'టెంపరేచర్ పెరగగానే ఆయనకు ఫారిన్ టూర్' | BJP chief Amit Shah criticizes Rahul Gandhi's absence from the country | Sakshi
Sakshi News home page

'టెంపరేచర్ పెరగగానే ఆయనకు ఫారిన్ టూర్'

Published Sat, Jul 2 2016 9:18 AM | Last Updated on Mon, Sep 4 2017 3:59 AM

'టెంపరేచర్ పెరగగానే ఆయనకు ఫారిన్ టూర్'

'టెంపరేచర్ పెరగగానే ఆయనకు ఫారిన్ టూర్'

గోరఖ్పూర్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర విమర్శలు చేశాడు. దేశంలో వేడిపెరగగానే రాహుల్ దేశం విడిచిపెట్టి వెళ్లిపోతాడని అన్నారు. 'దేశంలో ఉష్ణోగ్రతలు పెరగగానే రాహుల్ బాబా విదేశాలకు వెళ్లిపోతాడు. అలాంటాయని బీజేపీ పరిపాలన రికార్డును అడుగుతాడు' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

గోరఖ్ పూర్ లోని బస్తీలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ ఎస్పీని, బీఎస్పీని మట్టికరిపించి 2017 ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. రెండు పార్టీలను చెత్తబుట్టలో వేయాలని, ఆ పార్టీల వల్ల ఇప్పటి వరకు రాష్ట్రం అభివృద్ధికే నోచుకోలేదని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎస్పీ, బీఎస్పీ నే కారణం అన్నారు. నేరస్తులు, మాఫియానే ఎస్పీ ప్రభుత్వాన్ని డామినేట్ చేస్తున్నాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement