criticize
-
రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పాలన అంతా చీకటిమయమేనని మంత్రి హరీష్ రావు అన్నారు. కరెంట్ కష్టాలు, నీటి కష్టాలను ప్రజలు ఏనాడూ మర్చిపోలేదని చెప్పారు. అర్ధరాత్రి రైతులను గోస పెట్టిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రైతులను ఏనాడు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో నకిలీ విత్తనాలతో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో పెండింగ్ ప్రాజెక్టులుగా పేర్లు మారిపోయాయని ధ్వజమెత్తారు. వ్యవసాయం దండగ అంటున్న నాయకునికి వారసుడు రేవంత్ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఆపాలని కుట్ర పన్నిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా రైతు వ్యతిరేక పార్టీనే అని అన్నారు. కాంగ్రెస్ గెలవగానే కర్ణాటకలో రైతు బంధు రద్దు అయిందని చెప్పారు. టీపీసీసీ చీఫ్ రైతు బంధు అవసరమా? అంటాడు.. రైతుల కష్టాలు తెలియని వారు సరైన పాలన ఎలా ఇవ్వగలరని ప్రశ్నించారు. ఇదీ చదవండి: కాంగ్రెస్‌వాళ్లే రైతుబంధు ఆపారు.. సిగ్గుందా?: కేసీఆర్ -
తనకు బలం లేదని పవన్ కల్యాణే ఒప్పుకున్నారు:మిథున్‌రెడ్డి
కాకినాడ: టీడీపీతో పొత్తు ఆశయంలో భాగంగానే జనసేన నేత పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ మిథున్రెడ్డిఅన్నారు. ముఖ్యమంత్రిని కానని గతంలో పవన్ చెప్పారని, అంత బలం తనకు లేదని స్వయంగా పవన్ చెప్పిన వ్యాఖ్యల్ని ఆయన గుర్తు చేశారు. ప్రజలతో నేరుగా ఎలాంటి దాపరికాలు లేకుండా ఉండాలనేదే తమ పార్టీ స్ట్రాటజీ అని మిధున్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే తమవల్ల ఉపయోగం ఉంటేనే ఓటు వెయ్యమని సీఎం జగన్ అంటున్నారని ఆయన పేర్కొన్నారు. ముద్రగడ వైఎస్సార్సీపీలోకి వస్తానంటే తప్పకుండా ఆహ్వనిస్తామన్నారు. ఎంపీ ఎన్నికల షెడ్యూల్‌తోనే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. గడప గడపకు ప్రభుత్వం ద్వారా ప్రజల్లోకి వెళ్లే వారికే వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తామని, వారే తమ పార్టీ అభ్యర్ధులని చెప్పారు. వైఎస్ఆర్సీపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు టాప్ ప్రయారిటీ ఉంటుందని మిథున్‌రెడ్డి అన్నారు. ఇదీ చదవండి: గండికోటను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం: సీఎం జగన్ -
'భయపడేవాడు కాదు మోదీ..' ప్రతిపక్షాలపై ప్రధాని ఘాటు వ్యాఖ్యలు..
రాయ్‌పుర్: ఈ ఏడాది చివర్లో ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. అవినీతిలో కూరుకుపోయినవారు ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఒకరికొకరు తిట్టుకున్నవారు నేడు కలుసుకోవడానికి సాకులు వెతుకుతున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు రాయ్‌పుర్‌లో ఏర్పాటు చేసిన విజయ్ సంకల్ప్ ర్యాలీలో ఆయన మాట్లాడారు. 'మోదీ భయపడడు..' అవినీతి కోసం హామీలను కాంగ్రెస్ ఇస్తే.. అవినీతిని అంతం చేసే హామీని మోదీ ఇస్తున్నాడని చెప్పారు. అవినీతి లేకుండా కాంగ్రెస్ శ్వాసించలేదంటూ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ భావాజాలంలోనే అవినీతి ఉందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ అడ్డుగోడగా నిలబడిందని అన్నారు. అవినీతిపరులు ప్రతిపక్ష కూటమి పేరుతో తనపై కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిరంతరం తననే అనుసరిస్తున్నారని దుయ్యబట్టారు. తనను ఓడించడం కోసమే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కానీ భయపడేవారు ఎప్పటికీ మోడీ కాలేడంటూ ప్రతిపక్షాలపై ప్రధాని విరుచుకుపడ్డారు. కాగా.. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్, మిజోరాం, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లలో ఎన్నికలు జరుగనున్నాయి. రూ.7 వేల కోట్ల వ్యయంతో.. రాయ్‌పుర్‌లో ప్రధాని సభకు హాజరయ్యేందుకు వస్తుండగా ప్రమాదంలో ముగ్గురు మరణించారు. వారికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. గాయపడ్డవారికి సరైన చికిత్స అందించాలని కోరారు. మృతుల కుటుంబాలకు సహాయం చేస్తామని చెప్పారు. ఈ సభ ముందురోజు ఛత్తీస్‌గఢ్‌లో రూ.7 వేల కోట్ల వ్యయంతో ఎనిమిది ప్రాజెక్టులకు ప్రధాని భూమిపూజ కార్యక్రమం చేశారు. ఇందులో 6,400 కోట్లతో ఐదు జాతీయ రహదారులు నిర్మించనున్నారు. ఇదీ చదవండి: తీవ్ర పదజాలంతో ప్రధానిని తిట్టడం దేశద్రోహమేం కాదు! కానీ.. -
అధికారం కోసమే సంజయ్ పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్: ఇన్నాళ్లూ టీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్‌ను విమర్శించి నోరు పాడు చేసుకున్న బండి సంజయ్ కాళ్లు పాడుచేసుకునేందుకు ప్రజా సంగ్రామయాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్నారని పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ చైర్మన్ జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం సంజయ్ ఢిల్లీవైపు పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు శేఖర్‌రెడ్డి, రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ సతీశ్‌కుమార్‌తో కలిసి శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం కోసమే సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని, ఉన్నత పదవుల కోసం ప్రతిపక్ష పార్టీల నేతలు పోటీపడి యాత్రలు చేస్తున్నారని జీవన్‌రెడ్డి ఆరోపించారు. గిరిజనులపై ప్రేమ ఉంటే సంజయ్ పార్లమెంటులో మాట్లాడాలని, కేసీఆర్‌ను గిరిజన గాంధీగా రవీంద్రకుమార్ అభివర్ణించారు. -
రైతులను విస్మరిస్తున్న ప్రభుత్వాలు
తల్లాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను విస్మరిస్తున్నాయని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. తల్లాడలో శుక్రవారం మాజీ ఎంపీపీ వజ్రాల వెంకటసుబ్బమ్మ గృహంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ ఏడాది అకాల వర్షంతో పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు సతమతమౌతున్నారని, ఎన్నికల సమయంలో రైతులకు అనేక వాగ్ధానాలు చేసి వాటిని ఆచరణలో పెట్టడంలో విఫలమౌతున్నట్లు ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర ఉండేలా మద్ధతు ధర ప్రకంటించాలన్నారు. తెలంగాణను వ్యవసాయంలో ఒక మోడల్ స్టేట్‌గా రూపొందిస్తామని టీఆర్ఎస్ నాయకులు చెపుతున్నారని, స్వామినాధన్ కమిషన్ అమలుకు కృషి చేయాలన్నారు. బయ్యారం గనుల లీజుకిస్తే దానిపై లోక్‌సభలో ఆందోళన చేశామన్నారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెడతామని విభజన చట్టంలో పేర్కొన్నారని, ఇంతవరకు స్టీల్ ప్లాంట్ నెలకొల్పలేదన్నారు. పరిశ్రమలను అభివృద్ధి చేస్తేనే నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల శేషగిరావు, మండల అధ్యక్ష, కార్యదర్శులు దూపాటి భద్రరాజు, కేతినేని చలపతిరావు, దగ్గుల శ్రీనివాసరెడ్డి, కె.సత్యనారాయణ, నున్నా తిరుమలరావు, మొక్కా కృష్ణార్జున్, సురేష్, రేగళ్ల సత్యం పాల్గొన్నారు. -
పార్టీ బలోపేతంలో యువత పాత్ర కీలకం
పీలేరు : వైఎస్సార్సీపీ బలోపేతంలో యువత పాత్ర కీలకమని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం పీలేరులో పార్టీ యువ నేత కృష్ణచైతన్యరెడ్డి జన్మదిన వేడుకలకు ఆయన హాజరయ్యారు. వైఎస్సార్సీపీ జెండా రంగులో రూపిందించిన కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను గడప గడపకూ తీసుకెళ్లి వివరించడంలో యువత చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని కాదని, ముగిసిపోయిన అధ్యాయమని అవహేళన చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. హోదా కోసం ఉద్యమించిన ఎమ్మెల్యేలు, నాయకులు, యువకులపై అక్రమ కేసులు పెట్టించిన సీఎం ఉన్నఫలంగా యూటర్న్ తీసుకుని మరోమారు ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైఎస్. జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నామని చెప్పారు. సీఎం డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు.. తన ఉనికికే ప్రమాదం ఏర్పడడంతో సీఎం హోదా అంటూ కొత్తనాటకానికి తెరలేపారని విమర్శించారు. రూ. 30 కోట్ల ప్రజాధనంతో దొంగ దీక్ష చేసి తన ధ్వంద నీతిని సీఎం ప్రదర్శించారని ధ్వజమెత్తారు. సీఎం మాటలకు చేతలకు పొంతన ఉండదని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లో టీడీపీని భూస్తాపితం చేయడంలో యువత కీలకంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వినర్ నారే వెంటక్రమణారెడ్డి, పార్టీ నాయకులు ఎం. భానుప్రకాష్‌రెడ్డి, కొత్తపల్లె సురేష్‌కుమార్‌రెడ్డి, పెద్దోడు, చైతన్యరెడ్డి, ఆనంద్, శ్యామ్‌రెడ్డి, ఉదయ్, హరి, వెంకటేశ్వర్‌రెడ్డి, జీవన్, నవీన్, సుధాకర్, కిషోర్, మణి తదితరులు పాల్గొన్నారు. భాస్కర్‌నాయుడు కుటుంబానికి పరామర్శ కలకడ: స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు నీళ్ల భాస్కర్‌నాయుడు కుటుంబాన్ని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పరామర్శించారు. ఆదివారం మండలంలోని కె.బాటవారిపల్లెలో భాస్కర్‌నాయుడు తమ్ముడు భార్య సూర్యకుమారి శుభస్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మనోహర్‌నాయుడు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలసుకున్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ వెంకట్రమణరెడ్డి, నాయకులు నల్లారి తిమ్మారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, కేఎస్ మస్తాన్ తదితరులు ఉన్నారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలి కేవీపల్లె: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని జిల్లేళ్లమంద పంచాయతీ నగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని కోరారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్. జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల హామీలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. సమావేశంలో జెడ్పీటీసీ జి. జయరామచంద్రయ్య, పార్టీ మండల కన్వీనర్ వెంకటరమణారెడ్డి, నాయకులు గజ్జెల శీన్‌రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, రమేష్, ధర్మారెడ్డి, నాగసిద్ధారెడ్డి, గణపతిరెడ్డి, సైఫుల్లాఖాన్, అమరేంద్రనాయుడు, యర్రయ్య, చిన్నబ్బ, చెంగయ్య, ప్రభాకర, రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నువ్వూ హీరోయిన్ అయిపోదామనే..!
సాక్షి, చెన్నై: నువ్వు కూడా హీరోయిన్ అయిపోదామనే.. ఏముందీ నీలో? ఒక అందం ఉందా? ఆకర్షించే అవయవ సంపద ఉందా? నీది చాలా సీరియస్ ముఖం. నీకు హీరోయిన్ అయ్యే లక్షణాలే లేవు. నీ పేరుతో వ్యాపారం అవ్వదు అని ఒక దర్శకుడు స్టుపిట్ కారణాలతో తూలనాడాడని నటి తాప్సీ చెప్పింది. అయితే ఇది ఇప్పటి సంగతీ కాదట. కొత్తగా అవకాశాల వేటలో ఉన్న సమయంలోనని తాప్సీ పేర్కొంది. ఆ దర్శకుడు ఎవరన్నది మాత్రం ఈ అమ్మడు బయటపెట్టలేదు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అందుకున్న తాప్సీ ప్రస్తుతం హిందీలో వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటిస్తోంది. అయితే ఎప్పుడూ, ఏదోఒక అంశంతో వార్తల్లో ఉంటుంది తాప్సీ. ప్రస్తుతం హీరోయిన్గా తన తొలి రోజుల అనుభవాలను ఇటీవల ట్విటర్లో పేర్కొని మరోసారి సోషల్ మీడియాలకు పని చెప్పింది. దక్షిణాదిలో నటిగా గుర్తింపు తెచ్చుకుని, ఆ క్రేజ్‌తో బాలీవుడ్‌కు వెళ్లి ఆ తరువాత దక్షిణాదికి చెందిన వారిని విమర్శించడం హీరోయిన్లకు ఫ్యాషన్ అయ్యింది. తాప్సీ కూడా అంతే. బాలీవుడ్లో రెండు మూడు సక్సెస్‌లు రాగానే దక్షిణాది చిత్రపరిశ్రమతో పని లేదనుకుంటారో, ఏమోగానీ.. ఇలియానా, తాప్సీ లాంటి వాళ్లు నోరు జారడం చూస్తున్నాం. అసలు తనేమందో చూద్దాం. నటిగా ఆరంబంలో చాలా అవమానాలను ఎదుర్కొన్నాను. ‘నా మాదిరిగా చెల్లెల్ని కష్టపడనీయను. కారణం ఈ ప్రపంచంలో నేను ఎక్కువగా ఇష్టపడేది నా చెల్లెలినే. తనంటే నాకు చాలా ప్రేమ. సినిమా రంగంలోకి రావద్దని తన చెల్లెలికి చెప్పలేదు. అయితే నా మనసులో ఉంది మాత్రం అదే. ఇక నాకు నటన అంటే ఇష్టం. కానీ ఈ రంగంలో ఎలా రాణించడానికి ఎలా ప్రవర్తించాలో అప్పట్లో నాకు తెలియదు. వివిధ రకాల పాత్రల్లో నటించాలి. సినిమాలో ఎలా ఎదగాలి అన్న విషయాల గురించి ఇప్పుడే ఆలోచిస్తున్నాను. ఏమీ తెలియని నేను ఇంతగా నేర్చుకోవడం ఈ స్థాయికి చేరుకోవడం పెద్ద విషయమే’ అని నటి చెప్పింది. -
అవినీతికన్నా పెద్ద మోసం మాటతప్పడం
ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు సాక్షి, హైదరాబాద్: లంచం అడిగితే చెప్పుతో కొట్టమని మంత్రి కేటీఆర్ చెబుతున్నారని, ఆ మాటకొస్తే అబద్ధాలు చెప్పి, మోసం చేసిన వారిని కూడా చెప్పుతో కొట్టాల్సి ఉంటుందని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అవినీతి కన్నా పెద్ద మోసం ఇచ్చిన మాట తప్పడమని అన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా గాంధీ భవన్లో ఆయన చిత్రపటానికి టీపీసీసీ నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, సంపత్ తదితరులు నివాళులర్పించారు. -
‘దయ్యాలు వేదాలు వల్లించడమే... ’
హైదరాబాద్: ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ తాండూర్‌లో చేసిన వ్యాఖ్యల పై కాంగ్రెస్ నేతలు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. భూదందాలు ,అత్యధిక అరాచకాలు చేసిన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సంపత్ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. తెలంగాణ అభివృద్ధి అడ్డుకోవడమే కాంగ్రెస్ అజెండా అని చెప్పారు. పాలమూర్లో కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులకు అడ్డుపడుతుంటే రంగారెడ్డి లో కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులు కావాలంటూ పాదయాత్రలు చేస్తున్నారు . ఇదేం ద్వంద్వ నీతి అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మీ ఏలుబడిలో దివాళా తీయించారని ఎద్దేవా చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు నిర్ణయించేది కేంద్రమే అనే సంగతి కాంగ్రెస్ నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. ఉత్తమ్ ,పొన్నాల వంటి వారికి ఈ విషయాలు తెలిసే ధర్నాలు చేస్తున్నారా అని సూటిగా అడిగారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పరపతి కోల్పోయిందని, త్వరలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోవడం ఖాయమన్నారు. అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, మన రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ స్థానమేమిటో ప్రజలు రుచి చూపించారని అన్నారు. కాంగ్రెస్ లోని అజ్ఞానులు చిల్లర మల్లర ఆరోపణలు చేస్తే పట్టించుకోమని తెలిపారు. సంపత్ ఇక నైనా కేటీఆర్‌పై ఆరోపణలు మానుకో .. లేకుంటే ప్రజలే నీకు బుద్ది చెబుతారని హెచ్చరించారు. టీఆర్ఎస్ను తిట్టడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు తమ ఆరోపణలు నిరూపించక పోతే చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. కేటీఆర్‌ను విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టేనని అన్నారు. -
బాబుకు పాలించే అర్హత లేదు
గడప గడపకు వైఎస్సార్‌లో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి నెహ్రూనగర్: వ్యాపార, వర్తక, వాణిజ్య, రియల్ ఎస్టేట్ తదితర వర్గాలను దారుణంగా దెబ్బతీస్తున్న చంద్రబాబు సర్కారుకు పాలించే అర్హత లేదని వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి పేర్కొన్నారు. గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమం సోమవారం 39వ డివిజన్ బ్రాడీపేట డివిజన్ అధ్యక్షుడు మొక్కపాటి కృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, వ్యాపార వర్గాలపై పన్నుల భారం మోపే ముందు ముందస్తూ సమాచారం, నిర్ణీత గడువు ఇవ్వకుండా రాత్రికి రాత్రే పన్నుల భారం మోపడం చంద్రబాబుకు ఆనవాయితీగా వస్తుందన్నారు. రాత్రిపూట జీవోలు విడుదల చేయడం, అర్ధరాత్రి దేవాలయాలు, వైఎస్సార్ విగ్రహాలు అడ్డగోలుగా తొలగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం చీకటి పాలనకే అధిక ప్రాధాన్యతనిస్తుందని మండిపడ్డారు. గతంలో రైతుల ఆత్మహత్యలే చూశామని ప్రసుత చంద్రబాబు రెండేళ్ళ పాలనలో వ్యాపారులపై మోపుతున్న పన్నుల భారంతో ప్రభుత్వమే వ్యాపారులను ఆ దారిలో నెట్టాలను చూస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులే అధికారులతో వ్యాపారులను బెదిరించి భయాభ్రాంతులకు గురి చేసిన సందర్భాలు కోకొల్లలని అప్పిరెడ్డి అన్నారు. రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యాపార వర్గాల వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్న చంద్రబాబునాయుడు రానున్న ఎన్నికల్లో వ్యాపార వర్గాల సత్తా ఏమిటో చూపించేందుంకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. -
'టెంపరేచర్ పెరగగానే ఆయనకు ఫారిన్ టూర్'
గోరఖ్‌పూర్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర విమర్శలు చేశాడు. దేశంలో వేడిపెరగగానే రాహుల్ దేశం విడిచిపెట్టి వెళ్లిపోతాడని అన్నారు. 'దేశంలో ఉష్ణోగ్రతలు పెరగగానే రాహుల్ బాబా విదేశాలకు వెళ్లిపోతాడు. అలాంటాయని బీజేపీ పరిపాలన రికార్డును అడుగుతాడు' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గోరఖ్ పూర్ లోని బస్తీలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ ఎస్పీని, బీఎస్పీని మట్టికరిపించి 2017 ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. రెండు పార్టీలను చెత్తబుట్టలో వేయాలని, ఆ పార్టీల వల్ల ఇప్పటి వరకు రాష్ట్రం అభివృద్ధికే నోచుకోలేదని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎస్పీ, బీఎస్పీ నే కారణం అన్నారు. నేరస్తులు, మాఫియానే ఎస్పీ ప్రభుత్వాన్ని డామినేట్ చేస్తున్నాయని చెప్పారు. -
ప్రధాని మోదీ ప్రసంగంపై విమర్శలు
-
అప్పుడు మురళీమోహన్ ఎందుకు కో్ర్టుకెళ్లారు
-
మోదీకంటే చంద్రబాబే గొప్ప వ్యక్తి
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోదీకన్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే గొప్ప వ్యక్తి అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబు ప్రతిష్ఠకు భంగం కలిగే ఏపని బీజేపీ చేసినా ఒక్క టీడీపీ కార్యకర్త కూడా సహించడని హెచ్చరించారు. బీజేపీ వల్ల తమ ముఖ్యమంత్రి ప్రతిష్ఠ మొత్తం దెబ్బతింటోందని ఆరోపించారు. వైజాగ్, నరసాపురంలో బీజేపీ గెలవడానికి చంద్రబాబు చరిష్మానే కారణం అని చెప్పారు. హీరో శివాజీని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నేత రఘువీరా, సీపీఐ రామకృష్ణ ప్రత్యేక హోదాపై డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి ప్రధాన మోదీని కలుస్తున్నారని, ప్రత్యేక హోదాపై చర్చిస్తారని తెలియజేశారు.