
అవినీతికన్నా పెద్ద మోసం మాటతప్పడం
సాక్షి, హైదరాబాద్: లంచం అడిగితే చెప్పుతో కొట్టమని మంత్రి కేటీఆర్ చెబుతున్నారని, ఆ మాటకొస్తే అబద్ధాలు చెప్పి, మోసం చేసిన వారిని కూడా చెప్పుతో కొట్టాల్సి ఉంటుందని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అవినీతి కన్నా పెద్ద మోసం ఇచ్చిన మాట తప్పడమని అన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా గాంధీ భవన్‌లో ఆయన చిత్రపటానికి టీపీసీసీ నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, సంపత్ తదితరులు నివాళులర్పించారు.