హైదరాబాద్: బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడని, ఆయనకు సలహా ఇచ్చింది ఎవరని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంత రావు ప్రశ్నించారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీతేజ్ కోలుకోవాలని అల్లు అర్జున్ మృత్యుంజయ యాగం చేయాలన్నారు.
శ్రీతేజ్ కోలుకోవాలని తాను దేవుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. పుష్ప సినిమా టికెట్ రేట్‌ను సీఎం రేవంత్ రెడ్డి పెంచారు.. ఈ విషయం అల్లు అర్జున్ ఆలోచించాలని.. పుష్ప సినిమాకు వచ్చిన లాభాలలో కొంత మొత్తం యాదగిరిగుట్ట దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి హుండీలో వేయండని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment