Hanumantha Rao V
-
‘అల్లు అర్జున్‌కు ఆ సలహా ఇచ్చిందెవరు?’
హైదరాబాద్: బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడని, ఆయనకు సలహా ఇచ్చింది ఎవరని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంత రావు ప్రశ్నించారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీతేజ్ కోలుకోవాలని అల్లు అర్జున్ మృత్యుంజయ యాగం చేయాలన్నారు. శ్రీతేజ్ కోలుకోవాలని తాను దేవుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. పుష్ప సినిమా టికెట్ రేట్‌ను సీఎం రేవంత్ రెడ్డి పెంచారు.. ఈ విషయం అల్లు అర్జున్ ఆలోచించాలని.. పుష్ప సినిమాకు వచ్చిన లాభాలలో కొంత మొత్తం యాదగిరిగుట్ట దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి హుండీలో వేయండని సూచించారు. -
ప్లీజ్ ఆదుకోండి.. హరిరామజోగయ్య పేరిట వీహెచ్‌కు ఫోన్ చేసి..
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావును టార్గెట్ చేసి డబ్బులు దోచుకునే ప్రయత్నం చేశారు. మాజీ ఎంపీ హరి రామజోగయ్య పేరిట డబ్బు కాజేయాలని చూశాను. కానీ, వీహెచ్ తెలివిగా వ్యవహరించి.. కేటుగాళ్లకు టోకరా ఇచ్చారు. వివరాల ప్రకారం.. కాంగ్రెస్ సీనియన్ నేత వీహెచ్‌ను మోసగించేందుకు ఓ సైబర్ నేరగాడు యత్నించాడు. మాజీ ఎంపీ హరి రామజోగయ్య పేరిట వీహెచ్‌కు ఫోన్ చేసి.. ఆపదలో ఉన్నానని, గూగుల్‌పే ద్వారా డబ్బు పంపాలని సదరు వ్యక్తి అభ్యర్థించాడు. ఈ క్రమంలో అనుమానం వచ్చి వీహెచ్.. హరిరామ జోగయ్య ఇంటికి ఓ వ్యక్తిని పంపించారు. అలాంటిదేమీ లేదని తేలడంతో ఫేక్ కాల్ అని వీహెచ్ నిర్ధారించుకున్నారు. అనంతరం.. ఫేక్ కాల్‌పై పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సైబరాబాద్ పోలీసులకు కూడా సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సైబర్ నేరగాడు ఖమ్మం నుంచి ఫోన్ చేసినట్లు గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఇక, ఇటీవలి కాలంలో ఇలాంటి కాల్స్, మెసేజ్‌ల ద్వారా సైబర్ కేటుగాళ్లు డబ్బులు కాజేస్తున్న విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ అభ్యర్థి ఎలా గెలుస్తాడో చూస్తా.. రేఖా నాయక్ స్ట్రాంగ్ వార్నింగ్ -
నా పేరు వీ హనుమంతరావు కాదంతే.! వీహెచ్ ఆసక్తికర కామెంట్స్
సాక్షి, సంగారెడ్డి: గట్టిగా కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. చిన్న చిన్న కోపాలు పక్కన పెట్టి పని చేద్దామంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు(వీహెచ్) పిలుపునిచ్చారు. బుధవారం సంగారెడ్డిలో ఓబీసీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మమ్మల్ని బంగాళాఖాతంలో వేస్తానంటున్నారు.. నువ్వెందుకు వేస్తావు.. బంగళాఖాతంలో నిన్నే జనం వేస్తారు’’ అంటూ మండిపడ్డారు. ‘‘దేశంలో రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగింది. పప్పు అన్న మా రాహుల్ పప్పా అయ్యాడు...మీ బాబై కూర్చున్నాడు. ఈ సారి ప్రధాని రాహుల్ అవుతాడు.. లేకుంటే నా పేరు హనుమంతరావు కాదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఆదాని, మోదీకి ఏం సంబంధం అని ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారు’’ అంటూ వీహెచ్ దుయ్యబట్టారు. ‘‘మా దగ్గర ఉంటే అవినీతి పరులు.. బీజేపీలో చేరితే సత్యహరిశ్చంద్రులు. త్వరలోనే బీసీ గర్జన పెడుతున్నాం. అందుకు ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క అందరూ ఒప్పుకున్నారు. అగ్ర కులాలకే కాదు రిక్షా తొక్కేవాడికి కూడా టాలెంట్ ఉంటుంది. అగ్రకులాల వాళ్లు ఓబీసీలను అణగదొక్కుతున్నారు. రాహుల్ జోడో యాత్రలో అన్ని వర్గాల వారిని కలిశారు. కొందరు లేస్తే బీసీలకు 50 శాతం రిజర్వేషన్ అంటున్నారు. ఫస్ట్ 20 శాతం తెచ్చుకుందాం.. ఆ తర్వాత 50 శాతం గురించి ఆలోచిద్దాం. ప్రతి పార్లమెంట్ పరిధిలో మూడు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని అడుగుతున్నాం. నేనెవ్వరికి వ్యతిరేకం కాదు.. మా హక్కుల కోసం మేం పోరాడుతున్నాం.. ఫైనల్‌గా సోనియా, రాహుల్ గాంధీ మాటా వింటాను’’ అని వీహెచ్ చెప్పారు. చదవండి: టీ కాంగ్రెస్ ఎన్నికల యాక్షన్ ప్లానేంటి? కోమటిరెడ్డి నివాసంలో ఏం జరిగింది? ‘‘ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ చెప్పి రైతులను జైల్లో వేయిస్తున్నాడు. పక్క రాష్ట్రాలకు వెళ్ళి సహాయం చేస్తావ్. పార్టీలో సీనియర్లు, జూనియర్ల మధ్య చిన్న చిన్న గోడవలున్నాయి. సీనియర్ మీద జూనియర్ పెత్తనం చెలాయిస్తా అంటే ఉరుకుంటారా..?. మా పార్టీలో లొల్లి కూడా అంతే’’ అంటూ వీహెచ్ వ్యాఖ్యానించారు. -
సంబంధం లేని ప్రకటన.. కాంగ్రెస్ లో అంతే
-
రేవంత్‌రెడ్డి పేరు మీడియాకు చెప్పాను
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు రేపుతోంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకం ఖరారైరందన్న వార్తల నేపథ్యంలో సీనియర్ నేత, మాజీ ఎంపీ వి హనుమంతారావు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌కు కీలక బాధ్యతలు కట్టబెట్టడం సరికాదంటూ ఆయన విమర్శించారు. అదే విధంగా అభిప్రాయ సేకరణలో భాగంగా ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ వ్యవహరించిన తీరును ఎండగట్టారు. ప్యాకేజీకి అమ్ముడు పోయారని ఆరోపించారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవిపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. వీహెచ్ వ్యాఖ్యలపై మల్లు రవి శనివారం స్పందించారు. మాణిక్యం ఠాగూర్ సహా ఇతర కాంగ్రెస్ నేతలపై హనుమంతారావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వైద్య విద్యలో ఉన్నత చదువులు చదివి సమాజంలో మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని, తనకు ఎవరికీ చెంచాగిరీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తమ ప్రాంతవాసుడైన రేవంత్‌రెడ్డి పార్టీ ఎంపీ, వర్కింగ్ ప్రసిడెంట్‌గా ఉన్నారని, ఆయనకు పీసీసీ పదవి ఇవ్వాలని తాను బహిరంగంగానే మీడియాకు చెప్పినట్లు పేర్కొన్నారు.(చదవండి: రేవంత్‌ను పీసీసీ అధ్యక్షుడిని చేస్తే పార్టీలో కొనసాగలేను) ఇవేం మాటలు?! ఇక పీసీసీ చీఫ్ ఎంపిక అంశం గురించి మాట్లాడుతూ.. ‘‘165 మంది నాయకులతో పాటు నా అభిప్రాయాన్ని కూడా అధిష్టానం తీసుకుంది. ఏఐసీసీ దూతగా వచ్చిన ఇంచార్జి మాణిక్యం ఠాగూర్‌పై ఆరోపణలు చేస్తే అది అధిష్టానం పైన చేసినట్టే. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని స్థాయిల్లోని నాయకులతో ఏఐసీసీ ఇంఛార్జీలు, 4 రోజులపాటు సుదీర్ఘంగా చర్చించి అభిప్రాయ సేకరణ చేశారు. ఆ తర్వాత ఏఐసీసీ కార్యదర్శులు మరి కొంత మంది ముఖ్యనేతలతో మరో దఫా చర్చలు జరిపారు. ఇంతలోతుగా సమీక్ష చేసి అన్ని వర్గాల నాయకుల అభిప్రాయాలతో మాణిక్యం ఠాగూర్, కేసీ వేణుగోపాల్ సోనియా గాంధీకి నివేదిక ఇచ్చారు. నిజానికి ఇంత ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నడూ చర్చలు జరగలేదు. క్రమశిక్షణ గల నాయకులు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేయాలి. గతంలో జరిగిన అనేక కీలక నిర్ణయాలలో కూడా సీఎం, సీఎల్పీ, పీసీసీ నియామకాల విషయంలో అందరూ అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి పని చేశారు. నివేదికలో ఏముందో అధిష్టానానికి తప్ప ఎవరికి తెలియదు, పత్రికల్లో వచ్చిన వార్తలు ఆధారంగా ఆరోపణలు చేయడం తగదు. క్రమశిక్షణా ఉల్లంఘించి మాట్లాడాలంటే మేము చాలా మాట్లాడగలము.. కానీ అధిష్టాన నిర్ణయాలకు కట్టుబడి పనిచేసే నాయకులం కాబట్టి అలా చేయం. ఇప్పుడు పార్టీ ఉన్న పరిస్థితులలో ఎవరికి ఎలాంటి బాధ్యతలు ఇస్తే బాగుంటుందో పార్టీ అధిష్టానానికి తెలుసు. పార్టీ బాగుపడాలని, తిరిగి అధికారంలోకి వచ్చి తెలంగాణ ఆశయ సాధన లక్ష్యం నెరవేరాలని కోరుకునే వాళ్ళం. అధిష్టానం కూడా అలాగే ఆలోచిస్తుంది’’ అని మల్లు రవి పేర్కొన్నారు. -
‘ఏదైనా జరిగితే ప్రతిపక్షాలదే బాధ్యత’
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిని గురువారం తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2015లోనే ఉస్మానియాను కూల్చి కొత్త భవనాన్ని నిర్మిస్తామన్నామని, కానీ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వి. హనుమంతరావులు అడ్డుకున్నారని విమర్శించారు. గతంలో ఉస్మానియా ఆస్పత్రి వద్ద ప్రభుత్వ సిబ్బందిని ఉత్తమ్, వీహెచ్‌లు అడ్డుకుంటున్న వీడియో క్లిప్పింగ్స్‌ని మీడియాకు చూపించారు. ఏదైనా జరిగితే ప్రతిపక్షాలదే బాధ్యత అని హెచ్చరించారు. నిన్న వర్షం పడితే కాంగ్రెస్ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని, ప్రతిపక్షాలకు మంచి చేసే అలోచన లేదని దుయ్యబట్టారు. భవిష్యత్తులో పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని తలసాని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ నేత వీహెచ్‌కు కరోనా పాజిటివ్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు (వీహెచ్) కరోనా వైరస్ బారిన పడ్డారు. గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వీహెచ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సైతం పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం వారంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. కాగా ఇటీవలే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని వందమందికి దుప్పట్ల పంపిణీ చేశారు. అదే రోజు నుంచి వీహెచ్ జ్వరంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. లాక్డౌన్ కాలంలోనూ ఆయన పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. (రాజాసింగ్‌ను వెంటాడుతున్న కరోనా భయం) ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జలదీక్షలో సైతం వీహెచ్ పాల్గొన్న విషయం తెలిసిందే. దీంతో గడిచిన వారం రోజులుగా ఆయన ఏయే కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఎవరితో కలిసి మెలిగారు అనేదానిపై అధికారులు ఆరా తీసున్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మెకు మద్దతుగా గాంధీ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కరోనా సోకి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. కాగా తెలంగాణలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్థన్, బీగాల గణేష్ గుప్తాలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వారంత చికిత్స పొందుతున్నారు. (ముత్తిరెడ్డిని కలిసిన ఏపీ టీడీపీ ఎమ్మెల్యే) -
కేసీఆర్ మాటలే విజయారెడ్డి హత్యకు దారి తీశాయి
సాక్షి, హయత్‌నగర్: అధికారులపై ప్రజలు రెచ్చిపోయే విధంగా సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలే విజయారెడ్డి హత్యకు దారితీశాయని, రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, లేదంటే విజయారెడ్డి వంటి ఘటనలు పెరిగిపోయే ప్రమాదం ఉందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్‌నేత వి. హనుమంతరావు అన్నారు. విజయారెడ్డి హత్యకు గురైన అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చాలామంది రైతులు ఏళ్ల తరబడి పట్టాదారు పాస్బుక్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, రెవెన్యూ చట్టాల్లో చాలా లొసుగులు ఉన్నాయని విమర్శించారు. వాటిని ఆసరాగా చేసుకుని అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని, మార్పులు రాకుంటే ఇలాంటి హత్యలు పెరుగుతాయని తెలిపారు. మ్యుటేషన్ పేరుతో రెవెన్యూ సిబ్బంది రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారని విమర్శించారు. కర్ణాటక తరహాలో భూములను కొన్న మరునాడే రెవెన్యూ రికార్డులు మారేవిధంగా వ్యవస్థ ఉండాలని, రెవెన్యూ చట్టాల్లో మార్పుల కోసం కర్ణాటకలోని విధానాలపై అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. పటేల్, పట్వారీల కాలంలో రెవెన్యూ వ్యవస్థ పటిష్టంగా ఉండేదని, వీఆర్ఓల వ్యవస్థ కారణంగా వారికి అవగాహన లేక సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో లోపాల కారణంగా డబుల్, త్రిబుల్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఆరోపించారు. సీబీసీఐడీ విచారణపై తనకు నమ్మకం లేదని, గతంలో వారు విచారణ జరిపిన నయీం హత్య కేసు ఎంతవరకు వచ్చిందని, అతడి డబ్బులు ఏమయ్యాని ఆయన ప్రశ్నించారు. తహసీల్దార్ విజయారెడ్డి భర్త కోరిన విధంగా సీబీఐ విచారణ చేట్టాలని, హంతకుడి వెనుక ఉన్న వారిని బయటకు తీసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బందితో మాట్లాడి ఘటనపై వివరాలు సేకరించారు. పీసీసీ కార్యదర్శి దండెం రాంరెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందికి భరోసా కల్పించి తహసీల్దార్ కార్యాలయాల్లో భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బుర్రరేఖ మహేందర్‌గౌడ్, నాయకులు గుండ్ల వెంకట్‌రెడ్డి, యాదగిరిచారి తదితరులు ఉన్నారు. -
యూరేనియం వ్యతిరేక కమిటి చైర్మన్‌గా వీహెచ్
సాక్షి, హైదరాబాద్: నల్లమల్ల అడవి యూరేనియం తవ్వకాల వ్యతిరేక కమిటి చైర్మన్‌గా మాజీ పీసీసీ అధ్యక్షుడు వీ.హనుమంతరావు నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీలో మొత్తం 16 మంది సభ్యులు ఉంటారని ఆయన పేర్కొన్నారు. కాగా నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరపకుండా పెద్దఎత్తున ఉద్యమించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని టీపీసీసీ కోర్ కమిటీ తీర్మానించిన విషయం తెలిసిందే. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా సేవ్ నల్లమల (#SaveNallamala) పేరుతో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు ఈ విషయంపై గళమెత్తుతున్నారు. తాజాగా సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ఈ విషయంపై స్పందించారు. -
‘నాకు పార్టీలో అన్యాయం జరిగింది’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో తనకు అన్యాయం జరిగిందని ఆ పార్టీ మాజీ ఎంపీ వీ హనుమంతరావు అన్నారు. పార్టీలో ఆయారాం, గయరాం వంటి వారికే కీలక పదవులు ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడిగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను నియమించారని కొంతమంది ప్రచారం చేస్తున్నారని, అలాచేస్తే అనేకమంది పార్టీని వీడిపోతారని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో ఓడిపోయిన వాళ్లకు ఎంపీ టికెట్లు ఇస్తున్నారని, నేతల బ్యాక్‌గ్రౌండ్ చూసి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అపరిశుభ్ర వాతావరణంతో రోగాలు ప్రబలుతున్నాయని, భారీ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి బయటకు వచ్చి ప్రజల పరిస్థితిని చూడాలని అన్నారు. -
అగ్ర కులాల పెత్తనం ఇంకెన్నాళ్లు: వీహెచ్
సాక్షి, ఢిల్లీ : టీపీసీసీ ప్రెసిడెంట్ పదవిని బీసీలకే ఇవ్వాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు డిమాండ్ చేశారు. అగ్రకులాల పెత్తనం ఇంకెన్ని రోజులు భరించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించారు. గతంలో పొన్నాల లక్ష్మయ్యకు పదవి ఇచ్చి ఇట్టే తీసేశారన్న సంగతి గుర్తుంచుకోవాలని కోరారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తనపై కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడికి కొప్పుల రాజు అంటే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ సీటు విషయంలో పొంగులేటి సుధాకర్‌రెడ్డిని ఏఐసీసీ సెక్రటరీ డబ్బులడిగినందుకే ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయారని ఆరోపించారు. మరోవైపు బీసీలకు జరుగుతున్నఅన్యాయాలను ఎవరికి చెప్పాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
రాయుడు పేరును పరిశీలించండి: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెటర్ అంబటి రాయుడు ఉద్వేగంలో తీసుకున్న రిటైర్మెంట్ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోకుండా జట్టు ఎంపికలో అతని పేరును పరిశీలించాలని పేర్కొంటూ మాజీ ఎంపీ, భారత క్రికెట్ సమాఖ్య చైర్మన్ వి. హనుమంతరావు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్‌కు లేఖ రాశారు. ప్రతిభావంతుడైన రాయుడులో ఇంకా చాలా ఆట మిగిలి ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. నం. 4లో బ్యాటింగ్‌తో పాటు అవసరమైన సమయాల్లో వికెట్ కీపింగ్ కూడా చేయగల సామర్థ్యం రాయుడుకు ఉందన్నారు. ప్రపంచకప్ ఎంపికలో తనపై చూపించిన నిర్లక్ష్యం కారణంగా నొచ్చుకున్న రాయుడు భావోద్వేగంలో రిటైర్మెంట్ను ప్రకటించాడని, బీసీసీఐ చొరవ తీసుకొని రాయుడుకు మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరారు. -
‘అలా చేయకపోతే.. మా పిల్లలు బిచ్చగాళ్లు అవుతారు’
సాక్షి, ఢిల్లీ : క్రిమిలేయర్ ఎత్తివేయాలని గతంలో చాలాసార్లు కోరానని.. క్రిమిలేయర్‌ను ఎత్తివేయకపోతే తమ పిల్లలు బిచ్చగాళ్లు అయిపోతారని కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. సోమవారం ఓబీసీ కమీషన్ తెలంగాణ ప్రాంతానికి వస్తున్న నేపథ్యంలో వీహెచ్ మాట్లాడుతూ.. 1993లో ఓబీసీ కమీషన్ ఏర్పడిందని అయినా బీసీలకు ఉద్యోగ అవకాశాల్లో 9శాతం కంటే ఎక్కువ దాటడం లేదని పేర్కొన్నారు. కమిటీ కొన్ని కులాలను బీసీల్లో కలుపుతామని అంటున్నారు.. అయితే తాను దానికి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. ఏడాదికి 8లక్షలు దాటితే రిజర్వేషన్ వర్తించదని, బీసీ సర్టిఫికేట్ ఇవ్వడం లేదని అన్నారు. తమ పిల్లలకు, చదువు, ఉద్యోగ అవకాశాలు రావడం లేదని అన్నారు. క్రిమిలేయర్ వల్ల తమకు వచ్చే ఉద్యోగాలు అగ్ర కులాలకు పోతున్నాయని తెలిపారు. గతంలో బైసన్‌పోలో గ్రౌండ్ విషయంలో తాను పబ్లిక్ పోల్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు 97శాతం మంది ప్రజలు వారి స్పందన తెలిపారన్నారు. అలాగే మళ్లీ ఇప్పుడు కొత్త సచివాలయం నిర్మాణంపై పబ్లిక్ ఒపీనియన్ అడగుతామన్నారు. -
‘కేసీఆర్.. పిచ్చి పనులు మానుకో’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు నిర్మించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని తుగ్లక్ చర్యగా కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అభివర్ణించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తప్పుడు నిర్ణయాలకు మద్దతు తెలపడాన్ని ఎంఐఎం మానుకోవాలని సూచించారు. బైసన్ పోలో మైదానంలో సచివాలయం నిర్మాణానికి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నట్టు తాము నిర్వహించిన తమ ప్రజాభిప్రాయ సేకరణలో తేలిందన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ భవనం ఉండగా కొత్తది అవసరమా అని ప్రశ్నించారు. వచ్చే తరాలకు తన పేరు తెలియాలన్న స్వార్ధంతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని వీహెచ్ ఆరోపించారు. కొత్త అసెంబ్లీ పేరుతో హెరిటేజ్ భవనాలు కూల్చటం దారుణమని, ఇలాంటి పిచ్చి పనులు కేసీఆర్ మానుకోవాలన్నారు. ప్రజల డబ్బు వృథా చేయటం సరికాదని, అన్నింటికన్నా ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త అసెంబ్లీని ఫంక్షన్ హాల్‌గా, కౌన్సిల్‌ను లైబ్రరీగా మారుస్తామన్నారు. -
వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రేవంత్ రాజీనామా
సాక్షి, నల్గొండ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మద్దతుగా తెలంగాణలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకుని ఏఐసీసీ పగ్గాలు చేపట్టాలని కోరుతూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే రాజీనామా చేయగా, మరో వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి కూడా రాజీనామా చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలయినప్పుడు కీలక హోదాల్లో ఉన్న నేతలు బాధ్యత వహించాలన్న రాహుల్ గాంధీని స్ఫూర్తిగా తీసుకుని తాను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు శనివారం ఆయన వెల్లడించారు. ప్రెస్మీట్లతో ప్రజలు కనెక్ట్ కావడం లేదని, ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాల్సిందేనని అన్నారు. ఎన్నికలప్పుడు బాధ్యతలలో ఉన్నవారు రాజీనామా చేయాలని రాహుల్ రాజీనామా చేశారని, అందుకే తాను కూడా రాజీనామా చేసినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. మొత్తం మీద రాజకీయంగా ఎప్పుడూ వార్తలో ఉండే రేవంత్ ఈసారి కూడా తనదైన శైలిలో రాజీనామాను ప్రకటించి అటు పార్టీలోనూ, ఇటు అధిష్టానం దృష్టిలోనూ చర్చనీయాంశం కావడం గమనార్హం. అలాగే మాజీ ఎంపీ వి హనుమంతరావు కూడా తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపారు. దీంతో రాహుల్‌కు మద్దతుగా ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లకు తోడు మరో సీనియర్ నేత రాజీనామా చేసినట్టయింది. మరికొందరు నేతలు కూడా నేడో, రేపో రాజీనామాలు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. -
‘పీసీపీ పదవికి వీహెచ్ అర్హుడే’
సాక్షి, హైదరాబాద్ : పీసీసీ పదవికి సీనియర్ నేత వి. హనుమంతరావు అర్హుడేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. హైకమాండ్ బీసీలకు పీసీపీ ఇవ్వాలనుకుంటే వీహెచ్ సమర్థుడైన నాయకుడని జగ్గారెడ్డి చెప్పారు. బీసీలలో వీహెచ్ స్టార్ అని ప్రశంసించారు. వీహెచ్‌కి పీసీపీ ఇస్తే అన్ని విధాలా ఆయనకు సహకరిస్తానని తెలిపారు. పీపీసీ పదవిని ఎస్సీలకు ఇవ్వాలని అధిష్టానం భావిస్తే దామోదర రాజనర్సింహకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెడ్డిలలో పీసీసీ పదవి తనతో పాటు మిగతావారిలో ఎవరికిచ్చినా సమర్థవంతంగా పనిచేస్తారని జగ్గారెడ్డి అన్నారు. కాగా పీసీపీ పదవి తనకు ఇవ్వాలని జగ్గారెడ్డి అధిష్టానాన్ని కోరడంపై వీహెచ్ మండిపడ్డ విషయం తెలిసెందే. ఎప్పుడూ ఒకే సామాజిక వర్గానికి ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. మొదటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉన్న వారికే పీసీసీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను పార్టీలో సీనియర్ నేతనని, తనకే పీసీసీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
కేసీఆర్ దళితుల వ్యతిరేకి : మల్లురవి
సాక్షి, హైదరాబాద్ : రాత్రిపూట అంబేడ్కర్ విగ్రహాన్ని తీసివేసి చెత్త కుప్పలో వేశారని మాజీ ఎంపీ మల్లురవి మండిపడ్డారు. ఇదే అంశంపై గవర్నర్‌ను కలిశామని, అఖిల పక్షం భేటీ జరిగిందన్నారు. కానీ, ప్రభుత్వం ఇంతవరకు అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించిన వారిపై చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మంగళవారం ఉదయం అంబేడ్కర్ విగ్రహం పెట్టడానికి వెళితే లారీతో పాటు విగ్రహం కూడా తీసుకెళ్లారన్నారు. వి.హనుమంతరావుతో పాటు దాదాపు 60మందిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. కేసీఆర్ దళితుల వ్యతిరేకి అని మల్లు రవి నిప్పులు చెరిగారు. తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి దళితుడు అనిచెప్పి చేయలేదని, ఆ తరువాత ఉప ముఖ్యమంత్రిని చేసి కారణం లేకుండా తొలగించారని తూర్పారబట్టారు. ఇప్పుడు అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించారని, వెంటనే ప్రభుత్వమే విగ్రహ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
శ్రీనివాసరెడ్డిని ఎన్కౌంటర్ చేయాలి
సాక్షి, నల్గొండ : హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిని ఎన్కౌంటర్ చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హాజీపూర్ బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హాజీపూర్ సందర్శించి, బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు. రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హాజీపూర్ సంఘటన పట్ల సీఎం కేసీఆర్ బాధపడ్డారని చెప్పిన కేటీఆర్, బాధితులను ఆదుకునేందుకు ఎందుకు ముందు రావడం లేదని ప్రశ్నించారు. -
‘జనాలు తిరగబడి తన్నే రోజు వస్తుంది’
సాక్షి, హైదరాబాద్ : 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహం పేరుతో కాంగ్రెస్ నాయకులు 36 గంటల దీక్ష చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌ఛార్జి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీనియర్ నేతలు వీహెచ్, జానారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కుంతియా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అక్రమంగా ఎమ్మెల్యేలను చేర్చుకుందని ఆరోపించారు. ఎమ్మెల్యేలంతా ఒకేసారి పార్టీ వీడారనడం అబద్ధమన్నారు. పార్టీ వీడిన వారి మీద అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా.. గవర్నర్‌ను కలిసినా సరైన స్పందన రాలేదన్నారు. కోర్టుకు వెళ్తే కేసును ఈ నెల 11కు వాయిదా వేశారని తెలిపారు. కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగా ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారని కుంతియా ప్రశ్నించారు. కేసీఆర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. వి.హనుమంతరావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ప్రజాస్వామ్యానికే వెన్నుపోటుగా అభివర్ణించారు. ప్రతిపక్షాన్ని చూసి కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్.. దళిత ప్రతిపక్ష నేత కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అప్రజాస్వామిక చర్యలను జనాలు చూస్తున్నారని.. ఏదో ఒక రోజు తిరగబడి తంతారని హెచ్చరించారు. -
నన్ను అకారణంగా సస్పెండ్ చేశారు...
సాక్షి, హైదరాబాద్ : సస్పెన్షన్ వేటుపై తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ ముదిరాజ్ స్పందించారు. పార్టీ నుంచి తనను అకారణంగా సస్పెండ్ చేశారని ఆయన ఆరోపించారు. దీనిపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని నగేశ్ స్పష్టం చేశారు. క్రమశిక్షణా కమిటీ వీ హనుమంతరావుకు తొత్తులా పని చేస్తోందని ఆయన ఆరోపించారు. వాస్తవానికి, ఆ రోజు జరిగిన ఘటనలో తన తప్పేమీ లేదని, ఈ విషయం క్రమశిక్షణా సంఘం కూడా గుర్తించినా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని నగేశ్ ముదిరాజ్ వ్యాఖ్యానించారు. తనను సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్న అనంతరం ఆయన గాంధీభవన్‌లోని గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనపై అకారణంగా చేయి చేసుకోవడంతో పాటు వీహెచ్ తనను వ్యక్తిగతంగా దూషించారని చెప్పారు. అన్ని పార్టీల నేతల ముందు, తన నియోజకవర్గంలో వీహెచ్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. అయినా, కనీసం వీహెచ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ 11వ తేదీన ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో మాజీ ఎంపీ వీ హనుమంతరావు, నగేశ్ మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. వేదికపైనే ఇద్దరు నేతలు బాహాబాహీకి దిగిన దిగటంతో విచారణ జరిపిన కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం...నగేశ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : నా సస్పెన్షన్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం -
నగేశ్‌పై సస్పెన్షన్ వేటు వేసిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ ముదిరాజ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ 11వ తేదీన ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో మాజీ ఎంపీ వీ హనుమంతరావు, నగేశ్ మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. వేదికపైనే ఇద్దరు నేతలు బాహాబాహీకి దిగిన దిగటంతో క్రమశిక్షణా సంఘం రంగంలోకి దిగింది. ఈ ఘటనపై చైర్మన్ కోదండరెడ్డి అధ్యక్షతన క్రమశిక్షణా సంఘం సమావేశం సోమవారం గాంధీభవన్‌లో సమావేశమైంది. ఈ సమావేశంలో కో చైర్మన్ అనంతుల శ్యామ్ మోహన్, కన్వీనర్ కమలాకర్ రావు, శ్రీనివాస్ పాల్గొన్నారు. వీహెచ్, నగేశ్ మధ్య జరిగిన ఘర్షణపై కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. నగేశ్ ముదిరాజ్ ఈ సందర్భంగా క్రమశిక్షణా సంఘం ఎదుట హాజరై సంఘటనపై వివరణ ఇచ్చారు. మరోవైపు వీహెచ్ కూడా జరిగిన సంఘటనపై లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. అలాగే పార్టీ నాయకులు అందించిన సమాచారాన్ని కూడా పరిశీలించింది. అన్ని అంశాలను లోతుగా పరిశీలించిన తర్వాత నగేశ్ ముదిరాజన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : నగేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కాంగ్రెస్ చదవండి: (వేదికపైనే కొట్టుకున్న వీహెచ్, నగేశ్) -
నగేష్ బహిష్కరణకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ ముదిరాజ్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించేందుకు రంగం సిద్ధమైంది. దీని కోసం పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ కోదండ్‌రెడ్డి, ఇతర సభ్యులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఇందిరా పార్క్ వద్ద అఖిలపక్ష సమావేశంలో మాజీ ఎంపీ వి. హనుమంతరావుపైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ ముదిరాజ్ దాడి చేసినట్లు క్రమశిక్షణా సంఘం భావిస్తోన్నట్లు తెలిసింది. ఏఐసీసీ ఇంఛార్జ్ కార్యదర్శి ఆర్సీ కుంతియా సభలో పాల్గొన్న సమయంలో వీహెచ్‌పైన దాడి జరిగిందని భావిస్తున్నట్లు వెల్లడించింది. సీనియర్ నాయకులు, పార్టీలో అనేక పదవులు నిర్వహించిన వీహెచ్‌పైన నగేశ్ ముదిరాజ్ అనుచితంగా ప్రవర్తించి భౌతిక దాడికి దిగడాన్ని క్రమశిక్షణా సంఘం తీవ్రంగా ఖండింది. క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని క్రమశిక్షణా సంఘం తేల్చి చెప్పింది. ఈ అంశంపైనా అక్కడ సభలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, మండలి విపక్ష మాజీ నేత షబ్బీర్ అలీలను కమిటీకి నివేదిక ఇవ్వాలని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా సూచన చేశారు. ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం, వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా నగేష్ ముదిరాజ్‌పైన చర్యలు తీసుకునేందుకు క్రమశిక్షణా సంఘం రంగం సిద్ధం చేసింది. క్రమశిక్షణ విషయంలో ఎలాంటి వారినైనా, ఎంత పెద్దవారైనా చర్యలు తప్పవని హెచ్చరికలు పంపింది. -
వేదికపైనే కొట్టుకున్న వీహెచ్, నగేశ్..
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ.. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ తీరును ఖండిస్తూ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు, టీపీసీసీ అధికార ప్రతినిధి నగేశ్ బాహాబాహీకి దిగారు. దీంతో ధర్నా కార్యక్రమం రసాభాసగా మారింది. వేదికపై నుంచి వీహెచ్ మాట్లాడుతుండగా, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా అక్కడికి వచ్చారు. ఆయన్ను ఆహ్వానిస్తూ మైక్‌లో వీహెచ్ అనౌన్స్ చేశారు. అదే సమయంలో నగేశ్ కూడా వేదికపైకి వెళ్లారు. కుంతియా కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో నగేశ్ కూర్చునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నగేశ్, వీహెచ్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. నగేశ్‌పై వీహెచ్ చేయి చేసుకోవడంతో నగేశ్ వీహెచ్ చొక్కా పట్టుకున్నాడు. తోపులాటలో ఇద్దరూ కిందపడిపోవడంతో అక్కడున్న వారు వీహెచ్‌ను పైకిలేపి ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి వచ్చినప్పుడు బాధ్యతగల నాయకుడు ఇలా ప్రవర్తించడం సరికాదంటూ వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదండరాం, నారాయణ జోక్యం చేసుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. ఏకంగా వేదిక మీదే కాంగ్రెస్ నేతలు కొట్టుకోవడంతో అఖిలపక్ష నేతలు బిత్తరపోయారు. చనిపోయిన పిల్లల కుటుంబాల ముందు ఇలా మనం కొట్టుకోవడం వారిని అవమానించడమేనని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలంటే మీరు గాంధీభవన్‌లో కొట్లాడుకోండంటూ సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. నగేష్‌ను పార్టీ నుంచి బహిష్కరించే యోచన! ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో వీహెచ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ ఘర్షణ పడటాన్ని పార్టీ తీవ్రంగానే పరిగణించింది. శనివారం రాత్రి పార్టీ క్రమశిక్షణ సంఘం అత్యవసరంగా భేటీ అయింది. కమిటీ చైర్మన్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భేటీలో ఈ గొడవపై చర్చించారు. సీనియర్ నేత వీహెచ్‌పై నగేశ్ దాడి చేసినట్లుగానే భావిస్తున్నట్లు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని తేల్చిచెప్పింది. నగేశ్‌ను పార్టీ నుంచి బహిష్కరించే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు... దీనికి సంబంధించి ఘటనా స్థలంలో ఉన్న కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, మండలి విపక్ష మాజీ నేత షబ్బీర్ అలీ కమిటీ నివేదిక ఇవ్వాలని కుంతియా ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా నగేశ్‌పై చర్యలు తీసుకోనున్నారు. -
ఐ లవ్ హైదరాబాద్.. కర్రాబిళ్ల ఆడేవాళ్లం
సాక్షి, సిటీబ్యూరో/హిమాయత్‌నగర్ : ‘హోలీ హోలీల రంగ హోలీ.. చెమ్మకేలిల హోలీ’ అంటూ చిన్నప్పుడు బాగ్‌అంబర్‌పేట వీధుల్లో ఆడిన రోజులు ఎప్పటికీ మరిచిపోలేనివి. ఆ పండుగపూట రంగులు పట్టుకొని ఇంటింటికీ వెళ్లి పెద్ద మనుషులకు బొట్లు పెట్టి చందాలు సేకరించేవాళ్లం. అలా వచ్చిన డబ్బుతో రాత్రివేళ విందు ఏర్పాటు చేసేవాళ్లం. మాకు తోడు స్థానికులు కలిసేవాళ్లు. ఇక ఉమ్మడిగా ఒకేచోట కూర్చొని తిన్న జ్ఞాపకాల ముద్రలు ఎవరూ చెరపలేనివి. నా ఊరు, నా మనుషులతో ఉన్న అనుబంధం నాతో పోవాల్సిందే. నిన్న.. నేడు.. రేపు.. నా మనసంతా హైదరాబాదే’ నగరంలో పుట్టి పెరిగి బుధవారం కన్నుమూసిన జస్టిస్ సుభాషన్‌రెడ్డి మాటలివి..లోకాయుక్త హోదాలో కొద్ది కాలం క్రితం సాక్షి ప్రతినిధితో పంచుకున్న సుభాషన్‌రెడ్డి అనుభవాలివీ.. పూలు కోసేవాడిని... మాకు అంబర్‌పేట, రామంతాపూర్, ఉప్పల్‌లో వ్యవసాయ భూమి ఉండేది. 36 మంది వ్యవసాయ కూలీలు పనిచేసేవారు. ప్రతిరోజూ వారికి జొన్నరొట్టెలు, అన్నం పెట్టేవాళ్లం. ఒక్క యాపిల్ తప్ప ప్రతి పంటను పండించేవాళ్లం. తాతతో కలిసి మల్లెపూల తోటకు పోయేవాడిని, అక్కడ కూలీలతో కలిసి పూలను కోసేందుకు పోటీపడేవాడిని. కూరగాయాల లోడ్‌తో మోండా మార్కెట్‌కు వెళ్లేవాడిని. వ్యవసాయ పొలాల్లో చిన్నప్పుడు సరదాగా చేసిన అన్ని పనులు గుర్తొస్తూనే ఉంటాయి. అప్పట్లో..నగరమంతా చల్లదనమే.. అప్పట్లో వాతావరణం చల్లగా ఉండేది. ఎండాకాలంలోనూ గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ మించేది కాదు. ఇంట్లో ఫ్యాన్లు కూడా లేవు. వేసవిలో ఫ్యాన్లతో అవసరముండేది కాదు. వానలు సమయానుకూలంగా పడేవి. హుస్సేన్‌సాగర్ నీళ్లు తాగేవాళ్లం. బట్టలు కూడా ఉతికేవాళ్లం. వ్యవసాయానికి పనికి వచ్చేవి. కొంత మంది ఈత కూడా కొట్టేది. అన్ని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉండేది. ఎలాంటి నీటి కొరత ఉండేది కాదు. డెక్కన్ ఆట మరచిపోలేను... చిన్నప్పుడు స్నేహితులతో కలిసి డెక్కన్ (కూల్‌డ్రింక్స్ మూత)లను సేకరించేవాళ్లం. వీధుల్లోని అన్ని దుకాణాల వద్ద ఇవి దొరికేవి. ఆ డెక్కన్లతో ఫ్రెండ్స్‌తో కలిసి ఆటలు ఆడేది. ఒక గుండం గీసి అందులో డెక్కన్‌లను వేసేది. ఒక డెక్కన్ను మాత్రమే రాయితో కొట్టి మిగతా డెక్కన్‌లను గెలుచుకునేది. ఈ ఆట సరదాగా అనిపించేది. గోళీల ఆట కూడా ఆడా. బొంగురం తిప్పేది. గుల్లేరు పట్టుకొని మామిడి చెట్టుపై ఉన్న పండ్లను కొట్టేది. మొక్కజొన్న కంకులపై వాలే పక్షులను గురిచూసి కొట్టేవాన్ని. సినిమాలు బాగా చూసేవాన్ని... నూర్ మహల్ టాకీస్, ప్రభాత్, ప్రశాంత్, సాగర్ థియేటర్లలో సినిమాలు చూసేవాళ్లం. వీలుచిక్కినప్పుడల్లా స్నేహితులతో కలిసి మూవీలకు వెళ్లేవాడిని. బాయ్ జా బజార్ సినిమాను ప్రశాంత్ థియేటర్లో ఐదుసార్లు చూశా. ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు నటించిన మాయా బజార్ సినిమాను సాగర్ థియేటర్లో లెక్కలేనన్ని సార్లు చూశా. అప్పట్లో దో అణాకు చాయ్ వచ్చేది. ఇప్పటి పిల్లలకు తీరని లోటు గతంలో పిల్లలు బాల్యదశను ఎంతో ఎంజాయ్ చేసేవాళ్లం. నాన్నమ్మ, అమ్మమ్మల ఇళ్లకు వెళ్లేవాళ్లం. ఆటలు బాగా ఆడేది. ఇప్పటి రోజుల్లో అయితే ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి నిద్రపోయేవరకు పాఠశాల, ట్యూషన్‌తోనే సమయం గడిచిపోతోంది. పండుగలకు కూడా బంధువులతో కూడా సరిగా సమయాన్ని వెచ్చించలేకపోతున్నారు. ఇది ఇప్పటిపిల్లలకు తీరని లోటే. అతని టీమ్‌లో నేనుండాల్సిందే.. సుభాషణ్ రెడ్డి నాకు చిన్ననాటి నుంచీ మిత్రుడు. ఈతకు వెళ్లినా..కర్రాబిళ్ల ఆడినా అతని టీంలో నేనుండాల్సిందే. పెద్దయ్యాక కూడా అవకాశం వచ్చిన ప్రతి సారీ కబుర్లు చెప్పుకునేవాళ్లం. పెద్ద న్యాయమూర్తి అయినా వారి ఇంట్లో ఏ చిన్న పూజ అయినా నేనే హాజరై పూజలు చేయాల్సిందే. వారం క్రితం వారి ఇంటికి వెళ్లి వారి నాన్నగారితో మాట్లాడాను. ఒక స్నేహితుడిని కోల్పోయాను. బాధగా ఉంది. – సుభాష్ పంతులు,బుర్జుగల్లీ హనుమాన్ ఆలయం తోచిన సాయం చేసేవారు అంబర్‌పేటలో పది ఎకరాల ఆసామి అయిన సుభాష్‌రెడ్డి పటేల్ అయినప్పటికీ ఎలాంటి భేదం లేకుండా తనకు తోచిన సాయం చేసేవారు. బాగ్ అంబర్‌పేటలో ఉన్న వారి నివాసంతో పాటు వారి కుటుంబంలో ఎవరు ఇల్లు కట్టినా మేం పని చేశాం. మాకే చెప్పి దగ్గరుండి కట్టించాల్సిందిగా చెప్పేవారు. చిన్ననాటి నుంచి సుభాష్‌రెడ్డి మాకు ఎంతో అండగా ధీమా ఇచ్చేవారు. ఏదైనా బస్తీలో పంచాయతీ అయితే ఆయన దగ్గరకు వెళ్లి పరిష్కరించుకునేవాళ్లం. – రాములు, అంబేడ్కర్‌నగర్,బాగ్ అంబర్‌పేట బాధాకరం సుభాషణ్‌రెడ్డి మృతి బాధాకరమని సమాచారహక్కు మాజీ కమిషనర్ డాక్టర్ వర్రే వెంకటేశ్వర్లు, ప్రెస్‌క్లబ్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డిలు అన్నారు. న్యాయమూర్తిగా ఆయన ఎన్నో హోదాల్లో విధులు నిర్వర్తించి ఎందరికో మార్గదర్శకులుగా ఉన్నారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కర్రాబిళ్ల ఆడేవాళ్లం నాకూ సుభాషణ్కి మధ్య చాలా సాన్నిహిత్యం ఉంది. ఇద్దరం ప్రాణస్నేహితులం. చిన్నతనంలో మేం కర్రాబిళ్ల, స్విమ్మింగ్ చేసిన సన్నివేశాలు ఇప్పుడు నా కళ్ల ఎదుట కనిపిస్తున్నాయి. సుభాషణ్ న్యాయవృత్తిలో అంచలంచెలుగా ఎదిగారు.నా మంచి స్నేహితుడు ఈ రోజు నన్ను వదిలేసి వెళ్లడం నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది.– వి.హనుమంతరావు,మాజీ రాజ్యసభ సభ్యులు పలువురి నివాళి జస్టిస్ సుభాషణ్‌రెడ్డికి పలువురు నివాళులర్పించారు.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర ఎస్ చౌహాన్, న్యాయమూర్తులు జస్టిస్ రామచంద్రరరావు, జస్టిస్ కేశరావు, జస్టిస్ చల్లా కోదండరాం, జస్టిస్ అభినంద్షాలీ, జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ షమీఅక్తర్లతో పాటు సుమారు 35మంది మాజీ న్యాయమూర్తులు నివాళులు అర్పించారు. వందల మంది న్యాయవాదులు విచ్చేసి ఆయన సేవలను స్మరించుకుంటూ, ఓనమాలు దిద్దిన గురువు మా మధ్య లేకపోవడం బాధాకరంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఐఏఎస్ అధికారి అమ్రపాలి, కేవీపీ రామచంద్రరావు, జస్టిస్ ఈశ్వరయ్య, చంద్రకుమార్, నటుడు సామ్రాట్, ఏసీబీ మాజీ డైరెక్టర్ ఏ.కె.ఖాన్, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఖాద్రీలు ఘన నివాళులు అర్పించారు. -
కేటీఆర్ అలా చెప్పడం సిగ్గుచేటు..
బంజారాహిల్స్: ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలకు కారణమైన గ్లోబరీనా సంస్థ పేరును తాను మొదటిసారి విన్నానని కేటీఆర్ చెప్పడం సిగ్గుచేటని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు అన్నారు. ఆ సంస్థ తెలియదని పెద్దమ్మ తల్లిపై ప్రమాణం చేయాలని కేటీఆర్‌కు సవాల్ విసిరిన ఆయన... మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి దేవాలయానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం అక్కడ బైఠాయించారు. మధ్యాహ్నం 12గంటల వరకు కేటీఆర్ కోసం గుడి బయట వేచి చూశారు. కేటీఆర్ రాకపోవడంతో బయటకు వచ్చిన వీహెచ్ మీడియాతో మాట్లాడారు. రెండేళ్లలో ప్రభుత్వం పడిపోవాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. 23 మంది విద్యార్థుల మరణానికి కారణమైన గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాలన్నారు. -
కేటీఆర్ ప్రమాణం చేస్తావా?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్లోబరీనా ఐటీ కంపెనీ తనకు తెలియదని కేటీఆర్ చెప్పడం అబద్ధమని తెలిపారు. గ్లోబరీనా కంపెనీ తెలియదని అమ్మవారి మీద ప్రమాణం చేస్తావా అని కేటీఆర్‌కు సవాలు విసిరారు. కేటీఆర్ రేపు ఉదయం 12 గంటలకు పెద్దమ్మ గుడి వద్దకు రావాలని అన్నారు. ఆయన పెద్దమ్మ గుడి దగ్గరకు రాకపోతే గ్లోబరీనా ఐటీ కంపెనీతో ఆయనకు సంబంధం ఉన్న మాట నిజమని వ్యాఖ్యానించారు. ఐదేళ్లు ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్‌కు ఐటీ కంపెనీ గురించి తెలియదా అని ప్రశ్నించారు. -
‘హస్త’వాసి ఎవరిదో..?
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీ టికెట్ ఎవరికి దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదల కావడం.. 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం టికెట్ విషయంలో ఎటూ తేల్చడం లేదు. ఆశావహులు మాత్రం ఢిల్లీస్థాయిలో తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు ఢిల్లీలోనే మకాం వేసి తమకున్న పరిచయాల ద్వారా సర్వశక్తులు ఒడ్డుతుండగా.. మరికొందరు తమకున్న మార్గాల ద్వారా టికెట్ ఖరారు చేసుకునేలా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు నుంచే ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్ నేతలతో సహా అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలను గెలిచిన జిల్లాగా ఖమ్మంకు ప్రత్యేక గుర్తింపు ఉండడంతో ఇక్కడి నుంచి పోటీ చేయడం ద్వారా రాజకీయ భవిష్యత్, సుస్థిరత లభిస్తుందనే అంచనాలతో పలువురు సీనియర్లు ఈ సీటుపై దృష్టి సారించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఖమ్మం ఎంపీగా పోటీ చేయడానికి కాంగ్రెస్ నేతలు దరఖాస్తు చేసుకున్న సమయానికి.. ఎన్నికల షెడ్యూల్ విడుదల నాటికి జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించి పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరారు. అయితే జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సుస్థిర ఓటు బ్యాంకు ఉందని భావిస్తున్న పలువురు నేతలు ఖమ్మం ఎంపీగా బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను అధిష్టానానికి పంపించినా.. ఎవరిని ఖరారు చేయాలనే అంశంపై అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో కాంగ్రెస్ ఆశావహుల జాబితాలో రోజుకో పేరు చేరుతుండడం విశేషం. పలువురి దరఖాస్తు.. ఖమ్మం ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నేత వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకుడు రాయల నాగేశ్వరరావు దరఖాస్తు చేసుకున్నారు. 2009లో కాంగ్రెస్ తరఫున ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా రేణుకాచౌదరి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్, సీపీఐ కూటమిగా ఏర్పడి పోటీ చేయడంతో ఆ సమయంలో ఖమ్మం నుంచి కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ తరఫున 2009లో పోటీ చేసిన సిట్టింగ్ అభ్యర్థిని తానే అయినందున మరోసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని రేణుకాచౌదరి ఇప్పటికే పలుమార్లు కోరారు. అయితే ఆమె టికెట్ కోసం దరఖాస్తు చేయలేదు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు సైతం కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన పేరును సైతం ఎంపీ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయిన పారిశ్రామికవేత్త వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి టికెట్ తెచ్చుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రవిచంద్రకు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చిందని శనివారం పార్టీ వర్గాల్లో ప్రచారం జరగడం, ఆయన ఢిల్లీకి వెళ్లడంతో ఏం జరుగుతోందనే అంశంపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరిగినా.. నామా ఇంతవరకు అధికారికంగా తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడం, గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తమ సామాజిక వర్గానికి సరైన ప్రాధాన్యం ఇవ్వలేదనే కారణంతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు ఈసారి ఖమ్మం టికెట్‌ను పార్టీలో ఇప్పటికే కొనసాగుతున్న తమ పేర్లను పరిశీలించాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పార్టీ జిల్లా నాయకుడు రాయల నాగేశ్వరరావు తదితరులు ఎంపీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న తనకు ప్రతి ఎన్నికల్లో అన్యాయమే జరుగుతోందని, ఈసారి నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఖమ్మం టికెట్ తనకే ఇవ్వాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అధిష్టానం వద్ద పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక సీనియార్టీ దృష్ట్యా తనకు అవకాశం ఇవ్వాలని వీహెచ్ అధిష్టానానికి ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఒకటి రెండు రోజుల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతో ఆశావహులు ఎవరికి వారే తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రధాన పార్టీల్లోనూ... ఇక ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధాన రాజకీయ పక్షమైన టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో రోజుకో పేరు వినిపిస్తోంది. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్ లభిస్తుందని పార్టీ శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేస్తుండగా.. ఆ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ఇప్పటికే వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్లను పార్టీ పరిశీలిస్తోందని ప్రచారం జరుగుతుండగా.. తాజాగా శనివారం అదే సామాజిక వర్గానికి చెందిన కాంట్రాక్టర్ గరికపాటి వెంకటేశ్వరరావు(ఆర్టీసీ) పేరు ప్రచారంలోకి వచ్చింది. పార్టీ ముఖ్య నేతలు ఈ మేరకు ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాల ద్వారా ప్రచారం జరుగుతోంది. ఇక టీడీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన నామా నాగేశ్వరరావు ఈసారి ఆ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు దాదాపు కనుమరుగు కావడం.. ఆయన టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి తనకు అవకాశం ఇవ్వాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని) పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే రీతిలో బీజేపీ, వామపక్షాల నేతలు సైతం అభ్యర్థుల ఖరారులో తలమునకలైనట్లు ప్రచారం జరుగుతోంది. -
‘కృష్ణయ్య బీసీ గర్జనకు వెళితే నీకేంటి?’
హైదరాబాద్: బీసీ డిమాండ్ల సాధనకు, ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో బీసీలకు పెద్దపీట వేసేందుకు వైఎస్సార్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి నిర్వహించిన బీసీ గర్జన సభకు తమ నాయకుడు ఆర్.కృష్ణయ్య వెళితే మీకు వచ్చిన నొప్పేంటని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావును 14 బీసీ సంఘాల నేతలు ప్రశ్నించారు. బీసీల సమస్యలు, డిమాండ్లు కృష్ణయ్యకు తెలుసు కాబట్టే జగన్ ముఖ్య అతిథిగా పిలిచారన్నారు. గర్జన సభకు కృష్ణయ్య వెళ్లడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటని నిలదీశారు. మంగళవారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ మాట్లాడుతూ.. బీసీల నేతగా ఎదిగిన కృష్ణయ్యపై విమర్శలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ సభకు వెళ్లితే కృష్ణయ్యను తప్పు పట్టాల్సిన అవసరం ఏముందని వీహెచ్‌ని ప్రశ్నించారు. అంతకుముందు బీసీ సంఘాల నేతలంతా చీపుర్లు పట్టుకుని వీహెచ్‌కి తగిన గుణపాఠం చెబుతామంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ అధ్యక్షుడు నీరడి భూపేష్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
తొలి రోజు 25 దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల దరఖాస్తుల స్వీకరణ కాంగ్రెస్ ప్రారంభించింది. ఆదివారం నుంచి ఈ స్వీకరణ ప్రారంభం కాగా, తొలిరోజు పలు లోక్‌సభ నియోజకవర్గాలకు 25 దరఖాస్తులు వచ్చాయని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. తొలిరోజు దరఖాస్తు చేసిన వారిలో పార్టీ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, మల్లు రవి, బలరాం నాయక్, కోదండరెడ్డి తదితరులున్నారు. ఈ దరఖాస్తుల స్వీకరణ మంగళవారం వరకు కొనసాగనుంది. సోమ, మంగళవారాల్లో పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, సోమవారం గాంధీభవన్‌లో పలు సమావేశాలు జరగనున్నాయి. కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షులతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ కానున్నారు. దీంతో పాటు లోక్‌సభ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన మీడియా కో ఆర్డినేషన్ కమిటీ, పబ్లిసిటీ కమిటీ, ప్రచార కమిటీ, సమన్వయ కమిటీ భేటీలు జరగనున్నాయి. ఈ భేటీల అనంతరం మంగళవారం ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో లోక్‌సభకు పోటీచేసేందుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి షార్ట్‌లిస్టు చేయనున్నారు. పోటీకి సై అంటున్న సీనియర్లు ఈ సారి కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ సీనియర్ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశమివ్వాలని మాజీ ఎంపీ వీహెచ్, భువనగిరి సీటు ఇవ్వాలని ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్‌చైర్మన్ ఎం.కోదండరెడ్డిలు ఆదివారం దరఖాస్తు చేసుకున్నారు. తమ దరఖాస్తులను టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్‌రావుకు అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన మల్లు రవి (నాగర్‌కర్నూల్), కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ (మహబూబాబాద్)లు కూడా తమ దరఖాస్తులు అందజేశారు. కాగా, భువనగిరి స్థానం నుంచి టికెట్ కోసం నల్లగొండ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్, నల్లగొండ పార్లమెంటు కోసం సూర్యాపేటకు చెందిన పటేల్ రమేశ్‌రెడ్డి కూడా దరఖాస్తు చేశారు. ఇక, రిజర్వుడు నియోజకవర్గాలైన వరంగల్ నుంచి ఇందిరా, మహబూబాబాద్ నుంచి బెల్లయ్యనాయక్, నాగర్‌కర్నూల్ నుంచి సతీశ్మాదిగలు కూడా దరఖాస్తు చేసిన వారిలో ఉన్నారు. -
హైదరాబాద్‌లో క్రైమ్ ఎక్కువ అవుతోంది : వీహెచ్
సాక్షి, హైదరాబాద్ : మైనర్ బాలిక మధులికపై జరిగిన దాడి ఘటన దుర్మార్గమైందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. విద్యార్థినిపై అతికిరాతకంగా దాడి జరుగుతుంటే ఎవ్వరూ అపకపోవడం దారుణమన్నారు. అమ్మాయి నుంచి నేలమీద పడ్డ రక్తపు బొట్లను కడిగెయ్యడం అమానుషమని తెలిపారు. అబ్బాయిపై ఫిర్యాదు చేస్తే షీటీమ్స్ ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చారు తప్ప పోలీసులు ఎందుకు సీరియస్ వార్నింగ్ ఇవ్వలేదని వీహెచ్ మండిపడ్డారు. అమ్మాయి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుడు భరత్, ఆయనకు సహకరిస్తున్న బంధువులపై చర్యలు తీసుకోవాలన్నారు. షీ టీమ్ ఎందుకు కేసు బుక్ చెయ్యలేదని ప్రశ్నించారు. కేవలం కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో క్రైమ్ ఎక్కువ అవుతోందని ధ్వజమెత్తారు. చదవండి : హైదరాబాద్ బర్కత్‌పురాలో ఘోరం -
మమత విషయంలో ఎందుకు స్పందించరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రికి గానీ, ప్రధాన కార్యదర్శికి గానీ సమాచారం ఇవ్వకుండా పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ ఐపీఎస్ అధికారిని అరెస్టు చేసేందుకు సీబీఐ ప్రయత్నించడం దారుణమని కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజల ఓట్లతో రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన మమతాబెనర్జీ ప్రభుత్వంపై మోదీ, అమిత్‌షాలు దాడిచేయబోయారని, మమత ఓ శక్తిలా అడ్డుకొని రాజ్యాంగాన్ని కాపాడారని అన్నారు. బెంగాల్ సీఎంను, అక్కడి పోలీసులను అభినందిస్తున్నానని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్ ఎన్డీయేకు బీటీమ్ అని దీంతో తేలిపోయిందని ఆయన ఎద్దేవా చేశార -
ఎన్డీఏ బీటీమ్ కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ : వీహెచ్
సాక్షి, హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అక్కడి పోలీసులను అభినందిస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. సీఎస్‌కు గానీ, సీఎంకు గానీ సమాచారం ఇవ్వకుండా సీబీఐ అధికారులు ఒక ఐపీఎస్ అధికారి అరెస్ట్‌కు ప్రయత్నం చేయటం దారుణమని మండిపడ్డారు. ప్రజల ఓట్లతో రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన మమత ప్రభుత్వంపై నరేంద్ర మోదీ, అమిత్ షా దాడి చేయబోయారని ధ్వజమెత్తారు. మమత ఓ శక్తిలా అడ్డుకుని రాజ్యాంగాన్నీ కాపాడిందని కొనియాడారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని నిప్పులు చెరిగారు. ఎన్డీఏ బీటీమ్ కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అని వీహెచ్ ఆరోపించారు. -
భట్టి సన్మాన సభలో రభస
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క సన్మాన కార్యక్రమం రసాభాసగా మారింది. ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో జరిగిన సన్మాన కార్యక్రమంలో అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన రెండు వర్గాల నేతలు ఘర్షణకు దిగడంతో గందరగోళం నెలకొంది. మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఓబీసీ సెల్ నగర అధ్యక్షుడు శ్రీకాంత్ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణ చివరికి శ్రీకాంత్ సస్పెన్షన్‌కు దారితీసింది.శనివారం గాంధీభవన్‌లో ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు చిత్తరంజన్‌దాస్ ఆధ్వర్యంలో కొత్తగా ప్రతిపక్ష నేతగా ఎన్నికైన భట్టి విక్రమార్కకు సన్మానం ఏర్పాటు చేశారు. దీనికి మాజీ ఎంపీ వీహెచ్, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. సన్మాన సభ మొదలైన కొద్ది సేపటికే వేదికపై ఉన్న వీహెచ్‌కు వ్యతిరేకంగా నగర ఓబీసీ సెల్ అధ్యక్షుడు నూతి శ్రీకాంత్ వర్గీయులు ఆందోళనకు దిగారు. అంబర్‌పేట టికెట్ రాకుండా వీహెచ్ అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో సహనం కోల్పోయిన వీహెచ్ వారిని దుర్భాషలాడారు. ఈ సమయంలో వీహెచ్ వర్గీయులు కొందరు నూతి శ్రీకాంత్ వర్గీయులపైకి దూసుకురావడంతో ఘర్షణ మొదలైంది. ఇరు వర్గాలు కుర్చీలతో, పిడిగుద్దులతో పరస్పరం దాడిచేసుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాల వారిని సీనియర్ నేతలు శాంతింపజేసే ప్రయత్నం చేశారు.అయినా గొడవ సద్దుమణగక పోవడంతో హడావుడిగా కార్యక్రమాన్ని ముగించారు. నగర సెల్ పదవి నుంచి శ్రీకాంత్ తొలగింపు.. ఘర్షణకు కారణమైన శ్రీకాంత్‌ను నగర ఓబీసీ సెల్ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ సెల్ అధ్యక్షుడు చిత్తరంజన్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తనను సస్పెండ్ చేయడంపై నూతి శ్రీకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు. తనకు మద్దతుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ కార్యకర్తలను వీహెచ్ దుర్భాషలాడినం దునే తాను ప్రతిఘటించానని తెలిపారు. మంద బలంతో గెలుద్దామంటే పప్పులుడకవ్: భట్టి తనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ, లక్షలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తల గొంతుక వినిపించాలని ప్రజలు తమను అసెంబ్లీకి పంపారని, ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తానని వాగ్దానం చేశారు. గెలుపోటములు రాజకీయాల్లో శాశ్వతం కాదని, కేసీఆర్ కంటే బలమైన నేతలు వచ్చారని, అనంతరం కాల గర్భంలో కలిశారన్నారు. కాంగ్రెస్ ఓడిపోయిందని, మంద బలంతో నియంత్రిద్దామనుకుంటే పప్పులుడకవని హెచ్చరించారు. ఎలాంటి సమస్యలున్నా తనకు లేఖ రాయాలని కోరారు. కార్యక్రమం ముగిసిన అనంతరం నూతి శ్రీకాంత్, ఆయన వర్గీయులు భట్టి చాంబర్ వద్ద ధర్నాకు దిగారు. తనపై దుర్భాషలాడిన వీహెచ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తర్వాత వీహెచ్‌పై బేగంబజార్ పోలీస్ స్టేషన్లో శ్రీకాంత్ ఫిర్యాదు చేశారు. -
కేసీఆర్ భాష సరిగా లేదు : వీహెచ్
ఢిల్లీ: పక్క రాష్ట్రం ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి మీద కేసీఆర్ మాట్లాడిన భాష సరైనవిధంగా లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో వీహెచ్ విలేకరులతో మాట్లాడుతూ..కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిలాగా ప్రవర్తించడం లేదని విమర్శించారు. గ్రామాల్లో చదువులేని వారు మాట్లాడే భాషలాగా, ఒక ఊరు భాషలాగా కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుని సంక నాకుతున్నావా అని అనడం సమంజసం కాదన్నారు. నీ అవసరం బట్టి ఇతర నాయకుల సంక నాకుతున్నావ్ కదా అని కేసీఆర్‌పై పరుష పదజాలం వాడారు. ఇలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ని తాను ఎక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్లు ఏమయ్యాయ్ బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేసీఆర్ ఎందుకు పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్నారని సూటిగా అడిగారు. మోదీని కలిసి ఇచ్చిన 16 అంశాలలో బీసీల అంశం ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ స్పూర్తిని దెబ్బకొట్టడానికి కేసీఆర్ చూస్తున్నారని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ప్రజలు కేసీఆర్‌కి బుద్ది చెబుతారని జోస్యం చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులైనా ఇప్పటి వరకు క్యాబినేట్ ఎందుకు ఏర్పాటు చేయలేదని అడిగారు. కేసీఆర్ ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
ఇందిరా పార్క్ వద్ద బీసీల మహా ధర్నా
హైదరాబాద్: రాబోయే పంచాయతీ రాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించడాన్ని నిరసిస్తూ బీసీలు మహా ధర్నాకు దిగారు. ధర్నాలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. బీసీలపై కేసీఆర్ కక్ష కట్టారు: జాజుల ఎన్నికల్లో ఆశీర్వదించిన బీసీలపైనే కేసీఆర్ కక్ష కట్టారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన గంటల వ్యవధిలోనే బీసీల రిజర్వేషన్లను 34 నుంచి 23 శాతానికి తగ్గిస్తూ ఆర్డినెన్స్ చేశారని విమర్శించారు. బీసీల రిజర్వేషన్ల సమస్యపై 24 గంటల్లోగా శాశ్వత పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్లను రక్షించుకునేందుకు జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. సమస్యకు పరిష్కారం చూపకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బలహీనవర్గాలకు రాయితీలు..దొరలకు అధికారమా?: ఎల్ రమణ బలహీనవర్గాలకు రాయితీలు..దొరలకు అధికారం అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ విమర్శించారు. సీఎం అఖిలపక్ష సమావేశం నిర్వహించి సమస్య పరిష్కరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీలను కలుపుకునిపోయి బీసీ రిజర్వేషన్లను రక్షించుకోవాలని సూచించారు.బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టును ప్రశ్నించిన కేసీఆర్ తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరారు. రిజర్వేషన్ల పోరాటంలో టీటీడీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రాణం పోయినా ఊరుకునేది లేదు:వీహెచ్ ప్రాణం పోయినా ఊరుకునేది లేదు..బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం పోరాటం ఆపేది లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్లోని బీసీ ఎమ్మెల్యేలు రిజర్వేషన్లపై మాట్లాడాలని కోరారు. సకల జనుల సర్వేలో బీసీల లెక్కలు ఇప్పటికీ బయట పెట్టలేదని చెప్పారు. బీసీల ఓట్ల కోసం స్కీమ్‌లు పెట్టారు...ఎన్నికల్లో గెలిచాక బీసీల రిజర్వేషన్లు తగ్గించారు. బీసీల పట్ల సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు..బీసీలు అధికారంలో భాగస్వామ్యం కావాలని కోరారు. సమగ్ర కుటుంబసర్వేలో 54 శాతం బీసీలు ఉన్నారని ప్రకటించిన వాస్తవమా కాదా చెప్పాలన్నారు. బీసీలు చట్టసభల్లోకి వెళ్లకుండా గొర్లు,బర్లు కాసుకునే బతకాలా అని సూటిగా అడిగారు. కేసీఆర్ పిట్టల దొర : షబ్బీర్ కేసీఆర్ ఒక పిట్టల దొర అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. బీసీలకు రిజర్వేషన్లను పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ మద్ధతు ఉంటుందని స్పష్టం చేశారు. 34 శాతం కోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. సీఎం నిర్ణయం హాస్యాస్పదం: పొన్నాల సీఎంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని పీసీసీ మాజీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన ఆర్డినెన్స్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర కుటుంబ సర్వే చేసి చట్టబద్దం చేయలేదని వెల్లడించారు. బీసీలు రాజ్యాధికారం కోసం పోరాటం చెయ్యాలని సూచించారు. -
బీసీల రిజర్వేషన్లకు పోరాటం
హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రస్తుతం ఉన్న 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలనే డిమాండ్‌కు పార్టీలు, జెండాలు పక్కనబెట్టి తెలం గాణ ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకుని పోరాడాలని బీసీ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అధ్యక్షతన ‘ఇప్పుడున్న బీసీల 34 శాతం రిజర్వేషన్లు రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో అమలు చేయాలి’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సదస్సు జరిగింది. ఐక్యమైతేనే రాజ్యాధికారం: జస్టిస్ ఈశ్వరయ్య సమావేశంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ అధ్యక్షుడు, రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. లెక్కల ప్రకారం 18 జిల్లాల్లో బీసీలు 55 శాతంకన్నా ఎక్కువగా ఉన్నారని, మిగిలిన జిల్లా ల్లో కూడా 50 శాతం ఉన్నామని తెలిపారు. అయితే సీఎం కేసీఆర్ తన సొంత లెక్కల ద్వారా ఎస్సీ, ఎస్టీలు పెరిగారని చెప్తూ వారికి రిజర్వేషన్లు పెంచి, బీసీలకు తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలు ఇప్పుడు చైతన్యం కాకపోతే ఎప్పటికీ కాలేరని అంతా ఐక్యమై రాజ్యాధికారం దక్కేలా కృషిచేయాలన్నారు. ఉత్తరభారత దేశంలో మాదిరి ఇక్కడకూడా బీసీలపార్టీ ఒకటి ఏర్పాటు చేయాలన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు 26 శాతం పోతే మిగిలిన 74 శాతం బీసీలే కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ.. వివిధ బీసీ కుల సంఘా ల ఆశీర్వాద సభలు పెట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు రాజ్యాధికారం దూరం చేసే కుట్ర లు పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. రిజర్వేషన్లు తగ్గించడం చారిత్రాత్మక తప్పని, దీన్ని బడుగు, బలహీనవర్గాలవారు సహించరని నిరూపించాలన్నారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వీహెచ్ మాట్లాడుతూ .. సీఎం కేసీఆర్‌కు బీసీలంటే ఎందుకు ఇంత కక్షో అర్థం కావడంలేదన్నారు. ఈ అంశంపై ఓ వైపు న్యాయబద్ధంగా పోరాడుతూనే తెలంగాణ ఉద్యమస్పూర్తితో ఉద్యమాలు చేద్దామని, ప్రతీ జిల్లాలో నిరసనలు చేద్దామని పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ .. ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్‌బాపూజీ, ఆలె నరేంద్ర లాంటి బీసీ నేతల పునాదులమీద పుట్టిన టీఆర్ఎస్ పార్టీ, చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు బీసీలకే ద్రోహం చేస్తోందని ఆగ్రహంవ్యక్తం చేశారు. రిజర్వేషన్లపై కేసు వేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వప్నా రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ కి చెందిన గోపాల్ రెడ్డిలను ఆయా పార్టీలు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత, కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ చిత్తరంజన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల సాధనకోసం జాజుల శ్రీనివాస్ నేడు ధర్నాచౌక్ వద్ద చేపట్టనున్న ధర్నాకు అన్ని పార్టీలు, సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. పార్టీలు, జెండాలు పక్కన పెట్టి అందరూ రిజర్వేషన్ కోసం పోరాడాలని సదస్సులో తీర్మానించారు. -
‘నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని ఏఐసీసీ కార్యదర్శి వీ. హనుమంతరావు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించి, ఫలితాలు ప్రకటించాక కోర్టు కేసులతో వేలాది నిరుద్యోలు వేచి చూడాల్సి వస్తుందని విమర్శించారు. ఈ ఉద్యోగ సమస్య చిలికి చిలికి గాలివానగా మారక ముందే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఏళ్లు గడిచిన పోస్టీంగ్ లేదు: మానవతారాయ్ ‘రెండు సంవత్సరాల క్రితం పీఈటీ పోస్టుల కోసం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. పరీక్షలు కూడా నిర్వహించి, సర్టిఫికేషన్ల వెరిఫికేషన్లు కూడా అయిపోయాగా పోస్టీంగ్ నిలివేశారు. కోర్టు కేసులంటూ ఈ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుంది’ అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్ మండిపడ్డారు. టీఎస్పీఎస్సీఘావిర్భావ దినోత్సవం అని సంబరాలు చేసుకుంటున్నారు కానీ నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడంలేదని విమర్శించారు. గురుకుల విద్య సంస్థల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల సంగతి నిర్లక్ష్యం చేస్తున్నారు. గడిచిన నాలుగేళ్ల కాలంలో ఒక్క పీఈటీ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. నిరసన కూడా తెలపనీయకుండా అరెస్ట్ చేస్తున్నారు. పీఈటీ ఉద్యోగానికి సెలెక్ట్ కానీ అభ్యర్థులు కేసు వేస్తే ఉద్యోగ భర్తి ఆపుతున్నారు. రెండు సంవత్సరాలు అయినా పోస్టీంగ్ ఇవ్వడం లేదు. ఉద్యోగాల కోసం టీఎస్సీఎస్సీకి వస్తే అరెస్ట్ చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జైలులోనే ఉండాలా? ప్రజలే బాస్ అంటున్న కేసీఆర్ ఎందుకు ప్రజలను పట్టించుకోవడం లేదు. సెలెక్ట్ అయిన అభ్యర్థులను జైలులో పెట్టాల్సిన అవసరం ఏముంది. -సైదులు, భార్గవి, పీఈటీ అభ్యర్థులు -
కారు ఈరోజు జోరు.. రేపు రిపేరు: పొన్నం
సాక్షి, హైదరాబాద్: కారు ఈరోజు జోరు మీద ఉండొచ్చు.. రేపు రిపేర్ కావొచ్చునని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నా రు. శనివారం గాంధీభవన్‌లో పొన్నం మాట్లాడుతూ ఓటమితో ఎవరు అధైర్యపడొద్దని, గెలుపోటములు సహజమని కార్యకర్తలకు తెలిపారు. మండల, జిల్లా స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుని రాబోయే ఎన్నికలకు సిద్ధమవుదామని పిలుపునిచ్చారు. బీజేపీకి ఓ స్టాండ్ అంటూ లేదని, ఆ పార్టీ టీఆర్ఎస్కు తోకపార్టీగా మారిందని ఆయన ఆరోపించారు. రిజర్వేషన్లపై అసెంబ్లీసమావేశం పెట్టండి: వీహెచ్ సాక్షి, హైదరాబాద్: త్వరలో పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించను న్న నేపథ్యంలో తక్షణమే అసెంబ్లీ ఏర్పాటు చేసి బీసీ రిజర్వేషన్లు పెంచా లని మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. దీనిపై పీసీసీ చీఫ్ ఉత్త మ్, భట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ బీసీలను రాజకీయాల్లోకి రాకుండా చూస్తుందని ఆరోపించారు. బీసీ సంఘాలు రిజర్వేషన్ల పెంపు అంశంపై ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. -
‘బీసీలకు 69 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి’
సాక్షి, హైదరాబాద్ : బీసీలను రాజకీయంగా ఎదగనీయకుండా కేసీఆర్ అడ్డు పడుతున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హన్మంతరావు ఆరోపించారు. శుక్రవారమిక్కడ గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఆలోచనే పంచాయతీ ఎన్నికలని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ ఉంటే కేసీఆర్ దాన్ని తగ్గించాడని ఆరోపించారు. బీసీల జనాభా 53 శాతం ఉంటే.. 33 శాతం రిజర్వేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తమిళనాడులో ఇచ్చినట్లు తెలంగాణలో కూడా 69 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోకల్ బాడీ ఎలక్షన్లలో బీసీలను సర్పంచ్‌లు, జడ్పీటీసీలుగా కాకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ముస్లీంలకు ఎలాను రిజర్వేషన్లు పెరగవు.. బీసీలకైనా రిజర్వేషన్లు పెంచాలని కోరారు. కేసీఆర్‌కి నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే రిజర్వేన్లు పెంచి.. 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి గురించి మీటింగ్‌లో చర్చించిన తరువాత కారణాలు చెప్తామని తెలిపారు. పార్టీలో కోవర్ట్లున్నారని.. ఈవీఎంల సమస్యలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. -
అప్పుడే అనుమానం వచ్చింది: వీహెచ్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందని ఆరోపించారు. ఫలితాలు వెల్లడవుతున్న నేపథ్యంలో మంగళవారం ఆయన ఓ మీడియా చానెల్‌తో మాట్లాడారు. ‘నేను మొదట్నుంచి చెబుతున్నా.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని, నన్ను ఎవరు పట్టించుకోలేదు. ఫలితాలు చూస్తే ట్యాంపరింగ్ జరిగనట్లు స్పష్టమవుతోంది. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. తీరా ఫలితాలు చూస్తే వేరేలా ఉన్నాయి. ఒక్క రోజు క్యాంప్ ఆఫీస్‌కు రాకుండా ఇంట్ల పడుకున్న వ్యక్తికి జనాలు ఎలా ఓటేస్తారు. బ్యాలెట్ పేపర్లు పింక్ కలర్లో ఉన్నప్పుడే అనుమానం వచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కూడా ట్యాంపరింగ్ జరిగింది. లేకుంటే టీఆర్ఎస్ వారు గెలిచే స్థానాల సంఖ్యను ఖచ్చితంగా ఎలా చెబుతారు. మేం అప్పటి నుంచి ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాం. మమ్మల్ని పట్టించుకునేవాడే లేడు. ఈసీఐఎల్ ఉద్యోగులతో కేసీఆర్ కుమ్మక్కై ట్యాంపరింగ్ చేశారు. బయట రాష్ట్రాలకు గురించి తనకు తెలియదని, కానీ ఇక్కడ మాత్రం ట్యాంపరింగ్ జరిగిందన్నారు. ఫలితాల్లో ఇంత భారీ వ్యత్యాసం వస్తే అనుమానం రాదా?’ అని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికలకు ఈవీఎంలను ఒప్పుకునేది లేదని, బ్యాలెట్ బాక్సులతోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. తాజా ఎన్నికల ఫలితాల్లో కేసీఆర్ 90 స్థానాలు సాధించే దిశగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. చదవండి: టీఆర్ఎస్ ప్రభంజనం.! కొంపముంచిన చంద్రబాబు పొత్తు -
కేసీఆర్ పాలన వాగ్దానాలకే పరిమితం: వీహెచ్
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనలో వాగ్దానాలకే పరిమితం అయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్‌లో విలేకరులతో వీహెచ్ మాట్లాడుతూ..కేసీఆర్ ఒక్క వాగ్దానం కూడా సరిగా నెరవేర్చలేదని అన్నారు. నిరుద్యోగులు మహాకూటమిని గెలిపించాలని కోరారు. యువత మొత్తం ప్రజా కూటమికి అండగా నిలిచిందని, 5 సంవత్సరాలు పాలించలేని కేసీఆర్‌కు ఓటు వేటువద్దని ప్రజలు నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్‌లో గిరిజనుల ఓట్లు, హైదరాబాద్‌లో కూడా కొన్ని చోట్ల కావాలనే ఓట్లు తొలగించారని ఆరోపించారు. ప్రజా కూటమి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. మేమిచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పారు. ఈవీఎంలు పింక్ కలర్లో పెట్టారని, దాని వల్ల గుర్తు వెతుక్కోవడానికి తనకే టైం పట్టిందని విమర్శించారు. సోనియా, రాహుల్ పర్యటన వల్ల ప్రజాకూటమికి బాగా కలిసి వచ్చిందన్నారు. కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. పోలీసులు కేసీఆర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చాక వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
కేసీఆర్‌కు అంత భయమెందుకు?: వీహెచ్
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటిపైకి 50 మంది పోలీసులను పంపి దాడులు చేయించడం ఏ మేరకు సబబని కాంగ్రెస్ నేత వీ హనుమంత రావు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..కేసీఆర్‌కు అంత భయమెందుకని సూటిగా అడిగారు. పోలీసులు కూడా టీఆర్ఎస్కు ప్రచారం చేయండని చెబుతున్నారని ఆరోపించారు. కూకట్పల్లి ప్రాంతంలో పోలీసు అధికారులు టీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇంటిపై, ప్రగతి భవన్‌పై పోలీసులు దాడులు చేయమంటే చేస్తారా అని ప్రశ్నించారు. 108,104 వాహనాల్లో డబ్బులు, మద్యం తరలిస్తున్నారని, కాంగ్రెస్, తెలుగుదేశం కార్యకర్తలు 108,104 వాహనాలను తనిఖీలు చేయాలని సూచించారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి చెడ్డపేరు తెచ్చుకోవద్దని హితవు పలికారు. మహిళలని కూడ చూడకుండా పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. -
రవిచంద్రను భారీ మెజార్టీతో గెలిపించాలి: వి.హనుమంతరావు
సాక్షి, ఖిలా వరంగల్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం సర్వముఖోభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. వరంగల్ పోచమ్మమైదానంలో కాంగ్రెస్ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్ధి వద్ది రాజు రవిచంద్ర ఆధ్వర్యంలో శనివారం రాత్రి రోడ్‌షో జరిగింది. ముఖ్యఅతిథిగా హనుమంతరావు హాజరై రోడ్‌షోలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కుటుంబ పాలన చేస్తూ రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టిన ఘనత కేసీఆర్‌దేనిన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీలు, ఫెన్షన్ల రెట్టింపు, ఏడుకేజీల సన్నబియ్యం, విద్యార్థుల చదువులకు ఫీజు రీయింబర్స్ మెంట్‌తోపాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పట్టనున్నట్లు తెలిపారు. చేతి గుర్తుకు ఓటు వేసి వద్ది రాజు రవిచంద్రను భారీ మేజార్టీతో గెలిపించాని ఆయన కోరారు. అనంతరం రవిచంద్ర మాట్లాడుతూ తాను స్థానికుడినేనని, మున్నూరుకాపు బిడ్డను ఆదరించాలని కోరారు. చేతిగుర్తుకు ఓటు వేసి భారీ మేజార్టీని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆనంతరం రోడ్ షో పోచమ్మమైదానం నుంచి వరంగల్ చౌరస్తా, అండర్ బ్రిడ్జి, ఫోర్ట్‌రోడ్డుమీదుగా శంభునిపేట, ఆర్టీఏ జంక్షన్ వరకు సాగింది. రోడ్‌షోకు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంబాడి రవీందర్, మీసాల ప్రకాశ్, ఎండీ ఆయూబ్, రాజు, కొత్తపెల్లి శ్రీనివాస్, కరాటే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌కు ఫామ్‌హౌసే గతి
సాక్షి, నిజామాబాద్‌అర్బన్: డిసెంబర్ 12 తరువాత కేసీఆర్ తన ఫామ్ హౌజ్ కే పరిమితమవుతారని రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హన్మంత్‌రావు విమర్శించారు. ఆదివారం నగరంలోని వ్యాస్భవన్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడా రు. మహాకూటమిని చూసి భయపడి కేసీఆర్ అనవసరమైన విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని విమర్శించారు. కేసీఆర్ ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో కుమ్మకై డిసెంబర్లోనే ఎన్నికలు ఏర్పాటు చేసుకున్నాడని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య అవగాహన ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో దోపీడీ, దౌర్జన్యం కొనసాగిస్తుందని దీనిని రూపుమాపడానికి మహాకూటమి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్‌లో పలువురు చేరిక వి.హన్మంత్‌రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్టీల నాయకులు చేరారు. టీఆర్ఎస్ నుంచి భక్తవత్సలం, దిగంబర్పవర్, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు శ్యామేందర్, తెలుగు యువత మాజీ నగర అధ్యక్షుడు రమేశ్, శ్రీనివాస్, బీజేపీ నుంచి వినోద్‌కుమార్, బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో అర్బన్ అభ్యర్థి తాహెర్‌బిన్, టీపీసీసీ కార్యదర్శులు మహేశ్‌కుమార్‌గౌడ్, గడుగు గంగాధర్, నగర అధ్యక్షుడు కేశవేణు, పార్లమెంట్ యూత్ అధ్యక్షుడు పంచరెడ్డిచరణ్, కాంగ్రెస్ నగర ఎస్టీ సెల్ చైర్మన్ సుభాష్‌జాదవ్, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు వేణు పాల్గొన్నారు. ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదు సాక్షి, పెర్కిట్(ఆర్మూర్): ఎన్నికలకు ముందు కేసీఆర్ చేసిన వాగ్ధానాలను నిలబెట్టుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హన్మంత్ రావు ఆరోపించారు. ఆర్మూర్ మండలం పెర్కిట్‌లో ఆదివారం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ మాటలు అబద్దాల మూటలన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో నంబరు వన్ చేస్తానని చెప్పిన కేసీఆర్ దోచుకోవడంలో, దాచుకోవడంలోనే ముందున్నారని ఆరోపించారు. అలాగే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆస్తులు గత ఎన్నికలతో పోల్చితే ప్రస్తుతం భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉందన్నారు. ఈ నెల 29న ఆర్మూర్‌లో నిర్వహించే రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకుల లలిత, నాయకులు మహేశ్ కుమార్ గౌడ్, కంచెట్టి గంగాధర్, రమేశ్ రెడ్డి, పీసీ భోజన్న, వైస్ ఎంపీపీ ఇట్టెడి భాజన్న, లక్కారం నారాయణ, ఏలేటి రవికాంత్ రెడ్డి పాల్గొన్నారు. -
వీహెచ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల : కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సిరిసిల్లలో ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రచార రథం చక్రాలు ఊడిపోయాయి. నేరెల్ల మూలమలుపు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రచార రథంలో ఉన్న హనుమంతరావుకు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. -
సోనియా గాంధీ పిలుపిస్తే చాలు.. గెలుపు ఖాయం
సాక్షి,హైదరాబాద్ : మహాకూటమిని గెలిపించాలని యూపీఏ ఛైర్పర్శన్ సోనియా గాంధీ పిలుపిస్తే చాలు.. గెలుపు ఖాయమని ఏఐసీసీ కార్యదర్శి వి. హనుమంతరావు(వీహెచ్) అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...మహాకూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానన్నారు. ఒలిగొండ, యాదగిరి గుట్ట, వేములవాడ, సిరిసిల్లలో తన ప్రచారం ఉంటుందని వెల్లడించారు. కాంగ్రెస్‌లోని అసంతృప్తి నేతలకు అదిష్టాన దూతలు సర్ది చేబుతున్నారని, అంతా కలిసి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. పార్టీ టికెట్ దక్కని నేతలకు భవిష్యత్తులో ఎమ్మెల్సీ లాంటి పదవులు ఇచ్చి గౌరవిస్తామపొ పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల టికెట్లను అమ్ముకుంటుదని వ్యాఖ్యలు చేసిన కేటీఆర్.. నాంపల్లి టికెట్ ఆనంద్ గౌడ్‌కు ఇచ్చి మార్చడం పట్ల ఎలా సమర్థించుకుంటున్నారని ప్రశ్నించారు. సిరిసిల్లలొ కేటీఆర్ థర్డ్ డిగ్రీ ఇచ్చిన అంశాన్ని ప్రజలు ఎప్పటికి మర్చిపోరన్నారు. కేటీఆర్ రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండాలని వీహెచ్ వ్యాఖ్యానించారు. -
బీసీలకు 34 సీట్లు ఇవ్వాలి: వీహెచ్
సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు అన్యాయం జరగకుండా వారికి సముచిత స్థానం కల్పించేలా ఈ ఎన్నికల్లో 34 స్థానాలు కేటాయిం చాలని పార్టీ అధిష్టానా న్ని కోరినట్లు ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు తెలిపారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 54 శాతం ఉన్న బీసీలకు కాంగ్రెస్ పార్టీ సహా, ప్రజాకూటమిలోని పార్టీలు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరముందన్నారు. -
ఐఏఎస్‌ల్లో మొదటిసారి తిరుగుబాటు చూస్తున్నా: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: తమకు అన్యాయం జరిగిందంటూ సమా వేశం పెట్టుకుని కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకునేంత స్థాయిలో రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారుల తిరుగుబాటును తన రాజకీయ జీవితంలో మొదటిసారి చూస్తున్నానని మాజీ ఎంపీ వి.హన్మంతరావు వ్యాఖ్యానించారు. మంగళవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ తన ఇష్టానుసారం పనిచేయని వారిని పక్కనపెట్టి అనుకూల అధికారులను అందలమెక్కించి తాబేదార్లుగా పనిచేయించుకుంటున్నందుకు అసహనంతో కొందరు ఐఏఎస్‌లు తిరుగుబాటు చేయాల్సి వచ్చిందన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడని, గజ్వేల్‌లో కూడా ఆయన గెలవలేడని చెప్పారు. టికెట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని తాము స్క్రీనింగ్ కమిటీకి చెప్పినట్టు వీహెచ్ వెల్లడించారు. కాంగ్రెస్ నేతలకు భద్రత పెంచండి డీజీపీని కోరిన టీపీసీసీ నేతల బృందం సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ కీలక నేతలకు భద్రత పెంచాలని టీపీసీసీ నేతల బృందం డీజీపీ మహేందర్‌రెడ్డిని కోరింది. మంగళవారం టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి హర్కగోపాల్ డీజీపీని కలసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల దృష్ట్యా ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి జెడ్ కేటగిరీ భద్రత కల్పించి బుల్లెట్ ప్రూఫ్ వాహనం సమకూర్చాలని కోరినట్టు తెలిపారు. ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి 4+4 సెక్యూరిటీ కల్పించాలని కోరామన్నారు. అలాగే విజయశాంతి, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ గౌడ్, గూడూరు నారాయణరెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, వేణుగోపాల్‌కు మరింత భద్రత కల్పించాలని కోరినట్టు తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డీజీపీ.. అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానన్నారని చెప్పారు. -
మేనిఫెస్టోలో ‘మున్నూరు కార్పొరేషన్’ను చేర్చాలి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మేనిఫెస్టోలో మున్నూరు కాపుల కార్పొరేషన్ ఏర్పాటును చేర్చాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు హన్మంతరావు టీపీసీసీకి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. రెడ్లు, ఆర్యవైశ్యుల లాగే మున్నూరు కాపుల్లో కూడా ఆర్థికంగా వెనుక బడినవారు ఉన్నారని, మొత్తం జనాభాలో వీరు 30 శాతం ఉన్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని, వాటిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. -
సీట్ల కోసం పట్టింపులు వీడాలి: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: అబద్ధాల కేసీఆర్‌ను గద్దె దించేందుకు సీట్ల కోసం పంతాలు, పట్టింపులు వీడాలని మహాకూటమి భాగస్వామ్య పక్షాలకు మాజీ ఎంపీ వి.హనుమంతరావు సూచించారు. సీట్ల విషయంలో పంతాలకు పోవద్దని టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూచించడం అభినందనీయమని అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ అబద్ధాల కోరని ప్రజలకు అర్థమైందన్నారు. బీసీలకు సంబంధించి ఢిల్లీ మీటింగ్‌కు పిలవకపోవడంపై స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ను అడుగుతానన్నారు. తననే కాకుండా పొన్నాల, ఆనంద్ భాస్కర్‌లనూ ఈ మీటింగ్‌కు ఆహ్వానించకపోవడం తగదన్నారు. -
గజ్వేల్ ప్రజలు పరివర్తనను కోరుతున్నారు: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు పరివర్తనను కోరుకుంటున్నారన్న విషయం తన రథయాత్రలో అర్థమైందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఈ నెల 11 నుంచి 14 వరకు ఉమ్మడి మెదక్జిల్లాలో ఇందిరా విజయ రథయాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన సోమవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తాను పర్యటించిన ప్రతీ చోటా ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, గజ్వేల్‌తో పాటు నర్సాపూర్, మెదక్, జహీరాబాద్‌లలో పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారని ఆయన చెప్పారు. కేసీఆర్‌ను ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు అసహ్యిం చుకుంటున్నారని, ఆయన మోసం చేశారని ప్రజ లకు అర్థమైందని వీహెచ్ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హవా నడుస్తోందని, తాము కచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. -
తెలంగాణ తెచ్చాననడం హాస్యాస్పదం: వీహెచ్
పటాన్చెరు టౌన్: తెలంగాణ తానే తెచ్చానని కేసీఆర్ చెప్పుకోవడం హాస్యాస్పదం అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ఎంతో మంది ఆత్మార్పణ చేసుకోవడంతో.. వారి ఆవేదనను గుర్తించిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని, త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా వారు ఉన్నారన్నారు. కేసీఆర్‌ని వాలీబాల్ ఆడినట్లు ఆడుకుందాం: కోమటిరెడ్డి నల్లగొండ: తన ఎమ్మెల్యే పదవిని రద్దు చేసిన కేసీఆర్‌ను వాలీబాల్ ఆడినట్లు ఆడుకోవాలని మార్నింగ్ వాకర్స్‌ను సీఎల్పీ మాజీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఆది వారం ఉదయం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ గ్రౌండ్లో ఆయన మార్నింగ్ వాకర్స్‌తో కలిసి జాగింగ్ చేశారు. వాలీబాల్, క్రికెట్ ఆడి సందడి చేశారు. అనంతరం పట్టణంలో జరిగిన పలు కార్యక్రమాల్లో మాట్లాడారు. తాను అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తిని కాద ని, యాదాద్రి పవర్ ప్లాంట్‌తో జిల్లా ప్రజలకు ఆరోగ్యాలు దెబ్బతింటాయని చెప్పానన్నారు. -
తల ఎప్పుడు నరుక్కుంటావ్..?
మెదక్‌జోన్/నర్సాపూర్: తెలంగాణకు దళితుడిని తొలి ముఖ్యమంత్రిగా చేయనందుకు.. గతంలో ఇచ్చిన మాట మేరకు తల ఎప్పుడు నరుక్కుంటావని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన మెదక్ పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాడు రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానని చెప్పిన మోసగాడు కేసీఆర్, నేడు సోనియా గాంధీనే విమర్శిస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణ ద్రోహులైన మహేందర్‌రెడ్డి, తలసాని, తుమ్మలకు మంత్రి పదవులిచ్చిన కేసీఆర్, నేడు మహాకూటమిలో భాగంగా టీడీపీతో పొత్తుపెట్టుకుంటే ఎందుకు చిందులు వేస్తున్నారని మండిపడ్డారు. అడ్డదారుల్లో మళ్లీ అధికారం దక్కించుకుని కొడుకుకు పట్టం కట్టేందుకు కేసీఆర్ తహతహలాడుతున్నాడని వీహెచ్ ఆరోపించారు. తండ్రిలాగ కొడుకు సైతం ప్రతిపక్షాలను నీచ సంస్కృతితో తిడుతున్నాడని నిప్పులు చెరిగారు. కాగా, మెదక్ పట్టణం నుంచి వీహెచ్ విజయరథం యాత్ర రాత్రి నర్సాపూర్‌కు చేరుకుంది. అక్కడ ఆయన మాట్లాడుతూ, సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా వద్ద అడుక్కు తినాల్సి వచ్చేదని విమర్శించారు. -
నయీమ్ డబ్బులతో టీఆర్ఎస్ ప్రచారం
నిజామాబాద్‌అర్బన్: నయీమ్ ఎన్కౌంటర్ అనంతరం భారీగా డబ్బులతో పాటు బంగారాన్ని సీఎం కేసీఆర్ దోచుకున్నారని, ఆ డబ్బునే ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హన్మంత్‌రావు ఆరోపించారు. కేసీఆర్ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మహా కూటమియే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత మహేశ్‌కుమార్‌గౌడ్ తల్లి మణెమ్మ మృతి చెందడంతో ఆయనను పరామర్శించేందుకు ఆదివారం నిజామాబాద్‌కు వచ్చిన వీహెచ్ ఓ హోటల్లో విలేకరుల తో మాట్లాడారు. ముందస్తు ఎన్నికలకు కాం గ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, మహా కూటమి సీట్ల సర్దుబాటు త్వరలోనే పూర్తవుతుందన్నా రు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కేసీఆర్ విఫలమయ్యాడని, తన కుటుంబంలోని సమ స్యతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని విమర్శించారు. తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలనే తపనతో ప్రతిపక్షాలపై ఆరోపణ లు చేస్తున్నారని, అభద్రతాభావంతో కేసీఆర్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని ధ్వ జమెత్తారు. ఎన్నికల కమిషన్‌పై అనుమానా లు వ్యక్తమవుతున్నాయని, సీఎం కేసీఆర్ చెప్పినట్టే డిసెంబర్లో ఎన్నికలు రావడం, ఓటర్ల జాబితా పూర్తి కాక ముందే ఎన్నికల షెడ్యూల్ రావడం వల్లే అనుమానాలు పెరిగాయన్నారు. సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరూ అబద్దాలకోరులు అని, ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని విమర్శించారు. ప్రతిపక్షంలో ఎవరు ఉంటే, వారిపై ఐటీ దాడులు చేయడం పరిపాటిగా మారిందని తెలిపారు.త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ గాంధీ సభలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని వీహెచ్ విమర్శించారు. ఆర్టీసీ బస్సులకు కేసీఆర్, పోచారం ఫొటోలు ఉన్నాయని, బస్సులను ఆపి పోస్టర్లు చింపి వేసినట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అనేక పథకాలు చేపడతామన్నారు. -
కేసీఆర్ పోస్టర్లపై వీహెచ్ అసహనం
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావ్! తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావ్ పోస్టర్లపై అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుకు అతికించిన కేసీఆర్ పోస్లర్లను చించేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ప్రభుత్వం ప్రచార పోస్టర్లను తొలిగించకపోవటంతో వీహెచ్ ఆగ్రహానికి గురయ్యారు. నాచారంలో ఆర్టీసీ బస్సుపై ఉన్న కేసీఆర్ ప్రచార పోస్టర్లను చింపేశారు. ప్రయాణికులందరూ సహకరించాలని ఆయన విజ్ణప్తి చేశారు. -
పొత్తులు పెట్టుకుంటే తప్పేంటి?: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: ఎన్ని కల్లో పొత్తులు పెట్టుకుం టే తప్పేంటని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హను మంతరావు టీఆర్ఎస్ను ప్రశ్నించారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడు తూ ‘మీరు పొత్తు పెట్టుకున్నప్పుడు తప్పు లేదు కానీ మేము పెట్టుకుంటే తప్పా’ అని ప్రశ్నించా రు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ నేతలు అవా కులుచెవాకులు మాట్లాడుతున్నారని దుయ్యబ ట్టారు. టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. కేసీ ఆర్ వైఫల్యాలపై ఊరూరా ప్రచారం చేసి ప్రజా తీర్పు కోరుతామన్నారు. ప్రజల దీవెనల కోసం ప్రజాసంకల్ప యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 10 నుంచి ఇందిరమ్మ రథం ప్రారంభిం చనున్నట్లు వెల్లడించారు. -
కేసీఆర్ తొత్తులా గవర్నర్: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గవర్నర్ నరసింహన్ తొత్తులా వ్యవహరిస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వంలా లేదని, కేసీఆర్ ఇంకా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌కు మద్దతు పలికేలా గవర్నర్ ప్రవర్తిస్తున్నారని, మెట్రో రైల్ ప్రారంభోత్సవంలో గవర్నర్ టీఆర్ఎస్ నేతలా వ్యవహరించారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు, రేవంత్ రెడ్డిపై ఈడీ దాడులను రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా అభివర్ణించా రు. -
‘అక్కడ దాడులు చేస్తే వందల కోట్లు దొరుకుతాయి’
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్నాయకులు తప్పుబట్టారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి చేరుకున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డిలు ఈ దాడులను ఖండించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అణచివేత దోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు గళమెత్తినా వారిని టార్గెట్ చేస్తూ కేసులతో వేధిస్తున్నారని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు డీకే శివకుమార్‌పై ఐటీ దాడులను యావత్ దేశం చూసిందన్నారు. ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డిని కేంద్ర సంస్థల సహాకారంతో కేసీఆర్ ఎలా ఇబ్బందులు పెట్టి, భయభ్రాంతులకు గురిచేస్తున్నారో ప్రజలందరు గమనించాలని కోరారు. ఎన్నికల వేళ అకారణంగా ఇంట్లో ఎవరు లేనప్పుడు సోదాలు నిర్వహించటాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. నిజంగా ఐటీ శాఖకు డబ్బులు కావాలంటే టీఆర్ఎస్ కార్యలయం, కేసీఆర్ నివాసంపై రైడ్ చేయాలని.. అక్కడ అడ్డగోలుగా దోచుకున్న వందల కోట్లు దొరుకుతాయని ఆరోపించారు. అక్రమ కేసులతో కాంగ్రెస్ శ్రేణులను భయపెడతామంటే.. భయపడేది లేదని.. రెట్టించిన ధైర్యంతో కొట్లాడతామని తెలిపారు. ప్రతిపక్షాల గొంతు నొక్కి, అణచివేసేందుకు జరిగే దాడులను తిప్పి కొడతామని పేర్కొన్నారు. రేవంత్ ఇంటిపై జరుగుతున్న దాడులను.. తెలంగాణ సమాజంపై, తెలంగాణ ప్రజల మీద జరుగుతున్నవిగా ఆయన పేర్కొన్నారు. మోదీతో కుదుర్చుకున్న అంతర్గత ఒప్పందంతోనే దాడులు.. జానారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉన్నవారిని అణచివేసే విధానాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఏర్పరుచుకున్న అంతర్గత ఒప్పందంతోనే కేసీఆర్ ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. చట్టబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ, ఇక్కడ కేసీఆర్ ఒకేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యవాదుల మనుగడ కొనసాగాలంటే ఈ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి రాకుండా చేయాలని ప్రజలను కోరారు. ఇలాంటి దాడులకు కాంగ్రెస్ భయపడదని స్పష్టం చేశారు. మాల్దీవుల్లో ప్రతిపక్షాలను అణగదొక్కిన అక్కడి అధ్యక్షుడు ఓటమిపాలయ్యారని.. తెలంగాణలో కూడా అదే పునరావృతం అవుతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ నాయకులపై కక్ష సాధింపు మరోవైపు కాంగ్రెస్ శ్రేణులపై జరుగుతున్న దాడులపై ఆ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులపై కక్ష సాధింపులకు దిగుతోందని విమర్శించారు. ఇటీవల జగ్గారెడ్డిపైన పాత కేసులు తిరగదోడి, నేడు రేవంత్‌రెడ్డిపైన ఐటీ దాడులు జరిపి ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో కేసీఆర్ ఢిల్లీలో 40 నిమిషాలు ప్రత్యేంగా భేటీ అయ్యారని.. అప్పుడే ఈ దాడులకు ప్రణాళిక సిద్ధం అయిందని ఆరోపించారు. ప్రజల్లో టీఆర్ఎస్పైన తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇదీ పునరావృతం అవుతుందని హెచ్చరించారు. తాము కూడా టీఆర్ఎస్ బొక్కలు తవ్వడం స్టార్ట్ చేస్తామని తెలిపారు. అంతేకాకుండా మెట్రో రైల్ ఓపెనింగ్ సమయంలో గవర్నర్ నరసింహాన్‌తో కలిసి అపద్ధర్మ మంత్రి కేటీఆర్ తొక్కడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ దగ్గరకు వస్తుంటే టీఆర్ఎస్ పేరుపైన ప్రకటనలు ఇవ్వడం ఎంటని ప్రశ్నించారు. -
అన్నివర్గాల అభివృద్ధే కాంగ్రెస్ ధ్యేయం: జీవన్‌రెడ్డి
జగిత్యాలటౌన్: కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, అన్నివర్గాల అభివృద్ధే తమ పార్టీ ధ్యేయమని సీఎల్పీ మాజీ ఉపనేత జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన కాం గ్రెస్ మేనిఫెస్టోలోని ముఖ్య అంశాలను మీడియాకు వివరించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్నివర్గాలు మోసపోయాయని అన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని, కేసీఆర్ ఏ హక్కుతో ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే రైతులకు ఉచిత విద్యుత్, గ్రామగ్రామాన ఐకేపీ కేంద్రాలు, ఎస్సారెస్పీ నీళ్లు తెచ్చామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర, మహిళాసంఘాలకు వడ్డీ లేని రుణాలిస్తామన్నారు. ఇల్లులేనివారికి ప్రభుత్వ స్థలాలతోపాటు సొంతస్థలాల్లో రూ.5 లక్షలతో ఇంటి నిర్మాణం, దళిత కుటుంబాలకు ఉచితంగా 200 యూనిట్ల గృహ విద్యుత్, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని వివరించారు. కమీషన్ల కోసమే కేసీఆర్ మిషన్ భగీరథ చేపట్టారని, దీంతో గ్రామాల్లో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయన్నారు. కేటీఆర్ సీఎం కావాలనుకుంటున్నాడు: వీహెచ్ యాదగిరిగుట్ట: తండ్రి కేసీఆర్‌ను పక్కకు పెట్టి తాను సీఎం కావాలని కేటీఆర్ కల లు కంటున్నాడని కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక కమిటీ చైర్మన్ వి.హనుమంతరావు విమర్శించారు. అందుకే ఇటీవల కాలంలో కేసీఆర్ కంటే కేటీఆర్ ఎక్కువగా మాట్లాడుతున్నారని పేర్కొన్నా రు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో రాష్ట్ర భట్రాజుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్న విషయాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీకి వివరిస్తానన్నారు. తెలంగాణ తల్లి సోనియమ్మను బొమ్మ అని కేటీఆర్ అనడం బాధాకరమన్నారు. అన్నం పెట్టిన వాళ్లను అమ్మ బొమ్మ అనడం కరెక్టు కాదన్నా రు. ప్రతిపక్షాలు నిందలు మోపడం వల్ల ముం దస్తు ఎన్నికలకు వెళ్తున్నామనడం సిగ్గుచేటన్నారు. 17 సార్లు సర్వేలు చేయించి, 17 మంది జ్యోతిష్యులకు చూపించి సెప్టెంబర్ 6న ప్రభుత్వాన్ని రద్దు చేశారని ఆరోపించారు. ఊరూరా తిరిగి టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడతానని, వచ్చే ఎన్నికల్లో కాం గ్రెస్‌ను అధికారంలోకి తీసుకువస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ ఇన్చార్జి కుంతియాను దూషించినట్లు మాట్లాడటం సరైందికాదన్నారు. -
విద్యార్థి, నిరుద్యోగ ఆవేదన సభ భగ్నం
హైదరాబాద్: తెలంగాణ వచ్చి నాలుగున్నరేళ్లయినా తమకు ఉద్యోగాలు రాలేదంటూ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఆదివారం ఉస్మానియా వర్సిటీలో తలపెట్టిన ఆవేదన సభను పోలీసులు భగ్నం చేశారు. జేఏసీ చైర్మన్ మానవతరాయ్ ఆధ్వర్యంలో వందలాది విద్యార్థులు లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వద్దకు చేరుకున్నారు. జేఏసీ నేతలు, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు మాట్లాడిన తర్వాత సభకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకొని విద్యార్థులను చెదరగొట్టారు. దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో క్యాంపస్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు అతికష్టం మీద మానవతరాయ్, జేఏసీ నేత దయాకర్‌గౌడ్‌లతో పాటు మరో ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేసి అంబర్పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థుల అరెస్టు అన్యాయమని, వారిని వెంటనే విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్సీ, ఓయూ ఫ్రొఫెసర్ నాగేశ్వర్ డిమాండ్ చేశారు. -
‘మోదీ అబద్దాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అబద్దాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హనుమంతరావు విమర్శించారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్ నేతృత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించామన్నారు. నివాసాన్ని ముట్టడి చేసే ప్రయత్నంలో పోలీసులు తమని అడ్డుకున్నారని తెలిపారు. రాఫెల్ డీల్‌ను దేశంలోనే అతి పెద్ద కుంభకోణంగా ఆయన అభివర్ణించారు. మోదీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటివరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. రక్షణ శాఖ మంత్రికి తెలియకుండానే రాఫెల్ డీల్ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. రాఫెల్ డీల్‌లో జరిగిన అవినీతి గురించి కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామానికి.. ప్రజల్లోకి తీసుకెళ్తుందని పేర్కొన్నారు. రాఫెల్ డీల్‌పై తమ అధ్యక్షుడు రాహూల్ గాంధీ పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట నిలదీశారని అన్నారు. అనిల్ అంబానికి ఎలాంటి అనుభవం ఉందని ఈ డీల్ ఇచ్చారని ప్రశ్నించారు. అనిల్ అంబాని అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత కంపెనీ పెట్టినట్లు తెలుస్తోందన్నారు. -
‘ఆయనకు బూతు సాహిత్య అవార్డు ఇవ్వాలి’
సాక్షి, విజయవాడ : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావుకు బూతు సాహిత్య అకాడమీ ఇవ్వాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రజలు కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాజకీయం కోసం కేసీఆర్ దొర కులాల వారీగా వరాలు కురిపిస్తున్నారంటూ ఎద్దేవా చేసిన వీహెచ్... ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇళ్లు అంటూ వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. ఓట్ల చీలిక కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, కానీ ఆయన ప్రయత్నాలు ఫలించవని జోస్యం చెప్పారు. సీఎం తనయుడు కేటీఆర్ ఎక్కడ చదివారో తెలియదు కానీ, ఆయన పెరిగింది మాత్రం గల్లీలోనేనని వీహెచ్ ఎద్దేవా చేశారు. జనవరి 26న పవన్ కల్యాణ్ చేతుల మీదుగా కేటీఆర్‌కు బూతు సాహిత్య అవార్డు ఇవ్వాలంటూ తనదైన శైలిలో వ్యంగాస్త్రాలు సంధించారు. ఏపీకి హోదా బిల్లు పెట్టిన రోజు ఆమె సభకు రాలేదు.. ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వాలని చెప్పిన ఎంపీ కవిత.. బిల్లు ప్రవేశపెట్టిన రోజున సభకు హాజరవ్వలేదని వీహెచ్ అన్నారు. తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ ముందే చెప్పారని, రెండు రాష్ట్రాలకు సమన్యాం చేస్తామని చెప్పారని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉన్న కొందరు నాయకులు మాత్రం తెలంగాణ రానివ్వమంటూ అడ్డుపడ్డారన్నారు. మండలి కమిషన్ వేసి ఏళ్లు గడుస్తున్నా బీసీలకు మాత్రం న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘టీఆర్ఎస్ నేతల కాళ్ల కింద భూకంపం’
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాగ్దానం చేసిన పెన్షన్ స్కీం చూసి టీఆర్ఎస్ నేతల కాళ్ల కింద భూమి కంపించడం మొదలైందని పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ ఎద్దేవా చేశారు. గాంధీ భవన్లో మాట్లాడుతూ.. 2011లో కాంగ్రెస్ సర్కార్ పెన్షన్ వయసును 65 నుంచి 60 ఏండ్లకు తగ్గిస్తే.. తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వం 65 ఏళ్లకు పెంచిందని విమర్శించారు. పెన్షన్ వయసు 60 నుంచి 65కు పెంచడం వల్ల కేంద్ర నుంచి వస్తోన్న నిధులు కూడా తెలంగాణ సర్కారే తింటోందని ఆరోపించారు. టీఆర్ఎస్ సర్కార్ ఇచ్చే పెన్షన్ వల్ల కుటుంబాల్లో గొడవలు పడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాలపై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇది బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కు కాదా.. హామీ ఇచ్చిన బోధకాలు పెన్షన్ ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను టీఆర్ఎస్ వాళ్లు ఏమైనా అనవచ్చు..కానీ కాంగ్రెస్ కేవలం ఒక బచ్చా అంటే లేసి పడుతున్నారు..మీ టాలెంట్ అంతా తెలంగాణ సంక్షేమం కోసం చూపెడితే బాగుంటుందని హితవు పలికారు. ఇంటింటి సర్వే రూ.50 కోట్లు ఖర్చు పెట్టారు..దాని ఫలం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డలకు ఎక్కడా ఫలితాలు రావడం లేదు..కానీ కేసీఆర్ ఫ్యామిలీకి మాత్రం అందుతోన్నాయని విమర్శించారు. పోలీసుల మీద అనుమానం వస్తోంది : వీహెచ్ తెలంగాణ పోలీసుల మీద ఒక విషయంలో అనుమానం వస్తోందని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. నయీమ్ కేసులో బాధితులను పట్టించుకునే నాధుడే లేడని వ్యాఖ్యానించారు. నయీమ్ అనుచరుడు శేషన్నను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను వాడుకునే ప్రయత్నం చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. శేషన్నను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని తెలంగాణ డీజీపీని ప్రశ్నించారు. నయీమ్ గ్యాంగ్‌ను శేషన్న ఇంకా రక్షిస్తున్నాడని ఆరోపించారు. శేషన్నకు టికెట్ ఇచ్చి కేటీఆర్ వచ్చి ఎన్నికల్లో పోటీ చేయిస్తాడేమోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
‘బోఫోర్స్తోనే కార్గిల్ యుద్ధంలో గెలిచాం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ కార్యదర్శి వీ.హనుమంతారావు మండిపడ్డారు. ఏబీసీ అంటే ఏంటో తెలుసా అంటూ రాహుల్‌గాంధీపై ట్విటర్లో విమర్శలు చేసిన కేటీఆర్.. నిజాలు మాట్లాడడం లేదని విమర్శించారు. ‘బోఫోర్స్ స్కాం అన్నావ్.. కానీ అదే బోఫోర్స్ ఫిరంగులతో కార్గిల్ యుద్దం గెలిచిన సంగతి మరచిపోవద్ద’ని కేటీఆర్‌ను హెచ్చరించారు. బోఫోర్స్ కుంభకోణం గురించి మాట్లాడుతున్న కేటీఆర్ బీజేపీ హయాంలో చోటుచేసుకున్న రాఫెల్ స్కాం గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో రాహుల్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయిందని ఆనందం వ్యక్తం చేశారు. రాహుల్ పర్యటనను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ చాలా ప్రయత్నాలు చేశాడని అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. సంపత్, కోమటిరెడ్డి కేసులో స్పీకర్ మధుసూదనాచారికి హైకోర్టు నోటీసులు ఇవ్వడం కేసీఆర్ సర్కార్‌కు సిగ్గుచేటని అన్నారు. గొర్రెలు, బర్రెలు అంటూ కేసీఆర్ బీసీలను మోసం చేస్తున్నాడని అన్నారు. బీసీలపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లను 69 శాతానికి పెంచి రాజ్యాంగంలోని 9 షెడ్యూల్లో పెట్టించాలని సవాల్ విసిరారు. బీసీ క్రిమిలేయర్‌ను ఎత్తేస్తామని పార్టీ మేనిఫెస్టోలో చెప్పాలని అన్నారు. క్రిమిలేయర్‌ను ఎత్తేసే విషయం తమ నేత రాహుల్‌కు చెబితే సానుకూలంగా స్పందించారన్నారు. -
అమిత్ షా, మోదీ ఊచకోతను పాఠ్యాంశాల్లో చేర్చాలి
సాక్షి, హైదరాబాద్ : దేశంలో ఎమర్జెన్సీ విధించి 43 ఏళ్లయిన సందర్భంగా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీపై, కాంగ్రెస్‌పై పలువురు బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరా గాంధీని హిట్లర్ అని విమర్శిస్తున్నారు.. కానీ ఆమె బీసీల నేత, ఆమెనే ప్రజలు మళ్లీ గెలిపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లో చేసిన ఊచకోతను పాఠ్యాంశాల్లో చేర్చాలి. రెండు సంఘటనలను పాఠ్యాంశాల్లో ఉంచితే ఎవరు ఎలాంటి వారో తెలిసిపోతుంద’ని అన్నారు. మోదీ ఇప్పటికి ఆరెస్సెస్‌లో పని చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కూడా మోదీలాగానే చేయని పనికి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మీరు ఎన్నికలు పెడితే కదా.. మేము సిద్దంగా ఉన్నామా లేదో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కోతులకు అవకాశం ఇవ్వదని అనడాన్ని తప్పుబట్టారు. రాజకీయ పార్టీలను కోతులు అనడం సరైనది కాదని సూచించారు. బీసీలకు కూడా సీఎం అయ్యే అవకాశం వస్తుంది.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ దిశలో ఆలోచన చేస్తున్నారని తెలిపారు. -
‘దానం పార్టీ మారకుండా చూస్తాం’
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అంజన్‌కుమార్ యాదవ్ పేరును ఇటీవల ఖరారు చేసింది. అయితే తనకు మాట మాత్రమైనా చెప్పకుండా గ్రేటర్ అధ్యక్షుడి నియామకం జరగడంతో మాజీ మంత్రి దానం నాగేందర్ మనస్తాపం చెందారనీ, ఆయన కాంగ్రెస్ పార్టీని వీడనున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. దానం శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆ ఊహాగానాలకు ఊతమిచ్చినట్లయింది. ఆయన శనివారం కేసీఆర్ సమక్షంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే కథనాలు వెలువడుతున్నాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. ఆయన శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. దానం నాగేందర్ పార్టీని వీడడం కాంగ్రెస్‌కు నష్టమేనని వ్యాఖ్యానించారు. రేపు ఉదయంలోగా దానంతో మాట్లాడి మనసు మార్చుకొనేలా ప్రయత్నిస్తామని అన్నారు. జానారెడ్డి నివాసంలో సమావేశమై పార్టీ నాయకత్వం ఈ విషయంపై చర్చించిందని తెలిపారు. -
కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కాయి: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు గడుస్తున్నా విభజన హామీల అమలులో సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని, కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కాయని మాజీ ఎంపీ వి.హన్మంతరావు విమర్శించారు. బడుగు, బలహీన వర్గాలన్నీ కేసీఆర్‌కు వ్యతిరేకంగా భారీ సభ పెట్టాలని సూచించారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో బీజేపీ వైపు చూస్తున్న వారెవరూ లేరని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగుతున్న నియంత పాలనపై ఢిల్లీలో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం తెలిపారు. -
నాలుగేళ్ల పాలనలో కేసీఆర్ విఫలం: వీహెచ్
సాక్షి, న్యూఢిల్లీ: గత నాలుగేళ్ల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రకాలుగా విఫలమయ్యారని, ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరు, పేదలకు భూ పంపిణీలాంటి పథకాలను అమలు చేయలేకపోయారని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు విమర్శించారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల ఏడాదిలో ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం వల్ల భూస్వాములకే లబ్ధి కలుగుతోంది తప్ప సామాన్య రైతులకు ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. 23 వేల మంది కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగులను పర్మినెంట్ చేయలేదని, ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే ఇప్పుడు ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. తమ సొంత సామాజిక వర్గానికి ఆర్టీసీని అప్పగించేందుకు కేసీఆర్ ప్రయత్ని స్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేలా కార్యచరణ రూపొందిస్తున్నామని వీహెచ్ తెలిపారు. -
‘అవినీతిలో తెలంగాణ నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 4’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో అవినీతి ఏరులై పారుతుందంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంత రావు అన్నారు. పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో అవినీతిలో తెలంగాణ 2వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉండడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పలు మీడియా ప్రతినిధులు చేసిన సర్వేలో తెలంగాణలో 73 శాతం అవినీతి ఉందని తేలిందని ఆయన పేర్కొన్నారు. అవినీతికి పాల్పడే వారిని చెప్పుతో కొట్టాలంటూ మాట్లాడిన వారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారంటూ ప్రశ్నించారు. ఒకవేళ అలా చేయాల్సి వస్తే ఎన్ని చెప్పులైనా సరిపోవంటూ ఎద్దేవా చేశారు. తాము చేస్తున్న కార్యక్రమాల గురించి దేశమంతా ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. తమ అవినీతిని కూడా ప్రచారం చేసుకోవాలంటూ ఎద్దేవా చేశారు. రైతులపై అంత ప్రేమ ఉన్న వారే అయితే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఎందుకు ఆదుకోలేదని వీహెచ్ ప్రశ్నించారు. కేవలం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రైతు బంధు పథకం ప్రారంభించారని విమర్శించారు. రైతు బంధు పథకానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో టీఆర్ఎస్ సర్కారు చెప్పాలని.. లేని పక్షంలో సీబీఐ విచారణకు సిద్ధమవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అసలైన హిందువని కేటీఆర్ చెబుతున్నారని, మజ్లిస్ పార్టీతో సంబంధం లేకుండా ఆ మాట చెప్పగలరా అంటూ వీహెచ్ సవాల్ విసిరారు. తాము అసలైన హిందువులమంటూ చెప్పుకుంటున్న కేటీఆర్ మాటలు విన్న తర్వాత కూడా మజ్లిస్ పార్టీ టీఆర్ఎస్తో కలిసి ఉండాలనుకుంటుందో లేదో అక్బరుద్దీన్, అసదుద్దీన్ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. -
కంటతడి పెట్టిన వీహెచ్
సాక్షి, హైదరాబాద్ : సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు కంటతడి పెట్టుకున్నారు. తనపై అసత్య వార్తలు రాస్తున్నారంటూ వాపోయారు. శుక్రవారం మీడియాతో మట్లాడిన ఆయన గ్రేటర్ నేతలు ఏడుగురిని విమర్శిస్తు కరపత్రాలు ప్రచురిస్తే.. దానిపై న్యూస్ పేపర్లలో వార్తలు రాయడం అనైతికం అంటూ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకొని తనపై అసత్య వార్తలు రాస్తున్నారంటూ కంటతడి పెట్టుకున్నారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశానని, తనపై వార్తలు రాసేముందు ఒకసారి నిజమేంటో తెలసుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. అనుక్షణం పార్టీ కోసం పని చేసే వ్యక్తి తానని, తన రాజీకీయ జీవితంలో ఎంతో మంది లీడర్లను తయారు చేశానంటూ వీహెచ్ చెప్పుకొచ్చారు. అలాంటి తనను బీసీలకు వ్యతరేకమంటూ విమర్శలు చేస్తున్నారని, తనని డ్యామేజీ చేస్తే ఏం వస్తుందంటూ ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలే ఒకరిపై మరొకరు కరపత్రాలు ప్రచురించడం పార్టీకే నష్టం అంటూ హెచ్చరించారు. ఈ కరపత్రాలపై వార్తలు రాసిన వారిపై ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ నేతలపై వార్తలు రాసే మీడియా.. కేసీఆర్ ఇంటి గొడవలపై ఎందుకు వార్తలు రాయరు అంటూ నిలదీశారు. తనపై తప్పుడు కరపత్రాలు ప్రచురించిన వారిపై పరువునష్టం దావా వేస్తానని వీహెచ్ అన్నారు. -
హెడ్సెట్ విసిరితే గాయం అవుతుందా?
న్యూఢిల్లీ: ‘హెడ్సెట్ విసిరితే కంటికి గాయం అయ్యే పరిస్థితి ఎక్కడైనా ఉందా..?’అని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విసిరిన హెడ్సెట్ వల్ల, మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు గాయమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రామాకు తెరలేపారని ఆయన విమర్శించారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నిజజీవితంలోనే కేసీఆర్ సినిమా చూపిస్తున్నాడు. టీఆర్ఎస్ ఆడుతున్న నాటకాలను ప్రజలు విశ్వసించరు. కేసీఆర్ ఇన్ని నాటకాలు ఆడతాడని ముందే తెలిసుంటే యూత్‌కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే కేసీఆర్ మెడలు వంచేవాడిన’ని వీహెచ్ తెలిప. -
‘సినిమా చూపిస్తున్న కేసీఆర్’
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ సూపర్ స్టార్ రాజ్‌కపూర్ సినిమా కంటే గొప్ప సినిమాని ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు విమర్శించారు. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ నేతలను సస్పెండ్ చేయడంపై ఆయన పై విధంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఇంత పెద్ద డ్రామా తాను ఇంతవరకు చూడలేదని, కేవలం గౌడ్ సామాజిక వర్గం ఓట్ల కోసమే స్వామిగౌడ్‌కు దెబ్బ తగిలినట్టు నాటకం ఆడిస్తున్నారని ఆరోపించారు. ఇయర్ ఫోన్స్‌తో అసలు దెబ్బ తగులుతుందా, ఇదంతా జనం ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇస్తానని తానే మూడు ఇళ్లు కట్టుకున్నారని, ఒక ముఖ్యమంత్రికి అన్ని ఇళ్లు ఎందుకని విమర్శించారు. గిట్టుబాటు ధర లేదని రైతులు ఆందోళన చేస్తే వారిని అరెస్టు చేయించిన కేసీఆర్‌కి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ప్రశ్నించిన ప్రతిపక్ష సభ్యులందరిని సభ నుంచి సస్పెండ్ చేస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాలపై వీహెచ్ మాట్లాడుతూ.. భారతీయ జనత పార్టీ పతనం ప్రారంభమైందని అన్నారు. 2019లో కేంద్రంలో, రాష్టంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తెరాస ఎంపీలు రిజర్వేషన్ కోటా పెంచాలని డిమాండ్ చేస్తుంటే, కేసీఆర్ మాత్రం ఇక్కడ సర్పంచ్, కార్పొరేటర్లలకు అధికారం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ పెంపు సాధ్యం కాదని తెలిసే టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారని అన్నారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ సాధ్యం కాదని అసదుద్దీన్ ఎందుకు మద్దతు ఇస్తున్నారని, ఆయన ఎందుకు ఢిల్లీ రాలేదని ప్రశ్నించారు. ఢిల్లీలో తెరాస ఎంపీలు చేసేదంత ఒక డ్రామా అని అన్నారు. సమగ్ర సర్వే చేయించిన కేసీఆర్‌కు బీసీలకు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలో తెలియదా అని ప్రశ్నించారు. -
వివేక్‌పై చర్య తీసుకోండి!
హైదరాబాద్: హెచ్‌సీఏ కార్యదర్శిగా ఉన్న శేష్ నారాయణ్‌ను చట్టవిరుద్ధంగా ఆ పదవి నుంచి తప్పించారని... అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ, హెచ్‌సీఏ సభ్యుడు వి.హనుమంతరావు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు జి.వివేకానంద్‌పై చీటింగ్ కేసు నమోదు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సర్వసభ్య సమావేశం పూర్తి కాకుండానే లోధా కమిటీ ప్రతిపాదనలకు హెచ్‌సీఏ ఆమోద ముద్ర వేసిందంటూ క్రికెట్ అభిమానులను వివేక్ మోసగించారని వీహెచ్ ఆరోపించారు. హెచ్‌సీఏ సమావేశంలో సభ్యుల హాజరుకు సంబంధించి కూడా లోధా కమిటీకి తప్పుడు లేఖలు సమర్పించారని ఆయన విమర్శించారు. వివేక్ అధ్యక్ష హోదాలో ఉండి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు అదేశాలను, తాము ఇచ్చిన రికార్డులను, ఫిర్యాదులను పరిశీలించి ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు. -
సీఎం కేసీఆర్ ఓ అలీ బాబా: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఓ అలీ బాబా అని, ఆయన కుటుంబసభ్యులు కేటీఆర్, హరీశ్‌రావు, కవిత, సంతోష్ చార్ చోర్ (నలుగురు దొంగలు) అని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హన్మంతరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు లేకుండా పోయా యన్నారు. తెలంగాణలో ఇలాంటి నిరం కుశ, అరాచక పోకడలు ఉంటాయని ఊహించలేదన్నారు. రాజ్యసభ సీటు కూడా సంతోష్కిస్తారా, అమరవీరుల కుటుంబాలకు ఎందుకివ్వరని ప్రశ్నిం చారు. కాంగ్రెస్ బస్సు యాత్రతో మంత్రి కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని అన్నారు. ప్రధాని మోదీపై కేసీఆర్ వ్యాఖ్య లు బాధించాయంటున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నేరుగా సీఎంతోనే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేసీఆర్ తిడితే కేటీఆర్‌తో ఆమె వివరణ తీసుకోవడం హాస్యాస్పదమన్నారు. -
‘నల్ల కుబేరులకు కొమ్ముగాస్తున్న మోదీ’
సాక్షి, హైదరాబాద్: దేశాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్న నల్ల కుబేరులకు ప్రధాని నరేంద్ర మోదీ కొమ్ముగాస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రోజుకో అవినీతి, భారీ కుంభకోణాలతో ప్రజలను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబానీలతో మోదీ అంటకాగుతూ పెద్ద నోట్లను రద్దు చేశారని ఆరోపించారు. డబ్బులను బ్యాంకుల్లో వేయాలని పేద, మధ్య తరగతి ప్రజలకు చెప్పి నల్ల కుబేరులకు అప్పనంగా కట్టబెడుతున్నారని, ప్రజలను మోసం చేయడానికి ప్రోత్సహిస్తున్నారని వీహెచ్ ఆరోపించారు. -
ప్రధాని మోదీ దగ్గర కేసీఆర్ కిటుకు: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ దగ్గర సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు సంబంధించిన కిటుకు ఏదో ఉందని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు అన్నారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌కు సంబంధించిన కిటుకు మోదీ దగ్గర ఉండటం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగినా నోరు విప్పడం లేదని విమర్శించారు. బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగినా కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు నోరు విప్పడంలేదని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదాను అడిగిన ఎంపీ కవితకు రాష్ట్రానికి జరుగుతున్న అన్యా యం కనబడలేదా అని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే అన్నీ చేస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ ఇప్పటికీ చేసిందేమీలేదన్నారు. కార్పొరేటర్లను ఉత్సవ విగ్రహాలను చేసి, మంత్రి కేటీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జీహెచ్ఎంసీలో వసూలు చేసిన పన్నులను మిషన్ భగీరథకు ఖర్చు చేస్తున్నారన్నారు. బీసీ స్టడీ సర్కిళ్లను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. సర్కిళ్లలో బోధన సిబ్బంది, సౌకర్యాలు, ల్యాబ్‌లు, కంప్యూటర్లు లేవని, వెంట నే వీటిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
అమరులను కించపరిచిన ప్రధాని
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ తలుపులు మూసేసి ఆంధ్రప్రదేశ్‌ను విభజించారని ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడటం శోచనీయమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని మోదీ అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. దీనికి రాష్ట్ర బీజేపీ నేతలు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు గురించి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే టీడీపీ, బీజేపీలు మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడి ఆయన ప్రసంగానికి అడ్డుతగిలాయని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రాణహిత– చేవెళ్లకు జాతీయహోదా, వరంగల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, తెలంగాణకు రావాల్సిన నిధులు గురించి పార్లమెంటులో అడిగే దిక్కులేకుండా పోయిందన్నారు. నిధులు తేవడంలో సీఎం విఫలం: వీహెచ్ సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తేవడంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విఫలమయ్యారని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు విమర్శించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఆయన హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ను ఓడించేందుకు మిగతాపార్టీలు కాంగ్రెస్‌తో కలసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికలతో పాటు కేంద్రంలో కూడా కాంగ్రెస్‌దే అధికారమన్నారు. ఆ భయంతోనే బోఫోర్స్ కుంభకోణాన్ని ప్రధాని మోదీ మళ్లీ తెరపైకి తెస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ను రాహుల్ గాంధీ అధికారంలోకి తెస్తారని దీమా వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి క్షీణించింది: శారద సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో మాటకు కట్టుబడి ఉండే ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఇందిరా క్రాంతి పథకం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు పావలా వడ్డీకి రుణా లిచ్చామని గుర్తు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మహిళల ఆర్థిక పరిస్థితి క్షీణించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తీసుకునే నిర్ణయాలపై వనపర్తి సమావేశంలో కొన్ని ప్రకటనలు చేశామన్నారు. ఆసరా పెన్షన్ వచ్చే వారికి కూడా అభయ హస్తం వర్తించేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
హత్యల్లో నంబర్‌వన్‌గా తెలంగాణ: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హత్యలు పెరిగిపోయాయని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు (వీహెచ్) విమర్శించారు. హత్యల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా నిలుస్తోందని మండిపడ్డారు. గాంధీభవన్‌లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఏడు హత్యలు జరిగాయని ఆరోపించారు. అయినా గవర్నర్‌కు ఏం పట్టడం లేదని.. ప్రభుత్వానికి భజన చేయడమే ఆయన పనిగా మారిందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ అరాచకంలో నంబర్‌వన్‌గా కొనసాగుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యా రాజకీయాలపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాస్తానని వీహెచ్ చెప్పారు. -
గవర్నర్ ప్రభుత్వానికి భజన చేస్తున్నాడు: వీహెచ్
హైదరాబాద్ : గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి భజనచేస్తున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో హత్యలు, అశాంతి పెరిగిపోయాయన్నారు. దేశంలోనే హత్యల్లో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రెండు రోజుల్లోనే 7 హత్యలు జరిగాయన్నారు. నల్గొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హత్యల్లో,అరాచకాల్లో నెంబర్ వన్‌గా కొనసాగుతున్నారని విమర్శించారు. శాంతి భద్రతలను కాపాడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, రాష్ట్రంలో జరుగుతున్న హత్యా రాజకీయాలపై కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు లేఖ రాస్తానని తెలిపారు. -
కేసీఆర్ కుటుంబానికి హత్యాపాపం: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ కాంగ్రెస్‌నేత శ్రీనివాస్‌ను హత్య చేయించిన పాపం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులకు తగులుతుందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఏటా అయ్యప్పమాల వేసుకునే శ్రీనివాస్ గురుస్వామిగా ఉన్నారని, అతడిని చంపిం చినందుకు తగినశాస్తి జరుగుతుందన్నారు. బీసీ నేతగా ఎదుగుతున్న అతన్ని చంపిం చిన టీఆర్ఎస్కు, కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో బీసీలు బుద్ధి చెప్తారని పేర్కొ న్నారు. 10 రోజుల్లోగా దోషులను గుర్తించడానికి డీజీపీ చర్యలు తీసుకోవాలని, లేకుం టే కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. ఎమ్మెల్యే వీరేశంను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
‘దగ్గరుండి ప్లాన్ చేసింది డీఎస్పీనే’
సాక్షి, నల్లగొండ : తన ప్రధాన అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యపై సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని... డీఎస్పీని ఇక్కడకు తీసుకు వచ్చి అరాచకం సృష్టిస్తున్నారని, ఈ హత్యకు దగ్గరుండి ప్లాన్ చేసింది డీఎస్పీనేని ఆరోపించారు. కోమటిరెడ్డి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘ఆరేళ్ల క్రితం (డిశెంబరు 2011) నా కొడుకు చనిపోయినప్పుడు సగం చనిపోయిన. ఇప్పుడు నా ప్రాణానికి ప్రాణం తన తమ్ముడిలాంటోన్ని చంపారు. హంతకులు ఊటకూరు గ్రామంలో ఉన్నారని సమాచారం ఉంది. హత్యలే చేయాలనుకుంటే మీరెవ్వరు మిగలరు. మా పద్ధతి అదికాదు. దోషులను శిక్షిస్తే శ్రీనివాస్ కుటుంబానికి శాంతి కలుగుతుంది. ఆ కుటుంబం కోసం నా ప్రాణాలు ఇస్తా. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నవారిపై చర్యలుతీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. మరోవైపు శ్రీనివాస్ హత్యపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మాట్లాడుతూ... ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ హత్య చేయించినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. మాఫియా డాన్ నయీమ్‌కు వీరేశంకు దగ్గర సంబంధాలున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యే మనుషులే ఈ హత్యను చేసినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఇది చంపడం కాదని, బీసీల ఆడపడుచు బొట్టు తీసేశాడని వీహెచ్ వ్యాఖ్యానించారు. ఈ హత్య వెనుక నల్లగొండ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంఛార్జ్ హస్తం కూడా ఉందన్నారు. ఇది ముమ్మాటికి టీఆర్ఎస్ చేయించిన హత్యేనని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ పతనం నల్లగొండ నుంచే ప్రారంభం అవుతుందని అన్నారు. -
కేసీఆర్ అవినీతి పవన్‌కు కనిపించ లేదా?
సాక్షి, హైదరాబాద్: అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తానని ప్రకటించిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్.. వాటి మీద అసలు మాట్లాడటమే లేదని కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు విమర్శించారు. ప్రాణహిత ప్రాజెక్టు పేరును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి సీఎం కేసీఆర్ రూ.38 వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని దుయ్యబట్టారు. గాంధీభవన్‌లో బుధవారం వీహెచ్ విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాసిచ్చిన స్పీచ్‌నే పవన్ చదివారని ఆరోపించారు. వాస్తవాలు తెలుసుకుని కేసీఆర్‌కు భజన చేయడం మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ కోసం పోరాడిన కోదండరాం, మంద కృçష్ణల అక్రమ అరెస్టులు పవన్‌కు కనపడలేదా అని ప్రశ్నించారు. ఆదివాసీల సమస్యల పరిష్కారంలో విఫలం మాజీ ఎంపీ రవీంద్రనాయక్ సాక్షి, హైదరాబాద్: ఆదివాసీలు, లంబాడీల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ రవీంద్రనాయక్ విమర్శించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆదివాసీలను లంబాడీలపైకి కొన్ని శక్తులు ఉసిగొల్పుతున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగానే లంబాడీలను ఎస్టీల్లో చేర్చారన్నారు. దీనిపై త్వరలోనే రాష్ట్రపతికి మెమోరాండం అందజేయనున్నట్లు రవీంద్ర నాయక్ చెప్పారు. -
పవన్‌కు కాంగ్రెస్ పంచ్
సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్‌కు భజన చేసేందుకే పవన్ కల్యాణ్ తెలంగాణలో పర్యటిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఒకవైపు ఉద్యమకారులను అక్రమంగా అరెస్టు చేస్తున్న ప్రభుత్వం.. పవన్ లాంటివాళ్లను పల్లకీల్లో తిప్పుతున్నదని విమర్శించింది. కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉపనేత జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావులు మంగళవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘కేసీఆర్ పాలన అంత నచ్చితే జనసేనను తీసుకెళ్లి టీఆర్ఎస్లో విలీనం చెయ్యండి’ అని పవన్‌కు సూచించారు. జనసేనను వదిలి భజనసేనలా.. : ‘‘తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పరామర్శిస్తామంటే ప్రభుత్వం అనుమతించదు. ఎస్సీ వర్గీకరణ విషయంలో మంద కృష్ణ దీక్షను అంగీకరించరు. అదే అజ్ఞాతవాసి సినిమాకు మాత్రం 5 షోలకు పర్మిషన్లు ఇస్తారు. అందుకు కృతజ్ఞతగా పవన్ టీఆర్ఎస్కు భజన చేస్తారు! అసలు ఏం తెలుసని మాట్లాడుతున్నారు? తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టడంలో కేసీఆర్ పాత్ర ఎంటో తెలుసా? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించినవాటిలో ఎన్ని నిధులు ఖర్చుచేశారో ఎరుకేనా? పవన్ జనసేనను మర్చిపోయి టీఆర్ఎస్ భజనసేనలా తయారయ్యారు’’ అని సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి అన్నారు. ముందు కత్తి మహేశ్‌కు సమాధానం చెప్పు : పవన్‌ను ఉద్దేశించి సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ మాట్లాడుతూ..‘‘ఒకప్పుడు కేసీఆర్ తాటతీస్తానన్న పవన్.. ఇప్పుడేమో అలాంటి మనిషేలేరని కీర్తిస్తున్నారు. పవన్ చెబుతున్నట్లే ప్రజలు సంతోషంగా ఉంటే, పరిపాలన అంతబాగుంటే ఇక కష్టపడి తిరగడం ఎందుకు? ప్రశ్నిస్తానని చెప్పుకునే పవన్.. ముందు కత్తి మహేశ్ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలి. దమ్ముంటే ఆంధ్రలో సత్తానిరూపించుకోవాలి’’ అని అన్నారు. ఫ్యాన్స్‌తో పవన్ : రాజకీయ యాత్రలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్.. మంగళవారం కరీంనగర్లో అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. బుధవారం కొత్తగూడెం నుంచి ఖమ్మం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. -
రైతులకు న్యాయం చేయాలి: వీహెచ్
సాక్షి, న్యూఢిల్లీ: రైతుల భూముల్లో విద్యుత్ సరఫరా టవర్లు నిర్మించిన తెలంగాణ సర్కార్.. ఆయా స్థలాలకు నష్టపరిహా రం చెల్లించేందుకు నిరాకరిస్తోందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్‌కు బుధవారం లేఖ రాశారు. కేంద్ర మార్గదర్శకాల మేరకు రహదారుల సమీపంలోని భూముల్లో టవర్లు నిర్మిస్తే టవర్‌కు రూ.4.5 లక్షలు, దూరంగా ఉన్న భూముల్లో టవర్లు నిర్మిస్తే టవర్‌కు రూ.3.15 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉందని తెలిపారు. విద్యుత్ టవర్ల మధ్య స్థలానికి, పంట నష్టానికి 35 ఏళ్ల పాటు పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు రైతులకు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. -
అజారుద్దీన్‌కు బ్రేక్.. మైక్‌ను నేలకు కొట్టిన వీహెచ్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సహనం కోల్పోయారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను హెచ్‌సీఏ సమావేశానికి అనుమతించకపోవడంతో ఆగ్రహించిన వీహెచ్.. సమావేశంలో మైక్‌ను నేలకేసి కొట్టారు. హెచ్‌సీఏ కార్యాలయంలో ఆదివారం హెచ్‌సీఏ ప్రత్యేక సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన అజారుద్దీన్‌ను సిబ్బంది అడ్డుకోవడంతో వీహెచ్ ఆగ్రహంగా స్పందించారు. ఇదేమైనా టీఆర్ఎస్ మీటింగ్ అనుకుంటున్నావా.. అని టీఆర్ఎస్ నేత, హెచ్‌సీఏ ప్రెసిడెంట్ వివేక్‌పై మండిపడ్డారు. ఈ సందర్భంగా వివేక్ స్పందిస్తూ..లోథా కమిటీ ఆదేశాల అమలు కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. మీటింగ్‌లో ఇంతకుముందు అమలైన 16 అంశాలపై చర్చ జరిగిందన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ)కు అజారుద్దీన్ మద్దతిస్తున్నారని తెలిసిందని, అందుకే అనుమతి ఇవ్వలేదని తెలిపారు. అజారుద్దీన్ పై తమకు చాలా గౌరవం ఉందన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో నిధులు లేవని, అండర్-14 నిర్వహించడానికి కూడా నిధులు లేకపోతే ఇతరుల దగ్గర నుంచి నిధులు తెచ్చి నిర్వహించామని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హెచ్‌సీఏ లోథా సిఫార్సులన్నింటినీ అమలు చేస్తుందని వివేక్ చెప్పారు. హనుమంత రావు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. టీసీఏ వాళ్ల పని వాళ్లు చూసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. అజారుద్దీన్ తెలంగాణ క్రికెట్ అసోషియేషన్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటున్నారని వార్తలు వచ్చినందుకు ఆయన్ని మీటింగ్‌కు రానివ్వలేదని వివేక్ స్పష్టం చేశారు. -
కుల రాజకీయాలు చేస్తున్న కేసీఆర్: వీహెచ్
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుల రాజకీయాలు చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ధ్వజమెత్తారు. శనివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో 54 శాతం ఉన్న బీసీల ఓటు బ్యాంకును ఆకర్షించడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీసీలపై అంత ప్రేమ చూపిస్తున్న కేసీఆర్ 9 మంది బీసీ మంత్రులు ఉండాల్సిన కేబినెట్లో నలుగురికే ఎందుకు అవకాశం ఇచ్చారని ప్రశ్నించారు. బీసీలు ప్రభుత్వంలో ఉండి పాలన చేయడం కేసీఆర్‌కు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు కులాల వారీగా భవనాలు కడుతూ వాటికి నిధులు కేటాయిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుల రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు అన్ని గ్రామాల్లో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినా.. అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వ్యతిరేకించడం వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. దీని వల్ల గత ఎన్నికల్లో తాము మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. -
తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు విమర్శించారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. మద్యం ధరలను పెంచే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో ‘తెలంగాణ జాగో ఆంధ్రావాలా భాగో’అన్న కేసీఆర్ ఇప్పుడు వారినే దగ్గరికి తీసుకుంటున్నారని, తెలంగాణ ప్రజలకంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కేసీఆర్‌కు ఎక్కువైపోయారన్నారు. రాష్ట్రంకోసం ఉద్యమించిన ఉస్మానియా విద్యార్థులే ఇప్పుడు టీఆర్ఎస్పై తిరగబడుతున్నారని చెప్పారు. -
ప్రతిపక్షాన్ని ఎందుకు పిలవలేదు: వీహెచ్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రతిపక్ష పార్టీల నేతలను ఎందుకు ఆహ్వానిం చలేదని ప్రభుత్వాన్ని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు ప్రశ్నించారు. ఆదివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగు మహాసభలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఇంటి మహాసభలుగా మార్చేశారని మండిపడ్డారు. తెలంగాణలో ఉన్న ప్రతిపక్షానికి, పక్కరాష్ట్ర ముఖ్యమంత్రికి గౌరవమివ్వని కేసీఆర్ వైఖరి సరికాదన్నారు. అదే పక్కరాష్ట్ర సీఎం పిలిస్తే అమరావతి శంకుస్థాపనకు, మంత్రి పరిటాల సునీత కుమారుడి వివాహానికి వెళ్తారని ఎద్దేవా చేశారు. అందరూ ఆహ్వానితులే అనడం సరికాదని, ప్రతిపక్ష పార్టీలకు ప్రత్యేక ఆహ్వానం పంపడం సమంజసం అని పేర్కొన్నారు. -
కేసీఆర్‌ది ఓట్ల రాజకీయం: వీహెచ్
హైదరాబాద్ : బీసీ డిక్లరేషన్ అని తెలంగాణ సీఎం కేసీఆర్ ఓట్ల రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు విమర్శించారు. గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణ సెంటిమెంట్ వర్క్ ఔట్ కాదని సీఎంకు తెలిసిందని అందుకే బీసీ డిక్లరేషన్ అందుకున్నారని అన్నారు. బీసీ డిక్లరేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసి కేసీఆర్ చేతులు దులుపుకుంటారని ఆరోపించారు. 50 శాతం రిజర్వేషన్లు మించారదని కేంద్రం చెబుతోందని తెలిపారు. క్రిమిలేయర్ గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. కేసీఆర్ తన సామాజిక వర్గానికే పెద్ద పీట వేసుకున్నారని విమర్శించారు. కేబినేట్లో నలుగురు మంత్రులు కేసీఆర్ సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారని వెల్లడించారు. 2019 ఎన్నికల కోసమే కేసీఆర్ కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు చేసింది ఏమీ లేదని, కేసీఆర్ మాటలను ప్రజలెవరూ నమ్మరని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో ప్రజలే కేసీఆర్‌కి బుద్ది చెబుతారని జోస్యం చెప్పారు. -
ఎస్సీ, బీసీలపై కేసీఆర్‌ది కపట ప్రేమ: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, బీసీలపై సీఎం కేసీఆర్‌ది కపట ప్రేమ అని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు(వీహెచ్) అన్నారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా కర్ణాటకలో అక్కడి సీఎం సిద్ధరామయ్య పెద్ద ప్రకటన ఇచ్చారని, ఇక్కడ కేసీఆర్ పేపర్లో ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. దీంతో కేసీఆర్‌కు ఎస్సీలపై ఎంత ప్రేమ ఉందో తెలిసిపోయిందన్నారు. కేసీఆర్ మాటల గారడితో మాయ చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది తామేనని, అందుకే బడుగు బలహీనవర్గాలు 2019లో కాంగ్రెస్‌కే పట్టం కడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ అంటే కేసీఆర్‌కు అంత చులకన భావం ఎందుకని నిలదీశారు. బతుకమ్మకు తన కుమార్తె కవిత ఫొటోతో ప్రకటనలు ఇవ్వొచ్చు కానీ అంబేడ్కర్ వర్ధంతికి ఇవ్వరా? అని వీహెచ్ ప్రశ్నించారు. -
కమీషన్ల కోసమే కొత్త సచివాలయం: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: కొత్త నిర్మాణాల్లో కమీషన్లకోసమే సచివాలయం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే నిధుల్లేవని చెబుతున్న కేసీఆర్‌కు కొత్త సచివాలయం కట్టడానికి డబ్బులు ఎక్కడివని ప్రశ్నించారు. సచివాలయ స్థలాన్ని షాపింగ్‌మాల్స్‌కు కట్టబెట్టేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని వీహెచ్ ఆరోపించారు. కమీషన్లు దండుకోవడానికే కొత్త సచివాలయమని..సచివాలయానికే వెళ్లడం చేతకాని సీఎం కేసీఆర్‌కు కొత్తది ఎందుకన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందికి కొత్తగా ఉద్యోగాలు ఇప్పించారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. -
రేవంత్ రాకను ఎవరూ వ్యతిరేకించొద్దు: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాకను కాంగ్రెస్‌లో ఎవరూ వ్యతిరేకించొద్దని ఏఐసీసీ కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు (వీహెచ్) పేర్కొన్నారు. అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక పార్టీ నేతలందరూ సర్దుకుపోవాలని అన్నారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి రావాలని తాను ఎప్పటి నుంచో కోరుతున్నట్లు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రధాని నరేంద్ర మోదీ తుంగలోతొక్కారని విమర్శించారు. జీఎస్టీతో చిన్న చిన్న వ్యాపారులు రోడ్డున పడ్డారని అన్నారు. బోఫోర్స్ కుంభకోణంతో రాజీవ్ గాంధీకి సంబంధం లేదని 2005 లోనే కోర్టు తీర్పు ఇచ్చిందని, ఆ కేసును మళ్లీ తిరగదో డాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని అన్నారు. బోఫోర్స్ కేసు తిరగదోడితే.. అమిత్ షా, మోదీలపై ఉన్న కేసులను కూడా తిరగదోడాలని ఆయన డిమాండ్ చేశారు. -
రాష్ట్ర ప్రభుత్వం బలహీనపడుతోంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం క్రమంగా బలహీనపడుతోందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ప్రజల్లో నమ్మకం కోల్పోతోందని పేర్కొన్నారు. అమరుల స్ఫూర్తి యాత్ర కోసం 10 రోజుల క్రితమే అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నా పోలీసులు ఆఖరు నిమిషంలో అరెస్టులకు పాల్పడ్డారన్నారు. అనుమతి కోసం వెళ్తే అరెస్టులు చేస్తారా.. అని నిలదీశారు. ప్రభుత్వం శనివారం 400 మంది జేఏసీ నేతలు, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసిందన్నారు. ఆదివారం తన నివాసంలో కోదండరాం మీడియాతో మాట్లాడారు. ‘‘పోలీసుల అక్రమ అరెస్టుల నేపథ్యంలో జేఏసీ సంకల్పం మరింత బలపడింది. ప్రభుత్వ తీరును ప్రతిపక్ష పార్టీలన్నిటికీ వివరిస్తాం. గవర్నర్, రాష్ట్రపతికి కూడా ఇక్కడి పరిస్థితిపై ఫిర్యాదు చేస్తాం. న్యాయపోరాటానికి సైతం సిద్ధంగా ఉన్నాం. అత్యాచారాలు, దొమ్మీల వంటి నేరాలకు వర్తింపజేసే సెక్షన్ 151 కింద జేఏసీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేయడం అన్యాయం’’అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వెం టనే వాటిని భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక నుంచి కొలువుల కోసం కొట్లాట మొదలవుతుందన్నారు. ఈ నెల 31న కొలువుల కొట్లాట కోసం బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నందున కోదండరాం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియాన్ని పరిశీలించారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన: వీహెచ్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిని సీఎం అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్నారని, ఇప్పటికైనా ఈ వైఖరి మార్చుకోవాలని మాజీ ఎంపీ వి.హన్మంతరావు అన్నారు. ఆదివారం ఆయన మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి బండ చంద్రారెడ్డితో కలసి వెళ్లి కోదండరాంను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని విమర్శించారు. -
మేడిపల్లికి రాహుల్‌ను తీసుకొస్తా: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మేడిపల్లి లో ఫార్మా సిటీ ఏర్పాటు ను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏకపక్ష ధోరణి తో భూసేకరణ చేపడుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపిం చారు. శనివారం ఆయన గాంధీ భవన్లో మాట్లా డారు. ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చిన భూములను ప్రభుత్వం అక్రమంగా సేకరిస్తోం దని విమర్శించారు. ఫార్మా సిటీతో కాలుష్యం తీవ్రమవుతుందని ప్రజలు చెబుతున్నారని, ప్రభుత్వం మాత్రం వారి ఆందోళనను పట్టించు కోకపోవడం బాధాకరమన్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని మేడిపల్లికి తీసుకొస్తానన్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తామని, బలవంతపు భూసేకరణను అడ్డుకుంటామని చెప్పారు. -
నయీమ్ సొమ్ము ఏమైంది?: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత దొరికిన కోట్లాది రూపాయలు ఏమయ్యాయని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు(వీహెచ్) ప్రశ్నించారు. గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నయీమ్ కేసుపై తాను గతంలోనే సిట్ అధికారులకు, రాజ్‌నాథ్‌కు ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. కానీ, ఇంతవరకు ఏ చర్యలు చేపట్టలేదని, కేసును ప్రభుత్వం కావాలనే నీరుగార్చుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన కుంభకోణాలన్నింటిలో కేసీఆర్ కుటుంబసభ్యుల పాత్ర ఉండటంతోనే ఇంతవరకు ఏ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు -
తాగిస్తారు... జైలుకు పంపుతారా: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: మద్యం షాపులను అడ్డగోలుగా పెంచేయడంతోపాటు అమ్మకాలకు సమయాన్ని పెంచుతు న్న ప్రభుత్వమే తాగినవారిని జైలుకు పంపిస్తున్నదని మాజీ ఎంపీ వి.హన్మంతరావు విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మద్యానికి యువత దాసోహం అవుతోందని బాధ పడుతున్న ప్రధాని మోదీ మద్యంపై నిషేధం ఎందుకు విధించడంలేదని ప్రశ్నించారు. బీజేపీ, దాని భాగస్వామ్య పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మద్యపాన నిషేధాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మోదీ, సీఎం కేసీఆర్ ఇద్దరూ మాటలు చెప్పడం తప్ప పనులు చేయడంలేదని వీహెచ్ విమర్శించారు. -
సీఎంకు వాస్తు పిచ్చి పట్టింది: వీహెచ్
పటాన్చెరు టౌన్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వాస్తు పిచ్చి పట్టిందని, పాత సచివాలయం ఉండగా కొత్తది కట్టడం అవసరమా అని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ప్రశ్నిం చారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మంగళవారం ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాస్తు పిచ్చితో ముఖ్యమంత్రి చేస్తున్న తుగ్లక్ చేష్టలకు రాష్ట్రం దివాలా తీసిందని విమర్శించారు. బేగంపేటలో క్యాంపు కార్యాలయం కోసం గత ప్రభుత్వ హయాంలో రూ.30 కోట్లతో పెద్ద భవనం నిర్మిస్తే.. వాస్తు బాగా లేదని రూ.160 కోట్లతో ప్రగతి భవన్ పేరుతో రాజభవనం నిర్మించుకున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని పదేపదే చెప్పుకునే కేసీఆర్.. ఇప్పటి వరకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకు కట్టలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో మంగళవారం ఒక్కరోజే 20 కేంద్రాల వద్ద ప్రజా బ్యాలెట్ నిర్వహించామని, బుధవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో లెక్కిస్తామని వీహెచ్ పేర్కొన్నారు. -
‘కొత్త సచివాలయ నిర్మాణంపై ఓటింగ్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త సచివాలయ నిర్మాణం అవసరమా, లేదా అనేదానిపై ఓటింగ్ పెడుగున్నట్టుగా మాజీ ఎంపీ వి. హనుమంతరావు చెప్పారు. ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 26న(సెప్టెంబర్) ఉదయం నుంచి సాయంత్రం 6 గంటలదాకా ఓటింగ్‌ను 20 కేంద్రాల్లో పెడుతున్నామని వెల్లడించారు. ఈ నెల 27న సోమాజిగూడలో ప్రజాభిప్రాయంపై కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. సీఎం కేసీఆర్ తన ముద్ర, పేరుతో పాటు వాస్తు పిచ్చితో కొత్త సచివాలయం నిర్మించాలని ప్రయత్నిస్తున్నారని వీహెచ్ చెప్పారు. కొత్త సచివాలయం ద్వారా ప్రజాసొమ్మును దుర్వినియోగం చేయడమేనన్నారు. దీనిపై బ్యాలెట్ బాక్సుల ద్వారా ప్రజాభిప్రాయాన్ని చెప్పాలని ఆయన కోరారు. వాస్తు పేరుతో ప్రజల సొమ్మును దుర్వినియోగం చెయోద్దని సీఎంను కోరారు. ఫలితాల తర్వాత అయినా సీఎం కేసీఆర్ ఆలోచనలో మార్పారావాలని వీహెచ్ ఆకాంక్షించారు. -
'సచివాలయం ఎలా కడతారో చూస్తా'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అమరావతిలో కొత్త భవంతులు కడుతున్నారని కేసీఆర్ కూడా కొత్తవి కట్టాలని అనుకుంటున్నారు. ఉన్న సచివాలయానికే రాని ముఖ్యమంత్రికి కొత్త సచివాలయం ఎందుకని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు విమర్శించారు. ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజా సొమ్మును ఖర్చు పెట్టడానికి మీ జాగీరా? సచివాలయం ఎలా కడతారో నేను చూస్తా? కొత్త సచివాలయంపై నగరంలో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాం. ప్రజల ముదు బ్యాలెట్ పేపర్ పెడతామని అన్నారు. -
వీహెచ్‌కు ‘అర్జున్ రెడ్డి’ స్ట్రాంగ్ మెసేజ్
అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్లను చింపి వివాదం చేసిన కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంతరావుకు హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా మరో మెసేజ్ పెట్టాడు. డియర్ తాతయ్య.. అర్జున్ రెడ్డి సినిమాను ప్రశంసించిన కేటీఆర్ నాకు బంధువైతే మరి సినిమా నచ్చిన వాళ్లంతా కూడా బంధువులవుతారా..అంటూ సెటైరిక్‌గా ‘రాజమౌళిగారు మా నాన్న. హీరోలు రానా, నాని, శర్వానంద్, వరుణ్ తేజ్‌లు నా బ్రదర్స్. నాకు చెల్లెళ్లు ఉంటే ఫీలింగ్ ఎలా ఉండేదో తెలియదు కాబట్టి సమంత, అనూ ఇమ్యనూల్, మెహ్రీన్ పిర్జాదాలు నా మరదళ్లు. ఐదు రోజుల్లో ఐదువేలకు పైగా షోలను హౌస్ ఫుల్ చేసిన నా విద్యార్థిని, విద్యార్ధులు నా తోబుట్టువులు. ఇక ఆర్జీవీ సర్ మన ఇద్దరిలో ఎవరికి తండ్రో ఇంకా స్పష్టత లేదు. చిల్ తాతయ్య ప్రేమతో విజయ్ దేవరకొండ’. అంటూ ముగించాడు. గత వారం విడుదలైన అర్జున్‌రెడ్డి బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి ప్రముఖుల ప్రశంసలతో పాటు మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఇక అంతకు ముందు వీహెచ్... కేటీఆర్ లాంటి నేతలు ఈ సినిమాను సమర్థిస్తూ మాట్లాడటం మంచిది కాదన్నారు. ముద్దు సన్నివేశాలు, డ్రగ్స్, బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాను బాగుందంటూ వ్యాఖ్యానించిన కేటీఆర్.. సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. హీరో పాత్రతోనే డ్రగ్స్ తీసుకున్నట్టు చూపిస్తే ఇక తెలుగు సినిమాకు విలువెక్కడుందని వీహెచ్ ప్రశ్నించారు . -
తెలంగాణ తొలి మెగాస్టార్ అతనే!
విజయ్ దేవరకొండపై వర్మ ప్రశంసలే ప్రశంసలు విజయ్ దేవరకొండ రొమాంటిక్ డ్రామా 'అర్జున్ రెడ్డి' విజయయాత్ర కొనసాగుతోంది. ఇటు ప్రేక్షకులు, అటు ప్రముఖులు, విమర్శకుల నుంచి ప్రశంసలందుకుంటున్న ఈ సినిమాపై తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యంగ్‌హీరో విజయ్ను వర్మ ప్రశంసలతో ముంచెత్తారు. 'ఇప్పటి హీరోలంతా హీరోయిజాన్ని ప్రదర్శించేందుకు చెవులు బద్దలయ్యే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో కూడిన స్లో మోషన్, ర్యాంపింగ్ షాట్స్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. హీరోగా కనిపించడానికి ఇలాంటి స్లో మోషన్, ర్యాంపింగ్ షాట్స్ అవసరం లేకుండా నాకు ఇప్పటివరకు కనిపించిన మొదటి నటుడు విజయ్ దేవరకొండ. అతని కళ్లు, అతని గొంతు అతని నుంచే ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను ప్రసరిస్తున్నాయి' అని వర్మ విశ్లేషించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, హాలీవుడ్ నటుడు ఆల్ పసినోతో విజయ్ను పోలుస్తూ వర్మ ప్రశంసల జల్లు కురిపించారు. 'వివిధ కెమెరా స్పీడ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నడుమ కెమెరా ముందు క్రియేటైన టెక్నీకల్ ఎమోషన్‌కు తగ్గటు నిలబడగలిగిన నటుడిని చూడటం చాలా అరుదు. అమితాబ్ బచ్చన్ తర్వాత సినిమాటిక్ టెక్నిక్ అవసరం లేకుండా అదే తీవ్రతతో కెమెరా ముందు నిలబడగలిగిన నటుడు విజయ్ దేవరకొండ. యంగ్ అమితాబ్ బచ్చన్, యంగ్ ఆల్ పసినో మేలు కలయిక విజయదేవరకొండ. కొత్త తరం హీరోగా అతను ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తాడని నేను బలంగా భావిస్తున్నా. టాలీవుడ్ అమితాబ్ బచ్చన్‌గా, తెలంగాణ తొలి మెగాస్టార్‌గా అతను నిలుస్తాడని నేను కచ్చితంగా చెప్పగలను' అని వర్మ పేర్కొన్నారు. ఆయన పూర్తి వ్యాసం ఫేస్బుక్ పేజీలో చూడొచ్చు. -
వీహెచ్‌కు ముద్దిచ్చిన వర్మ!
సాక్షి, ప్రత్యేకం: పెళ్లి చూపులు ఫేం విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి చిత్రం శుక్రవారం విడుదలైంది. మొదట నుంచి అనుకున్నట్లు గానే.. బోల్డ్ మూవీగా వచ్చిన ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌తో పాటు రిలీజ్‌కు ముందు కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు సినిమా పోస్టర్లు చించేయడంతో సినిమాకు కావల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది. సినిమా పోస్టర్ యూత్‌ను చెడగొట్టేలా ఉందని వీహెచ్ చించేస్తే... వీహెచ్ దుస్తులు చించేయాలని రామ్ గోపాల్ వర్మ విజయ్‌కు సూచించడంతో వివాదం రాజుకుంది. అయితే.. ఈ వ్యవహారంపై ఎవరో ఎడిట్ చేసిన ఫొటోను ఆర్జీవీ తన ఖాతాలో పోస్ట్ చేశాడు. గతంలో అనురాగ్ కశ్యప్‌కు ముద్దు పెడుతూ ఇన్‌స్టాగ్రాంలో ఆర్జీవీ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో అనురాగ్‌కు బదులు వీహెచ్‌కు వర్మ ముద్దు పెడుతున్నట్లు ఓ ఫొటోను ఎవరో ఎడిట్ చేశారు. ఆ ఎడిట్ చేసిన ఫొటోను వర్మ తన ఫేస్బుక్లో పోస్ట్ చేసి వెటకారంగా కామెంట్స్ చేశారు. -
వీహెచ్ x వర్మ.. ఓ అర్జున్ రెడ్డి
అర్జున్ రెడ్డి పోస్టర్ చించేసిన కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు బట్టలను చించేయాలని హీరో విజయ్ దేవరకొండను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోరారు. వీహెచ్ మారుమూల పల్లెలో జన్మించి ఉంటారని, కనీసం పలకా బలపం కూడా పట్టి ఉండరని అందుకే అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్‌ను నడిరోడ్డులో చించేశారని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కామెంట్ చేశారు. ఈ మేరకు ఫేస్బుక్లో పలు వివాదాస్పద పోస్టులు పెట్టారు. వీహెచ్ మైండ్ సెట్ పురాతన కాలంలో ఉండిపోయిందని అన్నారు. అదీ ఎంతలా అంటే మధ్యయుగ కాలంలోని మనుషుల్లా అని నొక్కి చెప్పారు. హనుమంతరావు అర్జున్ రెడ్డి పోస్టర్‌ను ఎందుకు చించేశారో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. బహుశా.. అంత అందమైన అమ్మాయి.. విజయ్ దేవరకొండకు ముద్దివ్వడం ఆయనకు రుచించకపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. వీహెచ్‌కు అలాంటి అందమైన మహిళ ఎప్పుడూ ఇలా ముద్దు ఇవ్వాలేదా? అని ప్రశ్నించారు. వీహెచ్.. అర్జున్ రెడ్డి పోస్టర్‌ను తన మనవళ్లు, మనవరాళ్లకు చూపించి అందులో ఏదైనా తప్పుందా? అని అడగాలని అన్నారు. తాను చేసిన పోస్టులు తాతయ్యకు అర్థం కాదేమోనని కామెంట్ చేశారు. 'తాతయ్యా..! అర్జున్ రెడ్డి సినిమా మీ తాతయ్యల కోసం కాదు. మీ మనవళ్లు మనవరాళ్ల కోసం అని అర్థం చేసుకోండి.' అని వర్మ పోస్టులో పేర్కొన్నారు. 'మీ పార్టీ ఎలానో తాతయ్య అయిపోయింది. మీ పిల్ల చేష్టల వల్ల భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో మీ పార్టీకి రాష్ట్రంలోని మీ మనవళ్లు, మనవరాళ్లు ఎవరూ ఓటు వేయరని అన్నారు. అప్పుడు మీ వల్ల మీ కాంగ్రెస్ పార్టీ పే..ద్ద.. తాతయ్య అయిపోతుంది' అంటూ మరో కామెంట్ చేశారు. -
పోస్టర్ చించిన వీహెచ్.. చిల్ అన్న హీరో
సాక్షి, హైదరాబాద్: బస్సుపై అంటించిన సినిమా పోస్టర్ అసభ్యకరంగా ఉందని.. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు బస్సును ఆపించి మరీ చించేశారు. ఈ ఘటన నాంపల్లిలోని గాంధీ భవన్ వద్ద చోటు చేసుకుంది. గాంధీ భవన్లో జరిగిన సమావేశానికి హాజరైన వీహెచ్ తిరిగి వెళుతుండగా ఓ ఆర్టీసీ బస్సు మీద నటుడు విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ను గమనించారు. వెంటనే బస్సును ఆపించి కండక్టర్ సాయంతో పోస్టర్‌ను తొలగించేశారు. ఇలాంటి పోస్టర్లు యువతను తప్పుదోవ పట్టిస్తాయని వీహెచ్ అన్నారు. డబ్బు కోసం ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలకు ఒప్పుకోకూడదని హితవు పలికారు. చిల్ తాతయ్యా.. వీహెచ్ పోస్టర్ చింపేస్తున్న ఫొటో వైరల్ అవడంతో పోస్టర్‌లోని నటుడు విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. ‘చిల్ తాతయ్యా’ అంటూ తన ఫేస్బుక్లో పోస్టర్ చించుతున్న ఫొటోను పోస్ట్ చేశారు. -
తాగుబోతు, మాఫియా తెలంగాణగా మారింది
హైదరాబాద్: సీఎం కేసీఆర్ అహంకార మాటలు మానుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సూచించారు. ఇది ప్రజాస్వామ్య దేశమా లేక దొరల రాజ్యమా అని ప్రశ్నించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేరెళ్ల బాధితులను మంత్రి కేటీఆర్ దొంగచాటుగా పరమర్శించాల్సిన అవసరమేంటని నిలదీశారు. పెద్దపులి వంటి ఎస్పీని వదిలి జింకపిల్ల లాంటి ఎస్సైపై వేటువేయడం సిగ్గుచేటన్నారు. బాధితుల పక్షాన ప్రతిపక్షాలు పోరాడుతుంటే రాజకీయమంటూ నిందలు వేయడం తగదన్నారు. దళితుల మరణానికి కారణమైన లారీ డ్రైవర్, యజమానిపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దళితులను చిత్రహింసలు పెట్టిన ఎస్పీని తప్పించినపుడే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. లారీ ప్రమాదం కారణంగా చనిపోయిన కుటుంబాలకు రూ. 20 లక్షలు, పోలీసుల చేతిలో థర్డ్ డిగ్రీకి గురైన వారికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. తాగుబోతు, ఇసుక మాఫియా తెలంగాణగా రాష్ట్రం మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
నేరెళ్ల బాధితులకు అండగా ఉంటాం
వేములవాడ: నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగేదాకా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ సీనియర్ నేత,రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడలోని మనోహర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేరెళ్ల ఘటన బాధితులను గురువారం ఆయన పరామర్శించారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితులను పోలీసులు ఇష్టారీతిన చిత్రహింసలు పెట్టారని తెలిపారు. సిరిసిల్లా జిల్లాలో ఇసుక మాఫియా కొనసాగుతోందని వీహెచ్ ఆరోపించారు. -
‘ప్రతిపక్షం లేకుండా చేయాలని బీజేపీ కుట్ర’
హైదరాబాద్: దేశంలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలని బీజేపీ పన్నుతోందని కాంగ్రెస్ సీనియర్ వి. హనుమంతరావు బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. అందుకే కేసులు ఉసిగొల్పి డబ్బు ఆశ చూపి అన్ని పార్టీల వారిని బీజీపీలో చేర్చుకుంటున్నారని నేత వీహెచ్ అన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలోని సెక్యులర్ పార్టీలన్ని ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపక్షాలను ఏ విధంగా వేధిస్తోందో ప్రజలు గమనిస్తున్నారు. నిన్నటి వరకు ప్రధానిని తిట్టిపోసిన బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ రోజు మోదీని ఆకాశానికి ఎత్తుతున్నారు. దీని వెనుక మతలబేంటో? ఇక రాష్ట్రం విషయానికి వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్న చందంలా మారిందని ఆయన అన్నారు. తెలంగాణలో దళిత, బలహీన వర్గాలను టీఆర్ఎస్ సర్కార్ అణిచివేయాలని చూస్తోందన్నారు. -
కేటీఆర్‌పై కేసు పెట్టాలి: వీహెచ్
సిరిసిల్ల రూరల్(రాజన్న సిరిసిల్ల జిల్లా): తంగళ్లపల్లి మండలం నేరెళ్ల దళితులపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించినందుకు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌పై కేసు పెట్టాలని, సిరిసిల్ల ఎస్పీని సస్సెండ్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. పోలీసుల చేతిలో థర్డ్‌డిగ్రీకి గురైన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా వీహెచ్ విలేకరులతో మాట్లాడుతూ.. నెలరోజుల వ్యవధిలో ఇసుకలారీలతో ముగ్గురు మరణించగా.. ఆక్రోశంతో ప్రజలు లారీలను తగులబెడితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిపోయి.. దొంగల్లా రాత్రి వచ్చి.. 8మందిని కిడ్నాప్ చేసి.. నాలుగు రోజులు థర్డ్ డిగ్రీ ఇస్తారా..? వారేమైనా నక్సలైట్లా..? అంత చిత్రహింసలు ఎందుకు పెట్టారు..? అని ప్రశ్నించారు. ఒక్క కుటుంబం బతకడానికి పేద దళిత, బీసీ కుటుంబాలను చంపుతారా..? అని ప్రశ్నించారు. ఎస్పీ కొట్టీ మాట మార్చుతున్నారని, నాలుగురోజులు నిర్బంధించి.. ఒక్కరోజులోనే కోర్టులో హాజరుపర్చాం అంటూ కమిషన్ ముందు చెప్పడం ఆయనకే చెల్లిందన్నారు. దళితులపై ఇంతజరిగినా.. సర్కార్‌కు కనిపించకపోవడం శోచనీయమన్నారు. బాధితులకు తగిలిన గాయాలను చూసిన జైలర్.. వారిని వెనక్కిపంపడంతోనే ఈ దారుణం వెలుగుచూసిందని గుర్తుచేశారు. అవినితీ, ఇసుకమాఫియా గురించి ప్రశ్నిస్తే మంత్రి కేటీఆర్ తిరగబడి మాట్లాడటం సబబు కాదన్నారు. మంత్రి కేటీఆర్ వయసుకు తగిన మాటలు మాట్లాడాలని సూచించారు. జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలనిని కోరితే.. హోంమంత్రి ఒకలా, మంత్రి కేటీఆర్ మరోలా అహంకారంతో మాట్లాడుతున్నారని వాపోయారు. కొట్టిన దెబ్బలు చెప్పుకుంటే దళిత మహిళలపై వ్యభిచారం కేసులు పెడతారా..? మగవాళ్లపై గంజాయి కేసులు పెడతారా..? ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నించారు. జిల్లా ఎస్పీ విశ్వజిత్‌ను వెంటనే సస్సెండ్ చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దురాగతంపై చలో నేరెళ్ల కార్యక్రమంలో భాగంగా సిరిసిల్లలో భారీ బహిరంగ సభను ఈనెల 31న నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ముద్రగడ ఏమైనా ఉగ్రవాదా : వీహెచ్
భీమవరం: 2014 ఎలక్షన్లో బాబు ఇచ్చిన హామీలనే ముద్రగడ అడుగుతున్నారని మాజీ ఎంపీ వి.హనుమంతరావు వెల్లడించారు. సోమవారం ఆయన భీమవరంలో విలేకరులతో మాట్లాడుతూ..ఏపీ సీఎం చంద్రబాబుకు కాపులపై ఎందుకు కక్ష సాధిస్తున్నాడని ప్రశ్నించారు. కాపు ఉద్యమనేత ముద్రగడ ఏమైనా ఉగ్రవాదా అని సూటిగా అడిగారు. ఇది ప్రజాస్వామ్యమా, లేక నియంత రాజ్యమా అని మండిపడ్డారు. తుని సంఘటన చంద్రబాబు చేసిన కుట్ర అని అన్నారు. ట్రాక్ పై జనం ఉండగా రైలు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈ విషయం రైల్వే అధికారులకు తెలియదా అని అడిగారు. బడుగు బలహీన వర్గాలను చంద్రబాబు ప్రభుత్వం అణచి వేస్తోందని విమర్శించారు. 2019లో బలహీన వర్గాల ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెబుతారని ఆయన జోస్యం చెప్పారు. ముద్రగడ పద్మనాభం పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. తుందుర్రు, గరగపర్రుకు రాహూల్ గాంధీని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానని తెలిపారు. -
బాబుకు బుద్ధి చెప్పాలి: వీహెచ్
విజయవాడ: కాపులను మోసం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎంపీ వి.హనమంతరావు అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..ముద్రగడ పాదయాత్రను అణగదొక్కాలని చంద్రబాబు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేయలేదా అని ప్రశ్నించారు. కాపు కులంలో హోంమంత్రి చినరాజప్ప చెడపుట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కాపులేమైనా ఉగ్రవాదులా...లేక దొంగలా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేసే హక్కు అందరికి ఉందని, చంద్రబాబుకు కలలో కూడా ముద్రగడనే కనిపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు కాపులు బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జోస్యం చెప్పారు. -
డ్రగ్స్ పెరగడానికి ప్రభుత్వమే కారణం: వీహెచ్
వరంగల్: రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని.. గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో పెద్దల పేర్లు బయటికి రాకుండా.. మియాపూర్ భూకుంభ కోణాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు దాని పై నుంచి దృష్టి మరల్చేందుకు డ్రగ్స్ వ్యవహారాన్ని బయటకు తీశారని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. ఆయన శనివారం వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ' డ్రగ్స్ విపరీతంగా పెరగడానికి ప్రభుత్వమే కారణం. 2019 లో టీఆఎర్ఎస్కు గుణపాఠం తప్పదు. మెడల్ సాధించిన వారి మెడలో బంగారు పథకాలు వేసి అమాయక ప్రజలను మాత్రం మోసం చేశారు. వారం రోజుల క్రితం మురళి అనే కార్పొరేటర్ ను చంపిన నిందితులు నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోయారు. హత్యచేసిన విక్రమ్ తన తండ్రిని మురళి హత్య చేయడంతో ప్రతీకారంతో ఈ పని చేశాడు. కొడుకు చనిపోయిన బాధలో వున్న నాయిని రాజేందర్ రెడ్డి పై పోలీసులు రాజకీయ ఒత్తిడితో అక్రమంగా ఈ కేసులో ఇరికించారు. చనిపోయిన వ్యక్తి భార్య, పిల్లలు కూడా నాయిని పేరు చెప్పలేదు. పోలీసులపై ఇంకా నమ్మకం ఉంది. చార్జీ షీట్ నుండి నాయిని రాజేందర్ రెడ్డి పేరు వెంటనే తొలగించాలలి' అని డిమాండ్ చేశారు . -
‘సీఎంపై కేసు నమోదు చేయాలి’
హైదరాబాద్: సీఎం కార్యాలయం వద్ద ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించిన ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద నల్లగొండ జిల్లాకు చెందిన ముగ్గురు ఆత్మహత్యకు యత్నించిన విషయం విదితమే. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వారు ప్రయత్నించి నిరాశతో బలవన్మరణానికి యత్నించారని, ఇందుకు కారణమైన ముఖ్యమంత్రిపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలని వీహెచ్ శుక్రవారం పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
కేసీఆర్.. ఇప్పటికైనా ఆలోచించుకో: వీహెచ్
మీరాకుమార్‌కు మద్దతు ఇవ్వాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కల సాకారం కావడంలో తన వంతు కృషి చేసిన మాజీ లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మతతత్వ పార్టీ అయిన బీజేపీకి ఎలా మద్దతు ఇస్తారని ప్రశ్నించారు. ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ఇవ్వడం సరికాదన్నారు. ‘ఇప్పటికైనా కేసీఆర్ అలోచించి తెలంగాణకు సహకరించిన మీరాకుమార్‌కు మద్దతు ఇస్తే చరిత్రలో నిలుస్తారు, లేకుంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతారు’ అని వీహెచ్ హెచ్చరించారు. స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ ఉదంతాలపై కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. -
తెలంగాణ సంస్కృతిని కేసీఆర్ నాశనం చేస్తుండు
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతిని సీఎం కేసీఆర్ నాశనం చేస్తుండని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. గడీల పాలన చేస్తున్నావా అని సీఎంను ఉద్దేశించి ప్రశ్నించారు. కేసీఆర్ మాజీ స్పీకర్ మీరాకుమార్ ఫోన్ చేసినా మాట్లాడకుండా అవమానపరిచాడని ఆయన మండిపడ్డారు. గ్రామ గ్రామాన తిరిగి గడీల పాలనను అంతం చేస్తామని హెచ్చరించారు. జీఎస్టీ వల్ల నష్టం జరుగుతుందని ఈటల రాజేందర్ అంటే.. నష్టం ఏమి లేదని సీఎం అనడం శోచనీయమన్నారు. అసలు ఎవరు తప్పు చెబుతున్నారు కేసీఆరా? లేక ఈటలనా? అని సూటిగా అడిగారు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి కేసీఆర్ భజన చేస్తున్నారని విమర్శించారు. -
‘కేసీఆర్ మీరు ఆమెను ఎలా ఓడిస్తారు’
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ స్పీకర్ హోదాలో ఉండి తెలంగాణ ఇచ్చిన మీరాకుమార్ను ఓడించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా పనిచేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వీ హనుమంతరావు ప్రశ్నించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన మీరాకుమార్‌కు వ్యతిరేకంగా ఓటేయాలనే సీఎం కేసీఆర్ నిర్ణయం దారుణమన్నారు. ఆర్ఎస్ఎస్కు విధేయుడు రామ్‌నాథ్ కోవింద్ పోటీలో ఉన్న సమయంలో ఎంఐఎం వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం నేతలైన ఒవైసీ సోదరులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. జీఎస్టీపై ప్రజలను కేంద్రం మోసం చేస్తున్నదని, జీఎస్టీ అమలైతే చిన్న వ్యాపారులు అడ్డుక్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఒత్తిడి వల్లనే మియాపూర్ భూముల కుంభకోణంపై సీబీఐ విచారణ వేయడంలేదని, కేసీఆర్ అవినీతికి కేంద్ర ప్రభుత్వం వంత పాడటం దారుణని వీహెచ్ అన్నారు. ఈ భూములపై ఫిర్యాదు చేస్తామంటే హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. -
అమరావతిలో ఆయన విగ్రహం ఎందుకు పెట్టడం లేదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి ముఖ్య కారకుడైన పొట్టి శ్రీరాములు విగ్రహం, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ఎందుకు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేకరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములుకు తగిన గౌరవం ఇవ్వకపోవడం మంచిదికాదని హితవు పలికారు. దేశంలో రైతులు మొదటి సారి రోడ్ల మీదకి వస్తున్నా, సాయం చేయాలని ఇది ప్రధాని మోదీకి లేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కూడా రుణమాఫీ చేయడంలో విఫలమయ్యాడని మండిపడ్డారు. జీఎస్టీతో రైతులకు న్యాయం జరుగుతుందని భావించానని కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయంలో రైతులను దారణంగా మోసం చేసిందని విమర్శించారు. పంటల మీద, వ్యవసాయ పరికరాల మీద జీఎస్టీ వేయ్యొద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మిషన్ భగీరధ, గ్రానైట్ కోసం అడిగిన కేసీఆర్, రైతుల కోసం అడగలేదని మండిపడ్డారు. -
ఓయూతో కేసీఆర్‌కు అవసరం తీరింది: వీహెచ్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు మండిపడ్డారు. అధికారంలోకి రావడానికి విద్యార్థులను వినియోగించుకున్న కేసీఆర్, ఇప్పుడు విస్మరిస్తున్నారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీతో కేసీఆర్‌కు అవసరం తీరిందని.. అందుకే అక్కడ మీటింగులు పెట్టొద్దని ఆదేశాలు జారీ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అసలు రాష్ట్రానికి గవర్నర్ ఎందుకున్నాడో అర్ధం కావడం లేదు. రైతులకు సంకెళ్లు వేసినా.. చచ్చినా ఆయనకు పట్టడం లేదని మండిపడ్డారు -
'ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించం'
హైదరాబాద్: తెలంగాణ ఇచ్చిన పార్టీని నరరూప రాక్షస పార్టీ అంటారా అని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు టీఆర్ఎస్పై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన డీఎస్‌ను, కేకేను కలుపుకుని తమ పార్టీని నరరూప రాక్షస పార్టీ అనడంపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇష్టం వచ్చినట్లు కాంగ్రెస్‌ను తిడుతూ మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ నరరూప రాక్షస పార్టీ అనే వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను తెలుసుకోవడానికి రాహుల్ వారితో మాట్లాడతారని స్పష్టం చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకటరెడ్డి, కార్యకర్తలఫై దాడి చేస్తారు.. రైతులకు బేడీలు వేసి రైతే రారాజు అంటారు.. ఇదేమి పద్దతి అని ప్రశ్నించారు. బయటకు ఫ్రెండ్లి పోలీస్ అంటావు.. లోపలనేమో కేసులు పెట్టిస్తావు.. ఎవరి అబ్బ సొత్తు అని పోలీసులకు రూ. 500 కోట్లు ఇస్తానంటున్నావు అని వీహెచ్ వ్యాఖ్యానించారు. -
నిరంకుశంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ సర్కార్-వీహెచ్
హైదరాబాద్: తెలంగాణ సర్కార్ నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆరోపించారు. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమవారం ధర్నచౌక్‌లో రెండు వర్గాలకు అనుమతినిచ్చి రెచ్చగోట్టే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. ధర్నాచౌక్‌లో స్థానికులు కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులు ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. స్థానికులు మాత్రం తమకు మానవతాదృక్పదంతో తాగటానికి మంచినీళ్లు ఇచ్చారని చెప్పారు. రెచ్చిపోతే చచ్చిపోతారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అంటున్నారు జనాన్ని చంపడానికి ఉన్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌గారు సీఎం కేసీఆర్ ఆరోగ్యం గరించి వాకబు చేస్తాడు కాని రైతుల సమస్యల గురించి మాత్రం పట్టించుకోరని వెద్దేవా చేశారు. రైతులకు బేడీలు వేసింనందుకు నిరసనగా "రైతులు ఉగ్రవాదులా" అనే వాల్‌పోస్టర్‌ను వీహెచ్ ఈసందర్భంగా ఆవిష్కరించారు. -
దమ్ముంటే విచారణ జరిపించాలి.: వీహెచ్
హైదరాబాద్‌సిటీ: దిగ్విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. ప్రభుత్వానికి దమ్ముంటే విచారణ జరిపించాలని ఆయన సవాల్ విసిరారు. విలేకరులతో మాట్లాడుతూ..దిగ్విజయ్ దిష్టిబొమ్మలు తగలబెట్టడం సరికాదని అన్నారు. ప్రభుత్వం మీది..చేతనైతే విచారణ జరిపించాలన్నారు. కేసీఆర్ ఓ నియంత అని అన్నారు. ముఖ్యమంత్రి బీసీలకు విలువివ్వడని, జ్యోతిరావ్ పూలే జయంతికి దండ కూడా వేయలేదని ఆరోపించారు. రైతుల బాధలు చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని తెలిపారు. ఇది రైతు ప్రభుత్వం కాదని, దళారుల ప్రభుత్వమని మండిపడ్డారు. దీనికి ఖమ్మం మార్కెట్ యార్డు ఘటనే నిదర్శనమన్నారు. రైతులను తుమ్ముల గూండాలని అనడం బాధాకరమన్నారు. రైతులపై దేశద్రోహం కేసులు పెట్టడం దారుణమని విమర్శించారు. మిర్చీ రైతుల వద్దకు సీఎం ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. నర్సింహన్‌కు కొనసాగింపు ఎందుకు?అని సూటిగా అడిగారు. గవర్నర్ నర్సింహన్ ఉన్నంత వరకు రెండు రాష్ట్రాలకు న్యాయం జరగదని చెప్పారు. ఈ విషయంలో రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాస్తానని హనుమంతరావు తెలిపారు. -
ప్రగతి భవన్‌కు పరిమితమవడం సరికాదు
కేసీఆర్ భజనను గవర్నర్ మానుకోవాలి: వీహెచ్ సాక్షి, హైదరాబాద్: ప్రజల్లోకి వెళ్లకుండా ప్రగతిభవన్‌కే సీఎం కేసీఆర్ పరిమితమవడం సరికాదని కాంగ్రెస్ నేత వి.హనుమం తరావు అన్నారు. బీసీ నేత అయిన జ్యోతిబా పూలేకి నివాళుల ర్పించడానికి కూడా సీఎంకు సమయం లేకపోవడం దుర్మార్గమ న్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌ని కలవడానికి సీఎంకు సమయం దొరుకుతోంది కానీ, పూలేకు నివాళులర్పిం చడానికి సమయం దొరకడం లేదా అని ప్రశ్నించారు. ఈ విధంగా బీసీలను సీఎం కించపరుస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలా గవర్నర్ నరసింహన్ కేసీఆర్ భజన చేయడం మానుకోవాలని హితవు పలికారు. -
అవినీతికన్నా పెద్ద మోసం మాటతప్పడం
ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు సాక్షి, హైదరాబాద్: లంచం అడిగితే చెప్పుతో కొట్టమని మంత్రి కేటీఆర్ చెబుతున్నారని, ఆ మాటకొస్తే అబద్ధాలు చెప్పి, మోసం చేసిన వారిని కూడా చెప్పుతో కొట్టాల్సి ఉంటుందని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అవినీతి కన్నా పెద్ద మోసం ఇచ్చిన మాట తప్పడమని అన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా గాంధీ భవన్లో ఆయన చిత్రపటానికి టీపీసీసీ నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, సంపత్ తదితరులు నివాళులర్పించారు. -
గవర్నర్ ప్రభుత్వాలకు భజన చేస్తున్నారు
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ ప్రజలపక్షాన నిలబడకుండా.. ప్రభుత్వాల భజన చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. ఆయన సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంత్రి పదవులు ఇవ్వడం రాజ్యాంగానికి తూట్లు పొడవడమేనన్నారు. పార్టీ మారిన వారితో ఓ వైపు గవర్నర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఒక పార్టీలో గెలిచి.. మరో పార్టీకి మారడం వ్యభిచారం కంటే పెద్ద తప్పు అని, పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోకుండా ఇలానే చూస్తూ కూర్చుంటే.. రానున్న రోజుల్లో ఓటు హక్కుని ఎవరు కూడా వినియోగించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసీ, రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఎమ్మెల్యేల ఫిరాయింపులు జరుగుతున్నా ప్రదాని మోడీ పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. ఫిరాయింపు రాజకీయాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఇతరపార్టీలను కలుపుకుని కాంగ్రెస్ ఉద్యమించాలని పిలపునిచ్చారు. ఈ విషయంలో రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల కమిషన్ ని కలుస్తానన్నారు. -
కోదండరాంను పరామర్శించిన వీహెచ్
మన రాష్ట్రంలోనే ఉన్నామా: విమలక్క సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేత విమలక్క పరామర్శించారు. కోదండరాం నివాసానికి గురువారం వచ్చిన వీహెచ్, విమలక్క ర్యాలీ సందర్భంగా జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. విరిగిన తలుపులు, పోలీసులు చేసిన హడావుడి పరిశీలించారు. నిరుద్యోగ సమస్యపై, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకోసం పోరాడాలని కోదండరాంకు సూచించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఉద్యోగాలు ఇవ్వడంలేదని అడగడమే నేరమా అని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు అడిగేవారు ఉగ్రవాదులా, నక్సలైట్లా అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్బంధం, పోలీసుల అరాచకాలు చూస్తుంటే తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రంలోనే ఉన్నారా అని అనిపిస్తున్నదని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ (టఫ్) నేత విమలక్క అన్నారు. ఎవరైనా దోపిడీ చేస్తే పోలీసులకు చెప్పుకుంటామని, అదే పోలీసులు దాడి చేస్తే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. ఉద్యమశక్తుల అణచివేతకే పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టుగా ఉందని విమర్శించారు. ఇదేనా ప్రజలు కోరుకున్న తెలంగాణ అని విమలక్క ప్రశ్నించారు. -
బ్యాంకు ఎదుట వీహెచ్ మౌన దీక్ష
నంగనూరు : మెదక్ జిల్లా నంగనూరు మండలం పాలమాకుల సిండికేట్ బ్యాంకు ఎదుట కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ధర్నాకు దిగాడు. ప్రజల కరెన్సీ కష్టాలు తీర్చాలని కోరుతూ నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని మౌనదీక్షకు దిగారు. అంతకుముందు విలేకరులతో మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నాడని విమర్శించాడు. మా నాయకుడు రాహుల్‌గాంధీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక అలా చేస్తున్నాడని ఆరోపించారు. మొదట నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించిన సీఎం కేసీఆర్ డిల్లీ వెళ్లిన తర్వాత ఎందుకు మిన్నకుండిపోయారని ప్రశ్నించారు. నోట్ల రద్దు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు గ్రామాలకు వస్తేగానీ తెలియదన్నారు. -
సీనియర్ జర్నలిస్ట్ వి. హనుమంతరావు మృతి
కేసీఆర్, చంద్రబాబు, వైఎస్ జగన్ సహా ప్రముఖుల సంతాపం సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు, డీఎన్ ఎఫ్ న్యూస్ ఏజెన్సీ వ్యవస్థాపకుడు వి.హను మంతరావు(91) మంగళవారం ఉదయం కన్ను మూశారు. వృద్ధాప్యంతో కొంతకాలంగా నలతగా ఉంటున్న ఆయన మంగళవారం ఉద యం శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. హను మంతరావు మరణవార్త తెలియగానే శ్రీనగర్ కాలనీ నాగార్జుననగర్‌లోని ఆయన నివాసానికి సన్ని హితులు, జర్నలిస్టులు చేరుకుని నివాళి అర్పిం చారు. ఆయన భార్య సరళ, కుమారుడు సతీష్ బాబులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణు కులో పుట్టిన హనుమంతరావు కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య వద్ద స్టెనోగా చేరి, ఆ పై జర్నలిస్టు జీవితాన్ని ఆరం భించి అంచెలంచెలుగా ఎదిగి వివిధ పత్రికలు, హోదాల్లో పనిచేశారు. ప్రముఖుల సంతాపం.. హనుమంతరావు మరణంతో తెలుగు జర్నలి జం గొప్ప వ్యక్తిని కోల్పోయినట్లయ్యిందని తెలంగాణ, ఏపీ సీఎంలు, ప్రతిపక్ష నాయకులు కేసీఆర్, చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, కె.జానారెడ్డి అన్నారు. హనుమంతరావు మృతి మీడియా రంగానికి తీరని లోటని, జర్నలిజానికి రోల్ మోడల్ లాంటి వారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హనుమంతరావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సీనియర్ జర్న లిస్టు కె.రామచంద్రమూర్తి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు రాజమౌళి, విజయ్ కుమార్‌రెడ్డి, జర్నలిస్టులు మల్లె్లపల్లి లక్ష్మయ్య, వీక్షణం వేణుగోపాల్, సీఎం సీపీఆర్వో నర్సింగరావు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి తదితరులు హనుమంతరావు భౌతిక కాయానికి నివాళులర్పించారు. హనుమంత రావు మృతిపట్ల ఇండియన్ జర్నలిస్టు యూని యన్(ఐజేయూ), తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (టీయూ డబ్ల్యూజే) సంతాపం వ్యక్తం చేశాయి. ఐజేయూ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్, సీనియర్ నాయకులు కె.శ్రీని వాస్‌రెడ్డి, టీయూ డబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కె.విరహత్ అలీ హను మంతరావు భౌతిక కాయానికి నివాళులర్పిం చారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని గాంధీ మెడికల్ కళాశాలకు దానం చేశారు. హనుమంతరావు మృతి పట్ల సీపీఐ, సీపీఎం, యూసీసీఆర్ (ఎంఎల్) సంతాపాన్ని ప్రకటిం చాయి. విశాలాంధ్ర విలేకరిగా జర్నలిస్టు జీవితాన్ని ప్రారంభించి సుదీర్ఘకాలం వివిధ పత్రికల్లో పనిచేశారని, ఫ్రీలాన్సర్‌గా నేటితరం జర్నలిస్టులకు ఆదర్శంగా నిలిచారని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. తుదిశ్వాస వరకు సమాజంలో మార్పు కోసం కృషి చేశారని సీపీఎం నేత జి.నాగయ్య పేర్కొన్నారు. ఆయన మరణం జర్నలిస్టులు, కమ్యూనిస్టు ఉద్యమానికి, సాహితీలోకానికి తీరని లోట న్నారు. ఆయన మరణంతో కమ్యూనిస్టులు నిజమైన మిత్రుడిని కోల్పోయారని యూసీసీఆర్ఐ (ఎంఎల్) కార్యదర్శి వినోద్ సంతాపం తెలిపారు. హనుమంతరావు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో కె.ప్రతాపరెడ్డి (సీపీఐ), నరసింహారావు, శ్రీనివాస్ (సీపీఎం) తదితరులున్నారు. హనుమంతరావు ఓ విప్లవకారుడు హనుమంతరావు నిజమైన విప్లవకారుడని, ఆయన మరణానికి ప్రగాఢ సానుభూతిని ప్రక టిస్తున్నామని భారత కమ్యూనిస్టు విప్లవకా రుల సమైక్యతా కేంద్రం (మార్కిస్టు–లెనినిస్టు) ప్రకటించింది. వైఎస్ జగన్ సంతాపం ప్రముఖ జర్నలిస్టు వి.హనుమంతరావు మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సుదీర్ఘ జర్నలిస్టు జీవితంలో వయసు పైబడిన తరుణంలో కూడా ఆయన చురుగ్గా ఉంటూ క్రియాశీలంగా వృత్తిని కొనసాగించారని జగన్ శ్లాఘించారు. ఆర్థిక పరమైన, బడ్జెట్ విశ్లేషణలకు హనుమంతరావు పేరెన్నికగన్న వ్యక్తి అని కొనియాడుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని జగన్ ఆకాంక్షించారు. -
'నెహ్రూను కావాలనే తక్కువ చేస్తున్నారు'
హైదరాబాద్: ఉద్దేశ పూర్వకంగానే ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం నెహ్రూను కించపరుస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. నెహ్రూ 127వ జయంతి సందర్భంగా అబిడ్స్ లోని నెహ్రూ విగ్రహానికి నివాళులర్పించిన ఆయన అనంతరం నిరసన దీక్షకు దిగారు. స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రను, దేశానికి నెహ్రూ అందించిన సేవలను మోదీ ప్రభుత్వం మర్చిపోయిందని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఆయనకు నిమ్మరసం ఇచ్చి మరో కాంగ్రెస్ పార్టీ నేత భట్టి విక్రమార్క దీక్షను విరమింపజేశారు. అనంతరం భట్టి మాట్లాడుతూ నెహ్రూ ఇమేజ్ ను తగ్గించేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. బాలల దినోత్సవానికి ఇచ్చిన ప్రకటనల్లో నెహ్రూ ఫొటో లేకపోవడం చూస్తుంటే ఆయనను తక్కువ చేయాలనే కుట్ర మోదీ ప్రభుత్వం చేస్తుందని తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కేసీఆర్ సొంత డబ్బుతో చేయించాల్సింది: వీహెచ్
హైదరాబాద్: భద్రకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్పించిన బంగారు కిరీటాన్ని ప్రజల సొమ్ముతో కాకుండా ఆయన సొంత డబ్బుతో చేయించి ఉండాల్సిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ప్రజల సొమ్మును మొక్కుల కోసం ఎలా ఉపయోగిస్తారు అని వీహెచ్ ప్రశ్నించారు. కులాల సర్వే చేయించిన కేసీఆర్ ఆ వివరాలను బయటపెట్టాలని వీహెచ్ డిమాండ్ చేశారు. బీసీ కమిషన్ ఏర్పాటుతో వెనుకబడిన వర్గాలకు ఒరిగేదేమీ లేదని, జనాభా దామాషా ప్రకారం బీసీల సంక్షేమానికి నిధులివ్వాలన్నారు. అలాగే.. బీసీలకు క్రిమిలేయర్ పరిధిని రూ. 15 లక్షలకు పెంచాలని వీహెచ్ డిమాండ్ చేశారు. -
కేసీఆర్ పాలనలో నగరం సర్వనాశనం
దోమలగూడ: అరవై ఏళ్లుగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందిన హైదరాబార్ నగరం కేసీఆర్ రెండున్నర ఏళ్ల పాలనలో కుప్ప కూలిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గ్రేటర్ సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా కాంగ్రెస్ నేత వి హనుమంతరావు బుధవారం ఇందిరాపార్కు వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చే పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నగరాన్ని విశ్వనగరంగా మారుస్తామని, డల్లాస్, న్యూయార్కులను తలదన్నేలా తీర్చిదిద్దుతామని ప్రచారం చేశారన్నారు. ప్రస్తుతం ప్రజలు మ్యాన్‌హోల్‌లో పడి కొట్టుకుపోతున్నారని, బయటికి వెళ్లిన వారు తిరిగి ఇంటికి వస్తామో, రామో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. పాలనానుభవం లేని ప్రభుత్వం, నాయకులే ఇందుకు కారణమన్నారు. అసెంబ్లీ ముందు నుంచి మెట్రో వద్దని అడ్డుకున్న ముఖ్యమంత్రి అదే డిజైన్‌కు అనుమతి ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. చారిత్రకమైన ఉస్మానియా, సచివాలయాలను çకూల్చాలనుకోవడం దారుణమన్నారు. పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజల అవసరాలను పట్టించుకోవడం లేదన్నారు. మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా విఫలమయ్యాడన్నారు. జీహెచ్ఎంసీలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, కార్పొరేటర్లకు నిధులు కేటాయించడం లేదన్నారు. గ్రేటర్ హైదరాబాద్ గంతల హైదరాబాద్‌గా మారిందని, గత కమిషనర్ సోమేష్‌కుమార్ వైఖరి, అవినీలే ఇందుకు కారణమని ఆరోపించారు. వి హనుమంతరావు మాట్లాడుతూ కార్పొరేటర్లకు నిధులు లేక పనులు చేయడం లేదని, మేయర్‌కు ప్రభుత్వాన్ని నిధులు అడిగే ధైర్యం లేదన్నారు. అసదుద్దీన్ సోదరులు కూడా నగర సమస్యలపై నోరు మెదపక పోవడం దారుణమన్నారు. సీఎం రోజుకో కొత్త ఆలోచన ముందుకు తెస్తున్నారని, జిల్లాల విభజన పేరుతో ప్రజల మధ్య తగాదాలు పెడుతున్నారని ఆరోపించారు.కోదండరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ ఆదాయం ఎక్కడికి వెళుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. విశ్వనగరం ప్రక్రియను పోలీసులకు వాహనాలు, ఇంటింటికి చెత్త డబ్బాలకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మాజీఎమ్మేల్సీ సుధాకర్‌రెడ్డి, నాయకులు కూన శ్రీశైలంగౌడ్, సుధీర్‌రెడ్డి, కార్తీకరెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, ఇందిరాశోభన్, అనిల్‌కుమార్ యాదవ్, రమ్యారావు, నేరెళ్ల శారద తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరాపార్క్ వద్ద వీహెచ్ ధర్నా
హైదరాబాద్ : భాగ్యనగరంలో గతంలో గుంత చూపిస్తే రూ. వెయ్యి ఇస్తామని టీఆర్ఎస్ నేతలు చెప్పారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) ఆరోపించారు. ఇప్పుడు నగరమంతా గుంతలే దర్శనమిస్తున్నాయని ఆయన విమర్శించారు. నగరంలోని రహదారుల దుస్థితిపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు బుధవారం ఇందిరా పార్కు వద్ద ధర్నా చేపట్టారు. నగర జీవి ఇంటి నుంచి బయటకొస్తే మళ్లీ ఇల్లు చేరే వరకు భరోసా లేదని వి.హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
‘నయీం కేసును సీబీఐకి అప్పగించాలి’
హైదరాబాద్: కేంద్రప్రభుత్వం నుంచి నిధులు సాధించడం చేతకాక అప్పులుచేసి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్‌రావు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో బుధవారం వి. హనుమంతరావు విలేకరులతో మాట్లాడుతూ... ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంటే సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు తెలంగాణకు ఎందుకు సాధించలేకపోతున్నారని అడిగారు. నాబార్డు నుంచి 7వేల కోట్లు అప్పు తెచ్చామని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని వీహెచ్ విమర్శించారు. ప్రజలపై అప్పుల భారాన్ని మోపుతున్నామనే సోయి కేసీఆర్‌కు, హరీష్‌రావుకు లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. కార్పొరేట్లకు 50వేల కోట్లు మాఫీ చేసి, రైతులను, వ్యవసాయాన్ని పట్టించుకోవడంలేదన్నారు. రాష్ట్రంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. నయీం కేసు విచారణ సిట్‌తో సాధ్యం కాదని, నయీం కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాధ్సింగ్కు లేఖ రాసినట్టుగా వీహెచ్ ఈ సందర్బంగా తెలిపారు. -
కేసీఆర్ మాటలు నమ్మొద్దు: వీహెచ్
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: కేసీఆర్ చెబుతున్న మాటలు నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వి.హన్మంతరావు అన్నారు. గతంలో కేసీఆర్ చెప్పిన మాటలను ఇప్పుడు చెబుతున్న వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సామాజిక తెలంగాణ సాధన సమితి ఆధ్వర్యంలో ధూం..ధాం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. కొట్లాడి సాదించుకున్న తెలంగాణ మరొకరి చేతుల్లోకి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నేను హన్మంత రెడ్డిని అయితే ఆనాడే ముఖ్యమంత్రిని ఆయ్యేవాడినని అన్నారు. తెలంగాణ తెచ్చింది మేమైతే ప్రజలు టీఆర్ఎస్కు ఓటు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయినికి హోం మంత్రి నామ మాత్రమేనని ఒక్క కానిస్టేబుల్ కూడా ట్రాన్్సఫర్ కాడని, అందరు మంత్రులు పేరుకు మాత్రమే ఉన్నారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి చేసిన పొరపాట్ల వల్లే తమ పార్టీ దెబ్బతినిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ బలహీన వర్గాలకు చెందిన వారికి మంత్రి పదవులు ఇచ్చినప్పటికీ వారిని బలహీనులను చేసి పాలిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ వేదిక చైర్మన్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. ఉద్యమం చేయని వారికి మంత్రి పదవులు ఇచ్చి ఉద్యమంలో పాల్గొన్న వారిని పక్కకు పెట్టారని విమర్శించారు. కేసీఆర్ బాహుబలి కావచ్చు కాని ఇక్కడ అందరు కట్టప్పలు ఉన్నారని మర్చిపోవద్దని హెచ్చరించారు. తెలంగాణ సాధన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ ప్రభంజన యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పిఎల్.విశ్వేర్‌రావు, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, చంద్రన్న, పాశం యాదగిరి, రాములు తదితరులు పాల్గొన్నారు. ఏపూరి సోమన్న, జంగ్ ప్రహ్లాద్ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. సమావేశంలో అభివాదం చేస్తున్న వీహెచ్ తదితరులు -
'కేసీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారు'
హైదరాబాద్: కాంగ్రెస్ నాయకులపై తెలంగాణ సీఎం కేసీఆర్ అహంకార ధోరణితో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. కేసులు పెట్టి జైల్లో పెడతా, చిప్ప కూడు తినిపిస్తా అని కేసీఆర్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. ప్రాణహిత - చేవేళ్ల జాతీయ ప్రాజెక్టు కోసం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. జైలుకు పోవటం కాంగ్రెస్ కార్యకర్తలకు కొత్తకాదు అన్నారు. మహారాష్ట్రతో జరిగిన ఒప్పందంతో ఆ రాష్ట్రానికి లాభం చేకూర్చి ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై ఒక్క కేసు పెట్టినా.. అది టీఆర్ఎస్ పతనానికి నాంది అవుతుందని హెచ్చరించారు. -
'క్రీడల్లో రాజకీయ జోక్యం వద్దు'
హైదరాబాద్: ప్రభుత్వాలు క్రీడలపై దృష్టి పెట్టి యువతను ప్రోత్సహించాలన్నారు. సోమవారం ఆయనిక్కడ మాట్లాడుతూ.. క్రీడా సంఘాలలో రాజకీయ నాయకుల జోక్యం ఉండకూడదన్నారు. సింధూని ఆదర్శంగా తీసుకుని యువత ఆటల పట్ల మక్కువ పెంచుకోవాలన్నారు. మరో వైపు హీరో పవన్ కల్యాణ్ ఏపీ ప్రత్యేక హోదాపై పోరాడాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్పై కేసీఆర్ మాట్లాడినతీరు సరిగా లేదన్నారు. ప్రాణహిత చేవేళ్ల డిజైన్ మార్చడం వల్ల జాతీయ హోదా కోల్పోవడం నిజమా? కాదా? అని కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. -
జైరాం రమేశ్ పై చర్యలు తీసుకోవాలి: వీహెచ్
ఆదిలాబాద్: సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీని సీఎం కేసీఆర్ మోసం చేశారని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు విమర్శించారు. రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ మంగళవారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ను వదిలివెళ్లినవారు పార్టీలోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనపై జైరాం రమేశ్ ను ఎవరు పుస్తకం రాయమన్నారని ఆయన ప్రశ్నించారు. జైరాం రమేశ్ పై హైకమాండ్ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీకే అరుణ మాట్లాడుతూ.. ఒకేసారి రైతు రుణాలు మాఫీ చేయకుండా విడతలవారీగా చేస్తూ అన్నదాతలను కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు. ఇలాంటి తప్పుడు హామీలవల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. మోసపూరిత హామీలు ఇచ్చివుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదని పేర్కొన్నారు. -
పీఎం అపాయింట్మెంట్ ఇవ్వకుంటే..
హైదరాబాద్: క్రిమిలేయర్ కారణంగా బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు శుక్రవారం హైదరాబాద్‌లో ఆరోపించారు. ఈ అంశంపై త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలువనున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని మోదీ అపాయింట్మెంట్కు అధికారులు అవకాశం ఇవ్వకుంటే పార్లమెంట్ వద్దనున్న గాంధీ విగ్రహం వద్ద కూర్చుని నిరసన తెలుపుతానని వీహెచ్ స్పష్టం చేశారు. క్రిమిలేయర్ కారణంగా రాష్ట్రంలో, కేంద్రంలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 27 శాతం రిజర్వేషన్ కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన బీసీ సంఘాలకు సూచించారు. రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో మంచి ఫ్యాకల్టీ, డైరెక్టర్ లేక సిలబస్ పూర్తి కాలేదని విమర్శించారు. -
నాసిరకంగా పుష్కరాల పనులు :వీహెచ్
హైదరాబాద్ : రాష్ట్రంలో కృష్ణా పుష్కరాల పనులు నాసిరకంగా జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీహెచ్ ఆరోపించారు. దీనిపై గవర్నర్ స్పందించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. గుళ్లు గోపురాలు తిరగడానికి తప్ప ఆయనకు వేరే పనిలేదని ఎద్దేవా చేశారు. భవానీ ఘాట్ వద్ద నిర్మించిన బ్రిడ్జి నాసిరకంగా ఉందని... పిల్లర్ పడిపోయినా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగుతోన్న పుష్కర పనులపై గవర్నర్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. పుష్కర పనులు కాంట్రాక్ట్ తీసుకున్న సోమా కంపెనీ ఎవరిదో బయటకు రావాలని వీహెచ్ అన్నారు.గవర్నర్‌కు ఇచ్చే వినతి పత్రాలన్నీ చెత్త బుట్టలోకి చేరుతున్నాయని వీహెచ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గవర్నర్ ఉన్నంత వరకు న్యాయం జరగదన్నారు. ఛలో మల్లన్న సాగర్‌కు తనను పిలవలేదని కాంగ్రెస్ నాయకులపై వీహెచ్ మండిపడ్డారు. నేను మల్లన్నసాగర్‌కు వెళ్తే.. ఎవరిని అడిగి వచ్చారని సునీతాలక్ష్మారెడ్డి అనడం దారుణమని వీహెచ్ వ్యాఖ్యానించారు. స్థానిక నాయకులను ఆమె బెదిరించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. జిల్లాకు చెందిన నాయకులే నన్ను వద్దని అన్నప్పుడు నేను ఎందుకు వెళ్లాలని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘తాగుబోతుల తెలంగాణగా మార్చారు’
బంగారు తెలంగాణగా మార్చుతామంటున్న సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారని రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు పేర్కొన్నారు. మద్యం ఆదాయాన్ని తమిళనాడు, కేరళ రాష్ట్రాల పత్రికలకు ప్రకటనలిచ్చి గొప్పలు పోతున్నారని విమర్శించారు. ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్‌లోని పంజాబ్ చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల విషయమై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ విషయంలో నాలుగు గ్రామాల రైతులపై నాలుగువేల గ్రామాలను ఏకం చేస్తామని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యలను తప్పుబట్టిన వీహెచ్ రైతులకు, రైతులకు మధ్య కోట్లాట పెడుతున్నారని విమర్శించారు. -
రాజమండ్రిలో వీహెచ్ అరెస్టు
కాపుల సంక్షేమం కోసం ఆమరణ దీక్షకు దిగిన మాజీమంత్రి ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలపడానికి వచ్చిన కాంగ్రెసు నేత వి. హనుమంతరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం స్థానిక ఆనంద్ రిజెన్సీ రూమ్‌లో ఉన్న వి. హనుమంతరావును రాజమండ్రి పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
పవన్ కల్యాణ్ మద్దతు తెలపాలి: వీహెచ్
హైదరాబాద్ : కాపులను బీసీల్లో చేర్చాలంటూ చేస్తున్న ఉద్యమానికి జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ మద్దతు తెలపాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కాపుల రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడి సమస్య పరిష్కరించాలన్నారు. కాపు ఉద్యమాన్ని అణిచివేస్తే, చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వీహెచ్ హెచ్చరించారు. కాగా తుని ఘటనలో కేసులుండవని చెప్పిన ప్రభుత్వం మాటతప్పి అరెస్టులకు పాల్పడుతోందని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిన్న(మంగళవారం) ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈరోజు సాయంత్రం లోగా కేసులు ఉపసంహరించుకోకపోతే ఈనెల 9 నుంచి దీక్షకు ఉపక్రమిస్తానని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకపోతే రేపు ఉదయం 9 గంటలకు కిర్లంపూడిలోని తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు. -
కేసీఆర్ దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయ్: వీహెచ్
నిజామాబాద్ సిటీ: కేసులు పెట్టి అరెస్టు చేయిస్తానన్న సీఎం కేసీఆర్ దమ్ముంటే ముందు తనను అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత్‌రావు(వీహెచ్) సవాల్ విసిరారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ పని ఖతం అయిపోయిందని కేసీఆర్ అంటున్నారని, రాబోయే రెండు సంవత్సరాలలో టీఆర్ఎస్ పనే ఖతం కాబోతోందన్నారు. ఏ పార్టీలకైనా ఒడిదుడుకులు సహజమని కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ బెదిరింపులకు ఏ నాయకుడు భయపడవద్దని ధైర్యంగా ఉండాలని, తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు. -
రాజ్యసభ ఎన్నికల బరిలో వీహెచ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంనుంచి రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో పోటీచేయాలని పీసీసీ నిర్ణయించింది. సిట్టింగ్ సభ్యుడైన వి.హన్మంతరావునే పార్టీ అభ్యర్థిగా పోటీలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనికి అనుగుణంగానే ఏఐసీసీకి, పీసీసీ నివేదికను కూడా పంపింది. వి.హన్మంతరావు, ఇటీవలే టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన గుండు సుధారాణి పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీయే ఈ రెండుస్థానాలను గెలుచుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. అయినా గెలుపోటములకు సంబంధం లేకుండా పోటీకి దిగాలని పీసీసీ భావిస్తోంది. -
'చంద్రబాబు వ్యాఖ్యలు గాయపరిచాయి'
ఢిల్లీ: పాపాలు చేసిన వాళ్లే దేవాలయాలకు వెళ్తారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు మండిపడ్డారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందర్నీ గాయపరిచాయని, దీనిపై ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు పాపాలు చేసిన వాళ్లే దేవాలయాలకు వెళ్తారని చెప్పడం అమానుషమన్నారు. మన రాష్ట్ర గవర్నర్ తరచు దేవాలయాలకు వెళ్తున్నారు?, దానికి చంద్రబాబు ఏమి చెప్తారని ప్రశ్నించారు. అయ్యప్ప భక్తులను అవమానపరిచే విధంగా చంద్రబాబు మాట్లాడరని వీహెచ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా, రాజ్యసభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత సంప్రదాయాన్ని పాటించాలన్నారు. గతంలో కేశవరావుకు మద్దతిచ్చి రాజ్యసబ ఎన్నికల్లో గెలిపించామని, ఈసారి కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ మద్దతివ్వాలని వీహెచ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి ఎన్నికల్లో రాజ్యసభ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశానన్నారు. ఒకవేళ సోనియా అవకాశమిస్తే పోటీకి దిగుతానని వీహెచ్ తెలిపారు. -
భూ కబ్జాలపై ప్రభుత్వం దృష్టి సారించాలి: వీహెచ్
సాక్షి, న్యూఢిల్లీ: భూ మాఫియా ద్వారానే అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, భూ కబ్జాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యవహరించాలని ఎంపీ వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రెవెన్యూ శాఖలో భారీగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల్లో జరుగుతున్న అవకతవకలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొరడా ఝలిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా భూ కబ్జాల విషయంలో ఎలాంటి మార్పు లేదన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలు పార్టీ మారడం తప్ప ఏమీ జరగలేదని ఎద్దేవా చేశారు. ప్రధానిగా రాజీవ్‌గాంధీ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు గుర్తు చేసేందుకు రాష్ట్రమంతా పర్యటిస్తానని తెలిపారు. -
‘హోదా’ కావాలంటే కేంద్రం నుంచి తప్పుకోవాలి
టీడీపీకి ఎంపీ వీహెచ్ సలహా సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి టీడీపీ తప్పుకోవాలని, ప్రధానమంత్రికి తూతూ మంత్రంగా లేఖ రాస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకుంటే ప్రత్యేక హోదా దానంతట అదే వస్తుందన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సందర్భంగా రాజ్యసభలో ప్రత్యేక హోదా కోసం వెంకయ్యనాయుడు చాలా మాట్లాడారని, ఆయన ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ట్విట్టర్లో కూతలు కూసే పవన్ కల్యాణ్, కాంగ్రెస్‌పై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకుంటే అతనికే మంచిదన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడి రాజకీయంగా పలుచన కావొద్దన్నారు. -
సమన్వయ కమిటీ అంత పెద్దదా?: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ సమన్వయ కమిటీలో 31 మందిని నియమించి దానికి విలువ లేకుండా చేశారని ఎంపీ వి.హనుమంతరావు విమర్శించారు. సోమవారం వీహెచ్ విలేకరులతో మాట్లాడుతూ.. అంత పెద్ద సమన్వయ కమిటీలోని సభ్యుల మధ్య సమన్వయం సాధించడం కష్టమన్నారు. అలాంటిది ఈ కమిటీ టీపీసీసీని సమన్వయమేం చేస్తుందన్నారు. -
హైకోర్టులో వీహెచ్ రచ్చ
♦ ‘హెచ్‌సీయూ’ ఘటనపై పిటిషన్ విచారణలో గందరగోళం ♦ తమ న్యాయవాదిని ధర్మాసనం నిలదీయడంతో అసహనం ♦ నేను ఎంపీని.. కావాలంటే అరెస్ట్ చేసుకోండి ♦ జైలుకు కూడా వెళతానంటూ గ్యాలరీ దాటిన వీహెచ్ ♦ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం.. వెనక్కి తగ్గిన వీహెచ్ సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ వీసీగా అప్పారావుకు తిరిగి బాధ్యతలు అప్పజెప్పడంపై దాఖలైన పిటిషన్ విచారణలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు గందరగోళం సృష్టించారు. హైకోర్టులోనే గట్టిగా మాట్లాడుతూ.. గ్యాలరీ దాటి ముందుకెళ్లేం దుకు ప్రయత్నించారు. న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కితగ్గారు. ఇక ఈ పిటిషన్‌కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వీసీ అప్పారావు, సైబరాబాద్ కమిషనర్లకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. విచారణను జూన్ 20కి వాయిదా వేస్తూ... తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్‌సీయూ వీసీగా అప్పారావు తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ అనుమతివ్వడాన్ని సవాలు చేస్తూ ఎంపీ వి.హనుమంతరావు పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది సి.దామోదర్‌రెడ్డి స్పం దిస్తూ... హెచ్‌సీయూలో విద్యార్థి ఆత్మహత్య ఘటన కేసులో వీసీ అప్పారావు మొదటి నిందితుడిగా ఉన్నారన్నారు. దాంతో కేంద్రం ఆయనను సస్పెండ్ చేసిందని, దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారని పేర్కొన్నారు. ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టడంతో విద్యార్థుల హక్కులు ప్రభావితమవుతున్నాయన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. వీసీని సస్పెండ్ చేశారా, సెలవుపై వెళ్లారా అనే స్పష్టత లేకుంటే ఎలాగని నిలదీసింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాజ్యం దాఖలు చేశామని న్యాయవాది చెప్పగా... విద్యార్థుల ప్రయోజనాలను తాము పరిరక్షిస్తామని, దాని గురించి పిటిషనర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి వీసీగా కొనసాగరాదని ఏ చట్ట నిబంధనలు చెబుతున్నాయో చెప్పాలని ప్రశ్నించింది. భావోద్వేగాలు, మీడియా కథనాల ఆధారంగా కేసులను విచారించడం సాధ్యం కాదని పేర్కొంది. వీహెచ్ రగడ.. అసలు ఈ వ్యాజ్యంలో మీరు ఏం కోరుతున్నారో కూడా చెప్పాలని న్యాయవాదిని ధర్మాసనం పలుమార్లు ప్రశ్నించింది. ఈ సమయంలో కక్షిదారుల గ్యాలరీలో ఉన్న వీహెచ్ లేచి తనదైన యాసలో పెద్దగా మాట్లాడడం ప్రారంభించారు. ఓ వ్యక్తి కోసం 6 వేల మంది విద్యార్థులు రోడ్డుపై ఉన్నారని అరుస్తూ గ్యాలరీ దాటి వచ్చే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో న్యాయవాదులు వారించడంతో వెనక్కి తగ్గారు. ధర్మాసనం మళ్లీ న్యాయవాదిని స్పష్టత కోరడంతో వీహెచ్ సహనం కోల్పోయారు. తాను ఎంపీనని, తనను అరెస్ట్ చేసుకోవచ్చని, జైలుకు కూడా వెళతానంటూ గ్యాలరీ దాటి ముందుకెళ్లారు. తన వాదన వినాలని కోరారు. దీంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులను పిలిచేందుకు సిద్ధమైంది. ఈ సమయంలో న్యాయవాదులు వీహెచ్‌ను వారించడంతో వెనక్కి వెళ్లారు. అయితే పోలీసులు కోర్టు హాల్లోకి రావడం, వీహెచ్ మరో ద్వారం నుంచి బయటకు వెళ్లిపోవడం జరిగాయి. అనంతరం ధర్మాసనం ఈ పిటిషన్లో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. -
పార్లమెంట్ వద్ద నేడు వీహెచ్ మౌనదీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల్లో ఓబీసీల రిజర్వేషన్లు సక్రమంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఓబీసీ పార్లమెంటరీ ఫోరం కన్వీనర్, కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు సోమవారం మౌనదీక్ష చేపట్టనున్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఓబీసీల రిజర్వేషన్ల అమలులో కేంద్రానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బ్యాంక్‌ల రుణాలు ఎగవేసిన విజయ్‌మాల్యాతో పాటు కేంద్రమంత్రి సుజనాచౌదరి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై కూడా కేంద్రం చర్యలు తీసుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు. -
కేసీఆర్ దిమ్మ తిరిగేలా తీర్పునివ్వాలి
హనుమంతరావు కాజీపేట (వరంగల్): టీఆర్ఎస్ అభ్యర్ధులను ఓడించి సీఎం కేసీఆర్ దిమ్మతిరిగేలా వరంగల్ ప్రజలు తీర్పునివ్వాలని ఎంపీ హన్మంతరావు పిలుపునిచ్చారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాజీపేట పట్టణంలో శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ వీహెచ్ వందలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అభ్యర్థులను పరిచయం చేసి చేతిగుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ ప్రచారంలో డీసీసీబి చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ గుండె రామారావు, మాజీ ఎమ్మెల్యే బి.ఆరోగ్యం పాల్గొన్నారు. -
రోహిత్ తల్లికి గుంటూరులో ఇల్లు ఇవ్వండి
- ముఖ్యమంత్రికి ఎంపీ వీహెచ్ లేఖ న్యూఢిల్లీ ఆత్మహత్య చేసుకున్న సెంట్రల్ వర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధికకు గుంటూరులో ఇల్లు నిర్మించి ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడికి మంగళవారం ఒక లేఖ రాశారు. దళితులపై వివక్ష కారణంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఎంత పరిహారం ఇచ్చినా ఆ మాతృమూర్తికి జరిగిన నష్టాన్ని భర్తీచేయలేమని తెలియజేశారు. అందువల్ల మానవీయ కోణంలో ఆమెకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.