వీహెచ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్న నాయకులు
సాక్షి, నిజామాబాద్‌అర్బన్: డిసెంబర్ 12 తరువాత కేసీఆర్ తన ఫామ్ హౌజ్ కే పరిమితమవుతారని రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హన్మంత్‌రావు విమర్శించారు. ఆదివారం నగరంలోని వ్యాస్‌భవన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడా రు. మహాకూటమిని చూసి భయపడి కేసీఆర్ అనవసరమైన విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని విమర్శించారు. కేసీఆర్ ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో కుమ్మకై డిసెంబర్‌లోనే ఎన్నికలు ఏర్పాటు చేసుకున్నాడని ఆరోపించారు. బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య అవగాహన ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో దోపీడీ, దౌర్జన్యం కొనసాగిస్తుందని దీనిని రూపుమాపడానికి మహాకూటమి ఏర్పడిందన్నారు.
కాంగ్రెస్‌లో పలువురు చేరిక
వి.హన్మంత్‌రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్టీల నాయకులు చేరారు. టీఆర్‌ఎస్ నుంచి భక్తవత్సలం, దిగంబర్‌పవర్, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు శ్యామేందర్, తెలుగు యువత మాజీ నగర అధ్యక్షుడు రమేశ్, శ్రీనివాస్, బీజేపీ నుంచి వినోద్‌కుమార్, బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో అర్బన్ అభ్యర్థి తాహెర్‌బిన్, టీపీసీసీ కార్యదర్శులు మహేశ్‌కుమార్‌గౌడ్, గడుగు గంగాధర్, నగర అధ్యక్షుడు కేశవేణు, పార్లమెంట్ యూత్ అధ్యక్షుడు పంచరెడ్డిచరణ్, కాంగ్రెస్ నగర ఎస్టీ సెల్ చైర్మన్ సుభాష్‌జాదవ్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వేణు పాల్గొన్నారు.
ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదు
సాక్షి, పెర్కిట్(ఆర్మూర్): ఎన్నికలకు ముందు కేసీఆర్ చేసిన వాగ్ధానాలను నిలబెట్టుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హన్మంత్ రావు ఆరోపించారు. ఆర్మూర్ మండలం పెర్కిట్‌లో ఆదివారం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ మాటలు అబద్దాల మూటలన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో నంబరు వన్ చేస్తానని చెప్పిన కేసీఆర్ దోచుకోవడంలో, దాచుకోవడంలోనే ముందున్నారని ఆరోపించారు. అలాగే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆస్తులు గత ఎన్నికలతో పోల్చితే ప్రస్తుతం భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉందన్నారు. ఈ నెల 29న ఆర్మూర్‌లో నిర్వహించే రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకుల లలిత, నాయకులు మహేశ్ కుమార్ గౌడ్, కంచెట్టి గంగాధర్, రమేశ్ రెడ్డి, పీసీ భోజన్న, వైస్ ఎంపీపీ ఇట్టెడి భాజన్న, లక్కారం నారాయణ, ఏలేటి రవికాంత్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment