బాబుకు బుద్ధి చెప్పాలి: వీహెచ్
కాపులను మోసం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎంపీ వి.హనమంతరావు అన్నారు.
విజయవాడ: కాపులను మోసం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎంపీ వి.హనమంతరావు అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..ముద్రగడ పాదయాత్రను అణగదొక్కాలని చంద్రబాబు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేయలేదా అని ప్రశ్నించారు.
కాపు కులంలో హోంమంత్రి చినరాజప్ప చెడపుట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కాపులేమైనా ఉగ్రవాదులా...లేక దొంగలా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేసే హక్కు అందరికి ఉందని, చంద్రబాబుకు కలలో కూడా ముద్రగడనే కనిపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు కాపులు బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జోస్యం చెప్పారు.