
మీరు అపర కోటేశ్వరుడు ఎలా అయ్యారో ప్రజలకు చెప్పండి
చంద్రబాబుపై ముద్రగడ ధ్వజం
కాకినాడ: అధికారం అనే ఆకలితో చంద్రబాబు నాయుడు అలమటిస్తున్నాడని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకుడు ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. కాపు ఉద్యమాన్ని అణిచివేసి... తన కుటుంబాన్ని వేధించిన ఘనుడు చంద్రబాబు నాయుడు అంటూ మండిపడ్డారు. అటువంటి చంద్రబాబుతో పవన్ కల్యాణ్ జత కడతారా? అంటూ ముద్రగడ ప్రశ్నించారు.
చంద్రబాబు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ పెంకుటింటికి మరమత్తులు చేయించుకోలేదా? ఎమ్మెల్యే అయ్యేంత వరకూ పెంకుటింట్లో ఉన్న చంద్రబాబు నాయుడు.. ఉన్న పళంగా అపరకోటీశ్వరుడు అయిపోయాడు. చంద్రబాబు ఎలా అపర కోటీశ్వరుడు అయ్యారో ప్రజలకు చెప్పమని కోరుతున్నాను.
అధికారం అనే ఆకలితో చంద్రబాబు అలమటిస్తున్నాడు.వయస్సు పెద్దదైంది... ఆబద్దాలు ఆపేయండి. జగన్‌కు ఓటేయద్దని చెప్పే హక్కు చంద్రబాబుకు లేదు. పేదల పెన్నిధి జగన్. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. కుమిలి కుమిలి చనిపోయేలా చేశారు. రాష్ట్రంలో మీరు స్వేచ్చగా తీరుగుతున్నారు. మీరు, మీ సతీమణీ,.కుమారుడుకోడలు..వియ్యంకుడు,దత్తపుత్రుడుస్వేచ్చగాతిరుగుతున్నారు.
ఇంకేమి స్వేచ్చ కావాలో తమ సతిమణీని అడగండి.కాపు ఉద్యమాన్ని అణిచివేసి.. .నా కుటుంబాన్ని వేధించిన చంద్రబాబుతో పవన్ జతకడతారా? నన్ను ప్రేమించే జగన్‌తో నేను జతకట్టకూడదా?, పవన్ సినిమా డైలాగ్‌లు చదువుతున్నారు.
సినిమాల్లోను..రాజకీయాల్లోను పవన్ నటించేస్తున్నారు. యువతను పాడు చేయకండి..వారి జీవితాలను నాశనం చేయకండి.యువత జీవితాల్లో చీకటి నింపకండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని యువతను కోరుతున్నాను.సినిమా హీరోలతో తిరిగి మీ బంగారు భవిష్యతు పాడుచేసుకోకండి.మీ కుటుంబాలు నాశనం అవకుండా యువత మేలుకోండి.