2014 ఎలక్షన్లో బాబు ఇచ్చిన హామీలనే ముద్రగడ అడుగుతున్నారని మాజీ ఎంపీ వి.హనుమంతరావు వెల్లడించారు.
భీమవరం: 2014 ఎలక్షన్లో బాబు ఇచ్చిన హామీలనే ముద్రగడ అడుగుతున్నారని మాజీ ఎంపీ వి.హనుమంతరావు వెల్లడించారు. సోమవారం ఆయన భీమవరంలో విలేకరులతో మాట్లాడుతూ..ఏపీ సీఎం చంద్రబాబుకు కాపులపై ఎందుకు కక్ష సాధిస్తున్నాడని ప్రశ్నించారు. కాపు ఉద్యమనేత ముద్రగడ ఏమైనా ఉగ్రవాదా అని సూటిగా అడిగారు. ఇది ప్రజాస్వామ్యమా, లేక నియంత రాజ్యమా అని మండిపడ్డారు.
తుని సంఘటన చంద్రబాబు చేసిన కుట్ర అని అన్నారు. ట్రాక్ పై జనం ఉండగా రైలు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈ విషయం రైల్వే అధికారులకు తెలియదా అని అడిగారు. బడుగు బలహీన వర్గాలను చంద్రబాబు ప్రభుత్వం అణచి వేస్తోందని విమర్శించారు. 2019లో బలహీన వర్గాల ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెబుతారని ఆయన జోస్యం చెప్పారు. ముద్రగడ పద్మనాభం పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. తుందుర్రు, గరగపర్రుకు రాహూల్ గాంధీని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానని తెలిపారు.