
సాక్షి, నల్గొండ : హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిని ఎన్‌కౌంటర్ చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హాజీపూర్ బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హాజీపూర్ సందర్శించి, బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు. రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హాజీపూర్ సంఘటన పట్ల సీఎం కేసీఆర్ బాధపడ్డారని చెప్పిన కేటీఆర్, బాధితులను ఆదుకునేందుకు ఎందుకు ముందు రావడం లేదని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment