‘తాగుబోతుల తెలంగాణగా మార్చారు’ | VH comments on KCR Government | Sakshi
Sakshi News home page

‘తాగుబోతుల తెలంగాణగా మార్చారు’

Published Mon, Jun 20 2016 6:18 PM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM

VH comments on KCR Government

 బంగారు తెలంగాణగా మార్చుతామంటున్న సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారని రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు పేర్కొన్నారు. మద్యం ఆదాయాన్ని తమిళనాడు, కేరళ రాష్ట్రాల పత్రికలకు ప్రకటనలిచ్చి గొప్పలు పోతున్నారని విమర్శించారు.

ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్‌లోని పంజాబ్ చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల విషయమై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ విషయంలో నాలుగు గ్రామాల రైతులపై నాలుగువేల గ్రామాలను ఏకం చేస్తామని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యలను తప్పుబట్టిన వీహెచ్ రైతులకు, రైతులకు మధ్య కోట్లాట పెడుతున్నారని విమర్శించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement