![CLP Leader Mallu Bhatti Vikramarka Comments On TRS Government - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/4/Mallu-Bhatti-Vikramarka.jpg.webp?itok=gD95texN)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీసు యంత్రాంగం ఉందా? బాలికపై అఘాయిత్యం జరిగితే హోంమంత్రి స్పందించరా? అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో పబ్ కల్చర్ బాగా పెరిగిపోయిందన్నారు. బాలిక అత్యాచారం కేసు సీబీఐకి అప్పగించాలని భట్టి డిమాండ్ చేశారు.
చదవండి: అమ్నీషియా పబ్ కేసు: సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ!
సీబీఐకి అప్పగించాలి.. శ్రీధర్ బాబు
ఇక్కడి వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేదని.. బాలిక అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లిప్తత వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా కానీ దోషులను పట్టుకోవడంలేదు.. వారు బయట దర్జాగా తిరుగుతున్నారని శ్రీధర్‌బాబు దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment