CLP leader
-
బీఆర్ఎస్ నేతలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు
కేతేపల్లి: బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని నమ్మకం లేని ఆ పార్టీ నాయకులు గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క అన్నారు. ఉత్తర తెలంగాణ మొదలుకుని నల్లగొండవరకు సబ్బండ వర్గాల ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని, ప్రజల సంపద దోచుకుంటున్న ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకే తాను పాదయాత్ర చేపట్టానని ఆయన పేర్కొన్నారు. పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర మంగళవారం నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలో సాగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో మభ్యపెడుతున్న కేసీఆర్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. నక్కలగండి ప్రాజెక్టు వద్ద కుర్చీ వేసుకుని కూర్చుని పనులు పూర్తి చేయిస్తానని ఎన్నికల సమయంలో చెప్పిన కేసీఆర్‌కు.. ఇప్పటికీ కుర్చీ దొరకలేదా? అని ప్రశ్నించారు. ఏడేళ్లుగా పూర్తి చేయని ‘పాలమూరు–రంగారెడ్డి’ఎత్తిపోతల ప్రాజెక్టును నాలుగు నెలల్లో పూర్తి చేస్తామంటూ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. డిండి ఎత్తిపోతల, ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుల పనులు పూర్తి చేయించడంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఇద్దరూ విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. సమావేశంలో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య పాల్గొన్నారు. భట్టివిక్రమార్కకు అస్వస్థత కాగా, భట్టివిక్రమార్క మంగళవారం సాయంత్రం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సూర్యాపేట నుంచి వచ్చిన వైద్యులు కేతేపల్లిలోని పాదయాత్ర శిబిరం వద్ద ఆయనకు చికిత్స అందించారు. తీవ్రమైన వడగాలులు, ఎండలను లెక్కచేయకుండా 96 రోజులుగా పాదయాత్ర చేస్తుండటంతో ఆయన వడదెబ్బకు గురయ్యారు. జ్వరం, తలనొప్పితో ఆయన బాధపడుతున్నారని, బీపీ కూడా పెరిగిందని వైద్యులు తెలిపారు. ఫ్లూయిడ్స్ ఎక్కించడంతో బీపీ కంట్రోల్లోకి వచ్చిందన్నారు. షెడ్యూలు ప్రకారం మంగళవారం ఆయన నకిరేకల్ హైవే నుంచి కొర్లపాడు మీదుగా కేతేపల్లికి, అక్కడి నుంచి భాగ్యనగరం శివారు వరకు మొత్తం 12.5 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంది. అస్వస్థతకు గురికావడంతో నకిరేకల్ హైవే నుంచి బయలుదేరి కొర్లపాడు మీదుగా 6 కిలోమీటర్లు నడిచి కేతేపల్లికి చేరుకున్నారు. అక్కడే పాదయాత్రకు విరామం ప్రకటించారు. బుధవారం ఉదయం వరకు జ్వరం, తలనొప్పి తగ్గితే పాదయాత్ర తిరిగి ప్రారంభం అవుతుందని భట్టి విక్రమార్క కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, మాజీ ఎమ్మెల్సీ పి.నాగేశ్వరరావు, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ తదితరులు భట్టిని పరామర్శించారు. -
భలే కొంటున్నారు సారూ...
-
ఆ సభ సక్సెస్‌కు కారణం ఇదే.. మంచిర్యాలలో జై కొట్టించింది వారే..
మంచిర్యాలలో నిర్వహించిన జై భారత్ సత్యాగ్రహ సభ కోసం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కొన్ని కలిసివచ్చాయి. సభను ప్లాన్ చేయడం నుంచి సక్సెస్ ఫుల్‌గా జరిగే వరకు భట్టి విక్రమార్కకు అండగా నిలిచింది ఓ టీం. వారెవరో కాదు దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానుల బృందం. వైఎస్సార్‌ను అత్యంత అభిమానించే వారిలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఒకరు. ఎంతంటే దేవుడి ఫోటోల మధ్య లో వైఎస్సార్ ఫోటో పెట్టి పూజించేంత అభిమానం భట్టికి ఉంది. దీనికి కారణం భట్టి రాజకీయాల్లో ఎదగడానికి అన్ని రకాలుగా సపోర్ట్ చేసింది వైఎస్సారే. ఇటు వైఎస్సార్ అభిమానులకు కూడా భట్టి అంటే అంతే ఇష్టం. భట్టి పాదయాత్ర తలపెట్టినప్పుడు అన్ని తామై వెఎస్సార్ అభిమానులే చూసుకుంటున్నారు. జై భారత్ సత్యాగ్రహా సభ సక్సెస్ వెనక కూడా వైఎస్సార్ అభిమానులే బ్యాకప్ వర్క్ చేశారన్న టాక్ ఉంది. అందులో ముందు చెప్పుకోవాల్సిన పేరు ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల సభ కు అన్ని తానై ఏర్పాట్లు చేసారు ప్రేమ్ సాగర్ రావు. ఇదే జాబితాలో మరో ఇద్దరు శ్రీధర్ బాబు , జీవన్ రెడ్డి. వీరిద్దరూ మంచిర్యాలలోనే ఉండి సభ సక్సెస్ కోసం కృషి చేసారు. సీఏల్పీ నేతగా ఉన్నప్పుడు వైఎస్సార్ ప్రజా క్షేత్రంలోకి వెళ్లి తన పాదయాత్ర ద్వారా ఎంతో మంది ప్రజలను కలిశారు, వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. నేన్నునానంటూ భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను గెలిపించి ముఖ్యమంత్రి అయ్యారు డాక్టర్ వైఎస్సార్. ఇప్పుడు సీఏల్పీ నేతగా ఉన్న భట్టి కూడా వైఎస్సార్ బాటలోనే పాదయాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి దిగారు. వైఎస్సార్ సెంటిమెంట్ వైఎస్సార్ అభిమానిగా తనకు కలసి వస్తుందని ఆశిస్తున్నారు సీఏల్పీ నేత భట్టి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్‌డెస్క్ చదవండి: కాంగ్రెస్‌లో సరికొత్త ముసలం.. సచిన్ పైలట్‌కు కోపం ఎందుకు వచ్చింది? -
విడుదల చేసే దమ్ము కేంద్రానికి ఉందా..
-
రుణాలు బడా వ్యాపారులకేనా.. రైతులకు ఇవ్వరా?
సాక్షి, హైదరాబాద్: బడా పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రూపాయలను నిరర్ధక ఆస్తుల(ఎన్పీఏ) కింద రద్దు చేసే పాలకులు, ఆరుగాలం కష్టపడే రైతుకు రుణమాఫీ చేయమంటే మాత్రం వెనకాడుతారెందుకని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అంబానీ, అదానీ, ఇతర సంపన్నులు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.12 లక్షల కోట్ల రుణాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. గురువారం ఇక్కడి సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ రైతు ప్రభుత్వమా? లేక కార్పొరేట్ల ప్రభుత్వమా? అని నిలదీశారు. తెలంగాణ పర్యటనకు వచ్చి వెళ్లిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రైతు రుణమాఫీ గురించి చొరవ చూపితే బాగుండేదని హితవు పలికారు. బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు రుణాలు ఇప్పించి ఉంటే బాగుండేదన్నారు. కానీ, కేంద్రమంత్రి పర్యటన ఉపన్యాసాలకే పరిమితం కావడం విచారకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏకకాలంలో రైతు రుణమాఫీ అమలు చేయకపోవడంతో రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదని, దీంతో రైతులు ఎక్కువ వడ్డీకి ప్రైవేట్ అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, నకిలీ విత్తనాలతో పంట దిగుబడి రాక ప్రైవేటు అప్పులు తీర్చలేని పరిస్థితిల్లో రైతులు ఉన్నారని, ఈ దుస్థితి వారి ఆత్మహత్యలకు దారితీస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందు సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించి సమీక్ష నిర్వహించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయడంతోపాటు బ్యాంకర్ల నుంచి కొత్త రుణాలు ఇప్పించాలని భట్టి డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: ‘నన్ను అవమానిస్తున్నారు’.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ తమిళిసై ఫైర్ -
మద్యం పాలసీని రూపొందించడం విచిత్రం
-
ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ వెళ్లి.. మద్యం పాలసీపై నిర్ణయాలా?: భట్టి విక్రమార్క
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణంలో తెలంగాణ నేతలకు సంబంధాలు ఉన్నాయని బీజేపీ చేసిన ఆరోపణలు ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో మద్యం పాలసీపై ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారాయన. ‘మద్యాన్ని విచ్చలవిడిగా, అవినీతిపరులతో విక్రయాలు జరుపుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తులు మద్యం పాలసీని రూపొందించటం విచిత్రం. ప్రభుత్వ పాలసీలపై సచివాలయంలో లేదా కేబినెట్లో నిర్ణయాలు జరుగుతాయి. ప్రభుత్వ పాలసీలపై హోటల్లో నిర్ణయాలేంటి? ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి వచ్చి.. మద్యం పాలసీలపై నిర్ణయాలు తీసుకుంటారా?’ అని ప్రశ్నించారు భట్టి విక్రమార్క. ఇదీ చదవండి: లిక్కర్ స్కాం కేసు: బీజేపీ నేతలపై పరువునష్టం దావా వేసిన కవిత -
సీనియర్ నేతలు మా ఆస్థి.. వారిని కాపాడుకుంటాం : భట్టి
-
తెలంగాణలో పోలీసు యంత్రాంగం ఉందా?: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీసు యంత్రాంగం ఉందా? బాలికపై అఘాయిత్యం జరిగితే హోంమంత్రి స్పందించరా? అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో పబ్ కల్చర్ బాగా పెరిగిపోయిందన్నారు. బాలిక అత్యాచారం కేసు సీబీఐకి అప్పగించాలని భట్టి డిమాండ్ చేశారు. చదవండి: అమ్నీషియా పబ్ కేసు: సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ! సీబీఐకి అప్పగించాలి.. శ్రీధర్ బాబు ఇక్కడి వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేదని.. బాలిక అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లిప్తత వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా కానీ దోషులను పట్టుకోవడంలేదు.. వారు బయట దర్జాగా తిరుగుతున్నారని శ్రీధర్‌బాబు దుయ్యబట్టారు. -
ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే ఈ బడ్జెట్: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవానికి చాలా దూరంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త పథకాలు తెచ్చామని చెబుతున్నారు.. గతేడాది బడ్జెట్ కూడా పెట్టిన దానికి చేసిన ఖర్చు కు పొంతన లేదన్నారు. కేటాయింపులు కేవలం చెప్పుకోవడం కోసమేనని దుయ్యబట్టారు. చదవండి: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్: కేటాయింపులు ఇవే.. ‘‘ఎన్నికల సందర్భంగా జాగా ఉంటే ఇళ్లు కట్టుకోవడం కోసం 5 లక్షలు అని చెప్పి.. ఇప్పుడు 3 లక్షలు మాత్రమే పెట్టారు. నిరుద్యోగులు, రైతుల గురించి ఇలా ఏ వర్గానికి ఉపయోగపడని బడ్జెట్. ప్రచారానికి తప్ప .. ప్రజలకు పనికొచ్చే బడ్జెట్ కాదు. ఈ బడ్జెట్ తీవ్ర నిరాశ కలిగించింది. రాజ్యాంగ విరుద్ధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్రాన్ని తెచ్చుకొన్నది తలెత్తుకొని బతకడం కోసం. ఈ రోజు సెల్ప్ రెస్పెక్ట్ లేకుండా చేస్తున్నారు. గవర్నర్‌తో మీకు ఏమైనా వ్యక్తిగత తగాదాలు ఉంటే వేరే విధంగా చూసుకోవాలి. గతేడాది జరిగిన పురోగతి చెప్పాల్సి ఉన్నా.. చెప్పలేదు. అందుకే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన కనీసం మా వైపు కూడా స్పీకర్ చూడలేదని.. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిదని’’ భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. -
జగ్గారెడ్డితో భట్టిభేటీ..రాజీనామా అంశంపై చర్చ
-
‘మోదీ డ్రామా.. బహిరంగ సభకు జనం రాలేదనే..’
సాక్షి, హైదరాబాద్: పంజాబ్ పర్యటనలో మోదీ డ్రామాలాడారని.. ప్రధాని పదవి స్థాయిని దిగజార్చారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బహిరంగ సభకు జనం రాలేదని నాటకాలు ఆడారని ఎద్దేవా చేశారు. చదవండి: పర్యాటకుల్లా వచ్చి కేసీఆర్‌పై విమర్శలా? ‘‘పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తోంది. 371డి పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎల్పీ నుండి లేఖ రాస్తున్నాం. ధ్యానం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయన్నారు. యాసంగి ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కొనుగోలు చేయాల్సిందే. తామర పురుగుతో లక్షల ఎకరాల మిర్చి పంటకు నష్టం ఏర్పడింది. పసుపు, పత్తి పంటలకు కూడా నష్టపరిహారం అందించాలి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దయనీయ పరిస్థితిలో ఉంది. పోలీసులు యంత్రాంగాన్ని టీఆర్ఎస్ పార్టీ తన క్యాడర్ గా మార్చుకుంది. సీఎల్పీ బృందం.. గవర్నర్‌తో పాటు రాష్ట్ర డీజీపీని కలవాలని నిర్ణయించింది. విద్యుత్ చార్జీల పెంచితే పోరాటం చేస్తాం. పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని, వనమాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలంటూ భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. -
కేంద్రంతో యుద్ధం.. టీఆర్ఎస్ నాటకాలు: సీఎల్పీ నేత భట్టి
సాక్షి, హైదరాబాద్: కేంద్రంతో యుద్ధం చేస్తున్నట్లు టీఆర్ఎస్ నాటకాలు ఆడుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలన్నారు. ధాన్యం కొనకుంటే టిఆర్ఎస్ సర్కార్ చావు డప్ఫు కొట్టాల్సిందేనన్నారు. చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తానని ప్రకటించి టీఆర్ఎస్.. మూడు నెలలుగా రైతులను అవస్థలు పెడుతూ అన్నదాతల ఆత్మహత్యలకు కారణమవుతుందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. చదవండి: తెలంగాణ మంత్రులపై పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు -
కేసీఆర్ పాతాళ భైరవి సినిమాలోలాగా చేస్తున్నారు: భట్టి
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. పాతాళ భైరవి సినిమాలోలాగా అప్పుడప్పడూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకువస్తారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కేటీఆర్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్‌గా వచ్చాకా కరోనా వ్యాక్సిన్ రాష్ట్రంలో పూర్తిగా బంద్ అయ్యిందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన జూమ్ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ, కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు.. కరోనా రోగుల నుంచి వసూలు చేస్తున్న భరించలేని ఫీజులను నియంత్రించేందుకు సీనియర్ ఐఏఎస్‌ల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని గత బడ్జెట్ సమావేశాల్లోనే ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదని భట్టి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఏడాది సమయం ఉన్నా రాష్ట్రంలో కనీసం ఆక్సిజన్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ ఎక్కడ ఉందో, ఏ ఆసుపత్రిని పరిశీలించిందో? ఎక్కడ ఫీజులు నియంత్రణ చేసిందో ఇప్పటి వరకూ తెలియలేదన్నారు. ‘‘కరోనా పెరుగుతున్న సమమంలో చీఫ్ సెక్రెటరీతో ఫోన్ చేసి మాట్లాడాను.. రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతోంది. దున్న పోతుమీద వాన పడుతున్నా కదిలే పరిస్థితి లేదు. ఫామ్ హౌస్‌లో నిద్రిస్తోంది. మంత్రులెవరూ స్పందించడం లేదు. కనీసం బ్యూరోక్రసీతో పనిచేయించడం నీ బాధ్యత అని సీఎస్‌తో చెప్పి 15 రోజులైనా ఆయన స్పందించింది లేదు’’ అంటూ భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాపై పూర్తిస్థాయిలో ఒక మంత్రి పర్యవేక్షణ ఉండాలి కానీ.. గెస్ట్ యాక్టర్లలా రోజుకొకరు సమావేశాలు పెట్టడం ఏంటని భట్టి ప్రశ్నించారు. సోనూసూద్ మాదిరిగా తెలుగు సినిమా హీరోలు, హీరోయిన్లు ఆర్టిస్టులు, పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చిన కరోనా బాధితులకు అండగా నిలవాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఇక వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఎటువంటి నిర్దిష్టమైన కార్యాచరణ తీసుకోలేదన్నారు. రాష్ట్ర జనాభా ఎంత? కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్ డోసులు ఎన్ని? ఫార్మా సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేస్తున్న వ్యాక్సిన్ ఎంత? అనే దానిపై ప్రభుత్వం వద్ద క్లారిటీ లేదని భట్టి అన్నారు. ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న చీఫ్ సెక్రెటరీ కూడా ఈ వివరాలు చెప్పడం లేదని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. చదవండి: ఆత్మగౌరవం పేరిట కొత్త నాటకం: మంత్రి గంగుల లాక్డౌన్.. అంతంత మాత్రమే! -
అడవి బిడ్డలపై దాడి అత్యంత హేయం: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లాలో అటవీ ప్రాంతంలో అడవి బిడ్డలపై అటవీ సిబ్బంది పైశాచిక దాడిని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. ఇప్పపూలు, అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం వెళ్లిన గిరిజనులపై జరిగిన దాడిలో 14 మహిళలు, 9 మంది పురుషులకు తీవ్ర గాయాలయ్యాయని, వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అటవీ ఉత్పత్తులను సేకరించడం తప్పు కాదని, ఉత్పత్తుల సేకరణపైనే ఆధారపడి చెంచు, లంబాడాలు ఆధారపడి జీవిస్తున్నారని, 29 రకాల అటవీ ఉత్పత్తులను సేకరించి ఉపాధి పొందవచ్చు అని అటవీ చట్టం చెబుతోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గిరిజనులకు రోగం వస్తే హెలికాప్టర్లో తీసుకువచ్చి కార్పొరేట్ దవాఖానల్లో చేర్చించి కడుపులో పెట్టి చూసుకుంటామని, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, పోడు భూముల సమస్యను తనే కుర్చీ వేసుకుని పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు ఏమయ్యాయని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. గిరిజన మహిళలను చెట్లకు కట్టేసి కొట్టిన అరాచకాలు టీఆర్ఎస్ పాలనలో ఉందని, గత ఏడేళ్లుగా అనేక ప్రాంతాల్లో అధికారులు, అధికార పార్టీల నేతల ఆగడాలకు అడ్డేలేకుండా పోయిందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. చదవండి: తెలంగాణలో పండుగలు, పబ్బాలు లేవు! కరోనా తెచ్చిన కష్టం; ఊరి చివర గుడిసె.. ఒంటరిగా బాలిక -
సీఎం కేసీఆర్‌పై భట్టి విక్రమార్క ఫైర్..
సాక్షి, హైదరాబాద్: దాదాపు 30 రోజులు జరగాల్సిన బడ్జెట్ సమావేశాలను కేవలం ఆరు రోజుల్లోనే ముగించడంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020-21 ఏడాదికి సంబంధించిన 2 లక్షల 30 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన భారీ బడ్జెట్‌ను కేవలం ఆరు రోజులకు మాత్రమే చర్చలను పరిమితం చేసి.. పాస్ చేయించుకుని వెళ్లిన వైనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శుక్రవారం.. శాసనసభా సమావేశాలు ముగిసిన అనంతరం గన్ పార్క్‌లో దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వంపైనా, సీఎం కేసీఆర్ పైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దాదాపు 30 రోజులు జరపవలసిన బడ్జెట్ సమావేశాలను ఆరు రోజులకే పరిమితం చేయడంపై ఆయన మండిపడ్డారు. భారీ బడ్జెట్ పైనా సుదీర్ఘంగా చర్చలు జరిపి.. పాస్ చేసుకోవాల్సి ఉండగా, కేవలం ఆరు రోజుల్లోనే సమావేశాలు పూర్తి చేయడంపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆరు రోజుల్లో కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని భట్టి విమర్శించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సూచనలను అధికార పక్షం ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. బడ్జెట్‌ను అధికార పక్షం పాస్ చేయించుకున్న వైనం.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమన్నారు. కేసీఆర్ పాలన నియంతృత్వ పాలనలా ఉంది తప్ప ప్రజాస్వామ్య పాలనలా లేదన్నారు, శాసనసభా సమావేశాలు కేవలం అలంకార ప్రాయంగా మారిపోయాయి తప్ప... అర్థవంతమైన చర్చలు జరగడం లేదని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ రంగం, నీటిపారుదల, క్రుష్ణానదిమీద ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల గురించి సభలో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని భట్టి చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను రీ డిజైన్ పేరుతో టెండర్లలో అక్రమాలకు పాల్పడి.. భారీ అవినీతికి పాల్పడినట్లు భట్టి ఆరోపించారు. ఇది రాష్ట్రం మీద అదనపు ఆర్థిక భారంలా మారిందని బట్టి అన్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ ప్రజల సమక్షంలో పెట్టడంతో పాటు చట్టసభలలో పెట్టాలని భట్టి డిమాండ్ చేశారు. డీపీఆర్‌లను చట్టసభల్లో ఇవ్వకపోవడంతో ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అనేక అవకతవకలు జరిగినట్లు అనుమానాలున్నాయన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడవడం లేదన్నారు. అప్పులను ప్రభుత్వం విపరీతంగా చేస్తోందన్నారు. ఈ ఏడాది రూ. 48 వేల నుంచి రూ. 50 వేల కోట్ల వరకూ అప్పులు ప్రభుత్వం తీసుకువస్తోందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా.. చిరవకు రాష్ట్రాన్ని డెడ్ ట్రాప్ లోకి నెట్టేస్తున్నారన్నారు. 2023 నాటికల్లా అప్పులు ఐదున్నర నుంచి 6 లక్షల కోట్ల రూపాయాలకు రాష్ట్ర అప్పులు చేరుకుంటాయని వివరించారు. రాష్ట్రాన్ని కుదవపెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఇది చాలా ప్రమాదకరమన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన నిధులను వినియోగించకుండా.. వాటిని ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయితీ కార్యదర్శుల అంశాలపై కాంగ్రెస్ శాసనసభా పక్షం.. సభలో అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నేరుగా సమాధానం ఇవ్వలేదని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. -
‘తెలంగాణలో నయా రాచరికం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పాలన అంతా అయోమయంగా సాగుతోందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ అటు మంత్రులను, ఇటు ప్రజలను కలవకుండా ఫామ్ హౌస్ నుంచి నయా రాచరిక పాలన చేస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ రెండేళ్ల పాలనపై ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అధికారులు ఎవరు ఎక్కడ ఉంటారో.. ఎవరికి తెలియని పరిస్థితులు ఉన్నాయని దుయ్యబట్టారు. సెక్రటేరియట్లో ఏ శాఖకు ఫోన్ కలవని విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయన్నారు.(చదవండి: టీపీసీసీ చీఫ్ ఎంపిక మరింత ఆలస్యం!) ఆ హామీపై కనీసం ఊసేలేదు.. కాళేశ్వరం నుంచి ఇప్పటివరకూ ఒక్క ఎకరాకైనా నీళ్లు పారాయా? అని భట్టి ప్రశ్నించారు. వరదలతో హైదరాబాద్ నగరం మునిగిపోతే కేసీఆర్ ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకున్నారని భట్టి మండిపడ్డారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన భృతి హామీకి అతీగతీ లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా కనీసం విధివిధానాలను ఖరారు చేయలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీపై కనీసం ఊసేలేదని విమర్శించారు. (చదవండి: హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఏమైంది?) రాష్ట్రంలో గందరగోళం.. ధరణితో తెలంగాణ గందరగోళంలో పడిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ తనకు కావాల్సిన వారికోసం రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థను గందరగోళం చేశారని ఆరోపించారు. వ్యవసాయ రంగం అతలాకుతలం అవుతున్నా.. కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. రుణమాఫీ చేయకపోవడం రైతులకు మరింత భారంగా మారిందని.. సన్నవడ్లు పండించిన రైతుల బాధలు కేసీఆర్‌కు పట్టవా? అంటూ భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి.. గ్రేటర్ ఎన్నికల ముందు ప్రకటించిన వరద సహాయం ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్నికల తరువాత ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు 57 ఏళ్లకే పెన్షన్ అని చెప్పిన కేసీఆర్.. కొత్త పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం.. తరువాత దానిని మర్చిపోయిందన్నారు. ఆన్లైన్ తరగతులకు సరైన వసతులు కల్పించకుండా విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు. వారు మినహా అంతా డమ్మీలే.. కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చే అంశం పరిశీలిస్తామన్నారు.. ఎంత వరకు పరిశీలనకు వచ్చిందో ఏవరికీ తెలియదన్నారు. రాష్ట్ర కేబినెట్లో మంత్రులకు అధికారాలు లేవు. కేటీఆర్, హారీష్ మినహా అంతా డమ్మీలే అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో సామాన్య ప్రజలను, రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని, సూటు బూటు వేసుకున్నవారినే కేసీఆర్ కలుస్తారని ఘాటుగా విమర్శించారు. సమస్యల నుంచి ప్రజల ఆలోచనను మళ్లించేందుకే భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. బీజేపీ.. భావోద్వేగాలతో రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఆ అంశంపై నిర్ణయం తీసుకోలేదు.. సీఎల్పీ నేతగా తమ ఎమ్మెల్యేలు పీసీసీ ఎంపికపై కొన్ని అభిప్రాయాలు చెప్పారు. వారి అభిప్రాయాలను ఇంఛార్జ్ మానిక్యం ఠాగూర్ దృష్టికి తీసుకెళ్ళినట్లు ఈ సందర్భంగా భట్టి మీడియాకు చెప్పారు. పీసీసీ ఎంపికపై తన అభిప్రాయాన్ని పార్టీ ఇంఛార్జ్‌కు తెలియజేసానన్నారు. ఈ సందర్భంగానే ఢిల్లీ వెళ్లే అంశంపై నిర్ణయం తీసుకోలేదని ఆయన మీడియాకు వెల్లడించారు. ఒక వేళ వెళ్లే అవకాశం ఉంటే తప్పకుండా మీడియాకు తెలియజేస్తానని భట్టి విక్రమార్క చెప్పారు. -
‘అందుకే కేసీఆర్ కరోనాపై సమీక్ష పెట్టడం లేదు’
సాక్షి, హైదరాబాద్: వైద్యశాఖలో ఉన్న లోపాలు బయటకు వస్తాయనే భయంతోనే సీఎం కేసీఆర్ కరోనాపై సమీక్ష సమావేశం నిర్వహించడంలేదని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైద్యశాఖకు నిధులు విడుదల చేయండని, ప్రైవేటు హాస్పిటల్స్‌పై చర్యలు తీసుకుంటామని చెబుతున్న మంత్రి ఈటలకు ప్రైవేటు ఆస్పత్రుల దోపిడి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడ టెస్ట్ కిట్స్ లేవని చెబుతున్నారు.. 1,82,000 కోట్ల రూపాయల బడ్జేట్ ఉన్న రాష్ట్రంలో వైద్యం గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మానవత్వం లేని పాలకుల వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన ధ్వజమెత్తారు. ఆస్పత్రుల్లో సిబ్బంది కోరత కూడా తీవ్రంగా ఉందని ఆరోపించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 50 శాతం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ప్రైవేటు ఆస్పత్రుల రేట్లను ప్రభుత్వమే ఫిక్స్ చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించాలని, 17 మంది అధికారులను.. 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంచార్జీలుగా నియమించాలని భట్టి పేర్కొన్నారు. -
వరవరరావు ఆరోగ్యాన్ని కాపాడాలి: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: బీమా కోరేగావ్ కేసులో అరెస్టయిన విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆయన ఆరోగ్యాన్ని కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. ప్రస్తుతం ముంబయిలోని తలోజా జైలులో ఉన్న వరవరరావును మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించాలని, లేకపోతే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయస్థానాలు శిక్షించిన వారికి కూడా ఆరోగ్యం బాగోలేకపోతే మెరుగైన వైద్యం అందిస్తారని, ఉరి శిక్ష వేసిన వారికి కూడా ఆరోగ్యం బాగోలేకపోతే ఉరి వాయిదా వేస్తారు. అలాంటిది రోజుల తరబడి అనారోగ్యంతో ఉన్న తెలంగాణ ప్రాంత ఉద్యమ నేతను అక్కడి ప్రభుత్వాలు, పోలీసులు పట్టించుకోకపోవడం శోచనీయం అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వరవరరావు ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘ఆ టెండర్లపై సెంట్రల్ విజిలెన్స్‌కు లేఖ రాస్తాం’
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో కూడా పోలీసులను కపలా పెట్టి ప్రభుత్వం మద్యం అమ్మకాలు సాగిస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వల్ల తాగుబోతులు మృతి చెందిన పర్వాలేదని ప్రభుత్వం భావిస్తుందా అని ప్రశ్నించారు. ఒక పక్క తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతుంటే ప్రజలను ఆదుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు 21 వేల కోట్లతో టెండర్లు పిలవడం సబబేనా అంటూ విమర్శలు గుప్పించారు. టెండర్లు పిలవడం రిటైర్డ్ ఇంజనీర్ అసోసియేషన్ కూడా వ్యతిరేకిస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్గత పనుల వల్ల అదనంగా రూ.8 వేల కోట్ల భారం పడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.తెలంగాణ ఇప్పటికే 3 లక్షల 21 వేల అప్పుల్లో ఉందని.. మళ్ళీ మరో 21 వేల కోట్ల భారమా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి,కాళేశ్వరం టెండర్లపై సెంట్రల్ విజిలెన్స్‌కు లేఖ రాస్తామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను, మీడియాను తిడితే అసలు విషయాలు బయటకు రావని సీఎం కేసీఆర్ ఆలోచన అని దుయ్యబట్టారు. మద్యం షాపులు తెరవడం వల్ల ఇన్ని రోజులు వైద్యులు, పోలీసులు శ్రమ అంతా వృధా అయ్యిందన్నారు. రాజీలేని పోరాటం చేయాలి: శ్రీధర్‌బాబు రాబోయే రెండు వారాల్లో కరోనా వ్యాప్తి మరింత వేగంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్రంలో ఇసుక సరఫరా వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని.. ఇసుక తరలింపు కోసం పనిచేసేవారికి ఎలాంటి టెస్టులు నిర్వహించడం లేదన్నారు. తెలంగాణకు ఆదాయం వచ్చే వాటిలో చిన్న,సన్నకారు వ్యాపారుల పాత్ర కూడా కీలకమన్నారు. కేంద్రం కోటి 70 వేల కోట్లు ప్యాకేజీ ప్రకటించి చేతులు దులుపుకుందని.. దేశంలో ఇంతటి పరిస్థితుల్లో ఫైనాన్సిల్ ప్యాకేజి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై ఉందన్నారు. సింగపూర్, మలేషియా లాంటి చిన్న దేశాలు కూడా వారి ప్రజలకు నమ్మకం కల్పించాయన్నారు. దేశంలో ప్రతి పేద కుటుంబానికి 7,500 నగదు ఇవ్వాలనే రాహుల్ గాంధీ సూచనను పక్కన పెట్టారని మండిపడ్డారు. విద్యుత్ సంస్కరణల విషయంలో రాష్ట్రాల హక్కులను లాక్కునే ప్రయత్నాన్ని ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రంతో రాజీలేని పోరాటం చేయాలని శ్రీధర్‌బాబు హితవు పలికారు. -
ప్రజల కోసమే పోలీసులు పనిచేయాలి:భట్టి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ నేతల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. బోయినిపల్లి సంఘటనపై పోలీసుల తీరును తప్పుబట్టారు. ‘బోయినిపల్లిలో ఒక స్థల వివాదంలో స్థానిక అధికార పార్టీ నేత రాజకీయ పలుకుబడి అడ్డం పెట్టుకుని తన అనుచరులు, గుండాలతో కలిసి భూమిలో ప్రహరీ గోడను అక్రమంగా కూల్చివేయడమే కాకుండా వాచ్‌మేన్ శంకరప్ప పైన పెట్రోలు పోసి నిప్పంటిచారు. శంకరప్ప భార్యను వివస్త్రను చేసి హింసించారు. ఈ విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారని’ భట్టి విక్రమార్క విమర్శించారు. వాచ్‌మేన్ పరిస్థితి విషమంగా ఉందని..మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వైద్య ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించాలన్నారు. శంకరప్ప భార్యపై అఘాయిత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలన్నారు. టీఆర్ఎస్ నాయకుల కోసం కాకుండా.. ప్రజల కోసం పోలీసులు పనిచేయాలని భట్టి విక్రమార్క హితవు పలికారు. -
టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దివాలా : మల్లు భట్టి విక్రమార్క
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిన టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దివాలా తీసిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. గురువారం చర్ల మండలంలోని కుదునూరులో ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి మోసం చేశారని ఆరోపించారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఆర్టీసీలో 48 వేల ఉద్యోగాలు తొలగించేందుకు మొండిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీలో దళిత, గిరిజనుల సాగులో ఉన్న భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. దొరల తెలంగాణకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భద్రాచంల ఎమ్మెల్యే పోడెం వీరయ్య, ములుగు ఎమ్మెల్యే సీతక్క, తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో ఆస్తులమ్ముతున్న కేసీఆర్ : భట్టి
సాక్షి, వరంగల్ : తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించి ఆదాయం కోసం హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్తులను ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్ముతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని కిష్టపురం క్రాస్ రోడ్డు వద్ద ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఓటమి భయంతోనే హుజూర్‌నగర్‌లో మండలానికో మంత్రి, గ్రామానికో ఎమ్మెల్యేను పంపుతున్నారని విమర్శించారు. అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని విశ్వాసం వెలిబుచ్చారు. -
భవిష్యత్తులో నీరు, గాలిపైనా పన్ను : భట్టి విక్రమార్క
సాక్షి, పెద్దపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ 2023 నాటికి ఐదు లక్షల బడ్జెట్ ప్రవేశపెడ్తాడో లేదో తెలియదు కానీ ఆరోజుకు అప్పులు మాత్రం అంతవరకు చేరుస్తాడని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. గురువారం పెద్దపల్లిలో పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ అప్పుల భారం అంతా సామాన్య ప్రజానీకంపైనే పడుతుందన్నారు. ఆఖరుకు తాగే నీళ్లు, పీల్చే గాలిపైనా పన్నులు వసూలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్‌పై అత్యధికంగా పన్నులు వసూలు చేస్తున్న రాష్ట్రం మనదేనని, అప్పులు పెరుగుతూ పోతే వడ్డీలు కట్టేందుకు ప్రభుత్వం అన్నింటిమీదా పన్నుల రేట్లు పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఇసుకను ఆదాయ వనరుగా కాకుండా సహజ వనరుగా, రాష్ట్ర సంపదగా కాంగ్రెస్ ప్రభుత్వం భావించిందని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య, టీపీసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ విజయ రమణారావు తదితరులు పాల్గొన్నారు. -
పీసీసీ రేసులో నేను లేను
సాక్షి, ఢిల్లీ : రాష్ట్రమంతా సిద్ధిపేట మోడల్ అమలు చేస్తానంటున్న సీఎం కేసీఆర్ దుబ్బాకలో యూరియా కోసం రైతు చనిపోయిన ఘటన చూసి సిగ్గుపడాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. డబ్బు పెట్టి కొందామన్నా యూరియా దొరకడం లేదని వాపోయారు. రైతు బంధు, రుణమాఫీ పథకాలను అమలుచేయకపోవడంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందన్నారు. ఎన్నికల వేళ హడావిడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేయడం దుర్మార్గమన్నారు. రైతులకు ఇవ్వాల్సిన 20 వేల కోట్లు ఇంకా విడుదల చేయకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడం, విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి వంటి అంశాలపై పార్టీ అధ్వర్యంలో పోరాడుతూ.. కేంద్ర హోంమంత్రిని కలిసి లోతైన దర్యాప్తు చేయాలని కోరతామని స్పష్టం చేశారు. మరోవైపు పార్టీ సభ్యత్వ నమోదు, మునిసిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీనియర్ నేతలతో చర్చలు జరిపామని తెలిపారు. పీసీసీ అధ్యక్ష పదవి రేసులో లేనని స్పష్టం చేశారు.