
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేతగా భట్టి విక్రమార్కను ఎంపిక చేశారు. ఈ రేసులో ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ముందునుంచి ఉండగా.. చివరకు సీఎల్పీ నేతగా అధిష్టానం భట్టి విక్రమార్కను నియమించింది. ఈ మేరకు కొద్దిసేపటిక్రితమే కాంగ్రెస్ అధిష్టానం ఓ లేఖను విడుదల చేసింది.
నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవ్వగా.. కాంగ్రెస్ శ్రేణుల్లో సీఎల్పీ నేత ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ నాయకులు సీఎల్పీ నేత ఎంపికను పూర్తిగా అధిష్టానానికే వదిలేశారు. భట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితమే నియమించినట్లు ప్రకటించారు. దీంతో ఆయన సొంత నియోజకవర్గమైన మధిరలో పండుగ వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment