సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవానికి చాలా దూరంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త పథకాలు తెచ్చామని చెబుతున్నారు.. గతేడాది బడ్జెట్ కూడా పెట్టిన దానికి చేసిన ఖర్చు కు పొంతన లేదన్నారు. కేటాయింపులు కేవలం చెప్పుకోవడం కోసమేనని దుయ్యబట్టారు.
చదవండి: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్: కేటాయింపులు ఇవే..
‘‘ఎన్నికల సందర్భంగా జాగా ఉంటే ఇళ్లు కట్టుకోవడం కోసం 5 లక్షలు అని చెప్పి.. ఇప్పుడు 3 లక్షలు మాత్రమే పెట్టారు. నిరుద్యోగులు, రైతుల గురించి ఇలా ఏ వర్గానికి ఉపయోగపడని బడ్జెట్. ప్రచారానికి తప్ప .. ప్రజలకు పనికొచ్చే బడ్జెట్ కాదు. ఈ బడ్జెట్ తీవ్ర నిరాశ కలిగించింది. రాజ్యాంగ విరుద్ధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్రాన్ని తెచ్చుకొన్నది తలెత్తుకొని బతకడం కోసం. ఈ రోజు సెల్ప్ రెస్పెక్ట్ లేకుండా చేస్తున్నారు. గవర్నర్‌తో మీకు ఏమైనా వ్యక్తిగత తగాదాలు ఉంటే వేరే విధంగా చూసుకోవాలి. గతేడాది జరిగిన పురోగతి చెప్పాల్సి ఉన్నా.. చెప్పలేదు. అందుకే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన కనీసం మా వైపు కూడా స్పీకర్ చూడలేదని.. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిదని’’ భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment