Telangana Assembly Budget Session 2022
-
తెలంగాణ సభ సమరం..అసెంబ్లీలో ప్రధాన చర్చలు ఇవే!
-
మెదక్‌లో గెలుపొంది.. ఉన్నత పదవుల్లోకి..!
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా ఎంతో మందికి మంచి పదవులను అందించి వారిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టింది. ప్రముఖులుగా చరిత్రలో లిఖించింది. గతంలో ఇక్కడి నుంచి పోటీచేసి గెలిచిన నాయకులు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఉప సభాపతి లాంటి ఉన్నతమైన పదవులు అలంకరించారు. అలా ఉన్నత పదవులను కైవసం చేసుకున్న వారంతా చరిత్రపుటల్లో నిలిచిపోయారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోను మెదక్ జిల్లాకు ఆ విధమైన ప్రత్యేక ఏర్పడింది. ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీచేసి విజయం సాధించి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. పద్మాదేవేందర్‌రెడ్డి.. పద్మాదేవేందర్‌రెడ్డి 2001లో టీఆర్ఎస్ అవిర్భావం నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2001లో రామాయంపేట జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2004లో ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం స్వరాష్ట్రం కోసం 2008లో కేసీఆర్ పిలుపు మేరకు తన పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీచేయగా ఓడిపోయారు. ఆ తరువాత 2009లో టికెట్ దక్కక పోవడంతో స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. 2014లో మెదక్ ఎమ్మెల్యేగా గెలుపొంది తెలంగాణలో తొలి ఉప సభాపతిగా పనిచేసి చరిత్రలో నిలిచారు. అనంతరం 2018లో సైతం ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా పద్మాదేవేందర్‌రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ 1980లో లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా ఇందిరాగాంధీ(కాంగ్రెస్) నుంచి పోటీచేసి భారీ మెజార్టీతో గెలుపొంది దేశ ప్రధానమంత్రి పదివిని అలంకరించారు. అప్పట్లో ఇందిరాగాంధీకి 3,01,577 ఓట్లు రాగా తన ప్రత్యర్థి జనతాపార్టీకి చెందిన జైపాల్‌రెడ్డికి 82,453 ఓట్లు వచ్చాయి. ఇందిరాగాంధీ 2,19,124 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ముఖ్యమంత్రిగా అంజయ్య.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మెదక్ జిల్లా రామాయంపేట నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన టి.అంజయ్య 1980 అక్టోబర్ నుంచి 1982 ఫిబ్రవరి వరకు 16 నెలల పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పట్లో చెన్నారెడ్డి సీఎంగా కొనసాగుతున్న సందర్భంగా ఆయనను మార్చి అంజయ్యకు సీఎంగా అవకాశం కల్పించారు. ఆయన అప్పట్లో కేంద్ర మంత్రిగా పనిచేస్తుండగా దానికి రాజీనామా చేసిన ఆయన ఎమ్మెల్యేగా ఎంపిక కాకుండానే సీఎం పదవి చేపట్టారు. రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల్లో ఏదో ఒక చోటు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాలి. ఈ నేపథ్యంలో అప్పటికే రామాయంపేట ఎమ్మెల్యేగా ముత్యంరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండగా టి.అంజయ్య కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో రామాయంపేట స్థానానికి ఎన్నికలు నిర్వహించగా ప్రతిపక్షాలు సైతం నామినేషన్ వేయక పోవడంతో టి.అంజయ్య ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికై సీఎం పదవిని అలంకరించి 16 నెలల పాటు కొనసాగారు. ఉప ముఖ్యమంత్రిగా జగన్నాథరావు మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యే గెలుపొందిన సీహెచ్ జగన్నాథరావు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఫిబ్రవరి 24 నుంచి సెప్టెంబర్ 20 వరకు సుమారు ఏడు నెలల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇవి కూడా చదవండి: ఐదేళ్లు మీకోసం రక్తం ధారపోస్తా..! : మంత్రి గంగుల కమలాకర్ -
KCR: కోనాయిపల్లి వెంకన్న సన్నిధిలో నామినేషన్ పత్రాలపై సంతకాలు
సాక్షి, సిద్ధిపేట: కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ శనివారం దర్శించుకున్నారు. ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయాన్ని కేసీఆర్ సెంటిమెంట్‌గా భావిస్తారు. ఆయన ఏ పని చేపట్టినా మొదట ఇక్కడి వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీస్సులు తీసుకున్నాకే మొదలుపెడతారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గజ్వేల్, కామారెడ్డిల నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్, సిద్దిపేట నుంచి పోటీ చేస్తున్న హరీశ్‌రావు ఇద్దరూ తమ నామినేషన్ పత్రాలతో శనివారం ఈ ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. అనంతరం వాటిపై సంతకాలు చేశారు. నవంబర్ 9వ తేదీన రెండుచోట్ల ఆయన నామినేషన్లు వేయనున్నారు. వెంకన్న ఆశీస్సులతోనే ఉద్యమంలోకి.. 2001లో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్ టీడీపీతోపాటు అన్ని పదవులకు రాజీనామా చేసి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి దిగారు. ఆ సమయంలోనూ కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేశారు. హైదరాబాద్‌లోని జలదృశ్యంలో టీఆర్ఎస్ని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడేదాకా పార్టీ చేపట్టే కార్యక్రమాలను ఇక్కడి నుంచీ ప్రారంభించారు. 1985 నుంచీ సంప్రదాయంగా.. కేసీఆర్ 1985 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే సమయంలో కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా రు. ఆ ఎన్నికల్లో గెలవడంతో కోనాయిపల్లి ఆల యం ఆయనకు సెంటిమెంట్‌గా మారింది. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2018.. ఇలా ప్రతి ఎన్నికలో ఆయన ఈ ఆలయంలో పూజలు చేశాకే నామినేషన్ వేస్తూ వచ్చారు. మంత్రి టి.హరీశ్‌రావు నామినేషన్‌కు ముందు కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశాకే నామినేషన్ వేస్తున్నారు. చదవండి: ఆసక్తికరంగా ‘అలంపూర్’ రాజకీయం.. బీఫాం ఎవరికో? -
సభ నుంచి ఎమ్మెల్యే సీతక్క వాకౌట్.. బీఆర్ఎస్పై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో ఏం జరుగుతుందో అర్దం కావడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. సభలోకి వచ్చిన తర్వాత కూడా బిజినెస్ గురించి చెప్పడం లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, జీరో అవర్‌లో కూడా మాట్లాడనివ్వడం లేదని ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చాలా మంది తమ సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలని మాకు చెప్తున్నారు.. కానీ మాకు అవకాశం ఇవ్వకపోతే మేము ఎలా మాట్లాడేదని ప్రశ్నించారు. అసెంబ్లీ నిర్వహాణ పట్ల ఎమ్మెల్యే సీతక్క అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ.. ‘సభలో అధికార పార్టీ బుల్డోజ్ చేస్తుంది. బీఆర్ఎస్ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు ఇస్తే.. ప్రతీ ఊళ్ళో వాటర్ ప్లాంట్లు ఎందుకు పెట్టుకుంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంత సేపు మాట్లాడినా మైక్ కట్ చేయరు. మాకు ఓక నిమిషం మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారు. అసెంబ్లీలో లేని రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఎన్నికల ప్రచారం కోసం అధికార పార్టీ సభను వాడుకుంటుంది. నాలుగున్నర సంవత్సరాల క్రితం ఎన్నికైన సభ్యులు సభలో ఉంటే 9 ఏళ్ళ ప్రగతి గురించి చర్చ ఎలా చేపడుతున్నారు. సమస్యలు లేనప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు జీరో అవర్‌లోలో ఎందుకు అవకాశం ఇస్తున్నారు. సభ నిర్వాహణ మాలాంటి వారికి భాధ కలిగిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. చదవండి: ఎన్నికల వేళ ఇదేం గోల?.. కాంగ్రెస్ నేతలకు క్లాస్.. అయినా! -
ఈటెల పేరు పదే పదే ప్రస్తావించడంలో కేసీఆర్ ప్యూహం ఇదే..!
-
CM KCR: అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ వరాల వర్షం
తాగునీటి సమస్య ఉండదు సింగూరు నుంచి మంజీర నీళ్లతోపాటు కృష్ణా, గోదావరి నీళ్లను సరిపడా నగరానికి తెస్తున్నాం. సుంకేశుల నుంచి 40 టీఎంసీలను తేవడానికి రూ.1,450 కోట్లతో పనులు జరుగుతున్నయి. గోదావరి జలాలు గ్రావిటీ ద్వారానే హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే 100 ఏళ్లలోనూ హైదరాబాద్‌కు తాగునీటి సమస్య రాదు. కాబట్టి 111 జీవో అర్థరహితం. ఉన్న వస్త్రం పోయే.. కేంద్రం విధానాల వల్ల కరోనా కంటే ముందే దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. పనితీరు బాగాలేదని యూపీఏను దింపి బీజేపీని తెచ్చిన దేశ ప్రజల పరిస్థితి అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందన్న కాడికి వచ్చింది. మొత్తం దేశం క్రాష్ అయింది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన 700 మందిని చదివిస్తాం ఉక్రెయిన్ నుంచి 740 మందికిపైగా మన పిల్లలు తిరిగి వస్తే అందులో 700 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఉన్నారు. వారి చదువులకు ఎంత ఖర్చయినా భరించి చదివిస్తం. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తాం. ముఖ్యమంత్రి వరాల వర్షం సెర్ప్, మెప్మా సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు... తిరిగి విధుల్లోకి ‘ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చేందుకు నిర్మించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలు కలుషితం కాకుండా పరిరక్షించడానికి అమలు చేస్తున్న 111 జీవోను ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంచలన ప్రకటన చేశారు. ఆ జీవో అర్థరహితమైపోయిందని, అవసరం కూడా తీరిపోయిందని చెప్పారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో సభ్యుల ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు. ఒక్కసారే ఎత్తేస్తే అరాచకం ‘111 జీవో పరిధిలో 7 మండలాలు, 83 గ్రామాలు, సుమారు లక్షా 32 వేల 600 ఎకరాల భూమి ఉంది. గతంలో ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నగరానికి నీళ్లు తీసుకునేవారు. ఇప్పుడది తగ్గిపోయింది. ఎండా కాలంలో సంక్షోభం వచ్చినప్పుడు నీళ్లు తీసుకునే సందర్భం ఉంది. ఒక నిపుణుల కమిటీ నివేదిక మేరకు రిజర్వాయర్లు కలుషితం కాకుండా ఉండాలంటే నిషేధం పెట్టాలని ఆ రోజుల్లోనే (1996) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరానికి ఇప్పుడు ఈ రెండు జలాశయాల నీళ్లు వాడుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఒక్కసారిగా లక్షా 32 వేల ఎకరాల భూములపై జీవోను ఎత్తేస్తే అరాచకానికి అవకాశం ఉంటది. జీహెచ్ఎంసీ తరహాలో అక్కడ కూడా గ్రీన్ జోన్లు, మాస్టర్‌ప్లాన్ రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎస్, పురపాలక శాఖను ఆదేశించిన. జీవోపై నిపుణుల కమిటీ నివేదిక త్వరలో రావాల్సి ఉంది..’అని ముఖ్యమంత్రి తెలిపారు. ఇతర ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. అనుకూల వాతావరణం చెడిపోతే కష్టం ‘మతకలహాలు పెట్టి ప్రజలను విడదీసి ప్రజలను ఒకరిమీద ఒకరిని పడేసి తన్నేస్తే ఎలా? బెంగళూరులో విమానం దిగితే కర్ఫ్యూ ఉంటదట. హిజాబ్ పంచాయతీ, ప్రజలు ధరించే వస్త్రాలతో అక్కడి ప్రభుత్వానికి ఏం సంబంధం? ఇంత సంకుచిత విధానం చేస్తే దేశం ఎక్కడకు పోతుంది? సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరులో గత ప్రభుత్వాలు గత కొన్ని దశాబ్దాల పాటు సాగించిన కృషి వల్ల అక్కడ 30 లక్షల మంది ఐటీ రంగంలో పొట్టబోసుకుంటున్నారు. హైదరాబాద్‌లో బాగుంటది, ఫార్మా, పౌల్ట్రీ, ఐటీ పరిశ్రమలు పెట్టుకోవచ్చు అంటే ఎవరైన వస్తరు గానీ, ఎయిర్‌పోర్ట్‌ల దిగగానే.. వాళ్లు కత్తులు పట్టుకుని పొడుచుకుంటరట.. కర్ఫ్యూ, 144 సెక్షన్ ఉంటదట అంటే ఎవరొస్తరు? ఎంత పెద్ద ఫార్మా సంస్థ అయినా హైదరాబాద్‌కు వచ్చి సులువుగా కంపెనీ ప్రారంభించుకోవచ్చు. ఇక్కడ అనుకూల వాతావరణం ఉంది. ఈ వాతావరణం చెడిపోతే లక్షలాది మంది యువత భవిష్యత్తు అగమ్యగోచరమైతది. దేశంలో విష బీజాలు నాటుతున్నారు.. బీజేపీ హయాంలో దేశంలో ఏదైనా పెరిగిందంటే అది మత పిచ్చి, మతోన్మాదం, మూకదాడులే. మేం నలుగురం ఎక్కువ ఉన్నమని ఇద్దరి మీద పడి కొట్టడమేనా? ధర్మమైతదా? పద్ధతా? ఇది దేశాన్ని నడిపే విధానమా? అనేక జాడ్యాలను ప్రబలగొట్టి చక్కగా, ప్రేమపూర్వకంగా ఉన్న ఈ దేశంలో విష బీజాలు నాటుతున్నారు..’అని సీఎం ధ్వజమెత్తారు. దేశం ఆకలి రాజ్యమైతా ఉంది ‘యూపీఏ కాలంలో జీడీపీ వృద్ధి రేటు 8 శాతం ఉంటే ఇప్పుడు 6 శాతానికి పడిపోయింది. దుర్మార్గమైన విధానాలతో 5 లక్షల పైచిలుకు పరిశ్రమలు మూతబడ్డాయి. యూపీఏ ఉన్నప్పుడు 4.7 శాతం ఉన్న నిరుద్యోగిత రేటు 7.11 శాతానికి పెరిగింది. దేశం ఆకలిరాజ్యమైతా ఉంది. హంగర్ ఇండెక్స్‌లో పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ తర్వాత 101 స్థానంలో ఉన్నం. వ్యక్తిగత హక్కుల పరిరక్షణలో 81 నుంచి 115కు, మానవ అభివృద్ధి సూచిలో 80 నుంచి 131కి, ప్రజాస్వామ్య విలువ పరిరక్షణలో 56 నుంచి 93వ స్థానానికి దేశం దిగజారింది. కోట్ల మంది పేదరికంలోకి పోయారు. ఇవన్నీ యూఎన్డీపీ, వరల్డ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన లెక్కలే..’అని తెలిపారు. రాష్ట్రాల హక్కులు హరిస్తున్నారు ‘రాష్ట్రాల అఖిల భారత సర్వీసు అధికారుల్లో ఏ అధికారినైనా ఎప్పుడుపడితే అప్పుడు పిలిపించుకునే అధికారం తాము పెట్టుకుంటామని కేంద్రం అనడం చాలా దుర్మార్గం. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది. దీనిని విరమించుకోవాలని కేంద్రానికి బలంగా చెప్పినం. సింగరేణిని కూడా ఖతం చేసే పని పెడ్తున్నరు. రాష్ట్రాల హక్కులను హరించే విధంగా కేంద్రం కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటు చేసింది. మన హక్కులు, మన అవసరాలు తీరిన తర్వాతే నదుల అనుసంధానం చేయాలని కేంద్రాన్ని కోరాం. త్వరలో సీతారామ ఎత్తిపోతలు పూర్తి చేసుకోబోతున్నం..’అని కేసీఆర్ వివరించారు. త్వరలో పోడు భూములకు పట్టాలు ‘పోడు భూముల లెక్కలు తేలినయి. త్వరలో నియోజకవర్గాల్లో పోడు భూముల పట్టాలు జారీ చేస్తాం. సుప్రీంకోర్టులో కేసు తేలిన తర్వాత ఎమ్మెల్యేలు, అధికారులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు తీసుకుంటాం. వరంగల్ జిల్లాలో వర్షాలతో మిర్చి, ఇతర పంటలకు జరిగిన నష్టంపై నివేదికలు వస్తే కడుపునిండా ఆదుకుంటం. వారసత్వ కట్టడాలను పరిరక్షిస్తూనే ఉస్మానియా ఆస్పత్రిని పునర్నిర్మిస్తాం. దేవరయాంజాల్‌లోని ఆలయ భూముల కబ్జా (మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై వచ్చిన ఆరోపణలు) ఆరోపణలపై నలుగురు ఐఏఎస్‌ల కమిటీ నివేదిక ఇచ్చాక గజం భూమి కూడా కబ్జాకు గురికాకుండా ప్రభుత్వం కాపాడుతుంది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో జాప్యం వద్దని అధికారులకు గట్టిగా సూచనలు చేస్తున్న. ధరణి పోర్టల్‌లో చిక్కులు తొలగించడానికి ఏడెనిమిది వెసులుబాట్లను కల్పించాం. భూదాన్ భూములను తక్షణమే ధరణిలో తెస్తాం..’అని చెప్పారు. భట్టిగారిని పార్లమెంటుకు పంపుదాం.. ‘బడ్జెట్ సమయంలో సీఎల్పీ నేత భట్టి గారి ప్రేమకు మేం నోచుకోలేదు, ఒక్కటన్న మంచి మాట మా గురించి చెప్పలేదు అని ప్రతిసారీ నేను సభలో అంటుంటా. ఈసారి ఆయన మన ఊరు మన బడి కార్యక్రమం గురించి సానుకూలంగా మాట్లాడినట్టు పత్రికల ద్వారా తెలుసుకున్నా. ఈ రోజు కేంద్ర ప్రభుత్వ వైఖరి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న తీరుపై ఆయన గట్టిగా మాట్లాడుతుంటే మా వాళ్లు, భట్టిగారిని రాష్ట్రం తరఫున పార్లమెంటుకు పంపితే గట్టిగా మాట్లాడతారని అంటున్నారు..’అని కేసీఆర్ చెప్పారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంలో భట్టి విక్రమార్క, మజ్లిస్ నేత అక్బరుద్దీన్లు తన ఆరోగ్యం గురించి మంచిమాటలు చెప్పినందుకు వారికి ధన్యవాదాలని అన్నారు. సీఎం వరాల వర్షం ‘సెర్ప్లోపనిచేసే 4 వేల పైచిలుకు సిబ్బందితో పాటు మెప్మా సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇస్తాం. సమ్మెకు పోవడంతో గతంలో తొలగించిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను మానవతా దృక్పథంతో మళ్లీ వాపస్ తీసుకుని పనిలో పెడ్తం. మళ్లీ సమ్మెకు పోవద్దని పెద్దన్నగా హెచ్చరిస్తున్న. వీఆర్ఓలను కూడా ఉద్యోగ నియామకాలతో పాటే శాఖలకు పంపిణీ చేయడం జరుగుతుంది. వీఆర్ఏల్లో విద్యాధికులు పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నరు. పే–స్కేల్ ఇచ్చి ఇరిగేషన్ శాఖలో లస్కర్‌గా వీఆర్ఏలను తీసుకోవాలని ఆలోచన చేస్తున్నం. వారి నుంచి ఆప్షన్లు తీసుకుంటాం. రాష్ట్రంలో 54,201 మంది మధ్యాహ్న భోజనం కార్మికులున్నరు. విద్యాశాఖ మంత్రి సూచన మేరకు వారి గౌరవ వేతనాన్ని రూ.1,000 నుంచి రూ.3 వేలకు పెంచాలని నిర్ణయించాం’ అని కేసీఆర్ తెలిపారు. మన అప్పులు చాలా తక్కువ.. ‘అప్పుల్లో మనం 25వ స్థానంలో ఉన్నాం, మనకంటే ఎక్కువ అప్పు తెచ్చుకుంటున్న రాష్ట్రాలు మరో 24 ఉన్నాయి. జీఎప్డీపీలో మన అప్పుల వాటా 23 శాతమే. 40 శాతానికి పైబడ్డ రాష్ట్రాలూ ఉన్నాయి. మన అప్పులు చాలా తక్కువ. అప్పులతో మనకొచ్చే నష్టం లేదు. కేంద్రం ఆర్థిక పనితీరు మనకంటే తక్కువగా ఉంది. జీడీపీలో కేంద్రం అప్పుల వాటా 58.5 శాతం. రూ.152 లక్షల కోట్ల అప్పులున్నాయి. కేంద్రం తీరు బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు అన్నట్టుగా ఉంది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోంది..’అని విమర్శించారు. డబుల్ ఇంజన్ కాదు ట్రబుల్ ఇంజన్! ‘డబుల్ ఇంజన్ గ్రోత్ ఉన్న రాష్ట్రాలు చాలా బాగుపడ్డాయి అని ఓ పుణ్యాత్ముడు మాట్లాడిండు. డబుల్ ఇంజన్ గ్రోత్ ఉన్న యూపీతో పోల్చితే.. రూ. 2.78 లక్షల తలసరి ఆదాయంతో తెలంగాణ నంబర్ వన్‌గా ఉంది. రూ.71 వేలతో యూపీ అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉంది. యూపీ ఆర్థికాభివృద్ధి రేటు 7.26 శాతమైతే తెలంగాణది 10.8 శాతం. యూపీలో 2017 నుంచి 21 వరకు వృద్ధిరేటు 25.6 శాతం అయితే.. మన సింగిల్ ఇంజన్ గ్రోత్ 55.46 శాతం. యూపీలో మాతా మరణాల రేటు 167 ఉంటే తెలంగాణలో కేవలం 56. యూపీలో శిశు మరణాల రేటు 41, తెలంగాణలో 23. మతపిచ్చి, రాష్ట్రాల అధికారాలను హరించే పద్ధతులు, సంస్కరణల పేరిట జరిగే మర్మ మాయాజాలం.. వీటన్నింటినీ తట్టుకుని తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన ప్రగతి సాధించింది..’ అని సీఎం తెలిపారు. -
చిన్నపాటి జ్ఞాపకం గుర్తు చేసుకున్న కేసీఆర్
-
అక్కడ బటన్ నొక్కితే చాలు డబ్బులు టంగ్ టంగ్ అని పడ్డాయి..
-
ఆ అధికారుల గొంతుకోసే.. కేంద్రం ప్లాన్ ని బయటపెట్టిన కేసీఆర్
-
బడ్జెట్ గురించి తెలుసుకోవాలా? అయితే ఈ వీడియో చూడండి
-
కాగ్ నివేదికను ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
-
మత చిచ్చు పెడుతున్నారు.. యువత భవిష్యత్తుకు ఇది ప్రమాదం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ అంటే బ్రహ్మపదార్థం కాదని సీఎం కేసీఆర్ తెలిపారు.. బడ్జెట్ అంటే అంకెలు మాత్రమే చెబుతారన్న అపోహా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ మంగళవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బడ్జెట్ అద్భుతమని అధికారపక్షం అంటే, బాగాలేదని ప్రతిపక్షం విమర్శిస్తుందన్నారు. ఈ విమర్శలు సహజమని అన్నారు. బడ్జెట్ అనేది నిధుల కూర్పు అని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ కూడ కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశ తొలి బడ్జెట్ 190 కోట్లు అయితే అందులో 91 కోట్లు రక్షణకే కేటాయించినట్లు పేర్కొన్నారు. అవినీతిని పూర్తిగా నిర్మిలించాం ప్రభుత్వాలకు అప్పులు సహజమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు ఏపీ బడ్జెట్ రూ.680 కోట్లు ఉంటే ఇప్పుడేమో బడ్జెట్ లక్షల కోట్లకు చేరిందన్నారు ప్రజాస్వామ్య ప్రభుత్వానికి రెండే అధికారులు ఉంటాయన్న కేసీఆర్.. ఎవరికైనా ట్యాక్స్‌లు వేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చని తెలిపారు. కొత్త రాష్ట్రమైనా తెలంగాణ అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రశంసించారు. రాష్ట్రంలో అవినీతిని పూర్తిగా నిర్మిలించామని చెప్పారు. అప్పులనేది వనరుల సమీకరణ కింద భావిస్తామని. వనరుల సమీకరణలోనూ కఠోరమైన క్రమశిక్షణ పాటిస్తున్నామని తెలిపారు. అప్పులుచేసే రాష్ట్రాల్లో మన ర్యాంకు 28గా ఉందనిని సీఎం కేసీఆర్ తెలిపారు. అందుకే భట్టిని పార్లమెంట్‌కు పంపాలనుకుంటున్నా సీఎం కేసీఆర్కేంద్రం విషయాలను ఇక్కడ సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క గట్టిగా మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే భట్టిని పార్లమెంట్‌కు పంపాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇన్నాళ్లకు తమపై భట్టికి దయ కలిగిందని, మన ఊరు- మన బడి మంచిదని భట్టి చెప్పినట్లు తెలిపారు. భట్టికి ప్రమోషన్ ఇవ్వాలని తెలిపారు. తన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్న భట్టి ధన్యవాదాలు తెలిపారు. చదవండి: హైకోర్టు ఉత్తర్వు కాపీలతో అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు.. స్పీకర్ ఏమన్నారంటే.. ‘మన అప్పులు శాతం కూడా 23 శాతమే. మనకంటే ఎక్కువ అప్పులుచేస్తున్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. అప్పులపై భట్టికి ఆందోళన అక్కర్లేదు. రాష్ట్రాల ఉనికి లేకుండా చేస్తాం, రాష్ట్రాలను అణిచేస్తాం అనే దుర్మార్గ వైఖరితో కేంద్రం ఉంది. కేంద్రం పనితీరు మనకన్నా దారుణంగా ఉంది. ప్రస్తుతం భారతదేశం అలప్పు 152 లక్షల కోట్లు. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగిస్తోంది. దేశంలో ఫెడరలిజం ఇప్పుడు ప్రమాదంలో ఉంది. ఐఎస్‌ఎస్‌ల విషయంలోనూ కేంద్రం కొత్త అధికారాల కోసం ప్రయత్నిస్తోంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పాం. మత చిచ్చు దేశానికి మంచిది కాదు హైదరాబాద్ ఐటీ ఎగుమతుల విలువ ఏడాదికి దాదాపు లక్షన్నర కోట్లు. రాష్ట్రాల్లో పరిస్థితులు దిగజారితే పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి. హిజాబ్ వంటి సమస్యలు ఉంటే పారిశ్రామిక వేత్తలు వస్తారా? మత చిచ్చు దేశానికి మంచిది కాదు. దేశంలో మతోన్మాదం, మూకదాడులు పెరుగుతున్నాయి. ఇలాంటి వివాదాలు మన దేశ యువత భవిష్యత్తును దెబ్బతీస్తాయి. 25 వేల మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. ఎంబీబీఎస్ చదవుకోడానికి అక్కడికి వెళ్లారు. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ ఖర్చు తక్కువ అని విద్యార్థులు చెబుతున్నారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ప్రభుత్వం చదివిస్తుంది.’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. -
తెలంగాణ స్పీకర్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు
-
హైకోర్టు ఉత్తర్వు కాపీలతో అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు.. స్పీకర్ ఏమన్నారంటే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీతో శాసన సభకు చేరుకున్న సస్పెండెడ్ బీజేపీ ఎమ్మెల్యేలకు నిరాశే ఎదురైంది. బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ అసెంబ్లీలోకి అనుమతివ్వలేదు. సభ నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు జేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావు వెళ్లిపోయారు. తమ అభ్యర్థనను స్పీకర్ తిరస్కరిస్తున్నట్లు చెప్పారని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. కాగా శాసనసభ్యులను సహేతుకమైన కారణాలు లేకుండానే సస్పెండ్ చేయడం వారి హక్కులను హరించడమేనని హైకోర్టు సోమవారం పేర్కొన్న విషయం తెలిసిందే . తమను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సింగిల్ జడ్జి కొట్టివేయడంపై.. బీజేపీ ఎమ్మెల్యేలు రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావులు దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం విచారించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పునిచ్చింది. ఈ సెషన్ మొత్తం సభకు హాజరుకాకుండా బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ నిర్ణయానికి సహేతుకమైన కారణాలు లేవని భావిస్తున్నామని హైకోర్టు పేర్కొంది. సస్పెండైన ముగ్గురు ఎమ్మెల్యేలు శాసనసభ కార్యదర్శిని కలిసి వినతిపత్రం సమర్పించాలని, సమావేశాలకు అనుమతించాల్సిందిగా కోరాలని సూచించింది. కార్యదర్శి వీరిని మంగళవారం సభకు ముందే స్పీకర్ దగ్గరికి తీసుకెళ్లాలని, వారి అభ్యర్థనను స్పీకర్ విని తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. -
తలసాని v/s రాజగోపాల్‌రెడ్డి.. ‘కాంట్రాక్టర్లపైనే ధ్యాస’.. ‘తెల్లారితే పేకాటే’
సాక్షి, హైదరాబాద్: ‘‘ఆయనో కాంట్రాక్టర్.. ప్రజా సమస్యల గురించి అడగడు. దృష్టంతా కాంట్రాక్టర్ల మీదే..’’ – కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వ్యాఖ్య ఇది. ‘‘ఇప్పుడు నేను కాంట్రాక్టర్‌ను కాదు.. ప్రజాజీవితంలో ఉన్న ఎమ్మెల్యేను. పొద్దున లేస్తే పేకాటలో ఉండే శ్రీనివాసయాదవ్ నన్ను అనటమేంటి?’’ – తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రాజగోపాలరెడ్డి కౌంటర్ ఇది. నేతల మధ్య సోమవారం జరిగిన ఈ వాగ్వాదంతో రాష్ట్ర శాసనసభ అట్టుడికింది. తలసాని, రాజగోపాల్‌రెడ్డి ఇద్దరూ పరస్పరం ఆరోపణలు గుప్పించుకోవడం.. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలను తప్పుపడుతూ, క్షమాపణ చెప్పాలని అధికారపక్ష సభ్యులు డిమాండ్ చేయడంతో గందరగోళం నెలకొంది. మొదట అసెంబ్లీలో పద్దులపై చర్చలో భాగంగా టీఆర్ఎస్ సర్కారుపై రాజగోపాల్‌రెడ్డి విమర్శలు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న చోట్ల గ్రామాలకు కేంద్ర నిధులు విడుదల చేయటం లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డికి శ్రీధర్‌బాబు మద్దతు ప్రకటించారు. నన్ను కాంట్రాక్టర్ అంటారా..? టీఆర్ఎస్ సర్కారు లక్షల కోట్లు ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందని.. స్థానిక చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులివ్వక వేధిస్తోం దని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న మంత్రి తలసాని.. రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టర్ కావటంతో ఆయన దృష్టంతా కాంట్రాక్టర్లపైనే ఉంటుందని విమర్శించారు. రాష్ట్రానికి చెందిన చిన్న కాంట్రాక్టర్లకు అన్యాయం చేస్తున్నారని మాట్లాడితే.. తాను కాంట్రాక్టర్‌నంటూ ఎలా అంటారని మండిపడ్డారు. పొద్దున లేచినప్పటి నుంచి పేకాటలో మునిగే తలసాని తన గురించి మాట్లాడటమేమిటన్నారు. చదవండి: కీసరగుట్టలో అడవుల్లో కార్చిచ్చు క్షమాపణ చెప్పాల్సిందే.. బలహీనవర్గాల నేత తలసానిపై రాజగోపాల్ వ్యాఖ్యలు సరికాదని మంత్రి ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరగా.. ఆయన తొలగిస్తున్నట్టు ప్రకటించారు. అయినా అధికారపక్ష సభ్యులు కోమటిరెడ్డి క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన రాజగోపాల్.. ‘నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా’ అని మాత్రమే చెప్పారు. రాజగోపాల్‌రెడ్డితో తలసానికి క్షమాపణ చెప్పించాలని ఈ సందర్భంగా భట్టికి స్పీకర్ సూచించారు. కానీ భట్టి స్పందిస్తూ.. తలసాని, రాజగోపాల్‌రెడ్డి ఇద్దరి వ్యాఖ్యలు సరికావని, రెంటినీ రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. కాంగ్రెస్ నేత జుగుప్సాకర మాటలు: కేటీఆర్ సభలో కాంగ్రెస్ సభ్యులు, బయటనేమో వారినేత జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ సాధించిన నేతగా ఇటీవల కేసీఆర్ పుట్టినరోజును సంబురంగా జరుపుకోవాలని మేం పిలుపునిస్తే.. కాంగ్రెస్ నాయకుడేమో 3రోజులు సంతాప దినాలు జరుపుకోవాలన్నారు. ఇటీవల చిన్న ఆరో గ్య సమస్యతో సీఎం ఆస్పత్రికి వెళ్తే.. ముందురోజు వచ్చిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావమని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడేమో బలహీనవర్గాలకు చెందిన మంత్రిని పేకాట ఆడుతారంటారా? స్కాంలో కూరుకుపోయిన దౌర్భాగ్యపు పార్టీ వాళ్లా అవినీతి గురించి మాట్లాడేదని మండిపడ్డారు. చదవండి: ఆరు నెలల పాటు సినిమాలు, వాట్సాప్ చూడకండి: కేటీఆర్ -
సభలో నవ్వులు పూయించిన కేటీఆర్
-
రాష్ట్రంలో కొత్తగా 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు: మంత్రి హరీశ్‌రావు
-
పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నాం: నిరంజన్‌రెడ్డి
-
వైద్య విద్యార్థులకు శుభవార్త చెప్పిన హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: 60 ఏళ్ళలో తెలంగాణలో 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే.. 6 ఏళ్ళలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న 700 ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను.. వచ్చే విద్యా సంవత్సరానికి ఈ సంఖ్య 2,850కి పెంచుకోవడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా యూజీ సీట్లు 1640కి, పీజీ సీట్లు 934కు పెంచడం జరిగిందన్నారు. ఈ మేరకు శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇస్తూ.. కేంద్రం తెలంగాణపై నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా 171 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే.. తెలంగాణకు ఒక్క కాలేజీ ఇవ్వకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందన్నారు. నిమ్స్‌లో ప్రస్తుతం 1400 పడకలు ఉన్నాయని, మరో 2 వేల పడకలు అదనంగా ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలలో డెడ్ బాడీల కొరత ఉందని, చట్ట సవరణ చేసి డెడ్ బాడీలను మెడికల్ కాలేజీలకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామని, కొత్తగా ఏర్పాటు చేసిన 8 మెడికల్ కాలేజీలలో ఈ సంవత్సరమే క్లాసులు ప్రారంబిస్తామని వెల్లడించారు. చదవండి: రెండోసారి మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి -
తెలంగాణ అసెంబ్లీ: ‘ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కారించాం’
►పట్టణాల్లో ఉండే పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరంలో బస్తీ దవాఖానాలను ప్రారంభించారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చడానికి బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 259 బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మరో 91 బస్తీ దవాఖానాలను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో సందర్భంగా బస్తీ దవాఖానాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు. ►తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించామని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెరిగిందని అన్నారు. రాష్ట్రంలో 26 లక్షల 36 వేల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయని, 35 వేల కోట్లతో విద్యుత్ రంగ సంస్థలకు చేయూతనిచ్చామని తెలిపారు. విద్యుత్ నష్టాలలో జాతియ సగటు కంటె తెలంగాణ సగటు తక్కువ ఉందని పేర్కొన్నారు. విద్యుత్ తీగలకు దగ్గరగా ఇళ్ళ నిర్మాణం చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నివారిస్తామని వెల్లడించారు. ►తెలంగాణలో పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని మంత్రి స్పష్టం నిరంజన్ రెడ్డి చేశారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. పంట మార్పిడి విధానంలో భాగంగా భారీ స్థాయిలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ►కాసేపట్లో తెలంగాణ శాసన మండలి సమావేశం ప్రారంభం కానుంది. సభ ప్రారంభం కాగానే మండలి చైర్మన్‌ను ప్రొటెం చైర్మన్ జాఫ్రీ ప్రకటించానున్నారు. అనంతరం ఛైర్మెన్ చైర్ వద్ద కొత్త ఛైర్మన్‌ను మండలి సభ్యులు తీసుకెళ్లనున్నారు. సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అయితే నేడు జీరో అవర్ కూడా ఉంటుందని, సభ్యులు ప్రశ్నలు అడగాలని, ఉపన్యాసాలు ఇవ్వద్దని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం, ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు, పోలీసు శాఖ ఆధునీకరణ, రాష్ట్రంలో విద్యుత్ రంగం, జీహెచ్ఎంసీ ప్రాంతంలో బస్తీ దవాఖానాలు, వ్యవసాయ పంపుసెట్లకు ప్రీపెయిడ్ మీటర్లు, వివిధ సంస్థల నుంచి రుణాలు, నిమ్మకాయల నిల్వ కొరకు నకిరేకల్ వద్ద శీతలీకరణ గిడ్డంగి వంటి అంశాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. కాగా మార్చి7న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. రేపటితో బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. చదవండి: మండలి చైర్మన్‌గా గుత్తా నామినేషన్ -
కరెంట్, మంచి నీళ్లు బంద్ చేస్తాం.. కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఆర్మీ పరిధిలో ఉన్న కంటోన్మెంట్ బోర్డు తీరు సరిగా లేదని.. అది హైదరాబాద్ నగర అభివృద్ధికి అడ్డంకిగా మారుతోందని ఐటీ పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కె.తారకరామారావు మండిపడ్డారు. ఆ ప్రాంత నిర్వహణపై స్వయం ప్రతిపత్తి ఉన్నంత మాత్రాన.. రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ నగరపాలక సంస్థలు చేసిన సూచనలను పట్టించుకోకపోవడం సరికాదని స్పష్టం చేశారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా శనివారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో కేటీఆర్ మాట్లాడారు. ‘‘ఆర్మీ పరిధిలో ఉన్న కంటోన్మెంట్ బోర్డు వ్యవహారం నగర అభివృద్ధికి అడ్డంకిగా మారుతోంది. ఏఎస్ఐ సమీపంలోని బోర్డు ప్రాంతంలో చెక్‌డ్యాం నిర్మించారు. అక్కడ చేరుకున్న నీటితో కింద ఉన్న నదీమ్ కాలనీలోకి నీళ్లు వస్తున్నాయి. కంటోన్మెంట్ పరిధిలో రోడ్లను కూడా మూసేస్తున్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు సూచనలు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే కరెంటు, నీటి సరఫరా బంద్ చేస్తాం.’’అని హెచ్చరించారు. హైదరాబాద్‌పై మోదీ స్పందించరేం? రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలు ముంపునకు గురైన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. అప్పట్లో కేంద్ర మంత్రులు, ఇతర బీజేపీ నాయకులు వచ్చి చుట్టపుచూపుగా చూసి వెళ్లడమే తప్ప.. ఇప్పటికీ పైసా సాయం అందించకపోవడం బాధాకరమన్నారు. గుజరాత్లో వరదలు వస్తే వెంటనే స్పందించి రూ.వెయ్యి కోట్లు సాయం చేసిన ప్రధాన మంత్రి మోదీ.. హైదరాబాద్ విషయానికి వస్తే ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. ఇక తెలంగాణ నుంచి ఒకవ్యక్తి కేంద్ర మంత్రిగా ఉన్నారని.. కనీసం ఆ మంత్రి కూడా హైదరాబాద్‌కు వరద సాయం కోసంఏమాత్రం ప్రయత్నించకపోవడం సిగ్గుచేటని కిషన్‌రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. Live: Replying to a question on ‘Strategic Nala Development Program (SNDP) in Hyderabad’ city https://t.co/7Fw8Zxdo5E — KTR (@KTRTRS) March 12, 2022 వ్యూహాత్మక ప్రాజెక్టులు చేపట్టాం భారీ వర్షాలు, వరదల నుంచి నగరాన్ని రక్షించేందుకు, సమగ్ర అభివృద్ధి కార్యక్రమాల కోసం వ్యూహాత్మక ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ శాసనసభలో వివరించారు. ఇందుకోసం షా కన్సల్టెన్సీని ఎంపిక చేసి పూర్తి స్థాయి సర్వేలు చేయించామని.. అభివృద్ధి కార్యక్రమాలను మూడు విధాలుగా విభజించి చేపడుతున్నామని తెలిపారు. ముందుగా ఎంసీహెచ్ (పాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) పరిధిలోని అంతర్గత మురుగు వ్యవస్థ, నాలా వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పాత పైపులైన్లను పునరుద్ధరించేందుకు రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. మురుగు నీటి పారుదల, వరద నీటి పారుదలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాల్సిందని.. ఇన్నాళ్లుగా ఆ రెండూ కలిపి ఉండటంతో ఇబ్బందులు వస్తున్నాయని కేటీఆర్ వివరించారు. కొన్నిచోట్ల తాగునీటి పైపులైన్లు కూడా వీటిలో కలుస్తున్నాయని చెప్పారు. వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా వీటన్నింటినీ వేర్వేరుగా, ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ పరిధిలోని నాలాలపై దాదాపు 10వేలకు పైగా ఆక్రమణలు, నిర్మాణాలు ఉన్నాయని.. వాటిని తొలగించేందుకు వ్యూహాత్మక నాలా అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టామని వివరించారు. ఆక్రమణలు తొలగించి బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. -
కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా రాలేదు..
-
పద్మారావు గౌడ్, రసమయి మధ్య వాగ్వాదం.. షాక్‌లో టీఆర్ఎస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు, అధికార పార్టీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో రసమయి ప్రశ్నలు అడుగుతుండగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు.. మైక్ కట్ చేసి ఎమ్మెల్యే గొంగడి సునీతకు మైక్ ఇచ్చారు. ఇంతలో దీనిపై రసమయి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సభలో మాట్లాడదాం అంటే మాట్లాడే అవకాశాలు రావు.. కనీసం ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఇవ్వకుంటే ఎలా? అని అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నలే అడగవద్దు అన్నప్పుడు తమకు ప్రశ్నలు ఎందుకు ఇవ్వడం అంటూ అసంతృప్తి వ్యక్తపరిచారు. తాను ప్రశ్నలే అడుగుతున్నానని వాదించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆయన వ్యాఖ్యలపై పద్మారావు స్పందిస్తూ.. తొందరగా ప్రశ్నలే అడగండి.. ప్రసంగాలు వద్దూ అంటూ వ్యాఖ్యలు చేశారు. గంటన్నరలో 10 ప్రశ్నలు పూర్తి చేసుకోవాలని చెప్పారు. దీంతో అసహనం వ్యక్తం చేస్తూ రసమయి తన కుర్చీలో సైలెంట్‌గా కూర్చుండిపోయారు. -
తెలంగాణ అసెంబ్లీ.. ఐదవరోజు సమావేశాలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సెషన్ 2022-23లో భాగంగా.. శనివారం ఉదయం ఐదవ రోజు సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. చేపల పెంపకానికి ప్రోత్సాహం, హైదరాబాద్ నగరంలో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం, నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం, జీహెచ్ఎంసీ, ఇతర జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల సౌకర్యం, రాష్ట్రంలో నేత కార్మికుల సంక్షేమం, ఓఆర్ఆర్ వెలుపల ఆవాసాలకు తాగునీరు, జర్నలిస్టుల సంక్షేమంతో పాటు అంశాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి. ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం బడ్జెట్ పద్దులపై చర్చించనున్నారు. అనంతరం సభలో రెండు బిల్స్ తో పాటు 6 పద్దులు చర్చకు రానున్నాయి. సాంకేతిక విద్య ,పర్యాటకం , మెడికల్ అండ్ హెల్త్ , మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ ,లేబర్ ఎంప్లాయిమెంట్ , అడవుల అభివృద్ధి పై సభలో చర్చ జరగనుంది. సభలో ప్రశ్నలే అడగాలని, ప్రసంగాలు వద్దంటూ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సూచించడం విశేషం. -
అప్డేట్స్: శనివారానికి తెలంగాణ అసెంబ్లీ వాయిదా
►తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారానికి వాయిదా పడ్డాయి. ►తెలంగాణలో మత కల్లోలాలు లేవని, ప్రజలందరూ ప్రశాంతంగా నిద్ర పోతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పేర్కొన్నారు. పోలీసులు సమర్థవంతంగా పని చేయడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన చెప్పారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే కిరణ్ మాట్లాడారు. ►తెలంగాణలో మద్యం అమ్మకాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తప్పుబట్టారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు శాసనసభలో మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ప్రతి పాన్ షాపు బెల్ట్ షాపే.. ప్రతి కిరాణ షాపు బెల్ట్ షాపే అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పద్మారావు గౌడ్ స్పందిస్తూ.. తప్పుడు ఆరోపణలు చేయొద్దని శ్రీధర్ బాబుకు సూచించారు. హైదరాబాద్ సిటీలో ఎక్కడా బెల్ట్ షాపు ఉండదని అన్నారు. ►‘మండల్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఎక్కడో ఒక చోట, 10 కిలోమీటర్ల దూరంలో వైన్ షాపు ఉంటది. అక్కడికి వెళ్లి తెచ్చుకునేందుకు ఇబ్బంది పడుతారని చెప్పి.. అదేదో తెచ్చి గ్రామాల్లో పెడుతరు. అయితే గ్రామానికి, కిరణా షాపుల్లో, అక్కడ ఇక్కడ బెల్ట్ షాపులు ఉండు. గతంలో ఎక్సైజ్ మంత్రిగా పని చేశాను.. తాను ఇక్కడ కూర్చొని చెప్పొద్దు కానీ చెప్పాల్సి వస్తుంది’ అని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. ► ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు చేయబోతున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేసీఆర్ కిట్ పథకం అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు.సీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద 2017, జూన్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు 13 లక్షల 29 వేల 951 మందికి లబ్ధి చేకూరింది. ► శాసనసభలో ప్రశ్నోత్తారల సందర్భంగా మన ఊరు – మన బడి పథకం అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 వేల ప్రభుత్వ బడుల్లో 22 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, ఈ స్కూళ్లను మన ఊరు – మన బడి పథకం కింద అభివృద్ధి చేస్తున్నామని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ఈ ఒక్క ఏడాదే కొత్తగా 3 లక్షల మంది చేరారని సబిత తెలిపారు. ►సభలో ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా మన ఊరు – మన బడి, కేసీఆర్ కిట్, సింగరేణి కాలరీస్ సంస్థ ప్రయివేటీకరణ, పోడు భూముల పంపిణీ, పల్లెప్రగతి, నూతన ఆస్పత్రుల ఏర్పాటుపై చర్చించనున్నారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిసిన తర్వాత బడ్జెట్ పద్దులపై చర్చ చేపట్టనున్నారు. సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు Telangana Assembly Budget Session 2022 నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. -
బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు కారణాలేంటి?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావులను సస్పెండ్ చేయడానికి కారణాలేంటో తెలపాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను హైకోర్టు ఆదేశించింది. శాసనసభ సమావేశాలు ప్రారంభమైన ఈ నెల 7న సభలో ఏం జరిగిందో చెప్పాలంది. సమావేశాల ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించి పిటిషనర్ సమర్పించిన వీడియో సరైనది కాదన్నప్పుడు సభలో రికార్డు చేసిన ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించిన వీడియోను సమర్పించడానికి అభ్యంతరమేంటని ప్రశ్నించింది. శాసనసభ కార్యదర్శి, శాసనసభ సెక్రటేరియట్ కార్యదర్శిలకు నోటీసులు జారీ చేస్తున్నామని, సస్పెన్షన్‌కు కారణాలు తెలియజేయాలని స్పష్టం చేసింది. తమను చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా సస్పెండ్ చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ బుధవారం విచారించారు. సరైన కారణాల్లేకుండానే సస్పెన్షన్ సరైన కారణాలు లేకుండానే బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. నిబంధనల ప్రకారం సభ వ్యవ హారాలను అడ్డుకున్న సభ్యు డి పేరును స్పీకర్ ప్రస్తావించాలని, వారిని సస్పెండ్ చేయాలని కోరుతూ శాసనసభ వ్యవహారాల మంత్రి తీర్మానాన్ని ప్రతిపాదించాల్సి ఉంటుందని అన్నారు. స్పీకర్ ఎవరి పేరును ప్రస్తావించకుండానే ముందు రాసుకొచ్చిన మేరకు బీజేపీకి చెందిన ముగ్గురు సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తీర్మానం ప్రతిపాదించారని తెలిపారు. గవర్నర్‌ను ఆహ్వానించకపోవడంపై బీజేపీ సభ్యులు నిరసన తెలిపారని.. రాజేందర్, రఘునందన్‌రావులు తమ స్థానాల్లో ఉండి నిరసన తెలిపారని, రాజాసింగ్ స్పీకర్ స్థానం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారని వివరించారు. స్పీకర్ స్థానం వైపు వెళ్లినంత మాత్రాన సస్పెం డ్ చేయడానికి వీల్లేదని.. రాజ్యాంగ, చట్ట నిబంధనలకు విరుద్ధంగా వారిని సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. చదవండి: (Telangana Assembly: బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్) సస్పెన్షన్ ఉత్తర్వులను ఇవ్వట్లేదు సస్పెండ్ ఉత్తర్వులను పిటిషన్‌తో పాటు ఎందుకు సమర్పించలేదని ప్రకాశ్‌రెడ్డిని ప్రశ్నిం చగా.. తాము కోరినా శాసనసభ కార్యదర్శి ఇవ్వడం లేదని తెలిపారు. వీరిని సస్పెండ్ చేసినట్లు అన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిందని, ఓ చానల్లో వచ్చిన వీడియోను సమర్పించామని తెలిపారు. సస్పెండ్ చేస్తూ జారీచేసిన ఉత్తర్వులతో పాటు 7న సభా వ్యవహారాలకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారం వీడియోను సమర్పించేలా ఆదేశించాలని కోరారు. ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. సభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లే దని నివేదించారు. సమావేశాలకు సంబంధిం చి పిటిషనర్ సమర్పించిన వీడియో సరైనది కాదన్నారు. విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేశారు. -
భట్టికి మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్
-
ప్రజల ఆకాంక్షలు, ఆశలు తీరేలా బడ్జెట్ లేదు: భట్టి విక్రమార్క
-
సీఎం కేసీఆర్ ప్రకటనతో కరీంనగర్లో అంబరాన్నంటిన సంబరాలు
-
కాంట్రాక్ట్ ఉద్యోగులకు కేసీఆర్ తీపి కబురు..
-
జిల్లాల వారీగా పోస్టుల వివరాలు
-
సంబరాల్లో తెలంగాణ నిరుద్యోగులు
-
తెలంగాణలో కొలువుల పండగ
-
తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీ
-
నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ డబుల్ ధమాకా
-
నేనూ పోలీసు దెబ్బలు తిన్నా...
-
ఆరోగ్య భాగ్యం
వైద్య,ఆరోగ్యశాఖకు ఈసారి నిధులు గణనీయంగా పెరిగాయి. 2021–22 బడ్జెట్లో రూ.6,295 కోట్లు కేటాయిస్తే.. 2022–23 బడ్జెట్లో ఏకంగా రూ.11,237 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే రూ.4,942 కోట్లు అదనంగా కేటాయించారన్నమాట. ప్రతి జిల్లాకో వైద్య కళాశాల లక్ష్యంగా బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు. ఏ జిల్లాలో ఎప్పుడు మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలో నిర్ధారించారు. హైదరాబాద్ నగరం నలుదిక్కులా.. అంటే గచ్చిబౌలి, ఎల్బీనగర్, అల్వాల్, ఎర్రగడ్డలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో ఆసుపత్రిలో వెయ్యి పడకలు, నిమ్స్‌లో మరో రెండు వేల పడకలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో మొత్తం 3,489 పడకలు అందుబాటులోకి వస్తాయి. వరంగల్‌లో హెల్త్ సిటీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. – సాక్షి, హైదరాబాద్ వచ్చే ఏడాది నుంచి 8 మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాకో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. తెలంగాణ ఏర్పడినప్పుడు 5 మెడికల్ కాలేజీలే ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడగానే మొదటి విడతగా మహబూబ్‌నగర్, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేటలో కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించింది. వీటిలో పీజీ కోర్సులు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం మరో 8 కళాశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. రాబోయే వైద్య విద్యా సంవత్సరం నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. ఇక రాబోయే రెండు సంవత్సరాల్లో మిగిలిన అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 8 కళాశాలలను ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఏర్పాటు చేస్తారు. 2023 సంవత్సరంలో మిగతా జిల్లాలు.. మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణపేట, గద్వాల, యాదాద్రిల్లో ఏర్పాటు చేయనుంది. కొత్త కాలేజీల స్థాపన కోసం ఈ బడ్జెట్లో ప్రభుత్వం రూ.1,000 కోట్లు ప్రతిపాదించింది. కాగా ఆరోగ్యశ్రీకి రూ.1,343 కోట్లు, కేసీఆర్ కిట్‌కు రూ.443 కోట్లు కేటాయించింది. వైద్యారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం బడ్జెట్లో 4.5 శాతం ఆరోగ్యరంగ అభివృద్ధికే కేటాయించడం శుభపరిణామమని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు అన్నారు. బడ్జెట్లో వైద్యారోగ్య శాఖకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావులకు డిపార్ట్మెంట్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ దవాఖాన్లాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తదితరాలకు రూ.1,400 కోట్లు కేటాయించారని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుతో మారుమూల ప్రజలకు కూడా స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. -
అభివృద్ధి నిధులు ‘స్పెషల్’!
సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజనుల ప్రత్యేక అభివృద్ధి నిధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా కేటాయింపులు చేసింది. ఏటా ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నా.. తాజాగా 2022–23 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో నిధులు పెంచింది. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ.47,350.37 కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ నిధులు పెంచామని తెలిపారు. ఇందులో ఎస్సీ ఎస్డీఎఫ్ కింద రూ.33,937.75 కోట్లు, ఎస్టీ ఎస్డీఎఫ్ కింద రూ.13,412.62 కోట్లు చూపారు. గత బడ్జెట్లో ఈ నిధికి రూ.33,610.06 కోట్లు కేటాయించగా.. ఈసారి అంతకన్నా రూ.13,740.31 కోట్లు పెరిగాయి. ఈ ఫండ్‌కు కేటాయించిన నిధులను సంబంధిత సంక్షేమ శాఖలతోపాటు 42 ప్రధాన ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దళితబంధుకు భారీ నిధులు కరోనా ప్రభావం కారణంగా రెండేళ్లుగా సంక్షేమ శాఖలకు కేటాయింపులు పెద్దగా చేయలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం, రోజువారీ జనజీవనం సాధారణ స్థితికి రావడంతో సంక్షేమ కార్యక్రమాల అమల్లో వేగం పెంచినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా నిధుల కేటాయింపులు పెంచుతున్నట్టు తెలిపింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళిత బంధు పథకానికి తాజా బడ్జెట్లో ఏకంగా రూ.17,700 కోట్లు కేటాయించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మందికి లబ్ధి చేకూరుస్తామని ప్రకటించింది. దళిత బంధు పథకానికి భారీగా నిధులు కేటాయించడంతో ఎస్సీ ఎస్డీఎఫ్లోనూ భారీ పెరుగుదల నమోదైంది. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు నిధుల కేటాయింపులు పెరగడంతో.. పెండింగ్‌లో ఉన్న పథకాలు, ఇతర సమస్యలకు పరిష్కారం లభించినట్టేనని అధికారవర్గాలు చెప్తున్నాయి. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న వివిధ రాయితీ పథకాలకు మోక్షం కలుగుతుందని పేర్కొంటున్నాయి. -
ఫామ్‌లోకి ఆ యిల్‌పామ్
సాక్షి, హైదరాబాద్: మొత్తంగా వ్యవసాయ రంగానికి రూ. 24,254 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అయితే గతేడాది కంటే వ్యవసాయానికి నిధులు స్వల్పంగా తగ్గించింది. గత ఏడాది రూ.25 వేల కోట్లు కేటాయించగా ఈసారి అందులో రూ.746 కోట్లు తగ్గించి బడ్జెట్ ప్రతిపాదనలు చేసింది. రైతుబంధు పథకానికి రూ.14,800 కోట్లు కేటాయించింది. ఎన్ని ఆర్థిక కష్టాలు ఎదురైనా రైతుకు, సాగుకు అండగా నిలిచే రైతుబంధు పథకానికి ప్రభుత్వం అవసరమైన కేటాయింపులు చేస్తూనే ఉంది. ఇప్పటివరకు రైతుబంధు కింద ఎనిమిది విడతల్లో రూ.50,448 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. తద్వారా 63 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. ఇక రైతుబీమా ప్రీమియం కోసం గతేడాది రూ.1,200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి రూ.1,488 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది రైతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున అదనపు కేటాయింపులు చేసింది. రైతు ఏ కారణంతోనైనా మరణిస్తే ఈ పథకం కింద అతని కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందుతుంది. ఇప్పటివరకు వివిధ కారణాలతో మరణించిన సుమారు 75 వేల మంది రైతుల కుటుంబాలకు రూ. 3,775 కోట్ల సాయం అందజేసింది. ఉద్యానశాఖకు గణనీయంగా పెరిగిన బడ్జెట్ ఉద్యానశాఖకు కూడా ప్రభుత్వం ఈ బడ్జెట్లో భారీగా రూ.994.85 కోట్లు కేటాయించింది. గతేడాదితో (రూ.242.30 కోట్లు) పోల్చితే రూ.752.55 కోట్లు అధికంగా కేటాయించడం గమనార్హం. రైతులను వరి నుంచి మళ్లించి ఇతర పంటల సాగుకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉద్యానశాఖకు కూడా అధిక కేటాయింపులు చేసింది. మరోవైపు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.75 కోట్లు, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ.17.50 కోట్లు కేటాయించింది. వచ్చే ఏడాది రూ.75 వేల లోపు రుణాల మాఫీ ఈ ఏడాది బడ్జెట్లో రైతు రుణమాఫీకి రూ.2,939.20 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 35.32 లక్షల మంది రైతులకు చెందిన రూ.16,144 కోట్ల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ దఫా రుణమాఫీలో భాగంగా ఇప్పటివరకు 5.12 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. దీంతో రూ.50 వేలలోపు రుణాలు ఈ మార్చిలోపు మాఫీ అవుతాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.75 వేల లోపు ఉన్న పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుందని బడ్జెట్లో స్పష్టంగా ప్రకటించారు. ఇలావుండగా ఈసారి వ్యవసాయ యంత్రీకరణకు నిధులను గణనీయంగా తగ్గించారు. 2021–22 బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయిస్తే, ఈసారి కేవలం రూ.377.35 కోట్లకే పరిమితం అయ్యారు. కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు కలిస్తే ఇది దాదాపు రూ.500 కోట్లు మాత్రమే ఉండే అవకాశముందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఆయిల్‌పామ్ సాగుపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్రంలో నీటి వనరులు పుష్కలంగా ఉండటం, అనుకూల వాతావరణం నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రెండున్నర లక్షల ఎకరాలకు ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచాలని భావిస్తోంది. అందుకోసం బడ్జెట్లో ఏకంగా రూ.1,000 కోట్లు కేటాయించింది. -
‘పోలీసుల’కు 1,104 కోట్లు
పోలీస్ శాఖకు బడ్జెట్లో ఆశించిన స్థాయిలోనే ప్రభుత్వం నిధులు కేటాయించింది. డీజీపీ ఖాతా కింద రూ. 1,104 కోట్లు ప్రగతి పద్దులో కేటాయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌తోపాటు జిల్లా పోలీసు కార్యాలయాలు, పోలీసు స్టేషన్ల నిర్మాణం, నూతన వాహనాల కొనుగోళ్లు.. ఇలా మొత్తంగా బడ్జెట్లో ప్రముఖంగానే నిధులు కేటాయించింది. – సాక్షి, హైదరాబాద్ నూతన నిర్మాణాలు, వాహనాలు...: రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే పోలీసు శాఖకు నూతన వాహనాలను ప్రభుత్వం అందించింది. దానికి కొనసాగింపుగా మరిన్ని వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రగతి పద్దులో రూ. 300 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే కొత్తగా ఏర్పడిన కమిషనరేట్లు, జిల్లాల పోలీసు కార్యాలయాల నిర్మాణాలకు రూ. 300 కోట్లను ప్రగతి పద్దులో ప్రతిపాదించింది. అదేవిధంగా నూతన పోలీసు స్టేషన్లు, సర్కిల్, డివిజినల్ కార్యాలయాలతోపాటు సిబ్బంది క్వార్టర్లు, బ్యారక్ల నిర్మాణానికి రూ. 323 కోట్లు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సీసీ కెమెరాల ఏర్పాటుకు ఈ ఆర్థిక సంవత్సరం రూ. 50 కోట్లు, వరంగల్ కమిషనరేట్ నిర్మాణానికి రూ. 25 కోట్లు కేటాయించగా, ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు మరో రూ. 95.82 కోట్లు ప్రతిపాదించింది. త్వరలో ఇది అందుబాటులోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో మహిళా సిబ్బందికి ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణం కోసం రూ. 3 కోట్లు కేటాయించగా. సిటిజన్ ఫ్రెండ్లీ సర్వీసెస్‌కు రూ. 3 కోట్లు, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ అమలుకు రూ.3 కోట్లు ప్రతిపాదించారు. నేరస్తుల డేటా అనలిటిక్స్ వ్యవస్థగా ఉన్న ఐటీ విభాగానికి రూ.6 కోట్లను కేటాయించింది. జాతీయ పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల బందోబస్తు తదితర ఏర్పాట్లకు రూ. 2.9 కోట్లను ప్రతిపాదించింది. -
పెంచీ పెంచనట్టు!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమానికి తాజా బడ్జెట్లో కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.175.46 కోట్లు ఎక్కువగా రూ.5,697.55 కోట్లను సర్కారు కేటాయించింది. నిర్వహణ పద్దులో పెరుగుదల ప్రభావంతో ఈ మేరకు బడ్జెట్ పెరిగినా సంక్షేమ పథకాలకు ప్రత్యేకంగా కేటాయింపులు పెరగలేదు. బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి రూ.90 కోట్లు కేటాయించింది. 42 కులాల ఆత్మగౌరవ భవనాల కోసం ఇప్పటికే స్థలాలను ప్రభుత్వం నిర్దేశించగా తాజా కేటాయింపులతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కార్పొరేషన్లకు కోత.. ఫెడరేషన్లకు కొంత.. బీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు తాజా బడ్జెట్ నిరాశ కలిగించింది. 2021–22 బడ్జెట్లో బీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు చొప్పున ప్రభుత్వం కేటాయించింది. తాజా బడ్జెట్లో ఒక్కో కార్పొరేషన్‌కు రూ.300 కోట్లు చొప్పున ప్రకటించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.400 కోట్లు కోతపడింది. ఫెడరేషన్లకు గత బడ్జెట్లో రిక్త హస్తం చూపినా తాజా బడ్జెట్లో 12 ఫెడరేషన్లకు సింగిల్ డిజిట్లో నిధులు కేటాయించింది. ఉచిత విద్యుత్ పథకం కింద రజకులకు రూ.50 కోట్లు, నాయీబ్రాహ్మణులకు రూ.50 కోట్లు చొప్పున ప్రకటించింది. ఎస్సీలకు దండిగా.. ఎస్టీలకు మెండుగా.. ఎస్సీ అభివృద్ధి శాఖకు తాజా బడ్జెట్లో ప్రభుత్వం నిధులు భారీగా కేటాయించింది. రూ.20,624.88 కోట్లు ప్రతిపాదించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే పద్దు రూ.15,036.91 కోట్లు పెరిగింది. దళితబంధు పథకానికి ఏకంగా రూ.17,700 కోట్లు ప్రకటించడంతో బడ్జెట్ అమాంతం పెరిగింది. గిరిజన సంక్షేమానికి ప్రస్తుత బడ్జెట్లో రూ.3,415.41 కోట్లను కేటాయించింది. ఈ పద్దు గత బడ్జెట్‌తో పోలిస్తే 359.29 కోట్లు పెరిగింది. మైనార్టీ సంక్షేమ శాఖకు గత బడ్జెట్ కన్నా రూ.122.32 కోట్లు ఎక్కువగా రూ.1,728.71 కోట్లను ప్రకటించింది. నిధులు దాదాపు 7 శాతం మేర పెరగడంతో పెండింగ్ పథకాలకు సర్దుబాటు చేసుకునే అవకాశం ఉందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
బడి.. బాగు..
రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి గత ఏడాదితో పోలిస్తే, ఈసారి రూ.2,477 కోట్ల మేర కేటాయింపులు పెరిగాయి. ముఖ్యంగా మన ఊరు–మన బడి కార్యక్రమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రూ.7,289 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న మహిళా యూనివర్సిటీకి, అటవీ విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించింది. గత ఏడాది విద్యారంగం కేటాయింపులు రూ.13,608 కోట్లు ఉంటే.. ఈసారి ఈ పద్దు రూ.16,085 కోట్లకు చేరింది. ఉన్నత విద్యకు గత ఏడాది రూ.1,873 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.2,357.72 కోట్లు కేటాయించారు. పాఠశాల విద్యకు గత ఏడాది రూ.11,735 కోట్లు ఉంటే, ఈసారి ఇది 13,725.97 కోట్లకు పెరిగింది. మొత్తం మీద రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగం వాటా గత ఏడాది 6.1 శాతంగా ఉంటే, ఈసారి 6.2 శాతంగా ఉన్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. – సాక్షి, హైదరాబాద్ కేటాయింపులు భేష్: మంత్రి సబిత సాక్షి, హైదరాబాద్: విద్యారంగం కేటాయింపులపై ఆ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ‘మన ఊరు–మనబడి’ని ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలన్న సీఎం ఆలోచనలు బడ్జెట్లో ప్రతిబింబించాయన్నారు. బడ్జెట్‌పై సోమవారం ఆమె స్పందిస్తూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. వారికి కానుకగానే ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రూ.వంద కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా రూ.7,289 కోట్లతో చేపట్టనున్న ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమానికి దశల వారీగా శ్రీకారం చుడుతూ, మొదటి దశలో 9,123 పాఠశాలల్లో రూ.3,497 కోట్లతో కార్యాచరణ ప్రారంభించటం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. జిల్లాకో వైద్య కాలేజీతో పాటు నగరం నలుమూలలా టీమ్స్ ఏర్పాటు పట్ల సబిత హర్షం వ్యక్తంచేశారు. గతంలో 19 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలుంటే, ఇప్పుడు వాటి సంఖ్య 281కి పెరిగిందని, రూ.620 కోట్లు ఏటా ప్రభుత్వం ఖర్చు చేయడం ఆ వర్గాలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 46 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసి అందులో ఐదింటిలో పీజీ కోర్సులు ప్రవేశపెట్టి పెద్దఎత్తున విద్యకు నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. స్కూళ్ల ఆధునీకరణకు అధిక ప్రాధాన్యం..: ప్రభుత్వ స్కూళ్ళను ఆధునీకరించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, తాజా బడ్జెట్ కేటాయింపుల్లో దీనికి ప్రాధాన్యమిచ్చింది. మన ఊరు–మన బడి, మన బస్తీ– మన బడి పేరుతో చేపట్టే ఈ కార్యక్రమానికి రూ.7,289 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. అయితే తొలి దశలో 9,123 స్కూళ్ళలో చేపట్టే 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3,497 కోట్లు ఇతర పద్దుల నుంచి కేటాయించారు. కాగా రాష్ట్రావతరణ తర్వాత మహిళా యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనపై ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. ఎట్టకేలకు ఈ ఏడాది వర్సిటీ ఏర్పాటుకు అనుమతించింది. కార్యాచరణకు కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా రాష్ట్ర బడ్జెట్లో ప్రాథమిక అవసరాల కోసం రూ.100 కోట్లు కేటాయించింది. అదే విధంగా అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మరో రూ.100 కోట్లు కేటాయించింది. ఎంత ఖర్చు చేస్తారో అనుమానమే బడ్జెట్లో విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావా రవి సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. విద్యకు గతంతో పోలిస్తే రూ.2,470 కోట్లు అదనంగా కేటాయించినట్లు కనిపించినా, వాస్తవానికి ఎంత ఖర్చు చేస్తారో అనుమానమేనని వారు పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల పిల్లలు అధికంగా చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన చదువు అందించటానికి ప్రభుత్వం తగిన నిధులు కేటాయించలేదని తెలిపారు. ఉన్నత విద్యకు ఊతం : ప్రొఫెసర్ లింబాద్రి ఉన్నత విద్య బలోపేతానికి రాష్ట్ర బడ్జెట్ తోడ్పడుతుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి అభిప్రాయపడ్డారు. మహిళా విశ్వవిద్యాలయం, ఫారెస్ట్ యూనివర్సిటీల ఏర్పాటుకు అవసరమైన నిధులు కేటాయించడంపై హర్షం వెలిబుచ్చారు. సరికొత్త బోధన విధానాలను అమలు చేయాలన్న ప్రయత్నాలు వేగం పుంజుకున్న నేపథ్యంలో ప్రభుత్వ కేటాయింపులు సత్ఫలితాల నిస్తాయన్నారు. -
సొంత జాగాలోనే ‘రెండు పడకలు’
సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల పథకం కొత్త రూపు సంతరించుకోనుంది. ఇప్పటివరకు ప్రభుత్వమే గుర్తించిన స్థలాల్లో అపార్ట్‌మెంటుల తరహాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇకపై ఆ తరహా ఇళ్లకు బదులు, లబ్ధిదారులే వారికున్న సొంత స్థలాల్లో వ్యక్తిగత ఇళ్లుగా నిర్మించుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తోంది. ఇందుకోసం ఒక్కో లబ్ధిదారుడికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలైన ఇందిరమ్మ ఇళ్ల పథకం తరహాలో.. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది. వాస్తవానికి 2014లోనే మేనిఫెస్టోలో ఈ మేరకు ప్రకటన వెలువడింది. కానీ ఆ తర్వాత అది ఇప్పటివరకు అమలైన ఇళ్ల నిర్మాణం మోడల్లోకి మారింది. ఈ తరహాలో ఎన్నో సమస్యలు ఎదురై, పథకం సాఫీగా సాగని పరిస్థితి నెలకొనడంతో.. ప్రజలు ఎక్కువగా డిమాండ్ చేస్తున్న రీతిలో వ్యక్తిగత స్థలాల్లో ఇళ్ల నిర్మాణం విధానాన్ని ప్రభుత్వం తీసుకొస్తోంది. దీనికి తాజా బడ్జెట్లో రూ.12 వేల కోట్లను కేటాయించారు. నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు చొప్పున 3.57 లక్షల ఇళ్లను నేరుగా కేటాయించనుండగా, ముఖ్యమంత్రి ఖాతాలో మరో 43 వేల ఇళ్లు మంజూరు కానున్నాయి. వెరసి మొత్తం 4 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాల్సి ఉంది. పాత పథకానికి పీఎంఏవై నిధులు తాజా బడ్జెట్లో ప్రతిపాదించిన రూ.12 వేల కోట్లు.. సొంత స్థలాలున్న వారికి మంజూరయ్యే ఇళ్లకే సరిపోనున్నాయి. మరి ఇప్పటివరకు అమలులో ఉన్న పద్ధతిలో కొనసాగుతున్న ఇళ్లకు నిధుల మాటేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.4 వేల కోట్ల వరకు మంజూరు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆ నిధులను రెగ్యులర్ ఇళ్ల నిర్మాణానికి వినియోగించాలని భావిస్తోంది. -
బడులు.. మడులు.. బడుగులు బారెడు పద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల దళిత కుటుంబాలకు లబ్ధి కలిగేలా ‘దళిత బంధు’పథకానికి రూ.17,700 కోట్లను ఈసారి బడ్జెట్లో కేటాయించారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.12 వేల కోట్లు కేటాయించారు. అందులో భాగంగానే సొంతంగా స్థలమున్న పేదలు కట్టుకునేందుకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించారు. రైతు బీమా తరహాలో నేతన్నలకు కూడా రూ.5 లక్షల బీమా సౌకర్యం, లక్ష మంది భవన నిర్మాణ కార్మికులకు సబ్సిడీపై మోటార్ సైకిళ్లు ఇచ్చే పథకాలకు శ్రీకారం చుట్టారు. వీటితోపాటు వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి శాఖలకు కూడా భారీగా నిధులు కేటాయించారు. ఇక పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఆసరా పింఛన్లు, వడ్డీ లేని రుణాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా, శిశు సంక్షేమం తదితర పథకాలు, విభాగాలకు గణనీయంగా కేటాయింపులు చేశారు. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో.. కుటుంబాలకు, వ్యక్తులకు నేరుగా లబ్ధి కలిగే పథకాలను ప్రభుత్వం ప్రకటించిందని ఆర్థిక, రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. విద్య, వైద్య రంగాలకూ ప్రాధాన్యం తొలి నుంచీ చర్చ జరుగుతున్న విధంగానే.. ఈసారి విద్య, వైద్య రంగాలకూ బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించారు. కొత్తగా ఎనిమిది వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ.1,000 కోట్లను కేటాయించారు. మన ఊరు–మన బడి కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3 వేల కోట్లకుపైగా కేటాయించారు. ప్రభుత్వ దవాఖానాల్లో చికిత్స పొందే రోగులకు డైట్ చార్జీలను పెంచడంతోపాటు హైదరాబాద్‌లోని 18 మేజర్ ఆస్పత్రులకు వచ్చే రోగుల సహాయకులకు సబ్సిడీపై భోజన సదుపాయాన్ని కొత్తగా కల్పించారు. తద్వారా రోజుకు 18,600 మందికి లబ్ధి కలుగుతుందని పేర్కొన్న ప్రభుత్వం.. ఇందుకోసం రూ.38.66 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న బస్తీ దవాఖానాలను.. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కూడా విస్తరించేలా కొత్తగా 60 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో ప్రకటించారు. కొత్తగా మహిళా విశ్వవిద్యాలయం, అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రతిపాదిస్తూ.. చెరో రూ.100 కోట్లను కేటాయించారు. పాలమూరు, డిండి పూర్తిచేస్తాం.. తాజా బడ్జెట్లో సాగునీటి రంగానికి రూ.24 వేల కోట్లకుపైగా ప్రతిపాదించారు. కృష్ణానదిపై చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్టు మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. మరో ముఖ్య ఎన్నికల హామీ అయిన రైతు రుణమాఫీ విషయంలోనూ స్పష్టత ఇచ్చారు. రూ.50వేలలోపు ఉన్న రైతుల రుణాలు ఈ నెలలో మాఫీ అవుతాయని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.75వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. వృద్ధాప్య పింఛన్ల కోసం 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించిన వయో పరిమితిని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తామని.. ఆసరా పింఛన్ల కోసం రూ.11,728 కోట్లు ఇస్తున్నామని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లకు రూ.2,750 కోట్లను కేటాయిస్తున్నట్టు తెలిపారు. అయితే నిరుద్యోగ భృతిని మాత్రం బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించలేదు. మొత్తంగా ప్రాధాన్య రంగాలకు కేటాయింపులు తగ్గకుండా చూసుకోవడంతోపాటు.. ప్రస్తుత సంక్షేమ పథకాల అమలు, కొత్తగా మరిన్ని పథకాలు ప్రవేశపెట్టడం, దళితబంధుకు భారీ నిధులు వంటివి ఈసారి బడ్జెట్లో ముఖ్యాంశాలుగా హరీశ్‌రావు పేర్కొన్నారు. -
దేశానికి తెలంగాణ టార్చ్ బేరర్
సాక్షి, హైదరాబాద్: ‘టుడే తెలంగాణ ఈజ్ ఏ టార్చ్ బేరర్. నేడు రాష్ట్రం అమలు చేసే కార్యక్రమాలను రేపు దేశం అనుసరిస్తుంది. గత ఏడున్నర సంవత్సరాల చరిత్రే దీనికి సాక్ష్యం. ఈ ప్రగతి యాత్రకు కొనసాగింపే ఈ కొత్త బడ్జెట్’అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజాస్వామ్య భారత చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ప్రగతి ఓ అద్భుతమని చెప్పారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి.. రాష్ట్ర పురోగతిని వివరించారు. దేశంలో మరే రాష్ట్రం లో అమలు చేయలేని పథకాలను ప్రవేశపెట్టిన ఘనత, వాటి ఫలితంగా రాష్ట్రం పురోగమిస్తున్న తీరును తెలిపారు. బడ్జెట్లో పథకాల తీరును వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఆ వర్సిటీలకు రూ. 100 కోట్ల చొప్పున దళితబంధుకు గత బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు, ఈసారి రూ. 17,700 కోట్లు ప్రతిపాదించాం. వచ్చే సంవత్సరాంతానికి 2 లక్షల మందికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రంలో తొలి మహిళా వర్సిటీ కోసం రూ.100 కోట్లు, అటవీ విశ్వ విద్యాలయం కోసం రూ.100 కోట్లను కేటాయిస్తున్నాం. కొత్తగా ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చే స్తున్నాం. 2023లో మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ము లుగు, వరంగల్, నారాయణపేట, గద్వాల, యాదా ద్రిల్లో ఏర్పాటు చేస్తాం. కొత్త మెడికల్ కాలేజీల కోసం బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు కేటాయించాం. రూ.7,289 కోట్లతో స్కూళ్ల అభివృద్ధి.. రాష్ట్రంలో రూ.7,289 కోట్లతో దశల వారీగా పాఠశాలల అభివృద్ధి పనులు చేపడుతున్నాం. తొలి దశలో మండలం యూనిట్‌గా 9,123 పాఠశాలల్లో రూ.3,497 కోట్లతో కార్యాచరణ ప్రారంభించాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డైట్ చార్జీలను ప్రతి బెడ్‌కు రూ.56 నుంచి రూ.112 (నిర్ధారిత కొన్ని జబ్బులకు)కు, సాధారణ రోగులకు రూ.40 నుంచి రూ. 80కి పెంచుతున్నాం. కరోనా కట్టడిలో ప్రభుత్వం చేపట్టిన చర్యలను హైకోర్టు ప్రశంసించింది. చదవండి: (కేసీఆర్ సైగలతో సభ నడుపుతారా?) కొత్త ఆసరా పింఛన్లు ఇస్తాం మేనిఫెస్టోలో ప్రకటించకుండానే రైతుబంధు తెచ్చాం. గత 8 సీజన్లలో రూ.50,448 కోట్లను 63 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేశాం. 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు సడలించిన వయోపరిమితి ఆధా రంగా ఈ ఆర్థిక ఏడాది నుంచి కొత్త లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు ఇస్తాం. ఇందుకు రూ.11,728 కోట్లు ప్రతిపాదించాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవాలనుకుంటే రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం. 4 లక్షల మందికి సాయం అందించేలా బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ.12 వేల కోట్లను ప్రతిపాదించాం. గొర్రెల పంపిణీకి రూ. వెయ్యి కోట్లు రైతుబీమా తరహాలో నేతన్నలు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5 లక్షల బీమా పథకాన్ని అమలు చేయనున్నాం. గీత కార్మికుల సంక్షేమానికి రూ.100 కోట్లతో పథకం ప్రారంభిస్తాం. గొర్రెల పంపిణీకి రూ. వెయ్యి కోట్లు కేటాయి స్తున్నాం. గిరిజన,ఆదివాసీ పంచాయతీలకు సొంత భవనాలకు రూ.600 కోట్లను వెచ్చించనున్నాం. భవన నిర్మాణ కార్మికులకు బైక్‌లు రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణకు రూ.1,542 కోట్లు కేటాయించాం. ఎస్టీ నివాస ప్రాం తాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి ఎస్టీ ఎస్డీఎఫ్ నిధు ల నుంచి రూ. వెయ్యి కోట్లను కేటాయించనున్నాం. మెట్రో రైలును పాత బస్తీలో 5.5 కిలోమీటర్లకు అనుసంధానానికి రూ.500 కోట్లు, ప్రజా రవాణాకు రూ. 1,500 కోట్లు అందజేయనున్నాం. బాలింతల్లో రక్తహీనత సమస్యను తగ్గించేందుకు ‘కేసీఆర్ నూట్రిషన్ కిట్’లను పంపిణీ చేయనున్నాం. కాళేశ్వరం టూరిజానికి రూ.750 కోట్లు కాళేశ్వరం టూరిజం సర్క్యూట్‌కు రూ.750 కోట్లు, అర్బన్ మిషన్ భగీరథకు రూ.800 కోట్లు, అంతర్జాతీయ విమానాశ్రయంతో మెట్రో కనెక్టవిటీకి రూ.500 కోట్లు, హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు కేటాయించాం. పరిశ్రమలకు ప్రోత్సాహకాలుగా రూ.2,142 కోట్లు, విద్యుత్ రాయితీ కింద రూ.190 కోట్లు ప్రతిపాదించాం. పావలా వడ్డీ స్కీంను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు, చిన్న తరహా పరిశ్రమలను, మహిళలు ఏర్పాటు చేసేందుకు రూ.187 కోట్లు కేటాయించాం. లక్షా 45 వేల కోట్ల ఐటీ ఎగుమతులు గత ఆరేళ్లలో 28,288 పోలీసు పోస్టులను భర్తీ చేశాం. ఈ బడ్జెట్లో పోలీసు శాఖకు రూ.9,315 కోట్లు కేటాయించాం. తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తెచ్చాక ఆ రంగంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులొచ్చాయి. రాష్ట్ర ఐటీ ఎగుమతుల్లో 12.98 శాతం పెరుగుదల నమోదైంది. 2021లో 1,45,522 కోట్ల మేర ఎగుమతులు జరిగాయి. సస్పెన్షన్ కోసమే వెల్‌లోకి వచ్చారు! బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై మంత్రి హరీశ్ వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ‘అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రసంగం సందర్భాల్లో సభ్యులు వెల్‌లోకి వస్తే సస్పెండ్ చేస్తామని గత బీఏసీ సమావేశంలో సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించి వెల్‌లోకి వచ్చినందునే బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండయ్యారు. వారు అందుకే వెల్‌లోకి వచ్చారు’అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సోమ వారం అసెంబ్లీ వాయిదా అనంతరం లాబీల్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘బడ్జెట్, గవర్నర్ ప్రసంగం వేళ కాకుండా ఇతర సందర్భాల్లో సభ్యులకు నిరసన తెలిపే హక్కు ఉంది. సభ హుందాతనం కాపాడుకోవాలని బీఏసీలో సమష్టి నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి రానందునే సస్పెండ్ చేయలేదు. రాజ్యసభలో వెల్‌లోకి రాకున్నా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 12 మంది సభ్యులను మొత్తం సెషన్ నుంచే సస్పెండ్ చేశారు. ఢిల్లీకో న్యాయం.. రాష్ట్రానికో న్యాయమా’అని హరీశ్ ప్రశ్నించారు. ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం పట్టించుకోవడంలేదు. అయినా కేంద్రం నుంచి గ్రాంట్లు వస్తాయనే ఉద్దేశంతోనే బడ్జెట్లో ప్రతిపాదించాం’అని తెలిపారు. -
Telangana Assembly: బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. సభ నుంచి బయటకు వెళ్లాల్సిందిగా పదే పదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో రంగంలోకి దిగిన మార్షల్స్ వారిని బయటకు తీసుకెళ్లారు. సోమవారం ఉదయం 11.30కు సమావేశాలు ప్రారంభం కాగా, జాతీయ గీతాలాపన తర్వాత స్పీకర్ ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు 2022–23 వార్షిక బడ్జెట్ ప్రసంగాన్ని చదవడం ప్రారంభించారు. అయితే గవర్నర్ ప్రసంగం లేకుండా నేరుగా బడ్జెట్ ప్రసంగంతో సభను ప్రారంభించడంపై కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు తమ స్థానాల నుంచి లేచి నిలబడి అభ్యంతరం వ్యక్తం చేశారు. నల్ల కండువాలు ధరించి సభకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, ఎం.రఘునందన్‌రావు గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్థిక మంత్రి ప్రసంగం కొనసాగుతున్న క్రమంలో పది నిమిషాల తర్వాత బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు తమ స్థానాల వద్ద నిల్చుని మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. మంత్రి ప్రసంగానికి అడ్డు తగులుతుండటంతో.. సీఎం కేసీఆర్ సూచన మేరకు హరీశ్‌రావు ప్రసంగం ఆపడం, మంత్రి తలసాని అసెంబ్లీ రూల్స్ 340, సబ్ రూల్ 2 ప్రకారం బీజేపీ ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని టీఆర్ఎస్ సభ్యులు బల్లలు చరుస్తూ ఆమోదించడంతో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అసెంబ్లీ ఆవరణలో బైఠాయింపు సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు సభనుంచి బయటకు వెళ్లేందుకు నిరాకరించడంతో మార్షల్స్‌ను పిలిపించారు. తొలుత రాజాసింగ్‌ను సభ నుంచి తీసుకెళ్లారు. ఈ సమయంలో ‘కేసీఆర్ రాజ్యాంగం నడవదు’అంటూ రాజాసింగ్ నినదించగా, ‘మోదీ రాజ్యాంగం నడవదు’అని టీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. రఘునందన్‌రావును కూడా మార్షల్స్ బయటకు తీసుకెళ్లగా, చీఫ్ మార్షల్ కరుణాకర్ ఈటల వద్దకు వెళ్లి సభ నుంచి వెళ్లాల్సిందిగా కోరడంతో ఆయన కూడా బయటకు వెళ్లిపోయారు. అసెంబ్లీ ఆవరణలో వారు ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, కేసీఆర్ నియంతృత్వ వైఖరి నశించాలి’అంటూ నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన, వాకౌట్ ఆర్టికల్ 171 ప్రకారం రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభించే ముందు గవర్నర్ ప్రసం గం ఉండాలంటూ సోమవారం సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఈ మేరకు రాజ్యాంగం ప్రతిని చూపుతూ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి, సీతక్క,, పోడెం వీరయ్య తమ స్థానాల్లో నిలబడి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. సుమారు అరగంట పాటు ఆ విధంగా విజ్ఞప్తి చేసినా స్పీకర్ స్థానం నుంచి స్పందన లేకపోవడంతో 12 గంటల సమయంలో కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. -
కేసీఆర్ సైగలతో సభ నడుపుతారా?
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ సైగలతో శాసనసభను నడపడం దుర్మార్గమని, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన వ్యవహారశైలి మార్చుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం గాంధీభవన్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క, నేతలు కోదండరెడ్డి, అనిల్ యాదవ్‌లతో కలిసి రేవంత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ విద్యార్థులను, అమరులను అవమానించిందని.. అమరుల కుటుంబాలకు అణా పైసా కేటాయించలేదని విమర్శించారు. నిరుద్యోగులకు రూ.3,016 భృతి ఇస్తామని గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని.. అది ఏమైందని రేవంత్ నిలదీశారు. సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షలు ఇస్తామన్న టీఆర్ఎస్ సర్కారు.. దాన్ని రూ.3 లక్షలకు కుదించిందని మండిపడ్డారు. శాసనమండలి రెండు, మూడు రోజులే నడపడం అన్యాయమని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ బడ్జెట్ ప్రసంగం సమయంలో నిరసనలు తెలిపిన సభ్యుల మీద చర్యలు తీసుకున్న సందర్భాలు లేవని.. కానీ ఇప్పుడు స్పీకర్ తీరు దారుణమని వ్యాఖ్యానించారు. ఒక పార్టీ సభ్యులందరినీ సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం సిగ్గుచేటని, దాన్ని కాంగ్రెస్ ఖండిస్తోందని స్పష్టం చేశారు. నిరసన తెలపడం ప్రజాస్వామిక హక్కు అని, నిరసనలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న విషయం గుర్తులేదా అన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ సభ్యుల పట్ల కూడా స్పీకర్ తీరు సరిగా లేదని.. దీనిపై మంగళవారం గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని రేవంత్ తెలిపారు. స్పీకర్ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో అంబేద్కర్ విగ్రహాల దగ్గర నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని ఆందోళన వ్యక్తం చేస్తామని ప్రకటించారు. కాగా అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని.. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పక్షనేత పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే స్పీకర్ కన్నెత్తి చూడకపోవడం అవమానకరమని, దళితుడిని సీఎల్పీ లీడర్‌గా సహించలేకపోతున్నారని విమర్శించారు. అలాగే రాష్ట్రం రాజుల చెరలో ఉన్నట్టుగా.. సభాపతి బంట్రోతుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగం ఉంటే సభ్యులు ప్రజాసమస్యలను ప్రస్తావించే అవకాశం ఉండేదని స్పష్టం చేశారు. చట్టసభా.. టీఆర్ఎస్ పార్టీ ఆఫీసా?: భట్టి విక్రమార్క అప్రజాస్వామికంగా, నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ నడుస్తోందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే స్పీకర్ కనీసం పట్టించుకోలేదని.. ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం దారుణమని వ్యాఖ్యానించారు. ‘‘ఇది చట్టసభనా? లేక టీఆర్ఎస్ పార్టీ ఆఫీసా? ప్రతిపక్ష సభ్యులను తీవ్రంగా అవమానిస్తున్నారు. సభా సంప్రదాయం ఉండదా..? మేం కూడా సభ నడిపించామంటూ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే స్పీకర్ పట్టించుకోలేదు. ప్రజా సమస్యలను లేవనెత్తకుండా గొంతు నొక్కుతున్నారు. కనీస విధానాలు తెలియని సభాపతిని చూసి సిగ్గుపడాల్సి వస్తోంది. ఇది మీ ఇల్లు కాదు. మేం కూడా ప్రజల నుంచి గెలిచి వచ్చాం. ప్రజా సమస్యలను ప్రస్తావించి తీరుతాం. స్పీకర్ తీరుపై రాష్ట్రపతికి లేఖ రాస్తాం’’అని స్పష్టం చేశారు. -
ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే ఈ బడ్జెట్: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవానికి చాలా దూరంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త పథకాలు తెచ్చామని చెబుతున్నారు.. గతేడాది బడ్జెట్ కూడా పెట్టిన దానికి చేసిన ఖర్చు కు పొంతన లేదన్నారు. కేటాయింపులు కేవలం చెప్పుకోవడం కోసమేనని దుయ్యబట్టారు. చదవండి: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్: కేటాయింపులు ఇవే.. ‘‘ఎన్నికల సందర్భంగా జాగా ఉంటే ఇళ్లు కట్టుకోవడం కోసం 5 లక్షలు అని చెప్పి.. ఇప్పుడు 3 లక్షలు మాత్రమే పెట్టారు. నిరుద్యోగులు, రైతుల గురించి ఇలా ఏ వర్గానికి ఉపయోగపడని బడ్జెట్. ప్రచారానికి తప్ప .. ప్రజలకు పనికొచ్చే బడ్జెట్ కాదు. ఈ బడ్జెట్ తీవ్ర నిరాశ కలిగించింది. రాజ్యాంగ విరుద్ధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్రాన్ని తెచ్చుకొన్నది తలెత్తుకొని బతకడం కోసం. ఈ రోజు సెల్ప్ రెస్పెక్ట్ లేకుండా చేస్తున్నారు. గవర్నర్‌తో మీకు ఏమైనా వ్యక్తిగత తగాదాలు ఉంటే వేరే విధంగా చూసుకోవాలి. గతేడాది జరిగిన పురోగతి చెప్పాల్సి ఉన్నా.. చెప్పలేదు. అందుకే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన కనీసం మా వైపు కూడా స్పీకర్ చూడలేదని.. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిదని’’ భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. -
తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు
-
తెలంగాణ బడ్జెట్ హైలైట్స్: కేటాయింపులు ఇవే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్‌ను మంత్రి హరీష్‌రావు, సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే మొదలైన సంగతి తెలిసిందే. దీంతో మంత్రి హరీష్‌రావు నేరుగా బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తెలంగాణ 2022-223 బడ్జెట్‌కు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ బడ్జెట్ 2022-2023 కేటాయింపులు.. ► దళిత బంధు పథకానికి ఈ ఏడాది ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు నిధులను భారీగా పెంచారు. గత వార్షిక బడ్జెట్లో వెయ్యి కోట్లను కేటాయించగా ఈసారి ఏకంగా వార్షిక బడ్జెట్లో దళిత బంధు పథకం కోసం రూ. 17,700 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు చింతకాని, తిరుమలగిరి, నిజాంసాగర్, చారగొండ మండలాల్లో ప్రభుత్వం ఇప్పటికే సంపూర్ణంగా అమలు చేస్తోంది. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి వందమంది చొప్పున మొత్తం 118 నియోజకవర్గాల్లో 11వేల 800 కుటుంబాలకు దళితబంధు పథకం కింద ఆర్థికసహాయం అందిస్తున్నది. వచ్చే సంవత్సరాంతానికి రెండు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించడం జరిగింది. ► రెండోదశలో ఇతరప్రభుత్వపాఠశాలలను బలోపేతం చేసే దిశగా దృష్టి కేంద్రీకరిస్తూ మనఊరు-మనబడి పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధనను అందించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేదలకు ఆంగ్ల మాధ్యమం అందని ద్రాక్ష కాకూడదనీ, వారు కూడా మిగతా ప్రపంచంతో సమానంగా ఎదగాలనీ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 7,289 కోట్ల రూపాయలతో దశల వారీగా పాఠశాలల్లో అభివృద్ది పనులను ప్రభుత్వం చేపడుతున్నది. మొదటి దశలో మండలాన్ని యూనిట్‌గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో 3,497 కోట్ల రూపాయలతో కార్యాచరణ ప్రారంభించింది. ► రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా విశ్వ విద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికోసం ఈ ఆర్థిక సంవత్సరంలో వంద కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రతిపాదించింది. ► ఈ ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా అటవి విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ఈబడ్జెట్లో వంద కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ► రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాబోయే రెండేళ్లలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ సంవత్సరం కొత్తగా ఎనిమిది వైద్య కళాశాలలను, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 2023 సంవత్సరంలోని రాష్ట్రంలోని మిగతా ఎనిమిది జిల్లాలైన మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణపేట, గద్వాల, యాదాద్రిల్లో మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నూతన మెడికల్ కాలేజీల స్థాపన కోసం ఈ బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ► ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగులకు చికిత్సతో పాటు పోషకాహారాన్ని అందించాలనీ, ఇందుకోసం డైట్ ఛార్జీలను రెట్టింపు (డబుల్) చేయాలని ప్రభుత్వంనిర్ణయించింది. టీ.బి.,క్యాన్సర్ తదితర రోగులకు బలవర్ధకమైన ఆహారం అందించడం కోసం బెడ్ ఒక్కంటికి ఇచ్చే డైట్ ఛార్జీలను 56 రూపాయల నుంచి 112 రూపాయలకు పెంచాలనీ, సాధారణ రోగులకు ఇచ్చే డైట్ ఛార్జీలు బెడ్ ఒక్కంటికి 40 రూపాయల నుంచి 80 రూపాయలకు పెంచాలని ఈ బడ్జెట్ లో ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ప్రభుత్వం ప్రతి ఏటా 43.5కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. ► హైదరాబాద్ లోని 18 మేజర్ ప్రభుత్వ హాస్పటళ్లలో రోగితో ఉండే సహాయకులకు కూడా సబ్సిడీపై భోజన సదుపాయం కల్పించాలని ఈ బడ్జెట్లో నిర్ణయించడం జరిగింది. రెండు పూటలా వారికి ఈ భోజనం అందుతుంది. ప్రతీ రోజు సుమారు 18,600 మందికి ఈ ప్రయోజనం కలుగుతుందని అంచనావేస్తోంది. దీని కోసం సంవత్సరానికి 38.66 కోట్లు ఖర్చవుతాయి. ► పారిశుధ్యకార్మికులకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బడ్జెట్లో ప్రభుత్వం బెడ్ ఒక్కంటికి చేసే పారిశుద్ద్య ఖర్చును 5000 నుంచి 7500 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం ప్రభుత్వం రూ. 338 కోట్లను ప్రతి సంవత్సరం వెచ్చించనుంది. ► రాష్ట్ర వ్యాప్తంగా 61 మార్చురీల ఆధునీకరణకు 32 కోట్ల 50 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది (ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది) ► 2022-23 సంవత్సరంలో బడ్జెట్లో పామాయిల్ సాగును ఎక్కువగా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందు కోసం ఈ ఏడాది బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ►వ్యవసాయ రంగానికి గత ఏడేళ్లుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున బడ్జెట్లో నిధులు కేటాయిస్తోంది. గత ఎనిమిది వ్యవసాయ సీజన్లలో రైతు బంధు పథకం కింద 50,448 కోట్ల రూపాయలను 63 లక్షల మంది రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. రైతు భీమా పథకం ద్వారా రైతు మరణిస్తే వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇలా ఇప్పటి వరకు 75 వేల కుటుంబాలకు 3,775 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందజేసింది. ఇలా రైత సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నాం. ఈ వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి మొత్తంగా 24254 కోట్ల రూపాయలు కేటాయించాం. గతంలో హామీ ఇచ్చినట్టుగా ఈ ఏడాది 75 వేల లోపు రుణాలను కూడా మాఫీ చేయాలని నిర్ణయించింది. ►వృద్ధాప్య ఫింఛన్ల మంజూరు కోసం విధించిన వయోపరిమితిని ప్రభుత్వం 65 ఏళ్లనుంచి 57 ఏళ్లకు తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి సడలించిన వయోపరిమితి ప్రకారం కొత్త లబ్దిదారులకు ఆసరా ఫించన్లను ప్రభుత్వం అందజేస్తుంది. ఆసరా ఫించన్ల కోసం 2022-2023 వార్షిక బడ్జెట్లో 11728 కోట్ల రూపాయలు ప్రతిపాదించింది. ►సొంత జాగ కలిగినవారు తమ స్థలంలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టుకోవడం కోసం మూడు లక్షల రూపాయల చొప్పున అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ బడ్జెట్లో అందుకు నిధులు కేటాయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మందికి, సొంత స్థలంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతోంది. నియోజకవర్గానికి మూడువేల ఇండ్ల చొప్పున కేటాయిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం 12000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయించింది. ► ఎస్టీ నివాస ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం కోసం ఎస్టీఎస్డీఎఫ్ నిధుల నుంచి 1000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయించింది. ► గొల్ల కురుమల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. అందులో భాగంగా 11 వేల కోట్ల రూపాయల వ్యయంతో 7.3లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ బడ్జెట్లో గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు కేటాయించింది. ► రైతు బీమా మాదిరిగానే నేతన్నలు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఐదు లక్షల రూపాయల బీమా పథకాన్ని అమలు చేయాలని ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. ► గీత కార్మికుల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయలతో ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టాలని ఈ బడ్జెట్లో నిర్ణయం తీసుకుంది. ► బాలింతలలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈలోపాన్ని నివారించేందుకు, ‘కేసీఆర్ నూట్రీషియన్ కిట్’ అనే పేరుతో పోషకాహారంతో కూడిన కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిర్ణయించింది. ఈ కిట్స్ ద్వారా ప్రతి సంవత్సరం లక్షా 25 వేల మంది మహిళలు ప్రయోజనం పొందనున్నారు. ► రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, జూనియర్ కాలేజీల్లో 7 నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధినులకు ఉచితంగా హెల్త్ అండ్ హైజనిక్ కిట్స్ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది బాలికలకు ప్రయోజనం చేకూరనుంది. ► హైదరాబాద్ చుట్టూ, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టు ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీటి కొరతను శాశ్వతంగా తీర్చేందుకు రూ.1200 కోట్లను ఈ వార్షిక బడ్జెట్లో ప్రతిపాదించారు. ► దూప దీప నైవేధ్య పథకంలో హైదరాబాద్‌లోని దేవాలయాలను చేర్చాలన్న అర్చకుల కోరిక మేరకు ఈ ఏడాది 1736 దేవాలయాలను కొత్తగా ఈ పథకంలో చేరుస్తున్నారు. దూప దీప నైవేద్య పథకానికి రూ. 12.50 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ► రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణ కోసం రూ. 1542 కోట్లను ప్రభుత్వం ఈ వార్షిక బడ్జెట్లో కేటాయించింది. ► మెట్రో రైలును పాతబస్తీలో 5.5 కిలోమీటర్లకు అనుసంధానించేందుకు ఈ బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించింది. ► భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కొత్త పథకం ప్రవేశపెడుతున్నామని, మొదటి విడుతలో లక్ష మంది కార్మికులకు మోటార్ సైకిళ్లను ఇవ్వాలని బడ్జెట్లో ప్రతిపాదించింది. విధివిదానాలు త్వరలో ప్రకటిస్తారు. ► రైతు బందు పథకం తరహాలో నేత కార్మికుల కోసం ఈ ఏడాది ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభించాలని నిర్ణయించింది. ► రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీ నివాస ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం కోసం ఎస్టీఎస్డీఎఫ్ నిధుల నుంచి 1000 కోట్ల రూపాయలను కేటాయింపు. ► గిరిజన, ఆదివాసీ గ్రామ పంచాయతీలకు సొంత భవనాల నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఈ ఏడాది 600 కోట్ల రూపాయలు కేటాయింపు. ► రాష్ట్ర వ్యాప్తంగా సొంత జాగల్లో ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నాం. దీని కోసం ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు ఇస్తాం. ఈ ఏడాది నాలుగు లక్షల ఇండ్లను నిర్మించనున్నాం. ఒక్కొక్క లబ్దిదారుడికి రూ.3 లక్షలను ప్రభుత్వం సహాయంగా అందిస్తుంది. రూ. 12వేల కోట్లను డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం ఈ ఏడాది బడ్జెట్లో కేటాయింపు. ► కాళేశ్వరం టూరిజం సర్య్యూట్‌కు రూ. 750 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయింపు. ► అర్బన్ మిషన్ భగీరథకు ఈ బడ్జెట్లో రూ. 800 కోట్లు కేటాయింపు. ► ఎయిర్ పోర్టు మెట్రో కనెక్టవిటీకి ఈ బడ్జెట్లో రూ. 500 కోట్లు కేటాయించడం జరిగింది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు మరో రూ. 1500 కోట్లు కేటాయింపు. ► పరిశ్రమలకు ప్రోత్సాహకాలుగా రూ. 2142 కోట్లు, పరిశ్రమలకు విద్యుత్ రాయితీ కింద రూ. 190 కోట్లను బడ్జెట్లో కేటాయింపు. ► పావలా వడ్డీ స్కీంను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు, చిన్న తరహా పరిశ్రమలను, మహిళలు ఏర్పాటు చేసి విధంగా ప్రోత్సహించడానికి రూ. 187 కోట్లు కేటాయింపు. ► హైదరాబాద్ మెట్రో పరిధిలో రోజుకు 20 లీటర్ల ఉచితంగా నీరందించే పథకానికి రూ. 300 కోట్లు కేటాయింపు. ► ఆర్టీసీని బలోపేతం చేసేందుకు రూ. 1500 కోట్లు కేటాయింపు. తెలంగాణ బడ్జెట్ రూ.2,56,958.51 కోట్లు-- పలు ప్రధాన కేటాయింపులు చదవండి: తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ సభ్యుల సస్పెన్షన్ -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా
అప్డేట్స్ ►తెలంగాణ బీఏసీ సమావేశం ముగిసింది. ఈనెల 15 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. అన్ని అంశాలపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని బీఏసీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. ►తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి(మార్చి 9) వాయిదా పడ్డాయి. సభను బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ►రాష్ట్రంలో మరో ఎనిమిది మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఇప్పటికే 17 మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయని, వచ్చే ఏడాది కొత్తగా మరో ఎనిమిది జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామన్నారు. నూతన కాలేజీల ఏర్పాటుకు 2022-23 వార్షిక బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. ►తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగాన్ని 2 గంటల పాటు చదివి వినిపించారు. ఉదయం 11:30 గంటలకు హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కాగా, మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రసంగాన్ని ముగించారు. ►బీజేపీ సభ్యులు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావులపై సస్పెన్షన్ వేటు ► తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకూ బీజేపీ సభ్యుల సస్పెన్షన్ ►బడ్జెట్ ప్రసంగానికి అడ్డుపడుతుండటంతో సస్పెండ్ చేయాలని మంత్రి తలసాని తీర్మానం.. ఆమోదించిన స్పీకర్ పోచారం. ►తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ సభ్యులు సస్పెన్షన్ ► గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో బీజేపీ సభ్యులు ఆందోళన ►తెలంగాణ పురిటి దశలో ఉన్నప్పుడే కేంద్రం దాడి మొదలైంది: హరీష్‌రావు ►ఫెడరల్ స్ఫూర్తిని కేంద్రం దెబ్బతీస్తుంది: హరీష్‌రావు ►ఆర్థిక సంఘం సూచనలను కేంద్రం పట్టించుకోవడం లేదు: హరీష్‌రావు ►తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థికమంత్రి హరీష్‌రావు ప్రసంగిస్తున్నారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టే క్రమంలో ముందుగా హరీష్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణలో కరెంట్ కోతలు, ఆకలి చావులు ఇప్పుడు లేవన్నారు. రాష్ట్ర పునఃనిర్మాణ బాధ్యతను సీఎం కేసీఆర్ తన భుజాలపై వేసుకున్నారన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభం కావడం గమనార్హం. ► బీజేపీ నుంచి గెలిచిన తర్వాత తొలిసారి అసెంబ్లీకి వస్తున్న ఈటల రాజేందర్.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ► తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై బీజేపీ ఎమ్మెల్యేలు నల్లకండువాలతో నిరసన వ్యక్తం చేశారు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగం లేకుండానే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసన సభలో మంత్రి హరీశ్‌రావు, శాసనమండలిలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్ అనంతరం తెలంగాణ బీఏసీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో గవర్నర్ ప్రసంగంతో పాటు నిరుద్యోగ సమస్య, ధాన్యం కొనుగోలు, డబుల్ బెడ్రూమ్ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని విపక్షాలు పేర్కొన్నాయి.