
పోలీస్ శాఖకు బడ్జెట్‌లో ఆశించిన స్థాయిలోనే ప్రభుత్వం నిధులు కేటాయించింది. డీజీపీ ఖాతా కింద రూ. 1,104 కోట్లు ప్రగతి పద్దులో కేటాయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌తోపాటు జిల్లా పోలీసు కార్యాలయాలు, పోలీసు స్టేషన్ల నిర్మాణం, నూతన వాహనాల కొనుగోళ్లు.. ఇలా మొత్తంగా బడ్జెట్‌లో ప్రముఖంగానే నిధులు కేటాయించింది.
– సాక్షి, హైదరాబాద్
నూతన నిర్మాణాలు, వాహనాలు...: రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే పోలీసు శాఖకు నూతన వాహనాలను ప్రభుత్వం అందించింది. దానికి కొనసాగింపుగా మరిన్ని వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రగతి పద్దులో రూ. 300 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే కొత్తగా ఏర్పడిన కమిషనరేట్లు, జిల్లాల పోలీసు కార్యాలయాల నిర్మాణాలకు రూ. 300 కోట్లను ప్రగతి పద్దులో ప్రతిపాదించింది. అదేవిధంగా నూతన పోలీసు స్టేషన్లు, సర్కిల్, డివిజినల్ కార్యాలయాలతోపాటు సిబ్బంది క్వార్టర్లు, బ్యారక్‌ల నిర్మాణానికి రూ. 323 కోట్లు కేటాయించింది.
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సీసీ కెమెరాల ఏర్పాటుకు ఈ ఆర్థిక సంవత్సరం రూ. 50 కోట్లు, వరంగల్ కమిషనరేట్ నిర్మాణానికి రూ. 25 కోట్లు కేటాయించగా, ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు మరో రూ. 95.82 కోట్లు ప్రతిపాదించింది. త్వరలో ఇది అందుబాటులోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో మహిళా సిబ్బందికి ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణం కోసం రూ. 3 కోట్లు కేటాయించగా.
సిటిజన్ ఫ్రెండ్లీ సర్వీసెస్‌కు రూ. 3 కోట్లు, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్ అమలుకు రూ.3 కోట్లు ప్రతిపాదించారు. నేరస్తుల డేటా అనలిటిక్స్ వ్యవస్థగా ఉన్న ఐటీ విభాగానికి రూ.6 కోట్లను కేటాయించింది. జాతీయ పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల బందోబస్తు తదితర ఏర్పాట్లకు రూ. 2.9 కోట్లను ప్రతిపాదించింది.
Comments
Please login to add a commentAdd a comment