Telangana Assembly Budget Session 2022 Telugu Live Updates - Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధ‌వారానికి వాయిదా

Published Mon, Mar 7 2022 10:38 AM | Last Updated on Mon, Mar 7 2022 3:20 PM

Telangana Assembly Budget Session 2022 Telugu Live Updates - Sakshi

అప్‌డేట్స్‌

తెలంగాణ బీఏసీ సమావేశం ముగిసింది. ఈనెల 15 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. అన్ని అంశాలపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని బీఏసీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు.

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు బుధ‌వారానికి(మార్చి 9) వాయిదా ప‌డ్డాయి. స‌భ‌ను బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు వాయిదా వేస్తున్న‌ట్లు అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు.

రాష్ట్రంలో మరో ఎనిమిది మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. ఇప్పటికే 17 మెడికల్‌ కాలేజీలు అందుబాటులో  ఉన్నాయని, వచ్చే ఏడాది కొత్తగా మరో ఎనిమిది జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తామన్నారు. నూతన కాలేజీల ఏర్పాటుకు 2022-23 వార్షిక బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు.

తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హ‌రీశ్‌రావు బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని 2 గంట‌ల పాటు చ‌దివి వినిపించారు. ఉద‌యం 11:30 గంట‌ల‌కు హ‌రీశ్‌రావు బ‌డ్జెట్ ప్ర‌సంగం ప్రారంభం కాగా, మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్ర‌సంగాన్ని ముగించారు.

బీజేపీ సభ్యులు ఈటల రాజేందర్‌, రాజాసింగ్‌, రఘునందన్‌రావులపై సస్పెన్షన్‌ వేటు

► తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకూ బీజేపీ సభ్యుల సస్పెన్షన్‌

బడ్జెట్‌ ప్రసంగానికి అడ్డుపడుతుండటంతో సస్పెండ్‌ చేయాలని మంత్రి తలసాని తీర్మానం.. ఆమోదించిన స్పీకర్‌ పోచారం.

తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ సభ్యులు సస్పెన్షన్‌
►  గవర్నర్‌ ప్రసంగం లేకుండా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో బీజేపీ సభ్యులు ఆందోళన

తెలంగాణ పురిటి దశలో ఉన్నప్పుడే కేంద్రం దాడి మొదలైంది: హరీష్‌రావు
 ఫెడరల్‌ స్ఫూర్తిని కేంద్రం దెబ్బతీస్తుంది: హరీష్‌రావు
 ఆర్థిక సంఘం సూచనలను కేంద్రం పట్టించుకోవడం లేదు: హరీష్‌రావు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆర్థికమంత్రి హరీష్‌రావు ప్రసంగిస్తున్నారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టే క్రమంలో ముందుగా హరీష్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణలో కరెంట్‌ కోతలు, ఆకలి చావులు ఇప్పుడు లేవన్నారు. రాష్ట్ర పునఃనిర్మాణ బాధ్యతను సీఎం కేసీఆర్‌ తన భుజాలపై వేసుకున్నారన్నారు. 

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం లేకుండానే ప్రారంభం కావడం గమనార్హం. 

►  బీజేపీ నుంచి గెలిచిన తర్వాత తొలిసారి అసెంబ్లీకి వస్తున్న ఈటల రాజేందర్‌.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. 

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం లేకపోవడంపై బీజేపీ ఎమ్మెల్యేలు నల్లకండువాలతో నిరసన వ్యక్తం చేశారు. 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. గవర్నర్‌ ప్రసంగం లేకుండానే తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.  శాసన సభలో మంత్రి హరీశ్‌రావు, శాసనమండలిలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్‌ అనంతరం తెలంగాణ బీఏసీ సమావేశం జరగనుంది.

అసెంబ్లీ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో గవర్నర్‌ ప్రసంగంతో పాటు నిరుద్యోగ సమస్య, ధాన్యం కొనుగోలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని విపక్షాలు పేర్కొన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement