Vemula Prashant Reddy
-
పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్‌కు ప్రశాంత్‌రెడ్డి ఓపెన్ ఛాలెంజ్
సాక్షి,నిజామాబాద్జిల్లా:రేవంత్‌రెడ్డి తన కుర్చీని కాపాడుకునేందుకు ఢిల్లీకి మూటలు మోసే పనిలో ఉన్నాడని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం(నవంబర్19) నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘త్వరలో కాంగ్రెస్ పార్టీ సీఎం పదవి నుంచి రేవంత్ రెడ్డిని తొలగించటం ఖాయం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్‌కు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా.రుణమాఫీ,రైతు బంధు,వడ్ల బోనస్ మీరు ఇచ్చారని ప్రజలు చెప్తే నేను రాజీనామా చేస్తాను. ఇవ్వలేదు అని ప్రజలు చెప్తే నువ్వు నీ పీసీసీ పదవికి రాజీనామా చేస్తావా? పీసీసీ పదవి రాగానే మహేష్‌గౌడ్ నిషాలో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుందని అవాకులు చవాకులు పేలుతున్నారు.11నెలల కాలంలో కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి తప్పులు కప్పిపుచ్చుకునేందుకు చిల్లర ఆరోపణలు చేస్తున్నారు. మా పార్టీ సంగతి వదిలేసి మీ పార్టీ లో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలపై దృష్టి పెట్టండి.బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నేతలు రిబ్బన్లు కట్ చేస్తున్నారు. ఏం ముఖం పెట్టుకుని విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తారు.సామాన్య ప్రజలతో తిట్లు పడుతున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సైతం పచ్చి అబద్ధాలు చెప్తున్నారు.మహారాష్ట్రలో తెలంగాణ పరువు తీస్తున్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదు.ఇపుడు అదే వరంగల్ లో విజయోత్సవాలా’అని ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. -
రేవంత్‌కు హరీష్ అంటే భయం: మాజీ మంత్రి వేముల
సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్‌రావు అంటే భయం. అందుకే ఆయనకు పీఏసీ చైర్మన్ ఇవ్వలేదన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సీఎం రేవంత్ ఓ నియంతగా మారాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు. అలాగే, అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం ప్రపంచమంతా చూసిందని చెప్పుకొచ్చారు.కాగా, ప్రశాంత్ రెడ్డి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ..‘సహజంగా ప్రశ్నించే ప్రతిపక్షానికే పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం దేశంలో ఆనవాయితీగా వస్తోంది. పీఏసీ చైర్మన్ పదవిని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు ఇవ్వడం పార్లమెంటరీ స్ఫూర్తికి, సంప్రదాయాలకు విరుద్ధం. పీఏసీలో మొత్తం 13 సభ్యులు ఉండాలని.. ఇందులో తొమ్మిది మంది అసెంబ్లీ నుంచి ఉండాలని అసెంబ్లీ రూల్ బుక్‌లో స్పష్టంగా ఉంది. ఎన్నిక పూర్తయిన తర్వాత స్పీకర్ అసెంబ్లీలోనే కమిటీ సభ్యుల పేర్లు ప్రకటించాలి. అసెంబ్లీ రూల్ బుక్‌లో 250 రూల్ కింద పీఏసీకి సంబంధించి ప్రతిపక్షానికి సంఖ్యను బట్టి సభ్యుల సంఖ్యను కేటాయిస్తారు.బీఆర్ఎస్కు నిబంధనల ప్రకారం పీఏసీలో ముగ్గురు సభ్యులకు అవకాశం ఉంటుందని చెబితే నామినేషన్లు వేశాము. నేను, హరీష్ రావు, గంగుల కమలాకర్ నామినేషన్లు వేశాము. మధ్యలో అరికెపూడి గాంధీ పేరు ఎక్కడి నుంచి వచ్చింది. పీఏసీ సభ్యుల కన్నా ఎక్కువ నామినేషన్లు వస్తే ఓటింగ్ జరగాలి. ఓటింగ్ జరగకుండానే హరీష్ రావు నామినేషన్‌ను ఎలా తొలగించారు. బీఆర్ఎస్ తరఫున గాంధీ నామినేషన్ వేయడానికి ఎవరు అనుమతించారు. అరికెపూడి గాంధీ బీఆర్ఎస్కు చెందిన వ్యక్తి అని మంత్రి శ్రీధర్ బాబు చెబుతున్నారు. గాంధీని పీఏసీ చైర్మన్‌గా నియమించమని కేసీఆర్ సూచించారా?. కేసీఆర్‌ను శ్రీధర్ బాబు ఎప్పుడు సంప్రదించారో చెప్పాలి.పీఏసీ కమిటీల విషయంలో రేవంత్ సర్కార్ అతి పెద్ద తప్పు చేసింది. రాహుల్ గాంధీ మాటలు కూడా వినిపించుకోలేని స్థాయికి రేవంత్ వెళ్లారా?. కాంగ్రెస్‌లో సీనియర్ అయిన జానారెడ్డి వంటి వారు కూడా రేవంత్‌కు చెప్పే స్థితిలో లేరా?. పీఏసీపై స్పీకర్ గడ్డం ప్రసాద్ పునరాలోచన చేయాలని కోరుతున్నాం. పీఏసీ నియామకంపై తెలంగాణ రాజకీయ విశ్లేషకులు స్పందించాలి. పీఏసీపై స్పీకర్ నిర్ణయం మారకపోతే గవర్నర్‌ను కలవడం, ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తాం.మోదీ హాయంలో మొదటి రెండు పర్యాయాలు కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా లేకున్నా పీఏసీ చైర్మన్ పదవులు దక్కాయి. మొన్నటికి మొన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సూచన మేరకు కేసీ వేణుగోపాల్‌కు కేంద్రంలో పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో ఓ సూత్రం.. తెలంగాణలో మరో సూత్రమా?. రాహుల్ రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరుగుతారు.. ఆ రాజ్యాంగం తెలంగాణకు వర్తించదా?. రాహుల్ విధానాలు తెలంగాణలో అమలు కావా?’ అంటూ ప్రశ్నించారు. -
కవితకు బెయిల్ ఆలస్యమైనా.. న్యాయం గెలిచింది: బీఆర్ఎస్ నేతలు
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది.కవిత బెయిల్‌పై తెలంగాణ రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నెలకొంది. బెయిల్ విషయంలో కుమ్మక్కయ్యారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తున్నారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అయిదునెలలుగా ఒక ఆడబిడ్డ జైల్లో ఇబ్బంది పడిందని, అన్యాయంగా కవితను జైల్లో పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్.. సుప్రీంకోర్టు తీర్పును కించపరిచే విధంగా దానికి రాజకీయాలు ముడి పెట్టి దుర్మార్గంగా మాట్లాడారని మండిపడ్డారు.సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేస్తున్నారని, కేంద్రమత్రిగా ఉండి బండి సంజయ్ ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడిన వ్యాఖ్యాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మహేష్ కుమార్ గౌడ్‌పై కేసులు వేస్తామని, బెయిల్‌ను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడారని విమర్శించారు. కోర్టులో జరిగిన వాదనలు సమాజం చూసిందని, ఈబీ, సీబీఐ వరి కనుసన్నల్లో నడుస్తున్నాయనేది దేశం మొత్తం తెలుసని అన్నారు. బెయిల్ రావడం ఆలస్యమైనా.. న్యాయం గెలిచిందన్నారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. నిజం ఆలస్యంగా గెలుస్తుందని నిరూపితమైందని తెలిపారు. రాజకీయ నేతలు ఈ కేసులో లేకపోతే 15 రోజుల్లో బెయిల్ వచ్చేదని పేర్కొన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలకు చెందిన రాజకీయ నేతలు ఈ కేసులో ఉన్నారు కాబట్టే జైల్లో పెట్టారని ఆరోపించారు. ఢీల్లి లిక్కర్ కేసులో ఒక్క రూపాయి రికవరీ చేయలేదని, సౌత్ గ్రూప్ అని పేరు పెట్టి అహంకారంతో వ్యవహరించారని మండిపడ్డారు.‘చార్జీషీట్ దాఖలు చేసిన తర్వాత జైల్లో ఎందుకు ఉండాలని కోర్టు అడిగింది. అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఆ ప్రశ్నకు నీళ్లు నమిలారు. మహిళలకు బెయిల్ విషయంలో కొన్ని చట్టబద్ధమైన హక్కులు ఉంటాయి. ఢీల్లి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. బండి సంజయ్ అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. బండి సంజయ్‌కు అసలు తెలివి ఉందా? సుప్రీంకోర్టులో లాయర్లు పార్టీల తరపున ఉండరు. ముకుల్ రోహత్గీ బీజేపీ ప్రభుత్వంలో సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్‌గా ఐదేళ్ళు పని చేశారుకేంద్ర హోంశాఖా సహాయ మంత్రి హోదాను బండి సంజయ్ కాపాడుకోవాలి. మేము బాంఛన్ అంటే కవిత ఎప్పుడో బయటకు వచ్చేది. చట్ట ప్రకారం కొట్లాడదామనే మేము ముందుకు వెళ్ళాము. స్త్రీలను ఇబ్బంది పెట్టిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోలేదు. బీజేపీలో చేరిన హిమంత బిశ్వశర్మపై కేసులు లేకుండా చేసి సీఎంను చేశారు.ఏపీలో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఇద్దరు రాజ్యసభ సభ్యులపై ఈడీ కేసులు ఎందుకు నడవడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో బీజేపీలో చేరిన ఎంతో మంది నేర చరితలపై విచారణ జరగడం లేదు. బీజేపీలో చేరితే కేసులు లేకుండా చేస్తున్నారు. కవితపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపిత కేసు. కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టే కుట్ర చేశారుబండి సంజయ్ తెలంగాణలో 750 కోట్ల సివిల్ సప్లై స్కాం పై ఎందుకు మాట్లాడడం లేదు. కేంద్ర ప్రభుత్వ సివిల్ సప్లై శాఖ పై ఎందుకు దృష్టి పెట్టలేదు. తెలంగాణ ఆడబిడ్డ బెయిల్ వస్తే ఎందుకింత అక్కసు?- మాజీ మంత్రిగంగుల కమలాకర్. -
భట్టికి నోబెల్ ప్రైజ్ ఇవ్వొచ్చు: ప్రశాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నిన్నటి(శుక్రవారం) వరకు జరిగినవి బడ్జెట్ సమావేశాలు కావు, అవి బుల్డోస్ చేసే వాటిలా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన శనివారం మీడయాతో మాట్లాడారు. ‘‘అసెంబ్లీలో జీరో ఆవర్ మొత్తానికే రద్దు చేశారు. కేవలం 6 రోజులే సమావేశాలు సాగాయి. 16 మంది మంత్రులు మాట్లాడాల్సిన అంశంపై చర్చనే జరగలేదు. నాకు అవకాశమే ఇవ్వలేదు. అన్యాయంగా నేను మాట్లాడకుండా నా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. ఏరోజు ఏ ఒక్క విప్ కూడా ప్రతిపక్షాలతో మాట్లాడలేదు. ప్రజా సమస్యల మీద మాట్లాడుదాం అంటే మైక్ కట్ చేశారు. మార్షల్స్‌ను పెట్టి ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయటికి పంపించారు. .. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష, ఆయన తీరు, హావభావాలు మొత్తం చూసి నాకు బాధేసింది. అసెంబ్లీ నడిచిన తీరు, ప్రభుత్వంలో ఉన్న నాయకులు మాట్లాడిన భాషను సైతం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. సబ్జెక్ట్ మంచిగా మాట్లాడుతున్నారని, ప్రతిపక్షాలది పైచేయి అవుతుంటే మమ్మల్ని ఆపే ప్రయత్నం చేసి, చర్చను మరుగున పడేశారు. ఈ సభ మొత్తం జరిగింది మాజీ సీఎం కేసీఆర్‌ణు తిట్టడం, గత ప్రభుత్వాన్ని నిందించటం, మమ్మల్ని బెదిరించటంతోనే సరిపోయింది... నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. జాబ్ క్యాలండర్లో స్పష్టత లేదు. రైతు భరోసా నిధుల మాటే లేదు. జాబ్ క్యాలండర్‌కు చట్టబద్దత ఏది? రుణమాఫీ అంశం క్లారిటీ లేదు. మైక్ ఇవ్వరు, అడిగితే మార్షల్స్‌ను పెట్టి ఎత్తిపడేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేంద్ర ఇరిగేషన్ మంత్రిత్వ శాఖ ఇవ్వాలని ప్రధాని మోదీని కోరుతున్నా. రూ. 75 కోట్లతో 1.50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని ఆయన అంటున్నారు. భట్టికి నోబెల్ ప్రైజ్ ఇవ్వొచ్చు. అసెంబ్లీ లో మహిళ ఎమ్మెల్యేలు కంట తడి పెట్టుకున్నారు. ఏం మొహం పెట్టుకొని అసెంబ్లీకి వచ్చారని డిప్యూటీ సీఎం అన్నారు. మా కర్మకాలి అసెంబ్లీకి వచ్చానని సబితా ఇంద్రారెడ్డి బాధపడుతూ చెప్పారు’’ అని ప్రశాంత్ రెడ్డి అన్నారు. -
బాల్కొండ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డితో టుడేస్ లీడర్
-
వేల్పూర్‌కు సీఎం కేసీఆర్.. మంత్రి ప్రశాంత్‌రెడ్డికి పరామర్శ
సాక్షి, వేల్పూర్/హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి వేముల మంజులమ్మ(77) హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆమె చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. పరిస్థితి విషమించి ఆమె మరణించడంతో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రశాంత్‌రెడ్డి నివాసంలో విషాదం నెలకొంది. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌లో మంజులమ్మ అంత్యక్రియలు నేడు (శుక్రవారం) జరగనున్నాయి. మంత్రి తల్లి అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. కాగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే షకిల్ పరామర్శించారు. వేముల మాతృమూర్తి మృతిపై సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో పాటు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ తదితరులు సంతాపం ప్రకటించారు. చదవండి: నేటి నుంచి తెలంగాణలో బడులకు దసరా సెలవులు -
మంత్రి వేములకు మాతృవియోగం.. అంత్యక్రియలకు సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్/నిజామాబాద్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రేపు(శుక్రవారం) నిజామాబాద్ జిల్లా వేల్పూరుకు వెళ్లనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి అంత్యక్రియలకు కేసీఆర్ హాజరు కానున్నట్లు సమాచారం. రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ తల్లి మంజులమ్మ హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో పలువురు నేతలు ఆయనకు సానుభూతి తెలిపారు. ఆపై అంత్యక్రియల కోసం భౌతిక కాయాన్ని వేల్పూర్‌కు తరలించారు. అంతకు ముందు.. వేముల మాతృవియోగంపై సీఎంవో ఒక సంతాప ప్రకటన విడుదల చేసింది. -
రాజ్‌భవన్ అడ్డాగా పాలిటిక్స్.. తమిళిసైపై మంత్రి వేముల ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వం ఎమ్మెల్సీ కోటాలో పంపిన(దాసోజు శ్రవణ్, సత్యనారాయణ) సిఫార్సులను గవర్నర్ తిరస్కరించారు. ఈ క్రమంలో రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించలేనని, అర్హుల పేర్లను ప్రతిపాదించాలని గవర్నర్ తమిళిసై సూచించారు. దీంతో, తెలంగాణలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. దీంతో, గవర్నర్‌పై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టే.. తాజాగా, తెలంగాణ గవర్నర్ తమిళిసైపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. మంత్రి ప్రశాంత్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌గా కొనసాగే నైతిక అర్హత తమిళిసై సౌందరరాజన్‌కి లేదు. ఆమె రాజ్‌భవన్‌ను రాజకీయ అడ్డాగా మార్చుకుని పాలిటిక్స్ చేస్తున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం తెలిపి పంపితే వారికి రాజకీయా నేపథ్యం ఉందని రిజెక్ట్ చేయడం అత్యంత దుర్మార్గం. అత్యంత వెనుక బడిన కులాలకు(ఎంబీసీ)చెందిన సామాజిక కార్యకర్త దాసోజు శ్రవణ్, షెడ్యుల్ తెగకు (ఎస్టీ) చెందిన సామాజిక కార్యకర్త కుర్రా సత్యనారాయణ లను రిజెక్ట్ చేయడం యావత్ తెలంగాణ సమాజాన్ని అగౌరపర్చినట్టే. అప్రజాస్వామిక నిర్ణయం.. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై నియమించబడబడలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ గవర్నర్‌కు నైతిక విలువలు ఉంటే ఆమె వెంటనే పదవికి రాజీనామా చేయాలి. సర్కారియ కమిషన్ చెప్పినట్టు రాజకీయాలకు సంబంధంలేని వారిని గవర్నర్లుగా నియమించాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. సర్కారియ కమిషన్ సూచనలు తుంగలో తొక్కి ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిని గవర్నర్‌గా నియమించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. గవర్నర్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాము అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: గణేష్ నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు -
TS: స్కూల్లో 90 మంది విద్యార్థినిలకు అస్వస్థత.. మంత్రి సీరియస్
సాక్షి, భీంగల్: ఫుడ్ పాయిజన్ కారణంగా కస్తూర్భా పాఠశాలలో దాదాపు 90 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. తీవ్రమైన కడుపునొప్పితో పాటుగా వాంతులు చేసుకున్నారు. దీంతో, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ ఘటనపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా భీంగల్‌లోని కస్తూర్భా పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత పుఢ్ పాయిజన్‌తో 90 విద్యార్థినులకు కడుపునొప్పితో పాటు వాంతులు అయ్యాయి. దీంతో సిబ్బంది అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రత్యేకాధికారి శోభ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం అస్వస్థతకు గురైన విద్యార్థులందర్నీ నిజామాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే మంత్రి వేముల ప్రశాంత్ సీరియస్ అయ్యారు. దీనికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్‌కు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని మంత్రి వేముల.. కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రస్తుతం విద్యార్థినిల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరాతీశారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్‌తో మంత్రి మాట్లాడి.. విద్యార్థినిలకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఇది కూడా చదవండి: డీఎస్‌కు తీవ్ర అస్వస్థత.. పరిస్థితి విషమం: ఆసుపత్రి వర్గాలు -
TS: గృహలక్ష్మి పథకానికి లాస్ట్‌డేట్ లేదు!
సాక్షి, హైదరాబాద్: ఆగష్టు 10వ తేదీతో గృహలక్ష్మి పథకం గడువు ముగుస్తుందంటూ జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించింది. అలాగే.. దరఖాస్తుల స్వీకరణకు రకరకాల పేపర్లు అడుగుతూ కొర్రీలు పెడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాల విమర్శలపైనా స్పందించింది. గృహలక్ష్మి పథకం అనేది తెలంగాణలో కొనసాగే నిరంతర ప్రక్రియ అని, కాబట్టి దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టమైన ప్రకటన చేసింది. ఇళ్లులేని నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సొంత జాగా ఉండి.. ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకుంది. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల కోసం ప్రభుత్వం డెడ్ లైన్ విధించిందని, అర్హులైన వారు ఈనెల 10వ తేదీలోగా ధరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించిందని పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దరఖాస్తు విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ‘‘గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ. దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు. కాబట్టి ఇంటి నంబర్ అయినా సరే లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చు అని స్పష్టం చేసింది. దీనికి గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు తమతమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తులు పంపించవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతీ నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3వేల ఇండ్లు పూర్తి అయిన తర్వాత.. రెండో దశలో ఇచ్చే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇండ్లు లేని పేదలు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు. దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి అమలు చేస్తారు అని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. గృహలక్ష్మి పథకం విషయంలో.. ప్రతి పక్షాలు, కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలు నమ్మొద్దని, పేదలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారాయన. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ - దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఇండ్లులేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టుకోవడానికి రూ. 3 లక్షలు ఆర్ధిక సహాయం అందించే గృహలక్ష్మి… pic.twitter.com/yLp0zgYM0s — BRS Party (@BRSparty) August 9, 2023 మార్గదర్శకాలు ఇవే.. ► ఈ పథకం కింద 100 శాతం రాయితీతో ప్రభుత్వం రూ. 3 లక్షల ఈ ఆర్థిక సాయం అందించనుంది. ► రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున మెుత్తం 4 లక్షల మంది లబ్ధిదారులకు సాయం అందిస్తారు. ► మహిళల పేరు మీదే ఆర్థిక సాయం అందిస్తారు. ► లబ్ధిదారైన మహిళ పేరిట బ్యాంకు ఖాతా తెరవాలి (జన్‌ధన్ ఖాతాను వినియోగించవద్దు) . ► కలెక్టర్లు, కమిషనర్లు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. ► ఇంటి బేస్ మెంట్ లెవెల్, రూఫ్ లెవెల్, స్లాబ్ ఇలా మూడు దశల్లో ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ► ఇప్పటికే ఆర్సీసీ (RCC) ఇళ్లు ఉన్న వారికి, 59 ఉత్తర్వులు కింద లబ్ధి పొందిన వారు ఈ పథకానికి అనర్హులు. ► ఈ పథకం కింద ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీ, మైనార్టీలకు 50 శాతం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. దివ్యాంగులకు 5 శాతం ప్రత్యేక రిజర్వేషన్లను ప్రకటించారు. -
ఎంతో ఆసక్తికరంగా బాల్కొండ నియోజకవర్గ రాజకీయ చరిత్ర
బాల్కొండ నియోజకవర్గం బాల్కొండ నియోజకవర్గంలో టిఆర్ఎస్ తరపున పోటీచేసిన వేముల ప్రశాంతరెడ్డి మరోసారి గెలిచి మంత్రి అయ్యారు. ఆయన 2014లో గెలిచిన తర్వాత మిషన్ బగీరద స్కీమ్ అమలు కు చైర్మన్ గా బాద్యతలు నిర్వహించారు. ప్రశాంతరెడ్డి బిఎస్పి తరపున పోటీచేసిన సునీల్ కుమార్‌పై 32459 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ గతంలో 2009లో ప్రజారాజ్యం తరపున గెలిచిన మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ 2014, 2018లలో కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసి ఓడిపోయారు. ఈయన 2018లో మూడోస్థానానికి పరిమితం అవడం విశేషం. ప్రశాంతరెడ్డికి 73538 ఓట్లు రాగా, సునీల్ కుమార్‌కు 41079 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఐ నేత అనిల్ కుమార్‌కు సుమారు ముప్పైవేల ఓట్లు మాత్రమే వచ్చాయి. బాల్కొండలో పదిసార్లు రెడ్లు గెలుపొందితే, ఆరుసార్లు బిసి నేతలు ప్రధానంగా మున్నూరుకాపు నేతలు విజయం సాదించారు. రెండువేల తొమ్మిదిలో ఇక్కడ ప్రజారాజ్యం అభ్యర్ధి ఎర్రాపత్రి అనిల్ ఎనిమిదివేల ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్ధి, మాజీ మంత్రి సంతోష్‌రెడ్డి కుమారుడు అయిన శ్రీనివాస్‌రెడ్డిపై గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత అనిల్ తదుపరి కాలంలో ప్రభుత్వవిప్‌గా పదవి పొందారు. బాల్కొడంలో నాలుగుసార్లు చొప్పున గెలిచిన ఘనత జి.రాజారాం, కె. ఆర్. సురేష్‌రెడ్డిలకు దక్కింది. 1994లో సైతం గెలుపొందిన సురేష్‌రెడ్డి డీలిమిటేషన్‌ను దృష్టిలో ఉంచుకుని 2009లో బాల్కొండలో కాకుండా ఆర్మూరులో పోటీచేసి మేనత్త అన్నపూర్ణమ్మ చేతిలో ఓడిపోవడం విశేషం. 2014లో కూడా ఓటమి తప్పలేదు.ఆ తర్వాత ఆయన టిఆర్ఎస్లో చేరి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. సురేష్‌రెడ్డి 2004 నుంచి ఐదేళ్లపాటు స్పీకరుగా పదవీబాధ్యతలు నిర్వహించారు. జి. రాజారాం 1967లోఇక్కడ నుంచి ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికవడం ఓ రికార్డు.ఈయన ఆర్మూరులో కూడా ఒకసారి గెలుపొందడం ద్వారా మొత్తం ఐదుసార్లు చట్టసభకు వెళ్లారు. ఈయన జలగం, చెన్నారెడ్డి, అంజయ్యల మంత్రివర్గాలలో పనిచేసారు. రోడ్డు ప్రమాదంలో మరణించడంతో రాజారామ్ భార్య సుశీలాబాయి ఇక్కడ నుంచి ఉప ఎన్నికలో గెలిచారు. ఈ విధంగా భార్యభర్తలు ఇద్దరూ చట్టసభలోకి వెళ్లినట్లయింది. టిడిపినేత జి.మధుసూదనరెడ్డి రెండుసార్లు గెలిచారు. బాల్కొండకు ఒక ఉప ఎన్నికతో సహా 16సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి పదిసార్లు గెలుపొందగా, టిడిపి రెండుసార్లు, సోషలిస్టు పార్టీ, ప్రజారాజ్యం పార్టీ టిఆర్ఎస్ రెండుసార్లు గెలిచాయి. బాల్కొండలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
300 కిలోమీటర్ల దిగువ ప్రాంతం నుంచి ఎగువకు నీరు
-
ఆర్టీసీ బస్సెక్కిన మంత్రి.. సీఎం నాటిన మొక్కకు హ్యాపీ బర్త్‌డే
సాక్షి, మహేశ్వరం: విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తిరుగు పయనంలో మన్సాన్పల్లి చౌరస్తా వద్ద తన కాన్వా య్‌ను ఆపారు. నాగారం వైపు వెళ్తున్న బస్సు ఎక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. అందులో ప్రయాణిస్తున్న విద్యార్థులతో ముచ్చటించారు. ఏ పాఠశాలలో చదు తున్నారు? బస్సులు సమయానికి వస్తున్నాయా? ప్రభుత్వ పాఠశాలలో బోధన, వసతులు బాగున్నాయా?.. అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారితో ఆమె ఫొటోలు దిగారు. కాసేపు బస్సులో ప్రయాణించిన తర్వాత మంత్రి .. తిరిగి తన కారులో హైదరాబాద్ బయలుదేరారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి...తన ఇంటి వద్ద ఎనిమిదేళ్ల క్రితం సీఎం కేసీఆర్ మొదటి విడత హరితహారంలో నాటిన మొక్కకు గురువారం పుట్టినరోజు వేడుక నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచం మొత్తం అడవుల శాతం తగ్గిపోతుంటే, తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ చొరవ వల్ల 7.7 శాతం అడవులు పెరిగాయన్నారు. -వేల్పూర్ అరక పట్టిన అమాత్యుడు నిర్మల్ జిల్లాలో గిరిజనులకు అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం పోడు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సారంగాపూర్ మండలం రవీంద్రనగర్ తండాకు వెళ్లి పోడు భూమిలో ఇలా అరక పట్టి దుక్కి దున్నారు. పోడు భూముల్లో రతనాలు పండించి ఆదర్శంగా నిలవాలని ఆదివాసీ రైతులకు సూచించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్ అల‘గెల’గా సాధారణంగా ఒక అరటి చెట్టుకు ఒక గెల మాత్రమే కాస్తుంది. ఇందుకు భిన్నంగా ఒకే చెట్టుకు రెండు అరటి గెలలు కాశాయి. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం భీమవరం పంచాయతీ మద్దిపుట్టులో ఓ గిరిజనుడి ఇంటి వద్ద ఈ అద్భుతాన్ని పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు. – హుకుంపేట -
‘వాపును చూసి.. బలుపు అనుకుంటున్న కాంగ్రెస్’
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల్లో గెలు పుతో కాంగ్రెస్ పార్టీ భ్రమల్లో బతుకు తోందని, ఆ పార్టీ నాయ కులు వాపును చూసి బలుపు అనుకుంటున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజ మెత్తారు. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన భీంగల్, ముచ్కూర్, బాబాపూర్ గ్రా మాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు, పలువురు యువకులు ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. సీఎం కేసీఆర్ కంటే ముందు పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతులు, పేదలకు ఏం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాచికలు తెలంగాణలో పారవన్నారు. కేంద్రంలో అధి కారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏమీ చేయలేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ తెలంగా ణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్ర« దాని మోదీ దేశ వ్యాప్తంగా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన ప్రాజెక్టులు, నిధులను గుజరాత్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు అన్యాయంగా తరలిస్తుంటే ఇక్కడి బీజేపీ ఎంపీలు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్కొండ నియో జకవర్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అన్ని విధాలా అభివృద్ధి చేశామన్నారు. కాంగ్రెస్.. భారత రాబందుల పార్టీ: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘మాది బీజేపీ బంధువుల పార్టీ కాదు, మీదే భారత రాబందుల పార్టీ. ఏఐసీసీ అంటేనే అఖిల భారత కరప్షన్ కమిటీ. దేశంలో అవినీతికి, అసమర్థతకు ఒకే ఒక్క కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పారీ్ట’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం సభ వేదికగా రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ మండిపడ్డారు. ‘మా పార్టీ బీజేపీకి బీ టీమ్ కాదు, కాంగ్రెస్ పారీ్టకి సీ టీమ్ అంతకన్నా కాదు. బీజేపీ, కాంగ్రెస్ రెండింటీనీ ఒంటిచేత్తో ఢీకొట్టే ‘డీ టీమ్’బీఆర్ఎస్’అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ను నేరుగా ఢీకొనే దమ్ములేక బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చే కుట్ర చేస్తారా, ఈ మిస్ ఫైరింగ్‌లో ముమ్మాటికీ కుప్పకూలేది కాంగ్రెస్ పారీ్టయే అంటూ మండిపడ్డారు. లక్ష కోట్లు వ్యయంకాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతి అంటూ కాంగ్రెస్ అర్ధంలేని ఆరోపణలతో నవ్వుల పాలవుతోందన్నారు. ధరణి రద్దు చేసి దళారుల రాజ్యాన్ని తెస్తే ప్రజలు క్షమించరని, రూ.4వేల పెన్షన్‌ను ఎవరూ నమ్మరని, డిక్లరేషన్లను విశ్వసించరన్నారు. దేశాన్ని దోచుకున్న చరిత్ర కాంగ్రెస్‌ది: హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: దేశాన్ని దోచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, అందుకే దేశ ప్రజలు వారిని అధికారం నుంచి దించి మూలన కూర్చోబెట్టారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎవరికీ బీటీమ్ కాదని, తమది పేదలు, ప్రజా సంక్షేమం చూసే ఏ క్లాస్ టీమ్ అని వ్యాఖ్యానించారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేనందునే దేశాన్ని బీజేపీ కబంధ హస్తాల నుంచి కాపాడేందుకే బీఆర్ఎస్ పుట్టిందన్నారు. స్కామ్‌లలో ఆరితేరిన కాంగ్రెస్ కుంభకోణాల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. ఖమ్మంలో పసలేని ఆరోపణలు, ఊకదంపుడు ప్రసంగాలు, రాసిచి్చన స్క్రిప్ట్ తో రాహుల్ స్కిట్ వేశారని హరీశ్ ఎద్దేవా చేశారు. -
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటనలో అపశృతి
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. భీంగల్ మండలం పురానిపెట్ గ్రామంలో ఊరుర చెరువుల పండగకు ఆయన హాజరు అయ్యారు. ఆ సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. బాణాసంచా భారీ సంఖ్యలో పేల్చడంతో.. అవి కాస్త పక్కనే ఉన్న టెంట్‌పై పడ్డాయి. ఆ ప్రభావంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే.. స్థానికులు సత్వరమే స్పందించి మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా.. బాణాసంచాతో పెను ప్రమాదమే జరిగింది. అగ్ని ప్రమాదం.. దానికి కొనసాగింపుగా సిలిండర్లు పేలడంతో నలుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. -
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటనలో అపశ్రుతి
-
తెలంగాణపై విషం కక్కేందుకే మోదీ హైదరాబాద్ వచ్చారు: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ప్రాజెక్టుల శంకుస్థాపన కోసం వచ్చినట్లు లేదని.. తెలంగాణపై విషం కక్కేందుకే వచ్చినట్లు ఉందని మండిపడ్డారు. ప్రతి మాట సత్యదూరమని, ప్రధానిగా ఇన్ని అబద్ధాలు చెప్పడం మోదీకే చెల్లిందని విమర్శించారు. రైతు బంధును కాపీ కొడితే పీఎం కిసాన్ అయ్యిందని.. కానీ పీఎం కిసాన్ వల్లే మొదటిసారి రైతులకి లబ్ది అని చెప్పుకోవడం సిగ్గు చేటు అని విమర్శించారు. రైతు బంధుతో పోల్చితే పీఏం కిసాన్ సాయమెంత? అని ప్రశ్నించారు. ‘తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆసరా పెన్షన్, రైతు బంధు వంటివి నేరుగా లబ్ది దారుల ఖాతాలో జమ అవుతున్నాయి. తన వల్లే డీబీటీ మొదలైనట్టు అనడం పచ్చి అబద్దం. ఇందులో గొప్ప చెప్పుకోవాల్సింది ఏముంది?. వ్యవసాయానికి, పరిశ్రమలకు చేయూత అని చెప్పడం పూర్తి అవాస్తవం. ITIRను బెంగళూరుకు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన వెంటనే గుజరాత్లో అర్బిట్రేషన్ సెంటర్ పెట్టారు. తెలంగాణ ధాన్యాన్ని కొనకుండా రైతుల కంట కన్నీరు పెట్టించారు. ఇవన్నీ చేసింది మోదీ ప్రభుత్వం కాదా? రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందించడం లేదని మోదీ చెప్పడం హాస్యాస్పదం. నిజానికి ఈ పరిస్థితి రివర్స్గాగా ఉంది. రాష్ట్రానికి రావాల్సిన గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, జాతీయ హోదా వంటివి ఇవ్వకుండా కేంద్రం తెలంగాణకు ఎలాంటి సహకారం అందించడం లేదు’ అని మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. తెలంగాణకు మోదీ ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు: ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్‌రెడ్డి ‘తెలంగాణ సీఎంకు సరైన సమాచారం ఇవ్వకుండా పరేడ్ గ్రౌండ్స్‌లో సభ నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాల సభను ఎన్నికల ప్రచార సభగా ప్రధాని మోదీ మార్చారు. ప్రధాని తన ప్రసంగంలో డొల్ల మాటలు మాట్లాడారు. తెలంగాణకు తొమ్మిది ఏళ్లుగా మోదీ ఎలాంటి సహాయం చేయలేదు. విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చలేదు. ఎయిమ్స్ ప్రకటన చేసిన నాలుగేళ్ళ తర్వాత మోదీ ఈ రోజు శంకుస్థాపన చేశారు. తెలంగాణకు మోదీ ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు దేశంలో 150 మెడికల్ కాలేజీలు ఇచ్చిన మోదీ తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలి. మెట్రోకు కావాల్సిన నిధులు ఎవరు ఇచ్చారో తెలంగాణ ప్రజలకు తెలుసు. మెట్రో తమ ఘనతగా మోదీ గొప్పలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ 28 ప్రాజెక్టులు అడిగితే కేంద్రం ఇచ్చింది కేవలం మూడు ,నాలుగు మాత్రమే. టోల్ రూపంలో 9 వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు చెల్లించారు. మోడీ తన ప్రసంగంలో మొత్తం అబద్దాలు మాట్లాడారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులు ఇవ్వలేదు. అప్పు అడిగినా ఇవ్వలేదు’ అని ఎమ్మెల్సీ మండపడ్డారు. అవార్డులు ఎందుకు ఇస్తోంది: మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రధానికి రాష్ట్రానికి వచ్చి ఏమైనా ప్రాజెక్టులు ఇస్తారనుకుంటే.. కేవలం తిట్టిపోయారని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ విమర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యలపై మంత్రులు విరుచుకుపడ్డారు. గతంలో కేసీఆర్ పాలనను ప్రధాని మెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం తప్ప మోదీకి ఏమీ చేత కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోతే కేంద్రం అవార్డులు ఎందుకు ఇస్తోందని ప్రశ్నించారు. అభివృద్ధి తట్టుకోలేకే విమర్శలు: మంత్రి జగదీశ్ రెడ్డి రైలు ప్రారంభం పేరుతో తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ.. ఈ ప్రాంతంపై మరోసారి విషం చిమ్మారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. హైదరాబాద్ పర్యటనలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రధాని నరేంద్ర మోదీ తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. ఆ ప్రంసంగం ఆసాంతం మోసపూరితంగా సాగిందని విమర్శించారు. మోదీ ముఖంలో కేసీఆర్ భయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు మోదీ. భయంతో మోదీ పూర్తి అబద్ధాలు, అసత్యాలు మాట్లాడారు. ప్రధాని తన ప్రసంగంలో తెలంగాణ అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందనడం విడ్డూరంగా ఉంది. ఎందులో అడ్డుకున్నాం.. కేంద్రం పసుపు బోర్డు ఇస్తానంటే అడ్డుకున్నామా?. ‘కేసీఆర్‌ది కుటుంబ పాలన కానేకాదు. ఆయనది ఉద్యమ నేపథ్య కుటుంబం. కేసీఆర్‌కు ప్రజల ఆమోదం ఉంది. -మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి -
ఏప్రిల్‌లో అంబేడ్కర్ భారీ విగ్రహం ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్‌సాగర్ తీరంలో నిర్మిస్తున్న 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహాన్ని వచ్చే ఏప్రిల్‌లో ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి నాటికి విగ్రహం ఏర్పాటు పనులు పూర్తి అవుతున్నందున, ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజున పర్యాటకుల వీక్షణకు వీలుగా విగ్రహాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. సోమవారం విగ్రహం ఏర్పాటు పనులను మంత్రులు కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ భారీ విగ్రహాన్ని ఢిల్లీలో పద్మభూషణ్ పురస్కార గ్రహీత, శిల్పి రాంసుతార ఆధ్వర్యంలో తయారు చేసినట్లు చెప్పారు. తరలింపునకు వీలుగా ముక్కలుగా రూపొందించిన విగ్రహాన్ని తీసుకువచ్చి ఇక్కడి వేదికపై పేర్చి అతికిస్తున్నట్లు తెలిపారు. మొత్తం పదకొండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోందని మంత్రులు వెల్లడించారు. దిగువ పార్లమెంటు ఆకృతిలో నిర్మించిన భవనంలో అంబేడ్కర్ జీవిత చరిత్రను ప్రతిబింబించే ఫొటో గ్యాలరీ, ఆడిటోరియం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఇంకా అంబేడ్కర్‌కు సంబంధించిన చిత్రాలు, పార్లమెంటులో ఆయన ప్రసంగించిన వీడియోలను ప్రదర్శించేందుకు మినీ థియేటర్ కూడా ఉంటుందని తెలిపారు. ఈ భవనం మీద అంబేడ్కర్ విగ్రహం ఉంటుందని చెప్పారు. -
జనవరి 15లోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికను జనవరి 15 నాటికి పూర్తి చేయా లని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పురోగతి, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై గురువారం ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, హౌసింగ్ స్పెషల్ సెక్రెటరీ సునీల్ శర్మలతో కలసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇళ్లు అందేలా చూడాలని కలెక్టర్లను కోరారు. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలు, ఆహారభద్రత కార్డులు, అద్దె ఇళ్లలో ఉన్న వారి జాబితాను ఎంపిక చేయాలని సూచించారు. తుది జాబితాను సంబంధిత ప్రజాప్రతినిధుల ఆమోదంతో హైదరాబాద్‌కు పంపాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో మొత్తం 2 లక్షల 91 వేల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను చేపట్టామని వివరించారు. హైదరాబాద్ మినహా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లక్షా 29 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. కాగా, 62 వేల ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సీఎస్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీల్లో విద్యుత్, సీవరేజ్, రహదారుల నిర్మాణాలను వెంటనే చేపట్టాలని కోరారు. కాగా, సెక్రటేరియట్ భవనం, అమరవీరుల స్మారకచిహ్నం, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మాణ పనుల పురోగతిని మంత్రి వేముల, సోమేశ్ కుమార్ బీఆర్కేఆర్ భవన్ 10వఅంతస్తునుంచి పరిశీలించారు. 26లోగా పోడు సర్వే పూర్తి చేయాలి.. ఈ నెల 26లోగా పోడు భూముల సర్వే పూర్తి చేసి, గ్రామ సభల ద్వారా వివరాలను సబ్ కమిటీకి పంపేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. అలాగే క్రీడా ప్రాంగణాలు, బృహత్ ప్రకృతి వనాలను లక్ష్యాల మేరకు పూర్తి చేసి ఆన్లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని కోరారు. ధరణిలో వచ్చిన ఫిర్యాదులను, జీవో 58, 59 ప్రకారం ఉన్న సమస్యలను పరిశీలించి అర్హులైన వారికి పట్టాలు ఇవ్వాలని సీఎస్ సూచించారు. డా.బి.ఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్, అమరవీరుల స్మారక చిహ్నం, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మాణాలను బీఆర్కేఆర్ భవన్ పదో అంతస్తు నుంచి సీఎస్ సోమేశ్‌కుమార్‌తో కలిసి పరిశీలిస్తున్న -
బెంగాల్ ఫార్ములా అమలుకు బీజేపీ కుట్ర
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ సర్కస్ ఆడుతోందని, రాష్ట్రంలో బెంగాల్ ఫార్ములా అమలుకు బీజేపీ కుట్ర చేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ఏదో ఒక విషయాన్ని వివాదాస్పదం చేసి తెలంగాణలో శాంతి భద్రతల సమస్య తెచ్చేందుకు బీజేపీ పన్నాగం పన్నిందన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, ఎమ్మెల్సీలు వి.గంగాధర్‌గౌడ్, రాజేశ్వర్‌రావుతో కలిసి శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ప్రశాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నామని, ఆయన చేసిన వ్యాఖ్యలతో పోలిస్తే కవిత తిట్టింది చాలా తక్కువని వ్యాఖ్యానించారు. సంస్కారం లేకుండా రాజకీయాలకే కళంకంగా మారిన అర్వింద్ తన తీరు మార్చుకోవడం లేదని, ఆడబిడ్డను కేసీఆర్ అమ్ముకుంటున్నారని నీచ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కవితపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తే అభిమానులు సహిస్తారా అని మంత్రి ప్రశ్నించారు. మహిళా గవర్నర్ ఏం చేస్తున్నారు? కేసీఆర్ తన బిడ్డను అమ్ముకుంటున్నారని ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై మహిళా గవర్నర్ ఏం చేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే రాష్ట్రంలో రాజకీయాల స్థాయి దిగజారిందన్నారు. కేసీఆర్ ఫెయిల్యూర్ సీఎం అంటూ విమర్శలు చేస్తున్న బండి సంజయ్‌కి సక్సెస్, ఫెయిల్యూర్‌కు నడుమ తేడా తెలుసా అని ప్రశ్నించారు. మునుగోడు ఓటమి నుంచి బీజేపీ గుణపాఠం నేర్చుకోలేదన్నారు. అర్వింద్ ఇంట్లో మూడు పార్టీలకు చెందిన నేతలున్నారని, కాంగ్రెస్‌తో కుమ్మక్కు కావడం వల్లే ఆయన ఎంపీగా గెలుపొందారని ఆరోపించారు. అర్వింద్ భాషపై పౌర సమాజం, మీడియా కూడా స్పందించాలని మంత్రి వేముల కోరారు. బీజేపీ నేతల తిట్లతో పోలిస్తే అరవింద్ ఇంటిపై జరిగిన దాడి ఘటన చాలా చిన్నదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బెంగాల్ తరహా కుట్రలను బీజేపీ అమలు చేయాలని చూస్తోందని ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ ఆరోపించారు. అర్వింద్ మొదటి నుంచి తప్పుడు మార్గంలో ఉన్నారని, కాంగ్రెస్‌లో బీ ఫారాలు అమ్ముకున్న చరిత్ర ఉందని ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు విమర్శించారు. -
ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోలుకు విముఖత చూపుతున్న కేంద్రం మెడలు వంచేందుకు ఉగాది తర్వాత ఉగ్ర రూపం చూపుతామని రాష్ట్ర మంత్రుల బృందం హెచ్చరించింది. ఈ అంశంపై ఇటీవల ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ రాసిన లేఖకు నెలాఖరులోగా జవాబు రాకపోతే కేంద్రంపై తమ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపింది. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరేందుకు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్ శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. గురువారం రాత్రి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన మంత్రుల బృందం శుక్రవారం ప్రగతి భవన్లో కేసీఆర్‌తో సుదీర్ఘంగా భేటీ కావడం తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తమపట్ల వ్యవహరించిన తీరు, కేంద్రం మెడలు వంచేందుకు చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన వివరాలను శనివారంవారు వెల్లడించారు. తెలంగాణ కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తామని, తెలంగాణను అవమానించి అవహేళన చేసిన ఎందరో నేతలు రాజకీయ భవిష్యత్తు లేకుండా చరిత్ర పుట ల్లో కలిసిపోయారని వ్యాఖ్యానించారు. నూకలు తినాలంటూ రాష్ట్ర ప్రజలను అవమానించిన బీజేపీకి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. బీజేపీకి కౌరవులు, రావణాసురుడి గతే: నిరంజన్‌రెడ్డి మహాభారతంలో ద్రౌపదిని అవమానించిన కౌరవులకు, రామాయణంలో సీతను చెరబట్టిన రావణాసురుడికి దక్కిన ఫలితమే తెలంగాణ ప్రజలను అవమానించిన బీజేపీకి దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. ఆరు దశాబ్దాల అన్యాయాల చేదు జ్ఞాపకాలను దిగమింగుకుంటూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న తెలంగాణలో ముడి బియ్యం, ఉప్పుడు బియ్యం పేరిట కేంద్రం రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కేంద్రంతో వడ్లు కొనిపించే బాధ్యత తనదంటూ ప్రకటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రోజుకోమాట మారుస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ రైతుల సమస్యలకు పరిష్కారం చూపకుండా కేంద్రం తన మెదడుకు తాళం వేసుకుందని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ ప్రాంత ప్రతినిధిగా కేంద్ర ప్రభుత్వంలో వ్యవహరించడం లేదని దుయ్యబట్టారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా గతంలో కేంద్ర విధానాలను తప్పుబట్టిన నరేంద్ర మోదీ.. ప్రస్తుతం ప్రధాని హోదాలో అవే తప్పులు చేస్తున్నారని ఆక్షేపించారు. బియ్యం నిల్వల నిర్వహణ, ఎగుమతుల్లో కేంద్రానికి విధానమంటూ లేదని, రాష్ట్రాలతో కేంద్రం అనుసరించే తీరు బాధాకరమని నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్, టీఆర్ఎస్ ఉన్నంత వరకు రాష్ట్ర రైతులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. వారి మెదడుకు, నాలుకకు లింకులేదు: ప్రశాంత్‌రెడ్డి ధాన్యం కొనుగోలుపై 16 లేఖలు రాసినా స్పందించకపోగా ఈ అంశంపై కేంద్రం నిర్వహించే సమావేశాలకు తెలంగాణ ప్రతినిధులు హాజరు కావడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అబద్ధాలు చెప్పడాన్ని మంత్రి గంగుల కమలాకర్ ఖండించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి పీయూష్ వ్యాఖ్యలతో గుండెల నిండా బాధనిపించిందని వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ‘మీ ధాన్యం మీరే కొనండి .. మీ నూకల బియ్యాన్ని మీ ప్రజలకు మీరు అలవాటు చేయండి. మేము పీడీఎస్ బియ్యం ఆపేస్తాం. మీరు నూకలను పీడీఎస్ కింద ఇవ్వండి’అని తెలంగాణ ప్రజలను అవమానించిన కేంద్ర మంత్రికి ఇంత కండకావరమా అని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ నాయకుల నాలుకకు, మెదడుకు లింకు తెగిపోయిందని దుయ్యబట్టారు. సంజయ్ మగాడైతే కేంద్రంతో ధాన్యం కొనిపించాలని.. అందుకు సహకరించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించకుండా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రాష్ట్రం కొనాలని డిమాండ్ చేయడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఉగాది వరకు కేంద్రానికి నిరసన తెలుపుతామని, ఆ తర్వా త నూకెవరో, పొట్టు ఎవరో తేలుస్తామని మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించారు. రాజకీయ కోణంలో, రాజకీయ కక్షతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నామని కేంద్రం భావిస్తే అది శునకానందమే అవుతుందని హెచ్చరించారు. -
జూన్ నాటికి రామగుండం వైద్య కళాశాల
సాక్షి, హైదరాబాద్: గోదావరిఖనిలో నిర్మిస్తున్న రామగుండం వైద్య కళాశాల జూన్ నాటికి మొదటి సంవత్సరం విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కొత్తగా ప్రభుత్వం నిర్మిస్తున్న 8 వైద్య కళాశాలల నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు గురువారం మంత్రుల నివాస సముదాయంలోని తన అధికారిక నివాసంలో ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కొత్తగా 8 జిల్లాల్లో వైద్య కళాశాలలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం వీటి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనల మేరకు నిర్మాణాలు ఉండాలని అధికారులను ఆదేశించారు. మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు వైద్య కళాశాలలు ఏప్రిల్‌లోనే పూర్తవుతాయన్నారు. ఫస్టియర్ విద్యార్థుల కోసం భవన నిర్మాణాలు పూర్తైన చోట మెడికల్ కాలేజీ నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులను టీఎస్ఎండీసీ అ«ధికారులతో సమన్వయం చేసుకోవాలని ఈఎన్సీ గణపతి రెడ్డిని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో ఆర్ అండ్ బి కార్యదర్శి శ్రీనివాసరాజు, ఈఎన్సీ గణపతి రెడ్డి, సీఈ సతీశ్ పలువురు అధికారులు పాల్గొన్నారు. -
బీజేపీ ఎమ్మెల్యేల వైఖరి వల్లే సస్పెన్షన్: వేముల
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సభ్యుల ప్రవర్తనే వారి సస్పెన్షన్‌కు కారణమని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. గవర్నర్, బడ్జెట్ ప్రసంగాల సందర్భంగా వెల్‌లోకి వచ్చే సభ్యులను సస్పెండ్ చేయాలని గతంలోనే నిర్ణయించామన్నారు. సభ నుంచి బీజేపీ సభ్యులను సస్పెండ్ చేయడం తమకు ఇష్టం లేకున్నా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో సమావేశాలు పూర్తయ్యేంత వరకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందన్నారు. సమావేశాలు ముగియడంతో మంగళవారం అసెంబ్లీ కమిటీహాల్లో మీడియాతో మంత్రి మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గతంలో విపక్ష సభ్యులను సమావేశాలకు హాజరు కాకుండా సస్పెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. కేంద్రం నిర్ణయాలకు అసెంబ్లీలో సమాధానాలు చెప్పలేకే బీజేపీ ఎమ్మెల్యేలు కావాలనే సస్పెండ్ అయ్యేలా ప్రవర్తించారన్నారు. శాసన వ్యవస్థలో కోర్టులు జోక్యం చేసుకోవని, చట్ట సభల విచక్షణను కోర్టులు ప్రశ్నించలేవని తెలిసినా వారు కోర్టుకెళ్లి అభాసుపాలయ్యారని అన్నారు. -
ఇద్దరు మంత్రులు.. మూడోసారి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీలో వరుసగా మూడుసార్లు వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఘనతను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, శాసనసభ వ్యవ హారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సొంతం చేసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హోదాలో హరీశ్‌రావు వరుసగా 2020–21, 2021–22, 2022–23 బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మంత్రి వేముల కూడా వరుసగా మూడు వార్షిక బడ్జెట్లను మండలిలో ప్రవేశపెట్టారు. సోమవారం ఉదయం హరీశ్ తన ఇంటి నుంచి అసెంబ్లీకి వెళ్తూ ఫిల్మ్‌నగర్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు. అసెంబ్లీకి చేరుకుని సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న హరీశ్.. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి బడ్జెట్ ప్రతిని అంద జేశారు. మంత్రి వేములతో కలసి మండలికి వెళ్లి ప్రొటెమ్ చైర్మన్ అమీనుల్ జాఫ్రీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కాగా, ఉదయం 11.30కు ప్రారంభ మైన హరీశ్ బడ్జెట్ ప్రసంగం 1.57 నిమిషాల పాటు కొనసాగింది. 90 పేజీల ప్రసంగ పాఠంలో రాష్ట్రంపై కేంద్రం చూపుతున్న వివక్షతో పాటు ఏడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఫలితాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కేటాయింపు వంటి అంశాలను ప్రస్తావించారు. -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా
అప్డేట్స్ ►తెలంగాణ బీఏసీ సమావేశం ముగిసింది. ఈనెల 15 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. అన్ని అంశాలపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని బీఏసీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. ►తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి(మార్చి 9) వాయిదా పడ్డాయి. సభను బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ►రాష్ట్రంలో మరో ఎనిమిది మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఇప్పటికే 17 మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయని, వచ్చే ఏడాది కొత్తగా మరో ఎనిమిది జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామన్నారు. నూతన కాలేజీల ఏర్పాటుకు 2022-23 వార్షిక బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. ►తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగాన్ని 2 గంటల పాటు చదివి వినిపించారు. ఉదయం 11:30 గంటలకు హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కాగా, మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రసంగాన్ని ముగించారు. ►బీజేపీ సభ్యులు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావులపై సస్పెన్షన్ వేటు ► తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకూ బీజేపీ సభ్యుల సస్పెన్షన్ ►బడ్జెట్ ప్రసంగానికి అడ్డుపడుతుండటంతో సస్పెండ్ చేయాలని మంత్రి తలసాని తీర్మానం.. ఆమోదించిన స్పీకర్ పోచారం. ►తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ సభ్యులు సస్పెన్షన్ ► గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో బీజేపీ సభ్యులు ఆందోళన ►తెలంగాణ పురిటి దశలో ఉన్నప్పుడే కేంద్రం దాడి మొదలైంది: హరీష్‌రావు ►ఫెడరల్ స్ఫూర్తిని కేంద్రం దెబ్బతీస్తుంది: హరీష్‌రావు ►ఆర్థిక సంఘం సూచనలను కేంద్రం పట్టించుకోవడం లేదు: హరీష్‌రావు ►తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థికమంత్రి హరీష్‌రావు ప్రసంగిస్తున్నారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టే క్రమంలో ముందుగా హరీష్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణలో కరెంట్ కోతలు, ఆకలి చావులు ఇప్పుడు లేవన్నారు. రాష్ట్ర పునఃనిర్మాణ బాధ్యతను సీఎం కేసీఆర్ తన భుజాలపై వేసుకున్నారన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభం కావడం గమనార్హం. ► బీజేపీ నుంచి గెలిచిన తర్వాత తొలిసారి అసెంబ్లీకి వస్తున్న ఈటల రాజేందర్.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ► తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై బీజేపీ ఎమ్మెల్యేలు నల్లకండువాలతో నిరసన వ్యక్తం చేశారు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగం లేకుండానే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసన సభలో మంత్రి హరీశ్‌రావు, శాసనమండలిలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్ అనంతరం తెలంగాణ బీఏసీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో గవర్నర్ ప్రసంగంతో పాటు నిరుద్యోగ సమస్య, ధాన్యం కొనుగోలు, డబుల్ బెడ్రూమ్ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని విపక్షాలు పేర్కొన్నాయి. -
ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం
-
ఇండియా గేట్ వద్ద బియ్యాన్ని పారబోస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం సేకరించిన మొత్తం బియ్యాన్ని కేంద్రం తీసుకోవాల్సిందేనని మంత్రుల బృందం తేల్చిచెప్పింది. బియ్యం తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని, ఈ వ్యవహారాన్ని ఇంకా పొడిగిస్తే మంచిది కాదని హెచ్చరించింది. కేంద్రం రైతులను తీవ్రంగా అవమానించేలా వ్యవహరిస్తోందని మండిపడింది. ‘రాష్ట్రం సేకరించిన మొత్తం బియ్యాన్ని తీసుకో కుంటే, మిగిలిన బియ్యాన్ని ఢిల్లీలోని ఇండియాగేట్ వద్ద పారబోసి నిరసన తెలుపుతాం’అని ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అల్టిమేటం ఇచ్చారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఇంకా కొనసాగుతున్నాయని, ఇప్పటికే 60 లక్షల మెట్రిక్ టన్నుల పైబడి ధాన్యం సేకరించామని చెప్పారు. రైతుల సంక్షేమం దృష్ట్యా ఉన్నఫళంగా ధాన్యం సేకరణను ఆపేయలేమని, రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి పూర్తిగా కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో మంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, కేఆర్ సురేష్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాసరెడ్డి, లింగయ్య యాదవ్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో సేకరించిన పూర్తి బియ్యాన్ని తీసుకుంటామని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట ఇచ్చారు. దానికి సంబంధించిన లేఖ రాని పక్షంలో 60 లక్షల మెట్రిక్ టన్నులకు మించి సేకరించిన బియ్యాన్ని ఢిల్లీకి తెచ్చి పారబోస్తాం. ధాన్యం సేకరణ అంశం రాష్ట్ర రైతులకు సంబంధించినది.. అందువల్ల కేంద్రప్రభుత్వం దీనిపై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలి’అని పేర్కొన్నారు. బియ్యం తీసుకెళ్లకుండా నిందలా: గంగుల 60 లక్షల మెట్రిక్ టన్నులకు మించి సేకరించిన ధాన్యంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చెప్పినందున వచ్చే యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండబోవని స్పష్టం చేశారు. ‘కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అబద్ధాలు చెబుతున్నారు. రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో సిద్ధంగా ఉన్న బియ్యాన్ని తీసుకెళ్లాలని ఎఫ్‌సీఐకి గతేడాది నుంచి ఇప్పటివరకు 7 లేఖలు రాశాం. వారికి బియ్యం తీసుకెళ్లే ఉద్దేశం లేదు. అందుకే మాపై నిందలు వేస్తున్నారు’అని పేర్కొన్నారు. 3–5 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్: నిరంజన్‌రెడ్డి ఏటా రూ.90 వేల కోట్లు వెచ్చించి వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నామని చెబుతున్న కేంద్రం.. దేశ రైతులకు వంట నూనెలు పండించే దారి చూపించకపోవడం దౌర్భాగ్యమని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. అందుకే వచ్చే వానాకాలంలో రాష్ట్రంలో 3–5 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రతినిధులు వచ్చి ఢిల్లీలో ఎదురుచూస్తున్నా పట్టించుకోకుండా కేంద్రం చిన్నచూపు చూస్తోందని అన్నారు. 2022 కల్లా దేశంలోని రైతుల ఆదాయం రెండింతలు చేస్తామన్న ప్రధాని మోదీ, రైతులు పండించిన పంటను ఇండియాగేట్ వద్ద పోసుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ధాన్యం సేకరణ అంశంలో పీయూష్ గోయల్‌కు రాష్ట్ర బీజేపీ నేతలు తప్పుడు సమాచారం ఇచ్చారని, తాము వాస్తవ పరిస్థితిని ఆయనకు వివరించామన్నారు. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఇద్దరూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇది రాజకీయం కాదని.. రైతాంగ సమస్య అని వ్యాఖ్యానించారు. కాగా, గత శనివారం ఢిల్లీ వచ్చిన ఐదుగురు మంత్రులు, కేంద్రమంత్రి గోయల్ కార్యాలయం నుంచి లేఖ రాకపోవడంతో, తదుపరి కార్యాచరణ కోసం శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు పయనమయ్యారు. -
గడువులోపు సచివాలయం, స్మారక భవనాలు పూర్తవ్వాలి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన గడువులోపు కొత్త సచివాలయం, అమరవీరుల స్మార కభవన నిర్మాణాలు పూర్తి కావాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం ఆయన ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. సచివాలయ పనులు జరుగుతున్న తీరుపట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. అయితే ఇంకా పనుల్లో వేగం పెంచాలని పేర్కొన్న ఆయన.. సచివాలయంలో ముఖ్యమంత్రి, మంత్రుల చాం బర్లు, అధికారుల కార్యాలయాలకు సంబంధించిన డిజైన్లను అంతస్తులవారీగా పరిశీలించారు. గతంలో సీఎం చేసిన మార్పులకు తగ్గట్టు తుది ప్లాన్స్‌ను సమర్పించాలని వేముల ఆదేశించారు. అమరవీరుల స్మారక భవనం ఎలా ఉండబోతుందనే విషయంలో అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. భవనం పైభాగంలో నిరంతరం జ్వలించేలా చేసే ఏర్పాట్లు ప్రత్యేకంగా ఉం డాలని, దానిపై దృష్టి సారించాలని సూచించారు. ప్రవేశమార్గం వద్ద అమరవీరులకు చిన్నారులతో నివాళులర్పించేలా ఉండే డిజైన్, పచ్చిక బయళ్లు, ఆడియో వీడియో ప్రాంగణం తదితర డిజైన్లపై చర్చించారు. ప్రవేశంలో తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం తెలుగులో ఉండాలన్నారు. అమరుల ఫొటో ఎగ్జిబిషన్ ప్రాంగణం, కాన్ఫరెన్స్ హాలు, రెస్టారెంట్ ప్లాన్లను పరిశీలించారు. సమావేశంలో రోడ్లు, భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఈఎన్సీ గణపతిరెడ్డి, ఇతర ఇంజ నీరింగ్ అధికారులు పద్మనాభరావు, లింగారెడ్డి, సత్యనారాయణ, శశిధర్, నర్సింగరావు, వాస్తు నిపుణులు సుధాకర్ తేజ, ఆర్కిటెక్ట్ ఆస్కార్ పొన్ని పాల్గొన్నారు. -
స్పీకర్‌దే తుది నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశానికి ముగ్గురు సభ్యులున్న బీజేపీని పిలవాలా వద్దా అనేది స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బీఏసీ సమావేశానికి హాజరు కావాలనుకుంటే బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. సోమవారానికి అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ కమిటీహాల్లో శుక్రవారం మీడియాతో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు అసెంబ్లీ వేదికగా చెప్పుకుంటామని సీఎం కేసీఆర్ బీఏసీ భేటీలో వెల్లడించారన్నారు. ప్రతిపక్షాలు కోరినన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుత సమావేశాల్లో హరితహారం, దళితబంధు, ఐటీ, పరిశ్రమలు వంటి పది అంశాలను చర్చించాలని కోరుతూ స్పీకర్‌కు ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. 12 అంశాలపై చర్చకు కాంగ్రెస్ ప్రతిపాదనలు ఈ సమావేశాల్లోనే నాలుగైదు బిల్లులతో పాటు రెండు ఆర్డినెన్స్‌లు కూడా సభ ముందుకు వస్తా యని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 12 అంశాలపై చర్చించాలని ప్రతిపాదనలు ఇచ్చిందని, హైదరాబాద్ ఓల్డ్‌సిటీ అభివృద్ధిపై చర్చించాలని ఎంఐఎం పార్టీ కోరిందని పేర్కొన్నారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం కానిస్టిట్యూషన్ క్లబ్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. టీఆర్ఎస్పై ఈటల రాజేందర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీయే తమకు ప్రధాన ప్రత్యర్థి అని, ఈ నెల 21,22,23 తేదీల్లో నిర్వహించిన సర్వేలో బీజేపీ కంటే టీఆర్ఎస్ పార్టీ 15% ఎక్కువ ఓట్లు సాధిస్తుందని వెల్లడైనట్లు మంత్రి తెలిపారు. -
అందుబాటు గృహాలు కట్టండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా సొంతింటి కలను సాకారం చేసుకునే దిశగా డెవలపర్లు అందుబాటు గృహాలను నిర్మించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. ప్రస్తుతం ఐటీ, ఫార్మా రంగాలు బాగున్నాయి కాబట్టి పెద్ద సైజు గృహాలు, లగ్జరీ ప్రాపర్టీ విక్రయాలు బాగానే సాగుతున్నాయని.. ఇది ఎల్లకాలం ఉండదని గృహ విక్రయాలలో స్థిరత్వం ఉండాలంటే మధ్యతరగతి గృహాలను నిర్మించాలని చెప్పారు. ఆయా ప్రాజెక్ట్‌ల నిర్మాణాలకు అవసరమైన భూముల కొనుగోళ్లు, అనుమతుల మంజూరు, నిర్మాణ రాయితీలు వంటి వాటి కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావులతో చర్చిస్తానని.. సానుకూల నిర్ణయం వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. గచ్చిబౌలిలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో శుక్రవారం కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో 10వ ప్రాపర్టీ షో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వెలుపల 20–30 కి.మీ. దూరంలో రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) నిర్మాణం కోసం కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. ల్యాండ్ పూలింగ్ కోసం సుమారు రూ.3 వేల కోట్లు వ్యయమవుతుందని అంచనా వేయగా.. ఇందులో రూ.1,500 కోట్లు భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆర్ఆర్ఆర్ అందుబాటులోకి వస్తే రియల్టీ పరిశ్రమ 20–30 ఏళ్లు ముందుకెళుతుందని చెప్పారు. ఎక్కువ స్థలం అందుబాటులోకి వచ్చి చౌక ధరలలో స్థలాలు దొరుకుతాయని పేర్కొన్నారు. రెరాకు శాశ్వత చైర్మన్.. త్వరలోనే తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)కు శాశ్వత చైర్మన్, పూర్తి స్థాయి అధికారులను నియమించడంతో పాటు రిటైర్డ్ జడ్జి లేదా పరిశ్రమలోని నిపుణులను అథారిటీగా నియమించే అంశం తుదిదశకు చేరుకుందని మంత్రి వివరించారు. ధరణిలో అర్బన్ ఏరియాలతో ముడిపడి ఉన్న వ్యవసాయ భూములలో కొన్ని మినహా.. గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయ భూములకు ఎలాంటి సమస్యలు లేవని దీంతో ఆయా స్థలాల క్రయవిక్రయాల సమయంలో 15–20 నిమిషాలలోనే రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయని చెప్పారు. సాఫ్ట్వేర్, బ్యాండ్‌విడ్త్ రిలేటెడ్ సమస్యలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ధరణిలో నమోదైన భూములకు చట్టబద్ధత వస్తుందని.. దీంతో భవిష్యత్తు తరాలకు ఎలాంటి ఇబ్బందులు రావని పేర్కొన్నారు. వ్యవసాయ భూముల క్రయవిక్రయాలకు, లావాదేవీలకు ఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా కూర్చున్న చోటు నుంచి పని చేసుకునే విధంగా సులభతరంగా ధరణిని రూపొందించామని చెప్పారు. ధరణిలో లీగల్ ప్రొవిజన్స్ లేవు.. ఇప్పటికీ ధరణిలో పలు సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని... ప్రధానంగా న్యాయమపరమైన నిబంధనలు (లీగల్ ప్రొవిజన్స్) లేవని తెలంగాణ ప్రెసిడెంట్ సీహెచ్ రామచంద్రారెడ్డి చెప్పారు. దీంతో భూ యజమానులకు, కొనుగోలుదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ), తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ)లతో కలిపి మరొక సమావేశం నిర్వహించాలని ఆయన కోరారు. ధరణి విధానాన్ని ముందుగా ఒకట్రెండు జిల్లాలలో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టి వాటి ఫలితాలను అంచనా వేసుకున్నాక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సిందని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ పీ రామకృష్ణారావు సూచించారు. ప్రతి 10 ప్రాపర్టీలలో 7 ధరణి సమస్యలలో చిక్కుకున్నాయన్నారు. వేలాది దరఖాస్తుల కరెక్షన్స్ పెండింగ్‌లో ఉన్నాయని, ఆయా సమస్యలను పరిష్కరించే సమయం కలెక్టర్లకు ఉండటం లేదని చెప్పారు. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం 5–6 నెలల సమయం పడుతుందన్నారు. ప్రతి జిల్లాలోనూ స్పెషల్ ఐఏఎస్ ఆఫీసర్లను నియమిస్తే పది రోజుల్లో పరిష్కరించవచ్చని చెప్పారు. టీఎస్–బీపాస్ పర్మిషన్స్ సంపూర్ణంగా లేవు.. టీఎస్–బీపాస్‌తో 21 రోజుల్లోనే నిర్మాణ అనుమతులు వస్తున్నప్పటికీ అవి సంపూర్ణంగా లేవని రామకృష్ణారావు పేర్కొన్నారు. ఎలక్ట్రిసిటీ, ఎన్విరాన్మెంటల్, వాటర్ బోర్డ్ విభాగాలు టీఎస్–బీపాస్‌లో అనుబంధమై లేవని.. దీంతో ఆయా విభాగాల కార్యాలయాల చుట్టూ మళ్లీ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో లేదా అర్బన్ ఏరియా ప్రాంతాలలో కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (కార్డ్) విధానాన్నే ఉంచాలని కోరారు. గ్రిడ్, వేర్‌హౌస్ పాలసీలు, ఈ–సిటీ, ఎంఎస్ఎంఈ, మెడికల్ డివైజ్ వంటి పార్క్‌లు, ఫార్మా సిటీ వంటి కొత్త కొత్త అభివృద్ధి పనులు జరుగుతున్నాయని క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. దీంతో అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా నగరం నలువైపులా విస్తరిస్తుందని తెలిపారు. పాలసీల రూపకల్పనలో రియల్టీ నిపుణులను కూడా భాగస్వామ్యం చేయాలని కోరారు. నేడు, రేపు కూడా ప్రాపర్టీ షో క్రెడాయ్ హైదరాబాద్ 10వ ప్రాపర్టీ షోలో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు వంద స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. 15 వేలకు పైగా ప్రాజెక్ట్‌లు ప్రదర్శనలో ఉన్నాయి. శని, ఆదివారాలలో కూడా ప్రాపర్టీ షో అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ వంటి బ్యాంక్‌లు, పలు నిర్మాణ సామగ్రి సంస్థలు కూడా స్టాళ్లను ఏర్పాటు చేశాయి. మూడు రోజుల్లో కలిపి సుమారు 60 వేల మంది సందర్శకులు వస్తారని క్రెడాయ్ హైదరాబాద్ అంచనా వేసింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జీ ఆనంద్ రెడ్డి, కే రాజేశ్వర్, ఎన్ జైదీప్ రెడ్డి, బీ జగన్నాథ్ రావు, ట్రెజరర్ ఆదిత్య గౌరా, జాయింట్ సెక్రటరీలు శివరాజ్ ఠాకూర్, కే రాంబాబు, క్రెడాయ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ జైలు పాలయ్యే రోజు దగ్గరలోనే ఉంది
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు కేసులో కొద్ది రోజులు జైలుకు పోయిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శాశ్వతంగా జైలుకు పోయే రోజు దగ్గరలోనే ఉంది. రేవంత్‌వి బుడ్డరఖాన్ మాటలు. కాంగ్రెస్ డ్రామా కంపెనీ, ఆయన అందులో ఓ డ్రామా ఆర్టిస్టు. సమైక్యవాదుల పంజరంలో చిలుక రేవంత్.. వాళ్లు చెప్పేదే పలుకుతారు. చంద్రబాబు మేనేజ్‌మెంట్‌తోనే టీపీసీసీ అధ్యక్షుడు అయ్యారు. హుజూరాబాద్‌లో ఓడితే టీపీసీసీ అధ్యక్ష పదవి పోతుం దని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు’అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, జి.విఠల్‌రెడ్డి, మాజీ ఎంపీ గెడాం నగేశ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. 1981లో ఇంద్రవెల్లిలో ఆదివాసీలను కాల్చిచంపిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆదివాసీలకు స్మారక స్తూపం కడతా మని ప్రకటించడం విడ్డూరంగా ఉందని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పూటకో పార్టీ మార్చిన రేవంత్‌ను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలా నమ్ముతారని, సోనియాని బలిదేవతగా రేవంత్ గతంలో అభివర్ణించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘నా మీద వ్యక్తిగతంగా మాట్లాడితే నాలుక తెగ్గోస్తా అని గతంలోనే హెచ్చరించినా రేవంత్ భాష మారడం లేదు. మరో 25 ఏళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుంది. పోడు భూములపై కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకుంటార’ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మేమూ తిట్టడం మొదలు పెడితే..! ‘ఆర్టీఐ రెడ్డిగా పేరొందిన రేవంత్ సమాచార హక్కు చట్టాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించారు. భూమికి జానెడు లేవు.. బిడ్డా మేము తిట్టడం మొదలుపెడితే ఉరేసుకుని చస్తావ్, ద మ్ముంటే హుజూరాబాద్‌లో ఏదైనా మండల ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకో, ఎవరు గెలుస్తారో చూ ద్దాం’అని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సవాల్ చేశారు. ‘కాంగ్రెస్ నేతలు ఇంద్రవెల్లిలో సభ పెట్టి పుండుమీద కారం చల్లారు. ఆదివాసీలతో చెలగాటం ప్రమాదకరం, విల్లు ఎక్కుపెడితే కోలుకోలేవు. ఒక్క సభతోనే రేవంత్ రెచ్చిపోతున్నాడు. టీఆర్ఎస్ ఇలాంటి సభలు వందలు పెట్టి ఉంటుంది. దళితబంధు ఆట ఇప్పుడే మొదలైంది క్లైమాక్స్ మిగిలే ఉంది’అని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ సభ జరిగిన చోట ఆదివాసీలు శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారని, తెలంగాణ వచ్చిన తర్వాతే ఆదివాసీల బతుకులు బాగుపడ్డాయని మాజీ ఎంపీ జి.నగేశ్ చెప్పారు. బ్లాక్మెయిలర్లకు బ్రాండ్ అంబాసిడర్ ‘బ్లాక్మెయిలర్లకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్‌రెడ్డి, చంచల్‌గూడలో ఖైదీనంబరు 1779, చర్లపల్లిలో 4170. టీపీసీసీ అధ్యక్షుడు కాగానే రేవం త్‌కు వసూళ్లు పెరిగాయి, తమను వేధిస్తున్నారని బిల్డర్లు ఫిర్యాదు చేస్తున్నార’ని పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ చైర్మన్ ఏ.జీవన్‌రెడ్డి అన్నారు. ‘తెలంగాణకు రేవంత్ ముఖ్యమంత్రి కాదు కదా కనీసం చప్రాసీ కూడా కాలేరు. తాను జైలుకు వెళ్లివచ్చి అందరూ జైల్లో ఉండాలని కోరుకుంటున్నారు. రేవంత్ అధికారం గురించి కలలు కనడం మానేయాలి. కాంగ్రెస్ పార్టీని రేవంత్ భూస్థాపితం చేస్తారు’అని జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
అప్పటి మాటలు ఏమయ్యాయి?
రాజంపేట టౌన్: విడిపోయినా కలిసి ఉందాం అన్న తెలంగాణ నాయకుల అప్పటి మాటలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. ఆంధ్ర ప్రజలు రాక్షసులు అనడంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని మంత్రితో తన మాటలను ఉప సంహరింప చేయించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ జిల్లా రాజంపేటలో బుధవారం ఆయన కడప మేయర్ సురేష్‌బాబు, వైఎస్సార్ సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రలో కంటే తెలంగాణలోనే అభివృద్ధి బాగా జరిగిందన్నారు. రాయలసీమ ప్రజలు రాజధానిని త్యాగం చేసి హైదరాబాద్‌ను రాజధాని చేస్తే తీరా హైదరాబాద్ అభివృద్ధి చెందాక, అది తెలంగాణకు వెళ్లడంతో రాయలసీమకు తీరని నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీమ గొంతు కోస్తున్నారు.. తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి నోరు పారేసుకోవడం సరికాదని శ్రీకాంత్‌రెడ్డి హితవు పలికారు. ఏ హక్కుతో కృష్ణా జలాలపై మాట్లాడుతున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో 797 అడుగుల్లో నీరు ఉన్నప్పుడు, నాగార్జునసాగర్‌కు నీటి అవసరం లేకపోయినా కేవలం స్వార్థంతో తెలంగాణ ప్రభుత్వం పవర్ జనరేషన్ చేస్తూ రాయలసీమ గొంతు కోస్తోందని మండిపడ్డారు. అయినప్పటికీ తాము సంయమనం పాటిస్తున్నామన్నారు. కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల వద్దనే కాకుండా అలంపూరు వద్ద లిఫ్ట్ పెట్టాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని, అలాచేస్తే రాయలసీమ పూర్తిగా ఎడారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమకు కేటాయించిన 114 టీఎంసీలు, చెన్నైకి తాగునీటికి సంబంధించిన కేటాయింపులను మాత్రమే తాము వాడుకుంటున్నామన్నారు. ప్రాజెక్టులో నీరు 800 అడుగులకు చేరకముందే కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టుల ద్వారా నీటిని తోడేస్తున్నందున శ్రీశైలంలో పైభాగానికి నీళ్లు రావడం లేదని చెప్పారు. 840 అడుగులు చేరేంత వరకు రాయలసీమకు ఒక్క చుక్క నీరు కూడా రాని పరిస్థితి నెలకొందన్నారు. సీఎం వైఎస్ జగన్ ఈ పరిస్థితిని అపెక్స్ కమిటీలో విన్నవించారని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఏపీ కోటా మేరకే నీటిని వాడుకుంటోందని గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వబోతుందని తెలిసి తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. బాబు, లోకేష్‌లు తెలంగాణకు మద్దతు వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మించే సమయంలో టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రకాశం బ్యారేజీ వద్ద ధర్నా చేసి ఆ ప్రాజెక్టు అవసరం లేదని మాట్లాడారని శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఈ రోజు చంద్రబాబు, లోకేష్, ఉమా.. ఆంధ్రకు మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం దారుణమన్నారు. చంద్రబాబు, లోకేష్‌లకు ఆంధ్ర ప్రయోజనాలు పట్టవని, వారు హైదరాబాద్‌లో కూర్చొని తెలంగాణకు మద్దతు తెలుపుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. తమకు కేటాయించిన నీళ్లు తాము తీసుకోగలిగితే రాయలసీమతో పాటు ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. -
ఏపీ ప్రజలు రాక్షసులా? తెలంగాణ మంత్రిపై రోజా ఆగ్రహం
సాక్షి, అమరావతి: కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు సరికాదని.. ప్రాంతాలు విడిపోయినా, తెలుగు వారంతా ఒక్కటేనని తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి గుర్తించాలని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యే రోజా, ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను రాక్షసులంటూ మాట్లాడటం దారుణం అని, దుర్మార్గం అని మండిపడ్డారు. కలిసి మెలిసి ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య గొడవలు రేపేలా మాట్లాడటం ఎంత మాత్రం సరికాదన్నారు. తెలంగాణ మంత్రి వ్యాఖ్యలను తప్పు పడుతూ మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. కేటాయింపులు లేకుండా చుక్క నీటిని కూడా వాడుకోవడం లేదని పేర్కొన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ కేటాయింపుల్లో రాష్ట్ర విభజన చట్టం ద్వారా హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) కుడి కాలువ పనులను ఏపీ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ఈ ప్రాజెక్టులను ఆపాలని, అక్రమ ప్రాజెక్టులనీ మాట్లాడటం సరికాదన్నారు. ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే.. విభజన చట్టాన్ని గౌరవించాలి..: తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టాన్ని గౌరవించడం లేదు. కేటాయింపులే లేకుండా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో పాటు పాత ప్రాజెక్టుల సామర్థ్యం పెంచుతోంది. 8 అక్రమ ప్రాజెక్టుల ద్వారా 178 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోతోంది. ప్రాంతాలకు, కులాలకు అతీతంగా ప్రజల మనసుల్లో చిరస్థాయిలో నిలిచిపోయిన వైఎస్సార్‌ను తూలనాడటం తెలంగాణ మంత్రులు, నాయకులను తగదు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి మహానేత ప్రాజెక్టులు చేపట్టారు. అందుకే ఆయన్ను అన్ని ప్రాంతాల ప్రజలు గుండెల్లో పెట్టుకొని దేవుడిగా కొలిచారు. ముఖ్యమంత్రి జగన్ పారదర్శకతతో వ్యవహరిస్తున్నారు. రాష్ట్రానికి లేని కేటాయింపులను వాడుకోవాలని భావించడం లేదు. పొరుగు రాష్ట్రాలతో వివాదాలు పెట్టుకొనే యోచన మా రాష్ట్రానికి లేదు. కొత్త ప్రాజెక్టులు కడుతున్నది తెలంగాణే కొత్త ప్రాజెక్టులను అనుమతులు లేకుండా నిర్మిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమే. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఫిల్మ్, ఐటీ ఇండస్ట్రీ తదితర పరిశ్రమలతో హైదరాబాద్‌ను ఆర్థిక పరిపుష్టి గల కేంద్రంగా తయారు చేశాం. విభజన వల్ల ఆ ప్రాంతాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. మంచి వాతావరణంలో ఇరువురం కలిసి ఉండి కర్ణాటక, మహరాష్ట్రతో పోరాడి సాగునీటిని తెచ్చుకోవాల్సింది పోయి స్థానికంగా ప్రజలను కించపరిచేలా మాట్లాడటం తగదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఎంతో సంయమనంగా వ్యవహరిస్తున్నారు. -
ప్రతిపక్షాలకు మంత్రుల సవాల్.. నిరూపిస్తే రాజీనామాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణను అన్యాయం చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానదిపై అనుమతులు లేకుండా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తపోతల, ఆర్డీఎస్ కుడి కాల్వ ప్రాజెక్టులను విరమించుకోవాలని.. లేకుంటే ప్రజాయుద్ధం తప్పదని రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. సీఎం కేసీఆర్ మొండి అని.. మంచికి మంచి, చెడుకు చెడుగా ఉంటారని.. తెలంగాణకు నష్టం వాటిల్లేలా ఆంధ్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను చూస్తూ ఊరుకోరన్నారు. త్వరలో గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను మంగళవారం రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మంత్రి వేముల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్ర సీఎం రాయలసీమ ప్రాజెక్టు, ఆర్డీఎస్ కుడి కాల్వ కట్టి తీసుకుపోతున్నారని మండిపడ్డారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు తీసుకుపోతుంటే.. పాలమూరు జిల్లాకు చెందిన అప్పటి మంత్రి మంగళహారతులు పట్టారని విమర్శించారు. లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులేనని.. ఆంధ్రోళ్లు ఎక్కడ ఉన్నా ఆంధ్రోళ్లేనని.. తెలంగాణకు అన్యాయం చేసే వాళ్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ రైతులు బతకొద్దా... ఎవరి బతుకులు వాళ్లు బతకాలని, రైతులు ఎక్కడ ఉన్నా రైతులేనని.. తెలంగాణలోని రైతులు కూడా బతకొద్దా అని ప్రశ్నించారు. కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్ట్‌లపై మరో ప్రజాయుద్ధం చేయాల్సి ఉందని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ అన్నింటా ముందంజలో ఉందన్నారు. రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్లు, పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు.. లాంటి పథకాలు మీరు పాలించే ఏ రాష్ట్రంలో ఉన్నాయో చెప్పాలంటూ వేముల ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. వారు మొరిగే కుక్కలని.. ఇవి తప్పని నిరూపిస్తే తనతో పాటు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సైతం రాజీనామా చేస్తారంటూ సవాల్ విసిరారు. తెలంగాణకు అన్యాయం జరిగే రాయలసీమ ప్రాజెక్టును అడ్డుకుంటామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తే సీఎం కేసీఆర్ చూస్తూ ఊరుకోరన్నారు. కాగా, సభ చివరలో ఆంధ్ర నిర్మించే అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుంటామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: హే సీటీలు గొట్టుడు గాదు.. నేనేమన్న యాక్టర్నా.. చదవండి: ఈ సీఎం కేసీఆర్ మీ చేతిలో ఉన్నాడు -
కవితను పరిచయం చేసిన మండలి చైర్మన్
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను గురువారం శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెట్టారు. 84 పేజీల బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని దాదాపు గంటన్నరలో చదివారు. బడ్జెట్ ప్రసంగం ముగిశాక, స్థానిక సంస్థల నుంచి ఎన్నికై తొలిసారి మండలి సమావేశాలకు హాజరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను.. చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభ్యులకు పరిచయం చేశారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి వేములను, ఎమ్మెల్సీ కవితను పలువురు సభ్యులు అభినందించారు. -
బండి సంజయ్‌కు సవాల్ విసిరిన మంత్రి
కామారెడ్డి : బాన్సువాడలో రూ. 15.98 కోట్లతో నూతనంగా నిర్మించనున్న చెక్ డ్యాంకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి మరోసారి సవాల్ విసిరారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ డబ్బుల్లో కేంద్రం ప్రభుత్వ వాటా 200 రూపాయల కంటే మించితే తాను రాజీనామాకు సిద్ధమని మంత్రి సవాల్ విసిరారు. తన సవాలు స్వీకరించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అంటే భారతీయ ఝటా పార్టీ అని, తెలంగాణకు నిధులు తేవడంలో బీజేపీ నేతలు విఫలం అయ్యారని ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి ఇస్తే ఇక్కడి బీజేపీ నేతలు ఎందుకు స్పందించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. (ఉద్రిక్తత: మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ) -
కేసీఆర్ కాళ్లు బరాబర్ మొక్కుతా: మంత్రి
సాక్షి, హైదరాబాద్ : తండ్రి వయసున్న సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. బండి సంజయ్, ఎంపీ అర్వింద్‌లపై మండిపడ్డ మంత్రి.. వీరిద్దరూ తమ పరిధి దాటి మాట్లాడొద్దని హెచ్చరించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం పని తీరుపై సంజయ్, అర్వింద్ ఎప్పుడూ తప్పుడు ప్రచారాలే చేస్తున్నారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో తొమ్మిది కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల ప్రారభోత్సవ కార్యక్రమాల్లో శుక్రవారం మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 2016 రూపాయల పెన్షన్‌లో కేంద్రంలోని బీజేపీ రెండువందలకు మించి ఒక్కరూపాయి ఎక్కువ ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. ఎక్కువ ఇస్తున్నట్లు నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే ఎంపీ పదవికి అరవింద్ రాజీనామా చేస్తారా అని సవాలు విసిరారు. చదవండి: రైతు పిల్లలను ఎంకరేజ్ చేయాలి: హరీశ్ రావు గృహ నిర్మాణాల కోసం కేసీఆర్ ప్రభుత్వం 4 లక్షల 32 వేలు ఇస్తుంటే కేంద్రం ఇచ్చేది కేవలం 72 వేలు మాత్రమే అని చెప్పుకొచ్చారు. కల్యాణ లక్ష్మీ డబ్బులలో ఒక్క రూపాయి కుడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం లేదని స్పష్టం చేశారు. సీఎంఆర్ఎఫ్ లాగా పీఎం ఆర్ఎఫ్ కూడా ఉంటుందని అందులోంచి పేదల హాస్పిటల్ ఖర్చులకు సహాయం అందించాలని డిమాండ్ చేశారు. నిజంగా తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉన్నా, పౌరుషం ఉన్నా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించి, కేంద్రం నుంచి నిధులు తెప్పించాలని డిమాండ్ చేశారు. అలాగే కన్న కొడుకులాగా చూసుకుంటాడు కాబట్టే తండ్రి సమానమైన కేసీఆర్ కాళ్లు బరాబర్ మొక్కుతానని మంత్రి పేర్కొన్నారు. ఒక్కసారి కాదు అనేక సార్లు మొక్కుతా అని చెప్పుకొచ్చారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడాలే తప్ప, సంస్కార హీనులుగా మాట్లాడొద్దని బండి సంజయ్, ఎంపీ అర్వింద్‌లకు సూచించారు. -
కేసీఆర్‌ను జైల్లో పెట్టే ధైర్యం ఉందా?
సాక్షి, నిజామాబాద్ : బీజేపీ నేతల తీరుపై రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలు స్థాయికి మించి మాట్లాడి తమ సహనాన్ని పరిక్షించొదన్నారు. వైఖరి మార్చుకోకుంటే టీఆర్ఎస్ శ్రేణులు గ్రామాగ్రామాల్లో అడ్డుకుంటారని బీజేపీ పార్టీని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ను జైల్లో పెట్టే ధైర్యం ఉందా అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. తెలంగాణను అభివృద్ధి చేస్తున్నందుకు జైల్లో పెడుతారా అని సూటిగా ప్రశ్నించారు. రైతులకు సాగునీరు, రైతు బంధు, రైతు భీమా, 24 గంటల ఉచిత కరెంట్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, 2016 రూపాయల పెన్షన్, రెసిడెన్షియల్ స్కూళ్లలో పిల్లలకు సన్నబియ్యంతో పోషకాహార భోజనం ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందుకు జైల్లో పెడుతారా అని నిప్పులు చెరిగారు. చదవండి: కేటీఆర్ సమర్థుడైతే.. కేసీఆర్ అసమర్థుడా? ‘బిచ్చగాళ్ల లాగా నీతి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. అయిదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తామని రైతులను మోసం చేసిన బీజీపీ నేతలు రైతు పక్షపాతి కేసీఆర్ ప్రభుత్వం గురించి మాట్లాడుతారా.. మీ పార్టీని రైతులు తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. 2 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దమ్ముంటే చూపించండి. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో పెన్షన్ 600 రూపాయలు ఇస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పంట కొనుగోలు కేంద్రాలు ఉన్నాయా. రైతుల కోసం మీరు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో చేయరు. చేస్తున్న కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శిస్తారా. చేతనైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలి. మీకు కావాల్సింది రాష్ట్రాభివృద్ధి కాదు. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడమే’ అని బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. -
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వారం రోజుల్లో గాడిలో
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వారం రోజుల్లో గాడిలో పెడతామని, సాంకేతికపరంగా ఎదురవుతున్న అన్ని సమస్యలను పరిష్కరించి ప్రజలకు సులభతరంగా రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తెస్తామని ఆర్ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ఏర్పాటైన కేబినెట్ సబ్‌కమిటీ మంగళవారం మూడు గంటల పాటు సమావేశమైంది. ఈ సబ్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ప్రశాంత్‌రెడ్డి సమావేశం అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని భూములు, ఆస్తులకు సంబంధించిన అన్ని క్రయవిక్రయాలు పారదర్శకంగా జరగాలని, ప్రజలకు సులభతరంగా అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్.. మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారని, ప్రజలు తమంతట తామే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ధరణి పోర్టల్‌ను ప్రారంభించారని చెప్పారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వ యంత్రాంగం 100 రోజుల పాటు నిర్విరామంగా కష్టపడ్డారని, దేశంలో ఎక్కడా లేని విధంగా పారదర్శకంగా ఉండే పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని వివరించారు. ఉపసంఘం సమావేశం అనంతరం సభ్యులు కేటీఆర్, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో అన్ని అవరోధాలను త్వరలోనే అధిగమిస్తామని చెప్పారు. ఇందుకోసం అధికారులను మూడు బృందాలుగా విభజించామని వెల్లడించారు. సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఓ బృందం, చట్టపరమైన ఇబ్బందులకు మరో బృందం, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు మరో బృందంగా ఏర్పడి అధికారులు పనిచేస్తారని చెప్పారు. నాలుగు కేటగిరీలుగా విభజన.. ఏ ప్రక్రియ ప్రారంభించినా మొదట్లో ఇబ్బందులు ఉంటాయని, వాటిని అధిగమించి ప్రజలకు సులభతర రిజిస్ట్రేషన్ సేవలను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను నాలుగు కేటగిరీలుగా విభజించామని వివరించారు. డాక్యుమెంట్ పేపర్ల విషయంలో బ్యాంకర్లకు ఎలాంటి అపోహలున్నా తొలగిస్తామని, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. జీపీఏ, ఎస్పీఏలను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఆగిన రిజిస్ట్రేషన్లను పూర్తి చేయడానికి ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో అదనపు ఉద్యోగులను నియమించి 3 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సేల్ డీడ్లపై ఉన్న అపోహలను తొలగిస్తామని చెప్పారు. కొనుగోలుదారులు, అమ్మకందారులు తమకు ఇబ్బంది లేని రీతిలో డాక్యుమెంటేషన్ చేసుకోవచ్చని వెల్లడించారు. పీటీఐఎన్ అనేది యునిక్ నంబర్ అని, తప్పుడు రిజిస్ట్రేషన్లు జరగకుండా, అవకతవకల్లేకుండా ఉండేందుకే దీన్ని పొందుపరిచామని చెప్పారు. ఖాళీ స్థలాలకు రిజిస్ట్రేషన్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, దశల వారీగా అన్ని సర్వీసులను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని, ప్రస్తుతం ప్రారంభించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో వస్తున్న అన్ని సాంకేతిక సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూసే కోణంలోనే మంత్రివర్గ ఉపసంఘం పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. కాగా, రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు ‘ఇష్యూ ట్రాకర్’ద్వారా పరిష్కరిస్తున్నామని, చిన్న చిన్న సాంకేతిక సమస్యలను మూడు రోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి అధికారిక లేఅవుట్లే! వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో భూముల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) అంశం ఇప్పట్లో తేలేలా కన్పించట్లేదు. ఈ అంశం పరిష్కారానికి సమయం పడుతుందని, ప్రస్తుతానికి అధికారిక లేఅవుట్ల రిజిస్ట్రేషన్లకే పరిమితం కావా లని మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచించింది. క్షేత్ర స్థాయిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా సజావుగా రిజిస్ట్రేషన్లు జరిగేలా చూడాలని అధికారులతో పేర్కొంది. సమావేశంలో భాగంగా ఎల్ఆర్ఎస్ లేని లేఅవుట్ల గురించి ప్రస్తావన రాగా, ప్రస్తుతానికి అధికారిక లేఅవుట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లపై దృష్టి పెట్టాలని, ఎల్ఆర్ఎస్ గురించి మరో సమావేశంలో మాట్లాడుకుందామని మంత్రులు చెప్పినట్లు సమా చారం. కాగా, ఈనెల 17న ఎంసీఆర్హెచ్ఆర్డీలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో భాగస్వాములైన అన్ని వర్గాలతో వర్క్‌షాప్ నిర్వహించాలని నిర్ణయించారు. అదే రోజు కేబినెట్ సబ్‌కమిటీ భేటీ జరిగే అవకాశముందని తెలుస్తోంది. ఏ ప్రక్రియ ప్రారంభించినా మొదట్లోఇబ్బందులు ఉంటాయి. వాటినిఅధిగమించి ప్రజలకు సులభతర రిజిస్ట్రేషన్సేవలను త్వరలోనే అందుబాటులోకి తెస్తాం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నాలుగు కేటగిరీలుగా విభజించాం. డాక్యుమెంట్ పేపర్ల విషయంలో బ్యాంకర్లకు ఎలాంటి అపోహలున్నాతొలగిస్తాం. – వేముల ప్రశాంత్‌రెడ్డి -
సైనిక, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తాం
-
కంటతడి పెట్టుకున్న తెలంగాణ మంత్రి..
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్ పల్లి గ్రామంలో వీర జవాన్ ర్యాడ మహేష్‌కు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కార్తికేయలు నివాళుర్పించారు. మహేష్ వీరమరణం తలుచుకుని మంత్రి ప్రశాంత్ రెడ్డి కంటతడి పెట్టారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మహేష్ కుటుంబాన్ని అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ అండగా ఉంటారని చెప్పారు. సైనిక, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామని భరోసా ఇచ్చారు. రేపు సాయంత్రం మహేష్ పార్థివ దేహం హైదరాబాద్ చేరుకుంటుందని, ఎల్లుండి స్వగ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. చదవండి: ఉగ్ర పోరులో నిజామాబాద్ జవాన్ వీర మరణం కాగా జమ్మూ కశ్మీర్‌లోని మచిల్ సెక్టార్లో ఆదివారం రోజు ఉగ్రవాదులు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు భద్రతా దళాల సిబ్బంది మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహేష్(25) కూడా మరణించాడు. మహేష్ సంవత్సరం క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతని మృతితో కోమాన్‌పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మహేష్ మరణించాడని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ఆరు నెలల్లో స్మారకం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖులు ఢిల్లీకి వచ్చినప్పుడు అక్కడి మహాత్మాగాంధీ సమాధిని సందర్శించి, నివాళులర్పించినట్లే హైదరాబాద్‌కు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు వచ్చిన సందర్భాల్లో తెలంగాణ అమరవీరుల స్మారకం వద్ద నివాళులు అర్పించే సంప్రదాయం రావాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. హుస్సేన్‌సాగర్ వద్ద నిర్మిస్తున్న స్మారకం పనులను శుక్రవారం అధికారులతో కలసి మంత్రి పరిశీలించారు. ఖర్చుకు వెనకాడకుండా దీన్ని అద్భుతంగా నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. లుంబినీ పార్కు సమీపంలో ఇది రూపుదిద్దుకుంటున్నందున భవిష్యత్తులో ఇక్కడికి పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో 350 కార్లు, 600 ద్విచక్ర వాహనాలు నిలిపే సామర్థ్యంతో పార్కింగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. స్మారకం మొదటి అంతస్తులో మ్యూజియం, ఫొటో గ్యాలరీ, సమావేశ మందిరం, ఆర్ట్ గ్యాలరీ ఉంటాయని వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానం చేసుకున్న తీరు అక్కడి ఛాయా చిత్ర ప్రదర్శన కళ్లకు కడుతుందని చెప్పారు. రెండో అంతస్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమావేశాల నిర్వహణకు కన్వెన్షన్ సెంటర్ ఉంటుందన్నారు. మూడో అంతస్తులో రెస్టారెంట్లు ఉంటాయని పేర్కొన్నారు. మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ స్మారక భవనం రూపుదిద్దుకుంటోందన్నారు. ఆరు నెలల్లో ఇది సిద్ధమవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్ఈ పద్మనాభరావు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘లబ్ధిదారుల ఎంపికపై దృష్టి పెట్టండి’
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ హౌసింగ్ కార్యక్రమాలపై మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం పూర్తి కావడానికి గడువు సమీపిస్తున్న నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన ఈ ప్రక్రియ చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారుకు ఆదేశాలు జారీ చేశారు. హౌసింగ్ శాఖ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా కమిషనర్ నగర పరిధిలో ఉన్న ఇతర జిల్లాల కలెక్టర్లతో కలిసి సంయుక్తంగా లబ్ధిదారుల ఎంపిక చేయాలని సూచించారు. అయితే ఇప్పటికే జీహెచ్ఎంసీలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందని, త్వరలోనే ఇవన్నీ పూర్తవుతాయని అధికారులు మంత్రులకు తెలియజేశారు. (క్రమబద్ధీకరణలో ఊరట) దీనిపై స్పందించిన మంత్రులు లబ్ధిదారుల ఎంపిక పైన ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని ముందుకు పోవాలని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ కోసం ఇతర జిల్లాల పరిధిలో కడుతున్న ఇళ్లలో పది శాతం లేదా 1000 మించకుండా స్థానికులకు ఇల్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపికపైన కసరత్తు చేయాలని, గతంలో ఇల్లు అందిన వారికి మరోసారి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాకుండా చూడాలని మంత్రులు సూచించారు. (కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు) -
‘సీఎంకు ఇచ్చిన సమయం కంటే వారికే ఎక్కువ’
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు ఎనిమిది రోజులపాటు చాలా అర్థవంతంగా జరిగాయని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సభ సజావుగా 'సాగేందుకు సహాకరించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశాల్లో రెండు తీర్మాణాలను సభ ఆమోదించిందని పేర్కొన్నారు. రెవెన్యూ బిల్లు, టీఎస్ బీ-పాస్ బిల్లును సభ ఆమోదించిందన్నారు. 3 అంశాలపై సభ చర్చించగా, 12 బిల్లులకు సభ ఆమోదం తెలిపిందన్నారు. పార్లమెంట్‌తోపాటు, ఇతర రాష్ట్రాలలో చట్ట సభల్లో ప్రశ్నోత్తరాలతో పాటు జీరో అవర్‌ను రద్దు చేశారని తెలిపిన సభ్యులందరికి మాట్లాడే అవకాశం రావాలని అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ను కొనసాగించామన్నారు. (కేటీఆర్ చేతుల మీదుగా కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం) ‘4 రాష్ట్రాలలో 2,3 రోజులకు మించి సభ నడపలేదు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు సభ నడపాలని సీఎం భావించారు. కానీ రెండు రోజులుగా చేస్తున్న కోవిడ్ టెస్ట్‌లలో చాలా మందికి కరోనా పాజిటివ్ రావడంతో సభ్యులు కొంత భయాందోళనకు గురి అవుతున్నారు. స్పీకర్ సభ్యుల అభిప్రాయం తీసుకొని సభను నిరవధిక వాయిదా వేశారు. సీఎం 4 గంటల 52 నిమిషాలు మాట్లాడారు. ఎంఐఎం అక్బరుద్దీన్ 2 గంటల 27 నిమిషాలు మాట్లాడారు. సీఏల్పీ నేత భట్టి విక్రమార్క 2 గంటల 37 నిమిషాలు మాట్లాడారు. సీఎంకి ఇచ్చిన సమయం కంటే, ఎంఐఎం ,సీఏల్పీ ఫ్లోర్ లీడర్లకు ఇచ్చిన సమయం ఎక్కువ. కాంగ్రెస్ సభ్యులు 3 గంటల 54 నిమిషాలు. ఎంఐఎం సభ్యులు 3 గంటల 5 నిమిషాలు మాట్లాడారు. 103 మంది సభ్యులు కలిగిన టిఆర్ఎస్ 8 గంటల 39 నిమిషాలు మాట్లాడారు. దేశంలోని అన్ని శాసనసభలకు తెలంగాణ శాసనసభ దిక్సూచిలా వ్యవహరిస్తుంది. ఎల్ఆర్ఎస్ గురించి సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ వెంటనే సమాధానం ఇచ్చారు.’ అని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. (నేటితో అసెంబ్లీసమావేశాలకు తెర!) -
కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత
-
కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత
సాక్షి, హైదరాబాద్: దేశంలో రాఖీ పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సోదరీమణులందరూ తమ సోదరులకు రాఖీ కట్టి ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి సోదరుడు తన తోబుట్టువుకు ప్రతి విషయంలో అండగా ఉంటానని ప్రమాణం చేస్తున్నారు. అన్ని ఇళ్లల్లో రాఖీ పండుగ హడావిడి మొదలైంది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె కవిత సోదరుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. చదవండి: ఆమెతో రాఖీ కట్టించుకో, 11 వేలు ఇవ్వు: కోర్టు అదేవిధంగా రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రజలందరికీ రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నా చెల్లెల్లు-అక్కా తముళ్లు ఎంతో ప్రేమానురాగాలతో జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి అని తెలిపారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సోదర, సోదరీమణులందరు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. చదవండి: అక్కాచెల్లెమ్మలకు శుభాకాంక్షలు: సీఎం జగన్ -
మత్స్యకార కుటుంబాల సాంఘిక బహిష్కరణ
సాక్షి, నిజామాబాద్: మత్స్యకార కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసిన దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో చోటుచేసుకుంది. బహిష్కరించిన 38 కుటుంబాలకు ఎవరైనా సాయం చేస్తే వారికి కూడా అదే గతి పడుతుందని గ్రామాభివృద్ధి కమిటీ హుకూం జారీ చేసిందని బాధితులు తెలిపారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఈటల రాజేందర్, జిల్లా కలెక్టర్ లకు మత్స్యకారులు ఫిర్యాదు చేశారు. తమకు కనీసం పాలు వంటి నిత్యావసరాలు కూడా అందివ్వడం లేదని, వ్యవసాయ పనులకు కూడా పిలవొద్దంటూ కమిటీ సభ్యులు ఆదేశాలు జారీ చేశారని మత్స్యకారులు వాపోయారు. (గణేష్ ఉత్సవం నిరాడంబరంగా జరుపుకోవాలి) ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు ఇస్తుంది కాబట్టి గ్రామానికి ప్రతి ఏటా లక్ష రూపాయాలు చెల్లించి గ్రామంలో తాము నిర్ణయించిన ధరకే చేపలు అమ్మాలని హుకుం జారీ చేసినట్లు పేర్కొన్నారు. దీనికి తాము ఒప్పుకోకపోవడంతో కక్ష కట్టి సాంఘిక బహిష్కరణకు ఆదేశాలు జారీ చేశారని మత్స్యకారులు వాపోయారు. కరోనా కష్టకాలంలో తీవ్ర ఇబ్బందులు, మానసిక క్షోభకు గురవుతున్నామని మత్స్యకార కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజాప్రతినిధులైనా తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. (గర్భిణి సింధూరెడ్డి మృతదేహం లభ్యం) -
సచివాలయం కూల్చివేత.. అనూహ్య నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సచివాలయ భవనాల కూల్చివేత పనులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. సచివాలయ భవనాల కూల్చివేత పనుల వద్దకు వెళ్లేందుకు మీడియాకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు బీఆర్కే భవన్ నుంచి సిటీ పోలీసు కమిషనర్ నేతృత్వంలో మీడియా ప్రతినిధులు.. సచివాలయ భవనాల కూల్చివేత పనుల వద్దకు వెళ్లనున్నారు. ఈనెల 6 వ తేది అర్ధరాత్రి నుంచి కూల్చివేతలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. మధ్యలో హై కోర్టు కూల్చివేతల పనులను వారం రోజుల పాటు నిలిపివేయాలని ఆదేశించింది. ప్రతిపక్ష పార్టీలు కూల్చివేతలను ఆపాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కానీ కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించలేమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కూడా పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. దాంతో ప్రభుత్వం కూల్చివేత పనులను తిరిగి ప్రారంభించింది. (సినిమా అయిపోయాక టికెటిస్తే?) ఇప్పటికే దాదాపు 90 శాతం కూల్చివేత పనులు పూర్తయ్యాయి. శిథిలాలు (వ్యర్థాలు) మొత్తం దాదాపు 4500 లారీల లోడు ఉంటుందని అంచనా. ఇందులో ఇప్పటికే 2వేల లారీల ట్రిప్పులు ఎత్తివేయడం జరిగింది. మిగతా పనులు జరుగుతున్నాయి. ఎత్తైన భవనాలు కూల్చివేసే సందర్భంలో ప్రమాదం జరిగే అవకాశం పొంచి ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఎవరినీ ఆ ప్రాంతంలోకి అనుమతించలేదు. అందులో భాగంగా మీడియాను కూడా అనుమతించలేదు. అయితే కూల్చివేత వార్తలు సేకరించడానికి అనుమతి ఇవ్వాలని మీడియా ప్రతినిధుల నుంచి పదే పదే విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలయ్యింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూల్చివేత పనులకు, వ్యర్థాల తొలగింపు పనులకు సంబంధించిన వార్తల సేకరణకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింనట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత రెడ్డి ప్రకటించారు. (కేసీఆర్ సర్కార్‌కు హైకోర్టు షాక్..) అయితే కూల్చివేతల సందర్భంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వమే మీడియా ప్రతినిధులకు ఆ ప్రాంతాన్ని చూపించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఈ రోజు (సోమవారం) సాయంత్రం 4 గంటలకు బీర్కే భవన్ నుంచి మీడియా ప్రతినిధులను సిటి పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో తీసుకెళ్ళి, సెక్రటేరియట్ ప్రాంతాన్ని చూపిస్తామన్నారు. -
‘సిమెంట్ ధరలు తగ్గించేందుకు అంగీకారం’
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం నెలకొన్న కరోనా సంక్షోభం వల్ల అన్ని రంగాల మాదిరిగానే రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో కలిసి రియాల్టీ రంగానికి చేయూతనిచ్చేందుకు సిమెంట్ ధరలను తగ్గించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రభుత్వం సిమెంట్ కంపెనీల ప్రతినిధులను కోరింది. ఈ మేరకు గురువారం సిమెంట్ కంపెనీలతో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి సమావేశం అయ్యారు. ప్రస్తుతం నెలకొన్న కోవిడ్, లాక్డౌన్ అనంతర పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు సిమెంట్ బస్తా ధరని తగ్గించాలని మంత్రులు కోరారు. సిమెంట్ కంపెనీలు అధికంగా ఉన్న హుజూర్నగర్ పరిసర ప్రాంతాల్లో స్థానిక యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో యువతకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన శిక్షణ కేంద్రాలను ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. (అతడే సుడా నూతన చైర్మన్) 2016లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ.230 ఒక బస్తా సిమెంట్‌ను ఇచ్చేందుకు అంగీకరించిన కంపెనీలు, మరో మూడేళ్ల పాటు ప్రభుత్వ పథకాలకు యథాతథ ధరకు ఇచ్చేందుకు కంపెనీలు అంగీకరించాయి. ప్రభుత్వం చేసిన పలు సూచనలకు సిమెంట్ కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. అంతర్గతంగా మాట్లాడుకుని వచ్చే వారంలో ఎంత ధరను తగ్గిస్తామనే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. సిమెంట్ కంపెనీలకు అవసరమైన సిబ్బందిని ప్రభుత్వ ఏర్పాటు చేసే శిక్షణ కేంద్రం నుంచి తీసుకుంటామని తెలిపారు. అదే విధంగా శిక్షణ కేంద్రానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (డిశ్చార్జీల కంటే.. రెండింతల కేసులు) -
నష్టం రాకుండా ఉండేందుకే నియంత్రిక వ్యసాయం
సాక్షి, నిజామాబాద్ : తెలంగాణలో పంటలకు మంచి మద్దతు ధర అందించేందుకు, లాభసాటి వ్యవసాయం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారని, దాన్ని నియంతృత్వ వ్యవసాయం అంటూ ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. పంటలు కొనలేని పరిస్థితి వస్తే తెలంగాణలో రైతుకు నష్టం రాకుండా ఉండేందుకే నియంత్రిక వ్యవసాయమన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే గిట్టుబాటు వస్తుందన్నారు. పసుపు పంటలో అంతరపంటగా మొక్కజొన్న వేసుకోవచ్చని, వర్షాకాలంలో మొక్కజొన్న వేయవద్దని చెప్పారు. కరోనా వల్ల పసుపు మార్కెట్ మూసివేసినందున ముఖ్యమంత్రిని కోరితే ప్రారంభించడానికి అనుమతి ఇచ్చారని తెలిపారు. 2,3 రోజుల్లోనే నిజామాబాద్ మార్కెట్ ప్రారంభిస్తామని, రైతులు పసుపు అమ్మకాలు చేసుకోవచ్చునని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కరోనా కట్టడిలోనే ఉందని చెప్పారు. వరి ధాన్యం కొనుగోలులో జాప్యం లేకుండా 80 శాతం కొనుగోలు చేశామని వెల్లడించారు. ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యానికి గానూ 500 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించామన్నారు. -
కరోనా రహితంగా కామారెడ్డి: వేముల ప్రశాంత్‌రెడ్డి
సాక్షి కామారెడ్డి : జిల్లా కరోనా వైరస్ రహిత జిల్లాగా మారిందని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర నుండి 474 మంది వచ్చారని, వారందరినీ 28 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ చేశామని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రతి క్లస్టర్లో 20 లక్షలతో రైతు వేదికల నిర్మాణాలకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రైతులు లాభసాటి వ్యవసాయం, గిట్టుబాటు ధరలు పొందేందుకు ముఖ్యమంత్రి ప్రణాళిక రూపొందించారు. డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే గిట్టుబాటు వస్తుంది. రైతు నష్ట పోవద్దనే ఉద్దేశ్యంతో కేసీఆర్ నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. వర్షాకాలంలో మక్కపంట వేయద్దు, యాసంగిలొనే మక్కపంట వేయాలి. కందులు పండిస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలుకు సిద్దంగా ఉంది. రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. లాభసాటి వ్యవసాయం కోసం ప్రభుత్వం సూచించిన పంటలు వేయాలని కోరుతున్నాం. మక్క పంట 85వేల ఎకరాల బదులు వాటి స్థానంలో సొయా 25వేలు, కందులు 30వేలు, పత్తి 70వేల ఎకరాలకు పెంచుకోవాలి. రైతులు, నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమీక్షలు జరిపి తెలంగాణ లాభసాటి వ్యవసాయ విధానం రూపొందించారు’’ అని అన్నారు. -
నిజామాబాద్ ‘ఎమ్మెల్సీ’గా కవిత నామినేషన్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలసి కలెక్టరేట్‌కు చేరుకున్న కవిత.. రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ సి. నారాయణరెడ్డికి అందజేశారు. ఉదయం హైదరాబాద్‌లోని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఆమె జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. నిజామాబాద్ చేరుకుని అత్తమామలు, భర్త అనీల్‌రావు ఆశ్వీరాదం తీసుకున్న అనంతరం నామినేషన్ వేసేందుకు కలెక్టరేట్‌కు చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న కవిత మళ్లీ రావడంతో అనుచరులు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. నామినేషన్ వేసేందుకు వచ్చిన కవితకు పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా, స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఉంది. జిల్లా పరిషత్, మండల పరిషత్‌లు, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు మొత్తం 824 ఉండగా, ఇందులో 550 పైగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే ఉన్నారు. దీంతో ఈ ఎన్నికల్లో కవిత విజయం ఖాయంగా కనిపిస్తోంది. -
లక్షా 82 వేల కోట్ల తెలంగాణ బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను శాసనసభలో ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్దే లక్ష్యంగా వాస్తవిక కోణంలో బడ్జెట్ రూపొందించినట్టు హరీష్ తెలిపారు. ఆయన ప్రసంగిస్తూ.. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుంది. బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. బడ్జెట్ అంటే కాగితాల లెక్కలు కాదు.. సామాజిక స్వరూపం’అని మంత్రి పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక ఏడాదికి గాను రాష్ట్ర బడ్జెట్ 1,82,914.42 కోట్లుగా హరీష్‌రావు పేర్కొన్నారు. అదేవిధంగా రెవిన్యూ వ్యయం 1,38,669.82 కోట్లు, క్యాపిటల్ వ్యయం 22,061.18 కోట్లు, ఆర్ధిక లోటు 33,191.25 కోట్లుగా మంత్రి వెల్లడించారు. ఇక ఆర్థిక మంత్రి హోదాలో హరీష్‌రావు తొలిసారి శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా.. మండలిలో శాసనసభా వ్యవహా రాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. హరీష్‌రావు ప్రసంగం హైలైట్స్: గతేడాది నుంచి దేశవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ప్రభావం ఉంది కేంద్రం నుంచి జీఎస్టీ రావడం లేదు 2019-20 వృద్ధి రేటు 6.5శాతంగా ఉంది గత బడ్జెట్లో ప్రవేశపెట్టిన అంచనాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి నాటికి ఖర్చు రూ.1.36 లక్షల కోట్లు 2018-19లో 14.3% ఉన్న జీఎస్డీపీ 19-20కి 12.6% తగ్గింది తెలంగాణ ఆర్థిక బడ్జెట్ 2020-21 ఏడాదికి గాను 1,82,914.42 కోట్లు రెవిన్యూ వ్యయం 1,38,669.82 కోట్లు క్యాపిటల్ వ్యయం 22,061.18 కోట్లు ఆర్ధిక లోటు 33,191.25 కోట్లు సవరించిన అంచనా ప్రకారం.. 2019-20కి చేసిన అంచనా వ్యయం 1,42,152.28 కోట్లు రూ.25వేలు రుణం ఉన్న రైతులకు ఏకకాలంలో మాఫీ ఈనెలలోనే రుణమాఫీ పూర్తి చేస్తాం రూ.25వేల నుంచి లక్ష లోపు ఉన్న రుణాలు 4 విడతలుగా పంపిణీ చెక్కులను స్థానిక ఎమ్మెల్యేలు రైతులకు అందిస్తారు ఎంత ఖర్చైనా సరే కందులను కొనుగోలు చేస్తాం రైతుబంధు పథకానికి రూ.14వేల కోట్లు కేటాయింపు మూసీ రివర్‌ఫ్రంట్ కోసం రూ.10వేల కోట్లు కేటాయింపు మున్సిపల్‌శాఖకు 14,809 కోట్లు కేటాయింపు హైదరాబాద్ అభివృద్ధి కోసం వచ్చే ఐదేళ్లలో రూ.50వేల కోట్లు పాఠశాల విద్య కోసం రూ.10,421 కోట్లు ఉన్నత విద్యాశాఖకు రూ.1,723 కోట్లు హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలు 118 నుంచి 350కి పెంపు వైద్య రంగానికి రూ.6,156 కోట్లు పంచాయతీరాజ్ శాఖకు రూ.23,005 కోట్లు కల్యాణలక్ష్మీ పథకానికి రూ.1,350 కోట్లు కేటాయింపు గృహ నిర్మాణానికి రూ.11,917 కోట్లు మైనారిటీల కోసం రూ.1,518 కోట్లు ఎస్సీ సంక్షేమం కోసం రూ.16534.97 కోట్లు ఎస్టీ సంక్షేమం కోసం రూ.9,771.27 కోట్లు ఆసరా పెన్షన్ల కోసం రూ.11,750 కోట్లు సాగునీటి రంగానికి రూ.11,054 కోట్లు రవాణా, రోడ్లుభవనాలశాఖకు రూ.3494 కోట్లు పోలీస్‌శాఖకు రూ.5,852 కోట్లు కేటాయింపు విద్యుత్‌శాఖకు రూ.10,416 కోట్లు కేటాయింపు అటవీశాఖకు రూ.791 కోట్లు కేటాయింపు పారిశ్రామిక రంగ అభివృద్ధికి రూ.1,998 కోట్లు ఎస్డీపీ నిధుల కోసం రూ.480 కోట్లు కేటాయింపు మైక్రో ఇరిగేషన్ కోసం రూ.600 కోట్లు కేటాయింపు పాడిరైతుల ప్రోత్సాహం కోసం రూ.100 కోట్లు మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం రూ.1,200 కోట్లు పశుపోషణ, మత్స్యశాఖకు రూ.1,586.38 కోట్లు వచ్చే విద్యా సంవత్సరం నుంచి 71 మైనారిటీ జూనియర్ కళాశాలలు ఏర్పాటు ఈ ఏడాది నుంచి 55 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా రాయదుర్గం - శంషాబాద్ బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్ వరకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి రాష్ట్రంలో 2,72,763 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి దేశంలో తలసరి విద్యుత్ వినియోగం 1181 కాగా రాష్ట్రంలో 1896 యూనిట్లు హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలు 118 నుంచి 350కి పెంపు మరో 232 దవాఖానాలు త్వరలో ప్రారంభిస్తాం తెలంగాణలో కరోనా వైరస్ లేదు ఇప్పటి వరకు 12,427 పరిశ్రమలకు అనుమతులిచ్చాం 14 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లకు పెంపు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బోర్డు హరీష్‌రావు బడ్జెట్ ప్రసంగం ముగియడంతో శాసనసభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. -
ఆదివారం నాడు తెలంగాణ బడ్జెట్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసన సభలో ఆదివారం నాడు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నట్లు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం శాసన సభ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. బీఏసీ సమావేశం జరిగిందని, అందులో భట్టివిక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యేలు పాల్గొన్నారని చెప్పారు. శనివారం గవర్నర్ తమిళిసై ప్రసంగంపై అసెంబ్లీలో చర్చ ఉంటుందని తెలిపారు. సోమవారం, మంగళవారం హోలీ సందర్భంగా సెలవు ఉంటుదన్నారు. 13,14,16,17,18,19తేదీల్లో పద్దులపై అసెంబ్లీలో చర్చ జరుగుతుందన్నారు. 20వ తేదీ ముఖ్యమంత్రి కేసీఆర్ రీప్లే ఉంటుందని తెలిపారు. ‘అక్బరుద్దీన్, భట్టి విక్రమార్క షార్ట్ డిస్కర్షన్ పెట్టాలని కోరారు. సీఎం కేసీఆర్ దానికి సానుకూలంగా స్పందించారు. షార్ట్ డిస్కర్షన్లు వచ్చిన సంఖ్యను బట్టి 20వ తేదీ తరువాత మరొక సారి బీఏసీ ఉంటుంది. దాని తరువాత ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలనేది చెబుతాం. మండలిలో 13,14వ తేదీల్లో షార్ట్ డిస్కర్షన్ ఉంటుంది. 15వ తేదీ సెలవు. శాసన సభలో 12 రోజులు, మండలిలో 8 రోజులు సమావేశాలు ఉంటాయి. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్పై అసెంబ్లీలో చర్చ చేసిన తరువాత వాటికి వ్యతిరేకంగా బిల్ పాస్ చేస్తామ’ని చెప్పారు. -
సజావుగా సాగాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాలు, ప్రగతికి దోహదం చేసే చర్చలను ప్రజలు నిశితంగా గమనిస్తారనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని శాసనసభ సమావేశాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులుతో కలిసి బుధవారం శాసనసభ ఆవరణలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ శాసనసభ పనితీరు దేశానికే ఆదర్శంగా ఉండేలా చూడాలని, సభ్యులు అధికారుల మధ్య సమన్వయ లోపం లేకుండా చూడాలని పోచారం ఆదేశించారు. గతంలో మాదిరిగానే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమావేశాలు నిర్వహిస్తామని గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. శాసనసభ నుంచి శాసనమండలిలోకి వచ్చే మంత్రులకు ట్రాఫిక్ సమస్య ఎదురవకుండా చూడాలని, ఉభయ సభల్లో చర్చకు వచ్చే అంశాలకు సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల నివాస సముదాయాల నుంచి వచ్చే సభ్యులకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవకుండా చూడాలని తెలిపారు. శాసనమండలి చీఫ్ విప్, విప్‌లు, ఎమ్మెల్సీల విషయంలో జిల్లా స్థాయిలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని గుత్తా వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా సభ జరిగేందుకు అధికారులు సర్వసన్నద్ధులుగా ఉండాలని వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. భద్రత పరంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ కార్యదర్శులు వాట్సాప్ ద్వారా సమావేశాల తీరును ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. పోలీసు అధికారులతో ప్రత్యేక భేటీ.. శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పోలీసు అధికారులతో గుత్తా సుఖేందర్‌రెడ్డి, పోచారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భద్రత ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, డీజీపీ (ఎస్పీఎఫ్) తేజ్ దీప్ కౌర్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, అసెంబ్లీ చీఫ్ మార్షల్ టి.కరుణాకర్ పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, చీఫ్ విప్‌లు దాస్యం వినయభాస్కర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, టీఆర్ఎల్పీ ఇన్చార్జి రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం శాసనసభ ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆఫీసర్స్ లాంజ్‌ను స్పీకర్, మండలి చైర్మన్ సంయుక్తంగా ప్రారంభించారు. -
ఎంపీ అర్వింద్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సవాల్
సాక్షి, నిజామాబాద్ : బీజేపీ చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలను నమ్మొద్దని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఉన్నవి లేనట్లు.. లేనివి ఉన్నట్లు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మోసపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి 42 శాతం నిధులు, తెలంగాణ ప్రజల సొత్తు అని, 42 శాతం కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చినట్లు రుజువు చేస్తే దేనికైనా సిద్దమని స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ దర్మపురి ఆర్వింద్ కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా మండిపడ్డారు. అర్వింద్ నీచ రాజకీయాలు మానుకోవాలని మేయర్ స్థానం టీఆర్ఎస్ పార్టీదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ మజ్లిస్‌తో ఒప్పందం అయ్యిందంటూ హిందువులను మాయ మాటలతో రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఇచ్చిన మాట తప్పితే తాను రాజీనామా చేస్తానని.. రాజీనామాకు ఎంపీ అర్వింద్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. -
నిజామాబాద్ సభకు అసదుద్దీన్, ప్రశాంత్‌రెడ్డి
నిజామాబాద్ : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)లను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిజామాబాద్‌లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఖిల్లా రోడ్డులోని ఒక ఫంక్షన్ హాల్లో యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. నగరంలోని ఖిల్లా ఈద్గా మైదానంలో సాయంత్రం 6 గంటలకు ఈ సభ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. సభకు బీజేపీయేతర అన్ని రాజకీయ పార్టీలతో పాటు ముస్లిం సంస్థల ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు రానున్నట్లు చెప్పారు. సభకు హాజరుకానున్న అసదుద్దీన్, ప్రశాంత్‌రెడ్డి ఈ సభకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో పాటు, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వస్తారని నిర్వహకులు చెప్పారు. ఎన్నార్సీ, సీఏఏను ఉపసంహరించుకునేంత వరకు ఐక్యంగా ఉద్యమిస్తామని పేర్కొన్నారు. ఎన్పీఆర్ను కూడా తాము వ్యతిరేకిస్తున్నమని తెలిపారు. మోదీ ప్రభుత్వం ద్వంద్వ విధానాలను అనుసరిస్తుందని విమర్శించారు. సీఏఏ, ఎన్నార్సీలను అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. దీనిని అమలు చేయబోమని సీఎం కేసీఆర్ ప్రకటించాలని కోరారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉర్దు అకాడమీ చైర్మన్ మహ్మద్ రహీం అన్సారీ, యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మునీరుద్దీన్ ముక్తార్, జిల్లా కన్వీనర్ హఫిజ్‌లయాఖ్‌న్, మౌలానా వరియుల్లాఖాన్సి, పెద్ది వెంకట్రాములు, భూమయ్య, రఫత్‌ఖాన్ పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఐక్యకార్యాచరణ సమితి నాయకులు సభకు భారీ బందోబస్తు నిజామాబాద్‌లో శుక్రవారం ఖిల్లా వద్ద ఈద్గాలో జరిగే బహిరంగ సభకు సుమారు వేయి మంది పోలీసులతో బందోబస్తు చేపట్టనున్నారు. గురువారం రాత్రి వరకు సభ నిర్వహణపై పోలీసులతో సీపీ సమావేశం నిర్వహించారు. మెదక్, కామారెడ్డి, సిద్దిపేట నుంచి పోలీసులు బందోబస్తుకు వస్తున్నారు. -
కేసీఆర్‌ను చూసి కేంద్రం కాపీ కొట్టింది: మంత్రి నిరంజన్
సాక్షి, కామారెడ్డి : వచ్చే డిసెంబర్ నాటికి కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాలకు సాగునీరు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం నీటిని ఈ రెండు నియోజక వర్గాలకు అందించి భూములను సస్యశ్యామలం చేస్తామన్నారు. మార్కెట్ అవసరాలను బట్టి కొత్త సొసైటీల ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రంలో 21 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములను 332 పూర్తి చేశామని తెలిపారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో కూడా 24 గంట ఉచిత విద్యుత్ అందడం లేదని, కేవలం తెలంగాణలోనే నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ ఒక్కరే రైతులకు రైతు బంధు అందించారన్నారు. కేసీఆర్‌ను చూసి కేంద్రం ప్రభుత్వం కాపీ కొట్టిందని విమర్శించారు. రైతుబంధు విషయంపై మిగతా రాష్ట్రాలు కూడా సానుకూలంగా ఉన్నాయని, ఈ పథకం అమలుకు టీఆర్ఎస్ భూరికార్డుల ప్రక్షాళన చేసిందని గుర్తు చేశారు. రైతు సంక్షేమానికి ఏ రాష్ట్రం కూడా ఇంత ఖర్చు చేయడం లేదని అన్నారు. రాష్ట్రంలో సాగునీటి కోసం తానే ఇంజనీర్‌లాగా పనిచేసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని, మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని ప్రశంసించారు. రైతు సంక్షేమానికి ఏ రాష్ట్రం కూడా ఇంత ఖర్చు చేయడం లేదన్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌మత్స్యకారులకు గత అయిదేళ్లుగా చేప పిల్లలు ఉచితంగా ఇస్తున్నారని, నిజామాబాద్ జిల్లాలో రూ. 3 కోట్ల 75 లక్షలు చేప పిల్లల కోసం కేటాయించారన్నారు. 63 లక్షల రొయ్య పిల్లలను శ్రారం సాగర్ ప్రాజెక్టులో వదిలామన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని, మత్స్యకారుల తరపున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నా అన్నారు. -
ప్రజాధనం దుర్వినియోగం కావొద్దు: గుత్తా
సాక్షి, హైదరాబాద్: ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం వెచ్చించే నిధులు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత శాసనసభ అం చనాల కమిటీపై ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం శాసనసభ కమిటీ హాల్లో జరిగిన అంచనాల కమిటీ తొలి భేటీకి కమిటీ చైర్మన్, దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి అధ్యక్షత వహించారు. మం డలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాగా, వరుసగా రెండోసారి శాసనసభ అంచనా ల కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సోలిపేటను గుత్తా, హరీశ్, ప్రశాంత్‌రెడ్డి, కమిటీ సభ్యులు అభినందించారు. తర్వాత జరిగిన సమావేశంలో అ సెంబ్లీ వ్యవహారాల్లో ‘పేపర్స్ లెయిడ్ అన్ టేబుల్’ కమిటీ (సభకు సమర్పించే పత్రాల పరిశీలన కమిటీ) పాత్రకు ప్రాధాన్యత ఉందని సుఖేందర్‌రెడ్డి అన్నా రు. మండలి పేపర్స్ లెయిడ్ అన్ టేబుల్ కమిటీ తొలి సమావేశంలో కమిటీ చైర్మన్ సయ్యద్ జాఫ్రీ అధ్యక్షతన జరిగింది. -
త్వరలో 57ఏళ్లకే పింఛన్
సాక్షి, బాల్కొండ: గత సాధారణ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హమీ మేరకు త్వరలోనే 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం ముప్కాల్ మండలం నల్లూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యాక్రమాలను కలెక్టర్ రామ్మోహన్‌రావుతో కలిసి ప్రారంభోత్సవం, శంకు స్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే 57ఏళ్లు నిండిన వారికి పింఛన్ అందించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను చేస్తుందన్నారు. ప్రస్తుతం కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరు అందించాలని లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్ట్‌ల నిర్మాణం పూర్తి చేయడంలో కేసీఆర్ నిమగ్నమై ఉన్నారన్నారు. అందులో కాళేశ్వరం ప్రధాన ప్రాజెక్ట్ అన్నారు. ఆ ప్రాజెక్ట్ కోసం నిధులు ఎక్కువగా వెచ్చించడం వల్ల ప్రస్తుతం ఇతర పనులు చేపట్టలేక పోతున్నామన్నారు. త్వరలోనే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడుతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయితే ఎస్సారెస్పీ ఆయకట్టుకు డోకా ఉండదన్నారు. ఇది వరకే కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీని ముద్దాడాయన్నారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి నీరు రావడం వల్ల కాళేశ్వరం నీళ్లు అవసరం లేకుండా పోయిందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి నీరు రానప్పుడు కాళేశ్వరం నీళ్లు ఎంతో అవసరం ఉంటుందన్నారు. నల్లూర్పై మంత్రి నారాజ్.. నల్లూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లపై మంత్రి నరాజ్ అయ్యారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో 412 మంది రైతుబంధు, 500 మంది పింఛన్లు పొందుతున్నారన్నారు. 912మంది రాష్ట్ర ప్రభుత్వం వలన ప్రయోజనం పొందిన టీఆర్ఎస్ పార్టీకి గత ఎన్నికల్లో 200 ఓట్లు మాత్రమే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సేవాకుడిగా ప్రజలను నుంచి కోరుకునేది ఓటు మాత్రమే అన్నారు. ప్రజలు ఎక్కువగా ఓట్లు వేస్తే మరింత ఉత్సాహంతో పని చేస్తామన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తా.. నల్లూర్ గ్రామంలో ఇది వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టమన్నారు. భవిష్యత్తులో గ్రామానికి మరింత అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామంలో లో వోల్టేజీ సమస్య తీర్చడం కోసం విద్యుత్తు సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు. గ్రామంలో లైబ్రరీ భవనం నిర్మించామన్నారు. కావాల్సిన పుస్తకాలను జిల్లా కలెక్టర్ నిధుల నుంచి మంజూరు చేయుటకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ముప్కాల్ మండల ఎంపీపీ సామ పద్మ, జెడ్పీటీసీ బద్దం నర్సవ్వ, వైస్ ఎంపీపీ ఆకుల చిన్నరాజన్న, స్థానిక సర్పంచ్ సుగుణ, ఎంపీటసీ సత్యనారయణ, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, మండల అధ్యక్షుడు ముస్కు భూమేశ్వర్, ఆర్డీవో శ్రీనివాస్, ఎంపీడీవో దామోదర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
50 శాతం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది
సాక్షి, న్యూఢిల్లీ : టోల్ ప్లాజాల వద్ద ప్రయాణీకుల సమయాన్ని, ఇంధనాన్ని ఆదా చేసేందుకు వన్ నేషన్ వన్ టాగ్ ఫాస్ట్ ట్యాగ్ ఉపయోగపడుతుందని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం ఢిల్లీలోని కేంద్ర రోడ్డు రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన్ నేషన్ వన్ టాగ్ ఫాస్ట్ టాగ్ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వన్ నేషన్ వన్ టాగ్ ఫాస్ట్ టాగ్ కార్యక్రమ అమలుకు తమ ప్రభుత్వం తెలిపిన ఆమోదాన్ని కేంద్రానికి వెల్లడించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెండింగులో ఉన్న జాతీయ రహదారులు, రోడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని నితిన్ గడ్కరీకి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. తమ విజ్ఞప్తులపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణకు అయ్యే ఖర్చులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్రానికి వివరించినట్లు మంత్రి వేముల పేర్కొన్నారు. -
ఏంది ఈ రోడ్డు ? ఎలా వెళ్లేది !
సాక్షి, భీమ్‌గల్(నిజామాబాద్) : మండలంలోని సంతోష్‌నగర్ తండాలో నీటి లీకేజీ కారణంగా ప్రధాన రహదారి దెబ్బ తినడంపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమ్‌గల్‌లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన కలెక్టర్ రామ్మోహన్‌రావుతో కలిసి కారులో బయల్దేరారు. అయితే, తండా వద్దకు రాగానే రోడ్డంతా దెబ్బతిని బురదమయం కావడాన్ని గమనించిన మంత్రి.. వాహనాన్ని ఆపి కిందికి దిగారు. రోడ్డు ఇలా కావడంపై సర్పంచ్ ఎంజీ నాయక్‌ను ప్రశ్నించారు. పక్కనే ఉన్న భగీరథ పైపులైన్ లీకేజీ కారణంగా నీరు రోడ్డుపై ప్రవహించి బురదమయంగా మరుతోందని సర్పంచ్ తెలిపారు. దీంతో ఆయన అక్కడి నుంచే ఎస్ఈతో ఫోన్లో మాట్లాడి వెంటనే రోడ్డును సరిచేయాలని ఆదేశించారు. -
ఓట్ల కోసం ఈ పని చేయట్లేదు : మంత్రి
సాక్షి, నిజామాబాద్ : ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని ఓట్లకోసం చేపట్టలేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన శ్రీరాం సాగర్ ప్రాజెక్టు వరద కాలువ వద్ద కాళేశ్వరం జలాలకు పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలు, రైతుల రుణం తీర్చుకోవడానికి, పదవిలో ఉన్నన్ని రోజులు ఏదో ఒక గుర్తుండే పని చేయాలనే తలంపుతో చేశామంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్ష నేతల మాటలు వింటుంటే జాలేస్తుందన్నారు. కాళేశ్వరం జలాలు ఎలా వస్తాయనే ప్రతిపక్షాల హేళనలన్నీ భరించిన కేసీఆర్ ఇప్పుడు అపర భగీరథుడయ్యాడని ప్రశంసించారు. మరోవైపు తెలంగాణ దేశానికే ఆదర్శమని కొత్త గవర్నర్ చెప్పడం హర్షదాయకమని తెలిపారు. -
కూల్చివేయడమే కరెక్ట్..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత సచివాలయ భవనాల కూల్చివేతకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఇవి ఉపయోగించడానికి వీలు లేకుండా ఉన్నాయని కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఈ మేరకు యోచిస్తోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం గురువారం తన నివేదికను సమర్పించింది. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ భవనం ఉపయోగించడానికి వీలు లేకుండా ఉన్నందున, సచివాలయం కోసం కొత్త భవన నిర్మాణం సముచితమేనని ఉపసంఘం తేల్చిచెప్పింది. ప్రస్తుత సచి వాలయం భవనంలో మార్పుచేర్పులు చేసి కొనసాగించ డానికి కూడా ఏమాత్రం అనువుగా లేదని పేర్కొంది. ప్రస్తుత భవన సముదాయంలోని ఎ, బి, సి, డి, జి, హెచ్ నార్త్, జె, కె బ్లాకుల్లో అగ్నిప్రమాదం జరిగితే మంటలు ఆర్పడానికి అగ్నిమాపక వాహనాలు వెళ్లే పరిస్థితి లేదని, మార్పులు చేసినప్పటికీ ఫైరింజన్ వెళ్లడం కుదరదని స్పష్టంచేసింది. అంతేకాకుండా ప్రస్తుత సచివాలంలో వీవీఐపీ, వీఐపీలకు భద్రత సరిగా లేదని.. వీఐపీలకు, అధికారులకు, సందర్శులకు అందరికీ ఒకే ఎంట్రన్స్, ఒకే ఎగ్జిట్ ఉన్నాయని.. ఆయా బ్లాకుల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని, ఇది వారి భద్రతకు ఏ మాత్రం క్షేమకరం కాదని అభిప్రాయపడింది. ప్రస్తుతం సీఎంఓ, మంత్రులు, అధికారులు వేర్వేరు బ్లాకుల్లో ఉంటున్నారని.. అత్యంత రహస్యమైన డాక్యుమెంట్లు, ఫైళ్లను వివిధ బ్లాకులకు తిప్పాల్సి వస్తున్నందున అధికార రహస్యాలు బహిర్గతమవుతున్నాయని పేర్కొంది. మంత్రి వేములతో సీఎం చర్చలు తెలంగాణ రాష్ట్ర కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ నేపథ్యంలో సాంకేతిక అంశాలన్నింటినీ పరిశీలించి నివేదిక ఇవ్వాలని పేర్కొంటూ ఇంజనీరింగ్ శాఖలకు చెందిన నలుగురు ఈఎన్సీలతో ఓ నిపుణుల కమిటీని నియమిస్తూ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సచివాలయ భవనంలో మార్పులు, చేర్పులు చేసి కొనసాగించాలా? లేక కొత్త భవనం నిర్మించాలా? అనే అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆ కమిటీకి సూచించింది. దీంతో రంగంలోకి దిగిన నిపుణుల కమిటీ.. డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్‌తో విస్తృతంగా చర్చించింది. అలాగే సచివాలయ భవన సముదాయం ప్రాంగణాన్ని సునిశితంగా పరిశీలించి, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, మంత్రివర్గ ఉపసంఘానికి తన నివేదిక సమర్పించింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన ఉపసంఘం.. తన అభిప్రాయాలతో కూడిన నివేదికను నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేసింది. దీనిపై గురువారం రాత్రి సీఎం కేసీఆర్.. ఉపసంఘానికి నేతృత్వం వహించిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో చర్చించారు. సబ్ కమిటీ నేవేదిక నేపథ్యంలో సచివాలయ భవనాల కూల్చివేత దాదాపు ఖాయమైనట్టేనని తెలుస్తోంది. -
కుటుంబాలు చితికిపోతున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలు రాష్ట్రవ్యాప్తంగా ఏటా వేల మంది ప్రాణాలను బలిగొంటున్నాయి. గ్రేటర్‌తోపాటు, రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారిలో ఎక్కువ గా కుటుంబాల పెద్దదిక్కులే ఉండడంపై రహదారి భద్రత సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఏటా దాదాపు 6వేల మందికిపైగా ఈ ప్రమాదాల్లో చనిపోతున్నారు. మృతుల్లో 49% మంది 15 నుంచి 45 ఏళ్ల లోపువారే. వీరంతా కుటుంబాలను పోషిస్తున్న వాళ్లే. దీంతో ఆ కుటుంబాలన్నీ రోడ్డునపడుతున్నాయి. ప్రమాదాలను నియంత్రించేందుకు రహదారి భద్రత నిబంధనలను అమలు చేయడంతో పాటు పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటునివ్వడం ముఖ్యమేనని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో సోమవారం రహదారి భద్రతపై హైదరాబాద్‌లో సదస్సు జరిగింది. రవాణా మంత్రి ప్రశాంత్‌రెడ్డి, రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ కృష్ణప్రసాద్, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ పాల్గొన్ని ప్రసంగించారు. విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలు ‘డ్రైవర్ల నిర్లక్ష్యం, వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే 76%ప్రమాదాలు జరుగుతున్నాయని కృష్ణప్రసాద్ అన్నారు. ఇంట్లో సంపాదించే ముఖ్యమైన వ్యక్తే చనిపోతే కుటుంబం దిక్కులేనిదవుతుందన్నారు. పిల్లల్లో అవగాహన కల్పించేందుకు ‘రోడ్డు భద్రత’ను పాఠ్యాంశంగా మార్చినట్లు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు వివిధ విభాగాల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నట్లు రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. -
'అందరం కలిసికట్టుగా పనిచేస్తాం'
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ జెడ్పీచైర్మన్‌గా దాదన్నగారి విఠల్, వైస్ చైర్మన్‌గా రజిత యాదవ్ శుక్రవారం ప్రమాణం చేశారు. కలెక్టర్ ఎం.ఆర్.ఎం రావు స్వయంగా వీరిద్దరి చేత ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమానికి హాజరైన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..సభను హుందాతనంగా నడిపించాలి. అందరూ పోటి పడీ పనిచేయాలని, అర్థవంతమైన చర్చల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో 24 గంటలు పాటు కరెంటు అమలవడం, ఎకరాకు రూ.ఐదు వేలు ఇవ్వడం చూసి ఇతర రాష్ట్రాల నాయకులు ఆశ్చర్యపోతున్నారు. గ్రామాలలో ఏ సమస్యలు ఉన్నా ప్రజా ప్రతినిధులుగా సభా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందని పోచారం పేర్కొన్నారు. 'స్థానిక సంస్థలకు మరిన్ని అధికారాలు కట్టబెట్టాలని, దానికి తగ్గట్టే నిధులను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నార'ని రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఎస్సారెస్సీ పునరుజ్జీవం ద్వారా త్వరలోనే జిల్లా రైతులకు సాగు, తాగు నీరు అందుతుందని ఆయన స్పష్టం చేశారు. 'నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ప్రజల సమస్యలు తీర్చేందుకు అందరం కలిసికట్టుగా పని చేస్తామని' నూతన జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ తెలిపారు.కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీలు విజి గౌడ్, ఆకుల లలిత తదితరులు హాజరయ్యారు. -
ఇరవై రోజుల్లో ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లు..
సాక్షి, నిజామాబాద్: మరో ఇరవై రోజుల్లో కాళేశ్వరం నీళ్లు శ్రీరాంసాగర్ జలాశయంలో పడబోతున్నాయని రాష్ట్ర రవాణా, రోడ్లుభవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రకటించారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలోభాగంగా ఇప్పటికే జగిత్యాల జిల్లా రాంపూర్, రాజేశ్వర్‌రావుపేట్ పంప్‌హౌజ్‌ల ట్రయల్ రన్ నిర్వహించామని అన్నారు. జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సమీపంలో ముప్కాల్ వద్ద నిర్మిస్తున్న మూడో పంప్‌హౌజ్ పనులను మంత్రి బుధవారం పరిశీలించారు. పైప్లైన్లు, గేట్లు తదితర పనుల ప్రగతిపై నీటి పారుదలశాఖ అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ మాసంలో 30 టీఎంసీల కాళేశ్వరం నీటిని ఎస్సారెస్పీకి తరలిస్తామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీరు మొదటగా మిడ్‌మానేరు, ఎస్సారెస్పీకి వస్తున్నాయని, ముప్కాల్ వద్ద నిర్మిస్తున్న మూడో పంప్‌హౌజ్ పనులు పూర్తి కాకపోయినప్పటికీ., మొదటి, రెండు పంపుల ద్వారా రోజుకు 0.6 టీఎంసీల చొప్పున నీటిని తరలించేందుకు వీలు కలుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. రెండు పంప్‌హౌజ్‌ల ద్వారా నీటిని తరలిస్తుండగా, నిర్మాణంలో ఉన్న మూడో పంప్‌హౌజ్‌లోకి నీళ్లు వెళ్లకుండా గేట్ల నిర్మాణం కూడా త్వరలోనే పూర్తవుతుందని చెప్పారు. కాళేశ్వరం నీటితో ఎస్సారెస్పీ కళకళలాడితే కన్నుల పండువగా ఉంటుందని, చూసి తరించి పోవాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. 200 కిలోమీటర్ల కింది కాళేశ్వరం వద్ద నుంచి గోదావరి నదిని మళ్లిస్తూ రూ.1,060 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు మహా అద్భుతమైనదని వ్యాఖ్యానించారు. నిజామాబాద్, కరీంగనర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల రైతాంగం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టును చేపట్టినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంజనీరింగ్ చరిత్రలో ఈ రివర్స్ పంపింగ్ పథకం ఓ వండర్లా నిలిచిపోతుందని అన్నారు. ఎస్సారెస్పీ వరద కాలువ ఏడాదంతా నిండుకుండలా ఉండే అవకాశం ఉన్నందున కాలువకు ఇరువైపులా సమీపంలోని చెరువులను నింపేందుకు వీలుగా తూముల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్ పనులు త్వరలో పూర్తవుతున్న నేపథ్యంలో ఏయే చెరువులను నింపవచ్చో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన జరపాలన్నారు. ఇప్పటికే 15 తూములు ఏర్పాటు చేయాలని నిర్ణయించినందున మరిన్ని ఏర్పాట్లకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంలో భాగంగా వరద కాలువ జీరో పాయింట్ వద్ద రూ.420 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న మూడో పంప్‌హౌజ్ పనులను మంత్రి బుధవారం పరిశీలించారు. తదనంతరం పనులు జరుగుతున్న స్థలంలోనే నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో అక్టోబర్ మాసంలో మోటార్ల పనులన్నీ పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. డిసెంబర్లో ట్రయల్ రన్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
ఆర్టీఏ కార్డుల జారీలో జాప్యాన్ని నివారించాలి
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖ కార్యాలయాల్లో లైసెన్స్, రిజిస్ట్రేషన్ కార్డుల జారీలో నెలకొన్న జాప్యాన్ని పక్షం రోజుల్లో నివారించాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సమస్య తీవ్రంగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మంచిర్యాల జిల్లాల కార్యాలయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.30 లక్షల కార్డుల జారీ పెండింగ్‌లో పడిన నేపథ్యంలో వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం ఆయన రవాణా శాఖ అధికారులతో సమీక్షించారు. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, జేటీసీలు రమేశ్, పాండురంగ నాయక్, ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సంబంధిత కాంట్రాక్టర్ ఆ కార్డుల జారీకి కావాల్సిన రిబ్బన్లను సరఫరా చేయకపోవటంతో సమస్య తలెత్తిందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. సమస్య తీవ్రంగా ఉన్న నాలుగు జిల్లాల కార్యాలయాలకు మూడు రోజుల్లో కార్డుల జారీకి కావాల్సిన సరంజామాను సరఫరా చే యాలని మంత్రి ఆదేశించారు. పక్షం రోజు ల్లో ఆ నాలుగు జిల్లాల్లో పెండింగ్‌ను క్లియర్ చేయాలని తెలిపారు. సాధారణ ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేకంగా ఓ వ్యక్తిని కేటాయించి ఓ ల్యాండ్ లైన్ నంబరు, వాట్సాప్ నంబర్, ఈమెయిల్ ఐడీ కేటాయించాలని సూచించారు. ఆన్లైన్ సేవల పరిశీలనకు కమిటీ.. ప్రస్తుతం రవాణా శాఖ అందిస్తున్న ఆన్లైన్ సేవల తీరును పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆర్టీఏ మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తేవాలని తెలిపారు.కమిషనర్ అధ్యక్షతన ఏర్పడే ఈ కమిటీ పక్షం రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించారు. అనంతరం ఆయన కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. -
‘టీఎస్ ఆర్టీసీని విలీనంపై ఎలాంటి ప్రతిపాదనలు లేవు’
-
‘టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యం’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రతిపాదనలు లేవని రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రవాణా శాఖ ఆదాయంలో దేశంలోనే నాల్గో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఈ మధ్య ఆర్టీఏలో కార్డ్స్ అందుబాటులో లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఐదు వేల రిబ్బన్స్ అవసరం ఉంటే రెండు వేలు మాత్రమే అందించారని అన్నారు. 2.30లక్షల కార్డ్స్ ప్రింట్ చెయాల్సి ఉందన్నారు. వీటిని రాబోయే 15రోజుల్లో ప్రింటింగ్ చేస్తామని తెలిపారు. రవాణా శాఖలో మరిన్ని మార్పులను తీసుకొస్తామని అన్నారు. తెలంగాణ రవాణా శాఖపై కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. కమిటీ 15రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రజల సౌకర్యం కోసం ఫిర్యాదలు అందించడానికి ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటి నుంచి నెలకొకసారి ఫిర్యాదులపై మంత్రి కార్యాలయానికి రిపోర్ట్ ఇస్తుందన్నారు. ఆర్టీఏలో మొబైల్‌యాప్‌ను అందుబాటులోకి తెస్తామని అన్నారు. 2018-19లో ఏడు కోట్ల పర్మిట్ ఫీజులను వసూళ్లు చేశామని ప్రకటించారు. -
సచివాలయం నిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘం
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయాల నిర్మాణంపై అధ్యయనం కోసం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నేృత్వత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఈ కమిటీలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ సభ్యులుగా వ్యవహరించనున్నారు. రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ మంత్రివర్గ ఉపసంఘానికి సహాయ, సహకారాలు అందించనున్నారు. సచివాలయం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత, సచివాలయంలోని ప్రభుత్వ శాఖల కార్యాలయాల తరలింపు, కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయాల నిర్మాణం, ఈ భవనాలకు సంబంధించిన డిజైన్ల ఖరారు తదితర అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా సచివాలయం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత, కొత్త భవనాల నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని కోరింది. శంకుస్థాపనలకు ఏర్పాట్లు... కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల శంకుస్థాపన కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 27న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే. సచివాలయంలోని డీ–బ్లాక్ భవనం వెనుక భాగంలోని పోర్టికో ఎదురుగా ఉన్న గార్డెన్లో కొత్త సచివాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా ఎర్రమంజిల్ ప్యాలెస్, ఆర్ అండ్ బీ కార్యాలయ భవన సముదాయం మధ్యలోని ఖాళీ స్థలంలో కొత్త అసెంబ్లీ భవన నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించనున్నారు. శంకుస్థాపన కార్యక్రమాల ఏర్పాట్లలో భాగంగా ఈ రెండు చోట్లా శిలాఫలకాలను సిద్ధం చేస్తున్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం సచివాలయం, ఎర్రమంజిల్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. -
నాసిరకం డ్రైవర్లు రాకుండా చూడాలి
సాక్షి, హైదరాబాద్: తక్కువ వేతనం ఇస్తుండటం వల్లే అద్దె బస్సులకు నాసిరకం డ్రైవర్లు వస్తున్నందున ఈ సమస్య పరిష్కారానికి వెంటనే దృష్టి సారించనున్నట్టు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. వారికి మెరుగైన వేతనాలు చెల్లిస్తే నైపుణ్యం ఉన్నవారు డ్రైవింగ్‌కు వచ్చే వీలున్నందున, అద్దె బస్సు యజమానులతో చేసుకునే ఒప్పందంలో మెరుగైన వేతనాలు చెల్లించేలా నిబంధన చేర్చాలని, వేతనాలు పెంచేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొన్నిరోజులుగా అద్దెబస్సులు ప్రమాదాలకు గురవుతున్న తీరు, దానికి కారణాలను విశ్లేషిస్తూ ‘ఆటోడ్రైవర్ల చేతిలో ఆర్టీసీ బిస్స’శీర్షికతో శనివారం ‘సాక్షి’ప్రచురించిన కథనానికి ఆయన స్పందించారు. శనివారం సాయంత్రం సచివాలయంలో ఆయన రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ, ఆర్టీసీ ఈడీలు పురుషోత్తం నాయక్, వినోద్, టీవీరావు, అజయ్‌కుమార్, సీటీఎం రాజేంద్రప్రసాద్, సీఎంఈ వెంకటేశ్వర్లు, ఓఎస్డీ కృష్ణకాంత్, ఇతర అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. అద్దె బస్సులకు నైపుణ్యంలేని డ్రైవర్లు వస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుభవం, నైపు ణ్యం లేకపోవటమే కాకుండా డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్లో మాట్లాడటం, పాన్, గుట్కా వేసుకోవటం లాంటివి కూడా ప్రమాదాలకు కారణమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూండటం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని మంత్రి అన్నారు. దీన్ని వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నిర్లక్ష్యంగా బస్సులు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైవర్లపైనే కాకుండా, వారిని పనిలో పెట్టిన అద్దె బస్సుల యజమానులపై కూడా చర్యలు తీసుకుంటేనే ప్రమాదాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. ఏం చర్యలు తీసుకుంటున్నారు..? ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైవర్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అధికారులను మంత్రి వేముల ప్రశ్నించారు. సంస్థ సొంత డ్రైవర్లయితే ప్రాథమిక విచారణ జరిపి బాధ్యులని తేలితే సస్పెండ్ చేస్తున్నామని, తుది విచారణలోనూ నిర్ధారణ అయితే తొలగిస్తున్నామని అధికారులు వివరించారు. అద్దె బస్సు డ్రైవర్లను బ్లాక్‌లిస్టులో పెడుతున్నామని పేర్కొన్నారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసే వారికి ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని అధికారులు వివరించారు. ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురికాకుండా చూడాలని అధికారులకు సూచించారు. అద్దె బస్సు డ్రైవర్లకు కొన్ని మార్కులను వెయిటేజీగా ఇస్తే ఉద్యోగం వస్తుందన్న ఉద్దేశంతో వారు బాధ్యతాయుతంగా ఉంటారని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. వీటిపై సాధ్యాసాధ్యాలు పరిశీలించి తెలపాలని మంత్రి సూచించారు. బస్సుల జీవితకాలం వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. 13.50 లక్షల కిలోమీటర్లు తిరిగినా లేదా 15 ఏళ్లపాటు తిరిగిన వాటిని తుక్కు కింద తొలగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. సాధ్యమైనంత వరకు బస్సులు కండీషన్లో ఉండేలా చూడాలని ఆయన ఆదేశించారు. -
179 మంది రైతుల నామినేషన్లు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ స్థానానికి రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు సోమవారం ఏకంగా 182 నామినేషన్లు దాఖలు కాగా.. ఇందులో 179 మంది రైతులే ఉన్నారు. తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని, పసుపు, ఎర్రజొన్నను ప్రభు త్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. పెద్ద ఎత్తున రైతులు తరలిరావడంతో కలెక్టరేట్ పరిసరాలు కిటకిటలాడాయి. సమస్యను జాతీయ స్థాయిలో వినిపించేందుకే తాము నామినేషన్లు వేశామని పసుపు, ఎర్రజొన్న రైతులు ప్రకటించారు. కాగా, ఈనెల 20న ఏడు నామినేషన్లు, 22న 56 మంది అభ్యర్థుల నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం మీద నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి దాఖలైన నామినేషన్ల సంఖ్య 245 కు చేరింది. తరలి వచ్చిన నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన రైతులు పసుపు, ఎర్రజొన్న సాగయ్యే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలతో పాటు జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల నుంచి రైతులు తరలివచ్చారు. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుండగా, ఉదయం ఎనిమిది గంటల నుంచే రైతుల రాక ప్రారంభమైంది. ఒక్కో గ్రామం నుంచి ఇద్దరు, ముగ్గురు, నలుగురు., అభ్య ర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేసే రైతులతో పాటు, అభ్యర్థిని బలపరిచేందుకు వచ్చిన రైతులతో కలెక్టరేట్ పరిసరాలు కిటకిటలాడింది. ఒక్కసారిగా రైతులు తరలిరావ డంతో అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పా ట్లు చేసింది. ప్రగతిభవన్‌లో షామియానాలు, కుర్చీలు వేసి కూర్చోబెట్టారు. నాలుగైదు కౌంటర్లను ఏర్పాటు చేసి, అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. నామినేషన్ల పరిశీలన, ధ్రువపత్రాలు, చెక్‌లిస్టు ప్రకా రం జత చేయాల్సిన సర్టిఫికెట్లు., ఇలా ఒక్కో అంశానికి సంబంధించి ఒక్కో కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లలో పరిశీలన అనంతరం జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఎం రామ్మోహన్ రావు నామినేషన్లు తీసుకున్నారు. జిల్లాలోని డీఆర్వో, ఆర్డీవోలు, అన్ని స్థాయిల్లోని రెవెన్యూ ఉన్నతాధికారులందరూ చివరి రోజు ఈ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ విధులను నిర్వర్తించారు. గ్రామాభివృద్ధి కమిటీల తీర్మానాలు ఆయా గ్రామాల్లోని రైతులంతా ఏకతాటిపైకి వచ్చి నామినేషన్లు వేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు కొన్ని గ్రామాల్లో వీడీసీ (గ్రామాభివృద్ధి కమిటీ)లు తీర్మానాలు చేశాయి. నామినేషన్లు వేసే అభ్యర్థులకు డిపాజిట్ల కోసం అవసరమైన మొత్తాన్ని కూడా వీడీసీలే సర్దుబాటు చేశాయి. ఆయా గ్రామాల్లోని ఒక్కో కుటుంబం నుంచి నిర్ణీత మొత్తాన్ని జమ చేసి, అభ్యర్థులకు అవసరమైన డిపాజిట్ నిధులను సమకూర్చుతున్నారు. ఫలించని మంత్రి, ఎమ్మెల్యేల ప్రయత్నాలు రైతులు నామినేషన్లు వేయకుండా నిలువరించేందుకు అధికార పార్టీ టీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నికల అనంతరం ఎర్రజొన్నకు బోనస్ ప్రకటిస్తామని టీఆర్ఎస్ నేతలు హామీలు ఇచ్చారు. మరోవైపు నామినేషన్లు వేయకుండా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రైతులతో మాట్లాడారు. నామినేషన్లు వేయవద్దని సూచించారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా మోర్తాడ్‌లో రైతులతో సమావేశమై నామినేషన్లు వేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సూచించారు. అయితే ఇందుకు రైతులు ససేమిరా అన్నట్లు నామినేషన్ల వెల్లువను బట్టి తెలుస్తోంది. 144 సెక్షన్ అమలు నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిజామాబాద్ కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ట్రాఫిక్ వన్‌వేగా ఏర్పాటు చేసి, కలెక్టరేట్ వైపు ఇతర వాహనాలు వెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పా ట్లు చేశారు. జిల్లా పోలీసులతో పాటు, సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. జాతీయ స్థాయిలో గళం వినిపించేందుకే.. తమ సమస్యను జాతీయ స్థాయిలో విని పించేందుకే తాము నామినేషన్లు వేశామని పసుపు, ఎర్రజొన్న రైతులు ప్రకటించారు. నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తాము ఎన్నికల్లో భారీ ఎత్తున నామినేషన్లు వేయాలని నిర్ణయించామని ఆర్మూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన గాదేపల్లి మధు అనే రైతు విలేకరులతో పేర్కొన్నారు. -
ఎయిర్‌పోర్ట్‌లో ఆర్టీసీ నిర్లక్ష్యం.. మంత్రి ఆగ్రహం!
సాక్షి, హైదరాబాద్: నగరానికి విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ ఆర్టీసీ నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరీంనగర్ వెళ్లేందుకు తాను ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ.. అక్కడ బస్సు అందుబాటులో లేకపోవడం.. వాకబు చేసేందుకు కనీసం సిబ్బంది కూడా లేకపోవడంతో షాక్ తిన్నారు. దీంతో వెంటనే ఆయన రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ఎస్సెమ్మెస్స్ ద్వారా ఫిర్యాదు చేయగా.. ఆయన వెంటనే స్పందించి.. సదరు ప్రయాణికుడికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడమే కాకుండా.. ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణకు ఆదేశించారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్‌కు చెందిన శంకరయ్య, ఆయన కుమారుడు అరవింద్ ఆదివారం ఉదయం అహ్మదాబాద్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆర్టీసీ బస్సులో కరీంనగర్ వెళ్లేందుకు ముందుగానే వారు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నారు. బస్సు ఉదయం 10.30 గంటలకు రావాల్సి ఉండగా.. ఎంత వేచి చూసినా అది రాలేదు. దీంతో వాకబు చేసేందుకు ఆర్టీసీ కౌంటర్ వద్దకు వెళ్లగా.. అక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవడం వారికి విస్మయం కలిగించింది. దీంతో వెంటనే ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యంపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ఎస్సెమ్మెస్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై వెంటనే స్పందించిన మంత్రి సంబంధిత అధికారులను ఆరాతీసి.. బస్సును ఏర్పాటుచేశారు. అంతేకాకుండా ఆర్టీసీ సిబ్బంది అలసత్వంపై విచారణకు ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. -
మినీ థియేటర్ల ఏర్పాటులో ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తొలి సమీక్షలో సూచించిన విధంగా ప్రధాన బస్స్టేషన్లలో మినీ థియేటర్ల ఏర్పాటును వేగవంతం చేసే పనిలో టీఎస్ఆర్టీసీ నిమగ్నమైంది. గుర్తించిన కొన్ని ప్రత్యేకమైన బస్డాండ్ల్లో పటిష్టతను పరిశీలించిన తర్వాత ఏర్పాటు పనులను ప్రారంభించేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. టికెట్‌యేతర ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో భాగంగా సంస్థ వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఇందుకు 72 ప్రధాన బస్టాండ్‌ల్లో మినీ థియేటర్ల నిర్మాణం, బడ్జెట్ హోటల్స్ ఏర్పాటు పనులను ముమ్మరం చేసింది. ఆయా బస్టాండ్లలో పటిష్టత ఎలా ఉంద నే అంశాలపై ఆర్ అండ్ డీ, జేఎన్టీయూ, నేషన ల్ వర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఆయా అంశాలపై పరిశీలన జరపనుంది. ఈ బృందం నిర్ధారించిన తర్వాత ఆయా బస్టాండ్లలో డార్మెంటరీ, బడ్జెట్ హోటల్స్‌తో పాటు థియేటర్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. -
అమాత్యునిపైనే ఆశలు!
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా సరైన రోడ్లు లేని గ్రామాలెన్నో.. ఆర్టీసీ బస్సుల ముఖం చూడని పల్లెలెన్నో.. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, ప్రత్యేక తెలంగాణలోనూ రవాణా సౌకర్యాల్లో పెద్దగా మార్పు రాలేదు.. పల్లెలకు బస్సుల రాకపోకలు పెద్దగా పెరగలేదు.. అయితే, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి రవాణా శాఖ మంత్రిగా నియమితులు కావడంతో ఉమ్మడి జిల్లాల ప్రజలు ఆయనపైనే ఆశలు పెట్టుకున్నారు. ఉభయ జిల్లాల్లో రవాణా కష్టాలు తీరడంతో అన్ని గ్రామాలకు రోడ్ల నిర్మాణం, బస్సు సౌకర్యం కలుగుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. సాక్షి, కామారెడ్డి: సమాజ పురోభివృద్ధిలో రోడ్డు, రవాణా వ్యవస్థ అత్యంత కీలకమైనది. సాంకేతికంగా దూసుకుపోతున్న నేటి కాలంలో సరైన రవాణా సౌకర్యాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో దశాబ్దాలుగా రవాణా రంగం అభివృద్ధికి నోచుకోలేదు. ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యాలు లేక ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో సగానికి పైగా గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. రోడ్డు సౌకర్యం ఉన్న అన్ని గ్రామాలకు బస్సులు నడుపుతామన్న ఆర్టీసీ ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి. దీంతో ప్రజలు ఆటోలు, జీపులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఆర్అండ్బీ, రవాణా శాఖ మంత్రి గా నియమితులు కావడంతో ఉమ్మడి జిల్లా ప్ర జలు ఆయన పైనే ఆశలు పెట్టుకుంటున్నారు. జిల్లాకు చెందిన వ్యక్తే రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినందున ఉమ్మడి జిల్లాలో రవాణా కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు. ఇదీ పరిస్థితి.. నిజామాబాద్ రీజియన్ పరిధిలోని కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఆరు బస్ డిపోలు ఉన్నా యి. వాటి పరిధిలో 668 బస్సులు మాత్రమే ఉ న్నాయి. రోజు సగటున 3.50 లక్షల మంది ఆ యా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఆయా బస్సు లు రోజుకు సరాసరిగా 2.85 లక్షల కిలోమీటర్లు తిరుగుతుండగా, ఆర్టీసీకి రూ.90 లక్షల ఆదా యం సమకూరుతోంది. కామారెడ్డి జిల్లాలో 526 పంచాయతీలు, నిజామాబాద్ జిల్లాలో 530 పం చాయతీలు ఉన్నాయి. వాటికి తోడు ఆవాస గ్రా మాలు మరో వంద ఉంటాయి. అయితే, ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో బస్సు ముఖం చూడని గ్రా మాలెన్నో ఉన్నాయి. సగానికి పైగా గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదు. దీంతో ప్రజలు ఆటోల్లో నే ప్రయాణిస్తున్నారు. ఆటోలో పరిమితి మించి ప్రజలను తరలిస్తుండడంతో తరచూ ప్రమాదా లు జరుగుతున్నాయి. గతేడాది ముప్కాల్ సమీపంలో ఆటో ప్రమాదవశాత్తు బావిలో పడి పదకొండు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. చిన్నాచితకా ప్రమాదాలు జరగడం, ఒకరిద్దరు మృతి చెందడం నిత్యకృత్యంగా మారింది. ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటే ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారమే ఉండదు. పల్లెలకు వెళ్లని బస్సులు.. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో మెజారిటీ గ్రామాలకు వివిధ పథకాల ద్వారా మంచి రోడ్లు వేశారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసలు, మారుమూల గ్రామాల నుంచి సైతం మండల కేంద్రాలు, ప్రధాన రహదారులను కలుపుతూ బీటీ రోడ్లు వేశారు. దాదాపు అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉంది. అయితే, గతంలో రోడ్డు బాగా లేదనే సాకుతో ఆర్టీసీ బస్సులు నడిపేది కాదు. కానీ ఇప్పుడు రోడ్డు సౌకర్యం ఉన్న గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదు. కొన్ని గ్రామాలకు విద్యార్థుల సౌకర్యార్థం బస్సులు నడుపుతున్నారు. ఉదయం గ్రామాలకు వెళ్లి పిల్లల్ని పట్టణాలకు చేరుస్తాయి. తరువాత సాయంత్రం తిరిగి ఊళ్లకు వెళ్లి దింపి వస్తాయి. మిగతా సమయాల్లో ఆయా గ్రామాలకు బస్సు సౌకర్యం ఉండక పోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆటోల్లోనే ప్రయాణించాల్సి వస్తోంది. బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాల నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రానికి ఎక్స్‌ప్రెస్ బస్సు సౌకర్యం లేదు. వెనుకబడిన ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, పెద్దకొడప్గల్ తదితర మండలాల నుంచి జిల్లా కేంద్రానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు రెండు, మూడు బస్సులు ఎక్కాల్సి వస్తోంది. హామీలుగానే బస్ డిపోలు.. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని నందిపేటలలో బస్ డిపోలు ఏర్పాటు చేయడానికి రెండు దశాబ్దాల క్రితమే ప్రయత్నాలు జరిగాయి. ఆర్టీసీ స్థలాన్ని కూడా సేకరించింది. దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ అక్కడ డిపోలు ఏర్పాటు కాలేదు. ప్రతీ ఎన్నికల్లోనూ బస్ డిపో ఏర్పాటు అంశాన్ని నేతలు ప్రస్తావిస్తారు. ఆ తరువాత మరిచిపోవడం పరిపాటిగా మారింది. ఎల్లారెడ్డిలో బస్‌డిపో ఏర్పాటు చేస్తే ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజక వర్గాల్లోని ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఎల్లారెడ్డి, జుక్కల్ ప్రాంతాల్లోని గ్రామాలకు కామారెడ్డి, బాన్సువాడ డిపోలకు చెందిన బస్సులే దిక్కవుతున్నాయి. అక్కడే బస్‌డిపో ఏర్పాటు చేస్తే ఎంతో మేలు జరిగేది. అలాగే నందిపేటలోనూ బస్‌డిపో ఏర్పాటు చేయకపోవడం మూలంగా ఆ ప్రాంత ప్రజలకు అసౌకర్యంగా ఉంది. నష్టాల సాకుతో ఎత్తివేసిన భీమ్‌గల్ బస్ డిపోను తిరిగి తెరిపిస్తామని నేతలు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. దీంతో భీమ్‌గల్ పరిధిలోని మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం అంతంత మాత్రంగానే మారింది. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో రెండో డిపో ఏర్పాటు ఎంతో అవసరం. కామారెడ్డిలో చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేయడంతో పట్టణ జనాభా లక్షన్నర దాటింది. పట్టణానికి వలస వచ్చే వారి సంఖ్య పెరిగింది. స్థానికంగా లోకల్ బస్సులు నడపాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ప్రమాదమని తెలిసినా.. గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఆటోల్లోనే ప్రయాణిస్తున్నారు. ఆటోల్లో ప్రయాణం ఒక్కోసారి ప్రాణాల మీదికి తెస్తున్నా, తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రమాదాలు జరిగినపుడు ఆటోవాలాలను ఇబ్బంది పెట్టడమే తప్ప, ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామన్న ఆలోచనలు చేయడం లేదు. ఆర్టీసీ బస్సు ముఖం చూడని గ్రామాలు ఎన్నో ఉన్నప్పటికీ ఆయా గ్రామాలకు బస్సులను నడిపే విషయంలో ప్రజాప్రతినిధు లు కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. పెరిగిన జనాభాకు అనుగుణంగా ఆర్టీసీ బస్‌డిపోలను ఏర్పాటు చేయడంతో పాటు అదనపు బస్సులను కేటాయించాల్సిన అవసరం ఎంతో ఉంది. రవాణా మంత్రిగా ప్రశాంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలో నెలకొన్న రవాణా కష్టాలను తీర్చడానికి ఏమేరకు ప్రయత్నిస్తారో వేచి చూడాలి. -
కీలక బాధ్యతలు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : బాల్కొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వేముల ప్రశాంత్‌రెడ్డి రాష్ట్ర మంత్రిగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు అత్యంత కీలకమైన శాసన సభా వ్యవహారాలు, రోడ్లు భవనా లు, రవాణా, గృహ నిర్మాణ శాఖలు అప్పగించారు. సివిల్ ఇంజినీర్ అయిన ప్రశాంత్‌రెడ్డికి సీఎం కేసీఆర్ ఇంజినీరింగ్ శాఖలే కేటాయించారు. మిషన్‌భగీరథ వైస్ చైర్మన్‌గా పనిచేసిన ప్రశాంత్‌రెడ్డి, కేసీఆర్ కలల ప్రాజెక్టు వాటర్‌గ్రిడ్ పనులను అనతి కాలంలోనే ముందుకు తీసుకెళ్లారు. నిర్దేశించిన పనిలో సమర్థత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తన జట్టులో కేసీఆర్ చోటు కల్పించారు. గత ప్రభుత్వ హయాంలో శాసన సభా వ్యవహారాల మంత్రిగా హరీశ్ రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర్రావు పనిచేశారు. రవాణా శాఖ మంత్రిగా మహేందర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. వీటితో పాటు గృహ నిర్మాణశాఖ బాధ్యతలు కూడా వేములకు అప్పగించారు. దైవసాక్షిగా ప్రమాణం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా పది మంది ఎమ్మెల్యేలకు అవకాశం లభించింది. ఇందులో ప్రశాంత్‌రెడ్డి ఒకరు కాగా, ఆయన రాజ్‌భవన్‌లో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తల్లి మంజుల ఆశ్వీరాదం తీసుకున్న అనంతరం ప్రశాంత్‌రెడ్డి తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. కాగా ప్రశాంత్‌రెడ్డికి మంత్రి వర్గంలో చోటు ఖాయమనే అభిప్రాయం మొదటి నుంచి వ్యక్తమైంది. అందరూ ఊహించినట్లుగానే మంత్రి పదవి దక్కింది. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులు కావడం, కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ పట్ల ఉన్న విధేయతే ఆయనకు పదవి వరించేలా చేసింది. ఎంపీ కవితను కలిసిన మంత్రి.. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎంపీ కల్వకుంట్ల కవితను మర్యాద పూర్వకంగా కలిసారు. హైదరాబాద్‌లో ఎంపీ నివాసానికి వెళ్లారు. మహానాయకుడు కేసీఆర్ కేబినెట్లో చోటు లభించడం తన అదృష్టమని ప్రశాంత్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు, తన విజయానికి కృషి చేసిన ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా నియమితులైన ప్రశాంత్‌రెడ్డికి ఎంపీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంత్‌రెడ్డికి పలువురి శుభాకాంక్షలు.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రశాంత్‌రెడ్డిని జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కలసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ దఫెదార్ రాజు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి, నుడా చైర్మన్ చామకూర ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ సుమనారెడ్డి, పార్టీ నాయకులు డాక్టర్ మధుశేఖర్ తదితరులు ప్రశాంత్‌రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. -
ప్రశాంత్‌రెడ్డి అనే నేను..!
బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారనే అంశంపై నేడు స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ప్రశాంత్‌రెడ్డి గత ప్రభుత్వ హయాంలో కూడా కేబినెట్ హోదాలో మిషన్‌భగీరథ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించా రు. ముఖ్యంగా సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రత్యే క రాష్ట్ర సాధన లక్ష్యంగా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: మంత్రివర్గ విస్తరణలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డికి చోటు దక్కింది. మంగళవారం ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రశాంత్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని సీ ఎం నివాసం ప్రగతిభవన్లోనే ఉన్నారు. ఈ మేరకు ఆయనకు సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారు. ప్రశాంత్‌రెడ్డికి ఏ శాఖ కేటాయిస్తారనే అంశంపై మంగళవారమే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. తమ నేతకు మంత్రి పదవి లభించనుండటంతో నియోజకవర్గంలో ఆయన అనుచరుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రశాంత్‌రె డ్డి 2014, తాజాగా జరిగిన ఎన్నికల్లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత ప్రభుత్వ హయాంలోనే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన ప్రశాంత్‌రెడ్డి గత ప్రభుత్వ హయాంలో కూడా కేబినెట్ హోదాలో మిషన్‌భగీరథ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. ఈసారి కేసీఆర్ నేరుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. స్వతహాగా ఇంజనీర్ అయిన ప్రశాంత్‌రెడ్డికి కేసీఆర్ తన కలల ప్రాజెక్టు అయిన మిషన్ భగీరథ (వాటర్‌గ్రిడ్) బాధ్యతలను అప్పగించారు. 2016లో ఏప్రిల్ 29న ఆయన మిషన్‌భగీరథ వైస్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఈ ప్రాజెక్టు పనులను ముం దుకు తీసుకెళ్లడంలో కృషి చేశారు. ఉద్యమంలో చురుగ్గా.. 2001లో కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీలో తం డ్రి వేముల సురేందర్‌రెడ్డితో కలిసి పని చేశారు. తెలంగాణ ఉద్యమం లో చురుగ్గా పా ల్గొన్నారు. 2010లో సీఎం కేసీఆర్ ప్రశాంత్‌రెడ్డికి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఉద్యమ సమ యంలో కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నియోజక వర్గంలో ఉద్యమాన్ని చేపట్టారు. సాగరహారం, అసెంబ్లీ ముట్ట డి, రైల్‌రోకో, వంటావార్పు లాంటి అనేక ఆం దోళన, నిరసన కార్యక్రమాల్లో పాల్గొ న్నారు. ఉద్యమ సమయంలో రైల్‌రోకో, ఇతర కేసులు ఎదుర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి.. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ప్రశాంత్‌రెడ్డి నియోజకవర్గ అభి వృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. చెక్‌డ్యామ్‌లు, ఇలా 40 ప్రత్యేక సాగునీటి పనులను రూ.200 కోట్లతో చేపట్టారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలైన రోడ్లు పనులకు భారీగా నిధులు మంజూరయ్యాయి. ప్రశాంత్‌రెడ్డి బయోడేటా.. పేరు: వేముల ప్రశాంత్‌రెడ్డి విద్యార్హత : బీఈ సివిల్ (బాల్కి, కర్ణాటక) తండ్రి: కీ.శే.వేముల సురేందర్‌రెడ్డి తల్లి : మంజుల భార్య : నీరజా రెడ్డి కుమారుడు : పూజిత్‌రెడ్డి– ఎంబీబీఎస్ కుమార్తె : మానవి రెడ్డి (బీటెక్)– సీబీఐటీలో సోదరుడు : వేముల శ్రీనివాస్ (అజయ్‌రెడ్డి– వెటర్నరీ సీనియర్ డాక్టర్) సోదరి : రాధిక (గ్రూప్–1 ఆఫీసర్) జననం: 14.03.1966 బాల్యం విద్యాభ్యాసం : వేల్పూర్, కిసాన్‌నగర్ వృత్తి : ప్రఖ్యాత బిల్డర్‌గా హైదరాబాద్‌లో పేరుగాంచారు. -
కేసీఆర్ ప్రధాని కావాలి!
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి కావాల్సిన అవసరముందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. ఇన్నాళ్లూ దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు ఎలాంటి మార్పు తీసుకురానందున.. దేశానికి కేసీఆర్ వంటి నాయ కుడి అవసరం ఉందన్నారు. గవర్నర్ నరసింహన్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆదివారం ఆయన శాసన సభలో మాట్లాడుతూ.. ‘దేశంలో గుణాత్మక మార్పు తీసుకొచ్చేందుకే సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు పూనుకున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి దేశం విస్మయం చెందుతోంది. ప్రధాని మోదీతోపాటు సీఎంలు నవీన్ పట్నాయక్, మమతా బెన ర్జీలు మన పథకాలపై ఆసక్తి కనబరుస్తు న్నారు. జాతీయ మీడియా కూడా కేసీఆర్ మోడల్‌పై దృష్టిసారించింది’ అని అన్నా రు. కేసీఆర్ నాయకత్వాన్ని అన్ని రాష్ట్రాల సీఎంలు అనుసరించాల్సిన పరిస్థితి తలె త్తిందన్నారు. ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా కేసీఆర్ కృషి చేశారన్నారు. సంపద సృష్టించి, దాన్ని పేదలకు, రైతులకు పంచ డమే కేసీఆర్ లక్ష్యమన్నారు. ఎవరెన్ని తిట్టినా, విపక్షా లన్నీ జతకూడినా, ఏపీ సీఎం చంద్రబాబు నీచరాజకీయాలు చేసినా.. టీఆర్ఎస్కు ప్రజలు 88 సీట్లు కట్టబెట్టారని తెలిపారు. వచ్చే ఏప్రిల్ నాటికి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా నీళ్లు వస్తాయన్నారు. అందుకే మళ్లీ పట్టం: మండలిలో పల్లా రాష్ట్రంలో నాలుగున్న రేళ్లలో సంక్షేమం, అభి వృద్ధి జోడెడ్ల పాలనగా సాగింది కాబట్టే.. కేసీఆర్‌కు ప్రజలు మరో సారి పట్టంగట్టారని టీఆర్ఎస్ ఎమ్మె ల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మండ లిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని పల్లా ప్రారంభించారు. ఆర్థిక క్రమశిక్షణతోపాటు అవినీతి రహిత పాలన కారణంగానే 88 సీట్లతో ప్రభంజనం సృష్టించామన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి ముందున్న పరిస్థితులు, సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని సంక్షేమబాటలో నిలిపేందుకు కేసీఆర్ చేసిన కృషిని దేశం ప్రశంసించిందని పల్లా చెప్పారు. కరెం ట్ సంక్షోభం నుంచి గట్టెక్కి మిగులు విద్యుత్‌ను సాధించడం ఒక అద్భుతమైన విజయ గాథని ఆయన అన్నారు. కాగా, ఇరిగేషన్ ప్రాజె క్టులు, ఇతర అంశాలపై కోర్టుల్లో కేసులు వేయడం మానుకో వాలని, ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేయకుండా నిర్మాణాత్మక సూచనలతో బాధ్యతా యుతంగా వ్యవహరించాలని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు విపక్షాలకు విజ్ఞప్తిచేశారు. ‘నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానాకు’అనే పరిస్థితి నుంచి.. ‘నేను వస్త బిడ్డో.. సర్కారు దవాఖానకు’ అనేట్లుగా పరిస్థితి మారిందన్నారు. రికార్డులు సవరించాలి: షబ్బీర్ ఒక్క కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందని గవర్నర్ చేసిన వ్యాఖ్యలు సవరించి.. 1969 నుంచి అమరుల త్యాగాలు, ప్రత్యేక రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ కృషిని కూడా ప్రభుత్వం, గవర్నర్ రికార్డుల్లో చేర్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపే బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందన్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు, పీఆర్సీ అమలు, బయ్యారం స్టీల్‌ప్లాంట్‌పై స్పష్టతనివ్వడంతో పాటు, నిరుద్యోగ భృతి అమలు, పెంచిన పింఛన్లు, ఇతరత్రా కొత్త హామీలు ఎప్పటి నుంచి అమలుచేస్తారో ప్రభుత్వం వెల్లడించాలన్నారు. సంక్షేమ రంగానికి భారీగా నిధులు కేటాయి స్తున్నట్టు చూపుతున్నా.. వాటిలో 20 శాతం కూడా క్షేత్రస్థాయిలో ఖర్చుకావడం లేదన్నారు. అభివృద్ధికి అద్దం పట్టింది: కొప్పుల ఈశ్వర్ గవర్నర్ ప్రసంగం రాష్ట్రాభివృద్ధికి అద్దం పట్టిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ అన్నారు. నాలుగున్నరేళ్లలో రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసన సభలో చర్చను కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. కొత్త రాష్ట్రమైనప్పటికీ సంక్షేమ పథకాల అమల్లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని చెప్పారు. సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాయి కాబట్టే ప్రజలు మళ్లీ టీఆర్ఎస్కు పట్టంగట్టారన్నారు. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. సొంతకాళ్లపై నిలబడేలా: రామచంద్రరావు ఉత్పాదకత పెంచి ప్రజలు సొంత కాళ్లపై నిలబడేలా చేయూత నివ్వాలి గానీ.. వివిధ రూపాల్లో ప్రజలు ప్రభుత్వంపై ఆధారపడేలా చేయడం సరికాదని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. వివిధ రంగాలకు సంబంధించి అది చేశాం, ఇది చేశాం, మరోటి చేస్తున్నాం అని గవర్నర్ చెప్పారని, అయితే నిజంగా ఆయా రంగాల్లో అంతగా అభివృద్ధి జరిగిందా అన్న సమీక్ష జరగాలన్నారు. విద్యారంగంలో రాష్ట్రం వెనుకబడి ఉందన్నారు. డీఎస్సీ ద్వారా ఎంత మంది ఉపాధ్యాయులను భర్తీచేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉస్మాని యా సహా రాష్ట్రంలోని పలు వర్సిటీల్లో అధ్యాప కుల కొరత తీవ్రంగా ఉందని, దీన్ని వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వైద్య రంగంలో రాష్ట్రం సాధించాల్సింది ఎంతో ఉందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన ‘ఆయు ష్మాన్ భారత్’పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. జంట నగరాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం వేగం పెంచాలని ఎంఐఎం ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ జాఫ్రీ కోరారు. హైదరాబాద్‌లో శాంతి పరిరక్షణకు సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలు అభినందనీయమన్నారు. వెనుకబడిన ముస్లిం వర్గాలకు 12%, ఎస్టీలకు 10% రిజర్వేషన్ల కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరారు. కాంపన్సేటరీ పెన్షన్ స్కీమ్ విధానం రద్దుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దనరెడ్డి సూచించారు. -
ఎన్నికల ప్రచారంలో వేముల ప్రశాంత్‌రెడ్డికి చేదు అనుభవం