
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్ పల్లి గ్రామంలో వీర జవాన్ ర్యాడ మహేష్‌కు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కార్తికేయలు నివాళుర్పించారు. మహేష్ వీరమరణం తలుచుకుని మంత్రి ప్రశాంత్ రెడ్డి కంటతడి పెట్టారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మహేష్ కుటుంబాన్ని అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ అండగా ఉంటారని చెప్పారు. సైనిక, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామని భరోసా ఇచ్చారు. రేపు సాయంత్రం మహేష్ పార్థివ దేహం హైదరాబాద్ చేరుకుంటుందని, ఎల్లుండి స్వగ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. చదవండి: ఉగ్ర పోరులో నిజామాబాద్ జవాన్ వీర మరణం
కాగా జమ్మూ కశ్మీర్‌లోని మచిల్ సెక్టార్‌లో ఆదివారం రోజు ఉగ్రవాదులు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు భద్రతా దళాల సిబ్బంది మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహేష్(25) కూడా మరణించాడు. మహేష్ సంవత్సరం క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతని మృతితో కోమాన్‌పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మహేష్ మరణించాడని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment