Army jawan kills
-
మరికాసేపట్లో బేగంపేటకు మహేష్ పార్థివ దేహం
సాక్షి, హైదరాబాద్: ఉగ్రమూకల కాల్పుల్లో అమరుడైన షహీద్ మహేష్ పార్థివ దేహం మరికాసేపట్లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకొనుంది. మహేష్ పార్థివ దేహాన్ని స్వస్థలమైన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్‌పల్లికి తరలిచించేందుకు మంగళవారం ఆర్మీ అధికారులు ప్రత్యేక అంబులెన్స్ సిద్దం చేశారు. ఈ సందర్భంగా మహేష్ సోదరుడు మల్లేష్, మామయ్య జీటీ నాయుడు మీడియాతో మాట్లాడారు. మహేష్ మృతి వారి కుటుంబాన్ని తీవ్రంగా కలచివేస్తోందన్నారు. అనునిత్యం దేశ సేవకై పరితపించే మహేష్ భరతమాత కోసం ప్రాణత్యాగం చేసినందుకు గర్వపడుతున్నామన్నారు. ప్రతీ ఒక్క యువకుడు కూడా ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని చెబుతూ యువకులకు ఆదర్శంగా నిలిచేవాడని పేర్కొన్నారు. (చదవండి: ఉగ్ర పోరులో నిజామాబాద్ జవాన్ వీర మరణం) ఏడాది క్రితమే మహేష్ వివాహం జరిగిందని అంతలోనే మహేష్ మృతి తమ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జమ్మూ కశ్మీర్లో మచిల్ సెక్టార్లో ఆదివారం రోజున ఉగ్రవాదులు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు భద్రతా దళాల సిబ్బంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లోవీరమరణం పొందిన ముగ్గురిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహేష్(25) కూడా మరణించాడు. మహేష మృతి వార్త తెలియగానే మహేష్ కటుంబ సభ్యులు, భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
సైనిక, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తాం
-
కంటతడి పెట్టుకున్న తెలంగాణ మంత్రి..
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్ పల్లి గ్రామంలో వీర జవాన్ ర్యాడ మహేష్‌కు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కార్తికేయలు నివాళుర్పించారు. మహేష్ వీరమరణం తలుచుకుని మంత్రి ప్రశాంత్ రెడ్డి కంటతడి పెట్టారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మహేష్ కుటుంబాన్ని అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ అండగా ఉంటారని చెప్పారు. సైనిక, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామని భరోసా ఇచ్చారు. రేపు సాయంత్రం మహేష్ పార్థివ దేహం హైదరాబాద్ చేరుకుంటుందని, ఎల్లుండి స్వగ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. చదవండి: ఉగ్ర పోరులో నిజామాబాద్ జవాన్ వీర మరణం కాగా జమ్మూ కశ్మీర్‌లోని మచిల్ సెక్టార్లో ఆదివారం రోజు ఉగ్రవాదులు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు భద్రతా దళాల సిబ్బంది మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహేష్(25) కూడా మరణించాడు. మహేష్ సంవత్సరం క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతని మృతితో కోమాన్‌పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మహేష్ మరణించాడని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
హిమపాతంతో ఇద్దరు జవాన్ల మృతి
జమ్మూ: హిమపాతం కారణంగా ఇద్దరు ఆర్మీ జవాన్లు శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. లద్ధాఖ్లోని దక్షిణ సియాచిన్ హిమానీనదం వద్ద సుమారు 18 వేల అడుగుల ఎత్తులో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా హిమపాతం సంభవించిందని రక్షణ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కలియా తెలిపారు. హిమపాత సహాయక బృందం ఘటనా స్థలానికి చేరుకుందని, పెట్రోలింగ్ నిర్వహిస్తున్న వారందరినీ గుర్తించి బయటకు తీయగలిగామని ఆయన చెప్పారు. హిమపాతంలో చిక్కుకున్న బాధితులను రక్షించడానికి ఆర్మీ హెలికాప్టర్ల సేవలను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. వైద్య బృందాలు శాయశక్తులా ప్రయత్నించాయని, అయితే ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు తెలిపారు. -
కుటుంబ సభ్యులను కాల్చి... ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్ ఫైజాబాద్‌లోని అయోధ్య కొట్వాలీ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఆర్మీ జవాను రమేష్ సింగ్ (40) తన భార్య, ఇద్దరు పిల్లలను తుపాకితో కాల్చి హత్య చేశాడు. అనంతరం రమేష్ సింగ్ తనకుతాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కథనం ప్రకారం... ఛండీగఢ్ ఆర్మీ యూనిట్లో పని చేస్తున్న రమేష్ సింగ్ సెలవుపై ఫైజాబాద్ వచ్చాడు. ఇంటివచ్చిన అతడు ఎంత కొట్టిన తలుపు తీయకపోవడంతో ఆగ్రహించిన గోడ దూకి ఇంట్లోకి వెళ్లాడు. అనంతరం భార్య కుసుమ్ (26)తో అతడు గొడవపడ్డాడు. ఆ క్రమంలో రమేష్ ఆగ్రహంతో ఊగిపోతు భార్యను తుపాకితో కాల్చాడు. అనంతరం ఇద్దరు చిన్నారులు రియా (7), శేషు (5)లను కాల్చి చంపాడు. అనంతరం తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. తుపాకీ శబ్దం వినపడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న రమేష్ సింగ్‌తోపాటు అతని కుటుంబ సభ్యుల మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.