
జమ్మూ: హిమపాతం కారణంగా ఇద్దరు ఆర్మీ జవాన్లు శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. లద్ధాఖ్‌లోని దక్షిణ సియాచిన్ హిమానీనదం వద్ద సుమారు 18 వేల అడుగుల ఎత్తులో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా హిమపాతం సంభవించిందని రక్షణ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కలియా తెలిపారు. హిమపాత సహాయక బృందం ఘటనా స్థలానికి చేరుకుందని, పెట్రోలింగ్ నిర్వహిస్తున్న వారందరినీ గుర్తించి బయటకు తీయగలిగామని ఆయన చెప్పారు. హిమపాతంలో చిక్కుకున్న బాధితులను రక్షించడానికి ఆర్మీ హెలికాప్టర్ల సేవలను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. వైద్య బృందాలు శాయశక్తులా ప్రయత్నించాయని, అయితే ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment