
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)ను హిమపాతం ఇంకా వీడటం లేదు. లాహౌల్ స్పితి జిల్లాలో ఎడతెగని రీతిలో భారీగా మంచు కురుస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో గత రెండు రోజుల నుంచి అడపాదడపా ఇదే పరిస్థితి ఏర్పడుతోంది. భారీగా మంచు పడుతున్న నేపధ్యంలో లాహౌల్ స్పితి జిల్లాలోని పాఠశాలలు, విద్యాసంస్థలను మూసివేయాలని రాష్ట్ర విద్యాశాఖ అదేశాలు జారీ చేసింది.
Manali Update: Road is blocked near Dhundhi Bridge due to an avalanche Travelers are advised to avoid the route until further notice. Stay updated and travel safely.- Lahaul-Spiti Police#manali #snowfall @HP_SDRF @PoliceKullu @himachalpolice @CMOFFICEHP #HimachalPradesh pic.twitter.com/VwILGzYK7y
— Vinod Katwal (@Katwal_Vinod) February 27, 2025
గడచిన మూడు రోజులుగా లాహౌల్ స్పితి(Lahaul Spiti)లో హిమపాతం కురుస్తోంది. నేడు (గురువారం) సిమ్లాలో తేలికపాటి వర్షం కుర్తుస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మనాలి సమీపంలోని ధుండిలో కొండచరియలు విరిగిపడిన కారణంగా, లేహ్ మనాలి హైవేను మూసివేశారు. దీంతో మనాలిలోని సోలాంగ్ వ్యాలీని దాటి ముందుకు వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. అటల్ టన్నెల్ దక్షిణ, ఉత్తర పోర్టల్‌లలో రెండు అడుగుల ఎత్తున మంచు పేరుకుపోయింది.
ఇటువంటి పరిస్థితిలో స్థానికులు తమ ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని అధికారులు సూచించారు. ధర్మశాలలో భారీ వర్షం కారణంగా పోలీసు నియామక ప్రక్రియను మార్చి 9కి వాయిదా వేశారు. వాతావరణ శాఖ(Meteorological Department) తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రోహ్తాంగ్ పాస్ వద్ద దాదాపు రెండున్నర అడుగుల మేరకు మంచు కురిసింది. ఈ కారణంగా ఫిబ్రవరి 19 నుండి లాహౌల్ స్పితికి హెచ్‌ఆర్‌టీసీ బస్సు సర్వీసులను నిరవధికంగా నిలిపివేశారు. ఫిబ్రవరి 26- 28 మధ్య భారీ వర్షాలు/హిమపాతం సంభవించే అవకాశం ఉన్నందున హిమాచల్ ప్రదేశ్‌లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఇది కూడా చదవండి: Marathi Language Day: దేశంలో ‘థర్డ్ లాంగ్వేజ్’
Comments
Please login to add a commentAdd a comment