holiday
-
పండగైనా బ్యాంకులు పనిచేయాల్సిందే: ఆర్బీఐ
మార్చి 31, 2025 (సోమవారం) ప్రభుత్వ సెలవు దినం అయినప్పటికీ.. అన్ని బ్యాంకులు పనిచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశించింది. 2024-25 ఆర్ధిక సంవత్సరం ముగింపు రోజు కాబట్టి.. అన్ని లావాదేవాలను అదే రోజు నమోదయ్యేలా చూసేందుకు సెలవు రద్దు చేయడం జరిగింది.2025 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. కాబట్టి అప్పటికే పన్ను చెల్లింపులు (ఆదాయపు పన్ను, జీఎస్టీ, కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలు), పెన్షన్ చెల్లింపులు, ప్రభుత్వ సబ్సిడీలు, ప్రభుత్వ జీతభత్యాల చెల్లింపు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రజా లావాదేవీలను ముగించాల్సి ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.నిజానికి మార్చి 31 రంజాన్ పండుగ, ఈ కారణంగానే.. దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు. ఆర్ధిక సంవత్సరం చివరి రోజు కావడంతో ఆ రోజు బ్యాంకులన్నీ పనిచేయాలని.. ఆర్ధిక కార్యకలాపాలకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేయాలనీ ఆర్బీఐ ఆదేశించింది. అంతే కాకుండా ఏప్రిల్ 1న సెలవు దినంగా ప్రకటించింది. ఆన్లైన్ సేవలు అన్ని సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఆన్లైన్ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఉండదు. -
కలిసే దూరంగా ఉందాం!
పెళ్లయిన కొత్తలో ఆమె ఏం చెప్పినా, చేసినా అతనికి ఎంతో ఇష్టం. ఇద్దరికీ నచ్చిన ఫుడ్, నచ్చిన రంగు, నచ్చిన హాలిడే వెకేషన్. కొన్నాళ్లు గడిచాక సీన్ రివర్స్. ఏం చేసినా తప్పే. చేయకపోయినా తప్పే. టాయిలెట్ కమోడ్ మూత వేయకపోతే మాటల యుద్ధం. మంచంపై తడిసిన తువ్వాలు కనిపిస్తే పెద్ద వాగ్వాదం. ఏసీ నంబర్ పెంచినా, తగ్గించినా పట్టరానంత కోపాలు. పెద్దలు కుదిర్చిన పెళ్లికావొచ్చు మనసులు కలిపిన ప్రేమ వివాహం కావొచ్చు. కీచులాటలు కామన్. ఇలా కొట్టుకుంటూ కలిసుండే బదులు విడిపోతే బాగుండు అనే జంటలు కోకొల్లలు. శాశ్వతంగా విడిపోకుండా దూరం దూరంగా వేర్వేరు ఇళ్లలో ఉంటూ ఒకరికిపై మరొకరు గాఢమైన ప్రేమానుబంధాలను పెంచుకునే కొత్త ధోరణి ఇప్పుడు మొగ్గ తొడిగి వేగంగా విస్తరిస్తోంది. దీనికే ఇప్పుడు చాలా జంటలు ‘దూరంగా కలిసి బతకడం( లివింగ్ అపార్ట్ టుగెదర్ ) అనే కొత్త పేరు పెట్టి ఆచరిస్తున్నాయి. ఈ నయా ట్రెండ్‌లోని విశేషాలను తెల్సుకునేందుకు ఆయా జంటల జీవితాల్లోకి ఓసారి తొంగిచూద్దాం.. ఏమిటీ ఎల్ఏటీ? లివింగ్ అపార్ట్ టుగెదర్ (ఎల్ఏటీ) గురించి 19వ శతాబ్దానికి చెందిన లెబనాన్ మూలాలున్న అమెరికన్ రచయిత కహ్లిల్ గిబ్రాన్ తన ‘పెళ్లి’కవితలో తొలి సారిగా ప్రస్తావించారు. భా ర్యభర్తలు ఒకరిపై మరొకరికి ఎనలేని ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ తమ అహం కిరీటం కిందపడొద్దనే కారణంగా తమ మాటే నెగ్గాలనే మొండిపట్టుదలతో చిన్నపాటి వాగ్వాదాలకు దిగుతారు. తర్వాత బాధపడతారు. మళ్లీ అంతా సర్దుకోవడానికి కాస్తంత సమ యం పడుతుంది.ఇప్పుడున్న ఆధునిక యుగంలో భార్యాభర్తలిద్దరూ సొంత కెరీర్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. వేర్వేరు చోట్ల ఉద్యోగాలు, వృత్తుల్లో నిమగ్నమవుతున్నారు. పని కోసం వేరే చోట ఉండాల్సి రావడం, వ్యక్తిగత అభిప్రాయాలకు గౌరవించాల్సి రావడం, అన్యోన్యంగా ఉన్నాసరే కొన్నిసార్లు వ్యక్తిగత ఏకాంతం(పర్సనల్ స్పేస్) కోరుకోవడం వంటివి జరుగుతున్నాయి. వీటికి పరిష్కార మార్గంగా జంటలే తమకు తాముగా ఎల్ఏటీకి జై కొడుతున్నాయి. చినికిచినికి గాలివాన దుమారంగా మారే ప్రమాదాలను దూరం దూరంగా ఉండటం వల్ల తప్పించుకోవచ్చని జంటలు భావిస్తున్నాయి.ఒకరి అభిప్రాయాలకు మరొకరు గౌరవం ఇస్తూనే ఇలా దూరంగా ఉంటూ మానసికంగా అత్యంత దగ్గరగా ఉంటున్నామని ఎల్ఏటీ జంటలు చెబుతున్నాయి. ‘‘సాన్నిహిత్యంలోనూ కా స్తంత ఎడం ఉంచుదాం. ఈ స్వల్ప దూరా ల్లోనే స్వర్గలోకపు మేఘాల స్పర్శను స్పశిద్దాం’’అంటూ జంటలు పాటలు పాడుకుంటున్నాయని కవి గిబ్రాన్ ఆనాడే అన్నారు. ఎవరికి బాగా నప్పుతుంది?వేర్వేరు చోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే జంటలు ఈ సిద్ధాంతాన్ని ఆచరించి మంచి ఫలితాలు పొందొచ్చు. ముఖ్యమైన పనుల మీద దూరంగా, విదేశాల్లో గడపాల్సిన జంటలు ఈ మార్గంలో వెళ్లొచ్చు. వ్యక్తిగత ఏకాంతం కోరుకుంటూనే జీవిత భాగస్వామికి అత్యంత విలువ ఇచ్చే జంటలూ ఈ సిద్ధాంతం తమకు ఆమోదయోగ్యమేనని చెబుతున్నాయి. వేర్వేరు కార్యాలయాలు, భిన్న వృత్తుల్లో, విభిన్న సమయాల్లో పనిచేసే జంటలకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భాగస్వామికి అతిభారంగా మారకూడదని, ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడదామని భావించే జంటలూ ఈ ట్రెండ్‌ను ఫాలో కావొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఎలా సాధ్యం?కథలు, సినిమాల్లో, నవలల్లో ప్రస్తావించినట్లు దూరంగా ఉన్నప్పుడు ప్రేమికులను విరహవేదన కాల్చేస్తుంది. అదే వేదన ఈ జంటలకు ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. కలిసిమెలిసి ఉంటేనే బంధం బలపడుతుందన్న భావనకు భిన్నమైన సిద్ధాంతం ఇది. కాస్తంత కష్టపడితే ఈ బంధాన్నీ పటిష్టపరుచుకోవచ్చని మనోవిజ్ఞాన నిపుణులు చెప్పారు. ‘‘వారాంతాలు, సెలవు దినాల్లో ఒకరి నివాస స్థలానికి ఇంకొకరు వచ్చి ఆ కాస్త సమయం అత్యంత అన్యోన్యంగా గడిపివెళ్తే చాలు. తమ మధ్య దూరం ఉందనే భావన చటక్కున మటుమాయం అవుతుంది.కలిసి ఉన్నప్పటి సరదా సంగతులు, మధుర స్మృతులను మాత్రమే టెక్ట్స్ రూపంలో సందేశాలు పంపుతూ గుర్తుచేసుకుంటూ ప్రేమ వారధికి మరింత గట్టిదనం కల్పించొచ్చు. కలిసి ఉన్నప్పుడు జరిగిన గొడవలను భూతద్దంలోంచి చూడటం మానేయాలి. ఆధునిక జంటల్లో స్వతంత్ర భావాలు ఎక్కువ. గతంతో పోలిస్తే వ్యక్తిగత ఏకాంతం ఎక్కువ కోరుకుంటారు. జీవిత భాగస్వామి ఆలోచనలకు విలువ ఇవ్వాలి. పాత, చేదు విషయాలను తవ్వుకోవడం తగ్గించాలి’’అని ఢిల్లీలోని ఎల్ఏటీ నిపుణుడు రుచీ రూహ్, మానసిక నిపుణుడు, జంటల మధ్య మనస్పర్థలను తగ్గించే డాక్టర్ నిషా ఖన్నా సూచించారు. చివరగా చెప్పేదేమంటే? విడివిడిగా జీవించే సమయాల్లో ఇద్దరి మధ్యా నమ్మకం అనేది అత్యంత కీలకం. ఆర్థిక, శారీరక, మానసిక అంశాలను నిజాయతీగా, నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా మాట్లాడుకుని కష్టాల కడలిలోనూ జీవననావ సాఫీగా సాగేలా చూసుకోవాలి. ఎప్పుడు కలవాలి? ఎక్కడ కలవాలి? ఎంతసేపు కలవాలి? ఏమేం చేయాలి? అనేవి ముందే మాట్లాడుకుంటే వేచి చూడటం వంటి ఉండవు. అనవసర కోపాలు, అపార్థాలు రావు. భారత్‌లో బ్రతుకు దెరువు కోసం లక్షలాది కుటుంబాల్లో పురుషులు వేరే జిల్లాలు, రాష్ట్రాలకు వలసవెళ్తూ భార్యను గ్రామాల్లో ఒంటరిగా వదిలి వెళ్తున్నారు.విశాల దృక్పథం, మానసిక పరిణతి కోణంలో చూస్తే భారత్‌లో దశాబ్దాలుగా ఎల్ఏటీ సంస్కృతి ఉందనే చెప్పాలి. ప్రత్యేకంగా పేరు పెట్టకపోయినా నోయిడా, గుర్గావ్, ఢిల్లీ, ముంబైలలో ఇద్దరూ పనిచేసే చాలా జంటలు ఇదే సంస్కృతిని ఆచరిస్తున్నాయి. వేర్వేరు చోట్ల ఉద్యోగాలు, సొంతూర్లలో వృద్ధ తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యతల కారణంగా మెట్రో నగరాల్లో చాలా జంటలు దూరంగా ఉంటున్నాయి. పశ్చిమదేశాల్లో ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతి బాగా విస్తరిస్తోంది. -
ఆదివారం ఆశవర్కర్లకు సెలవు
సుల్తాన్‌బజార్/అఫ్జల్‌గంజ్: ఆశవర్కర్లకు ఆదివారం సెలవుగా పరిగణించడంతోపాటు పండుగ సెలవులను సైతం మంజూరు చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్య–కుటుంబ సంక్షేమ కమిషనర్ కర్ణన్ ప్రకటించారు. ఈ నిర్ణయా న్ని తక్షణమే అమలు చేస్తామన్నారు. ఆశవర్కర్లకు విధించే టా ర్గెట్లతోపాటు స్పూటమ్ డబ్బాలు మోసే విధానాన్ని రద్దు చేస్తున్నట్లు చె ప్పారు. కుష్టు వ్యాధి నివారణ, పల్స్‌పోలియోకు సంబంధించిన పెండింగ్ డబ్బులను వారికి త్వరలోనే చెల్లిస్తామన్నారు. ఈ మేరకు తెలంగాణ ఆశవర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జయలక్ష్మి సహా ఇతర ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు. ఫిక్స్డ్ వేతనం రూ. 18 వేలు, రూ. 50 లక్షల బీమా, రిటైర్మెంట్ ప్రయోజనాలు, పెన్షన్, ప్రమోషన్, హెల్త్‌కార్డు లు, ఏటా 20 రోజుల క్యాజువల్ సెలవులు తదితర సమస్యలపై ప్రతిపాదనలతో ఫైళ్లను ప్రభుత్వానికి సమర్పిస్తామని హామీ ఇచ్చారు. రెండోరోజూ ధర్నా.. నచ్చజెప్పిన పోలీసులు అంతకుముందు జీతాల పెంపు సహా తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆశవర్కర్లు మంగళవారం కూడా ఆందోళన కొనసాగించారు. హైదరాబాద్ కోఠిలోని డీఎంహెచ్ఎస్ చౌరస్తాలో తెలంగాణ ఆశవర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో వందలాది మంది ఆశ వర్కర్లు ధర్నాకు దిగారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రస్తు త అసెంబ్లీ సమావేశాల్లోనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులు రోడ్డుపై బైఠాయించడంతో తీవ్ర ట్రాఫిక్‌జాం ఏర్పడింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు వెంటనే అక్కడికి చేరుకొని నిరసనకారులతో మాట్లాడారు. కావాలంటే డీఎంహెచ్ఎస్ ప్రాంగణంలో నిరసన తెలుపుకోవాలని నచ్చజెప్పారు. దీంతో ఆశవర్కర్లు డీఎంహెచ్ఎస్లో ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో స్పందించిన వైద్య, ఆరోగ్య–కుటుంబ సంక్షేమ కమిషనర్ కర్ణన్ యూనియన్ ప్రతినిధులను చర్చలకు పిలిచారు. చర్చల అనంతరం జాయింట్ డైరెక్టర్ రాజేశం, మరికొందరు అధికారులు నిరసనకారుల వద్దకు వెళ్లి ప్రభుత్వ హామీలను వివరించారు. ఆ పోలీసులను డిస్మిస్ చేయాలి: కేటీఆర్ ఆశవర్కర్లు సోమవారం చేపట్టిన నిరసన సందర్భంగా వారితో అనుచితంగా ప్రవర్తించిన పోలీసులను ప్రభుత్వం వెంటనే డిస్మిస్ చేయాలని బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు డిమాండ్ చేశారు. పో లీసులతో తోపులాటలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రహీంబీ అనే ఆశ వర్కర్‌ను మంగళవారం ఆయన పరామర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్సీలు మహ్మద్ అలీ, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మా జీ మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. -
వచ్చే ఏడాది 23 సాధారణ సెలవులు
సాక్షి, అమరావతి: 2025 క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించి సాధారణ సెలవులు, ఆప్షనల్ హాలిడేల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. దీనిప్రకారం 2025కు సంబంధించి మొత్తం 23 సెలవు దినాలు ప్రకటించింది. ఇందులో నాలుగు సెలవులు రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం పండుగలు ఆదివారంలో కలిసిపోవడంతో నికరంగా 19 సెలవులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులకు లభించనున్నాయి. అదే విధంగా అక్టోబర్ 2 గాం«దీజయంతి, విజయదశమి రెండూ కలిసిపోయాయి. పై అధికారికి ముందస్తు సమాచారంతో గరిష్టంగా ఐదు సెలవుదినాలను వినియోగించుకునే విధంగా 21 ఆప్షనల్ హాలిడేస్‌ను ప్రకటించింది. ఇందులో రెండు ఈద్–ఈ– గదర్, మహలాయ అమావాస్యలు ఆదివారంతో కలిసిపోయాయి. మొత్తం 12 నెలల్లో 10 నెలల్లో సెలవులు ఉండగా మే, నవంబర్ నెలల్లో ఎటువంటి సెలవులు లేవు. జనవరి, ఏప్రిల్, ఆగస్టు నెలల్లో అత్యధికంగా నాలుగేసి రోజులు సెలవులు వచ్చాయి. బ్యాంకులు వంటి ఇతర వ్యాపార సంస్థలకు నెగోషబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ద్వారా 20 సాధారణ సెలవులను ప్రకటించింది. నెలవంక దర్శనాన్ని బట్టి నిర్ణయించే రంజాన్, బక్రీద్, మొహర్రం, ఈద్ మిలాద్ ఉన్ నబీతో పాటు ఇతర హిందూ పర్వదినాల్లో ఏమైనా మార్పులు ఉంటే వాటిని ప్రచార మాధ్యమాల ద్వారా ముందుగానే తెలియచేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఈ దేశాల్లోనూ దీపావళి సెలవులు
న్యూఢిల్లీ: భారతదేశంలోని ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ఈ పండుగ సందర్భంగా పలు ప్రాంతాల్లోని ప్రజలు బంగారం, వెండి, కార్లు, పాత్రలు, కొత్త బట్టలు మొదలైనవి కొనుగోలు చేస్తారు. అన్ని విద్యా సంస్థలు, బ్యాంకులు, కార్యాలయాలకు దీపావళి రోజున సెలవు ఉంటుంది.విదేశాల్లో దీపావళి వేడుకల విషయానికొస్తే నేపాల్, బాలి, సింగపూర్ సహా పలు దేశాల్లో దీపావళి సందడి కనిపిస్తుంది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటిస్తారు. అమెరికాలో అధిక సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు దీపావళి సందర్భంగా వైట్ హౌస్‌లో దీపం వెలిగిస్తారు. అమెరికాలోని పెన్సిల్వేనియా, న్యూయార్క్‌లలో దీపావళినాడు అధికారిక సెలవుదినంగా ప్రకటించారు.ఫిజీ: 1879 నుంచి ఫిజీలో దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు.మలేషియా: మలేషియాలో ప్రభుత్వ సెలవుల జాబితాలో దీపావళి కూడా చేరింది. మారిషస్: మారిషస్‌లో హిందువుల జనాభాను పరిగణనలోకి తీసుకుని దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించారు. ఈ ద్వీపంలో దీపావళి సందర్భంగా దీపాలు వెలిగిస్తారు. ఇళ్లను అందంగా అలంకరిస్తారు.నేపాల్: నేపాల్‌లో దీపావళిని తిహార్ లేదా స్వాంతి అంటారు. అక్కడ ఈ పండుగను 5 రోజుల పాటు జరుపుకుంటారు.శ్రీలంక: శ్రీలంకలో తమిళనాడు చెందినవారు దీపావళిని జరుపుకుంటారు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ సెలవులు ఇస్తారు.సింగపూర్: దీపావళి సందర్భంగా సింగపూర్‌లో ప్రభుత్వ సెలవుదినం. లిటిల్ ఇండియాలో దీపావళి నాడు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దక్షిణాఫ్రికా, ట్రినిడాడ్, టొబాగోలో కూడా దీపావళి సందర్భంగా పబ్లిక్ హాలిడే ఇస్తారు. ఇది కూడా చదవండి: గుడిలో బాణసంచా ప్రమాదం.. 150 మందికి గాయాలు -
దీపావళి.. ఏ రాష్ట్రంలో ఎప్పుడు సెలవు?
న్యూఢిల్లీ: ప్రతి సంవత్సరం దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ చీకటి నుండి వెలుగులోకి మారే పయనాన్ని సూచిస్తుంది. దీపావళి సందర్భంగా, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ సెలవులు ప్రకటించారు. అయితే ఈసారి దీపావళిని అక్టోబర్ 31న లేక నవంబర్ 1 న జరుపుకోవాలా అనే గందరగోళం చాలామందిలో నెలకొంది. మరి.. ఈసారి దీపావళికి ఏ రాష్ట్రంలో ఎప్పుడు సెలవు ప్రకటించారో తెలుసుకుందాం.యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో దీపావళికి అక్టోబర్ 31 న సెలవు ఇచ్చారు. నవంబర్ 2 న గోవర్ధన పూజకు సెలవు ఉంటుంది. నవంబర్ 3 న భాయ్ దూజ్ పండుగను జరుపుకుంటారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో ఈ రోజుల్లో మాత్రమే సెలవు దినంగా ప్రకటించారు. అయితే నవంబర్ ఒకటి గురించి స్పష్టంగా తెలియజేయలేదు. మహారాష్ట్రలో సాధారణంగా దీపావళికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. నవంబర్ 1, 2 తేదీలలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు దీపావళి సెలవు ప్రకటించారు. దీపావళికి ముందు, తరువాత పాఠశాలలకు ఏడు నుండి 10 రోజుల వరకూ సెలవులు ఉండవచ్చు. నవంబర్ 1న ఢిల్లీలో దీపావళి సెలవు ఉంటుంది. అయితే కుటుంబ సమేతంగా ఈ పండుగను జరుపుకునేందుకు వీలుగా అక్టోబర్ 31 నుంచి నవంబర్ 3 వరకు పాఠశాలకు సెలవు ప్రకటించారు.తమిళనాడులో ఈసారి దీపావళి అక్టోబర్ 31, నవంబర్ ఒకటి తేదీల్లో రెండు రోజుల సెలవు ప్రకటించారు. గుజరాత్లో దీపావళితో పాటు నూతన సంవత్సరాన్ని కూడా జరుపుకుంటారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు దీపావళి సందర్భంగా ఇక్కడ మూడు రోజుల సెలవు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో కాళీ పూజ, దీపావళిని కలిసి జరుపుకుంటారు. నవంబర్ 1, 2 తేదీలలో ఇక్కడ దీపావళి సెలవు ఉంటుంది. కాళీ పూజ సందర్భంగా అక్టోబర్ 31న కూడా సెలవు ప్రకటించారు.దీపావళి సందర్భంగా మధ్యప్రదేశ్‌లో రెండు రోజులు సెలవులు ఇచ్చారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు నవంబర్ 1, 2 తేదీలలో మూసివేయనున్నారు. బీహార్‌లో ఈసారి దీపావళికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. నవంబర్ 1, నవంబర్ 2 న ఇక్కడ సెలవు ఉంటుంది. దీనితో పాటు ఛత్ పూజకు సెలవులను కూడా పొడిగించవచ్చు. రాజస్థాన్‌లో ఈ ఏడాది దీపావళికి మూడు రోజుల సెలవులు ఉంటాయి. అక్టోబర్ 31 నుండి నవంబర్ 2 వరకు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయనున్నారు.కర్ణాటకలో దీపావళికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. నవంబర్ 1, 2 తేదీలలో ప్రజలు ఈ పండుగను సాంప్రదాయ రీతిలో జరుపుకుంటారు. కేరళలో దీపావళికి నవంబర్ 1న సెలవు ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, ఒడిశా తదితర రాష్ట్రాల్లో దీపావళి సందర్భంగా రెండు రోజులు సెలవులు ప్రకటించారు.ఇది కూడా చదవండి: బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కిషన్‌రెడ్డి? -
HYD: కీలకఘట్టం.. 17న మహా నిమజ్జన సెలవు
సాక్షి, హైదరాబాద్: గణేష్ ఉత్సవాల్లో అత్యంత కీలకఘట్టమైన సామూహిక నిమజ్జనం ఈ నెల 17న (మంగళవారం) జరగనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఆ రోజు సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 17కి బదులుగా నవంబర్ 9(రెండో శనివారం)న పనిదినంగా ప్రకటించింది. ఈ నెల 7న మొదలైన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు 17తో ముగియనున్నాయి.నిమజ్జనాలు నేపథ్యంలో నగర పోలీసులు, అదనపు బలగాలతో కలిపి దాదాపు 25 వేల మంది బందోబస్తు, భద్రత విధులు నిర్వర్తిస్తారని కొత్వాల్ సీవీ ఆనంద్ ప్రకటించారు. నిమజ్జనంతో పాటు 19న జరగనున్న మిలాద్ ఉన్ నబీ ఊరేగింపును దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒక్క అడుగుతో మొదలై 70 అడుగులకు..హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ ఏడాది కూడా ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనాలు నిషేధించామని చెప్పిన ఆయన ఎన్టీఆర్ మార్గ్‌తో పాటు పీవీ నరసింహారావు మార్గ్‌ల్లో అవసరమైన అదనపు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. గణేష్ విగ్రహాల ఊరేగింపు జరిగే మార్గాలతో పాటు సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.మరోపక్క కమిషనరేట్‌లోని జోన్ల వారీగా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆనంద్ శుక్రవారం వెస్ట్ జోన్‌పై సమీక్షించారు. మాసబ్‌ట్యాంక్‌లో డీసీపీ కార్యాలయానికి వెళ్లిన ఆయన శాంతిభద్రతల విభాగంతో పాటు ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్, టాస్‌్కఫోర్స్ అధికారులతో సమావేశమయ్యారు. కమ్యూనల్ రౌడీలను కట్టడి చేయాలని, సోషల్ మీడియా ద్వారా వదంతులు, సున్నిత అంశాలు సంబంధించిన వీడియోలు ప్రచారం చేసే వారిపైనా నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. -
సెలవు కోసం.. తోటి బాలుడిని చంపేశారు!
న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. మదర్సాలో చదువుతున్న ఐదేళ్ల బాలుడిని తోటి బాలురే పొట్టనబెట్టుకున్నారు. మదర్సాకు సెలవిస్తే ఇంటికి వెళ్లొచ్చనే దురాచనతో, టీవీలో క్రైం షోలో చూపినట్లే చేశామని నిందితులు తెలపడంతో పోలీసులు విస్తుపోయారు.శుక్రవారం దయాళ్‌పూర్ ఏరియాలోని తలీముల్ ఖురాన్ మదర్సాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు 9, 11 ఏళ్ల ముగ్గురు బాలురను విచారించగా దారుణం వెలుగు చూసింది. మదర్సాకు సెలవిస్తారని తోటి బాలుడ్ని కొట్టి చంపినట్లు వాళ్లు ఒప్పుకున్నారు. -
విద్యార్థినులకు ‘ప్రత్యేక’ సెలవు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ (డీఎస్ఎన్ఎల్యూ) విద్యార్థినులకు నెలలో ఒక రోజు నెలసరి సెలవును ప్రకటించింది. కేవలం మెయిల్ ద్వారా ఈ ప్రత్యేక సెలవు తీసుకునే అవకాశం విద్యార్థినులకు కల్పించింది. ప్రస్తుత (2024–25) విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్టు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. నెలసరి సమయాల్లో మహిళల్లో వచ్చే కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.నెలసరి సమయాల్లో ఆరోగ్య సమస్యలతో విద్యార్థినులు కాలేజీకి వెళ్లడంలేదు. ప్రత్యేకంగా సెలవు కావాలంటే మెడికల్ సరి్టఫికెట్ సమర్పించాలి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక సెలవు కోరుతూ యూనివర్సిటీ విద్యార్థినులు గత విద్యా సంవత్సరంలోనే రిజి్రస్టార్ ముందు ఈ ప్రతిపాదన పెట్టారు. జనవరిలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దేశంలో 8 యూనివర్సిటీల్లో అమలు ఇప్పటికే దేశంలోని 7 యూనివర్సిటీల్లో ఈ విధానం అమల్లో ఉంది. రాయిపూర్‌లోని హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ, ముంబై, ఔరంగాబాద్‌ల్లో ఉన్న మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీలు, భోపాల్‌లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ, జబల్పూర్లోని ధర్మశాస్త్ర నేషనల్ లా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని నల్సార్, అసోంలోని నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జ్యుడిíÙయల్ అకాడమీల్లో ఈ వి«ధానం అమలవుతోంది. దామోదరం సంజీవయ్య నేషనల్ లా వర్సిటీ ఎనిమిదోది. -
అమెరికాలో రోహిత్ శర్మ చిల్.. ఫొటోలు చూశారా?
-
రాజస్థాన్‌లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
రుతు పవనాల రాకతో గత మూడు నాలుగు రోజులుగా రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో కోటా జిల్లా నుంచి మధ్యప్రదేశ్‌కు వెళ్లే రహదారి తెగిపోయింది. ఇక్కడి పార్వతి నది ఉప్పొంగుతుండటంతో రోడ్డుపై నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఫలితంగా షియోపూర్, గ్వాలియర్ రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.ఇక్కడికి సమీప గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. మోకాళ్లలోతు నీటి మధ్య వివిధ గ్రామాల ప్రజలు కాలం వెళ్తదీస్తున్నారు. టోంక్ జిల్లాలో భారీ వర్షం కారణంగా బిసల్పూర్ డ్యామ్ నీటిమట్టం 310.09 ఆర్ఎల్ మీటర్లకు చేరుకుంది. వరద ముప్పు పొంచివున్న నేపధ్యంలో విద్యాలయాలకు సెలవు ప్రకటించారు.జైపూర్‌లోని వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం మేవార్ ప్రాంతంలో జూలై 8 నుండి 10 వరకు భారీ వర్షాలు కురియనున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో రానున్న రెండు మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురియనున్నాయి. జులై 10 నాటికి రుతుపవనాలు మరింత బలపడతాయని, అప్పడు మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. -
నేడు 500 మంది ఉద్యోగులకు సెలవు!! కారణం తెలిస్తే..
దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి మన జట్టు వరల్డ్ కప్ గెలిస్తే ఆ సంబరం ఎలా ఉంటుంది. భారత్ టీ20 ప్రపంచ కప్ గెలవడంతో ఊరూరా సంబరాలు జరుగుతున్నాయి. తమ ఉద్యోగులు కూడా సంబరాలు చేసుకునేందుకు ఏకంగా సెలవు ఇచ్చేసిందో కంపెనీ.భారత్ టీ20 క్రికెట్ ప్రపంచకప్ విజయాన్ని పురస్కరించుకుని స్టాఫింగ్ సంస్థ ఎక్స్‌ఫెనో తన ఉద్యోగులందరికీ జూలై1న సెలవు దినంగా ప్రకటించింది. ఈ కంపెనీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఇందులో సుమారు 500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. "ఇది మా అందరికీ ఆశ్చర్యం కలిగించింది. బిల్లింగ్‌లు, పేరోల్ క్లోజర్స్ వంటివి ఉన్నందున నెలలో మొదటి రోజు సాధారణంగా బిజీగా ఉంటుంది. కానీ టీమ్ ఇండియా గొప్ప విజయాన్ని సాధించడంతో ఆ రోజును సెలవుగా ప్రకటించాలని కంపెనీ నిర్ణయించింది" అని ఎక్స్‌ఫెనో వర్క్‌ఫోర్స్ రీసెర్చ్ హెడ్ ప్రసాద్ ఎంఎస్ చెప్పినట్లుగా మనీకంట్రోల్ పేర్కొంది.ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్ ప్రపంచ కప్ యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్ సంయుక్తంగా వేదికగా జూన్ 1 నుంచి జూన్ 29 వరకు జరిగింది. ఇందులో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో రాణించి ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి కప్‌ను కైవసం చేసుకుంది. -
రేపు స్టాక్ మార్కెట్ పనిచేస్తుందా?
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం పనిచేయవు. రోజంతా ఎటువంటి ట్రేడింగ్ సెషన్లు జరగవు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) జూన్ 17 సోమవారం బక్రీద్ సందర్భంగా మూతపడనున్నాయి.ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ (సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ ఎరాక్టివ్) సెగ్మెంట్లపై ఈ మూసివేత ప్రభావం చూపుతుందని బీఎస్ఈ వెబ్సైట్ పేర్కొంది. తిరిగి జూన్ 18న ట్రేడింగ్ పునఃప్రారంభం కానుంది.ఇక మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎంసీఎక్స్) జూన్ 17న ఉదయం సెషన్‌ను మూసివేయనుంది. అయితే సాయంత్రం సెషన్లో మాత్రం సాయంత్రం 5 గంటల నుంచి 11:30/11:55 గంటల వరకు ట్రేడింగ్ కోసం తిరిగి తెరవనున్నారు. -
‘కాళేశ్వరా’నికి హాలిడే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాన్ని పరీక్షించేందుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఆరుగురితో నిపుణుల కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఎన్డీఎస్ఏ విధాన, పరిశోధన విభాగం డిప్యూటీ డైరెక్టర్ అమిత్ మిత్తల్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. మూడు బ్యారేజీల్లో ఏర్పడిన సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలు సూచించడంతోపాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిఫారసు చేయాలని... 4 నెలల్లోగా నివేదిక సమర్పించాలని గడువు విధించారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ బ్యారేజీలను పరిశీలించి నివేదిక సమర్పించాకే మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టడానికి ఆస్కారముందని ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పలుమార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వచ్చే 4 నెలలపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు హాలిడే ప్రకటించినట్లేనని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్డీఎస్ఏ కమిటీ సిఫారసులకు అనుగుణంగా జూలై తొలి వారం తర్వాతే పునరుద్ధరణ పనులు చేపట్టే అవకాశం ఉంది. నిపుణుల కమిటీ సిఫారసులు, సూచనల కోసం వేచిచూడక తప్పని పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల 6న కమిటీ బ్యారేజీల పరిశీలనకు రానుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కమిటీలో కీలక విభాగాల నిపుణులు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలపై ఏర్పాటైన కమిటీలో పలు కీలక విభాగాలకు చెందిన నిపుణులు ఉన్నారు. ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రిసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త యు.సి. విద్యారి్థ, పుణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త ఆర్.పాటిల్, సీడబ్ల్యూసీ డైరెక్టర్ (బీసీడీ) శివకుమార్, సీడబ్ల్యూసీ డైరెక్టర్ (గేట్స్)/ఎన్డీఎస్ఎఏ డైరెక్టర్ (విపత్తులు) రాహుల్ కుమార్‌సింగ్‌లు ఈ కమిటీ సభ్యులుగా, ఎన్డీఎస్ఏ డైరెక్టర్ (టెక్నికల్) అమితాబ్ మీనా కమిటీ సభ్యకార్యదర్శిగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే లోపాలను నిర్ధారించిన ఓ కమిటీ... గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్ కుంగిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు అన్నారం బ్యారేజీకి బుంగలు ఏర్పడి భారీగా నీళ్లు లీక్ అయ్యాయి. ప్రణాళిక, డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, పర్యవేక్షణ, నిర్వహణ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని గతంలో ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసిన మరో నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. అన్నారం బ్యారేజీ పునాదుల దిగువన పాతిన సెకెంట్ పైల్స్కి పగుళ్లు రావడంతోనే బ్యారేజీలో పదేపదే బుంగలు ఏర్పడుతున్నాయని మరో నివేదికలో స్పష్టం చేసింది. మూడు బ్యారేజీలను ఒకే తరహాలో డిజైన్, సాంకేతికతతో నిర్మించినందున మూడింటిలోనూ లోపాలు ఉంటాయని, అన్నింటికీ జియోఫిజికల్, జియోలాజికల్ పరీక్షలు నిర్వహించాలని అప్పట్లో సూచించింది. ఈ నేపథ్యంలో మూడు బ్యారేజీల డిజైన్లు, నిర్మాణ లోపాలపై సమగ్ర అధ్యయనం జరిపి తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 13న ఎన్డీఎస్ఏకు లేఖ రాసింది. డ్యామ్ సేఫ్టీ చట్టం–2021లోని 2వ షెడ్యూల్లోని 8వ క్లాజు కింద ఈ మేరకు కమిటీని ఏర్పాటు చేస్తూ ఎన్డీఎస్ఏ నిర్ణయం తీసుకుంది. బ్యారేజీలపై అధ్యయనం కోసం కమిటీకి ఎన్డీఎస్ఏ జారీ చేసిన విధివిధానాలు.. ► మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు తనిఖీలు నిర్వహించాలి. బ్యారేజీల స్థలం, హైడ్రాలిక్, స్ట్రక్చరల్, జియోటెక్నికల్ వంటి అంశాలకు సంబంధించిన సమస్యలను నిర్ధారించడానికి అధికారులు, కాంట్రాక్టర్లు, ఇతర భాగస్వామ్యవర్గాలతో చర్చించాలి. ► ప్రాజెక్టు డేటా, డ్రాయింగ్స్, డిజైన్ల నివేదికలు, పరీక్షలు, స్థల తనిఖీ నివేదికలు, బ్యారేజీల తనిఖీ నివేదికలు, మూడు బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత పర్యవేక్షణ, నాణ్యత హామీల నివేదికలను పరిశీలించాలి. ► బ్యారేజీ నిర్మాణంలో భాగంగా చేపట్టిన ఇన్వెస్టిగేషన్లు, డిజైన్లు, నిర్మాణం, నాణ్యత పర్యవేక్షణ, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, ఇతర వ్యవహారాల్లో పాలుపంచుకున్న భాగస్వామ్యవర్గాల (ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేటు)తో సంప్రదింపులు జరపాలి. ► బ్యారేజీల డిజైన్ల రూపకల్పనకు దోహదపడిన భౌతిక/గణిత నమూనా అధ్యయనాలను పరిశీలించాలి. (బ్యారేజీల డిజైన్ల రూపకల్పనకు ముందు ప్రయోగాత్మకంగా ల్యాబ్స్‌లలో నమూనా బ్యారేజీలను రూపొందించి వరదలను తట్టుకోవడంలో వాటి పనితీరును పరీక్షిస్తారు) ► మూడు బ్యారేజీల్లోని సమస్యలను గుర్తించి నష్ట నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, పరిష్కారాలు, చేపట్టాల్సిన తదుపరి అధ్యయనాలు/పరిశోధనలను సిఫారసు చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రతలను సూచించాలి. -
22న స్కూళ్లకు సెలవు.. ఈ రాష్ట్రాల్లోనే..
ఈ నెల 22న అయోధ్యలోని రామాలయంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ వేడుకకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంపై దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్సాహం నెలకొంది. ఈ నేపధ్యంలోనే ఆ రోజు పలు రాష్ట్రాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో ఆ రోజు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. ఏ రాష్ట్రాల్లో ఈ నెల 22న పాఠశాలలకు సెలవులు ప్రకటించారంటే.. ఉత్తర ప్రదేశ్ ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 22న పాఠశాలలకు సెలవుపై ఆదేశాలు జారీ చేశారు. జనవరి 22న రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలతో పాటు మద్యం దుకాణాలను కూడా మూసివేస్తున్నట్లు యోగి తెలిపారు. ఆ రోజున ఏ విద్యా సంస్థలనూ తెరవరు. మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్‌లోనూ పాఠశాలలు, కళాశాలలకు 22న సెలవు ప్రకటించారు. ఈమేరకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పెద్ద పండుగలాంటిదని సీఎం పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో ఆ రోజు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి గోవా 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా గోవా ప్రభుత్వం.. ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలకు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్ ఛత్తీస్‌గఢ్‌లో కూడా జనవరి 22న పాఠశాలలు, కళాశాలలు మూసివేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసింది. హర్యానా హర్యానాలో కూడా రామ్‌లల్లా పవిత్రోత్సవంనాడు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు మూసివేయనున్నారు. ఆ రోజున మద్యం దుకాణాలను కూడా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది కూడా చదవండి: ఢిల్లీ, ముంబైలకు పోటీనివ్వనున్న అయోధ్య స్టార్ హోటళ్లు! -
ఇండియాలో చూడాల్సిన హాలిడే డెస్టినేషన్స్ ప్రదేశాలు
-
TN: తమిళనాడును వదలని భారీ వర్షాలు
చెన్నై: తమిళనాడును భారీ వర్షాలు విడిచిపెట్టడం లేదు. మొన్నటి దాకా చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసిన వర్షాలు ప్రస్తుతం దక్షిణ తమిళనాడును ముంచెత్తుతున్నాయి. తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, టెన్‌కాశి జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. దీంతో ప్రభుత్వం ఈ జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలతో పాటు బ్యాంకులు,ప్రైవేటు సంస్థల ఆఫీసులకు సెలవు ప్రకటించింది. దక్షిణ తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి అక్కడి పరిస్థితి గందరగోళంగా తయారైంది. పలు చోట్ల వరదలు పోటెత్తుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచి రవాణాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దక్షిణ తమిళనాడులోని జిల్లాలతో పాటు దక్షిణ కేరళ, లక్షద్వీప్‌లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ‘కన్యాకుమరి, తిరునల్వేలి, తూత్తుకుడి, టెన్‌కాశీ జిల్లాల్లో భారీ వర్షాల వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాం. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్డీఆర్ఎఫ్)కు చెందిన 250 మంది సిబ్బందిని సహాయక చర్యల కోసం నియమించాం’ అని తమిళనాడు రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి రామచంద్రన్ తెలిపారు. ఇదీచదవండి..ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్ -
‘కేంద్ర మంత్రి వైఖరి విచారకరం.. మహిళల బాధను విస్మరించారు’
సాక్షి, హైదరాబాద్: మహిళల బాధను కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ విస్మరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వాస్తవిక సవాళ్ల పట్ల సానుభూతి చూపకపోవడం విస్తుగొల్పుతోందని తెలిపారు. విధానాల రూపకల్పనకు, వాస్తవికతకు మధ్య అంతరాన్ని పూడ్చాల్సిన సమయం ఇదని అన్నారు. మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇవ్వాలన్న ప్రతిపాదనను స్మృతీ ఇరానీ వ్యతిరేరించడాన్ని ఆమె తప్పుపట్టారు. కేంద్ర మంత్రి వైఖరి నిరుత్సాహపరిచిందని, మహిళల బాధను కేంద్ర మంత్రి విస్మరించారని ‘ఎక్స్’లో అసహనం వ్యక్తం చేశారు. రుతుక్రమ పోరాటాలను రాజ్యసభలో కేంద్ర మంత్రి కొట్టిపారేయడం విచారకరమని, మహిళల బాధలను స్మృతీ ఇరానీ విస్మరించడం దారుణమని పేర్కొన్నారు. “నెలసరి ఎంపిక కాదు. అది సహజమైన జీవ ప్రక్రియ. వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడం అసంఖ్యాకమైన మహిళలు అనుభవిస్తున్న బాధను విస్మరించినట్లే. మహిళలు ఎదుర్కొంటున్న వాస్తవిక సవాళ్ల పట్ల సానుభూతి చూపకపోవడం విస్తుగొల్పుతోంది. విధానాల రూపకల్పనకు, వాస్తవికతకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాల్సిన సమయం ఇది’ అని కవిత తెలిపారు. Disheartened by the Union Minister of Women and Child Development Smriti Irani Ji’s dismissal of menstrual struggles in Rajya Sabha. As a woman, it's appalling to see such ignorance, for our struggles, our journeys isn’t a consolation, it deserves a level playing field and that’s… pic.twitter.com/vj9wbb0A4f — Kavitha Kalvakuntla (@RaoKavitha) December 15, 2023 గురువారం జనతాదళ్(యూ) సభ్యుడు మనోజ్ కుమార్ ఝా రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా స్మృతి.. నెలసరి అనేది మహిళల జీవితంలో ఒక సహజ ప్రక్రియ. అదేం వైకల్యం కాద అన్నారు. నెలసరికి ప్రత్యేకంగా వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటించాల్సిన అవసరం లేదని పేర్కొన్న విషయం తెలిసిందే. చదవండి: నెలసరి లీవ్ అవసరం లేదు -
నెలసరి లీవ్ అవసరం లేదు
న్యూఢిల్లీ: ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు నెలసరి రోజుకు వేతనంతో కూడిన సెలవుదినంగా కొన్ని దేశాల్లో పాటిస్తున్నారు. భారత్‌లోనూ మహిళా ఉద్యోగులకు నెలసరికి పెయిడ్ లీవ్ ఇవ్వాలన్న డిమాండ్ పెరిగిన నేపథ్యంలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మహిళా మంత్రి స్మృతి ఇరానీ ఒక స్పష్టతనిచ్చారు. జనతాదళ్(యూ) సభ్యుడు మనోజ్ కుమార్ ఝా రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా స్మృతి వివరణ ఇచ్చారు. ‘‘ నెలసరి అనేది మహిళల జీవితంలో ఒక సహజ ప్రక్రియ. అదేం వైకల్యం కాదు. దీనికి ప్రత్యేకంగా వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటించాల్సిన అవసరం లేదు. నెలసరిని ప్రత్యేక సెలవు ఇవ్వాల్సిన సందర్భంగా పరిగణించకూడదు. నెలసరిని ఒక ఆటంకంగా కూడా భావించకూడదు. ఒకవేళ ఉద్యోగినులకు ఒక పెయిడ్ లీవ్ ఇస్తే తోటి పురుషులు తమకు ఒక సెలవు లభించలేదే అని భావించి పని ప్రదేశాల్లో వివక్షపూరిత వాతావరణం నెలకొనే ప్రమాదం ఉంది’’ అని ఇరానీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నెలసరి శుభ్రత విధాన ముసాయిదాను కేంద్రం తీసుకొచి్చందని ఆమె గుర్తుచేశారు. 10–19 ఏళ్ల టీనేజర్లలో నెలసరి శుభ్రతపై అవగాహన పెంచేందుకు కేంద్రం ఇప్పటికే ప్రత్యేక పథకాన్ని అమలుచేస్తోందని ఆమె వెల్లడించారు. మరోవైపు, ‘‘నెలసరి రోజుల్లో చాలా మంది ఉద్యోగినులు ఇబ్బందులు పడుతూ అది పని ప్రదేశాల్లో ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. వీరికి నెలసరి సెలవు లేదా సిక్ లీవ్ లేదా నెలకో సంవత్సరానికో సగం వేతనంతో కూడిన సెలవు ఇవ్వొచ్చు’’ అని సిబ్బంది, శిక్షణ వ్యవహారాలు, న్యాయ, సాధికారత వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒక నివేదికలో పేర్కొనడం గమనార్హం. -
అమెరికాలో ఘనంగా హాలిడే పార్టీ.. పాల్గొన్న400 మంది సీఈవోలు
అమెరికాలో ఐటీ సర్వ్ అలయెన్స్ నార్త్ ఈస్ట్ చాప్టర్ వార్షిక ఫ్యామిలీ హాలిడే పార్టీ నిర్వహించింది. నార్త్ ఈస్ట్ చాప్టర్ అధ్యక్షుడు కళ్యాణ్ విజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్లో 400 మందికి పైగా కంపెనీ సీఈవో(CEO)లు పాల్గొన్నారు. కుటుంబంతో కలిసి హాజరైన పలువురు ప్రవాసులు ఈ పార్టీలో పాల్గొని సందడి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సింగర్స్ తమ గాత్రంతో మైమరిపించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ఎంతో ఘనంగా హాలీడే పార్టీని నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల కమ్యూనికేషన్ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఈ పార్టీలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి కళ్యాణ్ విజయ్ ధన్యవాదాలు తెలిపారు. కాగా ఐటీ సర్వ్ అలయెన్స్ అనేది ఐటీ రంగానికి చెందిన 1400 కంపెనీలతో ఏర్పడిన ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అమెరికాలోని 22 రాష్ట్రాలలో ఉన్న 19 చాప్టర్లలో ఈ సంస్థ ఐటీ సేవలను అందిస్తోంది. ఈ సంస్థలో ఉన్న ఐటీ కంపెనీల మొత్తం ఆదాయం 10 బిలియన్ డాలర్లు. లక్ష మంది ఐటీ నిపుణులు ఈ సంస్థల్లో పనిచేస్తున్నారు. -
నేడు విద్యా సంస్థలకు సెలవు
సాక్షి, అమరావతి: తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు బుధవారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తుపాను తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్‌గౌర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం కూడా కాకినాడ నుంచి నెల్లూరు వరకు ఉన్న జిల్లాల్లో విద్యా సంస్థలు తెరవరాదని ఆదేశించారు. -
Bank Holidays: డిసెంబర్లో బ్యాంకు సెలవులు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..
డిసెంబర్ 2023లో బ్యాంకులకు 18 రోజులు సెలవులు రానున్నాయి. ఈ నెలలో ఐదు ఆదివారాలు ఉన్నాయి. ఈ ఐదు ఆదివారాలు, రెండు,నాలుగో శనివారాలతో కలిపి ఈ నెలలో 18 రోజులు బ్యాంకులు బంద్ అవ్వనున్నాయి. ఇందులో ఆర్బీఐ హాలిడే లిస్టుతో పాటు ప్రాంతీయ సెలవులు, సమ్మె దినాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం డిసెంబర్ నెలలో బ్యాంకులకు రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలు, క్రిస్మస్తో కలిపి 8 రోజులు సెలవులు ఉన్నాయి. పనుల నిమిత్తం నేరుగా బ్యాంకుకు వెళ్లేవారు ఏయే తేదీల్లో బ్యాంకులు మూతపడుతాయో తెలుసుకుంటే మేలు. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ.. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలు మాత్రం యథావిధిగా వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఇదీ చదవండి: వాట్సాప్ న్యూ సీక్రెట్ ఫీచర్.. ఎలా సెట్ చేయాలంటే? డిసెంబర్లో బ్యాంక్ సెలవులు డిసెంబర్ 1: రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం ఇటానగర్, కోహిమా బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 3: ఆదివారం సెలవు డిసెంబర్ 4: సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ, గోవాలోని పనాజీలో సెలవు. డిసెంబర్ 9: రెండో శనివారం సెలవు. డిసెంబర్ 10: ఆదివారం సెలవు. డిసెంబర్ 12: లోసంగ్/ పా తోగన్ కారణంగా షిల్లాంగ్‌లో సెలవు. డిసెంబర్ 13, 14: లోసంగ్/ పా తోగన్ కారణంగా గాంగ్టక్లో బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 17: ఆదివారం సెలవు. డిసెంబర్ 18: షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 19: గోవా విమోచన దినోత్సవం, పనాజీలో సెలవు. డిసెంబర్ 23: నాలుగో శనివారం. డిసెంబర్ 24: ఆదివారం సెలవు. డిసెంబర్ 25: క్రిస్మస్ సెలవు. డిసెంబర్ 26: ఐజ్వాల్, కోహిమా, షిల్లాంగ్‌లలో క్రిస్మస్ సెలవు. డిసెంబర్ 27: క్రిస్మస్ కారణంగా కోహిమాలో సెలవు. డిసెంబర్ 30: యు కియాంగ్ కారణంగా షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 31: ఆదివారం సెలవు. -
నేడు వేతనంతో కూడిన సెలవు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 30న రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు వేతనంతో కూడిన సెలవును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నెగోషియబుల్ ఇన్‌స్రూ్టమెంట్ యాక్ట్ 1881 కింద ఈ మేరకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గత అక్టోబర్ 16న ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ ఫ్యాక్టరీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1974 కింద అన్ని పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, ఇతర ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగులు, కార్మికులు, కూలీలు, ఇండ్రస్టియల్ అండర్‌టేకింగ్స్, ఎస్టాబ్లిష్మెంట్స్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ ఈనెల 15న రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణీకుముదిని ఉత్తర్వులు జారీచేశారు. ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వని పక్షంలో కార్మిక, ఎన్నికల చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ ఆదేశించారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలుఏర్పాటు చేస్తే సెలవులు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఏవైనా ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల భవనాల్లో పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఆయా కార్యాలయాలు, సంస్థల ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులను ప్రకటించే అధికారాన్ని స్థానిక జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. నవంబర్ 29న పోలింగ్‌కు ముందు రోజు, 30న పోలింగ్ రోజు, డిసెంబర్ 3న కౌంటింగ్ రోజు అక్కడి ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును ప్రకటించాలని సూచించింది. అన్ని పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు ఇతర ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగులు, కార్మికులు, కూలీలకు గురువారం వేతనంతో కూడిన సెలవును రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈమేరకు సంబంధిత సంస్థల యాజమాన్యాలకు సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
రేపు సెలవు ఇవ్వడం లేదు.. ఈసీకి వరుస ఫిర్యాదులు
హైదరాబాద్: రేపు (నవంబర్ 30) జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కంపెనీల యాజమాన్యాలు సెలవు ఇవ్వడం లేదంటూ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు వెల్లువెత్తాయి. నగరంలోని పలు ఎంఎన్సీ కంపెనీలకు చెందిన ఉద్యోగులు ఎలక్షన్ కమిషన్‌కు సంబంధించిన ఓటర్ హెల్ప్‌లైన్ 1950 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేస్తున్నారు. ఓటేసేందుకు గురువారం తమ కంపెనీల యాజమాన్యాలు సెలవు ఇవ్వడం లేదని వాపోతున్నారు. పని చేయాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తున్నారని, ఉద్యోగం కావాలా? ఓటు కావాలా? అంటున్నారని సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లందరూ ఓటు వేసేలా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పోలింగ్ రోజున సెలవు ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే కొన్ని ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలు తమకు సెలవు ఇవ్వడం లేదంటూ ఉద్యోగులు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. -
ముగిసిన ప్రచార గడువు, అమల్లోకి నిషేధాజ్ఞలు, 144 సెక్షన్
సాక్షి, హైదరాబాద్: ‘ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా మంగళవారం రాత్రి మొదలు నిరంతర పర్యవేక్షణ పోలింగ్ పూర్తయ్యే వరకూ కొనసాగుతుంది. ప్రతి వాహనాన్నీ తనిఖీ చేయాలని ఆదేశించాం. ప్రతి ఫిర్యాదుపై దగ్గర్లోని వీడియో సర్వేలన్స్ బృందాలు వెళ్లి విచారణ చేస్తాయి.’అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. ఓటర్లకు డబ్బులు, మద్యం, ఇతర కానుకల పంపిణీని కట్టడి చేసేందుకు కంట్రోల్ రూమ్ ద్వారా 24్ఠ7 పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించారు. అన్ని చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా కంట్రోల్ రూమ్స్ నుంచి పర్యవేక్షిస్తామని చెప్పారు. రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల ఏర్పాట్లను మంగళవారం ఆయన బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. స్థానికేతరులందరూ వెళ్లిపోవాలి... ఎన్నికల ప్రచారానికి తెరపడిందని, మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ ప్రారంభమైందని వికాస్ ప్రకటించారు. రాజకీయ, ప్రచార కార్యక్రమాలపై నిషేధాజ్ఞలతో పాటు 114 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులందరూ నియోజకవర్గాలను విడిచి తక్షణమే వెళ్లిపోవాలని ఆదేశించారు ప్రతి పార్టీ నిషేధాజ్ఞలు పాటించాలి నిషేధాజ్ఞలను అనుసరించాలనీ, టీవీ, సినిమా, రేడియో వంటి ప్రసార మాధ్యమాల ద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయకూడదనే నిబంధనలను పాటించాలని అన్ని రాజకీయ పార్టీలకు వికాస్‌రాజ్ సూచించారు. ఒపీనియన్ పోల్స్‌పై నిషేధం ఉంటుందన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత అర్ధ గంట వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించరాదని స్పష్టం చేశారు. ఎల్రక్టానిక్ మీడియా, సోషల్ మీడియాలో ఎలాంటి రాజకీయ ప్రకటనలు ఇవ్వరాదన్నారు. మీడియా సర్విఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఆమోదంతోనే పత్రికల్లో ప్రకటనలు జారీ చేయాలని సూచించారు. బల్క్ ఎస్ఎంఎస్లు, వాయిస్ మెసేజేస్లపై నిషేధం ఉంటుందన్నారు. ఎన్నికలకు సంబంధించి పార్టీల స్టార్ క్యాంపైనర్లు పత్రికా సమావేశాలు పెట్టరాదని, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదని స్పష్టం చేశారు ఈవీఎంల తరలింపును ఫాలో కావచ్చు.. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం నిర్వహించడం, మొబైల్ ఫోన్స్, కార్డ్‌లెస్ ఫోన్లు, వాహనాలతో రావడంపై నిషేధం ఉంటుందని వికాస్‌రాజ్ తెలిపారు. అభ్యర్థులు పోలింగ్ కేంద్రానికి ఓటర్లను తీసుకుని రావడం, తీసుకెళ్లడం కోసం వాహనాలను సమకూర్చడం నేరమని హెచ్చరించారు. ఈవీఎంల మూడో ర్యాండమైజేషన్ పూర్తయిందని, పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల కేటాయింపుపై మంగళవారం రాత్రిలోగా నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేందాలకు బుధవారం ఉదయం పోలింగ్ సిబ్బంది వచ్చాక వారికి ఈవీఎంలను ఇచ్చి పోలింగ్ కేంద్రాలకు పంపిస్తారన్నారు. పోలింగ్‌కు ముందు, పోలింగ్ తర్వాత ఈవీఎంలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించే సమయంలో అభ్యర్థుల ఏజెంట్లు తమ వాహనాల్లో ఫాలో కావచ్చని సూచించారు. నిర్దేశిత రూట్లలోనే ఈవీఎంలను రవాణా చేయాల్సి ఉంటుందని, మధ్యలో ఎక్కడా ఆగకూడదని స్పష్టం చేశారు. పోలింగ్ రోజు అభ్యర్థి ఒక వాహనం వాడడానికి మాత్రమే అనుమతిస్తామని, ఏజెంట్‌కు మరో వాహనం అనుమతి ఉంటుందన్నారు. ఓటర్లకు రాజకీయ పార్టీలు పంపిణీ చేసే ఓటర్ స్లిప్పుల్లో అభ్యర్థి పేరు, రాజకీయ పార్టీ గుర్తు ఉండరాదన్నారు. ఏజెంట్లు ఈవీఎంల వద్దకి వెళ్లరాదు.. పోలింగ్ రోజు మాక్ పోల్ కోసం అభ్యర్థుల ఏజెంట్లు ఉదయం 5.30 గంటలకి పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సీఈఓ వికాస్‌రాజ్ సూచించారు. ప్రిసైడింగ్ అధికారులు మాక్‌పోల్ నిర్వహించిన తర్వాత వీవీ ప్యాట్ కంపార్ట్మెంట్ను ఖాళీ చేయాల్సి ఉంటుందని, కంట్రోల్ యూనిట్ మెమోరీని సైతం డిలీట్ చేయాలన్నారు. ఏజెంట్లు ఈవీఎంల వద్దకి వెళ్లరాదని, లేనిపక్షంలో ప్రిసైడింగ్ అధికారులు వారిని బయటికి గెంటివేస్తారన్నారు. పోస్టల్ బ్యాలెట్లో విఫలం కాలేదు.. పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పనలో విఫలమైనట్టు వచ్చిన ఆరోపణలను వికాస్‌రాజ్ తోసిపుచ్చారు. ఇంటి నుంచి ఓటేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో 94శాతం మందికి సదుపాయం కల్పించామన్నారు. 27,178 మంది ఇంటి నుంచే ఓటేయగా, వారిలో 15,999 మంది 80ఏళ్లుపైబడినవారు, 9459 మంది దివ్యాంగులు, 1720 మంది అత్యవసర సేవల ఓటర్లున్నారని వెల్లడించారు. మరో 10,191 మంది సర్విసు ఓటును ఎల్రక్టానిక్ రూపంలో డౌన్లోడ్ చేసుకున్నారని, డిసెంబర్ 3న ఉదయం 7.59 గంటలకు అవి సంబంధిత కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఎన్నికల విధుల్లో ఉన్న మరో 1.48 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం నాటికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సంబంధిత నియోజకవర్గానికి పంపించేందుకు గచ్చిబౌలి స్టేడియంలో ఎక్ఛేంజ్ కేంద్రం పెట్టామని ఆయన వివరించారు సెక్టోరియల్ అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు... ప్రతి నియోజకవర్గం పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాలకు ఒక్కో సెక్టోరియల్ అధికారిని నియమించామని ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా వారు స్పందించి చర్యలు తీసుకుంటారని వికాస్‌రాజ్ తెలిపారు. శాంతిభద్రతల సమస్యలొస్తే చర్యలు తీసుకునే మెజిస్టీరియల్ అధికారాలు వారికి ఉంటాయన్నారు. ఎక్కడైన ఈవీఎంలు పనిచేయని పక్షంలో తక్షణమే ప్రత్యామ్నాయ ఈవీఎంలను వారే సమకూర్చుతారని తెలిపారు. విలేకరుల సమావేశంలో అదనపు సీఈఓ లోకేష్‌కుమార్, జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహమద్, డిప్యూటీ సీఈఓ సత్యవాణి పాల్గొన్నారు. పోలింగ్ రోజు సెలవు ప్రకటించకుంటే కఠిన చర్యలు సీఈఓ వికాస్‌రాజ్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: శాసనసభ సాధారణఎన్నికల్లో ఓటేసేందుకు నవంబర్ 30న పోలింగ్ రోజు సెలవు ప్రకటించని ప్రైవేటు వ్యాపార సంస్థలు, కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ ఆదేశించారు. గత శాసనసభ సాధారణ ఎన్నికల పోలింగ్ రోజు కొన్ని ఐటీ, ఇతర ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించలేదని ఫిర్యాదులొచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఈ సారి ఎవరైనా తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించని పక్షంలో కార్మిక చట్టంతో పాటు ఎన్నికల చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ రాష్ట్ర కార్మిక శాఖకు మంగళవారం లేఖ రాశారు. -
30న హైకోర్టుకు సెలవు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈనెల 30న హైకోర్టుకు సెలవు ప్రకటిస్తూ శనివారం రిజిస్టర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టుతోపాటు జ్యుడీషియల్ అకాడమీ, లీగల్ సర్విసెస్ అథారిటీ, లీగల్ సర్విసెస్ కమిటీ, మీడియేషన్ అండ్ ఆర్బిట్రేషన్ సెంటర్‌కు ఈ సెలవు వర్తిస్తుందని చెప్పారు. ఈ సెలవు నేపథ్యంలో డిసెంబర్ 16 (శనివారం)ను పనిదినంగా ప్రకటించారు. న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టుల సిబ్బందికి సమాచారం కోసం ప్రకటన విడుదల చేసినట్లు వెల్లడించారు. -
తెలంగాణలో నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలింగ్ తేదీ నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ నిర్ణయించింది. ఈనేపథ్యంలో కర్మాగారాలు, దుకాణాలు, పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ ప్రకటనలో పేర్కొంది. -
AP: 24న దసరా సెలవు.. ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: ఈ నెల 24న దసరా సెలవు ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఏపీలోని పాఠశాలలకు అక్టోబరు 14 నుంచి 24 వరకూ దసరా సెలవులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తిరిగి అక్టోబరు 25న పాఠశాలలు తెరుచుకుంటాయని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మొత్తం 11 రోజుల పాటు పాఠశాలలకు దసరా సెలవులు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, ప్రయాణికుల సౌకర్యార్థం ఈ సారి విజయదశమి(దసరా) 5,500 ప్రత్యేక సర్వీసులను ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ నడుపుతోంది. అక్టోబర్ 13వ తేదీ నుంచి 26వ దాకా ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు.. సాధారణ ఛార్జీలతోనే ఈ సర్వీసులను ఏపీఎస్ఆర్టీసీ నడిపిస్తోంది. ఎప్పుడు.. ఎక్కడి నుంచంటే.. 13 నుంచి 22 దాకా.. దసరా ముందు రోజులలో 2,700 బస్సుల్ని, అలాగే.. పండుగ దినాలైన 23వ తేదీ నుంచి 26 దాకా(పండుగ ముగిశాక కూడా) 2,800 బస్సుల్ని నడిపించనుంది. హైదరాబాద్ నుండి 2,050 బస్సులు, బెంగుళూరు నుండి 440 బస్సులు,చెన్నై నుండి 153 బస్సులువివిధపట్టణాలకు నడపబడతాయి. విశాఖపట్నం నుండి 480 బస్సులు, రాజమండ్రి నుంచి 355 బస్సులు, విజయవాడ నుండి 885 బస్సులు, అదే విధంగా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి వివిధ ప్రాంతాలకు/ పల్లెలకు/ నగరాలకు 1,137 ప్రత్యేక బస్సుల కేటాయింపుతో రద్దీని తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. చదవండి: చంద్రబాబు ప్లాన్ రివర్స్.. టీడీపీ క్యాడర్‌కు కొత్త టెన్షన్! -
Janhvi Kapoor Paris Holiday: పారిస్‌లో చిల్ అవుతోన్న దేవర భామ జాన్వీ కపూర్! (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో స్కూళ్లకు ఇవాళ సెలవు
-
‘హలాల్ హాలిడే’ అంటే ఏమిటి? ముస్లిం యువతులకు ఎందుకంత ఇష్టం?
తాజాగా పలు ముస్లిం దేశాలలో ‘హలాల్ హాలిడే’కు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ముస్లిం మహిళలు హలాల్ హాలిడేని ఇష్టపడుతున్నారు. పలు దేశాలలోని ముస్లిం మహిళలు ఇస్లామిక్ నియమాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ, తమ హక్కుల కోసం డిమాండ్ చేయడాన్ని చూస్తుంటాం. అయితే ‘హలాల్ హాలిడే’ దీనిని భిన్నమైనది. ఇంతకీ ఈ ‘హలాల్ హాలిడే’అంటే ఏమిటి? ఈ ప్రత్యేక సెలవుల కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హలాల్ హాలిడే అంటే ముస్లింలు ఇస్లామిక్ నియమాలను అనుసరిస్తూనే ఎక్కడైనా పర్యటించడం. ఈ సమయంలో వారు మతపరమైన విలువల విషయంలో రాజీ పడాల్సిన అవసరం ఎదురుకాదు. వారు మత ఆచారాను పాటిస్తూనే కొన్ని రోజులు వారికి నచ్చిన చోట గడుపుతారు. ఇప్పుడు ఈ భావనను బలోపేతం చేస్తూ, వారికోసం అనేక హోటళ్లు తెరుచుకున్నాయి. చాలా మంది ముస్లింలు విహారయాత్రకు వెళ్లినప్పుడు వారు మద్యం అందుబాటులో లేని రెస్టారెంట్ల కోసం వెదుకుతారు. అయితే ఇప్పుడు హలాల్ హాలిడేను దృష్టిలో ఉంచుకుని పలు హోటళ్లు ఏర్పాటయ్యాయి. ఈ హోటళ్లలో మద్యం ఉండదు. ఆహారం విషయంలో కూడా మతాచారాలకు అనువైనవి అందుబాటులో ఉంటాయి. ఇంతేకాకుండా ఈ ప్రదేశాలలో దుస్తులకు సంబంధించిన నియమాలు కూడా ఇస్లాం ఆచారాల ప్రకారమే ఉంటాయి. ఎవరైనా ముస్లిం మహిళ స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లాలనుకుంటే ఆయా హోటళ్లలో ఆమెకు ఎటువంటి ఇబ్బంది ఎదురుకాదు. ఎందుకంటే ఆ హోటళ్లలో ఆమె చుట్టూ అదే నియమాన్ని అనుసరించే వారు ఉంటారు. అందుకే ముస్లిం యువతులు ‘హలాల్ హాలిడే’ను ఇష్టపడుతున్నారు. ‘హలాల్ హాలిడే’ కోసం ఏర్పాటైన ప్రాంతాల్లో నమాజ్ మొదలైన మతాచారాల కోసం ప్రత్యేక స్థలం ఉంటుంది. ఫలితంగా వారు మత నిబంధనల విషయంలో రాజీ పడాల్సిన అవసరం ఏర్పడదు. గ్లోబల్ ముస్లిం ట్రావెల్ ఇండెక్స్ ప్రకారం 2022లో హలాల్ ట్రావెల్ వ్యాపారం $ 220 బిలియన్లకు చేరుకున్నదని బీబీసీ ఒక నివేదికలో తెలిపింది. ఇది కూడా చదవండి: షాజహాన్‌కు ‘మసాలా పిచ్చి’ ఎందుకు పట్టింది? -
Independence Day 2023: స్వాతంత్య్రాన్ని ఇలా ఎంజాయ్ చేయండి!
నేటి టెక్నాలజీ యుగంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని హాలిడేగా తీసుకుని ఆనందించే వారే ఎక్కువ. స్కూలు, కాలేజీ విద్యార్థులైతే జెండా వందనం తరువాత ఇంటికెళ్లిపోవచ్చు అని తెగ సంబరపడిపోతుంటారు. కానీ డెబ్బై ఆరేళ్లుగా విరామం లేకుండ జరుపుకొంటూ నేడు 77వ వసంతంలో అడుగు పెట్టాం. దేశాన్ని పాలించే అధికారులు అధికారికంగా ఈ వేడుకలు జరిపిస్తున్నారు. బాధ్యత గల పౌరులుగా మనం ఇలా సెలబ్రేట్ చేసుకుందాం.... ► ఉదయాన్నే ఎర్రకోటపై జరిగే జెండావందనం, వివిధ కార్యక్రమాలను టీవీలో చూడాలి. డెభ్బై ఏడేళ్ల స్వాతంత్య్ర భారతం ఎంత ఎత్తుకు ఎదిగిందన్న అంశాలను ప్రత్యక్ష ప్రసారాలు చూడడం ద్వారా తెలుసుకోవచ్చు ► తరువాత ఎప్పటి నుంచో అనుకుంటున్న ప్లేసుకి ఈరోజు వెళ్లండి. ఒక రోజులో వెళ్లిరాగల ప్రాంతానికి వెళ్లి అక్కడ గడిపి మీ ఒత్తిడిని దూరం చేసుకోండి. అక్కడ స్వతంత్ర దినోత్సవాన్ని గుర్తుండిపోయేలా గడపండి. ► రోజూ వేసుకునే దుస్తులు కాకుండా భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలాంటి దుస్తులు ధరించండి. వీలైనంత వరకు డ్రెస్‌లో తెలుపు, కాషాయం, ఆకుపచ్చని రంగులు ఉండేలా చూసుకుని వేసుకోవాలి. అప్పుడు త్రివర్ణ పతాకానికి మరింత వన్నె తెచ్చిన వారవుతారు ► ఎక్కడికీ వెళ్లే ఓపిక లేనప్పుడు ఇంట్లోనే ఉండి దేశభక్తి సినిమాలు చూడండి. మీతోపాటు మీ పిల్లలకు మన దేశ చరిత్ర, ఔన్నత్యాలు తెలుస్తాయి ► మరింత ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకోవాలంటే మూడు రంగులు ఉండేలా వెరైటీ డిష్‌లు తయారు చేసుకుని తినండి ► స్వాతంత్య్ర దినోత్సవం అర్థం ఉట్టిపడేలా గాలిపటాలు ఎగరవేయండి. మూడు రంగుల్లో ఉన్న గాలిపటాలను వీలైనంత ఎత్తుకుఎగరేస్తూ మనకొచ్చిన స్వేచ్ఛను ఎంజాయ్ చేయవచ్చు ► పుస్తకాల పురుగులు అయితే దేశభక్తి పుస్తకాలను చదవండి. స్వాతంత్య్ర సమర యోధుల విజయగాధలు, వీరిలో బాగా పాపులర్ అయిన నాయకుల బయోగ్రఫీని చదివి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు ► దేశభక్తి గీతాలు వింటూ కూడా సంబరాలు జరుపుకోవచ్చు. అలనాటి పోరాట, అసామాన్య త్యాగాలను గుర్తుచేసే పాటలను వినాలి. లతా మంగేష్కర్, మహ్మద్ రఫీ, ఏఆర్ రెహ్మాన్ పాటలు మనలో నిద్రపోతున్న దేశభక్తిని తట్టి లేపుతాయి ► ఇంటి చుట్టుపక్కల వారు లేదా బంధువులు, కుటుంబ సభ్యులతో దగ్గరలో జరుగుతోన్న జెండా పండుగకు వెళ్లి రెపరెపలాడే త్రివర్ణ పతాకానికి జైహింద్ కొట్టాలి ∙దేశానికి పెద్ద సేవ చేయలేక పోయినప్పటికీ మీ చుట్టుపక్కల ఉన్న వారందరికి స్వీట్లు పంచి, నోరు తీపి చేస్తూ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోండి. ► ప్రతి భారతీయుడికి ఎంతో విలువైన బహుమతులు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు. అందుకే వీలైనంత వరకు అందరితో కలిసి జరుపుకోవాల్సిన జెండా పండుగ ఇది. సెలవు దొరికింది అని సంబరపడిపోక వీటిలో ఏ ఒక్కదాన్ని పాటించినా స్వాతంత్య్ర దినోత్సవాన్ని గౌరవించినట్లే. -
Ravindra Jadeja Enjoying Vacation: అమెరికాలో చక్కర్లు కొడుతున్న రవీంద్ర జడేజా.. వైరల్ ఫొటోలు
-
పార్కుగా మారనున్న రైల్వేస్టేషన్
పార్కుగా మారనున్న పాడుబడ్డ స్టేషన్ ఇది పాతకాలం నాటి రైల్వేస్టేషన్. దశాబ్దాలుగా వినియోగంలో లేకపోవడంతో పూర్తిగా పాడుబడింది. ఇంగ్లండ్ కెంట్ కౌంటీలోని లాయిడ్ పట్టణంలో ఉంది ఈ స్టేషన్. దీనిని 1881లో నిర్మించారు. తొలినాళ్లలో ఇక్కడకు రైళ్ల రాకపోకలు బాగానే కొనసాగేవి. అయితే, ఐదు దశాబ్దాలుగా రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. స్థానికంగా గొడవలు జరిగినప్పుడు ఇక్కడి యువకులు ఈ స్టేషన్‌పై రాళ్లు రువ్వడం, నిప్పుపెట్టడం వంటి పనులు చేస్తుండటం పరిపాటిగా మారింది. స్థానికుల దాడుల వల్ల ఈ భవంతి బాగా దెబ్బతింది. దీని గోడల నిండా ఆకతాయిలు రాసిన పిచ్చిపిచ్చి రాతలు కనిపిస్తుంటాయి. ఇన్నాళ్లకు స్థానిక అధికారులకు ఈ రైల్వేస్టేషన్‌ను పార్కుగా మార్చాలనే బుద్ధిపుట్టింది. పాడుబడిన రైల్వేవ్యాగన్లతో ఇరవై జంట క్యారవాన్లను, ఆరు సింగిల్ క్యారవాన్లను సిద్ధం చేయనున్నారు. పిల్లలు ఆడుకునేందుకు వీలుగా తగిన వసతులను ఏర్పాటు చేసి, త్వరలోనే పూర్తిస్థాయి పార్కుగా మార్చనున్నారు. (చదవండి: ఇంకో యాభై ఏళ్లలో ఆ దేశం అదృశ్యం!) -
లోన్ పట్టు..టూర్‌కు జైకొట్టు
సాక్షి, హైదరాబాద్: గతంలో మెడికల్ ఎమర్జెన్సీ, పిల్లల ఉన్నత విద్య వంటి వాటికి పర్సనల్ లోన్లు తీసుకునేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపేవారు. అందుకు భిన్నంగా ఇప్పుడు తమ ఇళ్లను ఆధునీకరించుకోవడం, ఇతర రెనోవేషన్ పనుల కోసమే కాకుండా హాలిడే టూర్‌కు వెళ్లేందుకు సైతం ఈ రుణాలు తీసుకుంటున్నట్టు వెల్లడైంది. మెట్రో నగరాలు, ప్రధాన పట్టణాలకు మించి నాన్ మెట్రో నగరాల నుంచి ఇలాంటి డిమాండ్ పెరుగుతోంది. వ్యక్తిగత రుణాలు పొందే ప్రతీ ఐదుగురిలో ఒకరు హాలిడే టూర్ కోసమే తీసుకుంటున్నట్టు ఆన్లైన్ప్లాట్ఫామ్ ‘పైసా బజార్’ తాజా సర్వేలో వెల్లడైంది. 2023 జనవరి–జూన్ మధ్య పైసాబజార్ నుంచి హాలిడే లోన్స్ తీసుకున్న వారిలో.. దేశంలోని 97 నాన్ మెట్రో నగరాలకు చెందిన వారు 68 శాతం మంది ఉండటం విశేషం. జోథ్‌పూర్, పట్నా, కాన్పూర్, ఆగ్రా, సూరత్, పాటియాలా తదితర మెట్రోయేతర నగరాల వారే ఈ రుణాలపై ఆసక్తి చూపుతున్నారు. ఇదే మెట్రో నగరాల విషయానికొస్తే... ముంబైలో 25 శాతం, బెంగళూరులో 22 శాతం, ఢిల్లీలో 20 శాతం మంది జాలీ ట్రిప్పుల కోసం రుణాలు తీసుకుంటున్నారు. అభిరుచులు మారుతున్నాయి. సెలవులను ఎంజాయ్ చేసేందుకో లేదా కొత్త కొత్త ప్రాంతాలను చూసేందుకో వెళ్లాలనుకునే వారు పెరుగుతున్నారు. దేశంలోగానీ లేదా విదేశాలకు గానీ వెకేషన్లకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో వీటి కోసం చాలామంది డబ్బు పొదుపు చేసుకుని దాంతో టూర్లకు వెళ్లేవారు. ఇప్పుడు పర్సనల్ లోన్ తీసుకుంటుండటం ట్రెండ్‌గా మారింది. నివేదికలోని ముఖ్యాంశాలివీ.. గత ఆరు నెలల్లో హాలిడే టూర్ కోసం పర్సనల్ లోన్లు తీసుకున్న వారిలో 73 శాతం దేశంలోని పర్యాటక ప్రదేశాలకు, 27 శాతం విదేశాల్లోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లారు. విదేశాల్లో హాలిడే టూర్‌కు వెళ్లాలనుకుంటే ఎక్కువగా దుబాయ్ (28 శాతం)ని ఎంచుకోగా ఆ తర్వాత థాయ్‌లాండ్ (15 శాతం),యూరప్ (10 శాతం)ను ఎంచుకుంటున్నారు. దేశంలో అయితే గోవా (23 శాతం), హిమాచల్ ప్రదేశ్ 10శాతం), ఉత్తరాఖండ్ (9 శాతం), జమ్మూకశ్మీర్ (9 శాతం)లో హాలిడే ట్రిప్‌లకు మొగ్గుచూపుతున్నారు. 2023 జనవరి–జూన్ మధ్య కనీసం 21 శాతం మంది పర్యటనల నిమిత్తం పర్సనల్ లోన్లు తీసుకున్నారు. ఇది జనవరి–మార్చి మధ్య 16 శాతం ఉండగా, ఏప్రిల్–జూన్ కాలంలో 27 శాతంగా ఉంది. హాలిడే టూర్ లోన్లు తీసుకున్న వారిలో ఉద్యోగులు 74 శాతం ఉండగా, వివిధ రంగాల నిపుణులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు (డాక్టర్లు, లాయర్లు, సీఏలు, వ్యాపారులు) 26 శాతం. ఖర్చు ఎక్కువైనా వెనుకాడట్లేదు.. హాలిడే టూర్లకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతంలో పోల్చితే హాలిడేపై వెళ్లేటప్పుడు రవాణా, వసతి, ఆహారం, ఇతర సౌకర్యాల్లో మరింత నాణ్యతను కోరుకుంటున్నారు. అందుకోసం ఖర్చు ఎక్కువైనా భరించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికోసం పర్సనల్ లోన్లు వంటి వాటిని ఎంచుకుంటున్నారు. –అజయ్ రామిడి, ఎండీ, లార్వెన్ టూర్స్, ట్రావెల్స్ -
ఆదివారం అసలు సెలవు రోజేనా! అంతకు ముందు ఇది ఉందా?
అప్పట్లో మన దేశములో ఆదివారం సెలవు రోజు కాదు. నెలలో పున్నమి, అమావాస్య రోజుల్లో మాత్రమే సెలవులు ఇచ్చేవారట. ఇదే తరువాత రోజుల్లో సామెతగా మారి -'అమావాస్యకో పున్నమికో' అంటుంటాము కదా? ఇక పోతే నేడు మనం సెలవు దినంగా భావించే ఆదివారము ఆంగ్లేయుల కాలం నుండి మొదలయింది . ఆదివారం మనకి చాలా శక్తిమంతమైన దినం. మనకు ఆ రోజు సూర్యారాధన దినము, చాలామంది అప్పట్లో సూర్యారాధన చేసేవాళ్ళు. భారతీయులు మేధస్సుకు, శక్తికి ఈ ఆదివార దీక్ష కారణం అని తెలుసుకున్న తెల్లవారు బలవంతంగా మనకి ఆదివారం సెలవును పులిమారు. ఇపుడు ఆదివారం అంటే సెలవు రోజు, మందు మాంసాల దినంగా మారింది. కానీ అంతకు ముందు ఆ రోజు మనకు ఓ సుదినం . అప్పటిలో వృత్తి విద్యల్లో ఉన్నవాళ్ళకి సెలవులు అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండేవి కావు. విద్యార్థులకు మాత్రం గురుకులాల్లో పక్షానికి నాలుగు దినాలు అనగా పాడ్యమి, ఆష్టమి, చతుర్దశి, పూర్ణీమ అమావాస్య రోజులు అవిద్య దినాలని విద్య నేర్పే వారు కాదు. మనం వాల్మీకి రామాయణములో అశోకవనంలో ఉన్న సీతమ్మను "ప్రతిపద్ పాఠశిలస్య విద్యేవ తనుతాంగతా" అని వర్ణించాడు మహర్షి . పాడ్యమినాడు పాఠాలు చదివే వాడి చదువులాగ సన్నగా చిక్కిపోయిందట సీతమ్మ. కనుక, పాడ్యమినాడు అయితే చదువుగాని, చింతనం గాని ససేమిరా ఉండేవి కావు. ఇక్కడ చింతన అంటే జరిగిన పాఠాన్ని మరొకరితో పాటు చదువడం, పరిశీలించడం తదితరాలు అని. ఐతే అవ కూడా ఆ పాఢ్యమి రోజు చేసేవారు కాదట. ఆదివారం నాడు విధిగా సూర్యోపాసన చేసేవారు. మనకు ప్రపంచములో ఉన్న ఇతర నాగరికతలో కూడా సూర్యారాధన ఉన్న విషయం తెలిసిందే. మన నుండే ఈ సూర్యారాధన ఇతర దేశాలకు వెళ్ళింది. అప్పట్లో దుకాణాలు కూడా పౌర్ణమి, అమావాస్యలకు మూసేసేవారు. ఆదివారం నాడు నేడు జల్సాలు చేస్తున్నట్టు చేయకూడదని మనకు మన వేదాలలోనే కాదు "స్త్రీ తైల మధు మాంసాని యే త్యజంతి రవేర్దినే నవ్యాధిః శోక దారిద్యం సూర్య లోకం స గచ్ఛతి" అంటూ మన సూర్యాష్టకం లో ఉంది. మానవుడు ఏ రోజున ఆ పనులు చేయకూడదని శాస్త్రాలు వక్కాణించాయో.. ఆరోజే ఆచారించి ఎంజాయ్ చేస్తున్నాం. ఆఖరికి ఆయుర్వేద శాస్త్రంలో కొన్ని వ్యాధులు, రుగ్మతలకు ఆదివారం రోజున కచ్చితంగా మద్యం మాంసం తినొద్దని రోగులకు సూచిస్తారు. వాస్తవానికి ఈ విషయాలు అందరికీ చెప్పడానికి శక్తి సరిపోకపోవచ్చు కనీసం తెలుసుకున్న కొందరైనా ఈవిషయాలను గుర్తించి.. ఆచరించినా చాలు. (చదవండి: మనిషి జీవితం విస్తరాకు.. తిన్నాక మరి ఉంచరు! నిన్ను కూడా అంతే ఏమీ లేకుండానే! -
గ్రూప్ 4 పరీక్ష: వాళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: జూలై 1న జరిగే గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పరీక్షలను నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు పరీక్షా కేంద్రాలున్న స్కూళ్లు, కాలేజీలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. ఈ క్రమంలో జూలై 8 రెండో శనివారం రోజును వర్కింగ్ డే ప్రకటించింది. రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి జులై 1న పరీక్ష జరగనుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 2,846 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు సెషన్స్‌లో గ్రూప్-4 పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్ష మొత్తం 9 లక్షల 50 వేలమంది రాయనున్నారు. ఉదయం 9 గంటల 45 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల వరకు మాత్రమే అభ్యర్థులు అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. చదవండి: గ్రూప్-4 పరీక్ష.. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఇవే.. -
జాలీ మూడ్‌లో జక్కన్న.. ఫ్యామిలీతో కలిసి!
'ఆర్ఆర్ఆర్'తో ఆస్కార్ కొట్టి, గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. ప్రస్తుతం జాలీ మూడ్ లో ఉన్నాడు. కుటుంబంతో కలిసి ఫ్యామిలీ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు రావడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. ఈ హాలీడే బ్రేక్ లో రాజమౌళి చాలా హ్యాపీగా కనిపిస్తున్నాడు. అయితే ఈ ట్రిప్ కి ఓ కారణముందని అనిపిస్తుంది. (ఇదీ చదవండి: ఒక్కో పాట కోసం రూ.3 కోట్లు.. ఆ సింగర్ ఎవరో తెలుసా?) రాజమౌళి పేరు ఇప్పుడు దేశంలో ఓ బ్రాండ్ అయిపోయింది. ఎందుకంటే 'బాహుబలి'తో టాలీవుడ్ పవర్ ఏంటో చూపించిన జక్కన్న.. గతేడాది విడుదలైన 'ఆర్ఆర్ఆర్'తో ఏకంగా ఆస్కార్ కొట్టాడు. 'నాటు నాటు' పాటకు ఈ పురస్కారం రావడంతో రాజమౌళి పేరు హాలీవుడ్ లోనూ మార్మోగిపోయింది. ఇలా దాదాపు ఏడాదిపాటు తీరిక లేకుండా చాలా బిజీబిజీగా గడిపాడు. త్వరలో మహేశ్ తో చేయబోయే సినిమాని ప్రారంభించబోతున్నాడు. ఈ రెండింటికి మధ్య కాస్త విరామం దొరకడంతో రాజమౌళి.. మొత్తం కుటుంబంతో కలిసి తమిళనాడులోని తూత్తుకుడికి వెళ్లిపోయాడు. రిసార్ట్స్ లో జక్కన్న మొక్కలు నాటుతున్న ఫొటోలని రిసార్ట్ నిర్వహకులు ఇన్ స్టా స్టోరీలో షేర్ చేయడంతో అవి వైరల్ అయిపోయాయి. వీటితో పాటు మరికొన్ని ఫొటోలు బయటకొచ్చాయి. ఇకపోతే మహేశ్-రాజమౌళి మూవీ ఆగస్టులో లాంచ్ కానుందని అంటున్నారు. షూటింగ్ వచ్చే ఏడాది నుంచి ప్రారంభమవుతుందని చెబుతున్నారు. వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఈ నటిని గుర్తుపట్టారా? అప్పుడు ఐటమ్ సాంగ్స్ ఇప్పుడేమో ఆశ్రమంలో!) -
కెప్టెన్సీ మాకు వద్దు అంటూ ట్రోల్స్ రోహిత్ శర్మ ఏం చేసాడో చూడండి..!
-
అమెరికాలో దీపావళికి సెలవు.. ప్రత్యేక బిల్లు!
వాషింగ్టన్: అమెరికాలో దీపావళిని ఫెడరల్ హాలీడేగా ప్రకటించాలని కోరుతూ అమెరికా చట్టసభ్యురాలు ఒకరు ప్రత్యేక బిల్లు (Diwali Day Act )ప్రవేశపెట్టారు. గ్రేస్ మెంగ్ శుక్రవారం ప్రతినిధుల సభ( House of Representatives)లో ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనపై పలువురు చట్టసభ్యులతో పాటు భారతీయ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. గ్రేస్ మెంగ్ వర్చువల్‌గా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మందికి దీపావళి పండుగ ఎంతో ముఖ్యమైంది. క్వీన్స్, న్యూయార్క్ లాంటి అమెరికా ప్రధాన నగరాల్లోనూ లెక్కలేనన్ని కుటుంబాలు, కమ్యూనిటీలు దీపావళిని ఘనంగా నిర్వహించుకుంటాయి. అమెరికన్ పౌరులు సైతం హుషారుగా పాల్గొనడమూ చూస్తున్నాం. ఆ వెలుగులు ప్రజల్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతాయి. కాబట్టి, ఈ పండుగను ఫెడరల్ హాలీడేగా ప్రకటించాల్సిన ఆవశ్యకత ఉంది’’ అని ఆమె వివరించారు. మరో ఈ ప్రతిపాదనపై సౌత్ ఏషియా కమ్యూనిటీతో పాటు పలువురు అక్కడి చట్టసభ్యులు హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. న్యూయార్క్‌కు చెందిన మరో చట్టసభ్యురాలు జెన్నిఫర్.. దీపావళిని అధికారిక సెలవు దినంగా గుర్తించాల్సిన అవసరం కచ్చితంగా ఉందని అంటున్నారు. అమెరికాలో 40 లక్షల మంది దీపావళి వేడుకల్లో పాల్గొంటున్నారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారామె. న్యూయార్క్ సెనెటర్ జెర్మీ కూనీ, న్యూయార్క్ సిటీ కౌన్సిల్మ్యాన్ శేఖర్ కృష్ణన్ సైతం ఈ బిల్లును స్వాగతిస్తున్నారు. శేఖర్ కృష్ణన్ న్యూయార్క్ ప్రభుత్వానికి ఎన్నికైన తొలి ఇండియన్ అమెరికన్. ఇక అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్‌లోనూ దీపావళి వేడుకలు జరుగుతుండడం చూస్తున్నదే. ఈ బిల్లు తొలుత పార్లమెంట్లో పాస్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధ్యక్షుడు సంతకంతో చట్టం అవుతుంది. ఒకవేళ దీపావళి పండుగకు గనుక సెలవు దినంగా ఆమోద ముద్ర పడితే.. అమెరికా సంయుక్త రాష్ట్రంలో ఫెడరల్ హాలీడేస్ జాబితాలో 12వదిగా నిలుస్తుంది. అమెరికాలో పబ్లిక్ హాలీడేస్(నేషనల్ హాలీడేస్)తో పాటు ఫెడరల్ హాలీడేస్(ప్రత్యేక సెలవులు) ఉంటాయి. ఈ లిస్ట్‌లో న్యూఇయర్, మార్టిన్ లూథర్ కింగ్ జయంతోత్సవాలు, వాషింగ్టన్ బర్త్‌డే, మెమొరియల్ డే, జూన్టీన్త్ నేషనల్ ఇండిపెండెన్స్ డే, ఇండిపెండెన్స్ డే, లేబర్ డే, కొలంబస్ డే, వెటరన్స్ డే, థాంక్స్‌గివింగ్ డే, క్రిస్మస్ డేలు ఉన్నాయి. -
సెగ పుట్టిస్తున్న ఎండలు.. చిల్ అవుదాం.. పద!
సాక్షి, అమరావతి: ఎండలు సెగ పుట్టిస్తున్నాయి. ఫ్యాన్ కింద కూర్చున్నా ఉక్కపోతే. ఏసీ వేసుకుంటే కొంతసేపే చల్లదనం. పగలంతా ఇదే తీరు. సాయంత్రం సరదాగా నాలుగడుగులు బయటకు వేద్దామంటే భగ్గుమనే వేడిగాలులు... ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి దగ్గర వేసవి సెలవుల్ని ఏం ఎంజాయ్ చేస్తామంటూ.. సుదీర్ఘ ప్రయాణాలకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం వేసవి ట్రిప్‌లను చూస్తే కరోనా మునుపటి స్థితిని అధిగమించేలా కనిపిస్తున్నాయని ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ సంస్థ థామస్ కుక్ (ఇండియా), ఎస్ఓటీసీ ట్రావెల్ విడుదల చేసిన ‘ఇండియా హాలిడే రిపోర్ట్–మే 2023’ వెల్లడించింది. పర్యాటకుల ప్రయాణాలు చాలాకాలంగా పెండింగ్‌లో ఉండటంతో ఎక్కువ ఖర్చు పెట్టి విదేశాలకు కూడా వెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మెజార్టీ ప్రజలు సులభంగా ప్రయాణ వీసాలు పొందే దేశాలకే మొగ్గు చూపుతున్నారు. భారతీయులకు అత్యంత ఇష్టమైన విదేశీ వేసవి విడిది ప్రాంతంగా యూరప్ అగ్రస్థానంలో నిలుస్తోంది. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ దేశాలు ప్రాధాన్య గమ్యస్థానాలుగా ఎక్కువ ట్రావెల్ బుకింగ్‌లు చేస్తున్నారు. సుదూర ప్రయాణాలకు సమయం వెచ్చించలేని పర్యాటకులు థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, దుబాయ్, అబుదాబి, ఒమన్‌తో పాటు మాల్దీవులు, మారిషస్ వంటి ద్వీపాల్లో సేద తీరేందుకు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. కొత్తగా జపాన్, దక్షిణ కొరియా పర్యటనలపై కూడా ఆసక్తి పెరిగినట్టు సర్వే నివేదిక చెబుతోంది. విచిత్రంగా అమెరికా కంటే ట్రావెల్ బుకింగ్‌లలో 20 శాతం అధికంగా ఆస్ట్రేలియాకు ఉంటున్నాయి. వీసాలు పొందడంలో ఇబ్బందుల ఫలితంగా అమెరికాకు ట్రావెల్ బుకింగ్‌లలో తగ్గుదల కనిపిస్తోంది. చల్లని కాశ్మిరానికి ఛలో! దేశీయంగా వేసవి పర్యటనలకు అనుకూలమైన గమ్యస్థానంగా కశ్మిర్‌కు మద్దతు లభిస్తోంది. ఆ తర్వాత హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, లద్ధాఖ్, ఈశాన్య ప్రాంతాలు, కేరళ, అండమాన్, గోవాతో పాటు భూటాన్‌కు వెళ్లేందుకు లగేజీలు సర్దేస్తున్నారు. సర్వేలో మెట్రో, మినీ మెట్రో నగరాలు పుణే, చండీగఢ్, కోయంబత్తూర్, టైర్ 2, 3 సిటీలైన జైపూర్, ఇండోర్, తిరుచిరాపల్లి, మధురై, నాగ్‌పూర్, సూరత్, బరోడా, భువనేశ్వర్, లక్నో, మైసూర్, విశాఖపట్నం, గౌహతి, పాటా్నలో ఆన్లైన్ ద్వారా సర్వే చేశారు. ఇందులో 40 శాతం మంది దేశీయంగా, 60 శాతం మంది విదేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు వెల్లడైంది. -
ఇది కదా అద్భుతం: ఎగ్జోటిక్ వీడియోషేర్ చేసిన ఆనంద్ మహీంద్ర
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త ఎంఅండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర మరో అద్బుతమైన వీడియోను షేర్ చేశారు. ఎన్నో ఇన్నోవేటివ్ వీడియోలతో అభిమానులను ఆకట్టుకునే ఆయన తాజాగా మరో వీడియోతో ఫాన్స్‌ను ఫిదా చేశారు. చెన్నైకి చెందిన ఒక వ్లాగర్ వీడియోలోని విశేషాలపై అబ్బురపడుతూ అసలు ఇప్పటికే ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన హాలిడే అనుభవాలలో ఒకటిగా ఎందుకు జాబితా కాలేదంటూ ప్రశంసించారు. ఆవిష్కర్తలకు సెల్యూట్ చెబుతూ సాటర్డేవండరింగ్ అనే హ్యాష్ ట్యాగ్‌తో దీన్ని ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: మలేసియాలో ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి గ్రామానికి: రారాజులా లాభాల పంట ప్రకృతి సోయగాల నడుమ మనోహరమైన మున్నార్‌లోని బబుల్ గ్లాంపింగ్లో ట్రాన్స్పరంట్గా హోటల్ గదులు ఉండటం విశేషం.హోటల్ గది నుంచే సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని ఆకాశాన్ని, చుక్కల్ని ఎంజాయ్ చేస్తూ గడవపచ్చు టాప్ లగ్జరీ హోటల్స్‌లో ఉండే అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ ఉంటాయి. ప్రేమికులకు, కొత్తజంటల రొమాంటిక్ అనుభవంకోసం ఇవి బెస్ట్ సమ్మర్ వెకేషన్స్గా బాగా పాపులర్ అయ్యాయి. (అక్షయ తృతీయ 2023: టన్నుల కొద్దీ విక్రయాలు, ఏడాదిలో షాకింగ్ ధరలు) Why isn’t this listed yet as one of the world’s most exotic holiday experiences. ( Hope it’s a net-zero facility?) Salute to the innovators who established this…On my bucket list now… 👏🏽👏🏽👏🏽 #saturdaywandering pic.twitter.com/0lQGmcwld3 — anand mahindra (@anandmahindra) April 22, 2023 -
ఆఫీస్‌కు రావద్దు.. ఇంట్లో హాయిగా నిద్రపోండి..
ఆఫీస్‌కు రాకుండా ఇంట్లో హాయిగా నిద్రపోండి.. అంటూ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది ఓ కంపెనీ. తమ ఉద్యోగుల్లో వెల్నెస్ పద్ధతులను ప్రోత్సహించేందుకు బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ మార్చి 17న అంతర్జాతీయ నిద్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికారికంగా సెలవు ప్రకటించింది. ఇదీ చదవండి: అదిరిపోయే ఫీచర్లున్న ఈ స్మార్ట్ఫోన్ల ధర రూ.15,000 లోపే.. వేక్‌ఫిట్ సొల్యూషన్స్ అనే డీ2సీ హోమ్ అండ్ స్లీప్ సొల్యూషన్స్ స్టార్టప్ కంపెనీ లింక్డ్ఇన్లో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. అది తమ ఉద్యోగులందరికీ పంపిన మెయిల్ స్క్రీన్‌షాట్. ‘సర్ప్రైజ్ హాలిడే: అనౌన్సింగ్ ది గిఫ్ట్ ఆఫ్ స్లీప్’ అనేది దాని ట్యాగ్‌లైన్. ఇదీ చదవండి: నానో సోలార్ కార్! రూ.30కే 100 కిలోమీటర్లు.. గత సంవత్సరం కూడా ఈ కంపెనీ తమ ఉద్యోగులకు ‘రైట్ టు నాప్ పాలసీ’ని ప్రకటించింది. దీని ద్వారా ఉద్యోగులందరూ తమ పని వేళల్లో 30 నిమిషాల నిద్రపోవచ్చన్న మాట. శరీరాన్ని రీఛార్జ్ చేసి పనిపై దృష్టి కేంద్రీకరించడంలో మధ్యాహ్న నిద్ర ఉపకరిస్తుందని, తద్వారా ఉత్పాదకత పెరుగుతుందని ఆ కంపెనీ భావిస్తోంది. అంతేకాకుండా ఇతర కంపెనీలు కూడా ఇలాంటి ఆలోచన చేయాలని పిలుపునిచ్చింది. ఇదీ చదవండి: కొత్త పన్ను విధానం ఏప్రిల్ 1 నుంచి... వీరికి ఒక్క రూపాయి కూడా పన్ను లేదు! -
Holi 2023: బంపరాఫర్.. స్కూల్ పిల్లలకు గురువారం కూడా సెలవు..!
లక్నో: పాఠశాల విద్యార్థలకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. హోలి పూర్ణిమ సందర్బంగా గురువారం(మార్చి9) సెలవు అని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను బుధవారం ఉదయం విడుదల చేసింది. హోలీ పండుగ సందర్భంగా ఇప్పటికే మార్చి 7, 8న రెండు రోజులపాటు సెలవులు ఇచ్చింది యూపీ ప్రభుత్వం. అయితే పండుగ బాగా జరుపుకొనేందుకు మరో రోజు కూడా కావాలనే డిమాండ్ రావడంతో అందుకు తగ్గట్టే మూడో రోజు కూడా హాలిడే ఇస్తున్నట్లు ప్రకటించింది. యూపీ బేసిక్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. उत्तर प्रदेश बेसिक शिक्षा परिषद के विद्यालयों में 9 मार्च 2023 को होली के उपलक्ष्य में अवकाश रहेगा। pic.twitter.com/9FfiYp8Wye — Department Of Basic Education Uttar Pradesh (@basicshiksha_up) March 7, 2023 కాగా.. ఉత్తర్‌ప్రదేశ్‌లో 10, 12వ తరగతి పరీక్షలు మార్చి 3,4 తేదీల్లో ముగిశాయి. మే నెలలో ఫలితాలు ప్రకటిస్తారు. అయితే తేదీపై అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరోవైపు ఈ ఏడాది హోలీని మహారాష్ట్రలో 6,7 తేదీల్లో జరుపుకోగా.. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో మాత్రం 7,8 తేదీల్లో జరుపుకొన్నారు. ఒక్క యూపీ ప్రభుత్వమే హోలీ సందర్బంగా స్కూళ్లకు మూడు రోజులపాటు సెలవులు ఇచ్చింది. దీంతో విద్యార్థులు సంతోషంలో మునిగిపోయారు. మరో రోజు సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. చదవండి: ఆ బీజేపీ ఎమ్మెల్యేకు ఈ రేంజ్లో వెల్కం.. ఏందిరా నాయనా..? -
వారానికి 4 రోజులు.. పని విధానంలో ఇదో కొత్త ట్రెండ్
సండే.. దేశంలో చాలామంది ఉద్యోగుల సేదతీర్చే రోజు.. వారమంతా పనిలో పడ్డ కష్టం నుంచి వారికి విశ్రాంతినిచ్చే ఒకే ఒక్క సెలవు రోజు.. అదే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్ కంపెనీలు, ఐటీ, అనుబంధ రంగాల వంటి వాటిలో పనిచేసే ఉద్యోగులైతే వారానికి రెండు రోజులపాటు సెలవులు పొందుతుంటారని మనకు తెలుసు. మరి వారానికి మూడు రోజులపాటు సెలవులు అందుకుంటున్న ఉద్యోగులు కూడా ఉన్నారని మీకు తెలుసా?! అదేంటి.. మన దేశంలో ఎవరిస్తున్నారని ఆలోచిస్తున్నారా? ఇంకా మన దేశంలో అమల్లోకి రాలేదులేండి... ప్రస్తుతానికి యూరప్‌లోని కొన్ని దేశాలు ఈ ట్రెండ్‌ను సెట్ చేసే పనిలో ఉన్నాయి.. అదేంటో తెలుసుకుందామా? సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి దెబ్బకు కంపెనీలు, సంస్థల పని విధానమే మారిపోయింది. అప్పటివరకు ఆఫీసుకు వెళ్లి చేసే పని బదులు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పించాయి. ఆ తర్వాత కొన్నిరోజులు ఆఫీసు నుంచి, మరికొన్నిరోజులు ఇంటి నుంచి పని (హైబ్రీడ్) చేసే పద్ధతిని అమల్లోకి తెచ్చాయి. దీనికి కొనసాగింపుగా అన్నట్లు యూరప్‌లోని కొన్ని దేశాలు వారానికి నాలుగు రోజుల పని, మూడు రోజుల సెలవుల విధానం అమలును ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో 61 కంపెనీలు 3 వేల మంది ఉద్యోగులకు 6 నెలలపాటు ఫోర్డే వీక్ విధానాన్ని పరిశీలించాయి. ఇరుపక్షాలకూ లాభమే.. వారానికి నాలుగు రోజుల పని వల్ల ఉత్పాదకత పెరగడంతోపాటు ఉద్యోగుల పని–జీవితం బ్యాలెన్స్ కూడా మెరుగైనట్లు ప్రయోగాత్మక పరిశీలనలో తేలింది. అలాగే ఉద్యోగాలు మానేసే వారి సంఖ్య తగ్గడంతోపాటు గతంలో మానేసిన వారు తిరిగి విధుల్లో చేరడం, అనారోగ్యంతో సెలవులు పెట్టే వారి సంఖ్య తగ్గడం వంటి ఎన్నో సానుకూల అంశాలు వెల్లడయ్యాయి. జీతం కంటే కూడా వారంలో ఒకరోజు పని తగ్గుదల వైపే మొగ్గుచూపుతున్నట్లు ఈ ప్రయోగంలో పాల్గొన్న వారిలో అధిక శాతం మంది ఉద్యోగులు పేర్కొన్నారు. భారత్‌లో నిపుణుల స్పందనేంటి? మన దేశంలోనూ వారానికి 4 రోజుల పని విధానంపై క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. దీనిపై కర్ణాటక అసెంబ్లీలో ఏకంగా ఓ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. రోజుకు 12 గంటలు పనిచేసే ఉద్యోగులకు వారానికి మూడు రోజులు ఆఫ్ తీసుకోవచ్చని ఇందులో పొందుపరిచారు. అయితే భారత్‌లో ఈ విధానం అమలుపై నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు ఎదురయ్యే కొన్ని సవాళ్లను అధిగమిస్తూ పక్కా ప్రణాళికలతో చేపడితేనే మన దేశంలో సత్ఫలితాలు సాధ్యమని వాల్యూ మ్యాట్రిక్స్.ఏఈ వ్యవస్థాపకుడు ఆదిత్య మాలిక్ పేర్కొన్నారు. ఈ విధానానికి తగ్గట్లుగా నియమ, నిబంధనలు ఇతర అంశాలను మార్చాల్సి ఉంటుందన్నారు. మన దేశంలో ఆతిథ్య, తయారీ, రిటైల్ రంగాల్లో నాలుగు రోజుల పనివిధానం అమలు సాధ్యం కాదని డే కొలాబ్ కో–ఫౌండర్, సీఈవో రాజేశ్వరీసింగ్ అభిప్రాయపడ్డారు. కేవలం ఈ–కామర్స్, బ్యాంకింగ్, బీమా, టెక్నాలజీ వంటి రంగాల్లోనే ఇది సాధ్యమని పేర్కొన్నారు. ఈ పని పద్ధతికి సరిపోయే పరిశ్రమ ఎంపికతోపాటు ఉద్యోగుల జీతభత్యాలు తగ్గించకుండా ఇందుకు అర్హమయ్యే సంస్థలనే ఎంపిక చేయాలని కర్మ వీ ఫౌండర్, సీఈవో ఉజ్జల్ డే సూచించారు. ప్రతి పరిశ్రమ, సంస్థకు 4 రోజుల పని విధానం సరిగ్గా వర్తించకపోవచ్చని, అయితే కోవిడ్ వ్యాప్తి తర్వాత పనిప్రదేశాలు మారిపోతున్న నేపథ్యంలో టెక్నాలజీ సహకారంతో నూతన ప్రక్రియలను చేపట్టడంలో నష్టమేమీ లేదని ఐమోచా సీఈవో అమిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఫోర్ డే వర్క్ విధానం అమలు వల్ల యాజమాన్యాలకు లేబర్ కాస్ట్‌లు, ఓవర్‌హెడ్ ఖర్చులు తగ్గడంతోపాటు ఉద్యోగులకూ వర్క్–లైఫ్ బ్యాలెన్స్ మెరుగవుతుందని జెన్లీప్ ఫౌండర్ సచిన్ తెలిపారు. ఫోర్ డే వీక్ ఆహ్వానించదగ్గదే.. మన దేశంలో ఈ విధానం పనిచేయదనుకోవడానికి లేదు. గత పదేళ్లలో భారత్ ఎంతో అభివృద్ధి చెందింది. అయితే మనం ‘మెంటల్ వెల్నెస్’కు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. రాబోయే 5–10 ఏళ్లలో దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. కొత్త పనివిధానంతో కొన్ని సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఆర్థిక రంగానికి కూడా ఉపయోగపడుతుంది. ఫైవ్ డే వీక్ బదులు రోజుకు మరో గంటన్నర, రెండు పనిగంటలు పెంచి ఫోర్ డే వీక్ చేస్తే ఉద్యోగులకు మూడు రోజులు వెసులుబాటుగా ఉంటుంది. ఈ దిశగా యాజమాన్యాలు ఆలోచించాలి. – సాక్షితో డాక్టర్ బి.అపర్ణారెడ్డి, హెచ్.ఆర్. నిపుణురాలు ఈ విధానం ఎలా అమల్లోకి...? దాదాపు వందేళ్ల కిందటే వారానికి చేసే పనిదినాలను తగ్గించాలనే ఆలోచన వచ్చిందట. ఫోర్డ్ మోటార్ కంపెనీ వ్యవస్థాపకుడు హెన్రీ ఫోర్డ్ 1926లోనే 6 రోజులపని స్ధానంలో ‘ఫైవ్ డే వీక్’విధానాన్ని ప్రవేశపెట్టారు. ఉద్యోగులు, సిబ్బంది పనిగంటలు తగ్గించినంత మాత్రాన ఉత్పాదకతపై దాని ప్రభావం పడలేదని వెల్లడైంది. దీంతో ఇతర కంపెనీలు కూడా ఈ పద్ధతిని అనుసరించడం ప్రారంభించాయి. మారుతున్న కాలం, అభిరుచులను బట్టి ఐర్లాండ్, ఐస్లాండ్, ఆస్ట్రేలియా ఇతర దేశాల్లో అమలు చేసి సత్ఫలితాలు సాధించాయి. ఈ పని పద్ధతిపై న్యూజిలాండ్, యూఎస్, కెనడా, వివిధ ఐరోపా దేశాలు ప్రయోగాలు చేశాయి. ‘ఫోర్ డే వర్క్’సిస్టమ్‌ను 2018లోనే టెక్ కంపెనీ అమెజాన్ ఎంపిక చేసిన ఉద్యోగులకు అమలు చేసింది. 2019లో జపాన్‌లో మైక్రోసాఫ్ట్ నెలపాటు ఈ పద్ధతిని పరిశీలించింది. 2020లో యూనీలివర్ న్యూజిలాండ్‌లో ఏడాదిపాటు పరీక్షించింది. తద్వారా ఈ కంపెనీలు మంచి ఫలితాలనే సాధించాయి. ఆ తర్వాత విదేశాల్లోని కొన్ని కంపెనీలు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ స్టార్టప్ ‘త్రీడే వీక్’! దాదాపు ఏడాదిన్నర క్రితమే బెంగళూరుకు చెందిన ఓ ఫిన్‌టెక్ స్టార్టప్ కంపెనీ కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి వారంలో మూడు రోజుల పనికి 80 శాతం జీతం, ఇతర సౌకర్యాలు కల్పించింది. కొత్త ఆలోచనలు, నవీన ఆవిష్కరణలపై జిజ్ఞాస పెంచేందుకు తమ ›ప్రాజెక్ట్‌లో పనిచేసే టీమ్ సభ్యులకు వారు కోరుకున్న పనివిధానంలో పనిచేసే అవకాశం కల్పించింది. -
న్యూయార్క్‌లో స్కూళ్లకు దీపావళి సెలవు.. ప్రియాంకా చోప్రా హర్షం
లాస్ఏంజెలెస్: న్యూయార్క్‌లోని పాఠశాలలకు దీపావళి పండుగ రోజును సెలవుగా ప్రకటించడంపై బాలీవుడ్ నటి, నిర్మాత ప్రియాంకా చోప్రా జొనాస్ హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని పబ్లిక్ స్కూళ్లకు 2023 నుంచి దీపావళి రోజున సెలవు ఉంటుందని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ గురువారం ప్రకటించడంపై శనివారం రాత్రి ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. తన చిన్నతనంలో న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో స్కూలుకు వెళ్లినప్పటి రోజులను గుర్తుకు వచ్చి ఏడ్చేశానని పేర్కొన్నారు. న్యూయార్క్ నగరంలో భారత సంతతికి చెందిన సుమారు 2 లక్షల మంది హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతస్తులున్నారు. వీరంతా దీపావళి పండుగను జరుపుకుంటారని, అందుకే సెలవుగా ప్రకటించాలని నిర్ణయించామని మేయర్ ఎరిక్ ఆడమ్స్ తెలిపారు. ప్రియాంకా చోప్రా ప్రస్తుతం లాస్ఎంజెలెస్లో నివాసం ఉంటున్నారు. -
దీపావళి సెలవుపై ప్రభుత్వం ప్రకటన.. పబ్లిక్ హాలీడే ఎప్పుడంటే..
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు, ఉద్యోగులకు క్లారిటీ ఇస్తూ దీపావళి పండుగ సెలవుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటక చేసింది. ఈ నెల 24వతేదీన(సోమవారం) సెలవు దినంగా ప్రకటించింది. కాగా, సెలవును 25వ తేదీ నుంచి 24వ తేదీకి మార్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. పండితులు కూడా 24వ తేదీనే జరుపుకోవాలని తేల్చి చెబుతున్నారు. పంచాంగాల్లో కూడా ఇదే విషయం పొందుపరిచి ఉందని స్పష్టం చేశారు. నిజానికి ఈనెల 25న మంగళవారం అమావాస్యగా క్యాలెండర్లలో ఉంది. సాధారణంగా ఆశ్వయుజమాసం బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగ నిర్వ హించుకోవటం ఆనవాయితీ. క్యాలెండర్లలో 25వ తేదీనే అమావాస్య ఉండటంతో పండుగ అదే రోజు ఉంటుందన్న భావన జనంలో వ్యక్తమైంది. కానీ, పంచాంగాలు మాత్రం, 25న కాదు, 24వ తేదీనే దీపావళి అని స్పష్టం చేస్తున్నాయి. ఇదీ కారణం.. దీపావళిని ప్రదోష వేళ నిర్వహించటం ఆనవాయితీ, అంటే సూర్యాస్తమయ సమయంలో నిర్వహిస్తారు. 25న మంగళవారం అమావాస్య తిథి ఉన్నా.. ప్రదోషవేళ(సూర్యాస్తమయం) వచ్చేసరికి పాడ్యమి ఘడియలు వచ్చాయి. ఆరోజు సాయంత్రం 4.25 కల్లా అమావాస్య ముగిసి పాడ్యమి వచ్చేసింది. సూర్యాస్తమయానికి అమావాస్య లేదు. 24న సోమవారం సాయంత్రం 4.25 సమయానికి అమావాస్య ప్రారంభమవుతోంది. సూర్యాస్తమయానికి అమావా స్య ఘడియలే ఉన్నందున 24న సాయంత్రాన్ని అమావాస్యగా పరిగణించి అదే రోజు దీపావాళి నిర్వహించుకోవాలని పండితులు పేర్కొంటున్నారు. అదే రోజు ధనలక్ష్మి పూజలు కూడా నిర్వహించాలని పేర్కొంటున్నారు. చాలామందికి దీపావళి రోజున కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించే సంప్రదాయం ఉంది. సాధారణంగా మధ్యాహ్నం వేళ అమావాస్య ఉన్న సమయంలో కేదారేశ్వర వ్రతం జరుపుతుంటారు. 24న మధ్యాహ్నం అమావాస్య తిథి లేనందున, మరుసటి రో జు వ్రతం జరుపుకోవాలని, కానీ ఆ రోజు సూర్యగ్రహణం ఉన్నందున, గ్రహణం విడిచిన తర్వాత గృహ శుద్ధి చేసి సాయంత్రం వేళ జరుపుకోవాలని కొందరు పండితులు పేర్కొంటున్నారు. కానీ దీపావళి రోజునే ఆ వ్రతాన్ని ఆచరించే పద్ధతి ఉన్నందున, అమావాస్య మధ్యాహ్నం లేన్పటికీ 24వ తేదీనే వ్రతం చేసుకోవాలని కొందరు పేర్కొంటున్నారు. ఈ విషయంలో కొంత భిన్నాభిప్రాయాలున్నాయి. -
జాతీయ సమైక్యత దినోత్సవం.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా రేపు(17 సెప్టెంబర్ 2022) రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం బంజారాహిల్స్‌లో ఆదివాసీ, బంజారా భవనాలను ప్రారంభిస్తారు. తర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. చదవండి: హైదరాబాద్‌పై కేంద్రం సైనిక చర్య.. ‘ఆపరేషన్ పోలో’ పేరెలా వచ్చింది? -
Telangana: గణేశ్ నిమజ్జనం సందర్భంగా నగరాల్లో సెలవు
సాక్షి, హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 9న శుక్రవారం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది. 9న సెలవు తీసుకుంటున్నందున ఈ నెల 10న రెండో శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు పనిచేస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆగస్టు 31ని పండగలా జరుపుకుంటున్న తాలిబన్లు... అంబరాన్నంటిన సంబరాలు
కాబూల్: తాలిబన్లు అఫ్గనిస్తాన్ తమ నియంత్రణలోకి తెచ్చుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తాలబన్లు తమ ఇష్టా రాజ్యంగా రకరకాల నిబంధనలు, ఆదేశాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చింది. ఇప్పుడు తాజగా తాలిబన్లు ఆగస్టు 31 బాణా సంచా కాలుస్తు పెద్దగా సంబరాలు చేసుకుంటున్నారు. వాస్తవానికి ఆగస్టు 31 అనేది యూఎస్ నేతృత్వంలోని దళాలను ఉపసంహరించుకున రోజు. ఈ సందర్భంగా తాలిబన్లు తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. యూఎస్ బలగాలు అఫ్గనిస్తాన్ పై గత 20 ఏళ్లుగా దారుణమైన యుద్ధం సాగించింది. దీంతో అఫ్గాన్ నిరంతరం యుద్ధం భయంతో మునిగిపోయింది. అంతేకాదు ఈ యుద్ధంలో వేలాది మంది అఫ్గాన్ వాసులు చనిపోవడం, లక్షలాది మంది గాయాలపాలవ్వడం వంటి విధ్వంసాన్ని చవిచూసింది అఫ్గాన్. ఈ విధ్యంసకర దాడికి ముగింపు పలకి ఆగస్టు 31న యూఎస్ తన బలగాలను అప్గనిస్తాన్ నుంచి వెనుక్కు రప్పించింది. అందువల్ల తాలిబన్లు ఈ రోజును స్వాతంత్య్ర దినోత్సవంగా పేర్కొంటూ ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా తెలిపారు. ఈ వార్షికోత్సవంను తాము వివిధ రంగుల బానసంచా కాల్పులతోనూ, వైమానిక కాల్పులతో అట్టహాసంగా జరుపుకుంటామని చెప్పారు. అంతేకాదు తాలిబన్లు అఫ్గనిస్తాన్‌లో అధికారంలోకి వచ్చిన రోజైన ఆగస్టు 15 జాతీయ సెలవుదినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి: అఫ్గాన్ పైలెట్లకు శిక్షణ ఇస్తున్న యూఎస్...ఐ డోంట్ కేర్ అంటున్న రష్యా) -
సెలవు దినాలైనా నేడు, రేపు పనిచేయనున్న 52 ఎస్బీఐ బ్రాంచ్‌లు
సాక్షి, అమరావతి: ఈ నెల 26, 27 తేదీలు (నేడు, రేపు) సెలవు దినాలైనప్పటికీ రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ తెలిపారు. ఈ రెండు రోజులు రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంపు ఫీజుల చలానాలు కట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 52 ఎస్బీఐ బ్రాంచ్‌లు ప్రత్యేకంగా పని చేయనున్నట్లు పేర్కొన్నారు. చదవండి: 29న కొత్త జిల్లాలకు తుది రూపు? ఆర్థిక సంవత్సరం చివరి రోజులు కావడంతో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ఏర్పాటు చేసింది. ఎస్బీఐ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్ ఫీజుల చలానాలు కట్టించుకునేలా ఒప్పించారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కమిషనర్ రామకృష్ణ కోరారు. -
కోవిడ్ తగ్గుముఖం.. ఈసారి సమ్మర్ వెకేషన్లకు తగ్గేదేలే! పక్కా ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లుగా బెంబేలెత్తిస్తున్న కోవిడ్ మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కోవిడ్ థర్డ్‌వేవ్ అంతమవుతున్నట్లుగా సంకేతాలు వస్తుండటంతో హాలీడే ట్రిప్‌లు, ఫారెన్ వెకేషన్లకు వెళ్లాలనుకునేవారిలో కొత్తఆశలు చిగురిస్తున్నాయి. రెండు, మూడురోజుల వీకెండ్, షార్ట్ ట్రిప్‌లకు వెళుతున్నవారూ ఉన్నారు. 2020 నుంచి రెండు వేసవికాలాల్లో సరదాగా దూర ప్రాంత విహారాలకు వెళ్లి అవకాశాలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో ఈసారి సమ్మర్ వెకేషన్లకు వెళ్లడానికి ముందు నుంచే చాలామంది ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు 2, 3 రోజుల చిన్న ట్రిప్, వీకెండ్ టూర్, సమ్మర్ వెకేషన్, ఫారెన్ టూర్లకు కుటుంబసభ్యులు, ఆప్తులు, అత్యంత సన్నిహితులు, స్నేహితులతో వెళ్లాలనే భావన అత్యధికుల్లో పెరిగింది. ఈ అంశాలపై తాజాగా హాస్పిటాలిటీ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ‘ఓయో’కన్జుమర్ సర్వేలో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ముఖ్యాంశాలు... ♦ తమకు అత్యంత ఆప్తులు, సన్నిహితులతో కలసి వెళ్లేందుకు మూడోవంతు వంతు మంది ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు ♦ ఇలాంటి ట్రిప్‌లు తమకు నచ్చిన వారితో అనుబంధం మరింత పటిష్ట పరుస్తాయంటున్నవారు 84 శాతం ♦ దగ్గరలోనే ఉన్న ప్రాంతాలకు వెళ్లేందుకు 62 శాతం మంది మొగ్గు ♦ గతంలో పోల్చితే హాలీడే ట్రిప్‌లు, వెకేషన్లపై వెళ్లేందుకు మూడింట రెండు వంతుల మంది సిద్ధం ♦ వాలంటైన్ డే సందర్భంగా ప్రేమికులు, దంపతులు, స్నేహితులు వెళ్లాలనుకునే పర్యాటక ప్రాంతాల్లో మొదట గోవా ఆ తర్వాతి స్థానంలో మనాలి ఉంది. ♦ తమ ఆప్తులు, దగ్గరివారితో నాణ్యమైన సమయం గడపాలనే భావనలో 38% మంది ♦ రొటీన్ జీవితం నుంచి తప్పించుకుని వెకేషన్లపై వెళ్లాలనుకునేవారు 26 శాతం ♦కొత్త ప్రాంతాలను సందర్శించి, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవాలని భావిస్తున్నవారు 25 శాతం ♦పారిస్, మాల్దీవులు, స్విట్జర్లాండ్‌కు వెళ్లానుకునేవారు అత్యధికంగా ఉన్నారు. రివెంజ్ టూరిజంలో భాగమే... మార్చి తర్వాత మనదేశంలో, రాష్ట్రంలో హాలీడే వెకేషన్లు, ట్రిప్‌లు పెరగనున్నాయి. ఇప్పటికిప్పుడు వెంటనే విదేశీ ట్రీప్‌లకు వెళ్లేందుకు ఆచితూచి స్పందిస్తున్నారు. ఇంటర్నేషనల్ ట్రావెల్ పూర్తిస్థాయిలో సాగితే ఐరోపా, సింగపూర్, థాయ్‌లాడ్, ఇతర దేశాలకు డిమాండ్ విపరీతంగా పెరగనుంది. ఇప్పుడు తెలంగాణ నుంచి ఎక్కువగా గోవా, హిమచల్‌ప్రదేశ్ తదితర చోట్లకు ఎక్కువగా వెళుతున్నారు. టూర్లకు, లగ్జరీ హోటళ్లలో ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేసేందుకు ఎవరూ వెనుకాడటం లేదు. దేశ, విదేశాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు గతంతో పోల్చితే 50, 60 శాతం ఎక్కువగా ఎంక్వైరీలు పెరిగాయి. – అజయ్ రామిడి, ఎండీ లార్వెన్ టూర్స్, ట్రావెల్స్ -
భారీ వర్షాలు: నేడు తెలంగాణలో సెలవు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండటం, మరో రెండు రోజు లూ కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు మంగళవారం సెలవు ప్రకటించింది. భారీ వర్షాలపై సమీక్ష సందర్భంగా సెలవు అంశంపై నిర్ణయం తీసుకోవాలని సీఎస్‌కు సీఎం కేసీఆర్ సూచించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే రెవెన్యూ, పోలీస్, ఫైర్ సర్వీసులు, మున్సిపల్, పంచాయతీ రాజ్, నీటిపారుదల శాఖ, రోడ్లు, భవనాల శాఖలు, ఇతర అత్యవసర సర్వీసుల ఉద్యోగులు మాత్రం విధి నిర్వహణలో ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. (చదవండి: భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ ) పరీక్షలన్నీ వాయిదా.. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న, వచ్చే రెండు, మూడు రోజుల్లో జరగాల్సిన అన్నిరకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. 28, 29 తేదీల్లో జరగాల్సిన ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు కూడా వాయిదా వేసినట్టు తెలిపారు. ఆయా పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. కాగా.. బ్రాహ్మణ పరిషత్తు ఆధ్వర్యంలో బెస్ట్ పథకానికి మంగళవారం జరగాల్సిన ఇంటర్వ్యూలను బుధవారానికి వాయిదా వేసినట్టు పరిషత్తు అడ్మినిస్ట్రేటర్ కె.చంద్రమోహన్ ప్రకటించారు. (చదవండి: హైదరాబాద్‌లో కాస్త తగ్గుముఖం పట్టిన వర్షం..) -
పది రోజులు సెలవు తీసుకోండి, పండగ చేస్కోండి! ఆ కంపెనీ వినూత్న నిర్ణయం
ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, ప్రశాంతతే లక్ష్యంగా ఓ స్టార్టప్ కంపెనీ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఉల్లాసంగా, ఉత్సాహాంగా గడపండంటూ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇచ్చింది. అంతేకాదు ఈ సెలవులు స్పెషల్‌గా ప్లాన్ చేసుకునేందుకు వీలుగా రెండు నెలల ముందే హాలిడే షెడ్యూల్ సైతం ప్రకటించింది. పది రోజుల సెలవులు సోషల్కామర్స్ రంగంలో స్టార్టప్‌గా మొదలై యూనికార్న్ కంపెనీగా ఎదిగింది మీషో సంస్థ. ఉద్యోగులు రేయింబవళ్లు కష్టపడి పని చేయడంతో అనతి కాలంలోనే ఈ సంస్థ మార్కెట్ వాల్యూ అనూహ్యంగా పెరిగింది. దీంతో తమ కంపెనీ ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యతను యాజమాన్యం తీసుకుంది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని భావించింది. దీంతో కంపెనీ ఉద్యోగులందరికీ ఒకేసారి పది రోజుల పాటు సామూహికంగా సెలవులు ప్రకటించింది. ఎప్పుడంటే గత రెండు నెలలుగా కరోనా సంక్షోభ సమయంలోనూ తమ కంపెనీ ఉద్యోగులు రేయింబవళ్లు కష్టపడినట్టు మీషో యాజమాన్యం ప్రకటించింది. దీనికి తోడు రాబోయే దసరా, దీపావళి సీజన్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని కూడా ముందే తెలిపింది. ఎంతో ఒత్తిడిలో సంస్థ అభివృద్ధికి పాటుపడిన ఉద్యోగులకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో పీక్ సీజన్ ముగిసిన తర్వాత 2021 నవంబరు 4 నుంచి 14 వరకు సంస్థలోని ఉద్యోగులకు సెలవులు ప్రకటించింది. అంతేకాదు ఆ పది రోజలు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపండి అంటూ ఉద్యోగులకు సూచించింది. మీషో ప్రస్థానం విదిత్ ఆత్రేయ్ అనే ఔత్సాహిక పారిశ్రామికవేత్త 2016లో మీషోను ప్రారంభించారు. చిన్న కళాకారులు, వ్యాపారులు తమ ఉత్పత్తులను అమ్ముకునేలా మీషోను వేదికగా మార్చారు. బయ్యర్లు, అమ్మకం దార్ల మధ్య మీషోను ప్లాట్‌ఫామ్‌గా చేశారు. కేవలం ఐదేళ్లలోనే ఈ మీషో స్టార్టప్ నుంచి యూనికార్న్‌గా ఎదిగింది. ఉద్యోగుల సంక్షేమం విషయంలో మీషో ఎల్లప్పుడు జాగ్రత్తగానే ఉంటుందనే పేరుంది. ఈ కంపెనీ అంతకు ముందు 64 ఆప్షనల్ హలిడేస్ను ఉద్యోగుల కోసం ప్రకటించింది. Meesho is going on a company-wide break from November 4-14th. Yes, you read that right. We are going to completely unplug from work — right after our busy and frenetic festive sale season, so that we are back to doing what we love — relaxed and rejuvenated. (1/2)#Meesho pic.twitter.com/CGusDZZyfw — Life@Meesho (@meeshoapp) August 30, 2021 చదవండి : ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకు బంపర్ఆఫర్ ప్రకటించిన జెరోదా..! -
Telangana: 20న మొహర్రం సెలవు
సాక్షి, హైదరాబాద్: మొహర్రం మాసం 10వ రోజు ఇచ్చే సాధారణ సెలవును ఆగస్టు 19వ తేదీ(గురువారం) నుంచి 20వ తేదీ(శుక్రవారం)కి మారుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొహర్రం 9వ రోజు ఇచ్చే ఐచ్ఛిక సెలవును ఆగస్టు 18 నుంచి 19వ తేదీకి మార్పు చేశారు. నెలవంక ఆధారంగా మొహర్రం మాసం ఒకరోజు ఆలస్యంగా ప్రారంభమైందని, కాబట్టి సెలవులను మార్చాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు విజ్ఞప్తి చేయడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. కాగా, మొహర్రం సెలవును గురువారం నుంచి శుక్రవారానికి మారుస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. -
స్టాక్ మార్కెట్: ఈ వారం ఇలా కొనసాగే ఛాన్స్
ముంబై: దేశీయంగా స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసే వార్తలేవీ లేకపోవడంతో ఈ వారం సూచీల కదలికలకు అంతర్జాతీయ పరిణామాలే కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు. కార్పొరేట్ కంపెనీలు జూన్ త్రైమాసిక ఫలితాల ప్రకటన ఘట్టాన్ని దాదాపు పూర్తి చేశాయి. ఆయా రాష్ట్రాల కోవిడ్ కర్ఫ్యూ సడలింపులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, కోవిడ్ మూడో వేవ్ విస్తరణ అంశాలపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించున్నాయి. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలు మార్కెట్లకు కీలకంగా మారనున్నాయి. మొహర్రం సందర్భంగా గురువారం(ఆగస్ట్ 19న) ఎక్స్ఛేంజ్లకు సెలవు కావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితంకానుంది. ‘‘జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలతో మార్కెట్లో దీర్ఘకాలం పాటు బుల్లిష్ ట్రెండ్ కొనసాగవచ్చు. ఇదే సమయంలో సూచీల రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో చిన్నపాటి దిద్దుబాటుకు అవకాశం లేకపోలేదు. రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో మూడునెలల కనిష్టానికి దిగివచ్చింది. హోల్‌సేల్ ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా అంచనాలకు తగ్గట్లే నమోదైతే ఆర్బీఐ వడ్డీరేట్ల భయాలు తగ్గి ఈ వారంలోనూ సూచీలు సరికొత్త రికార్డులను నెలకొల్పే అవకాశం ఉంది. సాంకేతికంగా నిఫ్టీ 16500 స్థాయిపైన ముగిసింది. అప్‌ట్రెండ్ కొనసాగితే నిఫ్టీ 16,800–17,000 శ్రేణిని పరీక్షించవచ్చు. దిగువస్థాయిలో 16,380 వద్ద తక్షణ మద్దతును కలిగి ఉంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదుతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో గతవారంలో సెన్సెక్స్, నిఫ్టీలు జీవితకాల రికార్డు స్థాయిలను నమోదుచేశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 1160 పాయింట్లు, నిఫ్టీ 291 పాయింట్లను ఆర్జించాయి. అంతర్జాతీయ పరిణామాలు చైనా జూలై పారిశ్రామికోత్పత్తి, రిటైల్ గణాంకాలు నేడు(సోమవారం) విడుదల కానున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశపు మినిట్స్ బుధవారం వెల్లడి అవుతాయి. ద్రవ్యోల్బణ కట్టడి చర్యలపై ఫెడ్ రిజర్వ్ ఆలోచన తీరును మార్కెట్ వర్గాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. బాండ్ల కొనుగోళ్లను క్రమంగా తగ్గించాలని కొందరు ఫెడ్ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ అం శంపై మినిట్స్‌లో సానుకూల వైఖరి ఉంటే ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు సంభవించవ చ్చు.యూరోజోన్ జూలై ద్రవ్యోల్బణ గణాంకాలు అదేరోజున(ఆగస్ట్18న)విడుదల కానున్నాయి. టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు కేంద్ర గణాంకాల శాఖ నేడు(సోమవారం) టోకు ద్రవ్యోల్బణ గణాంకాలను విడుదల చేయనుంది. జూన్‌లో 12.07 శాతంగా నమోదైన హోల్‌సేల్ ద్రవ్యోల్బణం జూలైలో 11.30% దిగిరావచ్చనే ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాలు కూడా అంచనాలకు తగ్గట్లు నమోదైతే ఆర్బీఐ వడ్డీరేట్ల భయాలు తగ్గి మార్కెట్ మరింత ముందుకెళ్లవచ్చు. ఆర్బీఐ శుక్రవారం ఆగస్ట్ 13తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వల గణాంకాలను వెల్లడించనుంది. నికర కొనుగోలుదారులుగా ఎఫ్ఐఐలు ఆర్థిక వ్యవస్థ రికవరీ నేపథ్యంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఈ ఆగస్ట్ ప్రథమార్థంలో ఎఫ్ఐఐలు రూ.2,085 కోట్ల షేర్లను కొన్నారు. ఇదే సమయంలో డెట్ మార్కెట్ నుంచి రూ.2,044 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. లార్జ్ క్యాప్ షేర్లను కొనేందుకు ఎఫ్ఐఐలు ఆసక్తి చూపుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒకే రోజున నాలుగు లిస్టింగ్‌లు ఒకేరోజున నాలుగు లిస్టింగ్‌లతో ప్రాథమిక మార్కెట్... సెకండరీ మార్కెట్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఈ ఆగస్ట్ 4–6 తేదీల మధ్య పబ్లిక్ ఇష్యూలను పూర్తి చేసుకున్న నాలుగు కంపెనీల షేర్లు సోమవారం(నేడు) ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. దేవయాని ఇంటర్నేషనల్, క్రిష్ణా డయాగ్నస్టిక్స్, ఎక్సారో టైల్స్, విండ్లాస్ బయోటెక్ టైల్ కంపెనీల షేర్లు ఇందులో ఉన్నాయి. గ్రే మార్కెట్లో ఈ నాలుగు కంపెనీల షేర్లు ప్రీమియం ధరలతో ట్రేడ్ అవుతున్నందున లిస్టింగ్‌లో లాభాల్ని పంచవచ్చు. ఇదే వారంలో ఆప్టస్ వేల్యూ, నువోకో విస్టాస్ ఇష్యూలకు సంబంధించిన అలాట్మెంట్ ప్రక్రియ కూడా పూర్తి అవుతుంది. అలాగే కార్‌ట్రేడ్ టెక్, నువాకో విస్టా కార్పొరేషన్ కంపెనీలు శుక్రవారం ఐపీఓ షేర్లను లిస్ట్ చేయాలని భావిస్తున్నాయి. -
నేడు మార్కెట్‌కు సెలవు
సాక్షి, ముంబై: బాబా అంబేడ్కర్ జయంతి సందర్భంగా నేడు (బుధవారం) స్టాక్ మార్కెట్‌కు సెలవు. ఎక్సే్చంజీలతో పాటు ఫారెక్స్, డెట్, కమోడిటీ మార్కెట్లు కూడా పనిచేయవు. తిరిగి గురువారం అన్ని మార్కెట్లు యథావిధిగా ప్రారంభమవుతాయి. మహారాష్ట్ర నూతన సంవత్సర ఆరంభ దినం ‘గుడి పడ్వా’ పండుగ కారణంగా మంగళవారం ఫారెక్స్ మార్కెట్ పనిచేయలేదు. -
హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న సింగర్ సునీత ఫోటోలు వైరల్
-
ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుంది.. వచ్చేసింది
యాష్గబట్: కుక్కలకుండే విశ్వాసం మనుషులకు కూడా ఉండదని..చాలామంది కుక్కలను ఎంతో అపురూపంగా పెంచుకుంటుంటారు. కుక్కలను అమితంగా ఇష్టపడే వారిలో తుర్క్మెనిస్థాన్ దేశాధినేత గుర్బంగులి బెర్డిముఖమెదోవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఈయనకు సెంట్రల్ ఆసియాలో నివసించే ‘అలబాయ్’ అనే అరుదైన జాతి కుక్కలంటే చాలా ఇష్టం. అందుకే ఈ జాతి కుక్కల స్మృతిగా శునక విగ్రహాన్ని బంగారంతో చేయించి దేశ రాజధాని యాష్గబట్‌లోని ప్రధాన కూడలిలో ప్రతిష్టించారు. తాజాగా ఆయన మరో అడుగు ముందుకేసి.. వార్తల్లో నిలిచారు. అలబాయ్ జాతి కుక్కల గౌరవార్థం ఏప్రిల్ చివరి ఆదివారాన్ని ‘నేషనల్ హాలిడే’గా ప్రకటించారు. ఇదేరోజు స్థానిక గుర్రపు జాతిని స్మరించుకోవడంతోపాటు అలబాయ్ డేను కూడా ఘనంగా జరుపుకోవచ్చని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అంతేగాక ఆరోజు డాగ్ బ్యూటీ అండ్ అగ్లీ కాంటెస్ట్‌లు నిర్వహిద్దామని గుర్బగులి పేర్కొన్నారు. అత్యంత ప్రాచుర్యం పొందిన జాతులలో ఒకటైన అలబాయ్ శునకం.. రష్యాతోపాటు, ఇతర మధ్య ఆసియా దేశాలలో కనిపిస్తుంది. తుర్క్మెనిస్థాన్లోనే కాకుండా పొరుగు దేశాల్లోనూ శునకాలను, గుర్రాలను గౌరవించే సంప్రదాయం ఉంది. వాళ్లు తమ పశుసంపదతోపాటు వీటిని కూడా ప్రేమతో పెంచుకుంటారు. తుర్క్మెనిస్థాన్ అధ్యక్షుడు గుర్బంగులి జాతి కుక్కల మీద ఓ పాట రాయడంతోపాటు ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించారు. అంతేగాక 2017లో గుర్బంగులి అలబాయ్ శునకాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు బహూకరించారు. -
మార్కెట్లకు నేడు సెలవు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లకు నేడు (సోమవారం) సెలవు. ఈద్ పర్వదినం సందర్భంగా ఈక్విటీ మార్కెట్లు నేడు పనిచేయవు. కాగా వరుసగా మూడవ రోజుకూడా నష్టపోయిన సూచీలు శుక్రవారం అతను నిఫ్టీ 9039 వద్ద సెన్సెక్స్ 30,672 వద్ద ముగిసాయి. డాలరు మారకంలో రూపాయి 75.92 వద్ద స్థిరపడింది. ఒకవైపు అమెరికా-చైనా ట్రేడర్ వార్, మరోవైపు ఇన్వెస్టర్లను నిరాశపర్చిన ఉద్దీపన ప్యాకేజీ... దీనికి తోడు ఆర్బీఐ కీలకరేట్ల తగ్గింపు అంచనాలను అందుకోలేకపోవడం దేశీయ మార్కెట్లను నిరాశపర్చాయి. దీంతో వారం మొత్తం మీద సెన్సెక్స్ 425 పాయింట్లు, నిఫ్టీ 98 పాయింట్లు నష్టపోయాయి. -
ఒక నెలలో ఇంత లాభం గత పదేళ్లలో ఇదే తొలిసారి
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్‌కు నేడు (శుక్రవారం) సెలవు.మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, సందర్భంగా బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ ట్రేడింగ్ వుండదు. శనివారం, ఆదివారం సాధారణ సెలవు రోజులు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ మార్కెట్ సోమవారం(4వ తేది) తిరిగి ప్రారంభమవుతుంది. ఈ రోజు మే 1 అంతర్జాతీయ కార్మికదినోత్సవంగా కూడా. (‘కరోనా’కు మందు! మార్కెట్ ముందుకు...) పారిశ్రామిక రంగానికి మరో ప్యాకేజీని కేంద్రం ఇవ్వనున్నదన్న అంచనాలు, లాక్ డౌన్ ఎత్తివేత, ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయన్న అంచనాలకు తోడు గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో మార్కెట్ వరుసగా నాలుగవ రోజు సానుకూలంగా ముగిసింది. కోవిడ్-19 చికిత్సలో గిలియడ్ రెమెడిసివిర్ ఔషధం సత్ఫలితాలు ఇస్తోందన్న అమెరికా ప్రకటన, వ్యాక్సిన్‌పై మానవ పరీక్షలను ప్రారంభించడం కూడా ర్యాలీకి ఆజ్యం పోసింది. దీంతో గురువారం కీలక సూచీలు భారీగా లాభపడ్డాయి. దీనికితోడు ఏప్రిల్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు రోజు కావడంతో షార్ట్ కవరిం, రోల్-ఓవర్లు కూడా లాభాలకు దోహదపడ్డాయి. సెన్సెక్స్ 997 పాయింట్ల లాభంతో 33,718 పాయింట్ల వద్ద, నిఫ్టీ 307 పాయింట్లు ఎగసి 9,860 పాయింట్ల వద్ద ముగిశాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 57 పైసలు పుంజుకోవడం విశేషం. (కరోనా : ట్రెండ్ సెట్ చేసిన అంబానీ, వేతనాల కోత) కాగా గత తొమ్మిదేళ్లలో ఈ రెండు సూచీలకు ఇది రెండో అత్యధిక వారం లాభం. ఏప్రిల్ నెలలో సెన్సెక్స్ 13 శాతం, నిఫ్టీ 14 శాతానికి పైగా లాభపడ్డాయి. ఈ వారంలో సెన్సెక్స్ 7.6 శాతం, నిఫ్టీ 7.7 శాతం చొప్పున ఎగిశాయి. ఒక నెలలో సెన్సెక్స్ 4 వేల పాయింట్లకు పైగా ఎగిసింది. గత 10 ఏళ్లలో ఇంతగా లాభపడటం ఇదే మొదటిసారని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అలాగే ఒక నెలలో నిఫ్టీ ఇంతగా లాభపడటం గత 11 ఏళ్లలో ఇదే మొదటిసారి. అయితే ఈ స్థాయిల వద్ద కరెక్షన్ కు అవకాశం వుందని, పెట్టుబడి దారులు అప్రమత్తంగా వుండాలని వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సూచించారు. మార్చి 2020 కనిష్టాల నుండి బలమైన ర్యాలీ తరువాత, మార్కెట్ 30వేల స్థాయికి దిగువకు వెళ్ళే అవకాశం కనిపిస్తోందని పెట్టుబడిదారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని పేర్కొన్నారు. (కరోనా కట్టడిలో కొత్త ఆశలు : ఈ మందుపై ప్రశంసలు) -
రెండో శనివారం సెలవులు రద్దు!
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం ఇంటర్, ఉన్నత విద్యలో రెండో శనివారం సెలవులు రద్దయ్యే అవకాశం ఉంది. కరోనా కారణంగా జరిగే ఆలస్యాన్ని నివారించేందుకు విద్యాశాఖ ఇదే విధానాన్ని అమ లు చేయాల్సి వస్తుందని అధికారులు పేర్కొం టున్నారు. ఇప్పటివరకు పాఠశాల విద్యాశాఖ టెన్త్ పరీక్షలను పూర్తి చేయలేదు. మరోవైపు ఇంటర్ ఫలితాలు వెలువడలేదు. డిగ్రీ పరీక్షలు నిర్వహించలేదు. లాక్‌డౌన్‌ను పొడిగించడంతో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి లేదు. లాక్డౌన్ ముగిశాక విద్యాకార్యక్రమాలు చేపట్టినా జూన్, జూలైలో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే అవకాశాలు లేవు. ఆ తర్వాత విద్యా సంవత్సరం ప్రారంభమైతే పనిదినాలను, సెమిస్టర్ విధానాన్ని సర్దుబాటు చేసేందుకు రెండో శనివారం సెలవులు రద్దు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. విద్యాసంవత్సరం ఆలస్యం తప్పదు... మార్చి 19న ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు మూడు పేపర్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 8 పేపర్లు నిర్వహించాల్సి ఉంది. కరోనా ప్రభావంతో మార్చి 23 నుంచి ఏప్రిల్ 6 వరకు నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. మరోవైపు ఇంటర్మీయట్ ప్రధాన పరీక్షల మూల్యాంకనం పూర్తి కాలేదు. గత నెలలో నిర్వహించాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా అదుపులోకి వస్తే వీటిని నిర్వహించే అవకాశం ఉంది. లేదంటే ఇంకా కొన్నాళ్లు ఆలస్యం అయ్యే పరిస్థితి ఉంది. వచ్చే నెలలో పదో తరగతి పరీక్షలను నిర్వహించి వాటి మూల్యాంకనం పూర్తి చేసి, ఫలితాలు ఇచ్చేటప్పటికి జూన్ రెండో వారం వస్తుంది. అప్పుడు ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టి తరగతులు మొదలుపెట్టేసరికి జూలై వచ్చేస్తుంది. దీంతో ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరంలో ఆలస్యం తప్పదు. ఇక ఆ తర్వాత కాలేజీల పని దినాలు సర్దుబాటు చేసేందుకు రెండు శనివారం సెలవులను రద్దు చేయకతప్పని పరిస్థితి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇంటర్మీడియట్ మూల్యాంకన పూర్తి చేసి, డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టేందుకు ఇంకా సమయం పట్టనుంది. పైగా ఆయా కాలేజీల అఫీలియేషన్లు పూర్తి చేయడంలో ఆలస్యం తప్పదు కనుక విద్యా సంవత్సరం ప్రారంభానికి ఎక్కువ సమయం పడుతుంది. మరోవైపు ఇప్పటికీ డిగ్రీ పరీక్షలు కూడా పూర్తి కాలేదు. వచ్చే నెలలో ఈ పరీక్షలను నిర్వహించి, ఫలితాలను జూలై నాటికి వెల్లడించే అవకాశం ఉంది. ఆ తర్వాత పీజీ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టినా విద్యా సంవత్సరంలో ఆలస్యం తప్పదు. -
నేడు మార్కెట్లకు సెలవు
సాక్షి, ముంబై : దేశీయ మార్కెట్లకు నేడు సెలవు. రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంగళవారం దేశీ స్టాక్ మార్కెట్లు పనిచేయవు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ట్రేడింగ్ తిరిగి బుధవారం(15న) యథావిధిగా ఉదయం 9.15కు ప్రారంభమవుతుంది. బులియన్, మెటల్ తదితర హోల్‌సేల్ కమోడిటీ మార్కెట్లకూ సెలవు. ఫారెక్స్ మార్కెట్లు సైతం పనిచేయవు. కాగా సోమవారం సెన్సెక్స్ 470 పాయింట్లు పతనమై 30690 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు క్షీణించి 8994 వద్ద ముగిసింది. అటు డాలరుతో మారకంలో రూపాయి నామమాత్రంగా బలపడి 76.27 వద్ద ముగిసింది. -
గుడ్ ఫ్రైడే మార్కెట్లకు సెలవు
సాక్షి, ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లుకు సెలవు. గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు (శుక్రవారం 10) మార్కెట్లకు సెలవు. అలాగే బులియన్, కమోడిటీ మార్కెట్లు, ఫారెక్స్ మార్కెట్లు సైతం పనిచేయవు. సోమవారం(13న) ఉదయం 9.15కు యథావిధిగా ప్రారంభమవుతుంది. సెన్సెక్స్ 1266 పాయింట్లు ఎగిసి 31,160 వద్ద , నిఫ్టీ సైతం 363 పాయింట్లు జంప్‌చేసి 9112 వద్ద స్థిరపడ్డాయి. తద్వారా 31,000 పాయింట్ల మైలురాయినిఎగువన ముగిసింది. నిఫ్టీ కూడా 9100 ఎగువన పటిష్టంగా ముగిసింది. డాలరుతో మారకంలో రూపాయి గురువారం 76.28 వద్ద ముగిసింది. వారాంతంలో బుల్ పరుగు, అన్నీ లాభాలే -
నేడు మార్కెట్లకు సెలవు
సాక్షి, ముంబై: మహావీర్ జయంతి సందర్భంగా నేడు(సోమవారం) దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ పనిచేయవు. ట్రేడింగ్ తిరిగి రేపు (మంగళవారం, ఏప్రిల్ 7)ఉదయం 9.15కు ప్రారంభమవుతుంది. అలాగే బులియన్, మెటల్ తదితర హోల్‌సేల్ కమోడిటీ మార్కెట్లకూ నేడు పనిచేయవు. కమోడిటీ ఫ్యూచర్స్‌లో సైతం ట్రేడింగ్‌ను అనుమతించరు. ఇక ఫారెక్స్ మార్కెట్లకు కూడా నేడు మహావీర్ జయంతి సందర్భంగా సెలవుకాగా.. గత వారం సైతం రెండు రోజులపాటు పనిచేయలేదు. ఏప్రిల్ 1(బుధవారం) ఖాతాల వార్షిక(2019-20) ముగింపు రోజు సందర్భంగా ఫారెక్స్ మార్కెట్లకు సెలవు. మరుసటి రోజు గురువారం శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని సెలవు ప్రకటించారు. కాగా వారాంతంలో (శుక్రవారం) దేశీ స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 674 పాయింట్లు పతనమై 27,591 వద్ద, నిఫ్టీ 170 పాయింట్లు క్షీణించి 8,084 వద్ద స్థిరపడింది. తద్వారా కీలక సూచీలురెండూ ప్రధాన మద్దతు స్థాయిలకు దిగువన ముగిసిన సంగతి విదితమే. -
నేడు మార్కెట్లకు సెలవు
సాక్షి,ముంబై: శ్రీరామ నవమి పండుగ సందర్భంగా నేడు(గురువారం,ఏప్రిల్ 2) దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ పనిచేయవు. ఈ నేపథ్యంలో బులియన్, మెటల్ తదితర హోల్‌సేల్ కమోడిటీ మార్కెట్లకూ సెలవు ప్రకటించారు. కమోడిటీ ఫ్యూచర్స్‌లో సైతం ట్రేడింగ్‌ను అనుమతించరు. ఇక ఫారెక్స్ మార్కెట్లయితే నేటితో కలిపి రెండు రోజుపాటు పనిచేయవు. ఏప్రిల్ 1(బుధవారం) ఖాతాల వార్షిక(2019-20) ముగింపు రోజు సందర్భంగా ఫారెక్స్ మార్కెట్లకు సెలవు. శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని ఈక్విటీ మార్కెట్లు పనిచేయవు. ట్రేడింగ్ తిరిగి శుక్రవారం(3న) యథావిధిగా ఉదయం 9.15కు ప్రారంభమవుతుంది. కాగా బుధవారం కీలక సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి. కరోనా వైరస్ వ్యాప్తి, విదేశీ మదుపరుల భారీ అమ్మకాల మధ్య ఆర్థిక సంవత్సరాన్ని నష్టాలతో ఆరంభించాయి. చివరికి1203 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 28,265 వద్ద, నిఫ్టీ 344 పాయింట్లు కుప్పకూలి, 8253 వద్ద స్థిరపడినసంగతి తెలిసిందే. -
సెలవురోజూ పనిచేయాలా?
అబిడ్స్: వాణిజ్య పన్నులశాఖ ఉన్నతాధికారుల తీరుతో కింది స్థాయి అధికారులు, వ్యాపార డీలర్లు లబోదిబోమంటున్నారు. ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్‌తో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మాల్స్, సినిమా థియేటర్లు, జనసంద్ర ప్రాంతాలు, విద్యా సంస్థలు ఈ నెల 31 వరకు మూసివేయాలని సీఎం కేసీఆర్ స్వయానా ఆదేశించారు. అయితే సీఎస్ శని, ఆదివారాల్లో కూడా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా వి«ధులు నిర్వహించాలని సర్క్యులర్ జారీ చే శారు. ఈ నెల 31 వరకు అన్ని వాణిజ్య పన్నుల శాఖా కార్యాలయాల్లో సెలవు దినాల్లో కూడా, రెండవ శనివారం, ఆదివారాల్లో కూడా కార్యాలయాలు తెరిచి ఉండాలని హుకుం జారీ చేశారు. దీంతో అధికారులు, సిబ్బంది లబోదిబోమంటున్నారు. అంతేకాక కరోనా భయంతో గజగజలాడుతున్న వ్యాపారస్తులు, హోల్ సేల్ డీలర్లు కూడా వాణిజ్య పన్నులశాఖ అధికారుల తీరుపట్ల మండిపడుతున్నారు. శని, ఆదివారాల్లో పలువురు వాణిజ్య పన్నుల అధికారులు డీలర్లకు ఫోన్లు చేసి తమ కార్యాలయాల్లోకి రావాలని, పన్నులు చెల్లించాలని కోరడంతో పలువురు వ్యాపారస్తులు ప్రభుత్వ తీరుపట్ల విస్మయం వ్యక్తం చేశారు. అంతేకాక పలువురు అధికారులు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ జారీ చేసిన సర్క్యులర్‌ను మీడియాకు చూపిస్తూ ఆయన తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చే శారు. టార్గెట్లే... టార్గెట్లు సర్కిల్ స్థాయి అధికారులు, సిబ్బంది సెలవు దినాల్లో కూడా ట్యాక్స్ అధిక మొత్తం వసూలు చేయాలని ఉన్నతాధికారులునిర్ణయాలు తీసుకుంటడంతో పలువురు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కరోనై వైరస్‌తో భయపడుతున్న వ్యాపారస్తులు కానీ, అధికారులు కానీ, సిబ్బంది కానీ పై అధికారుల తీరుపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక అధికారుల మధ్య పన్నులు వసూళ్ళు టార్గెట్లు, పోటీలు పెట్టి వేధిస్తున్నారని పలువురు వాపోయారు. కొంత మంది యూనియన్‌లో ఉన్నప్పటికీ వారిని కూడా సెలవు దినాల్లో పన్నులు వసూళ్ళు చేయాలని హుకుం జారీ చేయడంతో యూనియన్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘క్యూటీ’తో రామ్‌చరణ్
ఆదివారం.. అందులోనూ సెలవు దినం.. మరి మన మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఎలా గడిపాడో తెలుసా? తాను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న క్యూట్ బాయ్ పెంపుడు కుక్కతో సరదాగా గడిపాడు. ‘నిజమే.. మేము కుక్కలను మా కుటుంబ సభ్యులుగా.. సొంత బిడ్డలుగా చూసుకుంటాము. రామ్‌చరణ్ క్యూటీ కుక్కతో ఇలా సరదాగా గడిపాడు..’ అంటూ ఆయన సతీమణి ఉపాసన కొణిదెల రామ్‌చరణ్ తన పెంపుడు కుక్కతో ఆడుకుంటున్న ఫొటోను ట్వీట్ చేశారు. ఆమె చేసిన ట్వీట్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. (పార్టీ మూడ్) Now that’s what I call unconditional love ! Super chilled Sunday with my boys ❤️❤️❤️❤️ #ramcharan #brat pic.twitter.com/GJPcCY7FSj — Upasana Konidela (@upasanakonidela) February 23, 2020 -
దసరాకి సెలవు లేదా ?
కర్ణాటక, యశవంతపుర: 2020–2021 విద్యా సంవత్సరపు సెలవులను అధికారులు ప్రకటించారు. అయితే విజయదశమి పండుగకు సెలవును ప్రకటించలేదు. దీంతో ప్రైవేట్ విద్యా సంస్థల పాలన మండలి ఒక్కూట అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. హిందువుల పవిత్రమైన పండుగకు సెలవును ప్రకటించకపోవటంతో ప్రజలు అధికారులపై మండిపడుతున్నారు. దసరా సెలవులు అక్టోబర్ 3 నుంచి 25 వరకు ఇచ్చారు. 26న విజయదశమికి పాఠశాలలను తెరవాలని విద్యా శాఖ ఆదేశించింది. 26న సెలవు ఉన్నా విద్యాశాఖ కళ్లు మూసుకుని సెలవుల జాబితా రూపొందించిందని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం మండిపడింది. -
అమలా పూల్
అమలా పాల్ కాస్తా అమలా పూల్ అయిందేంటని ఆలోచిస్తున్నారా? కింద ఉన్న ఫొటో చూశారు కదా. పువ్వులు నిండిన తొట్టిలో అమలా పాల్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో? అందుకే అమలా పూల్ అన్నాం. షూటింగ్స్‌కి కాస్త విరామం ఇచ్చి తన బర్త్‌డేను (అక్టోబర్ 26) సెలబ్రేట్ చేసుకోవడానికి బాలీకి హాలిడేకు వెళ్లారు అమలా. అక్కడ కొన్ని రోజులు తనకు నచ్చినట్లుగా గడిపారామె. ఆ వెకేషన్ ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. వాటిలో పూలతో నిండిన బాత్ టబ్‌లో ‘హీలింగ్ బాత్’ చేస్తున్న ఫొటో ఒకటి. ఇక సినిమాల విషయానికి వస్తే.. అమలా పాల్ నటించిన ‘అదో అంద పరవై పోల’ అనే తమిళ లేడీ ఓరియంటెడ్ చిత్రం, ‘ఆడు జీవితం’ అనే మలయాళ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ‘లస్ట్ స్టోరీస్’ యాంథాలజీలోనూ నటిస్తున్నారు అమలా పాల్. -
రేపు జంట నగరాలకు సెలవు
సాక్షి, హైదరాబాద్: గణేష్ నిమజ్జనం సందర్భంగా గురువారం హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న రెండో శనివారం ఈ జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు పనిదినంగా ప్రకటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
హాలిడే కానీ వర్క్ డే!
తమిళ, తెలుగు, హిందీ భాషల్లో హీరోయిన్గా ప్రూవ్ చేసుకున్న అదా శర్మ ఇప్పుడు డిజిటల్ రంగంవైపు కూడా దృష్టి పెట్టారు. ‘హాలిడే’ అనే వెబ్ సిరీస్ చేయడానికి ఆమె అంగీకరించారు. ‘‘హాలిడే వెబ్ సిరీస్ కోసం మారిషస్ వచ్చాం. కొత్త హెయిర్ కలర్ డిజైన్ ట్రై చేశాను. ఏ హీరోయిన్ అయినా నా హెయిర్‌స్టైల్‌తో ఇన్స్పైర్ అయినట్లయితే.. వారు నాకు కాపీరైట్ చార్జెస్ పే చేయాలి (సరదాగా)’’ అని పేర్కొన్నారు అదా శర్మ. మారిషస్‌లో కొన్ని రోజుల పాటు ఈ చిత్రీకరణ జరుగుతుంది. అదా వెబ్‌సిరీస్‌లో నటించడం ఇదే తొలిసారి. ఇక సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో రాజశేఖర్ హీరోగా నటించిన ‘కల్కి’ సినిమాలో అదా శర్మ ఒక హీరోయిన్గా నటించారు. అటు హిందీలో ‘బైపాస్ రోడ్, కమాండో 3’ సినిమాలు చేస్తున్నారు. -
నాలుగో సింహం.. విధినిర్వహణే శాపం
ఈ చిత్రంలో నిర్జీవంగా పడి ఉన్న వ్యక్తి రాజశేఖర్. చిత్తూరు పోలీసువిభాగంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ (ఎస్టీఎఫ్)లో పని చేసేవాడు. పెళ్లి చూపులకు వెళ్లేందుకు సెలవు అడిగితే ఉన్నతాధికారులు నిరాకరించారు. సెలవు అడిగిన ప్రతిసారీ ఇతనికి నిరాశే ఎదురయ్యేది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురై గతేడాది ఏప్రిల్ 20న ఎస్పీ క్యాంపు కార్యాలయంలోనే విధులు నిర్వర్తిస్తూ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిత్తూరు అర్బన్: బహుశా ఈ ఒక్క ఉదాహరణ చాలనుకుంటా.. విధి నిర్వహణలో సగటు పోలీసు పడుతున్న ఒత్తిడి భారం.. జిల్లాలో పోలీసుల సంఖ్య..24 గంటల్లో ఎప్పుడు పిలిచినా పరుగెత్తాల్సిన పోలీసుశాఖలో సెలవు ఇవ్వకుంటే ఓ వ్యక్తి మానసిన పరిస్థితి ఎలా ఉంటుందనడానికి రాజశేఖర్ మరణమే సాక్ష్యం. సెలవు.. ప్రభుత్వ ఉద్యోగి హక్కు. కానీ అత్యవసర సేవల్లాంటి పోలీసు విభాగంలో సెలవు పేరు ఎత్తే అర్హత ఏ ఒక్కరికీ ఉండదు. ఎండలో నిలబడి ట్రాఫిక్ విధులు, అడవుల్లో కూంబింగ్, ఇతర రాష్ట్రాల్లో ఎర్రచందనం స్మగ్లర్ల వేట, ఆర్ఐల వద్ద ఆర్డర్లీ డ్యూటీలు.. ఇన్నింటి నుంచి కాస్త ఉపసమనం ఇచ్చే వారంతపు సెలవు జిల్లాలోని ఏ ఒక్క కానిస్టేబుల్‌కు అమలు కావడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పోలీసుశాఖలో వారాంతపు సెలవు (వీక్లీ ఆఫ్)ను తప్పనిసరి చేస్తానంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటివ్వడం ఆ శాఖలో సంతోషాన్ని నింపిందనే చెప్పాలి. సమయం ఎక్కడ..? పోలీసుశాఖ అత్యవసర విభాగమే అయినప్పటికీ వారాంతపు సెలవు ఇవ్వకపోవడంతో పోలీసులు, వారి కుటుంబాలు నలిగిపోతున్నాయి. వేళకాని వేళల్లో విధులు నిర్వహిస్తూ నలిగిపోతున్నారు. దీంతో వ్యక్తిగత, కుటుంబ జీవితానికి దూరమైపోతున్నారు. ప్రధానంగా ఇంట్లో తల్లిదండ్రులు, భార్యా పిల్లలతో గడపలేని పరిస్థితి. పిల్లలు ఏం చదువుతున్నారు ? ఏం చేస్తున్నారు? వారి ఇష్టాఇష్టాలు తెలుసుకునే సమయం కూడా చాలామందికి దొరకడం లేదు. కొన్నిసార్లు పనిలో అధికారుల నుంచి ఎదురయ్యే చీవాట్లు, చీత్కారాలను ఇంట్లో వారిపై చూపించేవాళ్లూ ఉన్నారు. తండ్రి కుటుంబంపై దృష్టి పెట్టకపోవడంతో చెడుదారిను ఎంచుకునే వాళ్లు ఉన్నారు. చిత్తూరులో ఓ ఏఎస్ఐ కొడుకు తొమ్మిదో తరగతిలోనే తోటి విద్యార్థిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో అతనిపై కేసు నమోదు చేసి జువైనెల్ హోమ్‌కు తరలించడమే ఇందుకు నిదర్శనం. పట్టించుకునే వారేరీ? జిల్లాలో తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో పోలీసుల బాగోగుల కోసం సంక్షేమ సంఘాలున్నాయి. పోలీసుల కష్టాలు, ఇబ్బందులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికే సంక్షేమ సంఘాన్ని ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికైన అధికారుల్లో చాలా మంది డ్యూటీలకు వెళ్లకుండా.. ఇంకా చెప్పాలంటే అసలు యూనిఫాం తొడగకుండా ఉన్నతాధికారుల అడుగులకు మడుగులొత్తుతుంటారు. ప్రభుత్వ పెద్దలు చెప్పేట్లు నడుచుకుంటూ వేలాది మంది పోలీసుల మనోభావాలను తాకట్టు పెడుతుంటారు. అధికారపార్టీ నేతలు పోలీసులపై దౌర్జన్యం చేసినా ఖండించని నేతలు.. ప్రతిపక్ష నాయకులు చిన్నమాట అంటే మాత్రం మీడియా ఎదుటకొచ్చి విమర్శలు గుప్పించిన ఘటనలు చాలానే ఉన్నాయి. జిల్లాలో పోలీసులకు ట్రావెల్ అలవెన్స్ ఇచ్చి ఆర్నెళ్లవుతున్నా ఏ యూనియన్ ప్రశ్నించదు. స్పెషల్ పార్టీ పోలీసులకు ఇతర ప్రాంతాలకు, దూరంగా డ్యూటీలు వేస్తే ఆరోగ్య సమస్యలున్న వారికి డ్యూటీల నుంచి మినహాయింపు ఇవ్వండంటూ అధికారులను అడిగే ధైర్యం ఎవరికీ ఉండదు. వైఎస్జగన్ హామీతో ఆశలు.. పోలీసుశాఖలో సిబ్బంది పడుతున్న కష్టాలను ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తించారు. ‘పోలీసుల కష్టాలు నే విన్నాను.. మీకు తోడుగా నేనుంటాను. మన ప్రభుత్వం రాగానే పోలీసుశాఖలో వారాంతపు సెలవు(వీక్లీఆఫ్)ను కచ్చితంగా ఇస్తాను. హోంగార్డులకు సైతం ఇది వర్తింపజేస్తాం’ అంటూ ఇచ్చిన హామీ పోలీసుల్లో కొత్త ఆశలను చిగురింపచేస్తోంది. జీవితాంతం రుణపడి ఉంటారు వైఎస్జగన్ ఇచ్చిన హామీ అమల్లోకి వస్తే బతికున్నంత వరకు ఏ ఒక్క పోలీసు మర్చిపోరు. జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఏళ్ల తరబడి ఈ శాఖలో డ్యూటీలు చేస్తూ కుటుంబాలకు దూరమైపోయాం. పిల్లల బాగోగులు చూసుకునే టైం ఉండడం లేదు. తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగలేకుంటే ప్రశాంతత లేకుండా పోతోంది. వీక్లీ ఆఫ్ అమలు చేస్తే మాత్రం ప్రతి పోలీసు కుటుంబం జగన్‌కు రుణపడి ఉంటుంది. – కేఎన్ మురళి, జిల్లా పోలీసు సంక్షేమ సంఘ మాజీ అధ్యక్షుడు, చిత్తూరు -
సోమవారం మార్కెట్లకు సెలవు
సాక్షి, ముంబై: మహాశివరాత్రి సందర్భంగా సోమవారం మార్కెట్లకు సెలవు. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) పనిచేయవు. ట్రేడింగ్ తిరిగి మంగళవారం(5న) యథావిధిగా ఉదయం 9.15కు ప్రారంభమవుతుంది. భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గతవారం దేశీ స్టాక్ మార్కెట్లు భారీస్థాయిలో హెచ్చుతగ్గులను చవిచూశాయి. చివరికి శుక్రవారం సెన్సెక్స్ నికరంగా 192 పాయింట్లు(0.55 శాతం) బలపడి 36,064 వద్ద నిఫ్టీ 72 పాయింట్లు(0.7 శాతం) పుంజుకుని 10,863 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. -
నగరంలో భారీ వర్షం..!
సాక్షి, హైదరాబాద్: నగరంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచే వాతావరణం పలు మార్పులతో ఉండటంతో రాత్రి సమయంలో భారీగా వర్షం పడింది. గణతంత్ర దినోత్సవం, సెలవుదినం కావడంతో ప్రజలకు పెద్దగా ఇబ్బందేమీ కలగలేదు. నగరంలో పలు ప్రాంతాల్లో సాయంత్ర నుంచే వర్షం మొదలైంది. దీంతో ప్రజలు అప్రమత్తమై రాత్రి వేళ బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వర్షంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మధ్యాహ్నం నుంచే నగరం మేఘావృతమై ఉండి వాతావరణం మారటంలో భారీ వర్షం సంభవించింది. -
ఊరెళ్లిన నగరం..!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరం ఊరెళ్లింది. నగరంలోని నాలుగు వంతులకు పైగా జనం సంక్రాంతి పండగకు తమ స్వస్థలాలకు పయనమయ్యారు. విశాఖలో ఉద్యోగాలు, విద్య, వ్యాపారాల నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిలైన వారు, నివాసం ఉంటున్న వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరిలో అత్యధికులు ఈ సంక్రాంతి సెలవులకే వారి ఊళ్లకు వెళ్తుంటారు. ఈ సంవత్సరం వారం రోజులకు పైగా ప్రభుత్వ కార్యాలయాలకు వరుస సెలవులు రావడంతో భారీ సంఖ్యలో నగరవాసులు ఊళ్లకు బయల్దేరి వెళ్లారు. దాదాపు ఆరు లక్షల మంది విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు సంక్రాంతి సందర్భంగా వెళ్తున్నట్టు అంచనా. గత ఏడాదితో పోల్చుకుంటే వీరి సంఖ్య లక్షకు పైగా ఎక్కువని చెబుతున్నారు. గత శుక్రవారం నుంచి మొదలైన ఊళ్ల ప్రయాణాలు సోమవారం రాత్రి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం సంక్రాంతి కావడంతో ఆరోజు ప్రయాణించే వారి సంఖ్య నామమాత్రంగానే ఉండనుంది. స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఈనెల 20 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. 21 నుంచి వీటిని తెరవనున్నారు. దీంతో ఊళ్లు వెళ్లిన వారు నగరానికి చేరుకోవడానికి కనీసం మరో ఐదారు రోజులైనా పడుతుంది. అందువల్ల ఆదివారం వరకు స్వస్థలాలకు వెళ్లే వారు తిరిగి వచ్చే పరిస్థితి లేదు. దీంతో నిత్యం ప్రజలతో కళకళలాడే విశాఖ నగరం ఈ నాలుగు రోజులు బోసిపోనుంది. ఏటా సంక్రాంతి సెలవుల్లో నాలుగైదు రోజులు నగరంలో చిన్న, చితక హోటళ్లు మూతపడతాయి. దీంతో ఆ రోజుల్లో అల్పాహారం దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. నగరంలో వాహనాల సంచారం కూడా బాగా తగ్గుతుంది. రోడ్లు కూడా ఖాళీగా దర్శనమిస్తాయి. ఈ ప్రభావం మంగళవారం నుంచి కనిపించనుంది. కిక్కిరిసిన వస్త్ర దుకాణాలు సోమవారం భోగీ రోజున వస్త్ర దుకాణాలు కిక్కిరిసిపోయి కనిపించాయి. సంక్రాంతి నాడు కొత్త దుస్తులను విధిగా ధరిస్తారు. అందువల్ల కుటుంబ సభ్యులకు వీటిని కొనుగోలు చేయడానికి చివరి రోజైన భోగి నాడు జనం ఎగబడతారు. ఇలా నగరంలోని అన్ని వస్త్ర దుకాణాలతో పాటు ఫుట్‌పాత్‌పై జరిగే అమ్మకాల వద్ద అత్యంత రద్దీగా కనిపించాయి. అలాగే ఇప్పటిదాకా వివిధ కారణాల వల్ల ఊరెళ్లలేకపోయిన ప్రయివేటు ఉద్యోగులు, వ్యాపారులు సోమవారం పయనమయ్యారు. వీరితో ఇటు ఆర్టీసీ బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు జనంతో కిటకిటలాడాయి. ఏ బస్సు చూసినా, ఏ రైలు చూసినా నిలబడడానికి ఖాళీ లేనంత రద్దీతో వెళ్లాయి. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు, ప్రత్యేక బస్సులు వీరి డిమాండ్‌కు తగినట్టుగా అవసరాలు తీర్చలేకపోయాయి. -
ఎన్నికల రోజూ తరగతులా..?
సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఈ నెల 6, 7 తేదీల్లో అధికారికంగా సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ఎల్బీనగర్లోని శ్రీ చైతన్య రెసిడేన్షియల్ కాలేజీ ఏసీ క్యాంపస్ యాజమాన్యం యథావిధిగా హాస్టల్‌ను కొనసాగించింది. ఎన్నికల సందర్భంగా తమ ఊరికి వెళ్లి ఓటు వినియోగించునేందుకు అనుమతి ఇవ్వాలని పలువురు విద్యార్థులు కోరినా నిర్వాహకులు అంగీకరించకపోవడంతో వారు మనస్తాపానికి లోనయ్యారు. చేతిపై గాట్లు పెట్టుకుని నిరసన... ఎల్బీనగర్లోని శ్రీచైతన్య రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో 800 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. వీరిలో చాలా మందికి ఓటు హక్కు ఉండటంతో ఓటును వినియోగించుకునేందుకు సెలవు ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరగా నిర్వాహకులు అందుకు నిరాకరించారు. ప్రజాప్రాతినిథ్య చట్టం 1951 సెక్షన్ 135(బి) ప్రకారంఎన్నికల తేదీల్లో విధిగా ఆయా సంస్థలకు వేతనంతో కూడిన అధికారిక సెలవు ప్రకటించాలని ఇటీవల ఎన్నికల కమిషన్ స్వయంగా ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు కాలేజీలు, విద్యాలయాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినా సదరు యాజమాన్యం లెక్కచేయకపోగా గురువారం యథావిథిగా తరగతులు నిర్వహించడంతో మనస్థాపానికి గురైన ఆరుగురు విద్యార్థినులు స్కేళ్లతో తమ చేతులపై గాట్లు పెట్టుకుని నిరసన తెలిపారు. తమ పట్ల యాజమాన్యం అమానుషంగా ప్రవర్తిస్తోందని ఆరోపిస్తూ వాయిస్ రికార్డులను మీడియాకు పంపారు. దీంతో మీడియా ప్రతినిధులు హాస్టల్ కు చేరుకోగా, విద్యార్థినులను కలిసేందుకు యాజమాన్యం నిరాకరించింది. తమ హాస్టల్లో ఎలాంటి ఘటన చోటు చేసుకోలేదని, ఆ వాయిస్ రికార్డ్ కూడా తమ హాస్టల్ విద్యార్థులది కావని డీన్ జగదీష్ పేర్కొన్నారు. ఏసీపీ విచారణ... దీనిపై బాలల హక్కుల సంఘం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్‌కు ఫిర్యాదు చేయగా, సీపీ ఆదేశాల మేరకు ఎల్బీనగర్ ఏసీపీ పృధ్వీధర్‌రావు కాలేజీకి వెళ్లి విచారణ చేపట్టారు. కాగా దీనిపై ఫిర్యాదు చేసేందుకు విద్యార్థినులు ముందుకు రాలేదు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. చర్యలు తీసుకుంటాం... ‘జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు రెండు రోజుల పాటు సెలవు ఇవ్వాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. నేనే స్వయంగా ఆయా కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలకు ఫోన్ చేశాను. ఎన్నికల విధుల్లో ఉన్నందున దాన్ని ఫాలో అప్ చేయలేక పోయాం. ఇప్పటి వరకు ఈ విషయం నా దృష్టికి రాలేదు. నిబధనలను ఉల్లగించిన సదరు కాలేజీపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం’ –సుధారాణి, ఇంటర్మీడియట్ బోర్డు అధికారిణి, రంగారెడ్డి జిల్లా -
పొదుగు
‘‘పొద్దన్నంతా యాడేడో తిరిగొచ్చిందిచాలక ఇంకేడికి బోతన్నావురా’’ అని లోపల్నించే కసురుకుంది అమ్మ. పంచలో కుక్కిమంచంలో కునికిపాట్లుపడుతున్న నాయనమ్మ ఉలిక్కిపడి ‘‘పిలకాయలకు ఇస్కూలు సెలవులిస్తే ఇంటిపట్టున యాడుంటారు చెప్పు. అయినా ఇంటికాడుంటే ఇద్దరికీ క్షణం పడదు’’ అని గొణిగి మంచానికి ఆనించిన చేతికర్రతో అక్కడక్కడే తిరుగుతున్న కోడిపుంజుని హుష్పాడుకోళ్ళు’’ అని అదిలించింది.నాగి చొక్కా గుండీలు పెట్టుకుంటూ గడ్డివాము అవతలకి దాటాడు. గడ్డివాముకి పక్కనే చెట్టునీడకి కట్టేసిన గేద ఊరికూరికే తలమీద విసిగిస్తున్న ఈగని అదిలించడానికి కొమ్ములు విదిలించింది.సీత చేతులు వెనక్కి కట్టుకుని అడుగులో అడుగేసుకుంటూ గడ్డివాముదాకా వచ్చి నాగి ఎటుపోతున్నాడా అని చూసింది. ‘‘నువ్వేడికే.. ఆడితోపాటు నువ్వుకూడా పోతావా ఏంది?’’ అని మళ్ళీ సీతను కసురుకున్నది నానమ్మ. ఆసరికే నాగి గడ్డివాము దాటుకుని, ఇంటెనక కాలవ దూకి దాసరోళ్ళ పెరడు అవతలికి వెళ్ళి వెనక్కు చూసాడు. సీత ఇంకా అక్కడే నిలబడి చూస్తా ఉంది. ‘‘ఈయమ్మి రెండు మూడు దినాలనుంచి నాకు చూపించకుండా ఏదో దాస్తా ఉంది. అదేందో తేలడంలా.. అనుకున్నాడు నాగి. అమ్మయితే కొనుక్కోవడానికి ఏమీ ఇవ్వదు. ఇంట్లో వండింది తనకు తెలీకుండా పోదు. నిన్న రాత్రి నాయన సీతకి ఇచ్చిన రూపాయిలో అర్ధరూపాయి నాకీయకపోతే అమ్మూరుకోదు. ఇక నాయనమ్మ దగ్గర ఏదన్నా ఉంటే అది నాకే.. ఇంతకీ ఆయమ్మి ఏది దాచిపెడుతున్నట్టు అనుకున్నాడు. అలా అనుకుంటూనే ఊరవతలకి వచ్చేసాడు. నడిమధ్యాహ్నం దాటిన ఎండ. పైన నిట్టనిలువు సూర్యుడు మలుపు తిరిగాడు. కొమ్మలు ఎత్తిపట్టుకున్న పొడవాటి చెట్లకు నీడలు మొదలయ్యాయి.సీమచింతకాయ చెట్టుమీద పికిలిపిట్ట ఊరికూరికే ఉలిక్కిపడుతూ ఒకటే ఆ కొమ్మకూ ఈ కొమ్మకూ ఎగురుతూఉంది. సెలవురోజు వస్తే నాగి ఇంటిదగ్గర ఉండడు. ఊరవతల కాలవ దాటుకొని పోరంబోకు బూముల్లో చెట్లు పుట్టల మధ్య జీరంగులకోసమో, రేక్కాయలకోసమో, కలేక్కాయల కోసం తిరుగుతుంటాడు. ఏదీ లేకపోతే కావలగట్టుమీద కూర్చుని చేపలుపట్టే ముసలితాతతో కలిసి చేపలు పడుతూంటాడు. చేపలతాత పేరేమిటో తెలీదు. ఆయనకి ఇల్లూ వాకిలి లేదంటారు. నాగికి ఊరిబయటే పరిచయం. ఎప్పుడు చూసినా కాలవలో నుంచుని మోకాలులోతు నీళ్ళలో వంగుని వల సవరించుకుంటూనో నీళ్ళలో చేపలకోసం తడుముకుంటూనో ఉంటాడు. అతడి కాళ్ళు చేతులు నీళ్ళలో నానినాని మెత్తగా చీకిపోయి ఉంటాయి.బక్కపల్చటి నల్లటి శరీరం. భుజానికి తగిలించిన తాటాకు చేపలబుట్ట వేలాడుతూ ఒంటిమీద చొక్కా ఉందో లేదో అన్నట్టు ఉంటుంది. నల్లటి మొహానికి వేలాడే పలుచటి పొడవాటి గడ్డం. కాలవలో వంగుని వలను సర్దుకుంటున్న తాతను చూసి ‘‘ఏం తాతో ఇయ్యాల సేపలు దొరికినయ్యా’’ అన్నాడు.నీళ్ళలో వంగున్న తాత నడుమెత్తి ‘‘నువ్వా నాగి.. ఇయ్యాల ఇస్కూలు లేదా.. చాన్నాళ్ళకొచ్చినావే’’ అన్నాడు.‘‘స్కూలు లేత్తాతా’’ అని తాతకి సమాధానం చెబుతూ ఒడ్డునుంచి నీళ్ళలోకి దిగాడు. చల్లగా తగిలాయి. ఇంకాస్త ముందుకెళ్ళాక నీరు మోకాళ్ళపైదాకా వచ్చి నిక్కరు అంచు తడిసింది. గులకరాళ్ళని ఆసరాగాచేసుకుని నిదానంగా అలలకు ఎదురడుగులేస్తూ కాలవ అవతలికి వెళ్ళాడు. కాలవగట్టు? పైనుంచి ఏటవాలు కరకట్ట కిందకి అడుగులు దబదబ పడ్డాయి. పరిగెడుతున్నట్లు అక్కడ్నుంచి చింతతోపులోకి వచ్చాడు. అక్కడికి చీకట పడితే మనుషులెవరూ ఉండరు. గుబురు చింతచెట్లకింద నీడ ఉన్నా పిల్లలెవరూ అటువైపు వెళ్ళరు. చింతతోపు దాటాక నడక నెమ్మదించింది. డొంకదారిలో బాగిమాను మీద వాలిన ఒంటరి జెముడుకాకిని చూసుకుంటూ తాటితోపులోకి అడుగుపెట్టాడు. తాటి చెట్లు ఒకదాని వెనక మరొకటి వరసకట్టి గుండ్రంగా గుంపులు గుంపులుగా నుంచున్నాయి.తోపు మధ్యలో జపాన్ తుమ్మ, బూరుగు, కానుగ చెట్లు దట్టంగా ఉన్నాయి. కొత్త మనిషిని చూసి ఉడతొకటి ఉలిక్కిపడి చెట్టు తొర్రలోకి తుర్రుమంది. నేలమీద చీదరవాదరగా పెరిగిన మొక్కలు. కొన్ని ఉమ్మెత్త, జిల్లేడు, నాంజేడు, ఉత్తరేణి లాంటి మోకాలెత్తు మొక్కలు. మనిషి చేతికి అందేట్లు కొమ్మలున్న వేప, అవదం చెట్లు. చిగురు చేతికందనంత దూరంలో ఆకాశం చివరికి విస్తరించిన యూకలిప్టస్ చెట్లవరస. గుచ్చుకుంటే ఏమవుతుందో అని భయపెట్టే కరెంటుతుమ్మ ముళ్ళు. ఎక్కడపడితే అక్కడ ఆకుపచ్చ గచ్చపొదలూ, విసిరేసినట్లున్న రాళ్ళూ రప్పలు. పలికిచెట్టు పక్కనుంచి నడుస్తుంటే రెండడుగుల దూరంలో కొమ్మచివర తూనీగ కనిపించింది.నిదానంగా వెనకాలే వెళ్ళి వంగి పట్టుకునేంతలో మళ్ళీ అది ఎగిరిపోయి మనిషి నిలబడి అందుకునేంత ఆకు మీద వాలింది. ముందుకెళ్ళి నిదానంగా కొమ్మ వెనకాలే మునివేళ్ళమీద నుంచుని ఆకుమీద వాలిన తూనీగ తోక పట్టుకోబుతుండగా ఉన్నట్లుండి అక్కడ చెదురుమొదురుగా ఉన్న సన్నటి కొమ్మల మధ్య గోధుమరంగు గువ్వ కనిపించింది. దాని రెక్కల మీద మచ్చలు. నాగి బిత్తరపోయి దాన్నలా చూస్తుండగానే అది ఒక నిమిషం అలాగే కూర్చుని నాగిని చూసి టపటపా రెక్కలు విదిల్చి ఒక్కసారిగా దబ్బున ఎగిరిపోయింది. నాగి ఉలిక్కిపడి కొంచెంసేపు అలానే నిలబడి కొమ్మల్ని పక్కకి వంచి రెండడుగులు ముందుకెళ్ళి మునివేళ్ళమీద నుంచుని గూట్లోకి చూసాడు. సన్నటి పుల్లలతో కూర్చినట్లున్న గూడు. కొమ్మల మధ్య అల్లిన అమరిక.పదిలంగా రెండు తెల్లటి గువ్వ గుడ్లు. వెడల్పాటి గోళీకాయల్లా. చేతికందేంత దగ్గరగా. నాగి వెనక్కి జరిగి అలానే నుంచుండిపోయాడు. తూనీగ ఎటెళ్ళిపోయిందో గాలిలో కలిసిపోయింది. ఎగిరిపోయిన గువ్వ ఎక్కడా కనిపించలేదు. నాగి అక్కడే నేలమీద కూర్చుండిపోయాడు. ‘గువ్వ గుడ్లు చూసాడంటే ఎవరూ నమ్మరు. అమ్మకి చెప్తే యాడాడ తిరిగొస్తన్నావురా అని చెవులు మెలిపెట్టుద్ది. సీతకి చెప్తే చాల్లే అబద్ధాలు అంటుంది. నానమ్మ అసలు వినిపించుకోదు. ఇక మిగిలింది ఇంటి పక్కనే ఉండే సికాకోళ్ళ శీనుగాడికి చెప్తే వాడస్సలు నమ్మడు. బో..చూసాంలేవో.. మేమూ చూసాం..అని అబద్ధమాడతాడు. లోకంలోని వింతలన్నీ వాడికే తెలుసునంటాడు.’ తను గువ్వ గూడు చూసినట్లు ఎవరికైనా చెప్పాలనిపించింది నాగికి. వెనక్కి కాలవ దగ్గరకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు.నాగి చెప్పింది వినగానే ‘‘గువ్వగూడా.. నువ్వేమన్నా కదిపినావా? అన్నాడు తాత ఒడ్డున కూర్చుని ఎండకు ఒళ్ళు ఆరబెట్టుకుంటూ.‘‘లేతాత్తా.. నేనేం కదపలేదు’’ ‘‘సరే..పోయి చూద్దాం పద’’ అన్నాడు తాత. ఇద్దరూ చెట్టు దగ్గరకు వచ్చారు. తాత చెట్ల గుబురులోకి వెళ్ళి కొమ్మల్ని తప్పించి లోపలికి చూస్తూ ‘‘యాడబయా.. ఇక్కడ గూడేం లేదే’’ అన్నాడు. ‘ఉంది తాతా నేనకడ్నే చూసాను’’. తాత మళ్ళీ లోపలకి ముందుకెళ్ళి వెతికాడు. ఈసారి నాగికూడా కొమ్మల్లోకి దూరాడు. అక్కడ కొమ్మలు తప్ప గూడేం కనిపించలేదు. ‘‘గువ్వేనంటావా?’’ అన్నాడు తాత.‘‘గువ్వనే తాత. రెక్కలమీద మచ్చలుగూడా ఉండాయి. ఇక్కడ్నే చూసినాన్తాతా.. గూట్లో గుడ్లు కూడా ఉండాయి.’’తాత ఒకడుగు వెనక్కేసి ‘‘గుడ్లుండాయా.. అన్నాడు ఆశ్చర్యపోయి. నా కళ్ళతో చూసినాన్తాతా...‘‘గుడ్లున్న గూట్లో సెయ్యిపెట్టినావా?’’ అనడిగాడు తాత కళ్ళు పెద్దవిచేసి.‘‘లేతాత్తా. అడుగు దూరం నుంచి సూసినానంతే. నన్ను సూడగానే అది లటక్కమని ఎగిరిపోయింది.’’ ‘‘నిన్ను గూటిదగ్గర సూస్తే మళ్ళీ అది గూటికి రాదబయా’’ అన్నాడు తాత బాధగా మొహం పెట్టి. ‘‘ఎందుకు రాదు తాతా?’’‘‘అదంతే అబయా.. పిట్ట గూటిమీద నరుడి నీడ పడితే అది గూటికి చేరదు. ఇంక సెయ్యిపెడితే సరేసరి.. అంతే సంగతి.’’ తాత మళ్ళీ గుబురులోకి దూరాడు. ఎంత వెతికినా అక్కడ గూడు కనిపించలేదు. మనుషుల తొక్కిడికి కొమ్మలు పక్కకి తిరిగి గుబురు చెదిరింది. చివరికి తాత కొమ్మల్లోంచి బయటికి వచ్చాడు.‘‘ఇక్కడేం లేదబయా. మడిసి నీడ పడిన గూడు. గువ్వ మాయం చేస్తది. సరే ఇక ఇంటికి పోదారి.’’ ‘‘నిజ్జెం తాతా. నేనిక్కడే నా కళ్ళతో సూసినాను. నన్ను సూడగానే ఎగిరిపోయింది. మచ్చల గువ్వు’’ తాత బయటికి వచ్చాక నాగి మళ్ళీ లోపలికి వెళ్ళాడు. కొమ్మకొమ్మనూ చూసాడు. అదే చెట్టు. అదే కొమ్మ.అతడి చూపులు అంతకుముందు చూసినదానికోసం వెతుకుతూ ఉన్నాయి. తను వెతికేది అంతకుముందు చోటేనా అని మళ్ళీ చూసుకున్నాడు. వెతికేకొద్దీ పట్టుదల ఎక్కువైంది. చూసినచోటు అదికాదేమోనని పక్కన ఉన్న చెట్ల కొమ్మల్లోకి వెళ్ళి వెతికాడు. కొద్దిసేపటిక్రితం కనిపించింది మళ్ళీ కనిపించలేదు. గువ్వ ఎగిరిపోయింది సరే. గూడూ మాయమైంది. నాగిని నిండా నిరాశ కమ్ముకుంది. నాగి నుంచున్న చోటునే కూలబడి కూర్చున్నాడు. ఎదురుగా తొండ ఒకటి సర్రున ముందుకు పాకి తల పైకీ కిందికీ తిప్పుతూ ఎక్కిరిస్తా ఉంది. అప్పటికే తాత వెనక్కి మళ్ళి చెట్లమధ్య కనుమరుగయ్యాడు. ఉన్నట్టుండి నాగికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఏదో వింత వస్తువు చేతికి అందినట్లే అంది చేజారినట్లయింది. గువ్వ గూటికి రాదని తెలిసీ తెలియని దుఃఖం పొంగుకొచ్చింది. దుఃఖం ఏడుపుగా మారింది. ఏడుపు ఎక్కిళ్ళయింది. అప్పటికి పొద్దు గుంకుతూ ఉంది. బూడిదలో ఆరిపోతున్న నిప్పులా ఉన్నాడు చివరి సూర్యుడు. పడమటి ఆకాశం ఎర్రగా పగిలింది. చెట్ల నీడలు నిదానంగా తూరుపుకి పరుచుకుంటున్నాయి.పిట్టలు గూళ్ళకు చేరే సమయం. మధ్యాహ్నమంతా కాసిన ఎండకు నుదురు నల్లబడింది. చెంపల మీద ఆరిపోయిన కన్నీళ్ళు చెమటతో కలిసి చారికలు కట్టాయి. జుట్టు ముందుకు పడింది. మొహం వాడిపోయింది. ఎప్పుడొచ్చినాడో చేపల్తాత మళ్ళీ ఎదురుగా వచ్చి నుంచున్నాడు. ఏడుస్తున్న నాగిని చూసి కలవరపడ్డాడు. ‘‘ఏందబయా.. ఇంకా ఇంటికి పోలేదా. ఎందుకేడస్తండా..’’తాతను చూసాక మళ్ళీ ఎక్కిళ్ళు మొదలైనాయి. మాసిన కాలరుతో కళ్ళు తుడుచుకున్నాడు. నాగెందుకు ఏడుస్తున్నాడో చేపలతాతకు ముందు అర్థం కాలేదు. అర్థమయ్యాక ‘ఓ అదా సంగతి’ అన్నాడు. ‘‘యిక ఇంటికిపా.... సీకటి పడతా ఉంది. నిన్ను ఊరికాడ దిగబెడతా.. పురుగూ పుట్రా వుంటది. సీకటి పడ్డాక గువ్వ ఇంటికొస్తదబయా. ఏడవబాకబయా.. నే మంత్రమేస్తాగా. నువ్వు కదిలేదాక అదిక్కడికి రాదు. తాత భుజంమీద చేయివేసి సముదాయించాడు. నాగి కాలరుతో కళ్ళు తుడుచుకున్నాడు. చేపలతాత బుట్ట చంకనేసుకున్నాడు. ఇద్దరూ ఊరుదారి పట్టారు. నాగికి అడుగులు ముందుకు పడుతున్నా ధ్యాసంతా వెనకే ఉంది. దారిలో ఏ పిట్ట కనిపించినా అది గువ్వేనేమో అని తేరిపార చూస్తున్నాడు. పడమటి దిక్కున పగిలిన ఆకాశం మెల్లగా మూసుకుపోతూ మసక చీకటి అలముకుంటూ ఉంది.దూరంనుంచి కనిపిస్తున్న ఊరిచివరి వీధిలైటు మిణుక్కుమంటూ ఉంది. అలవాటైన దారిలో గబగబఅంగలేస్తున్న తాత తాటితోపులో అడుగుపెట్టాడు. తాత నీడని అంటిపెట్టుకుని పరిగెడుతున్నట్లు నడుస్తున్న నాగి వెనక్కి చూసాడు. డొంకలో నిలబడ్డ నిలువెత్తు తాటిచెట్లు తిరిగి చూస్తున్న చింపిరి జుట్టు మనుషుల్లా ఉన్నాయి. ఇద్దరూ చింతతోపుదాకా వచ్చేసరికి పూర్తిగా చీకటిపడి చల్లటి గాలి మొదలైంది. అప్పటిదాకా వెనకెనక్కి చూసుకుంటూ తాతకు వెనకాలే నడుస్తున్న నాగి తాత పక్కకివచ్చి నడవసాగాడు. చెట్లమీద గూళ్ళకు చేరిన పిట్టలు చీకట్లో కికిక్..కికిక్..అంటూ చప్పుడు చేస్తూ ఉన్నాయి. దబదబ అడుగులేస్తున్న తాత ఒక్కసారి ఆగి తలపైకెత్తి ఆకాశంలోకి చూసి వానరాబోతుందబయా.. దబదబ నడవాలి అన్నాడు. కళకళమని చప్పుడు చేసుకుంటూ ప్రవహిస్తున్న కాలవలో గులకరాళ్ళమీద పాదాలు గుదిగుచ్చినడుస్తూ ఇద్దరూ కాలవదాటారు. కాలవలో నీళ్ళు నిరంతరంగా ప్రవహిస్తూనే ఉన్నాయి.చివరికి పొలిమేరల దగ్గర కాలిబాట రెండుగా చీలిన చోట చేపల్తాత నుంచుండి పోయాడు. ‘‘ఇక దబ్బున ఇంటికిపా.. మీ అమ్మనాయినలు ఎదురుసూస్తా ఉంటారు. దబ్బున పో.. అంటూ వెళ్ళిపోయాడు. అవతలిపక్క కాలిబాటమీద నడుచుకుంటూ పోతున్న తాత చెట్లమధ్యనుంచి చీకట్లో కనుమరుగయ్యాడు. పూర్తిగా చీకటి పడింది. ఊళ్ళోకి అడుగుపెట్టి దాసరోళ్ళ పెరడు దగ్గరకు వచ్చేసరికి దబదబమని చినుకులు మొదలయ్యాయి. నాగి పరుగందుకున్నాడు. గడ్డివాము దగ్గరకొచ్చేసరికి వానలో తడుస్తున్న గేద మోరతిప్పి చూసింది. ఇంటిదాకా వచ్చేసరికి చొక్కాలాగు పూర్తిగా తడిసిపోయాయి. నాగిని చూడగానే ‘‘ఇంత సీకటిదాక ఇంత వానలో యాడ తడిసొస్తండా.. ఇప్పుడేళయిందా నీకు’’ అన్నది నాయనమ్మ కేకేసింది. నెత్తిమీద చీరకొంగు వేసి తడిసిన తల తుడిచింది. ‘‘అన్నాలేళయిందిగా అయ్యగారికి పెత్తనాలు అయిపోయాయి’’ అన్నది అమ్మ లోపలనుంచి. బయటి వానకి పొయ్యి లోపల పెట్టింది అమ్మ. అడ్డం పెట్టిన తడిక సందుల్లోంచి తెల్లటి పొగ ఒకటే బయటికి వస్తాఉంది. వానకు తడిసిన పుంజు పంచలో చోటుకోసం అటూ ఇటూ తిరుగుతూ ఉంది. తడిసిన బట్టలిప్పి నిక్కరేసుకుని మళ్ళీ మంచమ్మీద నానమ్మ పక్కన కూర్చుంటూ ‘‘సీతక్కాడికి పోయిందే? అన్నాడు. ‘‘పొద్దుగూకాక మీ నాయిన దాన్ని బయటికి తీసుకెళ్ళాడు.వాళ్ళటెళ్ళారు.. ఇటు వాన మొదలైంది’’ అన్నది నాయనమ్మ మంచంలో ఒరుగుతూ. ‘‘కొనుక్కోడానికి దానికేదన్నా ఇచ్చినావేమే?’’ అన్నాడు. ‘‘ఇయ్యడానికి నాకాడ యాడుండాయి.మీనాయన బజారుకు తీసుకెళ్ళాడుగా.. వచ్చేటప్పుడు కారబ్బూంది తెస్తారేమో.. తీసుకుని తిను ’’ అన్నది నాయనమ్మ. నిర్విరామంగా కురుస్తున్న వానకి కరెంటు పోయింది. చీకట్లో అమ్మ కిరసనాయిలు దీపం ముట్టించింది. మంచంమీద నుంచి లేచి నట్టింట్లో దీపం ముందు కూర్చున్నాడు. వానకి తడిసి ఆరిన ఒళ్ళు దీపం వెలుతురులో మెరుస్తూ ఉంది. సీత దాచిపెట్టిందేదో వెతకాలనుకున్నాడు. నిలబెట్టిన నవారు మంచంకోడెక్కి బీరువా పైన చూసాడు. అక్కడ ఏదీ కనపడలేదు. గూట్లో ఉన్న స్కూలుబ్యాగులో చెయ్యిపెట్టి లోపటిదాకా వెతికాడు. నలిగిన స్కూలు పుస్తకాలూ, ఒకటి రెండు నలిగిన కాగితాలూ తప్ప ఏంలేవు.జామెంట్రీబాక్సు తెరిస్తే అందులో పెన్నూ పెన్సిలూ, రబ్బరూ తప్ప మరేంలేవు. ‘‘దాని ఇస్కూలు బ్యాగు నీకెందుకురా? అని అమ్మ కసిరి పొగలుకక్కుతున్న అన్నంపళ్ళెం ముందు పెట్టింది. బ్యాగు అక్కడే ఒదిలేసి కూర్చుని అన్నం తింటుంటే చెక్కబీరువా కిందనుంచి రెండు చుంచులు బయటికి వచ్చాయి. అమ్మ వాటిని చూసి హుష్షో అంది విసుగ్గా. చుంచులు చటుక్కున బీరువా కిందికి ఉరికాయి.నాగి పళ్ళానికి పక్కన రెండు అన్నం మెతుకులు వేసాడు. చుంచులు మళ్ళీ బయటికి వచ్చి మెతుకులు తిన్నాయి. పళ్ళెంలో చెయ్యి కడుక్కుని మళ్ళీ నానమ్మ పక్కలోకి చేరాడు. మంచంకింద సదురుకున్న పుంజు అప్పుడప్పుడూ కురకుర మంటూ ఉంది. ‘‘నానమా గువ్వ గూట్లో సెయ్యి పెడితే ఏమయిద్దే?’’ అన్నాడు. ‘‘ఏమయిద్ది. ఏం కాదు. గువ్వ గూట్లో సెయ్యి పెట్టావా’’ అన్నది నానమ్మ . ‘‘లేదు నానమా..’’ అన్నాడేకాని చీకట్లోకి చూస్తూ గువ్వ తనను చూసిందని చెప్దామనుకున్నాడు. చెప్పలేదు. ఈపాటికి గువ్వ గూటికి చేరి ఉంటదా అని కాసేపు విచారించాడు. తోటి గువ్వ ఎక్కడ కూర్చుంటదా అనుకున్నాడు. మరికాసేపు వానలో తడిసిన గుడ్లు ఏమవుతాయా అనుకున్నాడు. పగలంతా తిరిగిన అలసటకి కళ్ళు మూతలు పడ్డాయి. నానమ్మను చుట్టుకుని నిద్రలోకి జారిపోయాడు.తరవాత నిద్రలో దూరంగా రోడ్డుమీద సైకిలు బెల్లు కొట్టిన చప్పుడూ, నాయిన రావటం, నాయనమ్మ లేచి కూర్చోడం, సీత కారబ్బూందీ పొట్లం విప్పటం, అమ్మ తిట్లూ వినిపించాయి. మెలకువ వచ్చినట్లయి మళ్ళీ ముడుచుకుపడుకున్నాడు. నాన్న నాగిని రెండు చేతులతో ఎత్తుకుని లోపల మంచంమీద పడుకోపెట్టాడు. అప్పటిదాకా కురిసిన వానకి చలి మొదలయింది. నాగి వెచ్చటి దుప్పటిలోకి మరింత ముణగదీసుకున్నాడు. నిద్రలో చలి. చలిలో చీకటి. చీకట్లో వాన. చీకటి నీలంరంగు వెలుతురులోకి తెరుచుకుంది. నేలమీద ఉత్తరేణి పొదలు. చేతికి అందుతున్న కానుగ చెట్టు కొమ్మలు. హఠాత్తుగా కళ్ళముందర చేపల్తాత కనిపించాడు. ‘‘ఏడవబాకబయా.. గువ్వలొస్తాయిగా నేను మంత్రమేస్తానుండు’’ అన్నాడు. నాగికి కాలవగట్టుమీద నిలబడి చూస్తున్నాడు. చేపల్తాత నేలపైన ఒంటికాలిమీద నుంచుని తపస్సు చేస్తున్న మునివలె రెండు చేతులూ పైకి గాలిలోకి నిట్టనిలువుగా చాపాడు. తరువాత కుడిచేయి పైకే ఉంచి ఎడమచేయి ముందుకు చాపాడు. ఆ తరువాత కుడిచేయి ముందుకు సాచి ఎడమచేతితో కలిపాడు. ముందుకు చాచిన గుప్పిట. ‘‘తీసుకో నాగి’’ అన్నాడు తాత. నాగి చెయ్యిచాచాడు. చేతివేళ్ళకి మెత్తగా తగిలింది. నాగి జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని చూసాడు. అది గోధుమరంగు మచ్చలగువ్వ ! మొహం మీద వానచినుకులు పడుతున్నాయి. ఎవరో మొహం మీద చల్లటి నీళ్ళు చిలకరించారు. నాగి ఒక్కసారిగా నిద్రలో ఉలిక్కిపడ్డాడు. ఒళ్ళు జలదరించినట్లయింది. ముక్కుమీద ఏదో చిన్నగా గుచ్చుకున్నట్లయింది. ఒకసారి అటూ ఇటూ మెసిలిమళ్ళీ దుప్పట్లోకి మునుక్కున్నాడు.‘‘నిద్దట్లో ఎవర్ని పిలస్తండా’’ అన్న మాట వినిపించింది. దిండుమీద తల దగ్గర మళ్లీ ఏదో కదిలిన చప్పుడయింది. నాగి కళ్ళు తెరిచి చూసాడు. పసుపురంగు దూదిలా ఉంది. రెండు చిన్నటి కళ్ళు. నన్నటి ముక్కు. పసుపురంగు కోడిపిల్ల. నాగి దానికేసి చూస్తుండగానే పసుపురంగు కోడిపిల్ల తల అటు ఇటు తిప్పి నాగి మొహంమీద మరోసారి ముక్కుతో పొడిచింది. అతడి కళ్ళు నవ్వాయి.చేతివేళ్ళు సుతారంగా కోడిపిల్లని పట్టుకున్నాయి. సీత తనకు చెప్పకుండా దాచిపెట్టినదేదో అర్థమయ్యింది. వెనక ఎవరో గట్టిగా నవ్వుతున్నారు.. ...సీత -
యథావిధిగా బ్యాంకులు పనిచేస్తాయి
న్యూఢిల్లీ: సెప్టెంబర్ మొదటి వారంలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు వరుసగా ఆరు రోజులు సెలవులంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అసత్యమని ఆర్థిక శాఖ స్పష్టంచేసింది. వచ్చేవారంలో ఉన్నటువంటి సాధారణ సెలవులు మినహా యించి మిగిలిన రోజుల్లో బ్యాంకులు, ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయని వివరించింది. సెప్టెంబర్ 2 (ఆదివారం), సెప్టెం బరు 8 (రెండవ శనివారం) మినహా సెలవులు లేవని స్పష్టత ఇచ్చింది. సెప్టెంబరు 3న కృష్ణాష్టమి పండుగ కాగా, ఆ రోజున దేశవ్యాప్త సెలవులేదని.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే సెలవు ఉంటుందని వివరించింది. సెలవు రోజుల్లో ఏటీఎంలు, ఆన్లైన్ లావాదేవీలలో ఎటువంటి అంతరాయం ఉండబోదని భరోసా ఇచ్చింది. వచ్చే వారం ఏటీఎంలలో తగినంత నగదును నిర్వహించాల్సిందిగా బ్యాంకులను సూచించినట్లు వెల్లడించిన ఆర్థికశాఖ.. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక ప్రకటన ద్వారా వివరించింది. -
బక్రీదు: మార్కెట్లకు సెలవు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లకు నేడు ( బుధవారం) సెలవు. బక్రీద్ పర్వదినం సందర్భంగా ఇవాళ దేశీయ మార్కెట్లకు సెలవును ప్రకటించారు. దీంతో ఇవాళ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు పనిచేయవు. తిరిగి గురువారం యధావిధిగా మార్కెట్లు ప్రారంభం కానున్నాయి.