అత్తగారి ఊర్లో అన్నీ బంద్! | bandh at raina s mother in law s place for semi final match | Sakshi
Sakshi News home page

అత్తగారి ఊర్లో అన్నీ బంద్!

Published Thu, Mar 26 2015 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 PM

అత్తగారి ఊర్లో అన్నీ బంద్!

అత్తగారి ఊర్లో అన్నీ బంద్!

క్రికెట్ కోసం ఆఫీసులు ఎగ్గొట్టడం, రోడ్లు అన్నీ ఖాళీ కావడం తరచుగా చూస్తూనే ఉంటాం. సెమీఫైనల్ కోసం ఒక ఊరు ఊరంతా సెలవు తీసుకున్నారు.

బగ్‌పథ్: క్రికెట్ కోసం ఆఫీసులు ఎగ్గొట్టడం, రోడ్లు అన్నీ ఖాళీ కావడం తరచుగా చూస్తూనే ఉంటాం. సెమీఫైనల్ కోసం ఒక ఊరు ఊరంతా సెలవు తీసుకున్నారు. దీనికి కారణం ఉందండోయ్... ఆ ఊరికి కాబోయే అల్లుడు రైనా భారత్ తరఫున సెమీస్ ఆడుతున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని బామ్నాలి అనే గ్రామవాసులంతా గురువారం సెలవు దినంగా ప్రకటించుకున్నారు. ఈ గ్రామానికి చెందిన ప్రియాంకను రైనా త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. షాప్‌లన్నీ మూసేసి... గ్రామంలో బిగ్‌స్క్రీన్ ఏర్పాటు చేసుకుని అందరూ కలిసి మ్యాచ్ చూడబోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement