న్యూఢిల్లీ: ప్రతి సంవత్సరం దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ చీకటి నుండి వెలుగులోకి మారే పయనాన్ని సూచిస్తుంది. దీపావళి సందర్భంగా, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ సెలవులు ప్రకటించారు. అయితే ఈసారి దీపావళిని అక్టోబర్ 31న లేక నవంబర్ 1 న జరుపుకోవాలా అనే గందరగోళం చాలామందిలో నెలకొంది. మరి.. ఈసారి దీపావళికి ఏ రాష్ట్రంలో ఎప్పుడు సెలవు ప్రకటించారో తెలుసుకుందాం.
యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో దీపావళికి అక్టోబర్ 31 న సెలవు ఇచ్చారు. నవంబర్ 2 న గోవర్ధన పూజకు సెలవు ఉంటుంది. నవంబర్ 3 న భాయ్ దూజ్ పండుగను జరుపుకుంటారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో ఈ రోజుల్లో మాత్రమే సెలవు దినంగా ప్రకటించారు. అయితే నవంబర్ ఒకటి గురించి స్పష్టంగా తెలియజేయలేదు. మహారాష్ట్రలో సాధారణంగా దీపావళికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. నవంబర్ 1, 2 తేదీలలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు దీపావళి సెలవు ప్రకటించారు. దీపావళికి ముందు, తరువాత పాఠశాలలకు ఏడు నుండి 10 రోజుల వరకూ సెలవులు ఉండవచ్చు. నవంబర్ 1న ఢిల్లీలో దీపావళి సెలవు ఉంటుంది. అయితే కుటుంబ సమేతంగా ఈ పండుగను జరుపుకునేందుకు వీలుగా అక్టోబర్ 31 నుంచి నవంబర్ 3 వరకు పాఠశాలకు సెలవు ప్రకటించారు.
తమిళనాడులో ఈసారి దీపావళి అక్టోబర్ 31, నవంబర్ ఒకటి తేదీల్లో రెండు రోజుల సెలవు ప్రకటించారు. గుజరాత్‌లో దీపావళితో పాటు నూతన సంవత్సరాన్ని కూడా జరుపుకుంటారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు దీపావళి సందర్భంగా ఇక్కడ మూడు రోజుల సెలవు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో కాళీ పూజ, దీపావళిని కలిసి జరుపుకుంటారు. నవంబర్ 1, 2 తేదీలలో ఇక్కడ దీపావళి సెలవు ఉంటుంది. కాళీ పూజ సందర్భంగా అక్టోబర్ 31న కూడా సెలవు ప్రకటించారు.
దీపావళి సందర్భంగా మధ్యప్రదేశ్‌లో రెండు రోజులు సెలవులు ఇచ్చారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు నవంబర్ 1, 2 తేదీలలో మూసివేయనున్నారు. బీహార్‌లో ఈసారి దీపావళికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. నవంబర్ 1, నవంబర్ 2 న ఇక్కడ సెలవు ఉంటుంది. దీనితో పాటు ఛత్ పూజకు సెలవులను కూడా పొడిగించవచ్చు. రాజస్థాన్‌లో ఈ ఏడాది దీపావళికి మూడు రోజుల సెలవులు ఉంటాయి. అక్టోబర్ 31 నుండి నవంబర్ 2 వరకు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయనున్నారు.
కర్ణాటకలో దీపావళికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. నవంబర్ 1, 2 తేదీలలో ప్రజలు ఈ పండుగను సాంప్రదాయ రీతిలో జరుపుకుంటారు. కేరళలో దీపావళికి నవంబర్ 1న సెలవు ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, ఒడిశా తదితర రాష్ట్రాల్లో దీపావళి సందర్భంగా రెండు రోజులు సెలవులు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కిషన్‌రెడ్డి?
Comments
Please login to add a commentAdd a comment