duration
-
దీపావళి.. ఏ రాష్ట్రంలో ఎప్పుడు సెలవు?
న్యూఢిల్లీ: ప్రతి సంవత్సరం దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ చీకటి నుండి వెలుగులోకి మారే పయనాన్ని సూచిస్తుంది. దీపావళి సందర్భంగా, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ సెలవులు ప్రకటించారు. అయితే ఈసారి దీపావళిని అక్టోబర్ 31న లేక నవంబర్ 1 న జరుపుకోవాలా అనే గందరగోళం చాలామందిలో నెలకొంది. మరి.. ఈసారి దీపావళికి ఏ రాష్ట్రంలో ఎప్పుడు సెలవు ప్రకటించారో తెలుసుకుందాం.యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో దీపావళికి అక్టోబర్ 31 న సెలవు ఇచ్చారు. నవంబర్ 2 న గోవర్ధన పూజకు సెలవు ఉంటుంది. నవంబర్ 3 న భాయ్ దూజ్ పండుగను జరుపుకుంటారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో ఈ రోజుల్లో మాత్రమే సెలవు దినంగా ప్రకటించారు. అయితే నవంబర్ ఒకటి గురించి స్పష్టంగా తెలియజేయలేదు. మహారాష్ట్రలో సాధారణంగా దీపావళికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. నవంబర్ 1, 2 తేదీలలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు దీపావళి సెలవు ప్రకటించారు. దీపావళికి ముందు, తరువాత పాఠశాలలకు ఏడు నుండి 10 రోజుల వరకూ సెలవులు ఉండవచ్చు. నవంబర్ 1న ఢిల్లీలో దీపావళి సెలవు ఉంటుంది. అయితే కుటుంబ సమేతంగా ఈ పండుగను జరుపుకునేందుకు వీలుగా అక్టోబర్ 31 నుంచి నవంబర్ 3 వరకు పాఠశాలకు సెలవు ప్రకటించారు.తమిళనాడులో ఈసారి దీపావళి అక్టోబర్ 31, నవంబర్ ఒకటి తేదీల్లో రెండు రోజుల సెలవు ప్రకటించారు. గుజరాత్లో దీపావళితో పాటు నూతన సంవత్సరాన్ని కూడా జరుపుకుంటారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు దీపావళి సందర్భంగా ఇక్కడ మూడు రోజుల సెలవు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో కాళీ పూజ, దీపావళిని కలిసి జరుపుకుంటారు. నవంబర్ 1, 2 తేదీలలో ఇక్కడ దీపావళి సెలవు ఉంటుంది. కాళీ పూజ సందర్భంగా అక్టోబర్ 31న కూడా సెలవు ప్రకటించారు.దీపావళి సందర్భంగా మధ్యప్రదేశ్‌లో రెండు రోజులు సెలవులు ఇచ్చారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు నవంబర్ 1, 2 తేదీలలో మూసివేయనున్నారు. బీహార్‌లో ఈసారి దీపావళికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. నవంబర్ 1, నవంబర్ 2 న ఇక్కడ సెలవు ఉంటుంది. దీనితో పాటు ఛత్ పూజకు సెలవులను కూడా పొడిగించవచ్చు. రాజస్థాన్‌లో ఈ ఏడాది దీపావళికి మూడు రోజుల సెలవులు ఉంటాయి. అక్టోబర్ 31 నుండి నవంబర్ 2 వరకు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయనున్నారు.కర్ణాటకలో దీపావళికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. నవంబర్ 1, 2 తేదీలలో ప్రజలు ఈ పండుగను సాంప్రదాయ రీతిలో జరుపుకుంటారు. కేరళలో దీపావళికి నవంబర్ 1న సెలవు ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, ఒడిశా తదితర రాష్ట్రాల్లో దీపావళి సందర్భంగా రెండు రోజులు సెలవులు ప్రకటించారు.ఇది కూడా చదవండి: బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కిషన్‌రెడ్డి? -
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?.. ఇవి తెలుసుకోవాల్సిందే!
ఆర్థిక పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో ఎవరూ ఊహించలేరు. నెలకు లక్షల రూపాయలు సంపాదించేవారు కూడా క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు, కావలసినప్పుడు లోన్స్ కూడా తీసుకుంటున్నారు. అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత లోన్స్ తీసుకోవచ్చు. కానీ పర్సనల్ లోన్ తీసుకునే ముందు తప్పకుండా కొన్ని విషయాలను తెలుసుకోవాలి. లేకుంటే తీసుకున్న అసలు కంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.సిబిల్ స్కోర్బ్యాంకు లోన్ ఇవ్వాలంటే సిబిల్ స్కోర్ చూస్తుంది. మంచి సిబిల్ స్కోర్ ఉంటే ఎక్కువ బ్యాంక్స్ మీకు లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తాయి. లేకుంటే లోన్ లభించడం కొంత కష్టమనే చెప్పాలి. ఒకవేళా మీకు లోన్ లభించినా వడ్డీ రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.వడ్డీ రేటులోన్ తీసుకునే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన మరో విషయం వడ్డీ రేటు. ఎందుకంటే ఒక్కో బ్యాంక్ ఒక్కో వడ్డీ రేటుతో లోన్ అందిస్తుంది. కాబట్టి తక్కువ వడ్డీతో లోన్ ఇచ్చే బ్యాంకుల వద్ద నుంచి లోన్ తీసుకోవడం ఉత్తమం. ఇది మీరు తిరిగీ చెల్లించాల్సిన ఈఎమ్ఐలను సులభతరం చేస్తుంది. ఏ బ్యాంక్ ఎంత వడ్డీకి లోన్ ఇస్తుందనే విషయాలను అధికారిక వెబ్సైట్లలో లేదా బ్యాంకుకు వెళ్లి తెలుసుకోవచ్చు.లోన్ వ్యవధిలోన్ తీసుకునే వ్యక్తి.. తిరిగి ఎన్ని నెలల్లో చెల్లచగలుగుతాడో, సంపాదన ఎంత వంటి వాటిని బేరీజు వేసుకుని వ్యవధిని ఎంచుకోవచ్చు. పర్సనల్ లోన్ వ్యవధి 12 నెలల నుంచి 60 నెలల మధ్య ఉంటుంది. అయితే 36 నెలలు లేదా మూడు సంవత్సరాలకు మించి ఎక్కువ టైమ్ తీసుకోకపోవడం మీకే మంచిది. అయితే ఇది ఖచ్చితంగా అందరూ పాటించాల్సిన అవసరం లేదు.లోన్ ఎక్కడ నుంచి తీసుకోవాలి (బ్యాంకు/ఎన్బీఎఫ్సీ)పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునే వ్యక్తి.. బ్యాంకు నుంచి తీసుకోవాలా? లేదా ఎన్బీఎఫ్సీ నుంచి తీసుకోవాలా? అని సొంతంగా నిర్దారించుకోవాలి. బ్యాంకు నుంచి తీసుకోవడం చాలా ఉత్తమం అని నిపుణులు చెబుతారు. లోన్ తీసుకోవడానికి కొంత ఆలస్యమైనా బ్యాంకు నుంచే తీసుకోవడం మంచిది. ఇందులో ఎలాంటి అవకతవకలకు తావుండదు.ఎన్బీఎఫ్సీ (నాన్ బ్యాంక్ ఫైనాన్సియల్ కంపెనీలు) నుంచి కూడా లోన్ తీసుకోవచ్చు. కానీ ఇందులో కొన్నిసార్లు మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో డాక్యుమెంట్స్ ఎక్కువ అవసరం లేదు. ఎన్బీఎఫ్సీలో లోన్ తీసుకోవాలనుకునే వారు ముందుగా ఆ సంస్థ గురించి తెలుసుకోవాలి. -
కోవిషీల్డ్ రెండో డోస్ 12–16 వారాల మధ్య
సాక్షి, న్యూఢిల్లీ: దేశ పౌరులకు అందజేస్తున్న కోవిషీల్డ్ కోవిడ్ టీకా రెండు డోస్‌ల మధ్య కాల వ్యవధిని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. రెండో డోసు తీసుకోవడానికి ప్రస్తుతం 6–8 వారాలున్న వ్యవధిని ఇకపై 12–16 వారాలకు పెంచాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టీఏజీఐ) చేసిన సిఫారసుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. రెండు టీకాల మధ్య కాల పరిమితిని పెంచితే మరింతగా ప్రయోజనాలు ఉన్నట్లు బ్రిటన్ అధ్యయనంలో వెల్లడైన నేపథ్యంలో ఎన్టీఏజీఐ కొత్తగా ఈ సిఫార్సు చేసింది. మొదటి టీకా తీసుకున్నాక ఆరు వారాలలోపు రెండో టీకా తీసుకుంటే వారిలో వ్యాక్సిన్ సామర్థ్యం 55.1 శాతం ఉండగా, రెండో డోస్‌కు 12 వారాలకంటే ఆలస్యంగా తీసుకుంటే టీకా సామర్థ్యం ఏకంగా 81.3 శాతానికి పెరిగినట్లు బ్రిటన్ అధ్యయనంలో తేలింది. మరోవైపు, భారత్ బయోటెక్ తయారుచేస్తున్న కోవాగ్జిన్ కోవిడ్ రెండు టీకాల మధ్య వ్యవధిలో ఎలాంటి మార్పు లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. తమ వద్ద కోవిడ్ టీకాల కొరత చాలా ఎక్కువగా ఉందని చాలా రాష్ట్రాలు కేంద్రప్రభుత్వానికి విన్నవించుకున్నవేళ కోవిషీల్డ్ టీకా డోస్‌ల మధ్య అంతరాన్ని పెంచడం చర్చనీయాంశమైంది. డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా లేకపోవడంతో టీకా డోస్‌ల కొనుగోలు కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడం తెల్సిందే. కోవిషీల్డ్ టీకాల డోస్‌ల మధ్య వ్యవధిని పెంచడం ఇది రెండోసారి. 28 రోజుల వ్యవధిని 6–8 వారాలుగా మారుస్తూ మార్చి నెలలో నిర్ణయించారు. ఎన్టీఏజీఐ చేసిన సిఫార్సులను నీతి ఆయోగ్ సభ్యుడైన డాక్టర్ వీకే పాల్ నేతృత్వంలోని నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కోవిడ్–19(ఎన్ఈజీవీఏసీ) అంగీకరించిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. కోవిషీల్డ్ డోసుల మధ్య కాలవ్యవధిని 12 వారా లు మించి పెంచితే మంచిదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం పేర్కొందని, ఇదే విధానాన్ని చాలా దేశాలు అనుసరిస్తున్నాయని వీకే పాల్ చెప్పారు. ఎన్టీఏజీఐ చేసిన సిఫార్సులు ఇవీ.. ► కోవిషీల్డ్ కోవిడ్ రెండు డోసుల మధ్య కాల వ్యవధిని 12–16 వారాలకు పెంచుకోవచ్చు ► కోవిషీల్డ్, కోవాగ్జిన్ కోవిడ్ టీకాల్లో గర్భిణులు తమకు నచ్చిన టీకాలను ఎంచుకోవచ్చు ► కోవాగ్జిన్ రెండు టీకాల మధ్య కాల పరిమితిలో ఎలాంటి మార్పు లేదు ► నిర్ధారణ పరీక్షలో కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తులు పూర్తిగా కోలుకున్నాక ఆరు నెలల తర్వాతే టీకాను తీసుకోవాలి ► కోవిడ్ టీకా తీసుకునేముందు లబ్దిదారులకు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేయాలన్న ప్రతిపాదనను ఎన్టీఏజీఐ తిరస్కరించింది ► గర్భిణులకు తరచుగా జరిగే డాక్టర్ చెకప్‌ల సమయంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు తీసుకుంటే కలిగే ప్రయోజనాలతోపాటు సైడ్ ఎఫెక్ట్లపైనా వారికి అవగాహన కలిగించాలి ► టీకా తీసుకుంటే అత్యంత అరుదుగా రక్తం గడ్డ కట్టడం, బ్లడ్ ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చనే వివరాలతో కూడిన అవగాహనను గర్భిణులకు కల్పించాలి ► ప్రసవించాక పాలిచ్చే తల్లులు ఎప్పుడైనా సరే టీకా తీసుకోవచ్చు ► టీకా మొదటి డోస్ తీసుకున్నాక పరీక్షలో పాజిటివ్‌గా తేలితే పూర్తిగా కోలుకున్నాక 4–8 వారాల తర్వాతే రెండో డోస్ తీసుకోవాలి ► బయటి వ్యక్తుల నుంచి యాంటీ బాడీలు, ప్లాస్మాను పొందాక కోవిడ్ నుంచి కోలుకున్న రోగులు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తేదీ నుంచి మూడు నెలల వరకు కోవిడ్ టీకాను తీసుకోకూడదు. ► మొదటి డోస్ తీసుకున్నాక అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స అవసరమైన వారు, ఐసీయూ చికిత్స అవసరమైన వారు కనీసం 4–8 వారాలు ఆగిన తర్వాతే రెండో డోస్ టీకా తీసుకోవాలి. -
H1B వీసాపై కత్తి
-
రేపు ఫసల్ బీమాకు చివరి తేది
పెద్దేముల్:- ప్రధాన మంత్రి ఫసల్ బీమాకు నేడు మంగళవారం చివరి తేదీ అని మండల వ్యవసాయ అధికారి వెంకటేశం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత నెల 31వరకు ఉన్న గడువును ప్రభుత్వం నేటి వరకు పొడిగిందని బ్యాంకుల్లో రుణాలు పొందిన రైతులు అధికారులను కలవాలని సూచించారు. పంటపేరు-------ఎరాకు చెల్లించవలసిన ప్రెమియం వరి --- రూ.364 కంది --- రూ.260 పెసర --- రూ.200 మినుము --- రూ.200 మెక్కజోన్న --- రూ.400 పసుపు --- రూ.2740 రూపాయలు అగ్రికల్చరర్ ఇన్స్‌రెన్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పేరుతో డీడీ రూపంలో మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో ఏఓకు చెల్లించాలని సూచించారు. -
ఫిక్స్ చేశారంటే... వడ్డించిన విస్తరే!
ఉమన్ ఫైనాన్స్ చాలామంది పెట్టుబడి మార్గాలు ఎన్ని అందుబాటులో ఉన్నా కానీ... సంప్రదాయక పెట్టుబడి మార్గమైన, తక్కువ రిస్క్‌తో కూడిన సురక్షితమైన బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వైపే మొగ్గు చూపుతారు. ఇలాంటి వారికి బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా ఎక్కువ వడ్డీని అందజేసే కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఒక మంచి అవకాశం. కానీ వీటిలో డిపాజిట్ చేసే సమయంలో క్షుణ్ణంగా అన్ని వివరాలూ తెలుసుకుని పెట్టుబడి పెట్టడం మంచిది. కొన్ని కంపెనీలు తమ కంపెనీ పెట్టుబడికి అవసరమైన నిధులను ప్రజల నుండి ఫిక్స్డ్ డిపాజిట్ రూపేణా సమీకరిస్తాయి. ఇవి సాధారణ బ్యాంకు డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ రేటును కలిగి ఉంటాయి. కాల పరిమితిని కూడా పెట్టుబడిదారుల సౌలభ్యం కోసం వివిధ వ్యవధులలో అందజేస్తాయి. తీసుకోవలసిన జాగ్రత్తలు మొదట గమనించవలసిన విషయం ఏమిటంటే.. ఈ కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి సెక్యూరిటీ లేనివి. అంటే కంపెనీ కనుక దివాళా తీస్తే పెట్టిన పెట్టుబడిని కూడా నష్టపోవలసి ఉంటుంది. కనుక ఏ కంపెనీలోనైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేయదలచుకున్నారో తప్పనిసరిగాఆ కంపెనీ రేటింగ్ చూసుకోవాలి. ఇఖఐఐఔ, ఐఇఖఅ మొదలైన ఫైనాన్షియల్ సంస్థలు వివిధ కంపెనీలకు, ఆ కంపెనీలు జారీ చేసే వివిధ ర కాల పెట్టుబడి మార్గాలకు రేటింగులను అందచేస్తుంటాయి. వాటిని ఫాలో అవొచ్చు. కంపెనీ గురించి, గడిచిన సంవత్సరాలలో కంపెనీ స్థితిగతుల గురించి, మేనేజ్మెంట్ గురించి క్షుణ్ణంగా పరిశీలించాలి. కంపెనీ డిపాజిట్స్‌పై అందే వడ్డీ రు.5,000 దాటితే టి.డి.ఎస్. (టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) వర్తిస్తుంది. అదే బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద వచ్చే వడ్డీకైతే రు.10,000 దాటితేనే టి.డి.ఎస్. వర్తిస్తుంది. కనుక కంపెనీ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టే ముందు ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం మంచిది. కంపెనీ రేటింగ్ తక్కువగా ఉన్నప్పుడు తక్కువ కాల వ్యవధిలో డిపాజిట్ చేయడం ఉత్తమం. ఒకవేళ ఎక్కువ కాల వ్యవధితో డిపాజిట్ చేసినట్లయితే కంపెనీ స్థితిగతులు సరిగా లేనట్లయితే సొమ్మును నష్టపోవలసి వస్తుంది. కనుక బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్ కన్నా ఎక్కువ వడ్డీ రావాలని కోరుకునేవారు, మంచి కంపెనీలు అందజేసే ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి పూర్తిగా చదువుకుని, అర్థం చేసుకుని పెట్టుబడి పెడితే ఎక్కువ వడ్డీని పొందవచ్చు. రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
‘గ్యాస్’ కాలపరిమితి.. గుర్తించేదెలా?
మనం వాడే ప్రతి వస్తువుకూ కాలపరిమితి ఉంటుంది. అది తినే వస్తువు కావొచ్చు.. ఆరోగ్యాన్ని కాపాడే మందులు కావొచ్చు.. ఇంట్లో ఉపయోగించే వస్తువు కావొచ్చు. మనం నిత్యం ఇంట్లో ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌కు కూడా కాలపరిమితి ఉంటుంది. అన్ని వస్తువులపై పలానా సంవత్సరం.. పలానా నెలలో డేట్ అయిపోతుందని ముద్రించి ఉంటుంది. గ్యాస్ సిలిండర్‌పై మాత్రం ఒక ‘కోడ్’ రూపంలో దాని కాలపరిమితి ముద్రించి ఉంటుంది. మరి ఆ కోడ్‌ను ఎలా గుర్తించాలి..? ఏ నెలలో దాని కాలపరిమితి ముగుస్తుంది..? తదితర విషయాలు మీకోసం.. - సాక్షి, రంగారెడ్డి జిల్లా * ప్రతి సిలిండర్‌పై ప్రత్యేక ‘కోడ్’ * దానిని బట్టే కాలపరిమితి గుర్తింపు * వినియోగంలో జాగ్రత్త సుమా! ప్రయోజనం.. ⇒ గ్యాస్ సిలిండర్ కాలపరిమితి ‘ఆల్ఫా న్యూమరికల్’ పద్ధతిలో ముద్రితమై ఉంటుంది. ⇒ సిలిండర్ హ్యాండిల్ రాడ్ వద్ద ఏదో ఒకదానిపై ఒక ఇంగ్లిష్ అక్షరం, రెండు సంఖ్యలు ముద్రించి ఉంటాయి. ⇒ ఇంగ్లిష్ అక్షరం సిలిండర్ కాల పరిమితిలో నెలను.. పక్కనున్న సంఖ్య సంవత్సరాన్ని సూచిస్తుంది. ఉదా: సిలిండర్‌పై ‘డి 16’ అని ఉందనుకుంటే.. ‘డిసెంబరు- 2016’ సంవత్సరానికి దాని కాలపరిమితి ముగుస్తుందని అర్థం. ⇒ ఇక్కడ నెలను ముద్రించే విధానం భిన్నంగా ఉంటుంది. దీన్ని నాలుగు రకాలుగా విభజించారు. ⇒ సంవత్సరంలోని 12 నెలలను ‘ఎ,బి,సి,డి’గా విభజించారు. వీటిలో ఒక్కోదానికి మూడు నెలలుగా కేటాయించారు. ⇒ అంటే ‘ఎ’ సిరీస్‌కు మెదటి భాగం మూడు నెలలు (జనవరి, ఫిబ్రవరి, మార్చి), ‘బి’ సిరీస్‌కు రెండో భాగం మూడు నెలలు (ఏప్రిల్, మే, జూన్), ‘సి’ సిరీస్‌కు (జూలై, ఆగస్టు, సెప్టెంబరు), ‘డి’ సిరీస్‌కు నాలుగో భాగం మూడు నెలలు (అక్టోబరు, నవంబరు, డిసెంబరు)గా ఉన్నాయి. ⇒ సిలిండర్‌పై ‘ఎ’ ఉంటే మార్చి వరుకు, ‘బి’ ఉంటే జూన్ వరకు, ‘సి’ ఉంటే సెప్టెంబరు వరకు, ‘డి’ ఉంటే డిసెంబరు వరకు అని అర్థం. ఉదా: ‘ఎ 20’ అని ఉంటే.. ‘మార్చి 2020’ నాటికి సిలిండర్ గడువు ముగుస్తుంది. సూచన: కాలపరిమితి అయిన సిలిండర్‌ను గుర్తించి అప్పుడే మార్చుకోవాలి. లేకపోతే దాన్ని వాడే సమయంలో ఒత్తిడికి గురైనా, దాన్ని అలాగే వాడినా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. -
రుణమాఫీలో బినామీలు
కొక్కిరాపల్లి సొసైటీలో వెలుగులోకి అక్రమాలు కార్యదర్శిని నిలదీసిన బాధితులు యలమంచిలి : బినామీ, కాలపరిమితి తీరిన రుణాలకు సంబంధించిన కుంభకోణంతో గతంలో కుదేలైన కొక్కిరాపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లో ప్రస్తుతం రుణమాఫీలోనూ అక్రమాలు చోటు చేసుకున్నట్టు శనివారం బయటపడింది. సమగ్ర విచారణ జరిపితే ఈ వ్యవహారం వెనుక ఉన్న సూత్రధారులు బయటపడే అవకాశం ఉందని సభ్యరైతులు డిమాండ్ చేస్తున్నారు. రెండో విడత రుణమాఫీ జాబితాలో పేర్లున్న పలువురు రైతులు శనివారం ఇంటర్నెట్ కేంద్రాల్లో తమ స్టేటస్‌ను తెలుసుకున్నారు. షేకిళ్లపాలేనికి చెందిన రాయి నూకరాజు ఈ సొసైటీలో రూ.4,193లు రుణం తీసుకున్నాడు. యలమంచిలి ఎస్బీఐలో కూడా రూ.43వేల వరకు పంటరుణం మంజూ రైంది. ఇవి కాకుండా అతని పేరుతో కొక్కిరాపల్లి సొసైటీలో రూ.1.8లక్షలు తీసుకున్నట్టు ఉంది. ఇది చూసి కంగారుపడిన నూకరాజు కుమార్తె లక్ష్మి శనివారం సొసైటీకి వచ్చి కార్యదర్శి రామకృష్ణ, సిబ్బందిని నిలదీశారు. తమకు సంబంధం లేని రుణాలు తమ పేరుతో ఎలా ఉన్నాయని ప్రశ్నించా రు. ఆమెకు మద్ధతుగా సభ్యరైతులు ఆడారి రమణబాబు, ఆడారి ఆదిమూర్తి కార్యదర్శిని నిలదీయడంతో కంప్యూటర్లో తప్పు వచ్చిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కొత్తపాలెంకు చెందిన రాపేటి అప్పలనాయుడు తన ఆధార్‌కార్డు నంబరుతో వివరాలు చూస్తే ఊడా నర్సింహమూర్తి పేరుతో రూ.76,477 రుణం తీసుకున్నట్టు వచ్చింది. రిపోర్టుతో అతడు సొసైటీ కార్యాలయానికి వచ్చి వాపోయాడు. తాను రూ.40వేలు రుణం తీసుకున్నానని, తన ఆధార్, రేషన్ కార్డుల వివరాలతో మరో వ్యక్తి పేరుతో వివరాలు రావడమేమిటని కార్యదర్శిని నిలదీశారు. పెదపల్లికి చెందిన మరిశావెంకటేశ్వరులు యలమంచిలి ఎస్బీఐలో రుణం తీసుకున్నారు. అతని కుమారుడు మరిసా రాము ఈ సొసైటీలో పంటరుణం పొందారు. వెంకటేశ్వరులు కొక్కిరాపల్లి సొసైటీలో ఎలాంటి రుణం తీసుకోలేదు. అయినప్పటికీ వెంకటేశ్వరులు ఆధార్ నంబర్‌తో కొఠారు మంగతల్లి, పండూరి నాగభూషణం, బోజా సోమునాయుడు పేర్లతో రుణాలు తీసుకున్నట్టు బయటపడింది. ఇవన్నీ బినామీ రుణాలుగానే వెంకటేశ్వరులు భావిస్తున్నారు. పైడాడ వెంకటేశ్వరులు అనే రైతు రూ.9,484 పంటరుణం సొసైటీ నుంచి తీసుకున్నారు. ఇతని ఆధార్, రేషన్ వివరాలు నమోదు చేస్తే గొల్లవిల్లి రాంబాబు పేరుతో రుణం తీసుకున్నట్టు సూచిస్తోంది. ఇదే తరహాలో పలువురు రైతుల పేర్లతో స్టేటస్ రిపోర్డులు వస్తున్నట్టు పలువురు రైతులు విలేకరులకు చెప్పారు. ఈ సొసైటీలో గతంలో తీసుకున్న బినామీ రుణాలు మాఫీ అయ్యేందుకు కొందరు వివరాలు తప్పుగా నమోదు చేయించినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపితే భారీ స్థాయిలో అక్రమాలు బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు. -
డీఎస్సీ చిక్కుప్రశ్నలు
కర్నూలు(జిల్లా పరిషత్): రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా ప్రకటించిన డీఎస్సీ అభ్యర్థులను గందరగోళానికి గురిచేస్తోంది. అర్హత మార్కులు.. సిలబస్.. పరీక్షా సమయం.. సబ్జెక్టులకు తక్కువ మార్కుల కేటాయింపు.. తదితర చిక్కు ప్రశ్నలతో వారి తలబొప్పి కడుతోంది. ప్రధానంగా సిలబస్ ప్రకటించకుండా నోటిఫికేషన్ జారీ చేయడం అసలు సమస్యకు కారణమవుతోంది. పరీక్షకు పాత సిలబస్‌తో సిద్ధమవ్వాలా? కొత్త సిలబస్‌ను చదువుకోవాలా? అనే మీమాంస కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ 122, లాంగ్వేజ్ పండిట్ 98, పీఈటీ 13, ఎస్జీటీ 497 కలిపి మొత్తం 730 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 21న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విడత జిల్లాలో 30వేల మంది అభ్యర్థులు పోటీపడే అవకాశం ఉంది. అయితే సిలబస్ విషయమై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడం గమనార్హం. పాత సిలబస్‌లోనే పరీక్ష నిర్వహించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం టెట్ కమ్ టెర్ట్ పేరిట టెట్, డీఎస్సీ కలిపి పరీక్ష నిర్వహిస్తుండటంతో గతంలో టెట్ అర్హత సాధించిన అభ్యర్థుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడు రెండు పరీక్షలకు ఒకేసారి సిద్ధం కావడం అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టెట్‌లోని సబ్జెక్టులు డీఎస్సీలో కలిపేయడం వల్ల అధిక మార్కులు సాధించడం కష్టమనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఆయా రిజర్వేషన్ వర్గాలను బట్టి అర్హత మార్కులు నిర్దేశించడం కూడా అభ్యర్థుల్లో కలకలం రేపుతోంది. ఈ ప్రశ్నలకు డీఈఓ కార్యాలయ వర్గాల్లోనూ సమాధానం లేకపోవడం గమనార్హం. డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనకు కారణాలు తెలుగు, హిందీ, ఉర్దూ బాషా పండితులకు గతంలో వారి సబ్జెక్టుల్లో 50 శాతానికి పైగానే ప్రశ్నలు ఇచ్చేవారు. ఇప్పుడు 35 శాతానికే సబ్జెక్టు ప్రశ్నలను పరిమితం చేశారు. గతంలో టెట్‌లో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులు తాజా డీఎస్సీలో తిరిగి టెట్‌ను రాయాల్సి ఉంది. టెట్ పాసయ్యామనే ధైర్యంతో చాలా మంది సబ్జెక్టులపైనే దృష్టి సారిస్తున్నారు. వీరి పరిస్థితి గందరగోళంగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు పరీక్షలో 40 శాతం, బీసీలకు 50 శాతం, ఓసీలకు 60 శాతం మార్కులు తెచ్చుకోవాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. గతంలో తక్కువ మార్కులు సాధించినా ఎస్సీ, ఎస్టీలు ఉపాధ్యాయ పోస్టులు సాధించారు. తాజా నిబంధనలతో ఆయా రిజర్వేషన్ వర్గాల్లో అర్హులైన వారు లభించక పోస్టులు మిగిలిపోయే ప్రమాదం ఉంది. బ్లాక్‌లో పాత సిలబస్ పుస్తకాలు నేను 2012లో బీఎడ్ పూర్తయింది. డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించడంతో పాత సిలబస్ పుస్తకాలకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో అంతా కొత్త సిలబస్ పుస్తకాలే. అందువల్ల పాత సిలబస్ పుస్తకాలు బ్లాక్‌లో అమ్ముతున్నారు. వీటిని కొనేందుకే రూ.2వేలు ఖర్చవుతోంది. - నాగిరెడ్డి, వెల్దుర్తి పరీక్షా సమయం సరిపోదు సర్వీస్ కమిషన్ పరీక్షల్లో 150 మార్కులకు మూడు గంటల సమయం ఇస్తారు. తాజా డీఎస్సీలో 200 మార్కులకు కూడా 3 గంటల సమయం మాత్రమే కేటాయించారు. దీనికి తోడు అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించి, బబ్లింగ్ చేయాలంటే సమయం సరిపోదు. - వసంతకుమారి, అనంతపురం సిలబస్‌పై స్పష్టత కరువైంది నేను 2012లో బీఈడీ పూర్తి చేశాను. డీఎస్సీ కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకటించినా గైడ్‌లైన్స్ చూస్తే ఆందోళన కలుగుతోంది. ఏ సిలబస్ ప్రకారం పరీక్ష నిర్వహిస్తారో చెప్పలేదు. - ప్రసన్నలక్ష్మి, నంద్యాల పాత సిలబస్‌తోనే పరీక్ష నిర్వహించాలి నేను డీఎడ్ పూర్తి చేశాను. పాఠశాల విద్యాభ్యాసమంతా పాత సిలబస్‌లోనే జరిగింది. ఇప్పుడు సీసీఈ మెథడ్‌లో సిలబస్ ఉంది. ఇది నేటి తరం పాఠశాల విద్యార్థులకు అర్థమవుతుంది. మా లాంటి వారికి ఈ మెథడ్ అర్థం కావాలంటే చాలా కష్టం. పాత విధానంలోనే పరీక్ష నిర్వహించాలి. - కె.ఇమ్రాన్, ఎమ్మిగనూరు భాషా పండితులకు తీరని నష్టం తాజా డీఎస్సీలో 200 మార్కులకు ప్రశ్నాపత్రం ఇస్తున్నారు. ఇందులో భాషా పండితుల(తెలుగు, ఉర్దూ, హిందీ)కు మాత్రం వారి సబ్జెక్టులో 70 మార్కులు ఇచ్చి, మిగిలిన 130 మార్కులకు జనరల్ ప్రశ్నలు అడుగుతున్నారు. గతంలో ఇలా ఉండేది కాదు. వంద మార్కులకు పైగానే సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు ఉండేవి. ఇది భాషా పండితులకు తీరని నష్టం చేకూరుస్తుంది. - ఎం.చంద్రశేఖర్, అనంతపురం