మార్కెట్ యార్డుకు నాలుగు రోజుల సెలవు
కర్నూలు(వైఎస్‌ఆర్ సర్కిల్): కర్నూలు మార్కెట్‌యార్డు వచ్చే నాలుగు రోజులు మూత పడనుంది. వరుస సెలవు దినాలు రావడంతో రైతులు కలవరపడుతున్నారు. 26న గురువారం గణతంత్రదినోత్సవం, 27న శుక్రవారం అమావాస్య(సెంటిమెంట్‌తో రైతులు, వ్యాపారాలు ఎలాంటి లావాదేవీలు జరపరు), 28న శనివారం (నగదు బదిలీతో రెండు నెలలుగా శనివారాలు యార్డు కార్యకలాపాలు స్తంభింపజేయాలని నిర్ణయించుకున్నారు). 29న ఆదివారం. దీంతో మార్కెట్‌లో నాలుగు రోజులపాటు క్రయ విక్రయాలు నిలిచిపోనున్నాయి.
ఖుషీఖుషీగా అధికారులు
మార్కెట్ అధికారులు, సిబ్బంది ధాన్యం కొలిచేటప్పుడు దుమ్ము..«ధూళితో అవస్థలు పడుతున్నా.. విధులను మాత్రం నిర్విరామంగా నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో వరుసగా నాలుగు రోజులు సెలవు దినాలు కావడంతో వారు ఉపశమనంగా భావిస్తూ ఖుషీ..ఖుఫీగా ఫీలవుతున్నారు.