మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీల సిబ్బంది రైతు శ్రేయస్సుకు పాటుపడాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్ రావు పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. మార్కెటింగ్ విభాగంలో వివిధ గ్రేడ్లలో పనిచేస్తున్న 76 మందికి పదోన్నతులు ఇచ్చిన సందర్భంగా మంగళవారం ఉద్యోగులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం రైతుల కోసం ప్రకటించే సంక్షేమ పథకాలను వారికి అందేలా కృషి చేయాలన్నారు. మార్కెట్ కమిటీల్లో ఇంకుడు గుంతలు నిర్మించి జల సంరక్షణ చేపట్టాలని చెప్పారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ డాక్టర్ శరత్, అదనపు ైడె రెక్టర్ లక్ష్మీబాయి, మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలుక నర్సింహారెడ్డి, కార్యదర్శి ఎండీ ముకరం తదితరులు పాల్గొన్నారు.
రైతు శ్రేయస్సుకు పాటుపడండి
Published Wed, Apr 27 2016 3:11 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement