Minister Harish Rao
-
తెలంగాణ ద్రోహులంతా ఒక్కటయ్యారు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణను దెబ్బ తీయడానికి, రాష్ట్రాన్ని ఆగం చేయడానికి కాంగ్రెస్, బీజేపీల ముసుగులో తెలంగాణ ద్రోహులంతా ఒక్కటయ్యారని మంత్రి టి.హరీశ్‌రావు ధ్వజమెత్తారు. శుక్రవారం సంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘పవన్‌కల్యాణ్‌తో బీజేపీ చేతులు కలిపారు. షర్మిలమ్మ కాంగ్రెస్‌లో కలుస్తుందంటా.. వీరిద్దరూ తెలంగాణ ద్రోహులు కాదా. తెలంగాణ ప్రకటిస్తే భోజనం మానేసిన పవన్‌తో బీజేపీ చేతులు కలిపింది. తెలంగాణ అంటే సిగరేటా.. బీడీనా అన్న షర్మిల, కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తుందట. లోపల నుంచి చంద్రబాబు కూడా సపోర్టు చేస్తారంటా. ఓట్లు చీలవద్దని చంద్రబాబు తెలంగాణలో పోటీ చేయబోమని ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ ద్రోహులంతా ఒక్కటవుతున్నారని అర్థమవుతోంది’అని విమర్శించారు. రేవంత్ క్రిమినల్ నం.4170 తెలంగాణ గెలవాలంటే ప్రజలు కేసీఆర్ పక్షాన నిలవాలని, తెలంగాణ ఓడాలంటే రేవంత్‌రెడ్డి క్రిమినల్ గ్యాంగ్‌కు మద్దతు ఇవ్వాలని హరీశ్‌రావు ఘాటుగా వాఖ్యానించారు. ఈ క్రిమినల్ గ్యాంగుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా రూ.50 లక్షలతో దొరికిన రేవంత్‌రెడ్డే క్రిమినల్. ఆయన క్రిమినల్ నం.4170 బెయి ల్ మీద బయట ఉన్న ఖైదీ రేవంత్ అని చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే తిప్పలు తప్పవు.. కాంగ్రెస్ పార్టీ రకరకాల కుట్రలతో బయలు దేరిందని, తప్పిపోయి ఆ పార్టీకి ఓటేస్తే తిప్ప లు తప్పవని హరీశ్‌రావు అన్నారు. ‘కర్ణాటకలో ఐదుగంటల కరెంటు కూడా ఉండటంలేదని వార్తలు వస్తున్నాయి. ఆ పరిస్థితి తెలంగాణలో కూడా వస్తుంది. సాఫీగా కేసీఆర్ పాలన జరు గుతున్న ఈ తరుణంలో రిస్క్ ఎందుకో ఆలోచించుకోవాలి’అని ఆయన ప్రజలకు సూచించారు.] ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపైనా హరీశ్‌రావు విమర్శలు చేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం రాజీనామా చేయాలని డిమాండ్ వచ్చినప్పటికీ కిషన్‌రెడ్డి పదవి పట్టుకుని వేలాడారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి బీఆర్ ఎస్ అభ్యర్థి చింత ప్రభాకర్, టీఎస్‌ఎంఎస్‌ఐ డీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
3 గంటలు కావాలా?.. 24 గంటలు కావాలా?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/రామన్నపేట/తుంగతుర్తి: ‘మీ ఇంటి ముందున్న అభివృద్ధిని చూడండి.. మీ కళ్ల ముందుండే అభ్యర్థిని చూసి బీఆర్ఎస్కు ఓటు వేయండి’ అని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. నకిరేకల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి లింగయ్యను గెలిపించి సీఎం కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎంను చేయాలన్నారు. నకిరేకల్ పట్టణంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. హరీశ్‌రావు మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సిగ్గులేకుండా 3 గంటల కరెంట్ చాలని మాట్లాడారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటే ఉంటుందని, బీఆర్ఎస్ వస్తే 24 గంటలు వస్తుందని, ఏది కావాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు. 3 గంటల కరెంటు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, 24 గంటల కరెంటు కావాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలన్నారు. కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌రెడ్డిలు పేర్లుకే పెద్దమనుషులు నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, వారు పేరుకే పెద్దమనుషులని హరీశ్ వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్లు పెద్దవే తప్ప వాళ్లు చేసే పనులు చిన్నవన్నారు. వారు జిల్లాను ఏనాడైనా పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వారి పాలనలో శవాన్ని కాల్చేసి స్నానం చేద్దామంటే కరెంట్ లేని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు. ఆనాడు ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ పార్టీయేనని, నకిరేకల్ అభివృద్ధి కొనసాగాలంటే ఎమ్మెల్యేగా లింగయ్యను గెలిపించాలని పిలుపునిచ్చారు. వంద రకాలుగా తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్ః జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రజల ముఖాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీదేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ‹Ùరెడ్డి అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ వంద రకాలుగా ద్రోహం చేస్తే. బీఆర్ఎస్ ప్రభుత్వం వంద మంచి పనులు చేసిందన్నారు. ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే మేనిఫెస్టో వస్తుంది ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే విధంగా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రాబోతుందని హరీశ్‌రావు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి 35 నియోజకవర్గాల్లో అభ్యర్థులు కరువయ్యారని, మనం పనికిరారంటూ పక్కన పెట్టిన వారిని పార్టీలో చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ వాంరటీ అయినా గ్యారంటీ అయినా కేసీఆరే తెలంగాణ వాంరటీ అయినా గ్యారంటీ అయినా కేసీఆరే అని మంత్రి హరీష్‌రావు అన్నారు. తుంగతుర్తి సభలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌తో కలిసి మాట్లాడారు. అసెంబ్లీ టిక్కెట్లను కాంగ్రెస్ పార్టీ రూ.15కోట్లకు అమ్ముకుంటోందని ఆరోపించారు. రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటారని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటల, నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలో, నకిరేకల్‌లో, సూ ర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్ శంకుస్థాపనలు ప్రారంబోత్సవాలు చేశారు. -
కాంగ్రెస్‌వి దొంగ డిక్లరేషన్లు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ ప్రకటించినవన్నీ దొంగ డిక్లరేషన్లేనని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. వాటిని నమ్మితే ప్రజలు నిలువునా మోసపోతారన్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు టౌన్షిప్లో జీహెచ్ఎంసీ నిర్మించిన డబుల్ బెడ్రూం గృహాలను గురువారం 4,800 మంది లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హరీశ్‌రావు మాట్లాడు తూ కేసీఆర్ కిట్టు.. న్యూట్రీషియన్ కిట్టు.. ఎన్సీడీ కిట్టు.. ఇలా బీఆర్ఎస్ సర్కారు లబ్ధిదారులకు కిట్లు పంపిణీ చేస్తుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు తిట్లకే పరిమితం అవుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధిని చూసి సినీ నటుడు రజనీకాంత్ మెచ్చుకున్నప్పటికీ., ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన గజనీగాళ్లకు మా త్రం అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ బెంగళూరును మించి పోయిందనీ, ఇప్పుడు ఈ రంగంలో దేశంలోనే హైదరాబాద్ నం.1 స్థానంలో నిలుస్తోందన్నారు. ఇచ్చే రూ.60 వేలల్లోనూ లంచాలు తీసుకునేవారు.. కాంగ్రెస్ హయాంలో ఇంటి నిర్మాణానికి ఇచ్చే రూ.60 వేలల్లోనూ ఆ పార్టీ నేతలు లంచాలు అడిగే వారని హరీశ్‌రావు ఆరోపించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎలాంటి లంచాలు లేకుండా ఇంటిని కేటాయిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఒక్కొక్కరు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదీ జలాల్లో 90 టీఎంసీల నీటి వాటా మనకే దక్కిందని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి కూడా అనుమతి తెచ్చుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాశ్‌గౌడ్, మాగంటి గోపీ నాథ్, సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ పాల్గొన్నారు. -
ఔను.. 6 నెలలకు సీఎం మారడం గ్యారంటీ
పెద్దశంకరంపేట (మెదక్) / కంగ్టి (నారాయణఖేడ్): కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ కార్డు పథకాలపై ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ కార్డులు అమలు కావని, ఆరు నెలలకు ముఖ్యమంత్రి మారడం మాత్రం గారంటీ అని విమర్శించారు. అదేవిధంగా 6 నెలలకు ఒక కర్ఫ్యూ, రైతులకు 6 గంటల కరెంటు, పరిశ్రమలకు వారానికి రెండు పవర్ హాలిడేలు ఉండటం మాత్రం గ్యారంటీ అని ఎద్దేవా చేశారు. మంగళవారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట, సంగారెడ్డి జిల్లా కంగ్టిలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎలాగూ అధికారంలోకి రాలేమని తెలిసి కాంగ్రెస్ నేతలు కల్లగోల్లి మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఇక రెండో రాజధాని బెంగళూరు అవుతుందేమో ఎమ్మెల్యేలకు ఢిల్లీ హైకమాండ్ అవుతుందని, దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లాలంటే వయా బెంగళూరు మీదుగా వెళ్లాలని, ఇక బెంగళూరు మనకు రెండో రాజధాని అవుతుందని హరీశ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హామీలు పోస్టుడేటెడ్ చెక్కులాంటివన్నారు. కర్ణాటకలో అధికారంలో ఉండి రూ.600లు పింఛన్ ఇస్తున్న ఆ పార్టీ.. తెలంగాణలో రూ.4000 ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమంటూ ప్రస్తుతం అక్కడ బస్సులు తగ్గించారన్నారు. బీఆర్ఎస్ 24 గంటలూ ఉచిత కరెంటు సరఫరా చేస్తుందని, గతంలో ఉచిత కరెంటు హామీ ఇచి్చన కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉత్త కరెంటు ఇచ్చిందని మంత్రి గుర్తు చేశారు. కిట్లు ఇచ్చే వారు కావాలో, కేసీఆర్‌ను తిట్టే వారు కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. త్వరలో బీఆర్ఎస్ నుంచి అద్భుతమైన మేనిఫెస్టో వస్తుందని వెల్లడించారు. -
హైదరాబాద్ లో కార్ఫ్యూ వస్తుంది: మంత్రి హరీష్ రావు
-
మాది స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్
లక్డీకాపూల్: మాది స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీలు కేవలం నినాదాల పార్లు .. బీఆర్ఎస్ మాత్రమే నినాదాలను నిజం చేసే పార్టీ అని పేర్కొన్నారు. గురువారం –నిమ్స్‌లో ఏర్పాటు చేసిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్‌ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ హామీలు, వెకిలి చేష్టలతో ఆ రెండు పార్లు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. అమిత్ షా, ఖర్గేలు పర్యాటకుల్లా వచ్చి.. అవగాహన లేమితో ఇక్కడి నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోయారన్నారు. గుజరాత్లో బీజేపీ గుడ్డి పాలనను దారిలో పెట్టడం చేతగాని అమిత్ షా ఇక్కడికి వచ్చి అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి వెళితే ఎవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో మూడు నెలలకే కాంగ్రెస్ తీరేమిటో తేలిపోయిందని, ముందుగా ఖర్గే తన సొంత రాష్ట్రాన్ని చక్కదిద్ది ఇక్కడ కొచ్చి మాట్లాడాలని సూచించారు. వివిధ పార్టీల డిక్లరేషన్లు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని..బీఆర్ఎస్కు మూడోసారి అధికారం ఇవ్వాలని ఎపుడో సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. నిమ్స్‌లో ఆయుష్ ఏర్పాటు రాష్ట్రంలోనే తొలిసారి నిమ్స్‌లో ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందంటూ.. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎస్ శాంతి కుమారికి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ఈ తరహా వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రంలోనే తొలిసారన్నారు. ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, సిద్ధ, ప్రకృతి వైద్యం.. అన్ని వైద్య విధానాలు ఇక్కడ ఒకే వేదికగా అందుబాటులో ఉంటాయని చెప్పారు. వికారాబాద్, భూపాలపల్లి, సిద్ధిపేటల్లో 50 పడకల కొత్త ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. వచ్చే నెల రెండో వారంలో మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. దీంతో కొత్తగా 900 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయని వివరించారు. త్వరలో మరో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించి.. ప్రతి జిల్లాకూ ఒక మెడికల్ కాలేజీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించబోతుందని హరీశ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, నిమ్స్ సంచాలకులు నగరి బీరప్ప, ఆయుష్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. -
అవసరమైన చోట ఎక్కువమంది ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే ప్రజారోగ్య సంచాలకుల విభాగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనతో హేతుబద్దికరణ చేపట్టాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఏర్పాటు చేసిన కమిటీ ప్రతిపాదనల మేరకు గురువారం మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీచేశారు. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని ఉద్యోగుల హేతుబద్దికరణ ప్రక్రియకు అనుమతించారు. రోగుల తాకిడికి అనుగుణంగా తగిన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసుకునేలా మార్గదర్శకాలు రూపొందించారు. కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో ఇప్పటివరకు ఒక్క డీఎంహెచ్‌వో మాత్రమే ఉన్నారు. హైదరాబాద్‌లో ఇక ఆరుగురు డీఎంహెచ్వోలు పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత, భవిష్యత్ వైద్య అవసరాలు గుర్తించిన ప్రభుత్వం అదనంగా 5 డీఎంహెచ్వోలను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చార్మినార్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోన్ల వారీగా వీటి ఏర్పాటుకు అంగీకరించింది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఆరుగురు డీఎంహెచ్వోలు ఉంటారు. కొత్త డీఎంహెచ్వోలను కలుపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 38 మంది ఉంటారు. ఇక రాష్ట్రంలో 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా, అందులో సిబ్బంది ఏకరీతిగా లేదు. వైద్యాధికారి, పర్యవేక్షక సిబ్బంది పోస్టులు ఏకరీతిగా పంపిణీ జరగలేదు. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది ఏకరీతిగా ఉండేలా ప్రస్తుతం పునర్వ్యవస్థీకరించారు. కొత్తగా 40 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కొత్తగా ఏర్పడిన 40 మండలాల్లో పీహెచ్‌సీలు లేవు. వీటిలో 40 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. గతంలో 30 మండలాల్లో ఉన్న పీహెచ్‌సీలను ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ ప్రదేశాలలో ఔట్రీచ్ కార్యకలాపాలు సీహెచ్‌సీలతో నిర్వహి స్తున్నారు. అయితే అన్ని సీహెచ్‌సీలను తెలంగాణ వైద్య విధాన పరిషత్‌కు బదిలీ చేయడం వల్ల, ఔట్రీచ్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఈ ప్రదేశాలలో పీహెచ్‌సీల అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో 30 మండలాల్లో పీహెచ్‌సీలను మంజూరు చేశారు. రాష్ట్రంలోని 235 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూపీహెచ్సీ)లను బలోపేతం చేయడానికి, తగిన సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ల సేవలు వినియోగించేందుకు వీలుగా, డెంటల్ అసిస్టెంట్ సర్జన్లను టీవీవీపీ ఆసుపత్రుల పరిధిలోకి తీసుకొచ్చారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఉన్న ప్రభుత్వ టీబీ ఆసుపత్రిని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకువచ్చారు. 4,246 ఎంపీహెచ్ఏ పోస్టులు మంజూరు 1,712 పోస్ట్‌లను సూపర్‌న్యూమరరీ పోస్ట్‌లుగా మార్చారు. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళ) కేడర్ ఈ హేతుబద్ధీకరణలో కవర్ చేయలేదు. దాంతో పీహెచ్‌సీలు, ఇతర సంస్థలలో మంజూరు చేసిన ఎంపీహెచ్ఏ (ఎఫ్) పోస్టుల స్థానం మారదు. దాంతో 4,246 ఎంపీహెచ్ఏ (మహిళ) పోస్టులను మంజూరు చేశారు. అయితే ఈ పోస్టులకు సంబంధించిన స్పష్టతను వైద్య, ఆరోగ్యశాఖ ఇవ్వలేదు. మార్గదర్శకాల్లో కొంత గందరగోళం ఉందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కాగా, ఈ హేతుబద్ధీకరణ ప్రక్రియలో రోగుల తాకిడికి అనుగుణంగా, అవసరాల మేరకు సిబ్బందిని స్థానచలనం చేయడానికి ప్రభుత్వం వీలు కలి్పంచింది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మూడు నెలల గడువు విధించింది. -
రుణమాఫీలో రికార్డు
సాక్షి, హైదరాబాద్: రైతుల పక్షాన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం కేవలం తెలంగాణలో మాత్రమే ఉందని, పదేళ్ల కాలంలో రెండుసార్లు రైతులకు పంట రుణాలు మాఫీ చేసి రికార్డు సృష్టించిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కరోనా వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గినప్పటికీ రైతుల ప్రయోజనం కోసం రుణమాఫీ అమలు చేస్తున్నట్లు చెప్పారు. తాజాగా రాష్ట్రంలోని 37 లక్షల మందికి రూ.20,141 కోట్ల మేర రుణమాఫీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటివరకు రూ.99,999 వరకు రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ అమలు చేశామని, రూ.16.66 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.8,098 కోట్లు జమ అయ్యాయని వివరించారు. రుణమాఫీ, రెన్యువల్ తీరును పరిశీలించేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందులో ఆర్థిక, వ్యవసాయ శాఖ కార్యదర్శులు, బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు ఉంటారని తెలిపారు. సోమవారం బేగంపేటలోని వివాంటా హోటల్లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం(ఎస్ఎల్బీసీ) జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆ ఘనత ముఖ్యమంత్రిదే..! దేశంలో పలు రాష్ట్రాలు రుణమాఫీ అంశంపై అనేక పరిమితులు విధించాయని, కానీ ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాత్రమే అని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ మినహా మరే రాష్ట్రం కూడా పూర్తిస్థాయిలో రైతులకు రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు. రుణమాఫీతో రైతుకు భారీ ఊరట లభిస్తుందని అన్నారు. ఒకవేళ రైతు రుణ మొత్తాన్ని చెల్లించి ఉంటే ఆ మేరకు నగదును రైతుకు ఇవ్వాలని సూచించారు. కొందరు రైతులకు బ్యాంకుల్లో వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు వంటి పాత రుణాలు ఉండొచ్చని, ఇప్పుడు వచ్చిన డబ్బులను పాత అప్పు కింద జమ చేయకూడదని స్పష్టం చేశారు. రుణమాఫీ ప్రక్రియను నెలరోజుల్లోగా పూర్తి చేసేలా బ్యాంకులు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు. రైతు సంక్షేమం ధ్యేయంగా, ఆర్థిక భారాన్ని మోస్తూ రైతు రుణమాఫీని సీఎం కేసీఆర్ ప్రారంభించారని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. వ్యవసాయాన్ని నమ్ముకుంటే అభివృద్ధి సాధించలేమన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి మార్చేశారని ప్రశంసించారు. -
జేపీ నడ్డా పర్యటన.. మంత్రి హరీష్‌రావు ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు రాగానే రాష్ట్రానికి టూరిస్ట్ నాయకులు క్యూ కడుతున్నారంటూ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం గురించి మా ప్రభుత్వం తపిస్తే.. అనారోగ్య రాజకీయాల కోసం ప్రతిపక్షాలు తపిస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు అధమ స్థానంలో ఉన్నాయి. అసత్యాలు ప్రచారం చేస్తే ఊరుకోం’’ అంటూ మండిపడ్డారు. ‘‘అభివృద్ధి, ఆరోగ్య రంగంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణకు నీతులు చెబుతారు. బాధతో చెబుతున్నా.. ఇన్నేళ్ల స్వతంత్రంలో తల్లిబిడ్డల ఆరోగ్యాలకు కూడా మన దేశంలో భరోసా ఇవ్వలేకపోతున్నాం. ఇలాంటి అంశాల గురించి దేశ నాయకులు ఆలోచించాల్సింది పోయి రాజకీయాల గురించి ప్రతిసారీ మాట్లాడటం సిగ్గుచేటు’’ అంటూ మంత్రి దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్.. ఎంఎంఆర్, ఐఎంఆర్ గణనీయంగా తగ్గించి దేశానికి తెలంగాణను రోల్ మోడల్ చేశారు. మరొకరికి జన్మనిచ్చే అమ్మకు, ఊపిరిపోసుకునే బిడ్డ ఆరోగ్యానికి అనేక పథకాలు, కార్యక్రమాల ద్వారా కేసీఆర్ భరోసా ఇచ్చారు. మానవ సంపదే మహోన్నత సంపద అనే భావనతో సీఎం కేసీఆర్ పని చేస్తే, ఓట్లు, సీట్లే పరమావధిగా కొందరు విమర్శలు చేస్తుంటారు. నడ్డాలు, పాండేలు, సుఖ్విందర్ సింగ్ సుక్కు సహా, తెలంగాణకు వచ్చి నీతులు చెప్పే బిజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలి. ఇక్కడికి వచ్చి మా నుంచి నేర్చుకొని వెళ్లండి’’ అంటూ మంత్రి హరీష్‌రావు హితవు పలికారు. చదవండి: ఢిల్లీలో హీటెక్కిన తెలంగాణ పాలిటిక్స్.. హస్తినాలో ఏం జరుగుతోంది? -
కుర్రోకుర్రు.. కేసీఆర్ పీఎం.. హరీశ్‌రావు సీఎం
సాక్షి, సిద్ధిపేట: ఆత్మీయ సమ్మేళనంలో సిద్దిపేట అర్బన్ మండలం నాంచారిపల్లికి చెందిన చిన్నారి మైత్రి సభావేదికపై కుర్రో కుర్రు అంటూ మంత్రి హరీశ్‌రావుకు సోది చెప్పింది. హరీశ్‌రావుకు నరదృష్టి బాగా ఉందని పేర్కొంది. నరంలేని నాలుక 40 మాటలు అంటుందని.. అవన్నీ పట్టించుకోవద్దని సూచించింది. తన నోరు సత్యమే పలుకుతుందని.. తన మాట తప్పదంటూ దేశానికి కేసీఆర్ పీఎం కావాలనుకుంటే హరీశ్‌రావు రాష్ట్రానికి సీఎం కావాలని ఆ చిన్నారి సోది చెప్పింది. మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి తన్నీరు హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి చెందిన మేస్త్రీలు ఇటీవల తనను కలిసినప్పుడు తెలంగాణ అభివృద్ధిలో చెమట చుక్కలు కార్చిన ప్రతి ఒక్కరూ తమ బిడ్డలేనని చెప్పానన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఇక్కడే ఉండాలని వారికి సూచించానన్నారు. చదవండి: హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి అల్లుడితో లాడ్జికి వెళ్లిన అత్త.. షాకింగ్ ట్విస్ట్! -
మంచి కాన్సెప్ట్ అనిపిస్తోంది
సిద్ స్వరూప్, కార్తికేయ రెడ్డి, ఇందు ప్రియ ప్రధాన పాత్రల్లో సూర్యనారాయణ అక్కమ్మ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘దోస్తాన్’. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు రిలీజ్ చేసి, మాట్లాడుతూ – ‘‘ఫస్ట్ లుక్ చూస్తుంటే మంచి కాన్సెప్ట్ ఉన్న కథను సెలక్ట్ చేసుకుని చిత్ర యూనిట్ సినిమా తీశారని అనిపిస్తోంది. ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి పేరు వచ్చి, నిర్మాత సూర్యనారాయణకు పెద్ద హిట్‌గా నిలవాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘సిద్ స్వరూప్ అందించిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాం. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అన్నారు సూర్యనారాయణ. ‘‘మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో నటించే చాన్స్ ఇచ్చిన సూర్యనారాయణ అక్కమ్మగారికి థ్యాంక్స్’’ అన్నారు సిద్ స్వరూప్. -
కాళేశ్వరం ప్రాజెక్ట్ తో రాష్ట్ర జీడీపీ పెరిగింది: హరీష్ రావు
-
ఆ విషయం బీజేపీ ఎంపీకి ముందే ఎలా తెలుసు?
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ దాడిని మంత్రి హరీష్‌రావు ఖండించారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో ఎంఓటీ, మోడ్రన్ కిచెన్, దోబీఘాట్లను ప్రారంభించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సీబీఐ నోటీసులు ఇస్తుందని బీజేపీ ఎంపీకి ఎలా తెలుసు? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పాలనను వదిలేసి ప్రతిపక్షాలను వేధిస్తోంది. 8 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పడగొట్టారు. రాష్ట్రంలో పథకం ప్రకారం కుట్రలు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలు బీజేపీ జేబు సంస్థలుగా మారాయనే అనుమానం కలుగుతోందన్నారు. చదవండి: మునుగోడు ఉప ఎన్నిక: టికెట్ రెడ్డికా.. బీసీకా? కర్ణాటకలో కాంట్రాక్టు పనులకు 40 శాతం కమిషన్ ఇవ్వాలని అక్కడ కాంట్రాక్టర్ అసోసియేషన్ అంటుంది. అక్కడ ఎందుకు ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు జరగవు అని హరీష్‌రావు ప్రశ్నించారు. మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీతో పాటు నిన్న జార్ఖండ్‌లో బీజేపీ చేసిన నిర్వాకాన్ని అందరూ చూశారన్నారు. ప్రతిపక్షాలను లేకుండా చేయాలన్న ధోరణిలో బీజేపీ పనిచేస్తోందని దుయ్యబట్టారు. ఆ పార్టీని ఎవరు ప్రశ్నించినా వారిని టార్గెట్ చేస్తోందని, సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తోందని హరీష్‌రావు ధ్వజమెత్తారు. -
గిరిజనుల మనోభావాలను కేద్రం దెబ్బ తీసింది: మంత్రి హరీష్ రావు
-
ఆరుసార్లు గెలిపిస్తే.. అవమానిస్తావా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆరుసార్లు గెలిపించిన హుజూరాబాద్ ప్రజలను ఈటల రాజేందర్ తన మాటలతో అవమానించాడని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం జమ్మికుంటలోని కొత్త వ్యవసాయ మార్కెట్లో నిర్వహించిన రెడ్డి ఆత్మీయ సమ్మేళనం సభలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి, సతీశ్‌బాబు, రాసరి మనోహర్‌రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్‌లో రూ.కోటి వ్యయంతో చేపట్టిన రెడ్డి కమ్యూనిటీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌కు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం జమ్మికుంటలో ఈ సభ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన దాదాపు 20 వేల మంది సభకు హాజరయ్యారు. సభలో మంత్రి హరీశ్‌రావు ఈటల రాజేందర్‌పై నిప్పులు చెరిగారు. ఇంతకాలం టీఆర్ఎస్లో ఉండి ఇటీవల పార్టీ మారిన ఈటల రాజేందర్, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను విమర్శించడం ఏంటని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ హుజూరాబాద్ ప్రజలను అవమానించడమేనని స్పష్టంచేశారు. బీజేపీ పంచన చేరిన ఈటల, చేతనైతే తెలంగాణకు విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీలను తీసుకురావాలని సవాలు విసిరారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటును సీఎం దృష్టికి తీసుకువెళ్తామని హరీశ్ హామీ ఇచ్చారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించి, కేసీఆర్‌కు అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. రెడ్డిలకు డబుల్ బెడ్రూం ఇళ్లు: గెల్లు చిన్నప్పటి నుంచి తమ కుటుంబానికి రెడ్డి సామాజికవర్గంతో అనుబంధం ఉందని హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తమ గ్రామంలో రెడ్డి సామాజికవర్గం నాయకుల సహకారంతోనే తన తల్లి సర్పంచ్‌గా గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు. తనను మంత్రి నిరంజన్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. తాను గెలిస్తే పేద ఓసీలకు డబుల్ బెడ్రూంలు ఇప్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. కేసీఆర్‌ది రైతుసంక్షేమ ప్రభుత్వం: పోచారం సభకు ముఖ్యఅతిథిగా వచ్చిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను ఈ సభకు స్పీకర్ హోదాలో రాలేదని అన్నారు. కొంతకాలంగా తమ సామాజికవర్గంలో పేరు చివరన రెడ్డి అని పెట్టుకోకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిత్యం సామాజికసేవలో ముందుండే రెడ్లు తప్పకుండా పేర్లు పెట్టుకోవాల్సిందేనన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు లాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఈ పథకాలు లేవు: నిరంజన్‌రెడ్డి 45 లక్షల ఎకరాలకు నీరిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడేళ్లలో పూర్తి చేయడం రైతులపై కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోలు, రైతువేదికలు తదితర రైతు సంక్షేమ పథకాలు గుజరాత్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. మహిళలకు పెద్దపీట: సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ ఏర్పాటుకు ముందు రైతుల కష్టాలు తాము స్వయంగా చూశామని మంత్రి సబితారెడ్డి గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ ఇస్తున్నారని, బాలికల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. రాజకీయాల్లో మహిళలు రాణించాలని 50 శాతం రిజర్వేషన్ తెచ్చారని, నామినేటెడ్ పోస్టుల్లోనూ 50 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. -
ప్రజల దృష్టిలో చిల్లర కావద్దు
హుజూరాబాద్: ‘మిస్టర్ హరీశ్‌రావు! నీతోపాటు 18 ఏళ్లు పనిచేశాను. నీలాగే నేను కూడా ఉద్యమకారుడినే. నేను ఏనాడైనా ముఖ్య మంత్రి కావాలనుకున్నానా? కేవ లం మనుషులుగా గుర్తించమని అడిగింది మనిద్దరమే కదా? నన్ను మంత్రి పదవి నుంచి తీసేసినప్పు డు దళితుల భూములు ఆక్రమించుకున్నారని చెప్పారు. ఇప్పుడేమో ఈటల రాజేందర్, ముఖ్యమంత్రి కుర్చీకే ఎసరు పెట్టారని ఇక్కడి మహిళలతో చెబుతున్నావు. హరీశ్‌రావు.. నాపై చేసిన ఆరోపణలు నిజమేనని గుండెలపై చేయి వేసుకుని చెప్పగలవా? ఇంత నీచమైన స్థాయికి ఎందుకు దిగజారిపోయావు మిత్రమా? ఇలాంటి నీచమైన పనులు చేసి తెలంగాణ ప్రజల దృష్టిలో చిల్లర కాకు’అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ హితవు పలికారు. సోమవారం హుజూరాబాద్‌లో వివిధ పార్టీలకు చెందిన పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఈటల మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్‌లో డిపాజిట్ కోల్పో బోతోందని జోస్యం చెప్పారు. 2023కు హుజూరాబాద్ ఎన్నికలు రిహార్సల్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మారావు, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. -
ఎవరివైపు ఉంటారో ఆలోచించుకోండి: మంత్రి హరీశ్‌రావు
హుజూరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్న బీజేపీ వైపు ఉంటారో లేక ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్న సీఎం కేసీఆర్ వైపు ఉంటారో ఆలోచించుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఆర్టీసీకి ఏటా రూ. 2 వేల కోట్లు ఇచ్చి సీఎం కేసీఆర్ కాపాడుతుంటే కేంద్రం మాత్రం రైల్వే, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలను అమ్ముతోందని విమర్శించారు. శుక్రవారం హుజూరాబాద్‌లో రిటైర్డ్ ఉద్యోగుల కృతజ్ఞత సభలో మంత్రి హరీశ్ మాట్లాడుతూ సీఎం మంచి వేతన సవరణ చేసినందుకు రిటైర్డ్ ఉద్యోగులు కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారన్నారు. ‘మేము అమ్ముతున్నాం.. మీరు కూడా ప్రభుత్వరంగ సంస్థలను అమ్మితే బహుమానాలు ఇస్తాం’అని కేంద్రం రాష్ట్రానికి లేఖ రాసిందని హరీశ్ చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యాదాద్రి, భద్రాద్రి లాంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థలను నెలకొల్పి ఆస్తులు పెంచుతోందని వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ రంగానికి మేలు చేసిందో చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు. ఈటల గెలిస్తే ఆయనకే మేలు.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ ప్రజలకు మేలు జరగాలని ఏమైనా రాజీనామా చేశారా? అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఉప ఎన్నికలో ఒకవేళ ఈటల గెలిస్తే వ్యక్తిగా ఆయనకు మేలు జరుగుతుందని, కానీ ఇది ప్రజలకు నష్టమేనన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు శక్తివంతులని, ఒక్కొక్కరూ వంద మందిని ప్రభావితం చేయగలరన్నా రు. సమావేశంలో మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, నాయకులు రాజయ్య, వి. హన్మంత్‌గౌడ్, విష్ణుదాస్ గోపాల్‌రావు, మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు. -
ఈటలకు ఓటమి భయం పట్టుకుంది
వీణవంక(హుజూరాబాద్): ‘‘ఈటల రాజేందర్‌కు ఓటమి భయం పట్టుకుంది, నేను నియోజకవర్గానికి వస్తే ఆయనకు అంత భయం ఎందుకు? పార్టీ ఆదేశిస్తే ఎక్కడికైనా వెళ్లి పనిచేస్తాను. ఈటల టీఆర్ఎస్ పార్టీలోకి మధ్యలోనే వచ్చిండు..మధ్యలోనే పోయిండు’’అని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం దేశాయిపల్లి క్రాస్‌లో గురువారం టీఆర్ఎస్ కార్యకర్తలు, సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. నాడు కేసీఆర్ ప్రజలకోసం రాజీనామా చేశారని, మరి ఈటల ఎవరికోసం ఎందుకోసం రాజీనామా చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. రైల్వేలు, రోడ్లను అమ్మి వ్యవస్థను, ప్రభుత్వ ఆస్తులను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. హుజురాబాద్ టీఆర్ఎస్ అడ్డా.. 2001లోనే అప్పటి కమలాపూర్ నియోజకవర్గంలో పార్టీ ఎంపీపీలు..జెడ్పీటీసీలు గెలిచిన చరిత్ర ఉందని, అప్పటికి ఈటల టీఆర్ఎస్ పార్టీలో చేరలేదని హరీశ్‌రావు గుర్తుచేశారు. హుజూరాబాద్ గులాబీ జెండా అడ్డా అని, పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపులో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమ కారుడు, పేదింటి బిడ్డ అయిన శ్రీనివాస్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ విజయ, పాడి కౌశిక్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు. -
మతతత్వపార్టీలో చేరి ఎర్రజెండా డైలాగులు
హుజూరాబాద్: బీజేపీ నేత, మాజీమంత్రి ఈటల రాజేందర్ మాటలకు, చేతలకు పొంతన ఉండదని, మతతత్వ పార్టీ అయిన బీజేపీలో చేరి, ఎర్రజెండా డైలాగులు కొడుతున్నారని రాష్ట్ర ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రక్తసంబంధం కన్నా, వర్గసంబంధం గొప్పదని ఈటల అన్నారని, ఆ మాట మాట్లాడే అర్హత ఆయనకు లేదని హరీశ్ అన్నారు. వర్గ సంబంధమైన పార్టీని కాదని, మత సంబంధమైన పార్టీలో చేరింది ఎవరని నిలదీశారు. ఎప్పడు మాట్లాడినా తనది వామపక్ష భావజాలం, లెఫ్ట్ ఇజం అని చెప్పుకునే ఈటల బీజేపీలో చేరి ఆత్మవంచన చేసుకున్నారని విమర్శించారు. ఆదివారం హుజూరాబాద్‌లో ప్రజా ఉద్యమనాయకుడు పులవేని పోచమల్లు యాదవ్ టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్ మాట్లాడారు. ఈటల పెట్టిన కష్టాలు, నష్టాలు భరించలేక పోచమల్లు టీఆర్ఎస్లో చేరారని తెలిపారు. ఏడేళ్లు మంత్రిగా ఉండి నియోజకవర్గంలో ఏమీ చేయలేని ఈటల బీజేపీ నుంచి గెలిస్తే అభివృద్ధిని ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. హుజూరాబాద్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమం కోరుకుంటున్నారని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో పనిచేశారని, పోలీసుల రబ్బర్ బుల్లెట్లకు అడ్డంగా ఉరికారని గుర్తు చేశారు. ఈటల ఓటమి ఖాయమని, తల కిందకు, కాళ్లు మీదకు పెట్టినా గెలిచే ప్రసక్తే లేదని అన్నారు. ఇప్పటికే గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమైందని, ఇక మెజార్టీ ఎంతనేది తెలాల్సి ఉందని అన్నారు. ఈటల చారాణ బీసీ.. బారాణ రెడ్డి: గంగుల ఈటల ఏనాడూ బీసీలాగా ప్రవర్తించలేదని, అందుకే ఆయన చారాణ బీసీ, బారాణ రెడ్డి అని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు. అసలు సిసలైన బీసీ బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించుకోవాలని, ఆయన కేసీఆర్ విడిచిన బాణం అని అన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మికాంతారావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్‌కుమార్, పాడి కౌశిక్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అపోహలొద్దు.. అందరికీ దళితబంధు
హుజూరాబాద్ /సాక్షి, కరీంనగర్: అర్హులైన వారందరికీ దళితబంధు అందజేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఈ పథకంపై ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని కోరారు. శనివారం హుజూరాబాద్‌లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి హరీశ్ మీడియాతో మాట్లాడారు. దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఈనెల 16న హుజూరాబాద్ మండలంలోని శాలపల్లిలో సీఎం ప్రారంభించనున్నట్లు చెప్పారు. హుజూరాబాద్‌లోని ప్రతి దళిత కుటుంబానికీ ఈ పథకాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. దళిత బంధును ఇక్కడ అమలు చేయడానికి రూ.2 వేల కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ నిధులతో 20 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. రైతు బంధు ఇక్కడినుంచి ప్రారంభించినప్పుడు కూడా.. కొందరికే వస్తుందని, ఎన్నికల కోసమే ఇస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. రైతు బంధు ఇదే నియోజకవర్గంలో ప్రారంభించినప్పుడు చప్పట్లు కొట్టిన కొందరు నాయకులు, ఇవాళ దళిత బంధు ప్రారంభిస్తుంటే అదే చేతులతో గుండెలు బాదుకుంటున్నారని అన్నారు. ఎన్నికల కోసం ఈ పథకం తెచ్చారంటున్నారని, కానీ బడ్జెట్ సమావేశాల సందర్భంగానే ఈ పథకం గురించి చెప్పామని హరీశ్ గుర్తుచేశారు. మార్చిలోనే ఈ కొత్త పథకాన్ని సీఎం ప్రకటించారని చెప్పారు. కేంద్రం రూ.40 లక్షలు ఇస్తే సంతోషిస్తాం ‘ఎంపీ బండి సంజయ్ రూ.50 లక్షలు ఇవ్వాలంటున్నారు. మాకు చేతనైనంత మట్టుకు రూ.10 లక్షలు ఇస్తున్నాం. మరో రూ.40 లక్షలు అదనంగా కేంద్రం నుండి తెచ్చిస్తే మీకు, మోదీకి ప్రజలు పాలాభిషేకం చేస్తారు. మొత్తంగా ప్రజలకు రూ.50 లక్షలు అందితే మేమెంతో సంతోషిస్తాం..’అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సీఎం చేతుల మీదుగా 15 కుటుంబాలకు చెక్కులు 16న జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి 15 కుటుంబాలకు చెక్కులు అందజేస్తారని మంత్రి తెలిపారు. 16న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం శాలపల్లికి వస్తారని, 4 గంటల వరకు సభ ఉంటుందని చెప్పారు. గ్రామసభలు నిర్వహించి.. సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల సమక్షంలో ప్రజల మధ్యే అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మేయర్ సునీల్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అత్యంత బీదలు తొలి లబ్ధిదారులు: సీఎస్ దళితబంధు అమలుపై శనివారం కలెక్టరేట్లో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, సీఎస్ సోమేశ్‌కుమార్, ఎస్సీ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, కలెక్టర్ కర్ణన్ తదితరులు సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎస్ విలేకరులతో మాట్లాడారు. అత్యంత బీదలైన దళితులను దళిత బంధు తొలి లబ్ధిదారులుగా ఎంపిక చేస్తామని చెప్పారు. అత్యంత పేదరికంలో ఉన్నవారితో మొదలుపెట్టి, అర్హులైన అందరికీ అందేలా చర్యలు చేపడతామన్నారు. సీఎం సభకు ఏర్పాట్ల పరిశీలన శాలపల్లిలో సీఎం సభ ఏర్పాట్లను మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ శనివారం పరిశీలించారు. ఐజీ నాగిరెడ్డి, సీపీ సత్యనారాయణకు పలు సూచనలు చేశారు. ఈ సభకు లక్షా 20 వేల మంది హాజరుకానున్నారు. సభకు దళితులను తీసుకురావడానికి 825 బస్సులను ఏర్పాటు చేశారు. -
మామ మెప్పు కోసం హరీశ్ ఆరాటం
ఇల్లందకుంట(హుజూరాబాద్): ‘నాతో 18 సంవత్సరాల అనుబంధాన్ని మరిచిపోయి.. మంత్రి హరీశ్‌రావు తన మామ కేసీఆర్ మెప్పు పొందడానికి ఆరాటపడుతున్నారు’అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. పచ్చి అబద్ధాలు మాట్లాడడంలో హరీశ్‌రావు మామ కేసీఆర్‌ను మించిపోయారని ఎద్దేవా చేశారు. గురువారం ఈటల కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హరీశ్‌రావు ఎంత ఆరాటపడ్డా కేసీఆర్ నమ్మరని పేర్కొన్నారు. 2018 ఎన్నికల్లో తనతోపాటు మరో 11 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఓడించడానికి కేసీఆర్ డబ్బులు పంపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆర్థిక శాఖకు మంత్రిగా ఉన్న తాను.. తన శాఖ నుంచే ముఖ్యమంత్రికి జీతం ఇచ్చానని.. అలాంటి తాను నియోజకవర్గ అభివృద్ధిని ఎలా విస్మరిస్తానని ఆవేదన వ్యక్తం చేశారు. మూడుసార్లు మంత్రులతో కలసి ప్రగతి భవన్‌కు వెళ్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానపరిచారని పేర్కొన్నారు. 2003లో తనకున్న ఆస్తులెన్ని.. ఇప్పుడున్న ఆస్తులెన్నో తేల్చేందుకు సీబీఐతో విచారణకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. అదే సమయంలో ‘మీ ఆస్తులపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేందుకు సిద్ధమా’అని నిలదీశారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కాకుండా మిగతా ఎక్కడా 2 వేలకు పైగా డబుల్ బెడ్రూం ఇళ్లు లేవని, అవి కూడా ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు తీసుకున్న వారు పూర్తి చేశారని తెలిపారు. అబద్ధాలు మాట్లాడితే దుబ్బాకలో ప్రజలు ఏ విధంగా కర్రు కాల్చి వాతపెట్టారో.. హుజూరాబాద్‌లో కూడా అలాగే చేస్తారని హెచ్చరించారు. సంక్షేమ పథకాలకు తాను వ్యతిరేకం కాదని, ఆ ఫలాలు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే చేరాలని చెప్పానని వెల్లడించారు. హుజూరాబాద్, జమ్మికుంటలను అద్దంలా మార్చాలని రూ.25 కోట్ల చొప్పున జీవో తెస్తే, కేటీఆర్ నిధులు ఆపారని పేర్కొన్నారు. అది ప్రగతి భవన్ కాదు.. బానిసలకు నిలయమని రాసుకోమని ఎంపీ సంతోష్‌కుమార్‌కు చెప్పానని, రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఈటల అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఈటల గెలిస్తే లాభమేంటి?
సిద్దిపేటజోన్: హుజూరాబాద్‌లో బీజేపీ ఏం చెప్పి ఓట్లు అడుగుతుందని, పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను పెంచామని చెప్పి ఓట్లు అడుగుతారా అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలిస్తే ప్రజలకు వచ్చే లాభం ఏమిటని, ఆయన గెలిచినా నియోజకవర్గ అభివృద్ధి ఏమీ ఉండదన్నారు. వ్యక్తి ప్రయోజనమా.. హుజూరాబాద్ ప్రజల ప్రయోజనమా అనే అంశంపై చర్చ పెట్టాలని సోషల్ మీడియా వారియర్స్‌కు ఆయన సూచించారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలో టీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్‌తో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. నాడు హుజూరాబాద్‌లో రైతుబంధును ప్రారంభిస్తే చప్పట్లు కొట్టిన ఈటల, నేడు అక్కడే దళితబంధు ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటిస్తే గుండెలు బాదుకొని గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. దళిత బంధును ఆపేందుకు బీజేపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని, అందుకే తొందరగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి ఒత్తిడి తెస్తున్నారన్నారు. దళితబంధు హుజూరాబాద్ ప్రజలకు ఇవ్వద్దంటారా? దీనిపై బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దళితబంధు పథకం ఎన్నికల కోసం అంటున్నారని, మార్చి నెలలోనే బడ్జెట్లో దళితుల అభ్యున్నతికి రూ.1,200 కోట్లతో దళిత ఎంపవర్మెంట్ స్కీంను అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి, వివిధ జిల్లాల టీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. -
దమ్ముంటే కేసీఆర్,హరీశ్‌రావు నాపై పోటీచేయాలి:ఈటల
హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో దమ్ముంటే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు తనపై పోటీచేయాలని మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. ఉరుములు వచ్చినా.. పిడుగులు పడినా తన గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూర్లో బీజేపీలో చేరిన దాదాపు 500 మంది ముదిరాజ్ కులస్తులకు ఈటల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ, ‘నన్ను బక్కపల్చటి పిలగాడు.. దిక్కులేని వాడని అనుకోవద్దు.. హుజూరాబాద్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డను నేను’ అన్నారు. దళితబంధుతో రూ.10 లక్షలు ఇచ్చినా.. గొర్రెలిచ్చినా, కులాల వారీగా తాయిలాలిచ్చినా ప్రజల గుండెల్లో ఉంది తానేనని పేర్కొన్నారు. తాను పనిచేస్తేనే ఇక్కడి ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జెడ్పీటీసీలుగా గెలిచారన్నారు. సీఎం కేసీఆర్‌కు దళితుల ఓట్ల మీద తప్ప, హుజూరాబాద్ దళితులపై ప్రేమ లేదని, ఆసరా పింఛన్లు, రేషన్‌కార్డులు ఇవ్వాలని కోరినందుకే తనపై కేసీఆర్ కోపం పెంచుకున్నారని తెలిపారు. కమ్యూనిటీ హాళ్లకు, ఆలయాలకు నిధులిస్తే తప్పులేదని, ఆ సొమ్మంతా ప్రజలదే అన్నారు. ఏమిచ్చినా తీసుకుని ఓటు మాత్రం పువ్వు గుర్తుకు వేయాలని ఈటల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
6 లక్షల మంది రైతులకు రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,850 కోట్ల మేర పంట రుణమాఫీ డబ్బులను జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.25వేల నుంచి రూ.50 వేల లోపు పంట రుణాలున్న రైతుల రుణాలను మాఫీ చేస్తూ శుక్రవారం వ్యవసాయ శాఖ రెండు ఉత్తర్వులు జారీ చేసింది. రూ.50 వేల లోపు రుణాలన్నీ మాఫీ చేయాలని, బ్యాంకులు ఈ మొత్తాన్ని ఏ ఇతర బాకీ కింద జమ చేసుకోవద్దని ఆదేశించింది. ఆ సొమ్మును పూర్తిగా పంట రుణమాఫీ కిందే జమ చేయాలని స్పష్టం చేసింది. రుణమాఫీ జరిగిన రైతుల ఖాతాలను జీరో చేసి, కొత్తగా పంట రుణాలు ఇవ్వాలని సూచించింది. అంతకు ముందు ఇదే అంశంపై 42 బ్యాంకుల ప్రతినిధులతో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బీఆర్కే భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, రూ.50 వేలలోపు రైతు రుణమాఫీకి సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఈ నెల 15వ తేదీన సీఎం కేసీఆర్ లాంఛనంగా రూ. 50 వేలలోపు రైతు రుణమాఫీని ప్రకటిస్తారన్నారు. అదే రోజు నుంచి ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,850 కోట్లు జమ అవుతాయన్నారు. రుణమాఫీ సొమ్ము జమ కాగానే ముఖ్యమంత్రి పేరుతో రైతు రుణం మాఫీ అయినట్లు లబ్ధిదారుల ఫోన్లకు ఎస్ఎంఎస్ వెళ్లాలని ఆదేశించారు. రైతు రుణమాఫీతో పాటు కొత్త పంట రుణానికి మీరు అర్హులని.. ఆ సందేశంలో తప్పకుండా పేర్కొనా లని సూచించారు. బ్యాంకులు సైతం రైతులకు రుణమాఫీ అయినట్లు స్పష్టమైన సందేశం పంపాలన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వానికి అన్ని బ్యాంకులు సహకరించాలన్నారు. ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా రైతులకు రుణ మాఫీ మొత్తం చేరవేయాలని కోరారు. -
చిన్నారులకు ‘పౌష్టికాహార కిట్స్
సిద్దిపేటజోన్: సిద్దిపేటలో అంగన్వాడీ పిల్లల కోసం మంత్రి హరీశ్‌రావు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. చిన్నారులకు కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉందన్న వైద్యుల హెచ్చరికలతో వారిలో రోగనిరోధక శక్తి పెంపే లక్ష్యంగా ‘పౌష్టికాహారం కిట్స్’ పంపిణీని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. కర్ణాటకలో సత్ఫలిస్తున్న ‘క్షీరభాగ్య’ తరహాలో చిన్నారుల్లో ఐరన్ లోపం, రక్తహీనత వంటి సమస్యలు అధిగమించే దిశగా ఇమ్యూనిటీ బూస్టర్ తరహాలో దీనిని రూపొందించారు. అన్నపూర్ణ ట్రస్ట్ సహకారం, దాతల తోడ్పాటుతో జిల్లాలోని చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనుకుంటున్నారు. ఎన్ఐఎన్ నిర్ధారణతో... సిద్దిపేట జిల్లాలో ఆయా అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గత ఏడాది జాతీయ పోషకాహర సంస్థ (ఎన్ఐఎన్) పర్యవేక్షణలో బృందాలు సర్వే చేసి చిన్నారులకు పోషకాహారలోపం ఉందని నిర్ధారించాయి. ఈ క్రమంలోనే కరోనా థర్డ్ వేవ్ రానుందని, ముఖ్యంగా చిన్నారులపై ప్రభావం చూపనుందని ప్రచారం సాగుతోంది. ఆరేళ్లలోపు చిన్నారుల పోషకాహారలోపం సరిదిద్ది బలవర్ధకమైన పౌష్టికాహారం అందించాలని మంత్రి హరీష్ సంకల్పించారు. ఈ నెల 8న స్థానిక ప్రభుత్వ ఇందిరానగర్ పాఠశాలలో దీనిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. కిట్స్‌లో ఇలా ►జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ రికార్డుల ప్రకారం సుమారు 60 వేలమంది చిన్నారులు ఉండగా, వారిలో మూడేళ్ల నుంచి ఆరేళ్ల వయసులోపు ఉన్నవారు సుమారు 25 వేలు. ►వీరిలోని ప్రతి ఒక్కరికీ నెలకు 450 గ్రాముల పౌష్టికాహారం కిట్స్ పంపిణీ చేయనున్నారు. ►కిట్స్‌లో పాలు, షుగర్‌తో పాటు న్యూట్రీషియన్ పౌడర్, విటమిన్ సి, కాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం వంటివిS ఉంటాయి. -
సిద్ధిపేట: మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి హరీష్ రావు జోరు
-
తెలంగాణ లో చేపల డిమాండ్ ఎక్కువ
-
కూడవెల్లి వాగులోని గోదావరి నీటిని విడుదల చేసిన మంత్రి హరీష్ రావు
-
ప్రజల ఆశలు నెరవేర్చేలా.. సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.50 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని.. ప్రస్తుతం ఈ నష్టం రూ.లక్ష కోట్లకు చేరుకున్నదని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. కరోనా తర్వాతి పరిస్థితులలో రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని, వివిధ రూపాల్లో రాబడి పెరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో గత బడ్జెట్ కంటే రాబోయే బడ్జెట్లో నిధుల కేటాయింపులు ఎక్కువగానే ఉండే అవ కాశం ఉందని తెలిపారు. బడ్జెట్ ఆశాజనకంగా ఉండబోతున్నదని స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్ 2021–22 రూపకల్పనపై శనివారం సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పద్దుల్లో పొందుపర్చాల్సిన శాఖల వారీ బడ్జెట్ అంచనాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికారులు సమర్పించిన నివేదికలను సీఎం పరిశీలించారు. ఆయా అం శాలపై చర్చించిన అనంతరం.. బడ్జెట్ కేటాయిం పుల విధివిధానాలను ఖరారు చేశారు. ఆదివారం నుంచి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తమ శాఖ అధికారులతో కలిసి.. ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, పురపాలక, విద్యా, నీటిపారుదల తదితర శాఖల బడ్జెట్ అంచనాల తయారీపై రోజువారీగా వరుస సమావేశాలు నిర్వహిస్తారని ఈ సందర్భంగా వెల్లడించారు. అన్ని శాఖలతో బడ్జెట్ రూపకల్పన కసరత్తు ముగిసిన తర్వాత.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దనున్నారు. ఈ నెల మధ్యలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సీఎం తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగింపు రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గొర్రెల పెంపకం కార్యక్రమం అమలు కొనసాగుతుందన్నారు. ఈ పథకం ద్వారా యాదవులు, గొల్లకుర్మల కుటుంబాలు ఆదాయాన్ని మంచి ఆర్జిస్తున్నందున.. ఇప్పటికే పంపిణీ చేసిన 3.70 లక్షల యూనిట్లకు కొనసాగింపుగా.. మరో 3 లక్షల యూనిట్ల పంపిణీ కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని తెలిపారు. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకున్నదని సీఎం గుర్తు చేశారు. దేశంలోనే అధికంగా గొర్రెలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ పురోగమిస్తున్నదని కేంద్రం గుర్తించిన నేపథ్యంలో.. ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించామన్నారు. ఇక చేపల పెంపకం కార్యక్రమం గొప్పగా సాగుతోందని, మంచి ఫలితాలు వస్తున్నందున దాన్ని కూడా కొనసాగిస్తామని ప్రకటించారు. సీ సమీక్ష్లలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థిక వ్యవహారాల సలహాదారు జీఆర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్టారావు, కార్యదర్శి రోనాల్డ్ రాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య తెలంగాణే కేసీఆర్ లక్ష్యం
సాక్షి, సిద్ధిపేట: జిల్లా కేంద్రంలోని నాగులబండలో నూతనంగా నిర్మించిన ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి, జడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎల్వీ ప్రసాద్, గొల్లపల్లి ఎన్ రావు, హెటిరో చైర్మన్ పార్థసారథి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా మారాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్, వరంగల్‌లో మాత్రమే మెడికల్ కళాశాలలు ఉండేవని.. రాష్ట్రవ్యాప్తంగా అనేక మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 1987లో ప్రారంభించిన ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిని నాలుగు రాష్ట్రాలకు విస్తరించి ప్రజలకు సేవలందించడం అభినందనీయమన్నారు. ఆసుపత్రి సేవలను సిద్ధిపేట ప్రజలు వినియోగించుకోవాలన్నారు. హైదరాబాద్‌లో 400 కోట్లతో క్యాన్సర్ ఆసుపత్రిని పార్థసారథి రెడ్డి ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. మొట్టమొదటిగా సిద్ధిపేటలో క్యాన్సర్ స్క్రినింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని హరీష్‌రావు కోరారు. -
డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేసిన మంత్రి హరీష్
సాక్షి, సంగారెడ్డి: అన్ని హంగులతో లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్‌లో 150 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, 141 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం కొత్త ట్రాక్టర్లను సర్పంచ్‌లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అమరుల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయిందన్నారు. పేదల కోసం ముఖ్యమంత్రి కట్టించిన ఇళ్లల్లో పేదలు మాత్రమే నివసించాలని..వాటిని అమ్ముకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. పేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రైతుల కోసం రైతు బంధు బీమా, 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు. నిత్యం ప్రజల సంక్షేమం కోసమే కేసీఆర్ ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. దేశమంతటా వర్షాలు పడి ప్రాజెక్టులు పొంగిపొర్లుతుంటే సింగూర్ లో మాత్రం చుక్క వర్షం పడటం లేదని.. భవిషత్తులో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సింగూర్ నింపుతామన్నారు. 40 వేల ఎకరాలకు రెండు పంటలకు నీరందిస్తామని పేర్కొన్నారు. అందోల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. పేదలకు అండగా ఉంటాం.. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి.. పేదలకు ఇళ్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇళ్లు లేని పేదలకు వచ్చే ఏడాదిలోగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందిస్తామని వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని చెప్పారు. -
నియోజకవర్గానికో వ్యవసాయాధారిత పరిశ్రమ
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర, వ్యవసాయ ఉత్పత్తులతో వివిధ పదార్థాలు తయారు చేసేలా ప్రతి నియోజకవర్గంలో వ్యవసాయాధారిత పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మలేసియాకు చెందిన డీఎక్స్ఎన్ కంపెనీ ఏర్పాటు చేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు మంగళవారం సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా చేసేందుకు ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టిస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 16 టీఎంసీలను పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. పరిశ్రమల ఏర్పాటు చేయాలంటే రవాణా సౌకర్యాలు, మౌలిక వసతులు కావాలని, వాటిని ప్రభుత్వం సమకూర్చుతుందని తెలిపారు. పరిశ్రమలకు ఉపయోగపడే 250 ఎకరాల స్థలాన్ని సేకరించామని.. ఇందులో నుంచి 47 ఎకరాలను డీఎక్స్ఎన్ కంపెనీకి అప్పగిస్తున్నట్లు వివరించారు. ఈ కంపెనీ ద్వారా 1,500 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, పరోక్షంగా ఈ ప్రాంత రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ రాబోయే 20 ఏళ్ల ప్రగతిని దృష్టిలో ఉం చుకొని ముందుచూపుతో పనులు చేపడుతున్నారని కొనియాడారు. దళితుల భూములను అభివృద్ధి చేసి వాటి ఉత్పత్తులను డీఎక్స్ఎన్ కంపెనీకి అప్పగించేలా ప్రణాళిక రూపొందించిన దళిత స్టడీస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య సహకారంతో కంపెనీ వచ్చిందని చెప్పారు. సిద్దిపేట జిల్లాలోని నర్మెట ప్రాంతంలో జపాన్‌కు చెందిన ఎగ్ ప్రాసెస్ కంపెనీ ఏర్పాటుకు ఒప్పందాలు కుదిరాయని మంత్రి వెల్లడించారు. శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం.. ఈ భూముల్లో స్పెరిలేనా, పుట్టగొడుగులు, ఉత్పత్తి చేస్తామని డీఎక్స్ఎన్ కంపెనీ యజమాని లిమ్ తెలిపారు. విత్తన నిల్వ కేంద్రం, నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని నిర్మిస్తామని చెప్పారు. రూ.150 కోట్లతో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమలో మరో సంవత్సరంలో ఉత్పత్తులు ప్రారంభమవుతాయని వివరించారు. 2020 నాటికి డీఎక్స్ఎన్ కంపెనీ ద్వారా ఆహార, మందులు, కాస్మోటిక్స్ ఉత్పత్తులు వస్తాయని వెల్లడించారు. కార్యక్రమంలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, టీఎస్ఐసీసీ చైర్మన్ బాలమల్లు, ఎండీ నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
కొత్త బిచ్చగాళ్లు వస్తుంటారు
తూప్రాన్: ఎన్నికల సమయం రాగానే కొత్త బిచ్చగాళ్లు వస్తుంటారని, చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్లుగా గెలువని కాంగ్రెస్‌కు మాటలు ఎక్కువని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. తూప్రాన్ మండలం రామాయపల్లి సమీపంలో 44వ నంబర్ రహదారిపై వంద కోట్ల రూపాయలతో రైల్వే వంతెన నిర్మాణం పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలో రైల్వే పనులు, జాతీయ రహదారులు, కరెంట్ సమస్యలతో పాటు ప్రజలకు చెప్పని ఎన్నో పథకాలను చేసి చూపిందన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దీవెనలు అందించాలని కోరారు. రూ.12 వేల కోట్లతో హైదరాబాద్ మహానగరానికి మరో రీజినల్ రింగ్‌రోడ్డును కేసీఆర్ సాధించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ రీజినల్ రింగ్‌రోడ్డు ఆరు లైన్లతో సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, జగదేవ్‌పూర్ మీదుగా, భువనగిరి వరకు ఉంటుందన్నారు. రైల్వే లైన్లను పట్టించుకోలేదు.. డ్వాక్రా మహిళలు ఎన్నో ఏళ్లుగా వడ్డీలేని రుణాల కోసం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 1,650 కోట్ల వడ్డీలేని రుణాలను ఇటీవల మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇందులో 3.26 కోట్లు తూప్రాన్ మండలానికి వర్తిస్తుందన్నారు. ఎస్సీలకు 101 యూనిట్ల వరకు కరెంట్ బిల్లు మాఫీ చేసిన ఘనత టీఆర్ఎస్కు దక్కిందన్నారు. 2006లో కాంగ్రెస్ హయాంలో మంజూరైన రైల్వే నిర్మాణం పనులు ఆ తర్వాత ఎనిమిదేళ్ల కాలంలో పట్టించుకోలేదన్నారు. నేడు అదే ప్రాజెక్టుకు రూ.1,160 కోట్ల వ్యయం పెరిగిందన్నారు. కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి వల్లే నేడు అధిక నిధులు కేటాయించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా 20 ఏళ్ళు అధికారంలో ఉన్నా ఈ పని సాధ్యమయ్యేది కాదన్నారు. కరీంనగర్, పెద్దపల్లి మీదుగా నిజామాబాద్ వరకు రైల్వేలైన్ నిర్మాణం పనులను ఎన్నేళ్లు చేశారో కాంగ్రెస్ నాయకులు గుర్తు చేసుకోవాలన్నారు. పెద్దపల్లి నుంచి నిజామాబాద్ వరకు రైల్వే నిర్మాణం పనులకు 40 ఏళ్ల కాలం పట్టిం దన్నారు. కాగా, మంత్రితో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
‘ఖరీఫ్ కంది 75% కొనుగోలు చేయండి’
సాక్షి, హైదరాబాద్: ఈ ఖరీఫ్‌లో సాగవుతున్న కంది ఉత్పత్తిలో 75% మేర కేంద్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కోరనుంది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు త్వరలో కేంద్రానికి లేఖ రాయనున్నారు. కేంద్ర అర్థ, గణాంక శాఖ ముందస్తు అంచనాల ప్రకారం మద్ద తు ధరకు కొనుగోలు పథకం కింద సేకరణకు అనుమతినిస్తుంది. దీని ప్రకారం మొత్తం ఉత్పత్తిలో 40% మాత్రమే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తాయి. ఈ ఖరీఫ్‌లో రైతులు కందులు 6.57 లక్షల ఎకరా ల్లో వేశారు. ఈ విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ముందుగానే కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలిసింది. గతేడాది కంది సాగు విస్తీర్ణం 7.28 లక్షల ఎకరాలు కాగా, దిగుబడి 2.84 లక్షల టన్నులుగా ఉంది. మొదటి ముందస్తు అంచనాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్న కేంద్రం కేవలం 75,300 క్వింటాళ్లకే అనుమతించింది. తర్వాత రాష్ట్రమే రైతుల నుంచి క్వింటాకు రూ.5,450 మద్దతు ధర తో 1.13 లక్షల మెట్రిక్ టన్నులు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
ఎస్సారెస్పీ నీరొస్తోంది
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) ఆయకట్టు రైతులకు శుభవార్త. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో ఈ ఖరీఫ్‌లో పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని మంత్రుల బృందం నీటి విడుదలపై సానుకూల నిర్ణయం తీసుకుంది. నీటి విడుదలకు షెడ్యూల్ రూపొందించాలని అధికారులను ఆదేశించింది. భారీగా ప్రవాహాలు వస్తున్నందున ఒకట్రెండు రోజుల్లోనే ప్రాజెక్టు నుంచి నీరు విడుదలయ్యే అవకాశముంది. మూడు రోజుల్లో పూర్తిగా.. ఎస్సారెస్పీకి ఎగువన ఉన్న మహారాష్ట్రలోని విష్ణుపురి, బాలేగావ్, అంధురా ప్రాజెక్టుల నీటి మట్టాలు పూర్తిస్థాయికి చేరడం.. బాలేగావ్ నుంచి 1.98 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తుండటంతో ప్రాజెక్టుకు ఒక్కసారిగా ప్రవాహాలు పెరిగాయి. సాయంత్రానికి 2.68 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవడంతో ఎస్సారెస్పీలో నీటి నిల్వ 58 టీఎంసీలు (సామర్థ్యం 90 టీఎంసీలు) దాటింది. ఎగువన మహారాష్ట్రలోని గోదావరి పరీవాహకంలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో వరద స్థిరంగా కొనసాగే అవకాశం ఉం ది. అదే జరిగితే మూడు రోజుల్లో ప్రాజెక్టు నిండొ చ్చని నీటి పారుదల వర్గాలు అంచనా వేస్తున్నాయి. షెడ్యూల్ ఖరారుకు ఆదేశాలు ఎస్సారెస్పీ నిల్వలు పెరగడంతో మంత్రి హరీశ్‌రావు మంగళవారం జలసౌధలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మిషన్ భగీరథ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఈఎన్సీ మురళీధర్, ఇరిగేషన్ ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, ఇరిగేషన్ ప్రత్యేకాధికారి కె.ప్రసాద్‌లతో సమీక్ష నిర్వహించారు. శ్రీశైలం, ఎస్సారెస్పీ, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయి జలకళ సంతరించుకోవడం పట్ల మంత్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ కింద ఈ ఖరీఫ్‌కు నీరు విడుదల చేయాలని తీర్మానించారు. ప్రాజెక్టు కింది కాకతీయ, లక్ష్మీ కాలువలతో పాటు లక్ష్మీ కాంప్లెక్స్‌లోని చౌటుపల్లి హన్మంత్‌రెడ్డి లిఫ్ట్, నవాబ్ లిఫ్ట్ కింది ఆయకట్టు.. సరస్వతీ కెనాల్ కాలువ, గుత్ప, అలీ సాగర్, ఐడీసీ ఆధ్వర్యంలో నడిచే 24 లిఫ్ట్‌ల పరిధిలోని ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరివ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 58 టీఎంసీల నీరుందని, రెండున్నర లక్షల క్యూసెక్కుల నీరొస్తోందని, ఈ ప్రవాహం మరి కొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఎస్సారెస్పీకి ఎగువన ఏయే ప్రాజెక్టుల్లోకి నీరు వస్తోంది, వర్షపాతం ఎలా ఉందో మంత్రులు ఆరా తీశారు. గ్రామాల్లో చాటింపు వేయించండి ఎస్సారెస్పీలో నీటి లభ్యత పెరిగిన దృష్ట్యా అందుకు అనుగుణంగా నీటి విడుదల ప్రణాళిక సిద్ధం చేయాలని ఈఎన్సీని మంత్రి హరీశ్ ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలోని చెరువులు, కుంటలను నింపాలని ఇంజనీర్లకు చెప్పారు. క్షేత్రస్థాయిలో రైతులు, రెవెన్యూ సిబ్బంది, ప్రజా ప్రతినిధులతో ఇంజనీర్లు సమావేశాలు ఏర్పాటు చేసి నీటి విడుదల ప్రణాళికలు వివరించాలన్నారు. కాలువ పరిధిలోని రైతులకు నీటి విడుదల సమాచారం అందించేలా ఇంజనీర్లు, రెవెన్యూ సిబ్బంది గ్రామాల్లో చాటింపు వేయించాలన్నారు. నీరు విడుదల చేసే కాలువలను పటిష్ట పరచాలని, ఉపాధి హామీ పథకంలో భాగంగా పూడిక తీయాలని చెప్పారు. నీటి వృథా అరికట్టేందు కు టెయిల్ టు హెడ్, ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి అవలంబించాలన్నారు. గత రబీలో ఈ పద్ధతి అమలు చేయ డం ద్వారా ఒక్క టీఎంసీ నీటితో 13 వేల నుంచి 14 వేల ఎకరాలకు నీరు ఇవ్వగలిగామని గుర్తుచేశారు. సాగర్‌లో 210 టీఎంసీలు నాగార్జునసాగర్‌కు కృష్ణా ప్రవాహం తగ్గింది. శ్రీశైలం నుంచి నీటి విడుదల తగ్గడంతో నిన్నమొన్నటి దాకా 2 లక్షలకు పైగా నమోదైన ప్రవాహం మంగళవారం సాయంత్రానికి 61 వేలకు పడిపోయింది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం సాగర్‌లో 210 టీఎంసీల నీరుంది. అయితే ఎగువ ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి 1.60 లక్ష ల క్యూసెక్కుల ప్రవాహం స్థిరంగా కొనసాగుతుండటం, నిన్నటివరకు తగ్గిన తుంగభద్ర వరద మళ్లీ పుంజుకొని లక్ష క్యూసెక్కులకు పెరిగిన నేపథ్యంలో శ్రీశైలానికి మళ్లీ ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉంది. ప్రస్తు తం శ్రీశైలానికి 1.31 లక్షల ప్రవాహం వస్తుండగా 92 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కాంగ్రెస్ నేతల కళ్లలో కన్నీరు తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని.. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను సీఎం ప్రారంభించారని మంత్రులు చెప్పారు. సాగు ప్రాజెక్టుల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేసేం దుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో దేవుడూ కరుణించి చక్కగా వర్షం కురిపించడం వల్ల ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయని ఆనం దం వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా గోదావరి బేసిన్లో నీరుంటే కృష్ణా బేసిన్లో ఉండేది కాదని.. కృష్ణాలో ఉంటే గోదావరిలో ఉండేది కాదని, కానీ రెండు బేసిన్లలోకి వరద నీరు రావడం, ప్రాజెక్టులు నిండటం తొలిసారని హరీశ్ అన్నారు. ప్రాజెక్టుల్లోకి నీరొస్తుంటే.. కాంగ్రెస్ నేతల కళ్లలో కన్నీరు వస్తోందని విమర్శించారు. -
వానలొచ్చినా ఏడుపేనా!
సాక్షి, సిద్దిపేట: వర్షాలు కురిసి తెలంగాణ ప్రాంతం నీళ్లతో నిండిపోతుంటే కాంగ్రెస్ నాయకులు కన్నీళ్లు పెడుతున్నారని నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించాల్సిన నాయకులు ద్రోహులుగా వ్యవహరించడం శోచనీయమన్నారు. కరువుతో అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను ఆదుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయించాలని కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టులో కేసు వేశారని పేర్కొన్నారు. మంగళవారం సిద్దిపేటలో సబ్సిడీపై పశువుల పంపిణీ అవగాహన కార్యక్రమానికి హాజరైన మంత్రి కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో ఉన్న 15 టీఎంసీల నీళ్లు తాగడానికే సరిపోతాయని, దీనిని అర్థం చేసుకోలేని కాంగ్రెస్ నేతలు రైతులను రెచ్చగొట్టి నీళ్లు విడుదల చేయాలని ఆందోళన చేయించడం సరికాదని హితవు పలికారు. నీళ్ల రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ కుట్రను వాన దేవుడు చూసి వారికి బుద్ధి చెప్పాలని వర్షాలు కురిపించాడని అన్నారు. ఈ వర్షాలతో చెరువులు, కుంటలు నిండి ప్రాజెక్టుల్లోకి ఉధృతంగా వరద నీరు వస్తోందన్నారు. వాన దేవుడు కూడా ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం నిండి సాగర్‌కు నీళ్లు వస్తున్నాయన్నారు. ఎస్సారెస్పీకి 50 టీఎంసీల నీరు చేరిందని, ఇంకా 2.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని చెప్పారు. దీంతో నీటి కష్టాలు తొలగిపోయి, ఎస్సారెస్పీ కింద తాగునీరు, సాగు నీటికి ఢోకా ఉండదని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఏది అవసరమో అడగకుండానే సీఎం కేసీఆర్ సమకూర్చుతున్నారని, ఆయన చేసే మంచి పనులకు దైవం కూడా మద్దతు పలుకుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల మద్దతు లభించదన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బి.వెంకటేశ్వర్లు, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్‌కుమార్ పాల్గొన్నారు. -
కాళేశ్వరానికి ఎన్జీటీ లైన్‌క్లియర్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు తొలగిపోతున్నాయి. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవంటూ దాఖలైన పిటిషన్‌ను జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కొట్టేసింది. ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని రకాల కీలక అనుమతులు వచ్చిన నేపథ్యంలో ఈ పిటిషన్లో విచారించడానికి ఇంకేం లేదని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవని, ఇటీవల వచ్చిన అనుమతులు చెల్లవని పేర్కొంటూ హయాతుద్దీన్ దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లను జస్టిస్ రఘువేంద్ర రాథోర్ బెంచ్ మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్ ఉపాధ్యాయ వాదిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఎలాంటి అనుమతులు లేకుండా ప్రారంభించారని, పర్యావరణ, అటవీ అనుమతులు లేకుండానే అటవీ భూముల్లో నిర్మాణాలు చేపట్టారని వాదించారు. తాగునీటి అవసరాల కోసం అని చెప్పి సాగునీటి అవసరాల కోసం పనులు చేపట్టారన్నారు. అందుకే గతంలో ఇదే ఎన్జీటీ పనులు నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. అయితే న్యాయ విచారణ పరిధి తదితర అంశాలను ప్రస్తావిస్తూ పనులు నిలుపుదల ఉత్తర్వులను హైకోర్టు కొట్టేస్తూ కొన్ని షరతులు విధించిందని చెప్పారు. అన్ని రకాల అనుమతులు వచ్చాకే సాగునీటి అవసరాలకు పనులు ప్రారంభించాలని, అటవీ అనుమతులు లేనిదే అటవీ భూముల్లో పనులు చేపట్టరాదని చెప్పిందన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే పిటిషనర్లు తిరిగి ఎన్జీటీని ఆశ్రయించే అవకాశం కల్పిస్తున్నట్టు ఉత్తర్వులిచ్చిందన్నారు. దీని ప్రకారం ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించిందనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, కావాలంటే ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తే అన్ని విషయాలు తెలుస్తాయని వాదించారు. కమిషన్ అవసరం ఏముంది? సంజయ్ ఉపాధ్యాయ వాదనలపై స్పందించిన ట్రిబ్యునల్.. ప్రాజెక్టుకు ఇప్పుడు అన్ని రకాల అనుమతులు వచ్చిన నేపథ్యంలో ఈ కేసును విచారించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. అయితే అనుమతులు రాక ముందు ప్రభుత్వం అనేక ఉల్లంఘనలకు పాల్పడిందని సంజయ్ అన్నారు. మరి అలా అయితే ఎన్జీటీ స్టే ఇచ్చిన తరువాత రాజ్యాంగ న్యాయస్థానాలైన హైకోర్టు, సుప్రీం కోర్టులే ఈ కేసులను కొట్టేశాయిగా అని బెంచ్ వ్యాఖ్యానించింది. అనుమతులన్నీ వచ్చిన నేపథ్యంలో కమిషన్ అవసరం ఏముందని ప్రశ్నించింది. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే అనుమతులు చెల్లవంటూ దాఖలైన పిటిషన్‌కు జత చేయాలని బెంచ్ సూచించింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది పినాకి మిశ్రా స్పందిస్తూ.. ఇక ఈ కేసును విచారించాల్సిన అవసరం లేదని, కేసు కొట్టేయాలని కోరారు. దీంతో ఏకీభవించిన బెంచ్ అనుమతులు లేవన్న పిటిషన్‌ను కొట్టేసింది. వచ్చిన అనుమతులు చెల్లవంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను సెప్టెంబర్ 18న విచారిస్తామని తెలిపింది. తీర్పుపై మంత్రి హరీశ్ హర్షం.. ఈ తీర్పుపై మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తున్న శక్తులకు ఈ తీర్పు చెంపపెట్టులాంటిదన్నారు. ఇప్పటికైనా రాష్ట్రానికి జీవనాధారమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపక్షాలు సహకరించాలని ఆయన సూచించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రాజెక్టుల కోసం అన్ని పక్షాలు ఒక్కతాటిపై నిలిస్తే ఇక్కడ మాత్రం ప్రతిపక్షాలు ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా అనుమతులు చెల్లవంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కు తీసుకోవాలని ఆయన హితవు పలికారు. ట్రిబ్యునల్ తీరుపై కాళేశ్వరం ప్రాజెక్టు ఈసీ హరిరాం, న్యాయవాది సంజీవ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. -
అప్రమత్తంగా ఉండండి: భారీ వర్షాలపై కేసీఆర్ ఆరా
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లను అప్రమత్తం చేశారు. జిల్లాల్లోనే ఉండి సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలతోపాటు కరీంనగర్ పాత జిల్లా పరిధిలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సీఎం ఆదేశాల మేరకు మంత్రి ఈటల ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో పరిస్థితిని సమీక్షించారు. అధికారులు, సహచర ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. ఆగిన కాళేశ్వరం పనులు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాల వద్ద పనులు నిలిచిపోయాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రాజెక్టుపై ఉన్న యంత్రాలు, ఇంజనీర్లు, కూలీలను వెనక్కి రప్పించారు. కాగా, కాళేశ్వరం, మంథని, మెట్పల్లి, సారంగపూర్, ఏటూరు నాగా రం ప్రాంతాల్లో 8 నుంచి 12 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎల్లంపల్లి వద్ద గేట్లు ఎత్తివేయడంతో నీటిని దిగువకు వదిలారు. ఈ క్రమంలో భారీగా ప్రవా హం వస్తుండటంతో ముం దస్తు చర్యలు చేపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మొదటి, రెండో బ్యారేజి అన్నారం, మేడిగడ్డ వద్ద భారీ ప్రవాహం ఉన్నందున ఇంజనీరింగ్, పోలీస్ ఉన్నతాధికారులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కూలీలు, యం త్రాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజిలు, గ్రావెటీ కెనాల్ వద్ద పనులు నిలిచిపోయాయి. మేడిగడ్డ వద్ద వరద ఉధృతితో బ్యారేజి ప్రాంతంలో నిర్మించిన కాఫర్ డ్యాంకు ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలవాసులు అప్రమత్తంగా ఉండాలని ఎల్ఎండీ కాలనీ అతిధిగృహంలో ఎస్సార్ఎస్పీ అధికారులతో మంత్రి ఈటల రివ్యూ సమావేశం నిర్వహించారు. మానకొండూర్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో తప్ప కోరుట్ల, జగిత్యాల, వేములవాడ, సిరిసిల్ల, రామగుండం, ధర్మపురి, పెద్దపల్లి, మంథని, కరీంనగర్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వివరించారు. ఆయా నియోజకవర్గాలో చెరువులు, కుం టలు పూర్తిగా నిండాయని తెలిపారు. భూగర్భ జలాలు కూడా పెరిగాయని చెప్పారు. కాగా భారీ వర్షాల కారణంగా మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎంపీలు కల్వకుంట్ల కవిత, వినోద్ కుమార్ పర్యటనను రద్దు చేసుకున్నారు. -
కాళేశ్వరం లక్ష కోట్లు కాదు.. రూ.80వేల కోట్లే
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసి, దానివ్యయాన్ని భారీగా పెంచారన్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యలను భారీ నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు కొట్టిపారేశారు. ప్రాజెక్టు వ్యయం రూ.38 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లకు పెరిగిందని స్క్రిప్టు రైటర్లు తప్పుడు సమాచారం ఇచ్చారని, ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని రాహుల్‌కు సూచించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా హరీశ్ కౌంటర్ ఇచ్చారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో అంచనా వ్యయాన్ని రూ.38 వేల కోట్ల నుంచి, లక్ష కోట్లకు పెంచారని రాహుల్‌కు స్క్రిప్ట్ రైటర్లు చెప్పారు. కానీ ప్రాణహిత–చేవెళ్ల తొలి జీవో రూ.17 వేల కోట్లకు జారీ చేశారని వారు మరచిపోయారు. ఏడాది వ్యవధిలో కనీసం ప్రాజెక్టు పనులు మొదలుపెట్టకముందే.. 2008లో రూ.38 వేల కోట్లకు, 2010లో రూ.40 వేల కోట్లకు డీపీఆర్ సిద్ధం చేశారు’అని పేర్కొన్నారు. ప్రాజెక్టు వ్యయం అలా ఎందుకు పెంచారో రాహుల్ చెప్పగలరా..? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80,190 కోట్లకు సీడబ్ల్యూసీ ఆమోదించిందని, లక్ష కోట్లకు కాదని స్పష్టం చేశారు. ఈ విషయం రాహుల్ స్క్రిప్ట్ రైటర్లకు తెలియదా అని ప్రశ్నించారు. మన దేశంలో నీటి ప్రాజెక్టులకు సంబంధించి సీడబ్ల్యూసీ అనేది అపెక్స్ బాడీ అని, జలవనరుల శాఖకు ఇది అనుబంధమని, ఈ విషయంపై రాహుల్‌కు గానీ, ఆయన స్క్రిప్ట్ రైటర్లకు గానీ అవగాహన లేదా? అని ఎద్దేవా చేవారు. అలాంటి అత్యున్నత కమిషన్ విశ్వసనీయతను రాహుల్‌గాంధీ ఎలా అనుమానిస్తారని ప్రశ్నించారు. అంబేడ్కర్ ప్రాజెక్టు పేరును రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంగా మార్చిందని రాహుల్ చెప్పారని, ఈ విషయంలోనూ స్క్రిప్టు రైటర్లు తప్పుదోవ పట్టించారన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే అంబేడ్కర్ ప్రాణహిత ప్రాజెక్టు అలాగే ఉందని ట్విట్టర్లో మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. -
తెలంగాణలో తిరిగొచ్చి మాట్లాడు..
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ పర్యటనలో ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ టీపీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్కలు చెప్పింది విని విమర్శలు చేయడం సరికాదని నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తిరిగి చూస్తే ఇక్కడి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరు అర్థం అవు తుందని హితవు పలికారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో కోమటి చెరువులో చేపపిల్లలను వదిలిన అనంతరం రైతుల బీమా బాండ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంది. నాలుగేళ్లుగా టీఆర్ఎస్ పాలన కొనసాగుతోంది. ఈ రెండు ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధిని పరిశీలించాలి. గతంలో రైతులు అధికారుల చుట్టూ తిరిగే వారు. ఇప్పుడు అధికారులే రైతుల చుట్టూ తిరుగుతున్నారు. రైతుల సంక్షేమం కాంక్షించే ఏకైక ప్రభుత్వం తమదే’ అని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించి ఇతర రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించారు. ఎన్నడూ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించని కాంగ్రెస్ నాయకులు వర్షాలొస్తే ఉసిల్లు వచ్చినట్లు.. ఎన్నికలొస్తే ప్రజల్లోకి రావడం చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. నాలుగేళ్లుగా అమలవుతున్న ప్రతి పథకం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు అమలు చేస్తామని స్పష్టం చేశారు. రానున్నవి మత్స్యకారుల రోజులే.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే కాలంతో పనిలేకుండా చెరువులు, కుంటల్లో నీళ్లుంటాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అప్పుడు మత్స్యకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో అనంతగిరి సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్లతో పాటు, ఇతర ప్రాజెక్టులు జల కళ సంతరించుకుంటాయని చెప్పారు. ప్రతి రిజర్వాయర్ పరిధిలో 15 ఎకరాల విస్తీర్ణంలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, అప్పుడు మనకు కావాల్సిన చేప పిల్లలు ఇక్కడే ఉత్పత్తి చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల తో 21 వేల చెరువులకుగాను 11 వేల చెరువులు నిండాయన్నారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. -
చంపిన చేతులతో.. నివాళులా?
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలోకి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. ఉద్యమ సమయంలో యూనివర్సిటీలో పోలీసు కాల్పుల్లో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు వెళ్లిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గేటు దగ్గరే అరెస్ట్ చేయించిన విషయం కాంగ్రెస్ నేతలు మరిచారా అని ప్రశ్నించారు. అప్పటి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రక్తాలు కారుతున్న విద్యార్థులను కనీసం పరామర్శించలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం ఓయూ ప్రశాంతంగా ఉందని, రాహుల్ వస్తే ఆ వాతావరణం దెబ్బతింటుందని వీసీ అనుమతి నిరాకరించడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో హరీశ్ మాట్లాడారు. అమరవీరుల స్తూపానికి రాహుల్ గాంధీ నివాళులు అర్పిస్తారన్న ప్రకటనపైనా ఆయన మండిపడ్డారు. ‘1969లో 369మంది ఉద్యమకారులను పిట్టల్లాకాల్చి చంపించిందెవరు.. ఇందిరాగాంధీ ప్రభుత్వం కాదా.. 2009లో డిసెంబర్ 9 ప్రకటనను కాంగ్రెస్ వెనక్కి తీసుకుంటే మళ్లీ ఆత్మహత్యలు జరిగాయి. ఆ అమరత్వానికి కాంగ్రెస్ కారణం కాదా? చంపేది మీరే.. నివాళులర్పించేది మీరే’అంటూ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. రాహుల్ నివాళులు అర్పించినంత మాత్రన కాల్చిన గాయాలను మాన్పలేరని చెప్పారు. పార్లమెంట్లో ఎప్పుడైనా ప్రశ్నించారా? తెలంగాణ హక్కుల గురించి ఒక్కరోజైనా పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడలేదని హరీశ్ విమర్శించారు. విభజన చట్టంలో రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించాలని అడగలేదని చెప్పారు. పోలవరానికి జాతీయ హోదా ఇస్తుంటే ప్రాణహిత, పాలమూరులకు హోదా గురించి ఎందుకు మరిచారని ప్రశ్నించారు. హైకోర్టు విభజనపై సైతం రాహుల్ ఇప్పటివరకు నోరుమెదపలేదన్నారు. తెలంగాణ నుంచి 7 మండలాలను ఆంధ్రాలో కలిపేందుకు పూర్తి మద్దతిచ్చింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా అడుగుతున్న రాహుల్, తెలంగాణలోని వాణిజ్య, వ్యాపారులకు సమాన రాయితీలపై ఎందుకు మాట్లాడరని నిలదీశారు. సీడబ్ల్యూసీలో తెలంగాణ నుంచి ఒక్క నాయకుడికి అర్హత లేదా అని ప్రశ్నించారు. జాతీయ పార్టీలు రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తున్నాయని విమర్శించారు. ఈ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ మాత్రమే శ్రీరామరక్ష అని, అది అర్థమయ్యే ప్రజలు ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తున్నారని చెప్పారు. విద్యుత్, వ్యవసాయంలో దేశానికే ఆదర్శం కాంగ్రెస్ అంటేనే కరెంట్ కోతలు, విత్తనాలు, ఎరువుల కొరత, రుణాల కోసం ధర్నాలు, లాఠీచార్జీలే గుర్తొస్తాయని హరీశ్ విమర్శించారు. సాగు, తాగు, విద్యుత్, వ్యవసాయానికి ధీమా కల్పించ డంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు, ఇవ్వనివి కూడా నెరవేర్చాం. రైతుబంధు, రైతు బీమా పథకాలను తీసుకొచ్చాం. రాష్ట్రప్రభుత్వ పనితీరు చూసి కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని గ్రామాల ప్రజలు తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. నాలుగేళ్లలో 14 లక్షల కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చాం. రూ.12 వేల కోట్లు రైతుబంధుకు ఖర్చు చేస్తున్నాం. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క సమస్యనైనా శాశ్వతంగా పరిష్కరించారా? ఆరు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా తెలంగాణ ఉంది. ఇతర రాష్ట్రాలు సైతం తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. కాంగ్రెస్ హయాంలో ఒక్క ప్రాజెక్టైనా పూర్తయిందా.. దేశాన్ని సుదీర్ఘంగా పాలించి ఒక్క సమస్యకైనా శాశ్వత పరిష్కారం చూపిందా’అని ప్రశ్నించారు. ఉద్యోగాల కల్పనపై కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తాము లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పామని, అందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ మోసాలు ప్రజలకు తెలుసని, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదని హరీశ్ హెచ్చరించారు. -
కాళేశ్వరానికి రూ.20 వేల కోట్లివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర సాయంగా రూ.20 వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని మంత్రి హరీశ్‌రావు కోరారు. రాష్ట్రంలో చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టులు, వాటికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై శుక్రవారం ఢిల్లీలో గడ్కరీతో చర్చించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు కేంద్ర సాయంగా ఇవ్వాలని హరీశ్ కోరారు. ఇదే విషయమై గత వారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతను ప్రధానికి వివరించిన కేసీఆర్ ప్రాజెక్టుకు కేంద్ర సాయంగా రూ.20 వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఈ విషయంపై గడ్కరీతో హరీశ్ చర్చించారు. ఇక దేశంలో ఏ సాగునీటి ప్రాజెక్టును కూడా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబోమని శుక్రవారం లోక్‌సభలో గడ్కరీ ప్రకటన చేయడంపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఏపీ విభజన చట్టంలో ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారని, అదే చట్టం ద్వారా ఏర్పడ్డ తెలంగాణలోనూ ఒక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాల్లో ఏదో ఒకదాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఈ అంశాన్ని కూడా హరీశ్‌రావు ప్రస్తావించినట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టను సందర్శించేందుకు రావాలని గడ్కరీని ఈ సందర్భంగా ఆహ్వానించారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతుల మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. -
ఇక పంటల వారీ మార్కెట్ యార్డులు
సాక్షి, హైదరాబాద్: ప్రతి ప్రధాన పంటకు ఒక మార్కెట్ దిశగా తెలంగాణ సర్కారు అడుగులు వేస్తుంది. మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు ఆలోచనల మేరకు ఆ శాఖ అధికారులు వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్, నల్లగొండలో బత్తాయి మార్కెట్, సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో పచ్చిమిర్చి మార్కెట్‌ను మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసింది. అయితే వీటి ఏర్పాటుతో రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుండటంతో మున్ముందు జగిత్యాలలో మామిడి మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆ శాఖ రంగం సిద్ధం చేసింది. గతంలో నల్లగొండ జిల్లా రైతులు బత్తాయి పంటను అమ్ముకునేందుకు హైదరాబాద్‌లోని గడ్డి అన్నారం మార్కెట్‌కు తీసుకొచ్చేవారు. దీంతో రవాణా ఖర్చుల భారం, తూకాలలో మోసం వంటివి రైతుల్ని ఇబ్బందులు పెట్టేవి. కొందరు రైతులు తోటల వద్దే దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చేది. నల్లగొండలో బత్తాయి మార్కెట్ యార్డ్ రాకతో వీటన్నింటికీ అడ్డుకట్ట పడింది. నిమ్మ, పచ్చిమిర్చికీ మార్కెట్లు తెలంగాణలో మొదటిసారిగా నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్‌ను 9 ఎకరాల్లో మార్కెటింగ్‌శాఖ ఏర్పాటు చేసింది. మార్కెటింగ్‌శాఖ రూ. 3.07 కోట్లు కేటాయించింది. మార్కెట్లో 25 ట్రేడర్ షాపులు నిర్మించడంతోపాటుగా ఆక్షన్ ప్లా్లట్ఫాంను నెలకొల్పింది. గతంలో నిమ్మ రైతులు సరుకును తోటలవద్దే దళారుల వద్ద అమ్ముకునేవారు. ఈ మార్కెట్ రాకతో జిల్లాలో నిమ్మరైతుల పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉంది. మున్ముందు ప్రత్యేకంగా మార్కెట్ కమిటీ చైర్మన్‌ను ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో పచ్చిమిర్చి మార్కెట్‌ను నెలకొల్పారు. జగిత్యాలలో మామిడి మార్కెట్‌కు ఏర్పాట్లు జగిత్యాలలో మామిడి మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. జగిత్యాల మామిడి నాణ్యత, రుచిలో చాలా ప్రాముఖ్యం పొందటంతో ఈ మామిడికి ‘జగిత్యాల మామిడి‘గా ఒక బ్రాండ్ ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్‌శాఖ పూనుకుంది. మామిడి మార్కెట్ అభివృద్ధి కోసం రూ. 5.50 కోట్లతో అంచనాలు రూపొందించారు. ప్రస్తుతం కేటాయించిన 23.19 ఎకరాల స్థలంతో పాటు అదనంగా మరో 10 ఎకరాల స్థలాన్ని రైతుల సౌకర్యార్థం ఉచితంగా కేటాయించడానికి సంప్రదింపులు జరుపుతున్నారు. -
‘మేడిగడ్డ’ పనుల్లో వేగం పెంచాలి
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి (మేడిగడ్డ) పంపుహౌస్ పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులకు, ఏజెన్సీ సంస్థలను భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. బుధవారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లిలో నిర్మిస్తున్న మేడిగడ్డ పంపుహౌస్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మెగా క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు చివరన మొదటి పంపు డ్రైరన్ (మోటార్ల పనితీరు పరిశీలన), సెప్టెంబర్ 5న వెట్ రన్, రెండో పంపు సెప్టెంబర్ 10న డ్రైరన్, 15న వెట్ రన్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పంపు హౌస్‌లో అమర్చనున్న శక్తివంతమైన మోటార్లకు అవసరమున్న సబ్‌స్టేషన్ నిర్మాణం ఆగస్టు చివరి వరకు పూర్తి చేయాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కాళేశ్వరం బ్యారేజీ చీఫ్ ఇంజనీర్ నల్ల వెంకటేశ్వర్లు, ఎస్ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ రమణారెడ్డి, డీఈఈప్రకాష్, సూర్యప్రకాష్, మెగా సంస్థ డైరెక్టర్ కృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి ఉన్నారు. -
మాకూ ప్రోత్సాహకాలు ఇవ్వాలి
సాక్షి, సిద్దిపేట: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే విభజన సందర్భంగా నాటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ చెప్పినట్టు తెలంగాణకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సిద్దిపేటలో టీఆర్ఎస్వీ జిల్లా శిక్షణతరగతుల ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడారు. ఎవరిని అడిగి రాష్ట్ర విభజన చేశారని పార్లమెంట్లో టీడీపీ నాయకులు ప్రశ్నించడం శోచనీయమన్నారు. 1956లో ఇక్కడి ప్రజల అభిప్రాయాలను తెలుసుకొనే అప్పటి ప్రధాని నెహ్రూ, తెలం గాణను ఏపీలో కలిపారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు విభజన సందర్భంగా కూడా తెలంగాణకు అన్యాయమే జరిగిందన్నారు. ఏడు మండలాలను ఏపీలో కలిపారని, పోలవరానికి జాతీయ హోదా ప్రకటించిన కాంగ్రెస్ తెలంగాణలోని ప్రాణహిత, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయహోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణపై విషం కక్కిన చంద్రబాబుతో దోస్తీకి తెలంగాణ కాంగ్రెస్ సమాయత్తం కావడం సిగ్గుమాలిన చర్యగా హరీశ్ అభివర్ణించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఇక్కడి పరిశ్రమలు తరలిపోతాయని, యువత నిరుద్యోగులుగా మిగులుతారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇక్కడి అభివృద్ధిని అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర పన్నారన్నారు. -
హోదాపై కాంగ్రెస్ వైఖరేంటి: హరీశ్
-
ఏపీకి హోదా ఇస్తే.. తెలంగాణకూ ఇవ్వాలి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే.. తెలంగాణకూ ఇవ్వాలని నీటి పారుదల, మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఏపీకి హోదా ఇస్తే తెలంగాణలోని పరిశ్రమలు అక్కడికి తరలివెళ్తాయని, దీంతో స్థానికులు రోడ్డు మీద పడతారని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై రూ.26 కోట్లతో నిర్మించ తలపెట్టిన అండర్‌పాస్‌కు మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. ఏపీకి హోదా కల్పిస్తామ ని సీడబ్ల్యూసీ కమిటీ సమావేశంలో తీర్మానించడంపై ఇక్కడి కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన సంగారెడ్డి, పటాన్చెరు ప్రాంతాల నుంచి ఏపీకి పరిశ్రమలు తరలివెళ్తే మనమేం చేయాలన్నారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం.. తెలంగాణలో ఒక్క సాగునీటి ప్రాజెక్టుకూ ఇవ్వలేదని మండిపడ్డారు. ‘సింగూరు’కు కాళేశ్వరం నీళ్లు... కాళేశ్వరం ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి సింగూరు ప్రాజెక్టును నింపుతామని హరీశ్‌రావు ప్రకటించారు. ‘హస్తం అంటేనే ఉత్త చేతులు.. కాంగ్రెస్ హయాంలో ప్రజలకు మేలు జరగలేదని’విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో కేవలం నాయకులు, కార్యకర్తలకే మేలు జరిగిందన్నారు. నిరుపేదలే లక్ష్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. తాము చేసిన అభివృద్ధిని ‘కల్యాణలక్ష్మి’చెక్కులు అందుకుంటున్న తల్లిదండ్రుల కళ్లలో, పింఛన్ అందుకుంటున్న వృద్ధుల బోసి నవ్వుల్లో, ఉచిత కరెంటు అందుకుంటున్న రైతు మనసులో చూడాలని మంత్రి హరీశ్ వ్యాఖ్యానించారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి హరీశ్ ఇస్నాపూర్ చౌరస్తా విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. -
‘మిడ్ మానేరు’కు ఎల్లంపల్లి నీళ్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అక్టోబర్ నాటికి 6,7,8 ప్యాకేజీలు అందుబాటులోకి వస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్‌మానేరుకు నీటి సరఫరా చేస్తామని భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు అన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామ పరిధిలోని కాళేశ్వరం ప్రాజెక్టులోని 8వ, ప్యాకేజీ అండర్ గ్రౌండ్ టన్నెల్లో మొదటి విద్యుత్ మోటారును డ్రైరన్ చేసి శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏడో ప్యాకేజీకి సంబంధించి 50 కిలోమీటర్ల ట్విన్ టన్నెల్ డ్రిల్లింగ్ పనుల్లో 49.988 కి.మీ. పని పూర్తయిందని, 12 మీటర్ల టన్నెల్ డ్రిల్లింగ్ మాత్రమే ఉన్నప్పటికీ లూజ్‌సాయిల్ వల్ల జాగ్రత్తగా పనులు చేయాల్సి వస్తోందన్నారు. మరో 10 రోజుల్లో మిగిలిన 12 మీటర్ల టన్నెల్ డ్రిల్లింగ్ పూర్తి చేసి.. ఆ తర్వాత లైనింగ్ పనులు చేపడుతామని చెప్పారు. మొదటి పంపు డ్రైరన్ విజయవంతం ‘కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి పంపుమోటార్‌ను విజయవంతంగా డ్రైరన్ నిర్వహించామని మంత్రి తెలిపారు. 139 మెగావాట్ల సామర్థ్యంతో ఈ మోటారు ప్రపంచ సాగునీటి రంగంలోనే అతి పెద్దదన్నారు. స్వదేశీ టెక్నాలజీతో బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో ఈ పంపు మోటారు తయారైందని, మోటారు గరిష్టంగా 214 ఆర్పీఎం స్పీడ్‌తో నడుస్తుందన్నారు. ఇవాల్టి డ్రైరన్‌లో పూర్తి సామర్థ్యంతో పని చేసిందన్నారు. 13 పంపుహౌస్‌ల్లో 86 మోటార్లు కాళేశ్వరం ప్రాజెక్టులో 13 పంపు హౌస్‌ల్లో మొత్తం 86 మోటార్లు పెడుతున్నామని, వాటిలో మొదటి మోటార్ శనివారం విజయవంతం అయిందని హరీశ్‌రావు అన్నారు. నీటిని లిఫ్ట్ చేయడానికి అవసరమైన కరెంట్ కోసం 18 సబ్స్టేషన్ల నిర్మాణం జరగుతోందని చెప్పారు. లక్ష్మిపూర్‌లో 400 కేవీ సబ్‌స్టేషన్ పూర్తి కావడంతో అదే కరెంట్‌తో ఇవాల్టి మోటార్ డ్రై రన్ చేశామని, 8వ ప్యాకేజీలోని మిగతా మోటార్లన్నీ సెప్టెంబర్ నాటికి పూర్తవుతాయని మంత్రి స్పష్టం చేశారు. మేడారం దగ్గర 6వ ప్యాకేజీ కి సంబంధించి గ్యాస్ బేస్డ్ 400 కేవీ పవర్ సబ్‌స్టేషన్ ఈనెల 25లోగా పూర్తవుతుందని చెప్పారు. ఇది కూడా ప్రపంచంలో గ్యాస్ ఆధారిత అది పెద్ద సబ్‌స్టేషన్ అని పేర్కొన్నారు. 6వ ప్యాకేజీ సబ్ స్టేషన్ పూర్తయితే ఆగస్టు 2వ వారంలో ఇక్కడి మోటార్ల డ్రై రన్ కూడా చేస్తామన్నారు. కాగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
మానవ జీవితానికి పాఠశాలే పునాది
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జీవితంలో వెలుగు నింపేది విద్యేనని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. మానవ జీవితానికి పునాది వేసేది పాఠశాలేనని పేర్కొన్నారు. కరీంనగర్లో శనివారం జరిగిన వాణినికేతన్ విద్యాసమితి స్వర్ణోత్సవ వేడుకలను మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, జస్టిస్ నవీన్‌రావుతో కలసి ఆయన ప్రారంభించారు. గవర్నర్ మాట్లాడుతూ.. విద్యావంతులు ఎక్కడికి వెళ్లినా పూజింపబడుతారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు క్రమశిక్షణ పాటిస్తూ తమ పిల్లలకూ అలవర్చాలని కోరారు. చీకటి నుంచి వెలుగులోకి మన జీవితాన్ని నడిపించేది కేవలం విద్యేనని ఉద్ఘాటించారు. ‘‘పదవులు శాశ్వతం కాదు.. జీవిత విలువలే ముఖ్యం. కుర్చీలు పట్టుకొని వేలాడొద్దు.. అవి ఇప్పుడు ఉండొచ్చు రేపు పోవచ్చు. కానీ వ్యక్తిగత గౌరవం పొందేలా జీవితాన్ని మలచుకోవాలి’’అని ఉద్బోధించారు. విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే గురువులకు నిజమైన సంతోషమన్నారు. విద్యతోనే గౌరవం, క్రమశిక్షణ అలవడుతోందని.. సత్యం వద..« ధర్మం చర అని మా మాస్టారు చెప్పారు.. ఆ మాటలే తనను ఇంతటి స్థాయికి చేర్చిందన్నారు. హరీశ్ అంటే చాలా ఇష్టం మంత్రి హరీశ్ అంటే ట్రూత్ అని.. అతనంటే చాలా ఇష్టమని గవర్నర్ చెప్పారు. హరీశ్‌రావు ఎంపీ వినోద్‌తో కలసి తన దగ్గరకు వచ్చి నేను చదివిన పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానించడంతో ఏం ఆలోచించకుండా ఓకే చెప్పానన్నారు. ‘నేను ఉమ్మడి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మొదటి సారిగా బడ్జెట్ ప్రసంగం చేస్తున్నప్పుడు ఓ టాల్ యువకుడు (హరీశ్) వెనుక బెంచిలో కూర్చున్నాడు. నా ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ఒక్కో టేబులు దాటుకుంటూ వస్తున్నాడు. నేను అతడిని గమనించాను.. ఒక్కో టేబుల్ మీద నుంచి జంప్ చేస్తూ వస్తున్న ఆయన కిందపడితే చప్పట్లు కొట్టాలనుకున్నాను.. కానీ నా మీదే పడిపోయాడు.. అప్పటి నుంచి ఆయనంటే ఇష్టం’అని నరసింహన్ వివరించారు. గవర్నర్ తాను చదువుకున్న రోజు నాటి తీపి జ్ఞాపకాలను ఒకసారి నెమరేసుకొన్నారు. వాణినికేతన్ మాలో మార్పు తెచ్చింది: హరీశ్ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మనిషి జీవితంలో మార్పు తీసుకొచ్చేది పాఠశాల అని. ఆ మార్పు మాలో తీసుకొచ్చింది వాణినికేతన్ విద్యా సంస్థ అని పేర్కొన్నారు. విద్యతోపాటు వినయం, విజ్ఞానాన్ని, విధేయతను, సంస్కారాన్ని, జీవిత పాఠాలను సైతం నేర్పింది అయోధ్యరామారావు అని చెప్పారు. తమను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలను జరుపుకోవడం జీవితంలో మరువలేనిదన్నారు. ప్రస్తుత సమాజంలో ఏ దేశమైనా బాగు పడాలంటే విద్య పాత్ర కీలకమన్నారు. తమ ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థలకు వ్యతిరేకం కాదని, అందరికీ నాణ్యమైన విద్యనందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తన వ్యక్తి గత జీవితం ప్రారంభమైంది ఈ పాఠశాలలోనేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్‌రావు అన్నారు. 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు మూడేళ్లు చదువుకున్నానని, విలువలతో కూడిన విద్యను, నైతిక విలువలను ఇక్కడే నేర్చుకున్నానని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీ వినోద్‌కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే, స్వర్ణోత్సవ కమిటీ చైర్మన్ గంగుల కమలాకర్, వాణినికేతన్ విద్యాసంస్థల అధినేత సీహెచ్ అయోధ్యరామారావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యత విషయంలో రాజీ వద్దు
సాక్షి, హైదరాబాద్: రిజర్వాయర్ల పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని ఇంజనీర్లను నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. కనీసం 200 ఏళ్ల పాటు ప్రజా అవసరాలు తీర్చేవిగా రిజర్వాయర్లు ఉండాలన్నారు. క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు, ప్రాజెక్టు ఇంజనీర్లు పనులను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. నాణ్యత విషయంలో అలక్ష్యం వహిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. సోమవారం జలసౌధలో డిండి ఎత్తిపోతల పథకం పనులు, ఇతర ప్రాజెక్టులు, రిజర్వాయర్ల పురోగతిపై సమీక్షించారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగమైన సింగరాజు పల్లి, గొట్టి ముక్కల రిజర్వాయర్ పనుల వేగం పెంచి ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని ఆదేశించారు. సింగరాజు పల్లి రిజర్వాయర్ ద్వారా చెరువులు నింపేందుకు డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ పనులు పూర్తి చేయాలని సూచించారు. గొట్టి ముక్కల రిజర్వాయర్ పనులు 70 శాతం పూర్తయ్యాయని మిగతా పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రిజర్వాయర్ పరిధిలో భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనులకు రూ.32 కోట్లు అవసరమవుతాయని ప్రాజెక్టు ఇంజనీర్లు తెలపగా ఆ నిధులు విడుదల చేస్తామన్నారు. సింగరాజు పల్లి రిజర్వాయర్, గొట్టిముక్కల రిజర్వాయర్ పనులకు మరో రూ.పది కోట్లు విడుదల చేయనున్నట్లు చెప్పారు. కిష్టరాంపల్లి రిజర్వాయర్ పనులకు రూ.పది కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించారు. ప్యాకేజీ–6లోని శివన్న గూడెం రిజర్వాయర్‌ను వేగంగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఇంజనీర్లకు సూచించారు. పనుల్లో జాప్యాన్ని సహించం పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లాలోని తుమ్మిళ్ల, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, బీమా ప్రాజెక్టు లకు నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని హరీశ్‌రావు తెలిపారు. పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల పురోగతిపై ఆయన సమీక్షించారు. ఈ పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. తుమ్మిళ్ల ప్రాజెక్టు పరిధిలో సర్వీస్ బే కంట్రోల్ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆగస్టు 31లోగా ఒక పంపును రన్ చేసేలా పనులు చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో 300 ఎకరాల వరకు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు పరిధిలో దాదాపు 200 ఎకరాల వరకు భూ సేకరణ జరపాలని మంత్రికి ఇంజనీర్లు తెలపగా,జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్తో హరీశ్ ఫోన్లో మాట్లాడారు. మంగళవారం సమావేశం నిర్వహించి భూ సేకరణ పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫీల్డ్ చానల్స్ తవ్వే విషయంలో గ్రామస్తులు సహకరించడం లేదని ఇంజనీర్లు మంత్రి దృష్టికి తేవడంతో, వెంటనే జిల్లా కలెక్టర్లు, రైతు సమితి సభ్యులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఆల్మట్టి, తుంగభద్రల నుంచి నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరిన వెంటనే కల్వకుర్తి మోటార్ ఆన్ చేయాలన్నారు. భూ సేకరణపై దృష్టి పెట్టండి డిండి ప్రాజెక్టుకు సంబంధించి అటవీ శాఖ పరిధిలో ఉన్న భూముల సేకరణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని హరీశ్ సూచించారు. జిల్లా కలెక్టర్లు, అటవీ సమస్యల పరిష్కారం కోసం నియమించిన సలహాదారు సుధాకర్‌తో చర్చించి వెంటనే పరిష్కరించాలని ఇంజనీర్లను మంత్రి ఆదేశించారు. అటవీ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుకు ప్రత్యేకంగా చీఫ్ ఇంజనీర్‌ను ఏర్పాటు చేయాలని ఈఎన్సీలు మురళీధర్, నాగేందర్‌రావులకు సూచించారు. -
తెలంగాణ బతుకుదెరువు కాళేశ్వరం
సాక్షి, సిద్దిపేట: ‘తెలంగాణ ఉద్యమం సాగిందే నీళ్లు, నిధులు, ఉద్యోగాలకోసం. పోరాడి, ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ పచ్చటి పంటలతో తులతూగాలనే ఆలోచనతోనే సీఎం కేసీఆర్.. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ బతుకుదెరువు కాళేశ్వరం. ఇది పూర్తి చేయాలనే తపనతో రేయింబవళ్లు కష్టపడుతున్నాం’అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా రాఘవాపూర్, గజ్వేల్ ప్రాంతాల్లో ఆయన పర్య టిం చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమా వేశంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో వర్షాలు సక్రమంగా పడకపోవడంతో రైతులు కరువు కాటకాలతో అల్లాడే వారని, బతుకు దెరువు కోసం దుబాయ్, ముంబై, ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లేవారని ఆవేదన వ్యక్తం చేశారు. వలసలు వెళ్లిన వారు తిరిగి రావాలంటే ఇక్కడ ప్రతి సెంటు భూమికి నీరు అందాలని, బోర్లు వేసే పని లేకుండానే సాగునీరు రావాలని అన్నారు. ఇందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని స్పష్టం చేశారు. బోర్లు వేసి, బావులు తవ్వి అప్పుల పాలైన రైతుల కష్టాలు స్వయంగా చూసిన సీఎం.. రాష్ట్రంలోని ప్రతి సెంటు భూమికి సాగునీరు అందించేందుకు కష్టపడుతున్నారని చెప్పారు. ఇందులో భాగంగా కరువు సీమగా పేరుగాంచిన మహబూబ్‌నగర్ జిల్లాలో ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందిస్తున్నామని, కాళేశ్వరం నిర్మాణం, ఎస్సారెస్పీ పునరుద్ధరణ.. ఇలా అవసరమైన ప్రతీ చోట కృష్ణా, గోదావరి నది నీళ్లను వినియోగించుకుంటామని వెల్లడించారు. విపక్షాలకు కంటి మీద కునుకులేదు.. గతంలో ఏనాడూ రైతుల గురించి, సాగునీటి గురించి ఆలోచించని కొందరు నాయకులు నేడు ప్రాజెక్టుల నిర్మాణ పనులను అడ్డుకుంటున్నారని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకుల కాలంలో ప్రాజెక్టుల నిర్మాణాలకు దశాబ్ద కాలం పట్టేదని, ఇప్పుడు ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయడం చూసిన ప్రతిపక్షాలకు కంటి మీద కునుకు లేకుండాపోతోందని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్స్ పథకంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని, ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెసిడెన్సియల్ పాఠశాలల్లో మెరుగైన విద్య, వసతులు కల్పిస్తున్నామని, విద్యార్థులకు పోషక విలువతో కూడిన ఆహారం అందిస్తున్నామని చెప్పారు. -
ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం: హరీశ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చెరువులు, కుంటలను ప్రాజెక్టులకు అనుసంధానించి వాటిని ఆ నీటితో నింపాలని నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు పటిష్టమైన మైనర్ ఇరిగేషన్ నెట్వర్క్ సిస్టం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం జలసౌధలో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అవసరాలకు అనుగణంగా సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రీ–డిజైనింగ్ చేశారని, తెలంగాణలోని బీడు భూముల్లో నీరు పారించేలా ప్రణాళికలు తయారు చేశారని వివరించారు. జిల్లాల వారీగా మేజర్, మైనర్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న గొళుసు కట్టు చెరువులను గుర్తించి వాటిని ఏ ప్రాజెక్టు నీటి ద్వారా నింపే అవకాశం ఉందో తెలుసుకోవాలన్నారు. ప్రతీ ప్రాజెక్టు నుంచి గొలుసు కట్టు చెరువులు నింపాలన్నది ప్రభుత్వ ఆలోచన అని, ఇందుకు అనుగుణంగా ప్రాజెక్టు సీఈలు, ఎస్ఈలు, మైనర్ ఇరిగేషన్ ఇంజనీర్లు నెల రోజుల్లో ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. చెరువులను నింపడం ద్వారా రాష్ట్రానికి పూర్తి స్థాయిలో నీటి భద్రత లభిస్తుందన్నారు. అంతకుముందు మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ, గొళుసు కట్టు చెరువుల తాజా పరిస్థితిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి మైనర్ ఇరిగేషన్ అధికారులు వివరించారు. -
అమ్రాబాద్‌లో మంత్రి హరిష్‌రావు పర్యటన
-
కృష్ణమ్మ నీటితో రైతన్న కాళ్లు తడుపుతాం
అమ్రాబాద్/అచ్చంపేట రూరల్: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాల మాగాణికి సాగునీరు అందిస్తామని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. కృష్ణమ్మ నీటితో రైతన్న కాళ్లు తడుపుతామని చెప్పారు. సోమ వారం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్‌తో కలసి ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్రాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ వారు తెలంగాణే వద్దన్నారు. కాంగ్రెస్ నాయకులు లోన ఒకటి, పైన మరొకటి మాట్లాడారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో వెనకబడిన తెలంగాణలో ముఖ్యంగా కరెంట్ కోతలవల్ల రైతులు, ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేల కోట్లు వెచ్చించి 24 గంటల కరెంటును సరఫరా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. అమ్రాబాద్, పదర మండలాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. కల్వకుర్తి నీళ్లు చంద్రసాగర్‌కు వచ్చేలా చూడాలని ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ కోరడంతో, వ్యాప్కోస్ సంస్థ ద్వారా రూ.800 కోట్ల వ్యయంతో సర్వే చేయిస్తున్నామని మంత్రి చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డుపడుతున్నారని విమర్శించారు. అచ్చంపేట నియోజకవర్గంలో డిండి ఎత్తిపోతల, కేఎల్ఐ ద్వారా 1.55 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని వివరించారు. -
గిడ్డంగుల వినియోగంలో రాష్ట్రం నంబర్‌వన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వంద శాతం నిల్వలతో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మార్కెటింగ్, గిడ్డంగుల మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేవలం 10.64 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యమున్న గిడ్డంగులు ఉండగా, 86 శాతం మాత్రమే వినియోగం ఉండేదని, ప్రస్తుతం 20.43 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యము న్న గిడ్డంగులుండగా, వంద శాతం వినియోగం ఉందని తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల బోర్డు సమావేశం శనివారం లక్డీకాపూల్‌లోని సెంట్రల్ కోర్టు హోటల్ లో జరిగింది. ఈ సమావేశానికి మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ మందుల సామెల్, ఎండీ జగన్మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు గిడ్డంగులు నిండుగా ఉండి, ప్రభుత్వ గిడ్డంగులు ఖాళీగా ఉండేవన్నారు. ప్రస్తుతం పరిస్థితి తారుమారై నాయకుల గిడ్డంగులు ఖాళీగా, ప్రభుత్వ గిడ్డంగులు నిండుగా ఉన్నాయన్నారు. మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల పూర్తితో 12 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, మరో 13 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగి ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు. దానికి అనుగుణంగా మార్కెటింగ్ శాఖ 364 గిడ్డంగులను రూ.1024 కోట్లతో చేపట్టగా, 320 పూర్తయినట్లు తెలిపారు. ధాన్యం నిల్వల కోసం గిడ్డంగులను పౌర సరఫరాల శాఖ, మార్క్‌ఫెడ్, నాఫెడ్ సంస్థలు గతంలో ప్రైవేటు గోదాముల్లో నిల్వలు చేస్తే.. బస్తాకు రూ.4.30 పైసలు చెల్లించేవని ఇప్పుడు ప్రభుత్వ గిడ్డంగుల్లో నిల్వకు బస్తాకు రూ.3.25 పైసల చొప్పునే కేటాయించడంతో రూ.18.17 కోట్ల మేర ఆదా అవుతోందని తెలిపారు. 2017–18 ఏడాదిలో గిడ్డంగుల సంస్థకు రూ.140.91 కోట్ల ఆదాయం సమకూరిందని, ఇది గతంతో పోలిస్తే చాలా ఎక్కువని వెల్లడించారు. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, ఆర్థిక పురోగతిలో రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉందని, గిడ్డంగుల్లోనూ నంబర్‌వన్‌గా మారి కొత్త చరిత్ర సృష్టించామన్నారు. గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ మందుల సామెల్ మాట్లాడుతూ.. గిడ్డంగుల సంస్థలో ఉద్యోగుల కొరత ఉందని, వారిని భర్తీ చేయాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. -
కాళేశ్వరం 19 ప్రాజెక్టుల సమ్మేళనం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం 19 ప్రాజెక్టుల సమ్మేళనమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్ రావు చెప్పారు. 141 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు వీలుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని, ఇది పూర్తయితే ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును సోమవారం జాతీయ మీడియా ప్రతినిధుల బృందం సందర్శించింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ సమీపంలో జరుగుతున్న 8వ ప్యాకేజీ పనులు, అండర్ టన్నెల్, సర్జిపూల్లను పరిశీలించింది. సర్జిపూల్ పనులను చూసి ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం లక్ష్మీపూర్ వద్ద క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు గురించి జాతీయ మీడియా ప్రతినిధులకు వివరించారు. దేశంలో విదర్భ తర్వాత అత్యధిక ఆత్మహత్యలు జరిగేవి తెలంగాణలోనేనని, సీఎం కేసీఆర్ సోషల్ ఇంజనీరుగా మారి వ్యాప్కోస్ సంస్థ ద్వారా సర్వే చేయించి ఈ బృహత్తర ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని చెప్పారు. గోదావరి నది ఒడ్డున ఉన్న శివాలయం పేరిట కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నామని, మేడిగడ్డ ఈ ప్రాజెక్టులో తొలి బ్యారేజీ అని, ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. గోదావరి, ప్రాణహిత వల్ల మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఎక్కువ ఉంటుందని, ఇదే విషయాన్ని సీడబ్ల్యూసీ, వ్యాప్కోస్ సంస్థలు సర్వేలు చేసి చెప్పాయన్నారు. అందువల్లే తమ్మిడిహెట్టి వద్ద కాకుండా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజీ నిర్మాణాలు చేపడుతున్నట్లు వివరించారు. 45 రోజుల్లో తొలి ఫలితం జాతీయ మీడియా ప్రతినిధులతో ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి హరీష్‌రావు వారు వెళ్లిన తర్వాత రాత్రి వరకు ప్రాజెక్టు ఇంజనీర్లతో సమీక్ష జరిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నారం రెండో బ్యారేజీ 66 గేట్లకుగాను 23 గేట్లు పూర్తి కాగా, మిగతా పనుల వేగం పెంచాలని సూచించారు. డబుల్ లేన్ రోడ్ బ్రిడ్జి కూడా నిర్మించి ప్రజలకు సౌకర్యంగా ఉండేలా చూడాలన్నారు. జూలై 31 నాటికి బ్యారేజీ పనులు పూర్తి చేసి, మరో 45 రోజుల్లో తొలి ఫలితం ప్రజలకు అందేలా చూడాలని సూచించారు. 1,832 కి.మీ. కాల్వలు.. 203 కి.మీ.లు అండర్ టన్నెల్స్ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 1,832 కి.మీ. డిస్ట్రిబ్యూషన్ కాల్వలు నిర్మిస్తున్నామని, ఇందులో 1,531 కి.మీ. మేర గ్రావిటీ కాల్వలు కాగా, 203 కి.మీ. అండర్ టన్నెల్ నిర్మిస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు. 141 టీఎంసీల నీటి వినియోగానికి 19 రిజర్వాయర్లతోపాటు 22 లిఫ్టులు, 21 పంప్‌హౌస్‌లను నిర్మిస్తున్నట్లు వివరించారు. ఇందుకు 139 మెగావాట్ల పంపులు వాడుతున్నామని, ఇది ప్రపంచంలోనే ఓ రికార్డు అని పేర్కొన్నారు. మహాయజ్ఞంలా సాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 6 వేల మంది ఇంజనీర్లు, 25 వేల మంది కూలీలను వినియోగిస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 4,20,95,000 సిమెంటు బస్తాలకు గానూ 3 కోట్ల 10 లక్షల సిమెంటు బస్తాలు వినియోగించామన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో 85 గేట్లు ఏర్పాటు చేస్తున్నామని, 60 శాతం పనులు పూర్తయ్యాయని, తొలి పంప్‌హౌస్ మేడిగడ్డ వద్ద నిర్మిస్తున్నామని తెలిపారు. మేడిగడ్డ 2019 జనవరి 1 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ నదిలో 3 బ్యారేజీల వద్ద 36 టీఎంసీల నీరు నిల్వ చేయవచ్చని, దీంతో గోదావరి పునరుజ్జీవనం అవుతుందని చెప్పారు. ఈ బ్యారేజీ వల్ల 110 కిలోమీటర్ల బ్యాక్ వాటర్‌తో గోదావరిలో 365 రోజులపాటు నీరు నిల్వ ఉంటుందని, దీనివల్ల టూరిజం, ఫిషింగ్, వాటర్ స్పోర్ట్స్ వంటి కార్యకలాపాలు సాగనున్నాయని వివరించారు. అన్నారం బ్యారేజీ పనులు కూడా 90 శాతం పూర్తయ్యాయని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ నల్ల వెంకటేశ్వర్లు, అడ్వయిజర్ పెంటారెడ్డి, ఎస్ఈ వెంకట్రాములు, ఈఈ నూనె శ్రీధర్, జాతీయ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. -
మేస్త్రీలా పని చేస్తా: హరీశ్
సాక్షి, హైదరాబాద్: సాగు నీటి ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు మంత్రిలా కాకుండా పెద్ద మేస్త్రీలా పని చేస్తానని సాగు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి అన్ని స్థాయిల్లో కృషి చేద్దామని చెప్పారు. బుధవారం జలసౌధలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, బీమా, కోయిల్ సాగర్, తుమ్మిళ్ల, నెట్టెంపాడు ప్రాజెక్టు పనులపై మంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టులు, ప్యాకేజీల వారీగా సమీక్షించారు. బీమా, కోయిల్ సాగర్, తుమ్మిళ్ల ప్రాజెక్టుల్లో భూ సేకరణ సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్లు, ఎస్డీసీలు, ప్రాజెక్టు ఇంజనీర్లు కలసి భూ సేకరణలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. ప్రతిరోజూ పని తీరు మదింపు చేసుకుని, లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. కార్మికుల సంఖ్య పెంచండి బీమా ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను హరీశ్ ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ప్యాకేజీ పనులు ఈ సీజన్లో పూర్తి చేయాల్సిందేనన్నారు. పనులకు సంబంధించిన చెల్లింపులు ఎక్కడా ఆగకుండా తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, పనులు పూర్తవగానే చెల్లింపులు జరిగేలా జాగ్రత్త పడుతున్నామని చెప్పారు. కోయిల్ సాగర్ పరిధిలోని ప్యాకేజీ–13లో భూ సేకరణ జరిగిన చోట గుత్తేదారులు పనులు చేయడం లేదని ఇంజనీర్లు మంత్రికి వివరించగా.. వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. మిగిలిన భూ సేకరణకు కలెక్టర్లు, ఎస్డీసీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని పూర్తి చేయాలన్నారు. తుమ్మిళ్ల ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేసి ఆగస్టు 15 లోగా ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరివ్వాలని ఆదేశించారు. కార్మికుల సంఖ్యను పెంచాలని ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. పంపులు, మోటార్లు చైనా నుంచి రావాల్సి ఉందని ఏజెన్సీ ప్రతినిధులు చెప్పగా ఎయిర్ కార్గో ద్వారా తెప్పించాలని సూచించారు. మహబూబ్‌నగర్‌లో క్షేత్ర స్థాయి పర్యటన తుమ్మిళ్ల లిఫ్టుల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు లిఫ్టుల్లో కొత్తగా నియమితులైన ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా చీఫ్ ఇంజనీర్ ఖగేందర్‌ను ఆదేశించారు. కల్వకుర్తి ప్రాజెక్టు పనులనూ సమీక్షించిన మంత్రి.. అనుకున్న సమయంలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 90 కిలోమీటర్ల ప్రధాన కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని, 90 నుంచి 130 కిలోమీటర్ల ప్రధాన కాలువ నిర్మాణం పూర్తి కాకున్నా నీరిచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీలు పని చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హరీశ్ హెచ్చరించారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులను రెండ్రోజుల పాటు క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలిస్తానని, ఈ నెలాఖరులోగా పర్యటనకు వస్తానని చెప్పారు. కార్మికుల కొరతను ఇంజనీర్లు మంత్రికి వివరించగా.. ఈ అంశంపై ఫిర్యాదులొస్తున్నాయని, కాళేశ్వరంలోనూ ఇలాంటి ఇబ్బంది ఎదురైతే తానే స్వయంగా మేస్త్రీలా వ్యవహరించి పని జరగని ఇతర ప్రాజెక్టుల నుంచి కార్మికులను తరలించే ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఎస్ఈ, సీఈలు కూడా ఇలాగే చొరవ చూపాలని సూచించారు. -
మెరుపు వేగంగా కాళేశ్వరం
పెద్దపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మెరుపు వేగంతో పూర్తవుతున్నాయని, అన్ని ప్రాజెక్టుల్లోనూ కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డు సృష్టించబోతోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారంలోని ప్యాకేజీ–6 పనులను మంగళవారం మంత్రి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల చివరి వారంలో గ్యాస్ ఆధారిత కరెంటు ఉత్పత్తిని పూర్తి చేయాలన్నారు. వచ్చే జూలై నాటికి మూడు పంపుల ద్వారా నీరందించాలన్నారు. దీనికి కావాల్సిన నిపుణులను రంగంలోకి దించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇప్పటికి రెండు పంపులు పూర్తయినందున మూడో పంపు పనులను సైతం త్వరితగతిన పూర్తి చేసి, జూలై నాటికి అందుబాటులో ఉంచాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. టన్నెల్ నిర్మాణం అయినందున వర్షాలు సమృద్ధిగా కురిసి నీరు నిల్వ స్థాయికి చేరగానే అనుకున్న వ్యవధికి నీటిని విడుదల చేసేందుకు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైపు దేశంలోని అన్ని రాష్ట్రాలు తొంగి చూస్తున్నాయన్నారు. అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి చేసి, సాగు, తాగునీటి సమస్యలను తీర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. దీనికోసం యంత్రాం గం చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. -
ముగిసిన చర్చలు.. కొనసాగుతున్న సస్పెన్స్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్టీసీ ఉద్యోగులకు మధ్య వివాదం, సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. సమ్మెకు వెళ్తే వేటు తప్పదని ప్రభుత్వం హెచ్చరించినా, ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకే మొగ్గు చూపడంతో ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అయితే సమ్మె ఆలోచనను విరమించేందుకు, మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రులకు టీఎంయూ నేతల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. టీఎంయూకు గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీష్ రావుఅటు ప్రభుత్వానికి, ఇటు కార్మిక సంఘాలకు మధ్యవర్తిత్వం వహించారు. ఆయనతో పాటు ఇతర మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి, టీఎంయూ ప్రదాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి, ఇతర కార్మిక సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమ్మె చేస్తే తదనంతరం పరిణామాలను మంత్రి కార్మిక సంఘాలకు వివరించారు. మధ్యంతర బృతి ఇస్తే కార్మికులను ఎలా ఒప్పించాలనే అంశంపై మంత్రులు, కార్మిక సంఘాలు తీవ్ర తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. టీఎంయుపై కార్మికులకు నమ్మకం సన్నగిల్లకుండా ఏవిధంగా ముందుకు వెళ్లాలని సమాలొచనలు జరిపారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాలు 25 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేసినా చర్చల అనంతరం 15 శాతానికి దిగొచ్చినట్లు తెలిసింది. అంతేకాకుండా పీఆర్సీ, వేతన సవరణ చేయాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే 12.5 శాతం ఇస్తామంటూ మంత్రుల బృందం వెల్లడించినట్లు సమాచారం. 25 శాతం మధ్యంతర బృతి ఇస్తే రూ.900కోట్లకు పైగా భారం పడుతుందని మంత్రి వర్గం ఆర్టీసీ ఉద్యోగ సంఘాలకు వివరించింది. ఈ చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించేందుకు మంత్రులతో పాటు టీఎంయూ ప్రధాన నేతలు ప్రగతి భవన్ బయలుదేరారు. అయితే మంత్రుల భేటి వివరాలను బయటకు వెల్లడించడానికి టీఎంయూ నేతలు నిరాకరించారు. ఆర్టీసీ పరిరక్షణ, లాభాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి వర్గం కార్మిక సంఘాలకు సూచించినట్లు తెలిసింది. ఎన్నో ఏళ్లుగా తీవ్ర నష్టాల ఎదుర్కొంటున్న ఆర్టీసీని గట్టెక్కించడానికి విభజనే పరిష్కారమనే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం. కర్ణాటక, తమిళనాడు తరహా పరిస్థితులపై అధ్యయనం చేసి, నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. -
కాళేశ్వర విజయం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుకు కీలకమైన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ఆమోదం లభించింది. బుధవారం ఢిల్లీలోని కేంద్ర జల సంఘం కార్యాలయంలో జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి యూపీ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రాజెక్టుకు ఉన్న అన్ని ప్రధాన అవరోధాలు తొలగిపోనున్నాయి. తాజా అనుమతి నేపథ్యంలో ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశం మళ్లీ తెరపైకి రానుండగా, ప్రపంచంలోని ఎక్కడ్నుంచైనా కాళేశ్వరానికి అవసరమయ్యే నిధుల సేకరణకు వెసులుబాటు కలగనుంది. అన్ని అనుమతులు వచ్చేసినట్టే! టీఏసీ అనుమతులకు సంబంధించి బుధవారం జరిగిన భేటీలో కేంద్ర జల సంఘం చైర్మన్ మసూద్ హుస్సేన్, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి, నీతి ఆయోగ్ సలహాదారు, భూగర్భ జల శాఖ కమిషనర్, వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు, కేంద్ర జల సంఘానికి చెందిన అన్ని విభాగాల సంచాలకులు, చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఇరిగేషన్) మురళీధర్, ఇంజనీర్ ఇన్ చీఫ్ (కాళేశ్వరం ప్రాజెక్టు) హరిరామ్ పాల్గొని ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యాంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కాళేశ్వరం నిర్మాణ ప్రక్రియకు సంబంధించి లింక్ –1, లింక్ –2, లింక్ –3 పనుల పురోగతిని ప్రదర్శించారు. ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాల్లోని 18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం మేడిగడ్డ బ్యారేజీ నుంచి 195 టీఎంసీల నీటిని గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు రూపొందించిన ప్రణాళికను వివరించారు. ఎల్లంపల్లిలో లభ్యమయ్యే 20 టీఎంసీల నీరు, మరో 25 టీఎంసీల భూగర్భ జలాలు కలుపుకొని మొత్తం ప్రాజెక్టు నీటి లభ్యత 240 టీఎంసీలు ఉండగా, ఇందులో నుంచి 237 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి కేంద్ర జల సంఘం ఇప్పటికే తన అంగీకారం తెలిపిన విషయాన్ని ప్రస్తావించారు. ఇందులో 169 టీఎంసీలు సాగునీటికి, 30 టీఎంసీలు హైదారాబాద్ తాగు నీటి అవసరాలకు, 10 టీఎంసీలు దారి పొడవునా ఉండే గ్రామాల తాగునీటికి, 16 టీఎంసీలు పారిశ్రామిక అవసరాలు, 12 టీఎంసీలు ఆవిరి నష్టం కోసం వినియోగించే ప్రణాళికపై వివరణ ఇచ్చారు. ఇప్పటికే మేడిగడ్డ, అన్నరం, సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌజ్‌ల్లో 24 గంటల పాటు జరుగుతున్న పనులు, ఇప్పటికే జరిగిన రూ.30 వేల కోట్లకు పైగా ఖర్చు అంశాలను వివరించారు. అధికారుల ప్రజెంటేషన్‌పై సంతృప్తి వ్యక్తం చేసిన టీఏసీ.. సమావేశం అనంతరం ఏకగ్రీవంగా ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులను మంజూరు చేస్తూ తీర్మానించింది. ఈ మేరకు ఈఎన్సీలు మురళీధర్, హరిరామ్‌లు ఢిల్లీ నుంచి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే మొత్తం 9 కీలక అనుమతులు సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు రావడంతో సీడబ్ల్యూసీ నుంచి అన్ని అనుమతులు లభించినట్లయింది. జలవనరుల మంత్రిత్వ శాఖ ద్వారా ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ (పెట్టుబడి అనుమతి) మాత్రమే మిగిలి ఉంది. అన్ని అనుమతులు ఇప్పటికే రావడంతో ఈ అనుమతి త్వరలోనే వస్తుందని హరిరామ్ తెలిపారు. మంత్రి హరీశ్ హర్షం కాళేశ్వరానికి టీఏసీ అనుమతిపై నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. అనుమతి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి కేంద్ర జల వనరుల మంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. అనుమతుల సాధనలో కీలక పాత్ర పోషించిన సీఎస్ ఎస్కే జోషి, ఈఎన్సీలు మురళీధర్, హరిరామ్‌లతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లను అభినందించారు. కాళేశ్వరానికి ఇప్పటి వరకు లభించిన అనుమతులివీ.. 1. పర్యావరణ ప్రభావ నివేదిక తయారీకి టీఓఆర్ 2. మేడిగడ్డ వద్ద 75% డిపెండబిలిటీతో 283.3 టీఎంసీలకు హైడ్రాలజీ క్లియరెన్స్ 3. అంతర్రాష్ట్ర అనుమతి 4. కేంద్ర భూగర్భ జల శాఖ 5. కన్స్ట్రక్షన్ అండ్ మిషనరీస్ డైరెక్టరేట్ 6. అటవీ మంత్రిత్వ శాఖ తుది అనుమతి 7. పర్యావరణ తుది అనుమతి 8. ఇరిగేషన్ ప్లానింగ్ 9. ప్రాజెక్టు అంచనా , -
ఘనంగా హరీశ్ జన్మదిన వేడుకలు
సాక్షి, హైదరాబాద్: మంత్రి హరీశ్‌రావు జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున నేతలు, అభిమానులు పోటెత్తడంతో మంత్రుల నివాస సముదాయం జనసందోహంగా మారింది.ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్, చందూలాల్, ఎంపీలు, తదితరులు ఎమ్మెల్యేలు తీగల, గాంధీ, మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. హరీశ్ తన తల్లి లక్ష్మి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, అత్యంత క్రియాశీలకంగా పనిచేసే మన మంత్రుల్లో హరీశ్ ఒకరంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేటలో ఇండస్ట్రియల్ కారిడార్ సిద్దిపేట జోన్: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతోనే సిద్దిపేటలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు అన్నారు. మలేసియాకు చెందిన ప్రముఖ సంస్థ డీఎక్స్ఎన్ సిద్దిపేటలో మొదటి పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఆదివారం సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో మంత్రి హరీశ్‌తో మలేసియా ప్రతినిధి డాక్టర్ లిమ్సీయోజిన్ భేటీ అయ్యారు. -
వానొస్తే.. వరద మొదలైతే..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులకు కొత్త సమస్య మొదలవుతుందేమోనన్న ఆందోళన పట్టుకుంది. కొద్దిరోజుల్లో వర్షాకాలం ప్రారంభం అవుతుండటంతో.. బ్యారేజీలు, పంపుహౌజ్‌ల నిర్మాణం ఇప్పుడున్న వేగంతో కొనసాగడం సవాలుగా మారనుంది. ముఖ్యంగా గోదావరిలో వరద మొదలైతే.. మేడిగడ్డ సహా పలు బ్యారేజీల పనులు నిలిచిపోయే అవకాశం ఉండనుంది. ముఖ్యంగా మేడిగడ్డ పంపుహౌజ్ పరిధిలోని గ్రావిటీ కెనాల్ కింద చేపట్టాల్సిన ఉన్న నిర్మాణాలకు ఇబ్బందులు కలుగనున్నాయి. ఈ నేపథ్యంలో పనులను ముమ్మరంగా కొనసాగించేందుకు.. నిర్మాణ ప్రాంతాల్లో యంత్రాలు, కార్మికుల సంఖ్యను మరింతగా పెంచాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు జారీ చేశారు. వరుసగా అవరోధాలు.. కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ, పంపుహౌజ్‌లను జూలై నాటికి పూర్తిచేసి ఆగస్టు నుంచి నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వం సంకల్పించినా.. వరుసగా అవరోధాలు ఎదురవుతున్నాయి. ఇటీవలి వరకు తీవ్రమైన వేసవి, నలభై డిగ్రీలకుపైగా ఎండలు ఒకవైపు.. కార్మికుల కొరత మరోవైపు పనులు జాప్యం కావడానికి కారణమయ్యాయి. ఇప్పుడు వర్షాలు, గోదావరి వరద భయం వెన్నాడుతోంది. పనులు ఇదే వేగంతో ముందుకు సాగుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ పరిధిలో మొత్తంగా 85 గేట్లు బిగించే పనులను 11 బ్లాక్‌లుగా విడగొట్టి చేపట్టారు. ఇందులో 35 గేట్లు బిగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో కాంక్రీట్ పనులు నెమ్మదించాయి. ఇక ఇక్కడ గరిష్టంగా 10 లక్షల క్యూసెక్కుల మేర వరద రావచ్చన్న అంచనాతో 44 గేట్ల మేర నిర్మించే 4వ బ్లాక్‌ను ప్రవాహానికి వీలుగా ఖాళీగా ఉంచారు. ఒకవేళ అంతకు మించి వరద వస్తే మిగతా బ్లాక్‌ల పరిధిలోని గేట్ల బిగింపు ప్రక్రియకు ఇబ్బంది ఎదురవక తప్పని పరిస్థితి. నెమ్మదించిన ఫ్లడ్ బ్యాంకుల పనులు ఇక గోదావరి వరదను నివారించేందుకు నదికి ఇరువైపులా ఫ్లడ్ బ్యాంకుల నిర్మాణాన్ని చేపట్టారు. అందులో మహారాష్ట్ర వైపునే 10 కిలోమీటర్ల మేర ఫ్లడ్ బ్యాంకులు నిర్మించాల్సి ఉంది. అందులో 5 కిలోమీటర్ల మేర నిర్మాణం అత్యవసరం. నదిలో వరద మొదలవడానికి ముందే ఆ పనులు పూర్తి చేయాలని భావిస్తున్నా.. ఇప్పటికే మొదలైన వర్షాల కారణంగా నల్లమట్టి తరలింపు, రివిట్మెంట్ పనులు నెమ్మదించాయి. అటు తెలంగాణ వైపున 6 కిలోమీటర్ల మేర ఫ్లడ్‌బ్యాంక్ నిర్మించాల్సి ఉండగా.. 5 కిలోమీటర్ల మేర పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు కూడా వర్షాలతో ఇబ్బంది ఎదురవుతోంది. మోటార్లు పెట్టి నీటిని తోడేస్తున్నా.. మేడిగడ్డ బ్యారేజీ పంపుహౌజ్ పరిధిలో నదిలోకి నీళ్లు రాకముందే డ్రాఫ్ట్ ట్యూబ్‌లు, హెడ్‌రెగ్యులేటరీ గేట్లు, బ్రెస్ట్ వాల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికే వర్షాలు మొదలై నీరు వస్తుండటంతో.. ప్రత్యేకంగా మోటార్లు పెట్టి ఆ నీటిని తోడేస్తున్నారు. వర్షాలు పెరిగితే ఇక్కడి పనులు ఆలస్యం కానున్నాయి. ఇక 13 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పనుల్లో 90 శాతం పనులు పూర్తికాగా.. మరో 12 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టిని తవ్వాల్సి ఉంది. ఈ కెనాల్ పరిధిలో పెద్దవాగును దాటేందుకు 29 నిర్మాణాలు (స్ట్రక్చర్లు) ఏర్పాటు చేయాల్సి ఉండగా.. 24 పురోగతిలో ఉన్నాయి. అయితే వర్షాలు పెరిగి పెద్దవాగులో నీటి ప్రవాహం మొదలైతే.. 9 అండర్‌టన్నెల్ నిర్మాణాల పనులు ఆగిపోనున్నాయి. అన్నారం, సుందిళ్ల వద్దా ఇదే పరిస్థితి అన్నారం బ్యారేజీలో మట్టిపని పూర్తికాగా.. 11 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులకుగాను 1.19 లక్షల క్యూబిక్ మీటర్ల పని మిగిలి ఉంది. ఇక్కడ 66 గేట్లకుగాను 45 గేట్లను సిద్ధం చేయగా.. అందులో 18 గేట్ల బిగింపు పూర్తయింది. అయితే వర్షాలతో కాంక్రీట్ పనులకు ఆటంకం ఏర్పడుతుండటంతో.. మిగతా గేట్ల తయారీ, బిగింపు పనుల వేగం పెంచాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 8 క్రేన్లతో పనులు చేస్తుండగా.. మరో 8 క్రేన్లు అదనంగా తెప్పించి పనులు చేయాలని సూచించారు. ఇక సుందిళ్ల పరిధిలో 10.09 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనికిగాను.. 8.53 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూర్తయింది. మిగతా పనిని జూలై 15 నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇక్కడ 74 గేట్లకు గాను 64 గేట్లు సిద్ధం చేయగా.. ఇప్పటివరకు 17 గేట్లనే బిగించారు. ఇక అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిధిలోనూ ఫ్లడ్ బ్యాంకుల పనులు చేయాల్సి ఉంది. వర్షాలు, వరద కారణంగా ఆటంకాలు ఎదురైతే.. నిర్మాణ పనులు ఆగస్టు వరకు కొనసాగే అవకాశముందని, సెప్టెంబర్ వరకు నీళ్లిచ్చే పరిస్థితి ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కాళేశ్వరంతో జిల్లా సస్యశ్యామలం
చిన్నకోడూరు(సిద్దిపేట) : కళాశ్వరం ప్రాజెక్టుతో సిద్దిపేట జిల్లా సస్యశ్యామలం అవుతుందని రాష్ట్ర నీటి పారదుల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రాజెక్టు నీటి లభ్యతను, సమగ్ర స్వరూపాన్ని శుక్రవారం అర్థరాత్రి వరకు మేధావులకు ఆయన వివరించారు. శుక్రవారం రాత్రి చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు, టన్నెల్, సర్జిపుల్ పంప్ హౌస్‌ల నిర్మాణాలను జిల్లా వైద్యులు, అడ్వకేట్లు, టీఎన్జీఓ బృందాల సభ్యులు పరిశీలించారు. ప్రతీ ప్యాకేజీ లెక్కను నీటి లభ్యతను ఘణాంకాలతో పాటు వివరించారు. బీడు వారిన భూములకు గోదావరి జలాలు వరంగా మారుతాయని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో అర్థరాత్రి వరకు ఎల్ఈడీ స్క్రీన్‌పై ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పనులను సవివరంగా వివరించారు. యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న కాళేశ్వరం పనులు చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పనుల్లో ఏ ఏ ప్యాకేజీల్లో ఎంత మేర పనులు పూర్తయ్యాయి.. ఇంకా ఎంత మేర చేయాల్సి ఉంది.. ఆ పనులు ఎన్ని రోజుల్లో పూర్తవుతాయి.. ఎన్ని రోజుల్లో నీళ్లు వస్తాయి.. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపం ఎలా ఉంది..ఎలా నీళ్లను పైకి తీసుకువస్తున్నామనే పూర్తి వివరాలను మంత్రి వారికి సవివరంగా వివరించారు. లైవ్ విజువల్స్ ద్వారా ఎక్కడెక్కడ ఏ ప్యాకేజీలో ఏ మేర పనులు జరుగుతున్నాయి. ఎంత శాతం పూర్తయింది. ఇంకా ఎన్ని రోజుల్లో పూర్తవుతుందనే అంశాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. ఆరు దశాబ్ధాలుగా తెలంగాణకు సాగు నీటి రంగంలో జరిగిన అన్యాయాన్ని వివరించారు. మేడిగడ్డ, అన్నారం, సందిళ్ల మీదుగా ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ల ద్వారా నిజామాబాద్ జిల్లాలోని హల్దీవాగుకు నీళ్లు ప్రవహించే విధానం వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్త 36 లక్షల ఎకరాలకు నీరు అందించడానికి ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. -
మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాదే
సిద్దిపేట జోన్: ‘ఈ మట్టిలో పుట్టి.. ఈ మట్టిలోనే కలసిపోయేవాళ్లం. మీ గురించి ఆలోచించే బాధ్యత మాపై ఉంది. ఎక్కడో హైదరాబాద్‌లో ఉండేవారు భవిష్యత్తులో మీ గురించి ఆలోచించరు. తెలంగాణను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆస్తులు, భూములు ఇచ్చిన మీరంతా మా ఆత్మీయులే. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాదే. మీ మంచి మనసుకు శిరస్సు వంచి వందనం చేస్తున్నా’అని నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవనంలో మల్లన్న సాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామం వేములఘాట్ నిర్వాసితులకు మంత్రి రూ.17.10 కోట్ల పరిహారాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ పరిధిలోని 8 గ్రామాల్లో 7 చోట్ల వందశాతం భూసేకరణ పూర్తయిందన్నారు. వేములఘాట్‌లో ఇప్పటి వరకు 80 శాతం భూసేకరణ జరిగిందని, మిగతా 20 శాతం కొద్ది మంది స్వార్థ రాజకీయాల వల్ల ఆగిందని తెలిపారు. వ్యక్తిగతంగా తమకు ఎవరిపైనా ద్వేషం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరాల కోసమే ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. రంగనాయకసాగర్ ప్రాజెక్ట్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయని.. త్వరలోనే నీరు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మల్లన్నసాగర్కింద 13 వేల ఎకరాల భూసేకరణ జరిగిందని.. ఇంకా 700 ఎకరాలు చేయాల్సి ఉందని చెప్పారు. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఆస్తులు ఇచ్చినవారిని ప్రభుత్వం కాపాడుకుంటుందన్నారు. ప్రతి ఇంటికి రూ.7.50 లక్షల ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, డబుల్ బెడ్రూం ఇళ్లు, ప్రాజెక్టులో చేపల ఆదాయంపై వాటా, హక్కులు కల్పిస్తామన్నారు. గజ్వేల్‌లో కొత్తగా ఇల్లు కట్టి ఇచ్చిన తర్వాతే.. పాత ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుందని, పాత ఇంటికి కూడా డబ్బులు చెల్లిస్తామని హరీశ్ భరోసా ఇచ్చారు. ప్రాజెక్ట్‌పై జరుగుతున్న గోబెల్స్ ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పురోగతిని చూడాలన్నారు. భూసేకరణలో భాగంగా చివరి ప్రయత్నం చేస్తున్నామని, అవసరమైతే ఆ కొద్ది మంది కోసం కోర్టులో డబ్బు డిపాజిట్ చేస్తామని వివరించారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ వల్ల నిజాంసాగర్, యాదాద్రిలోని గంధమల్ల, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు అందుతుందని వెల్లడించారు. పరిహారం డబ్బులను వృథా చేయవద్దని, వాటిని భూమిపై పెట్టుబడిగా పెట్టాలని హరీశ్‌రావు సూచించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇది ‘చెరువూరు’
సాక్షి, హైదరాబాద్: ఊరికి ఉత్తరాన కర్విరాల చెరువు. తూర్పున కొత్త కుంట. రెండు చెరువుల్లోంచి పునాదులు వేసుకున్న ఊరే కర్విరాల కొత్తగూడెం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని ఓ చిన్న గ్రామమిది. పల్లె తలాపున చిన్న గుట్ట. పొలిమేరలోని చెరువులే జీవనాధారం. ఈడొచ్చిన ఒడ్డోళ్ల పోరగాళ్లు చిన్నగుట్టను పగులగొట్టి కంకర చేసి పొట్టపోసుకుంటారు. ఇతర జాతుల వారికి చెరువుపై ఆధారపడి కుల వృత్తులు, చేతి వృత్తులతో జీవనం. ఊరు పుట్టిన 200 ఏళ్ల చరిత్రలో చెరువులు నిండిన సందర్భాలు చాలా తక్కువే. కాలం కలిసిరానప్పుడు ఒడ్డెర్లు వలసలతో, మిగతా కులాల నాటు సారా పెట్టి కాలం గడిపేవాళ్లట. అలాంటి ఊరు ఇప్పుడు వలసలను, గుడంబాను జయించింది. మిషన్ కాకతీయ కింద నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు ఈ చెరువులను పునరుద్దరించారు. వానలతో పని లేకుండా గోదావరి జలాలతో నింపారు. దాంతో వలస పోయిన వాళ్లతో పాటు సుదూరంలోని సైబీరియా నుంచి కూడా పక్షులు వచ్చి కొత్తగూడెంలో సందడి చేస్తున్నాయిప్పుడు. చెరువే ఆదరువు కర్విరాల చెరువుకు ఎగువన, కొత్తకుంటకు దిగువన లింగమంతుల గుట్ట, చిన్నగుట్ట, వడ్లు దంచే బండ... ఇవన్నీ నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్నాయి. పరీవాహక ప్రాంతం ఎక్కువగా లేక చెరువులు నిండవు. ఆయకట్టు తక్కువే ఉన్నా చెరువు నీళ్లపై ఆధారపడి బోరు, బావుల కింద సాగు సాగేది. చేతి వృత్తులు బలపడేవి. మిషన్ కాకతీయ తొలి దశలో కొత్తకుంటకు రూ.26 లక్షలు, రెండో దశలో కర్విరాల చెరువుకు రూ.22 లక్షలు ఖర్చు చేసి పూడిక తీశారు. ఉపాధి హామీ పనులతో గ్రామస్థులంతా ఏకమై చెరువు క్యాచ్‌మెంటు ఏరియాను పునరుద్ధరించారు. హరీశ్ చొరవ చూపి శ్రీరాంసాగర్ కాల్వ నుంచి గోదావరి జలాలు తెచ్చి చెరువులు నింపారు. నిండిన చెరువుల్లో చేపలు పెంచారు. భూగర్భ జలాలు పెరిగి కర్విరాల చెరువు కింద 600 ఎకరాలకు, కొత్తకుంట కింద 300 ఎకరాలకు సాగునీరందుతోంది. చెరువులకు జలకళ రావడంతో వలస పోయిన గ్రామస్థులు తిరిగొచ్చారు. చేతి వృత్తులు పూర్తిగా అంతరించాయి గానీ కుల వృత్తులు ఇప్పుడిప్పుడే కొత్త జీవం పోసుకుంటున్నాయి. నాటుసారా పెట్టొద్దని ఊరు తీర్మానం చేసుకుంది. శీతాకాలంలో సైబీరియా నుంచి కొంగ జాతులొచ్చి వేసవి ముగిసే దాకా చెరువు మీదే గడిపి వర్షాకాలం ప్రారంభంలో తిరిగి వెళ్లిపోతున్నాయి. బోర్లకు నీళ్లు మళ్లినయి నాకు రెండు ఎకరాలుంది. బోరు నీళ్లే దిక్కు. చెరువుల పూడిక తీసి గోదావరి నీళ్లతో నింపినంక బోర్లళ్లకు నీళ్లు మళ్లినయి. రెండు కార్ల పంట వచ్చింది. కానీ ఈ ఏడాది చెరువుకు గోదావరి నీళ్లు రాలేదు. బోర్లు మళ్లీ మొదటికొచ్చినై. ప్రభుత్వం మళ్లీ గోదావరి నీళ్లొదిలి మా చెరువులు నింపాలె. – పేర్ల ప్రహ్లాద చెరువు నిండితే చుట్టాలొస్తరు చెరువుల్ల నీళ్లున్నప్పుడు మా ఊరికి సైబీరియా కొంగలొస్తయి. ఈ పక్షులు ఒక రకంగా మా చుట్టాలు. ఆర్నెల్ల పాటు చేప పిల్లల తిని బతుకుతై. గట్టు మీద సవారు చింతల తోపు చెట్ల మీద ఉంటై. –బండి అంతయ్య -
‘పాలమూరు’కు కాంగ్రెస్సే అడ్డు: హరీశ్
వికారాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులకు కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అడ్డం పడుతోందని నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు అన్నారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను సోమవారం ప్రారంభించారు. అంతకు ముందు పులుమామిడిలోని ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఇంట్లో విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకుడు హర్షవర్ధన్ ప్రాజెక్టు పనులు జరగకుండా కోర్టుకు వెళ్లిన మాట వాస్తవమో కాదో ఆ పార్టీ నేతలే చెప్పాలన్నారు. హర్షవర్ధన్ కాంగ్రెస్ నాయకుడా కాదా అనే విషయాన్ని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి సబితారెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ పక్క కోర్టులకు వెళ్లి స్టేలు తీసుకువస్తూ.. మరో పక్క నిరాహార దీక్షలతో నాటకాలాడుతున్నారని తెలిపారు. 2007లో ప్రాణహిత ప్రాజెక్టును ప్రారంభిం చిన కాంగ్రెస్ 2014 వరకు రూ.22 కోట్ల పనులు మాత్రమే చేసి.. సర్వేలు, మొబిలైజేషన్ల పేరుతో రూ.161 కోట్ల బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. ఈ అవినీతి బయట పడుతుందనే భయంతోనే కాంగ్రెస్ నేతలు గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేశారని అన్నారు. అన్ని గోదాములను అందుబాటులోకి తెండి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన గోదాములతోపాటు మిగిలిన గోదాముల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం మార్కెటింగ్ శాఖ పని తీరుపై ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో గోదాముల సామర్థ్యం, వాటవినియోగంపై అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రంలో 364 గోదాములుంటే 310 గోదాముల నిర్మాణం పూర్తయిందని, అందులో 233 గోదాముల్ని వినియోగంలోకి తెచ్చామని అధికారులు పేర్కొన్నారు. -
దారిపై రుధిరధార
సాక్షి, సిద్దిపేట/గజ్వేల్: రాజీవ్ రహదారి రక్తమోడింది! నడిరోడ్డుపై మరణ మృదంగం మోగింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి 11 మంది నిండు ప్రాణాలు బలయ్యాయి. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన 11 మందిలో ఒకే కుటుంబానికి చెందినవారు ఎనిమిది మంది ఉన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద శనివారం సాయంత్రం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తొలుత బస్సు డ్రైవర్ లారీని ఢీకొట్టడం.. ఆ లారీ కుడి వైపునకు ఎగిరి ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొట్టడం.. అదే సమయంలో ఓ క్వాలిస్ దూసుకురావడంతో లిప్తపాటులో పెను ప్రమాదం సంభవించింది. ఇందులో క్వాలిస్‌లో ప్రయాణిస్తున్న సంగారెడ్డి జిల్లా పెద్దమ్మగూడెం గ్రామానికి చెందిన పత్రికా విలేకరి గొర్ల లక్ష్మణ్ (40)తోపాటు అతని కుటుంబసభ్యులు ఏడుగురు, బస్సులో హైదరాబాద్ నుంచి మంచిర్యాల వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. లక్ష్మణ్ బంధువర్గానికి చెందిన ఓ ఆరేళ్ల బాలుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదంపై మంత్రి మహేందర్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఎలా జరిగింది? మంచిర్యాల డిపోకు చెందిన టీఎస్ 19జెడ్ 0012 నంబర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ జూబ్లీ బస్‌స్టేషన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు మంచిర్యాలకు బయల్దేరింది. గంట తర్వాత గజ్వేల్ పట్టణం దాటిన తర్వాత రిమ్మనగూడ ఫార్మసీ కళాశాల సమీపంలోకి చేరుకుంది. ఇదే సమయంలో సిద్దిపేట వైపు వెళ్తున్న లారీ(ఎంపీ 28హెచ్1945)ని ఓవర్ టేక్ చేయబోతూ ఢీకొట్టి బోల్తా పడింది. బస్సు ఢీకొట్టడంతో లారీ డివైడర్‌ను దాటుకొని రోడ్డుకు అవతలి వైపు దూసుకొచ్చి, సిద్దిపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మరో లారీ (కంటైనర్)ని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా సిద్దిపేట వైపు ముందుకు కదిలింది. ఇదే సమయంలో కొమురవెళ్లి గుడిలో పూజలు చేసుకొని గజ్వేల్ వైపు వస్తున్న క్వాలిస్ ఈ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్వాలిస్ నుజ్జునుజ్జు అయింది. ఇందులో ప్రయాణిస్తున్న గొర్ల లక్ష్మణ్, తల్లి గండమ్మ (65), తండ్రి మల్లయ్య (67), కుమార్తె నిహారిక (5)తోపాటు మెదక్ జిల్లా తుప్రాన్ మండలం వెంకటరత్నాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ అత్త ఇల్టం సత్తమ్మ (60), బావమరిది కుమారుడు శ్రీనివాస్ (8), తుఫ్రాన్‌కు చెందిన సమీప బంధువు గాజు సుశీల (62) చనిపోయారు. అలాగే బస్సు బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ఆసిఫాబాద్‌కు చెందిన పరండి రాహుల్ (35), గోదావరిఖని లక్ష్మీనగర్‌కు చెందిన సాయినిఖిల్ (25), కరీంనగర్‌కు చెందిన సింధుజ (26) మృతి చెందారు. క్వాలిస్‌లో ప్రయాణిస్తున్న లక్ష్మణ్ భార్య పుష్పలత, కుమారుడు ఆకాశ్, డైవర్ నర్సింహులుతోపాటు బస్సులో గాయపడ్డ ప్రయాణికులకు గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం గాంధీ, యశోద అసుపత్రులకు తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ లక్ష్మణ్ బంధువర్గానికే చెందిన ఓంకార్ (6) అనే బాలుడు మృతిచెందాడు. ఈ బాలుడి తండ్రి నర్సింహులు కూడా ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంత్రి హరీశ్‌రావు పరామర్శ సంఘటన గురించి తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు వెంటనే సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, గడా ప్రత్యేకాధికారి హన్మంతరావు కలిసి ప్రమాద స్థలికి వెళ్లారు. అనంతరం గజ్వేల్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదం దురదృష్టకరమని, బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందచేస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు హైదరాబాద్‌లో మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డ్రైవర్ నిర్లక్ష్యమే..! ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమేనని తెలుస్తోంది. నిజానికి ఆర్టీసీకి చెందిన ఎక్స్‌ప్రెస్, లగ్జరీ బస్సులు 75–80 కిలోమీటర్లకు స్పీడ్‌లాక్ చేస్తారు. కానీ ప్రమాదం సమయంలో బస్సు అంతకన్నా వేగంగా వెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బస్సు లారీని ఢీకొట్టిన తర్వాత కిందకు పడబోతుండగా డ్రైవర్ ఇష్టానుసారంగా టర్న్ చేయడంతో రౌండ్ తిరిగి బోల్తా కొట్టిందని ప్రయాణికులు చెబుతున్నారు. హాహాకారాలు... ఆర్తనాదాలు ప్రమాద స్థలం హాహాకారాలు, ఆర్తనాదాలతో దద్దరిల్లింది. క్షతగాత్రుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే గజ్వేల్ ఇన్చార్జి ఏసీపీ మహేందర్ చేరుకొని వాహన శకలాల నుంచి మృతదేహాలను వెలికితీసే ప్రక్రియను చేపట్టారు. సిద్దిపేట అదనపు డీసీపీ నర్సింహారెడ్డి కూడా చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంతో రాజీవ్ రహదారి సుమారు రెండున్నర గంటలు స్తంభించిపోయింది. నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బిడ్డా భయపడకు.... నేనున్నా! బీటెక్ విద్యార్థినికి హరీశ్ భరోసా రిమ్మనగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన బీటెక్ విద్యార్థిని సాహితిని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలో మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. మంచిర్యాలకు చెందిన ప్రభాకర్–పద్మావతి దంపతుల కూతురు హైద్రాబాద్ బాచుపల్లిలోని ఓ కళాశాలలో బీటెక్ చదువుతోంది. సెలవులు కావడంతో స్వగ్రామమైన మంచిర్యాలకు బయల్దేరింది. ప్రమాదంలో తలకు గాయాలై ఆమె గజ్వేల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ‘‘నీకేం కాదు.. మేమున్నాం.. అధైర్యపడవద్దంటూ..’’ అంటూ మంత్రి ఆమెకు భరోసానిచ్చారు. -
చెరువు నిండుగా.. పల్లె పచ్చగా...
సాక్షి, హైదరాబాద్: ఒక్కొక్క వర్షపు చినుకును పోగేసి చెరువులోకి మళ్లిస్తే... నిండిన చెరువు నీళ్లను పంట పొలానికి మళ్లిస్తే...! పల్లె చిగురిస్తుంది. ఊరు ఊరంతా పచ్చబడుతుంది. అప్పుడెప్పుడో ఎగిరిపోయిన పక్షులు తిరిగొస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగభూపాలెం చెరువులో ఇప్పుడదే ప్రయోగం జరుగుతోంది. ప్రతాపరుద్రుని జమానాలో పది గ్రామాలకు తాగునీరు, వేల ఎకరాలకు సాగునీరు అందించిన ఈ చెరువు కాల గమనంలో విధ్వంసమైంది. ఒకవైపు శిఖం భూమి కబ్జాలు, మరోవైపు పూడికలతో చెరువు ఉనికినే కోల్పోయింది. పశుపక్ష్యాదులకూ నీళ్లు దొరకని దైన్యం వచ్చింది. అడుగంటిన చెరువు మీద బతకలేక జాలర్లు పట్నం బాట పట్టారు. రైతన్నలు వరిసాగు మానేసి పునాస పంట మీద కాలం నెట్టుకొచ్చారు. జవసత్వాలన్నీ ఉడిగి అంపశయ్య మీదున్న చెరువుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త మొగ్గలు తొడిగింది. నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు పట్టుదలతో చెరువుకు మళ్లీ జలకళ వచ్చింది. ఎండిన బీడు భూములు పచ్చబడ్డాయి. పక్షులు, ప్రాణులు తిరిగొచ్చాయి. చేప పిల్లలు మళ్లీ జీవం పోసుకొని నీళ్లలో ఎగిరి దుంకుతున్న సింగభూపాలెం చెరువుపై ‘సాక్షి’ప్రత్యేక కథనం... రెవెన్యూ, నీటిపారుదల శాఖ రికార్డుల ప్రకారం జూలూరుపాడు, సుజాతనగర్ మండలాల పరిధిలో ఈ చెరువు విస్త రించి ఉంది. దీని పరిధిలో 2,450 ఎకరాల ఆయకట్టుంది. కానీ తరతరాలుగా చెరువు పూడిపోయి ఉండటంతో 500 ఎకరాలు కూడ పారలేదు. ఈ నేపథ్యంలో నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు చెరువు మరమ్మతుల కోసం మిషన్ కాకతీయ ఫేజ్–1లో రూ.9.26 కోట్లు, 2వ ఫేజ్‌లో రూ.24 కోట్లు కేటాయించారు. కట్ట బలోపేతం చేసి అలుగులు, తూము పునర్నిర్మించారు. కుడి, ఎడమ కాల్వలను ఆధునీకరిస్తున్నారు. ఎడమ కాల్వ: సుజాతనగర్, సింగభూపాలెం రహదారిలో అంజనాపురం వద్ద మొదలై నర్సింహసాగర్ దాకా పారుతుంది. దీనికింద 11 తూములున్నాయి. 5.1 కిలోమీటర్ల పొడవైన ఈ కాల్వ ఆధునీకరణతో 973 ఎకరాలకు నీరందుతుందని అంచనా. కుడి కాల్వ: సుజాతనగర్, గొల్లగూడెం, సిరిపురం, వేపలగడ్డ, మంగపేట, చుంచు పల్లి, బృందావనం మీదుగా 1.9 కిలో మీటర్లుంది. 1,630 ఎకరాలకు సాగు నీరందిస్తోంది. హరీశ్ సరికొత్త ఆలోచన 1,000 ఎకరాల్లో ఉన్న సింగభూపాలెం చెరువును సీతారామ ప్రాజెక్టుతో అనుసంధానించి నింపే ప్రయత్నం చేస్తున్నారు. కట్ట ఎత్తును 1.5 మీటర్లు పెంచుతున్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌లోగా నీళ్లందించే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. 2,450 ఎకరాల ఆయకట్టును 5,000 ఎకరాలకు పెంచుతామని హరీశ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తోగువాగు వద్ద చెక్‌డ్యాం నిర్మించి కాల్వ ద్వారా ఆ నీటిని చెరువులోకి పంపేలా పను లు జరుగుతున్నాయి. సీతారామ ప్రాజెక్టు నీటినీ చెరువుకు అనుసంధానిస్తారు గనుక రెండు పంటలు పండే అవకాశముంది. ఈ ఏడాది 7.2 లక్షల చేప పిల్లలు, 1.8 లక్షల రొయ్య పిల్లలను చెరువులో వేశారు. పునరుద్ధరణకు నోచుకోవడం అదృష్టం గతంలో చెరువును పట్టించుకున్న నాథులే లేరు. కాల్వలు పూడుకుపోయి పొలాలకు నీరందేది కాదు. హరీశ్‌రావు మరమ్మతులు చేపట్టి చెరువును బాగు చేయిస్తున్నారు. ఇప్పుడు రెండు పంటలు పండించవచ్చు. – కాలంగి పుల్లయ్య, రైతు, సింగభూపాలెం -
వలసలు ఆగినయ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ ప్రజోద్యమంగా సాగిందని.. దాని ద్వారా హరిత తెలంగాణ సాధ్యమైందని నీటి పారుదల శాఖమంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. మిషన్ కాకతీయ ద్వారా వ్యవసాయ రంగంలో పెను మార్పులు తీసుకురాగలిగామని, రైతుల ఆదాయాన్ని పెంచగలిగామని చెప్పారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణ చేయాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్‌లో ‘మిషన్ కాకతీయ’అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. 2017 ఏడాదికి సంబంధించి మిషన్ కాకతీయపై ఉత్తమ కథనాలు రాసిన జర్నలిస్టులకు మంత్రి హరీశ్‌రావు అవార్డులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. మిషన్ కాకతీయపై సానుకూలంగా రాసిన కథనాలకే కాకుండా, తప్పులు ఎత్తి చూపుతూ రాసిన వార్తలనూ పరిగణనలోకి తీసుకుని అవార్డులు ప్రకటించినట్టు చెప్పారు. పారదర్శకంగా మిషన్ కాకతీయ పనులు జరగాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అదనంగా పది లక్షల ఎకరాలకు నీరు.. మిషన్ కాకతీయ ద్వారా కాకతీయుల కాలం నాటి చెరువులకు జల కళ వచ్చిందని, పక్షుల కిలకిలలతో చెరువులు చూడచక్కగా ఉన్నాయని, చెరువుల పునరుజ్జీవం ద్వారా రైతుల ఉత్పాదకత పెరిగిందని, వలసలు తగ్గాయని.. ఇలా ఎన్నో కథనాలు వెలువడటంపై హరీశ్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ వంటి జిల్లాల నుంచి వలస వెళ్లినవారు తిరిగి వెనక్కి వస్తుండటం మిషన్ కాకతీయ విజయానికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ‘మిషన్ కాకతీయ’ద్వారా మూడేళ్లలో 12 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామని, పదిలక్షల ఆయకట్టుకు అదనంగా నీళ్లిచ్చామని చెప్పారు. ఇప్పటివరకు 18 వేల చెరువులను పునరుద్ధరించామని, ఈ ఏడాది ఐదో విడత పనులు చేపడతామన్నారు. కోటి ఎకరాల లక్ష్యంలో భాగస్వాములు కండి నీటి పారుదలశాఖలో కొత్తగా ఎంపికైన 298 మంది ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీర్లకు ఈ కార్యక్రమంలోనే మంత్రి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు. విధుల్లోకి వచ్చిన ఇంజనీర్లలో ఎక్కువ సంఖ్యలో మహిళలు ఉండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. వారు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల వద్ద పనిచేస్తామని కోరడం హర్షించదగ్గ విషయమన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణ చేయాలన్న సీఎం కేసీఆర్ కల సాకారమయ్యేందుకు అందరం కలిసి పనిచేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, ఇంజనీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ‘సాక్షి’ జర్నలిస్టులకు అవార్డులు ‘సాక్షి’పత్రిక, టీవీకి చెందిన ఇద్దరు జర్నలిస్టులు మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా మిషన్ కాకతీయ అవార్డులు అందుకున్నారు. సంగారెడ్డి జిల్లా సీనియర్ స్టాఫ్ రిపోర్టర్‌గా ఉన్న కల్వల మల్లికార్జునరెడ్డికి ప్రింట్ మీడియా విభాగంలో, హైదరాబాద్ బ్యూరోలో సీనియర్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న కొత్తకాపు విక్రమ్‌రెడ్డికి ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో అవార్డు వచ్చింది. పురస్కారం కింద ప్రత్యేక మెమెంటో, రూ.50 వేల నగదు, ప్రశంసా పత్రం అందజేశారు. -
ఎత్తిపోతలకు 3,234 మెగావాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్‌ను సమకూర్చాలని విద్యుత్ శాఖను నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన అన్ని ప్రాజెక్టుల పంపుహౌజ్‌లకు ఈ వర్షాకాలం నుంచి విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్ల వద్ద సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని చెప్పారు. కంతనపల్లి ప్రాజెక్టుకు అనుబంధంగా జల విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం జలసౌధలో జరిగిన నీటి పారుదల, విద్యుత్ శాఖ అధికారుల సమన్వయ సమావేశంలో జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, జెన్కో డైరెక్టర్ సూర్యప్రకాశ్, ఎస్ఈ సురేశ్, నీటిపారుదల శాఖ ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, నీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఎత్తిపోతల పథకాలకు గరిష్టంగా 3,234 మెగావాట్ల విద్యుత్ అవసరం పడుతుందని ఈ భేటీలో తుది అంచనాకు వచ్చారు. ఆ ప్రకారం ప్రస్తుతం నడుస్తున్న ఎత్తి్తపోతల పథకాలకు 1,028.40 మెగావాట్లు, కాళేశ్వరంతోపాటు ఈ ఏడాది ప్రారంభమయ్యే ఇతర ఎత్తిపోతల పథకాలకు 2,206 మెగావాట్ల విద్యుత్ అవసరమని తేల్చారు. అలాగే పలు ప్రాజెక్టుల పరిధిలోని పంప్‌హౌజ్‌లలో ఈ ఏడాదిలో ఎప్పటి నుంచి నీటి పంపింగ్ ప్రారంభమవుతుంది, ఎన్నిరోజులపాటు పంపింగ్ చేసే అవకాశం వుంది, ఎంత విద్యుత్ వినియోగం అవుతుంది, ఏయే సమయాల్లో ఏయే పంప్ స్టేషన్లు పనిచేయాలి.. తదితర అంశాలపై నిర్ధారణకు వచ్చారు. కాళేశ్వరానికి 1,916 మెగావాట్లు కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి దశ పంపింగ్ ఈ ఏడాది జూలై–ఆగస్టులోనే ప్రారంభం అవుతుందని, దీనికి గరిష్టంగా ఈ ఏడాది 1,916 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని అంచనాకు వచ్చారు. ఈ పంప్‌హౌజ్‌లకు నిరాటంకంగా సరఫరా చేసేందుకు విద్యుత్‌ను సమకూరుస్తామని, సబ్స్టేషన్లు, లైన్ల నిర్మాణం పూర్తి చేశామని ప్రభాకర్ రావు తెలిపారు. కంతనపల్లి (తుపాకుల గూడెం) ప్రాజెక్టు వద్ద గోదావరి నీటితో విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలను పరిశీలించాలని హరీశ్‌రావు సూచించారు. జల విద్యుత్ ప్రాజెక్టుపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
‘సప్త సముద్రాలకు’ పునరుజ్జీవం!
సాక్షి, హైదరాబాద్: ఆకలి చావులు.. వలసలకు నిలయం.. సాగుకు నీళ్లు లేక గోసటిల్లిన నేల. పసిపిల్లలను, పండుటాకులను వదిలేసి ఎందరో వలసలు పోగా పల్లెలు పడావు పడిన ప్రాంతం. తరతరాలుగా కరువు కాళనాగై పగబట్టినట్టు వెంటబడి తరుముతుంటే సాగు చేయలేక, జోడెద్దులను సాకలేక కబేళాలకు అమ్ముకున్న రైతన్నల కన్నీళ్లతో నిండిన నేల పాలమూరు జిల్లా. ఇప్పుడు అదే బీడు భూముల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. వాగులు.. వంకలు.. గొలుసుకట్టు చెరువులు.. పాడుబడ్డ కుంటలు.. సకల జల స్థావరాలను నింపుతూ నెర్రెలు బాసిన భూముల్లో జీవం నింపుతోంది. పాడుబడిన పాలమూరు జిల్లా మిషన్ కాకతీయ తొలి ఫలాలతో పచ్చని పంట చేనుగా మారింది. 45 వేల ఎకరాలు.. 60 గ్రామాలు గొలుసుకట్టు చెరువులు అంటే మొదటగా గుర్తొచ్చేది వనపర్తి నియోజకవర్గ పరిధిలో ఉండే సప్త సముద్రాలు. రంగ సముద్రం, రాయ సముద్రం, కృష్ణ సముద్రం, వీర సముద్రం, గోపాల సముద్రం, మహభూపాల సముద్రం, శంకరమ్మ సముద్రం.. సప్త సముద్రాలుగా పేరెన్నికగన్నాయి. వనపర్తిని కేం ద్రంగా చేసుకుని పరిపాలనను సాగించిన నాటి రాజులు వీటిని నిర్మించారు. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ చెరువులకు గతంలో ఆదరణ కరువైంది. పాడుబడిన పాలమూరులో నీళ్లు పారిస్తామని ఉద్య మ సమయంలోనే హరీశ్‌రావు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్లుగానే మిషన్ కాకతీయ కింద సప్త సముద్రాలను మరమ్మతు చేయించారు. 45 వేల ఎకరాలను సాగులోకి తెచ్చారు. తొలుత బీమా ఎత్తిపోతల నుంచి నీళ్లను తోడి కొత్తకోట మండలంలోని కానాయిపల్లిలో 160 ఏళ్ల కిందట రాణీ శంకరమ్మ పాలనలో నిర్మించిన శంకర సముద్రాన్ని నింపారు. అటు నుంచి కృష్ణ సముద్రానికి, తర్వాత పెబ్బేరు మండలం శ్రీరంగాపూర్‌లోని రంగ సముద్రంలోకి నీళ్లు మళ్లాయి. తర్వాత కొత్తకోట మండలం రాయణిపేట వద్ద వనపర్తి సంస్థానాధీశుల కాలంలో నిర్మించిన రాయ సముద్రాన్ని నింపారు. అటు నుంచి వనపర్తి రాజు రాజారామేశ్వరరావు వంశీయులు నిర్మించిన మహభూపాల సముద్రం చెరువును.. తర్వాత పెబ్బేరు మండలంలోని వీర సముద్రం చెరువు, పెద్దమందడి మండలంలోని గోపాల సముద్రం చెరువును నింపి 45 వేల ఎకరాలకు సాగునీరుతోపాటు 60 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. గూటికి చేరిన వలస పక్షులు వనపర్తి జిల్లా వలసలకు నిలయం. భూమిని పడావు పెట్టి ఊరు ఊరంతా వలస వెళ్లటం అక్కడ సర్వ సాధారణం. మిషన్ కాకతీయ, ఇతర పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో ఇప్పుడీ గ్రామాలకు నీళ్లు వచ్చాయి. ఊళ్లలోనే పని దొరుకుతుండటంతో వలసపోయిన కుటుంబాలు తిరిగి వచ్చాయి. సాగు పనుల్లో నిమగ్నమయ్యాయి. 30 ఏళ్లుగా బోసినట్లు కన్పించిన ఖానాపురం ఇప్పుడు పల్లె రూపం సంతరించుకుంది. వలస పోయేటోన్ని శంకర సముద్రం నిండింది. మూడు పంటలకు నీరు పుష్కలంగా అందుతోంది. గతంలో ఏడాదిలో 10 నెలలు వలస పోయేటోన్ని. ఇప్పుడు ఊరిలోనే పొలం పనులు చేసుకుం టున్నాం. – నారాయణ, శ్రీరంగాపురం కళ్లెదుటే సుందర స్వప్నం ఉమ్మడి రాష్ట్రంలో ‘సప్త సముద్రాలు’ ఉనికి కోల్పోయాయి. వీటిని పునరుద్ధరిస్తే వనపర్తి జిల్లాలో కరువును రూపుమాపొచ్చని కేసీఆర్ నాతో చెప్పారు. రికార్డు సమయంలో మరమ్మతు పూర్తి చేశాం. ఇప్పుడు ఈ సుందర స్వప్నం ఆవిష్కృతమైంది. రైతన్నల మోముల్లో చిరునవ్వు ఆనందం కలిగిస్తోంది. – మంత్రి హరీశ్‌రావు -
ఉత్తమ్, జానారెడ్డికి కూడా చెక్కులు ఇస్తాం
సాక్షి, సిద్దిపేట: ఏడు దశాబ్దాలుగా కుంభకర్ణ నిద్రలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రైతుల గురించి, తాము వారికి అందజేసే సహాయం గురించి మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. శనివారం సిద్దిపేట జిల్లాలో ఆయన రైతుబంధు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతు సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఇంతకాలం రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగేవారని, ఇప్పుడు ప్రభుత్వం సాగుకు ముందే డబ్బులు ఇవ్వడాన్ని చూసి యావత్తు రైతాంగం పండగ చేసుకుంటోందని చెప్పారు. దీంతో తమ అడ్రస్ గల్లంతు అవుతుందని భయపడుతున్న కాంగ్రెస్ నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ పథకం ద్వారా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డిలకు కూడా చెక్కులు ఇస్తామని తెలిపారు. కాగా, గల్ఫ్ దేశాలతోపాటు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన రైతులకు కూడా పెట్టుబడి సాయం చెక్కులు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం అందజేసే పెట్టుబడి సాయంతో పెద్ద రైతులకే లాభం చేకూరుతుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శలు చేయడం అర్థరహితం అన్నారు. రాష్ట్రంలో 90.5 శాతం మంది రైతులు ఐదు ఎకరాల లోపు ఉన్నవారే అని, 7.7 శాతం మంది 10 ఎకరాలలోపు ఉన్న రైతులు ఉన్నారని హరీశ్‌రావు లెక్కలు చెప్పారు. కొడుకా ఎట్లున్నవ్? ‘కొడుకా ఎట్లున్నవ్.. చచ్చి నీ కడుపున పుడతా బిడ్డ. ఇంతకు ముందు సర్కార్లు రైతులకు డబ్బులు ఇవ్వడం చూడలేదు. అంతా మా దగ్గరే తీసుకునేటోళ్లు. నా కష్టానికి చెక్కు ఇయ్యనీకి వచ్చినవా..’అంటూ ఓ వృద్ధురాలు మంత్రి హరీశ్‌రావుతో తన ఆనందాన్ని పంచుకుంది. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండల పరిధి బద్దిపడగలో రైతుబంధు చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంగమ్మ అనే వృద్ధురాలు హరీశ్‌రావుతో ఇలా ఆప్యాయంగా మాట్లాడింది. – సాక్షి, సిద్దిపేట -
ఓర్వలేకే రైతుబంధుపై విమర్శలు
సంగారెడ్డి రూరల్/సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ఆరుగాలం కష్టపడి పంటలను సాగు చేసే రైతన్నలను ఆదుకునే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ.8 వేలు చెల్లిస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం చిద్రుప్ప, సదాశివపేట మండలం మద్దికుంట గ్రామాల్లో శుక్రవారం ఆయన రైతుబంధు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పాలనలో రైతులను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రైతుబంధు పథకానికి ఏడాదికి రూ.12 వేల కోట్లు ఖర్చవుతున్నప్పటికీ తమ ప్రభుత్వం ఉన్నంత వరకు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. తమ ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. రైతులు అందుకున్న చెక్కుల కాలపరిమితి మూడు నెలలు ఉంటుందని, తొందరపడి అందరూ ఒకేసారి బ్యాంకులకు వెళ్లకుండా విడతల వారీగా వెళ్లి నగదు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతాప్రభాకర్, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, నిఖిల తదితరులు పాల్గొన్నారు. -
నేడు మెదక్ జిల్లాకు సీఎం కేసీఆర్
-
నేడు మెదక్ జిల్లాలో కేసీఆర్ పర్యటన
సాక్షి, మెదక్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. నూతన జిల్లాల ఏర్పాటు అనంతరం మొదటి సారిగా జిల్లాకు రానున్నారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు సీఎం పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు రెండ్రోజులుగా పట్టణంలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశమై ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. బహిరంగ సభ కోసం జిల్లా నలుమూలల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. కేసీఆర్ బుధవారం సాయంత్రం 4.30 గంటలకు హెలికాప్టర్లో మెదక్ పట్టణం చేరుకుంటారు. అనంతరం ఔరంగాబాద్‌లో రూ.74 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన సమీకృత కలెక్టరేట్ భవనం, ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, హరీశ్‌రావు, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. అనంతరం పట్టణంలోని అతిథి గృహంలో జిల్లా అధికారులతో సీఎం సమావేశమై జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించనున్నారు. అనంతరం 6 గంటలకు మెదక్ చర్చి గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు రోడ్డు మార్గం గుండా కరీంనగర్ చేరుకుంటారు. -
‘రైతుబంధు నాకొద్దు’
జోగిపేట(అందోల్): రైతుబంధు పథకం పేరుతో తన తల్లి జానాబాయి పేర ఉన్న వ్యవసాయ భూమికి వచ్చే చెక్కును తీసుకోనని, దానిని గౌరవంగా తిరస్కరిస్తున్నామని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రకటించారు. సోమవారం ఆయన సాక్షితో ఫోన్లో మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావు సింగూరు పర్యటన సందర్భంగా దామోదర తల్లి జానాబాయి పేర ఉన్న 20 ఎకరాలకు పెట్టుబడి పథకం కింద రూ.1.60 లక్షలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. దీనిపై స్పందించిన రాజనర్సింహ ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సహాయం తమకు వద్దన్నారు. రాష్ట్రంలో 60 నుంచి 70 శాతం మంది కౌలు రైతులే పంటలను పండించుకుంటున్నారన్నారు. వారికి ప్రభుత్వం న్యాయం చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. బడా రైతుల గురించి కాకుండా చిన్న, సన్న కారు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఏ మేరకు ఆదుకున్నారో శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్ నేతలకు కళ్ల పరీక్ష చేయిస్తాం: హరీశ్
సాక్షి, పెద్దపల్లి: రాష్ట్రంలో కోటి మందికి కళ్ల పరీక్షలు జరిపించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుత కార్యక్రమాన్ని చేపడుతున్నారని, పనిలో పనిగా కాంగ్రెస్ నాయకుల కళ్లకు కూడా పరీక్షలు చేయిస్తే బాగుంటుందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఆయన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు వైపు ప్రపంచమే తొంగి చూస్తుండగా, కాంగ్రెస్ నాయకులు మాత్రం అడ్డుకునేందుకు నానా తిప్పలు పడ్డారన్నారు. ట్రిబ్యునల్‌కు వెళ్లి కేసు వేశారన్నారు. తెలంగాణ వికాసం కోసం తాము ప్రయత్నాలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ విధ్వంసం కోసం కుట్రలు పన్నుతోందన్నారు. కర్ణాటక ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అక్కడి పార్టీలు మేనిఫెస్టోలో పెట్టుకున్నాయన్నారు. పంజాబ్, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పథకాలను చూసి ప్రశంసిస్తుండగా, ఇక్కడి కాంగ్రెస్ నాయకుల కళ్లు మండిపోతున్నాయన్నారు. అందుకే కంటి పరీక్షల కార్యక్రమంలో కాంగ్రెస్ నేతల కంటి పొరలు తొలగించేలా చికిత్స చేయిస్తేగాని నిజాన్ని చూడలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. -
రైతులు ఆందోళన చెందవద్దు: హరీశ్
సాక్షి, మెదక్: రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని, ఎలాంటి ఆందోళన చెం దవద్దని భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ నెల 9న సీఎం కేసీఆర్ మెదక్ పట్టణానికి రానున్న నేపథ్యంలో శనివారం మంత్రి ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. నూతన కలెక్టరేట్ భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్న స్థలాన్ని, బహిరంగసభాస్థలిని ఆయన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలసి పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఊహించిన దాని కంటే ఎక్కువగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావడం, హమాలీల కొరత కారణంగా కొనుగోలులో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెప్పారు. రైతుల నుంచి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న విమర్శలు అర్థరహితమన్నారు. -
మార్కెటింగ్‌పై హరీశ్‌కు చిత్తశుద్ధి లేదు
భూదాన్ పోచంపల్లి: నీటి పారుదల మంత్రి హరీశ్‌రావుకు మిషన్ కాకతీయ, భగీరథ పథకాలపై ఉన్న చిత్తశుద్ధి మార్కెటింగ్‌పై లేదని, దాంతో ఆ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ దత్తాత్రేయ విమర్శించారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని పోచంపల్లి, రేవనపల్లి, గౌస్‌కొండ, ఇంద్రియాల గ్రామాల్లో వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలను సందర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ అకాల వర్షంతో వరి, మామిడి తోటలు దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. 799 వరి రకాన్ని సాధారణ గ్రేడ్ కింద పరిగణించడం రైతు వ్యతిరేక చర్య అని, దీన్ని వెంటనే ఉపసంహరించుకుని పూర్తి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు రైతులకు రెట్టింపు లాభం చేకూర్చేలా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో కొత్త పథకాలను అమలు చేస్తున్నారని, వీటిని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కేంద్రాలను విస్మరించి మిల్లర్లను ప్రోత్సహిస్తూ, దళారులను పెంచడం సరికాదన్నారు. -
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితిని వాట్సాప్ ద్వారా సమీక్షించారు. తడిసిన ధాన్యంపై పలు సూచనలు చేస్తూ జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, వేర్‌హౌసింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. జాయింట్ కలెక్టర్లు వెంటనే మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను సందర్శించి పరిస్థితులను సమీక్షిస్తూ చర్యలు తీసుకోవాలని చెప్పారు. టార్పాలిన్లను వెంటనే సమకూర్చాలని, తడవని ధాన్యాన్ని వెంటనే గోదాంలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. గాలి దుమారం, భారీ వర్షానికి పాడైన గోదాంలకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
సిద్దిపేటలో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులకు శిక్షణ తరగతుల నిర్వహణకుగాను ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం(టీటీసీ) త్వరలో అందుబాటులోకి రానుంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో రూ.2.5 కోట్లతో నిర్మించిన టీటీసీ భవనాన్ని శుక్రవారం నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాలను స్కూళ్లలోనో ఇతర ప్రైవేటు స్థలాల్లో నిర్వహిస్తుంటారు. దీంతో శిక్షణ తరగతులకు ప్రతిసారీ కొత్త భవనాన్ని వెతకాల్సి ఉండేది. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లా కేంద్రంలో టీటీసీ భవనాన్ని ఏర్పా టు చేస్తే బాగుంటుందని ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి మొదట్నుంచి కోరుతున్నారు. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లాలో సీడీపీ నిధుల నుంచి రూ.2.5 కోట్లు కేటాయించి రాష్ట్రంలోనే తొలిసారిగా భవన నిర్మాణానికి కృషి చేశారు. -
ప్రాజెక్టులపై కుట్రలు చేస్తారా?
గజ్వేల్: సాగునీటి కష్టాలతో అల్లాడుతున్న తెలంగాణ రైతాంగాన్ని గట్టెక్కించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుండగా.. ప్రొఫెసర్ కోదండరాం దొడ్డిదారిన అడ్డుకునేందుకు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో పర్య టించారు. ఈ సందర్భంగా ములుగు మం డలం తున్కిబొల్లారంలో కొండపోచమ్మసాగర్ నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న ఆర్అండ్ఆర్ కాలనీ పనులను పరిశీలించారు. అనంతరం మర్కూక్‌లో నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవంలో పాల్గొని, దళితులతో సహపంక్తి భోజనం చేశారు. వీటితో పాటు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. కోదండరాం తీరుపై నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే సాగునీరు కావాలని ఉద్యమ సమయంలో డిమాండ్ చేసిన కోదండరాం.. ములుగు మండలం మామిడ్యాల, బహిలింపూర్, తానేదార్పల్లి గ్రామాల్లో కొండపోచమ్మసాగర్‌కు భూములివ్వొద్దంటూ కుట్రలు చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా భూసేకరణ చట్టాల అమలుపై అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అయినా, కోదండరాం మాటలను నిర్వాసితులు నమ్మలేదన్నారు. సీఎం కేసీఆర్‌పై ఉన్న నమ్మకంతో పలువురు రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని గుర్తుచేశారు. వారి సహకారం వల్లే ఇప్పటి వరకు ఈ రిజర్వాయర్ పనులకోసం 4,634 ఎకరాలను సేకరించాల్సి ఉండగా.. ప్రస్తుతం 4,468 ఎకరాలు సేకరించగలిగామన్నారు. అన్ని సౌకర్యాలతో కాలనీ..: నిర్వాసితులను ఆదుకునేందుకు ప్రభుత్వం మానవతాదృక్పథంతో వ్యవహరిస్తుందని హరీశ్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా ఒకప్పుడు నిర్వాసితుడు కావడం వల్ల... వారి కష్టాలు తెలుసని స్పష్టం చేశారు. సకల సౌకర్యాలతో తున్కిబొల్లారం వద్ద దేశంలో ఎక్కడా లేనివిధంగా కాలనీ పనులు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కాంగ్రెస్ నేతలకు కనిపించకపోవడం సిగ్గుచేటన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందన్నారు. దీనిపై సవాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం దళితుల హక్కుల పరిరక్షణలో విఫలమైందని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో కానిస్టేబుల్ నియామకపు పరీక్షల్లో అభ్యర్థుల దేహాలపై ఎస్సీ, ఎస్టీ అని రాయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర గృహ నిర్మాణసంస్థ చైర్మన్ మడుపు భూంరెడ్డి, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, గడా ప్రత్యేకాధికారి హన్మంతరావు, జాయింట్ కలెక్టర్ పద్మాకర్, గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ఉంటే కాళేశ్వరం కట్టేదా!
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాళేశ్వరం కట్టేదా, మొబిలైజేషన్ అడ్వాన్సులు, సర్వేలు, డిజైన్ల పేరుతో నిధులను దిగమింగారు. అధికారం ఉన్నా, లేకున్నా వారికి కుర్చీల కోసమే కొట్లాట. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని పీసీసీ పదవి నుంచి దించి తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే డీకే అరుణ కొట్లాడుతున్నారు. ప్రజలు పచ్చగా ఉండటం వారికి పట్టదు. వారి ఇల్లు, కుటుంబం పచ్చగా ఉండాలన్నదే కాంగ్రెస్ సిద్ధాంతం’అని కాంగ్రెస్‌పై భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మంగళవారం విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి ఉదయం 10 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి నియోజక వర్గాల్లో ఎస్సారెస్పీ స్టేజ్–2 కాల్వ పనులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే గాదరి కిశోర్ అధ్యక్షతన తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన జనహిత సభలో మంత్రి హరీశ్ మాట్లాడారు. ‘కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నాడు నీలం తుపాన్ వల్ల నల్లగొండ జిల్లాకు నష్టం జరిగింది. అప్పట్లో గుంటూరు, కృష్ణా జిల్లాలకు నీలం తుపాన్ పరిహారం ఇచ్చారు. కానీ నల్లగొండకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నాడు మంత్రులుగా ఉన్న జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ పంట పరిహారంపై కిరణ్‌కుమార్‌రెడ్డిని అడగలేదు. ఇద్దరు నేతలు ఎస్సారెస్పీ కాల్వ గట్లపై ఏనాడైనా తిరిగారా. నాడు పనులు ఆలస్యం కావడంపై ఎప్పుడైనా అధికారులతో చర్చించారా’అని ప్రశ్నించారు. కాళేశ్వరంతో సూర్యాపేట సస్యశ్యామలం కాళేశ్వరం నీళ్లతో తొలి ఫలితం సూర్యాపేట జిల్లాకే దక్కుతుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తొలుత కాళేశ్వరం నుంచి 26 టీఎంసీలు మిడ్‌మానేరుకు అక్కడ నుంచి కరీంనగర్ జిల్లా లోయర్ మానేరుకు అక్కడి నుంచి వరంగల్, సూర్యాపేట జిల్లాలకు ఈ నీళ్లు వస్తాయన్నారు. కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో అవసరమైన చోట్ల రిజర్వాయర్లు కట్టడానికి ఆన్లైన్ సర్వే కోసం ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. ‘అసెంబ్లీ అంటే కాంగ్రెస్ పారిపోతుంది’ అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు పారిపోతున్నారని, చర్చలకు రమ్మన్నా రావడం లేదని మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు అసత్యాలను ప్రచారం చేస్తూ ఉత్తమ్ బాబా 48 మంది దొంగల గుంపుతో యాత్రలు చేస్తున్నారన్నారు. ఈ సభలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, గిడ్డంగు సంస్థ చైర్మన్ మందుల సామేలు పాల్గొన్నారు. -
సొంతంగా గెలవలేక.. బ్లాక్మెయిల్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘సొంతంగా గెలవలేని పరిస్థితుల్లో బురద చల్లడం, బ్లాక్మెయిల్ చేయడం, దిగజారుడు రాజకీయాలు చేయడం ద్వారా ఇతర పార్టీలను కాంగ్రెస్ దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించిన కాంగ్రెస్.. నీటి కేటాయింపుల్లో వివక్షకు గురైన తెలంగాణ ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘రైతుబంధు’పథకం అమలు తీరుపై సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘పట్టాదారు పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీ అవగాహన సదస్సు’లో మంత్రి హరీశ్ పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘ఏపీలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ జాతీయ నాయకులు జైరాం రమేశ్ మాట్లాడారు. పక్క రాష్ట్రంపై ఎలాంంటి వ్యతిరేకత, ఈర్ష్య లేదు. కానీ, తెలంగాణకు పారిశ్రామిక, ఐటీ రంగాలకు పెట్టుబడి ప్రోత్సాహకాలు ఇస్తామనే విభజన చట్టం హామీ గురించి కాంగ్రెస్ నాయకులు ఎందుకు ప్రశ్నించరు’అని మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్ర పర్యటన సందర్భంగా.. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేలా మాట్లాడింది కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనన్నారు. ‘బీజేపీకి అనుకూలంగా టీఆర్ఎస్ మాట్లాడుతోందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల విమర్శలు చేశారు. స్వాతంత్య్రం వచ్చి 60ఏళ్లు దాటినా తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించలేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ పాలనా వైఫల్యాలతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టి సారించారు. మోదీని గద్దె దించడమో, రాహుల్‌ను అధికారంలోకి తీసుకురావడమో టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడటమే మా లక్ష్యం’అని మంత్రి స్పష్టం చేశారు. కేసీఆర్ చేతుల మీదుగా ‘రైతుబంధు’ వచ్చే నెల 10 నుంచి 17వ తేదీ వరకు 8 రోజు లపాటు జరిగే ‘రైతుబంధు’పథకాన్ని ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రారంభించాల్సిందిగా ముఖ్య మంత్రి కేసీఆర్‌ను కోరాలని జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఆకాంక్షిస్తున్నట్లు హరీశ్ వెల్లడించారు. జిల్లాలో పర్యటించాలని త్వరలో సీఎంను కలసి విజ్ఞప్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా రోజుకో జిల్లాలో పర్యటించి రైతుబంధు పథకం అమలును పర్యవేక్షిస్తారన్నారు. రాష్ట్రంలో 1.42 కోట్ల ఎకరాలకు సంబంధించి 58 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.4వేల చొప్పున అందజేస్తామన్నారు. కాళేశ్వరంపై హరీశ్ సుదీర్ఘ సమీక్ష సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు గడువు సమీపిస్తున్నందున పనులు వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఖరీఫ్‌లో గోదావరి నీటిని గరిష్ట ఆయకట్టుకు అందించాలని, మేడిగడ్డ నుంచి మల్లన్నసాగర్ వరకు పనులను వేగిరపరచాలని స్పష్టంచేశారు. సోమవారమిక్కడ జలసౌధలో కాళేశ్వరంపై రాత్రి పొద్దుపోయే వరకు సుమారు 6 గంటలపాటు మంత్రి సమీక్ష నిర్వహించారు. వానలు మొదలయ్యేందుకు మరో నెలన్నర గడువే ఉన్న నేపథ్యంలో కాంక్రీట్ పనులు, పంప్‌లు, మోటార్ల బిగింపు ప్రక్రియను వేగిరం చేయాలని సూచించారు. -
మన కూరగాయలను సద్వినియోగం చేసుకోండి
మణికొండ: మన తెలంగాణ–మన కూరగాయల పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవా లని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఆదివారం పథకం ప్రారంభోత్సవానికి ఆయన మణికొండకు వచ్చారు. మర్రిచెట్టు సర్కిల్లో ఏర్పాటు చేసిన స్టాల్‌ను ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రభు త్వం ప్రతిష్టా త్మకంగా అమలుచేస్తోం దని తెలిపా రు. అనంతరం మణికొండలోని పంచవటి కాలనీ ప్రవేశంలో స్టాల్‌ను ఏర్పాటు చేయాలని కోరామని, అది అమలు కాలేదని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో హరీష్‌రావు మార్కెటింగ్ శాఖ అధికారులపై మండిపడ్డారు. మణికొండలో రెండు స్టాళ్లను ఏర్పాటు చేయాలని గతంలో తాను ఆదేశించినా ఒకటే ఎందుకు సిద్ధం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల క్రితం ఆదేశించినా ఇప్పటివరకు ప్రక్రియ పూర్తి చేయకపోవడం ఏంటని నిలదీశారు. సర్వేనెంబర్ 42లోని ప్రభుత్వ భూమిలోని కొంత స్థలాన్ని తమకు కేటాయిస్తామని తహసీల్దార్ చెప్పి.. ఇప్పటివరకు పూర్తి చేయకపోవడంతోనే స్టాల్ ఏర్పాటు చేయలేకపోయామని మార్కెట్ అధికారులు మంత్రికి వివరించారు. దీంతో హరీష్‌రావు.. సదరు విషయాన్ని పరిశీలించి సమస్యను పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు సూచించారు. పక్కనే ఉన్న ఎంపీపీ తలారి మల్లేశ్ కలగజేసుకుని తహసీల్దార్‌తో మాట్లాడి ప్రతిపాదనలు పంపించామని, కలెక్టర్ స్థలం కేటాయించాలని చెప్పారు. ఈ విషయాన్ని కలెక్టర్‌తో చర్చించి త్వరలోనే స్టాల్ ఏర్పాటయ్యేలా చర్యలు చేపడతామని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మన కూరగాల పథకంలో అటు రైతులతో పాటు ఇటు కొనుగోలుదారులకు న్యాయం జరుగుతుందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఎంపీపీ తలారి మల్లేశ్, సర్పంచ్‌లు నరేందర్‌రెడ్డి, నర్సింహ, ఎంపీటీసీ సభ్యుడు రామకృష్ణారెడ్డి, రాఘవరెడ్డి, మహేందర్‌గౌడ్, మార్కెట్ ప్రత్యేక కార్యదర్శి పద్మహర్ష, నార్సింగి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మమతాశ్రీనివాస్, వైస్ చైర్మెన్ శ్రీరాములు తదితరులు ఉన్నారు. -
ఆ ప్యాకేజీలు వానాకాలం నాటికి పూర్తి కావాలి
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి లోని 6,7, 8 ప్యాకేజీల పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని.. వచ్చే వానాకాలం నాటికి పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. శుక్రవారం రాత్రి ఆయన ఈ మూడు ప్యాకేజీల పనులపై సమీక్షించారు. 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న సంకల్పంతో కాళేశ్వ రం ప్రాజెక్టు చేపట్టామని.. పనులను శరవేగం గా కొనసాగించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఏడో ప్యాకేజీ పనుల తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌజ్, అన్నారం బ్యారేజీల పనులు ఊపందుకున్నాయన్నారు. సమావేశంలో కాళేశ్వరం సీఈ వెంకటేశ్వర్లు, ఎస్ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ శ్రీధర్, వివిధ కాంట్రాక్టు ఏజన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఒక్క పంటకైనా మద్దతు ధర కల్పించారా?
నిజామాబాద్ అగ్రికల్చర్: కాంగ్రెస్‌ది స్వార్థ రాజకీయమని, వారికి ఓట్ల పంచాయతీ తప్ప తెలంగాణ అభివృద్ధి సోయి ఉండదని భారీ నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం నిజామాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు. మంత్రి మాట్లాడు తూ.. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఒక్క పంటకైనా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసిందా అని ప్రశ్నించారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలు అమ లు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని పంటలకు మద్దతు ధర కల్పించామన్నారు. రైతు సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు తేలేదని, తాము అన్నిరకాల అనుమతులు తీసుకొచ్చి పనులను వేగవంతంగా చేస్తున్నా మన్నారు. ప్రజా సంక్షేమం పట్టని కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తూ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల గురించి సీడబ్ల్యూసీ చైర్మన్ బృందం సందర్శించి భేషుగ్గా ఉందని కితాబిచ్చారన్నా రు. కాంగ్రెస్ అభివృద్ధి పనులను అడ్డుకుంటుందని, ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. ‘మంచిప్ప’బాధితులకు మెరుగైన ప్యాకేజీ కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా మంచిప్ప రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న బాధితులకు మెరుగైన ప్యాకేజీని అందిస్తామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఒక్కో ఎకరానికి రూ.15 లక్షలతోపాటు డబుల్ బెడ్రూం ఇళ్లు, పాత ఇంటికి నష్టపరిహారం అందిస్తామన్నారు. అసైన్మెంట్ భూమికి సైతం రూ.15 లక్షలు పరిహారం ఇస్తామని హరీశ్‌రావు ప్రకటించారు. కాగా ముంపు గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు తమ భూములకు సంబంధించిన పత్రాలను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మంత్రి హరీశ్‌రావుకు అందజేశారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్త, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మీరు నిద్ర పోతున్నారు..!
మహదేవపూర్: మిత్రమా సమయం లేదు.. ప్రభుత్వం పరుగెడుతున్నా.. ఇంజినీర్లు నిద్రపోతున్నారు.. ఇలా అయితే డిసెంబర్‌లోగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం ఎలా పూర్తి చేస్తారని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు బ్యారేజీ ఈఈ రమణారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. సోమవారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన ఆయన ఇంజినీర్లతో మాట్లాడారు. మహారాష్ట్ర వైపు పనులు వేగవంతంగా ఎందుకు నడవటం లేదని ప్రశ్నించారు. ‘తెలంగాణ వైపు ప్రభుత్వం అన్నీ సమకూర్చింది.. ఇక్కడ ఐబీ ఇంజినీర్లకు ఏం పని.. ఎల్అండ్టీ కంపెనీ పనులు చేస్తోంది. మహారాష్ట్ర వైపు ఇంకా 170 ఎకరాలు భూసేక రించాల్సి ఉంది. రైతులను ఒప్పించి భూసేకరణ చేయాలి. గడ్చిరోలి జిల్లా కలెక్టర్‌ను కలవండి.. భూసేకరణ వేగవంతం చేయండి’ అని ఆదేశించారు. గడ్చిరోలి జిల్లా కలెక్టర్ రంగనాయక్, జేసీతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. త్వరగా భూసేకరణ చేయాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి తానే స్వయంగా ముంబై వెళ్లి ఆర్థికశాఖ మంత్రి సుధీర్ ముదిగంటివార్‌తో మాట్లాడుతానన్నారు. 15రోజుల్లో భూసేకరణ పూర్తి చేసి పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. -
కాంగ్రెస్‌లో ఎప్పుడూ కుర్చీల కొట్లాటే
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ‘అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. కాంగ్రెస్‌లో కుర్చీల కొట్లాటలే తప్ప ఆ పార్టీకి ప్రజల సంక్షేమం పట్టదు’ అని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆ పార్టీ నేతలు చేపట్టిన బస్సు యాత్ర ఓ విహార యాత్ర అని ఎద్దేవా చేశారు. సోమవారం నిజామాబాద్ జిల్లా బోధన్‌లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ, రాష్ట్ర గవర్నర్, కేంద్ర జలసంఘం చైర్మన్ వంటి వారితో పాటు దేశమంతా కాళేశ్వరం ప్రాజెక్టును మెచ్చుకుంటే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం నొచ్చుకుంటున్నారని దుయ్యబట్టారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో కొత్తగా ఐదు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తే.. తమ మూడున్నరేళ్ల పాలనలో 20 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తొలి ఫలితం నిజామాబాద్ జిల్లాకే దక్కుతుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. పెట్టుబడి ఇస్తామంటే మింగుడుపడటంలేదు?: ఎంపీ కవిత దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తుంటే కాంగ్రెస్ నాయకులకు మింగుడుపడటం లేదని నిజామాబాద్ ఎంపీ కవిత విమర్శించారు. రైతులకు సాగునీరు కూడా అందితే తమకు మనుగడ ఉండదని కాంగ్రెస్ నాయకులకు భయం పట్టుకుందని అన్నారు. సీఎం కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలంటూ మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి రైతులను రెచ్చగొడుతున్నారని కవిత ఆరోపించారు. నిజాంషుగర్స్ కార్మికులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
దళితులకు రక్షణ లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దళితుల కోసం చట్టాలున్నా రక్షణ లేకుండా పోయిందని, వాటిని సమీక్షిస్తే పరిస్థితి దుర్భరం అవుతుందని రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు రాములు నాయక్, ఎం.శ్రీనివాస్‌రెడ్డితో కలిసి తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఏటా 40 వేలకుపైగా ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదవుతున్నాయన్నారు. దళితుల రక్షణ కోసం ఉన్న చట్టాలను సమీక్షిస్తే దాడులు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరుగుతుంటే కేసులు పెరుగుతున్నాయని, దళితుల్లో ఉన్న బాధను లోతుగా అర్థం చేసుకోవాలన్నారు. ప్రధాని మోదీ చొరవ తీసుకుని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలపై బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.దేశంలో గుణాత్మక మార్పులు వస్తేనే అట్టడుగు వర్గాల కష్టాలు తీరుతాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. దళితుల్లోని ఆందోళనను, ఆవేదనను పట్టించుకోకుండా కాల్పులు చేశారని విమర్శించారు. ఈ సందర్భంగా 9 మంది మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికరమన్నారు. వాస్తవాలు తెలుసుకోవాలి భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చే పరిస్థితి ఎందుకు ఏర్పడిందో ఆలోచించాలని హరీశ్‌రావు కోరారు. దళితుల రక్షణకోసం బ్రిటిష్ హయాం నుంచే ప్రత్యేక చట్టాలున్నాయని, వాటిని కాపాడటం కూడా కాంగ్రెస్, బీజేపీలకు చేతకావడంలేదన్నారు. దేశంలో గుణాత్మక జాతీయ రాజకీయాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారంటే దళిత, గిరిజనులపై దాడులు కూడా ప్రధాన కారణమని హరీశ్‌రావు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకుని న్యాయస్థానాలు వ్యవహరించాలన్నారు. పోలీసులతోనే, బలప్రయోగంతోనే దళితులను అణచి వేయాలని చూస్తే ఫలితం ఉండదన్నారు. -
అన్నదాతకు అండగా ఉంటాం
సాక్షి, సిద్దిపేట: ‘అయ్యా.. నాకున్న ఎకరంలో వరి సాగుచేశా. నీరు సరిపోకపోయినా వరుస తడులు పెట్టా. ఇప్పటి వరకు రూ.25 వేల పెట్టుబడి అయ్యింది. మాయదారి వర్షం వచ్చి మమ్ముల్ని నట్టేట ముంచింది. వడ్లన్నీ రాలిపోయినయి. మీరే దిక్కు..’అంటూ సిద్దిపేట అర్బన్ మండలం బక్రిచప్యాల గ్రామానికి చెందిన రైతు బోనాల దర్గయ్య రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ముందు కన్నీటిపర్యంతమయ్యారు. దీనిపై స్పందించిన మంత్రి.. ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సిద్డిపేట జిల్లాలో వడగండ్ల వానతో దెబ్బతిన్న వరి, మొక్కజొన్నచేలు, కూరగాయలు, మామిడి తోటలను సోమవారం హరీశ్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమకు జరిగిన నష్టాన్ని ఆయనకు వివరించారు. పంట చేతికొచ్చే దశలో వడగండ్ల వాన కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని మంత్రి తెలిపారు. వారిని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌తో ఇప్పటికే చర్చించామన్నారు. సీఎం సైతం సానుకూలంగా ఉన్నారని.. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. వీలైనంత త్వరగా రైతులకు సాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పంట నష్టంపై పూర్తి స్థాయి సమాచార సేకరణ కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి బాధ్యతలు అప్పగించామని చెప్పారు. ఈలోపే పంటనష్టాన్ని అంచనా వేసేలా బీమా కంపెనీలను ఆదేశించామని వెల్లడించారు. ప్రతీ సెంటు పంట నష్టాన్ని కూడా లెక్కలోకి తీసుకుని రైతులను ఆదుకుంటామన్నారు. మంత్రి వెంట సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు ఉన్నారు. -
‘కొండపోచమ్మ సాగర్’ ఓ రికార్డు
గజ్వేల్: ‘గతంలో ఒక్క టీఎంసీ ప్రాజెక్టు కట్టాలన్నా పది, పదిహేనేళ్ల కాలం పట్టేది. అయినా అవి పూర్తవుతాయో లేదో తెలియని దుస్థితి. ఇప్పుడు ఏడాదిలోనే భూ సేకరణతోపాటు పనులు పూర్తి చేసి నీళ్లు అందించబోతున్న ప్రాజెక్టుగా కొండపోచమ్మ సాగర్ దేశంలోనే అరుదైన రికార్డును సొంతం చేసుకోబోతోంది’అని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో నిర్మిస్తున్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ పనులు, మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే లైన్ పనులను ఆదివారం పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ ద్వారా 2.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నామన్నారు. దీని ద్వారా సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంతోపాటు మేడ్చల్, యాదాద్రి జిల్లాలకు ప్రయోజనం కలగనుందని చెప్పారు. హైదరాబాద్‌కు తాగు నీటిని సరఫరా చేసేందుకూ ఈ ప్రాజెక్టును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. కాలువల పనులకు సంబంధించి వారం రోజుల్లో టెండర్లను పిలిచి పను లను ప్రారంభిస్తామన్నారు. గజ్వేల్ మండలం అక్కారం వద్ద కొండపోచమ్మ సాగర్‌కు నీటిని అందించే పంప్ హౌస్ పనులను వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 3.4 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు జరగాల్సి ఉన్నా.. 86.5 లక్షల క్యూబిక్ మీటర్ల పనులే జరిగాయని, మిగతా పనులు వేగంగా చేపట్టాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. భూ సేకరణ ప్రక్రియ 99 శాతం పూర్తయిందన్నారు. రైతుల్లో అపోహలు సృష్టించి భూములు ఇవ్వకుండా చేయడానికి జేఏసీ చైర్మన్ కోదండరాం, కాంగ్రెస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో ప్రజలు సహకరిస్తున్నారన్నారు. వచ్చే జనవరి నాటికి గజ్వేల్‌కు రైలు.. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే లైన్ పనులను 2019 జనవరి నాటికి పూర్తి చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ రైల్వే లైన్ నిర్మాణ పనులను ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సిద్దిపేట, మెదక్ కలెక్టర్లు వెంకట్రామిరెడ్డి, ధర్మారెడ్డి, ‘గడా’ఓఎస్డీ హన్మంతరావు, రైల్వేశాఖ చీఫ్ ఇంజనీర్ అతుల్ కంకనే, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ సుబ్రహ్మణ్యంతో కలిసి పరిశీలించారు. గతేడాది ఈ లైన్ నిర్మాణానికి కేంద్రం రూ.60 కోట్లు ఖర్చు చేయగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద మూడో వంతు భరిస్తోందన్నారు. గజ్వేల్ వరకు లైన్ పూర్తయితే ఈ ప్రాంత రైతులకు, వ్యాపారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. రైల్వేలైన్ నిర్మాణానికి అవరోధంగా పరిణమించిన విద్యుత్ స్తంభాల షిఫ్టింగ్, బ్రిడ్జీల నిర్మాణం తదితర అంశాలపై ఆదేశాలిస్తూ ముందుకు సాగారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ మడుపు భూంరెడ్డి, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తూంకుంట నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాళేశ్వరం.. తెలంగాణకు వరం
మహదేవపూర్/ మంథని: తెలంగాణ రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరమని, సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అన్నారు. శుక్రవారం మంత్రి హరీశ్‌రావుతో కలసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, పెద్దపల్లి జిల్లా సిరిపురం వద్ద నిర్మిస్తున్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీ పనులను ఆయన పరిశీలించారు. అత్యాధునిక పద్ధతిలో నిర్మిస్తున్న ‘క్రష్‌గేట్ల’నిర్మాణ పనులను చూసి ఆయన ఆశ్చర్యపోయారు. మేడిగడ్డ వ్యూ పాయింట్ నుంచి ఇటు తెలంగాణ వైపు, అటు మహారాష్ట్ర వైపు జరుగుతున్న బ్యారేజీ పనులను తిలకించారు. వ్యూపాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సందర్శించారు. ప్రాజెక్టు పూర్తి సమాచారాన్ని మంత్రి హరీశ్‌రావు మ్యాపులో చూపుతూ వివరించారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులను చూసిన తర్వాత సంభ్రమాశ్చర్యానికిలోనైన సోరెన్ తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అత్యంత వేగంగా నిర్మాణమవుతున్న ప్రాజెక్టు బహుశా ప్రపంచంలో ఇదే మొదటిదని పేర్కొన్నారు. ప్రాజెక్టుపై పూర్తి అవగాహన కలిగి ఉన్న మంత్రి హరీశ్‌రావును, ఇంజనీర్లను అభినందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం, లక్ష్యం నిర్దేశించుకొని పనులు చేపట్టడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శమన్నారు. జూలైలో సాగునీటిని పారిస్తాం: హరీశ్ అనుకున్న లక్ష్యానికి జూన్ లేదా జూలై నాటికి సాగు నీటిని పారిస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇందుకోసం బ్యారేజీలు, పంపుహౌస్, సబ్స్టేషన్ల నిర్మాణ పనులు సమాంతరంగా చేయాలని అధికారులను ఆదేశించారు. మేడిగడ్డ వద్ద 5,500, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద సుమారు నాలుగు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని జరుగుతోందని తెలిపారు. పంపుహౌస్‌ల పనుల వేగం మరింత పెంచాలని.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రధాన పంపుహౌస్ పూర్తయితేనే బ్యారేజీలు, మిగతా పంపుహౌస్‌లకు నీరు చేరుతుందని, ఇందుకోసం లిఫ్ట్ ఇరిగేషన్ అడ్వయిజర్ పెంటారెడ్డి వారంవారం విజిట్ చేసేలా ఆదేశించినట్లు తెలిపారు. చైనా నుంచి స్రైరస్ కేసింగ్ గేట్లు చేరాయని, మేడిగడ్డ వద్ద 85, అన్నారం 66, సుందిళ్ల వద్ద 74 గేట్లను బిగిస్తామని ఆయన వివరించారు. ఎల్అండ్టీ కంపెనీ వారు జపాన్ నుంచి గేట్ల తయారీ మిషన్ తెప్పించుకున్నారని.. పనుల్లో నాణ్యత, వేగం పెరుగుతుందన్నారు. ఒక్కో గేటు 15 మీటర్ల పొడవులో 70 టన్నుల బరువు ఉం టుందని చెప్పారు. అటవీ ప్రాంతంలో 12 కిలో మీటర్ల మేర గ్రావిటీ కెనాల్ పనులు జరుగుతున్నాయని, కోటి 80 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనికి గాను కోటి 30 లక్షలు పూర్తయిందని, మరో 50 లక్షలు మాత్రమే మిగి లిందని హరీశ్ తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ డిసెంబర్ నాటికి పూర్తయినా.. అన్నారం, సుందిళ్ల మాత్రం జూలై నెలలో కచ్చితంగా పూర్తి చేస్తామన్నారు. -
కందుల కొనుగోళ్లతో వెయ్యి కోట్ల భారం
సాక్షి, హైదరాబాద్: కంది కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపడంతో రాష్ట్రంపై రూ.వెయ్యి కోట్లకుపైగా భారం పడిందని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధ వారం శాసన మండలి ఆవరణలో ఆయన వ్యవసాయ మార్కెటింగ్ అధికారులతో సమీక్షించారు. కందుల సేకరణలో కేంద్ర వైఖరి తెలంగాణ రైతుల ప్రయోజనాలకు నష్టకరమని హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కంది రైతులను ఆదుకోవాలంటూ కేంద్రానికి లేఖలు రాసినా.. నేరుగా కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందన్నారు. రూ.410 కోట్ల విలువ చేసే 75,300 టన్నుల కంది సేకరణకే కేంద్రం అంగీకరించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,450 చొప్పున 1.84 లక్షల టన్నుల కందులను కొనుగోలు చేసిందని తెలిపారు. దాంతో రాష్ట్రంపై రూ.వెయ్యి కోట్ల వరకు భారం పడిందని చెప్పారు. రైతులకు నాఫెడ్ నుంచి రూ.183.86 కోట్లు, మార్క్‌ఫెడ్, హాకా వంటి ఏజెన్సీల నుంచి రూ.52.46 కోట్లు రావాల్సి ఉందని.. ఈ బకాయిలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శనగ కొనుగోళ్లు ముమ్మరం.. శనగ కొనుగోళ్లు, చెల్లింపులపైనా హరీశ్‌రావు సమీక్షించారు. 50 వేల టన్నుల శనగ సేకరణకు కేంద్రం అనుమతించిందని.. 28 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 26 వేల టన్నుల శనగలను నాఫెడ్ కొనుగోలు చేసిం దన్నారు. ఇందుకు రైతులకు చెల్లించాల్సిన రూ.111 కోట్లు వెంటనే విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ముఖ్య కార్యదర్శి పార్థసారథి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. -
కాళేశ్వరానికి ఇరుసు మల్లన్నసాగర్
సిద్దిపేటజోన్: కాళేశ్వరం ప్రాజెక్టుకు మల్లన్నసాగర్ ఇరుసు లాంటిదని, ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్యాకేజీ 12 పనులను సోమవారం అర్ధరాత్రి సుమారు 3 గంటల పాటు మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. సిద్దిపేట మండలం వెంకటాపూర్ నుంచి తొగుట మండలం తుక్కాపూర్ వరకు సొరంగంలోనే కలియ తిరిగారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మల్లన్నసాగర్ సొరంగం, పంప్‌హౌస్ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఓ వైపు మల్లన్నసాగర్.. మరోవైపు కాళేశ్వరం మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అవసరమైతే లేబర్ సంఖ్యను పెంచాలని అధికారులకు సూచించారు. సొరంగం దాదాపు 17 కిలోమీటర్లు ఉండగా.. పనులు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయని, ఇప్పటికే 8 కిలోమీటర్లకు పైగా సిమెంట్ లైనింగ్ పూర్తయినట్టు చెప్పారు. సిద్దిపేట జిల్లా కొండ పోచమ్మసాగర్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్, యాదాద్రి జిల్లాలోని గందమల్ల, బస్వాపూర్, నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని శామీర్‌పేటకు మల్లన్నసాగర్ రిజర్వాయర్ ఫలాలు అందనున్నాయని మంత్రి తెలిపారు. వారం, పది రోజుల్లో పంప్‌హౌస్ పనులు, సర్జిఫుల్ గేట్లు పూర్తి కానున్నట్టు పేర్కొన్నారు. ఒకవైపు మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులు జరుగుతుండగా.. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటిని సొరంగం, పంప్‌హౌస్‌ల ద్వారా కాల్వలు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలకు నీరందించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. అత్యంత ఆధునిక టెక్నాలజీ కలిగిన భారీ మోటార్లు విదేశాల నుంచి తీసుకొచ్చి.. పనులు చేపడుతున్నట్టు తెలిపారు. అనంతరం సొరంగంలో పనులు నిర్వహిస్తున్న కార్మికులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. ఇక్కడ పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులకు గుర్తింపుకార్డులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది ఉన్నారు. -
కాళేశ్వరం సొరంగాలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలను పడావు భూములకు తరలించే లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు భారీ సొరంగాల నిర్మాణాలన్నీ తుది దశకు చేరుకున్నాయి. మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి తరలించే నీరు దిగువన మల్లన్నసాగర్ వరకు ఆటంకాలు లేకుండా ప్రవాహించేలా సొరంగాలను నీటి పారుదల శాఖ సిద్ధం చేసింది. వివిధ ప్యాకేజీల పరిధిలో 94.27 కిలోమీటర్ల మేర సొరంగాలు తవ్వాల్సి ఉండగా ఇప్పటికే 89.85 కిలోమీటర్ల నిర్మాణాలు (90 శాతం పనులు) పూర్తయ్యాయి. మిగిలిన పనులు మరో 2 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తం పనులు పూర్తయితే సాగునీటి రంగంలో ఆసియాలోనే అత్యంత పొడవైన టన్నెల్ గల ప్రాజెక్టుగా కాళేశ్వరం చరిత్రకెక్కనుంది. జూన్‌లో వెట్‌రన్! ఈ 149 కిలోమీటర్ల నిర్మాణాల్లో ప్యాకేజీ–6 నుంచి ప్యాకేజీ–12 వరకు టన్నెళ్ల నిర్మాణమే 94.27 కి.మీ. మేర ఉంది. ఇందులో ఇప్పటికే 89.85 కి.మీ. టన్నెల్ నిర్మాణం పూర్తయింది. మరో 4.42 కి.మీ. మాత్రమే మిగిలింది. ఇందులో ప్యాకేజీ–7 పరిధిలో 22.48 కి.మీ. ఉండగా, 22.36 కి.మీ. పని పూర్తయింది. ప్యాకేజీ–6లోని మొత్తం 19.06 కి.మీ. నిర్మాణం పూర్తయింది. మిడ్‌మానేరు దిగువన ప్యాకేజీలు–10, 11, 12ల పరిధిలో 32.42 కి.మీ. టన్నెల్ తవ్వాల్సి ఉండగా 31.54 కి.మీ. తవ్వకం పూర్తయింది. వచ్చే నెలాఖరుకు మిగతా పనులు పూర్తి కానున్నాయి. టన్నెళ్ల లైనింగ్ పనులు మాత్రం ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. 94.27 కి.మీ.లలో 53.78 కి.మీ పనులు పూర్తయ్యాయి. మిగిలిన 40 కి.మీ మేర పనులు మే చివరికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే జూన్ నాటికి పనులన్నీ పూర్తి చేసి వెట్‌రన్‌కు సిద్ధంగా ఉంచేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. జూన్ నుంచి కనిష్టంగా రోజుకు ఒక టీఎంసీ చొప్పున 90 టీఎంసీల నీటిని నిర్ణీత ఆయకట్టుకు తరలించేలా ప్రణాళికలు వేస్తున్నారు. రూ.80 వేల కోట్లతో.. కాళేశ్వరం ఎత్తిపోతలను రూ.80,400 కోట్లతో చేపట్టగా ఇప్పటివరకు రూ.60,922 కోట్ల పనులు ప్రారంభమయ్యాయి. వాటిలో ఇప్పటివరకు రూ.22,875 కోట్ల పనులు పూర్తయినట్లు శనివారం శాసనమండలిలో సమర్పించిన ప్రగతి నివేదికలో నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. వివిధ పనుల ప్రగతిని నివేదికలో పొందుపరిచారు. ఆ ప్రకారం.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌజ్‌ల పనులు 50 శాతానికి పైగా పూర్తయ్యాయి. ఇందులో అన్నారం బ్యారేజీ పనులు 67 శాతం పూర్తయ్యాయి. ఈ 3 బ్యారేజీల ద్వారా ఎల్లంపల్లికి నీరు తరలించి అటు నుంచి మల్లన్నసాగర్ వరకు తీసుకెళ్లాలంటే అప్రోచ్ చానళ్లు, లింక్ కెనాల్స్, గ్రావిటీ కెనాల్స్, టన్నెళ్లు నిర్మించాలి. మొత్తంగా 149 కిలోమీటర్ల మేర కెనాల్స్, టన్నెళ్ల నిర్మాణం చేయాల్సి ఉంది. -
‘లండన్’ మనసు దోచిన ‘గొల్లభామ’
సాక్షి, సిద్దిపేట: చేనేత కార్మికుల ప్రతిభకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. సిద్దిపేట మగ్గాలపై నేసిన గొల్లభామ డిజైన్లతో ఉన్న చీరలను లండన్ మగువలు, ప్రవాస భారతీయులు మెచ్చుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని లండన్‌లో వివిధ దేశాల కళాకృతులు, హస్తకళల ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో గొల్లభామ చీరలను ఉంచారు. ఈ ప్రదర్శనను ప్రవాస భారతీయ సంతతికి చెందిన లండన్ ఎంపీలు సీమా మల్హోత్రా, వీరేంద్రశర్మతో పాటు అక్కడి ప్రజాప్రతినిధులు, మహిళలు గొల్లభామ చీరలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మల్హోత్రా, వీరేంద్రశర్మ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే గొల్లభామ చీరల స్టాల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు ప్రమోద్‌గౌడ్ అంతటి మాట్లాడుతూ, తెలంగాణ చేనేత కార్మికులు ప్రపంచ దేశాలు అబ్బురపడేలా చీరలు తయారు చేస్తున్నారని కితాబిచ్చారు. రాష్ట్ర నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రోత్సాహంతో గొల్లభామ చీరల ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. -
రాష్ట్రంలో నేరాలు తగ్గాయి
సాక్షి, హైదరాబాద్: నేరగాళ్ల కదలికలపై పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో దృష్టి సారించడం, పట్టుబడిన వారికి శిక్షలు పడేలా శ్రద్ధ తీసుకోవటంతో రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని సీఎం కేసీఆర్ చెప్పారు. పదేపదే నేరాలకు పాల్పడే వారికి కళ్లెం పడిందని, కానీ ఇందులో పాక్షికంగానే విజయం సాధించినందున పూర్తిగా నిరోధించేందుకు ఇటీవలే ఉన్నతాధికారులతో సమీక్ష కూడా నిర్వహించినట్లు సోమవారం శాసనసభలో వెల్లడించారు. నేరాలు జరిగినపుడు బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్న నిర్ణయంతో ఖాళీగా ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పోస్టులనూ భర్తీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. పీపీల నియామకం కీలక అంశం కాబట్టి ఇందుకు సంబంధించి త్వరలో పూర్తిస్థాయిలో సమీక్షించనున్నట్లు తెలిపారు. వెరసి నేరాల అదుపులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రతి గ్రామంలో కంటి పరీక్ష శిబిరాలు ప్రతి గ్రామంలో కంటి పరీక్ష శిబిరాలు ఏర్పాటు చేసి కంటి చూపు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి కళ్లజోళ్లు పంపిణీ చేయనున్నట్లు వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర విశ్వజనీన నేత్ర సర్వే చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల సహకారం తీసుకుంటామని, అవసరమైన చోట్ల ప్రైవేటు వైద్యులనూ వినియోగించుకుంటామని చెప్పారు. ఆస్పత్రుల్లోని అన్ని రకాల సిబ్బంది ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ‘హైదరాబాద్‌లోని ప్రభుత్వ నిజామియా టిబ్బి కళాశాలలో 75, ప్రభుత్వ యునానీ డిస్పెన్సరీలో 178, ఎన్ఆర్హెచ్ఎం ప్రభుత్వ యునానీ డిస్పెన్సరీల్లో 57 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు ఆయుష్, ఇతర విభాగాల్లోని ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం’అని మంత్రి చెప్పారు. ‘మహా’తరహాలో నీరా ఉత్పత్తి: పద్మారావు నీరా ఉత్పత్తి, మార్కెటింగ్‌లో మహారాష్ట్ర తరహా విధానం అనుసరించాలని నిర్ణయించినట్లు అబ్కారీ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. ఇందుకోసం మహారాష్ట్రలోని దీహెన్ ప్రాంతం లో ఇటీవలే పర్యటించి అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేశామన్నారు. హరితహారం కార్యక్రమంలో రాష్ట్రంలో 1.70 కోట్ల తాటి, ఈత మొక్కలు నాటామని.. మరో 5 కోట్లు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా, నల్లగొండ జిల్లాలో 3 రోజుల క్రితం రిజర్వాయర్‌లో మునిగి మృతి చెందిన ఐదుగురు బాలల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అధికార పార్టీ సభ్యుడు రవీంద్రకుమార్ కోరారు. అసంపూర్తిగా పనులు చేసిన కాంట్రాక్టర్‌పై చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకతీతంగా నిర్మాణం: హరీశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మండలాలు సహా కొన్ని పాత మండలాల్లోనూ కొత్త గిడ్డంగులు నిర్మించనున్నట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. మొత్తంగా 164 గిడ్డంగులు నిర్మించాలని నిర్ణయించామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆయా ప్రాంతాల్లో డిమాండ్, ఎంత సామర్థ్యంతో వాటిని నిర్మించాలో అధ్యయనం చేసి నివేదికివ్వా లని నాబార్డును కోరామన్నారు. నివేదిక రాగానే రాజకీయాలకతీతంగా నిర్మాణం చేపడతామని వెల్లడించారు. -
సాగుకు 24 గంటల కరెంటు వద్దు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరా నిలిపివేసి, పాత పద్ధతిలో 12 గంటల సరఫరా పునరుద్ధరించాలని అధికార పార్టీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు శాసనసభలో ప్రభుత్వాన్ని కోరారు. భూగర్భజలం తగ్గిపోతున్నందున రైతులను ఆదుకోవాలంటే దాన్ని మార్పు చేయటమే దిక్కని పేర్కొన్నారు. త్వరలో వరి పంట చేతికొచ్చే తరుణంలో 24 గంటల కరెంటు వల్ల అవి ఎండిపోయే పరిస్థితి ఉందని, అవకాశం ఉన్నవారు ఎక్కువగా నీటిని తోడుకుంటున్నందున భూగర్భజలం అడుగంటిపోయే ప్రమాదం నెలకొందన్నారు. గతంలో ఇదే విషయాన్ని తాను మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకురాగా, గ్రామ పంచాయతీలతో తీర్మానం చేయించి పట్టుకొస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. దీంతో తన నియోజకవర్గం పరిధిలో ఆ మేరకు తీర్మానాలు చేయించినట్టు వెల్లడించారు. రైతుల లబ్ధిని దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన జీరో అవర్‌లో ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటామని సభలో ఆయనకు మంత్రి హరీశ్‌రావు సమాధానమిచ్చారు. మా ప్రశ్నలను మంత్రులు వినడం లేదు: బీజేపీ ఆరోపణ సోమవారం శాసనసభ జీరో అవర్‌లో చిన్న గందరగోళం నెలకొంది. జీరో అవర్‌లో సభ్యులు లేవనెత్తే అంశాలను ఏ మంత్రి నోట్ చేసుకుంటున్నారో తెలియక స్పీకర్ సహా సభ్యులు అయోమయానికి గురయ్యారు. బీజేపీ సభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ విద్యాసంస్థల్లో సంస్కృతం, అరబిక్, ఫ్రెంచ్ భాషలను క్రమంగా ఎత్తేసేందుకు ప్రభుత్వం చూస్తోందని, ఇది సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఆ సమయంలో విద్యాశాఖను పర్యవేక్షించే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సభలో లేరు. దీంతో ఆ అంశాన్ని ఏ మంత్రి నోట్ చేసుకున్నారో తెలియక స్పీకర్ మధుసూదనచారి ‘ఎవరు నోట్ చేసుకుంటున్నారు’అని ప్రశ్నించారు. కానీ వెంటనే ఎవరూ లేవలేదు. ఇంతలో హరీశ్‌రావు లేచి సమాధానం చెప్పేలోపు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి లేచి ఏదో అన్నారు. దీంతో అసలు మా సభ్యుడు లేవనెత్తిన అంశమేంటో కూడా మంత్రులు గుర్తించడం లేదని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్య, స్పాట్ వాల్యూయేషన్ గురించి కదా అంటూ ఇంద్రకరణ్‌రెడ్డి అనేసరికి, అయితే సభ్యుడి మాటలు వినలేదంటూ బీజేపీ సభ్యులు గట్టిగా అరిచారు. దీంతో మంత్రి హరీశ్‌రావు లేచి విషయాన్ని నోట్ చేసుకున్నానని, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. -
ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్లకు ఊరట
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీలలో బ్యాంకు గ్యారంటీలను మంత్రి హరీశ్‌రావు సడలించారు. టర్నోవర్‌ను బట్టి బ్యాంకు గ్యారంటీలను సమర్పించాలన్న నిబంధనలపై ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్ల అభ్యంతరాలకు మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు సానుకూలంగా స్పందించారు. గురువారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన సమావేశంలో జిన్నింగ్ మిల్లులు, రైస్ మిల్లుల యజమానుల సంఘాల ప్రతినిధులతో ఆయన చర్చించారు. రూ.కోటి టర్నోవర్ మేరకు లావాదేవీలు జరిపే ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్లు రూ.50 వేల బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని, రూ. కోటికి పైగా టర్నోవర్ ఉంటే రూ.లక్ష, రూ.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉంటే రూ.2 లక్షలు బ్యాంకు గ్యారంటీ సమర్పించాలని మంత్రి మినహాయింపులు ఇచ్చారు. అయితే బ్యాంకు గ్యారంటీ జీవోకు వ్యతిరేకంగా కోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకోవాలని కోరగా.. అందుకు ట్రేడర్లు, ఏజెంట్లు అంగీకరించారు. అధిక కమీషన్లు వసూలు చేస్తే చర్యలు నిబంధనలకు విరుద్ధంగా కొన్ని వ్యవసాయ మార్కెట్లలో ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్లు రైతులను ఇబ్బందుల పాల్జేస్తున్నట్టు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. నిర్ధారించిన కమీషన్ కన్నా ఎక్కువ వసూలు చేస్తూ పీడిస్తున్నట్టు తెలిపారు. మరికొన్ని చోట్ల గుమస్తా మామూలు పేరిట కూడా వసూళ్లు జరుగుతున్నట్టు చెప్పారు. ఈ ధోరణికి స్వస్తి చెప్పాలని మంత్రి కోరారు. మంత్రి ఈటల రాజేందర్‌పై కొందరు కాంగ్రెస్ నాయకులు చేసిన అవినీతి ఆరోపణలు తనకు బాధ కలిగించాయని అన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టలేకపోయారని రైస్ మిల్లర్లను ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే తమకు మంచి రోజులు వచ్చాయని రైస్ మిల్లర్ల సంఘం నాయకులు అన్నారు. ముఖ్యమంత్రి అనుమతిస్తే త్వరలోనే దాదాపు లక్ష మందితో ఒక భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనిపై తాను సీఎంతో మాట్లాడతానని, హైదరాబాద్‌లో సభ నిర్వహించాలని హరీశ్‌రావు కోరారు. రూ.వెయ్యి కోట్లతో కందుల కొనుగోలు... కంది రైతుల బకాయిల చెల్లింపునకు వెంటనే చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్, హాకా, నాఫెడ్ సంస్థలను హరీశ్‌రావు ఆదేశించారు. కందులు, మినుములు, శనగలు, ఎర్రజొన్నల కొనుగోళ్లు, చెల్లింపులపై మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్‌రావు సమీక్షించారు. రాష్ట్రంలో 2.58 లక్షల మెట్రిక్ టన్నుల కందులను ప్రభుత్వం సేకరించిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇందులో కేంద్రం ఇచ్చిన పరిమితి 75,300 టన్నులన్నారు. 1.83 లక్షల టన్నుల కందులను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. ఇప్పటివరకు రూ.600 కోట్లు చెల్లించామని, మరో రూ.400 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. మార్క్‌ఫెడ్, నాఫెడ్, హాకా తదితర ఏజెన్సీల పనితీరుపై హరీశ్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. -
టీచర్ల భాగస్వామ్యం అవసరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాభివృద్ధిలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం అవసరమని నీటి పారుదల మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో (టీయూటీఎఫ్) ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభలు – విద్యా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘పాఠశాల విద్య – సంస్కరణ’లు అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి తొలి అడుగులు వేసింది తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్) అని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో టీయూటీఎఫ్ వీరోచితంగా పాల్గొందని అందుకే ఆ సంఘం మీద ప్రభుత్వానికి ఎనలేని గౌరవమన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ హెల్త్‌కార్డులు అందజేశామన్నారు. ఉపాధ్యాయ నియామకాలు – బదిలీలు జూన్ లోపల పూర్తి చేసేలా విద్యామంత్రి చర్యలు చేపడుతున్నారన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంపై సమస్యల పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయితే అది పార్లమెంట్లో చట్టం కావాల్సి ఉందన్నారు. 60 ఏళ్ల పరిష్కారం కానీ తాగు, సాగునీరు, విద్యుత్ వంటి సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపుతున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం సాధించని విధంగా 18 శాతం వృద్ధి రేటును ఒక తెలంగాణ సాధించిందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతాయి: ఈటల రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూళ్లు ఎన్ని పెట్టినా ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతాయని రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితులు ఆశాజనకంగా లేకపోయినా అవి మూతపడకుండా ఉండేందుకు టీయూటీఎఫ్ చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు. ఈ సదస్సు ద్వారా వచ్చిన డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వి. శ్రీనివాస్ గౌడ్, ఎ.రవీందర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, టీయూటీఎఫ్ అధ్యక్ష – ప్రధాన కార్యదర్శులు సి. స్వామిరెడ్డి, డి. మల్లారెడ్డి, ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ చైర్మన్ కారం రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హరీశ్‌రావుకు కోపమొచ్చింది
సాక్షి, జనగామ: తన ప్రసంగానికి మధ్యమధ్యలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆటంకం కల్పించడంతో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు కోపం వచ్చింది. దీంతో ఇక తాను మాట్లాడలేనంటూ మైక్‌ను విసిరివేసి మధ్యలోనే వెళ్లిపోయారు. జనగామ జిల్లా లోని నర్మెట మండలం బొమ్మకూరులో నిర్మించిన జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్–3 ద్వారా నిర్మించిన పంప్‌హౌస్‌ను మంత్రి హరీశ్‌రావు శనివారం సాయంత్రం ప్రారంభించారు. పంప్‌హౌస్ నుంచి కన్నెబోయినగూడెం, లద్నూరు, తపాస్‌పల్లి రిజర్వాయర్లకు నీటిని విడుదల చేశారు. అనంతరం బొమ్మకూరులో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ సమయాభావం వల్ల మంత్రి హరీశ్‌రావు మాట్లాడతారని చెప్పి మైక్‌ను అందించారు. హరీశ్ ప్రసంగం మొదలు పెట్టినప్పటి నుంచి ఎమ్మెల్యే చీటికిమాటికి పక్కనున్న వాళ్లను పిలుస్తూ మాట్లాడారు. ముత్తిరెడ్డి సభలో చేస్తున్న హడావుడిని గమనిస్తున్న మంత్రి.. ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు. ఆయనవైపు చూస్తూ మాట్లాడవద్దని సైగ చేశారు. అయినప్పటికీ ముత్తిరెడ్డి సభకు దూరంగా ప్రజాప్రతినిధులను, పార్టీ శ్రేణులను పిలుస్తున్నారు. ముత్తిరెడ్డి వ్యవహారంతోపాటు పక్కనే ప్రారంభించిన పంప్‌హౌస్ మోటార్ల శబ్దంతో విసిగిపోయిన మంత్రి చేతిలోని మైక్‌ను విసిరివేశారు. వేదిక నుంచి బయటకు వెళ్తున్న హరీశ్‌రావును ఎమ్మెల్యే ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ఆగకుండా వెళ్లిపోయారు. దీంతో వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఆశ్చర్యపోయారు. -
నేతన్నకు సర్కారు భరోసా
దుబ్బాక: గత ప్రభుత్వాలు చేనేత రంగాన్ని పట్టించుకోలేదని, ఫలితంగా నేతన్నల ఆత్మహత్యలు పెరిగాయని ఐటీ, చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి చేనేత కార్మికులకు తమ ప్రభుత్వం భరోసానిస్తుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత సహకార సంఘాన్ని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలసి మంత్రి పరిశీలించారు. అందులో పని చేస్తున్న కార్మికుల జీవన స్థితిగతులపై ఆరా తీశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బడ్జెట్లో చేనేత రంగానికి రూ.1,200 కోట్లు కేటాయించి తమ ప్రభుత్వం చరిత్రలో నిలిచిందన్నారు. వరంగల్, సిరిసిల్ల జిల్లాల్లో చేనేత కార్మికులకోసం చేపడుతున్న అపెరల్, టెక్స్టైల్ పార్క్‌ల తరహాలో దుబ్బాకలో కూడా ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. నూలు, రసాయనాలు, ఇతర ముడిసరుకులను 50 శాతం సబ్సిడీపై చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తుందన్నారు. అలాగే చేనేత కార్మికులు ఉత్పత్తి చేస్తున్న వస్త్రాలకు ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. మరుగునపడుతున్న చేనేత వస్త్రాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి, నైపుణ్యాలను వెలికి తీయడానికే రాష్ట్ర ప్రభుత్వం చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి సమంతను నియమించిందన్నారు. రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేనేత, పవర్లూమ్లకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తోందన్నారు. ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని అక్కడున్న అధికారులకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు మంత్రి సూచించారు. దీంతో చేనేత కార్మికులకు పరోక్షంగా ఉపాధిని ఇచ్చినవాళ్లమవుతామన్నారు. దుబ్బాక చేనేతలకు రూ. 1.56 కోట్ల రుణాల మాఫీ దుబ్బాక సహకార సంఘంలో పనిచేస్తున్న చేనేత కార్మికులకు సంబంధించిన రూ. 1.56 కోట్ల రుణాలను ఎమ్మెల్యే రామలింగారెడ్డి కోరిక మేరకు మాఫీ చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. సిద్దిపేటలోని చేనేత కార్మికుల రుణాల విషయాన్ని మంత్రి హరీశ్‌రావు తన దృష్టికి తెచ్చారని, వారికి కూడా రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. చేనేతకు పూర్వ వైభవం తీసుకరావడానికి కోటి రూపాయల వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చేందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్మికులకు డబుల్ బెడ్రూం ఇళ్లను ఇచ్చే విషయాన్ని కూడా పరిశీలిస్తామని హామీనిచ్చారు. బిడ్డా బాగున్నావా.. మాది మీ ఊరే! కేటీఆర్‌ను ఆప్యాయంగా పలకరించిన వజ్రవ్వ దుబ్బాక టౌన్: ‘ఏం బిడ్డా మంచిగున్నవా.. చిన్నప్పుడెప్పుడో చూసిన.. చాన ఏండ్లయింది నిన్ను చూడక...మాదీ మీ వూరే చింతమడక. చిన్నప్పుడు మీ నాయన చంద్రశేఖర్‌రావుతో కలసి మీ బాయికాడ మోటకొట్టేటోళ్లం’అంటూ దుబ్బాకకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ను బ్యాగరి వజ్రవ్వ ఆప్యాయంగా పలకరించారు. దుబ్బాక చేనేత సహకార సంఘానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ను చూసి, ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద పనిచేసే వజ్రవ్వ అక్కడకు వెళ్లి పలకరించింది. మంత్రి ఆమె చెప్పిన విశేషాలను ఆసక్తిగా ఆలకించారు. ‘నాదీ చింతమడ్కనే.. లగ్గం అయి దుబ్బాకకు వచ్చిన. చిన్నప్పుడు మీ ఇంటివద్ద, బాయికాడ పనిచేసేదాన్ని’అంటూ వజ్రవ్వ జ్ఞాపకాలను నెమరువేసుకుంది. కేటీఆర్ ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని ‘పాణం ఎలా ఉంది? ఇప్పుడేం చేస్తున్నావు’అంటూ కుశలం అడిగారు. నాయన కేసీఆర్‌ను కలిపిస్తానంటూ చెప్పడంతో వజ్రవ్వ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. -
కందుల సేకరణలో కేంద్రం వివక్ష
సాక్షి, హైదరాబాద్: రైతాంగానికి మద్దతుధర కల్పించడంతో, కందుల సేకరణలో కేంద్రం తీరుపై మార్కెటింగ్ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. కందుల కొనుగోళ్లపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాసినా ఇంతవరకూ స్పందన లేదని, కేంద్రం వివక్ష చూపుతోందని అన్నారు. కందుల కొనుగోళ్లపై శనివారం సెక్రెటేరియట్‌లో సమీక్షించారు. ఇప్పటివరకు రూ.1,315 కోట్ల విలువ చేసే 24.13 లక్షల క్వింటాళ్ల కందులను తెలంగాణ ప్రభుత్వం సేకరించినట్టు తెలిపారు. దాదాపు మరో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల కందులు మార్కెట్‌కు వస్తున్నట్టు చెప్పారు. ఈసారి 2.51 లక్షల హెక్టార్లలో రైతులు కందిపంట వేశారని, కేవలం 75 వేల మెట్రిక్ టన్నుల సేకరణకే కేంద్రం అంగీకరించడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. కంది రైతుల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం రూ.600 కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిందన్నారు. వెంటనే బకాయిలు చెల్లించాలని మార్క్‌ఫెడ్, హాకా సంస్థలను మంత్రి కోరారు. గోడౌన్లు లేని 164 మండలాల్లో 5 ఎకరాల చొప్పున స్థలాన్ని కేటాయించాలని జిల్లా కలెక్టర్లకు లేఖలు రాయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆయా ప్రదేశాల్లో గోడౌన్ల వసతి డిమాండ్‌ను సరిగ్గా అంచనా వేయాలని కోరారు. దీనిపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని మంత్రి కోరారు. గోడౌన్లు మంజూరైనా భూసేకరణ పూర్తికాని ప్రాంతాల్లో , ప్రత్యామ్నాయస్థలాన్ని ఎంపిక చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులతో చర్చించాలని మార్కెటింగ్ అధికారులను హరీశ్‌రావు ఆదేశించారు. ప్రైవేట్ గోడౌన్లలో 4 లక్షల మెట్రిక్ టన్నుల సరుకులుండడంపట్ల మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలోని గోడౌన్లకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఖరీఫ్‌లో ఎరువులు, విత్తనాలను రైతులు నిల్వ చేసుకోవడానికి వీలుగా గోడౌన్ల నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. 9 కోల్డ్ స్టోరేజ్‌ల ఏర్పాటుకు కేసీఆర్ ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్రంలో వాటి ఏర్పాటుకు డిమాండ్ ఎక్కడున్నదో పరిశీలించాలని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్‌పై కేబినెట్ సబ్‌కమిటీ ఈ నెల 6న సమావేశం అవుతున్నందున నాబార్డు, మార్కెటింగ్, హార్టికల్చర్ సంస్థలు అధ్యయనం చేయాలని కోరారు. సమావేశంలో మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, జాయింట్ డైరెక్టర్లు లక్ష్మణుడు, మార్కెటింగ్ ఎస్ఈ ఉమామహేశ్వరరావు, జె.డి.రవికుమార్, వరంగల్ ఇన్చార్జ్ జె.డి.శ్రీనివాస్, మార్క్‌ఫెడ్, హాకా, నాబార్డు, వేర్ హౌసింగ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వచ్చే ఖరీఫ్‌కు గోదావరి నీళ్లు
సాక్షి, సిద్దిపేట: కరువుతో అల్లాడిన తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు అనుగుణంగా అధికారులు, కాంట్రాక్టర్లు అంకితభావంతో పనిచేసి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని నీటిపారుదుల శాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. వచ్చే ఖరీఫ్ నాటికి నిర్ధేశిత లక్ష్యం మేరకు గోదావరి జలాలను రైతులకు అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన 9,10,11,12 ప్యాకేజీ పనుల పురోగతిపై సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ అనంతగిరిసాగర్ రిజర్వాయర్ భూసేకరణను వేగంగా చేశారని, అలాగే టన్నెల్ లైనింగ్, పంప్‌హౌస్, సర్జిపుల్ పనుల వేగాన్ని పెంచాలని సూచించారు. అనంతగిరిసాగర్ రిజర్వాయర్ పనులను జూన్ నెలాఖరు వరకు పూర్తి చేస్తే దిగువన రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, అక్కడి నుండి కొండపోచమ్మసాగర్ వరకు గోదావరి నీటికి తరలించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. రంగనాయకసాగర్ రిజర్వాయర్ కట్ట నిర్మాణం పనుల నాణ్యతను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. మల్లన్నసాగర్ మెయిన్ కెనాల్ భూసేకరణలో మిగిలిన ఉన్న భూమిని త్వరగా సేకరించాలని అన్నారు. ఒకవైపు భూసేకరణ, మరోవైపు రిజర్వాయర్, కాల్వల నిర్మాణం పనులు వేగవంతం చేయాలన్నారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో చెట్లు, బోర్లు, బావులకు సంబంధించిన రైతులకు నష్టపరిహారాన్ని వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు వెంకట్రామిరెడ్డి, కృష్ణభాస్కర్, నీటిపారుదల శాఖ అధికారులు హరిరాం, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
పేదలకు కడుపు నిండా అన్నం
సాక్షి, సిద్దిపేట: పేదలకు కడుపు నిండా అన్నం పెట్టి దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయడమే ప్రభుత్వ లక్ష్యమని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లాలో పాస్‌పోర్టు సెం టర్ను ఆయన ప్రారంభించారు. అనంతరం పౌర సరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్‌తో కలిసి సివిల్ సప్లై కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. గతంలో పౌర సరఫరాల శాఖ నుంచి రైళ్లల్లో, ట్రక్కుల్లో బియ్యం అక్రమంగా తరలివెళ్లేవని, దీనిని అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్, కమిషనర్ సీవీ ఆనంద్ విప్లవాత్మక మార్పులు తెచ్చారని అభినందించారు. ఈ–పాస్ విధానం ద్వారా బినామీలు రేషన్ పొందకుండా చెక్ పెట్టామన్నారు. దీంతో ఏటా రూ.500 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదా అవుతోందని చెప్పారు. ఈ నిధులు పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టల్స్‌కు సన్న బియ్యం సరఫరాకు ఉపయోగపడుతున్నాయన్నారు. బియ్యం అక్రమ రవాణా అరికట్టడం కోసం కమాండ్ అండ్ కంట్రోల్ రూం ప్రారంభించామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఈ విధానం మంచి ఫలితాలను ఇచ్చిందని, ఇప్పుడు సిద్దిపేటలో ప్రారంభించామని, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తృతం చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 171 ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద 17 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, వాహనాలకు జీపీఎస్ అమర్చడంతో అక్రమాలను అడ్డుకట్ట వేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. డీలర్ల సమస్య సీఎం దృష్టికి.. రాష్ట్రంలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు డీలర్ల సంఘం నాయకులు దృష్టికి తెచ్చారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి హామీ ఇచ్చారు. డీలర్ల సమస్యను పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎం సమక్షంలో చర్చించి పరిష్కరిస్తామన్నారు. అక్రమ రవాణాకు చెక్: ఆనంద్ రాష్ట్రం నుంచి రేషన్ బియ్యం కాకినాడ మీదుగా ఇతర దేశాలకు అక్రమ రవాణా అవుతోందంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో బియ్యం పక్కదారి పట్టకుండా కమాండ్ అండ్ కంట్రోల్ విధానం ప్రారంభించామని రాష్ట్ర సివిల్ సప్లయ్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. జిల్లాలోని అన్ని మెయిన్ గోదాంలు, ఎంఎల్ఎస్ పాయింట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిజమైన లబ్ధిదారులకే బియ్యం సరఫరా చేయాలనే ఆలోచనతో రాష్ట్రవ్యాప్తంగా 17 వేల రేషన్ షాపుల్లో ఈ పాస్ విధానం అమలు చేస్తున్నామన్నారు. వేలిముద్రలు పడనివారి కోసం త్వరలో ఐరిస్ విధానం తీసుకొస్తామన్నారు. -
‘క్రాసింగ్’ దాటని ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులు రైల్వే క్రాసింగ్‌లో చిక్కుకుంటున్నాయి. ప్రాజెక్టుల పరిధిలోని కాల్వల నిర్మాణాలు రైల్వే లైన్లు దాటలేక చతికిలబడుతున్నాయి. తొమ్మిది ప్రాజెక్టుల పరిధిలో 32 రైల్వే క్రాసింగ్‌లు ప్రాజెక్టుల పనులకు అడ్డుగా నిలుస్తుండటంతో 4.74 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రభావితమవుతోంది. ఈ విషయమై రైల్వేతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. నిజానికి 11 సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో 60 చోట్ల రైల్వేకు సంబంధించిన అడ్డంకులున్నాయి. ఇందులో ఇప్పటికే 26 క్రాసింగ్‌ల పనులు పూర్తయ్యాయి. మరో 32 చోట్ల పూర్తయితే గానీ కాల్వల తవ్వకం, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం చేపట్టడం కుదరదు. ఇందులో నెట్టెంపాడు పరిధిలో 5, దేవాదులలో 6, ఎల్లంపల్లిలో 3, కాళేశ్వరంలో 3, ఉదయసముద్రం, వరద కాల్వ పరిధిలో రెండేసి చొప్పున క్రాసింగ్ సమస్యలున్నాయి. పెనుగంగ, కొమురం భీం పరిధిలోనూ ఇలాంటి సమస్యలే ఉన్నాయి. క్రాసింగ్లకు సంబంధించి నిధులను నీటి పారుదల శాఖ రైల్వేకు డిపాజిట్ చేస్తున్నా పనుల్లో వేగం మాత్రం కానరావడంలేదు. పనులు పట్టాలెక్కుతాయా..? రైల్వే క్రాసింగ్‌ల వల్ల ప్రభావితమవుతున్న 4,74,851 ఎకరాల ఆయకట్టులో 3,38,507 ఎకరాలకు ఈ ఏడాది చివరికి నీళ్లివ్వాలని నీటిపారుదల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు నెట్టెంపాడు, దేవాదుల, కొమురం భీం, ఉదయసముద్రం, ఎల్లంపల్లి పరిధిలో 18 చోట్ల రైల్వే క్రాసింగ్‌ల పనులు పూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్‌తో మంత్రి హరీశ్‌రావు ఇటీవల ప్రత్యేకంగా భేటీ అయ్యారు. క్రాసింగ్ ఇబ్బందులపై వివరణ ఇచ్చారు. ఈ ఏడాది ఖరీఫ్ మొదలయ్యే నాటికి 12 క్రాసింగ్ పనులు పూర్తి చేసి 90,709 ఎకరాలకు.. రబీ నాటికి మరో 2,47,798 ఎకరాలకు నీరిచ్చేలా పనులు పూర్తి చేయాలని కోరారు. మరో 14 క్రాసింగ్లను పూర్తి చేస్తే 1,36,344 ఎకరాలకు నీరందు తుందని చెప్పారు. దీనిపై రైల్వే జీఎం సానుకూలత వ్యక్తం చేసినా పనులు పట్టాలెక్కుతాయా? ఆయకట్టుకు నీరందుతుందా? వేచి చూడాలి. -
నిందితులపై వేటుకు వేళాయె..!
హసన్‌పర్తి: పదేళ్ల క్రితం ఎస్సారెస్పీ ప్రాజెక్టులో జరిగిన మెడికల్ స్కాంలో నిందితులపై వేటుకు రంగం సిద్ధమైంది. నిందితులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే, ఉద్యోగులను కాపాడేందుకు యూని యన్ నాయకులు రంగంలోకి దిగినట్లు సమాచారం. హైదరాబాద్‌కు వెళ్లి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును కలసి మాట్లాడినట్లు తెలిసింది. ప్రభుత్వం సీరియస్‌గా చర్యలు తీసుకున్నట్లయితే 26 మందిపై వేటు పడే అవకాశం ఉంది. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు చెందిన కొంత మంది ఉద్యోగులు 2008లో మెడికల్ బిల్లుల బాగోతానికి తెరలేపారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించి.. అక్కడ చికిత్స పొందినట్లు బిల్లులు పొందారు. ఒక్కొక్కరు రూ.89 వేల నుంచి రూ.3 లక్షలు వైద్యానికి ఖర్చయినట్లు బిల్లులు చూపించి డ్రా చేసుకున్నట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు అందగా.. ప్రాథమిక విచారణ చేపట్టిన సర్కార్ 2016లో 26 మంది ఉద్యోగులపై చర్యలకు ఆదేశించింది. డబ్బుల రికవరీ.. సస్పెన్షన్‌కు గురైన 26 మంది ఉద్యోగులు డ్రా చేసుకున్న డబ్బులను వడ్డీతో సహా చెల్లించారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆరు నెలల తర్వాత వారిని విధుల్లోకి తీసుకుంది.అయితే.. విచారణ మాత్రం యధావిధిగా కొనసాగించింది. వారికి పదోన్నతులు, ఇంక్రిమెంట్లను నిలిపివేసింది. విచారణ పూర్తి.. చర్యలకు ఆదేశం.. మెడికల్ స్కాంపై ఆరునెలల క్రితమే విచారణాధికారి పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఈ నివేదిక ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభు త్వం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. ఈ విష యం చింతగట్టు క్యాంప్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే నలుగురు ఉద్యోగ విరమణ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఇప్పటికే నలుగురు ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందారు. మరో ఇద్దరు ఉద్యోగులు నేడో, రేపో రిటైర్‌కానున్నారు. అయితే.. ఉద్యోగ విరమణ పొందిన వారికి ఇప్పటివరకు పెన్షన్ మంజూరు కాలేదు. ఇదిలా ఉండగా ఇందులో పెద్ద తలలు కూడా మెడికల్ బిల్లులు డ్రా చేసుకున్నప్పటికీ వారిపై చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ఎస్సారెస్పీ ఎస్ఈ శ్రీనివాన్రెడ్డిని వివరణ కోరడానికి ప్రయత్నించగా.. అందుబాటులో లేరు. -
‘పాలమూరు’కు నికరజలాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: దేశంలోనే అతిపెద్ద లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుగా రూపొందుతున్న పాలమూరు–రంగారెడ్డికి త్వరలోనే నికరజలాలు రావడం ఖాయమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ధీమా వ్యక్తంచేశారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో కేసు నడుస్తోందని త్వరలో కృష్ణాజలాల్లో తెలంగాణ వాటా అవార్డు పాస్‌కానుందని, తీర్పు రాష్ట్రానికి అనుకూలంగా వస్తుం దని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. తద్వారా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నికరజలాలు లభించనున్నాయని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో శనివారం స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ‘సాగునీటి సాధన సభ’లో మంత్రి హరీశ్‌రావు ప్రసంగించారు. ప్రస్తుతం వరద జలాల ఆధారంగా చేపడుతున్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నికర జలాల కేటాయింపు ఉంటుందన్నారు. అప్పుడు నీటి పంపింగ్ ప్రక్రియ 60 రోజుల నుంచి 120 రోజులకు పెరుగుతుందన్నారు. అయితే కోర్టులో కేసు ఉన్నందున బహిరంగంగా అన్ని విషయాలు చెప్పలేమన్నారు. కృష్ణాలో లభ్యమయ్యే నీటి ద్వారా ప్రప్రథమంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు లాభం చేకూరుతుందని వెల్లడించారు. అలాగే గోదావరి జలాల ద్వారా ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని మెజార్టీ భాగానికి నీరందిస్తామన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో వలసల జిల్లా పాలమూరును సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని హరీశ్‌రావు వివరించారు. ఉత్తమ్ క్షమాపణ చెప్పాలి రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి సాగునీరి వ్వడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ నేతలు కేసులు వేస్తూ అడ్డు పడుతున్నారని, అందుకు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల నల్లమల అటవీప్రాంతం దెబ్బతింటుందని కాంగ్రెస్ నేత హర్షవర్ధన్‌రెడ్డి గ్రీన్‌ట్రిబ్యునల్ లో కేసు వేశారని, ప్రాజెక్టు కింద భూములను సేకరించవద్దంటూ మరో కాంగ్రెస్ నేత హైకోర్టులో కేసు వేశారన్నారు. వీరి వల్లే ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయన్నారు. కేసును ఉపసంహరించుకుంటే కేవలం 3 నెలల్లోనే లైనింగ్‌కాల్వల పనులు చేపడతామన్నారు. కాంగ్రెస్ నేతలకు రైతులపై ప్రేమ ఉంటే కేసును ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలన్నారు. -
రైతు ముఖంలో చిరునవ్వు చూడాలి
సాక్షి, సిద్దిపేట: రైతు ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. దళారుల చేతిలో మోసపోకుండా.. పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. సోమవారం సిద్దిపేటలో రూ.8.5 కోట్ల వ్యయంతో నిర్మించిన మోడల్ రైతు బజారును మహిళా రైతు లచ్చవ్వతో జ్యోతి ప్రజ్వలనం చేయించారు. అలాగే.. సిద్దిపేట పోలీసు కమాండ్ కంట్రోల్ రూం భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రైతులకు సౌకర్యవంతంగా ఉండేలా అన్ని జిల్లాల్లో ఇలాంటి మోడల్ రైతు బజార్లు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. సిద్దిపేటలో నిర్మించిన మూడంతస్తుల భవనంలో 330 మంది రైతులు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు వీలుగా స్టాల్స్ ఏర్పాటు, ఇతర సౌకర్యాలు కల్పించామని చెప్పారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశామని మంత్రి తెలిపారు. -
ఎడారి చెలక మాగాణిగా మారింది
సాక్షి, హైదరాబాద్: ‘తలాపున పారుతుంది గోదారి..మన చేను, మన చెలక ఎడారి’అంటూ గతంలో తెలంగాణ రాష్ట్రం రాక ముందు పాడుకునే వాళ్ళమని, ఇప్పుడు ఆ పరిస్థితి మారి ‘మన చేను, మన చెలక మాగాణి’అని పాడుకోవాల్సిన రోజులు వచ్చాయని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముందు చూపుతో సాగునీటి రంగం అభివృద్ధికి మూడంచెల వ్యూహం అనుసరిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు అనేక సమస్యల కారణంగా గాలికి వదిలేసిన సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. నిర్థేశిత ఆయకట్టుకు త్వరితగతిన నీరందించడం, రాష్ట్ర అవసరాలమేరకు ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్ చేయడం, గత ప్రభుత్వాలు అటకెక్కించిన ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడం.. లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టు ఆయన వివరించారు. ఆదివారం హరీశ్‌రావు హైదరాబాద్‌లోని జలసౌధలో సాగునీటి శాఖ క్వాలిటీ కంట్రోల్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సాగునీటి రంగంలో నాణ్యత విషయంలో రాజీ పడవద్దని కోరారు. తనిఖీలు తప్పనిసరి.. సాగునీటి రంగంలో లక్ష్యాలు చేరుకోవడానికి, పనులు పర్యవేక్షించే ఫీల్డ్ ఇంజనీర్లతో పాటు, పనుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించే క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ల పాత్ర, ప్రాజెక్టుల డిజైన్లను రూపొందించే డిజైన్ ఇంజనీర్ల పాత్ర కీలకమని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పనులు త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు నాణ్యతలో రాజీ లేకుండా నిర్మించాల్సిన బాధ్యత ఇంజనీర్లపై ఉందన్నారు. ప్రాజెక్టులు పది కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడాలని అన్నారు. వెయ్యి సంవత్సరాల కిందట కాకతీయ రాజులు నిర్మించిన చెరువులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కాకతీయుల కాలంనాటి కట్టడాల్లో ఎక్కడా నాణ్యతలో రాజీ లేకుండా నిర్మించారని చెప్పారు. మనం కూడా కాకతీయుల వారసత్వాన్ని అంది పుచ్చుకోవాలని అన్నారు. తెలంగాణలో ఇప్పుడు నిర్మాణం అవుతున్న భారీ ప్రాజెక్టు నిర్మాణాలు ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు. ప్రాజెక్టుల్లో వాడే ఇసుక, స్టీల్, సిమెంట్ నాణ్యతకు క్వాలిటీ కంట్రోల్ విభాగానిదే బాధ్యత అన్నారు. డిజైన్ ప్రకారం కొలతలు, స్లోప్స్, లెవెల్స్ సరిగా ఉన్నాయా లేదా అని చూసే బాధ్యత డిజైన్ల విభాగంపైనే ఉందన్నారు. ప్రతి రోజూ క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది నిర్మాణాలవద్దకు వెళ్లి తనిఖీ చేయాలని కోరారు. భారీ కాంక్రీట్ పనులు జరుగుతున్న సైటుకు ఎక్కువ సార్లు వెళ్ళాలని సూచించారు. వివిధ సందర్భాల్లో పత్రికల్లో గానీ, ఇతరత్రా కానీ వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. భేటీలో ఇరిగేషన్ ఈఎన్సీలు మురళీధరరావు, నాగేందర్రావు, సీఈలు సునీల్, హరిరాం, ఖగేందర్‌రావు, సురేశ్ కుమార్, శ్యాం సుందర్, మధుసూదనరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం పనితీరును పర్యవేక్షించే బాధ్యతను ఈఎన్సీ నాగేందర్‌రావుకు అప్పగించారు. -
ఐదేళ్ల పిల్లాడు.. మంత్రిని మురిపించిండు!
సాక్షి, హైదరాబాద్: పిల్లాడికి పట్టుమని ఐదేళ్లు లేవు. కంఠస్తం చేసి చెబుతున్నవి పద్యాలు కావు. నిష్ణాతులకే అర్థం కాని ఇంజనీరింగ్ అంశాలు.. కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు రీ ఇంజనీరింగ్ చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ నుంచే గోదావరిని నీటిని ఎందుకు ఎత్తిపోస్తున్నారు.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఎన్ని టీఎంసీలతో నిర్మిస్తున్నారు. ఇలా అన్నీ ఫటాఫట్ చెప్పేస్తున్నాడు. బుడ్డోడి బుర్రకు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సహా ఇంజనీర్లంతా నివ్వెరపోయారు.. అబ్బురపడ్డారు.. పిల్లోడిని తెలంగాణ ఇరిగేషన్ శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు హరీశ్ ప్రకటించారు. యూకేజీ బుడ్డోడు.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లికి చెందిన హనుమంతరావు హైదరాబాద్ షాపూర్ నగర్లో ఓ ప్రైవేటు కంపెనీలో చిరుద్యోగి. కొడుకు ఐదేళ్ల నేహాల్ యూకేజీ చదవుతున్నాడు. ప్రాజెక్టుల గురించి ఇంట్లో నేహాల్ అనర్గళంగా మాట్లాడుతుండగా చూసిన స్థానిక టీఆర్ఎస్ నాయకుడొకరు ఈ విషయాన్ని మంత్రి హరీశ్‌రావు దృష్టికి చేరవేశారు. దీంతో అబ్బురపడ్డ మంత్రి ఆదివారం జలసౌధలో ఇంజనీర్లతో ఏర్పాటు చేసిన మేధోమధన సదస్సుకు నేహాల్‌ను పిలిపించారు. హరీశ్‌రావు, ఇంజనీర్ల సమక్షంలో నేహాల్ తన జ్ఞాపకశక్తిని ప్రదర్శించాడు. నిపుణులైన ఇంజనీర్లు కూడా గుర్తు పెట్టుకోని సమాచారాన్ని ఆశువుగా చెబుతుంటే హరీశ్ రావు, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, దేవీప్రసాద్, పలువురు చీఫ్ ఇంజనీర్లు, నీటిపారుదల రంగ నిపుణులు నివ్వెరపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టును తమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డ పాయింట్‌కు ఎందుకు మార్చారో, మహారాష్ట్ర అభ్యంతరాలు ఏమిటో, కేసీఆర్ దూరదృష్టి ఎలాంటిదో గణాంకాలతో సహా అలవోకగా వివరించాడు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సహా ఇతర ప్రాజెక్టుల గురించి కూడా చెప్పాడు. యూకేజీ చదువుతున్న నేహాల్ రాష్ట్ర ప్రాజెక్టులు, ఆయకట్టు, ఇతర ప్రయోజనాలపై 20 నిమిషాలపాటు ప్రసంగించిన తీరును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రెండేళ్ల వయసు నుంచే రికార్డులు సీఎం కేసీఆర్‌ను కలిస్తే ఏం మాట్లాడతావని నేహాల్‌ను హరీశ్ రావు అడగ్గా.. ‘శీలం సిద్దారెడ్డి నీటి పారుదల శాఖ మంత్రిగా ఉండగా మా గ్రామంలో ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామని చెప్పి నేటి వరకు కట్టించలేదు. గ్రామ రైతుల కోసం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించమని కోరతా’అని తెలిపాడు. నేహాల్ రెండేళ్ల వయసు నుంచే తన ప్రతిభతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్–2, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్–1, బొంబాయి సూపర్ కిడ్–2, భారత్ వరల్డ్ రికార్డ్–1, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్–1 అవార్డులను సాధించాడు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రతిభ అవార్డులు అందుకున్నాడు. నేహాల్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్‌లో యూకేజీ చదువుతున్నాడు. త్వరలోనే సీఎం వద్దకు.. నేహాల్ తెలివికి సంబురపడ్డ మంత్రి హరీశ్‌రావు.. పిల్లోడిని తెలంగాణ ఇరిగేషన్ శాఖ కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. నేహాల్ చదువుకయ్యే ఖర్చు మొత్తం ఇరిగేషన్ శాఖ భరిస్తుందని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ను కలవాలని నేహాల్ కోరగా, త్వరలోనే ఆ కోరిక నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. అలాగే నేహాల్‌తోపాటు ఆతని కుటుంబ సభ్యులను కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకువెళ్లి చూపాలని సీఈ హరిరామ్‌ను ఆదేశించారు. నేహాల్కు ఉజ్వల భవిష్యత్తు ఉందని హరీశ్ పేర్కొన్నారు. -
దళారులతో ‘మార్క్‌ఫెడ్ ’ చెట్టపట్టాల్
సాక్షి, హైదరాబాద్: కంది రైతులకు దక్కాల్సిన మద్దతు ధర దళారుల పాలవుతోంది. రైతు పేరు చెప్పి నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి వ్యాపారులు మోసం చేస్తున్నా మార్క్‌ఫెడ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దళారులతో వారు చెట్టపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారు. దళారులు కందిని రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద మద్దతు ధరకు విక్రయిస్తున్నారు. వీరికి సహకరించిన అధికారులకు ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ విషయం బయటపడినా, స్వయానా మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేసి సంబంధిత అధికారులను సస్పెండ్ చేయమని ఆదేశించినా ఇప్పటి వరకు చర్యలు లేవు. విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. కొనుగోలుపై పరిమితి ఉండటంతో... వ్యవసాయశాఖ అంచనా ప్రకారం రాష్ట్రంలో 2.84 లక్షల మెట్రిక్ టన్నుల కంది ఉత్పత్తి అవుతుంది. రెండేళ్ల క్రితం క్వింటాలు కంది ధర మార్కెట్లో రూ.9 వేల వరకు పలికింది. కానీ ఇప్పుడు రూ.4 వేల వరకే ఉంటోంది. కేంద్రం కందికి మద్దతు ధర రూ.5,450 ప్రకటించింది. మార్కెట్లో కంది ధర పతనమవడంతో కేంద్రమే మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకోసం రాష్ట్రంలో 110 కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు 1.13 లక్షల టన్నులు కొంటానని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో దళారులు రంగంలోకి దిగారు. రైతుల నుంచి క్వింటాలు రూ.4 వేలకే కొనుగోలు చేసి, మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాల వద్ద రూ.5,450 చొప్పున అమ్ముకుని లబ్ధి పొందుతున్నారు. కేవలం రైతుల నుంచే కొనుగోలు కేంద్రాల్లో కొనాలి. కానీ వ్యాపారుల నుంచి అక్రమంగా కొనుగోలు చేస్తున్నట్లు బయటపడింది. ఆదిలాబాద్, నిర్మల్, జనగామ జిల్లాల్లో మార్క్‌ఫెడ్ అధికారులు దళారులతో ఒప్పందం చేసుకొని అక్రమంగా కంది కొన్నారన్న ఆరోపణలు వచ్చాయి. దానికి బాధ్యులు ఆయా జిల్లాల మార్క్‌ఫెడ్ అధికారులేనని ప్రాథమిక విచారణలో తేలింది. వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు కోరడం, అధికారులు ప్రతిపాదనలు చేసినా సంబంధిత ఫైలును ఉన్నతాధికారులు పక్కన పెట్టినట్లు సమాచారం. ఉన్నతాధికారులే అక్రమార్కులను కాపాడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమాలున్న కొనుగోలు కేంద్రాలు రద్దు అక్రమాలు జరిగినట్లు నిర్ధారించిన కంది కొనుగోలు కేంద్రాలను రద్దు చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కేవలం వ్యవసాయ మార్కెట్లలో ఉన్న కొనుగోలు కేంద్రాలకే కందిని రైతులు తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతుల పేరు చెప్పి ఎక్కడెక్కడ అక్రమంగా కొనుగోళ్లు జరిగాయో విచారణ చేయాల్సిందిగా మార్క్‌ఫెడ్ అధికారులను ఆదేశించారు. దీంతో నాలుగు బృందాలను విచారణ కోసం మార్క్‌ఫెడ్ నియమించిందని మంత్రి హరీశ్‌రావు కార్యాలయం తెలిపింది. అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలో హాకా ఆధ్వర్యంలో ఉన్న 10 కంది కొనుగోలు కేంద్రాలను రద్దు చేశామని, కందిని కేవలం వ్యవసాయ మార్కెట్లకే తీసుకురావాలని రైతులకు ఆ సంస్థ ఎండీ సురేందర్ సూచించారు. ఇదిలావుండగా వేరుశనగ, శనగ కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్లలోనే ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. -
పసుపు రైతులకు రైతుబంధు పథకం
సాక్షి, హైదరాబాద్: పసుపు రైతులకు రైతుబంధు పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు నిర్ణయించారు. శనివారం ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మార్కెటింగ్ శాఖ కార్యక్రమాలు, సాగునీటి పథకాలను మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కవిత సమీక్షించారు. పసుపు ధర తగ్గినందున ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవాలని ఎంపీ కవిత విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన హరీశ్‌రావు, పసుపు రైతులను ఆదుకునేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని, రైతుబంధు పథకాన్ని పసుపు రైతులకు కూడా వర్తింపజేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మార్కెట్ యార్డులతో పాటు వాటి వెలుపల ప్రైవేటు కోల్డ్‌స్టోరేజ్‌లలో పసుపు పంటను నిల్వ చేసుకున్న రైతులకు కూడా రైతుబంధు పథకం అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. రైతుల తక్షణ అవసరాలకోసం రూ. 2 లక్షల రుణ సదు పాయం కల్పించాలన్నారు. దీనికి ఆరు నెలల దాకా రైతులు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరంలేదని తెలిపారు. గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత మార్కెట్లో అమ్ముకోవాలని పసుపు రైతులను హరీశ్‌రావు కోరారు. కాగా, పసుపు రైతుల సమస్యలను అధ్యయనం చేసేందుకు మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు ఆదివారం మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ నిజామాబాద్ వెళ్లనున్నారు. ఎంపీ కవిత విజ్ఞప్తి మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లతో మామిడికాయల మార్కెట్‌ను అభివృద్ధి చేయాలని మంత్రి ఆదేశించారు. మామిడి కాయల దిగుబడి, క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఈ నెల 9న మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, ఉద్యాన శాఖ, అపెడా అధికారులతో సమావేశం నిర్వహించాలని హరీశ్‌రావు, కవిత నిర్ణయించారు. కాగా ఈ నెల 19న బోధన్ నియోజకవర్గంలో హరీశ్‌రావు పర్యటించనున్నారు. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ నియోజకవర్గంలో సాగునీటి పథకాల పురోగతిని వారు సమీక్షించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. -
మాటలు ఘనం.. చేతలు శూన్యం
-
జూలై 15 నాటికి ‘భగీరథ’: హరీశ్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జూలై 15 నాటికి అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగు నీటిని అందజేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో శుక్రవారం ఆయన పలు అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2019లో పూర్తి కావాల్సిన భగీరథ పథకాన్ని ఏడాది ముందుగానే పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఇంటింటికీ స్వచ్ఛమైన నీటిని ఇవ్వలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని, ఆయన చిత్తశుద్ధి, నిబద్ధతకు ఈ పథకం నిదర్శనమని చెప్పారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతటి సాహసంతో ఇలాంటి పథకం చేపట్టలేదని గుర్తు చేశారు. కేసీఆర్ సాహసి.. కావునే ఆయన గొప్ప సంకల్పం నెరవేరుతోందన్నారు. గాంధీభవన్‌లో కూర్చొని విమర్శలు చేయడం ఏమిటని ఆయన కాంగ్రెస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. గ్రామాల్లోకి వచ్చి మిషన్ కాకతీయ, భగీరథ కార్యక్రమాలతో వస్తున్న మార్పులను, రైతుల కళ్లలో ఆనందం చూడాలన్నారు. సింగూరు ప్రాజెక్టు నుంచి వరుసగా మూడోసారి పంటలకు సాగు నీటిని అందిస్తున్నామని, ఇదొక రికార్డని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చేశారని, ఇప్పుడేమో కల్లబొల్లి మాటలు చెబుతున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం విద్యతోపాటు, వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కేసీఆర్ కిట్ అమల్లోకి వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయని వివరించారు. కాంగ్రెస్ పాలనలో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు పోలీస్స్టేషన్ల ఎదుట క్యూకట్టే వారని, తమ ప్రభుత్వం వచ్చాక ఆ ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. కార్యక్రమంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్‌షిండే పాల్గొన్నారు. పలు ప్రారంభోత్సవాలు.. రూ.1,300 కోట్లతో కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోని 785 గ్రామాలకు తాగునీరు అందించే మిషన్ భగీరథ పథకం మోటార్లను మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్‌రావు సింగూరులో ప్రారంభించారు. సింగూరు రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునే ఇన్‌టెక్‌వెల్ మోటార్లను పెద్దారెడ్డిపల్లి గ్రామం దగ్గరలో ఏర్పాటు చేసిన శుద్ధి కేంద్రం నుంచి నీటి పంపింగ్‌ను ప్రారంభించారు. అలాగే.. నారాయణఖేడ్ నియోజకవర్గం సుల్తానాబాద్‌లో రూ.25 కోట్లతో నల్లవాగు ప్రాజెక్టు కాల్వల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన, నారాయణఖేడ్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, పలు సీసీ రహదారులు, రూర్బన్ పథకం ఎల్ఈడీ బల్బుల పథకాలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. మాటలు ఘనం.. చేతలు శూన్యం మోదీ సర్కార్ మాటలు ఘనంగా ఉంటాయని.. చేతల్లో మాత్రం శూన్యమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. కేంద్రం గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతుల పట్ల చిన్నచూపు ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లాలోని నల్లవాగు కాల్వల ఆధునికీకరణ పనులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుజరాత్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా దారికిరాలేదని చురకలు అంటించారు. ఉన్నత వర్గాలకు మేలు చేసేందుకే జీడీపీ ఉపయోగపడుతుందని విమర్శించారు. డ్రిప్ ఇరిగేషన్, ఇతర వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ విధించడమేమిటని మంత్రి ప్రశ్నించారు. నీటి పారుదల రంగానికి బడ్జెట్లో నిధుల కేటాయింపులు చేయకుండా నిరాశ మిగిల్చారని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నేతలు గ్యాస్ డీలర్‌షిప్‌లు, పెట్రోల్ బంకులు, ఆస్పత్రుల ఏర్పాటుకే పరిమితమయ్యారని ఆరోపించారు. ప్రజల బాగోగులను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ రైతులు, ప్రజల సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తున్నారని కొనియడారు. -
‘తుమ్మిళ్ల’పై ఏపీ అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చేపట్టిన తుమ్మిళ్లపై ఏపీ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ రాసింది. ఈ ప్రాజెక్టు కోసం కృష్ణాబోర్డు నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే గత నెల 8న తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారని పేర్కొంది. ఎలాంటి అనుమతుల్లేకుండానే, రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి ప్రాజెక్టు చేపడుతోందని వివరించింది. ఈ ఎత్తిపోతల కారణంగా రాయలసీమ ప్రాంతాలకు నీటిని తరలించే కేసీ కెనాల్‌కు నీటి లభ్యత తగ్గుతుందని, దీంతో రాయలసీమలోని కర్నూలు, కడప జిల్లాల సాగు, తాగు నీటి అవసరాలకు కొరత ఏర్పడుతుందని తెలిపింది. ఈ దృష్ట్యా తుమ్మిళ్లను అడ్డుకోవాలని కోరింది. దీనిపై స్పందించిన కృష్ణాబోర్డు తుమ్మిళ్ల ఎత్తిపోతలకు సంబంధించి డీపీఆర్‌లను తమ ముందుంచాలని తెలంగాణను ఆదేశించింది. ఇప్పటికే ఓసారి ఏపీ ఫిర్యాదు.. తుమ్మిళ్లకు రూ.783 కోట్లతో పరిపాలనా అనుమతులిచ్చిన వెంటనే దీనిపై గతేడాది ఏప్రిల్‌లోనే ఏపీ తన అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై బోర్డు వివరణ కోరగా, తెలంగాణ సమాధానం ఇచ్చింది. ‘బచావత్ ట్రిబ్యునల్ ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటిని కేటాయించింది. అయితే కాల్వల పూడిక కారణంగా తెలంగాణకు దక్కుతున్న వాటా గరిష్టంగా 4 టీఎంసీలు దాటట్లేదు. దీంతో ఆర్డీఎస్ కింద 87,500 ఎకరాలకు సాగునీరందాల్సి ఉన్నా 30 వేల ఎకరాలకు సైతం అందట్లేదు. ఈ దృష్ట్యానే నీరందని 55,600 ఎకరాలకు సాగునీరు, దారిలోని గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో సుంకేశుల బ్యాక్‌వాటర్ ఫోర్‌షోర్‌లో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని నిర్ణయించాం. తుంగభద్ర జలాల్లో నీటిప్రవాహం ఉన్నప్పుడే నీటిని తీసుకుంటాం. దీనివల్ల సుంకేశులకు ఎలాంటి నష్టం లేదు’అని వివరణ ఇచ్చింది. అయినా కూడా ఏపీ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేయడంతో కృష్ణా బోర్డు తెలంగాణను వివరణ కోరింది. -
లక్షన్నర టన్నుల కందులు కొనండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ సీజన్లో కందుల దిగుబడి 2.84 లక్షల మెట్రిక్ టన్నులు వస్తున్న నేపథ్యంలో లక్షన్నర టన్నులు సేకరించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రిహరీశ్‌రావు కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన మరో లేఖ రాశారు. మొదట 33,500 మెట్రిక్ టన్నుల కందుల కొనుగోలుకు కేంద్రం అంగీకరించింది. మంత్రి విన్నపం మేరకు కేంద్రం 53,600 మెట్రిక్ టన్నుల సేకరణకు ఒప్పుకొంది. అయితే కంది దిగుబడి పెరగడంతో హరీశ్ ఆదేశాలతో ఎంపీ జితేందర్‌రెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ కార్యదర్శి సి.పార్థసారథి కేంద్ర వ్యవసాయమంత్రి రాధామోహన్‌సింగ్‌ను, ఆ శాఖ ఉన్నతాధికారులను ఢిల్లీలో కలసి విజ్ఞప్తి చేయడంతో 1.13 లక్షల మెట్రిక్ టన్నుల కందుల సేకరణకు అంగీకరిస్తున్నట్లు కేంద్రం బుధవారం రాష్ట్రానికి తెలిపింది. రాష్ట్రంలో కందుల దిగుబడి దృష్ట్యా కేంద్రం ఈ పరిమితిని సడలించాలని, లక్షలన్నర టన్నులు సేకరించాలని హరీశ్ కోరారు. 83,650 టన్నుల కొనుగోళ్లు.. తెలంగాణలో 83,650 మెట్రిక్ టన్నుల కందులను సేకరించారు.మొత్తం కందుల కొనుగోళ్ల విలువ రూ.455 కోట్లు. కొనుగోళ్ల అనంతరం చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం తగదని హరీశ్ అన్నారు. కొనుగోలు చేసిన వెంటనే మార్క్‌ఫెడ్, హాకా సంస్థల అధికారులు కందులను గోడౌన్లకు తరలించి నాఫెడ్‌కు స్వాధీనపరచాలని సూచించారు. కందుల కొనుగోళ్లలో అక్రమాలు, అవకతవకలు జరిగితే సహించబోమన్నారు. కందుల రీ సైక్లింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కంది రైతులకు మద్దతు ధర లభించాలన్నారు. జనగామ, భువనగిరిలలో కందుల క్రయవిక్రయాల్లో అవకతవకలు జరిగినందున జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ డైరెక్టర్‌ను ఆదేశించారు. -
ఛనాకా–కొరట బ్యారేజీకి క్లియరెన్స్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు సంబంధిం చిన ప్రాణహితలో భాగంగా చేపట్టిన తమ్మిడిహెట్టి బ్యారేజీ, ఛనాకా–కొరట బ్యారేజీ సాగునీటి ప్రాజెక్టులకు మహారాష్ట్ర వన్యప్రాణి బోర్డు క్లియరెన్స్‌లు ఇచ్చింది. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు గత కొన్ని నెలలుగా మహారాష్ట్రతో జరుపుతున్న సంప్రదింపుల ఫలితంగా ఈ కీలక నిర్ణయం వెలువడింది. ఈ రెండు బ్యారేజీల వల్ల వన్యప్రాణులకు ఎలాంటి హాని ఉండదని మహారాష్ట్ర తెలిపింది. ఛనాకా–కొరట బ్యారేజీని పెన్‌గంగ నదిపై నిర్మిస్తున్నారు. 51 వేల ఎకరాలకు సాగు నీరందించే ఈ ప్రాజెక్టుకు తిప్పేశ్వర్ వన్యప్రాణి కేంద్రం నుంచి అనుమతి లభించింది. ప్రాణహిత నదిపై 2 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో నిర్మిస్తున్న తమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు చాప్రాల్ వన్యప్రాణి కేంద్రం అనుమతిచ్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అధ్యక్షతన బుధవారం ముంబైలో ఆ రాష్ట్ర వన్యప్రాణి బోర్డు సమావేశమైంది. సమావేశంలో మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ మునిగంటివార్, రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ భగవాన్, తెలంగాణ నుంచి ఆదిలాబాద్ సీఈ భగవంతరావు, డిప్యూటీ ఫారెస్ట్ కన్జర్వేటర్ శ్రీనివాస్, పెన్‌గంగ ఎస్ఈ అమ్జద్ హుస్సేన్ పాల్గొన్నారు. ఛనాకా–కొరట, తమ్మిడిహెట్టి బ్యారేజీలపై సీఈ భగవంతరావు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజెంటేషన్‌పై సంతృప్తి వ్యక్తం చేస్తూ, వీటి నిర్మాణంతో వన్యప్రాణి కేంద్రాలపై ప్రభావముండదని తేల్చిన మహారాష్ట్ర వన్యప్రాణి మండలి.. జాతీయ వన్యప్రాణి బోర్డుకు సిఫారసు చేసింది. ఆ నిర్ణయం పట్ల హరీశ్‌రావు బుధవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. -
2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: పంటల పెట్టుబడి పథకం, మరింతగా అందుబాటులోకి రానున్న సాగునీటి వసతి, పలు సంక్షేమ కార్యక్రమాలు, మార్కెటింగ్ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణలతో రాష్ట్ర రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు అవుతుందని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులకు మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటకలలో అమలవుతున్న వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలపై అధ్యయనం చేసి వచ్చిన మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారుల బృందం మంగళవారం రాత్రి మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఆయా రాష్ట్రాల్లో రైతులు వేసే పంటలు, దిగుబడు లు, నిల్వ సదుపాయాలు, మా ర్కెట్ యార్డుల పరిస్థితి, మద్దతు ధర, రైతులకు చెల్లింపులు, మార్కెట్ స్థిరీకరణ నిధి వంటి అంశాలపై తమ అధ్యయనాన్ని ఈ బృందం మంత్రికి వివరించింది. 30 ఏళ్లుగా కాటన్ కార్పొరేషన్ మహారాష్ట్రలో గత 30 ఏళ్లుగా కాటన్ మార్కె టింగ్ కార్పొరేషన్ పనిచేస్తున్నట్టు అధికారులు మంత్రికి తెలిపారు. ఆ రాష్ట్ర మార్కెటింగ్ సంస్థ కందులు కొనుగోలు చేసి, పప్పుగా మార్చి మధ్యాహ్న భోజన పథకానికి, హాస్టళ్లకు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో ‘భావంతర్ భుగ్తాన్’’పేరిట అమలు చేస్తున్న కార్యక్రమాన్ని మంత్రికి వివరించారు. ఈ పథకం కింద మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధర పలికిన సందర్భాల్లో మిగతా డబ్బును నష్టపరిహారం కింద ఆ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లిస్తోందని చెప్పారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ‘సరాసరి ధర’ను అమలుచేస్తోందని వివరించారు. ఈ నాలుగు రాష్ట్రాల అధ్యయన నివేదికను సీఎం కేసీఆర్‌కు సమర్పించిన తర్వాత తగిన నిర్ణయాలు తీసుకుంటామని హరీశ్‌రావు తెలిపారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, జాయింట్ డైరెక్టర్ లక్ష్మణుడు తదితరులు పాల్గొన్నారు. -
వారిని ప్రజలే తరిమి కొడతారు
సాక్షి, సిద్దిపేట: ‘కరువు ప్రాంతానికి గోదావరి నీళ్లు తరలించి బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతోంది. ఇది చూసి సంతోషిం చాల్సిన కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారు. అలాంటి వారిని ప్రజలే తరిమి కొడతారు’అని భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. దౌల్తాబాద్ మండలం దొమ్మాటలో మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులను ప్రారంభించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ పనులు, ఉపరితల కాల్వల పనులను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ, ప్రాజెక్టులతో భారీ ప్రయోజనం ఉంటుందని, ఇలాంటి పరిస్థితిలో కొందరు భూమిని త్యాగం చేయక తప్పదన్నారు. భూములు, గ్రామాలు త్యాగం చేసిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందన్నారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఏనాడూ ప్రాజెక్టుల గురించి ఆలోచించలేదన్నారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ పనులు వేగవంతం గా జరుగుతున్నాయన్నారు. మట్టి తీసే పనులు 90 శాతం పూర్తయ్యాయని చెప్పారు. ఉపరితల కాలువల పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి మాట్లాడకుండా ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతుల శాశ్వత కష్టాలు తీర్చే ప్రాజెక్టులు కడుతున్న టీఆర్ఎస్ను విమర్శించడం శోచనీయం అన్నారు. -
కాంగ్రెస్‌వి పగటి కలలు
సాక్షి వనపర్తి: వచ్చే ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు పగటి కలలు కంటున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు అన్నారు. వనపర్తి జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కుడి కెనాల్‌పై ఆధారపడి నిర్మిస్తున్న పెద్దమందడి బ్రాంచి కెనాల్ పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఇదే మండలం వెల్టూరు, వనపర్తి మండలం చిట్యాలలో నూతనంగా నిర్మించిన మార్కెట్ గోదాములనూ ప్రారంభించారు. అనంతరం పెద్ద మందడి మండలం పామిరెడ్డిపల్లిలో జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వారిపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయితే తమకు పుట్టగతులు ఉండవని భావించి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చనిపోయిన రైతుల పేర్ల మీద కేసులు వేయించారని విమర్శించారు. రాష్ట్రంలోని రైతాంగం అంతా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతుండడంతో వారు జీర్ణించుకోలేక పోతున్నారని చెప్పారు. ఏ ఒక్క రైతు వచ్చి పెట్టుబడి పథకం కావాలని అడగకున్నా రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారని తెలిపారు. నిజంగా కాంగ్రెస్ నేతలకు రైతుల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే కోర్టుల్లో వేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కేవలం 50 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించారని.. తాము అధికారంలోకి వచ్చాక 6.50 లక్షల ఎకరాలకు అందిస్తున్నామని తెలిపారు. 90% ప్రాజెక్టులను పూర్తి చేశామంటున్న కాంగ్రెస్ నాయకు లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పొలాలకు సాగునీరు అందించలేకపోయారని ప్రశ్నించారు. కృష్ణానది నికరజలాలను పూర్తిగా ఉమ్మడి పాలమూరు జిల్లాలతో పాటు నల్లగొండలోని కొంత భాగానికి కేటాయించి నల్లగొండకు కాళేశ్వరం, ఖమ్మంకు గోదావరి నీటిని వాడుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి వివరించారు. సభకు ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షత వహించారు. మూడు గంటల కరెంట్ కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజుల్లో మూడు గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోయారని మంత్రి హరీశ్ విమర్శించారు. అదే టీఆర్ఎస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు రైతులకు 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తోందని తెలిపారు. -
పుస్తకం.. ఓ మంచి దోస్త్
సాక్షి, హైదరాబాద్: మనిషికి పుస్తకానికి మించిన దోస్తులు ఉండరని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ 31వ జాతీయ పుస్తక మహోత్సవం ఆదివారం ముగిసింది. ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ.. ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచాన్ని శాసిస్తున్నా.. పుస్తకాలను మాత్రం శాసించలేకపోతోందని అన్నారు. పుస్తకం అనేది ఒక చిరంజీవి అని, సీఎం కేసీఆర్ పుస్తకప్రియుడని, పుస్తకం కేసీఆర్‌ను నడిపిస్తుంటే కేసీఆర్ తెలంగాణ ప్రజలను నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యమంలో సాహిత్యం కీలక పాత్ర పోషించిందని, సాహిత్యం రుణాన్ని తీర్చుకోలేమన్నారు. భావితరాలకు పుస్తక విజ్ఞానాన్ని అం దించాలని పిలుపునిచ్చారు. పిల్లలను ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచి పుస్తకానికి చేరువ చేయాలని సీపీఎం నేత బీవీ రాఘవులు సూచించారు. ఆఖరి రోజు కిటకిట.. 11 రోజులపాటు నిర్వహించిన ఈ పుస్తక ప్రదర్శనను సుమారు 9 లక్షల మంది పుస్తకప్రియులు సందర్శించారు. ఆదివారం ఆఖరిరోజు కావడంతో కిటకిటలాడింది. నచ్చిన పుస్తకం కోసం నగరవాసులు అన్వేషిం చారు. ఈ ఏడాది సుమారు 133 స్టాళ్లను ఏర్పాటు చేశారు. అనేక అంతర్జాతీయ, జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. పిల్లల కోసమే 50 స్టాళ్లను ఏర్పాటు చేశారు. పఠనం పట్ల అభిరుచిని పెంచేందుకు, నేటితరం యువతీ యువకుల్లో, పిల్లల్లో సాహిత్యాభిరుచిని పెంపొందించేందుకు హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ కమిటీ 12 సాహిత్య సమాలోచనలను నిర్వహించింది. వేడుకల్లో భాగంగా పలువురు రచయితలు రాసిన 65 పుస్తకాలను ఆవి ష్కరించారు. పుస్తక ప్రదర్శనలో పిల్లల కోసం ప్రత్యేకంగా 25 కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు బుక్ ఫెయిర్ కమిటీ ప్రతినిధి చంద్రమోహన్ తెలిపారు. వైవిధ్యాన్ని చాటుకున్న స్టాళ్లు.. పుస్తక ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాళ్లు వైవిధ్యాన్ని చాటుకున్నాయి. ఆధ్యాత్మికం, సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యక్తిత్వవికాసం, ప్రముఖుల జీవిత చరిత్రలు, ఆత్మకథలు వంటి పుస్తకాలతో పాటు తెలుగు సాహిత్యం, కథలు, నవలలు, విశ్లేషణాత్మక గ్రంథాలకు చక్కటి ఆదరణ లభించింది. మేనేజ్మెంట్, కెరీర్ రంగానికి సంబంధించిన పుస్తకాలు, రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలతో పాటు ఆధ్యాత్మిక గ్రంథాలు పెద్ద ఎత్తున అమ్ముడైనట్లు నిర్వాహకులు తెలిపారు. -
కాళేశ్వరం భేష్!
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అంతర్జాతీయ ప్రశంసలు దక్కాయి. కోటి ఎకరాల సాగు దిశలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న కార్య క్రమాలు, చేపట్టిన పథకాలపై 19 దేశాల ప్రతినిధులు నీటిపారుదల శాఖను అభినందనలతో ముంచెత్తారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టును తక్కువ సమయంలో పూర్తిచేయడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అధ్యయనం కోసం ఇథియోపియా, శ్రీలంక, నేపాల్, భూటాన్, బ్రూనై, అల్జీరియా, మాల్దీవులు, మారిషస్ వంటి 19 దేశాలకు చెందిన ప్రతినిధులు 4 వారాల పర్యటన నిమిత్తం శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (అస్కీ) విదేశీ ప్రతినిధుల పర్యటనను సమన్వయపరచగా, ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎస్.కె.జోషి శనివారం ఇక్కడ జలసౌధలో వారికి సాగునీటి రంగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గొలుసుకట్టు చెరువులతో పాటు మొత్తం చిన్న నీటి వనరులను పరిరక్షించేందుకు, వాటి పునరుద్ధరణకుగానూ మిషన్ కాకతీయ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రూపకల్పన చేశారని, దీని ద్వారా 46వేల చెరువులను దశలవారీగా పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు ఈ పథకం విజయవంతానికి ప్రతివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని, నిరంతర పర్యవేక్షణతో సానుకూల ఫలితాలు వస్తున్నాయన్నారు. చెరువు మీద ఆధారపడి వ్యవసాయం చేసే రైతుతో పాటు, ఆ చెరువును నమ్ముకున్న రజక, బెస్త, ముదిరాజులకు జీవన భృతి దొరుకుతోందని వివరించారు. ఈ ప్రజెంటేషన్ పట్ల విదేశీ ప్రతినిధులంతా నివ్వెరపోయారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇరిగేషన్లో సాధించిన ప్రగతి అద్భుతమని కొనియాడారు. రాష్ట్ర ప్రజలు, రైతుల జీవితాన్ని మార్చబోతున్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి విదేశీ ప్రతినిధులకు జోషి వివరించినప్పుడు ఆయా ప్రతినిధులు విస్తుబోయారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వాడుతున్న అత్యాధునిక సాంకేతిక విధానాలను తెలుసుకుని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు దేశాల ప్రతినిధులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కాళేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టుకు ఆర్థిక వనరులు సమకూర్చుకున్న విధానాలు, రైతులు, ఇతర రంగాల వారికి ఒనగూరుతున్న ప్రయోజనాలు, వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసే తీరు వంటి అంశాలపై ఆయన్ను అడిగి తెలుసుకున్నారు. -
చివరి ఆయకట్టుకూ నీరందాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులైన ఎస్సారెస్పీ, నాగార్జునసాగర్, నిజాంసాగర్ల కింద ప్రస్తుత యాసంగిలో చివరి ఆయకట్టుకు సైతం నీరందేలా చర్యలు తీసుకోవాలని నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. యాసంగి పంటలకు సాగునీటి సరఫరాను క్రమబద్ధం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం జలసౌధలో ఈ మూడు ప్రాజెక్టుల ఆయకట్టుకు సాగు నీటి సరఫరాపై మంత్రి సమీక్షించారు. కాల్వల వెంట చీఫ్ ఇంజనీర్ సహా ఇతర సిబ్బంది నిరంతరం తిరగాలని, సాగు నీటి సరఫరా తీరును క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలన్నారు. ఇందుకుగాను జిల్లా కలెక్టర్ల సహకారంతో పాటు రెవెన్యూ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. చుక్క నీరు వృథా కాకుండా, అత్యంత పొదుపుగా వాడాలని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లదే బాధ్యత.. సాగునీటి క్రమబద్ధీకరణ వ్యవహారంలో ఎలాంటి లోటుపాట్లు జరిగినా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లదే బాధ్యత అని, వారిపై చర్యలకు ప్రభుత్వం వెనుకాడబోదని హరీశ్ హెచ్చరించారు. నీటిని వదిలినప్పుడు అప్రమత్తంగా ఉండాలని రాత్రింబవళ్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలో యాసంగి ఆయకట్టును కాపాడాల్సి ఉందని, ప్రధాన కాలువలకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో సాగు నీటిని సరఫరా చేస్తున్నందున దిగువనున్న రైతులకు నీరందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమీక్షలో ఈఎన్సీ మురళీధరరావు, సీఈలు శంకర్, సునీల్, మధుసూధనరావు తదితరులు పాల్గొన్నారు. -
కడుపులో పెట్టుకుని చూసుకుంటాం
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలోని బీడు భూముల్లో గోదావరి, కృష్ణా జలాలు పారించే ప్రయత్నంలో భాగంగా గ్రామాలు, భూములు కోల్పోయిన నిర్వాసితులను ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. అనంతగిరి సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని కొచ్చగుట్టపల్లి నిర్వాసితులకు పునరావాసం, ఉపాధిలో భాగంగా సిద్దిపేట అర్బన్ మండలం లింగారెడ్డిపల్లిలో 140 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి బుధవారం మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రిజర్వాయర్‌లో గ్రామం మొత్తం మునిగిపోతోందని, పాత గ్రామానికి తీసిపోని విధంగా కొత్త గ్రామం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నిర్వాసితుల త్యాగ ఫలంతోనే.. సంస్కృతి, సంప్రదాయాలు, తీపి గుర్తులను త్యా గం చేసి ప్రాజెక్టుల నిర్మాణానికి చేయూతనిచ్చిన నిర్వాసితుల త్యాగఫలమే రాష్ట్రానికి సాగునీరు అని హరీశ్ అన్నారు. మల్లన్న సాగర్ కింద 8 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, వారికి గజ్వేల్ పక్కనే మొట్రాజుపల్లి వద్ద నూతన గ్రామాలు నిర్మిస్తామన్నారు. మరోవైపు కొండపోచమ్మ ప్రాజెక్టులో మునిగిపోయే మరో రెండు గ్రామాలకు తునికి బొల్లారం వద్ద డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి త్వరలో భూమి పూజ చేస్తామని తెలిపారు. 123 జీవో ప్రకారం వారికి పరిహారం ఇచ్చామన్నారు. 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు అధిక మొత్తం లో డబ్బులు చెల్లించలేకపోతున్నామని, అందుకే 21/2017 సవరణ చట్టం కింద మెరుగైన పరిహారం అందజేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాలు నిర్మించడం, ఉపాధి, యువతకు నైపుణ్యాల శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి హామీనిచ్చారు. అనంతరం గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. -
హలో.. నేను మీ ప్రియమైన హరీశ్‌ను..!
సిద్దిపేటజోన్: స్వచ్ఛ సర్వేక్షణ్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వినూత్న పంథాను ఎంచుకున్నారు. తన వాయిస్‌తో కూడిన సందేశాన్ని పట్టణ ప్రజలకు ఫోన్ ద్వారా వినిపించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ‘నమస్కారం.. నేను మీ ప్రియమైన హరీశ్‌రావును మాట్లాడుతున్నాను. ఈ ఏడాది జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మన సిద్దిపేట పట్టణం పోటీలో ఉంది. మన పట్టణాన్ని మీ సహకారంతో బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణం (ఓడీఎఫ్)గా చేసుకుని ఇప్పటికే ఆదర్శంగా నిలిచాం. ఇక, మీ భాగస్వామ్యంతో ఇంటింటికి చెత్త సేకరణ, దాని నిర్వహణ సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. హరితహారంలో ముందున్నాం. వీటిని మరింత విజయవంతం చేయడంలో మీ సహకారం ఎంతో అవసరం. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పాల్గొని మన సిద్దిపేట పట్టణాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను’అని సందేశం వినిపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ‘040’కోడ్‌తో వచ్చే ఈ కాల్ పట్టణంలోని అందరికీ చేరుతోంది. ఫోన్ ఎత్తగానే మంత్రి గొంతుతో కూడిన సందేశం వినిపిస్తుంది. ‘ఈ మహా యజ్ఞంలో మీరు భాగస్వామ్యం కావడానికి 1969 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి. లేదా స్వచ్చ సర్వేక్షణ్ 2018 వెబ్‌కు లాగిన్ అయ్యి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి’అంటూ మంత్రి సందేశం ముగుస్తుంది. అయితే.. ఇప్పుడు పట్టణంలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. సిద్దిపేటకు ర్యాంకు ఇవ్వడానికి బుధవారం నుంచి మూడు రోజుల పాటు కేంద్ర బృందం పర్యటించనుంది. ఈ బృందం ప్రజలను కూడా కలుస్తుందని, చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై బృందం సభ్యులు వివిధ ప్రశ్నలు వేస్తారని, వాటికి తదనుగుణంగా సమాధానాలు ఇవ్వాలని మంత్రి ఆ సందేశంలో వినిపిస్తున్నారు. -
‘కాళేశ్వరం’తో సస్యశ్యామలం
కాళేశ్వరం(మంథని): కాళేళ్వరం ప్రాజెక్టుతో బీడు భూములు సస్యశ్యామలమవుతాయని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు అద్భుతంగా ఉందని ఆయన కొనియాడారు. శనివారం బేగంపేట విమానాశ్రయం నుంచి జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరానికి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో గవర్నర్ నరసింహన్ ఆయన సతీమణి విమల, మంత్రి హరీష్‌రావు చేరుకున్నారు. వీరికి స్పీకర్ మధుసూదనాచారి, మంథని ఎమ్మెల్యే పుట్ట మధుకర్, కలెక్టర్ ఆర్వీ.కర్ణణ్, ఎస్పీ భాస్కరన్ తదితరులు ఘనస్వాగతం పలికారు.హెలిప్యాడ్ నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా కారులో శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పూజలు చేసిన అనంతరం కారులో కన్నెపల్లి(మేడిగడ్డ)పంప్ హౌస్‌కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబ్యిషన్ను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు ప్రాజెక్టు విశిష్టతను మ్యాప్‌ల సాయంతో గవర్నర్‌కు వివరించారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం, మోటార్ల వినియోగం, విద్యుత్ అవసరాలను గవర్నర్‌కు విశ్లేషించి చెప్పారు. అనంతరం వ్యూ పాయింట్ చేరుకుని పనులు జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. ఆ తర్వాత పనులు జరుగుతున్న ప్రదేశానికి కారులో చేరుకున్నారు. అక్కడ 20 మీటర్ల ఎత్తులో పనులు జరుగుతుండగా నిచ్చెన ద్వారా పైకి ఎక్కారు. పంప్‌హౌస్ ద్వారా నీటి వినియోగం, రివర్స్ పంపింగ్ విధానం గురించి మంత్రి హరీష్‌రావు, మెగా కంపెనీ ప్రతినిధులు వివరించారు. మేడిగడ్డ ప్రాజెక్టు ఏరియల్ సర్వే క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం గవర్నర్ నరసింహన్ హెలిక్యాప్టర్‌లో మేడిగడ్డ ప్రాజెక్టును ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. అన్నారం బ్యారేజీని గవర్నర్ సందర్శించగా అక్కడ జరుగుతున్న పనులను హరీష్‌రావు వివరించారు. గోదావరి, ప్రాణహిత నీటిని వాడుకుని ఇక్కడి నుంచి మళ్లిస్తారని వివరించారు. 90 రోజులకు 180 టీఎంసీల నీటిని బ్యారేజీ ద్వారా వాడుకోవచ్చని గవర్నర్‌కు తెలిపారు. క్షేత్రస్థాయిలో కాంక్రీట్ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు.అక్కడి నుంచి తిరిగి హెలిక్యాప్టర్‌తో పెద్దపల్లి జిల్లా సుందిళ్ల బ్యారేజీకి బయలుదేరి వెళ్లారు.ఆయన వెంట ఇరిగేషన్ సీఎస్ ఎస్కే.జోషి, కాళేశ్వరం బ్యారేజీ సీఈ నల్లా వెంకటేశ్వర్లు, కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, ఎస్పీ భాస్కరన్, ఇరిగేషన్ ఇంజనీర్లు ఎస్ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈలు మల్లికార్జునప్రసాద్, డీఈఈలు ప్రకాష్, యాదగిరి, సతీష్ పాల్గొన్నారు. శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడి సన్నిధిలో గవర్నర్ దంపతులు కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వర ఆలయాలన్ని గవర్నర్ ఈఎస్ఎల్. నరసింహన్–విమల దంపతులు దర్శించుకున్నారు. స్వామివారి గర్భగుడిలో గణపతి, మహాన్యాసకపూర్వక రుద్రాభిషేకాలు చేశారు. గవర్నర్ దంపతులను మంథని ఎమ్మెల్యే పుట్ట మధుకర్ శాలువాతో సన్మానించి, స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. అక్కడ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గవర్నర్‌కు మెమెంటోను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీనివాస్, మాధవి, వసంత, హసీనభాను, చల్లా నారాయణరెడ్డి పాల్గొన్నారు. శభాష్.. హరీష్.. కాళేశ్వరం బ్యారేజీలోని కన్నెపల్లి పంప్‌హౌస్ పనులను పరిశీలించిన అనంతరం గవర్నర్ నరసింహన్ ఆనందం వ్యక్తం చేశారు. శభాష్ హరీష్... వెరీ గుడ్ అంటూ ఆయన మంత్రి హరీష్‌రావుకు కితాబిచ్చారు. పంప్‌హౌస్ పనులను పరిశీలించిన అనంతరం ప్రాజెక్టు విశిష్టతను క్షుణ్ణంగా వివరించడంతో నరసింహన్ ఫిదా అయి మంత్రిని అభినందించారు. -
కాళేశ్వరం సందర్శనకు గవర్నర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శనివారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఇటీవలే సీఎం కేసీఆర్ గవర్నర్‌తో భేటీ అయిన సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికను అందజేసి ప్రాజెక్టు పనులను పరిశీలించాలని కోరారు. ఈ మేరకు గవర్నర్ ప్రాజెక్టు పర్యటన ఖరారైంది. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుతో కలిసి పర్యటించనున్నారు. కాళేశ్వరం పర్యటనలో భాగంగా కన్నెపల్లి పంప్‌హౌజ్, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్‌లను పరిశీలించి, ఏరియల్ సర్వే చేయనున్నారు. అక్కడి నుంచి గోలివాడ పంప్‌హౌజ్, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఏరియల్ సర్వే, శాయంపేట ప్యాకేజీ–6, లక్ష్మీపూర్ ప్యాకేజ్–8 పనులను సందర్శించనున్నారు. కాగా.. ఇటీవలి కాలంలో సీఎం కేసీఆర్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రాజెక్టులను సందర్శించి వెళ్లారు. సీఎం పర్యటనతో పనుల్లో వేగం పుంజుకుంది. మూడు షిఫ్టులతో పనులు జోరందుకున్నాయి. దేశంలో ఏ ప్రాజెక్టు పనులు జరగనంత వేగంగా పనులు పూర్తిచేయాలని సంకల్పించారు. సుమారు 14 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం కానుంది. ఈ మధ్య కాలంలోనే కేంద్ర జలవనరుల కమిటీ (సీడబ్ల్యూసీ) సైతం ప్రాజెక్టులను సందర్శించి వెళ్లింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ప్రాజెక్టు పనులపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే గవర్నర్ నరసింహన్ ప్రాజెక్టుల సందర్శనకు చేపట్టిన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. పకడ్బందీ ఏర్పాట్లు.. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు జిల్లాలో శనివారం కాళేశ్వరం ప్యాకేజీ–8 పనులను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అధి కారులను ఆదేశించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్అహ్మద్ గవర్నర్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ ఏర్పాట్లను పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశిం చారు. అంబులెన్స్‌తోపాటు డాక్టర్లను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారిని ఆదేశించారు. ఫైరింజన్‌ను సైతం అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా బారీకేడ్లను ఏర్పాటు చేయాలని ఈఈ ఆర్‌అండ్‌బీని ఆదేశించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్ పర్యటన సందర్భంగా అన్ని రకాల ముం దు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. చుట్టూపక్కల గ్రామాల ప్రజ లు రావద్దని.. అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఈఈ ఇరిగేషన్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రాజేశం, ఈఈ ఆర్అండ్బీ సమాచార శాఖ ఉపసంచాలకులు ఎన్.వెంటేశ్వర్రావు, తదితరులు పాల్గొన్నారు. షెడ్యూల్ వివరాలు ► ఉదయం 7.45 గంటలకు.. : బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి బయలుదేరుతారు. ► ఉదయం 8.30 : కాళేశ్వరానికి చేరుకుంటారు. ► ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు.. : కాళేశ్వరం గుడిని సందర్శిస్తారు. ► 9.30 నుంచి 10 వరకు.. : కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిస్తారు. హెలికాప్టర్లో మేడిగడ్డను ఏరియల్ సర్వే చేస్తారు. ► 10.30 నుంచి 11 గంటల వరకు.. : అన్నారం బ్యారేజ్‌ను సందర్శిస్తారు. ► 11.20 నుంచి 12 గంటల వరకు : సుందిల్ల బ్యారేజీ, అన్నారం పంప్‌హౌజ్‌ను పరిశీలిస్తారు. అక్కడి నుంచి గోలివాడ పంప్‌హౌజ్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును ఏరియల్ సర్వే చేస్తారు. ► మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకు.. : శాయంపేట గ్రామంలోని ప్యాకేజీ–6 అండర్‌గ్రౌండ్ పంప్‌హౌజ్, సర్ట్పూల్, టన్నెల్స్‌ను సందర్శిస్తారు. ► మధ్యాహ్నం 3 నుంచి 4.15 వరకు.. : రామడుగు మండలం లక్ష్మీపూర్ ప్యాకేజీ–8 వద్ద ఉన్న అండర్‌గ్రౌండ్ పంప్హైజ్, సర్జ్‌పూల్, టన్నెల్స్‌ను సందర్శిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్ హెలికాప్టర్లో పయనమవుతారు. -
సరదాగా కాసేపు..
సాక్షి, సిద్దిపేట: కరవు ప్రాంతంగా ఉన్న తెలంగాణకు గోదావరి నీళ్లతో కాళ్లు కడిగి కష్టాలు తీర్చాలన్న తపనతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మహా యజ్ఞం మాదిరి చేపట్టామని రాష్ట్ర భారీనీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లాలోని చంద్లాపూర్ ప్రాంతంలో నిర్మిస్తున్న రంగనాయకసాగర్ రిజర్వాయర్ పనులను రెండో రోజు పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి బైక్‌పై ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. కాళేశ్వరం నుంచి నీటిని తరలించే విధానం, పంపులు పనిచేయడం, అక్కడి నుంచి రంగనాయక సాగర్, మల్లన్నసాగర్ రిజర్వాయర్లకు నీళ్లు నింపడం మొదలైన అంశాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకొన్నారు. ఇంజనీర్లు, కార్మికులు, అధికారులు అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. అందరి కష్టం, శ్రమ అంతా కరువును తరమి కొట్టాలన్నదే అని మంత్రి వివరించారు. అదేవిధంగా రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లో కట్టను మంత్రి పరిశీలించి నీటి సామర్థ్యం తట్టుకునేందుకు చేపట్టిన అధునాతన పద్దతులు, నల్లమట్టి, ఇసుకతో నిర్మాణలతో ఉపయాగాలను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని, వచ్చే ఖరీఫ్ నాటికి రైతులకు నీళ్లు ఇచ్చేలా పనులు జరగాలని మంత్రి ఆదేశించారు. -
NWDA సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు
-
జాప్యం జరిగితే క్రమశిక్షణ చర్యలు
సాక్షి, హైదరాబాద్: కంది కొనుగోళ్ల చెల్లిం పుల్లో ఆలస్యంపై మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు అధికారులపై మండిపడ్డారు. రైతులకు చెల్లించాల్సిన సొమ్ము పెండింగ్‌లో ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.145 కోట్లు కందుల రైతులకు, రూ.21 కోట్లు మొక్కజొన్న రైతులకు చెల్లించాలని.. వీటిని వెంటనే చెల్లించాలన్నారు. ఇకపై తాను జిల్లాలు పర్యటించినపుడు తప్పనిసరిగా వ్యవసాయ మార్కెట్ కమిటీలను సందర్శిస్తానని మంత్రి స్పష్టం చేశారు. కొనుగోలు తర్వాత రైతులకు చెల్లింపులో జాప్యం జరిగితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానన్నారు. మంగళవారం సచివాలయంలో మార్కెటింగ్ కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సీజన్లో కంది దిగుబడి 1.50 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా రానుందని అంచనా వేశామన్నారు. 33 వేల మెట్రిక్ టన్నులు కొనేందుకే కేంద్రం సుముఖత చూపిందన్నారు. ఇప్పటివరకు 26,200 మెట్రిక్ టన్నుల కందులు మార్కెట్‌కు వచ్చినట్టు వివరించారు. ఈ నేపథ్యంలో కందుల కొనుగోళ్ల పరిమితిని పెంచాలని కోరుతూ బుధవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రికి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. వివిధ జిల్లాల్లో పెండింగులో ఉన్న చెల్లింపులను వారంలో పూర్తి చేయాలని ఆదేశించారు. గడ్డిఅన్నారం మార్కెట్‌ను కోహెడకు తరలించనున్నందున.. అత్యాధునిక హంగులు, సాంకేతిక పరిజ్ఞానంతో దాని ఏర్పాటుకోసం 3 ప్రైవేటు సంస్థలు ప్రజెంటేషన్ ఇచ్చాయన్నారు. 15 రోజుల్లో పూర్తి ప్రాజెక్టు రిపోర్ట్ సమర్పించాలని ఆయా సంస్థలను కోరారు. ఏపీ మంత్రి దేవినేనికి హరీశ్‌రావు లేఖ రాజోలిబండ ఆధునీకరణ పనులపై చర్చి ద్దామని, అందుకు సమయమివ్వాలని ఏపీ జల వనరుల మంత్రి దేవినేని ఉమామహే శ్వర్‌రావుకు మంత్రి హరీశ్ లేఖ రాశారు. ఈ నెల 14న రాసిన లేఖను మంగళవారం మీడియాకు విడుదల చేశారు. ఆధునీకరణ పనులను ఈ ఏడాది జూలై నాటికి పూర్తి చేసేందుకు కర్ణాటక జల వనరుల మంత్రి ఎంబీ పాటిల్ ఒప్పుకున్నారని, ఈ అంశంలో ఏపీ సహకారం కీలకం అయినందున మూడు రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ‘కాకతీయ’ నాలుగో దశ ప్రారంభానికి ఫిబ్రవరి 3 డెడ్‌లైన్ మిషన్ కాకతీయ నాలుగో దశ పనులను ఫిబ్రవరి 3 లోగా ప్రారంభించాలని హరీశ్‌రావు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈసారి మిషన్ కాకతీయలో ఫీడర్ చానల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజాప్రతినిధులతో పాటు కలెక్టర్లు, ఎస్పీలను కూడా భాగస్వాములను చేయాలన్నారు. కాకతీయ 4వ దశ పనులపై మంగళవారం సచివాలయం నుంచి ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెలాఖరులోగా పనుల గ్రౌండింగ్ జరగాలని, ఏ రోజుకారోజు పనుల ఫొటోలను వాట్సాప్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. -
నిరంతర విద్యుత్ కుదింపుపై తీర్మానం
సాక్షి, వరంగల్ రూరల్: సాగుకు నిరంతర విద్యుత్ కుదించాలని భావిస్తే, సంబంధిత గ్రామ పంచాయతీ తీర్మానం చేసి పంపాలని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి, వంచనగిరిల్లో శనివారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులతో కలసి హరీశ్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. హరీశ్ మాట్లాడుతూ హైటెక్ సిటీలో ఎంత నాణ్యమైన కరెంట్ ఉందో అదే కరెంట్ గ్రామాలకూ వస్తుందన్నారు. ‘తెలంగాణ ఏర్పాటైతే రాష్ట్రం చీకటిగా మారుతుందని కాంగ్రెస్ వాళ్లు అన్నారు. కానీ, నేడు సాగుకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం’ అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతీ నియోజకవర్గానికి సాగు నీరు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామన్నారు. 24 గంటల కరెంట్ వద్దు: ఎర్రబెల్లి సాగుకు 24 గంటల కరెంట్‌పై టీఆర్ఎస్ నేతల నుంచే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పర్వతగిరిలో జరిగిన సభలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు వేదికపైనే ‘వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వడం వల్ల బావులు ఎండిపోయే ప్రమాదముందని, 12 గంటల కరెంట్ చాలు’ అని మంత్రి హరీశ్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి ‘మీకు ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంట లు విద్యుత్ ఇస్తాం. గ్రామ పంచాయతీ తీర్మానం చేసి పంపిస్తే పరిశీలిస్తాం’అంటూ బదులిచ్చారు. -
సీఎం మహోన్నత లక్ష్యానికి ఊపిరి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేయాలన్న సీఎం కేసీఆర్ మహోన్నత లక్ష్యానికి పాలేరు నియోజకవర్గం ఊపిరిలూది 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు తెచ్చుకున్న తొలి నియోజకవర్గంగా గుర్తింపు పొందిందని, కృష్ణ, గోదావరి నదుల అనుసంధానానికి సైతం ఖమ్మం జిల్లాలోనే అంకురార్పణ జరిగిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు వద్ద భక్తరామదాసు రెండోదశ ఎత్తిపోతల పథకం ద్వారా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి నీటిని విడుదల చేశారు. కాకరవాయిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. భక్తరామదాసు ఎత్తిపోతల పథకం బృహత్తరమైందని, ఈ ప్రాజెక్టుకు కాళేశ్వరం ద్వారా తొలి దశలోనే నీరందించనున్నామని, సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఇప్పటి వరకు కృష్ణా జలాలతో నిండిన చెరువులకు.. గోదావరి జలాలు సైతం వస్తాయని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు కావాలని పార్టీలు ఆందోళన చేయడం సహజమని, కాంగ్రెస్ పార్టీ మాత్రం సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తూ.. గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లాలంటూ రైతులను రెచ్చగొడుతోందని ఆరోపించారు. ప్రాజెక్టుల పనులు సాగుకుం డా న్యాయ స్థానాలను ఆశ్రయించి రైతాంగం నోటి కాడి ముద్ద లాక్కునే ప్రయత్నం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. సీతారా మ ప్రాజెక్టునకు ఈ నెలలోనే కేంద్ర ప్రభు త్వం నుంచి అటవీ అనుమతులు తీసుకొస్తామని, వచ్చేనెల వన్యప్రాణుల అనుమతులు, ఆపై పర్యావరణ అనుమతులు తీసుకు వస్తామని హరీశ్‌రావు వివరించా రు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయం అంటే తెలియని సన్నాసులు ప్రభుత్వంపై పస లేని విమర్శలు చేస్తూ ప్రజల్లో పలచన అవుతున్నారని విమర్శించారు. సభలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, శాసనమండలి విప్ పల్లా రాజేశ్వరరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, మదన్‌లాల్, కోరం కనకయ్య పాల్గొన్నారు. కాళేశ్వరం నీళ్లతో రైతుల కాళ్లు కడుగుతాం చెన్నారావుపేట(నర్సంపేట): కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను వర్షాకాలంలోపు పూర్తి చేసి ఆ నీటితో రైతుల కాళ్లు కడుగుతామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావు పేట మండలం ఉప్పరపల్లిలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి చే పట్టిన ‘పల్లె ప్రగతి’లో శుక్రవారం పా ల్గొన్నా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నెల రోజుల్లో కొత్త పంచాయతీలు సాక్షి, మహబూబాబాద్: సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 500కు పైగా జనాభా గల గ్రామాలు, గిరిజన తండాలు వచ్చే నెల రోజుల్లో గ్రామ పంచాయతీలుగా మారబోతున్నాయని మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కురవిలో శుక్రవారం మంత్రులు తుమ్మ ల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్‌రెడ్డితో కలసి పలు అభివృద్ధి పనులకు హరీశ్ శంకుస్థాపనలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగసభలో మంత్రి హరీశ్‌రావు ప్రసంగించారు. త్వరలో ఏర్పడే కొత్త పంచాయతీలను కలుపుకొని కొద్ది రోజుల్లోనే పంచాయతీ ఎన్నికలను కూడా నిర్వహించేందు కు ప్రభుత్వం సిద్ధమవుతోందని చెప్పారు. -
తీరనున్న కరువు
తిరుమలాయపాలెం: దశాబ్దాలుగా కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడిన తిరుమలాయపాలెం మండలం నేటి నుంచి సస్యశ్యామలం కానుంది. కరువును తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భక్తరామదాసు రెండో దశ ఎత్తిపోతల పథకాన్ని శుక్రవారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుండెపుడి వద్ద ప్రారంభించనున్నారు. ఇన్నాళ్లు వరుణుడిపై భారం వేస్తూ పంటలు సాగు చేస్తున్న మండల రైతాంగానికి భక్తరామదాసు ప్రాజెక్టులతో కరువు తీరనుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత ఏడాది పాలేరు నుంచి భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించి.. మండలంలోని ఎస్సారెస్పీ కాలువల ద్వారా చెరువులు నింపారు. కాకరవాయి, పైనంపల్లి, బచ్చోడు, బచ్చోడుతండా, రాజారం, జూపెడ, సోలీపురం, రఘునాథపాలెం గ్రామాలకు భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందకపోవడంతో మంత్రి తుమ్మల ప్రత్యేక కృషితో సీఎం కేసీఆర్ చేత ఈ ప్రాజెక్టుకు రూ.4.3కోట్ల నిధులు మంజూరు చేయించారు. 1.9 కిలోమీటర్ల మేర పైపులైన్ ఏర్పాటు చేసి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి వద్ద ఎస్సారెస్పీ కాల్వల్లోకి నీటిని విడుదల చేయనున్నారు. అనతి కాలంలోనే సుబ్లేడు గోనెతండా వరకు పైపులు ఏర్పాటు చేసి.. ఎస్సారెస్పీ కాల్వల్లోకి వదిలే విధంగా ప్రాజెక్టుకు రూపకల్పన చేసి నిర్మాణం పూర్తి చేశారు. మండలంలోని ఏడు గ్రామలతోపాటు కూసుమంచి మండలంలోని రెండు గ్రామాల్లో 16,365 ఎకరాలకు సాగునీరు అందనుంది. పాలేరు నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు పైగా సాగునీరందనుంది. -
ప్రజల్లోకి వస్తే అభివృద్ధి కనిపిస్తది
భూపాలపల్లి: ‘కాంగ్రెసోళ్లు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కూర్చొని పూటకో ప్రెస్‌మీట్‌కే పరిమితమవుతున్నారు.. అక్కడ కూర్చుంటే ఏమీ కనిపించదు. ప్రజల్లోకి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలాంటి పనులను చూస్తే అభివృద్ధి అంటే ఏమిటో కనిపిస్తది’అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండల కేంద్రంలో రూ.54 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో హరీశ్ మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ కోతలు కనిపించాయని, తాము నాణ్యమైన 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరు ఒక్కోమాట మాట్లాడుతున్నారన్నారు. తమ ప్రజాప్రతినిధులు పొలం గట్లు, కాల్వలు, చెరువుల వెంట ఉంటున్నారని, కాంగ్రెస్ నాయకులు ఏనాడైనా ప్రజల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్నారా అని ప్రశ్నించారు. మరో 20 ఏళ్ల వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉంటుందన్నారు. బీజేపీ మంత్రి ఒకరు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని చూసి పొగిడారని, బెంగాల్, కేరళ, ఒడిషా మంత్రులు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను చూసి నేర్చుకున్నారని అన్నారు. సీడబ్ల్యూసీ సభ్యులు కాళేశ్వరం ప్రాజెక్టును చూసి ప్రశంసించారని, ‘పనుల పరిశీలన కాదు.. తాము నేర్చుకొని వెళ్తున్నాం’ అని కొనియాడారన్నారు. తెలంగాణ ఇంజనీర్లు చాలా కష్టపడుతున్నారని ప్రశంసించారని తెలిపారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. సాగుకు రెండు, మూడు గంటల విద్యుత్ ఇచ్చిన కాంగ్రెస్ సన్నాసులకు ఇప్పుడు మాట్లాడేందుకు సిగ్గుండాలన్నారు. -
కాంగ్రెసోళ్లకు మనసున పడ్తలేదు
గజ్వేల్: ‘మా ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇస్తే కాంగ్రెసోళ్లకు మనుసున పడ్తలేదు. ఒకరేమో అన్ని గంటలు కరెంటు ఒద్దంటుండ్రు, మరొకరేమో ఈ ఘనత అంతా మాదేనంటుండ్రు. వాళ్లది వాళ్లే ఆగమాగమైతుండ్రు. ఆ పార్టీ ప్రతిపక్ష నేత జానారెడ్డి పల్లెటూరు, పట్నంకు, రైతుకు నిరంతర కరెంటిస్తే విచిత్రమే.. అట్ల జేస్తే నేనే కేసీఆర్‌కు ముందుండి కార్యకర్తగా ప్రచారం చేస్తానని చెప్పిండు. మాటమీద నిలబడతారా? మీ విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహిం చిన టీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ‘సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్నారు. తెలంగాణ తెస్తామని అనుకున్నది సాధించిండు. ఇంటింటికీనల్లా నీళ్లు ఇస్తామని ఇచ్చి చూపించిండు. నిరంతర కరెంటు ఇస్తమని ఇయ్యాల ఆ కలను నిజం చేసిండు’అని అన్నారు. గోదావరి జలాలతో రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీళ్లందిస్తామని చెప్పి ఆ మాటనూ నెరవేరుస్తున్నారని తెలిపారు. గోదావరి నది పై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి పదేళ్లు పడుతుందని, అలాంటిది రెండేళ్లలో పూర్తి చేసేందుకు కృషిచేస్తున్నామన్నారు. పనులు జరుగుతున్న తీరును సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ వర్క్స్ కమిషన్) సభ్యులు ప్రశంసించారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల ప్రక్రియ ప్రపంచంలోనే ఒక రికార్డుగా అభివర్ణించారు. ఇటీవల గజ్వేల్‌ను సందర్శించిన బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోదీ అభివృద్ధిని చూసి ప్రశంసలు కురిపించారని, హైదరాబాద్‌కు వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ మంత్రి రేవణ్ణ గొల్ల కురుమల సంక్షేమానికి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను కొనియాడిన తీరును వివరించారు. సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్ మడుపు భూంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి అడుగు రైతు కోసమే
సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వం వేసే ప్రతి అడుగు అన్నదాతల సంక్షేమం కోసమేనని భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సిద్దిపేటలో కంది కొను గోలు కేంద్రం ప్రారంభించారు. దాతల సహకారంతో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్లో విద్యార్థులతో మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ, రైతు పండించిన ప్రతీ గింజకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 95 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రూ.1,031 కోట్లతో 21 లక్షల క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశామని చెప్పారు. ఈసారి కందుల ఉత్పత్తి మరింత పెరిగిందనే ఆలోచనతో 106 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గత ఏడాదికన్నా క్వింటాకు రూ.400 అధికంగా పెట్టి అంటే రూ.5,450 మద్దతు ధరతో కొంటున్నామన్నారు. రైతులు 12 శాతం కన్నా తక్కువ తేమతో తేవా లని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి సాయం అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు. లాభసాటి వ్యవసాయం కోసం ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, హరియాణా రాష్ట్రాలకు అధికారులను పంపించి అధ్యయనం చేయిస్తున్నామని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో అమలవుతున్న ముభావంతు పథకం అమలు కోసం అధ్యయనం చేస్తున్నామన్నారు. ఈ–నామ్ లైసెన్స్ విధానంతో లైసెన్స్ పొందిన కమీషన్ వ్యాపారి రాష్ట్రంలో ఎక్కడైనా ఉత్పత్తులు కొనవచ్చన్నారు. దీంతో వ్యాపారుల మధ్య పోటీ పెరుగుతోందని, ఫలితంగా రైతులకు లాభం కలుగుతుందన్నారు. కాలేజీలను కాపాడిన కాంట్రాక్టు లెక్చరర్లు ప్రభుత్వ విద్యావిధానంపై ప్రజలకు నమ్మకం పోయే దశకు చేరుకున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు జీవం పోసి కాపాడింది కాంట్రాక్టు లెక్చరర్లేనని హరీశ్‌రావు కొనియాడారు. ఎన్నికల హామీలో భాగంగా వారిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే ప్రతిపక్ష నేతలు కొందరు కుట్ర పన్ని కోర్టుల్లో కేసులు వేశారన్నారు. అయినా ముఖ్యమంత్రి కాంట్రాక్టు లెక్చరర్లకు బేసిక్ పేతో వేతనాలు అందచేసేలా ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం.. ఇల్లంతకుంట(మానకొండూర్): ‘నిర్వాసితులెవ రూ అధైర్యపడొద్దు.. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారందరినీ ఆదుకుంటాం.. అన్నివిధాలా న్యాయం చేస్తాం’ అని మంత్రి హరీశ్‌రావు అభయమిచ్చారు. కాళేశ్వరం ఎత్తిపోతల– 10వ ప్యాకేజీలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి వద్ద 3.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపట్టిన రిజర్వాయర్ పనులను మంత్రి మంగళవారం పరిశీలించారు. మంత్రిని అనంతగిరివాసులు కలసి తమ సమస్యలు విన్నవించారు. అనం తరం హరీశ్‌రావు గ్రామస్తులతో మాట్లాడారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లిస్తున్నామని, రిజర్వాయర్ నిర్మాణానికి అందరూ సహకరించాలన్నారు. 18 ఏళ్లు నిం డిన యువతకు ఇంటిస్థలం కేటాయిస్తామని, కుటుంబ ప్యాకేజీ రూ.12.50 లక్షలు చెల్లించి పునరావాసం కల్పిస్తామన్నారు. రిజర్వాయర్ లో చేపలు పట్టుకునేందుకు హక్కులు కల్పిస్తా మని చెప్పారు. ఇళ్ల కొలతలకు సహకరించాలని కోరారు. వీటన్నింటికీ అంగీకరిస్తే కలెక్టర్ పరి శీలించాక పక్షంరోజుల్లో పూర్తిస్థాయి పరిహారం చెలిస్తామన్నారు. నిర్వాసితులు కోరుకున్న చోటే పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధం గా ఉందని వివరించారు. సిరిసిల్ల, అనంతగిరి, ఇల్లంతకుంటలో పునరావాసం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకు నిర్వాసితు లు సంసిద్ధతను వ్యక్తం చేశారు. గురువారం కలెక్టర్‌తో అన్ని విషయాలపై చర్చిస్తామని నిర్వాసితులు మంత్రితో చెప్పారు. -
కాళేశ్వరం పనుల ప్రత్యక్ష ప్రసారం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడానికి మంత్రి హరీశ్‌రావు టెక్నాలజీని అందిపుచ్చుకున్నారు. ఈ ప్రాజెక్టుకు చెందిన మూడు బ్యారేజీలు, మూడు పంప్‌హౌజ్‌లు, గ్రావిటీ కెనాల్, గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులను స్వయంగా మూడు రోజులపాటు పరిశీలించిన మంత్రి, అనంతరం జలసౌధ నుంచి ఆయా పనుల పురోగతిని ప్రత్యక్ష ప్రసారం(లైవ్) ద్వారా తనిఖీ చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. శనివారం జలసౌధలో ఏర్పాటు చేసిన లైవ్ స్క్రీన్ నుంచి మంత్రి హరీశ్ కాళేశ్వరం ప్రగతిని పర్యవేక్షించారు. మంత్రి లైవ్‌లోకి రావడంతో అన్నారం బ్యారేజీలో పనిచేస్తున్న అధికార యంత్రాంగం, సిబ్బంది నివ్వెరపోయారు. పనులు జరుగుతున్న ప్రాంతంలో ఉన్న సంబంధిత ఏజెన్సీ ఇంజనీర్, ఇరిగేషన్ ఇంజనీర్లతో నేరుగా సంభాషించారు. పనులు జరుగుతున్న తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. శనివారంనాడు ఎంత కాంక్రీటు వేశారు? ఎంత టార్గెట్ రీచ్ అయ్యారు? ఎన్ని గేట్లు ఫ్యాబ్రికేట్ చేశారు అని ఇరిగేషన్ ఈఈ మల్లికార్జున ప్రసాద్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు సైటులో ఉండే ప్లేస్మెంట్ రిజిష్టర్‌ను తనిఖీ చేశారు. క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది, ఫీల్డ్ ఇంజనీర్ల విధుల రికార్డులను కూడా మంత్రి హైదరాబాద్ నుంచే తనిఖీ చేశారు. గత నెల డిసెంబర్లో 1.04 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరిగాయని సైటు ఇంజనీర్లు మంత్రికి తెలిపారు. జనవరి నుంచి ప్రతినెలా 1.50 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనుల లక్ష్యంతో పనిచేస్తున్నట్టు సైట్ ఇంజనీర్లు మంత్రికి వివరించారు. కాగా కాళేశ్వరంకు సంబంధించిన ప్యాకేజీ –6, ప్యాకేజీ– 8లకు అవసరమైన పంపులు, మోటార్లు, ఇతర యంత్ర పరికరాలను సకాలంలో సరఫరా చేస్తామని బీహెచ్ఈఎల్ ఉన్నతాధికారుల బృందం ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. శనివారం ఈ బృందం హరీశ్‌రావుతో జలసౌధలో ప్రత్యేకంగా సమావేశమైంది. ఛనాకా–కొరటా పనులపై ఆగ్రహం.. ఛనాకా–కొరటా ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగడంపట్ల హరీశ్‌రావు అధికారులు, ఏజెన్సీల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రోజు 1,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరగని పక్షంలో ఏజెన్సీని మార్చుతామని ఆయన హెచ్చరించారు. 15 రోజులలో పనుల పురోగతి లేకపోతే సంబంధిత ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్చి నెలాఖరులోపు బ్యారేజీ పియర్స్‌ను బ్రిడ్జి లెవల్ వరకు లేపాలని, ఈలోగా గేట్ల తయారీ పూర్తి చేయాలన్నారు. వెనువెంటనే గేట్లను బిగించాలని కోరారు. జనవరి 15 లోపు సర్జ్‌పూల్ డిజైను, డెలివరీ సిస్టమ్, ప్రెషర్ పైపులైను వ్యాలీ క్రాసింగ్ డిజైన్లను పూర్తి చేయాలని సీడీఓ సీఈని ఆదేశించారు. మిగిలిన పైపులైన్ నిర్మాణాన్ని మార్చి చివరిలోగా పూర్తి చేయాలని హరీశ్ కోరారు. పవర్ లైన్స్ ఏర్పాటుకు 11 ప్రాంతాల్లో భూయజమానులతో ఇబ్బందులు ఉన్నట్టు ట్రాన్స్‌కో డైరెక్టర్ సూర్యప్రకాశరావు మంత్రికి తెలిపారు. దీనిపై ఆదిలాబాద్ జిల్లా మంత్రి జోగు రామన్నతో హరీశ్ ఫోన్లో మాట్లాడారు. రెండు, మూడు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. -
ఆశలు తీర్చాలి..నమ్మకం నిలబెట్టాలి!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడంతోపాటు సాగునీటిపై రైతాంగం ఆశల్ని తీర్చాల్సిన బాధ్యత ప్రతి ఇంజనీరుపై ఉందని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌కు ఉన్న అవగాహన దేశంలో మరే సీఎంకు లేదన్నారు. వచ్చే ఏడాది ఎన్నికల దృష్ట్యా సాగునీటి శాఖకు రాబోయే 8 నెలలే కీలకమన్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ 2018 క్యాలెండర్‌ను మంత్రి బుధవారం జలసౌధలో ఆవిష్కరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న పనుల వేగాన్ని మిగతా ప్రాజెక్టుల్లోనూ చేపట్టాలన్నారు. 16 నెలల్లో చేయాల్సిన పనుల్ని 8 నెలల్లోనే పూర్తి చేయాలని కోరారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులను నిర్మించే అవకాశం ఇక రాదన్నారు. రైతుల జీవితాల్లో వెలుగు నింపే జలసంకల్పంలో భాగస్వాములైనందుకు ఈ శాఖ ఇంజనీర్లంతా గర్వపడాలన్నారు. సామాజిక బాధ్యతగా ఉద్యోగ విధులు నిర్వర్తించాలని కోరారు. మరో 312 ఏఈఈలను నియమిస్తాం నీటిపారుదల శాఖలో ఈ ఏడాది మరో 312 మంది ఏఈఈలను నియమిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడంతోనే కాళేశ్వరం ప్రాజెక్టులో 8 వేల భూసేకరణ పూర్తయిందన్నారు. సెలవులు, పండుగల్లో కూడా పనిచేయడంతోనే అనుకున్న సమయానికి డిజైన్లు పూర్తయ్యాయన్నారు. జోషి (ష్) స్ఫూర్తిగా: టైపిస్టు, సెక్షన్ క్లర్క్ చేసే పనుల్ని కూడా ఈ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అహం లేకుండా చేసుకుపోతున్న తీరును ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ స్పెషల్ సీఎస్ జోషి, ఇరిగేషన్ ఈఎన్సీలు మురళీధరరావు, నాగేందర్ రావు, అనిల్, లిఫ్ట్ పథకాల సలహాదారు పెంటారెడ్డి, పలువురు సీఈ, ఎస్ఈలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
నిర్వాసితులకు న్యాయం చేస్తాం
దేవరకొండ: పెండ్లిపాకల రిజర్వాయర్ నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ వర్తింపజేస్తామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఈ రిజర్వాయర్ పనులు వేగవంతం చేస్తామని చెప్పారు. శనివారం నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో నాయిని నర్సింహారెడ్డి, గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డిలతో కలసి హరీశ్‌రావు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నక్కలగండి ప్రాజెక్టును సంద ర్శించారు. పెండ్లిపాకల పనుల్లో ఏజెన్సీ అలసత్వం వహిస్తోందని, అలసత్వం వీడకపోతే బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని చెప్పారు. నాగర్ కర్నూల్ జిల్లాలో భూ సేకరణ సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు హామీనిచ్చారు. నక్కలగండి సొరంగమార్గం తవ్వకాల్లో వినియోగిస్తున్న యంత్రాల్లో తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు విదేశాల నుంచి సామగ్రిని తెప్పించినట్లు చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాదు.. ఉత్తరకుమార్‌రెడ్డి అని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావును కోరారు. వారి వెంట నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు. యాడీ.. వారుచి కాయ్ చందంపేట (దేవరకొండ): ‘‘యాడీ..వారుచి కాయ్.. తారీ సమస్యలు.. కాయ్ చికాయ్.. తారి తరఫున సర్కార్ చ్ఛాయ్(అమ్మ బాగున్నారా, మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా.. ప్రభుత్వం మీ సమస్యలను పరి ష్కరిస్తుంది)’’ అంటూ లంబాడీ భాషలో మహిళలను హరీశ్‌రావు పలకరించారు. శనివారం నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని నక్కలగండి బండ్ పనులను పరిశీలించిన ఆయన కొంతమంది గిరిజన మహిళలతో ముచ్చటించారు. అక్కడే ఉన్న మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌లు హరీశన్నకు అన్ని భాషలొస్తాయని నవ్వుతూ అన్నారు. -
‘అక్షయ’కు ఆయుష్షు
సిద్దిపేటజోన్: ఏడేళ్ల చిన్నారి అక్షయకు ఒక్క వాట్సాప్ సందేశం పునర్జన్మను ప్రసాదించింది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి వ్యధను సోషల్ మీడియాలో వాట్సాప్ మెసేజ్ రూపంలో చూసి చలించిపోయిన మంత్రి హరీశ్‌రావు ఆదుకొని ప్రాణాలు నిలబెట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన చంద్రం కుమార్తె అక్షయ కొన్ని నెలల క్రితం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. పేదరికంలో ఉన్న చంద్రం.. తన కుమార్తె వైద్యం కోసం ప్రభుత్వ పరంగా సాయం అందించాలని వాట్సాప్‌లో మంత్రిని కోరారు. దీంతో చలించిన హరీశ్.. చంద్రంను తన నివాస గృహానికి పిలిపించుకుని మాట్లాడారు. పాపకు అవసరమైన చికిత్సకు ఎంత ఖర్చయినా తాను భరిస్తానని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.4 లక్షలను మంజూరు చేయించారు. దీంతో చిన్నారికి కేర్ ఆస్పత్రిలో ఊపిరితిత్తులను బాగు చేయడంతోపాటు గుండె రక్త నాళానికి స్టంట్ వేశారు. ఆదివారం అక్షయ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. అక్షయ తండ్రి చంద్రం కుటుంబ సభ్యులతో కలసి మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రి హరీశ్‌రావును కలసి కృతజ్ఞతలు తెలిపారు. -
కాళేశ్వరం పూర్తే ‘కాకా’కు నివాళి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపుదిద్దు కున్న అప్పటి ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు దివంగత కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి (కాకా) చలవేనని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. గత ప్రభుత్వం నీళ్లు లేని చోట ప్రాజెక్టును ప్రతిపాదించిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి లభ్యత ఉన్న మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు రీడిజైన్ చేశారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు అతి త్వరలో పూర్తి కాబోతోందని, కాకాకు అదే నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసై టీలో వెంకటస్వామి తృతీయ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ, ‘కాకా అన్ని పదవులు అధిష్టించారు. అహం భావం లేకుండా సామాన్య ప్రజలు, కార్మికులతోనే ఆయన నిరాడంబరంగా తిరిగారు. శక్తివంతమైన కార్పొరేట్ లాబీయింగ్‌ను తట్టుకొని కార్మికులకు పెన్షన్ పథకం అమలు జరిగేలా పోరాడారు’ అని వివరించారు. కాకాను అత్యున్నతంగా గౌరవించుకో వాలని ట్యాంక్‌బండ్‌పై విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. కాకా కుమారులు వివేక్, వినోద్ కీలక సందర్భాల్లో చక్రం తిప్పారని, తెలంగాణ ఉద్యమంలో ఎంపీగా వివేక్ తెర వెనుక ఎంతో క్రియాశీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. 2004లో కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ పొత్తులో కాకా కీలక పాత్ర వహించారన్నారు. తెలంగాణ సమాజం వెంకటస్వామికి ఎంతో రుణపడి ఉందని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. సమాజం మేలు కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం వెంకట స్వామి ముందుచూపుతో అంబేడ్కర్ సొసైటీని స్థాపించారని కొనియాడారు. కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ తదితరులు హాజరయ్యారు. -
కరెంట్ బాధ్యత ప్రభుత్వానిది
సాక్షి, సిద్దిపేట: ‘మీకు కావాల్సినంత కరెంట్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ, భూగర్భ జలాలు పరిరక్షించు కోవాల్సిన బాధ్యత మీపై ఉంది..’ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు రైతులనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఆటోమేటిక్ స్టార్టర్ల తొలిగింపుతో లాభాలపై శనివారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ కమిటీల అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. దేశంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. గతంలో కనీసం మూడు గంటల విద్యుత్ అయినా ఇవ్వమని రైతులు ధర్నాలు చేయడంతో పాటు కరెంటు కోసం బోర్ల వద్ద పడిగాపులు కాసిన రోజులు ఉన్నాయని మంత్రి గుర్తుచేశారు. పూర్తిస్థాయిలో కరెంటు ఇస్తున్న నేపథ్యంలో.. రైతులు ఆటోమేటిక్ స్టార్టర్ల ద్వారా అవసరానికి మించి నీళ్లు తోడేస్తున్నారని ఆవేదన చెందారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని, రబీ పంటలు చేతికి వచ్చే సమయానికి నీరు లేకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు స్టార్టర్లను తొలగించాలని, ఇది ఉద్యమంలా ఎవరికి వారు అమలు చేయాలని కోరారు. గోదావరి జలాలతో నల్లగొండ, భువనగిరి, వరంగల్, కరీంనగర్ సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలు సస్యశ్యామలం అయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, అప్పటి వరకు భూగర్భ జలాలు కాపాడుకోవాలని హరీశ్‌రావు సూచించారు. స్టార్టర్లను తొలగిస్తామని ప్రతిజ్ఞ తమ గ్రామంలో ఆటోమేటిక్ స్టార్టర్ల లేకుండా చేస్తామని సిద్దిపేట మండలం బంజరుపల్లికి చెందిన రైతులు ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వం తమ సంక్షేమం కోసం ఆలోచిస్తున్నదని, తామూ ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధమని వారు ప్రకటించారు. ఈ సందర్భంగా సాగుకు నిరంతరంగా కరెంట్ సరఫరా చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, టీఎస్పీడీసీఎల్ సీఎండీ రఘురామరెడ్డి, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, సతీష్‌కుమార్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పంటలు కొన్నరు.. పైసలివ్వరా?
సాక్షి, హైదరాబాద్: ఇటీవల షాద్‌నగర్‌లో మార్క్‌ఫెడ్ రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోళ్లు జరిపింది. రైతులకు రూ.4 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ రూ.66 లక్షలు మాత్రమే ఇచ్చింది. 20 రోజులు గడిచినా పూర్తిగా సొమ్ము చెల్లించలేదు. ఈ విషయం మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు దృష్టికి వచ్చింది. ఆయన మందలించాక అధికారులు మరో రూ. రెండున్నర కోట్ల వరకు రైతులకు చెల్లించారు. ఇంకా రూ.కోటి వరకు చెల్లింపులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇక్కడే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. మొక్కజొన్న, మినుములు, పెసర, సోయాబీన్, వరి, పత్తి పంటలను ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేసినా.. రైతులకు సకాలంలో సొమ్ము చెల్లించడం లేదు. మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారమే... రైతులకు ఇంకా రూ.324 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ధాన్యం కొనుగోళ్లు మినహా మిగతా పంటలకు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో అనేక చోట్ల రైతులు తమ పంటలను దళారులకు అమ్ముకుంటున్నారు. మద్దతు ధర కంటే తక్కువే ఇస్తున్నా.. తక్షణమే సొమ్ము చెల్లిస్తుండటంతో వారికే విక్రయిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు.. ప్రధాన పంటల్లో మిరప మినహా దాదాపు అన్ని పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను ఖరారు చేస్తుంది. రైతులు పండించే పంటలకు మార్కెట్లో మంచి ధర లభించే పరిస్థితి లేకుంటే.. ప్రభుత్వ సంస్థలు రంగంలోకి దిగి మద్దతు ధర మేరకు ఉత్పత్తులను కొనుగోలు చేస్తాయి. ఈ సారి భారత పత్తి సంస్థ (సీసీఐ) రాష్ట్రంలో 243 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. పౌర సరఫరాల శాఖ 2,555 వరి కొనుగోలు కేంద్రాలను, హాకా సంస్థ 29 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనేందుకు 236, పెసర కొనేందుకు 12, మినుములు కొనేందుకు 13 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటన్నింటిలో పౌర సరఫరాల శాఖ కొనుగోలు చేసిన ధాన్యానికి మాత్రమే త్వరగా చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ శాఖ ఇప్పటివరకు 15.05 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. రైతులకు రూ. 2,388 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటివరకు రూ. 2,203 కోట్లు చెల్లించింది కూడా. మార్క్‌ఫెడ్, హాకాలు కొనుగోలు చేసిన ఉత్పత్తులకు మాత్రం చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. రైతులకు మార్క్‌ఫెడ్ రూ.91.26 కోట్లు, హాకా రూ.35.07 కోట్లు బకాయి పడ్డాయి. మంత్రి హెచ్చరించినా.. రైతులకు చెల్లింపుల్లో జాప్యం చేయొద్దని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించినా అధికారుల తీరు మారడం లేదనే విమ ర్శలు వినిపిస్తున్నాయి. మార్క్‌ఫెడ్ రూ.500 కోట్ల రుణం తీసుకోవడానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. అయినా ఆ సంస్థ రైతులకు చెల్లిం పుల్లో జాప్యం చేస్తోంది. మార్క్‌ఫెడ్ 20.31 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసింది. దాని విలువ రూ.289 కోట్లు కాగా.. ఇప్ప టివరకు రూ.234 కోట్లు చెల్లించి రూ.55 కోట్లు బకాయి ఉంది. అలాగే మిను ముల కు సంబంధించి రూ.31.03 కోట్లు.. పెసర్ల కొనుగోళ్లకు సంబంధించి రూ.5.05 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇక హాకా సంస్థ 3.36 లక్షల క్వింటాళ్ల సోయాబీన్ కొను గోలు చేసి రైతులకు రూ.67.67 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇంకా రూ.35.07 కోట్లు బకాయి పడింది. -
కల్వకుర్తి పథకాన్ని విస్తరిస్తాం
సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్రంలోని ప్రతీ ఎకరానికి సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తోందని.. నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని(కేఎల్ఐ) మరింత విస్తరించి అప్పర్ ప్లాట్లోని అమ్రాబాద్‌కు సాగునీరు అందిస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో బుధవారం ఆయన పర్యటించారు. తెలకపల్లి మండలంలోని లక్నారంలో ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి చేపట్టిన జల విజయయాత్రను మంత్రి ప్రారంభించారు. హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు అభివృద్ధి నిరోధకులుగా మారారని, తప్పుడు కేసులతో ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని అన్నారు. రైతులకు సాగునీరు అందించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మూడేళ్లలో విజయం సాధించిందని అన్నారు. కేఎల్‌ఐకి రూ.1300 కోట్లు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రూ.1300 కోట్లను ఒక్క కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పైనే ఖర్చు చేసినట్లు మంత్రి హరీశ్ వెల్లడించారు. గత బడ్జెట్లో ఇందుకోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించడం వల్లే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తయి ప్రస్తుతం నీరందుతోందని అన్నారు. ప్రాజెక్టులు పూర్తయ్యేలా వాటి వద్దే నిద్ర చేస్తూ హరీశ్‌రావు పనులను పరుగులెత్తిస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించారు. నియోజకవర్గంలోని కల్వకుర్తి ఎత్తిపోతల కాల్వల వెంట రైతుల సమస్యలను తెలుసుకునేందుకు జల విజయ యాత్రను చేపట్టినట్లు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి వివరించారు. కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్మన్ బండారు భాస్కర్ పాల్గొన్నారు. -
సకాలంలో పూర్తి చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల విషయంలో టైమ్‌లైన్ ప్రకారం పనులు పూర్తి చేయాలని, ఎలాంటి అలసత్వం పనికి రాదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులన్నిటినీ వచ్చే జూన్ కల్లా పూర్తి చేయాలన్నారు. యాసంగి సీజన్లో ఎంత ఆయకట్టుకు నీరిస్తున్నారో, ఏ పంట ఎన్ని ఎకరాల్లో సాగవుతోందో సమగ్ర అంచనా రూపొందించాలని సూచించారు. మంగళవారం జలసౌథలో కల్వకుర్తి ప్రాజెక్టు పురోగతిని మంత్రి సమీక్షించారు. ఈ ప్రాజెక్టులో బాటిల్ నెక్ సమస్యలను గుర్తించాలని, కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయడానికి నలుగురు సభ్యులతో ఒక కమిటీని నియమిస్తున్నామన్నారు. ఈ నెల 26 కల్లా ఈ కమిటీ నివేదికను సమర్పించాలన్నారు. నివేదికలోని అంశాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని అధికారులకు సూచించా రు. 2018 ఖరీఫ్ సీజన్లో 4,500 క్యూసెక్కుల ప్రవాహానికి తగిన విధంగా కల్వకుర్తి కాల్వలను సిద్ధం చేయాలని, కల్వకుర్తి లిఫ్ట్ 3 టన్నెల్లో మిగిలిన లైనింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పారు. మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు, స్ట్రక్చర్ల పనులు పూర్తి చేయాలన్నారు. కల్వకుర్తితో పాటు రాజీవ్ భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ పనుల పురోగతిని కూడా మంత్రి సమీక్షించారు. పాలమూరు ప్రాజెక్టులకు ప్రాధాన్యత.. ప్రాజెక్టులన్నీ పూర్తయితే పూర్వ పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని హరీశ్‌రావు చెప్పారు. కల్వకుర్తికి చెందిన మెయిన్ కెనాల్ సహా అన్ని డిస్ట్రిబ్యూటరీల పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కల్వకుర్తికి నీటి కేటాయింపులను 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచామని, సీఎం కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. వచ్చే జూన్ కల్లా మొత్తం 5 పంపులు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు 2014 జూన్ వరకు పదేళ్లలో పెట్టిన ఖర్చు రూ.2,716 కోట్లు కాగా, ఈ మూడున్నరేళ్లలోనే రూ.1,121.17 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. కల్వకుర్తి నియోజకవర్గానికి నీరందించడానికి అడ్డంకిగా ఉన్న ఆవంచ ఆక్విడక్టు పనులను పూర్తి చేసి ఇప్పుడు నీటిని విడుదల చేశామన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్‌రావు, విజయప్రకాశ్, పెంటారెడ్డి, నరేందర్ రెడ్డి, సీఈలు ఖగేందర్‌రావు, లింగరాజు, ఎస్ఈ భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
హరీశ్‌పై కోటి ఆశలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రజల తాగు, సాగునీటి కష్టాలు తీర్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో కాళేశ్వరం ప్రాజెక్టు అత్యంత కీలకమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌కు తాగునీరు అందించడంతో పాటు పూర్వపు ఏడు జిల్లాల అవసరాలు తీర్చగలిగే ప్రాజెక్టు ఇది అని చెప్పారు. ఇంత ప్రాధాన్యమున్న ప్రాజెక్టు కాబట్టి అధికారులు, కాంట్రాక్టర్లు మనసు పెట్టి పనిచేయాలని సూచించారు. ప్రాజెక్టుకు భూసేకరణ, నిధుల సమీకరణ, అటవీ అనుమతులు వంటి అవాంతరాలన్నీ తొలగిపోయాయని.. ఇకపై పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించి అంతర్రాష్ట ఒప్పందాలు పూర్తయ్యాయని, అటవీ అనుమతులు వచ్చాయని, పర్యావరణ అనుమతులు కూడా తుది దశలో ఉన్నాయని చెప్పారు. శనివారం ప్రగతిభవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. సుదీర్ఘంగా ఏడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో మేడిగడ్డ బ్యారేజీ నుంచి గంధమల్ల, బస్వాపూర్ వరకు చేపడుతున్న అన్ని పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వేగంగా, తక్కువ వ్యవధిలో అనుమతులు సాధించడానికి కృషి చేసిన అధికారులను అభినందించారు. విద్యుత్ శాఖకు కృతజ్ఞతలు ‘‘తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని అద్భుతంగా మెరుగుపరిచాం. జనవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించనున్నాం. రాష్ట్రంలో ఇకపై ప్రతి రంగానికి 24 గంటలూ నాణ్యమైన కరెంట్ అందిస్తాం. సౌర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నాం. ఇప్పటికే 3 వేల మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి జరుగుతోంది. మరో నెలన్నరలో ఇంకో 500 మెగావాట్లు అందుబాటులోకి రానుంది. ఇక ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్ ఇవ్వడానికి విద్యుత్ శాఖ చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అనుకున్నదాని కంటే నెల ముందే విద్యుత్ శాఖ పని పూర్తిచేస్తోంది. జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, ఇతర అధికారులు, సిబ్బంది బాగా పనిచేసి రాష్ట్రానికి మేలు చేస్తున్నారు. విద్యుత్ శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నా..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల పంపుహౌజ్‌లు, ఇతర పనులకు విద్యుత్ సరఫరా ఏర్పాట్లను ప్రభాకర్‌రావు, ఇతర అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. హరీశ్‌పై కోటి ఆశలు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుపై తెలంగాణ ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తారని, తమకు నీళ్లు అందిస్తారని మంత్రి హరీశ్‌పై, నీటి పారుదల శాఖ అధికారులపై ప్రజలు ఎంతో ఆశతో, నమ్మకంతో ఉన్నారు. మంత్రి, అధికారులు ఇందుకు అనుగుణంగానే పనిచేస్తున్నారు. మహారాష్ట్రతో ఒప్పందం విషయంలో మంత్రి బాగా పనిచేశారు. సీఈ వెంకటేశ్వర్లు కూడా మహారాష్ట్ర అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడారు. ప్రాజెక్టులు పూర్తి కావడానికి కూడా ఇదే పట్టుదలతో పనిచేయాలి. ఇకపై మంత్రి హరీశ్‌రావు ప్రతి 10 రోజులకోసారి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలి. నెలకోసారి నేను, సీఎస్ కూడా కాళేశ్వరం పనులు చూస్తాం. మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు వరకు నీరు తీసుకుపోవడం చాలా ముఖ్యం. ఈ పనులు చేయడానికి 200 రోజుల సమయం ఉంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి..’’అని కేసీఆర్ సూచించారు. మిడ్ మానేరు సిద్ధం.. మిడ్‌మానేరు డ్యాం నిర్మాణం దాదాపు పూర్తయిందని, ఇప్పటికే 10 గేట్లు బిగించామని.. కట్టపై రోడ్డు కూడా నిర్మిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. దీంతో జనవరి నెలాఖరు కల్లా పనులు మొత్తం పూర్తికావాలని, 25 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి సిద్ధం కావాలని కేసీఆర్ ఆదేశించారు. ఇక మిడ్‌మానేరు నుంచి గౌరవెల్లి వరకు 80 వేల ఎకరాలకు నీరివ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని.. మిడ్‌మానేరు నుంచి గౌరవెల్లి దాకా 4,200 క్యూసెక్కుల ప్రవాహ ఉధృతికి తగ్గట్లు కాలువ, టన్నెల్ నిర్మించామని, డిస్ట్రిబ్యూటరీ కాల్వలు నిర్మించాల్సి ఉందని అధికారులు వివరించారు. దీంతో ఈ కాల్వల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం వెంటనే రూ.80 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు సీఎం ఆదేశించారు. గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని.. ఆ లోపుగా చేరే నీటిని వాడుకునేందుకు అవసరమైన వ్యూహం రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇక మిడ్‌మానేరు నుంచి మల్కన్పేట రిజర్వాయర్ వరకు వెళ్లే టన్నెల్ నిర్మాణ పనులను, రిజర్వాయర్ పనులను సీఎం సమీక్షించారు. హుస్నాబాద్, సిరిసిల్ల తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలని.. మిడ్‌మానేరు నుంచి గౌరవెల్లి, మల్కన్పేటలకు త్వరగా నీళ్లివ్వడం వల్ల అక్కడి రైతులకు మేలు కలుగుతుందని చెప్పారు. ఇక దేవాదుల ఎత్తిపోతల పథకం కోసం అవసరమయ్యే నీటిని అందించడానికి కొత్తూరు వద్ద నిర్మిస్తున్న బ్యారేజీ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. సమావేశంలో అనంతసాగర్, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ తదితర రిజర్వాయర్లపైనా సమీక్షించారు. సమీక్షలో మంత్రులు హరీశ్, ఈటల, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ శంకర్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, సీఎస్ ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఇతర ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. నెలన్నరలో మిషన్ భగీరథ నీళ్లు మిషన్ భగీరథ పనులు వేగంగా జరుగుతున్నాయని, మరో నెలన్నరలో రాష్ట్రంలోని 98 శాతం గ్రామాలకు నీళ్లు అందుతాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల ద్వారా మిషన్ భగీరథకు అవసరమైన నీరు అందించాలని అధికారులకు సూచించారు. కాగా.. పంపుహౌజ్‌లలో మోటార్లను పరిశీలించేందుకు 26 మంది ఇంజనీర్లలో కూడిన ప్యానెల్‌ను సీఎం కేసీఆర్ నియమించారు. అందులో నీటి పారుదల శాఖకు చెందిన 16 మంది విద్యుత్ శాఖకు చెందిన 10 మంది ఇంజనీర్లు ఉంటారు. సమీక్షలో సీఎం నిర్ణయాలివీ.. ⇒ అటవీ శాఖ అనుమతులు త్వరగా సాధించేందుకు అధికారులు కృషి చేయాలని. ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తిచేయడానికి, విద్యుత్ టవర్లు, లైన్లు నిర్మించడానికి అటవీ శాఖ సహకరించాలి. ⇒ కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీ, సింగూరు, మిడ్‌మానేరుకు నీరు అందితేనే మంచినీటి పథకం అమలు చేయగలం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పనులు చేయాలి. ⇒ ప్రతి బ్యారేజీపై డబుల్ లైన్ రోడ్డు నిర్మించాలి. విద్యుత్ సబ్స్టేషన్లు, కాల్వలు, పంపుహౌజ్‌లకు శాశ్వత ప్రాతిపదికన రహదారులు నిర్మించాలి. ⇒ ప్రతి పంపుహౌజ్ వద్ద ఒక విద్యుత్ ఉద్యోగిని ప్రత్యేకంగా నియమించాలి. నీటిపారుదల శాఖతో సమన్వయం ఏర్పాటు చేసుకోవాలి. ⇒ ప్రతి బ్యారేజీ వద్ద మంచి అతిథి గృహం నిర్మించాలి. ⇒ బ్యారేజీలు, పంపుహౌజ్‌లు, కరకట్టలు, కాలువలు, రిజర్వాయర్లు తదితర పనులన్నీ సమాంతరంగా జరగాలి. ⇒ బ్యారేజీల వద్ద భద్రతను పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేయాలి. నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ప్రతి ప్రాజెక్టు వద్ద కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ⇒ ప్రతి బ్యారేజీ వద్ద శాశ్వత ప్రాతిపదికపై హెలిప్యాడ్లు ఏర్పాటు చేయాలి. ⇒ మేడిగడ్డ వద్ద 365 రోజులు నీరు అందుబాటులోకి ఉంటుంది. కాబట్టి ఎత్తిపోతల పనులు ఏ మేరకు పూర్తయితే ఆ మేరకు నీటిని తరలించవచ్చు. ఈ మేరకు చర్యలు చేపట్టాలి. ⇒ ఎత్తిపోతల ప్రాజెక్టుల కోసం 400 కేవీ విద్యుత్ లైన్లను సిద్ధం చేశాం. అంతరాయం కలగకుండా సరఫరా చేయాలి. రాష్ట్ర చట్టం ప్రకారమే భూసేకరణ చట్టం ప్రకారమే భూసేకరణ చేయాల్సి వస్తే తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కొత్త చట్టం ప్రకారమే చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 2013 కేంద్ర చట్టంకన్నా 2017 రాష్ట్ర చట్టం వల్ల ఎక్కువ మేలు కలుగుతుందని చెప్పారు. నిర్వాసితుల భవనాలు, షెడ్డులకు ధర నిర్ణయించినట్లే బోర్లకు కూడా ధర నిర్ణయించాలన్నారు. శనివారం ప్రగతిభవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై సీఎం సమీక్షలో అధికారులు -
అమ్మా.. నేనున్నా!
జగదేవ్‌పూర్ (గజ్వేల్): ‘అమ్మా.. నీ కుటుంబానికి నేను అండగా ఉంటా.. కొడుకు మీద బెంగ పెట్టుకుని బాధపడకు.. పెద్ద కొడుకు రాజుకు గజ్వేల్ ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పిస్తా.. మురళి బాగా చదివేటోడంట.. చనిపోయాడంటే నాకే బాధగా ఉంది..ఏమి రంధి పెట్టుకోకు..ఇచ్చిన డబ్బులతో అప్పులుంటే కట్టుకుని మిగిలినవి భద్రపర్చుకో..’అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మురళి తల్లి లక్ష్మికి భరోసానిచ్చారు. ఈ నెల 3వ తేదీన ఓయూలో దౌలాపూర్కి చెందిన విద్యార్థి మురళి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆ రోజే లక్ష్మితో ఫోన్లో మాట్లాడిన మంత్రి .. నాడు ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం రాత్రి ఎంపీ ప్రభాకర్‌రెడ్డితో కలసి దౌలాపూర్‌కు వచ్చారు. మురళి తల్లి లక్ష్మి, అన్న రాజును పరామర్శించారు. ఉదంతంపై మొదట ఆయన ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ మురళి ఆత్మ హత్య ఘటన బాధాకరమని చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, యువత ఆత్మసైర్థ్యంతో ఉండాలన్నారు. కన్నవాళ్లకు శోకం పెట్టవద్దని సూచించారు. రూ.10 లక్షల ఆర్థికసాయం మురళి కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ పరంగా మంత్రి హరీశ్‌రావు రూ.10 లక్షల నగదును అందజేశారు. అనంతరం మురళి ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఏదైనా బాధ ఉంటే మీ ఊరుకు చెందిన కొండపోచమ్మ ఆలయ ఛైర్మన్ ఉపేందర్‌రెడ్డికి తెలపాలని లక్ష్మికి సూచించారు. -
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి
సాక్షి, హైదరాబాద్: కందికి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పించి తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన ‘కంది ధర ఢమాల్’కథనంపై ఆయన స్పందించారు. కందికి మద్దతు ధర అందించేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యదర్శి సి.పార్థసారథిని ఆదేశించారు. అలాగే ఈ మేరకు సోమవారం అత్యవసరంగా సమావేశమై చర్యలు తీసుకోవాలన్నారు. ఇదిలావుండగా రాష్ట్రంలో 33,500 మెట్రిక్ టన్నుల కందిని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని ఓ ప్రకటనలో హరీశ్ వెల్లడించారు. ధరల మద్దతు పథకం (పీఎస్ఎస్) కింద కందులు కొనుగోలు చేయనున్నట్లు వివరించారు.