
సాక్షి, హైదరాబాద్: కందికి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కల్పించి తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన ‘కంది ధర ఢమాల్’కథనంపై ఆయన స్పందించారు. కందికి మద్దతు ధర అందించేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యదర్శి సి.పార్థసారథిని ఆదేశించారు.
అలాగే ఈ మేరకు సోమవారం అత్యవసరంగా సమావేశమై చర్యలు తీసుకోవాలన్నారు. ఇదిలావుండగా రాష్ట్రంలో 33,500 మెట్రిక్ టన్నుల కందిని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని ఓ ప్రకటనలో హరీశ్ వెల్లడించారు. ధరల మద్దతు పథకం (పీఎస్‌ఎస్) కింద కందులు కొనుగోలు చేయనున్నట్లు వివరించారు.