
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితిని వాట్సాప్ ద్వారా సమీక్షించారు. తడిసిన ధాన్యంపై పలు సూచనలు చేస్తూ జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, వేర్‌హౌసింగ్ అధికారులను అప్రమత్తం చేశారు.
జాయింట్ కలెక్టర్లు వెంటనే మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను సందర్శించి పరిస్థితులను సమీక్షిస్తూ చర్యలు తీసుకోవాలని చెప్పారు. టార్పాలిన్లను వెంటనే సమకూర్చాలని, తడవని ధాన్యాన్ని వెంటనే గోదాంలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. గాలి దుమారం, భారీ వర్షానికి పాడైన గోదాంలకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment