Marketing department
-
పత్తి రేటుకు విపత్తు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తికి ధరల విపత్తు వచ్చింది. సీజన్ మొదట్లోనే, మార్కెట్లోకి పత్తి రావడం మొదలవుతుండగానే రేటు తగ్గిపోయింది. వ్యాపారులు, దళారులు ధరలు బాగా తగ్గించేశారు. కేంద్ర ప్రభుత్వం పత్తికి ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7,521 అయితే.. సోమవారం వరంగల్ మార్కెట్లో కనిష్టంగా రూ.5 వేల నుంచి గరిష్టంగా రూ. 6,950 వరకు మాత్రమే పలికింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోనూ రూ.5,500 నుంచి గరిష్టంగా రూ.7,000కు మించి చెల్లించలేదు. దీనితో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు వారాల క్రితం క్వింటాల్‌కు రూ. 8,250 వరకు ధర చెల్లించినా.. ఇప్పుడు ఒక్కసారిగా తగ్గించేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మార్కెట్లోకి పత్తి రాక పెరిగితే.. ధరలను ఇంకెంత తగ్గిస్తారోనని వాపోతున్నారు. మార్కెట్‌కు పత్తి రాక ప్రారంభమైనా ‘కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)’ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో.. వ్యాపారులు, దళారులు రేటు తగ్గించేస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే.. రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రెండేళ్ల క్రితం పత్తి ధరలు రూ. 10–15 వేల వరకు పలికాయని.. ఇప్పుడు దారుణంగా పడిపోయాయని అంటున్నాయి. పత్తి విస్తీర్ణంలో రాష్ట్రం మూడో స్థానం వానాకాలం సీజన్లో దేశవ్యాప్తంగా 2.74 కోట్ల ఎకరాల్లో పత్తి సాగైంది. మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్రలో అత్యధికంగా 98.47 లక్షల ఎకరాల్లో.. రెండో స్థానంలో ఉన్న గుజరాత్లో 56.56 లక్షల ఎకరాల్లో సాగవగా.. తెలంగాణ 43.76 లక్షల ఎకరాల సాగుతో మూడో స్థానంలో ఉంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 1.60 కోట్ల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేయగా.. అందులో తెలంగాణలో 25.33 లక్షల మెట్రిక్ టన్నుల మేర వస్తుందని రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ వర్గాలు అంచనా వేశాయి. నిజానికి ఖరీఫ్ సీజన్ మొదట్లో పత్తి విత్తనాలు వేసేందుకు అనువైన వర్షాలు పడలేదు. విత్తనాలు వేసినా, వర్షాల్లేక రెండు, మూడు సార్లు వేయాల్సి వచ్చింది. పత్తి పూత దశకు వచ్చిన సమయంలో భారీ వర్షాలు పడ్డాయి. చేన్లు నీట మునిగి.. పూత, కాయ నేలరాలాయి. కొమ్మలు నీటిలో నాని, తెగుళ్లు సోకి దెబ్బతిన్నాయి. అంతేకాదు.. ఈసారి పత్తి విత్తనాల ధరలు, ఎరువులు, డీజిల్, ఇతర ఖర్చులు పెరిగి.. పెట్టుబడి తడిసిమోపెడైంది. ఇలాంటి సమయంలో పత్తి ధరలు తగ్గించేస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా తేమ 8 శాతం, ఆలోపు ఉంటే పూర్తి మద్దతు ధర లభిస్తుంది. 9 శాతం నుంచి 12 శాతం మధ్యలో ఉంటే.. శాతాన్ని బట్టి అదే తరహాలో ధర తగ్గుతూ వస్తుంది. కానీ నాణ్యత బాగున్నా వ్యాపారులు, దళారులు తక్కువ ధర చెల్లిస్తున్నారని రైతులు వాపోతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రంగు మారిన పత్తికి కూడా కనీస మద్దతు ధర దక్కేలా చూడాలని కోరుతున్నారు. ఇప్పటికీ తెరుచుకోని సీసీఐ కొనుగోలు కేంద్రాలు... ఈ నెలాఖరు నుంచి మార్కెట్లోకి పెద్ద ఎత్తున పత్తి రానుంది. ఈ ఏడాది 351 పత్తి కొనుగోలు కేంద్రాలు పెట్టాలని నిర్ణయించారు. కానీ ‘కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)’ ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలేవీ ప్రారంభించలేదు. జిన్నింగ్ మిల్లులను కొనుగోలు కేంద్రాలుగా పెట్టి సీసీఐ పత్తి కొనుగోళ్లు చేస్తుంది. మిల్లులు ఆ పత్తిని జిన్నింగ్ చేసి సీసీఐకు అప్పగించాల్సి ఉంటుంది. టెండర్ల ద్వారా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈసారి టెండర్లు ఇటీవలే పూర్తయినా.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రారంభం కాలేదు. పైగా ఏటా వ్యాపారులు, దళారులు తక్కువ ధరలకు పత్తిని కొనుగోలు చేశాక.. సీసీఐ వచ్చి ప్రైవేట్ వ్యాపారుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారిందని.. అందులో భారీగా సొమ్ము చేతులు మారుతోందనే ఆరోపణలు ఉన్నాయి. రైతుల అవసరం.. వ్యాపారుల సాకులు.. రైతులు చేన్లలో మూడు దశల్లో పత్తిని తీస్తారు. అందులో మొదటి, రెండోసారి ఎక్కువ పత్తి వస్తుంది. రైతులు ఇందులో మొదట ఏరే పత్తిని నిల్వ చేయకుండా మొత్తంగా విక్రయిస్తారు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చేందుకు, ఇతర ఖర్చులకు వినియోగిస్తుంటారు. రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుంటున్న వ్యాపారులు, దళారులు పత్తిని తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం తేమ శాతం అధికంగా ఉందని, ఇటీవలి భారీ వర్షాలు, వరదలకు పంట నాణ్యత కోల్పోయిందని సాకులు చెప్తున్నారు. పలు దేశాల్లో సంక్షోభ పరిస్థితులతో పత్తికి మార్కెట్ తగ్గిందని.. టెక్స్టైల్ మిల్లులు మూతపడ్డాయని చెబుతూ తక్కువ రేటు చెల్లిస్తున్నారు. చాలాచోట్ల వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను దోచుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బంగ్లాదేశ్ సంక్షోభమూ కారణమే! మన దేశంలో పండే పత్తి అధికంగా బంగ్లాదేశ్, చైనా, వియత్నాం, టర్కీ, పాకిస్తాన్ దేశాలకు ఎగుమతి అవుతుంది. కొన్నాళ్లుగా బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం, పశ్చిమాసియా దేశాల్లో అల్లకల్లోలంతో ఎగుమతులు తగ్గుతున్నాయి. దీనితో పత్తికి డిమాండ్ తగ్గి, ధరలు పడిపోతున్నాయని మార్కెటింగ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కానీ గుజరాత్ రాష్ట్రంలో మాత్రం మద్దతు ధర కంటే అధిక రేట్లకు పత్తి కొనుగోళ్లు జరుగుతుండటం, తెలంగాణలో తగ్గిపోవడం ఏమిటన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెటింగ్ శాఖ వర్గాలు చెప్తున్న మేరకు.. గుజరాత్లో ప్రస్తుతం పత్తి క్వింటాల్‌కు రూ.8,257 పలుకుతోంది. వచ్చే నెలలో రూ.8,321 వరకు, డిసెంబర్ నెలలో రూ.8,260 వరకు ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. గుజరాత్లో వస్త్ర పరిశ్రమలు, మిల్లులు, వ్యాపారులు ఎక్కువగా ఉండటం వల్ల.. కొనుగోళ్లు ఎక్కువగా ఉండి, పత్తి ఎక్కువ రేటు పలుకుతోందనే వాదనలూ ఉన్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌పై ఫోకస్ పెట్టి.. ఇతర రాష్ట్రాల రైతులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. కనీస ధర కూడా ఇవ్వడం లేదు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పత్తికి రూ.7,521 మద్దతు ధర ప్రకటించింది. కానీ మార్కెట్లో ఆ ధర దక్కడం లేదు. వ్యాపారులు రూ.6,500 నుంచి రూ.7,000కు మించి ధర పెట్టడం లేదు. అంతేకాదు నాణ్యత పేరిట మరింతగా తగ్గిస్తున్నారు. సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేస్తేనే మద్దతు ధర లభిస్తుంది. అందుకోసమే ఎదురుచూస్తున్నాం. – బానోత్ రామా, బీసురాజుపల్లి తండా, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మంజిల్లా -
పండుగల ముందు 'ధర'.. దడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పండుగల ముందు నిత్యావసరాల ధరలు చుక్కలు తాకుతున్నాయి. రోజురోజుకూ నూనెలు, బియ్యం, కూరగాయల ధరలు పోటాపోటీగా పెరుగుతున్నాయి. రాష్ట్రమంతా ఘనంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ రెండు వారాల్లోనే మొదలవనుంది. తర్వాత పదిరోజుల్లోనే దసరా పండుగ ఉంది. ఈ సమయంలో ధరల పెరుగుదల సామాన్య జనంలో ఆందోళన రేపుతోంది. బియ్యం ధరలు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంటే.. నూనెలు, కూరగాయల ధరలు గత వారంలోనే ఒక్కసారిగా 20–30 శాతం వరకు పెరగడం ఇబ్బందిగా మారుతోంది. ఇలా పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలను, బ్లాక్ మార్కెటింగ్‌ను నియంత్రించడంపైగానీ.. సామాన్యులకు తక్కువ ధరలో సరుకులు అందించడంపైన గానీ ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదనే విమర్శలున్నాయి. బియ్యం మార్కెట్‌పై నియంత్రణ లేక.. రాష్ట్రంలో సన్నబియ్యం బంగారమైపోతోంది. పప్పులతో పోటీపడుతూ రేటు పెరుగుతోంది. జైశ్రీరాం, సోనామసూరి, హెచ్ఎంటీ రకాల బియ్యం రేటు కిలో రూ.70కిపైగా పలుకుతోంది. రైతుల నుంచి సన్నరకాల ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.2,500 నుంచి రూ.3,000కే కొనుగోలు చేస్తున్న మిల్లర్లు.. సన్న బియ్యానికి డిమాండ్ ఉండటంతో అడ్డగోలు రేటుకు విక్రయిస్తున్నారు. బియ్యం మార్కెట్‌పై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం కూడా దీనికి మరింత ఊతమిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం జైశ్రీరాం రకం రా రైస్ (ముడి బియ్యం) మార్కెట్లో 26 కిలోల బ్యాగ్ ధర రూ.1,800 వరకు ఉండగా.. స్టీమ్ రైస్ ధర రూ.1,500 వరకు ఉంది. సోనా మసూరి, హెచ్ఎంటీ రకాల ధరలు రూ.1,700కు చేరాయి. కేంద్రం ప్రకటనతో పెరిగిన వంట నూనెల ధర వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 20శాతం పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించటంతో వాటి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్), సోయాబీన్, రిఫైన్డ్ పామాయిల్, వేరుశనగ నూనెలపై దిగుమతి సుంకాన్ని 12.5 శాతం నుంచి 32.5 శాతానికి పెంచుతున్నట్టు కేంద్రం ఈనెల 14న ఉదయం ప్రకటన చేయగా.. అదే రోజు సాయంత్రానికే నూనెల ధరలు రూ.20కుపైగా పెరిగాయి. ఇటీవలి వరకు లీటర్ రూ.105గా ఉన్న పొద్దుతిరుగుడు నూనె ధర ప్రస్తుతం రూ.130–140కి చేరింది. పామాయిల్ రేటు రూ.95 నుంచి రూ.120 దాటిపోయింది. వేరుశనగ నూనె రూ.170 దాటింది. నిజానికి కొత్తగా దిగుమతి అయ్యే నూనెలపైనే పన్ను పెరిగింది. కానీ ఇప్పటికే దిగుమతి అయి, నిల్వ ఉన్న స్టాక్‌పైనా అధిక రేటు వసూలు చేస్తుండటం గమనార్హం. అంతేకాదు.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘విజయ’ వంట నూనె ధరలనూ అమాంతం పెంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ‘విజయ’ వంట నూనెలను తక్కువ ధరకు అందించే అవకాశం ఉన్నా.. ఆ దిశగా చర్యలేవీ చేపట్టడం లేదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం విజ్ఞప్తిని పట్టించుకోని వ్యాపారులు సుంకం పెంపునకు ముందే దిగుమతి చేసుకున్న స్టాక్ అయిపోయే వరకు కంపెనీలు.. నూనెల ధరలను గరిష్ట రిటైల్ ధర కంటే తక్కువగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా సుంకం పెంపునకు ముందే దిగుమతి అయిన సుమారు 30 లక్షల టన్నుల వంట నూనెల స్టాక్ ఉందని.. అది 45–50 రోజుల వరకు సరిపోతుందని అంచనా. అయినా కూడా హోల్‌సేల్ నుంచి రిటైల్ వరకు అన్నిచోట్లా వంటనూనెల ధరలు పెంచేశారు. దసరా నాటికి ఇంకా ధరలు పెరుగుతాయనే ప్రచారంతో.. వినియోగదారులు కొనుగోలు చేసి పెట్టుకుంటుండటం గమనార్హం. అందుబాటులో లేని ఉల్లి, వెల్లుల్లి.. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఉల్లి, వెల్లుల్లి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వెల్లుల్లి కిలో రూ.350 నుంచి రూ.400 వరకు ఉండగా.. ఉల్లి ధర కిలో రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. మన దేశంలో అవసరమైన వెల్లుల్లిలో అత్యధికంగా 40 శాతం వరకు మధ్యప్రదేశ్ నుంచే వస్తోంది. దీనితోపాటు వెల్లుల్లి పండించే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లోనూ.. వాతావరణ పరిస్థితులు కలసి రాక దిగుబడి తగ్గిందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. దీనితో వెల్లుల్లి రేటు మరింతగా పెరగొచ్చని అంటున్నాయి. ఉల్లి పంటకు కూడా వర్షాల ఎఫెక్ట్ పడింది. ఇప్పటికే రూ.60 దాటింది. ఇది రూ.100కు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పప్పులు, కూరగాయల మోత కూడా.. కందిపప్పు, పెసర, మినుములు, శనగ.. ఇలా పప్పుల ధరలన్నీ పెరిగాయి. కందిపప్పు ధర నాణ్యతను బట్టి కిలో రూ.150 నుంచి రూ.180 వరకు ఉండగా.. పెసర పప్పు రూ.130 నుంచి రూ.150 వరకు ఉంది. శనగపప్పు ధర గత పదిరోజుల్లోనే రూ.85 నుంచి రూ.105కు పెరిగింది. మినపపప్పు రూ.150పైనే పలుకుతోంది. మరోవైపు కూరగాయల ధరలు కూడా కొండెక్కుతున్నాయి. కిలోకు కాలీఫ్లవర్ రూ.150కిపైగా, పచ్చిమిర్చి రూ.120కిపైగా ఉంది. టమాటా ధర వారం క్రితం వరకు కిలో రూ.25–30 ఉంటే.. ఇప్పుడు రూ.60కి చేరింది. బీరకాయ, దోసకాయ, పొట్లకాయ, బెండకాయ, వంకాయ ఏది చూసినా కిలో రూ.50–60 దాటిపోయాయి. చిక్కుడు, బీన్స్ అయితే కిలో రూ.120కి తగ్గడం లేదు. సర్కారులో స్పందనేదీ? అడ్డగోలుగా ధరలు పెరిగిపోతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కానరావడం లేదని, పెరుగుతున్న ధరలపై కనీస సమీక్ష కూడా లేకపోవడం ఏమిటని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం కాస్త దృష్టిపెడితే.. ధరలను కాస్తయినా నియంత్రించవచ్చని నిపుణులు చెప్తున్నారు. మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల ద్వారా నిత్యావసరాలను తక్కువ ధరలతో వినియోగదారులకు అందించవచ్చని వివరిస్తున్నారు. గతంలోనూ ఇలా ధరలు పెరిగినప్పుడు రేషన్‌దుకాణాలు, రైతుబజార్ల ద్వారా తక్కువ ధరలో ఉల్లిగడ్డలు, ఉప్పు, పప్పులు విక్రయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో సంచార మార్కెట్లతో కాలనీల్లో కూరగాయలు, ఇతర నిత్యావసరాలను విక్రయిస్తే కొంత మేర ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్ప పండుగల సమయంలో సామాన్యులు ఇబ్బందులపాలు కావాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. పండుగ ముందు ధరలు పెరిగాయి ఐదు లీటర్ల సన్‌ఫ్లవర్ ఆయిల్ 15 రోజుల కింద రూ.570 ఉంటే.. ఇప్పుడు రూ.639 తీసుకుంటున్నారు. 15 రోజుల్లోనే 70 రూపాయలు పెరిగింది. దసరా పండుగ ముందు ధరలు పెరిగాయి. ఇంకా పెరుగుతాయని అంటున్నారు. – నాయిని రవి, న్యూశాయంపేట, హనుమకొండ అన్నింటి ధరలు మండిపోతున్నాయి వంట నూనె ఒకటే కాదు..అన్ని నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. పప్పులు, కూరగాయలు కూడా కొనే పరిస్థితి లేదు. – యానం విద్య , కాకాజీ కాలనీ, హనుమకొండ కూరగాయల రేట్లు పెంచేశారు కూరగాయల రేట్లు బాగా పెరిగాయి. టమాటా మొన్నటివరకు 20 రూపాయలు ఉంటే ఇప్పుడు 50, 60 రూపాయలకు అమ్ముతున్నారు. కాకర 30 నుంచి 45కు పెంచారు. వారంలోనే అన్ని కూరగాయల రేట్లు పెరిగాయి. రోజువారీగా కూరగాయల ధరలను చూసి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. – సాంబయ్య, నల్లగొండ నూనెలు కొనే పరిస్థితి లేదు వంట నూనె ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సన్ ఫ్లవర్ మొన్నటిదాకా 105 వరకు ఉంటే.. ఇప్పుడు 125, 130 రూపాయలకు పెంచారు. పామాయిల్ 90 నుంచి 120కి పెంచి అమ్ముతున్నారు. శనగపప్పు మొన్నటిదాకా కిలో 85 రూపాయల దాకా ఉంటే.. ఇప్పుడు 110 రూపాయలు తీసుకుంటున్నారు. – దుర్గ, నల్లగొండ నూనెలు కొనే పరిస్థితి లేదువంట నూనె ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సన్ ఫ్లవర్ మొన్నటిదాకా 105 వరకు ఉంటే.. ఇప్పుడు 125, 130 రూపాయలకు పెంచారు. పామాయిల్ 90 నుంచి 120కి పెంచి అమ్ముతున్నారు. శనగపప్పు మొన్నటిదాకా కిలో 85 రూపాయల దాకా ఉంటే.. ఇప్పుడు 110 రూపాయలు తీసుకుంటున్నారు. – దుర్గ, నల్లగొండ -
నిమ్మ.. ‘ధర’హాసం
తెనాలి: నిమ్మ ధరలు ఆశాజనకంగా ఉండడంతో ఆ రైతుల మోముల్లో ‘ధర’ హాసం కనిపిస్తోంది. దిగుబడి కొంతమేర తగ్గినప్పటికీ, మార్కెట్లో గరిష్ట ధరలకు క్రయ, విక్రయాలు సాగడంతో రైతులు దిల్ఖుష్ గా ఉన్నారు. నిమ్మకాయల ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఏడు రాష్ట్రాల్లో ఆంధప్రదేశ్ ఒకటి. రాష్ట్రంలో గూడూరు, ఏలూరు మార్కెట్ల తర్వాత నిమ్మకాయలకు ప్రసిద్ధి తెనాలి మార్కెట్. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆరు వేల ఎకరాలకుపైగా నిమ్మతోటలు సాగులో ఉంటే అందులో అత్యధిక విస్తీర్ణం తెనాలి డివిజనులోనే ఉంది. కృష్ణా జిల్లాలో తిరువూరు ప్రాంతంలో 800 ఎకరాల్లో నిమ్మతోటలున్నాయి. ఆ జిల్లా రైతులు దగ్గర్లోని ఏలూరు మార్కెట్‌కు వెళుతుంటారు. తెనాలి మార్కెట్ యార్డు ఆవరణలోని నిమ్మ మార్కెట్లో ప్రతిరోజూ లావాదేవీలు జరుగుతుంటాయి. ఇక్కడ్నుంచి ఉత్తర భారతదేశంలోని కాశీ, కోల్‌కతా, ఢిల్లీ, కాన్పూర్‌కు ఎగుమతి చేస్తున్నారు. సీజనులో 12 లారీలకుపైగా అన్ సీజనులో నాలుగైదు లారీల సరుకు ఎగుమతి అవుతుంటుంది. నికరమైన ఆదాయం నిమ్మతోటలు ఏటా జూలై, డిసెంబరు, మే నెలల్లో మూడు కాపులనిస్తాయి. ఒక కాపు మూడేసి నెలలు దిగుబడి నిస్తుంటాయి. ప్రతి కాపునకు సుమారు 200 టిక్కీల వరకు కాయ దిగుబడి వస్తుంది. కాయ సైజు ఆధారంగా ఒక్కో టిక్కీకి 55 కిలోలు వస్తాయి. కొన్నేళ్లుగా నిమ్మతోటల రైతులకు నికరమైన ఆదాయం వస్తున్నందున, కౌలు ధరలు పెరిగాయి. ఎకరా కౌలు రూ.90 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు చేరిన సందర్భాలున్నాయి. ఎరువులు, పురుగు మందులు, నీటితడులకు కలిపి ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ ఖర్చు చేయాల్సివస్తుంది. అయినా సరే నిమ్మసాగు లాభిస్తున్నందున మెట్ట ప్రాంతం నుంచి డెల్టా, మాగాణి భూములకు విస్తరించింది. ఈ ఏడాది భేషుగ్గా... గతంకన్నా ఈ ఏడాది నిమ్మ సాగు రైతులకు సంతృప్తినిచ్చింది. తెనాలి నిమ్మ మార్కెట్లో కిలో రూ.50 నుంచి రూ.70 మధ్య విక్రయాలు జరుగుతూ వచ్చాయి. గత ఏప్రిల్‌లో కనిష్ట ధర రూ.68, గరిష్టంగా రూ.80కి పైగా కొనుగోళ్లు జరిగాయి. ఏప్రిల్ 24న కిలో రూ.90లకు అమ్మకాలు జరిగాయి. ఏప్రిల్ 28 నుంచి కిలో రూ.65లపైన మార్కెట్ లావాదేవీలు కొనసాగుతూ వచ్చాయి. మే ఒకటో తేదీన గరిష్ట ధర రూ.78 పలికింది. ఫుల్ జోష్‌లో ఉన్న రైతులకు, సీజను ముగింపు దశలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత ధరల్లో తగ్గుదల కొంత నిరాశపరిచింది. ఎన్నికల కోసం నాలుగు రోజులు సెలవులివ్వటం, తర్వాత వర్షాలు పడటంతో వ్యాపారులు రేటు తగ్గించినట్టు చెబుతున్నారు. అయినప్పటికీ కిలో రూ.30కిపైగా కొనుగోళ్లు జరుగుతుండటం ఒకింత ఊరట. ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు కౌలుకు తీసుకున్న రైతులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జూన్‌లో వచ్చే ఏరువాక పౌర్ణమికి నిమ్మ తోటలకు రైతులు మళ్లీ కౌలు ఒప్పందాలు చేసుకుంటారు. గతంలో తీవ్ర నష్టాలు లాభదాయకమైన నిమ్మతోటల సాగు 2017, 2018 సంవత్సరాల్లో రైతులకు చేదు అనుభవాలను మిగిల్చింది. 2017 ఏప్రిల్‌లో కిలో రూ.20–30 మధ్య పలికిన ధర, మరో నెలకు రూ.12–20 మధ్యకు దిగజారింది. జూన్‌లో మరింతగా పతనమై రూ.5 నుంచి రూ.10లకు పడిపోయింది. జులైలో రూ.7లకు మించలేదు. మళ్లీ 2018లోనూ అదే పరిస్థితి ఎదురైంది. కిలో ఆరేడు రూపాయలకు మించటం లేదని రైతులు గొల్లుమన్నారు. కోత కూలీ కూడా దక్కదన్న భావనతో కాపు కోయకుండా వదిలేసిన సందర్భాలున్నాయి. ఖర్చులు లెక్కేసుకుంటే ఒక్కో నిమ్మకాయకు రైతుకు మిగిలేది కేవలం 10 పైసలు మాత్రమే. అప్పట్లో ఈ పరిణామాలు నిమ్మ తోటల కౌలు ఒప్పందాలపైనా నష్టాల ప్రభావం చూపాయి. ఎకరా కౌలు రూ.65 నుంచి రూ.70 వేలకు మించలేదు.కరోనాలో ఆదుకున్న ప్రభుత్వం కరోనా మహమ్మారి నిమ్మతోటల కౌలుదార్లను బెంబేలెత్తించింది. దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా అమ్మకాలకు బ్రేక్ పడింది. తర్వాత కూడా ఇతర రాష్ట్రాల్నుంచి ఆర్డర్లు లేకుండాపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో మార్కెటింగ్ శాఖ చొరవ తీసుకుని వారానికి మూడు రోజులు కొనుగోళ్లు చేసి, ఆదుకోవడంతో కొంతలో కొంత కోలుకోగలిగాం. అప్పట్లో కేవలం నెల రోజుల్లో 850 టన్నులను రైతుల్నుంచి కొనుగోలు చేసి ఎగుమతి చేసింది. లారీల సమ్మె రోజుల్లోనూ నిమ్మ రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం నిలకడగా మంచి ధర లభిస్తుండటంతో ఫర్వాలేదని చెబుతున్నారు.మిగులు గ్రాములు లెక్కిస్తే మేలు నిమ్మ కాపు కాస్త తగ్గినప్పటికీ నిమ్మకాయ ధరలు ఈ ఏడాది సంతృప్తికరంగా ఉన్నాయి. మార్కెట్ యార్డులో మిగులు గ్రాములు లెక్కలోకి తీసుకోవటం లేదు. 10 కిలోల 500 గ్రాములు తూకం వస్తే 10 కిలోలకే లెక్కిస్తున్నారు. దీనివల్ల రైతులకు నష్టం. గ్రాములను కూడా పరిగణనలోకి తీసుకుంటే మాకు మేలు జరుగుతుంది. – కొత్త రమేష్ బాబు, నిమ్మ రైతు, సంగంజాగర్లమూడి -
వ్యవసాయ మార్కెట్లలో రైతుల పడిగాపులు
తిరుమలగిరి (తుంగతుర్తి)/జనగామ: వానల్లేక, సాగునీరు అందక చాలా చోట్ల వరి పంట దెబ్బతి న్నది. మిగిలిన చోట రైతులు వరికోతలు పూర్తి చేసి.. వ్యవసాయ మార్కెట్లకు తెస్తున్నారు. కానీ మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోళ్లు చేస్తుండటం, అదీ సరిగా సాగకపోవడంతో.. పడిగాపులు పడుతున్నారు. శనివారం సూర్యాపేట జిల్లా తిరు మలగిరి, జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఇదే పరిస్థితి కనిపించింది. భారీగా పోటెత్తిన ధాన్యం: శనివారం తిరుమ లగిరి వ్యవసాయ మార్కెట్ యార్డుకు 47,660 బస్తాల ధాన్యం వచ్చింది. యాసంగి సీజన్ మొదలై నప్పటి నుంచి ఇంత భారీగా ధాన్యం రావడం ఇదే మొదటిసారి. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నా.. వాతావరణంలో మార్పులతో రైతులు యార్డుకే ధాన్యాన్ని తీసుకొస్తున్నారని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే మార్కెట్లోకి ధాన్యం ట్రాక్టర్లను అనుమతించాల్సి ఉండగా.. శనివారం తెల్లవారు జాము వరకు పంపలేదు. దీనితో రోడ్డు పైనే వందలకొద్దీ ట్రాక్టర్లు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. కాగా ట్రేడర్లు ధాన్యానికి క్వింటాల్‌కు కనిష్టంగా రూ.1,700, గరిష్టంగా రూ.1,980 ధర చెల్లించారు. జనగామలో కొనుగోళ్లు నిలిపేసిన ట్రేడర్లు తక్కువ ధరకు ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆందోళ న, ముగ్గురు ట్రేడర్లపై కేసుల నమోదు నేపథ్యంలో.. జనగామ వ్యవసాయ మార్కెట్లో ట్రేడర్లు కొనుగోళ్లు నిలిపివేశారు. దీనితో మార్కెట్‌కు వరి ధాన్యం, మక్కలు, చింతపండు, ఇతర వ్యవసాయ ఉత్పత్తు లను తీసుకువచ్చిన రైతులు వాటిని అమ్ముకో వడా నికి పడిగాపులు పడుతున్నారు. ఇక మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ రాజునా యక్ శనివారం జనగామ మార్కెట్ కార్యాలయంలో.. ట్రేడర్లు, అడ్తిదారులతో రెండు గంటల పాటు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రైవేట్ మార్కె ట్లోనూ మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాలని రాజునాయక్ కోరగా.. అది సాధ్యం కాదని ట్రేడర్లు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లేని నిబంధనలను జనగామ మార్కెట్‌పై ఎందుకు రుద్దుతున్నారని ప్రశ్నించారు. తమపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. మరోవైపు ఈ మార్కెట్లో కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభమవుతాయా? అని రైతులు ఎదురు చూస్తున్నారు. -
నేటి నుంచి మొక్కజొన్న కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: మొక్కజొన్న కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గురువారం (ఈ నెల 14న) కొనుగోళ్లు ప్రారంభించి మే 15వ తేదీ వరకు కొనసాగించాలని నిర్ణయించింది. నాణ్యమైన క్వింటాల్ మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ.2,090 చొప్పున చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ స్పెషల్ సీఎస్ అహ్మద్‌బాబు మార్గదర్శకాలు జారీ చేశారు. దీంతో ఆర్బీకేల ద్వారా రైతుల రిజిస్ట్రేషన్‌కు మార్క్‌ఫెడ్ చర్యలు చేపట్టింది. రైతును నిలబెట్టేలా మద్దతు ధర రాష్ట్రంలో రబీ 2023–24లో 4.75 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. రెండో ముందస్తు అంచనా ప్రకారం 16.82 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్రలో ఇప్పటికే కోతలు ప్రారంభం కాగా.. నెలాఖరు నాటికి ముమ్మరమవుతాయి. సీఎం యాప్ ద్వారా ప్రతిరోజు మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులను పర్యవేక్షిస్తున్నారు. అయితే.. పంట చేతికొచ్చే సమయంలోమార్కెట్ను బూచిగా చూపి వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తారేమోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో కనీస మద్దతు ధర విషయంలో రైతులకు అండగా నిలవాలన్న సంకల్పంతో క్వింటాల్‌కు రూ.2,090 చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగింది. ఇందుకోసం ముందస్తుగానే ఏర్పాట్లు చేసి కనీసం 85 వేల టన్నులను సేకరించేందుకు అనుమతిచ్చింది. కొనుగోలుకు పక్కా ఏర్పాట్లు మొక్కజొన్న కొనుగోలుకు ఏపీ మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో జాయింట్ కలెక్టర్ (ఆర్బీకే అండ్ ఆర్) నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేసింది. కొనుగోలుకు అవసరమైన టార్పాలిన్లు, తేమను కొలిచే మీటర్లు, డ్రయ్యర్లు, జల్లెడ, కుట్టు యంత్రాలు, వేయింగ్ మెషిన్లు వంటి వాటిని సమకూర్చే బాధ్యతను మార్కెటింగ్ శాఖకు అప్పగించింది. మొక్కజొన్న సేకరణకు అవసరమైన నిధులను ధరల స్థిరీకరణ నిధి నుంచి సమీకరించుకునే వెసులుబాటును మార్క్‌ఫెడ్‌కు కల్పించింది. అవసరమైతే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని రైతులకు సకాలంలో నగదు చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. రుణాలపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి నుంచి తిరిగి చెల్లిస్తుంది. మొక్కజొన్నను నిల్వ చేసుకునేందుకు సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీలతో పాటు వ్యవసాయ, ఇతర గిడ్డంగులను అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేసింది. ధరలు పెరిగేలా చర్యలు మార్కెట్లో మొక్క జొన్న ధరల హెచ్చుతగ్గులను సీఎం యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. సమీప రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉంది. ఏ ఒక్కరూ తొందరపడి అమ్ముకోవద్దు. మద్దతు ధర కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. ఇప్పటికే మినుము, పెసలు, వేరుశనగ, శనగ, జొన్నల సేకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తాజాగా మొక్కజొన్న కొనుగోలుకు కూడా అనుమతి ఇచ్చింది. – గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్ -
554 గోదాముల నిర్మాణం పూర్తి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)కు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న గ్రామీణ గోదాముల (బహుళ ప్రయోజన కేంద్రాలు – ఎంపీఎఫ్‌సీలు) నిర్మాణంపై ఈనాడు కథనాన్ని మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్ పాండే తీవ్రంగా ఖండించారు. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేంత వరకు రైతులు వాటిని నిల్వ చేసుకునేందుకు గ్రామ స్థాయిలో రూ.1,584.61 కోట్లతో 2,536 ఎంపీఎఫ్సీ గోదాములు నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. 15 సెంట్ల భూమిలో 500 టన్నులు, 25 సెంట్ల భూమిలో 1,000 టన్నుల సామర్థ్యంతో ఈ గోదాములను నిర్మిస్తున్నామన్నారు. తొలివిడతలో రూ.493.15 కోట్ల అంచనా వ్యయంతో 1,167 గోదాముల నిర్మాణం చేపట్టామని, వీటిలో రూ.166.83 కోట్లతో 8 రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు కడప డివిజన్లో అత్యధికంగా 271, గుంటూరు డివిజన్లో 152, విజయవాడ డివిజన్లో 93, విశాఖ డివిజన్లో 38 చొప్పున 554 గోదాముల నిర్మాణం పూర్తయిందన్నారు. జనవరి నాటికి 780 గోదాములు, మార్చి నాటికి మిగిలిన గోదాముల నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. పనుల పురోగతిపై చీఫ్ ఇంజనీర్ నుంచి చీఫ్ సెక్రటరీ స్థాయి వరకు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు. అవసరమైన చోట్ల కలెక్టర్లకు తగిన సూచనలు చేస్తూ పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తొలి విడతలో నిర్మిస్తున్న గోదాముల్లో రూ.7.76 కోట్లతో తేమ శాతం నిర్ధారించే పరికరాలు, కాటాలు, కంప్యూటర్లు ఇతర మౌలిక సదుపాయాలను సమకూర్చినట్లు తెలిపారు. రెండో విడతలో నిర్మించనున్న గోదాముల కోసం స్థలాల ఎంపిక వేగంగా జరుగుతోందన్నారు. వాస్తవం ఇలా ఉంటే కేవలం 350 గోడౌన్లు మాత్రమే పూర్తయినట్టుగా అసత్యాలు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. -
టమాటా రైతుకు బాసట..
సాక్షి, అమరావతి: ధరలేక సతమతమవుతున్న టమాటా రైతులకు బాసటగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం డిమాండ్‌కు మించి టమాటా పంట మార్కెట్లకు వస్తుండటంతో గత కొద్దిరోజులుగా ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు సీఎం యాప్ ద్వారా ధరల హెచ్చుతగ్గులను నిరంతరం పరిశీలిస్తూ కిలో రూ. 7 కంటే తక్కువ ధర పలుకుతున్న మార్కెట్లలో జోక్యం చేసుకుంటూ ధరలు నిలకడగా ఉండేలా చూస్తోంది. ఇటీవల టమాటా ధరలు చుక్కలనంటి.. కిలో రూ. 250కు పైగా పలికిన దశలో వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 28 నుంచి మార్కెట్లో జోక్యం చేసుకొని రైతుల నుంచి పెద్ద ఎత్తున టమాటాలను సేకరించి కిలో రూ. 50కే రైతు బజార్లలో విక్రయించింది. ఇలా దాదాపు రెండు నెలల పాటు రైతుల నుంచి సగటున కిలో రూ. 107.50 చొప్పున రూ.14.66 కోట్ల విలువైన 1,364.55 టన్నుల టమాటాలను సేకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 105 రైతుబజార్ల ద్వారా సబ్సిడీపై వినియోగదారులకు అందించింది. నేడు రైతులకు అండగా నిలిచేందుకు.. గత నెల రోజులుగా ఖరీఫ్ పంట పెద్దఎత్తున వస్తుండటంతో మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ మార్కెట్లతో సంబంధం లేకుండా కిలో రూ. 7 కంటే తక్కువ ధర పలుకుతున్న మార్కెట్లలో జోక్యం చేసుకొని రైతులకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించింది. దీంతో సీఎం యాప్ ద్వారా పర్యవేక్షిస్తూ ధరల తగ్గిన మార్కెట్లలో జోక్యం చేసుకుంటూ రైతులకు బాసటగా నిలుస్తోంది. నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్ పరిధిలో ధరలు తగ్గుదల నమోదవుతుండటంతో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద వ్యాపారులతో పోటీపడి రైతులవద్ద టమాటాలు కొనుగోలు చేశారు. లాభం ఆశించకుండా విక్రయం ఇటీవల ప్యాపిలి మార్కెట్లో కనిష్ట ధర రూ. 6 పలుకగా, అంతకంటే ధర తగ్గకూడదన్న ఆలోచనతో రైతుల వద్ద గడిచిన నాలుగు రోజుల్లో 16 టన్నులు సేకరించి స్థానిక రైతుబజార్లలో నో ప్రాఫిట్–నో లాస్ పద్ధతిన వినియోగదారులకు విక్రయించారు. సీఎం యాప్ ద్వారా ధరల హెచ్చుతగ్గులను పరిశీలిస్తూ ప్రభుత్వ జోక్యం చేసుకుంటుండటంతో సోమవారం ప్రధాన టమాటా మార్కెట్లలో నాణ్యమైన టమాటాకు సైజును బట్టి కిలో కనిష్టంగా రూ. 8, గరిష్టంగా రూ. 16 చొప్పున పలుకుతోంది. మరోవైపు బహిరంగ మార్కెట్లలో కిలో రూ. 11 నుంచి రూ. 24 పలుకుతుండగా, రైతు బజార్లలో కిలో రూ.9 నుంచి రూ. 20 వరకు ధరలు ఉండేలా చూస్తున్నారు. ధరల నిలకడే లక్ష్యం డిమాండ్ మించి పంట మార్కెట్‌కు వస్తుండటంతో గతకొద్ది రోజులుగా తగ్గుతున్న ధరలను నిలకడగా ఉంచడం ద్వారా రైతులకు బాసటగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీరోజూ ప్రధాన మార్కెట్లలో టమాటా ధరలను సీఎం యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. కిలో రూ.7 కంటే తక్కువగా పలుకుతున్న మార్కెట్లో జోక్యం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటికే కిలో రూ. 6 చొప్పున 16 టన్నులు రైతుల నుంచి సేకరించి స్థానిక రైతు బజార్లలో అదే ధరకు విక్రయించాం. ధరల విషయంలో రైతులెవ్వరూ ఆందోళన చెందనవసరం లేదు. – రాహుల్ పాండే, కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
టమాట రైతులకు అండగా ప్రభుత్వం
కర్నూలు (అగ్రికల్చర్): ధరలు తగ్గుతుండటంతో టమాట రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వ్యాపారులు సిండికేట్ కాకుండా చూడటం, ధర తగ్గుతున్నప్పుడు వేలం పాటలో పాల్గొని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇటీవల వరకు టమాట ధర చుక్కలనంటింది. ఆ సమయంలో జిల్లాలో టమాట పంట లేదు. ఇప్పుడు రైతులు సాగు చేసిన పంట ఒక్కసారిగా మార్కెట్‌ను ముంచెత్తడంతో ధరలు పడిపోయాయి. దీంతో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం మార్కెటింగ్ శాఖకు దిశానిర్దేశం చేసింది. జిల్లాలోని పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో టమాట క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఈ నెల 9 నుంచి మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం పత్తికొండ మార్కెట్ యార్డులో జరిగే టమాట వేలం పాటలో పాల్గొంటుందని మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు (ఏడీఎం) నారాయణమూర్తి తెలిపారు. శుక్రవారం పత్తికొండ మార్కెట్లో టమాట ధర కిలోకు కనిష్టంగా రూ.7, గరిష్టంగా రూ.14 పలికింది. మోడల్ ధర రూ.10గా నమోదైంది. కనిష్ట ధర రూ.7 కంటే తక్కువకు పడిపోతున్నప్పుడు మాత్రమే మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసిన బృందం వేలంలో పాల్గొంటుంది. మార్కెటింగ్ శాఖ కూడా వేలంలో పాల్గొంటున్నందున వ్యాపారుల మధ్య పోటీ పెరిగే అవకాశం ఉంటుంది. మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేసిన టమాటను రైతుబజార్ల ద్వారా నో లాస్, నో ప్రాఫిట్ కింద వినియోగదారులకు విక్రయిస్తామని ఏడీఎం తెలిపారు. -
కేంద్రం కంటే మిన్నగా..
ఈయన పేరు సోమిశెట్టి రామచంద్రరావు. విజయవాడ ఇందిరా కాలనీలో ఉంటున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో టమాటా కిలో రూ.120–150 పలుకుతుండగా, కృష్ణలంక రైతుబజార్లో రాష్ట్ర ప్రభుత్వం కిలో రూ.50కే అందిస్తుండడం మాబోటి వారికి చాలా ఊరటగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే నాలుగైదుసార్లు వెళ్లి తెచ్చుకున్న ఆయన.. టమాటాలు తాజాగా, నాణ్యతతో ఉంటున్నాయంటూ ఆయన తన ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. సాక్షి, అమరావతి : టమాటా ధరలు చుక్కలనంటుతున్న ప్రస్తుత తరుణంలో రైతుబజార్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై టమాటాలను విక్రయిస్తూ వినియోగదారులకు బాసటగా నిలుస్తోంది. ఆకస్మిక వర్షాలతో మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో టమాటా పంట దెబ్బతినడంతో ధరలు దేశవ్యాప్తంగా చుక్కలనంటాయి. దాదాపు 40 రోజులు కావస్తున్నా డిమాండ్ సరిపడా నిల్వల్లేక ధరలు అదుపులోకి రాని పరిస్థితి. ధరలు పతనమైనప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకుని రైతులకు కనీస మద్దతు ధర దక్కేలా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అదే రీతిలో ప్రస్తుతం మార్కెట్లో ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని వినియోగదారులకు బాసటగా నిలిచింది. దేశంలో మరెక్కడా లేని విధంగా దాదాపు నెలరోజులుగా ఆర్థిక భారాన్ని లెక్కచేయకుండా సబ్సిడీపై టమాటాలు విక్రయాలను కొనసాగిస్తోంది. రంగంలోకి మార్కెటింగ్ శాఖ.. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో కిలో రూ.200కు పైగా పలుకుతుండగా, రాష్ట్రంలో బహిరంగ మార్కెట్లో నేటికీ కిలో రూ.120 నుంచి రూ.150కు తగ్గలేదు. ధరలు పెరుగుదల మొదలైన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా మార్కెటింగ్ శాఖను రంగంలోకి దింపిన ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతులు, వ్యాపారుల నుంచి సేకరించి వాటిని రైతుబజార్ల ద్వారా కిలో రూ.50 చొప్పున సబ్సిడీపై వినియోగదారులకు అందిస్తోంది. రాష్ట్రంలో సబ్సిడీపై టమాటా విక్రయాలు ప్రారంభించిన మూడు వారాల తర్వాత కేంద్రం కూడా ఏపీ బాటలో వినియోగదారులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చిం ది. దక్షిణాది రాష్ట్రాల నుంచి సేకరించి ఉత్తరాదిలోని మండీల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా కిలో రూ.80 చొప్పున విక్రయాలకు శ్రీకారం చుట్టింది. సబ్సిడీ కోసం రూ.11.82 కోట్లు ఖర్చు.. రోజూ రాష్ట్రంలోని వివిధ టమాటా మార్కెట్లలో వ్యాపారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం వేలం పాటల్లో పాల్గొని రైతుల నుంచి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తోంది. డిమాండ్‌ను బట్టి స్థానిక వ్యాపారుల నుంచి కూడా సేకరిస్తోంది. ఇలా ఇప్పటివరకు సగటున కిలో రూ.104 చొప్పున రూ.11,82,40,000 ఖర్చుచేసి 1,136.90 మెట్రిక్ టన్నుల టమాటాలను సేకరించింది. రోజూ 40–70 టన్నుల చొప్పున సేకరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 105 ప్రధాన రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా మనిషికి ఒక కిలో చొప్పున విక్రయిస్తోంది. కిలో రూ.123.50 చొప్పున కొనుగోలు.. మంగళవారం సగటున కిలో రూ.123.50 చొప్పున రూ.49.40 లక్షల విలువైన 40 టన్నుల టమాటాలను అధికారులు సేకరించారు. వీటిని విశాఖ, విజయనగరం, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 40 రైతుబజార్ల ద్వారా వినియోగదారులకు సరఫరా చేశారు. ఇలా దాదాపు నెలరోజులుగా సబ్సిడీపై టమాటా విక్రయాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుండడంపట్ల వినియోగదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రెండేళ్ల క్రితం కూడా ఇదే రీతిలో కిలో రూ.100 దాటినప్పుడు రైతుల నుంచి సేకరించి సబ్సిడీపై రైతుబజార్ల ద్వారా విక్రయించారు. గతలో ఎన్నడూ ఇలా ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకున్న సందర్భాల్లేవని వినియోగదారులు చెబుతున్నారు. పేదలకు ఊరట టమాటా ధరలు చుక్కలనంటుతున్న తరుణంలో నెలరోజులుగా రైతుబజార్ల ద్వారా కిలో రూ.50కే నాణ్యమైన టమాటాలు అందిస్తుండడం మాలాంటి పేదవారికి ఎంతో ఉపయోగకరం. ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్న టమాటాలను ప్రజలు పొదుపుగా వాడుకుంటే మంచిది. – కె.నాయుడు, కార్మికుడు, సీతమ్మధార, విశాఖపట్నం నాణ్యంగా ఉంటున్నాయి ప్రభుత్వం అండగా నిలవకపోతే ఈ సమయంలో బహిరంగ మార్కెట్లో మాలాంటివారు కొనే పరిస్థితి ఉండదు. నెలరోజులుగా సీతమ్మధార రైతుబజారులో సబ్సిడీపై టమాటాలు అందిస్తున్నారు. కాయలు చాలా నాణ్యంగా ఉంటున్నాయి. చాలా సంతోషంగా ఉంది. – పైడి రమణమ్మ, పాత వెంకోజీపాలెం, విశాఖపట్నం ధరలు తగ్గే వరకు కొనసాగిస్తాం సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గత నెల 27న సబ్సిడీపై టమాటాల విక్రయా లకు శ్రీకారం చుట్టాం. సగటున కిలో రూ.104 చొప్పున కొనుగోలు చేసి వినియోగదారులకు కిలో రూ.50లకే విక్రయిస్తున్నాం. ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు రైతుబజార్లలో సబ్సిడీ కౌంటర్లు కొనసాగుతాయి. – రాహుల్ పాండే, కమిషనర్, ఏపీ మార్కెటింగ్ శాఖ -
పేదలకు భరోసాతో.. పెత్తందారులు బతికేదెలా ?
సాక్షి, అమరావతి: నిత్యావసరాల ధరల పెరుగుదల ప్రభావం సహజంగానే దేశమంతా ఉంటుంది. వీటిని ఒక్క రాష్ట్రమే నియంత్రించాలంటే సాధ్యం కాదు!! మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఆయా ప్రభుత్వాలు తక్షణం స్పందించి రాయితీపై వినియోగదారులకు అందించి ఊరట కల్పించాలి! రాష్ట్ర ప్రభుత్వం అదే చేస్తుంటే కొందరు పెత్తందారులు మాత్రం సహించలేకపోతున్నారు! దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటిన మర్నాడే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై రైతు బజార్ల ద్వారా రూ.50కే అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు ఉపశమనం కల్పించింది. నిత్యావసరాల బ్లాక్ మార్కెటింగ్‌కు తావులేకుండా నిల్వలపై పరిమితులు విధించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇలా గంటల వ్యవధిలోనే స్పందించడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో ఉల్లి ధరలు భగ్గుమన్నప్పుడు కూడా కర్నూలు సహా వివిధ ప్రధాన మార్కెట్లలో మార్కెటింగ్ శాఖను రంగంలోకి దించి నేరుగా రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి రాయితీపై ప్రజలకు అందచేసింది. ధరలు పెరిగినా, పతనమైనా ప్రతి సందర్భంలోనూ వెంటనే జోక్యం చేసుకుని వినియోగదారులను, రైతన్నలను ఆదుకుంటోంది. నాలుగేళ్లలో రూ.70.32 కోట్ల విలువైన 15 వేల టన్నుల ఉల్లిపాయలు, టమాటా, బత్తాయిలను రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసి సబ్సిడీపై వినియోగదారులకు పంపిణీ చేయడమే ఇందుకు నిదర్శనం. చరిత్ర ఎరుగని సంక్షేమం చరిత్రలో ఎన్నడూ లేనంత సంక్షేమాన్ని అందించి పేదల జీవన ప్రమాణాలు పెరిగేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకున్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ), ఇతర పథకాల (నాన్–డీబీటీ) ద్వారా ఏకంగా రూ.3.15 లక్షల కోట్లకుపైగా లబ్ధి చేకూర్చారు. కోవిడ్ సంక్షోభంలోనూ సంక్షేమ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగించారు. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరిగింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దాలుగా కానరాని గ్రామీణ ఆర్థిక సుస్థిరత నాలుగేళ్లలోనే సాధ్యమైంది. గతంలోనూ ప్రభుత్వాలకు ఇదే బడ్జెట్ ఉన్నా ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం దక్కలేదు. ఇప్పుడు ప్రతి నిరుపేద బాగుపడుతున్నాడు. తన కుటుంబానికి ఆపదొస్తే ప్రభుత్వం చూసుకుంటుందన్న భరోసాతో జీవిస్తున్నాడు. ఇదంతా పచ్చమంద, పెత్తందారులకు కంటగింపుగా మారింది. అధికార దండం దూరం కావడంతో కాళ్లు చేతులు ఆడని రామోజీ ‘ఈ బాదుడుకు.. పేదలు బతికేదెలా’? అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఓ కథనాన్ని తమ కరపత్రంలో ముద్రించారు. పెత్తనం కేంద్రానిదే వంట గ్యాస్ ధరలపై అజమాయిషీ కేంద్ర ప్రభుత్వానిదే. 2020 – 21 నుంచి వంట గ్యాస్‌పై సబ్సిడీని కేంద్రం భారీగా తగ్గించింది. మరోవైపు సిలిండర్ ధర క్రమంగా రూ.1,100కి ఎగబాకింది. సబ్సిడీ రూపంలో రూ.11 మాత్రమే జమ చేస్తోంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదిస్తూ “ఈనాడు’ మభ్యపుచ్చే యత్నం చేసింది. ఇదే తరహాలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలను బట్టి దేశంలో పెట్రోల్ రేట్లు నిర్ణయిస్తారు. పెట్రోల్ రేట్లు పెరిగినప్పుడల్లా ఆ ప్రభావం నిత్యావసరాలపై సహజంగానే ఉంటుంది. ఈ విషయం ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది! రూ.15 లక్షలకు పైగా విలువైన స్థిరాస్తి నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.75 వేల కోట్ల విలువైన 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను అక్కచెల్లెమ్మలకు పంపిణీ చేసింది. ఇంటి నిర్మాణ సాయంతో కలిపి ఒక్కొక్కరికీ రూ.15 లక్షల విలువైన స్థిరాస్తిని అందిస్తోంది. రెండు దశల్లో 21.25 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టగా ఇప్పటికే 5 లక్షల ఇళ్లు (టిడ్కో ఇళ్లు 72,400 + సాధారణ ఇళ్లు 4 లక్షలకు పైగా) పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో శరవేగంగా నిర్మాణంలో ఉన్నాయి. ఇళ్ల నిర్మాణాల ద్వారా కార్మికులకు 30 కోట్లకుపైగా పని దినాలను కల్పించింది. ఏపీ పొదుపు సంఘాలకే ఎక్కువ రుణాలు డ్వాక్రా మహిళలకు రూ.14,204 కోట్ల రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు మోసగించడంతో ఆ భారం రూ.25,571 కోట్లకు చేరుకుంది. 18.36 శాతం సంఘాలు నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ)గా మిగిలాయి. అలాంటి తరుణంలో సీఎం జగన్ మాట ప్రకారం వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఆదుకున్నారు. ఇప్పటి వరకు పొదుపు సంఘాల మహిళలకు రూ.19,178.17 కోట్లు చెల్లించారు. దీంతో ఇప్పుడు ఎన్పీఏ రేటు 0.45 శాతానికి తగ్గిపోయింది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. దేశంలో మొత్తం పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాల్లో 30 శాతం ఏపీలో సంఘాలకే పంపిణీ చేయడం విశేషం. ఈ నాలుగేళ్లలో ఏకంగా రూ.1.16 లక్షల కోట్ల మేర బ్యాంకు రుణాలు కూడా ఇప్పించారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు వైఎస్సార్ చేయూత కింద 26.39 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో రూ.14,129 కోట్లు ఆర్థిక సాయం చేశారు. తద్వారా సుమారు 10 లక్షల మంది మహిళలు వ్యాపారాలు, స్వయం ఉపాధి, చిరు దుకాణాల ద్వారా శాశ్వత జీవనోపాధి పొందుతున్నారు. రైతు సాధికారత.. అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద 52.38 లక్షల కుటుంబాలకు వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రూ.30,985.30 కోట్లను ప్రభుత్వం అందించింది. వైఎస్సార్ సున్నా వడ్డీ రుణాల కింద రూ.73.88 లక్షల మంది రైతులకు రూ.1,834.55 కోట్లు అందచేయగా వైఎస్సార్ పంటల బీమా కింద 44.28 లక్షల మందికి రూ.6,684.84 కోట్లు అందించింది. 22.74 లక్షల మంది రైతులకు పంట నష్ట పరిహారం కింద రూ.1,965.43 కోట్లు సీజన్ ముగియక ముందే చెల్లించింది. నాడు ముక్కిపోయిన బియ్యమే.. గత సర్కారు హయాంలో రేషన్ పంపిణీ అంటే పెద్ద ప్రహసనమే! ముక్కిపోయినవి, పురుగులు పట్టిన బియ్యాన్ని ఇస్తే పేదలు ఎలా తినగలరని ఈనాడు ఏనాడు ప్రశ్నించలేదు. రీ సైక్లింగ్ చేస్తున్నా స్పందించిన పాపాన పోలేదు. సబ్సిడీ కందిపప్పు పేరుతో గత సర్కారు మార్కెట్ కంటే అధిక రేట్లకు టీడీపీ నేతలకు టెండర్లను కట్టబెట్టింది. గరిష్టంగా కిలో రూ.120కి విక్రయించారు. 2014 సెప్టెంబర్ నుంచి 2015 జూలై వరకు కందిపప్పు పంపిణీ చేపట్టలేదు. అలాంటి అధ్వాన్న పరిస్థితులకు తెరదించి ఇప్పుడు నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని ఇంటి వద్దే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. రాళ్లు, పురుగులు, నూక, పొట్టు లేని బియ్యాన్ని ఇస్తుండటంతో ప్రతి నెలా రేషన్ తీసుకునేవారు 90 శాతానికి పెరిగారు. ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించడంలో భాగంగా తొలిదశలో రాయలసీమ జిల్లాల్లో ఉచితంగా రాగులు, జొన్నల పంపిణీని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాల్టీల్లో గోధుమపిండి కిలో రూ.16కే అందిస్తున్నారు. కార్డుకు అరకిలో పంచదార ఇవ్వడంతో పాటు కందిపప్పు రేటు ఎంత పెరిగినా 2020 నుంచి ఇప్పటిదాకా సబ్సిడీపై కిలో రూ.67కే అందిస్తుండటం గమనార్హం. మరోవైపు ప్రజా పంపిణీలో యువతను భాగస్వాములను చేస్తూ 9,260 మందికి ఉపాధి కల్పించింది. కేంద్ర ప్రభుత్వం 80 లక్షల ఎన్ఎఫ్ఎస్ కార్డులకు మాత్రమే ఉచితంగా బియ్యం ఇస్తుండగా నాన్–ఎన్ఎఫ్ఎస్ కార్డుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ అందరికీ సార్టెక్స్ బియ్యాన్నే అందిస్తోంది. వీటితో పాటు 18 జిల్లాల్లో బలవర్థకమైన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. మొత్తంగా రూ.23,860 కోట్లు పీడీఎస్‌పై ఖర్చు చేయడం విశేషం. దవ్యోల్బణం దేశంలోనే తక్కువ.. ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే భారత్‌లోనే ద్రవ్యోల్బణం రేటు తక్కువగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో 7 నుంచి 9 శాతం వరకు రేట్ల పెరుగుదల ఉండగా మన దేశంలో 4.5 శాతం వద్ద నిలకడగా కొనసాగుతోంది. విదేశీ దిగుమతులను తగ్గించుకుని స్వదేశీ ఎగుమతులను పెంచుకోవడం ద్వారా ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. గతంలో విదేశాల నుంచి వంట నూనె దిగుమతి చేసుకోవడంతో ధరలు అమాంతం పెరిగాయి. ఇప్పుడు నిలకడగా ఉన్నాయి. స్థానికంగా ఆయిల్ పామ్ రైతులకు రాయితీలు కల్పించడం ద్వారా సాగును ప్రోత్సహించాయి. ఫలితంగా డిమాండ్, సప్లై మధ్య వ్యత్యాసాన్ని 37 నుంచి 25 శాతానికి తగ్గించగలిగారు. అందుకే వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు పీడీఎస్ కింద పంపిణీ చేసే నిత్యావసరాలను రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసి స్థానికంగానే వినియోగించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఫలితంగా ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడి తక్కువ రేట్లకే నిత్యాసవరాలు లభించనున్నాయి. -
సబ్సిడీపై టమాటా
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఠారెత్తిస్తున్న టమాటా ధరల భారం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పలుచోట్ల టమాటా రేట్లు చుక్కలను తాకుతుండటంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను రంగంలోకి దించింది. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని రైతుబజార్లలో కిలో రూ.50కే అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టింది. వైఎస్సార్, కర్నూలు జిల్లాలలో బుధవారం శ్రీకారం చుట్టగా.. మిగిలిన జిల్లాల్లో గురువారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు నిత్యం 50–60 టన్నుల టమాటాలు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మరోవైపు టమాటాతో పోటీపడుతూ ఆకాశానికి ఎగబాకుతున్న పచ్చి మిర్చిని కూడా సబ్సిడీపై వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం యాప్‌లో పర్యవేక్షణ.. పలుచోట్ల విస్తారంగా కురుస్తున్న వర్షాలు టమాటా ధరలను హడలెత్తిస్తున్నాయి. వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతినడంతో టమాటా ధర చుక్కలనంటుతోంది. నిన్న మొన్నటి వరకు కిలో రూ.20–30కు మించి పలకని టమాటా ధరలు ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకాయి. పలు రాష్ట్రాల్లో కిలో రూ.100 దాటగా మన రాష్ట్రంలోని బహిరంగ మార్కెట్లలో ప్రస్తుతం కిలో రూ.65 నుంచి 90 మధ్య పలుకుతోంది. పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులపై భారం పడకుండా చర్యలు చేపట్టింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్ పాండే, రైతుబజార్ల సీఈవో నందకిషోర్‌తో పాటు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. సీఎం యాప్ ద్వారా ధరల హెచ్చుతగ్గులను సమీక్షిస్తూ కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. టమాటాతో పాటు పచ్చి మిర్చి ధరలు కూడా వంద దాటడంతో వాటిని కూడా సబ్సిడీపై అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. టమాటా ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో అత్యధికంగా విశాఖలో కిలో రూ.90 ఉండగా మిగిలిన జిల్లాల్లో రూ.50–85 మధ్య ధరలున్నట్లు గుర్తించడంతో రైతుబజార్ల ద్వారా అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమయ్యారు. నాలుగేళ్లుగా టమాటా ధరలు పెరిగిన పలు సందర్భాల్లోనూ రాష్ట్రప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై వినియోగదారులకు అందిస్తోంది. ధరల పెరుగుదల ఎక్కువగా ఉన్న నగరాలు, పట్టణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అదేవిధంగా పచ్చి మిర్చి కూడా పలు జిల్లాల్లో రూ.వంద దాటినట్టు గుర్తించారు. దీంతో మంత్రి ఆదేశాలతో పచ్చి మిర్చిని కూడా రైతుల నుంచి కొనుగోలు చేసి సబ్సిడీపై రైతుబజార్లలో అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మదనపల్లి, పలమనేరు మార్కెట్లలో సేకరణ ధరలు ఎగబాకడంతో టమాటా రైతన్నలకు మంచి రేటు లభిస్తోంది. రాష్ట్రంలోని మదనపల్లి, పలమనేరు, పత్తికొండ, పుంగనూరు, కలికిరి మార్కెట్లకు వస్తున్న టమాటాను పొరుగు రాష్ట్రాల వ్యాపారులు ఎగరేసుకుపోతున్నారు. బుధవారం మదనపల్లి, పలమనేరు మార్కెట్లలో మార్కెటింగ్ శాఖ అధికారులు రైతుల నుంచి కిలో రూ.70 చొప్పున 10 టన్నుల టమాటాలు సేకరించారు. నేటి నుంచి మిగిలిన మార్కెట్లలోనూ సేకరించనున్నారు. రోజుకు కనీసం 50–60 టన్నులు తక్కువ కాకుండా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో రైతుబజార్ల ద్వారా కిలో రూ.50 చొప్పున టమాటా విక్రయాలకు బుధవారం శ్రీకారం చుట్టగా.. విశాఖ సహా మిగిలిన జిల్లాలకు గురువారం నుంచి విస్తరించాలని నిర్ణయించారు. అదుపులోకి వచ్చే దాకా సబ్సిడీపై విక్రయాలు ఏపీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో కిలో రూ.100 దాటింది. ప్రధాన మార్కెట్లలో రైతుల నుంచి సేకరించి సబ్సిడీపై వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాం. ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు దీన్ని కొనసాగిస్తాం. – నందకిషోర్, సీఈవో, ఏపీ రైతుబజార్లు ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఏర్పాటు ప్రత్యేక కౌంటర్ల ద్వారా సబ్సిడీ టమాటా అమ్మకాలకు శ్రీకారం చుడుతున్నాం. మిగిలిన చోట్ల రైతు బజార్లలో కూడా కౌంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. – రాహుల్ పాండే, కమిషనర్, మార్కెటింగ్ శాఖ టమాటా, పచ్చిమిర్చి కూడా.. మార్కెట్లో టమాటా, మిర్చి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సబ్సిడీపై అందించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాం. ధరల నియంత్రణపై స్పెషల్ సీఎస్‌తోపాటు, మార్కెటింగ్ శాఖ కమిషనర్, రైతు బజార్ల సీఈవోతో సమీక్షించాం. గురువారం నుంచి రాష్ట్రంలో ప్రధాన రైతు బజార్లలో టమాటా కిలో రూ.50కే సబ్సిడీపై అందించనున్నాం. అదేవిధంగా మిర్చిని కూడా సబ్సిడీపై అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
కూరగాయల ధరల నియంత్రణకు చర్యలు
సాక్షి, అమరావతి: పెరుగుతున్న కూరగాయల ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీఎం యాప్ ద్వారా రోజూ క్షేత్రస్థాయిలో కూరగాయల ధరల హెచ్చుతగ్గులను పరిశీలిస్తోంది. ఉల్లి, ఇతర కూరగాయల ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా.. టమాటా ధర పెరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమ, కృష్ణా, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోనే టమాట ధర పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా టమాటాతో పాటు ముందస్తు చర్యల్లో భాగంగా ఉల్లి, బంగాళదుంపలు, మిరప వంటి ఇతర కూరగాయల ధరలను సమీక్షిస్తున్నారు. మరో వైపు ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను రంగంలోకి దింపింది. ధరల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కర్నూలు మినహా మిగిలిన జిల్లాల్లో టమాటా ధర బహిరంగ మార్కెట్లో కిలో రూ. 32 నుంచి రూ. 65 మధ్యలో, ఉల్లిపాయలు కిలో రూ.20 నుంచి 25 మధ్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో ఈ రెండింటి ధరలు బహిరంగ మార్కెట్‌కంటే తక్కువగా ఉండేలా చర్యలు చేపట్టారు. టమాటా కిలో రూ.100 దాటితే మార్కెట్లో జోక్యం చేసుకొని రైతుల నుంచి కొనుగోలు చేసి సబ్సిడీపై వినియోగదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం రైతుబజార్ల ఎస్టేట్ ఆఫీసర్లతో రైతుబజార్ల సీఈవో నందకిషోర్ సమీక్షించనున్నారు. సీఎం యాప్ ద్వారా రోజూ జిల్లాలవారీగా కూరగాయల ధరలను సమీక్షిస్తున్నామని, ప్రస్తుతం ధరలు నియంత్రణలోనే ఉన్నాయని మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్ పాండే ‘సాక్షి’కి తెలిపారు. అవసరమైతే మార్కెట్లో జోక్యం చేసుకుంటామని చెప్పారు. మిర్చి రైతుకు పండగే కంకిపాడు: రాష్ట్రంలో మిర్చి రైతుకు పండగొచ్చింది. సంవత్సర కాలంగా కిలో రూ.50 కి మించని పచ్చి మిర్చి ప్రస్తుతం రూ. 100 దాటింది. వారం, పది రోజులుగా మిర్చి ధర రూ 35 నుంచి క్రమేపీ పెరిగింది. వేసవి కారణంగా మిర్చి సాగు తగ్గింది. డిమాండ్‌కు సరిపడా దిగుబడి లేకపోవడంతో ధర పెరిగింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అద్దెకు గోదాములు
సాక్షి, అమరావతి: ఆర్థిక పరిపుష్టి సాధించుకునే దిశగా మార్కెటింగ్ శాఖ అడుగులేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న గోదాములను అద్దెకివ్వడం ద్వారా ఆదాయ వనరులను పెంచుకుంటోంది. రాష్ట్రంలో 218 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్న సంగతి తెలిసిందే. వీటి పరిధిలో 9,75,105 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 1,015 గోదాములు ఉన్నాయి. వీటితో పాటు 3,352 చోట్ల షాపులు, మరో 407 చోట్ల షాపులతో కూడిన గోదాములున్నాయి. ఇప్పటి వరకు కమిటీల పరిధిలో ఉన్న ఈ–చెక్‌పోస్టుల ద్వారా సెస్ వసూలు చేయడం, వ్యాపారులకు లైసెన్సులు జారీ చేయడం, గోదాములను ప్రభుత్వ శాఖలకు అద్దెకు ఇవ్వడం వంటి కార్యకలాపాల ద్వారా మార్కెటింగ్ శాఖకు ఆదాయం సమకూరేది. ఇలా ఏటా రూ.450 కోట్ల నుంచి రూ.550 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అయితే ఒకే దేశం– ఒకేమార్కెట్ విధానంతో సెస్ వసూళ్లను నిలిపివేయడంతో దాదాపు ఏడాది పాటు ఆదాయానికి గండి పడింది. 2021–22లో ఈ పన్నుల వసూళ్లను పునరుద్ధరించడంతో కాస్త గాడిలో పడినప్పటికీ ఆర్థికంగా మరింత పరిపుష్టి సాధించే దిశగా మార్కెటింగ్ శాఖ ముందుకెళ్తోంది. ఇప్పటివరకు ‘రైతుబంధు’ పథకం కింద రైతులు తాము పండించిన ఉత్పత్తులకు కనీస మద్దతు ధర వచ్చే వరకు ఈ గోదాముల్లో దాచుకునే వారు. అలాగే బియ్యం కార్డుదారులకు పంపిణీ చేసే బియ్యం, ఇతర నిత్యావసరాల నిల్వ కోసం పౌరసరఫరాల శాఖ, ధాన్యం, ఇతర ఆహార ఉత్పత్తుల నిల్వ కోసం సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, రాష్ట్ర గోదాముల సంస్థ, మార్క్ఫెడ్లకు అద్దెకిచ్చేవారు. గత కొంతకాలంగా ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు కూడా గోదాముల్లో నిల్వ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. వీరికి అద్దెకివ్వడం ద్వారా మార్కెటింగ్ శాఖ అదనపు ఆదాయం సమకూర్చుకుంటోంది. ఇప్పటివరకు అద్దెకు 2,976 షాపులు ఏడాది నుంచి రెండేళ్ల కాలానికి గోదాములను అద్దెకు ఇస్తున్నారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీల ద్వారా అద్దెను నిర్ణయించి,konugolu.ap. gov.in ద్వారా టెండర్లు పిలుస్తున్నారు. అద్దె రూపంలో వచ్చే ఆదాయాన్ని ఆయా మార్కెట్ కమిటీలకు జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు 2,976 షాపులు, 367 షాపులతో కూడిన గోదాములు, 614 గోదాములు అద్దెకిచ్చారు. వీటి ద్వారా ఏటా రూ.24 కోట్లకు పైగా అదనపు ఆదాయం మార్కెటింగ్ శాఖ సమకూర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఖాళీగా ఉన్న షాపులు, గోదాములను కూడా అద్దెకిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
వెజిటబుల్స్ ఆన్ వీల్స్.. మొబైల్ మార్కెట్ రెడీ
మార్కెటింగ్ శాఖ ప్రారంభించిన మొబైల్ కూరగాయల మార్కె ట్లకు మంచి స్పందన లభిస్తోంది. తాజా కూరగాయలను రైతులే తమ ప్రాంతానికి తెచ్చి అమ్ముతుండటం, ధరలు కూడా ఇతర మార్కెట్లతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుండటంతో వినియోగదారులు సంచార వాహనాల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు దఫాలుగా చాలావరకు కూరగాయలు అమ్ముడుపోతుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రజల నుంచి విశేష స్పందన నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ ఫోన్ లేదా ఈమెయిల్ చేస్తే వినియోగదారులు కోరుకున్న ప్రాంతానికి ఈ మొబైల్ రైతు బజార్లను పంపించే వెసులుబాటు కల్పించింది. కూరగాయలు సైతం వివిధ యాప్‌ల ద్వారా ఆల్‌లైన్‌లో డోర్ డెలివరీ అవుతుండటం, వారానికో రోజు మండే మార్కెట్, ట్యూస్డే మార్కెట్ల వంటివి వీధి మలుపుల్లోనే కొనసాగుతుండటం, ఇళ్లకు సమీపంలోనే భారీ దుకాణాల్లో అందుబాటులో ఉండటంతో ఇటీవలి కాలంలో రైతుబజార్లకు వెళ్లే వారి సంఖ్య కొంత తగ్గింది. గతంలో మాదిరి కిటకిటలాడటం లేదు. చాలా సందర్భాల్లో శ్రమకోర్చి తెచ్చిన కూరగాయలు అమ్ముడుపోక రైతులు నష్టపోతున్నారు. కొన్నిసార్లు పాడైన కూరగాయలను అక్కడే పారబోసి వెళ్ళాల్సి వస్తోంది. పరిస్థితిని గమనించిన మార్కెటింగ్ శాఖ వినూత్నంగా ఆలోచించింది. వాహనాలు సమకూర్చి రైతులే కూరగాయల్ని బస్తీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ సముదాయాలకు తీసుకెళ్లి విక్రయించుకునే ఏర్పాటు చేసింది. రైతుబజార్లకు వచ్చే రైతులు అక్కడినుంచి కూరగాయలను వాహనాల్లో పెట్టుకుని ఆయా ప్రాంతాలకు వెళతారన్నమాట. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లోని మూడు ప్రధాన రైతుబజార్ల నుంచి మార్కెటింగ్ శాఖ వాహనాలు పంపిస్తోంది. రైతులు వాహనాలకు సంబంధించిన డీజిల్, ఇతరత్రా ఖర్చులు ఏవీ భరించాల్సిన అవసరం లేకుండా తానే వ్యయాన్ని భరిస్తోంది. ప్రస్తుతం ఎర్రగడ్డ, ఫలక్‌నుమా, మెహిదీపట్నం రైతుబజార్ల నుంచి రైతులు వాహనాల్లో కూరగాయలు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. ఆన్లైన్లో వచ్చే కూరగాయలు తాజాగా ఉన్నాయో లేదో చూసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తాజా కూరగాయలు కళ్లెదుటే కని్పస్తుండటం వల్ల వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు. రైతుబజార్లకు తగ్గిన తాకిడి.. నగరవాసులు అన్ని వస్తు వులు ఆన్లైన్ ద్వారా డోర్ డెలివరీ పొందుతున్నారు. దీంతో రైతుబజార్లకు తాకిడి తగ్గింది. రైతులు కష్టపడి తెచ్చిన కూరగాయలు పూర్తిగా అమ్ముడవ్వక నష్టపోతున్నారు.దీంతో రైతులు వాహనాల్లో బస్తీలకు తీసుకెళ్లి విక్ర యించుకునేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించాం. – లక్ష్మీబాయి, డైరెక్టర్, మార్కెటింగ్ శాఖ ధరలు తక్కువ ఉంటున్నాయ్.. మా ఏరియాలో హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ కానీ రైతుబజార్ కానీ లేదు. దీంతో కూరగాయలు కొనాలంటే చాలా దూరం వెళ్లాల్సి వచ్చేంది. ధరలు కూడా ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం వారానికి రెండుసార్లు బాలానగర్ బస్తీకి మొబైల్ రైతుబజార్ వస్తోంది. ధరలు కూడా తక్కువగానే ఉంటున్నాయి. – గణపతి, బాలానగర్ నివాసి నిర్ధారించిన ధరలకే.. కూరగాయల ధరలను మార్కెటింగ్ శాఖే నిర్ణయిస్తోంది. ఆయా ధరలను రైతులు తమ వాహనం వద్ద బోర్డుపై ప్రదర్శిస్తున్నారు. ఆయా వాహనాలను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తూ మార్కెటింగ్ శాఖ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. రైతులు ఇష్టమొచి్చన ధరలకు అమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తు తం ఒక్కో రైతుబజార్ నుంచి 10 చొప్పున మొత్తం 30 వాహనాలు ఈ విధంగా బస్తీలకు కూరగాయలు తీసుకెళుతున్నాయి. ప్రజల నుంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో నగరంలో మొత్తం 11 రైతుబజార్లు ఉండగా..మరికొన్ని ప్రధాన రైతుబజార్ల నుంచి మొత్తం 125 వాహనాలు నడిపే ఆలోచనలో మార్కెటింగ్ శాఖ ఉంది. కూరగాయల కోసం కాల్ చేయాల్సిన నంబర్లు.. ఎర్రగడ్డ రైతుబజార్.. 7330733746 ఫలక్‌నుమా.. 7330733743 మెహిదీపట్నం.. 7330733745 ఈమెయిల్.. ఎర్రగడ్డ రైతుబజార్.. MRB.E.HYD@Gmail.com మెహిదీపట్నం.. MRB.M.HYD@Gmail.com ఫలక్‌నుమా.. MRB.F.HYD@Gmail.com -
సాగులో బ్రాండింగ్ తీసుకురండి
సాక్షి, అమరావతి/మధురానగర్ (విజయవాడ సెంట్రల్): పనిచేసే సంస్థలు, కంపెనీలకు బ్రాండింగ్ తీసుకొచ్చేందుకు ఎంతలా తపన పడతామో.. అదేస్థాయిలో సాగులో కూడా బ్రాండింగ్ తీసుకొచ్చేందుకు కృషిచేయాలని వ్యవసాయ, మార్కెటింగ్, సహకారశాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి పిలుపునిచ్చారు. సాగుబాట పట్టిన ఏ ఒక్కరూ వెనక్కితిరిగి చూడకుండా ముందుకుదూసుకుపోవాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా తోడుగా నిలుస్తుందని చెప్పారు. విజయవాడలో గురువారం జరిగిన విద్యావంతులైన వ్యవసాయదారుల సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షల జీతాలను వదులుకుని వ్యవసాయం పట్ల మక్కువతో సాగుబాట పట్టిన యువ రైతులంతా ఒకే వేదికపైకి రావడం శుభపరిణామమన్నారు. పండించే పంటలకు అదనపు విలువను జోడించేలా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం 30 నుంచి 50 శాతం వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు. రాష్ట్రస్థాయిలో సమాఖ్యగా ఏర్పడి మీరు పండించే ఉత్పత్తులకు బ్రాండింగ్ తీసుకురావాలని సూచించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నేటి తరానికి ఆదర్శంగా సాగును లాభసాటిగా మార్చాలని కోరారు. స్త్రీనిధి బ్యాంక్ తరహాలో వ్యవసాయదారులంతా కలిసి ఓ బ్యాంకు ఏర్పాటు చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. డ్రోన్ టెక్నాలజీతో ఖర్చులు తగ్గించుకోవాలి నాబార్డు మాజీ చైర్మన్ సీహెచ్.గోవిందరాజులు మాట్లాడుతూ రానున్న ఐదేళ్లు డ్రోన్ టెక్నాలజీదేనని చెప్పారు. డ్రోన్ల ద్వారా సాగుచేసి పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. సంప్రదాయ నాట్లు వేసే విధానాన్ని వదిలి డ్రోన్ల ద్వారా విత్తనాలు నాటుకుంటే నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చన్నారు. సదస్సులో పలు తీర్మానాలు ఆమోదించారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు భూపతిరాజు రామకృష్ణంరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్‌వర్మ, అఖిల భారత రైతు ఉత్పత్తిదారుల సంఘాల కన్వీనర్ జలగం కుమారస్వామి, భారతీయ కిసాన్‌సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు పి.రాఘవులు, డైరెక్టర్లు క్రాంతికుమార్‌రెడ్డి, నరసింహరాజు, రైతునేస్తం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సదస్సులో చేసిన తీర్మానాలు.. దేశంలో మరే రాష్ట్రంలోను లేనిరీతిలో ప్రత్యేకంగా ఆర్గానిక్ పాలసీ తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్గానిక్ విశ్వవిద్యాలయం ఏర్పాటు దిశగా కృషిచేయాలి. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయాలి. ఆర్గానిక్ ఉత్పత్తుల విక్రయం కోసం జాతీయ రహదారుల్లో ప్రతి వంద కిలోమీటర్లకు కనీసం 10 షాపులు నిర్మించి ఇవ్వాలి. రైతుబజార్లలో ప్రత్యేక స్టాల్ కేటాయించాలి. ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీని సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలి. జనవరి 5వ తేదీన విజయవాడలో కనీసం 10 వేలమందితో ఆర్గానిక్ వ్యవసాయదారుల రాష్ట్రస్థాయి సమ్మేళనం నిర్వహించాలి. -
ట‘మాట’ ప్రకారం రైతన్నకు అండగా
సాక్షి, అమరావతి/అనంతపురం అగ్రికల్చర్: తెలుగుదేశం హయాంలో ఏనాడూ టమాటా రైతుల్ని ఆదుకున్న దాఖలాలు లేవు. రైతు సమస్యల పట్ల పూర్తి అవగాహన, వారికి మంచి చేయాలన్న తపన ఉన్న ముఖ్యమంత్రి జగన్... తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ అవసరమైనపుడల్లా టమాటా రైతుల్ని ఆదుకుంటూనే వస్తున్నారు. ధరలు పతనమైన ప్రతిసారి అండగా నిలుస్తున్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ వ్యాపారుల మధ్య పోటీ పెంచి రైతులను ఆదుకుంటున్నారు. రైతన్నకు అదనపు ఆదాయం సమకూర్చే లక్ష్యంతో టమాటా పండే జిల్లాల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. నేడు 14 రాష్ట్రాలకు.. రాష్ట్రంలో ఏటా 22.16 లక్షల టన్నుల టమాటా దిగుబడులు వస్తుండగా 20.36 లక్షల టన్నులు రాయలసీమ జిల్లాల నుంచే వస్తోంది. ఇందులో మూడొంతులు పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. గతంలో ఐదారు రాష్ట్రాలకే ఎగుమతులు జరగ్గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా 14 రాష్ట్రాలకు పెరిగాయి. గతేడాది నవంబర్‌లో టమాటా ధర ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకింది. మార్కెట్లో కిలో రూ.100కిపైగా పలికింది. ఈ సమయంలో రైతుల నుంచి సుమారు వంద టన్నుల వరకు కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా కిలో రూ.60 చొప్పున విక్రయాలు చేపట్టి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారాన్ని నియంత్రించింది. ఎన్నడూలేని రీతిలో గత మూడేళ్లలో రూ.4.11 కోట్ల విలువైన 2,540.34 టన్నుల టమాటాలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఒక్క అనంతపురం మార్కెట్లోనే 250 టన్నులు కొనుగోలు చేసింది. మహిళాభివృద్ధి సంస్థ ద్వారా రూ.63.60 లక్షల విలువైన 1,615 టన్నుల టమాటాను సేకరించి ప్రాసెసింగ్ కంపెనీలకు సరఫరా చేసింది. పైనాపిల్ రైతులను కూడా ఇదే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. కాయ రూ.10 చొప్పున 200 టన్నులకు పైగా సేకరించి సబ్సిడీపై మహిళా సంఘాల సభ్యులకు రూ.5కే అందచేసింది. అనాస రైతులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించి ఒక్కో కాయ రూ.12–15 వరకు గిట్టుబాటు ధరకు అమ్ముకునేలా ఏర్పాట్లు చేసింది. ఇవన్నీ ‘ఈనాడు’ కథనంలో ప్రస్తావించకపోవటం గమనార్హం. అది.. డెమో యూనిట్ ‘ఈనాడు’ వార్తలో పేర్కొన్న టమాటా ప్రాసెసింగ్ యూనిట్... అనంతపురం జిల్లా కేంద్రం వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఈ ఏడాది మార్చి 26న ప్రారంభించినది. అది కేవలం డెమో కోసమే ఏర్పాటైంది. కుటీర పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పించి శిక్షణ ఇచ్చేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. మైసూరుకు చెందిన ఢిపెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (డీఎఫ్ఆర్ఎల్) దీనికి సాంకేతిక సహకారం అందించింది. అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.7.50 లక్షలు, మార్కెటింగ్ శాఖ తరపున రూ.2.50 లక్షలతో కలిపి మార్కెట్‌యార్డు గోదాములో ఈ డెమో ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ బాధ్యతలు వేదభూమి అనే రైతు ఉత్పత్తి దారుల సంఘానికి (ఎఫ్‌పీవో) అప్పగించారు. ఇక్కడ రోజుకు 200 కిలోల టమాటా ద్వారా 40 కిలోల వరకు పల్ప్, సాస్ తయారు చేస్తున్నారు. కిలో సాస్ తయారీకి ఖర్చు రూ.130 కాగా మార్కెట్లో రూ.170 వరకు విక్రయించేలా నిర్ణయించారు. డెమో ప్లాంట్‌లో సాంకేతిక లోపాలను సవరించి నాలుగైదు రోజుల్లో పునఃప్రారంభిస్తామని మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరి చెప్పారు. నంద్యాలలో రూ.174.20 కోట్లతో, అన్నమయ్య జిల్లా పీలేరులో రూ.250 కోట్లతో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కానున్నాయి. అనంత మార్కెట్లో గరిష్టంగా కిలో రూ.20 ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రస్తుతం 2,500 హెక్టార్లలో టమాటా పంట ఉంది. ఇక్కడ నుంచి నాణ్యమైన టమాటాలు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, నాగపూర్, కలకత్తా, బంగ్లాదేశ్ తదితర చోట్లకు ఎగుమతి అవుతుంటాయి. అనంతపురం కక్కలపల్లి మండీకి (ప్రైవేట్ మార్కెట్) రోజూ 6 వేల టన్నుల వరకు వస్తున్నాయి. వర్షాలతో కాయలు తడిచి రవాణాకు అనువుగా లేకపోవడంతో ధరలు తగ్గాయి. సీఎం యాప్ ద్వారానే కాకుండా రైతుల నుంచి అందిన అభ్యర్థన మేరకు మార్కెటింగ్ శాఖ జోక్యం చేసుకొని కొనుగోళ్లకు శ్రీకారం చుట్టింది. అనంతపురం మార్కెట్ పరిధిలో కిలో రూ.11 చొప్పున ఇప్పటి వరకు 600 క్వింటాళ్లు (60 టన్నులు) కొనుగోలు చేసి కర్నూలు, విశాఖ, విజయవాడ, గుంటూరు రైతు బజార్లకు తరలించారు. బుధవారం అనంతపురం మార్కెట్లో గరిష్టంగా కిలో రూ.20 ధర పలికింది. చంద్రబాబు హయాంలో ధరలు పతనమైనప్పుడు ‘ఈనాడు’ ఏనాడూ స్పందించకపోవటం ప్రస్తావనార్హం. ఆర్బీకేకి సమాచారమిస్తే చాలు... ధరలు పతనమైన ప్రతీసారి మార్కెట్లో జోక్యం చేసుకొని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నాం. మూడేళ్లలో రూ.4.11 కోట్ల విలువైన 2,540 టన్నుల టమాటాలు కొనుగోలు చేశాం. గతంలో ఎప్పుడూ ఇలా కొనలేదు. అనంతపురంలో మినహా మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. ధర ఏమాత్రం తగ్గినా సమీపంలోని ఆర్బీకేకి సమాచారం అందిస్తే చాలు.. మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. – బి.శ్రీనివాసరావు, సీఈవో, రైతు బజార్లు -
Andhra Pradesh: ఆన్లైన్లో అన్నదాత
సాక్షి, అమరావతి: దేశ రాజధానిలో ఉన్న ఓ కంపెనీ మన రైతన్న పండించిన పంటను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసి చెల్లింపులు పక్కాగా జరపడంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. అన్నదాతలు తాము పండించిన పంటను కళ్లాల నుంచే నేరుగా తమకు నచ్చిన ధరకు విక్రయించుకునే అవకాశాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఈ–ఫార్మార్కెటింగ్’కు అనూహ్య స్పందన లభిస్తోంది. మండీలకు ప్రత్యామ్నాయంగా రైతులు, కొనుగోలుదారులు, వ్యాపారులు, ప్రాసెసర్లను అనుసంధానిస్తూ దేశంలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తెచ్చిన ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్, యాప్ ద్వారా క్రయవిక్రయాలు నిర్వహించేందుకు పోటీ పడుతున్నారు. నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్‌కు చెందిన అగ్రీ సాఫ్ట్వేర్ సంస్థ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్ ద్వారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గూగుల్ ప్లే స్టోర్‌లో eFarmarket యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని పేరు, ఆధార్, మొబైల్ నంబర్ తదితర వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా సులభంగా పొలం నుంచే పంట ఉత్పత్తులను విక్రయించవచ్చు. ఇప్పటికే 23 రకాల పంటలను వెబ్ పోర్టల్‌లో రైతులు నమోదు చేసుకున్నారు. రూ.10.33 కోట్ల కొనుగోళ్లు అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. http://eFarmarket.ap.gov.in/web వెబ్ పోర్టల్‌లో ఇప్పటివరకు 463 మంది రైతులు, 551 మంది వ్యాపారులు నమోదు చేసుకున్నారు. వీరిలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులున్నారు. గత ఎనిమిది నెలల్లో 197 మంది వ్యాపారులు రాష్ట్ర రైతుల నుంచి రూ.10.33 కోట్ల విలువైన 79,650 క్వింటాళ్ల వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేశారు. ఎండు మిరప క్వింటాల్ రూ.11,704 ఈ–ఫార్మార్కెటింగ్ ద్వారా అత్యధికంగా కర్నూలు జిల్లాలో రూ.2.43 కోట్లు, గుంటూరులో రూ.2.29 కోట్లు, నంద్యాలలో రూ.1.63 కోట్లు, పల్నాడు జిల్లాలో రూ.కోటికి పైగా లావాదేవీలు జరిగాయి. అత్యధికంగా రూ.3.18 కోట్ల విలువైన 16 వేల క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేశారు. రూ.1.78 కోట్ల విలువైన 2,552 క్వింటాళ్ల పత్తి, రూ.1.58 కోట్ల విలువైన 9,120 క్వింటాళ్ల ఫైన్ వెరైటీ ధాన్యం, రూ.98.19 లక్షల విలువైన 1,853 క్వింటాళ్ల వేరుశనగను రైతులు విక్రయించారు. అత్యధికంగా క్వింటాల్ ఎండు మిరప రూ.11,704 ధర పలికింది. క్వింటాల్ జీడిపప్పు రూ.9,100, మామిడి రూ.7 వేలు, పత్తి రూ.6,995, మినుములు రూ.6,255 చొప్పున రైతులకు ధర లభించింది. ఈ ఫార్మార్కెటింగ్తో ప్రయోజనాలెన్నో.. ► కేంద్రం ప్రభుత్వం తెచ్చిన ఈనామ్‌లో మార్కెట్ యార్డుల్లో రిజిస్ట్రర్డ్ వ్యాపారులు మాత్రమే అందులో నమోదైన రైతుల నుంచి కొనుగోలు చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–ఫార్మార్కెటింగ్లో దళారీల ప్రమేయంతో పాటు ఎలాంటి ఫీజులు, రుసుములు ఉండవు. రైతుల నేరుగా కళ్లాల నుంచే మంచి ధరకు అమ్ముకోవచ్చు. ► పంట వివరాలు, ఉత్పత్తి లభ్యత, నాణ్యత వివరాలను రైతులు ‘ఏపీ ఫార్మర్స్ ఈ–విక్రయ కార్పొరేషన్ లిమిటెడ్’ (ఏపీఎఫ్‌ఈవీసీఎల్) ద్వారా ఎలక్ట్రానిక్ పోర్టల్‌లో నమోదు చేసుకుంటే దీని ద్వారానే వ్యాపారులు నచ్చిన ఉత్పత్తులను ఎంచుకొని నేరుగా రైతులతో సంప్రదించి కొనుగోలు చేస్తారు. రైతుల ఖాతాలకు డబ్బులు నేరుగా జమ చేస్తారు. రైతులు తమ ఉత్పత్తుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేసుకునేలా ఈ–విక్రయ కార్పొరేషన్ సిబ్బందితో పాటు ఆర్బీకేలు కూడా సహకరిస్తాయి. ► రైతులు పండించిన ఉత్పత్తులకు ప్రభుత్వమే సర్టిఫైడ్ క్వాలిటీ అసెస్మెంట్ సర్టిఫికెట్ కూడా జారీ చేస్తున్నందున నాణ్యతకు ఢోకా ఉండదు. ప్రభుత్వ పర్యవేక్షణ ఉన్నందున ఎలాంటి మోసాలకు తావుండదు. అనంతపురం జిల్లా రేగడికొత్తూరులో రైతుల నుంచి కొన్న మొక్క జొన్నను లోడ్ చేస్తున్న దృశ్యం స్పందన బాగుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని కొనుగోలుదారులను రైతులకు పరిచయం చేస్తూ ఉత్పత్తులకు మంచి ధర లభించే లక్ష్యంతో ‘ఈ ఫార్మార్కెటింగ్’ తీసుకొచ్చాం. నాలుగు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నాం. రైతులు, వ్యాపారుల నుంచి మంచి స్పందన వస్తోంది. – పీఎస్ ప్రద్యుమ్న, మార్కెటింగ్ శాఖ కమిషనర్ మార్కెట్ కంటే మంచి రేటు బాపట్ల జిల్లా వేమూరు మండలం వెల్లటూరు రైతు ఎం.గంగాధర్ రబీలో 20 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. మార్కెట్లో క్వింటాల్ రూ.2,150 పలుకుతుండగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఈ–ఫార్మార్కెటింగ్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా ఢిల్లీకి చెందిన ఓరిగో కమోడెటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి క్వింటాల్ రూ.2,220 చొప్పున 600 క్వింటాళ్లు విక్రయించాడు. మార్కెట్ రేటుతో పోలిస్తే భారీగా లాభం వచ్చింది. ఐదు రోజుల్లోనే ఖాతాకు డబ్బులు జమ అయ్యాయి. ఈ సదుపాయం ఎంతో బాగుందని ‘సాక్షి’తో రైతు పేర్కొన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వం చర్యలు.. టమాటా ధరలకు కళ్లెం
సాక్షి, అమరావతి: టమాటా ధరలకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి శుక్రవారం నుంచి రైతుబజార్ల ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లుచేసింది. బహిరంగ మార్కెట్లో టమాటా ధర ప్రస్తుతం ప్రాంతాన్ని బట్టి కిలో రూ.60 నుంచి రూ.81 వరకు పలుకుతోంది. స్థానికంగాను, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి దిగుమతులు తగ్గడం, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తుండడం ధరల పెరుగుదలకు కారణమవుతోంది. వీటిని కట్టడి చేసేందుకు రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం.. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద స్థానిక రైతుల వద్ద ఉన్న టమాటా నిల్వలను కొనుగోలు చేయడంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున దిగుమతులు చేసుకోవాలని సంకల్పించింది. బహిరంగ మార్కెట్ ధరల కంటే కనీసం కిలోకి రూ.10లు తక్కువగా రైతుబజార్లలో అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లుచేస్తోంది. ఇప్పటికే షోలాపూర్ నుంచి దిగుమతి చేసుకున్న 20 టన్నుల టమాటాలను గుంటూరు, ఏలూరు రైతుబజార్ల ద్వారా శుక్రవారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుంచి మరో 40 టన్నుల దిగుమతికి ఏర్పాట్లుచేసింది. వీటిని ఉత్తరాంధ్రతో పాటు కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో రైతుబజార్ల ద్వారా విక్రయించనుంది. ఇదే రీతిలో బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర ఉన్న ప్రాంతాలను ప్రాధాన్యతగా తీసుకుని అక్కడ రైతుబజార్ల ద్వారా కిలో రూ.60కు మించకుండా అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. మరోవైపు.. మదనపల్లి, ఇతర ప్రధాన టమాటా మార్కెట్లలో జోక్యం చేసుకుని రైతుల నుంచి పెద్దఎత్తున కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లుచేసింది. ఈ చర్యలతో నాలుగైదు రోజుల్లో వీటి ధరలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తాం బహిరంగ మార్కెట్లలో టమాటా ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వమే స్వయంగా పక్క రాష్ట్రాల నుంచి టమాటాలను దిగుమతి చేసుకుంటోంది. స్థానికంగా రైతుల వద్ద ఉన్న నిల్వలను కూడా మార్కెట్లో జోక్యం చేసుకుని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లుచేశాం. ఇందుకోసం వ్యవసాయ, మార్కెటింగ్, రైతుబజార్ అధికారులకు ఆదేశాలు జారీచేశాం. వీటిని ప్రాధాన్యతా క్రమంలో రైతుబజార్ల ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచుతాం. సాధ్యమైనంత త్వరగా ధరలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – కాకాణి గోవర్థన్‌రెడ్డి, వ్యవసాయ మంత్రి -
కొత్తగా 40 లక్షల టన్నుల గోదాములు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా గోదాముల నిర్మాణం చేపట్టాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. ఒకేసారి 40 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాముల ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రతీ మండలానికి ఒక గోదాము ఉండేలా సన్నాహాలు చేస్తోంది. అందుకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను సిద్ధం చేసింది. ఒక్కో మెట్రిక్ టన్ను గోదాము సామర్థ్యానికి రూ.10 వేల చొప్పున, మొత్తంగా రూ. 4 వేల కోట్లు ఖర్చవుతుందని వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వర్గాలు వెల్లడించాయి. 1.12 కోట్ల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి చేరిక రాష్ట్ర ఏర్పాటు సమయంలో 39.01 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు ఉండగా, ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ గోదాములు (ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవి కలుపుకొని) 72.26 లక్షల మెట్రిక్ టన్నులున్నాయి. మార్కెటింగ్‌శాఖ మంత్రిగా హరీశ్‌రావు ఉన్నప్పుడు గోదాముల నిర్మాణం పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు, భూగర్భజలాల పెరుగుదలతో రాష్ట్రవ్యాప్తంగా సాగునీరు విస్తారంగా అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడిని అందించేందుకు రైతుబంధు పథకాన్ని అమలు చేయడం, పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడంతో రైతులు వ్యవసాయం చేసేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. దీంతో పంట ఉత్పత్తులను నిల్వ చేసుకొనేందుకు సరిపడా గోదాములు అందుబాటులో లేకుండాపోయాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించాలని భావిస్తోంది. ఈ పరిశ్రమల కోసం కూడా గోదాములు, కోల్డ్ స్టోరేజీలు అవసరం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గోదాముల సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకే ఏకంగా 40 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇవి పూర్తయితే 1.12 కోట్ల మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల గోదాములు రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నాయి. యాసంగి అవసరాలకు 20.18 లక్షల మెట్రిక్ టన్నులే... ప్రస్తుతం ఉన్న గోదాముల్లో ఆహారధాన్యాలు, ఇతరత్రా నిల్వలు చేయగా యాసంగి అవసరాలకు 20.18 లక్షల టన్నుల సామర్థ్యమున్న గోదాములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ సామర్థ్యం యాసంగిలో వచ్చే ధాన్యానికి ఏమాత్రం సరిపోయేలా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి కనీసం 60 లక్షల టన్నుల ధాన్యం సేకరించినా వీటిని ఎక్కడ నిల్వ చేయాలన్నది ప్రశ్నార్థంగా మారింది. ధాన్యాన్ని మళ్లీ స్కూళ్లు, ఫంక్షన్ హాళ్లు, మిల్లింగ్ పాయింట్లలో నిల్వ చేయక తప్పేలా లేదు. దీంతో కొత్త గోదాములను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మార్కెటింగ్‌శాఖ వర్గాలు భావిస్తున్నాయి. -
నెల్లూరులో నానో యూరియా ప్లాంట్!.. రూ.250 కోట్లతో ఏర్పాటుకు సన్నాహాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. దక్షిణాదిన బెంగళూరులో తొలి ప్లాంట్ నెలకొల్పిన భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) రెండో ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయనుంది. నెల్లూరు జిల్లాలో ప్లాంట్‌ను నెలకొల్పడంపై ప్రభుత్వంతో ఇఫ్కో సంప్రదింపులు జరుపుతోంది. ఎందుకింత ఆదరణ....? సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా దవ్ర రూపంలో ఇఫ్కో అభివృద్ధి చేసిన నానో యూరియాకు విశేష ఆదరణ లభిస్తోంది. యూరియా బస్తాతో పోలిస్తే ధర తక్కువగా ఉండడం, మెరుగైన పనితీరు, ద్రవరూప యూరియా బాటిళ్లను సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లే వీలుండటం, రవాణా ఖర్చులు ఆదా కావడం దీనికి ప్రధాన కారణాలు. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా నానో యూరియా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రూ.250 కోట్లతో ఏపీలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఇటీవల ఉన్నత స్థాయి సమావేశంలో ఇఫ్కో నిర్ణయించింది. కోటి లీటర్ల సామర్థ్యంతో నెల్లూరు అగ్రి సెజ్‌లో ప్లాంట్ ఏర్పాటు కోసం ఇఫ్కో ఆసక్తి చూపుతోంది. కనీసం 20 ఎకరాల్లో ప్లాంట్ నెలకొల్పేందుకు భూ కేటాయింపుల కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. బస్తా యూరియాతో సమానం.. 45 కిలోల యూరియా బస్తాకు సమానంగా 500 మిల్లీ లీటర్ల ద్రవరూప నానో యూరియాను బాటిళ్లలో ఇఫ్కో మార్కెట్లోకి తీసుకొచ్చింది. బస్తా యూరియా ధర మార్కెట్లో రూ.266.50 ఉండగా నానో యూరియా బాటిల్ రూ.240కే లభిస్తోంది. సంప్రదాయ ఎరువుల్లో ఉండే పోషకాలన్నీ కలిగి ఉండడం, అన్ని పంటలకు అనుకూలమైనది కావడం, 80–90 శాతం యూరియా మొక్కకు అందడం, భూసారంతో పాటు భూగర్భ జలాలపై ఎలాంటి ప్రభావం ఉండదని రుజువు కావడంతో ‘నానో’ పట్ల రైతుల్లో ఆదరణ పెరుగుతోంది. గత ఖరీఫ్‌లో ప్రయోగాత్మకంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అమ్మకాలకు శ్రీకారం చుట్టగా సుమారు 20 వేల మంది రైతులు 34,128 బాటిళ్లు (17,064 లీటర్లు) కొనుగోలు చేశారు. వచ్చే ఏడాది డీఏపీ, జింక్, కాపర్ కూడా.. నానో యూరియా విక్రయాలను ప్రోత్సహిస్తూ రిటైల్ మార్కెట్లతో పాటు ఆర్బీకేల ద్వారా రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుత రబీ సీజన్ కోసం 5.25 లక్షల బాటిల్స్ (2.65 లక్షల లీటర్లు) అందుబాటులో ఉంచగా రికార్డు స్థాయిలో 4.35 లక్షల బాటిళ్ల (2.17 లక్షల లీటర్లు) విక్రయాలు జరిగాయి. డిమాండ్‌ను బట్టి నిల్వ పెంచేందుకు ఇఫ్కో ఏర్పాట్లు చేస్తోంది. నానో యూరియా మాదిరిగానే నానో డీఏపీ, జింక్, కాపర్ కూడా మార్కెట్లోకి తెచ్చేందుకు ఇఫ్కో ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఈ ఉత్పత్తులతో ట్రయిల్ రన్ నిర్వహించింది. 2023 ఖరీఫ్ సీజన్ నుంచి వీటిని మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కలుపు తగ్గింది.. దిగుబడి పెరిగింది ఖరీఫ్‌లో ఆరు ఎకరాల్లో ఎం–7 వరి రకం సాగు చేశా. 30వ రోజు, 60వ రోజు నానో యూరియాను రెండుసార్లు లీటర్ నీటిలో 4 ఎంఎల్ చొప్పున కలిపి స్ప్రే చేశాం. కలుపు సమస్య, ఖర్చు తగ్గింది. దిగుబడి సరాసరిన రెండు బస్తాలు అధికంగా వచ్చింది. – అశోక్‌కుమార్, ఎల్లాయపాడు, నెల్లూరు జిల్లా త్వరలో ప్లాంట్‌కు పునాది రాష్ట్రంలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఇఫ్కో అంగీకరించింది. నెల్లూరులో భూములను కేటాయించడంపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. ఒకటి రెండు నెలల్లో ప్లాంట్‌కు పునాదిరాయి వేసే అవకాశాలున్నాయి. ఈ ప్లాంట్ కోసం రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. – వై.మధుసూదనరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ, మార్కెటింగ్ శాఖ -
మస్తుమస్తుగా.. మార్కెట్ యార్డులు
సాక్షి, అమరావతి: మార్కెట్ యార్డులు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. నాడు –నేడు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. మార్కెటింగ్ శాఖ ఆధీనంలో 216 వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. వీటి పరిధిలోని 194 యార్డులున్నాయి. దశాబ్దాల కిందట నిర్మించిన పలు యార్డుల్లోని గోదాములు శిథిలావస్థకు చేరుకు న్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే వాటిని ఆధునికీకరించడంతో పాటు, కమిటీలు ఆర్థిక పరిపుష్టి సాధించేలా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వచ్చే నెలాఖరు నాటికి పూర్తి.. గతేడాది కొత్తగా ఏర్పాటైన 14 మార్కెట్ కమిటీలకు పరిపాలన భవనాలతో పాటు ప్లాట్‌ఫామ్స్, స్టోరేజ్ గోడౌన్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఉన్న వాటిలో 137 యార్డుల్లో బాగా దెబ్బతిన్న గోదాములపై కొత్తగా షీట్స్, కవర్డ్ షెడ్లు, శ్లాబ్‌లు, అప్రోచ్, సీసీ రోడ్లు, కల్వర్టులు, ప్లాట్ ఫామ్స్, కాంపౌండ్ వాల్స్, డ్రైన్స్, మరుగు దొడ్లు, బోర్‌వెల్స్, విద్యుత్, మంచినీటి పైప్ లెన్స్‌తో పాటు పరిపాలన భవనాలు, మీటింగ్ హాళ్లు, అదనపు అంతస్తులు, యార్డుల్లోని రైతు బజార్లకు కొత్త షెడ్లు, హమాలీలు, రైతులు విశ్రాంతి తీసుకునే షెడ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తున్నారు. నాడు–నేడు పథకం కింద రూ.249.87 కోట్ల అంచనాతో మొత్తం 589 పనులను ప్రారంభించారు. గతేడాది జూలై 8న రైతు దినోత్సవం నాడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రూ.60.22 కోట్ల విలువైన 204 పనులు పూర్తి కాగా, రూ.189.65 కోట్ల విలువైన మరో 385 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అత్యధికం గా కర్నూలు జిల్లాలో రూ.12.24 కోట్ల విలువైన 42 పనులు, వైఎస్సార్ జిల్లాలో 10.22 కోట్ల విలువైన 15 పనులు పూర్తయ్యాయి. వీటిని ఏప్రిల్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో మార్కెటింగ్ శాఖ ముందుకుసాగుతోంది. -
మార్కెట్లలో పీఎఫ్ గోల్మాల్
సాక్షి, హైదరాబాద్: మార్కెటింగ్ శాఖలో పనిచేసే సెక్యూరిటీ గార్డుల భవిష్యనిధి (పీఎఫ్)కి ఓ ఔట్సోర్సింగ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎసరుపెట్టింది. పీఎఫ్, ఈఎస్ఐ సొమ్మును జమ చేయకుండా స్వాహా చేసింది. కొత్తపేట పండ్ల మార్కెట్లో వెలుగు చూసిన ఈ అక్రమాలపై మార్కెటింగ్ శాఖ విచారణకు ఆదేశించింది. అయితే, పీఎఫ్ స్వాహా వ్యవహారం కేవలం కొత్తపేట మార్కెట్‌కే పరిమితం కాలేదని.. పదుల సంఖ్యలో ఇతర మార్కెట్లలో కూడా ఈ తతంగం జరిగినట్లు తేలింది. దీంతో రంగంలోకి దిగిన మార్కెటింగ్ శాఖ అధికారులు సెక్యూరిటీ ఏజెన్సీపై చర్యలకు ఉపక్రమించారు. నెలనెలా తమ ఖాతాలో జమ కావాల్సిన పీఎఫ్ సొమ్ము జమ కాకపోవడం, జనవరి వేతనం కూడా రాకపోవడంతో పలువురు సెక్యూరిటీ గార్డులు మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ ఏజెన్సీ అవినీతి వ్యవహారం వెలుగు చూసింది. పీఎఫ్ విభాగం లేఖలు రాసినా.. భవిష్య నిధి బకాయిలపై పీఎఫ్ విభాగం పలుమార్లు ఆయా మార్కెట్ల కార్యదర్శులకు లేఖలు రాసింది. ఉద్యోగుల ఖాతాలో పీఎఫ్ జమ చేయనందున సెక్యూరిటీ ఏజెన్సీకి నిధుల చెల్లింపులను నిలిపివేయాలని సూచిం చింది. అయితే, ఈ లేఖలను ఖాతరు చేయని కార్యదర్శులు.. ఏజెన్సీపై చర్యలు తీసుకోక పోగా క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించారు. తాజాగా సెక్యూరిటీ ఉద్యోగుల ఫిర్యాదుతో మార్కెటింగ్ శాఖ పీఎఫ్ అధికారులను సంప్ర దించగా.. ఈ విషయం బహిర్గతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహిస్తున్న మార్కెట్లలోని వందల సంఖ్యలో గార్డులకు పీఎఫ్, ఈఎస్ఐ సొమ్ము జమ కావడంలేదని తేలింది. దీంతో విచారణకు ఆదేశించిన మార్కెటింగ్ శాఖ డైరెక్టర్.. ఈ అవినీతికి బాధ్యులైన అధికారులపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా, కొత్తపేట పండ్ల మార్కెట్ కార్యదర్శి దీర్ఘకాలిక సెలవులో వెళ్లడం మార్కెటింగ్ శాఖ ఉద్యోగవర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. కాగా, కార్యదర్శి సెలవులో వెళ్లిపోవడంతో గ్రేడ్–1 కార్యదర్శి చిలుక నరసింహారెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
రైతుల మేలు కోరు‘కొనేలా’..
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అడ్డగోలుగా దోచేసే దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం కొనుగోళ్లలో పారదర్శకత, రైతులకు ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా ఈ–ఫారమ్ పేరుతో ఓ సరికొత్త జాతీయ స్థాయి మార్కెటింగ్ వసతి ఏర్పాటు చేయనుంది. వ్యాపారులే నేరుగా రైతుల నుంచి పంట కొనుగోలు చేసేలా, అందుకు అధికారులు మధ్యవర్తిత్వం వహించేలా ఓ కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టనుంది. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన జిల్లాల్లో ఇప్పటికే మార్కెటింగ్ శాఖ రైతుల వివరాలు సేకరిస్తోంది. జాతీయ స్థాయి మార్కెటింగ్ సౌకర్యం... పంటలు పండించడం ఒక ఎత్తయితే.. పండించిన పంటను మద్దతు ధరకు అమ్ముకోవడం రైతులకు మరో సవాల్. ప్రస్తుతం ఉన్న సంప్రదాయ మార్కెట్ విధానంలో వ్యాపారులకు, రైతులకు మధ్యలో దళారి వ్యవస్థ రైతులను నిలువునా ముంచుతోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఈ–ఫారమ్ అనే నూతన మార్కెటింగ్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తోంది. ఈ విధానం కింద వ్యాపారులే నేరుగా రైతుల వద్ద నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. రైతులు, వ్యాపారులకు మధ్యలో మార్కెటింగ్‌శాఖ అధికారులు మధ్యవర్తిత్వం వహిస్తారు. జిల్లాలో ఎంత మంది రైతులు ఉన్నారు.. వారు ఏఏ పంటలు సాగు చేశారు.. వారి వద్ద ఉన్న ఉత్పత్తులు ఏంటి.. ఎంతమేర ఉన్నాయి.. అనే వివరాలను మార్కెటింగ్‌శాఖ అధికారులు సేకరిస్తారు. తరువాత ఆ వివరాలను నేరుగా కార్పొరేట్ కంపెనీలు, బడా వ్యాపారులకు అందిస్తారు. వ్యాపారులు వారి అవసరాల మేరకు రైతుల నుంచి నేరుగా ఉత్పత్తులు కొనుగోలు చేసుకోవచ్చు. ఉత్పత్తులను కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇప్పటి వరకు జిల్లాలో 3.50 లక్షల రైతులు, పంట ఉత్పత్తుల వివరాలను మార్కెటింగ్‌శాఖ అధికారులు సేకరించారు. ఈ మొత్తం వ్యవహారం నడిపించేందుకు నాగార్జున ఫెర్టిలైజర్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఎఫ్జీఎల్)ను స్పెషల్ పర్పస్ వెహికల్‌గా ఎంపిక చేశారు. త్వరలో ముఖ్యమంత్రి ప్రారంభించిన అనంతరం ఈ –ఫారమ్ వ్యవస్థ వెబ్సైట్ అధికారికంగా అందుబాటులోకి వస్తుంది. ఈ వెబ్సైట్లో రైతులు నేరుగా తమ ఉత్పత్తుల వివరాలను నమోదు చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లోనే అధికారులు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. భారీగా ఆర్డర్లు... ఈ–ఫారమ్ విధానంలో ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు బడా కంపెనీలు, వ్యాపారులు ముందుకు వస్తున్నారు. వివిధ దేశాలు, రాష్ట్రాలకు చెందిన పలు బడా కంపెనీలు ఇప్పటికే తమకు కావాల్సిన ఉత్పత్తుల వివరాలను మార్కెటింగ్‌శాఖ అధికారులకు ఇచ్చారు. ఇప్పటికే ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా పచ్చి మిర్చి 80 టన్నులు, ఎండు మిర్చి 25 టన్నులు, ధాన్యం 3 వేలు టన్నులు, పత్తి 15 టన్నులు రైతుల నుంచి సింగపూర్‌కు ఎక్స్‌పోర్టు జరిగింది. మరో రూ.200 కోట్లు విలువ గల మిర్చి, ధాన్యం, పత్తి, కందులు, శనగలు, మినుములు, పెసలు కావాలని బడా కంపెనీల నుంచి ఆర్డర్లు ఇచ్చారు. జిల్లాలో అత్యధికంగా మిర్చి, వరి, పత్తి, కందులు, శనగలు, మినుములు, జొన్న, మొక్కజొన్న, పెసర వంటి పంటలు పండుతుండడంతో వీటికి మార్కెట్ అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో.. రాష్ట్రంలోని గుంటూరు, అనంతపురం, కర్నూలు, కృష్ణా, ప్రకాశం జిల్లాలను ఈ పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఈ మేరకు గుంటూరు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ–ఫారమ్ విధానాన్ని అమలు చేయడంలో మిగిలిన జిల్లాలతో పోల్చితే ముందు వరసలో ఉన్నారు. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జాయింట్ కలెక్టర్ దినేష్‌కుమార్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు మార్కెటింగ్‌శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. కంట్రోల్ రూం ఏర్పాటు... ఈ విధానాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు చుట్టుగుంట సెంటర్లోని మార్కెటింగ్‌శాఖ కార్యాలయంలోనే ఓ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి రైతులు తమ పేర్లు, ఉత్పత్తులను నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్ ట్రేడ్‌లో గుంటూరు జిల్లా ప్రథమ స్థానం... పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన జిల్లాల్లో ఈ–ఫారమ్ విధానం అమలు, ఆన్లైన్ ట్రేడింగ్‌లో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా ఇప్పటికే రైతుల నుంచి నేరుగా బడా కంపెనీలు కొనుగోలు చేసి సింగపూర్‌కు ఎక్స్‌పోర్టు చేశారు. ఈ–ఫారమ్ విధానంతో రైతులకు మార్కెటింగ్, ధరల పరంగా లాభం చేకూరనుంది. –బి.రాజాబాబు, ఏడీ మార్కెటింగ్‌శాఖ ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం మంచిదే.. రైతుల పంట ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం శుభపరిణామం. వాణిజ్య పంటలు పండించే రైతులకు ఈ విధానం కచ్చితంగా మేలు చేస్తుంది. అయితే దేశంలోని అన్ని కంపెనీలు, వ్యాపారులను ఈ విధానంలోకి ప్రభుత్వం తీసుకురావాలి. దీంతో మధ్య దళారీ వ్యవస్థ పూర్తిగా నశించిపోతుంది. – భవనం జయరామిరెడ్డి, అభ్యుదయ రైతు -
అద్దెకు మార్కెటింగ్ శాఖ గోడౌన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గోదాములను అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో 216 వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో 9,75,105 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 1,059 గోదాములు ఉన్నాయి. ఇప్పటివరకు ‘రైతుబంధు’ పథకం కింద రైతులు తాము పండించిన ఉత్పత్తులకు కనీస మద్దతు ధర వచ్చే వరకు ఈ గోదాముల్లో దాచుకునేవారు. మిగిలిన గోడౌన్లను ప్రభుత్వరంగ సంస్థలైన సివిల్ సప్లయిస్, రాష్ట్ర గోదాముల సంస్థకు అద్దెకు ఇచ్చేవారు. అయినప్పటికీ మరికొన్ని గోడౌన్లు ఖాళీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు కూడా వ్యవసాయ ఉత్పత్తులను వీటిలో నిల్వ చేసుకునే వెసులుబాటును మార్కెటింగ్ శాఖ కల్పిస్తోంది. తద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఏడాది నుంచి రెండేళ్ల కాలానికి వీటిని అద్దెకు ఇస్తారు. చదరపు అడుగుకు రూ.5పైగా అద్దె వస్తేనే.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2,53,639 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 258 గోదాములను చదరపు అడుగు రూ.5కు మించి ఎవరు కోట్ చేస్తారో వారికి అద్దెకిచ్చేందుకు ఇటీవలే నోటిఫికేషన్ జారీ అయింది. అత్యధికంగా గుంటూరులో 44, అత్యల్పంగా విశాఖపట్నంలో 4 గోదాములు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటివరకు విజయ నగరంలో 1, పశ్చిమ గోదావరిలో 7, వైఎస్సార్ జిల్లాలో 6 గోడౌన్లను చదరపు అడుగుకు రూ.6 చొప్పున చెల్లించి అద్దెకు తీసుకునేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. మిగిలిన వాటిని కూడా ప్రైవేటు సంస్థలు లేదా వ్యక్తులకు లీజుకిచ్చేందుకు మరోసారి నోటిఫికేషన్ జారీ చేసేందుకు మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
ట‘మోత’ తగ్గేలా.. సీఎం జగన్ ఆదేశాలతో రంగంలోకి మార్కెటింగ్ శాఖ
సాక్షి, అమరావతి: ఠారెత్తిస్తున్న టమాటా ధరలకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో మార్కెటింగ్ శాఖ నేరుగా రైతుల నుంచి టమాటాలను కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా విక్రయాలు చేపట్టింది. అనంతపురం, చిత్తూరు మార్కెట్ యార్డుల్లో రైతుల నుంచి కిలో రూ.50–55 చొప్పున కొనుగోలు చేసి వైఎస్సార్ కడప, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రైతు బజార్ల ద్వారా రవాణా చార్జీలతో కలిపి రూ.60 చొప్పున విక్రయిస్తోంది. ఒక్కో వినియోగదారుడికి కిలో చొప్పున అందిస్తున్నారు. అవసరమైతే మిగిలిన జిల్లాల్లోనూ విక్రయాలు చేపట్టనున్నారు. ప్రస్తుతం రోజుకు ఏడు నుంచి 10 టన్నుల చొప్పున కొనుగోలు చేస్తుండగా రానున్న రోజుల్లో కనీసం వంద టన్నులు రైతుల నుంచి సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 61,571 హెక్టార్లలో టమాటా సాగవుతుండగా చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనే 56,633 హెక్టార్లలో పండిస్తున్నారు. ఏటా మొత్తం 22.16 లక్షల టన్నుల దిగుబడుల్లో 20.36 లక్షల టన్నులు మూడు జిల్లాల నుంచే వస్తున్నాయి. సకాలంలో స్పందించడంతో... గత నెల రోజులుగా భారీ వర్షాలు, వరదలతో టమాటా పంటకు అపార నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనా ప్రకారం రాయలసీమ జిల్లాల్లోనే 2 వేల హెక్టార్లలో 65 వేల టన్నుల వరకు దెబ్బ తిన్నట్టు అంచనా. దీంతో తీవ్ర కొరత ఏర్పడి టమాటా ధరలు నింగినంటాయి. ఈ పరిస్థితిని గుర్తించి అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి టమాటా కొనుగోలు చేసి వినియోగదారులకు అందించాలని నిర్ణయించింది. సకాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల మరో వారం రోజుల్లో టమాటా ధర కిలో రూ.30–40కి దిగి వస్తుందని అంచనా వేస్తున్నారు. మదనపల్లెలో గ్రేడ్ –1 కిలో రూ.52 మదనపల్లె: ఇతర రాష్ట్రాల నుంచి టమాటా దిగుమతితో మదనపల్లె వ్యవసాయ కమిటీ మార్కెట్లో ధరలు తగ్గాయి. రెండు రోజుల క్రితం గ్రేడ్ –1 రకం కిలో రూ.130 పలకగా గురువారం రూ.52కి దిగి వచ్చాయి. చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి పది లారీల టమాటాలు వచ్చాయి. రెండో రకం టమాటా కిలో రూ.10–30 మధ్య ధరలు నమోదయ్యాయి. ములకలచెరువులో కిలో రూ.33 మాత్రమే ములకలచెరువు (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా ములకలచెరువు వ్యవసాయ మార్కెట్ యార్డులోనూ టమాటా ధరలు భారీగా తగ్గాయి. మొన్నటిదాకా ఇక్కడ 30 కిలోల టమాటా బాక్సు రూ.3 వేల వరకు పలకగా గురువారం రూ.800 నుంచి రూ.1,000 వరకు విక్రయించారు. బయటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు టమాటాలను తరలించడంతో ధరలు ఒక్కసారిగా తగ్గాయి. ధరలు నియంత్రించేందుకే.. ‘సీజన్ ఆరంభంలో ధరలేక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వేలం పాటల్లో పాల్గొని వ్యాపారులతో పోటీపడి కొనుగోలు చేసింది. ధరల నియంత్రణకు రైతుల నుంచి నేరుగా టమాటా కొనుగోలు చేపట్టి విక్రయిస్తున్నాం’ – పి.మధుసూదనరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ, మార్కెటింగ్ శాఖ వారం రోజుల్లో అదుపులోకి.. ‘వర్షాలు, వరదల వల్ల పంటలు దెబ్బతినడం, కార్తీకమాసం కారణంగా డిమాండ్ వల్ల టమాటా ధర పెరిగింది. ప్రభుత్వ చర్యలతో రానున్న వారం రోజుల్లో ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశాలున్నాయి’ -బి. శ్రీనివాసరావు, రైతుబజార్ల సీఈవో -
టమాటా రైతు 'పంట' పండింది
సాక్షి, అమరావతి: మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో టమాటా మంచి ధర పలుకుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో కేవలం కిలో రూ.2–4 మధ్య పలికిన ధర నేడు రూ.7–14ల మధ్య పలుకుతుండడంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. వచ్చే కొద్దిరోజుల్లో లాక్డౌన్ సడలింపులతో ఎగుమతులు పుంజుకుంటే ధర మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. టమాటా పంట రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 34,090 హెక్టార్లు, అనంతపురంలో 19,340 హెక్టార్లు, కర్నూలులో 3,203 హెక్టార్లలో సాగవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏటా 22.16 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుండగా, అందులో 20.36 లక్షల టన్నులు రాయలసీమ జిల్లాల నుంచే వస్తుంది. ఇలా మార్కెట్‌కు వచ్చే టమాటాలో మూడొంతులు వివిధ రాష్ట్రాలకు ఎగుమతవుతుంది. నిన్నటి వరకు ఏడు రాష్ట్రాలకే పరిమితమైన ఎగుమతులు మంగళవారం పది రాష్ట్రాలకు పెరిగింది. మరో నాలుగు రాష్ట్రాలకు ఎగుమతులు ప్రారంభం కానున్నాయి. వేలం పాటల్లో మార్కెటింగ్ శాఖ.. నిజానికి.. కరోనావల్ల ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో ఎగుమతుల్లేక, మార్కెట్లో ధరలేక కిలో టమాటా రూ.2–4కు మించి ధర పలకలేదు. ఈ దశలో ప్రభుత్వాదేశాలతో రంగంలోకి దిగిన మార్కెటింగ్ శాఖ మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ధర తక్కువగా ఉన్న మార్కెట్లలో వ్యాపారులతో కలిసి వేలం పాటల్లో పాల్గొంది. ఇలా కిలో రూ.5–7 చొప్పున రూ.11లక్షలు వెచ్చించి 52 మంది రైతుల నుంచి సుమారు 130.39 టన్నుల వరకు కొనుగోలు చేసిన మార్కెటింగ్ శాఖ కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం రైతుబజార్ల ద్వారా విక్రయాలు జరిపింది. మరోవైపు.. ఏపీ మహిళా అభివృద్ధి సంస్థ ద్వారా 410 మంది రైతుల నుంచి రూ.63.60 లక్షల విలువైన 1,615 టన్నుల టమాటాను సేకరించి ప్రాసెసింగ్ కంపెనీలకు సరఫరా చేసింది. దీంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. ఫలితంగా కిలో రూ.4కు మించి పలకని టమాటా ధర ప్రస్తుతం గరిష్టంగా రూ.14లు పలుకుతోంది. జాతీయ స్థాయిలో టమాటా మార్కెట్‌గా పేరొందిన మదనపల్లెతో పాటు పలమనేరు, మలకల చెరువు మార్కెట్ యార్డుల్లో టమాటా రైతుకు నేడు మంచి రేటు వస్తోంది. కనిష్ట, గరిష్ట ధరలిలా.. ► మదనపల్లె మార్కెట్ యార్డులో మంగళవారం మొదటి రకం టమాటా కిలో కనిష్టం రూ.11, గరిష్టం రూ.14.. రెండో రకం కనిష్టం రూ.7, గరిష్టం రూ.10 పలికింది. ► అలాగే, పలమనేరు మార్కెట్ యార్డులో రెండో రకం కనిష్టం రూ.9, గరిష్టం రూ.12 ధర పలికింది. ► మలకలచెరువు మార్కెట్ యార్డులో కిలో కనిష్టంగా రూ.7, గరిష్టంగా 10 పలికింది. ఈ మూడు మార్కెట్ యార్డులకు సగటున రోజుకు 2వేల టన్నుల చొప్పున టమాటా వస్తోంది. రైతుల వద్ద మరో 10 లక్షల టన్నుల టమాటా ఉన్నట్లు అంచనా. ► ఇదిలా ఉంటే.. టమాటా ధరలు ఈనెలాఖరులో భారీగా పెరిగే సూచనలు ఉన్నట్టు మార్కెటింగ్ శాఖ అంచనా వేస్తోంది. లాక్డౌన్ సడలింపులతో పలు రాష్ట్రాలకు ఎగుమతులు మొదలైతే వ్యాపారుల మధ్య పోటీతో ధరలు ఇంకా పెరుగుతాయి. ప్రభుత్వం జోక్యంవల్లే.. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ప్రభుత్వం జోక్యం చేసుకోవడంవల్లే టమాటా ధరలు పెరుగుతున్నాయి. గతంలో ఒకసారి పతనమైతే మళ్లీ పెరిగిన దాఖలాలు చాలా తక్కువ. అలాంటిది ఈసారి కిలో రూ.2–4ల మధ్య ప్రారంభమైన ధర నేడు కిలో రూ.14లు పలుకుతోంది. మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. – పీఎస్ ప్రద్యుమ్న, కమిషనర్, మార్కెటింగ్ శాఖ ఇది నిజంగా శుభపరిణామం ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మదనపల్లె మార్కెట్లో టమాటాకు మంచి ధర పలుకుతోంది. 10 కిలోల టమాటా 1వ రకం గరిష్టంగా రూ.140 పలకడం నిజంగా శుభపరిణామం. ప్రస్తుతం సాగు రకాల్లో 1వ రకం టమాటా 60 శాతం కంటే ఎక్కువగా సాగవుతోంది. – ఎంవీఎస్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్ -
మార్కెటింగ్ శాఖ అధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష
సాక్షి, అమరావతి: మార్కెటింగ్ శాఖ అధికారులతో మంత్రి కన్నబాబు శుక్రవారం రోజున సమీక్ష నిర్వహించారు. కోవిడ్ దృష్ట్యా మామిడి, టమాట మార్కెట్లపై దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు పండ్ల ధరలపై దృష్టి పెట్టామని మంత్రి కన్నబాబు తెలిపారు. రైతులు మార్కెట్లలోకి రాత్రులు కూడా సరుకులు తీసుకురావచ్చునని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. అంతేకాకుండా మార్కెట్ల నుంచి తిరిగి వెళ్లే వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని మంత్రి అధికారులకు సూచించారు. మామిడి ధరలను రోజూ పర్యవేక్షించాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు తెలిపారు. టమాట ధరలు పడిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల టన్నుల టమాటలను ప్రాసెసింగ్ యూనిట్స్ కొలుగోలు చేసేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. రైతు బజార్లలో మాస్క్ లేకుండా వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో ‘నో మాస్క్ - నో ఎంట్రీ విధానం’ అమలులో ఉంటుందని మంత్రి కన్నబాబు తెలిపారు. చదవండి: ‘సీఎం జగన్ అత్యంత బాధ్యతగా వ్యవహరించారు’ -
మార్కెట్ కమిటీలు కళకళ
సాక్షి, అమరావతి: వ్యవసాయ మార్కెట్ కమిటీలు మళ్లీ కళకళలాడుతున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల ఆర్డినెన్స్‌తో గతేడాది ఆగస్టు నుంచి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లపై మార్కెట్ సెస్ వసూళ్లు నిలిచిపోగా.. సుప్రీంకోర్టు ఆదేశాలతో నెల రోజుల క్రితం తిరిగి మొదలయ్యా యి. దీంతో 8 నెలల పాటు ఆర్థిక ఇబ్బందులు పడి న మార్కెట్ కమిటీలు గాడిలో పడ్డాయి. మార్కెటింగ్ శాఖ అదీనంలో 216 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటిలో 815 మంది రెగ్యులర్, 2,628 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి జీతభత్యాల కింద ఏటా రూ.1. 22 కోట్లు ఖర్చవుతోంది. 2,478 మంది పింఛన్‌దారులు ఉండగా, వారికి ఏటా రూ.100 కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తోంది. మార్కెట్ సెస్ ద్వారా మార్కెట్ కమిటీలకు ఏటా రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. జీతభత్యాలు, రోజువారీ ఖర్చులు పోగా మిగిలిన నిధులతో మార్కెట్ కమిటీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. 1 శాతం సెస్ వసూలు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు సంబంధించి ఆయా ఉత్పత్తుల విలువపై ఒక శాతం మొత్తాన్ని సెస్ రూపంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు వసూలు చేస్తాయి. 2019–20లో రికార్డు స్థాయిలో 10,18,235.76 మెట్రిక్ టన్నుల వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులు మార్కెట్లోకి రాగా.. వాటి క్రయ విక్రయ లావాదేవీలపై మార్కెటింగ్ శాఖకు సెస్ రూపంలో రూ.551.22 కోట్ల ఆదాయం లభించింది. వ్యవసాయ చట్టాల ఆర్డినెన్స్ కారణంగా గతేడాది ఆగస్టు 20వ తేదీ నుంచి మార్కెట్ సెస్ వసూళ్లు నిలిచిపోయాయి. ఫలితంగా 2019– 20తో పోల్చితే 2020–21లో ఏకంగా రూ.433.52 కోట్ల ఆదాయాన్ని మార్కెటింగ్ శాఖ కోల్పోవాల్సి వచ్చింది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పెద్దఎత్తున ఉద్యమం సాగడం తో సుప్రీంకోర్టు ఆ చట్టాల అమలుపై స్టే విధించిం ది. దీంతో సెస్ వసూళ్లకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది మార్చి 25నుంచి మార్కెట్ సెస్ వసూళ్లు పునఃప్రారంభం కావడంతో రూ.వంద కోట్లకు పైగా సెస్ వసూలయినట్లు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులకు తెరపడింది దాదాపు 8 నెలల పాటు మార్కెట్ సెస్ వసూళ్లు నిలిచిపోవడంతో మార్కెట్ కమిటీలు ఆర్థికంగా ఇబ్బంది పడ్డాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో నెల రోజుల క్రితం సెస్ వసూళ్లు ప్రారంభించారు. సీజన్ మొదలవడంతో మార్కెట్ కమిటీల్లో క్రయవిక్రయాలు జోరందుకుంటున్నాయి. – పీఎస్ ప్రద్యుమ్న, కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
గ్రామీణ గోదాముల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: రైతులు పండించే పంటకు వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల పరిధిలోనే అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల (బహుళ ప్రయోజన కేంద్రాల) నిర్మాణానికి అడుగులు ముందుకు పడ్డాయి. వీటిలోనే డ్రైయింగ్ యార్డ్స్ (ఆరబోత కళ్లాలు) సహా 500 నుంచి 1,000 మెట్రిక్ టన్నుల మేర పంట ఉత్పత్తుల నిల్వ సామర్థ్యంతో తొలి దశలో 1,255 గ్రామాల్లో గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం మార్కెటింగ్ శాఖ టెండర్లను ఆహ్వానిస్తోంది. పంటలను ఆరబెట్టుకునేందుకు వీలుగా ప్లాట్‌ఫామ్‌తో కలిపి ఒక్కో గోదామును ఆర ఎకరం విస్తీర్ణంలో నిర్మించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.2,700 కోట్లతో గ్రామీణ గోదాముల నిర్మాణాలను నాలుగు దశల్లో చేపట్టాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. వీటిలోనే అవసరమైన పరికరాలు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. నాలుగు ప్యాకేజీలుగా టెండర్లు రాష్ట్రాన్ని నాలుగు డివిజన్లుగా వర్గీకరించి తొలి దశలో రూ.579.33 కోట్లతో 1,255 గోదాములను నిర్మిస్తారు. ఇప్పటికే ఒక ప్యాకేజీ కింద గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 219 గ్రామాల్లో రూ.67.40 కోట్ల వీటిని నిర్మించేలా టెండర్లు ఆహ్వానించారు. మరో ప్యాకేజీగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగం జిల్లాల్లోని 92 గ్రామాల్లో రూ.27.98 కోట్లతో గోదాములు నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. ఈ రెండు ప్యాకేజీలకు వచ్చే నెల 18న సాంకేతిక బిడ్స్ తెరుస్తారు. వచ్చే నెల 21వ తేదీన ప్రైస్ బిడ్ తెరిచి అదే రోజున రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తారు. ఆరు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేయాలనే నిబంధన విధించారు. ఈ ప్యాకేజీల విలువ రూ.వంద కోట్ల లోపే ఉండటంతో ఈ ప్రొక్యూర్మెంట్లో టెండర్లను ఆహ్వానించారు. వైఎస్సార్ కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఒక ప్యాకేజీ కింద రూ.208.80 కోట్లతో 514 గ్రామాల్లో గోదాములు నిర్మాణాలకు టెండర్ డాక్యుమెంట్‌ను మార్కెటింగ్ శాఖ సిద్ధం చేసింది. అదేవిధంగా కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో మరో ప్యాకేజీ కింద రూ.161.15 కోట్లతో 430 గ్రామాల్లో గోదాములు నిర్మాణాలకు టెండర్ల డాక్యుమెంట్‌ను మార్కెటింగ్ శాఖ సిద్ధం చేసింది. ఈ రెండు ప్యాకేజీల టెండర్ల విలువ రూ.వంద కోట్లకు పైబడి ఉండటంతో జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. పరికరాల సరఫరాకూ.. మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లలో రైతులకు అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచేందుకు కూడా మార్కెటింగ్ శాఖ రూ.114 కోట్ల విలువైన టెండర్లను ఆహ్వానించింది. రూ.70 కోట్లను మల్టీ గ్రెయిన్‌న్ డీ–స్టోనర్ కమ్ క్లీనర్, పీటీవో ఆపరేటెడ్ మొబైల్ ప్యాడీ డ్రైయర్స్ సరఫరా కోసం వెచ్చిస్తారు. రూ.44 కోట్లను అసైయింగ్ యూనిట్లు, ప్రొక్యూర్మెంట్ కేంద్రాలు, కోల్డ్ రూమ్స్ పరికరాల సరఫరాకు వినియోగిస్తారు. ఈ పరికరాల సరఫరాకు కూడా రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తారు. నాలుగు దశల్లో నిర్మాణాలు పూర్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వీలైనంత త్వరగా మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లను రైతులకు అందుబాటులో తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నాలుగు దశల్లో మొత్తం ఈ కేంద్రాల నిర్మాణాలను పూర్తి చేయాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. తొలి దశలో ఇప్పటికే రెండు డివిజన్లలో టెండర్లను ఆహ్వానించాం. మరో రెండు డివిజన్లలో టెండర్లను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపేందకు సిద్ధం చేశాం. – ప్రద్యుమ్న, ప్రత్యేక కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
బత్తాయి ధరకు భరోసా.. రైతుకు ధిలాసా
సాక్షి, అమరావతి: ఆంధ్ర బత్తాయి.. అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో యమ గిరాకీ. మార్కెట్‌కు వస్తోందంటే చాలు ఎగరేసుకుపోతారు. గతేడాది రికార్డు స్థాయిలో దిగుబడులు రాగా, మార్కెట్‌కు వచ్చే సమయంలో కరోనా దెబ్బతీయడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని కొనుగోలు చేయడంతో బత్తాయి రైతు గట్టెక్కగలిగాడు. ప్రస్తుతం మార్కెట్లో మంచి రేటు పలుకుతుండడంతో ఈసారి లాభాలను ఆర్జించే అవకాశాలు కన్పిస్తున్నాయి. బత్తాయి సాగులోనే కాదు.. దిగుబడిలో కూడా మన రాష్ట్రం దేశంలో రెండోస్థానంలో ఉంది. రాష్ట్రంలో అనంతపురం, విజయనగరం, వైఎస్సార్, ప్రకాశం, తూర్పు గోదావరి, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఎక్కువగా సాగవుతోంది. మొత్తం విస్తీర్ణంలో సగానికి పైగా రాయలసీమ జిల్లాల్లోనే ఉంది. రాష్ట్రంలో సాతుగుడి, చీని రకాల బత్తాయి పండుతోంది. సాధారణంగా ఏడాదికి మూడు పంటల వరకు తీస్తారు. కానీ ఏప్రిల్‌లో వచ్చే పంటకే మంచి డిమాండ్ ఉంటుంది. మంచి లాభాలొస్తాయి.అందుకే రైతులు ఎక్కువగా ఆ పంటపైనే ఆశలు పెట్టుకుంటారు. మనరాష్ట్రంలో సాగయ్యే బత్తాయిలో సగానికిపైగా ఢిల్లీ అజాద్‌పూర్ మార్కెట్ ద్వారా ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. మిగిలిన సగంలో మూడొంతులకుపైగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మార్కెట్లకు వెళుతుంది. కేవలం 10 నుంచి 15 శాతం మాత్రమే లోకల్ మార్కెట్‌కు పోతుంది. మన బత్తాయి టన్ను రూ.లక్ష పలికిన సందర్భాలున్నాయి. 2018–19లో 88,029 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవగా 21.9 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. 2019–20లో సాగువిస్తీర్ణం 1,10,970 హెక్టార్లకు చేరగా దిగుబడి రికార్డు స్థాయిలో 26.63 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. నిరుడు ప్రభుత్వ జోక్యంతో గట్టెక్కారు.. 2019–20లో దిగుబడి ఎక్కువగా ఉన్నా.. పంట మార్కెట్‌కు వచ్చే సమయం (ఏప్రిల్)లో కరోనా దెబ్బతీసింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే.. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)లను ప్రకటించింది. ఆ జాబితాలో రాష్ట్రంలో ఎక్కువగా సాగయ్యే బత్తాయి కూడా ఉండడం రైతుకు మేలు చేసింది. గతేడాది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మార్కెటింగ్‌శాఖ ద్వారా బత్తాయిని టన్ను రూ.10 వేల చొప్పున 4,109 మెట్రిక్ టన్నుల బత్తాయిని కొనుగోలు చేసింది. రూ.5 సబ్సిడీ భరించి రైతుబజార్లు, స్వయం సహాయక సంఘాల ద్వారా విక్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఉపశమన చర్యలవల్ల లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత బత్తాయికి మంచి రేటొచ్చింది. టన్ను రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు అమ్ముకుని రైతులు గట్టెక్కారు. ఈ ఏడాది మార్కెట్లో మంచి రేటు ప్రస్తుతం 95,982 హెక్టార్లలో బత్తాయి సాగులో ఉంది. హెక్టారుకు 24 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రస్తుతం మార్కెట్లో టన్ను ధర రూ.40 వేల నుంచి రూ.50 వేల మధ్య ఉంది. పూర్తిస్థాయిలో పంట మార్కెట్‌కు వచ్చే సమయానికి రూ.60 వేలకు పైగా పలికే అవకాశాలుండడంతో మంచి లాభాలొస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మదర్ డెయిరీ తమ ఖాతాదారులకు పంపిణీ చేసేందుకు రాయలసీమ జిల్లాల నుంచి రోజుకు ఒక లోడు బత్తాయిని కొనుగోలు చేస్తోంది. మొత్తం బత్తాయి కొనుగోలు చేస్తామంటూ ఆ సంస్థ ఇప్పటికే అధికారులతో చర్చలు జరుపుతోంది. మరోపక్క ఢిల్లీ అజాద్‌పూర్ మార్కెట్ నుంచి ఆర్డర్లు కూడా మొదలయ్యాయని రైతులు చెబుతున్నారు. దిగుబడులు బాగున్నాయి ఈసారి పంట బాగుంది. దిగుబడులు కూడా రికార్డు స్థాయిలోనే వచ్చేలా ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్లో టన్ను రూ.40 వేలకుపైగా పలుకుతుండగా, ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ సంవత్సరం రైతుకు మంచి లాభాలు వస్తాయని అంచనా వేస్తున్నాం. – ఎం.వెంకటేశ్వర్లు, జేడీ, హార్టికల్చర్ (ఫ్రూట్స్ విభాగం) -
గ్రామాల్లో ‘మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లు’
సాక్షి, అమరావతి: ఆరుగాలం కష్టించి పండించిన పంటను మార్కెటింగ్ చేసుకోలేక అన్నదాతలు పడుతున్న వెతలకు త్వరలో తెరపడనుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతానికి చెందిన వ్యాపారులైనా రైతు నుంచి నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేసేలా మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా వీటిని తీర్చిదిద్దనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంతో మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లను వేగవంతం చేసింది. మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతం.. గ్రామాల్లో పండించిన పంటను స్థానికంగా విక్రయించేలా ఆర్బీకేల సమీపంలో మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటవుతాయి. రూ.2,718.11 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటయ్యే ఈ కేంద్రాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.264.2 కోట్లు ఖర్చు చేయనుండగా కేంద్రం రూ.74 కోట్లు సబ్సిడీగా అందించనుంది. రూ.2,361.1కోట్లను అగ్రి ఇన్ఫర్ ఫండ్ (ఏ.ఐ.ఎఫ్) కింద వడ్డీ ఉపసంహరణ స్కీమ్ ద్వారా ఒక శాతం వడ్డీకి నాబార్డు రుణం రూపంలో అందించనుంది. రైతు కమిటీల ద్వారా కొనుగోలు చేసే కొన్ని రకాల పరికరాలకు సంబంధించి రూ.18.9 కోట్లు లబ్ధిదారుల వాటా కింద భరించాల్సి ఉంటుంది. ఈ కేంద్రాల కోసం ఆర్బీకేల సమీపంలో 50 సెంట్ల నుంచి ఎకరం స్థలాన్ని సమీకరిస్తున్నారు. గ్రామస్థాయిలో మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో పంటకోతకు ముందు, తర్వాత రైతులకు మౌలిక సదుపాయాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఈఎఫ్‌ఎఆర్ మార్కెట్.ఏపీ.జీవోవీ.ఇన్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇ–మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ ఇదీ.. దళారీల బెడద లేకుండా పంట ఉత్పత్తులను రైతులు నేరుగా కళ్లాల నుంచి విక్రయించుకునే అవకాశం ఇ–మార్కెటింగ్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా కల్పించనున్నారు. దీనిద్వారా ప్రతి రైతును అఖిల భారత మార్కెట్‌కు అనుసంధానిస్తారు. గిట్టుబాటు ధర లభించే వరకు ఈ సెంటర్లలో నిల్వ చేసుకుని తమకు నచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. ఏ గ్రామంలో ఏ ఉత్పత్తులు పండిస్తున్నారు? సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులను పాటిస్తున్నారు? నాణ్యత ఎలా ఉంది? దిగుబడి ఎంత? తదితర అంశాలను ఈ ప్లాట్పామ్ ద్వారా వ్యాపారులు సైతం తెలుసుకోవచ్చు. త్వరలో టెండర్లు ఆర్బీకేలకు అనుసంధానంగా మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాగానే వచ్చే నెలలో రివర్స్ టెండరింగ్ ద్వారా టెండర్లను పిలవబోతున్నాం. ముందుగా జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపి ఆ తర్వాత టెండర్లను పిలుస్తాం. మార్చిలో ఈ ప్రక్రియ పూర్తి చేసి ఏప్రిల్‌లో పనులకు శ్రీకారం చుట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. వీటిని దశలవారీగా 2022 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని సంకల్పించాం’ – ప్రద్యుమ్న, మార్కెటింగ్ శాఖ కమిషనర్ మౌలిక సదుపాయాలివే ప్రధానంగా రూ.1,637.05 కోట్లతో 4,277 డ్రై స్టోరేజ్, డ్రైయింగ్ ప్లాట్‌ఫామ్స్, రూ.331.80 కోట్లతో ప్రజాపంపిణీ వ్యవస్థ కోసం 60 అధిక నిల్వ సామర్థ్యం కలిగిన గిడ్డంగులు, రూ.188.73 కోట్లతో 1,483 కలెక్షన్ సెంటర్లు (ధాన్యం సేకరణ కేంద్రాలు), కోల్డ్ రూమ్స్ (శీతల గిడ్డంగులు), టర్మరిక్ బాయిలర్స్/పాలిషర్స్, రూ.378.24కోట్లతో 7,950 ప్రైమరీ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ (ధాన్యం శుద్ధి పరికరాలు), రూ.60.86 కోట్లతో 10,687 ఎస్సాయింగ్ ఎక్విప్మెంట్ (ధాన్యం నాణ్యత పరీక్షించే సామగ్రి), రూ.108.92 కోట్లతో 10,678 ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఎక్విప్మెంట్ (ధాన్యం కొనుగోలు సామగ్రి) కొనుగోలు చేయనున్నారు. కళ్లాల నుంచే ఆన్లైన్లో మార్కెటింగ్ చేసుకునేందుకు రూ.12.51 కోట్లతో ‘ఇ–మార్కెటింగ్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్’తెస్తున్నారు. చదవండి: (సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ ఆతిథ్యం) -
మార్కెట్లో సీఎం కేసీఆర్..రందీ వడకుర్రి అంటూ..
గజ్వేల్: సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి కూరగాయల మార్కెట్‌ను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. బుధవారం మార్కెట్ యార్డును ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్‌యార్డులో పంటను అమ్ముకోవడానికి వచ్చిన రైతులు, కమీషన్ ఏజెంట్లతో ఆయన మాట్లాడారు. అనంతరం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కూరగాయ రైతులకు భారీ ప్రయోజనం చేకూర్చేలా వంటిమామిడి మార్కెట్‌ను విస్తరించాల్సిన అవసరముందని చెప్పారు. ప్రస్తుతమున్న స్థలానికి అదనంగా మరో 14 ఎకరాలను సేకరించి 50 ఎకరాల విస్తీర్ణంలో మార్కెట్ ఉండేలా చూడాలని సూచించారు. అవసరమైతే ఢిల్లీ, కోల్‌కతాలోని కూరగాయల మార్కెట్లను సందర్శించి వాటికి దీటుగా వంటిమామిడిని తీర్చిదిద్దాలన్నారు. గజ్వేల్ ప్రాంతాన్ని ‘వెజిటబుల్ హబ్’గా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోవాలన్నారు. 16 ప్రభుత్వ కౌంటర్లు.. ములుగు మండలం తున్కిబొల్లారం వద్ద 25 ఎకరాల భూమిని సేకరించి కోల్డ్ స్టోరేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. మార్కెట్లో కూరగాయల ధరలు నిలకడ లేక రైతులు నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పారు. వంటిమామిడి మార్కెట్ యార్డులో ఖాళీగా ఉన్న 16 దుకాణాల్లో వెంటనే ప్రభుత్వం తరఫున కౌంటర్లు తెరిచి రైతుల వద్ద నుంచి కూరగాయలు కొనుగోలు చేయాలని, వీటిని కిలో రూ.14కు తగ్గకుండా రైతులకు చెల్లించాలని ఆదేశించారు. ఈ కూరగాయలను ప్రభుత్వ వసతి గృహాలకు, మెస్‌లకు, ఇతర సంస్థలకు పంపే ఏర్పాట్లు చేయాలని సూచించారు. అధిక కమీషన్‌పై సీఎంకు ఫిర్యాదు వంటిమామిడి మార్కెట్లో ఏజెంట్లు 8% కమీషన్ వసూలు చేస్తున్నారని పలువురు రైతులు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. మార్కెట్ సందర్శన సందర్భంగా పలువురు రైతులు తమ ఇబ్బందులను వివరించారు. 8 శాతం కమీషన్ వసూలుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై 4 శాతం కమీషన్ మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు. కాగా, ఆలుగడ్డ ధర గణనీయంగా పడిపోయిన తీరుపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బిన్నీస్, టమాటా రైతులు కూడా తమ ఇబ్బందులను వివరించారు. సీఎం కేసీఆర్ వంటిమామిడి మార్కెట్ యార్డును సందర్శించిన సందర్భంగా రైతులతో ముచ్చటించారు. ఆ వివరాలు.. సీఎం: ఏం పెద్దమనిషి నీ పేరేంది? రైతు: మద్దికుంట కృష్ణమూర్తి. మాది తున్కిఖల్సా గ్రామం. వర్గల్ మండలం సీఎం: ఏ పంటలెక్కువ సాగు చేస్తవ్? రైతు: ఆలుగడ్డ ఎక్కువ సాగు చేస్త. సీఎం: గట్లనా.. నేను కూడా ఆలుగడ్డ సాగు చేసిన. విత్తనం ఎక్కడి నుంచి తెచ్చినవ్? రైతు: ఆగ్రా నుంచి తెచ్చిన సారూ.. 50 కిలోలకు రూ.3 వేల ధర పడ్డది. పోయినసారి వెయ్యి రూపాయలకే దొరికింది. సీఎం: అయ్యో గట్లనా.. నేను కూడా ఎక్కువ ధర పెట్టే విత్తనం కొన్న. ఆలుగడ్డ ధర ఎట్లుంది? రైతు: ఇన్నేండ్ల ఆలుగడ్డ సాగు లో నాకు లాసు ఎర్కలే. ఈ సారి మాత్రం లాసైతుంది సారూ.. 10 కిలోలకు రూ.80–110 అంటుండ్రు. గతంలో రూ.250 దాకా పలికేది. సీఎం: గంత తక్కువైందా..? అయితే లాసు కాకుండా ఏదైనా మార్గం ఆలోచిద్దాం. విత్తనాలు కూడా మీకు ఇక్కడే దొరికేటట్లు చేస్తా. మరో రైతుతో ఇలా.. సీఎం: నీ పేరేంది? ఏం చేస్తుంటవ్.. రైతు: పసుల స్వామి. మాది తున్కిమక్త, వర్గల్ మండలం. నేను రైతును, మార్కెట్లో కమీషన్ ఏజెంటును. సీఎం: ఆలుగడ్డ ధర ఎందుకు తగ్గింది? నీకేమైనా తెలుసా? రైతు: కొన్ని రోజుల దాకా ఈ మార్కెట్ నుంచి ఆలుగడ్డ విజయవాడ, ఖమ్మం, కర్ణాటకకు ఎగుమతి అయ్యేది. ఇప్పుడు ఎగుమతులు ఆగిపోయాయి. ధర తగ్గింది. సీఎం: ఇప్పుడు ధర ఎంత పలుకుతుంది ? రైతు: 10 కిలోలకు రూ.90–110 మాత్రమే పలుకుతుంది సార్. సీఎం: ఆలుగడ్డ ఎన్ని ఎకరాలల్ల సాగు చేసినవ్? రైతు: 16 ఎకరాలల్ల చేసిన సారూ.. ఈసారి నష్టం జరిగేటట్టుంది. సీఎం: ఏం రంది వడకుర్రి.. ఇబ్బందులు తీర్చే ప్రయత్నం చేస్తా. వంటిమామిడి మార్కెట్‌ను గొప్పగా తీర్చిదిద్దుతాం. దీనికి అనుబంధంగా తున్కిబొల్లారంలో కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేస్తాం. సీజన్ ముందే తక్కువ ధరలో విత్తనాలు అందుబాటులో ఉండేలా చూస్తా. (సీఎం వీరిద్దరితోనే కాకుండా నెంటూరు గ్రామానికి చెందిన కిచ్చుగారి స్వామి, గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్‌కు చెందిన మల్లేశంతోనూ సంభాషించారు) -
రైతుకు బాసటగా మార్కెటింగ్.. మరింత బలోపేతం
సాక్షి, హైదరాబాద్: ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతన్న ఆగం కాకూడదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అభిలషించారు. తాజా పరిస్థితుల్లో రైతులకు బాసటగా నిలిచేందుకు రాష్ట్రంలో మార్కెటింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాల ఫలితంగా దేశవ్యాప్తంగా మార్కెటింగ్ వ్యవస్థ ఎలా పరిణామం చెందినప్పటికీ, తెలంగాణలో మాత్రం సజీవంగా ఉంచడమే కాకుండా... మరింత బలోపేతం చేస్తామన్నారు. పది రోజుల్లోగా రాష్ట్రంలోని ఏ గుంటలో ఏ పంట వేశారనే విషయంలో సరైన లెక్కలు తీయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి వ్యవసాయ మార్కెట్లే వేదిక. తెలంగాణలో వాటిని కొనసాగిస్తామన్నారు. రైతులు ఓ పద్ధతి ప్రకారం వచ్చి మార్కెట్లో పంటలు అమ్ముకునే విధానం తీసుకురావాలన్నారు. ఏ గ్రామానికి చెందిన రైతులు ఏ రోజు మార్కెట్‌కు రావాలో నిర్ణయించి టోకెన్లు జారీ చేయాలన్నారు. ఏ పంటకు ఎక్కడ మంచి ధర ఉందనే విషయంలో రైతులకు సూచనలు చేయాల న్నారు. ఇందుకోసం మార్కెటింగ్ శాఖలో రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. కొత్త చట్టాల అమలు వల్ల మార్కెట్ సెస్ రాకున్నా ప్రభుత్వమే నిధులను సమకూర్చి మార్కెటింగ్ శాఖను బలోపేతం చేస్తుందన్నారు. ప్రగతిభవన్‌లో ఆదివారం జిల్లా వ్యవసాయాధికారులు, మార్కెటింగ్ శాఖాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. వ్యవసాయాభి వృద్ధి– రైతు సంక్షేమం విషయంలో ఈ రెండు శాఖలు నిర్వహించాల్సిన బాధ్యతలను ముఖ్య మంత్రి విడమర్చి చెప్పారు. దాదాపు 8 గంటల పాటు జరిగిన సమావేశంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మార్కెట్ల వారీగా ఎంత ధాన్యం వస్తున్నది, అక్కడి వ్యాపారులకు ఎంతవరకు కొనుగోలు శక్తి ఉన్నదన్న వివరాలు సేకరించాలన్నారు. వరిలో ఆధునిక సాగు పద్ధతులు వచ్చాయి. వెదజల్లే పద్ధతి ద్వారా సాగు చేయడం వల్ల ఎకరానికి 10 వేల రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. పత్తిలో సింగిల్ పిక్ పద్ధతి వచ్చింది. ఇంకా అనేక పంటల్లో కొత్త వంగడాలు, కొత్త పద్ధతులు వచ్చాయి. వాటిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. చదవండి: (తక్షణమే పీఆర్సీ చర్చల.. సీఎం కేసీఆర్ ఆదేశం) ‘పొలం– హలం’శాఖగా మారాలి ‘తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం బాగా పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ప్రాధాన్యం, బాధ్యత ఎంతో పెరిగింది. వ్యవసాయ శాఖ కాగితం – కలం శాఖగా కాకుండా పొలం – హలం శాఖగా మారాలి. ఈ రెండు శాఖల పనితీరులో గుణాత్మక, గణనీయమైన మార్పు రావాలి. వ్యవసాయంలో పంటల మార్పిడి విధానం, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు పెంపొందించేందుకు వ్యవసాయ శాఖ తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. రైతులు పండించిన పంటలను మార్కెట్లో అమ్ముకునేందుకు సరైన పద్ధతులు అవలంభించే బాధ్యత మార్కెటింగ్ శాఖపై ఉంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన రైతు వేదికలను వెనువెంటనే వాడుకలోకి తేవాలి. రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఏఈఓ, రైతు బంధు సమితి కార్యాలయాలు కూడా రైతువేదికలోనే భాగంగా ఉండాలి. ఇందుకు అవసరమైన ఫర్నీచర్, ఇతర వసతులు కల్పించాల’ని ముఖ్యమంత్రి ఆదేశించారు. చదవండి: (యాదాద్రి పునర్నిర్మాణం కేసీఆర్ కలల ప్రాజెక్టు) దేశానికి రోల్‌మోడల్‌గా తెలంగాణ ‘అమెరికా, చైనా, రష్యా, జపాన్, ఇజ్రాయిల్ లాంటి దేశాల్లో ఇలా జరిగింది... అలా జరిగింది అంటూ చెప్పుకునే విజయగాథలను ఇంతవరకు విన్నాం. కానీ ఇప్పుడా అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రమే గతంలో కనీవినీ ఎరుగని ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచింది. రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి వంద శాతం నల్లాల ద్వారా నీరందించి నెంబర్ వన్‌గా నిలవడం మిషన్ భగీరథ వల్ల సాధ్యమైంది. దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్న కరెంటు సమస్యను పరిష్కరించుకున్నాం. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేసుకోగలుగుతున్నాం. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామసీమల రూపురేఖలే మారిపోయాయి. అన్ని గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటయ్యాయి. ట్యాంకర్లు, ట్రాలీలతో కూడిన ట్రాక్టర్లు వచ్చాయి. డంప్ యార్డులు, శ్మశానవాటికలు, రైతు వేదికలు, కల్లాలు వచ్చాయి. అదే తరహాలో వ్యవసాయరంగంలో కూడా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి’అని సీఎం కేసీఆర్ అన్నారు. పంటల మార్పిడి విధానం రావాలి ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు ఏడాదికి కేవలం 35 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే పండించేవారు. కానీ నేడు 1 కోటి పది లక్షల టన్నుల ధాన్యం రాష్ట్రంలో పండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్మిస్తున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల 1 కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించుకోగలుగుతాం. బోర్ల ద్వారా మరో 40 లక్షల ఎకరాలకు పైగా నీరు అందుతోంది. ఏడాదికి 4 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ రూపాంతరం చెందుతున్నది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయశాఖ ఎంతో బలోపేతం కావాలి. వ్యవసాయాధికారులు అడుగడుగునా రైతులకు అండగా నిలవాలి. రైతులు ఎప్పుడూ ఒకే పంట వేసే విధానం పోవాలి. పంట మార్పిడి విధానం రావాలి. దీనివల్ల ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తాయి. గ్రామాల్లో కూలీల కొరత ఉంది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాల్సి ఉంది. సాగులో ఆధునిక పద్ధతులు రావాలి. ఈ అంశాలపై రైతులకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. రాష్ట్రవ్యాప్తంగా 2,600 క్లస్టర్లలో నిర్మించిన రైతువేదికలను వెంటనే వినియోగంలోకి తేవాలి. రైతులతో సమావేశాలు నిర్వహించాలి. పంటల సాగు, పంటల మార్పిడి, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. క్లస్టర్ల వారీగా ఉన్న వ్యవసాయ విస్తరణాధికారులు వెంటనే గ్రామాల్లో పర్యటించాలి. ఏ గుంటలో ఏ పంట వేశారనే వివరాలు నమోదు చేయాలి. పది రోజుల్లోగా రాష్ట్రవ్యాప్తంగా సాగవుతున్న పంటల విషయంలో స్పష్టత రావాల’ని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాలు.... – యాంత్రీకరణ పెంచడం కోసం ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుంది. – మండల వ్యవసాయాధికారులను ఆగ్రోనమిస్టులుగా మార్చడానికి నిరంతరం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. – ఆధునిక సాగు పద్ధతులను అధ్యయనం చేయడానికి వ్యవసాయాధికారులు ఇజ్రాయిల్‌లో పర్యటించాలి. – పప్పుదినుసులు, నూనె గింజల సాగును ప్రోత్సహించాలి. పప్పులు, నూనె గింజలు పండించే ప్రాంతాల్లో దాల్ మిల్లులు, ఆయిల్ మిల్లులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపుతుంది. – ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. ఇందుకోసం స్ట్రాటజిక్ పాయింట్లను గుర్తించాలి. – వ్యవసాయ పనిముట్లు రైతులకు కిరాయి పద్ధతిలో దొరికేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. – మార్కెట్లలో ట్రేడ్ లైసెన్స్ ఇచ్చే విషయంలో సులభతరమైన విధానాలను తీసుకురావాలి. -
రైతుబజార్లలో కొత్త దుకాణాలు
సాక్షి, అమరావతి: రైతు బజార్లకు ఎక్కువ మంది వినియోగదారులు వచ్చేలా వాటిలోనే ప్రతి చోటా బేకరీలు, ఏటీఎం, జనరిక్ మెడిసిన్, బియ్యం దుకాణాలు వంటివి ఏర్పాటు చేసేందుకు అదనపు షాపులు నిర్మించాలని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశించారు. మార్కెటింగ్ శాఖాధిపతులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. రైతు బజార్లలో దీర్ఘకాలంగా అద్దెలను పెంచని షాపులకు రైతులపై భారం పడకుండా హేతుబద్ధంగా అద్దెలు పెంచుకోవడంతో పాటు.. రైతు బజార్లలో బినామీ వ్యాపారుల తొలగింపునకు చర్యలు చేపట్టాలన్నారు. -
దిశ మారింది .. దశ తిరిగింది
సాక్షి, అమరావతి: మార్క్‌ఫెడ్ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో నామమాత్రపు సేవలకే పరిమితమై, మండలానికో కొనుగోలు కేంద్రంతో కొన్ని పంటలనే కొనుగోలు చేసిన ఈ సంస్థ.. ఇప్పుడు గ్రామ స్ధాయిలో పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన పంటలనే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన పంటలనూ కొనుగోలు చేస్తోంది. అలాగే గతంలో కొన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలే ఎరువులు పంపిణీ చేసేవి. ఇప్పుడు గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు పంపిణీ చేసే బాధ్యతను ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు అప్పగించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి, విస్తరిస్తున్న సంస్థ సేవలకు అనుగుణంగా రైతు సమస్యల పరిష్కారం విషయంలో నిబద్ధత కలిగిన అధికారులు, సిబ్బంది 100 మందిని డిప్యుటేషన్‌పై నియమించుకోవడానికి మార్క్‌ఫెడ్ కసరత్తు చేస్తోంది. ఎరువుల పంపిణీ బాధ్యత రాష్ట్రంలో 1950 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉంటే గత ప్రభుత్వ హయాంలో ఆరి్ధకంగా బలమైన ఐదు వందల్లోపు సంఘాలు రైతులకు ఎరువులు పంపిణీ చేశాయి. మిగిలిన సహకార సంఘాల పరిధిలోని రైతులు ప్రైవేట్ డీలర్ల నుంచి అధిక రేటుకు ఎరువులను కొనుగోలు చేశారు. అదే సమయంలో అనేక సహకార సంఘాల పాలకవర్గాలు ఎరువుల అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడ్డాయి. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు పంపిణీ చేసే బాధ్యతను ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు అప్పగించడం ద్వారా ఎరువుల అమ్మకాల్లో అక్రమాలకు చెక్ పెట్టినట్టయ్యింది. అప్పుడు ‘ఆ కొందరి’కే సేవలు టీడీపీ హయాంలో మార్క్‌ఫెడ్ నామమాత్రపు సేవలకే పరిమితమయ్యింది. మండలానికో కొనుగోలు కేంద్రం మాత్రమే ఉండటంతో రైతులు తాము పండించిన పంటను అమ్ముకోవడానికి అనేక వ్యయ ప్రయాసలకు గురయ్యారు. కేవలం తెలుగుదేశం సానుభూతిపరులకే సేవలందించిందనే అపప్రథను సంస్థ మూటగట్టుకుంది. ఆ పార్టీ నాయకులు సిఫారసు చేసిన రైతుల నుంచే పంటలను కొనుగోలు చేసేదన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇప్పుడు రైతులందరి సంక్షేమమే లక్ష్యం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మార్క్‌ఫెడ్ దశ తిరిగింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడంలో రైతులు ఎలాంటి ఇబ్బందులూ పడకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దీంతో తెలుగుదేశం పాలనలో ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు కేవలం రూ.3 వేల కోట్ల విలువైన పంటలను కొనుగోలు చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గత ఏడాదిలోనే రూ.3,119 కోట్ల విలువైన పంటలను కొనుగోలు చేశారు. అప్పట్లో కందులు, అపరాలు, పసుపు, వేరుశనగ వంటి పంటలనే కొనుగోలు చేస్తే .. గత ఏడాది కందులు, అపరాలు, శనగలు, వేరుశనగ, మొక్కజొన్న, జొన్నలు, పసుపు, సజ్జలు, ఉల్లిపాయలు, పొగాకు, అరటి, బత్తాయి, టమాటా వంటి అనేక పంటలు మొత్తం 8.74 లక్షల టన్నులు ప్రస్తుత ప్రభుత్వం కొనుగోలు చేసింది. దాదాపు వెయ్యి కొనుగోలు కేంద్రాల ద్వారా మార్క్‌ఫెడ్ సిబ్బంది సెలవుల్లోనూ పంటలను కొనుగోలు చేశారు. ఈ ఏడాది 10,641 రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రైతులు తమ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లోనే పంటలను అమ్ముకుంటున్నారు. టైమ్‌స్లాట్ విధానం, పంటల నమోదు వంటి నిబంధనలు సడలించి ఒక రోజు ముందు అధికారులకు తెలియపరిచి పంటను అమ్ముకునే సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. పొగాకు కొనుగోలు బాధ్యత కూడా.. వ్యాపారులంతా కూటమిగా ఏర్పడి పొగాకు రైతులను దోపిడీ చేస్తున్న పరిస్థితులను గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. పొగాకు కొనుగోలు బాధ్యతను ఈసారి మార్క్‌ఫెడ్‌కు అప్పగించారు. దీంతో పొగాకు బోర్డులో బిడ్డరుగా పేరు నమోదు చేసుకున్న సంస్థ మిగిలిన వ్యాపారులకు పోటీగా తొలిసారిగా పొగాకు కొనుగోలు చేసింది. దీంతో రైతులు గతంతో పోల్చుకుంటే సగటున కిలోకు రూ.2.42 అధికంగా పొందారు. గతంలో సగటున కిలోకు రూ.121.53 పొందిన రైతులు.. మార్క్‌ఫెడ్ రంగ ప్రవేశంతో సగటున కిలోకు రూ.123.95 పొందగలిగారు. పొగాకు బోర్డు ఆధ్వర్యంలో మొత్తం 128.65 మిలియన్ కిలోల అమ్మకాలు జరిగితే, అందులో పదిశాతం అంటే 12.93 మిలియన్ కిలోల పొగాకును మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. మార్క్‌ఫెడ్ ప్రవేశానికి ముందు, ఆ తర్వాత జరిగిన అమ్మకాలతో రైతులకు లభించిన మొత్తంలో వ్యత్యాసం రూ.150 కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. సిబ్బందిని పెంచుతున్నాం ఎరువుల పంపిణీ బాధ్యతను ఆగ్రోస్ నుంచి మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం బదిలీ చేసిన నేపథ్యంలో.. సంస్థకు ఎక్కువమంది సిబ్బంది అవసరం. మార్కెటింగ్ శాఖ మనుగడ ప్రశ్నార్ధకం కావడంతో.. అక్కడి ఉద్యోగులు, సిబ్బందిని డిప్యుటేషన్‌పై తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. –ఎస్.ప్రద్యుమ్న, ఎమ్డీ, మార్క్‌ఫెడ్ రైతు సంక్షేమానికి సర్కారు చర్యలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పంట పండించడానికి, అమ్ముకోవడానికి రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అనేక చర్యలు తీసుకుంటున్నారు. రైతుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, కొనుగోలు కేంద్రాలు అన్నిటినీ గ్రామస్థాయికి తీసుకువచ్చారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కొన్ని ప్రభుత్వ శాఖలకు బాధ్యతలు పెరుగుతున్నాయి. –మధుసూదనరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ, మార్కెటింగ్ శాఖ సేవలు అందించే సంస్ధల బలోపేతం రైతులకు సేవలు అందించే ప్రభుత్వ శాఖలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మార్క్‌ఫెడ్ గత ఏడాది ఒక్క సంవత్సరంలోనే 8.74 లక్షల టన్నుల పంటలను కొనుగోలు చేసింది. వీటి విలువ రూ.3,119 కోట్లు. ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ పంటల కొనుగోలు జరగలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకేసారి 24 పంటలకు మద్దతు ధర ప్రకటించారు. సీజను ప్రారంభానికి ముందే ప్రకటించడంతో రైతులు మార్కెట్లోని ధరలను బేరీజు వేసుకుని పంటల అమ్మకాలపై నిర్ణయాలు తీసుకున్నారు. – నాగిరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు -
దెబ్బతిన్న పంటకు సర్కారు భరోసా
సాక్షి, అమరావతి: భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వేరుశనగ, పత్తి రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో ముందుకు వచ్చింది. పత్తిలో అధిక తేమ, వేరుశనగలో గింజ నాణ్యత (శాతం) పడిపోవడం వల్ల రైతులు మద్దతు ధరకు అమ్ముకోలేక ఆందోళన చెందుతుండటాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల అమ్మకానికి సంబంధించి నిబంధనలు సడలించింది. ఇప్పటి వరకు ఉన్న టైం స్లాట్ విధానంలో పేర్కొన్న తేదీ, సమయానికే రైతులు పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాలి. పొరపాటున ఆ సమయానికి తీసుకెళ్లలేకపోతే మళ్లీ తమ పేరును ఆర్బీకేలో నమోదు చేసుకుని, ఆ తేదీ వరకు నిరీక్షించాలి. ఈ ఇబ్బందిని గమనించిన ప్రభుత్వం అందులో కొంత వెసులుబాటు కల్పించింది. దీంతో రైతులు ఆ సీజన్లో ఎప్పుడైనా పంట వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆధార్, పట్టాదారు పుస్తకం, బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలతో వచ్చి పేరు నమోదు చేసుకోవాలి. కొత్త నిబంధన ప్రకారం రైతులు ఏ రోజున పంట అమ్ముకోవాలని భావిస్తారో అదే రోజున కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లొచ్చు. అక్కడి అధికారులు నాణ్యతను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా ఉంటే వెంటనే కొనుగోలు చేస్తారు. నాఫెడ్ నిబంధనల ప్రకారం నవంబర్‌లో రైతు పండించిన పత్తి పంటలో 30 శాతమే కొనుగోలు చేయాలి. మిగిలిన పంట డిసెంబర్, జనవరిలో కొనుగోలు చేసే విధంగా నిబంధన కొనసాగుతోంది. ఈ నిబంధనను ప్రభుత్వం ప్రస్తుతం మార్పు చేసింది. తద్వారా 75 శాతం పంటను ఇప్పుడు రైతులు కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవచ్చు. వేరుశనగ రైతులకు ఊరట ► వర్షాల కారణంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పంట లేకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆ పంటను అమ్ముకోలేకపోతున్నారు. దీంతో వ్యాపారులు సగానికి సగం ధరను తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల రీత్యా వేరుశనగ పంటను మార్క్‌ఫెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ► కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వేరుశనగ పంటలో గింజ 65 శాతానికిపైగా ఉంటేనే క్వింటా రూ.5,275కు కొనుగోలు చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. అయితే వర్షాల కారణంగా 60 శాతం గింజ (అవుటెన్) ఉంటే సరిపోతుందని, ఆ విధంగా ఉన్న వేరుశనగకు క్వింటాకు రూ.4,500 ధర ప్రకటించింది. మార్కెట్లో వ్యాపారులు 60 శాతం గింజ ఉన్న వేరుశనగను రూ.3,500కే కొనుగోలు చేస్తున్నందున ప్రభుత్వ నిర్ణయం రైతులకు ఊరట కలిగిస్తోంది. ► డ్యామేజీ 2 నుంచి 3%, దెబ్బతిన్న గింజలు 2 నుంచి 6%, గింజ ముడత, పక్వానికిరాని కాయలు 4 నుంచి 8%నికి పెంచింది. నిబంధనలు సడలించడం వల్ల ప్రభుత్వంపై రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు భారం పడనుంది. ఈ నిబంధనలు తక్షణం అమలు పరచాలని కొనుగోలు కేంద్రాల్లోని సిబ్బంది, అధికారులను ఆదేశించామని మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ ఎస్.ప్రద్యుమ్న తెలిపారు. వరదలతో భారీగా పంట నష్టం భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో వేరుశనగ, పత్తి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాయలసీమ జిల్లాల్లో 7.46 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగైంది. సగటున ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంటే ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా 4 క్వింటాళ్లకు మించి రాలేదు. నాణ్యత లేనందున క్వింటా రూ.4 వేలకు మించి అమ్ముకోలేకపోతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ద్వారా 1.83 లక్షల టన్నుల వేరుశనగ కొనుగోలు చేయనున్నారు. రాష్ట్రంలో 6 లక్షల హెక్టార్ల వరకు రైతులు పత్తి సాగు చేశారు. 8 శాతం లోపు తేమ ఉన్న పత్తికి క్వింటాకు రూ.5,825 చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. అయితే వర్షాల కారణంగా తేమ శాతం 12 శాతానికిపైనే ఉంటోంది. దీంతో క్వింటా రూ.3,500తో మాత్రమే ప్రైవేట్ వ్యాపారులు కొంటున్నారు. ఈ దృష్ట్యా పంటను ఎండబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. -
భారమైనా.. ఉల్లి అందుబాటులోకి..
సాక్షి, అమరావతి: ఆర్థిక భారం పడుతున్నా ఒకవైపున నాఫెడ్, మరోవైపు ప్రైవేట్ మార్కెట్లలో ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేసి రాష్ట్రంలోని రైతుబజార్లకు రవాణా చేస్తోంది. అన్ని రాష్ట్రాల్లో ఉల్లిపాయలకు డిమాండ్ పెరగడంతో నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చర్ కో–ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్)పై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి పెంచాయి. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోని ప్రభుత్వాలైతే ఎన్నికల తేదీలోపు వినియోగదారులకు ఉల్లిపాయలు అందుబాటులోకి తీసుకురాకపోతే ఫలితాలపై ప్రభావం ఉంటుందనే భయంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో మిగిలిన రాష్ట్రాలకు ఉల్లి రవాణా ఆలస్యమవుతోంది. ఇది గమనించిన ఏపీ మార్కెటింగ్ శాఖ పది మంది సిబ్బందిని మహారాష్ట్రలోని నాసిక్‌కు పంపింది. వీరిలో కొందరు నాఫెడ్‌కు గతంలో ఇచ్చిన ఇండెంట్ ప్రకారం ఉల్లిపాయలను రాష్ట్రానికి రవాణా చేయడానికి, మరికొందరు నాసిక్ పరిసర గ్రామాల్లోని రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు వెళ్లారు. ఉల్లి కొరతను ముందుగానే ఊహించి.. రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఉల్లి కొరతను ముందుగానే ఊహించి సెప్టెంబర్‌లోనే 6 వేల టన్నులను నాఫెడ్‌కు ఇండెంట్ పెట్టింది. నాఫెడ్ నుంచి కిలో రూ.35లకు ఉల్లి లభిస్తున్నప్పటికీ, అక్కడి నుంచి రాష్ట్రానికి రవాణా, సరుకు గ్రేడింగ్ చేయడానికి ప్రభుత్వంపై మరో రూ.15 వరకు అదనపు భారం పడుతోంది. ఇప్పటివరకు ప్రధాన రైతుబజార్లలోనే రాయితీపై ఉల్లిపాయలు అందుబాటులోకి వచ్చాయి. పూర్తిస్థాయిలో ఉల్లిపాయలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మిగిలిన రైతుబజార్లలోనూ అమ్మకాలు ప్రారంభిస్తామని రైతుబజార్ రాష్ట్ర డైరెక్టర్ సుధాకర్ తెలిపారు. -
25 వరకు ఆర్బీకేల్లో రైతుల పేర్ల నమోదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 26వ తేదీ నుంచి మొక్కజొన్న కొనుగోళ్లను ప్రారంభిస్తున్నట్టు మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కమిషనర్ ఎస్.ప్రద్యుమ్న చెప్పారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రైతులు పంటలను కాపాడుకునే పనుల్లో నిమగ్నమైనందున రైతు భరోసా కేంద్రాల్లో పేర్ల నమోదును ఈ నెల 25 వరకూ కొనసాగిస్తున్నట్టు తెలిపారు. పత్తి రైతులకూ అవకాశం: ఈ ఏడాది నుంచి పత్తి రైతులు కూడా తమ పేర్లను రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకుని పంటను అమ్ముకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. కొత్తగా టైమ్‌స్లాట్ విధానాన్నీ ప్రవేశపెట్టింది. పేరు నమోదు చేసుకున్న రైతుకు ముందుగా (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సీసీఐ కూపన్లు జారీచేస్తుంది. ఆ కూపన్లలో పేర్కొన్న కొనుగోలు కేంద్రానికి, కేటాయించిన టైమ్‌లో రైతులు పత్తిని తీసుకెళ్లాలి. ఒక వేళ ఆ టైమ్‌లోగా పంట తీసుకెళ్లకుంటే మరోసారి టైమ్‌స్లాట్ తీసుకోవాల్సి ఉంటుంది. పత్తికి క్వింటాలుకు రూ.5,825ను మద్దతు ధరగా సీసీఐ ప్రకటించింది. -
రైతుల చేతికి ముందే కూపన్లు
సాక్షి, అమరావతి: ఖరీఫ్ ధాన్యాన్ని నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు పౌర సరఫరాల సంస్థ పక్కా ఏర్పాట్లు చేసింది. వరి పండించిన రైతులకు ఈసారి ముందుగానే కూపన్లు పంపిణీ చేస్తారు. కూపన్లో అన్ని వివరాలు నమోదు చేసి.. సంబంధిత ఉద్యోగి సంతకం చేయాల్సి ఉంటుంది. కూపన్లో పేర్కొన్న వివరాల ఆధారంగా రైతుల పొలాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఏ–గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు రూ.1,888, సాధారణ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.1,868 చొప్పున రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తారు. రబీ ధరతో పోలిస్తే క్వింటాల్‌కు రూ.53 చొప్పున ధర పెరిగింది. ఈ–క్రాప్ ఆధారంగా.. రైతులు దళారులు, వ్యాపారులను ఆశ్రయించి ధర, తూకాల్లో మోసపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తోంది. ఈ–క్రాప్‌లో నమోదైన వివరాల ఆధారంగా నేరుగా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తారు. సాగు వివరాలను ఈ–క్రాప్ ద్వారా ఇప్పటివరకు నమోదు చేసుకోని రైతులు రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి అగ్రికల్చరల్ అసిస్టెంట్ల ద్వారా వెంటనే నమోదు చేయించుకోవాలి. ఈ–క్రాప్ నమోదు కోసం వెళ్లే రైతులు ఆధార్ కార్డు, సెల్ ఫోన్, బ్యాంక్ పాస్ బుక్ వివరాలను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అవసరమైతే పొలానికి సంబంధించిన పట్టాదార్ పాస్ పుస్తకం కాపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. జియో ట్యాగింగ్ తప్పనిసరి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే వాహనాలకు తప్పనిసరిగా జియో ట్యాగింగ్ ఉండాలి. ధాన్యంలో 17 శాతం తేమ, దెబ్బతిన్నవి లేదా మొలకెత్తిన గింజలు 5 శాతం, కుచించుకుపోయిన గింజలు 3 శాతానికి మించి ఉండకూడదు. తేమ శాతం కొలిచే యంత్రాలు, ధాన్యాన్ని ఎండబెట్టేందుకు అవసరమైన యంత్రాలు, జల్లెడ వంటి వాటిని మార్కెటింగ్ శాఖ సమకూరుస్తుంది. ధాన్యం కొనుగోలు సందర్భంగా ఎవరైనా మోసం చేస్తున్నట్టు గుర్తించినా లేదా ధాన్యం సేకరణలో సమస్యలు తలెత్తినా టోల్ ఫ్రీ నంబర్ 1902 లేదా 1800–425–1903కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఎక్కువ ధర వస్తే బయట అమ్ముకోవచ్చు రైతులు తమ వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకుని.. కూపన్ పొందినా మద్దతు ధర కంటే ఎక్కువ ధర వస్తే బయట మార్కెట్లో విక్రయించుకోవచ్చు. ఖరీఫ్‌లో 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ఎక్కడా అవకతవకలు జరగకుండా చూసేందుకు గతంలో ఎప్పుడూ లేనివిధంగా రైతులకు ముందుగానే కూపన్లు ఇస్తాం. ఆ తర్వాత రైతుల పొలం వద్దకే వెళ్లి ధాన్యం కొంటాం. – కోన శశిధర్, ఎక్స్–అఫీషియో కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ -
16 నుంచి పంటలకొనుగోలు
సాక్షి, అమరావతి: ప్రస్తుతం మొక్కజొన్న, సజ్జ, రాగుల పంటల ఉత్పత్తులు చేతికందివస్తున్న తరుణంలో రైతుల ఆర్థిక పరిస్థితిని అవకాశంగా తీసుకుని వ్యాపారులు మరీ తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారుల దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తూ రైతులకు దన్నుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో మొక్కజొన్న, సజ్జ, రాగుల ఉత్పత్తుల సేకరణ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. దీనిపై రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)లోని వ్యవసాయ సహాయకులను కలసి ఈ నెల 15లోగా పేర్లను నమోదు చేసుకోవాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు. రైతులు తమ పంటల వివరాలను ఈ–కర్షక్‌లో నమోదు చేసుకుంటేనే మద్దతు ధర పొందడానికి వీలవుతుంది. రైతులకిచ్చిన మాట మేరకు సీజన్ ప్రారంభం కాకముందే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలను ప్రకటించడం విదితమే. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మొత్తం 24 పంటలకు మద్దతు ధర వర్తించేలా నిర్ణయం తీసుకుని, వాటి ధరలకు సంబంధించిన పోస్టర్‌ను ఇటీవల ఆవిష్కరించడం తెలిసిందే. వ్యాపారుల దోపిడీకి అడ్డుకట్ట.. రాష్ట్రంలో ప్రస్తుతం మొక్కజొన్న, సజ్జ, రాగుల ఉత్పత్తులు మార్కెట్లలోకి వస్తున్నాయి. మొక్కజొన్నకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.1,850 చొప్పున కనీస మద్ద«తు ధర ప్రకటించగా.. మార్కెట్లో ప్రస్తుతం రూ.1,200 నుంచి రూ.1,400 వరకే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అలాగే సజ్జలు క్వింటాలుకు ప్రకటించిన మద్దతు ధర రూ.2,150 ఉంటే మార్కెట్లో వ్యాపారులు రూ.1,500కు మాత్రమే కొంటున్నారు. రాగులకు మద్దతు ధర రూ.3,295గా ఉంటే మార్కెట్ ధర రూ.2,600 మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రైతులకు ఆలంబనగా నిలిచేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ నెల 16వ తేదీ నుంచే ఈ పంటల సేకరణ ప్రారంభించాలని నిర్ణయించింది. కాగా, మొక్కజొన్న, సజ్జలు, రాగులకు సంబంధించి ఒకో రైతు నుంచి గరిష్టంగా 100 క్వింటాళ్ల పంటను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని, ఐదెకరాల విస్తీర్ణం కలిగిన రైతు వరకు ఈ పంటలను కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. ఒకటి నుంచే పేర్ల నమోదు.. రైతు భరోసా కేంద్రాల్లో ఈ నెల 1 నుంచే రైతుల పేర్లను నమోదు చేసుకుంటున్నారు. రైతులు సాగుచేసిన పంట, సాగు విస్తీర్ణం, రానున్న దిగుబడి తదితర వివరాలు వీటిల్లో ఉంటున్నాయి. అంతేగాక పేర్లను నమోదు చేసుకున్న రైతులను ఏఏ తేదీల్లో పంటలను ఏయే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలో ముందుగానే తెలియపరిచే ఏర్పాటు చేశారు. వారి మొబైల్ ఫోన్లకు మెసేజ్‌లు పంపే ఏర్పాటు చేసి, కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల రద్దీ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. రైతులు తొందరపడి పంటను అమ్ముకోవద్దు రైతులెవరూ తొందరపడి పంటల్ని అమ్ముకోవద్దు. ఈ నెల 16 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నాం. ఈ–కర్షక్‌లో నమోదు చేసుకున్న రైతులనుంచే పంటలను కొనుగోలు చేస్తాం. – ప్రద్యుమ్న, మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కమిషనర్ -
నిమ్మ రైతుల కంటి చెమ్మ తుడిచేలా..
సాక్షి, అమరావతి: కేజీ నిమ్మకాయల ధర రూ.2కు పడిపోయింది. రైతుకు కనీసం కోత ఖర్చులు కూడా రాని దుస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తక్షణమే మార్కెటింగ్ శాఖను రంగంలోకి దించారు. కొనుగోళ్లలో జోక్యం చేసుకుని రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో మార్కెటింగ్ శాఖ నిమ్మకాయల కొనుగోలు చేపట్టింది. దీంతో కిలో రూ.2 ఉన్న నిమ్మ ధర ఇప్పుడు రూ.40కి పెరిగింది. దీంతో నిమ్మ రైతులకు మేలు కలుగుతోంది. నిమ్మ మార్కెట్లో తాజా పరిస్థితి ఎలా ఉందనే దానిపై సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్నతో సీఎం వైఎస్ జగన్ సోమవారం సమీక్షించారు. మార్కెట్లలో తాజా పరిస్థితులు, నిమ్మ ధరలు ఎంతవరకు పెరిగాయి, పొరుగు రాష్ట్రాల్లో మార్కెట్ల స్థితిగతులేమిటనే అంశాలపై సీఎం ఆరా తీశారు. ధరలు ఎందుకు పతనమయ్యాయంటే.. ► పొరుగు రాష్ట్రాల్లో మార్కెట్లు మూతపడటంతో నిమ్మ ఎగుమతులు నిలిచిపోయాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా నిమ్మకాయల ధరలు పడిపోయాయి. ఏపీలోని ప్రధాన మార్కెటైన ఏలూరులో ఈ నెల 24న కేజీ ధర రూ.2కు పడిపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం ఏం చేసింది.. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో నిమ్మ మార్కెట్లలో జో క్యం చేసుకున్న అధికారులు ప్రభుత్వం తరఫున కొనుగోళ్లు జరిపారు. ► మార్కెటింగ్ కమిషనర్ పీఎస్ ప్రద్యు మ్న బెంగాల్ వంటి తూర్పు రాష్ట్రాల అధికారులతో మాట్లాడి అక్కడి మార్కెట్లు తెరుచుకునేలా చూశారు. ► అక్కడి మార్కెట్లకు ఎగుమతులు మొదలు కావడంతో నిమ్మ ధరలు తిరిగి పుంజుకున్నాయి. ► గత శుక్రవారం ఏలూరు మార్కెట్లో కిలో నిమ్మకాయల ధర కనిష్టం రూ.2 నుంచి గరిష్టంగా రూ.5 వరకు పలకగా.. మార్కెటింగ్ శాఖ జోక్యంతో ఏలూరుతో పాటు, దెందులూరు మార్కెట్లో శనివారం కిలో ధర గరిష్టంగా రూ.9 పలికింది. ► ఏలూరు మార్కెట్లో సోమవారం కిలో కాయలను రూ.40 వరకు కొనుగోలు చేశారు. దెందులూరు మార్కెట్లోనూ కిలో రూ.30, ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న గూడూరు మార్కెట్లో రూ.11.50 వరకు కొనుగోలు చేశారు. ఎంత కొన్నారంటే.. ► సీఎం జగన్ ఆదేశాలతో మార్కెటింగ్ శాఖ అధికారులు గత శనివారం నుంచే నిమ్మ మార్కెట్లో కొనుగోళ్లు మొదలు పెట్టారు. ► కేజీ కాయల కనీస ధర రూ.9గా నిర్ణయించిన మార్కెటింగ్ శాఖ అధికారులు ఏలూరు మార్కెట్లో కొనుగోళ్లు చేపట్టడంతో ధరల్లో భారీ పెరుగుదల కొనసాగుతోంది. ► సోమవారం వరకు 2.1 టన్నుల నిమ్మకాయలను మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేసింది. ఇందుకోసం ధరల స్థిరీకరణ నిధి నుంచి సొమ్మును వెచ్చించింది. ఫలితమిచ్చిన ‘ఎంఐఎస్’ ► పంటలకు కనీస గిట్టుబాటు ధర లేనప్పుడు రైతులను ఆదుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసింది. ► ధరలు పతనమైనప్పుడల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు రంగంలోకి దిగి మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రైస్ స్కీమ్ (ఎంఐఎస్) కింద మార్కెట్ల లో ప్రభుత్వం తరఫున జోక్యం చేసు కుని ధరల స్థిరీకరణ నిధిని వినియోగించి కొనుగోళ్లు జరుపుతున్నారు. ► తాజాగా అదే విధానంలో పెద్ద ఎత్తున నిమ్మకాయల్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం.. ఆ రైతులకు కొండంత అండగా నిలబడింది. అరటి, బత్తాయి, టమాటా రైతుల విషయంలోనూ.. ► ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా మన రాష్ట్రంలో పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ. 3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధిని సీఎం వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. ► ఏ పంటకైనా కనీస గిట్టుబాటు ధర రాక రైతులు ఇబ్బందులు పడుతుంటే అధికారులను రంగంలోకి దించి ఆ పంటలను మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేయిస్తున్నారు. ► అరటి, బత్తాయి, ఉల్లి, టమాటాలు ప్రభుత్వమే కొనుగోలు చేయటం వల్ల పోటీతత్వం పెరిగి రైతులకు కనీన గిట్టుబాటు ధర లభించింది. -
పంటల నిల్వకు 9,000 కొత్త గోదాములు
సాక్షి, అమరావతి: మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మరో 9 వేల కొత్త గోదాములు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి అనుబంధంగా పంటల్ని ఆరబెట్టుకునేందుకు వీలుగా ప్లాట్‌ఫామ్‌లు సైతం నిర్మించనుంది. ప్రస్తుతం మార్కెటింగ్ శాఖకు మండల, జిల్లా స్థాయిలో 1,055 గోదాములు ఉన్నాయి. వీటి నిల్వ సామర్థ్యం 9 లక్షల టన్నులు కాగా.. రైతు బంధు పథకానికి వినియోగించగా మిగిలే గోదాములను భారత ఆహార సంస్థ, పౌర సరఫరాల సంస్థ, ఇతర వ్యాపార సంస్థలకు మార్కెటింగ్ శాఖ అద్దెకు ఇస్తోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామ స్థాయిలో పంటల సేకరణ, విత్తనాలు, ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. త్వరలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు, పశువుల మేత, మందుల విక్రయాలు వంటి కార్యక్రమాలను చేపట్టనుంది. వీటికి గోదాముల కొరత రాకుండా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం గ్రీన్ సిగ్నల్ ► మార్కెటింగ్ శాఖపై గురువారం నిర్వహించిన సమీక్షలో కొత్త గోదాముల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ► మొత్తం రూ.4 వేల కోట్లతో గోదాములు, శీతల గిడ్డంగుల నిర్మించడంతోపాటు వీటికి అనుబంధంగా సార్టింగ్, గ్రేడింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ► వీటిలో ఒక్క గోదాముల నిర్మాణానికే రూ.3,150 కోట్లు వ్యయం కాగలదని అంచనా. ఇతర నిర్మాణాలు, యూనిట్ల ఏర్పాటుకు రూ.350 కోట్లు ఖర్చు కాగలదని అధికారులు అంచనా వేశారు. ► కొత్తగా నిర్మించే ఒక్కో గోదాము నిల్వ సామర్థ్యం 500 టన్నులు. తుపానులు, వర్షాలు కురిసిన సమయంలో పంటలు తడిచిపోకుండా ఉండేందుకు వీటిని వినియోగిస్తారు. ► అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా వీటిని నిర్మిస్తుండటంతో రైతులెవరైనా ఎరువులకు పెద్ద మొత్తంలో ఆర్డరు ఇస్తే... వాటిని ఈ గోదాముల్లో నిల్వ ఉంచి పంపిణీ చేస్తారు. నిధుల సేకరణ, టెండర్లకు చర్యలు మార్కెటింగ్ శాఖను పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద ప్రయత్నమే చేస్తున్నారు. అవసరమైన నిధుల సేకరణ, టెండర్లు పిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పంటల్ని ఆరబెట్టుకునే ప్లాట్‌ఫామ్‌తోపాటు 500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో ఒక్కో గోడౌన్ నిర్మాణానికి రూ.35 లక్షలు వ్యయం అవుతుందని అంచనా వేశాం. దశల వారీగా వీటిని నిర్మిస్తాం. సత్వరమే వీటిని నిర్మించే పనులను మా శాఖతోపాటు ఇతర ఇంజనీరింగ్ శాఖలకు అప్పగించాలా, మా శాఖలోనే అదనపు డివిజన్ ఏర్పాటు చేయాలా అనే దానిపై సమాలోచనలు జరుపుతున్నాం. – ప్రద్యుమ్న, ప్రత్యేక కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
మార్కెటింగ్‌శాఖలో 246 ఆధునిక చెక్‌పోస్టులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ 246 ఆధునిక చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనుంది. రైతుల నుంచి పంటను కొనుగోలు చేసిన వ్యాపారులు మార్కెటింగ్ శాఖ కార్యాలయాలకు వెళ్లకుండా వీటిలోనే సెస్ చెల్లించేందుకు అనువుగా వీటిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు రోడ్డు పక్కన చిన్న రేకులషెడ్డులో అరకొర సౌకర్యాలతో చెక్‌పోస్టులు కొనసాగుతున్నాయి. అక్కడ సిబ్బంది పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వాటి స్థానే ఆధునిక చెక్‌పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. మంచి వాతావరణంలో విధులు నిర్వహించేందుకు వీలుగా సౌకర్యాల కల్పనతో పాటు కంప్యూటర్ల వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. వీటిని రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. సిబ్బందికి వాష్ రూంలు తదితర సౌకర్యాలు కల్పిస్తారు. ► గత ప్రభుత్వ హయాంలో సాలీనా రూ.400 కోట్లలోపే ఆదాయం కలిగిన మార్కెటింగ్‌శాఖకు గత రెండేళ్ల నుంచి రూ.600 కోట్లకుపైగా ఆదాయం వస్తోంది. కరోనా విపత్తు సమయంలోనూ లక్ష్యానికి అనువుగా ఆదాయాన్ని సాధించింది. పెరుగుతున్న ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం మార్కెట్ యార్డుల్లో రైతులకు అనేక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ► వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లి మార్కెట్‌యార్డులో అరటి రైతులు పంటను నిల్వ చేసుకునేందుకు, ప్యాకింగ్ చేసుకునేందుకు వీలుగా కోల్డుస్టోరేజీ ప్లాంట్, గోదామును నిర్మించనుంది. గత సీజన్లో అరటిని నిల్వ చేసుకునే సౌకర్యాల్లేక రాయలసీమ రైతులు నానా ఇబ్బందులుపడ్డారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం 600 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన కోల్డు స్టోరేజీ ప్లాంట్‌ను నిర్మించనుంది. ► దాదాపు రూ.5 కోట్ల విలువ చేసే ఈ యూనిట్ల నిర్మాణంతో వైఎస్సార్ జిల్లాలోని రైతులు పంటను నిల్వ చేసుకునేందుకు, అమ్ముకునేందుకు ఇక ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. ► గత నెలలోనే 70 గోడౌన్ల నిర్మాణాలకు టెండర్లు ఆహ్వానించిన మార్కెటింగ్‌శాఖ.. రాయలసీమ ప్రాంతంలోని మార్కెట్‌యార్డుల్లో సిమెంట్ రోడ్లు, దుకాణాలు, ప్లాట్‌ఫాంలు, ప్రహరీలు, పశువైద్యశాలల నిర్మాణాలకూ టెండర్లు పిలిచింది. ► దాదాపు రూ.20 కోట్ల విలువ చేసే ఈ సౌకర్యాలను వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కమిషనర్ ఎస్.ప్రద్యుమ్న చెప్పారు. -
పసుపు పంటకు లాభాల పారాణి
సాక్షి, అమరావతి: ఐదేళ్ల తరువాత పసుపు రైతులు లాభాలు పొందుతున్నారు. వారి కష్టానికి.. ప్రభుత్వం తీసుకున్న చర్యలు తోడు కావడంతో ఎకరానికి కౌలు, సాగు ఖర్చులు పోను ప్రతి రైతు కనీసం రూ.50 వేలకు పైగా లాభం పొందుతున్నాడు. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు నెలల క్రితమే పసుపు పంట క్వింటాకు రూ.6,850 మద్దతు ధర ప్రకటించింది. పంట చేతికి వచ్చిన వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరిచింది. పంటను కొనుగోలు చేసిన వారంలోపే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. దీంతో మరో మార్గం లేక ప్రైవేట్ వ్యాపారులు సైతం రైతుల నుంచి పోటీపడి పంటను కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో సగటు పంటను పరిగణనలోకి తీసుకుని ఎకరా పొలం కలిగిన రైతు నుంచి 24 క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని, రెండు ఎకరాల్లోపు భూమి కలిగిన రైతు నుంచి గరిష్టంగా 30 క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఒక్కొక్క రైతు నుంచి గరిష్టంగా 40 క్వింటాళ్లను కొనుగోలు చేస్తోంది. సాగుకు ముందే ధర ప్రకటించి.. ► సీఎం వైఎస్ జగన్ పసుపు, మిర్చి, చిరు ధాన్యాలకు సాగుకు ముందే మద్దతు ధర ప్రకటించారు. ► దీంతో తాము పండించిన పంటను అమ్ముకోగలమనే ధీమా రైతులకు ఏర్పడింది. ► గతంలో వ్యాపారులు రైతుల నుంచి క్వింటా పసుపును రూ.5 వేల నుంచి రూ.5,500 లోపే కొనుగోలు చేశారు. 2017–18లో రూ.5,450, 2018–19లో రూ.5,500లకు కొనుగోలు చేశారు. ► రాష్ట్రంలో 29,654 ఎకరాల్లో పసుపు సాగు చేశారు. శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో అధికంగా ఈ పంట సాగయ్యింది. ► మొత్తంగా 1.02 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ► కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎకరాకు సగటున 35 క్వింటాళ్ల దిగుబడి వస్తే శ్రీకాకుళం, వైఎస్సార్ జిల్లాల్లో 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ► ఎకరా కౌలుకు రూ.50 వేలు, సాగుకు రూ.80 వేలు, మొత్తంగా రూ.1.30 లక్షల ఖర్చు అవుతోంది. ► 30 క్వింటాళ్ల పంటను కొనుగోలు కేంద్రంలో రైతులు అమ్ముకుంటే రూ.2.05 లక్షల వరకు నగదు వస్తోంది. అన్ని ఖర్చులు పోను రైతుకు ఎకరాకు రూ.65 వేల వరకు ఆదాయం లభిస్తోంది. ► గతంలో రెండు, మూడు జిల్లాలకు ఒక పసుపు కొనుగోలు కేంద్రం ఉండేది. ఈ ఏడాది 8 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ► రైతుల నుంచి 10,200 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుని, ఇప్పటివరకు 3 వేల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేసింది. దళారులు లేకుండా చేశాం పసుపు క్వింటాకు రూ.6,850 మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రైతులకు పంటను అమ్ముకోవచ్చనే ధీమా ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోగా మిగిలిన పంటకు కూడా ప్రైవేట్ మార్కెట్లోనూ రైతులకు మంచి ధర లభిస్తోంది. గరిష్ట సేకరణను 30 నుంచి 40 క్వింటాళ్లకు పెంచడంతో రైతులకు ఎక్కువ లబ్ధి చేకూరుతోంది. – ఎస్.ప్రద్యుమ్న, ప్రత్యేక కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
ఇంటికే పండ్లు కార్యక్రమానికి పెరుగుతున్న జనాదరణ
సాక్షి, హైదరాబాద్ : వాక్ ఫర్ వాటర్, తెలంగాణ మార్కెటింగ్‌శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటికే పండ్ల కార్యక్రమానికి జనాదరణ పెరుగుతోంది. ఫోనుకాల్స్, ఆన్లైన్లో ఆర్డర్లు పోటెత్తుతున్నాయి. నాణ్యత బాగుండడం, తక్కువ ధరకావడంవల్ల పండ్లు కావాలంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. సంబంధిత వెబ్‌సైట్‌కి ఇప్పటికి 26 లక్షల హిట్స్ రాగా... ఇప్పటి వరకు వచ్చిన లక్షన్నర ఆర్డర్లలో... 65 వేలు సరఫరా చేశారు. డెలివరీ వేగవంతం చేసేందుకు తపాలశాఖతో ఒప్పందం కుదుర్చుకున్నారు. లాక్డౌన్ వేళ దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రజల ఇళ్ల వద్దకే తాజా పండ్లు సరఫరా చేస్తున్నందున... ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డిని నగరవాసులు ప్రశంసిస్తున్నారు. ఇటు రైతులు అటు వినియోగదారులకి ఏకకాలంలో మంచి చేస్తున్నారంటూ కొనియాడుతున్నారు. ఈ కిట్‌లో రూ.300 కు ప్రజల ఇంటి వద్దకే మామిడి(1.5 కేజీ), బొప్పాయి (3 కేజీలు), నిమ్మ(12కాయలు), పుచ్చ(3 కేజీలు), బత్తాయి(2 కేజీలు), సపోట(1 కేజీ) పండ్ల డెలివరీ చేస్తున్నారు. 88753 51555 నంబర్‌కి ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే ఇంటివద్దకే పండ్లు అందిస్తున్నారు. ( ‘సరిలేరు’ తర్వాత మహేశ్ చిత్రం ఇదే! ) ప్రజాదరణ, అధికారుల సహకారంతో... ఇంటికే పండ్ల కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోందని వాక్ ఫర్ వాటర్ ఛైర్మన్ ఎం. కరుణాకర్‌రెడ్డి తెలిపారు. నలుమూలల పంపిణీకోసం తపాలశాఖ రంగంలోకి దిగుతోందన్నారు. పండ్లు తీసుకున్న వారిలో 98 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని... నాణ్యత, పరిమాణం బాగున్న కారణంగా మళ్లీ మళ్లీ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రవాస తెలంగాణ పౌరులు... తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకి పండ్ల సంచి అందించాలంటూ ఆన్లైన్లో పెద్ద ఎత్తున వినతులు పంపిస్తున్నారని చెప్పారు. అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి సైతం ప్రజలు ఫోన్లు చేసి తమకి కూడా పండ్లు కావాలని కోరుతున్నట్లు వెల్లడించారు. సర్కార్ పిలుపు మేరకు కొందరు దాతలు స్పందించి పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, అనాధలకి పండ్లు వితరణ చేస్తున్నారని చెప్పారు. కరోనాతో దేశంలోని ప్రధాన రంగాలు స్తంభించిన సమయంలో రైతులని ఆదుకునేందుకు సత్ సంకల్పంతో చేపట్టిన ప్రయోగానికి జనామోదం లభించడం సంతోషంగా ఉందన్నారు. (ఇర్ఫాన్ భార్య సుతప భావోద్వేగ పోస్టు) -
జనతాబజార్లలో ఆక్వా ఉత్పత్తులు
సాక్షి, అమరావతి: జనతాబజార్లలో ఆక్వా ఉత్పత్తులను విక్రయించేలా చూడాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రేడింగ్, ప్యాకింగ్ దశ కూడా గ్రామస్థాయిలోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు ఈ బజార్ల ద్వారా తగిన స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు లభించాలని.. కరోనా నేపథ్యంలో వికేంద్రీకరించిన బజార్లను భవిష్యత్తులోనూ కొనసాగేలా చూడాలని ఆయనన్నారు. జనతా బజార్ల విధివిధానాలు.. అధికారుల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులను జనతా బజార్లలో విక్రయించేలా చూడాలి. ► కనీసం 20–25 రకాల ఉత్పత్తులు వీటిల్లో అందుబాటులో ఉంచాలి. ► పళ్లు, కూరగాయాలు, గుడ్లు, పాలు, ఆక్వా ఉత్పత్తులు వంటి నిత్యావసరాలు లభించే ఈ బజార్లలో వీటి వినియోగం 30–35 శాతం ఉండాలి. ► ఇలా అయితే మార్కెట్లో పోటీ పెరిగి రైతులకు మంచి ధరలు వచ్చి లాభం చేకూరుతుంది. ► ఏడాదిలోపు వీటిని ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. ► గ్రేడింగ్, ప్యాకింగ్ కూడా గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లాలి. ► ఈ బజార్ల ద్వారా రైతులకు మార్కెటింగ్ అవకాశాలు లభించాలి. ► అలాగే, కరోనా నేపథ్యంలో వికేంద్రీకరించిన బజార్లను భవిష్యత్తులోనూ కొనసాగేలా చూడాలి. ► మార్కెట్లో ఉత్పత్తులు నిలవాలంటే గ్రేడింగ్, ప్యాకింగ్ బాగుండాలి. ► సమావేశంలో చర్చించిన అంశాలతో విధివిధానాలు తయారుచేయాలి. మరింత మేధోమథనం చేసి మంచి ప్రతిపాదనలతో రావాలి. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి సహా ఇతర అధికారులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డుల్లోనూ రైతు బజార్లు రాష్ట్రంలోని మార్కెట్ యార్డుల్లోనూ శనివారం నుంచి రైతుబజార్లు ప్రారంభం కానున్నాయి. వాటిలోని గోడౌన్లు, ప్లాట్‌ఫారాలపై కూరగాయలు, పండ్లు విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గోడౌన్లు లేని యార్డుల్లో తాత్కాలికంగా షెడ్లు వేసి అమ్మకాలు ప్రారంభించాలని మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న ఆదేశించారు. గ్రామ, పట్టణ శివారు ప్రాంతాల్లోని గోడౌన్లకు కొనుగోలుదారులు పెద్దగా వచ్చే అవకాశాలు లేకపోవడంతో వాటిని మినహాయించాలన్నారు. వంద యార్డుల గుర్తింపు ► రాష్ట్రంలోని 216 మార్కెట్ కమిటీల పరిధిలో 150 మార్కెట్ యార్డులు ఉన్నాయి. సౌకర్యాలున్న 100 యార్డులను అధికారులు గుర్తించారు. ► వాటిలో శనివారం నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఈ యార్డుల్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి. ► వీటికి రైతులు, హమాలీలు, వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది కలిపి రోజుకు సగటున 200 మంది వరకు వస్తున్నట్లు అంచనా. వీరితోపాటు పరిసర ప్రాంతాల వినియోగదారులకు ఇవి ఉపయోగపడతాయి. ► కరోనా వైరస్ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే.. ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు వెళ్లాయి. ► మార్కెట్ కమిటీల పరిధిలో ఉండే మేజర్ పంచాయతీల్లోనూ అక్కడి పరిస్థితులను బట్టి రైతు బజార్లు ఏర్పాటు కానున్నాయి. అందుబాటులోకి మొబైల్ బజార్లు ► కరోనా వైరస్‌కు ముందు రాష్ట్రంలో 100 రైతు బజార్లు ఉండేవి. తర్వాత తాత్కాలిక రైతు బజార్ల ఏర్పాటు ద్వారా వాటి సంఖ్యను 417కు పెంచారు. ► వీటికి అధిక సంఖ్యలో కొనుగోలుదారులు వ స్తుండటంతో మొబైల్ రైతు బజార్ల విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం 451 మొబైల్ రైతు బజార్లు పని చేస్తున్నాయి. ఇందు కు ఆర్టీసీ బస్సులను కూడా వాడుతున్నారు. -
బత్తాయి రైతుకు సర్కారు అండ
సాక్షి, అమరావతి: కొవిడ్–19 కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మార్కెట్లు పూర్తిగా ప్రారంభం కాకపోవడంతో ఎగుమతుల్లేక రాష్ట్రంలో చీనీ (బత్తాయి) ధర పతనమైంది. దీంతో ఆ రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. పంటకు మంచి ధర వచ్చే వరకు రైతుల నుంచి కొనుగోలు చేసి రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో విక్రయించాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల్లోని రైతుల నుంచి టన్ను రూ.14 వేల చొప్పున తొలి విడతగా 120 మెట్రిక్ టన్నులను సోమ, మంగళవారాల్లో కొనుగోలు చేసింది. వీటిని లారీల ద్వారా రాష్ట్రంలోని వివిధ రైతుబజార్లకు పంపించింది. రవాణా ఖర్చులు, హమాలీ చార్జీలు, స్వయం సహాయక గ్రూపుల కమీషన్లతో కలిపి రైతుబజార్లలో కిలో రూ.20 లకు విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. కాగా, కొనుగోలు చేసిన బత్తాయిని శ్రీకాకుళం జిల్లాకు 5 టన్నులు, విజయనగరం 10, విశాఖ సిటీ 10, విశాఖ జిల్లా 20, తూర్పుగోదావరి 10, పశ్చిమ గోదావరి 10, విజయవాడ 10, కృష్ణాజిల్లా 15, గుంటూరు 10, ప్రకాశం 5, నెల్లూరు 5, చిత్తూరు 5, కర్నూలు జిల్లాకు 5 టన్నుల చొప్పున కేటాయించారు. ఇక విజయవాడ, విశాఖ రైతుబజార్లలో బుధవారం నుంచి ఇవి అందుబాటులో ఉంటాయి. మిగిలిన రైతుబజార్లలో ఒకట్రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తాయి. ఎగుమతులు మొదలయ్యే వరకూ కొనుగోళ్లు ఇదిలా ఉంటే.. ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్లు మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానున్నాయి. అక్కడి వ్యాపారులు బత్తాయి కొనుగోలుకు రాష్ట్రానికి వస్తే టన్ను రూ.20వేలకు పైగానే పలుకుతుందని రైతులు చెబుతున్నారు. ఆ ధర వచ్చే వరకు రైతుల నుంచి బత్తాయిని కొనుగోలు చేస్తామని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఇస్సార్ అహ్మద్ తెలిపారు. -
ఇంటి ముంగిటే పంట కొనుగోలు
సాక్షి, అమరావతి: ఎలక్ట్రానిక్ పంట నమోదు (ఇ–క్రాప్ బుకింగ్) ఆధారంగా ధాన్యాన్ని సేకరించాలని వ్యవసాయ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. గ్రామ సచివాలయ వ్యవస్థ, ఇ–పంట విధానంతో రైతుల ఇళ్ల ముంగిటే సేవలందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన మేరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇ–క్రాప్ డేటాతో ధాన్యాన్ని సేకరించడం ఇదే తొలిసారి. విధివిధానాలు ఇలా ఉన్నాయి... ► ఇ–క్రాప్ బుకింగ్‌లో ఆయా గ్రామాల్లోని రైతులు ఏఏ పంటలు వేశారో ఇప్పటికే నమోదు అయింది. ► వరి పంట వేసిన రైతులు తమ గ్రామ స్థాయిలోనే ధాన్యం అమ్మకానికి పేర్లను నమోదు చేయించుకోవాలి. ► గ్రామ సచివాలయంలోని వ్యవసాయ సహాయకులు కొనుగోలు కేంద్రం తరఫున రైతుల పేర్లను నమోదు చేస్తారు. వేరే గ్రామం వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉన్న ఊళ్లోనే రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. రబీ డేటా ఆధారంగా కొనుగోళ్లు చేపడతారు. ► ప్రస్తుత ఇ–క్రాప్ బుకింగ్ విధానంలో వ్యవసాయ సహాయకులు సర్వే నంబర్ వారీగా తనిఖీ చేసి సాగుదార్ల వివరాలను నమోదు చేసినందున కొనుగోళ్లు సుళువవుతాయి. ఇ–క్రాప్ బుకింగ్ డేటాను పంచాయతీ కార్యాలయాలలో ప్రదర్శిస్తారు. ఏవైనా ఫిర్యాదులు, అభ్యర్థనలు వస్తే పరిశీలించి అర్హత కలిగిన వారిని కూడా ఇ–క్రాప్‌లో అప్లోడ్ చేస్తారు. ► వెబ్‌ల్యాండ్‌లో లేని భూములను కూడా పరిశీలించి వాటిలో వరి సాగు చేసి ఉంటే ఆ రైతుల వివరాలను కూడా ఇ–క్రాప్‌లో నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ వల్ల ధాన్యం కొనుగోళ్ల కార్యక్రమం సాఫీగా సాగుతుందని భావిస్తున్నారు. ఇదే ప్రక్రియను మొక్కజొన్న కొనుగోళ్లకు కూడా వినియోగించనున్నారు. ఈ విధానాన్ని శనగలకు అమలు చేసి మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. గ్రామ స్థాయిలోనే జొన్న,మొక్కజొన్న సేకరణ లాక్‌డౌన్‌ను పూర్తిగా తొలగించే వరకు జొన్న, మొక్కజొన్న పంటల ఉత్పత్తులను గ్రామ స్థాయిలోనే సేకరించాలని మార్క్‌ఫెడ్ నిర్ణయం తీసుకుంది. మండల కేంద్రాల్లోని కొనుగోలు కేంద్రాలకు పంటను తరలించేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు అనేక వ్యయప్రయాసలకు గురయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మార్క్‌ఫెడ్ ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామ సచివాలయ సిబ్బందికి కొనుగోలు కేంద్రాల్లోని విధులు అప్పగించనున్నారు. ఈ నెల పదో తేదీలోపు వీటిని ప్రారంభించేందుకు మార్కెటింగ్‌శాఖ చర్యలు తీసుకుంటోంది. ► రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటను ఆ గ్రామ పరిధిలోని పంచాయతీ కార్యాలయం, పాఠశాల, ఆలయాల ప్రాంగణాల్లో తాత్కాలికంగా నిల్వ చేస్తారు. ► నాలుగైదు రోజులయ్యాక ఆ పంటను ప్రభుత్వం కేటాయించిన గోడౌన్లకు తరలిస్తారు. ► పంట కొనుగోలు, గోనె సంచుల్లో నిల్వ, తూకం తదితర పనులకు గ్రామాల్లో ధాన్యం వ్యాపారుల వద్ద పనిచేస్తున్న వ్యవసాయ కార్మికులనే వినియోగించనున్నారు. ► పంట సేకరణ బాధ్యతను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా మార్కెటింగ్ సొసైటీలు, రైతు ఉత్పత్తి సంఘాలు, స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తున్నారు. ► రాష్ట్రంలో 1.88 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగైంది. దాదాపు 14.60 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశముందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ► ప్రభుత్వం క్వింటాకు రూ.1760ను మద్దతు ధరగా ప్రకటించింది. రాష్ట్రంలో 3.64 లక్షల మెట్రిక్ టన్నులను మార్క్‌ఫెడ్ సేకరించనుంది. ► రాష్ట్రంలో 1.10 లక్షల హెక్టార్లలో జొన్న పంటను రైతులు సాగు చేశారు. దాదాపు 4.33 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చే వీలుందని అంచనా. ► ప్రభుత్వం క్వింటాకు రూ.2550లను మద్దతు దరగా ప్రకటించింది. 1.50 లక్షల మెట్రిక్ టన్నులను సేకరిస్తారు. ► కొనుగోలు కేంద్రాల సంఖ్యను ఒకటి రెండు రోజుల్లో నిర్ణయించనున్నారు. -
నేటి నుంచి మార్కెట్ యార్డుల పునఃప్రారంభం
సాక్షి, అమరావతి: గుంటూరు మిర్చి యార్డు మినహా రాష్ట్రంలోని అన్ని మార్కెట్‌యార్డులు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రాల సరిహద్దులు మూసివేయడంతో కొన్ని రకాల నిత్యవసర వస్తువుల కొరత ఏర్పడే పరిస్థితులొచ్చాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌యార్డులను ప్రారంభించి వాటిని ధరలను నియంత్రించాలని అధికారులు చర్యలు చేపట్టారు. మార్కెట్ యార్డులను పునఃప్రారంభించాలని సోమవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో జిల్లాల అధికారులను మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రద్యుమ్న ఆదేశించారు. ► రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా కందిపప్పు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో కందికీ కొరత వచ్చే అవకాశం ఉండటంతో కందుల కొనుగోలుపైనా ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు. ► రాయలసీమ జిల్లాల్లో కందులు, పప్పుశనగ నిల్వలు అధికంగా ఉన్నాయని, మార్కెట్‌యార్డులను ప్రారంభించిన వెంటనే రైతులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ► మార్కెట్‌యార్డుల్లో రైతులు, హమాలీలు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ► మిర్చి యార్డులకు సంబంధించి పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నందున ఉన్నతస్థాయి సమావేశం జరిగాక వీటి ప్రారంభంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రద్యుమ్న వెల్లడించారు. -
1 నుంచి జొన్న, మొక్కజొన్న కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: వచ్చే నెల (ఏప్రిల్) 1 నుంచి జొన్న, మొక్కజొన్నను కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులు ఇబ్బంది పడకుండా తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఐదెకరాలలోపు మొక్కజొన్న పంట మొత్తాన్ని కొనుగోలు చేసి చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవాలన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం మార్కెటింగ్ శాఖపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. తర్వాత వివరాలను వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మీడియాకు వివరించారు. కన్నబాబు ఏం చెప్పారంటే.. - ఈ సీజన్లో 15 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడి వచ్చే అవకాశముందని అంచనా వేశాం. ఇందులో సగం ఉత్పత్తిని అయినా కొనాలని సీఎం ఆదేశించారు. 5 ఎకరాలలోపు ఉన్న రైతుల పంట మొత్తం కొనుగోలు చేస్తాం. అత్యధికంగా ఒక్కో రైతు నుంచి 150 క్వింటాళ్ల వరకు మొక్క జొన్నని కనీస మద్దతు ధరలకు కొంటాం. - ఏప్రిల్ 1 నుంచి 150 మొక్క జొన్న, జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయనున్నాం. - ఖరీఫ్, రబీలో వరి ఉత్పత్తి పెరగడంతో గోడౌన్ల ఏర్పాటుపై కూడా సీఎం సమీక్ష చేశారు. మన గోడౌన్లతోపాటు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) గోడౌన్లను కూడా తీసుకోవాలని ఆదేశించారు. - వచ్చే ఏడాది నుంచి ‘మిషన్ గోడౌన్స్ (గిడ్డంగుల నిర్మాణం)’ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. ఇప్పటికే రూ.321 కోట్లు కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చారు. వీటి కోసం స్థలాలు చూడాలని జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేశాం. - ఈ ఏడాది అన్ని రైతు భరోసా కేంద్రాల్లో వేరుశనగ విత్తనాల పంపిణీ చేస్తాం. - విత్తన సేకరణ ఎలా జరుగుతుందో పర్యవేక్షించాలని, నాణ్యమైన విత్తన సేకరణలో రాజీ పడొద్దని సీఎం సూచించారు. పుడ్ ప్రాసెసింగ్‌పై సీఎం సమీక్ష - అరటి, టమాట, నిమ్మ, చీనీ వంటి వాటిని శుద్ధి చేసి విక్రయించడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని పుడ్ ప్రాసెసింగ్‌పై జరిగిన సమీక్షలో సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. - అరటికి గతంలోనే క్వింటాల్‌కి రూ.800 గిట్టుబాటు ధర ప్రకటించాం. - గోదావరి డెల్టాలో రబీకు సాగునీటి ఎద్దడి రాకుండా, చివరి ప్రాంతాలకు నీరందని పరిస్ధితి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. - సీలేరు నుంచి ఇప్పటికే 8 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నాం. అవసరమైతే మరో వేయి క్యూసెక్కులు నీటిని విడుదల చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
అక్రమాలు జరిగితే ఏజెన్సీని మార్చేస్తాం
సాక్షి, అమరావతి: పంటల కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరిగితే సేకరణ ఏజెన్సీని మార్చేస్తామని మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రద్యుమ్న తేల్చిచెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు మోసపోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన మంగళవారం మార్కెటింగ్ శాఖ అధికారులు, సేకరణ ఏజెన్సీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పత్తి, కందుల కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, పత్తి కొనుగోలు కేంద్రాలన్నింటిపై ఏసీబీ విచారణకు ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో కందుల సేకరణ ఏజెన్సీ అయిన జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీని ఆ బాధ్యత నుంచి తప్పించామని చెప్పారు. అవకతవకలకు పాల్పడ్డ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మద్దతు ధరలు ప్రకటించిన 22 రకాల పంటలను 216 మార్కెట్ యార్డులు, 150 సబ్ యార్డుల్లో కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. పంటల సేకరణ ఏజెన్సీలు ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. మార్గదర్శకాలు - రైతుల వారీగా యార్డుల్లోని ఇన్‌గేట్, ఔట్‌గేట్‌ల వద్ద పంటలను నమోదు చేయాలి. రైతుల నుంచే పంటలను సేకరించాలి. - సేకరణ కేంద్రానికి రైతులు తప్పనిసరిగా రావాలి. అలా రాకపోతే పంటను తీసుకోరు. - రైతు పట్టాదారు పాస్‌పుస్తకం, బ్యాంకు పాస్‌పుస్తకం, కౌలుదారీ పత్రం, ఈ–క్రాప్ నమోదు వివరాలు తీసుకురావాలి. - ప్రభుత్వం సూచించిన పరిమాణానికి మించి పంటను రైతుల నుంచి ఏజెన్సీలు తీసుకోకూడదు. - పంటల నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేయాలి. - మార్గదర్శకాలను ఉల్లంఘించిన కేంద్రాల్లో పంటల సేకరణను నిలిపివేసే అధికారం మార్కెటింగ్ శాఖ కార్యదర్శికి ఉంటుంది. -
‘కోవిడ్’ పేరిట రైతులకు బురిడీ
సాక్షి, అమరావతి: కోవిడ్ వైరస్ పేరుతో మిర్చి వ్యాపారులు రైతులను నిలువునా దోచేస్తున్నారు. ఈ వైరస్ కారణంగా చైనాకు ఎగుమతులు నిలిచిపోవడంతో మిర్చి ధరను సగానికి సగం తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. 15 రోజుల క్రితం దాకా క్వింటాల్ రూ.22 వేలకు కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రస్తుతం రూ.8,000 నుంచి రూ.13,500లకు కొంటున్నారు. మరో మార్గం లేక రైతులు పంటను అమ్ముకుంటున్నారు. వ్యాపారులు ఆ మిర్చిని ఇతర రాష్ట్రాలకు, బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు వ్యాపారులు సమీప భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తూ కోల్డు స్టోరేజీల్లో మిర్చీని నిల్వ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో అధిక డిమాండ్ ప్రతి సంవత్సరం గుంటూరు నుంచి చైనాకు 1.30 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి ఎగుమతి అవుతోంది. ఈ ఏడాది సీజను ప్రారంభమైన మొదటి రెండు నెలల్లో 20 వేల మెట్రిక్ టన్నుల సరుకు ఎగుమతి అయింది. కోవిడ్ వైరస్ కారణంగా ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. క్వింటాల్ రూ.22 వేలు పలికిన మిర్చీ ధర రూ.8 వేలకు పడిపోయింది. ఎటువంటి తాలు లేని మిర్చి గుంటూరు మార్కెట్ యార్డులో రూ.13,500 పలుకుతోంది. చైనాకు ఎగుమతులు నిలిచినా ఇతర రాష్ట్రాలు, బంగ్లాదేశ్‌లో మంచి మిర్చికి డిమాండ్ ఉంది. చైనాకు ఇప్పట్లో ఎగుమతులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం లేదంటూ వ్యాపారులు మాయ మాటలు చెబుతూ రైతుల నుంచి తక్కువ ధరకే పంటను కొనుగోలు చేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ నిర్లక్ష్యం గుంటూరు నుంచి బంగ్లాదేశ్‌కు ప్రతిఏటా 30 వేల నుంచి 50 వేల మెట్రిక్ టన్నులు మిర్చి ఎగుమతి జరుగుతోంది. ఇప్పుడు చైనాకు ఎగుమతులు నిలిచిపోవడంతో వ్యాపారులంతా రోజుకు 500 నుంచి 1,000 టన్నులను బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం మిర్చికి ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ అధికంగానే ఉందన్న విషయాన్ని మార్కెటింగ్ శాఖ ప్రచారం చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యాపారుల ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దు ‘‘గుంటూరు మిర్చి యార్డులో మంచి ధర లభిస్తుంది. జనవరి నెలాఖరు వరకు గుంటూరు యార్డుకు రోజుకు 1.20 లక్షల బస్తాల (ఒక బస్తా 40 కిలోలు) మిర్చీ వచ్చింది. ప్రస్తుతం చైనాకు ఎగుమతులు నిలిచిపోయాయి. గ్రామాల్లోని వ్యాపారులు రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తుండటంతో రోజుకు దాదాపు 70 వేల బస్తాలే యార్డుకొస్తున్నాయి. మార్కెట్ పరిస్థితులను తెలుసుకుంటూ పంటను మంచి ధరకు అమ్ముకోవాలి. వ్యాపారుల ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దు’’ – వెంకటేశ్వరరెడ్డి, సెక్రెటరీ, గుంటూరు మిర్చి యార్డు -
ఉల్లి రిటైలర్ల మాయాజాలం
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా హోల్‌సేల్ మార్కెట్లో ఉల్లి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే ఈ మేరకు రిటైల్ మార్కెట్లో పలువురు వ్యాపారుల మాయాజాలం వల్ల ధర తగ్గడం లేదు. సామాన్యులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కొద్ది రోజులుగా మార్కెటింగ్, సివిల్ సప్లయిస్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగాలు ఉల్లి ధరలను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాయి. మరో వైపు మార్కెటింగ్ శాఖ మార్కెట్ ధరకు ఉల్లిని కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా కిలో రూ.25 చొప్పున విక్రయిస్తోంది. ఇప్పటి వరకు రూ.25 కోట్లు ఖర్చు చేసి 35 వేల క్వింటాళ్ల ఉల్లిని విక్రయించింది. ధరల స్ధిరీకరణ నిధి నుంచి రూ.16.50 కోట్లను సబ్సిడీ కింద భరించింది. మాయాజాలం ఇలా.. రాష్ట్రంలోని కర్నూలు, తాడేపల్లిగూడెం మార్కెట్లలో గడువులు, మీడియాలు, గోల్టా, గోల్టీ, పేళ్లు, రెమ్మలు అనే రకాల ఉల్లిపాయలు వస్తున్నాయి. ఇందులో గడువులు, మీడియాలు కొన్ని సందర్భాల్లో కిలో రూ.110 వరకు ధర పలికాయి. మిగిలిన రకాలు కిలో రూ.40 నుంచి రూ.60 ధర పలుకుతున్నాయి. వీటి సగటు ధర (40+60+110=210/3) రూ.70గా నిర్ణయిస్తారు. ఈ రకాలన్నింటినీ రిటైలర్లు హోల్‌సేల్ వ్యాపారుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. వీటిలో తక్కువ రేటు కలిగిన ఉల్లిని ఎక్కువగా కలిపి ఏ గ్రేడ్ రేటుకు అమ్ముతున్నారు. వీటి సగటు ధర కిలో రూ.70 ఉంటే రిటైలర్లు రూ.100 నుంచి రూ.110కి అమ్ముతూ లాభాలు పొందుతున్నారు. రిటైలర్ల క్రయ విక్రయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని వినియోగదారులు కోరుతున్నారు. కాగా, ప్రస్తుతం మంచి నాణ్యత కలిగిన ఉల్లికి కిలోకు రూ.80 నుంచి రూ.100 వరకు ధర వస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతులు వస్తుండటంతో క్రమంగా ధరలు తగ్గుతున్నాయని మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శారదారాణి తెలిపారు. ప్రజలకు భారం కాకూడదని.. ప్రజలకు భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కిలో ఉల్లిపై రూ.80 నుంచి రూ.100 సబ్సిడీ భారాన్ని భరిస్తోంది. ఇలా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారాన్ని మోయడం లేదు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం షోలాపూర్, అల్వార్, కర్నూలు, తాడేపల్లిగూడెం నుంచి ఉల్లిని కొనుగోలు చేసి సబ్సిడీపై ప్రజలకు అందిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి రూ.150 నుంచి రూ.200 వరకూ పలుకుతోంది. పొరుగునున్న తెలంగాణలో కూడా రైతు బజార్లలోనే కిలో రూ.45కు అమ్ముతున్నారు. మహారాష్ట్రలో కిలో రూ.160, చెన్నైలో రూ.120, ఒడిశాలో రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. మనరాష్ట్ర ప్రభుత్వం మాత్రం వివిధ మార్కెట్లలో కిలో రూ.120 చొప్పున కొనుగోలు చేసి.. కేవలం రూ.25కే రైతు బజార్ల ద్వారా విక్రయిస్తోంది.. – మోపిదేవి వెంకట రమణారావు, రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి -
ప్రభుత్వ చర్యలతో దిగొస్తున్న ఉల్లి
సాక్షి, అమరావతి, కర్నూలు(అగ్రికల్చర్) : ఒకవైపున రాయితీపై రైతు బజార్లలో ఉల్లిని సరఫరా చేస్తూనే మరోవైపున బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితం ఇస్తున్నాయి. రెండు రోజులుగా మార్కెటింగ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, రవాణా శాఖలు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో.. రెండు రోజుల క్రితం వరకు పోటీపడి క్వింటా రూ.13 వేలకు కొనుగోలు చేసిన ట్రేడర్లు శనివారం కర్నూలు, తాడేపల్లిగూడెం మార్కెట్లలో క్వింటా రూ.8,750కి మించి కొనుగోలు చేయలేదు. వచ్చిన ఉల్లిలో 30 నుంచి 40 శాతానికి మించి కొనలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మార్కెటింగ్ శాఖ ట్రేడర్లతో పోటీపడి ఉల్లిని కొనుగోలు చేస్తోంది. నాణ్యమైన ఉల్లి మార్కెట్లో కనిపిస్తే ఎంత రేటుకైనా కొనుగోలు చేసేందుకు మార్కెటింగ్ శాఖ ముందుకు వస్తుండటంతో ట్రేడర్లు వెనుకంజ వేస్తున్నారు. తాడేపల్లిగూడెం మార్కెట్‌కు శనివారం 1000 క్వింటాళ్ల ఉల్లి రాగా, క్వింటా రూ.8,500 చొప్పున మార్కెటింగ్ శాఖ 550 క్వింటాళ్లను కొనుగోలు చేసింది. కర్నూలు మార్కెట్‌కు 6,500 క్వింటాళ్లు రాగా, మార్కెటింగ్ శాఖ క్వింటా రూ.8,750 – రూ.9,300 చొప్పున 4,000 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసింది. కాగా ఇప్పటి వరకు 33,950 క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేసి రైతు బజార్లలో విక్రయిస్తోంది. రైతుబజార్లకు సత్వరమే చేరవేత షోలాపూర్, ఆల్వార్ నుంచి ఉల్లి దిగుమతులు శనివారం నుంచి ప్రారంభం అయ్యాయి. కొనుగోలు చేసిన ఉల్లిని వెంటనే రాయితీపై రైతుబజార్లలో విక్రయించేందుకు సత్వర రవాణాకు మార్కెటింగ్ శాఖ చర్యలు తీసుకుంది. కర్నూలులో కొనుగోలు చేసిన ఉల్లిని రాయలసీమ జిల్లాలకు, తాడేపల్లిగూడెంలో కొనుగోలు చేసిన ఉల్లిని ఉభయగోదావరి, కృష్ణా,గుంటూరు జిల్లాలకు, షోలాపూర్ నుంచి వచ్చిన ఉల్లిని ఉత్తరాంధ్రకు రవాణా చేస్తున్నారు. రవాణాలో జాప్యాన్ని నివారించడంతోపాటు ఖర్చులు తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకున్నామని కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. రాష్ట్ర సరిహద్దులు, ప్రధాన మార్కెట్ల వద్ద ఉల్లి రవాణా, కొనుగోళ్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిఘా కొనసాగిస్తోంది. ఇతర రాష్ట్రాలకు ఉల్లిని ఎగుమతి చేస్తున్న లారీలను తనిఖీ చేస్తోంది. సరైన డాక్యుమెంట్లు లేకపోతే లారీలను నిలిపివేస్తోంది. వేలం పాటలు జరిగిన సమయంలో ఎక్కువ మొత్తంలో ఉల్లిని కొనుగోలు చేస్తున్న ట్రేడర్ల వివరాలను విజిలెన్స్ విభాగం అధికారులు నమోదు చేసుకుంటున్నారు. దీంతో వ్యాపారులు భయపడి పెద్ద మొత్తంలో ఉల్లిని కొనుగోలు చేసేందుకు ధైర్యం చేయడం లేదు. దీనికితోడు డైలీ ట్రాన్స్‌పోర్టుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం వేలంలో ఉల్లి ధర తగ్గింది. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా దిగుమతులు ప్రారంభం కావడంతో రెండు రోజుల్లోనే ఉల్లి ధరలు తగ్గుతాయని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. -
ఉల్లి ఎగుమతులకు బ్రేక్!
సాక్షి, అమరావతి, కర్నూలు (అగ్రికల్చర్) : వ్యాపార రిజిస్ట్రేషన్, వాహనాలకు సరైన పత్రాలు లేకుండా ఉల్లి ఎగుమతి చేస్తున్న 20 లారీలను శుక్రవారం ఉదయం రాష్ట్ర సరిహద్దుల వద్ద అధికారులు నిలిపివేశారు. దీంతో ఉల్లి విక్రయాలకు ప్రధాన మార్కెట్లైన కర్నూలు, తాడేపల్లిగూడెంలో వ్యాపారులు శుక్రవారం లావాదేవీలను ఆకస్మికంగా బహిష్కరించి నిరసన వ్యక్తం చేయడంతో దాదాపు 1,800 క్వింటాళ్ల కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో వ్యాపారులతో చర్చించిన మార్కెటింగ్‌శాఖ కమిషనర్ ప్రద్యుమ్న సమస్య పరిష్కారం అయ్యేవరకు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రైతుల నుంచి కొనుగోలు చేసే ఉల్లిలో సగం మాత్రమే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకోవచ్చని, మిగిలింది ఇక్కడే విక్రయించాలని సూచించారు. ఈ ప్రతిపాదనకు వ్యాపారులు సానుకూలంగా స్పందించారని, శనివారం నుంచి ఉల్లి కొనుగోళ్లు యథాతథంగా జరుగుతాయని చెప్పారు. రాజస్ధాన్ నుంచి కూడా ఉల్లి దిగుమతి చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్వింటాల్ గరిష్టంగా రూ. 12,400 కర్నూలు మార్కెట్లో ఉదయం తొలుత అరగంట పాటు వేలంపాట నిర్వహించి 20 లాట్ల వరకు కొనుగోలు చేయగా క్వింటాల్ గరిష్టంగా రూ.12,400 పలికింది. సరిహద్దుల్లో ఉల్లి లారీలను నిలిపివేశారనే సమాచారంతో తర్వాత వేలంపాటను ఆపేశారు. విజిలెన్స్ ఏడీ వెంకటేశ్వర్లు తదితరులు మార్కెట్ యార్డుకు చేరుకుని ఉల్లి కొనుగోళ్లను పరిశీలించారు. రాష్ట్రంలో ఉల్లి కొరతను పరిష్కరించి ప్రజల సమస్యలు నివారించేందుకు మార్కెటింగ్‌శాఖ వ్యాపారులతో పోటీపడి మార్కెట్లకు వస్తున్న ఉల్లిని రైతుల నుంచి కొనుగోలు చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఈ సీజన్లో కిలో రూ.45 నుంచి రూ.130 (గరిష్ట ధర) వరకు కొనుగోలు చేసి రాయితీపై కిలో రూ.25 చొప్పున రైతుబజార్లలో విక్రయిస్తోంది. సెప్టెంబరు 27 నుంచి డిసెంబరు 5వతేదీ వరకు 25,000 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసింది. ధరల స్ధిరీకరణ నిధిని ఈ సమస్య పరిష్కారానికి వినియోగిస్తోంది. కర్నూలు మార్కెట్లో 8 మంది వ్యాపారులు ఈ సీజన్లో ఇప్పటివరకు 2,02,262 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేయగా 1,75,808 క్వింటాళ్లను ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పేర్కొంది. -
ఉల్లి మరో 3 వారాలు కొరతే!
సాక్షి, హైదరాబాద్: ఉల్లి కొరత మరో 3 వారాల వరకు ఉంటుందని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వర్గాలు అంటున్నాయి. ఈజిప్ట్ నుంచి కేంద్ర ప్రభుత్వం 6,090 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకుంటోంది. అందులో 500 టన్నులు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది. ఈ మేరకు వారం రోజుల్లో రాష్ట్రానికి ఉల్లి వచ్చే అవకాశముందని అధికారులు అంటున్నారు. కాగా, రాష్ట్రంలో ఉల్లి ధరలను నియంత్రించేందుకు మార్కెటింగ్ శాఖ చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్, మెహిదీపట్నం రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.40కే విక్రయించేలా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఆధార్ కార్డు చూపించిన వారికి రోజూ సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు విక్రయించనున్నారు. కొరతను వ్యాపారులు అవకాశంగా తీసుకొని ఇష్టారాజ్యంగా ధరలు పెంచకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.ప్రస్తుతం తెలంగాణలో ఉల్లిపాయ ఫస్ట్ క్వాలిటీ ధర క్వింటాలుకు రూ.4 వేల నుంచి రూ.8 వేలకు పెరిగింది. కర్ణాటక, కర్నూలు నుంచి వచ్చే రెండో క్వాలిటీ ధర రూ.3,700 నుంచి రూ.6,000కు గరిష్టంగా పెరిగింది. కాగా,ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల ఉల్లి విత్తనాలు వేయడంలో మూడు, నాలుగు వారాలు ఆలస్యమైంది. దీంతో ఖరీఫ్ ఉల్లిపాయ సాగు విస్తీర్ణం తగ్గింది. మన రాష్ట్రంలో ఖరీఫ్‌లో 10 వేల ఎకరాల్లోపే ఉల్లి సాగవుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి రాష్ట్రానికి ఉల్లి దిగుమతి అవుతోంది. ఆయా రాష్ట్రాల్లోనూ ఆలస్యపు రుతుపవనాల వల్ల విస్తీర్ణం తగ్గింది. కోత సీజన్లో అకాల వర్షాలు ఉల్లి పంటను దెబ్బతీశాయి. సెప్టెంబర్–అక్టోబర్ కాలంలో కురిసిన వర్షాల వల్ల ఉల్లి రవాణాపైనా ప్రభావం పడింది. దీంతో ఉల్లి కొరత ఏర్పడింది. -
రాష్ట్రానికి ఈజిప్టు ఉల్లి
సాక్షి, అమరావతి: ఉల్లి కొరతను అధిగమించేందుకు రాష్ట్రానికి ఈజిప్టు ఉల్లిపాయలు దిగుమతి కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తోపాటు పశ్చిమబెంగాల్, ఒడిశా, కేరళ, సిక్కిం రాష్ట్రాల్లో ఉల్లి కొరత తీవ్రంగా ఉంది. కొనుగోలుదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాలకు నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్) ద్వారా ఉల్లిని సరఫరా చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. ఈజిప్టు నుంచి 6,090 మెట్రిక్ టన్నుల ఉల్లి కొనుగోలుకు ఆర్డరు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తొలిదశలో 2,265 మెట్రిక్ టన్నులను రాష్ట్రాలకు సరఫరా చేయనుంది. కాగా, రాష్ట్రానికి 1000 మెట్రిక్ టన్నుల ఉల్లిని సరఫరా చేయాలని కోరుతూ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంగళవారం నాఫెడ్‌కు లేఖ రాసింది. సముద్ర మార్గంలో ఈ ఉల్లిపాయలు దిగుమతి కానుండటంతో డిసెంబర్ 10 తర్వాత రాష్ట్ర కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా రైతుల నుంచి సర్కారు కిలో రూ.55 నుంచి రూ.60లకు కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా రాయితీపై కిలో రూ.25లకు విక్రయిస్తోంది. ఇలా రోజుకు 150 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేస్తోంది. దీనివల్ల ప్రభుత్వంపై రోజుకు రూ.40 లక్షల భారం పడుతోంది. ధరల స్థిరీకరణ నిధితో మార్కెటింగ్ శాఖ ఈ కొనుగోళ్లను చేపడుతోంది. -
నేటి నుంచి అన్ని రైతుబజార్లలో ఉల్లి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటికే చాలా వరకు రైతుబజార్లలో ఉల్లిపాయలను కిలో రూ.25కే విక్రయిస్తుండగా ఆదివారం నుంచి అన్ని రైతుబజార్లలో ఉల్లిపాయలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 85 రైతుబజార్లు ఉండగా అందులో ఇప్పటికే 80 రైతుబజార్లలో ఉల్లి అందుబాటులో ఉంది. బయటి మార్కెట్లో కిలో ఉల్లి రూ.80 నుంచి రూ.100 వరకు ఉండగా రైతుబజార్లలో కిలో రూ.25కే విక్రయిస్తుండటంతో ప్రభుత్వంపై రోజుకు రూ.40 లక్షల భారం పడుతోంది. అయితే.. అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కర్నూలు జిల్లా రైతుల నుంచి రోజుకు 150 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేస్తోంది. వీటిని రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలు, నగరాలకు పంపుతున్నారు. అక్కడి నుంచి రైతుబజార్లకు చేరుస్తున్నారు. మొదటి రెండు రోజులు ఉల్లిపాయల రవాణాలో కొంత జాప్యం జరగడంతో మారుమూల రైతుబజార్ల అవసరాలకు సరిపోను ఉల్లిపాయలు రాలేదు. దీంతో ధర మరింత పెరగొచ్చనే ఉద్దేశంతో రైతుబజార్లకు వచ్చే వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. ఉల్లిపాయల కొనుగోలు, రవాణాకు ప్రత్యేక చర్యలు ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడినా.. ధరల స్థిరీకరణ నిధితో ఉల్లిపాయలను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దీంతో మార్కెటింగ్ శాఖ ఉల్లిపాయల కొనుగోలు, రవాణాకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రస్తుతం కర్నూలు జిల్లా రైతుల నుంచి కిలో రూ.48 నుంచి రూ.55 ధరకు మార్కెటింగ్ శాఖ ఉల్లిపాయలను కొనుగోలు చేస్తోంది. మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటకల్లో ఉల్లిపాయలు అందుబాటులో ఉన్నప్పటికీ.. కర్నూలు జిల్లా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో మార్కెటింగ్ శాఖ కర్నూలు ఉల్లినే కొనుగోలు చేస్తోంది. పండిన పంటనంతటినీ కర్నూలు రైతుల నుంచి కొనుగోలు చేశాకే ఇతర రాష్ట్రాల ఉల్లిని దిగుమతి చేసుకోవాలనే ఉద్దేశంతో ఉంది. ప్రస్తుతం రైతుబజార్లలో ఒక్కో వినియోగదారుడికి కిలో ఉల్లిపాయలను విక్రయిస్తున్నారు. రైతుబజార్లకు ఎక్కువ ఉల్లి చేరాక కిలోకి మించి అమ్మాలని భావిస్తున్నారు. అవసరమైతే కౌంటర్లు పెంచుతాం నిర్ణీత సమయాలతో సంబంధం లేకుండా రైతుబజార్లకు చేరిన ఉల్లిపాయలను విక్రయిస్తాం. అవసరమైతే కౌంటర్ల సంఖ్యను పెంచుతాం. – ప్రద్యుమ్న, మార్కెటింగ్ శాఖ కమిషనర్ -
మరో నెల.. కిలో ఉల్లి రూ.25కే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రైతు బజార్లలో ఇప్పటికే కిలో రూ.25కే ఉల్లిని అమ్ముతున్నామని, దీనిని మరో నెల రోజులు కొనసాగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కొండెక్కగా.. రాష్ట్రంలోనూ ఆ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సామాన్యులను ఆదుకోవాలని వారికి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఉల్లి ధరలపై మార్కెటింగ్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. పెరుగుతున్న ఉల్లి ధరలు, అందుబాటులో ఉన్న నిల్వలు, దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా మరో నెలపాటు ఉల్లిని కిలో రూ.25కే రైతుబజార్లలో అమ్మేలా చూడాలన్నారు. ఇందుకోసం ప్రతిరోజూ 150 మెట్రిక్ టన్నుల ఉల్లిని రైతుబజార్లకు సరఫరా చేయాలన్నారు. బిడ్డింగులో నేరుగా పాల్గొంటూ రైతుల నుంచి ఉల్లిని కొనుగోలు చేస్తున్నామని, కర్నూలు మార్కెట్‌కు వచ్చే సరుకులో సగాన్ని మార్కెటింగ్ శాఖే కొనుగోలు చేస్తోందని అధికారులు చెప్పగా.. ధరల స్థిరీకరణ నిధిని వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి ధర నాణ్యత ప్రకారం కిలో రూ.62 నుంచి రూ.75 మధ్య ఉందని, బిడ్డింగులో కనీస ధర రూ.53 నుంచి రూ.62 మధ్య కొనుగోలు చేస్తున్నామని అధికారులు చెప్పారు. రవాణా ఖర్చులు కలుపుకుంటే రూ.70 నుంచి రూ.72 వరకూ ఖర్చవుతోందని, ఇంత ఎక్కువ రేటున్నా కిలోకు కనీసం రూ.40–45కి పైబడి రాయితీ ఇచ్చి రైతుబజార్లకు సరఫరా చేస్తున్నామని, పేదలకు, సామాన్యులకు ఇది ఊరటనిచ్చే నిర్ణయమని వారు చెప్పారు. ధరలు తగ్గేంతవరకూ ఇది కొనసాగాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉల్లిని అక్రమంగా నిల్వచేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. వేరుశనగ కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి.. వేరుశనగ కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని, ఇందుకోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉందని, కానీ దానికోసం ఎదురుచూడకుండా ఈ నెల 25 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పారు. అప్పటివరకూ రైతులెవ్వరూ ఎంఎస్పీ ధరకన్నా తక్కువకు అమ్ముకోకుండా చూడాలన్నారు. పంట వచ్చిన జిల్లాల్లో వెంటనే కేంద్రాల్ని ప్రారంభించి రైతులను దళారుల దోపిడీ నుంచి కాపాడాలన్నారు. మొక్కజొన్న రైతులను ఆదుకునేందుకు ఇప్పటివరకూ 18 కేంద్రాలు తెరిచామని, 200 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని అధికారులు వివరించారు. ధర స్థిరపడేంతవరకూ రైతులను ఆదుకోవాలని సీఎం ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలు తెరవడంవల్ల మొక్కజొన్న ధర పెరిగిందని అధికారులు చెప్పారు. కాగా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లను కూడా వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను వైఎస్ జగన్ ఆదేశించారు. పత్తి కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాకపోవడానికి గల కారణాలను ఆయనీ సందర్భంగా అధికారులను అడిగారు. వచ్చే జనవరి నుంచి ఈ–పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని సీఎం సూచించారు. సమీక్షలో మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కమిషనర్ మధుసూదనరెడ్డి, మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లి.. వంటింట్లో లొల్లి
ఉదయం పూట దోశలు వేసిన రోజు సుబ్బారావుకు ఉల్లిపాయ ముక్కలు తప్పనిసరి. మధ్యాహ్నం భోజనంలో భాగంగా పెరుగన్నంలో రోజూ పచ్చి ఉల్లిపాయ తినడం అలవాటు. ఇతని భార్య ఉల్లిపాయను ముక్కలుగా కోసి ప్లేట్లో పెట్టేది. వారం రోజులుగా ఇలా ఇవ్వడం మానేసింది. ‘ఉల్లిపాయ ఎందుకు ఇవ్వడం లేదు?’ అని సుబ్బారావు ప్రశ్నించాడు. ‘ఎందుకో ఏమిటో మీకు తెలియదా? ఏమీ తెలియనట్లు అడుగుతున్నావు.. ధర మండిపోతోంది.. ధర తగ్గేవరకు అంతే.. పోపులో, కొంచెం కూరల్లో మాత్రమే వేస్తాను..’ అని తేల్చి చెప్పింది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎడతెరిపిలేని వర్షాలు, వరదల ప్రభావం, పంట దిగుబడి గణనీయంగా తగ్గడం.. వెరసి ఉల్లిధరలు గణనీయంగా పెరిగాయి. రిటైల్ మార్కెట్లో కిలో రూ.60–70 వరకు ఉండటంతో వినియోగ దారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి తక్కువ ధరకే ఉల్లిని అందించే ఏర్పాట్లు చేయడం వల్ల కాస్త వెసులుబాటు లభించినా, రాష్ట్రంలో ఉల్లి ధరల ఘాటు మాత్రం తగ్గలేదు. రాష్ట్రంలో 95 శాతం ఉల్లి పంట ఒక్క కర్నూలు జిల్లాలోనే సాగవుతోంది. తక్కిన 5 శాతం మాత్రమే ఇతర జిల్లాల్లో పండుతోంది. కర్నూలు జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి ఏటా 87,500 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. ఎకరాకు సగటున 60 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ లెక్కన ఏటా 5.25 లక్షల టన్నుల ఉల్లి కర్నూలు జిల్లా నుంచి ఉత్పత్తి అవుతోంది. అయితే ఈ ఏడాది జూలై నుంచి అక్టోబర్ వరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం వల్ల దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు 40–45 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. పండిన గడ్డల్లోనూ ఎక్కువ శాతం కుళ్లిపోయాయి. ఇతర రాష్ట్రాల్లోనూ తగ్గిన దిగుబడులు మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉల్లి ఎక్కువగా సాగవుతోంది. ఉత్తరభారత దేశంలో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడంతో మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఉల్లి దిగుబడి గణనీయంగా తగ్గింది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో 48 వేల హెక్టార్లలో పంట సాగు చేస్తారు. ఈ ఒక్క జిల్లాలోనే 6.5 –7 లక్షల టన్నుల ఉల్లి పండుతుంది. ఈ ఏడాది వరదల ప్రభావంతో పంట బాగా దెబ్బతింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. దేశ వ్యాప్తంగా వరదల దెబ్బకు ఒక్కసారిగా పంట దిగుబడి తగ్గడం, ఎగుమతులు కొనసాగడంతో కొరత ఏర్పడి ధరలు అమాంతం పెరిగాయి. ఏపీపై మహారాష్ట్ర ప్రభావం మహారాష్ట్ర మార్కెట్ ఆధారంగా ఏపీలో ఉల్లి ధరలు నిర్ణయిస్తారు. అక్కడ ధరలు పెరిగితే ఇక్కడా పెరుగుతాయి. ఇక్కడి, అక్కడి వ్యాపారుల మధ్య సంబంధాలు బాగా ఉండటంతో మార్కెట్ ధరలు కూడా దాదాపు ఒకేలా ఉంటాయి. ఈ ఏడాది జూన్‌లో క్వింటా ధర కనిష్టంగా రూ.310 ఉంటే.. గరిష్టంగా రూ.1,520 వరకూ ఉండింది. సెప్టెంబర్ నుంచి ధరలు పెరిగాయి. సెప్టెంబర్‌లో గరిష్టంగా రూ.4,500, అక్టోబర్‌లో రూ.4070కు చేరింది. ఈ నెలలో 11వ తేదీన ఏకంగా రూ.5 వేలకు చేరింది. శనివారం (16వ తేదీ) కూడా క్వింటా రూ.4,650 వరకూ విక్రయించారు. దీంతో రిటైల్ మార్కెట్లో మొదటి రకం ఉల్లి కిలో రూ.60–70 చొప్పున విక్రయిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఉత్పత్తయ్యే పంటలో 20 శాతం మాత్రమే కర్నూలు మార్కెట్ యార్డులో అమ్మకాలు సాగుతాయి. మిగతా పంటను పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, హైదరాబాద్, చెన్నైతో పాటు ఇతర రాష్ట్రాల వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు. దాదాపు 50 శాతం ఇక్కడి పంటను తాడేపల్లిగూడెం వ్యాపారులే కొనుగోలు చేసి.. ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తుండడం గమనార్హం. వినియోగదారులకు తక్కువ ధరకే.. ఉల్లిరేట్లు పెరగడంతో వినియోగదారులు ఇబ్బంది పడకుండా కిలో రూ.25కే విక్రయించేలా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ ఫెడరేషన్) ద్వారా నాసిక్ నుంచి 350 టన్నుల ఉల్లిని ప్రభుత్వం కొనుగోలు చేసి.. రాష్ట్రంలోని మార్కెట్ యార్డులు, రైతు బజార్లలో కిలో రూ.25కే విక్రయిస్తోంది. మరో 300 టన్నుల కొనుగోలుకు కూడా ప్రతిపాదనలు పంపింది. మరోవైపు గోదాముల్లో అక్రమంగా నిల్వ చేసిన ఉల్లిపై విజిలెన్స్ దాడులు చేయించి, మార్కెట్లోకి తెస్తోంది. దీనికితోడు ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. ఈజిప్టు, నెదర్లాండ్స్ నుంచి లక్ష టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం చేసుకుంది. కాగా, నేటి (ఆదివారం) నుంచి రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలోనూ కిలో రూ.25 చొప్పున ఉల్లిపాయలు అందుబాటులో ఉంటాయని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. రైతులు ఆనందంగా ఉండారు.. ఎకరాలో పంట సాగు సేసినా. 120 ప్యాకెట్లయినాయి (60 క్వింటాళ్లు). పోయినేడు 200 పాకెట్లయిండే. వర్షాలకు ఈ ఏడు పంట పాడయిపోయినాది. అయితే రేటు బాగుంది. పోయిన్సారి కింటా 300 రూపాయలకు అమ్మినా. ఇప్పుడు 3,600 రూపాయలకు అమ్మినా. పంట తగ్గినా రేటు బాగుండాది. శానా సంతోషంగా ఉండాది. ఉల్లిగడ్డలు వేసిన రైతులంతా ఆనందంగా ఉండారు. – గిడ్డయ్య, బండపల్లి, దేవనకొండ మండలం, కర్నూలు జిల్లా ప్రజలపై భారం పడకుండా చర్యలు 2014 తర్వాత ఈ ఏడాది ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రభుత్వం నన్ను నాసిక్ పంపించింది. ఆరు రోజులు అక్కడ ఉండి 350 టన్నుల ఉల్లి కొనుగోలు చేశాం. ప్రభుత్వం ఎక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రజలకు రూ.25కే విక్రయించి ఉపశమనం కల్పిస్తోంది. నెలాఖరుకు కర్నూలు జిల్లాతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలోనూ ఉల్లి దిగుబడులు పెరగనున్నాయి. ఎగుమతులు తగ్గడం, దిగుమతి చేసుకోవడం, దేశీయంగా ఉత్పత్తులు పెరగనుండటంతో ఉల్లి ధరలు దిగొచ్చే అవకాశం ఉంది. – సత్యనారాయణ చౌదరి, ఏడీ, మార్కెటింగ్ శాఖ 6 నెలలుగా కర్నూలు మార్కెట్లో ఉల్లి ధరలు -
టమాటా రైతు పంట పండింది!
కర్నూలు జిల్లాలోని ఆదోని, కర్నూలు రెవెన్యూ డివిజన్ల పరిధిలో టమాటా విస్తారంగా సాగవుతోంది. ప్రస్తుతం జిల్లా మొత్తం మీద ఆరు వేల హెక్టార్ల వరకు సాగులో ఉంది. టమాటా మార్కెటింగ్‌కు పత్తికొండ కేంద్ర బిందువు. ఇక్కడి నుంచే దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తారు. సాక్షి, అమరావతి, కర్నూలు (అగ్రికల్చర్), పత్తికొండ : టమాటా రైతును ఆర్థికంగా దెబ్బ తీసేందుకు వ్యాపారులు, దళారీలు వేసిన ఎత్తులను వైఎస్ జగన్ సర్కారు రెండో రోజు కూడా చిత్తు చేసింది. ధరల స్ధిరీకరణ నిధితో శనివారం కర్నూలు జిల్లాలో 100 మెట్రిక్ టన్నుల టమాటాను మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేసిన విషయం విదితమే. దీంతో వ్యాపారులు కిలో టమాటా ధరను రూ.14 నుంచి రూ.19కి పెంచి కొనుగోలు చేశారు.టమాటాకు గిట్టుబాటు ధర వచ్చే వరకు మార్కెటింగ్ శాఖ చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేయడంతో ఆదివారం కూడా ఆ శాఖ అధికారులు కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డుపై దృష్టి కేంద్రీకరించారు. దీంతో దిగివచ్చిన వ్యాపారులు రైతుల నుంచి కిలో రూ.20 నుంచి రూ.22 చొప్పున కొనుగోలు చేశారు. మార్కెటింగ్ శాఖ కూడా 8 టన్నుల టమాటా కొనుగోలు చేసింది. ఆ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ, కమిషనర్ ప్రద్యుమ్నలు ఆదివారం కర్నూలు జిల్లాలో టమాటా అమ్మకాల గురించి గంటకోసారి ఆరా తీశారు. మార్కెట్ యార్డు బయట కొనుగోళ్లు జరపకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ధరల స్థిరీకరణ నిధితో రైతులకు భరోసా సీఎం ఆదేశాలతో శని, ఆదివారాల్లో ధరల స్ధిరీకరణ నిధితో కర్నూలు జిల్లాలో మార్కెటింగ్ శాఖ టమాటా కొనుగోలు చేపట్టింది. రైతుకు న్యాయం జరిగే వరకు అక్కడ మార్కెటింగ్ శాఖ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. – మంత్రి మోపిదేవి వెంకటరమణ -
టమాటా రైతుకు సీఎం బాసట
రాష్ట్రంలో టమాటా మార్కెట్‌కు ఆ ప్రాంతం పెట్టింది పేరు.. కొద్ది రోజులుగా ధర కూడా బాగానే ఉంది.. రోజూ లాగే పెద్ద ఎత్తున రైతులు పంటను మార్కెట్‌కు తీసుకొచ్చారు.. పంట ఎక్కువగా రావడం చూసిన దళారులకు కన్ను కుట్టింది.. వారి కనుసైగలతో నిమిషాల వ్యవధిలో ధర భారీగా పడిపోయింది.. అందరి నోటా ఒకే మాట.. వారు చెప్పిన ధరకే సరుకు అమ్ముకుని పోవాలని హుకుం.. నిశ్చేషు్టలవ్వడం రైతుల వంతైంది.. ఏం చేయాలో పాలుపోక తర్జనభర్జన పడ్డారు.. అంతలో విషయం సీఎం దాకా వెళ్లింది. ధరల స్థిరీకరణ నిధి ఉపయోగించి సరుకు కొనుగోలు చేయాలంటూ మార్కెటింగ్ శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి.. ఆ వెంటనే వారు రంగంలోకి దిగారు.. కిలోకు రూ.4 అధికంగా ఇచ్చి కొనుగోళ్లు మొదలు పెట్టారు.. దళారుల దిమ్మ తిరిగిపోయింది.. ఇలాగైతే తమకు సరుకు దక్కదని వారూ ఆదే రేటుకు కొన్నారు. దళారులను అరికడతామని, ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్న హామీని సీఎం వైఎస్ జగన్ శనివారం కర్నూలు జిల్లాలో అక్షరాలా అమలు చేసి చూపారు. సాక్షి, అమరావతి : దళారులు ధరలతో దగా చేయాలనుకున్న తీరు తిరగబడింది. మార్కెట్లో టమాటా కొనుగోళ్లు నిలిపేసి రైతులకు ఇబ్బందులు సృష్టించాలనుకున్న వ్యూహం బెడిసి కొట్టింది. ముఖ్యమంత్రి దెబ్బకు దిగొచ్చిన దళారులు గత్యంతంర లేక ధర పెంచి కొనుగోలు చేశారు. మార్కెట్ ఫీజు లేకుండా, ఏజెంట్లకు కమీషన్ ఇవ్వకుండా రైతులకు వంద శాతం న్యాయం జరిగేలా పండ్లు, కూరగాయల అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలై నుంచి డీ రెగ్యులేట్ చేసింది. దీంతో తమకు లాభంలేదని భావించిన కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ యార్డులోని దళారులు సమస్యలు సృష్టించారు. మార్కెట్ యార్డులో కొనుగోళ్లు చేస్తే తమకు ఉపయోగం ఉండడం లేదని, లోపల అమ్మకాలు నిలిపివేసి రైతులే బయటకు వచ్చి సరుకు విక్రయించాలని, లేకపోతే కొనుగోళ్లు చేయబోమని బెదిరింపులకు దిగారు. కానీ, రైతులు తాము లోపలే విక్రయాలు చేస్తామని చెప్పడంతో ఇబ్బంది ఏర్పడింది. ఈ సమస్య సీఎం వైఎస్ జగన్ దృష్టికి వెళ్లడంతో వెంటనే రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరిపించాలని మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ధరల పతనం కాకుండా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బంది ఉండకూడదని.. ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు. వెంటనే మార్కెటింగ్ శాఖ నుంచి కొనుగోళ్లు మొదలు పెట్టాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన మార్కెటింగ్ శాఖ.. శనివారం టమాటా కొనుగోళ్లను ప్రారంభించింది. కిలోకు అదనంగా రూ.4 ఇచ్చి కొనుగోళ్లు మొదలెట్టింది. ఇలా 50 టన్నుల టమాటా కొనుగోలు చేసింది. నేరుగా తాము కొనుగోళ్లు జరపడం వల్ల రూ.14, రూ.15 ఉన్న కిలో టమాటా ధర రూ.18, రూ.19కి పెరిగి రైతులకు లాభం చేకూరింది. దీంతో అవాక్కయిన దళారులు తాము నష్టపోతామని భావించి వెంటనే మార్కెట్లోనే కొనుగోళ్లు చేయడం మొదలు పెట్టారు. దీంతో వారు కూడా శనివారం 100 మెట్రిక్ టన్నుల టమాటాను కోనుగోలు చేశారు. నాలుగు నెలల్లోనే గిట్టుబాటు ధర విషయమై సీఎం మాట నిలుపుకున్నారని రైతులు ప్రశంసించారు. దళారులపై ఫిర్యాదు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధి వల్ల వెంటనే కొనుగోళ్లు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయగలిగామని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. రైతులను ఇబ్బందులకు గురిచేసిన ఏజెంట్లపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. ఈ ఏడాది జూలై నుంచి మార్కెట్ డి రెగ్యులేషన్‌ను ప్రారంభించామని, దీనివల్ల రైతులకు పూర్తిగా న్యాయం జరుగుతుందని కమిషనర్ చెప్పారు. ప్రభుత్వం మా పక్షాన నిలిచింది పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో టమాటా అమ్మకాలు సవ్యంగా జరిగితే రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు సౌకర్యాలు ఉంటాయి. కానీ రైతులకు లాభాలు రాకుండా దళారులు అడ్డుపడుతుంటారు. టమాటా రైతుల కష్టాలను తెలుసుకుని సీఎం వైఎస్ జగన్ వెంటనే స్పందించి ఆదేశాలు ఇవ్వడం వల్లనే అధికారులు కదిలి వచ్చి సమస్యను పరిష్కరించారు. – రామచంద్ర, రైతు, దూదేకొండ, పత్తికొండ మండలం రైతులకు ఇబ్బంది లేకుండా చేశారు టమాటా రైతుల ఇబ్బందులపై సీఎం వైఎస్ జగన్ స్పందించడం హర్షణీయం. రైతులకు ఇబ్బంది లేకుండా పత్తికొండ మార్కెట్ యార్డులోనే అమ్మకాలు జరిగేలా చూశారు. గిట్టుబాటు ధర కల్పిస్తామని, దళారుల బెడద లేకుండా చేస్తామని ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాట నిలుపుకున్నారు. గ్రేట్ సీఎంకు ధన్యవాదాలు. – రాజశేఖర్, రైతు, చక్రాళ్ల, పత్తికొండ మండలం -
మార్కెట్ చైర్మన్లలో సగం మహిళలకే
సాక్షి, తాడేపల్లి : మార్కెట్ యార్డులకు వెంటనే కమిటీల నియామయం జరపాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కమిటీలలో 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని సూచించారు. గురువారం ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మార్కెటింగ్, సహకార శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు. పంట ప్రారంభంలోనే మద్దతు ధర ప్రకటించాలని ఆదేశించారు. అక్టోబర్ చివరి వారంలోగా పప్పు ధాన్యాలకు మద్దతు ధర ప్రకటించాలన్నారు. నియోజకవర్గాల స్థాయిలో గోడౌన్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. అన్ని పంటలకు ఈనామ్ అమలు చేయాలన్నారు. ఆరు నెలల్లో దళారి వ్యవస్థను రూపుమాపాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. సమీక్షలో చర్చించిన ముఖ్యాంశాలు : పంటలకు లభిస్తున్న ధరలు, మార్కెట్లపై నిరంతర సమాచారం మూడు మార్గాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, వాటికున్న డిమాండ్, వివిధ ప్రాంతాల్లో ధరలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇప్పుడున్న అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు, అగ్రివాచ్‌తో సహా మరో ఏజెన్సీ ఏర్పాటుకు గత సమీక్షలో సీఎం నిర్ణయం, దీనిపై ప్రతిపాదనలు వివరించిన అధికారులు వ్యవసాయ ఉత్పత్తుల భవిష్యత్ ధరలు, బిజినెస్ కన్సల్టెన్సీ, ధరల స్థిరీకరణ నిధి నిర్వహణ, వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడం ఈ ఏజెన్సీ విధులుగా ఉండాలని సీఎం దిశానిర్దేశం నిపుణులను ఇందులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం పప్పు ధాన్యాల కొనుగోళ్ల కోసం కేంద్రాలు కొనుగోలు కేంద్రాలపై ఆరాతీసిన ముఖ్యమంత్రి అన్ని పంటల వివరాలను ఆన్లైన్లో రైతులు నమోదు చేయించుకోవాలన్న అధికారులు ఆరుతడి పంటలపై అక్టోబరు 10 నుంచి రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న అధికారులు అక్టోబరు 15 నుంచి కొనుగోలు ప్రారంభిస్తామన్న అధికారులు ధరల స్థిరీకరణ, మార్కెట్లో ప్రభుత్వ జోక్యం 85 రైతు బజార్లలో రూ.25 లకే కిలో ఉల్లిపాయలు విక్రయించామన్న అధికారులు 660 మెట్రిక్ టన్నులు వినియోగదారులకు ఇచ్చామన్న అధికారులు రూ. 32 లకే కిలో ఉల్లి ధరను అదుపు చేయగలిగామన్న అధికారులు మళ్లీ ధరలు పెరిగిన క్రమంలో ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్న అధికారులు రాష్ట్రంలో ఇప్పుడు సరిపడా నిల్వలు ఉన్నాయా? లేదా? అని అధికారులను సీఎం జగన్ ఆరా తీయగా.. సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పిన అధికారులు టమోటా రైతులను కూడా ఆదుకున్నామన్న అధికారులు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో మార్కెటింగ్ అవకాశాలు చూసి ఆమేరకు చర్యలు తీసుకున్నామన్న అధికారులు చిరు ధాన్యాల హబ్ గా రాయలసీమ రాయలసీమ ప్రాంతాన్ని మిల్లెట్స్ హబ్‌గా మార్చాలన్న సీఎం 9 నెలలపాటు గ్రీన్ కవర్ ఉండేలా చూడాలన్న సీఎం మిల్లెట్స్ బోర్డులో కూడా నిపుణులకు పెద్దపీట వేయాలని ఆదేశించారు వ్యవసాయ విధానాలు, మార్కెటింగ్, ప్రాససింగ్ అన్నీ బోర్డు పరిధిలో ఉంచాలని సీఎం ఆదేశించారు మిల్సెట్స్ బోర్డు విధివిధానాలపై సమావేశంలో చర్చ, అక్టోబరు చివరినాటికి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్న సీఎం పంటలు వేసేముందే.. ధరలప్రకటన కందులు, మినుములు, పెసలు, శెనగలు, టమోటా, పత్తి పంటలకు భవిష్యత్తు ధరలు ఎలా ఉంటాయన్నదానిపై సమావేశంలో చర్చ ధరల విషయంలో ప్రభుత్వం జోక్యంచేసుకున్న తర్వాత పరిస్థితి కచ్చితంగా మారాలన్న సీఎం రైతులకు కచ్చితంగా భరోసా ఇచ్చామన్న నమ్మకం కలగాలన్న సీఎం పంట వేసినప్పుడు వాటికి ధరలు ప్రకటించే పరిస్థితి ఉండాలన్న సీఎం జగన్ ఆదేశించారు. ఆ ధర ఏమాత్రం తగ్గుతున్నా.. ఆదుకోవడానికి తగిన ప్రణాళికలతో ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని సూచించారు దళారీలకు పంటలను తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండకూడదన్న సీఎం దళారులు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు విక్రయాలు జరగాలి 6 నెలల్లోగా దళారీ వ్యవస్థను నిర్మూలించాలి, అధికారులు దీన్ని సవాల్‌గా తీసుకోవాలని సీఎం జగన్ సూచన గ్రామ సచివాలయాల్లోనే ఈ క్రాప్ వివరాలు, ధరలు ప్రకటించాలన్న సీఎం రైతులకు నేరుగా కాల్చేసి సహాయం అడిగే అవకాశం ఉండాలన్న సీఎం దీనివల్ల ప్రైవేటు వ్యక్తులుకూడా మంచి ధరలకు రైతులనుంచి కొనుగోలుచేస్తారన్న సీఎం ఇ–క్రాప్ నమోదుపై వాలంటీర్ల ద్వారా రైతులకు సమాచారం ఇవ్వాలన్న సీఎం కనీస మద్దతు ధరలు లేని పంటలకూ ధరలు ప్రకటించాలన్న సీఎం రైతుకు నష్టం రాకుండా ఉండేలా ఈధరలు నిర్ణయించాలన్న సీఎం పంటల దిగుబడులు కూడా ఏస్థాయిలో ఉంటాయన్నదానిపై అంచనాలు రూపొందించాలన్న సీఎం మార్కెట్ ఛైర్మన్లలో సగం పదవులు మహిళలకే మార్కెట్ ఛైర్మన్లలో సగం మహిళలకే ఇవ్వాలని సీఎం ఆదేశం కమిటీల్లో కూడా సగం మహిళలకే ఇవ్వాలని ఇదివరకే జీవో ఇచ్చామన్న సీఎం అక్టోబరు చివరినాటికి భర్తీకి చర్యలు తీసుకోవాలన్న సీఎం సహకార బ్యాంకులు, సహకార రంగం పటిష్టానికి చర్యలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల నష్టాలపై ఒక కమిటీ వేయాలన్న సీఎం వాటిని తిరిగి బలోపేతం చేయడంపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం ప్రస్తుతం ఉన్న సమస్యలు, దీన్ని పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర ప్రణాళిక తయారుచేయాలన్న సీఎం అవినీతి, పక్షపాతానికి తావులేని విధానం ఉండాలన్న సీఎం సహకారరంగాన్ని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించాలన్న సీఎం ఈ వ్యవస్థని బాగుచేయడానికి ఏంచేయాలో అదిచేద్దామన్న సీఎం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను కంప్యూటరీకరించే దిశగా చర్యలు తీసుకుంటామన్న సీఎం ప్రతిష్టాత్మక సంస్థతో సమగ్ర పరిశీలన, అధ్యయనం చేయించాలన్న సీఎం ఆప్కో పునరుద్ధరణ, బలోపేతంపైనకూడా అధ్యయనం చేయించాలని సీఎం ఆదేశం నిర్ణీత కాలవ్యవధిలోగా ఈ ప్రక్రియ పూర్తికావాలన్న సీఎం 6 నెలల్లో మొత్తం అధ్యయనం, సిఫార్సుల అమలు మొదలు కావాలన్న సీఎం -
నగరంలో మరో బస్టాండ్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అధునాతన ఇంటర్సిటీ బస్టాండ్ ఏర్పాటు కానుంది. 21 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొత్తపేట పండ్ల మార్కెట్ స్థలంలో బస్టాండ్ ప్రాంగణం, దిల్సుఖ్నగర్, హైదరాబాద్–3 డిపోలను నిర్మించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించి నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించనుంది. మెట్రోరైల్ స్టేషన్‌తో అనుసంధానిస్తూ నిర్మించే ఈ ప్రాంగణం విజయవాడవైపు రాకపోకలు సాగించే జిల్లా బస్సులతోపాటు దిల్సుఖ్నగర్ మీదుగా ప్రయాణించే సిటీ బస్సులకు కూడా కేంద్రంగా మారనుంది. నగరంలో ఇప్పటికే ఉన్న ఎంజీబీఎస్, సికింద్రాబాద్‌లోని జేబీఎస్ బస్టాండ్ల తర్వాత ఇది మరో పెద్ద బస్టాండ్‌గా ఏర్పడనుంది. వాణిజ్యపరంగా కీలక ప్రాంతం కావడంతో కొత్తపేటలో బస్టాండ్‌ను వాణిజ్య హంగులతో నిర్మిస్తే ఆర్టీసీకి పెద్ద ఆదాయ వనరుగా మారనుంది. అయితే ఇది భారీ ఖర్చుతో కూడుకోవడం, ఆర్టీసీకి అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో ప్రభుత్వం సహకరిస్తేనే ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. కొత్త బస్టాండ్ వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉండటం, దిల్సుఖ్నగర్ ట్రాఫిక్ సమస్యను తగ్గించే ప్రాజెక్టు కావడంతో ప్రభుత్వం కూడా ఇందుకు సహకరిస్తుందన్న ఆశతో ఆర్టీసీ ఉంది. – సాక్షి, హైదరాబాద్ కొత్తపేట మార్కెట్ తరలింపుతో... కొత్తపేటలోని పండ్ల మార్కెట్‌కు నిత్యం వందల సంఖ్యలో లారీలు వస్తుండటంతో ఆ ప్రాంతంలో తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. వాణిజ్యపరంగా కీలక ప్రాంతం కావడంతో షాపింగ్ మాల్స్, విద్యాసంస్థలు, చిరువ్యాపారాలు అక్కడ అధికం. కొత్తపేట పరిసరాల్లో వందల సంఖ్యలో కాలనీలు ఉండటం, గత పదేళ్లలో అక్కడ భారీగా అపార్ట్మెంట్లు వెలియడంతో జనాభా కూడా పెరిగి రోడ్లపై వాహనాల సంఖ్య పెరిగిపోయింది. వెరసి కీలక సమయాల్లో గంటల తరబడి ట్రాఫిక్‌జాం నెలకొంటోంది. మెట్రోరైలు అందుబాటులోకి వచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని కొత్తపేట పండ్ల మార్కెట్‌ను అక్కడి నుంచి తరలించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఔటర్ రింగురోడ్డుకు చేరువగా ఉన్న కోహెడలో ఇందుకు స్థలాన్ని సేకరించింది. త్వరలో మార్కెట్ అక్కడికి మారనుంది. మార్కెట్ తరలింపుతో కొత్తపేటలో 21 ఎకరాల స్థలం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం దిల్సుఖ్నగర్ ప్రధాన రహదారిపై బస్టాండ్ ఉంది. విజయవాడ వైపు వెళ్లే బస్సులతోపాటు సిటీ బస్సులు అక్కడ ఆగుతాయి. ఆ పక్కనే దిల్సుఖ్నగర్, హైదరాబాద్–3 డిపోలున్నాయి. వెరసి ఆ రోడ్డు చిక్కుముడిలా మారింది. దీంతో ఆర్టీసీ ప్రాంగణాలను కొత్తపేట మార్కెట్ స్థలంలోకి తరలించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. విజయవాడ వైపు నిత్యం వందలాదిగా వచ్చే బస్సులను కొత్తపేట బస్టాండ్ వరకే పరిమితం చేస్తే ఎంజీబీఎస్పైనా భారం తగ్గుతుందని ఆర్టీసీ భావిస్తోంది. కరీంనగర్, ఆదిలాబాద్, సిద్దిపేట, నిజామాబాద్‌ల వైపు నుంచి వచ్చే బస్సుల్లో మూడొంతులను సికింద్రాబాద్‌లోని జేబీఎస్‌కే పరిమితం చేయడం వల్ల ట్రాఫిక్ తగ్గిందని, ఇదే పద్ధతిని కొత్తపేట బస్టాండ్ వద్ద అమలు చేయాలనుకుంటోంది. ఆర్టీసీకి ఆదాయ వనరు... దిల్సుఖ్నగర్ ప్రాంతం వాణిజ్యపరంగా కీలకమైంది. ఇక్కడ ఆర్టీసీ షాపింగ్ మాల్ నిర్మిస్తే ఎంతో ఆదాయం సమకూరుతుంది. మల్టీప్లెక్స్‌లు, గేమింగ్ జోన్, రెస్టారెంట్ల వంటివి ఏర్పాటు చేయడం ద్వారా సొంతంగా ఆదాయాన్ని ఆర్జించ వచ్చని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు దిల్సుఖ్నగర్ ప్రధాన రహదారిపై 8 ఎకరాల్లో ఉన్న బస్టాండ్, రెండు డిపోలను తొలగించి ఆ స్థలంలో భారీ మల్టీలెవల్ పార్కింగ్ టవర్ నిర్మించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. కొత్తపేట మార్కెట్ స్థలాన్ని ఆర్టీసీకి కేటాయిస్తే, ఆర్టీసీ తన స్థలాన్ని జీహెచ్ఎంసీకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. వీటన్నింటిపై నిర్ణయం తీసుకునేందుకు త్వరలో ఆర్టీసీ, మార్కెటింగ్‌శాఖ, జీహెచ్ఎంసీ, పురపాలన, పట్టణాభివృద్ధిశాఖల ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. -
వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు సమీకృత సాఫ్ట్వేర్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర, కొనుగోలుకు సంబంధించి సమీకృత సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఆదేశించారు. కొనుగోలు సమయంలో రైతులకు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తుల వివరాలను సంబంధిత సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం చేసి, కొనుగోలు సంస్థలకు అందుబాటులో ఉంచాలన్నారు. ఖరీఫ్‌లో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలపై సంబంధిత ప్రభుత్వ శాఖల సన్నద్ధతపై అధికారులతో శుక్రవారం పార్థసారథి సమీక్షించారు. ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల సంస్థ, పత్తి కొనుగోలుకు మార్కెటింగ్ శాఖ, ఇతర పంటలకు సంబంధించి నాఫెడ్‌లు ఇప్పటికే నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సహకారంతో వివిధ సాఫ్ట్వేర్లను రూపొందించాయన్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌ల్లోని లోటుపాట్లను సవరిస్తూ సమీకృత సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయాలన్నారు. రైతుల నుంచి వ్యవసాయ శాఖ అధికారులు సేకరిస్తున్న సమాచారాన్ని మార్కెటింగ్ సంస్థలకు అందించేందుకు త్వరలో జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. తద్వారా రాబోయే సీజన్లో పంటల వారీగా కొనుగోలు కేంద్రాలు, ఇతర ఏర్పాట్లపై ప్రణాళిక రూపొందించడం మార్కెటింగ్ సంస్థలకు సులభమవుతుందన్నారు. పంట వేయక ముందే ఎంత ధర పలుకుతుందనే సమాచారమిచ్చే వ్యవస్థను ఇప్పటికే మార్కెటింగ్ శాఖ సహకారంతో వ్యవసాయ వర్సిటీ రూపొందించిందన్నారు. ఈ సమాచారాన్ని రైతు వద్దకు తీసుకెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాల న్నారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి, మార్క్‌ఫెడ్, హాకా ఎండీ భాస్కరాచారితో పాటు మార్క్‌ఫెడ్, హాకా, నాఫెడ్, గిడ్డంగుల సంస్థ, ఎఫ్‌సీఐ, సీసీఐ, వ్యవసాయ వర్సిటీ, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
రైతులు అమ్మిన పంటకు తక్షణ చెల్లింపులు
సాక్షి, హైదరాబాద్ : అసంపూర్తిగా ఉన్న మార్కెటింగ్ గోదాముల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగిం చాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు.రైతుల ఉత్పత్తులకు మద్దతు ధర చెల్లించి వారినుంచి కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు తక్షణమే డబ్బులు చెల్లించాలన్నారు. అవసరమైన చోట గోదాములకు మరమ్మతులు చేయాలని, ఖాళీగా ఉన్న వాటిని గిడ్డంగుల శాఖకు అప్పగించి వినియోగంలోకి తేవాలన్నారు. సచివాలయంలో శనివారం మార్కెటింగ్ శాఖ కార్యకలాపాలపై మంత్రి నిర్వహించిన సమీక్షలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, మార్కెటింగ్ విభాగం డైరెక్టర్ లక్ష్మీబాయి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పౌర సరఫరాలు, వేర్‌హౌసింగ్ విభాగం నుంచి మార్కెటింగ్ శాఖకు రావాల్సిన అద్దె బకాయిలకు గాను సంబంధిత విభాగాల అధికారులు సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి, వసూలు చేయాలని మంత్రి ఆదేశించారు.పంటల సాగు విస్తీర్ణంతోపాటు, దిగుమతి వివరాలపై వ్యవసాయ అధికారులు కచ్చితమైన సమాచారం సేకరించాలన్నారు. మలక్‌పేటలోని ఉల్లిగడ్డల మార్కెట్‌ను పటాన్‌చెరుకు, గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ కోహెడకు, ఖమ్మం మిర్చి యార్డును మద్దులపల్లికి తరలించేందుకు కొత్త భవనాలు నిర్మించాలన్నారు. వనపర్తిలో కొత్త మార్కెట్ యార్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.అవసరమైన ప్రాజెక్టు రిపోర్టు, నిధుల సేకరణ, షాపుల కేటాయింపు తదితరాల కోసం ప్రతీ మార్కెట్‌కు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. మార్కెట్ ఫీజు ఎగవేతకు అడ్డుకట్ట మార్కెట్ యార్డుల్లో పంటను అమ్మిన రైతులకు కంప్యూటరైజ్డ్ తక్‌పట్టీలు ఇవ్వాలని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. వ్యాపారులు మార్కెట్ ఫీజు ఎగవేయకుం డా వసూలు చేసి ఆదాయాన్ని పెంచాలన్నా రు. రైతు బజార్లలో నకిలీ రైతులను ఏరివేసి సదుపాయాలు మెరుగు పరచాలన్నారు. కూరగాయల ధరలు నియంత్రణలో ఉండేలా అప్రమత్తంగా ఉండాలన్నారు. హైదరాబాద్ నగరంలో 60 ‘మన కూరగాయల స్టాళ్ల’ద్వారా నగర వాసులకు తాజా కూరగాయలు అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు వివరించారు. నగరం లో మరో 40 స్టాళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంటల సాగు నుంచి ఉత్పత్తి, అమ్మకం వరకు రైతులకు ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, పౌర సరఫరాలు, మార్క్‌ఫెడ్ శాఖ లు సమీక్ష చేసుకొని సమన్వయం తో పనిచేయాలని సూచించారు. -
ఎండలాగే మండుతున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న ఎండలతోపాటే రాష్ట్రంలో కూరగాయల ధరలు మండుతున్నాయి. రోజురోజుకీ తీవ్రమవుతున్న ఎండల కారణంగా భూగర్భ జలాల్లో భారీ క్షీణత ఏర్పడి కూరగాయల ధర లు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రాష్ట్రీయంగా కూరగాయల దిగుబడులు తగ్గడం, బయటి రాష్ట్రాల నుంచి రావాల్సినంతగా దిగుమతి లేకపోవడం ధరలు అమాంతంగా పెరిగేందుకు కారణం. ఎండలు మరింత ముదిరిన పక్షంలో వచ్చే మూడు నెలల్లో ధరలు మరింత ఎగబాకే అవకాశం ఉంది. అన్నింటి ధరలూ పైపైకే.. రాష్ట్రంలో ప్రస్తుత సీజన్లో 3లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు జరిగింది. అయితే సాగుకు తగినట్టు నీటి లభ్యత లేదు. ప్రస్తుత సీజన్లో చెరువులతో పాటు భూగర్భ జలాల్లో భారీ క్షీణత కనబడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చి మొదటి వారానికే భూగర్భ జలాలు పడిపోయాయి. రాష్ట్ర సగటు భూగర్భ మట్టం మార్చి మొదటి వారానికి గత ఏడాది 11.91 మీటర్లు ఉండగా, ఈ ఏడాది అది 12.53 మీటర్లకు పడిపోయింది. ఏకంగా 1.56 మీటర్ల మేర తగ్గుదల కనిపించింది. ముఖ్యంగా కూరగాయల సాగు అధికంగా జరిగే మెదక్‌లో 22.28 మీటర్లు, వికారాబాద్ 19.19 మీటర్లు, రంగారెడ్డిలో 17.32 మీటర్లు, సిద్దిపేటలో 18.92 మీటర్లకు నీటి మట్టాలు తగ్గాయి. ఈ ప్రభావం కూరగాయల సాగుపై పడింది. ఈ నేపథ్యంలో కిందటి నెల పచ్చిమిర్చి కిలో రూ.30 ఉండగా తాజాగా హోల్‌సేల్ మా ర్కెట్లలోనే వీటి ధర రూ.50కి చేరింది. ఇక రిటైల్ వ్యాపారులు ఏకంగా కిలో రూ.70కి పెంచి అమ్ముతున్నారు. బెండ, దొండకాయల ధరలు గత నెలలో కిలో రూ.20 నుంచి రూ.25 వరకు ఉండగా, ప్రస్తుతం కిలో రూ.40 నుంచి రూ.50 పలుకుతోంది. బీన్స్‌ఏకంగా రూ.70 ఉండగా, చిక్కుడు రూ.60, గోరుచిక్కుడు రూ.45, క్యాప్సికం రూ.60, వంకాయ రూ.40 మేర పలుకుతోంది. క్యాలిఫ్లవర్, క్యాబేజీ ధరల్లోనూ ఇదే తరహా పెరుగుదల కనిపిస్తోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ నగరానికి రోజూ వచ్చే కూరగాయలతో పోలిస్తే ప్రస్తుత దిగుమతులు సగానికి పడిపోయినట్టు మార్కెటింగ్ శాఖ చెబుతోంది. నీటి సమస్యే ఇందుకు ప్రధాన కారణమని అంటోంది. నీటి కరువు కారణంగా ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే కూరగాయల దిగుమతులు భారీగా పడిపోయాయి. ఇవి ప్రధానంగా బెండ, దొండ, క్యారెట్, క్యాబేజీ ధరలు పెరిగేందుకు కారణమవుతోంది. క్యాప్సికం కర్ణాటక, మహారాష్ట్రల నుంచే వస్తుండగా, వీటి దిగుమతులు 500 క్వింటాళ్ల నుంచి 300 క్వింటాళ్లకు తగ్గాయి. వంకాయ సైతం కేవలం 30 క్వింటాళ్ల మేరే దిగుమతి అవుతోంది. ఇతర కూరగాయలదీ ఇదే పరిస్థితి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ లోటు వర్షపాతాలు నమోదు కావడం, అక్కడ కూరగాయల సాగుపై దీని ప్రభావం ఉండే అవకాశాల నేపథ్యంలో నిండు వేసవిలో ధరల పెరుగుదల మరింతగా ఉండనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. -
అ‘ధన’పు కష్టం
సాక్షి, కొత్తగూడెం: మార్కెటింగ్ శాఖకు ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరట్లేదు. ఇందుకు అనేక రకాల కారణాలు కనిపిస్తున్నాయి. కందులు, మొక్కజొన్నలకు ఫీజు మినహాయింపునివ్వడం, పత్తి దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోవడం, కొన్ని చెక్‌పోస్టులు ఇతర జిల్లాల్లోకి వెళ్లడం, పౌరసరఫరాల శాఖ, సీసీఐ బకాయిల చెల్లింపు ప్రక్రియ పూర్తి కాకపోవడం వంటి కారణాలన్నీ కూడా అదనపు ఆటంకాలుగానే మారాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, 2018–19లో జిల్లాలో మార్కెటింగ్ శాఖ ఆదాయం తగ్గుతోంది. మొత్తం 59 గోదాములు, 20 చెక్‌పోస్టులు ఉన్నాయి. కందులు, మొక్కజొన్న పంటలకు ఒకశాతం మార్కెట్ ఫీజు మినహాయింపునివ్వడం, పత్తి దిగుబడి తగ్గడంతో మార్కెటింగ్ ఆదాయంపై గట్టి ప్రభావం పడింది. కొన్ని చెక్‌పోస్టులు ఇతర జిల్లాల్లోకి వెళ్లడంతో పాటు పోలవరం విలీన మండలాల్లో కొన్ని ఉండిపోవడంతో కచ్చితంగా ఆదాయానికి గండి పడింది. దీనికి తోడు పౌరసరఫరాల శాఖ, కాటన్ కార్పొరేషన్ (సీసీఐ) ద్వారా బకాయిలు పెండింగ్‌లో ఉండడంతో ఆదాయ లక్ష్యాన్ని సాధించడంలో వెనుకంజలో ఉంది. కొన్ని గోదాములను ఎన్నికల సామగ్రి భద్రపరిచేందుకు ఉపయోగిస్తుండగా, అత్యధిక గోదాముల్లో పౌరసరఫరాల శాఖ వారి ధాన్యం, సీసీఐ వారి పత్తిని నిల్వ ఉంచారు. వీటి ద్వారా రావాల్సన ఆదాయ బకాయిలు మాత్రం నెలల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. బకాయిల క్రమం ఇలా.. సీసీఐ ద్వారా మార్కెటింగ్ శాఖకు ఇప్పటివరకు రూ.50 లక్షలకుపైగా బకాయి నిధులందాల్సి ఉంది. పౌరసరఫరాల శాఖ ద్వారా రూ.3 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నాయి. ఇందులో గతేడాదికి సంబంధించి రూ.కోటి, ఈ సంవత్సరానికి రూ.2కోట్లు రావాల్సి ఉంది. అయితే పౌరసరఫరాల శాఖ వాళ్లు ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన ఫీజును తదుపరి ఏడాదిలో చెల్లిస్తుండడంతో బకాయిలు ఎక్కువగా పేరుకుపోతున్నాయి. ఇక పత్తి పంట ద్వారా ఆదాయం ఎక్కువగా వస్తుందని అంచనా వేసినప్పటికీ ఆ మేరకు సాధించలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో మొత్తం 47,294 హెక్టార్లలో రైతులు పత్తి పంటను సాగు చేశారు. అయితే ఇందులో ఎకరానికి 8 నుంచి 9 క్వింటాళ్ల మేర దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అయితే భారీగా తగ్గిపోవడంతో ఈ ప్రభావం మార్కెటింగ్ శాఖ ఆదాయంపైనా పడింది. ఎకరానికి కేవలం 2 నుంచి 3 క్వింటాళ్ల పత్తి మాత్రమే దిగబడి రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మొత్తం 9,59,000 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని భావించగా, అది మూడోవంతుకు కూడా రాలేదు. గతేడాది ఈ సమయానికి జిల్లాలోని బూర్గంపాడు, దమ్మపేట, ఇల్లెందు, భద్రాచలం, కొత్తగూడెం, చర్ల మార్కెట్ కమిటీల ద్వారా అనుకున్న లక్ష్యంలో 5.85 శాతం ఎక్కువగా ఆదాయం సాధించగా ఈసారి మాత్రం తగ్గింది. మొత్తంగా చూస్తే ఈ ఏడాది 45.64 శాతం తక్కువగా ఉంది. -
దళారుల చేతిలో మిర్చి రైతు నిలువుదోపిడీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మిర్చి ధర భారీ గా పతనం కావడంతో.. వ్యాపారులు, దళారులు విశ్వరూపం చూపిస్తున్నారు. దీంతో బాధిత రైతులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) లేకపోవడంతో.. దళారులు, వ్యాపారులు చెప్పేదే రేటుగా మారిపోయింది. రెండు మూడు నెలల్లోనే భారీగా ధరలు పడిపోవడంతో అన్నదాతలు నష్టాలపాలవుతున్నారు. దళారులు, వ్యాపారులను నియంత్రించే వ్యవస్థ లేకపోవడంతో మిర్చి రైతులకు అన్యాయం జరుగుతోంది. ఏదో ఒక సాకు చెప్పి కీలక సమయంలో ధరలను తగ్గించేస్తున్నారు. మార్కెట్ అధికారులు కూడా దళారులతో కుమ్మక్కై రైతులను పట్టించుకోవడం లేదు. ఉన్నతస్థాయి యంత్రాంగం కూడా దళారుల ఆగడాలను, అన్యాయాలను అడ్డుకునే దిశగా ఆలోచించడం లేదు. వరంగల్ జిల్లాలో ఇటీవల రైతులు ఆందోళన చేసినా ప్రభుత్వం, అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నాయి. గతంలో కొన్ని రాష్ట్రాల్లో క్వింటా మిర్చికి రూ.1,500 వరకు బోనస్ ఇచ్చారు. కానీ తెలంగాణలో దీనిపై ఉలుకూ పలుకూ లేదు. వివిధ పంటలను కొంటున్న ప్రభుత్వం మిర్చిని కొనేందుకు ముందుకు రాకపోవడంపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2, 3 నెలల్లో తగ్గిన ధర! రాష్ట్రంలో 2018–19 సీజన్లో మిర్చి 1.15 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 45,025 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 26,895 ఎకరాలు, గద్వాల జిల్లాలో 15,722 ఎకరా లు, వరంగల్ రూరల్ జిల్లాలో 4,485 ఎకరాలు సాగైంది. దేశంలో మిర్చి ఎక్కువగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సాగవుతోంది. ఈసారి తెలంగాణలో 1.29 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి ఉత్పత్తి అవుతుందని అంచనా వేశా రు. ఖమ్మం, మహబూబాబాద్ ప్రాంతంలో ‘తేజ’ రకం మిర్చిని అధికంగా పండిస్తుంటారు. ఈ మిర్చి నుంచి నూనెను తీసి వివిధ రకాలుగా వినియోగిస్తుంటారు. చైనా, మలేసియా, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో ఈ ఆయిల్‌ను కారంగా వినియోగిస్తుంటారు. ఇక్కడ పండించే ‘తేజ’ రకం మిర్చి ఆధారంగా ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో చైనీయులు ఓ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. తేజ రకం మిర్చికి జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నప్పటికీ వివిధ కారణాలతో పంట ఉత్పత్తి సమయంలోనే దళారులు ధరను తగ్గించటం శోచనీయం. జనవరిలో వర్షాలు రావడం, కొన్నిచోట్ల వైరస్ సోకడంతో ఉత్పత్తి పడిపోతుందని రైతులు అంటున్నా రు. అంతా అనుకున్నట్లుగా జరిగితే.. 35–40 క్విం టాళ్ల మధ్య ఉత్పత్తి వస్తుందని, కానీ 20–25 క్విం టాళ్లకు పడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మార్కెట్లో ధర పడిపోవడంతో వీరికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. 2 నెలల క్రితం రూ.11,900 ఉన్న మిర్చి ధర, ఇప్పుడు ఐదారు వేల కు మించడంలేదు. అక్కడక్కడ రూ. 7 వేలకు కొం టున్నారు. మార్కెట్‌కు సరుకు ఎక్కువగా వచ్చిందం టే చాలు వ్యాపారులు సిండికేటుగా మారి ఒక్కసారిగా ధరను పతనం చేస్తున్నారు. వానలకు మిర్చి తడిసిందని దళారులు కారణం చెబుతున్నారు. ధర రూ.10–12 వేల మధ్య ఉంటేనే గిట్టుబాటు అవుతుందని రైతులు అంటున్నారు. ఎగుమతుల్లేవని, నాణ్యత తగ్గిందని..! మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతో ధర తగ్గుతోం దని వ్యాపారులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా మిర్చి ఎగుమతులు లేకపోవటంతో ఈ పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఎగుమతులు నిలిచినందున పంటను కొనుగోలు చేసేవారు ఆసక్తి కనబరచటం లేదని వ్యాపారులంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు, తమిళనాడుకు చెందిన దళారులు రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ల నుంచి మిర్చి కొనుగోలు చేస్తుంటారు. ఉత్పత్తి లేని గత అక్టోబర్, నవంబర్ నెలల్లో మిర్చి ధర రూ.12 వేల వరకు చేరింది. రెండేళ్ల క్రితం గరిష్టంగా రూ.16 వేలకూ అమ్ముడైంది. ఈ ధరతో ఉత్సాహంగా అనేకమంది పంట సాగు చేశారు. పంట చేతికందే సమయానికి రూ.10 వేలైనా ధర వస్తుందని భావించారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని వ్యాపారులు ఇష్టారాజ్యం గా ధరను నిర్ణయించి కొంటున్నారు. కూలీలకు, ఇత ర ఖర్చులకు తెచ్చిన పెట్టుబడులు తీర్చటం కోసం రైతులు పంటను అమ్మక తప్పడంలేదు. దీంతో ఇదే అదనుగా వ్యాపారులు ధరలో మరికొంత కోతబెడుతున్నారు. ఇక పంట తేమగా ఉందని, రంగు మారిందని, ఇటీవల కురిసిన వర్షాలకు పంట తడిసిందని తదితర కారణాలు చెబుతూ తమకు అవసరమైన నాణ్యతా ప్రమాణాల్లో సరుకు లేదంటూ ధరలు తగ్గించడం దోపిడీయే. జెండా పాటకు, కొనుగోళ్లకు పొంతనేదీ? మిర్చి కొనుగోళ్లలో జెండాపాట నిర్వహిస్తారు. నాణ్యమైన సరుకు వద్ద నిర్వహించే జెండాపాటలో వ్యాపారులు పాల్గొని గరిష్ట ధర నిర్ణయిస్తారు. అయితే ఆ ఒక్క లాట్‌కు మాత్రమే జెండాపాట ధర ఉంటుంది. ఇక మార్కెట్‌కు విక్రయానికి వచ్చిన ఇతర సరుకుకు ఆ ధరను వర్తింపజేయరు. కానీ దాన్నే అసలైన ధరగా అధికారులు చెబుతుంటారు. వ్యాపారులు, మార్కెట్ అధికారులు కలిసి కుమ్మక్కవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంటోంది. ధరలో దగా వివిధ కారణాలతో వ్యాపారులు మిర్చి ధరలో దగాకు పాల్పడుతున్నారు. పంట ఉత్ప త్తి సీజన్లో వ్యాపారులు సిండికేటుగా ఏర్పడి ఇష్టారాజ్యంగా ధర నిర్ణయిస్తున్నా రు. క్వింటాలుకు రూ.8,500 పలుకుతుందని పంటను అమ్మడానికి తీసుకొస్తే.. రూ.6,500 లకు అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావటంలేదు. పంట కోసిన కూలీలకు, ఇతరత్రా ఖర్చుల కోసం అమ్మక తప్పటం లేదు. – వెంకటనారాయణ, పెద్దబీరవల్లి, బోనకల్ మండలం, ఖమ్మం జిల్లా పంట లేదు.. ధర లేదు! ఈ ఏడాది మిరపకు తెగుళ్లు విపరీతంగా నష్టం చేశాయి. దీంతో దిగుబడులు గణనీయం గా పడిపోయాయి. ఎకరాకు 40 క్వింటాళ్ల వరకు రావాల్సిన మిర్చి ఈ ఏడాది 15 క్వింటాళ్లకు మించడం లేదు. తెగుళ్ల కారణంగా పెట్టుబడులు కూడా పెరిగాయి. ధరలు ఆశాజనకంగా లేవు. అన్‌సీజన్‌లో రూ.12 వేల వరకు ఉన్న ధర ప్రస్తుతం రూ.7 వేలు దాటడం లేదు. వ్యాపారుల మాయతోనే ఈ స్థితి నెలకొంది. – ఎం.వెంకన్న, పూమ్యాతండా,గార్ల మండలం, మహబూబాబాద్ జిల్లా 1,500 బోనస్ ఇవ్వాలి మిర్చికి ప్రస్తుతం క్వింటాకు రూ.5–6 వేల ధర పలుకుతోం ది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్షాల కారణంగా ఉత్పత్తి తగ్గింది. వ్యాపారులు ఇష్టానుసారంగా ధర నిర్ణయించి రైతులను దోపిడీ చేస్తున్నారు. ఎంఎస్పీ లేకపోవడంతో నియంత్రణ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్వింటా కు రూ.1,500 బోనస్‌గా రైతులకు ఇవ్వాలి. ప్రభుత్వమే మిర్చిని కొనుగోలు చేయాలి. – టి.సాగర్, కార్యదర్శి,తెలంగాణ రైతుసంఘం వర్షాలతో నాణ్యత తగ్గింది కీలకమైన సమయంలో వర్షాలు రావడంతో మిర్చి నాణ్యత తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ధరల్లో హెచ్చుతగ్గులు వస్తున్నాయి. సీజన్లో ఎంతైనా రూ.7 వేలకంటే తగ్గదని అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్ ధర రూ.8 వేల కన్నా ఎక్కువే ధర ఉంది. – లక్ష్మీబాయి, డైరెక్టర్, మార్కెటింగ్‌శాఖ -
కేంద్రం పరిమితులతోనే రైతులకు ఇక్కట్లు
సాక్షి, హైదరాబాద్: పంటల ధర విషయంలో రైతులకు అన్యాయం జరుగుతోందని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మార్కెటింగ్ ఈ–సర్వీసెస్‌ను ప్రారంభించారు. అనంతరం పార్థసారథి మాట్లాడుతూ.. కేంద్రం మద్దతు ధర పెంచిందని, అయితే కొనుగోళ్ల విషయంలో పరిమితులు విధిస్తోందని.. దీనివల్లే రైతులకు సమస్య ఎదురవుతోందని చెప్పారు. రెండేళ్ల నుంచి రికార్డు స్థాయిలో ప్రభుత్వం తరఫున కొంటున్నామన్నారు. కేంద్రం పరిమితి విధించడానికి ఎగుమతి దిగుమతి విధానాలు తదితర అంతర్జాతీయ కారణాలున్నాయన్నారు. అయితే ఇవి రైతులకు సంబంధం లేనివి అయినప్పటికీ వారిపైనే ప్రభావం పడుతోందని తెలిపారు. ఈ విషయాలు రైతులకు అధికారులు వివరించాలన్నారు. మార్కెటింగ్‌శాఖ ఆందుకు సిద్ధంగా ఉండాలని, ధరల విషయంలో ముందుగానే అంచనాలు వేయాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేసుకుని కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. ప్రతీసారి సమీక్షించుకోవాలి.. వ్యవసాయ ఉత్పత్తులన్నీ వినియోగదారులకు చేరుతాయని, వాటి ధరలో రైతు వాటా ఏడాదికేడాది ఎంత పెరుగుతుందనేది ముఖ్యమని పార్థసారథి చెప్పారు. ప్రతిసారీ దీన్ని సమీక్షించుకుని రైతులకు గిట్టుబాటు కల్పిస్తున్నామా లేదా చూసుకోవాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో రైతులు సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వం తరఫున సాయం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. మార్కెట్లలో గత నాలుగేళ్లలో రూ.370 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఈ సర్వీసెస్ ఉపయోగపడుతోందన్నారు. అన్నీ ఆన్లైన్లో చూసుకోవచ్చని చెప్పారు. అయితే ఈ–నామ్లో రాజకీయ ఒత్తిడులు కూడా ఉన్నాయన్నారు. ఈ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా మోడల్ యాక్ట్ విషయంలో జవాబుదారీతనం ఉండాలని వెల్లడించారు. కార్యక్రమంలో మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, పద్మహర్ష తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి పత్తి కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: బుధవారం నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 267 జిన్నింగ్ మిల్స్‌లో పత్తి కొనుగోలు కేంద్రాలను, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 11 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని, రైతులు తొందరపడి పత్తి అమ్మకాలు చేయవద్దని, పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే ధర తక్కువ పలుకుతుందని, తేమ 12% ఉంటే ఎక్కువ ధర అందుతుందని తెలిపారు. పత్తి ఆరిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తేవాలన్నారు. నిజామాబాద్‌లో 40, సిద్దిపేటలో 8, నిర్మల్ జిల్లాలో 21 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్వింటాలు రూ. 1,700 మద్దతు ధరతో కొనుగోలు చేసినట్లు తెలిపారు. పెసల కొనుగోలుకు 6 కేంద్రాలు ఏర్పాటుచేసి రూ.6,975 మద్దతు ధరతో 9,411 క్వింటాళ్ల పెసలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో మినుములు, సోయ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. -
గోదాంలకు స్థలం కొరత
సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్థలం కొరత గోదాంల నిర్మాణానికి అడ్డంకిగా మారింది. జిల్లా, మహానగర అవసరాల మేరకు గిడ్డంకులు నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినా నిర్దేశిత ప్రాంతాల్లో భూమి లభించడం లేదు. మహానగర శివార్లలోని మండల కేంద్రాల్లో గిడ్డంకులు నిర్మించేందుకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఇటీవల జిల్లా యంత్రాంగాన్ని ప్రతిపాదనలు అడిగింది. దీంతో ఆయా మండలాల్లో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు రెవెన్యూ అధికారుల సహకారంతో క్షేత్రస్థాయిలో పర్యటించి స్థల లభ్యత వివరాలు సేకరించారు. ఒక్కో గోదాం నిర్మాణానికి కనీసం ఐదెకరాల భూమి అవసరం. అలాగే గోదాంల వద్దకు వాహనాలు రాకపోకలు జరిపేందుకు వీలుగా రోడ్డు మార్గం అనువుగా ఉండాలి. ఇటువంటి అనుకూలత కోసం రోజుల తరబడి జల్లెడబట్టినా పూర్తిస్థాయిలో స్థలాలు లభించలేదు. ఐదు మండల కేంద్రాల్లో స్థల లభ్యత ఉండగా.. మిగిలిన ఆరు మండలాల్లో కొరత ఉంది. ఐదు చోట్ల భూమి గుర్తింపు.. జిల్లా మార్కెటింగ్ శాఖ పరిధిలో మొత్తం 75,600 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 28 గిడ్డంకులు ఉన్నాయి. జిల్లా, మహానగర జనాభా అవసరాలకు ఇవి ఏమాత్రం సరిపోవడం లేదు. జనాభాకు సరిపడ వ్యవసాయ ఉత్పత్తులు, నిత్యావసర సరుకులు నిల్వ చేసేందుకు భారీ సామర్థ్యం గల గిడ్డంకులు అవసరం. వీటి నిర్మాణానికి నగరంలో స్థలం కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో జిల్లా పరిసర ప్రాంతాల్లోని మండల కేంద్రాల్లో నిర్మించాలని భావించారు. ఈ క్రమంలో నాబార్డు నిధులతో జిల్లాలో 11 గోదాంలు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించాలని మార్కెటింగ్ శాఖ జిల్లా యంత్రాంగాన్ని కోరింది. ఒక్కో గోదాం సామర్థ్యం 5వేల మెట్రిక్ టన్నులు. ఒక్కో గిడ్డంగి నిర్మాణానికి ఐదెకరాల స్థలం అవసరం. వీటి కోసం అన్వేషించగా అబ్దుల్లాపూర్‌మెట్, నందిగామ, శంషాబాద్, కడ్తాల్, చౌదరిగూడలో మాత్రమే స్థలం అందుబాటులో ఉన్నట్లు తేలింది. ఈ మేరకు జిల్లా మార్కెటింగ్ శాఖ నివేదిక జిల్లా కలెక్టర్‌కు పంపించింది. సాధ్యాసాధ్యాలపై ఇంజనీరింగ్ విభాగం రిపోర్ట్‌ని నాబార్డ్‌కు అందజేసింది. గోదాం పరిసర ప్రాంతాల్లో సాగు విస్తీర్ణం? ఏయే పంటలు అధికంగా సాగవుతున్నాయి? దిగుబడి అంచనా? ఎంతమంది రైతులకు మేలు చేకూరుతుంది? తదితర అంశాలపై మరోసారి నాబార్డ్ ప్రతినిధులు అధ్యయనం చేయనున్నారు. వాళ్లు సానుకూలత వ్యక్తం చేస్తే జిల్లా కలెక్టర్ భూమి కేటాయించనున్నారు. తద్వారా ఈ ఐదు గిడ్డంగులు జిల్లాకు మంజూరై నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. ఆ ఆరు వెనక్కి..! మహానగర శివారు ప్రాంతాల్లో గిడ్డంగుల నిర్మాణానికి స్థల లేమి అడ్డంకిగా మారింది. గండిపేట, బాలాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మాడ్గుల, షాద్‌నగర్ ప్రాంతాల్లో స్థల కొరత ఉంది. దీంతో గిడ్డంగుల నిర్మాణం ఇక్కడ సాధ్యం కాదన్న అభిప్రాయానికి మార్కెటింగ్ శాఖ వచ్చింది. ఫలితంగా ఆ ఆరు గిడ్డంగులు జిల్లా నుంచి చేజారిపోయినట్లే. వాటిని ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉందని జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఛాయాదేవి తెలిపారు. -
వ్యవసాయ మార్కెట్లలో ఈ–సేవలు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్లలో ఇక నుంచి ఆన్లైన్ ద్వారా ఈ–సేవలను అందించేందుకు మార్కెటింగ్‌శాఖ నడుం బిగించింది. మార్కెట్లలో మరింత పారదర్శకత, జవాబుదారీ తనం, వేగం పెంచేందుకు ఈ చర్య చేపడుతున్నట్లు మార్కెటింగ్‌శాఖ వర్గాలు తెలిపాయి. ఈ–సేవలకు సంబంధించి మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బందికి హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చా రు. వ్యాపారులకు కూడా శిక్షణ ఇస్తున్నారు. యాప్ ద్వారానే లైసెన్స్... వ్యాపారులకు లైసెన్స్‌లు, ఎగుమతుల పర్మిట్ల జారీ కోసం మార్కెటింగ్ శాఖ ప్రత్యేకంగా ‘ఈ–సర్వీసెస్’ పేరుతో మొబైల్ యాప్‌ను రూపొందిస్తోంది. ఈ యాప్ ద్వారా రూ. 100 చెల్లిస్తే లైసెన్సు దరఖాస్తు తెరుచుకుంటుంది. దరఖాస్తును నింపి తిరిగి అప్లోడ్ చేసిన తర్వాత లైసెన్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం ఈ దరఖాస్తు సంబంధిత మార్కెట్ కమిటీ కార్యదర్శి వద్దకు వెళుతుంది. ఆయన పరిశీలించిన తర్వాత రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌కు పంపుతారు. డైరెక్టర్ ఆమోదంతో మార్కెట్ కార్యదర్శి డిజిటల్ సంతకంతో కూడిన లైసెన్స్ సర్టిఫికేట్‌ను మంజూరు చేస్తారు. ఇలా ఆన్లైన్లోనే దరఖాస్తు ఆమోదం పొందటంతో సమయం, వ్యయం తగ్గుతుంది. అన్నీ ఆన్లైన్లోనే... కేవలం లైసెన్సులే కాకుండా కమీషన్ ఏజెంట్ లైసెన్సులు, మార్కెట్ ఫీజు వసూళ్లు, ఎగుమతుల పర్మిట్లు, రాస్తామాల్ వసూళ్లన్నీ ఆన్లైన్లోనే నమోదు చేసే వీలుంటుంది. వ్యాపారి ఖరీదులు ఎంతుంటాయో అంత సరుకుకే ఆన్లైన్ ద్వారా ఎగుమతుల పర్మిట్ లభిస్తుంది. ఈ సేవలు అమలైతే చెక్‌పోస్టుల వద్ద నగదు వసూళ్లన్నీ ఆన్లైన్లో నమోదు చేస్తారు. అలాగే క్యూఆర్ కోడ్‌తో కూడిన ఎగుమతుల పర్మిట్లు, చెక్‌పోస్టు చెల్లింపుల రశీదులను జారీ చేస్తారు. దీని వల్ల నకిలీ రశీదులను సృష్టించే అవకాశమే ఉండదు. మార్కెట్లో నిత్యం జరిగే వ్యాపార లావాదేవీలన్నింటికీ తక్‌పట్టీల ద్వారా ఈ–సేవల్లో ఎప్పటికప్పుడు మార్కెట్ ఫీజు లెక్కిస్తారు. ప్రస్తుతం జారీ చేసే లైసెన్సులతో రాష్ట్రంలో ఏ మార్కెట్లోనైనా ఖరీదులు చేసే వీలుంది. ఏ మార్కెట్లో ఖరీదు చేసినా ఆన్లైన్లో ఎక్కడ ఫీజు చెల్లించినా సదరు వ్యాపారి పేరిట మార్కెట్ ఫీజు ఆయా మార్కెట్ కమిటీలకే వెళుతుంది. మార్కెట్లలో ఈ–సేవలు ప్రారంభమైతే పారదర్శకత పెరుగుతుందని మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి ‘సాక్షి’కి తెలిపారు. -
ఐదో రోజుకు చేరుకున్న లారీల సమ్మె
-
నిలిచిన రూ.10 వేల కోట్ల వ్యాపారం
సాక్షి, అమరావతి: గత 5 రోజులుగా నడుస్తున్న లారీల సమ్మె ప్రభావం క్రమంగా సామాన్యులను తాకుతోంది. సమ్మె వల్ల రాష్ట్రంలో రూ. 10 వేల కోట్ల వ్యాపార లావాదేవీలు నిలిచిపోయినట్లు ఏపీ లారీ యజమానులు సంఘం వెల్లడించింది. కూరగాయల ధరలు రెక్కలు విచ్చుకుంటుండగా, ఇటుక, కంకర, సిమెంట్ సరఫరా తగ్గడంతో నిర్మాణ రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. పశ్చిమ బెంగాల్ నుంచి బంగాళదుంపలు, మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయ దిగుమతులు ఆగిపోగా, రాష్ట్రం నుంచి టమాటా, ఇతర కూరగాయల ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో కూరగాయల ధరలు క్రమేపీ పెరగుతున్నాయి. తొలుత నిత్యవసర వస్తువులను సమ్మె నుంచి మినహాయించాలని చూసినా ప్రభుత్వం దిగిరాకపోవడంతో కూరగాయల సరఫరాను ఆపేయాలని నిర్ణయించినట్లు లారీ యజమానుల సంఘం తెలిపింది. సిమెంట్, ఇసుక, కంకర సరఫరా ఆగిపోవడంతో నిర్మాణ రంగ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయి పనులు లేక కూలీలు రోడ్డునపడ్డారు. ప్రస్తుతానికి సమ్మె ప్రభావం ఎక్కువగా లేకపోయినా ఇంకో రెండు రోజులు దాటితే మాత్రం అన్ని రంగాలపై ప్రభావం పడుతుందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఏ క్షణమైనా సమ్మెలోకి పెట్రోలు ట్యాంకర్లు ముఖ్యంగా బియ్యం రవాణాపై లారీల సమ్మె ప్రభావం అధికంగా కనిపిస్తోంది. బియ్యం ఎగుమతుల కోసం కాకినాడలో నాలుగు ఓడలు, పంచదార కోసం రెండు ఓడలు నిలిచి ఉండగా లారీల సమ్మె కారణంగా ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో మిల్లర్లు బియ్యాన్ని ప్రభుత్వానికి సరఫరా చేసే కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)తో నెట్టుకొస్తున్నట్లు రాష్ట్ర రైస్‌మిల్లర్ల అసోసియేషన్ కార్యదర్శి సాదినేని హన్ముంతరావు తెలిపారు. గత ఐదు రోజుల సమ్మె వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.125 కోట్లు, లారీ యజమన్యాలు రూ. 175 కోట్లు నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాగే మొండి వైఖరి కొనసాగిస్తే నిత్యావసరాల సరఫరాను కూడా నిలిపివేసే ఆలోచన చేస్తున్నట్లు లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి వై.ఈశ్వరరావు తెలిపారు. ఏక్షణమైనా పెట్రోలు ట్యాంకర్లను కూడా సమ్మెలోకి తీసుకువస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మార్కెటింగ్‌పై లారీల సమ్మె పోటు లారీల సమ్మె మార్కెటింగ్ శాఖ ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. సమ్మె కారణంగా వాణిజ్య పంటలకు మంచి ధర రాకపోవచ్చనే ఉద్దేశంతో రైతులు మిర్చి, పసుపు, ఉల్లి, పత్తి, సుగంధ ద్రవ్యాలను మార్కెట్ కమిటీలకు దిగుమతి చేయడం లేదు. దీంతో మార్కెట్ కమిటీల ఆదాయం గణనీయంగా పడిపోతోంది. ధాన్యం, అపరాల విక్రయాలు తగ్గిపోవడంతో దాని ప్రభావం ఆదాయంపై పడింది. సెస్ రూపంలో సాలీనా మార్కెటింగ్ శాఖకు రూ. 150 కోట్ల వరకు ఆదాయం లభిస్తోంది. ఐదు రోజులుగా జరుగుతున్న లారీల సమ్మె కారణంగా సెస్ రూపంలో రావాల్సిన రూ.15 కోట్ల ఆదాయం నిలిచిపోయిందని మార్కెటింగ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జరిగిన రాష్ట్ర బంద్ విజయవంతం కావడంతో మార్కెట్ కమిటీల్లో పూర్తిగా క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. -
‘మార్కెటింగ్’లో 200 ఖాళీల భర్తీకి అనుమతి
సాక్షి, హైదరాబాద్: మార్కెటింగ్ శాఖలో వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న 200 పోస్టుల భర్తీకి సర్కారు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసార థి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేడ్–3 సెక్రటరీ పోస్టులు 11, అసిస్టెంట్ సెక్రటరీ పోస్టులు 27, అసిస్టెంట్ మార్కెట్ సూపర్వైజర్ పోస్టులు 80, గ్రేడర్ పోస్టులు 13, బిడ్ క్లర్క్ పోస్టులు 9, జూనియర్ మార్కెట్ సూపర్వైజర్ పోస్టులు 60 ఉన్నాయి. ఆయా పోస్టులను నేరు గా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ద్వారా భర్తీ చేస్తారు. గ్రేడ్–3 సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ పోస్టులకు తాజా రోస్టర్ పాయింట్లను తయారు చేయాలని ఆదేశించారు. -
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితిని వాట్సాప్ ద్వారా సమీక్షించారు. తడిసిన ధాన్యంపై పలు సూచనలు చేస్తూ జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, వేర్‌హౌసింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. జాయింట్ కలెక్టర్లు వెంటనే మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను సందర్శించి పరిస్థితులను సమీక్షిస్తూ చర్యలు తీసుకోవాలని చెప్పారు. టార్పాలిన్లను వెంటనే సమకూర్చాలని, తడవని ధాన్యాన్ని వెంటనే గోదాంలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. గాలి దుమారం, భారీ వర్షానికి పాడైన గోదాంలకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
ఏం కష్టమొచ్చె దేవుడా..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: అన్నదాతకు కొత్త కష్టం వచ్చి పడింది. ఆకస్మాత్తుగా కురుస్తున్న వడగండ్ల వర్షానికి చేతికొచ్చిన పంటలు నేలపాలవుతున్నాయి. నోటిదాకా వచ్చిన ముద్ద మట్టి పాలవుతోందనే బాధ ఒకవైపు... తడిసిన ధాన్యాన్ని తీసుకునేందుకు మార్కెటింగ్‌శాఖ ససేమిరా అనడం మరోవైపు.. ఇలా రెండు విధానాలుగా కష్టమే ఎదురుకావడంతో ఏం చేయాలో తోచన వరి సాగు చేసిన రైతులు విలవిల్లాడుతున్నారు. ఇటీవల వారం రోజులుగా కురుస్తున్న వడగండ్ల వానతో జిల్లాలో మూడో వంతు పంట నేలపాలైంది. ఇంత భారీ స్థాయిలో పంట నష్టం జరగడంతో బాధిత రైతుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు మాత్రం నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించడమే తమ బాధ్యత అని.. పరిహారానికి సంబంధించి తమకు సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. ఇక తడిసిన ధాన్యాన్ని తీసుకునేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు నిరాకరిస్తుండడం అన్నదాతను ఆవేదనకుగురి చేస్తోంది. మొత్తంగా కాలం కాని కాలం.. వరుణుడి కన్నెర్రతో సమస్యల సుడిగుండలో చిక్కుకున్న పాలమూరు రైతన్నలు ఏం చేయాలో దిక్కుతోచక స్థితి ఎదుర్కొంటున్నాలు. నిబంధనల విషయంలో సడలింపు, నష్టపరిహారం పంపిణీలో ప్రభుత్వం నిర్ణయంతో కోసం కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. మూడో వంతు నేలపాలు... క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఇటీవల కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. జిల్లాలోని 26 మండలాలకు గాను 20 మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సాగైన పంటలో దాదాపు మూడో వంతు పూర్తిగా నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలే పేర్కొంటున్నాయి. జిల్లాలో 46వేల ఎకరాల్లో వరి పంట సాగవగా.. ఇటీవలి వడగండ్ల వానకు 15,123 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. జిల్లాలోని మొత్తం 206 గ్రామాల్లో 8,428 మంది రైతులు పంట నష్టపోయినట్లు తేలింది. తద్వారా జిల్లా రైతాంగానికి రూ.8.16 కోట్ల పంట నష్టం వాటినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా కోయిల్‌కొండ మండలంలో 2,699 ఎకరాలు, మద్దూరు మండలంలో 2,125 ఎకరాలు, గండేడ్ మండలంలో 2,054 ఎకరాల చొప్పున రైతులు పంట నష్టపోయారు. మార్కెట్‌కు వస్తున్న ధాన్యం యాసంగి సీజన్ సంబంధించి ధాన్యం ఇప్పుడిప్పుడే మార్కెట్ వస్తోంది. కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని రైతులు మార్కెట్‌కు తరలిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా కురుస్తున్న వర్షానికి చాలా వరకు కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దవుతోంది. కొన్నిచోట్ల ఎండిన ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకొచ్చినా అకాల వర్షాలతో తడిసిపోతుంది. దేవరకద్ర మార్కెట్‌కు సోమవారం తీసుకొచ్చిన ధాన్యం బస్తాలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. అప్పటికప్పుడు కవర్లు కప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఫలితంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరోవైపు తడిసిన ధాన్యాన్ని తీసుకునేందుకు మార్కెటింగ్‌శాఖ అధికారులు ససేమిరా అంటున్నారు. నిబంధనల మేరకు తేమ 14శాతం కంటే తక్కువగా ఉండాలని, అంతకంటే ఎక్కువగా ఉంటే తీసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. అయితే జిల్లాలో ఇప్పటి వరకు 2,489 క్వింటాళ్ల హంస, 3,635 క్వింటాళ్ల సోనమసూరి రకం ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి రెండు ఎకరాల్లో వరి సాగు చేశాను. ఇందుకు గాను రూ. 40 వేల పెట్టుబడి పెట్టాను. వారం రోజుల నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో 50 శాతం ధాన్యం నేలరాలింది. దీంతో నాకు రూ. 80 వేల వరకు నష్టం వట్టిలింది. ఈ విషయాన్ని గమనించి తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేసి మాలాంటి వారిని ఆదుకోవాలి. – టంకర్ శ్రీనివాస్, మరికల్ -
కొంపముంచిన జీడిపప్పు ఆశ
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): ఉచితంగా జీడిపప్పు పొందాలన్న కక్కుర్తి ఆ అధికారి కొంప ముంచేసింది. ఓ వ్యాపారికి జీడిపప్పు ప్యాకెట్ కోసం మార్కెటింగ్‌శాఖ డీడీ హుకుం జారీ చేస్తే మాట చెల్లలేదు. సరే నీ సంగతి చూస్తానని ఆ విషయం మనసులో పెట్టుకున్న సదరు అధికారి వద్దకు వ్యాపారి రానే వచ్చాడు. ఏం ఇన్నాళ్లకు గుర్తొచ్చానా... రూ.10 వేలు ఇస్తేనే సంతకం పెడతానని మెలిక పెట్టడంతో ఆ వ్యాపారి ఏసీబీ అస్త్రాన్ని సంధించి కటకటాల వెనక్కి పంపాడు. అధికారికి సహకరించిన మరో ఉద్యోగి కూడా కటకటాల పాలయ్యాడు. గోపాలపట్నం మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో చర్చనీయాంశమైన ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గోపాలపట్నంలో ఉన్న ప్రాంతీయ మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఎస్టీ నాయుడు విధులు నిర్వహిస్తున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఉన్నతాధికారుల మన్ననలు పొందేందుకు జీడీపప్పు ఇవ్వాలని భావించాడు. అందుకోసం కంచరపాలెం కేంద్రంగా విశాఖ, విజయవాడకు జీడిపప్పు అమ్మకాలు జరిపే జగన్నాథరావు అనే వ్యాపారిని కేజీ జీడిపప్పు పంపాలని కోరాడు. డబ్బులివ్వకుండా జీడిపప్పు ఇవ్వలేనని ఆ వ్యాపారి చెప్పేయడంతో నాయుడు సిగ్గుపడిపోయాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఒకటిన సేల్ పర్మిట్ పుస్తకం కోసం జగన్నాథరావు మార్కెటింగ్ శాఖ కార్యాలయానికి వచ్చాడు. జగన్నాథరావుని చూడగానే ఎస్టీ నాయుడుకి జీడిపప్పు సంగతి గుర్తొచ్చింది. ఏం బాబూ... మా అవసరం ఇప్పుడొచ్చిందా... ఇపుడు నువ్వడిగింది ఇవ్వడానికి తీరిక లేదు... మళ్లీ రా అని రెండుమూడుమార్లు తిప్పారు. ఈ నెల 9న మళ్లీ కార్యాలయానికి వచ్చిన జగన్నాథరావు ఏమిస్తే సేల్ పర్మిట్ పుస్తకం ఇస్తారో చెప్పాలని అడగడంతో... రూ.10వేలు ఇవ్వాలని నాయుడు డిమాండ్ చేయడంతో సరేనని ఆ వ్యాపారి వెళ్లిపోయాడు. అనంతరం నేరుగా ఏసీబీ డీఎస్పీ కేవీ రామకృష్ణప్రసాద్‌ని ఆశ్రయించడంతో మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో సీఐలు గొలగాని అప్పారావు, ఎస్.రమేష్, ఎస్కే గఫూర్, ఎంవీ రమణమూర్తి జగన్నాథరావుని పంపి ట్రాప్ చేశారు. తెచ్చిన డబ్బులివ్వడానికి ప్రయత్నించిన జగన్నాథరావుని చూసి... సూపర్వైజర్ బంగారురాజుకి ఇచ్చి వెళ్లు అని ఎస్‌టీనాయుడు చెప్పడంతో ఏసీబీ అధికారులు రంగ ప్రవేశం చేశారు. డబ్బులు తీసుకున్న బంగారురాజుతో పాటు ఎస్‌టీనాయుడుని అరెస్టు చేశారు. వీరి నుంచి వేలిముద్రలు తీసుకున్నారు. ఎస్‌టీనాయుడు, బంగారురాజుని అరెస్టు చేశామని డీఎస్పీ రామకృష్ణప్రసాద్ చెప్పారు. ఏసీబీ దాడి జరిగిందన్న విషయం తెలియడంతో మార్కెటింగ్ శాఖ కార్యాలయానికి ఆ శాఖ జేడీ శ్రీనివాసరావు, ఏడీ కాళేశ్వరరావు చేరుకున్నారు. వారి నుంచి డీడీ విధులు, ప్రవర్తనపై డీఎస్పీ వివరాలు సేకరించారు. -
మార్కెట్ ఏజెంట్ల బ్యాంకు గ్యారెంటీల సవరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ కూరగాయలు, పండ్ల మార్కెట్లలో కమీషన్ ఏజెంట్ల లైసెన్సు రెన్యువల్, ట్రేడర్స్ లైసెన్సు రెన్యువల్ తదితరాల బ్యాంకు గ్యారెంటీలకు సంబంధించి డిపాజిట్ల సొమ్ములో సవరణలు చేస్తూ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వ్యాపారం చేస్తున్న ఏజెంట్లు, ట్రేడర్లకే సవరణ ఉత్తర్వులు అమలవుతాయి. టర్నోవర్ కోటి రూపాయల లోపున్న కూరగాయలు, పండ్ల కమీషన్ ఏజెంట్ల లైసెన్సు రెన్యువల్‌కు బ్యాంకు గ్యారంటీ రూ.3 లక్షలుండగా, దాన్ని రూ.25 వేలకు తగ్గించారు. రూ.కోటికి పైగా టర్నోవర్‌కు రూ.5 లక్షల బ్యాంకు గ్యారెంటీ ఉంటే, దాన్ని రూ.50 వేలకు తగ్గించారు. ఇక రూ.5 కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన వారికి రూ.లక్ష గ్యారెంటీగా నిర్ణయించారు. ఇతర లైసెన్సుల రెన్యువల్‌కు... కూరగాయలు, పండ్లకు సంబంధించి కాకుండా ఇతర లైసెన్సుల రెన్యువల్‌కు రూ.కోటి టర్నోవర్ ఉంటే రూ.5 లక్షల బ్యాంకు గ్యారెంటీ ఉండేది. దాన్ని రూ.50 వేలకు, కోటికి పైగా టర్నోవర్ ఉంటే రూ.లక్ష, ఐదు కోట్లకు పైగా టర్నోవర్ ఉంటే రూ.2 లక్షలు బ్యాంకు గ్యారెంటీగా నిర్ధారించారు. ఇక పండ్లు, కూరగాయల ట్రేడ్ లైసెన్సు రెన్యువల్‌కు రూ.కోటి టర్నోవర్ ఉంటే రూ.లక్ష బ్యాంకు గ్యారెంటీ ఉండగా, దాన్ని రూ.25 వేలకు తగ్గించారు. రూ.కోటి టర్నోవర్ ఉంటే రూ.2 లక్షల బ్యాంకు గ్యారెంటీ ఉండగా, దాన్ని రూ.50 వేలకు కుదించారు. రూ.5 కోట్ల టర్నోవర్ ఉన్న ట్రేడర్ల గ్యారెంటీని రూ.లక్ష చేశారు. పండ్లు, కూరగాయలు కాకుండా ఇతర వాటి ట్రేడ్ లైసెన్సు రెన్యువల్స్‌కు కోటి టర్నోవర్ ఉంటే రూ.5 లక్షలకు బదులు రూ.50 వేలు, కోటికి పైగా టర్నోవర్ ఉంటే రూ.10 లక్షలున్న బ్యాంకు గ్యారెంటీని రూ.లక్షకు కుదించారు. రూ.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వాటికి రూ.2 లక్షల బ్యాంకు గ్యారెంటీ కోరారు. ప్రాసెసింగ్ లైసెన్స్‌కు... ఇక ప్రాసెసింగ్ లైసెన్సుకు రూ.కోటి నుంచి అంతకుమించి టర్నోవర్ ఉంటే రూ.3 లక్షల బ్యాంకు గ్యారెంటీ ఉండగా, దాన్ని ఎంత టర్నోవర్ ఉన్నా రూ.50 వేలకు కుదించారు. వేర్‌హౌసింగ్ లైసెన్సుకు రూ.2 లక్షల బ్యాంకు గ్యారెంటీ ఉంటే రూ.50 వేలకు తగ్గించారు. మార్కెట్ నోటిఫికేషన్‌కు రూ.20 లక్షల బ్యాంకు గ్యారెంటీ ఉండగా, దాన్ని రూ.2 లక్షలకు తగ్గించారు. డైరెక్ట్ పర్చేజ్ సెంటర్ (డీపీసీ)కు రూ.10 లక్షల బ్యాంకు గ్యారెంటీని రూ.2 లక్షలకు కుదించారు. జాతీయ పొదుపు సర్టిఫికెట్లను కూడా బ్యాంకు గ్యారెంటీగా చూపొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
కందుల కొనుగోళ్లతో వెయ్యి కోట్ల భారం
సాక్షి, హైదరాబాద్: కంది కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపడంతో రాష్ట్రంపై రూ.వెయ్యి కోట్లకుపైగా భారం పడిందని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధ వారం శాసన మండలి ఆవరణలో ఆయన వ్యవసాయ మార్కెటింగ్ అధికారులతో సమీక్షించారు. కందుల సేకరణలో కేంద్ర వైఖరి తెలంగాణ రైతుల ప్రయోజనాలకు నష్టకరమని హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కంది రైతులను ఆదుకోవాలంటూ కేంద్రానికి లేఖలు రాసినా.. నేరుగా కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందన్నారు. రూ.410 కోట్ల విలువ చేసే 75,300 టన్నుల కంది సేకరణకే కేంద్రం అంగీకరించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,450 చొప్పున 1.84 లక్షల టన్నుల కందులను కొనుగోలు చేసిందని తెలిపారు. దాంతో రాష్ట్రంపై రూ.వెయ్యి కోట్ల వరకు భారం పడిందని చెప్పారు. రైతులకు నాఫెడ్ నుంచి రూ.183.86 కోట్లు, మార్క్‌ఫెడ్, హాకా వంటి ఏజెన్సీల నుంచి రూ.52.46 కోట్లు రావాల్సి ఉందని.. ఈ బకాయిలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శనగ కొనుగోళ్లు ముమ్మరం.. శనగ కొనుగోళ్లు, చెల్లింపులపైనా హరీశ్‌రావు సమీక్షించారు. 50 వేల టన్నుల శనగ సేకరణకు కేంద్రం అనుమతించిందని.. 28 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 26 వేల టన్నుల శనగలను నాఫెడ్ కొనుగోలు చేసిం దన్నారు. ఇందుకు రైతులకు చెల్లించాల్సిన రూ.111 కోట్లు వెంటనే విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ముఖ్య కార్యదర్శి పార్థసారథి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. -
రైతు ముఖంలో చిరునవ్వు చూడాలి
సాక్షి, సిద్దిపేట: రైతు ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. దళారుల చేతిలో మోసపోకుండా.. పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. సోమవారం సిద్దిపేటలో రూ.8.5 కోట్ల వ్యయంతో నిర్మించిన మోడల్ రైతు బజారును మహిళా రైతు లచ్చవ్వతో జ్యోతి ప్రజ్వలనం చేయించారు. అలాగే.. సిద్దిపేట పోలీసు కమాండ్ కంట్రోల్ రూం భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రైతులకు సౌకర్యవంతంగా ఉండేలా అన్ని జిల్లాల్లో ఇలాంటి మోడల్ రైతు బజార్లు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. సిద్దిపేటలో నిర్మించిన మూడంతస్తుల భవనంలో 330 మంది రైతులు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు వీలుగా స్టాల్స్ ఏర్పాటు, ఇతర సౌకర్యాలు కల్పించామని చెప్పారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశామని మంత్రి తెలిపారు. -
రైతు మురిసేలా..
సిద్దిపేటజోన్: అధునాతన హంగులతో షాపింగ్‌మాల్‌ను తలదన్నే రీతిలో రూపుదిద్దుకున్న సిద్దిపేట మోడల్ రైతుబజార్ ప్రారంభానికి ముస్తాబైంది. ఇరుకైన స్థలం.. గాలివీస్తే ఎగిరిపోయే రేకుల షెడ్లు.. వానొస్తే బురద.. నిన్నటి వరకు పాత రైతుబజార్లో రైతులు, వినియోగదారులు పడిన ఈ ఇబ్బందులు ఇక నేటితో తీరిపోనున్నాయి. భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మార్కెటింగ్ శాఖను కూడా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక శ్రద్ధతో సిద్దిపేటలో ఆధునిక మోడల్ రైతుబజార్‌కు రూపకల్పన చేశారు. ఇందుకోసం రూ.6 కోట్లు కేటాయించారు. ఇటువంటి తరహా రైతుబజార్ నిర్మాణం రాష్ట్రంలోనే మొదటిదని మార్కెటింగ్ శాఖ అధికారులు అంటున్నారు. దీని నిర్మాణానికి దాదాపు ఏడాది పట్టింది. సోమవారం మంత్రి హరీశ్‌రావు దీనిని ప్రారంభించి రైతులకు,వినియోగదారులకు అంకింతం చేయనున్నారు. అంతా ఆధునికమే.. కొత్త రైతుబజార్లో ఎన్నెన్నో సదుపాయాలను ఆధునిక హంగులతో కల్పించారు. రైతులు సరుకు అమ్ముకునేందుకు ఎత్తయిన ప్లాట్‌ఫాంలు నిర్మించారు. దీనివల్ల భూమిపై ఉండే సూక్ష్మజీవులు కూరగాయలు, ఇతర సరుకుల్లోకి చేరవు. దుమ్ము, ధూళి కూడా అంటదు. కూరగాయల నిల్వకు కోల్డ్ స్టోరేజీ సదుపాయం సైతం రైతుబజార్లోనే కల్పించారు. 24 గంటలూ సీసీ కెమెరాల నిఘా ఉండనుంది. కూరగాయల ధరలు తెలిపే డిస్ప్లే బోర్డులు ఆకట్టుకుంటున్నాయి. అలాగే, కూరగాయలు, పండ్లలో పోషక విలువలు, వాటిని ఆహారంలో తీసుకోవడం కలిగే ప్రయోజనాలను స్క్రీన్‌పై డిస్ప్లే అయ్యేలా ఏర్పాటు చేశారు. దళారులను రైతుబజార్‌లోకి అడుగుపెట్టనివ్వకుండా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తారు. నేడు మంత్రి చేతులమీదుగా ప్రారంభం మంత్రి హరీశ్‌రావు సోమవారం మధ్యాహ్నం 12.30కి మోడల్ రైతుబజార్‌ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘాలు, రైతు రక్షణ సమితులు, మహిళా రైతులు భారీ ర్యాలీ నిర్వహించనున్నాయి. పాత బస్టాండ్ నుంచి బతుకమ్మలు, బోనాలతో సాగే ర్యాలీ అనంతరం రైతుబజార్‌ను మంత్రి ప్రారంభిస్తారు. -
పాత కమిటీలకే మళ్లీ పట్టం!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీల కొత్త చట్టం ఏడాదికే అభాసు పాలైంది. పాత చట్టానికి చేసిన సవరణల అమలులో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తే సింది. మూడేళ్లపాటు ఉన్న కమిటీల పదవీకాలాన్ని తెలంగాణ నూతన మార్కెటింగ్ చట్టం ద్వారా ప్రభుత్వం ఏడాదికి కుదించింది. ఏడాది పూర్తయిన మార్కెట్ కమిటీ పాలక వర్గాలకు 6 నెలలపాటు పదవీ కాలాన్ని పొడిగిస్తూ జీవోలు జారీ చేస్తోంది. దీంతో కొత్త చట్టానికి ఏడాది లోనే తూట్లు పడ్డట్లయింది. తొలుత ఏడాదికి కుదింపు: రాష్ట్రంలో మొత్తం 180 మార్కెట్ కమిటీలున్నాయి. కొత్త మార్కెట్ కమిటీల చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం 2016 ఏప్రిల్ నుంచి పలు దఫాలుగా 160 మార్కెట్లకు పాలక వర్గాలను నియమించింది. తొలి సారిగా లాటరీ పద్ధతిన రిజర్వేషన్లు ఖరారు చేయటం, మహిళలకు 33 శాతం పదవులు రిజర్వు చేయటంతో మార్కెట్ కమిటీల నియామకాలు ప్రత్యేకతను చాటుకున్నాయి. మూడేళ్లున్న పాలకవర్గం పదవీకాలాన్ని కొత్త చట్టంలో ఏడాదికి కుదించటం, ఏడాదికోసారి రిజర్వేషన్‌ను రొటేషన్ చేసేలా చట్టం ఉండ టంతో అన్ని సామాజిక వర్గాలను ఆకట్టు కుంది. ఈ అంశాలనే ప్రభుత్వం విస్మరించటంతో అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో గందరగోళం నెలకొంది. జూలైలోనే ముగిసిన పదవీకాలం కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నియమించిన 160 మార్కెట్ కమిటీల్లో దాదాపు వందకుపైగా కమిటీల పదవీ కాలం గత జూలైలో ముగిసిపో యింది. ఆ వెంటనే సంబంధిత మార్కెట్ల కు కొత్త పాలకవర్గాలను నియమించాలి. రొటేషన్ ప్రకారం రిజర్వేషన్లను మార్చి ఇతర సామాజిక వర్గాలకు కమిటీ పదవులు దక్కేలా అమలు చేయాలి. ప్రభుత్వం అదేమీ పట్టించుకోలేదు. పదవీకాలం ముగిసిన మార్కెట్ పాలక వర్గాలకు గడువు పొడిగించే పాత ఎత్తుగడను అను సరించింది. వంద కమిటీలకు 6 నెలల పాటు గడువు పొడిగిస్తూ ఎప్పటికప్పుడు ఉత్తర్వులు జారీ చేస్తోంది. దీంతో పదవీ కాలం ముగిసిన మార్కెట్ కమిటీ చైర్మన్లు ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమనే మళ్లీ కొనసాగిం చాలని, పదవీ కాలాన్ని పొడిగించాలని ఒత్తిళ్లు తెస్తున్నా రు. ఇప్పటికే పొడిగింపు వెసులుబాటు పొందిన కమిటీలు మళ్లీ పొడిగింపునకు క్యూ కడుతున్నాయి. మరోవైపు రిజర్వేషన్ల రొటేషన్‌తో తమకూ అవకాశం వస్తుందని ఏడాదిగా ఎదురుచూసిన ఇతర సామాజిక వర్గాల నేతలు డీలా పడ్డారు. -
పసుపు రైతులకు రైతుబంధు పథకం
సాక్షి, హైదరాబాద్: పసుపు రైతులకు రైతుబంధు పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు నిర్ణయించారు. శనివారం ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మార్కెటింగ్ శాఖ కార్యక్రమాలు, సాగునీటి పథకాలను మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కవిత సమీక్షించారు. పసుపు ధర తగ్గినందున ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవాలని ఎంపీ కవిత విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన హరీశ్‌రావు, పసుపు రైతులను ఆదుకునేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని, రైతుబంధు పథకాన్ని పసుపు రైతులకు కూడా వర్తింపజేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మార్కెట్ యార్డులతో పాటు వాటి వెలుపల ప్రైవేటు కోల్డ్‌స్టోరేజ్‌లలో పసుపు పంటను నిల్వ చేసుకున్న రైతులకు కూడా రైతుబంధు పథకం అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. రైతుల తక్షణ అవసరాలకోసం రూ. 2 లక్షల రుణ సదు పాయం కల్పించాలన్నారు. దీనికి ఆరు నెలల దాకా రైతులు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరంలేదని తెలిపారు. గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత మార్కెట్లో అమ్ముకోవాలని పసుపు రైతులను హరీశ్‌రావు కోరారు. కాగా, పసుపు రైతుల సమస్యలను అధ్యయనం చేసేందుకు మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు ఆదివారం మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ నిజామాబాద్ వెళ్లనున్నారు. ఎంపీ కవిత విజ్ఞప్తి మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లతో మామిడికాయల మార్కెట్‌ను అభివృద్ధి చేయాలని మంత్రి ఆదేశించారు. మామిడి కాయల దిగుబడి, క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఈ నెల 9న మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, ఉద్యాన శాఖ, అపెడా అధికారులతో సమావేశం నిర్వహించాలని హరీశ్‌రావు, కవిత నిర్ణయించారు. కాగా ఈ నెల 19న బోధన్ నియోజకవర్గంలో హరీశ్‌రావు పర్యటించనున్నారు. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ నియోజకవర్గంలో సాగునీటి పథకాల పురోగతిని వారు సమీక్షించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. -
లక్షన్నర టన్నుల కందిని కొనండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షన్నర టన్నుల కందిని కొనుగోలు చేయాలని కేంద్రానికి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మరోసారి విజ్ఞప్తి చేయనుంది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి సి.పార్థసార«థి మం గళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర వ్యవ సాయశాఖ కార్యదర్శిని కలసి లక్షన్నర టన్నుల కందిని కొనుగోలు చేయాలని కోరతారు. రాష్ట్రంలో కేవలం 53,600 మెట్రిక్ టన్నుల కందిని మాత్రమే కొనుగో లు చేస్తామని కేంద్రం గతంలో ప్రకటించిం ది. కంది ఉత్పత్తి గణనీయంగా ఉన్నందు న పరిమితిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ ఏడాది రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల కంది ఉత్పత్తి అవుతుం దని ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్రం మాత్రం రాష్ట్రంలో కేవలం 33,500 మెట్రిక్ టన్నులు మాత్రమే మద్దతుధరకు కొనుగో లు చేస్తానని ప్రకటించింది. ఒత్తిడి పెంచ డంతో ఇటీవల మరో 20 వేల టన్నులు కొనుగోలు చేస్తామని అంగీకరించింది. ఇలాగైతే, రైతులు కంది పంటను వ్యాపారులకు తెగనమ్ముకునే పరిస్థితి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. -
కడుపులో పెట్టుకుని చూసుకుంటాం
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలోని బీడు భూముల్లో గోదావరి, కృష్ణా జలాలు పారించే ప్రయత్నంలో భాగంగా గ్రామాలు, భూములు కోల్పోయిన నిర్వాసితులను ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. అనంతగిరి సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని కొచ్చగుట్టపల్లి నిర్వాసితులకు పునరావాసం, ఉపాధిలో భాగంగా సిద్దిపేట అర్బన్ మండలం లింగారెడ్డిపల్లిలో 140 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి బుధవారం మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రిజర్వాయర్‌లో గ్రామం మొత్తం మునిగిపోతోందని, పాత గ్రామానికి తీసిపోని విధంగా కొత్త గ్రామం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నిర్వాసితుల త్యాగ ఫలంతోనే.. సంస్కృతి, సంప్రదాయాలు, తీపి గుర్తులను త్యా గం చేసి ప్రాజెక్టుల నిర్మాణానికి చేయూతనిచ్చిన నిర్వాసితుల త్యాగఫలమే రాష్ట్రానికి సాగునీరు అని హరీశ్ అన్నారు. మల్లన్న సాగర్ కింద 8 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, వారికి గజ్వేల్ పక్కనే మొట్రాజుపల్లి వద్ద నూతన గ్రామాలు నిర్మిస్తామన్నారు. మరోవైపు కొండపోచమ్మ ప్రాజెక్టులో మునిగిపోయే మరో రెండు గ్రామాలకు తునికి బొల్లారం వద్ద డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి త్వరలో భూమి పూజ చేస్తామని తెలిపారు. 123 జీవో ప్రకారం వారికి పరిహారం ఇచ్చామన్నారు. 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు అధిక మొత్తం లో డబ్బులు చెల్లించలేకపోతున్నామని, అందుకే 21/2017 సవరణ చట్టం కింద మెరుగైన పరిహారం అందజేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాలు నిర్మించడం, ఉపాధి, యువతకు నైపుణ్యాల శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి హామీనిచ్చారు. అనంతరం గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. -
రైతన్నకు ‘మద్దతు’!
సాక్షి, హైదరాబాద్: పంటకు మద్దతు ధర కంటే మార్కెట్లో తక్కువ ధర పలికితే ఆ తేడాను సర్కారే రైతుకు చెల్లించాలని మార్కెటింగ్ శాఖ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు వ్యవసాయ మార్కెట్ల పనితీరు, రైతులకు అందుతున్న మద్దతు ధరలు, సేవలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖకు చెందిన నాలుగు అధికారుల బృందాలు హరియాణా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో అధ్యయనం చేసి వచ్చాయి. తాజాగా ఆ శాఖ డైరెక్టర్‌కు నివేదిక సమర్పించాయి. మధ్యప్రదేశ్‌లో మద్దతు ధర కంటే తక్కువ పలికితే ఆ తేడాను ప్రభుత్వమే రైతులకు అందిస్తోంది. దీన్ని ప్రధాని మోదీ కూడా ప్రశంసించారు. హరియాణాలో అక్కడి ప్రభుత్వం ఇటీవలే కూరగాయలకు మధ్యప్రదేశ్ మాదిరిగా ఓ పథకానికి రూపకల్పన చేసింది. ఇక కర్ణాటకలో రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేసి ఆ నిధులతో రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నారు. అయితే కేంద్రం నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో రెండేళ్లుగా అక్కడ సరైన ఫలితాలు రావడంలేదని కర్ణాటక వెళ్లొచ్చిన బృందం తన నివేదికలో తెలిపింది. మహారాష్ట్రలో 1971లోనే పత్తి ఫెడరేషన్ ఏర్పాటైంది. పత్తికి మద్దతు ధర అందించడం దీని ఉద్దేశం. అయితే దాని గుత్తాధిపత్యం కారణంగా మూసేసినా, ఇటీవల మళ్లీ అక్కడక్కడ కార్యకలాపాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. దీని ద్వారా మద్దతు ధరతో పత్తి కొనుగోలు చేస్తున్నారు. ఏది ఆచరణీయం? మార్కెటింగ్ శాఖ బృందాలు ఇచ్చిన నివేదికపై త్వరలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. మద్దతు ధర, మార్కెట్ ధర మధ్య తేడాను రైతులకు ఇచ్చే సిఫారసుపైనే అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. దీన్ని అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున భారం పడనుంది. పైగా ప్రభుత్వం కూడా రైతులకు మద్దతు ధర అందించేందుకు రైతు సమితులను రంగంలోకి దింపాలని యోచిస్తోంది. వాటి ద్వారా కొనుగోలు చేయాలని భావిస్తోంది. దీనికి పెద్ద ఎత్తున నిధులు కావాలి. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. కేంద్ర పథకం ఎలా ఉంటుందో? కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు మద్దతు ధర అందించేందుకు సరికొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. వచ్చే బడ్జెట్లో దీన్ని వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో ఎఫ్‌సీఐ లేదా ఇతర సంస్థల ద్వారా వరి, గోధుమ పంటలను మాత్రమే మద్దతు ధరకు కొనుగోలు చేసే విధానం ఉంది. అయితే సోయాబీన్, కంది, మినుములు, పెసలు, వేరుశనగ, నువ్వులు, మొక్కజొన్న తదితర పంటలకు మాత్రం ఇది అమలు కావడం లేదు. ఆయా రాష్ట్రాల్లో పండించిన పంట దిగుబడిలో కేవలం 30 శాతం వరకు మాత్రమే కొనుగోలు చేస్తుంది. ఇది సరికాదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చెబుతోంది. కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్ తదితర సంస్థలే ఎంఎస్పీకి కొనుగోలు చేస్తున్నాయి. రైతుల నుంచి కొనుగోలు చేశాక వాటిని అమ్మే సందర్భంలో ఆయా రాష్ట్రాల సంస్థలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది. ఆ నష్టంలో కేంద్రం కేవలం 40 శాతమే భరిస్తానని చెబుతోంది. దాన్ని 55 శాతం చేయాలని రాష్ట్రం కోరుతోంది. అలాగే పంట ఉత్పత్తుల సేకరణకు అవసరమైన నిధులను కేంద్రమే సమకూర్చాలని డిమాండ్ చేస్తోంది. కనీసం 50 శాతం రివాల్వింగ్ ఫండ్‌ను సమకూర్చాలని విన్నవిస్తోంది. మార్కెటింగ్ బృందాల నివేదిక, కేంద్ర పథకం తీరు చూశాక రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి రూపకల్పన చేస్తుందన్న చర్చ జరుగుతోంది. -
మిర్చి ధరపై అనిశ్చితి
సాక్షి, హైదరాబాద్: గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో మిర్చి ధర మార్కెట్లో రూ. 12 వేలు పలికింది. ఈ ఏడాది జనవరి 10న రూ. 11,500, ఫిబ్రవరి 6న రూ. 9,100కు చేరింది. ఇలా ఏప్రిల్ 27 నాటికి క్వింటాల్ మిర్చి ధర ఏకంగా రూ. 2 వేలకు పడిపోయింది. దీంతో అదే రోజు ఖమ్మంలో కడుపు మండిన రైతన్నలు అక్కడి వ్యవసాయ మార్కెట్‌పై దాడి చేసి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రస్తుతం క్వింటాల్ మిర్చి ధర రూ. 4,700 – రూ. 9,600 ఉందంటే రానురాను పరిస్థితి మరింత ఘోరంగా ఉండొచ్చని వ్యవసాయ మార్కెటింగ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు మార్కెట్లకు మిర్చి పెద్ద ఎత్తున తరలివస్తే, ధరలు మరింత పడిపోవచ్చనే భావన అధికారులను వెంటాడుతోంది. మరోవైపు పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వ్యాపారుల వద్ద నగదు లేక కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. 87,220 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి... ఈ ఖరీఫ్‌లో 1.71 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ప్రధానంగా ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో అధికంగా సాగు చేశారు. దీంతో ఈ సారి 87,220 మెట్రిక్ ట న్నుల మిర్చి ఉత్పత్తి కావొచ్చని మార్కెటింగ్‌శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాణిజ్య పంట కావడంతో మిర్చికి ఎటువంటి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) లేదు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేసే అవకాశముంది. గతేడాది ధర పతనం కావడం, కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. జాతీయ అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌ను బట్టే మిర్చికి ధర ఉంటుంది. ఆ ప్రకారమే తాము కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. గతేడాది అంతర్జాతీయంగా ధర మందగించిందని, ఉత్తరాది వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి కనబర్చలేదని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులే ఉన్నాయని, ధర విషయంలో తామేమీ చేయలేమని తేల్చి చెబుతున్నారు. నిల్వకు అవకాశం లేక... మార్కెట్‌కు పెద్ద ఎత్తున మిర్చి తరలివచ్చేప్పుడే వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తారు. ఇలాంటి సమయంలో రైతులు మిర్చి పంటను సరైన ధర వచ్చే వరకు నిల్వ చేసుకునే అవకాశం లేక తెగనమ్ముకుంటున్నారు. కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో లేక, ఉన్న కొన్ని స్టోరేజీలు వ్యాపారుల చేతుల్లోనే ఉండటంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. నాణ్యత లేదని చెబుతూ కొందరు రైతుల నుంచి పంటను కొనుగోలు చేయని దుస్థితి కూడా ఉంది. ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా మార్కెటింగ్‌శాఖ చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. -
రైతు పేరిట వ్యాపారుల దాడులు
సాక్షి, హైదరాబాద్: మార్కెటింగ్ శాఖలో రైతుల ముసుగులో కొందరు వ్యాపారులు హమాలీలతో దాడులు చేస్తారని, అటువంటి వ్యాపారులను గుర్తించి వారి లైసెన్స్‌లు రద్దు చేయాలని మార్కెటింగ్‌శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. బోయినపల్లి వ్యవసాయ మార్కెట్లో ఆదివారం మార్కెట్‌శాఖ ఈ–సేవలపై శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఇప్పటివరకు మార్కెట్లలో లైసెన్స్‌లు ఎన్ని ఉన్నాయో చూసి కొత్త లైసెన్స్‌లు ఇవ్వాలన్నారు. లైసెన్స్‌లు 120 ఉంటే వ్యాపారం చేసేవారు 20 మంది మాత్రమే కాబట్టి కొత్త వారికి లైసెన్సులు ఇవ్వాలన్నారు. దేశంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ–నామ్ వినియోగంలో ఇప్పటికే దేశంలో నంబర్ వన్‌గా కొనసాగుతున్నామన్నారు. తాజాగా దేశంలోనే తొలిసారిగా మార్కెటింగ్ శాఖలో ఈ–సర్వీసెస్‌ను ప్రారంభించి టెక్నాలజీ వినియోగంలో మనకు మనమే సాటి అన్న రీతిలో సాగిపోతున్నామన్నారు. ప్రస్తుతానికి 44 మార్కెట్ యార్డుల్లో కొనసాగుతున్న ఈ–నామ్‌ను 2018 ఖరీఫ్ నాటికి మిగిలిన 14 మార్కెట్లలోనూ ప్రారంభిస్తామన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి నూటికి నూరు శాతం అన్ని మార్కెట్లలో ఈ–నామ్‌లు అమలు చేయాలని ఆదేశించారు. ప్రతీది ఆన్లైన్లోనే జరగాలన్నారు. సర్వర్ పనిచేయడం లేదంటూ తనకు చెప్పొద్దని, ఏ సిగ్నల్ అందుబాటులో ఉంటే ఆ నెట్‌వర్క్‌కు వెళ్లాలని సూచించారు. రైతులకు మద్దతు ధర వచ్చేవిధంగా, రైతులు మార్కెట్లో ఉండకుండా ఆన్లైన్ లో డబ్బులు పడే విధంగా చేయాలన్నారు. రాష్ట్రంలో 18 లక్షల టన్నుల సామర్థ్యమున్న మార్కెట్ గోదాములు ఉన్నాయన్నారు. నల్లగొండలో మార్కెట్లు ప్రారంభం రైతులకు మేలు చేసేందుకు నల్లగొండలో బత్తాయి, నిమ్మ మార్కెట్లు నిర్మించామన్నారు. వారంలో నల్లగొండలో మార్కెట్లు ప్రారంభిస్తామన్నారు. టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నామని అన్నారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవడంతో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి దాన్ని గ్రూపులో చూస్తున్నానని వివరించారు. మార్కెటింగ్‌శాఖలో ఇంకా జవాబుదారీతనం పెరగాలన్నారు. లైసెన్స్ ఇచ్చేందుకు, వాహనాల చెకింగ్ కోసం కొత్త సాఫ్ట్వేర్ తీసుకు వచ్చామన్నారు. దీనివల్ల అవకతవకలు జరగవన్నారు. దీని ద్వారా అక్రమాలకు చెక్ పెట్టవచ్చన్నారు. ఇతర రాష్ట్రాల వారు మన రాష్ట్రంలో కొనేందుకు చట్టం తీసుకు వస్తున్నామన్నారు. ఈ విషయంపై సీఎంతో మాట్లాడామన్నారు. ఈ–నామ్ ద్వారా కొనుగోలు చేయడం ద్వారా దళారీ వ్యవస్థ పోతుందన్నారు. -
కంది ధర ఢమాల్
సాక్షి, హైదరాబాద్: కంది ధర పతనమవుతోంది. మార్కెట్‌కు వస్తున్న రైతులను ప్రైవేటు వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. అత్యంత తక్కువ ధరకు కంది పంట కొనుగోలు చేస్తున్నారు. 2017–18 సంవత్సరానికి కేంద్రం కందికి ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటాలుకు రూ.5,450 కాగా.. మార్కెట్లలో రూ.4 వేల లోపే ధర పలుకుతోందని సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ తాజాగా తన నివేదికలో ప్రస్తావించడం పరిస్థితికి అద్దం పడుతోంది. కనిష్టంగా రూ.2 వేలు, గరిష్టంగా రూ.4 వేల వరకే ధర ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలాఖరు నుంచి కంది పంట మార్కెట్లలోకి విరివిగా రానుంది. గతేడాది గణనీయంగా ఉత్పత్తి ఉండటంతో డిమాండ్ తగ్గి ధర పడిపోయిందని భావించారు. కానీ ఈసారి ఉత్పత్తి తక్కువగా ఉన్నా డిమాండ్ పెరగకపోవడంపై రైతులు దిగాలు పడుతున్నారు. ఓవైపు పత్తి ధర పడిపోయి రైతులు హాహాకారాలు చేస్తుంటే.. మరోవైపు కంది కూడా రైతును కుదేలు చేస్తోంది. గతేడాది కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి కంది పప్పును దిగుమతి చేసుకోవడం వల్లే ధర పడిపోయిందని కొందరు అధికారులు విశ్లేషిస్తున్నారు. ఎక్కడెక్కడ ఎంతెంత ధర.. గతేడాది ఖరీఫ్‌లో కంది విస్తీర్ణం 10.77 లక్షల ఎకరాలు కాగా.. ఈ ఏడాది ఖరీఫ్‌లో కేవలం 6.27 లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఈసారి 1.65 లక్షల టన్నులు కంది ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సాధారణంగా కంది పంట నూర్పిడి డిసెంబర్లో మొదలవుతుంది. మార్చి వరకు మార్కెట్‌కు వస్తుంది. ఇప్పటికే కొన్నిచోట్ల మార్కెట్‌కు వచ్చింది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ గత నెల ఒకటో తేదీ నుంచి 15 వరకు రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో కందికి ఏ స్థాయిలో ధర పలికిందో వివరిస్తూ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం నవంబర్ 10న కరీంనగర్ మార్కెట్లో కందికి పలికిన గరిష్ట ధర క్వింటాలుకు రూ.3,056 మాత్రమే. అదేరోజు సూర్యాపేట మార్కెట్‌కు 235 క్వింటాళ్ల కంది పంట రాగా కనిష్ట ధర రూ. 3,069 పలికింది. గరిష్ట ధర రూ.3,929 పలికింది. అదే మార్కెట్లో 11న 156 క్వింటాళ్ల కంది రాగా.. కనిష్టంగా రూ.3,129, గరిష్టంగా రూ.3,843 ధర పలికింది. 13న వరంగల్ మార్కెట్‌కు 14 క్వింటాళ్ల కంది రాగా.. కనిష్ట ధర రూ.3,685, గరిష్ట ధర 3,789 మాత్రమే పలికింది. అదేనెల 14న ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు కనిష్టంగా రూ.2,100, గరిష్టంగా రూ.3,800 దక్కింది. కొనుగోలు కేంద్రాలపై స్పష్టత ఏది? కేంద్రం రాష్ట్రంలో కందిని ఎంఎస్పీకి కొనుగోలు చేయాలని సూచించింది. అయితే ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ఎన్ని ప్రారంభించాలన్న దానిపైనా స్పష్టత రాలేదు. గతేడాది 98 కంది కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ప్రారంభించింది. వాటి ద్వారా రికార్డు స్థాయిలో రూ.1,030 కోట్ల విలువైన 2.04 లక్షల టన్నుల కందిని కొనుగోలు చేసింది. మొత్తం 2.03 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇప్పటికే మార్క్‌ఫెడ్‌ను కంది కొనుగోలుకు నోడల్ ఏజెన్సీగా నియమించారు. త్వరగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తేనే రైతులకు ప్రయోజనం ఉంటుంది. లేకుంటే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. పెద్ద నోట్ల రద్దు ఓ కారణం ఈసారి దేశవ్యాప్తంగా పప్పుధాన్యాల ధరలు పడిపోతున్నాయి. ప్రస్తుతం అదే తీరు కొనసాగుతోంది. మున్ముందు ఇలాగే ఉండనుంది. ఉత్పత్తి తగ్గినా డిమాండ్ పెరగకపోవడానికి పెద్ద నోట్ల రద్దు ఒక కారణంగా కనిపిస్తుంది. వ్యాపారుల వద్ద గతంలో మాదిరి నగదు చేతిలో లేదు. దీంతో ఎక్కువ పరిమాణంలో కందిని కొనుగోలు చేయడం లేదు. ఇతర పంటల పరిస్థితి అలాగే ఉంది. కేంద్రం కందికి ప్రకటించిన ఎంఎస్పీ రూ.5,450 కాగా.. మార్కెట్లో రూ.4 వేల కంటే తక్కువగా వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కదలాలి. రైతుల నుంచి కందిని కొనుగోలు చేయాలి. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు లేఖ రాశాను. – పార్థసారథి, వ్యవసాయ శాఖ కార్యదర్శి -
39 శాతం పత్తికే మద్దతు ధర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో 33.25 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు మార్కెట్లకు 15.16 లక్షల క్వింటాళ్ల పత్తి రాగా, అందులో 5.87 లక్షల క్వింటాళ్ల (39%) పత్తికి కనీస మద్దతు ధర లభించిందని పేర్కొంది. ఖరీఫ్‌లో పండించిన వివిధ పంటలు, ధర తదితర వివరాల నివేదికను విడుదల చేసింది. 60 శాతం వరకు రంగు మారిందే.. ఇప్పటి వరకు వరంగల్ మార్కెట్‌కు వచ్చిన పత్తిలో దాదాపు 60 శాతం వరకు రంగు మారింది. దీని తేమ శాతం సరాసరి 25 శాతం ఉంది. 8 నుంచి 12 శాతం తేమ ఉన్న పత్తి మాత్రమే సీసీఐ కొనుగోలు చేస్తుంది. 12 శాతం నుంచి 25 శాతమున్న పత్తి, రంగు మారిన పత్తిని బీ గ్రేడ్‌గా పరిగణించి కొనాలని కేంద్రానికి విన్నవించినట్లు ఆ నివేదికలో తెలిపింది. పెసరకు మద్దతు ధర రూ.5,575 రాష్ట్రంలో ఖరీఫ్‌లో పెసర 2.75 లక్షల ఎకరాల్లో పండించారు. దాదాపుగా 1.1 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా. కేంద్రం క్వింటాలు పెసరకు రూ.5,575 మద్దతు ధర ప్రకటించింది. 12 కేంద్రాల ద్వారా 2,512 మంది రైతుల నుంచి రూ.11.62 కోట్లతో 2,084 మెట్రిక్ టన్నుల పెసర కొన్నట్లు నివేదికలో తెలిపింది. రాష్ట్రంలో మినుములు 80 వేల ఎకరాల్లో పండించారు. దాదాపు 30 వేల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇప్పటివరకు 13 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ. 23.26 కోట్లతో 4,308 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. మొక్కజొన్న 11.45 లక్షల ఎకరాల్లో పండించారు. దాదాపు 28.12 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా. దాదాపు 2.48 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అవుతుందని అంచనా. 19.38 లక్షల ఎకరాల్లో వరి.. ఖరీఫ్‌లో 19.38 లక్షల ఎకరాల్లో వరి పండించారు. దాదాపు 46.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అవుతుందని అంచనా. కేంద్రం ఏ గ్రేడ్ రకానికి రూ.1,590, బీ గ్రేడ్ రకానికి రూ.1,550 మద్దతు ధర ప్రకటించింది. 2,902 సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత నెల 31 నాటికి 914 కేంద్రాలు ఏర్పాటుచేసి 1.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. -
మార్కెట్ చైర్మన్ల వేతనాలు భారీగా పెంపు
సాక్షి, హైదరాబాద్: మార్కెట్ కమిటీ చైర్మన్ల గౌరవ వేతనాలను భారీగా పెంచుతూ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలను ఏకంగా పదింతలకు పైగా పెంచుతూ ఆ శాఖ కార్యదర్శి సి.పార్థసారధి ఆదేశాలు ఇచ్చారు. సెలక్షన్ గ్రేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్లకు ప్రస్తుతం నెలకు రూ. 2 వేలు వేతనం ఇస్తున్నారు. దాన్ని ఏకంగా రూ. 25 వేలకు పెంచారు. స్పెషల్ గ్రేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్లకు ప్రస్తుతం రూ. 1,500 ఇస్తుండగా, దాన్ని రూ. 20 వేలు చేశారు. అలాగే ఇతర గ్రేడ్ల మార్కెట్ కమిటీ చైర్మన్లకు ప్రస్తుతం నెలకు రూ. 500 నుంచి రూ. వెయ్యి ఇస్తుండగా, దాన్ని రూ. 15 వేలకు పెంచారు. అలాగే గ్రేడ్లతో సంబంధం లేకుండా అన్ని మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఇతర సభ్యులకు సిట్టింగ్ ఫీజును రూ. 250 నుంచి రూ. వెయ్యి వరకు పెంచారు. మార్కెటింగ్‌శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రతి పాదనల మేరకు సీఎం కేసీఆర్ ఆమోదంతో ఈ పెంపుదల చేసినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు మార్కెట్లకు ధాన్యం వచ్చే సమయం. ధాన్యంతోపాటు పత్తి కూడా మార్కెట్లను పోటెత్తనుంది. ఈ పరిస్థితుల్లో మార్కెట్లను సరిగ్గా నడిపించడంలో చైర్మన్లదే కీలకపాత్ర. ఈ నేపథ్యంలో భారీగా వేతనాలు పెంచడంతో వారిలో నూతనోత్సాహం వస్తుందని మార్కెటింగ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సరైన వేతనాలు లేక ఇబ్బందులు... రాష్ట్రంలో 180 మార్కెట్ కమిటీలున్నాయి. అందులో సెలక్షన్ గ్రేడ్ మార్కెట్లు 16 ఉన్నాయి. స్పెషల్ గ్రేడ్ మార్కెట్లు 29, గ్రేడ్–1 మార్కెట్లు 26, ఇవిగాక ఇతర మార్కెట్లు 109 ఉన్నాయి. ఈ కమిటీల చైర్మన్లకు ప్రస్తుతం ఇస్తున్న వేతనాలతో పోలిస్తే రాష్ట్రంలో వివిధ అణగారిన వర్గాలకు ఇస్తున్న పింఛన్లే నయంగా ఉన్నాయని మార్కెటింగ్‌శాఖ భావించింది. అంతేకాక మార్కెట్ కమిటీల చైర్మన్లలో అనేకమంది బడుగు, బలహీనవర్గాల వారున్నారు. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలోనే వేతనాలు భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
వామ్మో ఉల్లి.. పెరిగింది మళ్లీ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉల్లి ఘాటెక్కింది. తాత్కాలిక కొరతతో మార్కెట్లో ధరలు మండుతున్నాయి. నిన్న మొన్నటి వరకు బహిరంగ మార్కెట్లో కిలో రూ.20–25 ఉన్న ఉల్లి.. ఇప్పుడు దాదాపు రెట్టింపయింది. రిటైల్ మార్కెట్లో కిలో రూ.40 వరకు పలుకుతోంది. మలక్‌పేట్ మార్కెట్లో హోల్‌సేల్‌గా నాణ్యమైన ఉల్లి కిలో రూ.28.. మెత్తబడి, అంతగా బాగా లేని ఉల్లి రూ. 20 వరకు పలుకుతోందని మార్కెటింగ్ వర్గాలు వెల్లడించాయి. కృత్రిమ కొరత వల్ల రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నాయి. 10 రోజుల్లో 80 శాతం.. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ల నుంచి రాష్ట్రానికి ఉల్లి దిగుమతులు ఉంటాయి. వీటిలో మహారాష్ట్ర నుంచే రాష్ట్రానికి ఎక్కువగా దిగుమతి అవుతుంటాయి. అయితే దేశంలోనే అతి పెద్ద మార్కెట్ అయిన మహారాష్ట్రలోని లాసల్గావ్లో 10 రోజుల్లోనే 80 శాతం మేర ఉల్లి ధరలు పెరిగినట్లు తెలిసిందని, ఆ కారణంగానే తెలంగాణలో ధరలు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు గతేడాది ఉల్లికి గిట్టుబాటు కాక ఈసారి సాగు విస్తీర్ణం తగ్గిందని, దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా మహారాష్ట్రలోని మార్కెట్లు వారం రోజులు మూసేస్తారని, ఆ ప్రభావమూ ధరల పెరుగుదలపై ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలో 10 వేల ఎకరాల్లోనే.. మార్కెట్లో ఉన్న ఉల్లి మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉత్పత్తి అయిందే. నిల్వ చేసిన ఉల్లిలోనూ 30 శాతం వరకు వానలకు దెబ్బతిన్నట్లు తెలిసింది. మహారాష్ట్ర నుంచి దిగుమతులు తగ్గడం.. భారీ వర్షాలు, వరదలతో పంట దెబ్బతిని ఉల్లి మార్కెట్‌కు రావడం లేదు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూ ల్, గద్వాల, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో 10 వేల ఎకరాల్లోనే ఉల్లి సాగవుతోంది. దీంతో రాష్ట్ర అవసరాలు తీరడం లేదు. ఇదే అదనుగా వ్యాపారులు ధరలు పెంచుతున్నారని ఆరోపణలున్నాయి. పెరిగింది వాస్తవమే.. మహారాష్ట్ర సహా ఉల్లి సాగు చేసే రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల ఉల్లి పంట దెబ్బతిన్నది. వర్షం, తేమ వల్ల నిల్వ ఉంచిన ఉల్లి చెడిపోతోంది. దీంతో కొరత ఏర్పడి ధరలు పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి కిలో రూ.40 పలుకుతోంది. ఇది తాత్కాలికమే. త్వరలో ధరలు తగ్గుతాయని ఆశిస్తున్నాం. – పార్థసారథి, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి -
వెట్టిచాకిరి.. బెత్తెడు శాలరీ !
♦ రైతుబజార్ల సిబ్బందికి అందని కనీస వేతనాలు ♦ జీతాలు పెంచాలని రెండేళ్ల కిందట జీవో జారీ ♦ అయినా అమలు చేయని వైనం ♦ పట్టించుకోని మార్కెటింగ్ శాఖ ♦ కలెక్టర్ దృష్టి సారించాలని వినతి విజయవాడ : రైతుబజార్ల సిబ్బంది చాలీచాలని జీతాలతో వెట్టిచాకిరి చేస్తున్నారు. రెవెన్యూ, మార్కెటింగ్ శాఖల అధికారులు ఎవరికివారు రైతుబజార్ల సిబ్బందితో పని చేయించుకుంటూనే వేతనాల పెంపుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రైతుబజార్లలోని సిబ్బందికి వేతనాలు పెంచాలని రెండేళ్ల కిందట ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఆ జీవోను అమలు చేసే నాథుడే కరువయ్యాడు. దీంతో జిల్లాలోని రైతుబజార్లలో పని చేసే సిబ్బంది కనీస వేతనాలకు నోచుకోకుండా ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరల కారణంగా ఇల్లు గడవక అల్లాడుతున్నారు. ఆశలు చిగురించి... జిల్లాలో 18 రైతుబజార్లు ఉన్నాయి. వీటిలో 150మంది వరకు వివిధ కేడర్లలో పని చేస్తున్నారు. ప్రస్తుతం రైతుబజార్లలో పని చేసే ఎస్టేట్ ఆఫీసర్లకు పట్టణాల్లో నెలకు రూ.14వేలు, రూరల్‌లో రూ.12వేలు చొప్పున ఇస్తున్నారు. సబ్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డులకు పట్టణాల్లో రూ.6,735, రూరల్‌లో 5,735 చొప్పున ఇస్తున్నారు. జీతాలు పెంచాలని వారు దశాబ్దకాలంగా ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. ఎట్టకేలకు రెండేళ్ల క్రితం ప్రభుత్వం రైతుబజార్లలో పని చేసే సిబ్బందికి కనీస వేతన చట్టం ప్రకారం జీతాలను సవరిస్తూ జీవో జారీ చేసింది. ఆ జీవో కాపీని మార్కెటింగ్ అధికారులకు పంపింది. ఈ జీవో ప్రకారం ఎస్టేట్ ఆఫీసర్లకు రూ.18వేలు, సబ్ స్టాఫ్‌కు రూ.14వేలు చొప్పున చెల్లించాల్సి ఉంది. దీంతో వేతనాలు పెరుగుతాయని ఆశించిన వారికి నిరాసే మిగిలింది. మార్కెటింగ్ శాఖ సిబ్బందికి మాత్రమే పెంచి... అయితే, మార్కెటింగ్ అధికారులు తమ ఆధీనంలో పని చేస్తున్న కాంట్రాక్టు సిబ్బందికి మాత్రమే పెంచారు. రైతు బజార్లలోని సిబ్బందిని గాలికొదిలేశారు. కలెక్టర్ అయినా తమ సమస్యను అర్థం చేసుకుని ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రైతుబజార్లలోని సిబ్బంది కోరుతున్నారు. -
మార్కెట్లలో సింగిల్ లైసెన్స్ విధానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ల లో సింగిల్ లైసెన్స్ విధానం ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఫైలుపై మంగళవారం సంతకం చేశారు. ప్రస్తుతం ఒక వ్యవ సాయ మార్కెట్లో లైసెన్స్ ఉన్న వ్యాపారులు మరో మార్కెట్లో కొనుగోలు చేయడానికి అవకాశం లేదు. దీంతో ఒక్కో మార్కెట్లో కొందరు వ్యాపారులే లైసెన్స్డ్ ట్రేడర్లుగా ఉంటున్నారు. దీంతో రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. అయితే ఒక మార్కెట్లో లైసెన్స్ ఉన్న వ్యాపారి రాష్ట్రంలోని ఇతర మార్కెట్లలోనూ కొనుగోలు చేసే అవకాశముంటే పోటీ పెరిగి రైతులకు మేలు జరుగుతుందని సీఎంకు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు వివరించారు. స్పందించిన సీఎం.. సింగిల్ లైసెన్స్ విధానం అమలు చేయాలని ఆదేశించారు. తాజా విధానంతో ఒక మార్కెట్లో లైసెన్స్ ఉన్న వ్యాపారులు, ట్రేడర్లు.. ఇతర మార్కెట్లలోనూ వ్యాపారం నిర్వహించుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇద్దరు ఎమ్మెల్యేలకు ఇళ్లు.. సొంత ఇళ్లు లేని మాజీ ఎమ్మెల్యేలు డి.రామచంద్రా రెడ్డి, సి.భాగన్నలకు స్థలం కేటాయించి ఇళ్లు కట్టివ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. రామచంద్రారెడ్డికి సిద్దిపేటలో, భాగన్నకు జహీరా బాద్‌లో స్థలం ఇవ్వాలని పేర్కొన్నారు. -
మందగించిన మిర్చి కొనుగోళ్లు...
ఖమ్మం, వరంగల్ మార్కెట్లకు సగానికిపైగా తగ్గిన రైతులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మిర్చి కొనుగోళ్లు మందగించాయి. ఖమ్మం, వరంగల్ వ్యవసాయ మార్కెట్లకు తరలివచ్చే మిర్చి సాధారణ రోజుల కంటే సగానికి తగ్గినట్లు మార్కెటింగ్‌శాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.5వేలకు కొనుగోలు చేస్తా మని ప్రకటించడం, రాష్ట్ర ప్రభుత్వం రూ.7వేలు చేయా లని లేఖ రాయడం తెలిసిందే. దీంతో కేంద్రం ధర పెంచుతుందన్న ఆశతోనే రైతులు తమ మిర్చిని మార్కెట్‌కు తీసుకురావడంలేదని మార్కెటింగ్ శాఖ వర్గాలు విశ్లేషి స్తున్నాయి. అంతేగాకుండా ఆయా జిల్లాల యంత్రాంగం కూడా మిర్చి అధికంగా మార్కెట్లకు రాకుండా కొంతమే రకు నియంత్రించింది. సాధారణంగా ఖమ్మం మార్కెట్‌కు రోజుకు 80వేల నుంచి లక్ష బస్తాల వరకు మిర్చి వచ్చేది. శుక్రవారం 40వేల బస్తాలకు పడిపోయిందని అధికారులు తెలిపారు. వరంగల్ మార్కెట్‌కు 70 వేల బస్తాలొచ్చే లోడు... 22 వేల బస్తాలకు పడిపోయిం దన్నారు. దీంతో ఖమ్మం మార్కెట్లో శుక్రవారం కాస్తంత ధర పెరిగింది. -
మిర్చి ‘రైతుల మంట’ సర్కార్ వైఫల్యమే
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: మిర్చి దిగుబడిపై సరిగ్గా అంచనా వేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మిర్చి రైతులను ఆదుకోవడంలో, పంట దిగుబడుల సేకరణ విషయంలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల వైఫల్యాలను కేంద్రంపై మోపడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం బీజేపీ పార్టీనాయకులు చింతాసాంబమూర్తి, డా. ఎస్.మల్లారెడ్డి, డా. ప్రకాశ్‌రెడ్డి, గోలి మధుసూదనరెడ్డి, ప్రేం సాగర్రావులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మిర్చి కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందన్నారు. 8, 9 నెలల్లో చేతికివచ్చే ఈ పంట గురించి ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు, వ్యవసాయశాఖ అధికారులు సమీక్షించి ఉత్పత్తిని ఏ విధంగా కొనుగోలు చేయాలన్న ఆలోచన చేయకపోవడం పెద్ద తప్పిదమన్నారు. మిర్చి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం వల్లే రైతులు వ్యాపారుల చేతుల్లో నలిగి పోయారన్నారు. ఇంత జరిగినా బాధ్యులైన అధికారులపై ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముందుగానే పత్తిని గొడౌన్లలో పెట్టడంతో, మిర్చికి గొడౌన్లు అందుబాటులో లేకుండా పోయాయన్నారు. -
మొదలైన ధాన్యం కొనుగోళ్లు
► ఇప్పటివరకు 3.08 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు ► సోయాబీన్ కొనుగోలుకు ఏర్పాట్లు ► మిర్చి రైతులకు కేంద్రం మొండిచెయ్యి! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభ మయ్యాయి. ఈ ఏడాది యాసంగి వరి పంట ప్రస్తుతం మార్కెట్లకు చేరుకుంటోంది. ఈ సీజన్లో 26.41 లక్షల మెట్రిక్ టన్నులమేర దిగుబడులురాగా ఇప్పటివరకు 3.08 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో ‘ఏ’ గ్రేడ్ రకం వరిని రూ.1,450, సాధారణ రకం వరిని రూ.1,410 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు మార్కెటింగ్‌శాఖ కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. వరి ధాన్యం కొనుగోలుకు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 3,076 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పౌరసరఫరాల సంస్థ ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయి. వరి పంటను ఎంఎస్పీకి తగ్గకుండా కొనుగోలు చేస్తామని పార్థసారథి వెల్లడించారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 2,025 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 16.46 లక్షల మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు చేశారు. యాసంగిలో అధి కంగా ధాన్యం వస్తుందని గమనించి మరో వెయ్యి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు సోయాబీన్ ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తోంది. అందుకోసం ఆయిల్ ఫెడ్ ద్వారా 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు కేవలం 702 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. కంది కొనుగోలుకూ చర్యలు ఈ ఏడాది కందికి ఎంఎస్పీ కంటే తక్కువ ధర పలకడంతో ప్రభుత్వ సంస్థలు రంగం లోకి దిగాయి. గతంలో క్వింటాలు కంది మార్కెట్లో రూ. 10 వేలకు పైగా ధర పలకగా, ఈసారి రూ. 4 వేల వరకు పడిపోయింది. దీంతో ప్రభుత్వ సంస్థలు క్వింటాలుకు రూ.5,050 ఎంఎస్పీకి కొనుగోలు చేశాయి. రాష్ట్రంలో 2 లక్షల మంది రైతుల నుంచి 2.08 లక్షల మెట్రిక్ టన్నుల కందిని నాఫెడ్, ఎఫ్‌సీఐ, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేశారు. ఇందుకు 95 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే పత్తిని 4.50 లక్షల మంది రైతుల నుంచి 6.40 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. అందుకోసం 92 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. అలాగే 157 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, 18,256 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ను మార్క్‌ఫెడ్, ఎఫ్‌సీఐ కొనుగోలు చేశాయి. ఇదిలా వుంటే మిర్చి రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం కనికరం చూపలేదు. మార్కెట్లో మిర్చిని వ్యాపారులు క్వింటాలుకు రూ. 4,500 మించి కొనడంలేదు. దీంతో రూ. 7,500కు కొనుగోలు చేసేలా చూడాలని, లేదంటే ప్రతీ మిర్చి రైతుకు క్వింటాలుకు రూ. 1,500 పరిహారంగా ఇవ్వాలని రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ కేంద్రానికి విన్నవించింది. దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం వెలువడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
రూ.1,500 బోనస్ ఇవ్వండి
- మిర్చి క్వింటాలుకు ఇవ్వాల్సిందిగా కేంద్రానికి తాజాగా ప్రతిపాదన - తక్కువ ధరకు విక్రయించిన, విక్రయిస్తున్న రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి - రాష్ట్ర ప్రభుత్వ గత విన్నపాలను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం - ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తున్న వ్యాపారులు - గిట్టుబాటు ధర రాక మిర్చి రైతుల ఆందోళనలు సాక్షి, హైదరాబాద్: మిర్చి రైతులకు క్వింటా లుకు రూ.1,500 బోనస్ ఇవ్వాలని తెలంగాణ మార్కెటింగ్ శాఖ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదించింది. గతంలో క్వింటాలుకు రూ.7 వేలు చెల్లించేలా చర్యలు తీసుకో వాలని కోరిన మార్కెటింగ్ శాఖ, దానితో పాటు ప్రత్యామ్నాయంగా బోనస్ విషయాన్ని ప్రస్తావించింది. 70 శాతం వరకు రైతులు వ్యాపారులకు ఇప్పటికే తక్కువ ధరకు విక్రయించినందున వారందరినీ గుర్తించి రూ.1,500 చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. తాము గతంలో పేర్కొ న్నట్లు క్వింటాలుకు గిట్టుబాటు ధరగా రూ. 7–8 వేలు చెల్లించేలా నిర్ణయం తీసుకుంటే ఇప్పటికే విక్రయించిన రైతులకు ప్రయోజనం ఉండదని, వ్యాపారులు బాగుపడతారని, కాబట్టి మిర్చి రైతులను గుర్తించి వారికి పరిహారంగా రూ.1,500 ఇవ్వడమే సమంజసమని విన్నవించింది. అలాగే మార్కెట్‌కు తరలివచ్చే రైతులకు కూడా రూ.1,500 చెల్లించేలా నిర్ణ యం తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికా రులు కోరారు. ప్రస్తుతం మార్కెట్లో మిర్చి ధర క్వింటాలుకు రూ.4,500 వరకు ధర పలుకుతోంది. ప్రభుత్వం రూ.1,500 బోనస్ ఇస్తే క్వింటాలుకు రూ.6 వేలు రైతుకు అంద నుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్రం అందుకు అంగీకరిస్తే ఇప్పటికే వ్యాపారులకు విక్రయించిన రైతులను రెవెన్యూ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గుర్తి స్తామని, ఎకరానికి సరాసరి పండిన పంటను లెక్కలోకి తీసుకొని రూ.1,500 చెల్లిస్తామని అంటున్నారు. అయితే కేంద్రం మంగళవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. జనవరి నుంచి ధర పతనం వాస్తవంగా సీజన్ ఆరంభంలో మిర్చి ధర కొంత బాగుంది. జనవరి నుంచి ధర పతనం మొదలైంది. ఫిబ్రవరిలో దాదాపు రూ.1,500 తగ్గింది. పంట ఉత్పత్తి అధికంగా వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో అనూహ్యంగా ధర పతనమైంది. మార్చి మొదట్లో రూ.8 వేలకు తగ్గగా.. రెండో వారం నుంచి రూ.6–5 వేలకు పడిపోయింది. ప్రస్తుతం రోజుకు కొంత చొప్పున ధర పడిపోతోంది. రైతుకు ఎకరా పంట సాగు, కోతకు రూ.లక్షన్నర వరకు ఖర్చు అవుతుంది. రూ. 4,500కు ధరకు పడిపోవడంతో ఎకరాలో పండిన పంట నుంచి రూ.80 వేలకు మించి రావటం లేదని రైతులు వాపోతున్నారు. ధరల పతనంతో మిర్చి రైతులు హాహాకారాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మిర్చి కొనుగోలుకు అనుమతిచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి లేఖ రాసినా, ఆ శాఖ డైరెక్టర్ ఢిల్లీకి వెళ్లి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఇష్టారాజ్యంగా ధరలు ఊహించని రీతిలో మిర్చి ధర పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాలుకు సగటున ధర రూ.4,500 మించడంలేదు. కొన్ని చోట్ల నాణ్యత లేదంటూ రూ.3 వేలకు మించి కొనుగోలు చేయడంలేదు. తక్కువ ధరపై రైతులు ప్రశ్నిస్తే కొనుగోలు చేయ కుండా వ్యాపారులు సతాయిస్తున్నారు. బతిమిలాడితే మరో వందో యాభయో చేతిలో పెడుతున్నారు. ఇలా వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధర నిర్ణయిస్తూ మిర్చి కొనుగోలు చేస్తున్నారు. -
కందుల కొనుగోలును నిలిపేయొద్దు
ఎఫ్‌సీఐ ఎండీకి మంత్రి హరీశ్‌రావు ఫోన్ సాక్షి, హైదరాబాద్: కందుల కొనుగోలు ప్రక్రియను నిలిపి వేయరాదని... కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఎండీ త్రిపాఠీకి రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు త్రిపాఠీకి ఫోన్ చేసి రాష్ట్రంలో కందుల దిగుబడి అధికంగా వచ్చిందని చెప్పారు. కొనుగోలు కేంద్రాలను మూసివేయకుండా, ఎఫ్‌సీఐ ఉన్నతా ధికారులతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించాలని ఢిల్లీలోనే ఉన్న శాఖ కార్యదర్శి పార్థసారథిని మంత్రి ఆదేశించారు. కందులు కొనుగోలు చేస్తున్న నాఫెడ్ సంస్థ ఎదుర్కొంటున్న ఖాళీ సంచుల కొరత పరిష్కారానికి మంత్రి చర్యలు తీసుకున్నారు. ఆంధ్రపదేశ్ నుంచి 2.50 లక్షల ఖాళీ సంచులను తెప్పించినట్టు నాఫెడ్ తెలిపింది. మరో 5 లక్షల ఖాళీ సంచులు కూడా ఒకటి రెండు రోజుల్లో రానున్నట్టు నాఫెడ్ అధికారులు తెలిపారు. కాగా కొందరు ప్రైవేటు వ్యాపారులు రైతుల దగ్గర రూ. 4 వేలకు కొని ప్రభుత్వ రంగ సంస్థల కొనుగోలు కేంద్రాల దగ్గర మద్దతు ధర.. రూ.5,050కి అమ్ముతున్నట్లు వస్తున్న వార్తలపై మంత్రి స్పందించారు. వ్యాపారులు కొనుగోలు చేసిన కందులు రీసైక్లింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ డీజీ త్రివేదీని కోరారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలకు, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని మంత్రి సూచించారు. -
రైతన్నకు భరోసా
వినియోగదారులకు తాజా కూరగాయలు ‘మన కూరగాయల పథకం’ లక్ష్యమిదే: హరీశ్ సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన పంటకు కచ్చితమైన మార్కెట్ సదుపాయం కల్పించి, లాభదాయకమైన ధర చెల్లించటంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన తాజా కూరగాయలు అందించేందుకు ‘మన కూరగాయల పథకం’ ప్రవేశపెట్టామని మార్కెటింగ్ శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. మన కూరగాయల పథకం కింద హైదరాబాద్‌లో 100 రిటైల్ ఔట్లెట్లు ఏర్పాటు చేసి, అవి కుదురుకున్న తర్వాత రాష్ట్రం అంతటికీ విస్తరిస్తామని చెప్పారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు సుధీర్‌రెడ్డి, ఎం.కృష్ణారావు, బాలరాజు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ పథకం కింద మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలో 21 కూరగాయల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి రోజుకు 100 క్వింటాళ్ల కూరగాయలను సేకరిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లోని బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్లో పంపిణీ కేంద్రం ఏర్పాటు చేసి నగరంలో 19 రిటైల్ ఔట్లెట్ల ద్వారా కూరగాయలు విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్ర నుంచి వచ్చే డీఎస్పీలను తీసుకోం: నాయిని కమలనాథన్ కమిటీ సిఫారసు మేరకు ఆంధ్ర ప్రాంతం నుంచి 28 మంది డీఎస్పీలను తెలంగాణకు కేటాయిస్తున్నారని, వారిని తీసుకుంటే భవిష్యత్తులో భారీ నష్టం జరుగుతుందని, వారిని ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంటుందా? లేదా అని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అడిగారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సమాధానం చెప్తూ ..ఆంధ్ర నుంచి వచ్చిన డీఎస్పీలను తీసుకోబోమని స్పష్టంచేశారు. జాతీయ రహదారులకు ఇరువైపులా ఉన్న బార్లను, మద్యం దుకాణాలను సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా త్వరలోనే తొలగిస్తామని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
లెస్ టెండర్లతో గోదాముల నిర్మాణంలో రూ.150కోట్ల ఆదా
మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటన సాక్షి, హైదరాబాద్: ఆహారధాన్యాల నిల్వకోసం 330 ప్రాంతాల్లో గోదా ములను మంజూరు చేశామని, ఇందులో 321 ప్రాంతాల్లో గోదాముల నిర్మాణ పనులను ప్రారంభించామని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. రూ.1024.50 కోట్ల నాబార్డు రుణంతో మొత్తంగా 17.07లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో వీటిని చేపట్టామని వెల్లడించారు. గోదాములకోసం ఖర్చు చేస్తున్న ప్రతీ పైసాకు ఆన్లైన్ టెండర్లు పిలిచామని, అత్యంత పారదర్శకంగా ఈ జరిగిన టెండర్ల కారణంగా 11.5 లెస్తో మొత్తంగా రూ.150 కోట్ల మేర ఆదా అయిందని తెలిపారు. సోమవారం సభ్యులు మర్రి జనార్దన్‌రెడ్డి, బాజిరెడ్డి, కోమటిరెడ్డి, రేవంత్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. నిమ్స్‌లో అవినీతిపై చర్యలు: మంత్రి లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిమ్స్‌లో అవినీతి జరగలేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభ్యులు సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, రామ్మోమన్రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. కోర్టు తదుపరి ఉత్తర్వులను అనుసరించి వీరిపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా,అన్ని ప్రధాన ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
ఒకే గొడుగు కిందికి అన్ని గోదాములు!
• మార్కెటింగ్ శాఖ సమీక్షలో మంత్రి హరీశ్‌రావు ఆదేశం • నగదు రహితంగా మార్కెటింగ్ శాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ సంస్థలు, శాఖల కింద ఉన్న గోదాములన్నింటినీ గిడ్డంగుల సంస్థ కిందకు తీసుకురావాలని మంత్రి హరీశ్‌రావు నిర్ణరుుంచారు. అవసరమైన కసరత్తు కోసం ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని నియ మించారు. మంత్రి హరీశ్‌రావు గురువారం వివిధ అంశాలపై సచివాలయంలో సుదీర్ఘంగా సమీక్షిం చారు. మార్కెటింగ్, పౌర సరఫరాలు, వేర్ హౌసింగ్, వ్యవసాయ, ఆగ్రో సీడ్స, మార్క్‌ఫెడ్ సంస్థల కింద ఉన్న గోదాముల నిర్వహణ, కార్య కలాపాలన్నింటినీ ఒకే గొడుగు పరిధిలోకి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సం స్థల గోదాములు ఖాళీగా ఉంటూ, ప్రైవేటు గోదా ములు నిండుతున్న పరిస్థితి తక్షణం మారాలని, ప్రైవేటువ్యక్తులు, సంస్థలకు పోటీగా ప్రభుత్వ విభా గాలు సమర్థంగా పనిచేయాలని సూచించారు. వివిధ సంస్థల గోదాములన్నింటినీ గిడ్డంగుల సంస్థ పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై కసరత్తు చేసేం దుకు మార్కెటింగ్ శాఖ జేడీ, ఎస్ఈ , వేర్ హౌసిం గ్ జీఎం, ఈఈ , పౌర సరఫరాల సంస్థ జీఎం, డీఎం, మార్క్‌ఫెడ్ జీఎంలతో ఒక కమిటీని మంత్రి నియమించారు. కమిటీకి నోడల్ అధికారిగా వ్యవ సాయ శాఖ కమిషనర్, వేర్ హౌజింగ్ ఎండీ జగన్ మోహన్ ఉంటారు. గోదాములను ఆధునీక రించా లని, సీసీ కెమెరాల ఏర్పాటు, వివరాలను ఆన్లైన్ చేయడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నగదు రహితం దిశగా చర్యలు రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్లు, రైతు బజా ర్లను నగదు రహితంగా మార్చాలని అధికా రులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఇప్పటికే హరితహారం వంటి కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ నంబర్ వన్‌గా పేరు తెచ్చుకుందని.. అలాంటి స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. నగదు రహిత లావాదేవీలతో మార్కెట్ యార్డుల్లో జీరో దందాలకు చెక్ పెట్టవచ్చన్నారు. రైతులకు, మార్కె ట్ సిబ్బందికి నగదు రహిత విధానంపై తగిన శిక్షణ ఇవ్వాలని సూచించారు. వరంగల్ మార్కెట్ కమిటీ అమలు చేస్తున్న నగదు రహిత విధానాలను అన్ని మార్కెట్లలో అమలు చేయాలన్నారు. రైతులతో పాటు మార్కెట్లలో పనిచేసే దడ్వారుులు, హమా లీలు, ఇతర కార్మికులందరికీ బ్యాంకు ఖాతాలు తెరిచి, డెబిట్‌కార్డులు కూడా అందేలా చూడాల న్నారు. మార్కెట్లలో మైక్రో ఏటీఎం లను ఏర్పాటు చేయాలని, బ్యాంకు ఖాతాలున్న రైతులకు ఆర్టీజీ ఎస్ ద్వారా చెల్లింపులు చేయాలని చెప్పారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించాల్సిందిగా జిల్లా కలెక్టర్లను కోరామని, సమస్యలుంటే కలెక్టర్లతో సంప్రదిం చాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ మార్కెట్ కమిటీకి పాలకవర్గం హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమి టీని మంత్రి హరీశ్‌రావు గురువారం ప్రక టిం చారు. కమిటీ చైర్ పర్సన్‌గా షాహీన్ అఫ్రోజ్, వైస్ చైర్మన్‌గా భువనేశ్వరిని ఎంపిక చేశారు. -
వ్యవసాయ మార్కెట్లలో పడిపోతున్న ధాన్యం కొనుగోళ్లు
సర్కారుకు మార్కెటింగ్‌శాఖ నివేదిక సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో మార్కెట్లోకి వస్తున్న ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు పెద్ద ఎత్తున పడిపోతున్నాయని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి విన్నవిస్తూ సమగ్ర నివేదికను శనివారం అందజేసింది. ధాన్యంతో మార్కెట్లకు వచ్చే రైతులకు చిల్లర సమస్య ఎదురవుతోందని అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. రైతు ధాన్యాన్ని విక్రరుుంచిన తర్వాత రవాణా ఖర్చు, లోడింగ్, అన్లోడింగ్, హమాలీల కూలీ తదితర చెల్లింపులకు చిల్లర ఉండట్లేదని పేర్కొన్నారు. ధాన్యం కొనే వ్యాపారులు కూడా చిన్న నోట్లు లేకపోవడంతో సరుకు కొనేందుకు ఆసక్తి కనబరచట్లేదని నివేదికలో వివరించారు. ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా జరుగుతున్న పత్తి, వరి, మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన మొత్తాలను రైతుల ఖాతాల్లో ఆన్లైన్, ఆర్టీజీఎస్ విధానంలో చెల్లిస్తున్నారు. అరుుతే ఖాతాల్లో జమ అరుున మొత్తాన్ని తీసుకోవడంలో ఉన్న పరిమితుల కారణంగా రైతులకు కష్టాలు తప్పట్లేదని అధికారులు పేర్కొన్నారు. పది రోజులుగా పెద్ద నోట్లు చెల్లకపోవడం, చిన్న నోట్లు ఇవ్వని పరిస్థితుల వల్ల వారి జీవితాలు అతలాకుతలం అయ్యాయని పేర్కొన్నారు. రైతులకు, హమాలీలకు సరిగా చెల్లించలేని పరిస్థితి తలెత్తడంతో కేసముద్రం, మహబూబాబాద్ మార్కెట్లను మూసేశారని వెల్లడించారు. అరుుతే సూర్యాపేట, తిరుమలగిరి వంటి చోట్ల చెక్‌లు, ఆర్టీజీఎస్ ద్వారా రైతులకు చెల్లింపులు చేస్తున్నారని వివరించారు. రబీలో రైతులకు అవసరమైన రోజువారీ ఖర్చుల కోసం కొంతమేర చిన్న కాగితాల సొమ్ము అవసరమని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే మార్కెట్లలో కమీషన్ ఏజెంట్లకు కూడా రోజువారీ కూలీలకు, హమాలీలకు, రైతులకు చెల్లించేందుకు నగదు అవసరమని పేర్కొన్నారు. చెక్కుల రూపంలో చెల్లింపులు జరుపుతున్నా బ్యాంకుల్లో వాటిని మార్చుకోవడం.. అవసరమైనంత తీసుకోవడం రైతులకు కష్టంగా మారిందన్నారు. దీనివల్ల రబీలో అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల కొనుగోలుకు రైతులకు ఇబ్బందిగా మారిందన్నారు. ప్రైవేటు వ్యాపారులు కూడా రైతులకు అప్పుల రూపంలో ఇచ్చే సొమ్ము కూడా నిలిచిపోరుుందన్నారు. మార్కెట్లో కొనుగోళ్లు నిలిచిపోకుండా ఐకేపీ సహా ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నామని వివరించారు. -
ఉల్లి కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
- కిలో ఉల్లి రూ.8కి కొని రూ.10కి అమ్మాలని మంత్రి హరీశ్ ఆదేశం - పత్తి ధర తగ్గకుండా చూడాలని మార్కెటింగ్ అధికారులకు సూచన సాక్షి, హైదరాబాద్: కొల్లాపూర్, ఆలంపూర్ రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉల్లిని మలక్‌పేట మార్కెట్లోనూ, రైతు బజార్లలోనూ అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి కిలో రూ.ఎనిమిదికి కొని వినియోగదారులకు రూ.10కి అమ్మాలని కోరారు. రైతుల నుంచి ఉల్లి సేకరణ, కొనుగోలుకు మార్కెటింగ్ శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. అరుుతే మలక్‌పేట ఉల్లి మార్కెట్ ఇరుకుగా ఉన్నందున పటాన్ చెరుకు ఆనుకొని ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డుకు ఉల్లి మార్కెట్‌ను తరలించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎవరైనా ఉల్లి కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యంత ఆధునిక సౌకర్యాలతో మార్కెట్ ఏర్పాటుకు గాను పుణే ఉల్లి మార్కెట్‌ను అధ్యయనం చేయడానికి ఒక బృందాన్ని పంపాలని హరీశ్‌రావు వివరించారు. పాత 500, 1,000 నోట్లతో మార్కెటింగ్ కార్యకలాపాల స్తంభనపై మంత్రి హరీశ్‌రావు మంగళవారం మూడు గంటలకు పైగా సమీక్షించారు. ముందుగా ఉల్లి వ్యాపారులతో పరిస్థితిని సమీక్షించారు. రూ. 500, 1,000 నోట్ల రద్దు వల్ల వ్యాపార లావాదేవీలు జరపలేమని వారన్నారు. ఏదిఏమైనా వినియోగదారులకు ఉల్లి కొరత లేకుండా చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్‌శాఖ అధికార యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు. త్వరలో కొత్త వ్యవసాయ మార్కెట్ చట్టం వ్యవసాయ మార్కెట్ చట్టంలో సంస్కరణలు తీసుకువచ్చి కొత్త చట్టం రూపొందించేందుకు ‘నల్సార్ ’వర్సిటీ ప్రతినిధులతో మరో వారంలో సమావేశం జరపాలని మంత్రి నిర్ణరుుంచారు. పత్తి ధర క్వింటాలుకు ప్రస్తుతం రూ.4,500 నుంచి రూ.5,000 లభిస్తున్నదని.. ఈ ధర తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. జిన్నింగ్ మిల్లులపై రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నందున ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఉన్న జిన్నింగ్ మిల్లులను తనిఖీ చేసి, ట్రేడర్లతో సమావేశాలు జరిపి సమస్య పరిష్కరించాలని మంత్రి కోరారు. అలాగే కమిషన్ ఏజెంట్లకు లెసైన్సుల జారీ వ్యవహారంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వెళ్లాలని మార్కెటింగ్ డెరైక్టర్ లక్ష్మీబారుుని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. నల్లగొండలో తలపెట్టిన బత్తారుు మార్కెట్ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు పంపాలని కోరారు. -
మార్కెటింగ్ శాఖ ద్వారా రైతులకు పథకాలు
మార్కెటింగ్ శాఖ కమిషనర్ పెద్దాపురం : వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రభుత్వం రైతులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ మల్లికార్జునరావు తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం పెద్దాపురంలోని నూతన కూరగాయల మార్కెట్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం పెద్దాపురం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ చైర్మ¯ŒS ముత్యాల వీరభద్రరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు మార్కెటింగ్ శాఖ కృషి చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి మార్కెటింగ్ శాఖ నిధులు వెచ్చిస్తున్నట్టు చెప్పారు. పట్టణాల్లో కూరగాయాల మార్కెట్లకు నూతన భవనాలు నిర్మిస్తున్నామన్నారు. వీటి ద్వారా హోల్‌సేల్ ధరలకే కూరగాయలను ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీటిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మ¯ŒS రాజా సూరి బాబు రాజు, మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, మున్సిపల్ డీఈఈ ప్రభాకరరావు, ఏఈ సుధాకర్, వార్డు కౌన్సిలర్లు నాగమ ణి, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి సూర్యప్రకాష్, సూపర్ వైజర్ వెంకన్నబాబు పాల్గొన్నారు. -
తెలంగాణ నేలపై పసిడి పంటలు
సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: హరీశ్‌రావు - రైతులకు నీరందితే తమకు ఓట్లు పడవనే ప్రతిపక్షాల దుష్ర్పచారం సాక్షి, నాగర్‌కర్నూల్: ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసి తెలంగాణ నేలపై పసిడి పంటలు పండిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. రైతు కళ్లల్లో ఆనందం చూడటమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆయన పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, అలాగే వ్యవసాయ మార్కెట్ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేశామని, ఇందుకు అవసరమైన భూసేకరణను జీఓ నం.123 ప్రకారమే చేస్తున్నట్లు చెప్పారు. భూములను ఇచ్చేందుకు రైతులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పథకం ద్వారా డిండి ప్రాజెక్టును నింపడంతోపాటు నల్లమల ప్రాంతానికి కూడా సాగునీరు అందించే యోచనలో ప్రభుత్వం ఉందని వివరించారు. ఇప్పటివరకు పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. అదేవిధంగా ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలుచేస్తున్నామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన నాగర్‌కర్నూల్ జిల్లాలో కరువు తాండవిస్తోందని మంత్రి పేర్కొన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్ఐ) ద్వారా జిల్లాలోని 60 శాతం చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయని, తద్వారా పంటలు పండితే తమకు ఉనికి ఉండదన్న అక్కసుతోనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అసత్యపు ప్రచారం చేస్తున్నారని హరీశ్‌రావు చెప్పారు. విపక్షాల విమర్శల్లో పసలేదు దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారని, ఆయన అనుసరిస్తున్న విధానాలే నేడు అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా మారిన తరుణంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఈ విషయాన్ని అంగీకరించకపోవడం విచారకరమని హరీశ్‌రావు అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో ఏమాత్రం పసలేదని, రాబోయే అసెం బ్లీ ఎన్నికల్లో వారికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నాగర్‌కర్నూల్ జిల్లాతోపాటు వనపర్తి జిల్లాకు సాగునీరు అందించినట్లు తెలిపారు. ఇప్పటికే లక్ష ఎకరాల్లో యాసంగి పంట వేసేందుకు చెరువుల్లో నీరు సిద్ధంగా ఉందని జూపల్లి పేర్కొన్నారు. గతంలో ఒక ప్రాజెక్టు నిర్మించేందుకు దశాబ్దాలు పట్టేదని, అదే టీఆర్ఎస్ ప్రభుత్వం మూడు, నాలుగేళ్లలోనే ప్రాజెక్టులను పూర్తిచేసి రైతుల మన్ననలు పొందిందన్నారు. అచ్చం రైతన్నలా... మంత్రి హరీశ్‌రావు ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా పర్యటనలో ఆయన ధరించిన పంచెకట్టు రైతులను విశేషంగా ఆకట్టుకుంది. జిల్లా మంత్రి జూపల్లి కష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తదితరులు నాగర్‌కర్నూల్ వ్యవసాయ మార్కెట్ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి పంచెకట్టులో హాజరయ్యారు. మంత్రి ధరించిన పంచెకట్టు బాగుందని, రైతుల కోసం నిత్యం శ్రమిస్తున్న హరీశ్ పంచెకట్టులో సహజమైన రైతులా ఉన్నాడంటూ పలువురు రైతులు కితాబులిచ్చారు. కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మిబారుు, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
ఏడీఎం కార్యాలయ భవన పరిశీలన
మానుకోట ఏఎంసీ భవనంపై కార్యాలయం బోర్డు ఏర్పాటు మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడనున్న తరుణంలో స్థానికంగా జిల్లాస్థాయి అధికారుల కార్యాలయాల ఏర్పాటుకు కసరత్తు ఊపందుకుంది. ఇందులో భాగంగా మార్కెటింగ్ శాఖకు సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. తాజాగా బుధవారం వరంగల్ మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ ప్రవీణ్‌రెడ్డి మహబూబాబాద్‌కు వచ్చారు. స్థానిక ఏఎంసీ సెక్రటరీ వి.సుచిత్ర, సూపర్వైజర్ శ్రీనివాసరాజుతో కలిసి ఏడీఎం కార్యాలయ ఏర్పాటుకు ఎంపిక చేసిన భవనాన్ని పరిశీలించారు. అక్టోబర్ 1కల్లా ఏడీఏం కార్యాలయ ఫర్నీచర్ మహబూబాబాద్‌కు చేరుతుందని ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ భవనంపైన జిల్లా మార్కెటింగ్ కార్యాలయం బోర్డును కూడా ఏర్పాటు చేయించడం గమనార్హం. -
చితికిన టమాటా
చేవెళ్ల: మార్కెట్లో టమాటా ధర ఒక్కసారిగా పడిపోరుుంది. కిలో ధర రూ.2 కూడా పలకడం లేదు. దీంతో పంట కోసం పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటను తెంపేందుకు కూలీలు, మార్కెట్‌కు తరలించేందుకు రవాణా చార్జీలు పెట్టుకునే పరిస్థితి లేకపోవడంతో చాలా చోట్ల అన్నదాతలు చేలల్లోనే పంటలను వదిలేస్తున్నారు. మరికొన్ని చోట్ల పశువులకు మేతగా వినియోగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వ్యవసాయ మార్కెట్లో శనివారం 25 కిలోల టమాటా బాక్స్ ధర నాణ్యతను బట్టి రూ.40 నుంచి రూ.60 రూపాయలలోపే పలికింది. దీంతో రైతులు ఏమిచేయాలో దిక్కతోచని స్థితిలో ఉన్నారు. మండలంలోని గుండాల, చనువల్లి, పామెన, అల్లవాడ, ఇబ్రహీంపల్లి, దేవునిఎరవ్రల్లి, కమ్మెట, ఊరెళ్ల, తదితర గ్రామాల్లో టమాటా అధికంగా సాగు చేస్తారు. ఇక్కడి నుంచి చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌తో పాటుగా నగరంలోని గుడిమల్కాపూర్, సికింద్రాబాద్ సమీపంలోని బోరుున్ పల్లి కూరగాయల మార్కెట్లకు టమాటాను తరలిస్తారు. ధరలు బాగా ఉన్నప్పుడు గిట్టుబాటవుతున్నా.. పతనమైనప్పుడు మాత్రం అన్నదాతలు అప్పులపాలవుతున్నారు. నెలరోజులుగా టమాటా బాక్సు ధర (25 కిలోలు) రూ.100 పలుకగా.. గడచిన 15 రోజులుగా రూ. 60కి పడిపోరుుంది. దీనికి తోడు ఇటీవల కురిసిన వర్షాలకు టమాటా పండ్లుగా మారి చితికిపోతుండడంతో వాటిని చేలవద్దే వదిలేస్తున్నారు. తక్కువ ధర ఉన్న టమాటాను మార్కెట్‌కు తరలించి రవాణా, కూలీల చార్జీలు జేబు నుంచి పెట్టుకోవాల్సి వస్తుందని చేసేది లేక అక్కడే వదిలేయడమో, పశువులకు మేతగా వేయడమో చేస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా బహిరంగ మార్కెట్లో మాత్రం కిలో రూ. 5 నుంచి రూ.6 ధర పలుకుతుండడం గమనార్హం. రూ. 5కు కొనుగోలు ఏమైనట్లు.. ధర తక్కువగా ఉండడంతో టమాటా రైతులు నష్టపోకుండా ఉండడానికి ప్రభుత్వమే కిలో రూ. 5 చొప్పున కొనుగోలు చేస్తుందని ఇటీవల మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించిన సంగతి విదితమే. దీంతో రైతులు మార్కెట్ అధికారులను సంప్రదించగా తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు, సూచనలుగాని ప్రభుత్వం నుంచి రాలేదని చెబుతున్నారని ఇబ్రహీంపల్లికి చెందిన రైతు వెంకట్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలును ప్రారంభిస్తే తమకు కొంతమేరకై నా లాభం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కిలో టమాటా కనీసం రూ. 10 చొప్పున చేను వద్దనే కొనుగోలు చేస్తే రవాణా చార్జీలు మిగులుతాయని రైతులు పేర్కొంటున్నారు. ఇంకా ఆదేశాలు రాలేదు టమాటా కిలో రూ.5 కు కొనుగోలు చేసే విషయంలో తమకు ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వారు సూచించిన ధరకు కొనుగోలు చేస్తాం. త్వరలో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. - భగవంతు, ఇన్ చార్జి కార్యదర్శి,చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ -
పంటకు ఊపిరి
- రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు - ఊపిరిపీల్చుకున్న అన్నదాత సాక్షి, హైదరాబాద్: ఆలస్యంగానైనా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో పంటలకు ప్రాణం వచ్చింది! ఎండిపోతున్న అనేక పంటలకు ఈ వానలు ఊపిరి పోశాయి. ఇప్పటికే ఎండిపోయి న మొక్కజొన్న మినహాయిస్తే మిగిలిన పంటలకు తాజా వర్షాలతో ఉపయోగం ఉంటుందని వ్యవసాయశాఖ తెలిపింది. ప్రధానంగా కంది, పత్తి పంటలకు ఈ వర్షాలు ప్రాణదాతగా నిలుస్తాయని అంచనా వేసింది. సమయం మించిపోయినందున ఇప్పుడు ఖరీఫ్ వరి నాట్లు వేయడం కష్టమేనని.. అందుకే రైతులు ముందస్తు రబీకి వెళ్లడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ఆశలు వదులుకోవాల్సిందే రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సాధారణ విస్తీర్ణం 1.07 కోట్ల ఎకరాలు. ఇందులో 90 లక్షల ఎకరాల్లో (84%) సాగు జరిగింది. అత్యధికంగా పత్తి 30 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. మొక్కజొన్న 14.32 లక్షల ఎకరాల్లో వేశారు. సాధారణం కంటే 118 శాతం అధికంగా ఈ పంటను సాగు చేశారు. అలాగే కంది 10.64 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. సోయాబీన్ 7.36 లక్షల ఎకరాల్లో వేశారు. పత్తికి ప్రత్యామ్నాయంగా సోయా, కంది, మొక్కజొన్న తదితర పంటలు వేయాలని సర్కారు సూచించడంతో రైతులు అనేక మంది ఈ పంటలను ఎంచుకున్నారు. అయితే ఆగస్టు చివరి వరకు పెద్దగా వర్షాల్లేకపోవడంతో మొక్కజొన్న దాదాపు 75 శాతం వరకు ఎండిపోయింది. దాదాపు 10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న ఎండిపోయినట్టు అంచనా వేశారు. మిగిలిన 25 శాతం పంటకు ఈ వర్షాలు కొంతమేర ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. కందికి మాత్రం ఈ వర్షాలు నూటికి నూరు శాతం ప్రయోజనం చేకూర్చనున్నాయి. వరి ఖరీఫ్‌లో 24.35 లక్షల ఎకరాల్లో వేయాల్సి ఉండగా... ఇప్పటివరకు 15.04 లక్షల ఎకరాల్లో(62%) నాట్లు పడ్డాయి. ముంచెత్తుతున్న వానలు రెండు మూడ్రోజులుగా వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. పలుచోట్ల వాగులు పొంగుతున్నాయి. చెరువులు నిండడంతో భూగర్భజల మట్టం పెరిగి బోర్లపై ఆధారపడ్డ రైతులకు ఉపశమనం కలుగనుంది. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం 8.30 గంటల వరకు రంగారెడ్డి జిల్లా పెద్దేముల్లో 22 సెం.మీ. కుండపోత వర్షం కురిసింది. అదే జిల్లా పరిగిలో 21, గాండీడ్లో, వరంగల్ జిల్లా పర్వతగిరిలో 13 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. జూన్ 1 నుంచి బుధవారం వరకు రాష్ట్రంలో 584.3 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా... బుధవారం నాటికి 549 మి.మీ. (6 శాతం లోటు) కురిసింది. కాగా, రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డులలో వ్యవసాయ ఉత్పత్తులు తడిసిపోకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టం జరగకుండా వారి ఉత్పత్తులను యార్డుల్లోని షెడ్లలో నిల్వ చేయాలన్నారు. మార్కెటింగ్ శాఖ పనితీరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. మరోవైపు ఉపరితల ఆవర్తనం, రుతుపవనాలు పుంజుకోవడంతో ఏపీలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో గుంటూరు జిల్లా జంగమేశ్వరపురంలో 120 మిల్లీమీటర్లు గరిష్ట వర్షపాతం కురిసింది. -
సరిహద్దుల్లో సమీకృత చెక్‌పోస్టులు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ల ఆదాయం పెంపు లక్ష్యంగా రాష్ట్ర సరిహద్దుల్లో సమీకృత చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మార్కెటింగ్ శాఖ ఇప్పటికే రాష్ట్ర సరిహద్దులు, మార్కెట్ యార్డుల పరిధిలో చెక్‌పోస్టులను నిర్వహిస్తున్నా.. పూర్తిస్థాయి సౌకర్యాలు లేక ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. సరిపడినంత సిబ్బంది, పర్యవేక్షణకు అవసరమైన మౌళిక సౌకర్యాలు లేకపోవడంతో వ్యవసాయ ఉత్పత్తులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో రవాణా, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖలతో కలిసి సమీకృత చెక్‌పోస్టుల ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ మొగ్గు చూపుతోంది. ప్రస్తుతం మార్కెటింగ్ శాఖ రాష్ట్ర సరిహద్దుల్లో 14 చెక్‌పోస్టులను నిర్వహిస్తుండగా.. ఇతర శాఖలతో కలిసి సమీకృత చెక్‌పోస్టుల సంఖ్యను 16కు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు వాటి ఏర్పాటుకు అవసరమైన మౌలిక సౌకర్యాలపై మార్కెటింగ్ శాఖ నివేదిక సిద్ధం చేసింది. చెక్‌పోస్టుల వద్ద రవాణా వాహనాలతోపాటు వ్యవసాయ ఉత్పత్తులను తరలించే వాహనాల వివరాల నమోదుకు కామన్ ఎంట్రీ పాయింట్ ఉండాలని అధికారులు ప్రతిపాదించారు. కామన్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ పరికరాలు, ఇంటర్నెట్ సౌకర్యం, ఫర్నీచర్ తదితర మౌలిక సౌకర్యాల కల్పన వంటి అంశాలను నివేదికలో ప్రస్తావించారు. మూడు షిఫ్టుల్లో వాహనాల తనిఖీ, వివరాల నమోదుకు.. షిఫ్టుకు ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు సిబ్బంది అవసరమవుతారని అంచనా వేశారు. ఈ ఇద్దరిలో ఒకరు సహాయ కార్యదర్శి, మరొకరు సూపర్వైజర్ ఉంటారు. వాహనాల బరువును తూకం వేసేందుకు చెక్‌పోస్టుల వద్ద వే బ్రిడ్జిల ఏర్పాటును తప్పనిసరి చేయాలని నివేదికలో పేర్కొన్నారు. వివిధ వాహనాల బరువును తూకం వేసేందుకు ప్రత్యేక వరుసలను ఏర్పాటు చేయాలని.. సీజ్ చేసే వాహనాలను నిలిపేందుకు షెడ్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు. నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకే! రాష్ట్రంలో ప్రస్తుతం 180 వ్యవసాయ మార్కెట్ యార్డులున్నాయి. చెక్‌పోస్టుల ద్వారా లభించే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తంగా రూ.358.57 కోట్లను మార్కెట్ ఫీజు లక్ష్యంగా నిర్దేశించారు. వర్షాభావంతో సాగు విస్తీర్ణంపై ప్రభావం, పత్తి విత్తనాలు, బియ్యంపై మార్కెట్ ఫీజు వసూలు విషయంలో అస్పష్టత నేపథ్యంలో మార్కెట్ ఫీజు వసూలుపై ప్రభావం పడుతోంది. వరి ధాన్యం, వేరుశనగ, ఇతర పప్పుధాన్యాలను రాష్ట్ర సరిహద్దులు దాటకుండా చూడటం ద్వారా మార్కెట్ ఫీజు వసూలును పెంచాలని భావిస్తున్నారు. అయితే సొంతంగా చెక్‌పోస్టుల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, మౌలిక సౌకర్యాలు మార్కెటింగ్ శాఖకు లేకపోవడంతో.. తనిఖీలు, ఆదాయంపై ప్రభావం చూపుతోంది. మరోవైపు అలంపూర్ క్రాస్ రోడ్డు వంటి జాతీయ రహదారులపై సొంతంగా చెక్‌పోస్టుల ఏర్పాటు, నిర్వహణ కష్టసాధ్యమని మార్కెటింగ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. రవాణా, వాణిజ్య, ఎక్సైజ్ శాఖలు సమీకృత చెక్‌పోస్టుల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఆయా శాఖలతో కలిసి వీటిని ఏర్పాటు చేయడం ద్వారా నిర్వహణ భారం తగ్గించుకోవాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. -
ప్రభుత్వ గోదాములకే ప్రాధాన్యం
- ఆ తర్వాతే ప్రైవేట్ గోదాముల్లో నిల్వలు - మార్కెటింగ్ శాఖ పనితీరుపై మంత్రి హరీశ్ సమీక్ష సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ గోదాములు భర్తీ అయిన తర్వాతే ప్రైవేటు గోదాములకు నిల్వలు తరలించాలని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. రైతులు, వ్యాపారులు, పౌర సరఫరాల శాఖ తమ అవసరాల కోసం ప్రభుత్వ గోదాములకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు లేఖలు రాయాల్సిందిగా మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ పనితీరుపై మంత్రి హరీశ్‌రావు శనివారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ గోదాముల్లో ఆక్యుపెన్సీ పెంచేందుకు పౌర సరఫరాల సంస్థ, మార్క్‌ఫెడ్, విత్తనాభివృద్ధి సంస్థ తదితర అన్ని ప్రభుత్వ సంస్థలు తప్పనిసరిగా వినియోగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్రైవేటు గోదాముల్లో నిల్వ చేసే పక్షంలో మార్కెటింగ్ శాఖ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలన్నారు. జాతీయ వ్యవసాయ మార్కెట్లతో స్థానిక మార్కెట్లను అనుసంధానించడంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించడంతో పాటు వ్యాపారులు, రైతులకు ఉపయోగపడేలా మొబైల్ యాప్‌ను సెప్టెంబర్ 15లోగా అందుబాటులోకి తేవాలన్నారు. అసంపూర్తిగా ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డుల గోదాముల నిర్మాణాన్ని సెప్టెంబర్ 15లోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. 17.75 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యమున్న 330 గోదాముల నిర్మాణం చేపట్టగా వాటిల్లో 101 గోదాముల నిర్మాణం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మార్కెటింగ్ శాఖ చేపట్టిన ‘మన కూరగాయలు’ పథకానికి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, ప్రస్తుతం నడుస్తున్న 21 ఔట్‌లెట్లతోపాటు మరో ఆరు నిర్మాణంలో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ డైరక్టర్ డాక్టర్ శరత్, అదనపు డైరక్టర్ లక్ష్మిబాయి తదితరులు పాల్గొన్నారు. టమాట రైతులకు ప్రోత్సాహక ధర టమాట ధరలు తగ్గిన నేపథ్యంలో రైతులకు ప్రోత్సాహక ధర ఇప్పించాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. మన కూరగాయలు పథకంలో భాగంగా సేకరణ కేంద్రాల ద్వారా రైతుల నుంచి కిలోకు రూ.5 చొప్పున కొనుగోలు చేస్తారు. రైతుబజార్ల ద్వారా అమ్ముకునే రైతులకు ప్రాధాన్యమిస్తూ వినియోగదారులకు రూ.7కు తగ్గకుండా విక్రయిస్తారు. -
ఇక చవకగా ‘మన కూరగాయలు’!
- ప్రత్యేక విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్న సర్కారు - హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో వందకు పైగా ఔట్లెట్లు - ప్రయోగాత్మకంగా ఇప్పటికే ఓ ఔట్లెట్ ప్రారంభం - సేకరణ, విక్రయ బాధ్యతలు ప్రైవేటు సంస్థలకు అప్పగింత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, వినియోగదారులకు తక్కువ ధరకే కూరగాయలు అం దించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మన కూరగాయలు’ పేరుతో ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. దీనిపై వ్యవసాయ మార్కెటింగ్ విభాగం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ప్రస్తుతమున్న రైతు బజార్లలో సేవలు మెరుగుపరుస్తూనే ‘మన కూరగాయలు’ పథకంపై విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. వాస్తవానికి మన కూరగాయలు పేరిట మార్కెటింగ్ శాఖ ఇప్పటికే రైతుల నుంచి కూరగాయలు కొనుగోలు చేసి.. రైతుబజార్లు, ప్రభుత్వ కార్యాలయాలు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా విక్రయిస్తోంది. తాజాగా ‘మన కూరగాయలు’ ఔట్లెట్ల ఏర్పాటుపై దృష్టి సారిం చింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో వందకు పైగా మన కూరగాయలు ఔట్లెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రయోగాత్మకంగా నారాయణ గూడలోని బీఎస్ మెల్కోటే పార్కులో తొలి ఔట్‌లెట్‌ను ప్రారంభించారు. సేకరణ, విక్రయ బాధ్యత ప్రైవేటుకు.. సేకరణ కేంద్రాల్లో రైతుల నుంచి కూరగాయలు కొనుగోలు చేసే బాధ్యతను ‘ఫాం ఫిక్స్’ అనే ఏజెన్సీకి అప్పగించారు. సేకరించిన కూరగాయలను ఈ ఏజెన్సీ బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు తరలిస్తుంది. అక్కడ గ్రేడింగ్, సార్టింగ్ చేసి రైతు బజార్లు, ‘మన కూరగాయలు’ ఔట్లెట్లకు సరఫరా చేసి, విక్రయించేలా ప్రణాళిక రూపొందించారు. రైతులకు సొమ్మును నేరు గా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా రోజుకు 15 నుంచి 20 టన్నుల కూరగాయలు సేకరించి.. రైతుబజార్లు, ఔట్లెట్ల ద్వారా విక్రయిస్తున్నారు. ఇక ఔట్లెట్ల ఏర్పాటు, నిర్వహణ, కూరగాయల విక్రయ బాధ్యతలను జెనెరా అగ్రిక్రాప్ అనే సంస్థకు అప్పగించారు. తక్కువ ధరల్లో అందుబాటులోకి.. కూరగాయల సాగులో రాష్ట్రం విస్తీర్ణం పరంగా దేశంలో 11వ స్థానం, ఉత్పత్తిలో 13 స్థానంలో ఉంది. వాస్తవానికి స్థానిక అవసరాల్లో కేవలం 20 శాతం కూరగాయలు మాత్రమే రాష్ట్రంలో సాగవుతున్నాయి. మిగతావి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల నుంచి దిగుమతి అవుతున్నాయి. దళారుల ప్రమేయంతో కూరగాయల ధరలు ఆకాశానంటుతున్నాయి. దీంతో ధరలను కట్టడి చేసేందుకు ‘మన కూరగాయలు’ విధా నం దోహదం చేస్తుందని మార్కెటింగ్ శాఖ అంచనా వేస్తోంది. రైతుల నుంచి సేకరించే హోల్‌సేల్ ధరకు అదనంగా గరిష్టంగా 30 శాతం ధరతో ‘మన కూరగాయలు’ అందుబాటులోకి రానున్నాయి. రైతుల నుంచి కూర గాయల సేకరణ మొదలుకుని విక్రయాల వరకూ కంప్యూటర్ ఆధారిత లావాదేవీలు చేపట్టడం ద్వారా పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ ఎండీ శరత్ వెల్లడించారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ఈ ఔట్లెట్ల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే స్థలాలను గుర్తించారు. మూడు జిల్లాల నుంచి సేకరణ మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో రైతుల నుంచి కూరగాయలు నేరుగా కొనుగోలు చేసేందుకు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 21 సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల్లో కూరగాయలు విసృ్తతంగా సాగయ్యే ప్రాంతాల్లో ఎనిమిది కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఈ కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయి. హైదరాబాద్‌లోని బోయిన్పల్లి మార్కెట్లో ఉండే హోల్‌సేల్ ధరలకు అనుగుణంగా... కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి కూరగాయలు కొనుగోలు చేస్తారు. -
మెంటలెక్కిస్తున్న రెంట్
రైతు బజార్లలో వ్యాపారులు బిత్తరపోయేలా ప్రభుత్వ నిర్ణయం ఒక్కసారిగా రూ. ఐదు వేలు పెంచేసిన మార్కెటింగ్ శాఖ విద్యుత్ బిల్లుల బనాయింపు ఆందోళనలో వ్యాపారులు రైతుబజార్లలో వ్యాపారులు బిత్తరపోయేలా మార్కెటింగ్ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. 14ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన రైతు బజార్లలో ఎప్పుడూ లేని నిబంధనలు పెట్టి కుంగదీసే చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ 14 ఏళ్ల పాటు ఎలాంటి అద్దెలు పెంచ లేదు. విద్యుత్ బిల్లులు బనాయించలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాపారులపై కక్ష కట్టే విధంగా ఒక్కసారిగా అద్దెలు పెంచే నిర్ణయం తీసుకున్నారు. వ్యాపారులనుంచి ముక్కుపిండి వసూళ్లు చేసేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పెదవాల్తేరు/ఎంవీపీకాలనీ :రైతుబజారులలో రైతుల తప్పా, మిగిలిన వ్యాపారుల నుంచి అద్దెలు, విద్యుత్ బిల్లుల రూపంలో భారీగా వసూళ్లు చేసేందుకు మార్కెటింగ్ శాఖాధికారుల రంగంలోకి దిగారు. ఒక్కసారిగా అద్దెలు రెట్టింపు చేయడంతో వ్యాపారులు కుదేలవుతున్నారు. పెంచిన అద్దెలకు తోడు విద్యుత్ బిల్లుల బనాయించడంతో వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. చిన్న,పెద్ద అనే తేడా లేకుండా అన్ని బజారులలో అద్దెలు పెంచడంతో వ్యాపారులు లాభాలకంటే అద్దెల భారం పెరిగిపోయిందంటూ ఆందోళన చెందుతున్నారు. 2010లో స్టాల్‌కు పదివేల అద్దె రైతుబజారులో నిత్యావసరవస్తువులు, బియ్యం ఇతర దినుసులు విక్రయించేందుకు మార్కెట్ స్థాయి ప్రకారం గృహమిత్ర, బియ్యం దుకాణం, కో- ఆపరేటివ్ దుకాణం, సూపర్‌బజారు రెండుస్టాల్స్ కలిపి ఒకస్టాల్గా కౌంటర్లను కేటాయించారు. అప్పటి జేసీ పోలా భాస్కరరావు దుకాణానికి రూ.15వేలు చొప్పున అద్దెను పెంచారు. దీనిని వ్యాపారులు వ్యతిరేకించి, జేసీకి వినతిపత్రం అందజేయగా.. ఆ అద్దెను రూ.10వేలకు నిర్ణయించారు. చిన్న బజారుల్లో కౌంటర్‌కు రూ.5వేలు నిర్ణయించారు. నాటినుంచి నేటి వరకూ అదే కొనసాగుతోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా... 2010 నుంచి నేటి వరకూ పైన తెలిపిన విధంగానే అద్దెలు చెల్లిస్తున్నారు. అయితే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా రూ.10 వేలు ఉన్న షాపు అద్దెను రూ.15వేలకు పెంచేయడం దారుణమని వ్యాపారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అదనంగా విద్యుత్ బిల్లుల బనాయింపు ఇప్పటికే వ్యాపారాలు లేక అద్దెల భారంతో ఇబ్బంది పడుతున్న వ్యాపారులకు పుండుమీద కారం చల్లినట్టు విద్యుత్ బిల్లులను అదనంగా కట్టమంటున్నారు. లెక్కాపత్తా లేకుండా మార్కెటింగ్ శాఖ అధికారులు కౌంటర్‌కు ఇంత అని బలవంతంగా వసూళ్లకు పూనుకుంటున్నారు. పెద్దమార్కెట్లలో కౌంటర్‌కు నెలకు రూ.1000లు అయితే, చిన్న మార్కెట్లో నెలకు రూ.500 లు చొప్పన నిర్ణయించారు. అసలు కౌంటర్లలో విద్యుత్ వినియోగం మార్కెటింగ్ అధికారులు నిర్ణయించిన మేరకు ఉండదనేది వ్యాపారుల వాదన. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు. ఈ విషయమై మార్కెటింగ్ శాఖ ఏడీ కాళేశ్వరరావును వివరణ అడగ్గా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. -
టీటీడీలో దళారుల దందా
మార్కెటింగ్ విభాగంలో కమీషన్ల పర్వం సరుకుల టెండర్లు, క్వాలిటీ పరీక్షల్లో మాయాజాలం ముడుపులకు అలవాటు పడ్డ ఉద్యోగులు లోపించిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ తిరుమల తిరుపతి దేవస్థానం మార్కెటింగ్ విభాగంలో అవినీతి వేళ్లూనుకుంటోంది. సరుకుల కొనుగోలు కోసం నిర్వహించే టెండర్లు, నాణ్యత పరిశీలన, సరఫరా వంటి అంశాల్లో పలువురు దళారులు కీలకంగా మారారు. వీరితో చేతులు కలుపుతున్న కొందరు మార్కెటింగ్ విభాగం ఉద్యోగులు ఏటా కమీషన్ల రూపంలో అందే లక్షలాది రూపాయలను జేబుల్లో నింపుకుంటున్నారు. తిరుపతి మార్కెటింగ్ కార్యాలయంతో పాటు ఇక్కడున్న గోదాముల్లో దళారులదే పెత్తనంగా మారింది. వీరి సహకారాన్ని పొందుతున్న కొందరు కాంట్రాక్టర్లు టీటీడీ మార్కెటింగ్ విభాగానికి ఇష్టారాజ్యంగా సరుకులను రవాణా చేస్తున్నారు. నాణ్యత లేని సరుకును టీటీడీకి అంటగట్టి గుట్టుచప్పుడు కాకుండా కోట్లలో బిల్లులు పాస్ చేయించుకుంటున్నారు. తిరుపతి: తిరుపతి రుయా ఆస్పత్రికి ఎదురు రోడ్డులో ఉన్న టీటీడీ మార్కెటింగ్ విభాగంలో ఏటా వందల కోట్ల విలువ చేసే సరుకు కొనుగోళ్లు జరుగుతాయి. టీటీడీ అన్నదానం, ప్రసాదాల తయారీ, వివిధ స్థానిక, అనుబంధ ఆలయాల్లో నైవేద్య సంబంధ పదార్థాల తయారీకి అవసరమైన ముడిసరుకులన్నీ ఇక్కడి నుంచే సరఫరా అవుతుంటాయి. ఆరు నెలలకోసారి మార్కెటింగ్ విభాగం అధికారులు సరుకుల వారీ సరఫరాకు టెండర్లు పిలుస్తుంటారు. ఆపైన కాంట్రాక్టరు నుంచి ఆయా సరుకులను నిర్ణీతప్రమాణంలో ప్రొక్యూర్ చేస్తుంటారు. దేశంలోని అన్ని టీటీడీ సంస్థలన్నింటికీ ఇక్కడి నుంచే సరుకులు రవాణా అవుతుంటా యి. ఈ-ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు సరుకును తిరుపతి గోదాముల్లోనే దించాలి. ఏడాదికి సుమారు రూ.600 నుంచి రూ.800 కోట్ల విలువైన సరుకులు ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతుంటా యి. ఈ నేపథ్యంలో టీటీడీలో మార్కెటిం గ్ విభాగం కీలకంగా మారింది. ఏళ్ల నాటి నుంచి ఇక్కడ విధులు నిర్వర్తిస్తోన్న కొందరు ఉద్యోగులు కమీషన్ల రూపంలో దక్కే ముడుపుల కోసం దళారులను పెం చిపోషిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అన్లోడ్ నుంచే కమీషన్ల పరంపర ఈ-మార్కెటింగ్‌లో టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు సరుకును, తిరుపతి మార్కెటింగ్ గోడౌన్‌కు చేర్చి అన్లోడ్ చేసే ప్రక్రియ నుంచే కమీషన్ల పరంపర మొదలవుతున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. ఈ విషయంలో దళారులు, ఉద్యోగులు మిలాఖత్ అయ్యి టీటీడీ సొమ్మును దండుకుంటున్నారని సమాచారం. అంతేకాకుండా సరుకు నాణ్యతలను గుర్తించే పనుల్లోనూ దళారులే కీలకంగా మారార ని విమర్శలున్నాయి. సరుకును బట్టి ఒక్కో లోడుకు ఒక్కో రేటు ప్రకారం కమీషన్ తీసుకుంటున్నారని తెల్సింది. వీరితో తలనొప్పెందుకన్న ధోరణిలో కాంట్రాక్టర్లు కమీషన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. నెలకు అన్ని సరకుల మీదా దళారులు, కొందరు ఉద్యోగులు రూ.5 లక్షలకు పైగా కమీషన్లు దండుకుంటున్నారని సమాచారం. నాణ్యతలోనూ మోసాలే... టెండరులో ప్రస్తావించినట్టుగానే సరుకు నాణ్యత కలిగి ఉండాలి. అయితే బి య్యం, కందిపప్పు, మినుములు, పచ్చిపప్పు వంటి అపరాలతో పాటు యాల కులు, ఖర్జూర, లవంగాల వంటి సుగంధ ద్రవ్యాలు, నెయ్యి, పాలు వంటివి సరఫరాలో అప్పుడప్పుడూ నాణ్యత లోపిస్తోం ది. ఇటీవల కాలంలో మూడు నెయ్యి ట్యాంకర్లు నాణ్యత పరీక్షలో తిరస్కరణకు గురయ్యాయి. ఒక్కో ట్యాంకరు విలువ సుమారు రూ.45 లక్షలు. ఒక్కో సందర్భాల్లో పెద్ద మొత్తంలో సరుకు తిరస్కరణకు గురయినపుడు దళారులు రంగప్రవేశం చేసి కాంట్రాక్టరుతో బేరం కుదుర్చుకుని సరుకును తమకున్న పలుకుబడితో ఓకే చేయిస్తున్నారు. తమకు అనుకూలమైన అధికారి తనిఖీలు చేసే క్రమంలో ముందుగానే గుర్తుపెట్టుకున్న బస్తాలోంచి నాణ్యమైన సరుకు తీసి నాణ్యత పరీక్ష చేయిస్తారని తెల్సింది. ఈ తరహా మాయాజాలం వల్ల పెద్ద మొత్తంలో కమీషన్లు చేతులు మారుతున్నాయి. టెండర్లలోనూ మాయాజాలమే... ఆన్లైన్ టెండర్లలోనూ అవకతవకలు జరుగుతున్నట్లు తెల్సింది. ఇటీవల ఆరు నెలల కాలానికి టెంకాయలు, కందిపప్పు, మినప్పప్పు సరఫరా కోసం ఈ- టెండర్లు ఆహ్వానించారు. ఇందులో టీటీడీ పాలకమండలికి చెందిన ఓ ముఖ్య సభ్యుడి దగ్గర బంధువుకు కొబ్బరికాయల సరఫరా టెండరు దక్కింది. కందిపప్పు సరఫరా టెండరు నెల్లూరు కోఆపరేటివ్ సొసైటీకి దక్కినప్పటికీ దాని వెనుక ఉన్నది మాత్రం ఆ ముఖ్య సభ్యుడి బంధువులేనని తెల్సింది. ఈ రెండు టెండర్లకు సంబంధించి సరఫరా ఆర్డర్లు కూడా జారీ అయ్యాయి. సుమారు రూ.5 కోట్ల విలువైన ఈ టెండర్లను దక్కించుకోవడానికి చక్రం తిప్పిన కాంట్రాక్టరు మిగతా కాంట్రాక్టర్లను సిండికేట్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ-టెండర్ల దాఖల్లోనూ, వాటిని ఫైనల్ చేయడంలోనూ ఎలాంటి అవకతవకలు జరగలేదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. టీటీడీకి చెందిన పర్యవేక్షణ, క్వాలిటీ కంట్రోల్, విజిలెన్సు అధికారులు అవలంబిస్తోన్న ఉదాసీన వైఖరి వల్లనే ఈ తరహా అవినీతి హెచ్చుమీరుతోందని టీటీడీ వర్గాల్లోనే బహిరంగ విమర్శలు వినబడుతున్నాయి. -
ఐఏఎస్ అధికారులకు ఊరట
జరిమానా ఉత్తర్వుల అమలును నిలిపివేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: కోర్టు ఉత్తర్వుల అమలులో అలసత్వం ప్రదర్శించినందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులకు జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి ఇటీవల ఇచ్చిన తీ ర్పుల అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం, పోచంపల్లిలో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ చేసిన రోడ్డు ఆక్రమణలను తొలగించాలన ్న ఉత్తర్వులను అమలు చేయనందుకు రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్‌రావు తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆయన ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. కార్వాన్‌లోని కూరగాయల మార్కెట్‌ను గుడిమల్కాపూర్‌కు మార్చినప్పుడు దుకాణాల కేటాయింపులో జరిగిన అన్యాయంపై కొందరు వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి కేటాయింపుపై నిర్ణయం తీసుకోవాలని మార్కెటింగ్ శాఖను ఆదేశించారు. ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో ఆ శాఖ కమిషనర్ శరత్‌కుమార్‌కు కోర్టు ధిక్కారం కింద సింగిల్ జడ్జి రూ. 5 వేల జరిమానా విధించింది. మరో కేసులో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవికి రూ.1,116 జరిమానా వేశారు. ఈ తీర్పులను సవాల్ చేస్త్తూ శరత్‌కుమార్, శ్రీదేవి వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. శుక్రవారం వాదనలు విన్న ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుల అమలును నిలిపి వేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. -
బియ్యానికి మార్కెట్ ఫీజు మినహాయింపు
- పత్తి, వరి ధాన్యంపై 1.5% వడ్డింపు - ఫీజు పెంపుతో లోటును పూడ్చే యోచన సాక్షి, హైదరాబాద్: బియ్యం, పత్తి విత్తనాలను మార్కెట్ ఫీజు వసూలు నుంచి మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో లోటును పూడ్చేందుకు.. వరి ధాన్యం, పత్తిపై వసూ లు చేస్తున్న మార్కెట్ ఫీజును ఒక శాతం నుంచి 1.5 శాతానికి పెంచుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్‌యార్డులో అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలకు మార్కెటింగ్ ఫీజు ప్రధాన ఆదాయ వనరు. ఈ నేపథ్యంలో ఫీజు నుంచి బియ్యం, పత్తి విత్తనాలను మినహాయించడంపై మార్కెటింగ్ శాఖ అదనపు డెరైక్టర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. బియ్యంపై మార్కెట్ఫీజు ద్వారా గత మూడేళ్లుగా సమకూరుతున్న ఆదాయాన్ని ఈ కమిటీ లెక్క గట్టింది. బియ్యాన్ని ఫీజువసూలు నుంచి మినహాయిస్తే రూ.40 కోట్ల నుంచి రూ.60 కోట్లు, పత్తి విత్తనాలను మినహాయిస్తే మరో రూ.14 కోట్ల నుంచి రూ.18 కోట్ల మేర మార్కెట్ కమిటీలు ఆదాయం కోల్పోయే అవకాశముందని కమిటీ పేర్కొంది. మొత్తంగా సుమారు రూ.70 కోట్ల ఆదాయం కోల్పోయే అవకాశముందని అంచనా వేసింది. పత్తి, వరి ధాన్యంపై వడ్డింపు గతంలో వరి ధాన్యం, బియ్యం, పత్తి విత్తనాలు, పత్తిపై వేర్వేరుగా ఒక శాతం చొప్పున మార్కెటింగ్ ఫీజు వసూలయ్యేది. ఒకే సరుకుకు రెండు పర్యాయాలు మార్కెటింగ్ ఫీజు చెల్లించడం వ్యాపారులకు, వసూలు చేయడం మార్కెటింగ్ శాఖకు భారంగా పరిణమించింది. దీంతో మార్కెటింగ్ ఫీజు ఎగవేతకు వ్యాపారులు జీరో దందా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యం లో మార్కెటింగ్ ఫీజును ఒకే విడతకు కుదిస్తూ అదనంగా 0.5 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పారదర్శకంగా మార్కెటింగ్ ఫీజు వసూలవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వివిధ వర్గాల విజ్ఞాపనలు, అదనపు డెరైక్టర్ నివేదికను మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ ఇటీవల ప్రభుత్వానికి పంపారు. వీటిని బేరీజు వేసిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
ఆదిలాబాద్ పర్యటనకు మంత్రి హరీశ్
మూడు రోజుల పాటు జిల్లాలోనే బస సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖల మంత్రి టి.హరీశ్‌రావు మూడు రోజుల పాటు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జిల్లాలో నీటి పారుదల, మార్కెటింగ్ శాఖలకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంత్రి శనివారం బాసరలో బస చేసి.. ఆదివారం గోదావరి నదిపై బాసర వద్ద నిర్మించనున్న చెక్‌డ్యామ్‌కు శంకుస్థాపన చేస్తారు. తర్వాత ముధోల్ నియోజకవర్గం పరిధిలోని గడ్డన్న వాగు ప్రాజెక్టును సందర్శిస్తారు. ముధోల్‌లో మినీ ట్యాంక్‌బండ్ పనుల శంకుస్థాపన అనంతరం కుంటాల మండలం చకిపల్లిలో మిషన్ కాకతీయ పథకం రెండో విడత పనులను ప్రారంభిస్తారు. తర్వాత మంజులాపూర్ చెక్‌డ్యామ్‌కు శంకుస్థాపన చేసి మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్మల్‌కు చేరుకుంటారు. నిర్మల్‌లో మార్కెటింగ్ శాఖ నిర్మించిన నూతన గోదామును ప్రారంభించి.. ద్యాంగాపూర్లో మిషన్ కాకతీయ రెండో విడత పనులను ప్రారంభిస్తారు. అనంతరం బోథ్ మండలం చింతల్బోరిలో మిషన్ కాకతీయ, గుడిహత్నూర మండలం మల్కాపూర్‌లో జైకా పథకం పనులను ప్రారంభిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు ఆదిలాబాద్ కలెక్టరేట్లో జిల్లాలో సాగునీటి పథకాలపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి సమీక్ష నిర్వహిస్తారు. ఆదివారం రాత్రి తాంసి మండలంలోని చనాకా కొరాట ప్రాజెక్టు వద్ద మంత్రి హరీశ్‌రావు బస చేస్తారు. సోమవారం ఉదయం 7 గంటలకు చనాకా కొరాట బ్యారేజీ సందర్శన అనంతరం ఉట్నూరులోని కొమురం భీమ్ కాంప్లెక్స్‌ను సందర్శిస్తారు. లక్సెట్టిపేట మండలం ఇటిక్యాలలో మినీ ట్యాంక్‌బండ్ పనులు, తిర్యాని వద్ద ఎన్టీఆర్సాగర్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత కోసిని రిజర్వాయర్, జగన్నాథపూర్ ప్రాజెక్టు సందర్శన అనంతరం సాయంత్రం ఆరు గంటలకు కాగజ్‌నగర్ నుంచి రైలుమార్గంలో బయలుదేరి సోమవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంటారు. ‘జూరాల’ బాధితులకు సత్వరమే పరిహారమివ్వాలి: డీకే అరుణ మహబూబ్‌నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు త్వరగా పరిహారం ఇప్పించాలని కాంగ్రెస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ కోరారు. ప్రాజెక్టు ముంపు బాధితులతో కలసి శనివారం సచివాలయంలో మంత్రి హరీశ్‌రావును ఆమె కలిశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి... వీలైనంత త్వరగా బాధితులకు పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
మళ్లీ.. మళ్లీ దర్యాప్తు!
సాక్షి, విజయవాడ : మార్కెటింగ్ శాఖలో ఒకే ఘటనపై పదే పదే దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఆసియాలోకెల్లా అతి పెద్ద రెండో మార్కెట్ యార్డుగా పేరున్న గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో మిర్చి కమీషన్ ఏజెంట్ల లెసైన్స్‌లో భాగస్వాముల మార్పుపై మార్కెటింగ్ శాఖకు ఫిర్యాదు అందింది. దీనిపై గత రెండేళ్లుగా విచారణపర్వం సాగుతూనే ఉంది. ఈ క్రమంలో మంగళవారం గొల్లపూడిలోని మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో జాయింట్ డెరైక్టర్ రామాంజనేయులు విచారణ నిర్వహించారు. విచారణకు గతంలో గుంటూరు మార్కెట్ కమిటీ యార్డులో పనిచేసిన 13 మంది ఉద్యోగులు హాజరయ్యారు. 2008 నుంచి 2013 వరకు వరకు మొత్తం 293 కమీషన్ ఏజెంట్ల లెసైన్స్‌ల్లో భాగస్వాముల పేరు మార్పు చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టాల నిబంధనలకు లోబడి అప్పటి ఉన్నతశ్రేణి కార్యదర్శుల ఆదేశాలతో భాగస్వాముల పేర్లు మార్పు వ్యవహారం జరిగింది. ఈక్రమంలో కె.కోటిరెడ్డి అనే వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా లెసైన్స్‌ల భాగస్వాముల పేర్లు మార్పులు చేస్తున్నారని మార్కెటింగ్ శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో 2013 మార్చిలో రెన్యూవల్స్ కావాల్సిన 293 లెసైన్స్‌లను అప్పటి ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎన్.నరహరి నిలుపుదల చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కోటిరెడ్డి ఫిర్యాదును విచారించాల్సిందిగా ఆదేశాలు ఇస్తూ కడప జిల్లా జేడీ ఆర్.అక్ష్మణుడును విచారణాధికారిగా నియమించింది. దీంతో భాగస్వాముల లెసైన్స్‌ల మార్పు, ఫైల్ ప్రాసెస్ చేసిన మార్కెట్ కమిటీ ఉద్యోగులు 23 మందిని బాధ్యులుగా నిర్ధారించారు. వీరిలో సర్వీసులో ఉన్న 13 మంది ఉద్యోగుల్ని సస్పెండ్ చేయగా, మిగిలిన 9 మంది రిటైర్ అయ్యారు. వారిలో ఐదుగురుకి ఆర్టికల్ ఆఫ్ చార్జ్స్ కింద మోమోలు ఇవ్వగా మిగిలిన నలుగురు రిటైరై నాలుగేళ్లు దాటడంతో కేసు నుంచి మినహాయించారు. ఈ క్రమంలో లక్ష్మణుడు విచారణ నిర్వహించి ఉద్యోగులు రూల్ ప్రకామే చేశారని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మార్కెట్ యార్డులో లెసైన్స్‌ల వ్యవహారం హడావుడి జరగుతున్న క్రమంలో అప్పటి ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎన్.నరహరి తాను రెన్యూవల్స్ చేస్తానని వ్యాపారుల నుంచి సుమారు రూ. 2 కోట్ల వరకు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారులు దీనిపై లోకాయుక్తను ఆశ్రయించడంతో ప్రస్తుతం మార్కెటింగ్ శాఖ దీనిని విచారణ నిర్వహిస్తోంది. దీనికి కూడా రామాంజనేయులే విచారణాధికారి వ్యవహరిస్తున్నారు. లక్ష్మణుడు నివేదిక ఇచ్చిన తర్వాత మళ్లీ రైతుబాజార్ సీఈవో ఎంకె సింగ్‌ను విచారణాధికారిగా నియమించి రెండోసారి విచారణ నిర్వహించారు. ఆ అధికారి గుంటూరు యార్డుకు రాకుండానే ఉన్నతస్థాయి వ్యక్తుల సూచనలతో నివేదికను సిద్ధంచేసి ప్రభుత్వానికి పంపారు. దీంతో ప్రభుత్వం మళ్లీ రెగ్యులర్ ఎంక్వైయిరీ ఆఫీసర్‌గా గతేడాది ఫిబ్రవరి 2న రామాంజనేయుల్ని విచారణాధికారిగా నియమించి ఆరు నెలల కాలంలో పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. గత ఏడాది నిర్వహించాల్సిన విచారణ ఎట్టకేలకు మంగళవారం జరగడంతో 13 మంది ఉద్యోగులు హాజరై రాతపూర్వక వివరణ ఇచ్చారు. చట్టాలకు లోబడి, ఉన్నతశ్రేణి కార్యదర్శుల ఆదేశాలతో పనిచేసే తమను విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. వాస్తవానికి ఈ ఘటనతో పూర్తి ప్రయేయం ఉన్న వ్యక్తుల్ని విచారించాలని వారు కోరారు. -
ఖరీఫ్ నాటికి గోదాములు..
మార్కెటింగ్ శాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సౌకర్యాలను పెంచే లక్ష్యంతో చేపట్టిన గోదాముల నిర్మాణాన్ని ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభం నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 330 చోట్ల గోదాముల నిర్మాణాన్ని ప్రతిపాదించగా.. ఇప్పటికే 294 చోట్ల పనులు ప్రారంభమయ్యాయి. నిర్దేశిత గడువులోగా గోదాముల నిర్మాణం పూర్తి చేసేందుకు ఏప్రిల్, మే నెలల్లో రూ.250 కోట్లు ఖర్చు చేయాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.1,024.50 కోట్ల అంచనా వ్యయంతో 330 గోదాముల నిర్మాణం చేపట్టింది. రెండు విడతల్లో పనులను మంజూరు చేయడంతో పాటు.. తొలి విడత పనుల పూర్తికి గతేడాది డిసెంబర్‌ను గడువుగా నిర్దేశించారు. రెండో విడత పనులు ఈ ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే స్థల సేకరణ, టెండర్ల ప్రక్రియలో అవాంతరాలతో పనులు పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో సమస్యలు పరిష్కరించి.. నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా చూడాలంటూ జిల్లా కలెక్టర్లు, సంబంధిత ఎమ్మెల్యేలకు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు లేఖలు రాశారు. సకాలంలో స్థల సేకరణ జరపకుంటే మంజూరైన పనులు రద్దు చేసి.. ఇతర మండలాలకు తరలిస్తామన్నా రు. ఇందుకు అనుగుణంగా గోదాముల నిర్మాణ పూర్తి చేసేందుకు శాఖ తాజా గడువు నిర్దేశించిం ది. గతేడాది మొదటి విడతలో రూ.411 కోట్ల అంచనా వ్యయంతో 128 పనులను మంజూరు చేసింది. ఈ పనులను తాజా గడువు ప్రకారం ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి. అదే విధంగా గతేడాది ఆగస్టులో రెండో విడతలోరూ.613.50 కోట్ల వ్యయంతో 202 గోదాములు మంజూరు చేశారు. రెండో విడత పనులను తాజా గడువు ప్రకారం ఈ ఏడాది జూలైలోగా పూర్తి చేయాలని మార్కెటింగ్ శాఖ ఆదేశించింది. -
వారంలోగా మహిళల కోటా స్థానాలు!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంలో తొలిసారిగా రిజర్వేషన్ విధానానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా మహిళలకు 33శాతం కోటా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్కెటింగ్ చట్టానికి సవరణలు ప్రతిపాది స్తూ.. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపాదించిన తీర్మానం ఆమోదం పొందిం ది. తాజా సవరణ మేరకు రాష్ట్రంలోని 168 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో మహిళలకు 55 మార్కెట్లకు చైర్పర్సన్ స్థానాలు దక్కనున్నాయి. అయితే కేటగిరీల వారీగా మహిళలకు దక్కే మార్కెట్ కమిటీలను గుర్తించడంపై మార్కెటింగ్‌శాఖ దృష్టి సారించింది. గతంలో కేటగిరీల వారీగా కేటాయించిన కోటా నుం చే.. మహిళలకు దక్కే స్థానాలను గుర్తించాలని మార్కెటింగ్‌శాఖ ప్రాథమికంగా నిర్ణయించిం ది. నామినేటెడ్ పదవుల భర్తీని ప్రభుత్వం నెలాఖరులో చేపడుతుందనే వార్తల నేపథ్యం లో.. వీలైనంత త్వరగా మార్కెట్ కమిటీల్లో మహిళా కోటా స్థానాలను గుర్తించనున్నారు. నిజానికి గడాది సెప్టెంబర్‌లోనే కేటగిరీల వారీగా రిజర్వేషన్ కోటా ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కే మార్కెట్ కమిటీలను రిజర్వేషన్ కోటాకు అనుగుణంగా లాటరీ ద్వారా ఎంపిక చేశారు. తొలి ఏడాది లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేయగా.. తర్వాతి ఏడాది నుంచి రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ విధానాన్ని అనుసరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా ఏర్పాటయ్యే కమిటీల పదవీకాల పరిమితి ఏడాది కాగా.. ఈ కమిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్‌తో 14 మంది సభ్యులు వుంటారు. లాటరీ విధానంలో రిజర్వేషన్లు కొత్తగా ఏర్పాటవుతున్న మార్కెట్ యార్డులను కూడా పరిగణనలోకి తీసుకుని.. వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి చైర్మన్‌గా, మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ డాక్టర్ శరత్, అదనపు డెరైక్టర్ లక్ష్మీబాయి, వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శి సూర్యప్రభ సభ్యులుగా వున్న కమిటీలాటరీ విధానంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. 179 వ్యవసాయ మార్కెట్ కమిటీల కుగాను..పీసా చట్టం-1996 ప్రకారం ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో షెడ్యూలు ఏరియాలోని 11 కమిటీలను ఎస్టీలకు కేటాయించారు. మిగతా 168 మార్కెట్ కమిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ఎస్టీలకు - 6 శాతం, ఎస్సీలకు - 15 శాతం, బీసీలకు- 29 శాతం చొప్పున మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు కేటాయించారు. మిగతా 84 కమిటీలను అన్ రిజర్వుడు (ఓసీ)గా పరిగణిస్తూ రిజర్వేషన్లు ఖరారు చేశారు. తాజా సవరణ నేపథ్యంలో షెడ్యూలు ఏరియాలోని మార్కెట్ కమిటీలను మినహాయిస్తే.. మిగతా 168 కమిటీల్లో 33శాతాన్ని మహిళలకు రిజ ర్వు చేయాల్సి వుంటుంది. ఈ లెక్కన మహిళలకు 55 స్థానాలు దక్కే అవకాశం వుందని మార్కెటింగ్‌శాఖ వర్గాలు వెల్లడించాయి. వారంలోగా మహిళలకు రిజర్వు చేసిన కమిటీల గుర్తింపు ప్రక్రియ పూర్తిచేస్తామని మార్కెటింగ్‌శాఖ డెరైక్టర్ శరత్ వెల్లడించారు. -
ఈ నెలలో మార్కెట్ కమిటీలకు చైర్మన్లు
మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ఎల్లారెడ్డి: ఈ నెల 27లోగా రాష్ట్రంలో అన్ని మార్కెట్ కమిటీల చైర్మన్లతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల, ఆలయ కమిటీల నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడానికి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిలో శనివారం మంత్రి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మార్కెట్ కమిటీల చైర్మన్ల నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని చెప్పారు. పార్టీ కోసం కృషి చేసిన వారికి ఏనాడూ అన్యాయం జరగదన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవులు తప్పక లభిస్తాయన్నారు. ప్రమాదవశాత్తూ చనిపోయిన ప్రతి కార్యకర్త కుటుంబాన్ని ఆదుకునేందుకు పార్టీ పూర్తి నిబద్ధతతో ఉన్నదన్నారు. ఇందుకు గాను రూ. ఐదున్నర కోట్లతో పార్టీ బీమా చేసిందన్నారు. ఇటీవల సాధారణ మృతి చెందిన ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన ఏడుగురు కార్యకర్తల కుటుంబాలకు మంత్రి రూ. రెండు లక్షల చొప్పున పార్టీ తరఫున అందించారు. అలాగే, ఆత్మహత్య చేసుకున్న గండిమాసానిపేట గ్రామానికి చెందిన రైతు కొడిపాక సాయిబాబా కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. టీఆర్ఎస్ మూడేళ్లు, ఐదేళ్ల పార్టీ కాదని ఇరవై ఏళ్లపాటు రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతుందని మంత్రి హరీశ్‌రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
కార్బైడ్ వాడితే.. ఆరునెలల జైలు
హైదరాబాద్: కాల్షియం కార్బైడ్ రసాయనాన్ని వినియోగించి కృత్రిమంగా పండ్లు మగ్గ పెట్టే వ్యాపారులపై కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. హై కోర్టు ఆదేశాల మేరకు.. కాల్షియం కార్బైడ్ వినియోగంతో జరిగే అనర్థాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. కృత్రిమంగా పండ్లు మగ్గ పెట్టే వ్యాపారులకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు, లక్ష రూపాయల జరిమానా విధించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.కృత్రిమంగా మగ్గ పెట్టిన పండ్లను తినడం ద్వారా కాన్సర్‌తో పాటు జీర్ణ, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయన్నారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు షార్ట్ ఫిల్మ్‌లు, ఇతర ప్రచార సామగ్రి సిద్దం చేస్తున్నట్లు వెల్లడించారు. పండ్లను మగ్గ పెట్టేందుకు రూ.60 లక్షల వ్యయంతో గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో ఇథిలీన్ చాంబర్‌ను మార్కెటింగ్ శాఖ నిర్మిస్తోందని తెలిపారు. ఆరుగురు వ్యాపారులు సొంతంగా ఇథిలీన్ ఛాంబర్ల నిర్మాణానికి ముందుకు వచ్చారని.. మార్చి ఆఖరులోగా వినియోగంలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రై వేటు రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా 80 ఇథిలీన్ ఛాంబర్లు వుండగా.. అవసరమైన చోట వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశామన్నారు. -
నాణ్యత విషయంలో రాజీ వద్దు
పని చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టండి: మంత్రి హరీశ్ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ పనిలో నాణ్యత, ఉద్యోగిలో నిజాయితీ ఉండాలి, అధికారులు చట్టానికి భయపడాలి తప్ప వ్యక్తులకు కాదు’ అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నల్లవాగు, గట్టులింగపల్లి ప్రాజెక్టులను ఆయన ఏరియల్ సర్వే చేశారు. అనంతరం నియోజకవర్గం అభివృద్ధి పనులనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మిషన్ కాకతీయ ఫేజ్-1లో మిగిలిపోయిన చెరువు పనులతోపాటు ఫేజ్-2 చెరువుల్లో కూడా పూడికతీత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పైపై పూతలతో పనులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే అధికారులకు చార్జి మెమోలు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. తక్షణ తాగు నీటి అవసరాల కోసం గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులు వినియోగించుకోవాలని హరీశ్‌రావు సూచించారు. మార్కెటింగ్ శాఖకు పెద్దపీట జనగామ: తెలంగాణ ప్రభుత్వం మార్కెటింగ్ శాఖకు పెద్దపీట వేస్తోందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా జనగామ వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన ప్యాడీ డ్రయర్, కవర్డు యాక్షన్ షెడ్డును మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో 150 మార్కెట్లు ఉండగా, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 32 కొత్తగా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో మార్కెట్ల పరిధిలో గోదాంల నిర్మా ణం కోసం రూ.1,024 కోట్లు, కవర్డు షెడ్డులతో పాటు మౌలిక వసతుల కల్పనకు రూ.400 కోట్లు మంజూరు చేశామని వివరించారు. ప్యాడీ డ్రయర్ (ధాన్యం తేమ తగ్గించే యంత్రం) పంజాబ్ తర్వాత దేశంలో రెండవ యంత్రాన్ని జనగామలో ఏర్పాటు చేసినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. -
రైతు బజార్లలో ఉల్లి విక్రయాలు
మార్కెటింగ్‌శాఖకు మంత్రి హరీశ్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: హోల్‌సేల్ మార్కెట్లో ఉల్లి ధరలు గణనీయంగా తగ్గడంతో వినియోగదారులు, రైతులకు ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని రైతు బజార్లలో రైతులే నేరుగా ఉల్లిని విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర సగటున రూ. 20 ఉండగా హోల్‌సేల్ మార్కెట్లో రైతులకు కిలో రూ. 8కు మించి రేటు దక్కడం లేదు. రైతు బజార్లలో కిలోకు రూ. 11కు తక్కువ కాకుండా రైతులు ఉల్లిని అమ్ముకునేలా చూడాలని మంత్రి ఆదేశించారు. ఉల్లి విక్రయాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు సాగు అధికంగా ఉన్న మండలాల్లో మార్కెటింగ్, ఉద్యానవన శాఖ అధికారులు పర్యటిస్తారు. -
నిర్మించకుంటే మరో చోటుకు
♦ ‘మార్కెటింగ్’ గోదాములపై మంత్రి హరీశ్‌రావు ♦ త్వరలో ఉల్లి పాలసీ ముసాయిదాకు తుది రూపు ♦ మార్కెటింగ్ శాఖ సమీక్ష సాక్షి, హైదరాబాద్: నాబార్డు సహకారంతో మార్కెటింగ్ శాఖ తొలి విడతలో చేపట్టినవాటిలో 100 గోదాముల నిర్మాణం మార్చి 31లోగా పూర్తి చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. మంజూరు చేసినా నిర్దేశిత గడువులోగా పనులు ప్రారంభం కాని చోటు నుంచి డిమాండు ఉన్న చోటుకు గోదాములను తరలిస్తామని స్పష్టం చేశారు. మార్కెటింగ్ శాఖ కార్యకలాపాలపై మంత్రి హరీశ్‌రావు బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ డాక్టర్ శరత్, అదనపు డెరైక్టర్ లక్ష్మీబాయి, అపెడా అధికారి సుధాకర్, మార్కెటింగ్ ఎస్ఈ నాగేశ్వర్‌రెడ్డి సమీక్షలో పాల్గొన్నారు. తొలి విడతలో రూ.411 కోట్లతో 6.85 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న 128 గోదాములు, రెండో విడతలో రూ. 613.50 కోట్ల వ్యయంతో 10.22 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న 202 గోదాములు మంజూరు చేశామన్నారు. మంజూరైన గోదాములకు 2 వారాల్లో స్థలం చూపకుంటే ఇతర ప్రాంతాలకు తరలిస్తామన్నారు. గోదాములపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు గురించి సోలార్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌తో చర్చించాలని మార్కెటింగ్ శాఖ డెరైక్టర్‌ను ఆదేశించారు. మూడు చోట్ల కోల్డ్ స్టోరేజీలు వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహక సంస్థ (అపెడా)తో కలిసి మార్కెటింగ్ శాఖ రూ.60 కోట్లతో బోయినపల్లి, గుడిమల్కాపూర్, వంటిమామిడిలో నిర్మించే కోల్డ్ స్టోరేజీల డీపీఆర్‌పై టాప్ బ్లూ సప్లై చైన్ కన్సల్టెన్సీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. వీటితో పాటు మరో రెండు చోట్ల కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయాలని మంత్రి హరీశ్ ఆదేశించారు. వ్యవసాయ శాఖ రూపొందించిన ఉల్లి పాలసీ ముసాయిదాను అధికారులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఉల్లి ధరల్లో హెచ్చుతగ్గులను నివారించడమేగాక, రైతులకు లాభం కలిగేలా ఉల్లి విధానం రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ముసాయిదాకు తుది రూపు ఇవ్వాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో అన్ని యార్డుల్లో ఆటోమేటెడ్ గేట్ ఎంట్రీ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. -
అవినీతిని మంత్రి తేలుస్తారా? తేల్చేస్తారా?
మార్కెటింగ్ శాఖలో వసూల్ రాజాగా పేరొందిన ఓ ముఖ్య ఇంజనీరు అవినీతి సంగతి సీఎం వద్ద తేల్చాల్సిందేనని ఉత్తరాంధ్రకు చెందిన ఓ అమాత్యుడు పట్టుబడుతున్నారట. ఆ ఇంజనీరుకు మంత్రి ఫోన్ చేసి మరీ ‘నీ అవినీతి చిట్టా విప్పుతానంటూ’ హెచ్చరించడంతో ఇంజనీరు మంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు కింది ఉద్యోగులకు అప్పటికే నెలవారీ విధిస్తున్న ఇండెంట్లు రెట్టింపు చేశారట. మార్కెటింగ్ శాఖలో పనులే లేవు.. పర్సంటేజీలకు అవకాశం లేదని ఇంజనీర్లంతా వాపోతుంటే.. జీతాల నుంచైనా మామూళ్లు ఇవ్వాల్సిందేనని, అందరినీ మేనేజ్ చేయాలంటే కష్టమైపోతుందని ముఖ్య ఇంజనీరు బాహాటంగానే ఎవరెవరికి సమర్పించుకోవాలో.. ఇండెంట్ల చిట్టా విప్పుతున్నారట. తమ గోడు చెప్పుకుందామంటే.. ముఖ్య ఇంజనీరు తన గోడు చెబుతున్నారని, మంత్రుల మొదలు.. సచివాలయం అధికారుల వరకు తన పదవిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోందనీ, ఇప్పుడు కొత్తగా ఓ మంత్రి తగులుకున్నారని, ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు వసూళ్లు తప్పట్లేదని... ఇంజనీర్లకు చెప్పుకుంటున్నారట. దీంతో వారు మూకుమ్మడిగా ఉన్నత స్థాయికి ఫిర్యాదులు చేసే పనిలో పడ్డారట. ముఖ్య ఇంజనీరు అవినీతిని మంత్రి నిజంగా తేలుస్తారా? తేల్చేస్తారా? అన్న అనుమానాలు అంతా వ్యక్తం చేస్తున్నారు. -
రూ.32కే టమోటా
‘మన కూరగాయల’ ద్వారా విక్రయం రైతుబజార్లలో అందుబాటులో.. మందస్తు ప్రచారం చేయని మార్కెటింగ్ శాఖ సిటీబ్యూరో: అననుకూల వాతావరణ పరిస్థితులు... పంట సీజన్ ముగింపు కారణంగా టమోటా ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే కేజీ ధర రూ.60-70కు చేరుకుంది. ఈ ధరలను అదుపులోకి తెచ్చేందుకు మార్కెటింగ్ శాఖ నేరుగా రంగంలోకి దిగింది. రైతుబ జార్లలోని ‘మన కూరగాయల’ కౌంటర్ వద్ద కిలో టమోటా రూ.32కు విక్రయిస్తోంది. మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశాల మేరకు అధికారులు ‘తక్కువ ధరపై టమోటా’ పథకాన్ని బుధవారం నుంచి నగరంలోని అన్ని రైతుబజార్లలో ప్రారంభించారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కేజీ రూ.60-70 ధర పలుకుతుండగా... రైతుబజార్లో రూ.43కు విక్రయిస్తున్నారు. మన కూరగాయల కౌంటర్లో కేజీ రూ.32కే లభిస్తుండటంతో బుధవారం కొనుగోలుదారులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో వచ్చిన సరుకంతా 3 గంటల వ్యవధిలోనే అమ్ముడుపోయింది. ముందస్తు ప్రచారమేదీ? రైతుబజార్లలో తక్కువ ధరకు టమోటాను విక్రయిస్తున్నట్లు అధికారులు ముందస్తు ప్రచారం చేయకపోవడం వారి చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. నిజానికి టమోటా ధరల అదుపునకు అధికారులు కృషి చేస్తుంటే... ఎక్కడ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగా తెలియజేయాలి. ఈ విషయాన్ని అధికారులు గాలికి వదిలేశారు. కేవలం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకే ఒక్కో రైతుబజార్‌కు స్వల్పంగా 5-10 క్వింటాళ్ల టమోటా సరఫరా చేసి చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మనకూరగాయల స్టాళ్ల వద్ద టమోటా ధర తక్కువన్న విషయం తెలియక చాలామంది వినియోగదారులు ఎక్కువ మొత్తం చెల్లించి రైతుబజార్లు, రిటైల్ మార్కెట్లలో కొనుగోలు చేసి నష్టపోయారు. -
పత్తి రైతుల ఆక్రందన పట్టదా?
♦ యార్డులకు వచ్చిన పత్తిలో సీసీఐ కొనుగోలు చేసినది 15.96 శాతమే ♦ కనీస ధర మించకుండా సిండికేట్ అయిన ప్రైవేటు వ్యాపారులు ♦ నిబంధనల సాకుతో సహకరిస్తున్న సీసీఐ అధికారులు ♦ పొరుగు రాష్ట్రాల్లో భారీగా పలుకుతున్న పత్తి ♦ అక్కడికి తరలించి అమ్ముకుంటున్న వ్యాపారులు ♦ రాష్ట్రంలో ‘మద్దతు’ దక్కక నిండా మునుగుతున్న రైతులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి రైతు ఆక్రందన ఎవరికీ పట్టడం లేదు.. విత్తనాల దగ్గరి నుంచి వర్షాభావం దాకా ఎన్నో కష్టనష్టాల కోర్చి పండించిన పత్తి చివరికి వ్యాపారుల పాలవుతోంది.. రైతన్న నిలువునా దోపిడీకి గురవుతున్నాడు.. పత్తి రైతుకు మద్దతు ధర కల్పించాల్సిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిబంధనలను సాకుగా చూపుతూ కొనుగోలు చేయడం లేదు. ఇప్పటి వరకు మార్కెట్ యార్డులకు వచ్చిన పత్తిలో సీసీఐ కొనుగోలు చేసింది 15.96 శాతం మాత్రమే. దీంతో వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లు, కూలీలకు తక్షణమే చెల్లింపులు జరపాల్సిన పరిస్థితిలో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అయినకాడికి అమ్ముకుంటున్నారు. మరోవైపు ఇదే అదునుగా తక్కువ ధరకు భారీగా పత్తిని కొనుగోలు చేస్తున్న వ్యాపారులు పొరుగు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తొలి నుంచీ నిర్లక్ష్యమే రాష్ట్రంలో ఈ ఏడాది 16.76 లక్షల హెక్టార్లలో పత్తిసాగు చేయగా.. 284 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది. పత్తి మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.4,100గా నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం సేకరణ బాధ్యత సీసీఐకి అప్పగించింది. రాష్ట్రంలో గత ఏడాది 83 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన సీసీఐ.. ఈ ఏడాది 84 కేంద్రాల ఏర్పాటుకు అంగీకరించింది. అక్టోబర్ 20వ తేదీ నాటికే వీటిని ప్రారంభించాల్సి ఉండగా... ఇప్పటివరకు 67 కేంద్రాలనే తెరిచారు. వీటిలోనూ 41 కేంద్రాల్లోనే పత్తి కొనుగోళ్లు కొంత చురుగ్గా సాగుతున్నట్లు మార్కెటింగ్ శాఖ చెబుతోంది. అసలు ఇప్పటివరకు సీసీఐ 1.82 ల క్షల క్వింటాళ్ల పత్తిని (యార్డులకు వచ్చిన దానిలో 15.96 శాతం) మాత్రమే కొనుగోలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. నిబంధనల పేరిట మడతపేచీ పత్తికి కనీస మద్దతు ధర మొదలుకుని తేమ శాతం వరకు అడ్డగోలు సాకులు చూపుతుండడంతో సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలకు రైతులు ఆసక్తి చూపడం లేదు. తేమ శాతం 12కు మించకూడదని, ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 40 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ వర్గాలు తెగేసి చెబుతున్నాయి. అయితే క్వింటాల్ పత్తికి రూ. ఐదు వేలు మద్దతు ధర చెల్లించాలని, తేమ శాతాన్ని 20కి పెంచాలని, రైతుల నుంచి 40 క్వింటాళ్లకు మించి కొనుగోలు చేయాలని మంత్రి హరీశ్‌రావు కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి సంతోష్ కుమార్‌కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్రం.. పరిమితిపై ఆంక్షలు ఎత్తివేయడంతో పాటు, జిన్నింగు మిల్లుల వద్ద కూడా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. కానీ తేమ శాతం సడలించడం, మద్దతు ధర పెంచడం అసాధ్యమని సీసీఐ వర్గాలు తెగేసి చెప్తున్నాయి. ప్రైవేటు వ్యాపారులదే జోరు సీసీఐ వైఖరితో విసిగిపోయిన ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వారు గ్రామాల్లో నేరుగా రైతుల నుంచి క్వింటాల్‌కు రూ. 3,600 నుంచి రూ. 3,700 వరకు చెల్లిస్తున్నారు. డబ్బు చెల్లింపుపై వారం నుంచి నెల దాకా వాయిదాకు అంగీకరిస్తే రూ. 3,900 వరకు లెక్కగడుతున్నారు. ఇక యార్డుల్లో సగటున క్వింటాల్ పత్తి ధర రూ.3,950 నుంచి రూ.3,970 లోపే పలుకుతోంది. క్వింటాల్ ధర రూ. 4 వేలు మించకుండా ప్రైవేటు వ్యాపారులు సిండికేట్‌లా వ్యవహరిస్తున్నారని... వారితో సీసీఐ అధికారులు కుమ్మక్కై మద్దతు ధర దక్కకుండా చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు తెల్లదోమ మూలంగా మహారాష్ట్ర, రాజస్తాన్ రాష్ట్రాల్లో పత్తి పంట దెబ్బతినడంతో అక్కడి జిన్నింగు మిల్లులు రాష్ట్రంపై దృష్టి సారించాయి. ఇక పత్తి విత్తనాలకు కూడా మంచి ధర పలుకుతుండటంతో ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు వేగవంతం చేశారు. గుజరాత్లో జిన్నింగ్ మిల్లులు క్వింటాలు పత్తిని క్వింటాల్ రూ. 4,700 వరకు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. -
తేమ శాతం పన్నెండు వరకే...
♦ పత్తి కొనుగోళ్లపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష ♦ దళారీ వ్యవస్థ నిర్మూలనే లక్ష్యం ♦ ఆన్లైన్ విధానంలోనే రైతులకు చెల్లింపు సాక్షి, హైదరాబాద్: తేమ శాతం 12 లేదా అంతకంటే తక్కువ ఉంటేనే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తుందని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లపై మంత్రి సోమవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, మార్కెటింగ్ డైరక్టర్ డాక్టర్ శరత్, అదనపు డెరైక్టర్ లక్ష్మీబాయి సమీక్షలో పాల్గొన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు పత్తిని సంచుల్లో కాకుండా విడిగా తీసుకురావాలని... ఈ మేరకు కరపత్రాలు, పోస్టర్ల ద్వారా మార్కెటింగ్, రెవెన్యూ అధికారులు గ్రామాల్లో ప్రచారం కల్పించాలని హరీశ్ సూచించారు. పత్తి కొనుగోలులో దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు రైతులకు యుద్ధ ప్రాతిపదికన గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. నిర్దేశించిన తేదీల్లో సీసీఐ 84 పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు, సిబ్బంది డ్రెస్కో డ్‌ను పాటించడంతో పాటు, గుర్తింపుకార్డులు ధరించాలని అన్నారు. అవసరమైన చోట పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించడంతో పాటు, జేసీలు, కలెక్టర్లు తరచూ తనిఖీలు చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. సీసీఐ సిబ్బందితో సమన్వయం కోసం జిల్లా స్థాయిలో ఇప్పటికే మార్కెటింగ్ శాఖ నోడల్ అధికారులను నియమించిందని, రెవెన్యూ విభాగమూ తక్షణమే నోడల్ అధికారులను నియమించాలన్నారు. మౌలిక సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ పత్తి కొనుగోలు లావాదేవీలకు సంబంధించిన తక్‌పట్టీని ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారానే రైతులకు జారీ చేయాలని మంత్రి హరీశ్ సూచించారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలకు సమీపంలో ఉన్న వే బ్రిడ్జీల్ని గుర్తించి, వాటిలోనే తూకం వేయిం చాలన్నారు. అగ్నిమాపక యంత్రాలు, కవర్ షెడ్లు విధిగా సమకూర్చుకోవడంతో పాటు తేమ శాతాన్ని కొలిచే పరికరాలను గ్రామస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. రవాణా, గోదాములు, హమాలీలు, మిల్లులతో ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నారు. రైతులు అమ్మిన పత్తికి సంబంధించిన చెల్లింపులు పూర్తిగా ఆన్లైన్ విధానంలో జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మొక్కజొన్న ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపైనా మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. -
ఠారెత్తిస్తోన్న టమోటా !
♦ వర్షాలతో దెబ్బతిన్న పంటలు ♦ టమోటా కేజీ రూ.30లకు ఎగబాకిన వైనం ♦ ధరాభారంతో వినియోగదారుల విలవిల సాక్షి, హైదరాబాద్: నగర మార్కెట్లో టమోటా ధర ఠారెత్తిస్తోంది. నిన్న మొన్నటివరకు కేజీ రూ.11-15ల మధ్యలో లభించిన టమోటా ఇప్పుడు ఏకంగా రూ.30లకు ఎగబాకింది. మంగళవారం రైతుబజార్లో కేజీ రూ.11లకు లభించిన టమోటా బుధవారం నాడు రూ.23లకు చేరడం టమోటా కొరతకు అద్దం పడుతోంది. ఇదే సరుకు రిటైల్ మార్కెట్లో కేజీ రూ.28-30ల ప్రకారం వసూలు చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట దెబ్బతినడంతో నగరానికి టమోటా సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. కూరల్లో ప్రధాన ముడిసరుకైన టమోటా ధర పెరగడంతో మిగతా కూరగాయల ధరలు కూడా అదే బాటపట్టాయి. మంగళవారం రైతుబజార్లో కేజీ రూ.17 ఉన్న బెండ ప్రస్తుతం రూ.23, అలాగే రూ.19 ఉన్న దొండ రూ.23కి పెరిగాయి. ఒక్క దొండ, బెండలే కాదు... అన్ని కూరగాయల్లో రూ.2-12 వరకు ధరల పెరుగుదల కన్పిస్తోంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఏ రకం కూరగాయను కొందామన్నా కేజీ రూ.20-40 ధర పలుకుతుండటంతో సామాన్యుడి గుండె గుభేల్ మంటోంది. ఇటీవల ఏకధాటిగా కురిసిన వర్షాల వల్ల నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని పంటలు దెబ్బతిన్నాయి. ప్రత్యేకించి టమోటా పూర్తిగా దెబ్బతినడంతో రైతులు పంటను చేలల్లోనే వదిలేశారు. ఫలితంగా నగరానికి సరఫరా నిలిచిపోయి కొరత ఏర్పడింది. డిమాండ్-సరఫరాల మధ్య తీవ్రమైన అంతరం ఏర్పడి ఆ ప్రభావం ధరలపై పడింది. ప్రస్తుతం మదనపల్లి నుంచి దిగుమతయ్యే టమోటా పైనే నగరం ఆధారపడాల్సి వస్తోంది. వర్షాల కారణంగా ఏపీ నుంచి వచ్చే దిగుమతులు కూడా సగానికి సగం పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చే కూరగాయల దిగుబడి కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీంతో అసమతౌల్యం ఏర్పడి ధరలు ఆకాశం వైపు చూస్తున్నాయంటున్నారు. మార్కెటింగ్ శాఖ మౌనం అకాల వర్షాలు పడినప్పుడు మార్కెటింగ్ శాఖ ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఎక్కడాలేని విధంగా మనకు రైతుబజార్ వ్యవస్థ, ఇతర విభాగాలున్నప్పటికీ అధికారుల నిర్లిప్తత, నిర్లక్ష్యం కారణంగా ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం’ అవుతోంది. సామాన్య మధ్యతరగతి ప్రజానీకానికి ఈ శాఖ ఏమాత్రం సాంత్వన చేకూర్చలేక పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు కూరగాయల ఉత్పత్తి అధికంగా ఉండే ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన మార్కెటింగ్ శాఖ అది తమ పనికాదన్నట్లు వ్యవహరిస్తోంది. మరో వారం రోజుల్లో లోకల్ టమోటా దిగుబడినిచ్చే అవకాశం ఉందని, అప్పుడు ధరలు వాటంతటవే దిగివస్తాయని అధికారులు వ్యాఖ్యానించడం విశేషం. -
దిగివస్తున్న ఉల్లి...
♦ సగానికి తగ్గిన ధరలు ♦ సబ్సిడీ విక్రయ కేంద్రాలకు త్వరలో స్వస్తి ♦ ఉల్లి దిగుబడులపై మార్కెటింగ్ శాఖ ఆశాభావం సాక్షి, హైదరాబాద్: రెండు నెలలుగా వంటింట్లో కన్నీరు పెట్టించిన ఉల్లి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మరో వారం రోజుల్లో ఉల్లి ధర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ధర కంటే తక్కువగా ఉండనుందని మార్కెటింగ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో సబ్సిడీ విక్రయ కేంద్రాలను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ధరల స్థిరీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ త్వరలో విక్రయ కేంద్రాల ఎత్తివేతపై నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 88 కేంద్రాల ద్వారా కిలోకు రూ.20 చొప్పున సబ్సిడీ ధరపై మార్కెటింగ్ శాఖ ఉల్లిని విక్రయిస్తోంది. రాష్ట్రంలో ఉల్లి లావాదేవీల్లో ప్రధానమైన మలక్‌పేట హోల్‌సేల్ మార్కెట్లో ఆగస్టు 25న కిలో ఉల్లి ధర గరిష్టంగా రూ.68 పలి కింది. ప్రస్తుతం అత్యంత నాణ్యమైన నాసిక్ రకం ఉల్లి ధర కిలోకు గరిష్టంగా రూ.32 పలుకుతోంది. కర్నూలు రకం ధర కనిష్టంగా కిలోకు రూ.25కు పడిపోయింది. మహరాష్ట్రలోని లాసల్‌గావ్‌తో పాటు స్థానిక దిగుబడులు మార్కెట్‌కు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నట్లు అధికారులు చెపుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, కర్నూలుతో పాటు ఆలంపూర్, సదాశివపేట, దేవరకద్ర తదితర మార్కెట్లకు ఉల్లి దిగుబడులు పెరిగాయి. మరో వారం రోజుల్లో తాజా దిగుబడులు మార్కెట్లకు వెల్లువెత్తే అవకాశమున్నందున ధరలు మరింత పడిపోతాయని మార్కెటింగ్ శాఖ అంచనా వేస్తోంది. ‘సబ్సిడీ’ విక్రయాలకు త్వరలో స్వస్తి ఉల్లి ధరలు పెరగడంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం సబ్సిడీ విక్రయకేంద్రాలను ప్రారంభించింది. మలక్‌పేటతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఇప్పటి వరకు రూ.24.85 కోట్లు వెచ్చించి 5,309.02 మెట్రిక్ టన్నుల ఉల్లిని మార్కెటింగ్ విభాగం సేకరించింది. ఇందులో 5,157.44 మెట్రిక్ టన్నుల ఉల్లి విక్రయం ద్వారా 10.61 కోట్లను తిరిగి రాబ ట్టింది. కేంద్రం నుంచి మొదటిసారిగా ధరల స్థిరీకరణ నిధి నుంచి రూ.9.81 కోట్లు సాధించిన రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ భారాన్ని భరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉల్లి ధరలు తగ్గుతుంటుండటంతో త్వరలో సబ్సిడీ ఉల్లి విక్రయాల్ని నిలిపివేయాలని భావిస్తోంది. -
ఉద్రిక్తత
నందిగామ : బకాయిలు చెల్లించాలని కోరుతూ సుబాబుల్ రైతులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఎస్పీఎం పేపరు పరిశ్రమ కార్యాలయం ప్రధాన గేటు వద్ద సుబాబుల్ రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. ఉదయం 11 గంటల నుంచి రైతులు, పలు రాజకీయ పార్టీల నాయకులు కంపెనీ కార్యాలయాన్ని ముట్టడించారు. ధర్నా విరమించాలంటూ రైతులపై పోలీసులు ఒత్తిడితెచ్చారు. రైతులు అంగీకరించలేదు. దీంతో ఎస్ఐ తులసీరామ్ నేతృత్వంలో పోలీసులు కొంతమంది రైతు నాయకులను అరెస్టు చేసి బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయినప్పటికీ మిగిలిన రైతులు ధర్నా కొనసాగించారు. పోలీసులతో ఘర్షణ పడిన అనంతరం ధర్నాలో పాల్గొన్న నవాబుపేట గ్రామానికి చెందిన రైతు యర్రం శ్రీనివాసరావుకు బీపీ పెరిగి స్పృహకోల్పోయారు. శిబిరంలో ప్రథమచికిత్స చేసిన అనంతరం ఆయన్ను ప్రైవేటు ఆస్పత్రికి తరలిం చారు. రైతు నాయకుల అరెస్టును నిరసిస్తూ రైతులు 65 నంబరు జాతీయ రహదారిపై కొద్దిసేపు బైఠాయించారు. రైతులకు మద్దతు తెలుపుతూ వైఎస్సార్ సీపీ ఆందోళనలో పాల్గొన్నారు. బకాయిలు రూ.9.50 కోట్లు తొలుత రైతు ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ యార్లగడ్డ జోయ మాట్లాడుతూ 281 మంది రైతులకు ఎస్పీఎం కంపెనీ రూ.10.80 కోట్ల మేర బకాయిపడిందని తెలిపారు. గత ఏడాది మే 22న రైతులు చేసిన ఉద్యమం వల్ల రూ.1.30 కోట్లు మాత్రమే చెల్లించిన కంపెనీ మిగిలిన రూ.9.50 కోట్ల బకాయిలను నిలిపివేసిందని గుర్తుచేశారు. బకాయిల విడుదల విషయంలో ఏఎంసీ అధికారులు చేపట్టిన చర్యలకు ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లేకపోవడంతో కంపెనీ ప్రతినిధులు హైకోర్టుకు వెళ్లారని వివరిం చారు. కాగితపు పరిశ్రమలకు ఏఎంసీ హామీగా ఉండి సుబాబుల్ కర్ర కొనుగోలు చేసినందున రైతులకు చెల్లించాల్సిన బకాయిలను సెంట్రల్ మార్కెట్ కమిటీ ఫండ్ ద్వారా ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఎస్సీఎం కంపెనీ 13 జిల్లాల రైతులకు రూ.22 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని వివరించారు. అన్ని మార్కెట్ కమిటీలు ైరె తు బకాయిలను సెంట్రల్ మర్కెట్ కమిటీ ఫండ్ ద్వారా ఇవ్వాలని తీర్మానం చేశాయని గుర్తుచేశారు. ఆ ప్రకారం ైరె తులకు బకాయిలు చెల్లించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేశామని తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల రైతు నాయకులు సయ్యద్‌ఖాసీం, చనుమోలు సైదులు, గోపాల్, చుండూరి సుబ్బారావు, జర బన నాగేశ్వరరావు, మంగునూరి కొండారెడ్డి, చిరుమామిళ్ల అశోక్‌బాబు, సత్యనారాయణ, నెలకుర్తి శివనాగేశ్వరరావు, పలువురు రైతు నాయకులు పాల్గొన్నారు. సీపీఐ నాయకులు అక్కినేని వనజ, కె.రామచంద్రయ్య, ప్రసాదు మద్దతు తెలిపారు. మార్కెటింగ్ శాఖ జేడీ దృష్టికి తీసుకెళ్లాం రైతుల ఆందోళనను మార్కెటింగ్ శాఖ జేడీ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన మంత్రితో సమావేశంలో ఉన్నందున తర్వాత మాట్లాడుతామన్నారు. బకాయిలపై హామీ ఇవ్వందే ఆందోళన విరమించమని రైతు నాయకులు చెప్పారు. - ఏఎంసీ కార్యదర్శి గోపాలకృష్ణ -
సినిమా టికెట్ల కోసం కాదు....
తాండూరు: ఏదో కొత్త సినిమా విడుదలైన మొదటిరోజు మార్నింగ్ షో చూసేందుకు థియేటర్ వద్ద టికెట్ల కోసం క్యూ కట్టినట్లుగా ఉంది కదూ ఈ చిత్రాన్ని చూస్తే.. అదేం కాదు.. సబ్సిడీ ఉల్లిగడ్డల కోసం తాండూరు మార్కెట్ యార్డు వద్ద జనాలు ఇలా భారీగా బారులు తీరారు. సబ్సిడీ ఉల్లి విక్రయాల్లో క్రితం రోజు పరిస్థితి పునరావృతం కాకుండా మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నానికే ఉల్లి నిల్వలు నిండుకోవడంతో కేంద్రంలో నో స్టాక్ బోర్డు పెట్టారు. దీంతో జనాలు నిరాశతో వెనుదిరిగారు. రాత్రికిరాత్రే ఉన్నతాధికారులు తాండూరు కేంద్రానికి 50.60క్వింటాళ్ల ఉల్లి స్టాక్‌ను పంపించారు. క్రితం రోజు ఉల్లి లభించకపోవడంతో బుధవారం ఉదయం 8గంటలకే జనాలు మార్కెట్ యార్డు కేంద్రం వద్ద బారులు తీరారు. గంటకుపైగా క్యూలో నిల్చొని ఉల్లిని కొనుగోలు చేశారు. వచ్చిన స్టాక్‌లో 838మందికి 16.66 క్వింటాళ్ల ఉల్లి విక్రయించామని మార్కెట్ కమిటీ సూపర్వైజర్ హబీబ్ అల్వీ తెలిపారు. మేడ్చల్‌లో కుళ్లిపోయిన ఉల్లి సరఫరా.. మేడ్చల్: స్థానిక రైతు బజారులో కుళ్లిపోయిన సబ్సిడీ ఉల్లిని సరఫరా చేస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఉదయం 10 గంటలకు కేంద్రాలను తెరవాల్సిన అధికారులు 12 గంటలకు తెరుస్తుండటంతో మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు. రైతు బజారులో కుళ్లిపోయిన ఉల్లిని సరఫరా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతు బజారులో ఏర్పాటు చేసిన ఉల్లి కేంద్రాన్ని పర్యవేక్షించాల్సిన మేడ్చల్ మార్కెట్ కమిటీ కార్యదర్శి అపర్ణ ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళుతున్నారో తెలియడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. -
పేట్రేగిన ఉల్లి
♦ ఢిల్లీ ధరలతో వ్యాపారుల పోటీ ♦ రిటైల్ మార్కెట్లో కిలో రూ.70-80 ♦ సబ్సిడీ ఉల్లికి జనం బారులు సాక్షి, సిటీబ్యూరో : ఉల్లి ధర జనాలను హడలెత్తిస్తోంది. ఢిల్లీలో ఉల్లి ధర కిలో రూ.100కు చేరువవుతోందన్న వార్త నగరంలోని రిటైల్ వ్యాపారుల్లో అత్యాశను రేపింది. దీంతో ఒక్కరోజు వ్యవధిలోనే కిలోపైఅదనంగా రూ.10-15 పెంచేశారు. మలక్‌పేటలోని హోల్‌సేల్ మార్కెట్లో గ్రేడ్ -1 ఉల్లి కేజీ ధర రూ.67 పలకడంతో వెంటనే రిటైల్ వ్యాపారులు పెంచేశారు. నిన్న మొన్నటి వరకు కేజీ రూ.65కు లభించిన మహారాష్ట్ర ఉల్లి ఇప్పుడు రూ.80కి, కర్నూలు ఉల్లి కిలో రూ.50 నుంచి రూ.60కి ఎగబాకాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి నగరానికి ఉల్లి దిగుమతి తగ్గిపోవడంతో పాటు కర్నూలునుంచి కూడా సరఫరా నిలిచిపోయింది. మహారాష్ట్రలో స్థానికంగానే ఉల్లికి మంచి ధర పలుకుతుండటంతో రైతులు ఇక్కడికి పంపేందుకు ఆసక్తి చూపడం లేదు. నగరంలోని మహబూబ్ మాన్షన్ హోల్‌సేల్ మార్కెట్‌కు నిత్యం 16-18వేల క్వింటాళ్ల ఉల్లి దిగుమతయ్యేది. మంగళవారం 14వేల క్వింటాలు మాత్రమే వచ్చింది. ఇదే అదనుగా భావించి వ్యాపారులు ధర లు పెంచేశారు. నిన్నటి వరకు కేజీ రూ.50 ఉన్న గ్రేడ్-2 నీరుల్లి (కర్నూలు) ధర ఒక్కరోజులోనే రూ.60కి చేరింది. తోపుడు బండ్ల వారైతే... థర్డ్ గ్రేడ్ ఉల్లిని గ్రేడింగ్ చేసి కాస్త పెద్దవి కేజీ రూ.70, చిన్నవి రూ. 60 వంతున విక్రయిస్తున్నారు. టీవీలు, పత్రికల్లోని కథనాలను చూసి నగరానికి ఉల్లి సరఫరా ఆగిపోయిందని... ధరలు ఢిల్లీ తరహాలోనే ఉంటాయని కొందరు వ్యాపారులు ప్రచారం చేస్తున్నారు. కిక్కిరిసిన రైతుబజార్లు సబ్సిడీ ఉల్లి కోసం జనం పోటెత్తుతుండటంతో నగరంలోని రైతుబజార్లు కిక్కిరిసిపోతున్నాయి. ప్రతి సోమవారం సబ్సిడీ ఉల్లి కౌంటర్లను మూసేస్తుంటారు. ఇది తెలియని కొందరు సోమవారం ఉల్లి కోసం వచ్చి సరుకు అయిపోయిందని ప్రచారం మొదలెట్టారళు. దీన్ని నమ్మిన గృహిణులు మంగళవారం ఉదయాన్నే కౌంటర్ల వద్ద క్యూలు కట్టారు. స్కూల్‌కు వెళ్లాల్సిన పిల్లలను కూడా క్యూలైన్లో నిలబెట్టి ఉల్లి కొనుగోలు చేశారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు నిరంతరాయంగా విక్రయాలు సాగించినా రద్దీని నియంత్రించలేక పోతున్నామని రైతుబజార్ సిబ్బంది వాపోతున్నారు. కావాల్సినంత సరుకు ఉందనీ పదే... పదే మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నా... ఎవరూ పట్టించుకోవట్లేదని, పోలీసుల సహకారంలో విక్రయిస్తున్నామని చెబుతున్నారు. కృత్రిమ కొరత కొందరు ఉల్లి వ్యాపారులు ప్రస్తుత పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు వినికిడి. కర్నూలు ఉల్లి వారం రోజులకు మించి నిల్వ ఉండ దు. మహారాష్ట్ర ఉల్లి నెల రోజుల వరకు బాగుంటుంది. కొందరు వ్యాపారులు నాణ్యమైన మహారాష్ట్ర ఉల్లిని అక్రమంగా నిల్వ చేసి ధరలు పెంచేశారని తెలుస్తోంది. వర్షాలు, ఇతర కారణాలతో ఒక్కరోజు దిగుమతులు ఆగిపోతే... ఆ కొరతను బూచిగా చూపి ధరలు పెంచుతుండటం నగరంలో పరిపాటి. ఈ తరుణంలో మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగి అక్రమ నిల్వలపై దాడులు నిర్వహించడంతో పాటు, ఉల్లి ధరలకు కళ్లెం వేయకపోతే పరిస్థితి మరింత భారమయ్యే అవకాశం ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే సెప్టెంబర్ నాటికి నగరంలో ఉల్లి కేజీ రూ.100కు చేరినా ఆశ్చర్య పడాల్సిందేమీ లేదని మార్కెటింగ్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
మార్కెట్లలో రైతులకు న్యాయం జరగాలి
మంత్రి హరీశ్‌రావు ఆర్కేపురం: రైతులు, వినియోగదారుల శ్రేయస్సు కోసమే మార్కెటింగ్‌శాఖ పనిచేస్తుందని, రైతు లేనిదే మార్కెట్, కమిషన్ ఏజెంట్లు ఉండరని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఎల్బీనగర్ కూరగాయల మార్కెట్లో రూ. 2.60 కోట్లతో నిర్మించిన ప్రాంతీయ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ భవనాన్ని మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రైతులకు, ఏజెం ట్లకు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, వారికి న్యాయం జరిగేలా మార్కెటింగ్ శాఖ పని చేయాలన్నారు. మార్కెట్లో ఫిర్యాదుల బాక్స్, టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు. మార్కెట్లో తెల్లచిట్టీలతో వ్యాపారం చేయవద్దని, తక్పట్టీలతోనే వ్యా పారం కొనసాగించాలని, ఎలక్ట్రానిక్ వే మిషన్స్ వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్టీఆర్నగర్ మార్కెట్లో చిరువ్యాపారులకు షెడ్లు కట్టిస్తామని పేర్కొన్నారు. మార్కెట్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ఉల్లిగడ్డ ధర ఎంత ఉన్నా ప్రభుత్వం భరిస్తుందని, రూ. 20లకు కేజీ ఉల్లిగడ్డ అందిస్తామని పేర్కొన్నారు. నగరంలో 46 సెంటర్లను ఏర్పాటు చేశామని, అవసరమైతే మరిన్ని సెంటర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్లోని పలు కార్మిక సంఘాలు ఏఐటీయూసీ ఇతర సంఘాల నాయకులు వినతిపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ ఎ.శరత్, సూపరింటెండెంట్ నాగేశ్వర్‌రెడ్డి, మార్కెటింగ్ కమిటీ కార్యదర్శి శాస్త్రి, మల్లేషం, రాంమోహన్‌గౌడ్, మనోహర్‌రెడ్డి, తీగల విక్రమ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ఆర్కేపురం డివిజన్ పార్టీ అధ్యక్షులు మురుకుంట్ల అరవింద్, బీరెళ్లి వెంకట్‌రెడ్డి, కంచర్ల శేఖర్, పగిళ్ల భూపాల్‌రెడ్డి, తుమ్మల శ్రీరాంరెడ్డి, మహ్మద్, రామాచారి, శ్రీనివాస్, మల్లేష్, మార్కెటింగ్ కమిటీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలుక నర్సింహారెడ్డి, ముకారం పాల్గొన్నారు. -
రూ.20కే కిలో ఉల్లి
- రైతుబజార్లలో రాయితీపై విక్రయం - 5 నుంచి అధికారికంగా ప్రారంభం సాక్షి, సిటీబ్యూరో : ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు ఎట్టకేలకు మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగింది. నగరంలోని అన్ని రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కేజీ రూ.20ల ప్రకారం రాయితీ ధరపై ఉల్లిని అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 5 నుంచి కూకట్పల్లి, ఎర్రగడ్డ, మెహిదీపట్నం, సరూర్‌నగర్, వనస్థలిపురం, ఫలక్‌నుమా, మీర్పేట్, రామకృష్ణాపురం, అల్వాల్, మేడిపల్లి రైతుబజార్లతో పాటు వివిధ ప్రాంతాల్లోని 36 ఔట్లెట్స్ ద్వారా సబ్సిడీ ఉల్లిని అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఉల్లి, టమోటా ధరలకు కళ్లెం వేస్తే మిగతా కూరగాయల ధరలు పెరగకుండా నియంత్రించవచ్చేనే ఉద్దేశంతో గత జూన్ 24న అన్ని రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి హోల్‌సేల్ ధరకే (నో లాస్... నో ప్రాఫిట్ ప్రాతిపదికన) విక్రయాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాటిని తప్పించి అదే కౌంటర్లలో సబ్సిడీ ఉల్లి విక్రయాలు ప్రారంభించేందుకు రైతుబ జార్ సిబ్బంది సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఉల్లి కేజీ రూ.40-45లు పలుకుతోంది. వినియోగదారుల రద్దీ అధికంగా ఉండే ఎర్రగడ్డ, కూకట్పల్లి, మెహిదీపట్నం, సరూర్‌నగర్ రైతుబజార్లకు రోజుకు 2 నుంచి 3 టన్నులు, అలాగే చిన్న రైతుబజార్లకు 1-2 టన్నుల ఉల్లి సరఫరా చేయాలని నిర్ణయించారు. ఉదయం 9గం.ల నుంచి రాత్రి 7గంటల వరకు సబ్సిడీ ఉల్లి కౌంటర్లు తె రచి ఉంచి, ఒక్కో వినియోగదారుడికి 2 కేజీల చొప్పున విక్రయించాలని ప్లాన్ చేశారు. కర్నూలు, మహారాష్ట్ర, కర్ణాటకలకు ప్రత్యేక అధికారుల బృందాలను పంపి పెద్దమొత్తంలో ఉల్లిని సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కొరత రానివ్వం : ఉల్లి ధర లు అదుపులోకి వచ్చే వరకు రైతుబజార్లలో సబ్సిడీ ధరలపై ఉల్లిని అందుబాటులో ఉంచుతామని మార్కెటింగ్ శాఖ అడిషనల్ డెరైక్టర్ లక్ష్మీబాయి తెలిపారు. రైతుబజార్లు లేని ప్రాంతాలకు మొబైల్ వ్యాన్లు, మన కూరగాయల వాహనాల ద్వారా సబ్సిడీ ఉల్లి సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. హోల్‌సేల్ ట్రేడర్స్‌తో సమావేశం నిర్వహించి పెద్దమొత్తంలో సరుకు సేకరించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కొరత రాకుండా చూస్తే ధరలు వాటంతటవే దిగివస్తాయని, వ్యాపారులు కూడా ధరలు పెంచేందుకు సాహసించరని తెలిపారు. -
ఉల్లి..పేలింది
పెరుగుతున్న ధర వ్యాపారుల దోపిడీ వినియోగదారులు విలవిల సమీక్షలతో సరిపెడుతున్న సర్కార్ నిర్లక్ష్యం నీడలో మార్కెటింగ్ శాఖ సిటీబ్యూరో: ఉల్లి ధర మళ్లీ పేలుతోంది. సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంది. నగర మార్కెట్లో రోజుకో రకంగా ధర పలుకుతూ గృహిణులకు వణుకు పుట్టిస్తోంది. ధరలను కిందకు దించాల్సిన యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. ఆంధ్రాలో ఉల్లి కొరత కారణంగా కర్నూలు నుంచి హైదరాబాద్‌కు సరుకు సరఫరా నిలిపేశారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా ఉల్లికి మంచి డిమాండ్ ఉంటోంది. అక్కడి వ్యాపారులు స్వల్పంగానే సరఫరా చేస్తుండటంతో నగరంలో కొరత ఎదురైంది. ధరలు నియంత్రించాల్సిన మార్కెటింగ్ శాఖ పైపై చర్యలతో కాలం వెళ్లబుచ్చుతోంది. అధికారులను అప్రమత్తం చేసి పరుగెత్తించాల్సిన సర్కార్ సమీక్షలతో సరిపెడుతోంది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు ఇష్టారీతిన ధరలు నిర్ణయిస్తూ దోపిడీకి పాల్పడుతుండటంతో వినియోగదారులు విలవిల్లాడుతున్నారు. కొందరు బడా వ్యాపారులుఉల్లిని గోదాముల్లో దాచేసి... కృత్రిమ కొరతను సృష్టిస్తూ ధరలు పెంచేస్తున్నారన్న ఆరోపణలు హోరెత్తుతున్నాయి. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్ ధరలకు... రిటైల్ ధరలకు ఏమాత్రం పొంతన లేదు. రిటైల్ వ్యాపారులు రెట్టింపు ధరలు వసూలు చేస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. డిమాండ్...సరఫరాల మధ్య మలక్‌పేటలోని మహబూబ్ మాన్షన్ హోల్‌సేల్ మార్కెట్‌కు సోమవారం 50 కిలోల వంతున ఉండే 31వేల బ్యాగ్‌ల ఉల్లి దిగుమతైంది. మంగళవారం 21 వేలు, బుధవారం 18 వేల బ్యాగ్‌లు మాత్రమే వచ్చాయి. రెండు రోజుల వ్యవధిలోనే 12 వేల బ్యాగ్‌లు అంటే... 6 వేల క్వింటాళ్ల కొరత కనిపిస్తోంది. డిమాండ్-సరఫరాల మధ్య అంతరం ప్రభావం దరలపై పడుతోంది. హోల్‌సేల్ మార్కెట్లో బుధవారం గ్రేడ్-1 రకం ఉల్లి క్వింటాల్ కనీస మద్దతు ధర రూ.2800, గ్రేడ్-2 రకం రూ. 1600 పలికింది. ఈ ప్రకారం చూస్తే గ్రేడ్-1 ఉల్లి కేజీ రూ.28, గ్రేడ్-2 ఉల్లి కిలో ధర రూ.16గా హోల్‌సేల్ మార్కెట్లో అధికారికంగా నిర్ణయమైంది. ఇదే సరుకు రవాణా, హమాలీ, డ్యా మేజీ, లాభం వంటివి కలిపి రిటైల్ వ్యాపారులు కిలో రూ.40-45 చొప్పున వసూలు చేస్తున్నారు. దోపిడీ ఇలా... కిరాణా వ్యాపారులు, మాల్స్‌లో బెస్ట్ క్వాలిటీ పేరుతో గ్రేడ్-1 ఉల్లిని కేజీ రూ.40-45కు విక్రయిస్తున్నారు. కొందరు గ్రేడ్-2 ఉల్లినే చాటుగా గ్రేడింగ్ చేసి కేజీ రూ.40-45 వంతున అమ్ముతూ సొమ్ము చేసుకొంటున్నారు. వాస్తవానికి గ్రేడ్-1 రకం ఉల్లి స్వల్పంగానే మార్కెట్‌కు వస్తోంది. దీన్ని పెద్దపెద్ద హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల వారు నేరుగా కొని తీసుకెళుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో విక్రయించేదంతా గ్రేడ్-2 రక మే. తామేమీ తక్కువ కాదన్నట్టు రైతుబజార్లలోనూ కేజీ రూ.32 వంతున విక్రయిస్తున్నారు. నిజానికి హోల్‌సేల్ మార్కెట్ ధరకు రూ.3 అదనంగా వేసి రైతుబజార్లలో విక్రయిస్తారు. గ్రేడ్-2 ఉల్లి హోల్‌సేల్ మార్కెట్లో కనీస మద్దతు ధర క్వింటాలు రూ.1600 పలుకగా, రైతుబజార్లలో మాత్రం కేజీ రూ.30కు అమ్ముతుండటం గమనార్హం. ప్రజల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తమైనప్పుడు హడావుడి చేసి... తాత్కాలిక చర్యలతో సరిపెట్టేస్తుండటం మార్కెటింగ్ శాఖకు పరిపాటిగా మారిం ది. నగరంలో ఉల్లిని పెద్దమొత్తంలో నిల్వ చేసి ధరలు పెరిగిన సందర్భాల్లో మార్కెట్లోకి విడుదల చేయడం ద్వారా నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. మార్కెటింగ్ శాఖ అధికారులు ఇంతవరకు ఈ దిశగా చర్యలు తీసుకొన్న దాఖలాలు లేవు. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరచి అక్రమ నిల్వలపై అధికారులు దాడులు నిర్వహించి... చర్యలు తీసుకుంటే ఉల్లి ధరలకు కళ్లెం పడే అవకాశం ఉంది. -
మార్కెటింగ్ శాఖలో మరిన్ని ఉద్యోగాలు
మంత్రి హరీశ్‌రావు వెల్లడి సాక్షి, హైదరాబాద్: మార్కెటింగ్ శాఖలో 200 కొత్త పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని... వీటితో పాటు మరికొన్ని కొత్త ఉద్యోగాలు మంజూరు చేస్తామని మార్కెటింగ్‌శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. శనివారం ఆయన మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 150 మార్కెట్ కమిటీలున్నాయని... మరో 30 కమిటీలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో సిబ్బంది కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కొత్త పోస్టుల మంజూరు కోసం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. గోదాముల కోసం భూసేకరణ వేగవంతం చేయాలని, వాటి నిర్మాణానికి టెండర్లు పిలవాలని సూచించారు. ప్రతి రెవెన్యూ డివిజన్లో రైతు బజారు ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థల సేకరణపై దృష్టి సారించాలన్నారు. రైతు బజార్లన్నింటికీ కామన్ డిజైన్ రూపొందించాలని ఆదేశించారు. మార్కెటింగ్ శాఖలోనూ ఆన్లైన్ ఫైల్ మానిటరింగ్ సిస్టమ్ (బార్ కోడింగ్)ను అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. పనిలో వేగంతోపాటు పారదర్శకత కోసం వాట్స్ అప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సెక్యూరిటీ గార్డ్స్ వేతనాలు పెంచుతామని, దీనిపై త్వరలో ప్రకటన చేస్తామన్నారు. మార్కెట్ యార్డుల్లో పనిచేసే దడ్వాయి కార్మికులకు బీమా వర్తింప చేస్తామన్నారు. మార్కెటింగ్ ఫీజులకు ఎగనామం పెట్టే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. యార్డుల్లో సరుకు అమ్మకం నుంచి రైతులకు సొమ్ము చేతికి వచ్చే వరకు జరిగే ప్రక్రియను ఆన్లైన్లో పెట్టాలన్నారు. మార్కెట్ కమిటీలు హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, ఇందుకోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. -
కూరగాయల ఔట్లెట్లు
- ఈ నెల 23 నుంచి ప్రారంభం - కాలనీలు, కార్యాలయాల్లో అందుబాటులోకి.. - ధరల నియంత్రణకు చర్యలు - రంగంలోకి మార్కెటింగ్ శాఖ సాక్షి, సిటీబ్యూరో: కూరగాయల ధరలను నేల మీదికిదించే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. అసలు ధరకే అన్నిరకాల కూరగాయలను వినియోగదారుడికి అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. పెద్దమొత్తంలో సరుకు సేకరించి... నగరం నలుమూలకు సరఫరా చేసి... కొరత లేకుండా చూడటం ద్వారా ధరలకు కళ్లెం వేయాలని భావిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, కాలనీలు, అపార్టుమెంట్లు, ట్రాఫిక్ ఇబ్బంది లేని కూడళ్లలో పెద్దసంఖ్యలో కూరగాయల ఔట్లెట్ల ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి వీటిని ప్రారంభించేందుకు అధికారులు ముహూర్తం ఖరారు చేశారు. నగరంలో కూరగాయల ధరలపై ‘ధర దగా’ శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ధరల నియంత్రణకు చర్యలు చేపట్టారు. తాజా కూరగాయలను హోల్‌సేల్ ధరకే అందుబాటులో ఉంచడం ద్వారా రిటైల్ వ్యాపారుల అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు వినియోగదారులకు ఊరట కలిగించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ‘మన కూరగాయల’ పథకం కింద 20 వాహనాల ద్వారా వివిధ ప్రాంతాల్లో తాజా కూరగాయలను హోల్‌సేల్ రేట్లకే అందిస్తున్న అధికారులు... ఇకపై నగరంలోని అన్ని రైతుబజార్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, కాలనీలు, అపార్టుమెంట్లు, కూడళ్లలో ఔట్లెట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర వర్గాల వారు విధులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వెళ్లే తరుణంలో ఈ ఔట్‌లెట్స్‌లో కొనుగోలు చే స్తారని... దీంతో అన్ని రకాల కూరగాయలను అందుబాటులో ఉంచాలని యోచిస్తున్నారు. దీని వల్ల వారికి సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది కాబట్టి ఈ ఔట్లెట్లకు మంచి ఆదరణ ఉంటుందని అంచనా వేస్తున్నారు. సచివాలయం, బీఆర్కె భవన్, ఏజీ ఆఫీస్, మణికొండ, నేరెడ్మెట్, డిఫెన్స్ కాలనీ, వనస్థలిపురం సహారా ఎస్టేట్స్, కూకట్‌పల్లిలోని భవ్యాస్ ఆనంద్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్, జనప్రియ అపార్టుమెంట్స్ తదితర ప్రాంతాల్లో మంగళవారం నుంచి వీటిని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా సేకరణ నగరంలో కూరగాయల కొరత లేకుండా చూసేందుకు పెద్ద మొత్తంలో సరుకు సేకరించాలని మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ అధికారులను ఆదేశించారు. టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయల ధరలు పెరగకుండా నియంత్రించాలని సూచించారు. వర్షం లేదా మరే అనునుకూల పరిస్థితి ఎదురై ఒక్కరోజు కూరగాయల సరఫరా తగ్గినా.. రిటైల్ వ్యాపారులు యథేచ్ఛగా ధరలు పెంచి దోపిడీకి పాల్పడుతున్నారు. అందుకే ఎక్కువగా వినియోగించే టమోటా, మిర్చి, ఉల్లి ధరలు పెరగకుండా చూస్తే మిగతా కూరగాయల ధరలన్నీ అదుపులో ఉంటాయని అధికారుల యోచన. ఇందులో భాగంగా మహారాష్ట్ర నుంచి ఉల్లి, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలు, మదనపల్లి నుంచి టమోటా, కర్నూలు, గుంటూరు ప్రాంతాల నుంచి పచ్చిమిర్చి పెద్దమొత్తంలో సేకరించేందుకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. నగరమంతటా ఔట్లెట్స్ ప్రారంభించి ప్రజలకు తాజా కూరగాయలు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డెరైక్టర్ వై.జె.పద్మహర్ష తెలిపారు. ప్రస్తుతం నగరంలో ఎన్ని ఔట్లెట్స్ పెట్టాలి..? స్థానికంగా ఎంత మేర ఉత్పత్తి అవుతోంది? ఇతర ప్రాంతాల నుంచి ఏమేరకు సరుకు దిగుమతి చేసుకోవాలి..? వంటివాటిపై లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే గుర్తించిన కొన్ని ప్రాంతాల్లో వచ్చే మంగళవారం కొత్త ఔట్‌లెట్స్‌ను ప్రారంభిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. -
ఏదీ కళ్లెం?.. 12కే గొళ్లెం!
రైతుబజార్లకు నామ మాత్రంగా సబ్సిడీ టమోటా సరఫరా 12 గంటలకే కౌంటర్ల మూసివేత ధరలపై చేతులెత్తేసిన మార్కెటింగ్ శాఖ సిటీబ్యూరో: గ్రేటర్లో కూరగాయల ధరలకు కళ్లెం వేసేందుకు మార్కెటింగ్ శాఖ చేసిన ప్రయత్నం కంటితుడుపు చర్యగా మిగిలింది. టమోటా ధరలను నియంత్రిస్తే మిగతా కూరగాయల ధరలు అదుపులో ఉంటాయని అధికారులు భావించారు. ఈ మేరకు గత నెల 29న రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సబ్సిడీ టమోటా అందుబాటులో ఉంచారు. ఈ కౌంటర్లు మధ్యాహ్నానికే మూతపడుతుండటంతో వినియోగదారులకు తక్కువ ధరకు టమోటా అందని పరిస్థితి ఎదురైంది. ఒక్కో రైతుబజార్‌కు 50 ట్రేల టమోటా అవసరం ఉండగా... కేవలం 10-15ట్రేల సరుకు మాత్రమే సరఫరా చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. అవి ఏ మూలకూ సరిపోవడం లేదు. సబ్సిడీ ధరపై కేజీ రూ. 14కే అందుబాటులో ఉంచినట్లు అధికారులు ఆర్భాటంగా ప్రకటిస్తున్నా.... అవి అందరికీ అందకపోవడంతో రిటైల్ మార్కెట్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. గిరాకీని గుర్తించిన వ్యాపారులు టమోటా కేజీ రూ.25-30 చొప్పున విక్రయిస్తున్నారు. మార్కెటింగ్ శాఖ అరకొరగా అందిస్తోన్న టమోటా కూడా ఉదయం 10గంటల తర్వాత రైతుబజార్లకు చేరుతోంది. మధ్యాహ్నం 12 గంటలకే సరుకంతా అమ్ముడుపోతోంది. ఆ త ర్వాత వచ్చే వినియోగదారులకు అవి దక్కని పరిస్థితి ఎదురవుతోంది. శని, ఆదివారాల్లో సబ్సిడీ టమోటా గంటన్నర వ్యవధిలోనే ఖాళీ అవుతుండటం వినియోగదారులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. డిమాండ్‌కు తగ్గట్టు సరుకు సరఫరా చేయడంలో మార్కెటింగ్ శాఖ అధికారులు విఫలమవ్వడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరూర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, మెహిదీపట్నం రైతుబజార్లలో ఉదయాన్నే వచ్చి క్యూలో నిలబడినా అందరికీ అందడం లేదని మహిళలు వాపోతున్నారు. కేవలం 2గంటల వ్యవధిలోనే కౌంటర్ ఖాళీ అవుతుండటాన్ని బట్టి చూస్తే టమోటాను గుట్టుగా హోటళ్లకు సరఫరా చేస్తున్నారేమోనన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. రైతుబజార్ల సిబ్బందిపై నిఘా లేకపోవడాన్ని దీనికి కారణంగా చూపుతున్నారు. మరోవైపు ఏ రోజు వచ్చిన సరుకు ఆరోజే అమ్మకపోతే చెడిపోయే అవకాశం ఉండటంతో రైతుబజార్ల సిబ్బంది కావాలనే తక్కువ ఇండెంట్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ కారణంగానే సబ్సిడీ టమోటా అందరికీ అందడం లేదని అంటున్నారు. చిత్తశుద్ధి ఏదీ..? రైతుబజార్లలోని ప్రత్యేక కౌంటర్లపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే మధ్యాహ్నానికి మూత పడుతున్నాయి. ఆ తర్వాత వ్యాపారులు యథావిధిగా అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా సాయంత్ర వేళల్లో వచ్చే ఉద్యోగులు, ఇతరులకు సబ్సిడీ టమోటా అందని పరిస్థితి ఏర్పడింది. మొత్తమ్మీద సబ్సిడీ ప్రక్రియ పేరుకే తప్ప ఎక్కువ మందికి వినియోగపడడం లేదనే విమర్శలను అధికారులు మూటగట్టుకుంటున్నారు. -
మార్కెటింగ్ శాఖ ద్వారా పొద్దుతిరుగుడు కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: మార్కెటింగ్ శాఖ ద్వారా పొద్దుతిరుగుడు గింజలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. సచివాలయంలో సోమవారం మార్కెటింగ్, నూనె గింజల ఉత్పత్తిదారుల సమాఖ్య అధికారులతో పొద్దుతిరుగుడు గింజల కొనుగోలుపై ఆయన సమీక్ష నిర్వహించారు. క్వింటాలుకు రూ.3,750ల మద్దతు ధరతో కొనుగోలు చేయనున్నట్లు ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. సాధారణంగా నాఫెడ్ ద్వారా ఈ కొనుగోళ్లు జరుగుతాయని, ఇందుకు నాఫెడ్ ముందుకు రాకపోవడంతో రైతులకు నష్టం జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన మంత్రి వివరించారు. మొదటిదశలో సిద్దిపేట, గజ్వే ల్, నిజామాబాద్, జడ్చర్ల పట్టణాల్లో కొనుగోలు కేంద్రాలు తెరవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అన్నిమార్కెట్ యార్డులను ఆధునీకరించి ఆన్లైన్ వ్యవస్థలోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. మార్కెటింగ్‌శాఖలో సిబ్బం ది కొరతను తీర్చేందుకు ప్రతిపాదనలను పం పాలని కోరారు. 30 మార్కెట్ల విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రెవె న్యూ డివిజన్లో రైతు బజార్లను ఏర్పాటు చేయాలని, ఉన్న వాటిని ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. -
మొండి బకాయిలు
మార్కెటింగ్‌శాఖలో లక్ష్యం మేరకు వసూలు కాని సెస్ {పతికూల పరిస్థితుల్లోనూ రూ.70కోట్లు వసూలు జిల్లాలో మార్కెటింగ్‌శాఖకు సెస్ మొండి బకాయిలు గుదిబండగా మారుతున్నాయి. రూ.కోట్లలో పెరుకుపోతున్నాయి. ఏ ఆర్థిక సంవత్సరంలోనూ లక్ష్యం మేరకు వసూలు కాలేదు. వీటిలో ఎక్కువ పౌరసరఫరాలశాఖకు చెందినవే. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆశాఖ ఈఏడాది రూ.70కోట్ల మేర వసూలు చేసింది. లక్ష్యానికి చేరుకోలేకపోయినప్పటికీ ఆశించిన స్థాయిలోనే పన్నుల వసూలు చేయగలిగింది. విశాఖపట్నం: విశాఖలోని ప్రాంతీయ మార్కెటింగ్ శాఖ పరిధిలో శ్రీకాకుళం, విజ యనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో 51 మార్కెట్యార్డులుండగా, వాటి పరిధిలో 80 చెక్‌పోస్టులు న్నాయి. ఈ చెక్‌పోస్టుల ద్వారా వ్యవసాయఉత్పత్తులపై ఒక శాతం, మత్స్యశాఖ ఉత్పత్తులపై 0.5 శాతం సెస్ రూపంలో వసూలు చేస్తుంటారు. 2013-14లో నిర్దేశించిన రూ.83 కోట్ల కు రూ.67కోట్లు వసూలు చేయగలిగారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఈ నాలుగు జిల్లాల పరిధిలో 92.93కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. గతేడాది ఎలాగైనా లక్ష్యానికి చేరుకోవాలని మార్కెటింగ్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ హుద్‌హుద్‌తో లక్షలాది ఎకరాల్లో పంటల న్నీ దెబ్బతిన్నాయి. చేపలు, రొయ్యల చెరువులు నామరూపాల్లేకుండా పోయాయి. అయినప్పటికీ ఊహించని స్థాయిలోనే పన్నుల వసూలు జరిగాయి. గతేడాది వసూళ్లనైనా ఈ ఏడాది సాధించగలమో లేదోనని ఆందోళన పడ్డారు. కానీ గతేడాది వసూళ్లకు మించి ఈ ఏడాది వసూళ్లు సాధించ గలిగారు. ఈ ఏడాది రూ.92.93కోట్ల లక్ష్యం నిర్దేశించగా ఇప్పటి వరకు 69.75కోట్ల మేర వసూలు చేయగలిగారు. మరో 20రోజుల గడువు ఉన్నందున ఈ మొత్తం రూ.75కోట్లకు వరకు చేరుతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు వసూలైన పన్నుల్లో ధాన్యం ద్వారానే అత్యధికంగా రూ.50కోట్లు, బియ్యం ద్వారా మరో రూ.10 కోట్లు వసూలయ్యాయి. మిగిలిన రూ.10 కోట్లు ఇతర వ్యవసాయ, మత్స్యశాఖ ఉత్పత్తుల మార్కెటింగ్ ద్వారా ఆర్జించ గలిగారు. ‘తూర్పు’లోనే అత్యధిక వసూలు జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లాకు రూ.22కోట్ల పన్నుల వసూళ్లు లక్ష్యం కాగా, రూ.11.12 కోట్ల వసూలు చేశారు. విజయనగరం జిల్లాలో రూ.10.75 కోట్లకు రూ.7.90కోట్లు, విశాఖపట్నం జిల్లాలో రూ.10.53కోట్ల లక్ష్యానికి రూ.10.04కోట్లమేర వసూలు చేయగా, తూర్పు గోదావరిలో రూ.49కోట్ల లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.40.69కోట్ల మేర సెస్‌ల రూపంలో వసూలు చేశారు. మొండిబకాయిలు సివిల్ సప్లయిస్వే: పేరుకుపోయిన మొండిబకాయిలు ఎక్కువ పౌరసరఫరాలశాఖవే. గత ఏడేనిమిదేళ్ల నుంచి రూ.25కోట్లమేరబకాయిలు పేరుకుపోయాయి. వీటిలో రైసు మిల్లర్లు, వ్యాపారస్తుల నుంచి రూ.12కోట్ల వరకు వసూలు కావాల్సిఉండగా..సివిల్ సప్లయిస్ నుంచే ఏకంగా రూ.12కోట్ల వరకు వసూలు కావాల్సిఉంది. గతరెండేళ్లుగా ధాన్యం కొనుగోళ్లు సివిల్ సప్లయిస్ చేపట్టింది. సుమారు 8లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని గడిచిన ఏడాదిలో కొనుగోలు చేసింది. ఈ ధాన్యానికి ఒకశాతం సెస్‌రూపంలో రూ.15కోట్లు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.3కోట్లు మాత్రమే చెల్లించింది. మరో రూ.12కోట్ల మేర ఈ శాఖ చెల్లించాల్సి ఉంది. -
ఆదాయం ఫుల్
కడప అగ్రికల్చర్ : మార్కెటింగ్ శాఖ లక్ష్యాలను ఛేదించి అదనపు ఆదాయాన్ని రాష్ట్ర శాఖకు మిగిల్చిపెట్టింది. అధికారులు, సిబ్బంది నిత్య పర్యవే క్షణతోనే ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. చెక్‌పోస్టుల వద్ద శాఖ అధికారులు ఉంటూ రోడ్లపై వ్యవసాయ ఉత్పత్తులు, పశువుల రవాణా నుంచి ఫీజు వసూలు చేయడంతో మార్కెటింగ్ శాఖకు ఆదాయం సమకూరింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది వెంటబడి మరీ ఆదాయ పెంపునకు తీవ్రంగా కృషి చేశారని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఒక వైపు కరువు పరిస్థితులు ఉన్నప్పటికి, మరోవైపు తెలంగాణకు ధాన్యం, వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల రవాణా జరగకపోవడం కూడా జిల్లా మార్కెటింగ్ శాఖకు కలిసొచ్చిందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మార్కెటింగ్ శాఖకు 12 వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 9.39 కోట్లు మార్కెటింగ్ ఫీజు వసూలు లక్ష్యంగా నిర్ణయించారు. అయితే ఫిబ్రవరి నెల మొదటి వారం వరకు రూ.11.23 కోట్ల ఫీజు వసూలు చేసి లక్ష్యాన్ని ఛేదించారు. ఇదే సమయానికి గత ఏడాది రూ. 8.27 కోట్లు మాత్రమే వసూలైంది. జిల్లాలో 12 మార్కెటింగ్ కమిటీలుంటే అందులో గత 10 నెలలకు గాను రైల్వేకోడూరు మార్కెట్ కమిటీ రూ.92.10 లక్షలకు రూ. 123.23 లక్షలు వసూలు చేసి ప్రగతిలో ముందు వరుసలో ఉంది. సిద్ధవటం మార్కెట్ కమిటీ రూ.20.30 లక్షలకు గాను రూ. 20.06 లక్షలు(98.81 శాతం), రాజంపేట మార్కెట్ కమిటీ 50.50 లక్షలకు 44.63 లక్షలు వసూలు చేసి చివరి వరుసలో ఉన్నాయి. మిగతా 11 మార్కెట్ కమిటీలు వారికి ఇచ్చిన లక్ష్యాలను చేరుకున్నాయి. మార్చి ఆఖరుకు కేటాయించిన లక్ష్యాల కంటే అదనంగా రాబడితో పాటు, కమిటీల్లో మిగులు ఉంటుందని, దీంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి ఎంతో వీలుంటుందని ఏడీ ఉపేంద్రకుమార్ తెలిపారు. ఫీజు వసూలులో అధికారులు, సిబ్బంది కృషి అభినందనీయం.. మార్కెట్ కమిటీలు ప్రగతి సాధించడంలో అధికారులు, సిబ్బంది కృషి అభినందనీయం. ఒక వైపు కరువు పరిస్థితులు ఉన్నా శాఖకు వసూలు లక్ష్యాలు సాధించలేరేమోననే అనుమానాలు ఉండేవి. అయితే ఆ అనుమానాలకు తావులేకుండా వసూలు లక్ష్యాలు ఛేదించారు. - సీతారామాంజనేయులు, రీజినల్ జాయింట్ డెరైక్టర్, రాయలసీమ మార్కెటింగ్‌శాఖ. -
రైతుకు చేయూతనిద్దాం
సిద్దిపేట జోన్: రైతు సంక్షేమమే ధ్యేయంగా సర్కార్ ముందుకు సాగుతోందని, అధికార యంత్రాంగం కూడా ఆ మేరకు కృషి చేసి రైతుకు చేయూతనివ్వాలని మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం ఆమె సిద్దిపేటలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు, పత్తి మార్కెట్, రైతు బజార్లను సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెటింగ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ శాఖల అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. అంతకుముందు పలు శాఖల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులకు చేయూతనిచ్చే విధంగా అధికార యంత్రాంగం పని చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో వినూత్నంగా అంగన్వాడీల ద్వారా మహిళలు, శిశువులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు కొత్త పథకాన్ని రూపకల్పన చేసిందన్నారు. విజయ డెయిరీని పౌల్ట్రీ పరిశ్రమతో సమన్వయ పరుస్తూ ప్రతి రోజు ఐసీడీఎస్ ద్వారా గర్భిణులు, ఆరు సంవత్సరాలలోపు చిన్నారులకు కోడిగుడ్డు, పాలు, నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల జాతీయ ఆరోగ్య మిషన్ తన సర్వేలో 65 శాతం మహిళలకు రక్త హీనత ఉందని తేల్చిందన్నారు. అందువల్ల మాతాశిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతోందన్నారు. గ్రామాల్లో మదర్స్ కమిటీని ఏర్పాటు చేసి అంగన్వాడీల పనితీరును మెరుగుపరుస్తామన్నారు. సిద్దిపేటలో అత్యాధునిక రైతు బజార్ రాష్ట్రంలోనే అత్యాధునికమైన రైతు బజార్‌ను సిద్దిపేటలో నిర్మించాలని సర్కార్ భావిస్తోందని పూనం మాలకొండయ్య స్పష్టం చేశారు. మార్కెట్ యార్డులో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న ఏఎంసీ మార్కెట్ యార్డును త్వరలోనే పత్తి మార్కెట్‌యార్డులోకి మార్చనున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు సిద్దిపేట మార్కెట్ యార్డుకు వస్తున్న ధాన్యం కొనుగోళ్ల వివరాలు, సమస్యలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రస్తుత యార్డులోనే పండ్లు, కూరగాయలు , చేపలు, మాంస విక్రయించేలా వసతులు కల్పిస్తామన్నారు. ఈ మేరకు ఇప్పటికే అధికారులు రూపొందించిన ప్రణాళికను ఆమె పరిశీలించారు. యార్డులో రైతులు పండించిన కూరగాయలు పరిస్థితులకు అనుగుణంగా విక్రయాలకు వస్తాయని, ఆ దిశగా బహుళ ప్రయోజనాలతో కూడిన వసతులను కల్పించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా చేపల మార్కెట్‌కు అనుగుణంగా యార్డులో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, కోల్డ్ స్టోరేజ్ వసతి, హోల్‌సేల్ విక్రయాలకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించాలని ఆమె ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఉద్యానశాఖ అధికారులతో సమీక్షిస్తూ రైతుల డిమాండ్‌కు అనుగుణంగా విత్తనాలను పంపిణీ చేయాలన్నారు. ‘మన ఊరు, మన కూరగాయలు’ తరహాలోనే విస్త్రత ప్రచారం చేపట్టాలన్నారు. వచ్చే సీజన్ నాటికి సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో పెద్ద రైతు బజార్‌ను నిర్మించేలా సమష్టిగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. సమీక్షలో రాష్ట్ర మార్కెటింగ్ అడిషనల్ డెరైక్టర్ లక్ష్మిబాయి, డిప్యూటీ డెరైక్టర్ మల్లేశం, జిల్లా వ్యవసాయ శాఖ జేడీ హుక్యా నాయక్, పశు సంవర్దక శాఖ జేడీ లకా్ష్మరెడ్డి, ఉద్యాన శాఖ ఏడీ రామలక్ష్మి, ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఏడీఏలు వెంకటేశ్వర్లు, ఏఎంసీ కార్యదర్శి సంగయ్య, తహశీల్దార్ ఎన్వై గిరి పాల్గొన్నారు. -
ఉద్యోగులకు మార్గదర్శకుడు జావీద్
ఖమ్మం వ్యవసాయం : మార్కెటింగ్ శాఖలో 37 ఏళ్ల పాటు పని చేసిన ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ జావీద్ ఉద్యోగులకు మార్గదర్శకుడని వరంగల్ మార్కెటింగ్ శాఖ జాయింట్ డెరైక్టర్ టి.సుధాకర్ అన్నారు. ఈ నెలతో ఉద్యోగ విరమణ చేస్తున్న జావీద్‌ను శనివారం మార్కెటింగ్‌శాఖ ఉద్యోగులు సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుధాకర్ మాట్లాడుతూ జావీద్ సేవలను కొనియాడారు. క్రమశిక్షణగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు, రైతుల పక్షాన ఉండి మార్కెటింగ్ శాఖ లక్ష్యం కోసం తన వంతు కృషి చేశారని అన్నారు. రాష్ట్రంలోని పలు మార్కెట్లలో పని చేసి తనదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఈ-బిడ్డింగ్‌ను ఏర్పాటు చేయించిన ఘనత జావీద్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను ఆధునీకరించి గుర్తింపును సాధించారన్నారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగల సంఘం జిల్లా అధ్యక్షులు తాడేపల్లి కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు కూరపాటి రంగరాజు, కార్యదర్శి పి.రాజారావు, మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షులు సీహెచ్ ఖాదర్ బాబా తదితరులు జావీద్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మార్కెటింగ్ శాఖ జిల్లా సహాయ సంచాలకులు వినోద్ కుమార్, వివిధ మార్కెట్లకు చెందిన కార్యదర్శులు, మార్కెట్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
‘చెత్త’ పనికి రూ. లక్ష లంచం
రూ.50 వే లకు కుదిరిన బేరం డబ్బు తీసుకుంటూ పట్టుబడ్డ మార్కెటింగ్‌శాఖ అధికారులు చాదర్‌ఘాట్: కూరగాయల మార్కెట్ నుంచి చెత్త తరలింపు పని అనుమతి (వర్క్ అలాట్మెంట్) ఇచ్చేందుకు కాంట్రాక్టర్ నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఇద్దరు మార్కెటింగ్‌శాఖ అధికారులు ఏసీబీ(అవినీతి నిరోధకశాఖ)కి పట్టుబడ్డారు. బుధవారం ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ స్పెషల్ గ్రేడ్ సెక్రెటరీ (ఎస్జీఎస్) కల్పన గుడిమల్కాపూర్ మార్కెట్లోని చెత్త తరలింపునకు సంబంధిత కాంట్రాక్టర్ రాంబాబు నుంచి రూ.లక్ష డిమాండ్ చేశారు. మొదటి విడతగా రూ.50 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్న కాంట్రాక్టర్ ఈ విషయాన్ని ఈనెల 22న ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీంతో అవినీతి నిరోధకశాఖ అధికారులు ఎస్జీఎస్ను పట్టుకొనేందుకు పథకం వేశారు. కాంట్రాక్టర్ రాంబాబు ఇచ్చిన లంచం డబ్బును సీనియర్ అసిస్టెంట్ మహేశ్ ద్వారా ఎస్జీఎస్ కల్పన తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ నేతృత్వంలోని అధికారుల బృందం పట్టుకుంది. కల్పన, మహేష్‌లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి లంచం డబ్బు రూ. 50 వేలను స్వాధీనం చేసుకుంది. విచారణ అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఇదే సమయంలో దోమలగూడలో ఉన్న కల్పన ఇంటి వద్ద కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. దాడుల్లో సీఐలు మంజుల, సుదర్శన్‌రెడ్డి, రాజేశ్, ఎస్ఐ రాజవర్ధన్ పాల్గొన్నారు. -
ట‘మోత’
సాక్షి, సిటీబ్యూరో: మార్కెట్లో టమాట ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ఇటీవల ధర తగ్గినట్టేతగ్గి మళ్లీ పైపైకి ఎగబాకుతోంది. వారం కిందట కిలో రూ. 12-15 ఉన్న టమాట ధర ఒక్కసారిగా రూ. 30 లకు పెరిగింది. ఇళ్లవద్దకు వచ్చే తోపుడు బండ్ల వారైతే కేజీ రూ. 35కు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత పెరుగుతుండడంతో ఆ ప్రభావం పంట దిగుబడిపై పడిందని, ఈ కారణంగానే ఉత్పత్తి గణనీయంగా తగ్గినట్టు మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. స్థానికంగా సాగవుతున్న టమాట పంట కూడా చివరి దశకు చేరడం నగరంలో కొరతకు ఓ కారణంగా నిలిచింది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి దిగుమతి అయ్యే టమాటపైనే నగరం ఆధార పడాల్సి వస్తోంది. నగర డిమాండ్‌కు తగ్గట్టు సరుకు సరఫరా కాకపోవడంతో ఇదే అదనుగా భావించి వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. నిజానికి హోల్ సేల్ మార్కెట్లో ఆదివారం కిలో రూ. 20లు ధర పలికింది. దీనికి రూ. 3లు అదనంగా వేసి రైతుబజార్లలో ధర నిర్ణయించడంతో అక్కడ కిలో రూ.23లకు విక్రయించారు. ఇదే సరుకు బహిరంగ మార్కెట్లోకి వచ్చేసరికి కిలో రూ. 30-35 ప్రకారం వసూలు చేస్తున్నారు. ఘాటెక్కిన మిర్చి హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ.26లున్న పచ్చిమిర్చి ధర రిటైల్ మార్కెట్లో కేజీ రూ.40లకు చేరింది. నగర అవసరాలకు నిత్యం 100-150 టన్నుల మిర్చి దిగుమతి అయ్యేది. ప్రస్తుతం 100 టన్నుల లోపే మిర్చి దిగుమతి అవుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం లోకల్‌గా మిర్చి సరఫరా తగ్గిపోవడంతో గుంటూరు, విజయవాడ, అనంతపురం, బెంగళూరుల నుంచి దిగుమతి చేసుకొంటున్నారు. బెండ, దొండ, బీర, కాకర, దోస తదితరాల ధరలు కేజీ రూ.40లకు చేరువయ్యాయి. ఇక క్యారెట్, చిక్కుడు, గోకర, ఫ్రెంచ్ బీన్స్ ధరలైతే సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయి. -
తేమ శాతం ఆధారంగా మద్దతు ధరలు
సీసీఐ, మార్క్ఫెడ్లకు పూనం మాలకొండయ్య ఆదేశం హైదరాబాద్: పంటలో ఏర్పడిన తేమ శాతం ఆధారంగా పత్తికి మద్దతు ధరలు చెల్లిస్తున్నామని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. కనీస మద్దతు ధరల అమలుపై ఆమె ఆదివారం సంబంధిత మార్కెటింగ్, వ్యవసాయ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మద్దతు ధర చెల్లింపులపై సమీక్షించారు. ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘మద్దతేది... మహాప్రభో’ కథనానికి స్పందించిన మాలకొండయ్య ఈ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. 8 శాతం తేమ ఉంటే రూ. 4,050 మద్దతు ధర చెల్లిస్తున్నామన్నారు. 9 శాతం ఉంటే రూ. 4,009.50, 10 శాతం ఉంటే రూ. 3,969, 11 శాతం ఉంటే రూ. 3,929.50, 12 శాతం ఉంటే రూ. 3,888 చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో 16.76 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేయగా 205.77 లక్షల క్వింటాళ్లు ఉత్పత్తి అవుతుందని అంచనా వేశామని తెలిపారు. పత్తి, మొక్కజొన్న, వరి రైతులకు కనీస మద్దతు ధర చెల్లించే విషయంలో ధాన్యం అయిపోయేంత వరకు కొనుగోళ్లు చేయాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), మార్క్‌ఫెడ్ సహా వివిధ కొనుగోలు సంస్థలను మాలకొండయ్య ఆదేశించారు.