ఒకే గొడుగు కిందికి అన్ని గోదాములు!
• మార్కెటింగ్ శాఖ సమీక్షలో మంత్రి హరీశ్‌రావు ఆదేశం
• నగదు రహితంగా మార్కెటింగ్ శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ సంస్థలు, శాఖల కింద ఉన్న గోదాములన్నింటినీ గిడ్డంగుల సంస్థ కిందకు తీసుకురావాలని మంత్రి హరీశ్‌రావు నిర్ణరుుంచారు. అవసరమైన కసరత్తు కోసం ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని నియ మించారు. మంత్రి హరీశ్‌రావు గురువారం వివిధ అంశాలపై సచివాలయంలో సుదీర్ఘంగా సమీక్షిం చారు. మార్కెటింగ్, పౌర సరఫరాలు, వేర్ హౌసింగ్, వ్యవసాయ, ఆగ్రో సీడ్‌స, మార్క్‌ఫెడ్ సంస్థల కింద ఉన్న గోదాముల నిర్వహణ, కార్య కలాపాలన్నింటినీ ఒకే గొడుగు పరిధిలోకి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ సం స్థల గోదాములు ఖాళీగా ఉంటూ, ప్రైవేటు గోదా ములు నిండుతున్న పరిస్థితి తక్షణం మారాలని, ప్రైవేటువ్యక్తులు, సంస్థలకు పోటీగా ప్రభుత్వ విభా గాలు సమర్థంగా పనిచేయాలని సూచించారు. వివిధ సంస్థల గోదాములన్నింటినీ గిడ్డంగుల సంస్థ పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై కసరత్తు చేసేం దుకు మార్కెటింగ్ శాఖ జేడీ, ఎస్‌ఈ , వేర్ హౌసిం గ్ జీఎం, ఈఈ , పౌర సరఫరాల సంస్థ జీఎం, డీఎం, మార్క్‌ఫెడ్ జీఎంలతో ఒక కమిటీని మంత్రి నియమించారు. కమిటీకి నోడల్ అధికారిగా వ్యవ సాయ శాఖ కమిషనర్, వేర్ హౌజింగ్ ఎండీ జగన్ మోహన్ ఉంటారు. గోదాములను ఆధునీక రించా లని, సీసీ కెమెరాల ఏర్పాటు, వివరాలను ఆన్‌లైన్ చేయడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
నగదు రహితం దిశగా చర్యలు
రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్లు, రైతు బజా ర్లను నగదు రహితంగా మార్చాలని అధికా రులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఇప్పటికే హరితహారం వంటి కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ నంబర్ వన్‌గా పేరు తెచ్చుకుందని.. అలాంటి స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. నగదు రహిత లావాదేవీలతో మార్కెట్ యార్డుల్లో జీరో దందాలకు చెక్ పెట్టవచ్చన్నారు. రైతులకు, మార్కె ట్ సిబ్బందికి నగదు రహిత విధానంపై తగిన శిక్షణ ఇవ్వాలని సూచించారు. వరంగల్ మార్కెట్ కమిటీ అమలు చేస్తున్న నగదు రహిత విధానాలను అన్ని మార్కెట్లలో అమలు చేయాలన్నారు.
రైతులతో పాటు మార్కెట్లలో పనిచేసే దడ్వారుులు, హమా లీలు, ఇతర కార్మికులందరికీ బ్యాంకు ఖాతాలు తెరిచి, డెబిట్‌కార్డులు కూడా అందేలా చూడాల న్నారు. మార్కెట్లలో మైక్రో ఏటీఎం లను ఏర్పాటు చేయాలని, బ్యాంకు ఖాతాలున్న రైతులకు ఆర్టీజీ ఎస్ ద్వారా చెల్లింపులు చేయాలని చెప్పారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించాల్సిందిగా జిల్లా కలెక్టర్లను కోరామని, సమస్యలుంటే కలెక్టర్లతో సంప్రదిం చాలని అధికారులకు సూచించారు.
హైదరాబాద్ మార్కెట్ కమిటీకి పాలకవర్గం
హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమి టీని మంత్రి హరీశ్‌రావు గురువారం ప్రక టిం చారు. కమిటీ చైర్ పర్సన్‌గా షాహీన్ అఫ్రోజ్, వైస్ చైర్మన్‌గా భువనేశ్వరిని ఎంపిక చేశారు.