cash-free
-
అకటా...! మళ్లీ కటకట
⇒ బ్యాంకుల్లో నిండుకున్న నగదు నిల్వలు ⇒ ఏటీఎంల వద్ద ‘నో క్యాష్’ బోర్డులు ⇒ నగదురహితం పేరిట ప్రభుత్వం గొప్పలు ⇒ పల్లెలు, పట్టణాల్లో సామాన్యుల ఇక్కట్లు ‘నో క్యాష్’ బోర్డులు...పొడవైన క్యూలు... బ్యాంకుల్లో పడిగాపులు... అయినా అందుబాటులోకి రాని నగదు...వెరసి అమరావతిలో మరో సారి నగదు కష్టాలు ముప్పిరిగొన్నాయి. మూడు నెలల పాటు నగదు కష్టాలతో అల్లాడిన సామాన్యులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నామని భావిస్తుండగా... అంతలోనే మరోసారి నగదు కొరత వచ్చిపడింది. సాక్షి, అమరావతి బ్యూరో : బ్యాంకుల వద్ద నగదు నిల్వలు దాదాపు నిండుకోవడంతో సామాన్యులు ఇక్కట్లు పడుతున్నారు. మరోవైపు అమరావతి ప్రాంతాన్ని నగదు రహిత జిల్లాలుగా ప్రకటిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా తయారైంది. నగదు కష్టాలు రిజర్వు బ్యాంకు రాష్ట్రంలోని బ్యాంకులకు నగదు సరఫరాను గణనీయంగా తగ్గించివేసింది. నగదు రహిత లావాదేవీలవైపు ప్రజలను మళ్లించేందుకే ఇలా చేసినట్లు తెలుస్తోంది. అమరావతి పరిధిలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా తయారైంది. కృష్ణా జిల్లాలో 48 బ్యాంకులకు చెందిన 789 శాఖలు ఉండగా, గుంటూరు జిల్లాలో 42 బ్యాంకులకు చెందిన 795 శాఖలు ఉన్నాయి. దాదాపు అన్ని శాఖల్లోనూ కనీస స్థాయిలో కూడా నగదు నిల్వలు లేకుండా పోయాయి. కొత్తగా ప్రారంభించిన శాఖకు రోజువారీ లావాదేవీలకు కనీసం రూ.50లక్షలు అవసరం కాగా, 10 ఏళ్లకు పైబడిన శాఖలలో రోజుకు దాదాపు రూ.2కోట్ల వరకు లావాదేవీలు సాగుతాయి. ఇక గ్రామీణ బ్యాంకులకు రోజుకు కనీసం రూ.10లక్షల వరకు అవసరం. కానీ అందులో 25 శాతం నగదు నిల్వలు కూడా లేకుండాపోయాయి. దాంతో బ్యాంకుల్లో దాదాపు 75 శాతం లావాదేవీలు తగ్గిపోయాయి. డ్వాక్రా సంఘాలు, రైతులకు చెల్లింపులు నిలిపి వేశారు. ఖాతాదారులకు నగదు చెల్లింపులపై అనధికారికంగా పరిమితులు విధిస్తున్నారు. నో క్యాష్ బోర్డులే ... నగదు నిల్వలు లేకపోవడంతో ఏటీఎంల వద్ద ‘నో క్యాష్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో 928 ఏటీఎంలు, గుంటూరు జిల్లాలో 850 ఏటీఎంలు ఉన్నాయి. వాటిలో 80శాతం ఏటీఎంలలో నగదు నిల్వలు లేనేలేవు. విత్‌డ్రా కోసం ఖాతాదారులు పలు ఏటీఎంల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఒక్కో ఏటీఎంలో రోజుకు సగటున రూ.30లక్షలు ఉంచాలి. కానీ ప్రస్తుతం రూ.10లక్షలు కూడా అందుబాటులో ఉంచలేకపోతున్నారు. 13 నుంచి పరిస్థితి ఏమిటో...!? ఈ నెల 13 నుంచి బ్యాంకుల్లో విత్‌డ్రాల మీద పరిమితి ఎత్తివేస్తామని రిజర్వు బ్యాంకు ప్రకటించింది. ప్రస్తుతం సేవింగ్స్ ఖాతా నుంచి రోజుకు రూ.50వేల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మార్చి 13 నుంచి ఆ పరిమితి తొలగిస్తామని చెప్పారు. అదే విధంగా ఏటీఎం నుంచి రోజుకు రూ.40వేలు విత్‌డ్రా చేసుకోవచ్చని కూడా ప్రకటించారు. కానీ ప్రస్తుతం నగదు నిల్వలు నిండుకోవడంతో ఆర్బీఐ ప్రకటించిన విధానం అమలయ్యే సూచనలు కనిపించడం లేదు. -
నగదురహితం వైపు అడుగులు వేయండి
► గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేయండి ► ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పెద్దపల్లి : దేశాన్ని డిజిటల్ యుగం వైపు తీసుకెళ్లాలని, దీనికోసం సర్పంచులు గ్రామస్థాయిలో నగదురహితంవైపు ప్రజలను అడుగులు వేయించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సూచించారు. పెద్దపల్లి అమర్‌చంద్ కలాణ మండపంలో జిల్లా సర్పంచ్‌లకు పలు అభివృద్ధి కార్యక్రమాలు, నగదు రహిత చెల్లింపులపై అవగాహన కల్పించారు. గ్రామస్థాయిలో నగదురహితం గురించి ఇంటింటా ప్రచారం నిర్వహించాలని కోరారు. సెల్‌ఫోన్ ద్వారా సైతం నగదు చెల్లింపులు కొనసాగేలా ప్రోత్సహించాలన్నారు. ప్రజాప్రతినిధిగా గ్రామాభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని కోరారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువయ్యేలా చూడాలన్నారు. హరితహార కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న నీడనిచ్చే మొక్కలతోపాటు పండ్ల మొక్కలను పెంచేందుకు గ్రామస్తులకు అవగాహన కల్పించాలన్నారు. ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని నగదు రహితంతో బంగారు తెలంగాణగా మార్చుకుందామని అన్నారు. గ్రామాలను అభివృద్ధి పరుచుకునేందుకు నగదు రహితం చైతన్య కార్యక్రమంగా నిలుస్తుందన్నారు. ప్రజల్లో సంపూర్ణ అవగాహన కల్పించేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలని కోరారు. జిల్లా పంచాయతీ అధికారి సుదర్శన్, డీఆర్డీఏ పీడీ అంజయ్య సర్పంచ్‌లకు అవగాహన కల్పించారు. -
రిజిస్ట్రేషన్ల శాఖ ఇక నగదు రహితం!
- జనవరి 15లోగా ‘నగదు రహిత లావాదేవీల’కు రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం - రాష్ట్ర వ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పీవోఎస్ల ఏర్పాటు - సిద్దిపేటలో నేటి నుంచి అమలు సాక్షి, హైదరాబాద్: నగదు రహిత లావాదేవీల(క్యాష్‌లెస్) దిశగా రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ పరుగులు తీస్తోంది. ఇప్పటికే ఈ–చలాన్ల ద్వారా అధిక మొత్తం లావాదేవీలను క్యాష్‌లెస్‌గా మార్చిన అధికారులు, తాజాగా సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాల్లో చిన్న మొత్తాల చెల్లింపుతో చేసే లావాదేవీలనూ డిజిటలైజ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయా(ఎస్సార్వో)ల్లో పాయింట్ ఆఫ్ సేల్స్(పీవోఎస్) మెషీన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పూర్తి నగదు రహిత లావా దేవీల ప్రక్రియ అమలులో భాగంగా తొలుత సిద్దిపేట నియోజకవర్గంలోని అర్బన్, రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో శుక్రవారం నుంచి పైలెట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు. ఇందులో సమస్యలను పరిష్క రించే బాధ్యతను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) కు రిజిస్ట్రేషన్ల శాఖ అప్పగించింది. సిద్దిపేటలో పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైతే జనవరి 15లోగా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ పీవోఎస్ మెషీన్లను ఏర్పాటు చేసేందుకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అధికారులు అంగీకరించినట్లు తెలిసింది. నగదు రహిత లావాదేవీలు ఇలా.. ప్రస్తుతం ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్(ఈసీ), సర్టిఫైడ్ కాపీ, వీలునామా, వివాహ రిజిస్ట్రేషన్ల నిమిత్తం రిజిస్ట్రేషన్ల శాఖలో నగదు లావాదేవీలే కొనసాగుతున్నాయి. చిన్న మొత్తాల్లో ఉండే ఆయా ఫీజులను సబ్ రిజిస్ట్రార్ కార్యా లయంలోనే వినియోగదారులు నేరుగా చెల్లిస్తున్నారు. ఈ తరహా లావాదేవీల ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖకు ఏటా రూ.130కోట్ల నుంచి రూ.150కోట్ల దాకా ఆదాయం సమకూరుతోంది. రిజిస్ట్రేషన్ల శాఖను సంపూర్ణంగా క్యాష్‌లెస్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇకపై ఎస్సార్వోలలో చెల్లించే చార్జీలను కూడా వినియోగదారులు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లిం చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసీ కోసం రూ.200, సీసీ కోసం రూ.120, వివాహ రిజిస్ట్రేషన్‌కు రూ.100, వీలునామా రిజిస్ట్రేషన్‌కు రూ.1000 మొత్తాలను ఇకపై నగదు తీసుకెళ్లకుండానే వినియోగదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లించవచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి సాంకేతిక సేవలందిం చేందుకు ఏర్పాటు చేసుకున్న ఫెసిలిటీ మేనేజర్ (టీసీఎస్) కాంట్రాక్ట్ గడువు గత ఆగస్టుతోనే ముగిసింది. ప్రభుత్వం వెంటనే ఫెసిలిటీ మేనేజర్‌ను నియమించి, మెరుగైన ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలని అధికారులు, సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. -
పూర్తి నగదు రహితం సాధ్యం కాదు
ఎస్ఎల్బీసీ సమావేశంలో బాబు సాక్షి, అమరావతి: నగదు రహిత లావాదేవీల అంశంపై ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు మాటమార్చారు. పూర్తి స్థాయిలో నగదు రహితం సాధ్యం కాదని ఆయన తాజాగా పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలకే ఇది సాధ్యం కాలేదన్నారు. శుక్రవారం విజయవాడలో జరిగిన 197వ రాష్ట్ర బ్యాంకర్ల సమావేశంలో సీఎం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ‘నగదు రహిత లావాదేవీ’లను ప్రోత్సహిం చడం కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల కమిటీకి చైర్మన్ అయిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రజలు పూర్తిగా నగదు రహిత లావాదేవీల వైపు మళ్లాలని ఇటీవల వ్యాఖ్యానించిన ఆయన నోటి నుంచి పూర్తిస్థాయిలో నగదు రహితం సాధ్యం కాదన్న మాటలు వెలువడడం విశేషం. అయితే నగదు రహిత లావాదేవీల అంశంలో ప్రజల సైకాలజీ మారాలని ఆయనీ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రజలు నగదు లావాదేవీల నుంచి నగదు రహిత లావాదేవీలకు మారాల్సిన అవసరముందన్నా రు. బయోమెట్రిక్ విధానంతో కేవలం ఆధార్ నంబర్ ఆధారంగా మొబైల్ నుంచే లావాదేవీలు జరుపుకునే సౌలభ్యాన్ని కనుగొనడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ సమస్యలు ఎదుర్కొంటున్నారు.. ఇదిలా ఉండగా పెద్ద నోట్ల రద్దు అంశంపైనా చంద్రబాబు మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ప్రతీ ఒక్కరూ సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి సుదీర్ఘమైన సమస్యను తన రాజకీయ జీవితంలో ఎదుర్కొనలేదని వ్యాఖ్యానించారు. పెన్షన్లను బ్యాంకు ఖాతాల్లో వేయడం వల్ల క్యూలైన్లలో నించోలేక అనేకమంది మరణించారని, మరికొందరు అనారోగ్యం పాలయ్యారని అన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయాయని అంటూ.. వీటిని త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరముందన్నారు. మాకు నో రూల్స్: బాబు ‘‘రాజకీయంగా మాకు తలనొప్పులు రాకుండా చూడండి. నిబంధనలున్నా మమ్మల్ని దృష్టిలో ఉంచుకోండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు హితబోధ చేశారు. రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సదస్సులో ఏకంగా ముఖ్యమంత్రే నిబంధనలను పాటించవద్దని, అధికార పార్టీ వారి విషయంలో చూసీచూ డనట్లు వ్యవహరించాలని పేర్కొనడం పట్ల అధికార యంత్రాంగం విస్తుపోయింది. నిబం ధనల ప్రకారం వెళితే తమకు ఇబ్బందులు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘‘రెండున్నరేళ్ల తరువాత మేము ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ సమయంలో కలెక్టర్లు, ఎస్పీలు ఎన్నికల రిఫరీలు, పరిశీలకులుగా వస్తారు. మేము మాత్రం పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి న బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. ప్రతి విషయంలోనూ అధికార యంత్రాంగం నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ముందు కెళితే రాజకీయంగా మాకు ఇబ్బందులు తప్పవని దృష్టిలో ఉంచుకోవాలి’’ అని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో అధికులు అసంతృప్తితో ఉన్నారని సీఎం చెప్పారు. రాయలసీమ జిల్లాల నుంచి అమరావతి వరకు నిర్మించే ఎక్స్‌ప్రెస్ రహదారికి ఏకంగా 26,700 ఎకరాల భూమిని సమీకరించడం సాధ్యం కాదని ఆయా జిల్లాల కలెక్టర్లు సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. బాబు మాత్రం సమీకరణే తప్ప భూసేకరణ వద్దని తేల్చిచెప్పారు. 2018లో అమరావతిలో జాతీయ క్రీడలు అమరావతిలో 2018లో జాతీయ క్రీడలను నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన ఇబ్రహీంపట్నం మూలపాడులో 28వ ఆలిండియా అడ్వకేట్స్ క్రికెట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. -
నగదు రహితమే స్ఫూర్తి
- ఈ తరహా లావాదేవీలను ప్రోత్సహించేందుకు చర్యలు - ప్రజలు డిజిటల్ చెల్లింపులను అలవాటు చేసుకోవాలి - వచ్చే బడ్జెట్లో కొత్త కలెక్టరేట్లకు నిధులు - అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. సిద్ధిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్ నగదు రహిత గ్రామంగా ఆదర్శంగా నిలిచిందని, సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం కూడా త్వరలోనే ఈ ఘనత సాధిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ అంతటా నగదు రహిత లావాదేవీలు జరగాలని సూచించారు. పెద్దనోట్ల రద్దుతో పాటు ఆర్థిక అంశాలపై కేంద్రం అమలు చేస్తున్న నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై సోమవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావు, అధికారులు నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, నవీన్ మిట్టల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పైలెట్ ప్రాజెక్టు అమలవుతున్న సిద్ధిపేట నియోజకవర్గంలో అవసరమైనన్ని స్వైపింగ్ మిషన్లు, ఏటీఎం కార్డులు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి సూచించారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించే క్రమంలో తలెత్తే ఇబ్బందులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, వాటికి పరిష్కారాలు వెతకాలని అధికారులను ఆదేశించారు. ‘కరెన్సీ నిర్వహణ కేంద్రం పరిధిలోని అంశం. నగదు లావాదేవీలను కనిష్ఠ స్థాయికి తీసుకురావటం కేంద్రం ఉద్దేశమనిపిస్తోంది. కరెన్సీ కూడా పెద్ద మొత్తంలో అందుబాటులో లేదు. ఈ పరిస్థితిని ఎదుర్కునేందుకు ప్రజలు కూడా సిద్ధం కావాలి. నగదు రహిత లావాదేవీలు జరపాలి. మొబైల్ యాప్‌లు, ఏటీఎం కార్డులు, స్వైపింగ్ మిషన్లు వాడాలి. ఆన్లైన్ చెల్లింపులు పెరగాలి. ప్రజలకు అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమాలను అధికారులు రూపొందించాలి. బ్యాంకులు తమ సేవలను విస్తరించాలి. సర్వర్లను డెవలప్ చేసుకోవాలి. అధికారులు బ్యాంకర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలి. ఇంటర్నెట్ సౌకర్యం లేకున్నా లావాదేవీలు నిర్వహించే మొబైల్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు చేరవేయాలి..’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రేపు జిల్లా కలెక్టర్ల సదస్సు.. ‘అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీలక పాత్ర పోషించాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇంటిగ్రేటేడ్ కలెక్టరేట్లు నిర్మించాలి. కొత్త జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు, పోలీస్ కార్యాలయాలు నిర్మించేందుకు స్థలా లు ఎంపిక చేయాలి. వచ్చే బడ్జెట్లో వీటికి నిధులు కేటాయిస్తాం. కొత్త జిల్లాల ఏర్పాటు తో పరిపాలనా విభాగాలు ప్రజలకు అందు బాటులోకి వచ్చాయి. వాటి ఫలితాలు ప్రజల కు దక్కాలి. బుధవారం జరిగే కలెక్టర్ల సదస్సులో కొత్త జిల్లాల ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలపై చర్చ జరుగుతుంది. కలెక్టర్లు, ఇతర అధికారులు అన్ని విషయాలపై సమగ్ర సమాచారంతో రావాలి. నగదు రహి త లావాదేవీల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నీటి పారుదల ప్రాజెక్టులు, ఆసుపత్రుల నిర్వహణ, రెసిడెన్షియల్ స్కూళ్లు, హరితహారం, సాదా బైనామా తదితర అంశాలపై కలెక్టర్ల సమావేశంలో చర్చిద్దాం..’ అని సీఎం కేసీఆర్ అధికారులతో చెప్పారు. -
ఆర్టీసీ బస్సుల్లో త్వరలో ఈ–పాస్ యంత్రాలు
సాక్షి, అమరావతి : ఆర్టీసీలో నగదు రహిత కార్యకలాపాల్ని ప్రోత్సహించేందుకు గాను ఆర్డినరీ సర్వీసుల నుంచి ఏసీ సర్వీసుల్లో ఈ–పాస్ యంత్రాలు వినియోగించనున్నట్లు యాజమాన్యం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. క్రెడిట్, డెబిట్, రూపే కార్డులతో టిక్కెట్లకు చెల్లింపులు జరిపేలా స్వైపింగ్ యంత్రాలను వాడనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం 16 వేల యంత్రాలను సమకూరుస్తున్నట్లు ఆర్టీసీ ప్రజా సంబంధాల అధికారి మూర్తి చెప్పారు. -
రేషన్ షాపుల్లో నగదు రహితం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లోని రేషన్ షాపుల్లో నగదు రహిత లావాదేవీలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే నగర శివారులోని జిల్లాల్లో నగదు రహిత లావాదేవీలు ప్రారంభమవడంతో ఇక్కడ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే సంబంధిత అధికారులు, డీలర్లతో సమావేశమై నగదు రహిత లావాదేవీలపై చర్చించారు. ముందుగా రేషన్ సరుకులతో పాటు వివిధ శాఖల బిల్లులు, చార్జీలు వసూళ్లు చేసే బాధ్యతలను డీలర్లకు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ–పోస్ యంత్రాల ద్వారా సరుకుల పంపిణీ కొనసాగుతోంది. అయితే ప్రస్తుతమున్న ఈ యంత్రాలకు తోడు స్వైపింగ్ మిషిన్లను అందించాలా? లేదా ఈ–పోస్ యంత్రాల్లోనే కొత్త సాఫ్ట్వేర్ అమర్చడం సాధ్యమేనా? అన్న అంశంపై అధికారులు నిపుణలతో చర్చిస్తున్నారు. త్వరలో ఒక నిర్ణయం తీసుకొని నగదు రహిత లావాదేవీలు ప్రారంభించాలని యోచిస్తున్నారు. తొలివిడతలో సర్కిల్‌కు ఒకటి... గ్రేటర్లో సుమారు 12 సర్కిళ్లు ఉండగా సుమారు 1,545 పైగా చౌక ధరల దుకాణాలున్నాయి. అయితే తొలివిడతలో సర్కిల్‌కు ఒక దుకాణం చొప్పున ఈ నగదు రహిత లావాదేవీలకు శ్రీకారం చుట్టాలని అధికారులు భావిస్తున్నారు. -
అవినీతికి చోటులేదు
• నగదు రహితంతోనే నల్లధనానికి అడ్డుకట్ట ‘లింక్డిన్’లో ప్రధాని • నగదు రహిత మార్పునకు యువత నాయకత్వం వహించాలి న్యూఢిల్లీ: 21వ శతాబ్దంలో అవినీతికి చోటు లేదని, అది అభివృద్ధిని మందగింప చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పేదలు, దిగువ మధ్య, మధ్య తరగతి ప్రజల కలల్ని అవినీతి నాశనం చేస్తుంది’ అని లింక్డిన్.కామ్ వెబ్సైట్లో రాసిన వ్యాసంలో ప్రధాని పేర్కొన్నారు. కరెన్సీ రూపంలో భారీగా నగదు చెలామణిలో ఉండడం దేశంలో అవినీతి, నల్లధనానికి ఊతమిస్తోందని, దానికి అడ్డుకట్ట వేసేందుకు నగదు రహిత కార్యకలాపాల దిశగా సాగుతున్న మార్పునకు యువత నాయకత్వం వహించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ విధానం అవినీతి రహిత భారతదేశ నిర్మాణానికి గట్టి పునాదిగా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. భారీగా భౌతికరూపంలో నగదు ఉండడం అవినీతి, నల్లధనానికి కారణమవుతోందని, వాటిని నిర్మూలించేందుకే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ⇔ ‘నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా యువతకు... నగదు రహిత సమాజం దిశగా మార్పునకు నాయకత్వం వహించమని కోరుతున్నా’ అని కోరారు. ‘మనం ప్రస్తుతం మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ల యుగంలో నివసిస్తున్నాం. ఆహార పదార్థాల ఆర్డర్‌కు, ఫర్నీచర్ కొనుగోలు, అమ్మకానికి, టాక్సీ సేవల కోసం ఇలా చాలా వాటిని మొబైల్ ద్వారానే నిర్వహిస్తున్నాం. సాంకేతికత మన జీవితాల్లో వేగం, సౌలభ్యాన్ని తీసుకొచ్చింది’ అని వ్యాసంలో ప్రధాని పేర్కొన్నారు. కార్పొరేట్ల లబ్ధి కోసమే ఈ-వాలెట్లకు ప్రోత్సాహం: కాంగ్రెస్ కొన్ని కార్పొరేట్ సంస్థల ఈ-వాలెట్ వ్యాపారాలకు సాయపడేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైటట్ శుక్రవారం ఆరోపించారు. ప్రభుత్వమే ఎందుకు సొంత ఈ-వాలెట్ వ్యవస్థతో ముందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ వాలెట్ కంపెనీల్లో 60 శాతం వాటా చైనా ప్రజలవేనని, రహస్యాల్ని చైనాకు బహిర్గతం చేస్తున్నారంటూ విమర్శించారు. నోట్ల రద్దును విమర్శిస్తున్న వారు 50 రోజుల గడువు వరకూ ఓపిక పట్టాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లక్నోలో శుక్రవారం చెప్పారు. -
ఒకే గొడుగు కిందికి అన్ని గోదాములు!
• మార్కెటింగ్ శాఖ సమీక్షలో మంత్రి హరీశ్‌రావు ఆదేశం • నగదు రహితంగా మార్కెటింగ్ శాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ సంస్థలు, శాఖల కింద ఉన్న గోదాములన్నింటినీ గిడ్డంగుల సంస్థ కిందకు తీసుకురావాలని మంత్రి హరీశ్‌రావు నిర్ణరుుంచారు. అవసరమైన కసరత్తు కోసం ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని నియ మించారు. మంత్రి హరీశ్‌రావు గురువారం వివిధ అంశాలపై సచివాలయంలో సుదీర్ఘంగా సమీక్షిం చారు. మార్కెటింగ్, పౌర సరఫరాలు, వేర్ హౌసింగ్, వ్యవసాయ, ఆగ్రో సీడ్స, మార్క్‌ఫెడ్ సంస్థల కింద ఉన్న గోదాముల నిర్వహణ, కార్య కలాపాలన్నింటినీ ఒకే గొడుగు పరిధిలోకి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సం స్థల గోదాములు ఖాళీగా ఉంటూ, ప్రైవేటు గోదా ములు నిండుతున్న పరిస్థితి తక్షణం మారాలని, ప్రైవేటువ్యక్తులు, సంస్థలకు పోటీగా ప్రభుత్వ విభా గాలు సమర్థంగా పనిచేయాలని సూచించారు. వివిధ సంస్థల గోదాములన్నింటినీ గిడ్డంగుల సంస్థ పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై కసరత్తు చేసేం దుకు మార్కెటింగ్ శాఖ జేడీ, ఎస్ఈ , వేర్ హౌసిం గ్ జీఎం, ఈఈ , పౌర సరఫరాల సంస్థ జీఎం, డీఎం, మార్క్‌ఫెడ్ జీఎంలతో ఒక కమిటీని మంత్రి నియమించారు. కమిటీకి నోడల్ అధికారిగా వ్యవ సాయ శాఖ కమిషనర్, వేర్ హౌజింగ్ ఎండీ జగన్ మోహన్ ఉంటారు. గోదాములను ఆధునీక రించా లని, సీసీ కెమెరాల ఏర్పాటు, వివరాలను ఆన్లైన్ చేయడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నగదు రహితం దిశగా చర్యలు రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్లు, రైతు బజా ర్లను నగదు రహితంగా మార్చాలని అధికా రులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఇప్పటికే హరితహారం వంటి కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ నంబర్ వన్‌గా పేరు తెచ్చుకుందని.. అలాంటి స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. నగదు రహిత లావాదేవీలతో మార్కెట్ యార్డుల్లో జీరో దందాలకు చెక్ పెట్టవచ్చన్నారు. రైతులకు, మార్కె ట్ సిబ్బందికి నగదు రహిత విధానంపై తగిన శిక్షణ ఇవ్వాలని సూచించారు. వరంగల్ మార్కెట్ కమిటీ అమలు చేస్తున్న నగదు రహిత విధానాలను అన్ని మార్కెట్లలో అమలు చేయాలన్నారు. రైతులతో పాటు మార్కెట్లలో పనిచేసే దడ్వారుులు, హమా లీలు, ఇతర కార్మికులందరికీ బ్యాంకు ఖాతాలు తెరిచి, డెబిట్‌కార్డులు కూడా అందేలా చూడాల న్నారు. మార్కెట్లలో మైక్రో ఏటీఎం లను ఏర్పాటు చేయాలని, బ్యాంకు ఖాతాలున్న రైతులకు ఆర్టీజీ ఎస్ ద్వారా చెల్లింపులు చేయాలని చెప్పారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించాల్సిందిగా జిల్లా కలెక్టర్లను కోరామని, సమస్యలుంటే కలెక్టర్లతో సంప్రదిం చాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ మార్కెట్ కమిటీకి పాలకవర్గం హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమి టీని మంత్రి హరీశ్‌రావు గురువారం ప్రక టిం చారు. కమిటీ చైర్ పర్సన్‌గా షాహీన్ అఫ్రోజ్, వైస్ చైర్మన్‌గా భువనేశ్వరిని ఎంపిక చేశారు. -
నగదు రహిత చికిత్సలకు నిరాకరించే ఆస్పత్రుల పై వేటు
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధి నుంచి తొలగిస్తాం మంత్రి డాక్టర్ రాజయ్య హెచ్చరిక సాక్షి, హైదరాబాద్ : నగదు రహిత చికిత్సలకు నిరాకరించే సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధి నుంచి తొలగించేందుకూ వెనుకాడబోమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత పథకం కింద చికిత్స అందించేందుకు 230 ఆస్పత్రులు ముందుకు రాగా, మరో 12 సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయన్నారు. ప్యాకేజీకన్నా అదనంగా 25శాతం ఇవ్వాలని కోరుతున్నాయన్నారు. అవి నవంబర్ చివరికల్లా నెట్వ ర్క్ పరిధి లోకి రాకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం జూబ్లీహిల్స్ ఆరోగ్యశ్రీ కేంద్ర కార్యాలయంలో ఆరోగ్యశ్రీ పథకం అమలుపై ఆయన సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆస్పత్రుల వైఖరి వల్ల ఉద్యోగులకు ఇబ్బంది రాకుండా నవంబర్ 30 వరకు మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా వర్తింపజేస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లు చెప్పారు. జూడాలూ సహనంగా ఉండండి: రాజయ్య జూనియర్ వైద్యుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనిడిప్యూటీ సీఎం రాజయ్య తెలిపారు. వారు కోరుతున్నట్లు శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయడానికీ సిద్ధమేననీ అయితే కమలనాధన్ కమిటీ మార్గదర్శకాలు రావాలని అప్పటి వరకు సహనంతో ఉండాలని జూడాలకు సూచించారు. ఇప్పటికైనా సమ్మెను విరమించి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఇఓ ధనుంజయ్‌రెడ్డి, డీఎంఈ పుట్టా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.