ఉల్లి కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
- కిలో ఉల్లి రూ.8కి కొని రూ.10కి అమ్మాలని మంత్రి హరీశ్ ఆదేశం
- పత్తి ధర తగ్గకుండా చూడాలని మార్కెటింగ్ అధికారులకు సూచన
సాక్షి, హైదరాబాద్: కొల్లాపూర్, ఆలంపూర్ రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉల్లిని మలక్‌పేట మార్కెట్‌లోనూ, రైతు బజార్లలోనూ అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి కిలో రూ.ఎనిమిదికి కొని వినియోగదారులకు రూ.10కి అమ్మాలని కోరారు. రైతుల నుంచి ఉల్లి సేకరణ, కొనుగోలుకు మార్కెటింగ్ శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. అరుుతే మలక్‌పేట ఉల్లి మార్కెట్ ఇరుకుగా ఉన్నందున పటాన్ చెరుకు ఆనుకొని ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డుకు ఉల్లి మార్కెట్‌ను తరలించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎవరైనా ఉల్లి కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అత్యంత ఆధునిక సౌకర్యాలతో మార్కెట్ ఏర్పాటుకు గాను పుణే ఉల్లి మార్కెట్‌ను అధ్యయనం చేయడానికి ఒక బృందాన్ని పంపాలని హరీశ్‌రావు వివరించారు. పాత 500, 1,000 నోట్లతో మార్కెటింగ్ కార్యకలాపాల స్తంభనపై మంత్రి హరీశ్‌రావు మంగళవారం మూడు గంటలకు పైగా సమీక్షించారు. ముందుగా ఉల్లి వ్యాపారులతో పరిస్థితిని సమీక్షించారు. రూ. 500, 1,000 నోట్ల రద్దు వల్ల వ్యాపార లావాదేవీలు జరపలేమని వారన్నారు. ఏదిఏమైనా వినియోగదారులకు ఉల్లి కొరత లేకుండా చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్‌శాఖ అధికార యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు.
త్వరలో కొత్త వ్యవసాయ మార్కెట్ చట్టం
వ్యవసాయ మార్కెట్ చట్టంలో సంస్కరణలు తీసుకువచ్చి కొత్త చట్టం రూపొందించేందుకు ‘నల్సార్ ’వర్సిటీ ప్రతినిధులతో మరో వారంలో సమావేశం జరపాలని మంత్రి నిర్ణరుుంచారు. పత్తి ధర క్వింటాలుకు ప్రస్తుతం రూ.4,500 నుంచి రూ.5,000 లభిస్తున్నదని.. ఈ ధర తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. జిన్నింగ్ మిల్లులపై రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నందున ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఉన్న జిన్నింగ్ మిల్లులను తనిఖీ చేసి, ట్రేడర్లతో సమావేశాలు జరిపి సమస్య పరిష్కరించాలని మంత్రి కోరారు. అలాగే కమిషన్ ఏజెంట్లకు లెసైన్సుల జారీ వ్యవహారంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వెళ్లాలని మార్కెటింగ్ డెరైక్టర్ లక్ష్మీబారుుని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. నల్లగొండలో తలపెట్టిన బత్తారుు మార్కెట్ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు పంపాలని కోరారు.