ఏడీఎం కార్యాలయ భవన పరిశీలన | ADM office building inspection | Sakshi
Sakshi News home page

ఏడీఎం కార్యాలయ భవన పరిశీలన

Published Thu, Sep 29 2016 12:53 AM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

ADM office building inspection

  • మానుకోట ఏఎంసీ భవనంపై కార్యాలయం బోర్డు ఏర్పాటు
  • మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడనున్న తరుణంలో స్థానికంగా జిల్లాస్థాయి అధికారుల కార్యాలయాల ఏర్పాటుకు కసరత్తు ఊపందుకుంది. ఇందులో భాగంగా మార్కెటింగ్‌ శాఖకు సంబంధించి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. తాజాగా బుధవారం వరంగల్‌ మార్కెటింగ్‌ శాఖ  అసిస్టెంట్‌ ప్రవీణ్‌రెడ్డి మహబూబాబాద్‌కు వచ్చారు. స్థానిక ఏఎంసీ సెక్రటరీ వి.సుచిత్ర, సూపర్‌వైజర్‌ శ్రీనివాసరాజుతో కలిసి ఏడీఎం కార్యాలయ ఏర్పాటుకు ఎంపిక చేసిన భవనాన్ని పరిశీలించారు. అక్టోబర్‌ 1కల్లా ఏడీఏం కార్యాలయ ఫర్నీచర్‌ మహబూబాబాద్‌కు చేరుతుందని ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయ భవనంపైన జిల్లా మార్కెటింగ్‌ కార్యాలయం బోర్డును కూడా ఏర్పాటు చేయించడం గమనార్హం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement