సాక్షి,మహబూబాబాద్: ఏడాదిలో ఇరవైఎనిమిదిసార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. లగచర్ల ఫార్మాసిటీ బాధితులకు న్యాయం చేయాలని సోమవారం(నవంబర్ 25) మహబూబాబాద్ పట్టణంలో జరిగిన బీఆర్‌ఎస్ మహాధర్నాలో కేటీఆర్ మాట్లాడారు.
‘చిన్న సన్న కారు రైతులపై రేవంత్‌రెడ్డి జులుం ప్రదర్శిస్తున్నారు. లగచర్లలో సొంత అల్లుడి కోసం రేవంత్ పేదల భూములు లాక్కుంటున్నారు. రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పాలి. లగచర్లలో పేదల భూములను వెంటనే తిరిగి ఇచ్చేయాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
మహాధర్నాలో కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే..
- లగచర్లలో 3 వేల ఎకరాల భూములను చెరబట్టాలని చూశారు
- సీఎం రేవంత్ రెడ్డి.. తన సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించిన ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు
- ఢిల్లీకి 28 సార్లు వెళ్లి 28 రూపాయలు కూడా తేలేదు
- రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో తిరుగుబాటు ఎదుర్కొంటున్నాడు
- లగచర్లకు అధికారులు పోతే నిరసన వ్యక్తం చేశారు.. రేవంత్ రెడ్డి పోతే ఉరికించి కొట్టేవాళ్ళు
- ప్రధాని మోదీ.. రైతులు ఏడాది పాటు నిరసన తెలిపితే నల్ల చట్టాలు వెనక్కి తీసుకున్నారు
- రేవంత్ రెడ్డి రైతులతో పెట్టుకున్నారు
- జైల్లో పెట్టిన 30 మందికి సంఘీభావంగా మానుకోటలో ధర్నా చేస్తామంటే.. అడ్డుకునే ప్రయత్నం చేశారు
- ఎవరికోసం ఫార్మా విలేజ్..?.. అల్లుడి కోసం పేదవాళ్ల భూములు లాక్కుంటున్నారు
- ముఖ్యమంత్రి పేదల కోసం పనిచేయడం లేదు..అదాని కోసం.. అల్లుడి కోసం.. అన్నదమ్ముల కోసం పనిచేస్తున్నారు
- పేద ప్రజల కోసం సీఎం రేవంత్ రెడ్డి పనిచేయడం లేదు
- ఇంకా నాలుగు రోజులు అయితే ఈ ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతుంది.. ఆరు గ్యారెంటీలు అన్నారు .. ఒక హామీ అయినా అమలైందా
- రేవంత్ రెడ్డికి మహారాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు.. కాంగ్రెస్ పార్టీని తన్ని వెళ్ళగొట్టారు
- నేను వస్తే రాళ్లతో కొడతామని కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు.
- అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామంటే పోలీసులు ఏం చేస్తున్నారు
- మానుకోట రాళ్ల మహత్యం ఏంటో తెలంగాణ ఉద్యమంలో చూపించాం
- కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుంటే.. వెయ్యి మంది వస్తారు అనుకుంటే 20 వేల మంది వచ్చారు
- ప్రభుత్వం మీద ఎన్నో వ్యతిరేకత ఉందో మానుకోట మహా ధర్నా చూస్తే అర్థమవుతుంది
- నాలుగేళ్లు గట్టిగా కొట్లాడుదాం.. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి వస్తాం
- ఢిల్లీకి వెళ్లి గిరిజనులు వివిధ కమిషన్లకు తమ బాధ చెప్తుంటే.. వాళ్లు కూడా ఎంతో బాధపడ్డారు
- గిరిజనుల రిజర్వేషన్ 6 శాతం నుంచి 10 శాతానికి పెంచారు
- మానుకోట మొదటి అడుగు మాత్రమే.. రాష్ట్రంలోని ప్రతి తండా, పల్లెకు వెళ్లి మద్దతు కూడా కడతాము
ఇదీ చదవండి: మహబూబాబాద్‌లో హైటెన్షన్..కేటీఆర్ ఫ్లెక్సీలు చింపివేత
Comments
Please login to add a commentAdd a comment