
సాక్షి,నారాయణపేటజిల్లా:ఏడాదిగా కొడంగల్‌లో దుర్యోధనుడి పాలన సాగుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.సోమవారం(ఫిబ్రవరి10) కోస్గిలో జరిగిన బీఆర్‌ఎస్ ‘రైతుదీక్ష’లో కేటీఆర్ మాట్లాడారు.‘ఇక్కడ కురుక్షేత్ర యుద్దం సాగుతోంది. 14 నెలలుగా రేవంత్‌రెడ్డి తన కుటుంబ సభ్యుల కోసం పని చేస్తున్నాడు.
అల్లుడికి కట్నం కోసం లగచర్ల భూములు గుంజుకున్నాడు. కుట్రతో అదానీకి,తన అల్లుడి కంపెనీకి భూములు ఇస్తున్నాడు. బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేయించారు.లగచర్ల బాధితుల తరపున బీఆర్ఎస్ ఢిల్లీలో పోరాడింది.
గిరిజనులు తలచుకుంటే రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో మళ్లీ గెలవడు. రేవంత్ రెడ్డి దమ్ముంటే రాజీనామాచేసి కొడంగల్‌లో పోటీ చేసి గెలువు.ఇక్కడ మా పార్టీ అభ్యర్దికి 50 వేల మెజార్టీ కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేస్తా’అని కేటీఆర్ సవాల్ చేశారు.

రైతుదీక్షలో కేటీఆర్ కామెంట్స్..
- రాష్ట్రంలో 25 శాతం మంది రైతులకు కూడ రుణమాఫీ కాలేదు
- తమ హయాంలో 73 వేల కోట్ల రూపాయలను 12 సార్లు రైతుల ఖాతాల్లో రైతుబంధు వేశాం
- ఈ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు 17 వేల 500 రూపాయలు బాకీ ఉంది
- ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కొడంగల్‌లో బీఆర్ఎస్ అభ్యర్ది నరేందర్ రెడ్డి గెలుపు ఖాయం
- ఇక్కడి కంది రైతుల దాన్యం కొనుగోలు చేయలేని దుస్దితి నెలకొంది
- రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలోనైనా పూర్తి స్దాయిలో రుణమాఫీ జరిగితే
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా - లగచర్లలో భూములకు ఒక్కో ఎకరానికి నీవు ఇచ్చే 20 లక్షలకు అదనంగా పార్టీ పరంగా 5 లక్షల రూపాయలు ఇస్తాం రేవంత్ రెడ్డి సొంత పొలాలు కంపెనీలకు ఇవ్వాలి
- తెలంగాణలో ఎక్కడ రైతులకు,పార్టీ కార్యకర్తలకు నష్టం కలిగినా మేం రక్షణగా ఉంటాం
- కొడంగల్ ఎత్తిపోతల పథకం కేవలం కమీషన్ల కోసమే
Comments
Please login to add a commentAdd a comment