kosgi
-
రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజీ
-
జడ్జి భర్తపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి
సాక్షి, మహబూబ్‌నగర్: ఆస్పత్రికి వెళుతున్న జడ్జి భర్తతో పాటు ఓ సివిల్ కానిస్టేబుల్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం గండేడ్‌లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంట్యానాయక్ ఆధ్వర్యంలో రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. అదే సమయంలో కోస్గి సివిల్ జడ్జి ఫరీనాబేగం భర్త, న్యాయవాది శశికిరణ్ తన అత్తమామలు వెంకటేశ్, లక్ష్మిలను తీసుకొని మహబూబ్‌నగర్ ఆస్పత్రికి బయల్దేరారు. రాస్తారోకో వల్ల ఆలస్యమవుతుందని భావించిన శశికిరణ్.. బీఆర్ఎస్ కార్యకర్తల వద్దకెళ్లి పక్షవాతం వచ్చిన వాళ్లున్నారు, ఆస్పత్రికి వెళ్లేందుకు దారి ఇవ్వాలని కోరారు. ఆందోళన ముగిసే వరకు ఆగాలని కొందరు నాయకులు సూచించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, అడ్వొకేట్ శశికిరణ్ మధ్య మాటామాటా పెరిగింది. దీంతో కొందరు శశికిరణ్‌పై దాడికి దిగారు. అదే సమయంలో అటుగా వెళుతున్న కోస్గి మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన రాజాపూర్ కానిస్టేబుల్ కృష్ణారెడ్డి.. గొడవను గమనించి శశికిరణ్కు కొట్టకుండా బీఆర్ఎస్ కార్యకర్తలను వారించబోయారు. దీంతో అతడిపైనా కార్యకర్తలు దాడికి దిగారు. తర్వాత కొందరు ఇరువర్గాలకు నచ్చజెప్పారు. అనంతరం రేవంత్‌రెడ్డి దిష్టిబొ మ్మను దహనం చేసి ఆందోళన విరమించారు. కాగా, ఈ సంఘటనలో ఇరువర్గాల ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు మహమ్మదాబాద్ ఎస్ఐ సురేష్ తెలిపారు. దాడికి పాల్పడిన మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెంట్యానాయక్‌తో పాటు జోగు కృష్ణయ్య, వెంకట్రాములు, మల్లేశ్‌లపై కేసు నమోదు చేశారు. తమపై దాడి చేశారంటూ పెంట్యానాయక్, జోగు కృష్ణ చేసిన ఫిర్యాదుపై జడ్జి భర్త శశికిరణ్, హెడ్‌కానిస్టేబుల్ కృష్ణారెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు. చదవండి: ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణనే మహిళలకు ఎక్కువ సేఫ్... -
అయ్యప్పస్వామిపై భైరి నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
తల్లి కిరాతకం: అక్కపై కోపంతో.. అయిదు నెలల కొడుకుని హత్య చేసి..
సాక్షి, మహబూబ్‌నగర్: దివ్యాంగురాలైన చెల్లిని చేరదీసి.. తన భర్తకు రెండో వివాహం చేసి జీవితమిచ్చిన అక్కపై కోపంతో కన్నబిడ్డను హత్య చేసింది ఓ కసాయి తల్లి. పైగా నిద్రలో ఉండగా తన బిడ్డను ఎవరో ఎత్తుకెళ్లారంటూ అర్ధరాత్రి హంగామా సృష్టించి తప్పించుకునేందుకు చేసిన హైడ్రామా కథ బెడిసికొట్టి అడ్డంగా దొరికిపోయింది. ఈ సంఘటన నారాయణపేట జిల్లా కోస్గిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కోస్గిలోని ఎస్సీకాలనీకి చెందిన మద్దూరు గోవింద్‌కు కర్ణాటక రాష్ట్రంలోని కానగడ్డకు చెందిన మొగులమ్మతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. అయితే మొగులమ్మ చెల్లెలు కాశమ్మ పుట్టుకతో మూగ, చెవుడు కావడంతో తన చెల్లెలి జీవితాన్ని ఎలాగైనా నిలబెట్టాలని తన భర్త గోవిందును ఒప్పించి రెండేళ్ల క్రితం రెండో వివాహం జరిపించింది. కుటుంబ విషయమై అక్క చెల్లిని మందలిస్తూ ఉండేది. ఈ క్రమంలో రెండు రోజులుగా అక్కాచెల్లెళ్ల మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి. దీంతో అక్కపై కోపం పెంచుకున్న కాశమ్మ శనివారం ఇంట్లో అందరూ భోజనాలు చేసి నిద్రించిన తర్వాత అర్ధరాత్రి బాబును తీసుకెళ్లి హత్య చేసి పట్టణ శివారులోని శంభుని గుడి సమీపంలో ఉన్న నీళ్లబావిలో పడేసింది. ఇంటికి వచ్చిన కాశమ్మ తన బాబును ఎవరో ఎత్తుకెళ్లారని కుటుంబ సభ్యు లకు రోదిస్తూ సైగలు చేసింది. అయితే కొన్ని రోజులుగా దొంగలు తిరుగుతున్నారనే పుకార్లు ఉండటంతో కాలనీ మొత్తం మేల్కొంది. యువకులు కాలనీలో గాలించి ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు సమాచారం ఇచ్చారు. చదవండి: ప్రియుడితో కలిసి భర్తను చంపి.. అదే ఇంట్లో గోతి తీసి.. నాలుగేళ్ల తర్వాత తప్పించుకునే ప్రయత్నంలో.. పోలీసులు ఆదివారం ఉదయం కాలనీకి చేరుకొని వివరాలు సేకరించారు. ఇంట్లో అక్కాచెల్లెళ్ల మధ్య గొడవ జరగడంతో బాబును కుటుంబ సభ్యులే ఏదో చేశారని ప్రాథమికంగా నిర్ధారించారు. మొదట మొగులమ్మపై అనుమానం వచ్చినప్పటికీ పోలీసులు బాధిత కుటుంబ సభ్యులందరినీ స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో విచారించడంతో అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది. దివ్యాంగురాలైన కాశమ్మ అక్కపై కోపంతో క్షణికావేశంలో బిడ్డను తానే చంపి బావిలో వేసినట్లు ఒప్పుకుంది. బాబును వేసిన బావిని చూపడంతో పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. -
5 నెలల పసికందును బావిలో పడేసిన తల్లి
-
అతను మేజర్.. ఆమె మైనర్.. ఇంట్లో చెప్పలేక..
సాక్షి, కోస్గి (నారాయణపేట): అతను మేజర్.. ఆమె మైనర్. ఇద్దరూ ప్రేమించుకున్నారు. విషయం పెద్దలకు చెప్పలేక ఇంటి నుంచి బయటికి వచ్చేశారు. బాలిక కుటుంబీకులు యువకుడిపై కిడ్నాప్, డబ్బు దొంగతనం కేసు పెట్టారు. మూడ్రోజులు గడిచింది. విడిపోయి బతకలేమనుకున్నారో ఏమో చెట్టుకు ఉరేసుకొని ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం బోగారం శివారులోని అమ్లికుంటలో గురువారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం హుస్సేన్‌పూర్‌కు చెందిన యువకుడు శివకుమార్ (20) తల్లిదండ్రులు వెంకటయ్య, పద్మమ్మతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా గండిపేట పరిధిలోని నాగులపల్లికి చెందిన పదో తరగతి బాలిక (15) ప్రేమలో పడ్డాడు. ఈ నెల 27న ప్రేమికులిద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. బాలిక కుటుంబీకులు వాకబు చేయగా ప్రేమ విషయం బయటపడటంతో నార్సింగి పోలీస్ స్టేషన్లో మైనర్ కిడ్నాప్‌తో పాటు డబ్బులు దొంగతనం జరిగినట్టు శివకుమార్, అతని కుటుంబీకులపై ఫిర్యాదు చేశారు. చదవండి: (యువతికి రూ.50 వేలు బురిడీ.. వైన్ ఆర్డర్ చేసి అగచాట్లు) ఇరు కుటుంబాలు రాజీ చేసుకొని రెండ్రోజుల్లో బాలికను అప్పగిస్తామని లిఖిత పూర్వకంగా రాసుకున్నారు. ఇంతలో గురువారం సాయంత్రం కోస్గి మండలంలోని బోగారం చెరువు సమీపంలో అమ్లికుంటకు చెందిన ఓ రైతు పొలంలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నట్టు కొందరు రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి ప్రాథమికంగా విచారించగా సదరు ప్రేమజంటనే అని తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పైశాచిక ఘటన.. కాలిన గాయాలతో యువతి దుర్మరణం
సాక్షి, నారాయణపేట: నారాయణపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన దివ్యాంగ యువతి(21) చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపగా.. యువతి మృతికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం మద్దూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక బాధితురాలిపై వెంకట్రాములు అనే యువకుడు కిరోసిన్ పోసి నిప్పటించాడు. తీవ్రంగా గాయపడ్డ యువతిని గమనించిన స్థానికులు హుటాహుటిన మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం ఆమె కన్నుమూసింది. బాధితురాలిది మద్దూరు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామం కాగా, వెంకట్రాములుది కోయిల్ కొండ మండలం ఇంజమూరు గ్రామంగా తెలుస్తోంది. వీళ్లిద్దరి కుటుంబాలు హైదరాబాద్‌లో వలస కూలీలుగా ఉన్నాయి. నిందితుడు ఉప్పర్‌పల్లిలో చిన్న చిన్న పనులు చేస్తున్నాడు. బాధిత యువతి రాజేంద్రనగర్‌లోని పిన్ని ఇంట్లో ఉంటూ దివ్యాంగుడైన సోదరుడిని చూసుకుంటోంది. అయితే ప్రేమిస్తున్నానని నమ్మబలికి.. ఫిబ్రవరి 13న ఆ దివ్యాంగ యువతిని, యువకుడు అపహరించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు కూడా నమోదు అయ్యింది. అయితే లైంగిక దాడికి పాల్పడి.. ఆపై ఆమెను కాల్చి చంపాలని ప్రియుడి ప్రయత్నించి ఉంటాడని పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని కోస్గీ సర్కిల్ ఎస్సై జనార్ధన్ గౌడ్ వెల్లడించారు. -
మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం..భార్యను పట్టించుకోకపోవడంతో..
సాక్షి, మహబూబ్‌నగర్: ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. మండలంలోని చంద్రవంచలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్సై నరేందర్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని చంద్రవంచ గ్రామానికి చెందిన బోడ తాయప్ప, ఆయన భార్య గోపమ్మ(38) తరచూ గొడవ పడేవారు. ఇటీవల తాయప్ప వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్లిపోయేవాడు. దీంతో భార్య గోపమ్మ తన పిల్లలతోకలిసి అత్తామామల వద్దే ఉంటోంది. చదవండి: మైనేమ్ ఈజ్ సుజి, ఐ యామ్ సింగిల్.. అంటూ వీడియో కాల్ చేసి.. దుస్తులు తీసేసి.. ఈ క్రమంలోనే ఈనెల 27న రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగింది. ఈ విషయాన్ని అత్తామామలు గోపమ్మ తల్లిగారి కుటుంబానికి ఫోన్లో సమాచారం ఇచ్చారు. కానీ అదేరోజు అర్ధరాత్రి పరిస్థితి విషమించి చనిపోయినట్లు మరోమారు సమాచారం ఇచ్చారు. భర్త, అతని కుటుంబ సభ్యులే బలవంతంగా పురుగుల మందు తాగించి హత్య చేశారని మృతురాలి సోదరుడు కండయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సంఘటనపై వివాహిత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: ఇప్పుడే వస్తానమ్మా... అంటివి కదా కొడుకా! -
ఇదేం విడ్డూరం.. ఊళ్లో లేని వ్యక్తికి కరోనా టీకా!
సాక్షి, కోస్గి(మహబూబ్‌నగర్) : కరోనా టీకాల పంపిణీ కార్యక్రమం పారదర్శకతపై పలు అనుమానాలు రేకిత్తించే ఓ సంఘటన వెలుగు చూసింది. బాధితుడితోపా టు వైద్యాధికారులను విస్మయానికి గురి చే స్తోంది. ఆ వివరాలు.. పదిహేను రోజులుగా ఇంటింటికీ తిరిగి గుండుమాల్ పీహెచ్సీ వైద్య సిబ్బంది టీకాలు వేస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఆధార్‌కార్డు వివరాలు ఫోన్లో నమోదు చేసి వచ్చిన ఓటీపీ ఆధారంగా సదరు వ్యక్తికి టీకా వేయడంతో ఆన్లైన్లో నమోదవుతోంది. ఇదిలా ఉండగా పట్టణంలోని బహార్‌పేటకు చెందిన తిరుపతయ్య నెలక్రితం ముంబై వెళ్లాడు. టీకా తీసుకోని వారిని అక్కడి రైళ్లలో, బస్సుల్లో తిరగనీయకుండా ఆంక్షలు విధించారు. దీంతోపాటు టీకా పంపిణీ కార్యక్రమం కఠినంగా అమలుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తి ఈనెల 5న టీకా కేంద్రానికి వెళ్లి ఆధార్ వివరాలు అందజేశాడు. అయితే 4వ తేదీన గుండుమాల్ పీహెచ్సీలో టీకా తీసుకున్నట్లు ఆన్లైన్లో నమోదు చేసిఉంది. ఈ విషయమై వైద్యాధి కారి రాఘవేందర్‌ను వివరణ కోరగా, సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: చోరీ మామూలే..కానీ ఈ దొంగకు ఓ ప్రత్యేకత ఉంది -
ఇల్లరికం వెళ్లిన అల్లుడు అమ్మమ్మ ఊరికి వచ్చి శవమయ్యాడు
హన్వాడ: అమ్మమ్మ ఊరికి వచ్చిన యువకుడు బావిలో పడి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని ఏనమీదితండా సమీపంలో చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మదాబాద్ మండల కేంద్రానికి చెందిన శివకృష్ణ (29)కు నారాయణపేట జిల్లా కోస్గికి చెందిన అరుణకు మూడేళ్ల కిందట వివాహమైంది. శివకృష్ణ ఇల్లరికం వెళ్లాడు. చదవండి: ‘స్త్రీలను కాదు.. రోడ్డు చూసి బండి నడుపు’ పోలీసుల హెచ్చరిక వైరల్ ఈక్రమంలోనే భార్య అరుణతో తరచూ గొడవలు జరిగేవి. శివకృష్ణ అప్పుడప్పుడు స్వగ్రామం మహమ్మదాబాద్, అమ్మమ్మ వారి గ్రామం ఏనమీదితండాకు వచ్చివెళ్లేవాడు. గత శనివారం కూడా కోస్గి నుంచి నేరుగా అమ్మమ్మ ఇంటికి (ఏనమీదితాండ) వచ్చిన శివకృష్ణ అదేరోజు ఇంటి నుంచి ఎవ్వరికీ చెప్పకుండా గ్రామ సమీపంలో దొడ్డుకుంటోని బావిలో పడి మృత్యువాతపడ్డాడు. బుధవారం మృతదేహం బావిలో తేలడంతో స్థానికులు గమనించి బయటికి తీశారు. ఈ సమాచారం తెలుసుకున్న హన్వాడ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి శవపంచనామా చేశారు. జిల్లా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. మేనమామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని హన్వాడ పోలీసులు తెలిపారు. చదవండి: సిరిసిల్ల జిల్లా అరుదైన ఫీట్: సంతోషంలో కేటీఆర్ -
గొర్లు, బర్రెలకే బీసీలను పరిమితం చేసిన టీఆర్ఎస్: వైఎస్సార్టీపీ
మహబూబ్ నగర్: తెలంగాణలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో బీసీ గౌరవ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు రామకోటి, శ్రీరాములు, శ్రీనివాస్, అమృతసాగర్, బాలరాజ్ మాట్లాడుతూ.. బీసీల ఐక్యతను చాటేందుకు అక్టోబర్ 3వ తేదీన వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కోస్గి పట్టణంలో బీసీ గౌరవ సభను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏడేళ్ల తెలంగాణలో బీసీల అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీ ఓట్లతో గద్దెనెక్కిన కేసీఆర్ బీసీలకు పదవులు దక్కకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. బీసీ కార్పొరేషన్లను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ వసతిగృహాల్లో వసతులు లేవని, అదనపు గదుల నిర్మాణాల ఊసేలేదని విమర్శించారు. బీసీలను గొర్లు, బర్రెలు, చెప్పులకు మాత్రమే పరిమితం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పేద బీసీలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజురు చేయడానికి ఆలస్యం చేస్తున్నారని తెలిపారు. కోస్గిలో నిర్వహించే బీసీ గౌరవ సభకు బీసీలతో పాటు అందరూ భారీగా తరలిరావాలని వైఎస్సార్టీపీ నాయకులు పిలుపునిచ్చారు. చదవండి: ‘లంచం ఇస్తే తీసుకోండి.. కానీ’.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు -
TS: ఆర్టీసీ బస్సులో ప్రసవం!
కోస్గి: వైద్య పరీక్షల కోసం డాక్టర్ వద్దకు వెళ్లొస్తున్న ఓ గర్భిణి ఆర్టీసీ బస్సులోనే ప్రసవించింది. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం అల్లాపురం గ్రామానికి చెందిన బుడగ జంగం లక్ష్మి ఏడు నెలల గర్భవతి. మంగళవారం కడుపులో నొప్పి రావడంతో తల్లితో కలిసి కోస్గి ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు పరీక్షించి, ఇంటికి వెళ్లాల్సిందిగా సూచించారు. దాంతో గర్భిణి, ఆమె తల్లి కలిసి రాత్రి 9.15 గంటలకు ఆర్టీసీ బస్సులో స్వగ్రామానికి బయలుదేరారు. బస్సు కోస్గి పరిధిలోని సంపల్లి శివార్లలో ఉండగా లక్ష్మికి పురిటినొప్పులు వచ్చాయి. తోటి ప్రయాణికులు 108కు సమాచారం ఇవ్వగా.. 108 సిబ్బంది అబ్దుల్ అసద్, దేవేందర్ నాయక్ వెంటనే అక్కడికి చేరుకుని.. బస్సులోనే కాన్పు చేశారు. కవల ఆడపిల్లలు జన్మించారు. తర్వాత తల్లీబిడ్డలను 108 వాహనంలో కోస్గి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బలవన్మరణం
కొడంగల్: ఓ తల్లి ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇద్దరు పిల్లలను చెరువులో తోసి తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. హృదయ విదారకంగా మారిన ఈ ఘటన కొమ్మూరు, ఏపూర్, హస్నాబాద్ గ్రామాల్లో విషాదం నింపింది. బంధువుల కథనం ప్రకారం .. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం ఏపూర్ గ్రామానికి చెందిన ఎల్లమ్మ (28)ను నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన సత్యప్పతో పదేళ్ల కిందట వివాహం చేశారు. పెళ్లి నాటి నుంచి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో వారు పలుమార్లు కోస్గి, హస్నాబాద్ తదితర గ్రామాలకు పని నిమిత్తం వచ్చేవారు. వారికి రజిత (8), అనిత (6), రాజు (4) ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ సమస్యలు తలెత్తాయి. అత్తింట వేధింపులు అధికం కావడంతో మనస్తాపం చెందింది. గురువారం రోజు కుటుంబ సభ్యులతో గొడవ జరిగింది. ఇంటి సమస్యలతో సతమతమైన ఆమెకు బతుకు భారంగా అనిపించింది. బతకడం ఇష్టం లేక కొమ్మూరు గ్రామం నుంచి కోస్గికి వచ్చి అక్కడి నుంచి హస్నాబాద్‌కు చేరుకుంది. హస్నాబాద్ గ్రామ శివారులో ఉన్న చెరువు దగ్గరకు పిల్లలతో కలిసి వెళ్లింది. రజిత, రాజు చేతులను చున్నితో కట్టి చెరువులో తోసింది. (చదవండి: ఆన్లైన్ గేమ్.. అప్పులు తీర్చలేక యువకుడు బలి) ఈ విషయం గమనించిన మరో కూతురు అనిత అక్కడి నుంచి పారిపోయింది. హస్నాబాద్ గ్రామానికి చేరుకొని గ్రామస్తులకు విషయం చెప్పింది. గ్రామస్తులు అక్కడకు చేరుకునే లోపు ఎల్లమ్మ కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. గురువారం రాత్రి రాజు మృత దేహం ఒడ్డుకు వచి్చంది. తల్లి కూతుళ్ల శవాలు కనిపించకపోవడంతో శుక్రవారం ఉదయం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, అగి్నమాపక సిబ్బంది సహకారంతో వెతికారు. చెరువులో చెట్టుకు తగిలి ఉన్న రెండు మృతదేహలను వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎల్లమ్మ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నాగేశ్వర్రావు తెలిపారు. కొడంగల్ ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి, బొంరాస్‌పేట ఎస్ఐ శ్రీశైలం, రెవెన్యూ, అగి్నమాపక సిబ్బంది పాల్గొన్నారు. -
కళ్లు చెబుతాయ్.. చేతివేళ్లు రాస్తాయ్
కోస్గి (కొడంగల్): అందరికీ తెలిసి ఎక్కడైన మనుషులు నోటితోనే మాట్లాడతారు. కానీ కోస్గి మున్సిపాలిటీ విలీన గ్రామం పోతిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కళ్లు, చేతి వేళ్లు మాట్లాడతాయి. కళ్లు, చేతి వేళ్లు మాట్లాడటం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా..? మీరు నమ్మిన, నమ్మకపోయిన ఇది నిజం. పాఠశాలలో తెలుగు పండిత్‌గా పనిచేస్తున్న హన్మంతు ఎలాగైన తన విద్యార్థులకు కొత్త విధానంలో బోధన చేసి ప్రత్యేకతను చాటుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు గతంలో రాజుల పాలనలో కళ్లతోపాటు చేతివేళ్లతో సైగలు చేసే భాష ఉండేదని పురాణాల్లో ఉండటంతోపాటు గతేడాది ప్రపంచ తెలుగు మహాసభల్లో ఖమ్మం విద్యార్థులు కళ్లతో, చేతి వేళ్లతో సైగల ద్వారా అక్షరాలను, లెక్కలు చేసే విధానం ప్రదర్శించారు. ఇదే ప్రేరణగా తెలుగు ఉపాధ్యాయుడు హన్మంతు తనదైన శైలిలో ఈ భాషను నేర్పేందుకు సిద్ధమై పాఠశాలలో చురుకైన ఇద్దరు విద్యార్థుల్ని ఎన్నుకున్నాడు. రమాదేవి, సంతోష అనే ఇద్దరు విద్యార్థుల్ని ఎంపిక చేసుకొని రోజు విరామ సమయం, భోజన సమయాల్లో నేత్రావదానం, గణితావధానం నేర్పించాడు. మొదట ఒక్కో అక్షరానికి ఒక్కో సైగ, ఒక్కో అంకెకు ఒక్కో చేతి వేళ్ల భంగిమ నేర్పించాడు. నెల రోజుల వ్యవధిలోనే విద్యార్థులు నూతన విద్యలో సంపూర్ణతను సాధించారు. -
పంచాయతీ ఎన్నికల్లో విషాదం
దౌల్తాబాద్: పంచాయతీ ఎన్నికల్లో విషాదం చోటుచేసుకుంది. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.. బుధవారం వికారాబాద్ జిల్లాలో ఎన్నికల నిర్వహణలో ఉన్న వీఆర్వో, ఓటేసి వెళ్తూ ఓ మహిళ గుండెపోటుతో మృతిచెందారు. కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం చంద్రకల్ గ్రామానికి చెందిన నర్సప్ప (50) కోస్గి మండలం ముశ్రీఫా వీఆర్ఓగా పనిచేస్తున్నారు. బుధవారం తుదివిడత పంచాయతీ ఎన్నికల కోసం.. కోస్గి మండలం ముశ్రీఫా గ్రామానికి వెళ్లాడు. విధి నిర్వహణలో ఉండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో నర్సప్ప కిందపడిపోయాడు. స్థానికులు గమనించి కోస్గి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నర్సప్ప మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య అరుణమ్మ ఇటీవల చంద్రకల్ వార్డు సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో ఘటనలో ఓటరు పరిగి మండలం మిట్టకోడూర్ గ్రామానికి చెందిన కోరె వెంకటమ్మ (65) బుధవారం పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు ఉదయం 9 గంటల ప్రాంతంలో పోలింగ్ కేంద్రానికి వచ్చింది. ఓటేసేందుకు వరుసలో నిల్చుని ఉంది. ఓటేసిన వెంటనే వెంకటమ్మకు గుండెపోటు రావడంతో ఆమె పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలారు. వెంటనే కుటుంబసభ్యులు, స్థానికులు స్పందించి ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. పరిశీలించిన స్థానిక వైద్యులు ఆమె చనిపోయినట్లు వెల్లడించారు. -
కేసీఆర్ ప్రజల కలలను వమ్ము చేశారు
-
అంతా మంచి జరిగితే మళ్లీ వస్తా: రేవంత్
కోస్గి (కొడంగల్) : రాష్ట్రంలో జరిగేవి ముందస్తు ఎన్నికలైతే.. కొడంగల్‌లో మాత్రం ప్రజల ఆత్మ గౌరవం, చింతమడక దొరల పెత్తనానికి మధ్య జరుగుతున్న పోటీ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అంతా మంచి జరిగితే మళ్లీ ప్రచారానికి వస్తానని, లేకుంటే జైలు నుంచే నామినేషన్ పంపిస్తానని.. రేవంత్‌రెడ్డిని గెలిపించుకుని గుండెల్లో పెట్టుకుంటారనే నమ్మకంతో వెళ్తున్నానని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఒకేరోజు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు, రోడ్ షోలతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు బుధవారం రాత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఆయన ప్రచారం ప్రారంభించక ముందే హైదరాబాద్‌లోని ఆయన నివాసంపై ఐటీ దాడులు ప్రారంభమయ్యాయనే సమాచారం అందింది. అయితే, రేవంత్‌రెడ్డి ముందుగా ప్రకటించిన విధంగానే ప్రచారాన్ని ప్రారంభించినా ఐటీ అధికారుల పిలుపుతో కోస్గి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. పూజలు, ర్యాలీలు కోస్గి మండలంలోని పోలేపల్లి ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు చేసిన రేవంత్‌రెడ్డి కోస్గి వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. శివాజీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో ఉండే మోదీ, గల్లీలో ఉండే కేడీ కేసీఆర్ కుట్రలు కుతంత్రాలు పన్నారని విమర్శించారు. తాను నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటుండగా హైదరాబాద్‌లోని తన నివాసం, కుటుంబ సభ్యుల ఇళ్లపై ఐటీ దాడులు చేయించారన్నారు. కేసీఆర్‌ను బొందపెట్టేందుకు తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలు, మూడెకరాల భూమి దక్కని దళితులు, నిరుద్యోగులు, రిజర్వేషన్లు దక్కని మైనార్టీలు, గిరిజనులు, రుణమాఫీ కాని రైతులు ఏకమై కదనరంగంలోకి దిగారన్నారు. సన్నాసులపై కాదు.. ఇక్కడి ప్రజల పోరాటం చింతమడక చీటర్ కేసీఆర్ మీదనే తప్ప.. సన్నాసుల మీద కాదని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి అంటున్న కేసీఆర్, తన స్వగ్రామమైన చింతమడకలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపించేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కొండగట్టులో 60 మంది చనిపోతే చూడని కేసీఆర్‌కు మనసు ఉందా? అని ప్రశ్నించారు. తనపై ఓటుకు నోటు కేసు పెట్టించి 32 రోజులు జైల్లో పెట్టించాడన్నారు. ‘ఆనాడు జైలులో తిన్న చిప్పకూడు మీద ఒట్టేసి చెబుతున్నా.. బిడ్డా కేసీఆర్ నిన్ను, నీ కాందాన్‌ను గద్దె నుంచి దించేవరకు నిద్రపోనని శపథం చేస్తున్నా’అని పేర్కొన్నారు. కేసీఆర్ పెట్టిన కేసులు తననేమీ చేయకపోవడంతో మోదీ దగ్గరకు వెళ్లి తన వల్ల కావడంలేదని మోకాళ్లపై నిలిస్తే ఐటీ, ఈడీ, సీబీఐ అంటూ తనపై ఉసిగొల్పారన్నారు. తనపై కొత్తగా కేసులు పెట్టి నాలుగు నెలలు జైలులో పెట్టే కుట్ర జరుగుతోందని తెలిపారు. ఇదే జరిగితే తనకు ఇదే చివరి ఎన్నికల ప్రచారం కావొచ్చని.. కొడంగల్‌లో జరు గుతున్న కుట్రను ప్రజలు గుర్తించి ప్రతి ఒక్కరూ రేవంత్‌రెడ్డిగా మారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ‘బిడ్డా కేసీఆర్ గుర్తు పెట్టుకో.. నీకు, నీవు పోతే నీ వారసులకు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తా.. నేను పోతే రేవంత్‌రెడ్డి ఏం చేస్తాడనుకుంటున్నావేమో నీవు చేసిన పాపాలు, అధికారం నీ వారసులదే కాబట్టి వడ్డీతో సహా చెల్లిస్తా’అని స్పష్టం చేశారు. ‘రేవంత్‌రెడ్డి ప్రచారం చేస్తే 30 వేల మెజార్టీ, జైలులో ఉంటే 50 వేల మెజార్టీ ఖాయం. బిడ్డా కేసీఆర్ ఎన్నికలయ్యాక నా సత్తా తెలుస్తుంది’అని అన్నారు. -
మయూరం.. వయ్యారం
కోస్గి : మేఘాలు కమ్ముకున్న వేళ.. ఆనంద పరవశంలో ఓ మయూరం తన పురివిప్పి చేసిన నాట్యం అందరిని ఆకట్టుకుంది. ఆదివారం సాయంత్రం పట్టణ శివారులోని బిజ్జారపు బావుల కాలనీ సమీపంలోని ఓ రైతు పొలంలో ఇదిగో ఇలా నాట్యమాడుతూ అబ్బురపరిచింది. పురివిప్పి నాట్యం చేస్తున్న నెమలి -
ఇంటర్‌కూ ఆధార్ లింకు
కోస్గి (కొడంగల్) : ప్రభుత్వం విద్యారంగంలో విద్యార్థుల పేరుతో చేస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసి.. నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఆన్లైన్ విధానాన్ని అమలుచేస్తుంది. రాష్ట్ర ప్రభు త్వ నిర్ణయంతో ఇప్పటికే ప్రమాణాలు పాటించని ఎన్నో ప్రైవేట్ కళాశాలలు మూతపడ్డాయి. ఇప్పటికే డిగ్రీలో ఆన్లైన్లో అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఇంటర్‌లోనూ విద్యార్థుల ఆధార్ లింకు చేస్తూ ఆన్లైన్ విధానంలోనే అడ్మిషన్లు చేపట్టాలని ఆదేశాలు జా రీచేసింది. ఇంటర్ విద్యకు ప్రభుత్వం ఆధార్‌ను లింకు చేయడంతో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో బోగస్ విద్యార్థులకు చెక్ పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్లో అడ్మిషన్ కావాలంటే ఆధా ర్ను తప్పనిసరిగా విద్యార్థి సమర్పించాలని ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఈ విద్యా సంవత్స రం నుంచే అమలు చేయాలని కళాశాలలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఇకపై జూనియర్ కళాశాల ల్లో నేరుగా ప్రవేశాలు కల్పించే పద్ధతికి స్వస్తి చెప్పి ఆన్లైన్ విధానాన్ని ఇంటర్ బోర్డు ప్రవేశపెట్టింది. పక్కాగా విద్యార్థుల లెక్క ప్రభుత్వ ఆన్లైన్ విధానంతో ఇక నుంచి విద్యార్థుల లెక్క పక్కాగా ఉండబోతోంది. కోస్గి మండల కేంద్రంలో రెండు ప్రైవేట్, ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలలతోపాటు ఒక పారామెడికల్ ఒకేషనల్ కళాశాల, ప్రైవేట్ ఐటీఐతోపాటు గుండుమాల్‌లో మోడల్ పాఠశాలలో ఇంటర్ విద్య కొనసాగుతుంది. మండలంలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో నాలుగు వేలకుపైగా విద్యార్థులు ఇంటర్, ఐటీఐ, పారామెడికల్ కోర్సుల్లో చదువుతున్నారు. వీరందరికీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లు అందిస్తుంది. ఆధార్ అనుసంధానంతో ఏ కళాశాలలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. దీంతో ఒక కళాశాలలో చేరిన విద్యార్థి పేరు మరో కళాశాలలో నమోదు చేయలేరు. దీంతో ప్రభుత్వం అందించే స్కాలర్షిప్ నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడనుంది. నిరాకరిస్తున్న ప్రైవేట్ కళాశాలలు ఇంటర్లో ఈ ఏడాది నుంచి అమలు చేయనున్న ఆన్లైన్ విధానాన్ని ప్రైవేట్ కళాశాలు నిరాకరిస్తున్నాయి. ప్రభుత్వం అందించిన ఉత్తర్వులను అమలు చేయకుండా ప్రైవేట్ కళాశాలల యూనియన్ ఆధ్వర్యంలో ఉమ్మడిగా ఉత్తర్వులను రద్దు చేయించాలని నిర్ణయించినట్లు ఓ ప్రైవేట్ కళాశాల నిర్వాహకుడు తెలిపారు. ఇప్పటికే గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించే కళాశాలల యాజమాన్యాలు ఈ ఏడాది ఆన్లైన్ విధానం ఉత్తర్వులు అందడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మాత్రమే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పారదర్శకత పెరుగుతుంది ఇంటర్లో సైతం ఆన్లైన్ విధానం అమలు చేసి ఆధార్‌ను లింకు చేస్తే విద్యారంగంలో పారదర్శకత మరింత పెరుగుతుం ది. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల అక్రమాలకు అడ్డుకట్ట పడి ప్రభుత్వం అందించే నిధులు అర్హులైన పేద విద్యార్థులకు అందుతాయి. ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన వసతులు కల్పించి, సరిపడా బోధనా సిబ్బందిని నియమిస్తే ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలకు అడ్డుకట్ట వేయవచ్చు. – బద్రినాథ్, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కోస్గి -
కల్లాల కష్టాలు!
కోస్గి : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ఇతర పంటలను ఆరబెట్టుకోవడానికి కల్లాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ఏ మాత్రం తేమ ఉన్నా ధాన్యం కొనుగోలు చేయడంలేదు. మార్కెట్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబెట్టడానికి సరైన సదుపాయం కల్పించడంలేదు. అకాల వర్షాలు కురిసి మార్కెట్లో ధాన్యం తడిసి రైతులు నష్టపోయిన ఘటనలు అనేకం. కొంతమంది రైతులు తమ వ్యవసాయ పొలాల వద్ద, సమీపంలోని రోడ్లపై కవర్లు వేసుకుని ధాన్యం ఆరబెడుతున్నారు. చేతికి వచ్చిన పంటలను కూడా రైతులు కాపాడుకోలేకపోతున్నారు. ఉపాధిహమీలో కల్లాల నిర్మాణం! జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు కల్లాల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తుంది. కానీ, ప్రభుత్వం కల్లాలు నిర్మించుకునే అవకాశం కల్పించినా ఈజీఎస్ అధికారులు రైతులకు కల్లాల నిర్మాణాలపై అవగాహన కల్పించలేకపోవడంతో కల్లాలు నిర్మాణాలు కలగానే మిగిలిపోతున్నాయి. ఉపాధిహామీ పథకంలో పశువుల పాకలు, గొర్రెల షెడ్ల నిర్మాణంతో పాటు కల్లాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నా రైతులకు మాత్రం అధికారులు ఈ విషయం చెప్పడంలేదు. రైతులు కల్లాల నిర్మాణం ఆర్థిక సమస్యతో కూడుకోవడంతో సొంతఖర్చులు పెట్టి నిర్మించుకోలేని పరిస్థితి. అధికారులు కల్లాల నిర్మాణంపై రైతులకు అవగాహన కల్పిస్తే వారు కల్లాలు నిర్మించుకోవడానికి ముందుకొవచ్చే అవకాశం ఉంది. ఎవరు చెప్పలేదు అధికారులు కల్లాల నిర్మాణాల గురించి ఇంతవరకు చెప్పకపోవడంతో గ్రామ సమీపంలో ఉన్న పొలంలో ఎండబెట్టుకుంటున్నాను. అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించి ప్రొత్సహిస్తే ఎంతోమంది పేద రైతులకు లబ్ది చేకూరుతుంది. ఇందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. -
కోస్గిలో కార్డెన్ సెర్చ్
కోస్గి (కొడంగల్): పోలీసు ప్రత్యేక బృందాలు కోస్గిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఒక్కసారిగా తనిఖీలు జరపడంతో పట్టణవాసులు భయాందోళనకు గురయ్యారు. ముం దుగా డీఎస్పీ వాహనం, పదుల సంఖ్యలో పోలీసుల వాహనాలు, వెంటనే డీసీఎంలతో పోలీసు బలగాలు కోస్గికి చేరుకున్నాయి. పోలీసుల హంగామాను చూసి ఏం జరుగుతుందో తెలియక పట్టణ ప్ర జల్లో తీవ్ర ఉత్కంట నెలకొంది. ఇదంతా పోలీసు శాఖ చేపట్టిన కార్డెన్ సెర్చ్ అని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. పేట డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, 11 మంది ఎస్ఐలు, 150 మంది సిబ్బందితో పోలీసులు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఇంటింటికి వెళ్లి అన్నిరకాల వివరాలు సేకరించారు. రోడ్లపై వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీలు చేస్తూ సంబంధిత పత్రాలను పరిశీలించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు యువకులను విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు జరిపిన కార్డెన్ సెర్చ్‌లో మొత్తం 22 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. -
ప్రాణాలకు తెగించి.. ఏడుగురిని రక్షించి
ప్రజల శాంతిభద్రతల పరిరక్షణకే కాదు.. ప్రాణాలను కూడా కాపాడుతామని ఓ పోలీసు చాటి చెప్పాడు. ప్రమాదవశాత్తు తుంగభద్రనదిలో ఎనిమిది మంది కొట్టుకుపోతుండగా ఓ ఎస్ఐ సాహసం చేసి ఏడుగురిని రక్షించారు. మరో వ్యక్తిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కందకూరు గ్రామంలో సోమవారం తుంగభద్ర నదిలో పుట్టి మునిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి గల్లంతు కాగా.. ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు. – మంత్రాలయం/కోసిగి ఏటా శ్రావణ మాసం ఆఖరి సోమవారం ఉరుకుంద ఈరన్న స్వామి పల్లకి కోసిగి మండలం కందకూరు గ్రామం చేరుకుంటుంది. తుంగభద్రమ్మ నది ఒడ్డున వెలసిన రామలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలో పవిత్ర నదీజలంలో ఉత్సవమూర్తికి పుణ్యస్నానం చేస్తారు. ఆనవాయితీలో భాగంగా కందకూరు వేడుకను తిలకించేందుకు నది అవతలి వైపు ఉన్న కర్ణాటక రాష్ట్రం మాన్వి నియోజకవర్గం పొన్నూరు గ్రామం నుంచి రాము, శేఖర్, చాకలి నాగరాజు, హనుమేష్, బసవరాజ్, ఆంజనేయ, దేవరాజుతో కలిసి పుట్టిలో బయలు దేరారు. పుట్టి తుంగభద్ర నడి బొడ్డులోకి రాగానే అనుకోకుండా పుట్టిలోకి నీళ్లు ఉబికాయి. పుట్టి చోదకుడు యువరాజ్ వెంటనే నీళ్లు తోడేయండని చెప్పి తెడ్డుతో పుట్టిని ముందుకు నడపసాగాడు. అయితే హడావుడితో యువకులు నీళ్లను తోడేసే క్రమంలో ఒక్కపాటుగా జరిగారు. ఇంతటితో నీటి ఉధృతికి పుట్టి ఒక్కసారిగా బోల్తా పడింది. రెండు రోజుల క్రితం తుంగభద్ర డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో నదిలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నదిలో పడి పోయిన వారికి ఈత వచ్చినా ఒడ్డు చేరలేకపోతున్నారు. మరోవైపు భయంతో ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. ఇవతలి వైపు ఒడ్డున ఉన్న భక్తులు కేకలు వేశారు. ఎదురీది.. ఉరకుంద ఈరన్న స్వామి పల్లకి అప్పటికే నది ఒడ్డుకు చేరుకుంది. పూజలు అనంతరం ఉత్సవమూర్తికి జలాభిషేకం చేస్తున్నారు. ఈ సందర్భంగా బందోబస్తుగా వెళ్లిన పెద్దతుంబళం ఎస్ఐ శ్రీనివాసులు ఈత సరదాతో అప్పటికే నదిలోకి దిగారు. అదే సమయంలో అతనికి 100 మీటర్ల దూరంలో పుట్టి మునిగి ఎనిమిది మంది నదిలో పడ్డారు. గమనించిన ఎస్ఐ వారిని రక్షించేందుకు సాహసం చేశారు. నదిలో పడిన భయంతో కేకలు వేస్తున్న వారిని సమీపించి వారికి ధైర్యం చెప్పి ఏడుగురిని నదిలో నిలబడే స్థాయిలో నీళ్లు ఉండే చోటుకి చేర్చారు. అనుమన్న, యల్లమ్మ రెండో కుమారుడు రాము(22) ఎస్ఐ చేతికందినట్లే అంది నీటి మునిగి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అప్పటికే అలసిపోయిన ఎస్ఐ చేసేదేమి లేక అక్కడి నుంచి ఆయాశపడుతూ ఒడ్డుకు చేరుకున్నారు. సురక్షిత ప్రాంతం చేరుకున్న యువకులు అక్కడి నుంచి చిన్నగా ఒడ్డుకు చేరుకున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న కోసిగి సీఐ కంబగిరి రాముడు, ఎస్ఐ ఇంతియాజ్‌బాష అక్కడికి చేరుకుని పుట్టి చోదకుడు యువరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గల్లంతైన యువకుడి మృతదేహం కోసం మాన్వి, ఎమ్మిగనూరు అగ్ని మాపక సిబ్బంది గాలించారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో రాయచూరు నుంచి ప్రత్యేక బోటును తెప్పించేందుకు సమాయత్తమయ్యారు. ప్రతి ఒక్కరు ఎస్ఐ సహసాన్ని అభినందించారు. ఆశలు వదులుకున్నాం : శేఖర్, ప్రమాదం నుంచి బయటపడిన వ్యక్తి అనుకోకుండా ప్రయాణిస్తున్న పుట్టి అడుగుభాగాన చిల్లు పడి పుట్టిలోకి నీరు ఉబికింది. నీరు తోడేసే క్రమంలో అందరూ ఒక్కపాటున వచ్చాం. దీంతో ఉన్నపాటున ఒక్కవైపు బరువై పుట్టి బోల్తా పడింది. నిండునదిలో ఒరిగిపోవడంతో ప్రాణాలపై ఆశలు వదులుకున్నాం. ఎస్ఐ శ్రీనివాసులు దేవుడిలా వచ్చి మా ప్రాణాలకు ఆయువు పోశాడు. ఆయన సాహసం చేయకుంటే బతికేవాళ్లం తక్కువే. -
పుష్కర స్నానానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు..
ఇటిక్యాల: కృష్ణా పుష్కరాలు చివరి రోజు పుష్కరస్నానం కోసం బీచుపల్లికి వెళ్లి, 44వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. షాద్‌నగర్ మండలం బుర్గుల పంచాయతీ పరిధిలోని తండాకు చెందిన మూడవత్తు దస్రు (55) మంగళవారం బీచుపల్లిలో పుష్కరస్నానం చేశాడు. సాయంత్రం స్వగ్రామానికి వచ్చేందుకు జాతీయ రహదారి దాటుతుండగా లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సూచనమేరకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య దస్తి, ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులున్నారు. కుమారుడు రామ్‌జీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇటిక్యాల ఏఎస్ఐ జిక్కిబాబు పేర్కొన్నారు. ఎర్రవల్లి చౌరస్తాలో వృద్ధుడు.. కొడంగల్ రూరల్(కోస్గి): కోస్గి మండలకేంద్రానికి చెందిన జలంధర్‌రెడ్డి(71)మంగళవారం ఇంటి నుంచి పుష్కరాలకు వెళ్లాడు. ఈ క్రమంలో రాత్రి సమయంలో ఎర్రవల్లి చౌరస్తాలో దిగి మరో బస్సును ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయనను పోలీసులు కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. అక్కడి పోలీసులు కోస్గిలోని జలంధర్‌రెడ్డి కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారు బుధవారం ఉదయం అక్కడికి వెళ్లి మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. -
కుటుంబంపై కరెంటు కాటు
విద్యుదాఘాతంతో ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి కుక్కను కాపాడబోయి తండ్రి, తండ్రి కోసం కొడుకు, కొడుకును కాపాడబోయి తల్లి అప్రమత్తతతో కోడలికి తప్పిన ప్రమాదం కోస్గి మండలం హన్మండ్లలో విషాద సంఘటన అడవి పందులను నుంచి పంటను కాపాడుకునేందుకు ఓ రైతు పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె.. ఆ రైతు కుటుంబం పాలిట శాపంగా మారింది. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఆ కుటుంబంలో ఒకరిపై ఒకరికి ఉన్న మమకారం వెనకాముందు ఆలోచించకుండా ఆత్రుతతో ఒకరిని కాపాడబోయి మరొకరు వరుసగా... తల్లి, తండ్రి, కుమారుడు విద్యుదాఘాతంతో మృత్యువాతపడ్డారు. అప్రమత్తంగా వ్యవహరించిన కోడలు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ విషాదకర సంఘటన శుక్రవారం కోస్గి మండలంలోని తోగాపూర్ అనుబంధ గ్రామం హన్మండ్లలో చోటు చేసుకుంది. – కోస్గి హన్మండ్లకు చెందిన తుడుం కిష్టప్ప (40) పొలం దగ్గర ఇంటిని నిర్మించుకుని, వ్యవసాయం చేసుకుంటూ తల్లిదండ్రులు అమృతమ్మ, వెంకటయ్య, భార్య యాదమ్మతో పాటు తన నలుగురు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. ఈ ఏడాది తన పొలంలో జొన్న, పత్తి, కంది, మిరప పంటలను సాగు చేశాడు. జొన్న పంటను అడవి పందులు నాశనం చేస్తుండటంతో పొలం చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేశాడు. ప్రతిరోజు రాత్రి ఏర్పాటు చేసి తెల్లవారే సరికి విద్యుత్ కంచెను తొలగించేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన కంచెను తొలగించడం మరిచిపోయిన కిష్టప్ప.. భార్య, తల్లితో కలిపి పత్తి చేనుకు మందు వేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో కిష్టప్ప కుటుంబం పెంపుడు కుక్క అటుగా వెళ్లి విద్యుత్ కంచె తగిలి మృతి చెందింది. పొలం వైపు వెళ్తున్న వెంకటయ్య(60)గమనించి, కుక్కను తీగ నుంచి బయటకు తీసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడే కుప్పకూలిపోయి, మృత్యువాతపడ్డాడు. స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు చెప్పడంతో ఇంటివద్ద ఉన్న పిల్లలు ఏడుస్తూ పొలం వైపు పరుగులు తీశారు. విషయం గమనించిన కొడుకు కిష్టప్ప తండ్రిని కాపాడే ఆత్రుతతో పొలం గట్టుపై నుంచి పరుగెత్తుతుండగా ప్రమాదవశాత్తు కాలికి విద్యుత్ కంచె తగిలి కిందపడి కొట్టుకుంటున్నాడు. అతని వెనుకనే వస్తున్న భార్య యాదమ్మ అప్రమత్తమై ‘నీ కొడుకును కరెంటు పట్టుకుంది.. దగ్గరకు వెళ్లకు, నేను వైరు తీసి వస్తాను’ అని అత్త అమృతమ్మ (58)ను హెచ్చరిస్తూ, ఇంటివైపు పరుగెత్తింది. కళ్లముందు ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటున్న కొడుకుని చూసి ఆ మాతృ హృదయం తట్టుకోలేకపోయింది. కొడుకు చేయిపట్టి లాగేందుకు ప్రయత్నించగా.. ఆమె కూడా విద్యుదాఘాతానికి గురైంది. యాదమ్మ కరెంట్ తీసి వచ్చి చూడగా అప్పటికే భర్త, అత్తలు మృతి చెందడంతో బోరున విలపించింది. గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. దిక్కుతోచని స్థితిలో.. కుటుంబంలో ఉన్న పెద్దలందరూ ఒకేసారి మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో కన్నీరు మున్నీరవుతోంది. మృతుడు కిష్టప్పకు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. అవ్వ, తాతలతో పాటు తండ్రి మృతి చెందడంతో నిరాశ్రయులైన ఆ చిన్నారుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. అప్పటికే అనారోగ్యంతో ఉన్న రెండో కూతురు శిరీషా ఈ సంఘటనను చూసి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయింది. పోస్టుమార్టం నిమిత్తం ముగ్గురి మృతదేహాలను ఒకే ట్రాక్టర్లో కొడంగల్ ఆస్పత్రికి తరలిస్తుండగా గ్రామమంతా బోరున విలపించింది. కొడంగల్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐలు మల్లారెడ్డి, చంద్రశేఖర్, ఆర్ఐ అశోక్, వీఆర్ఓలు వెంకటయ్య, బుగ్యాసాబ్, ఈశ్వరమ్మ సంఘటన స్థలాన్ని సందర్శించి, ఘటన జరిగిన తీరును నమోదు చేసుకున్నారు. మృతుడు కిష్టప్ప భార్య యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లారెడ్డి తెలిపారు. -
కుక్కను కాపాడబోయి ముగ్గురు మృతి