
హన్వాడ: అమ్మమ్మ ఊరికి వచ్చిన యువకుడు బావిలో పడి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని ఏనమీదితండా సమీపంలో చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మదాబాద్ మండల కేంద్రానికి చెందిన శివకృష్ణ (29)కు నారాయణపేట జిల్లా కోస్గికి చెందిన అరుణకు మూడేళ్ల కిందట వివాహమైంది. శివకృష్ణ ఇల్లరికం వెళ్లాడు.
చదవండి: ‘స్త్రీలను కాదు.. రోడ్డు చూసి బండి నడుపు’ పోలీసుల హెచ్చరిక వైరల్
ఈక్రమంలోనే భార్య అరుణతో తరచూ గొడవలు జరిగేవి. శివకృష్ణ అప్పుడప్పుడు స్వగ్రామం మహమ్మదాబాద్, అమ్మమ్మ వారి గ్రామం ఏనమీదితండాకు వచ్చివెళ్లేవాడు. గత శనివారం కూడా కోస్గి నుంచి నేరుగా అమ్మమ్మ ఇంటికి (ఏనమీదితాండ) వచ్చిన శివకృష్ణ అదేరోజు ఇంటి నుంచి ఎవ్వరికీ చెప్పకుండా గ్రామ సమీపంలో దొడ్డుకుంటోని బావిలో పడి మృత్యువాతపడ్డాడు. బుధవారం మృతదేహం బావిలో తేలడంతో స్థానికులు గమనించి బయటికి తీశారు. ఈ సమాచారం తెలుసుకున్న హన్వాడ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి శవపంచనామా చేశారు. జిల్లా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. మేనమామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని హన్వాడ పోలీసులు తెలిపారు.
చదవండి: సిరిసిల్ల జిల్లా అరుదైన ఫీట్: సంతోషంలో కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment