grand mother
-
70 ఏళ్ల నాటి అమ్మమ్మ చీరలో పూజా హెగ్డే (ఫొటోలు)
-
ఇంటి గుట్టు : దెబ్బకి రూ. 80 లక్షలు ఖతం, చివరికి!
మోసగాళ్లు మనకు తెలియకుండానే మన చుట్టూ వైఫైలా ముసిరేసి ఉంటారు. ఏ మాత్రం గుట్టు జారినా, ఆదమర్చి ఉన్నా భారీ నష్టం తప్పదు. అలా ఒక బాలిక అమాయకంగా ఇంట్లోని కొన్ని ఆర్థిక విషయాలు షేర్ చేసినందుకు గాను ఆమె కుటుంబం చిక్కుల్లోపడింది. ఇంటిగుట్టు లంకకు చేటు అన్నట్టు అయి పోయింది. 15 ఏళ్ల పాఠశాల విద్యార్థినిని బ్లాక్మెయిల్ చేసి రూ.80 లక్షలు దోచుకున్న వైనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టోరీ ఏంటంటే.. గురుగ్రామ్‌లో 9వ తరగతి చదువుతున్న బాలిక బాలిక గొప్పగా చెప్పిందో, అమాయకంగా చెప్పిందో కానీ తన అమ్మమ్మ ఖాతాలో భార మొత్తంలో సొమ్ము ఉందని ఫ్రెండ్స్‌కి చెప్పింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం బాలిక అమ్మమ్మ( 75) తనకున్న ఆస్తిని అమ్మి తన ఖాతాలో రూ.80 లక్షలు జమ చేసింది. ఈ వివరాలతోపాటు, అమ్మమ్మ బ్యాంకు ఖాతాకు యాక్సెస్ కూడా తనకుందని తొలుత పదో తరగతి అబ్బాయికి చెప్పింది. అతను తన అన్నయ్యకు చెప్పాడు. వాడు తన స్నేహితుడికి చెప్పి ఆ డబ్బులు కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ఆ అమ్మాయికి బెదిరింపులు మొదలయ్యాయి. మార్ఫ్ చేసిన చిత్రాలతోఆమెను బ్లాక్మెయిల్ చేసి, వాటిని సోషల్ మీడియాలో లీక్ చేస్తామని, అలా చేయకుండా ఉండాలంటే, సొమ్మును ముట్టచెప్పాలని బాలికను బెదిరించారు. దీంతో బెంబేలెత్తిన బాలిక ఒకటీ రెండు సార్లు పలుదఫాలుగా నిందితుడు ఇచ్చిన ఫోన్ నంబర్లకు రూ. 80 లక్షలను బదిలీ చేసింది. ఇలా అమ్మమ్మ ఖాతాలోని మొత్తం డబ్బులన్నీ డిసెంబర్ 21 నాటికి స్వాహా అయిపోయాయి.అయినా బెదింపులు అగలేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో, క్లాస్‌లో ముభావంగా ఉన్న బాలికను గమనించిన టీచర్ గట్టిగా నిలదీయడంతో విషయమంతా టీచర్‌కు చెప్పింది. అలా అసలు సంగతి కుటుంబానికి చేరింది. దీంతో అమ్మమ్మ, ఇతర కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మార్ఫింగ్ ఫోటోలతో బెదిరింపులకు పాల్పడ్డారు. వివిధ అకౌంట్ల ద్వారా, డబ్బును తమకు బదిలీ చేయించుకున్నారు. ఇలా కొట్టేసిన సొమ్మంతా దాదాపు పార్టీలకు ఖర్చు చేశారు.గత ఏడాది డిసెంబర్లో నమోదైన ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకూ ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు నవీన్ కుమార్ గత రెండు నెలలుగా పరారీలో ఉన్నాడని పోలీసులు మంగళవారం తెలిపారు. నవీన్ కుమార్ (28) గురుగ్రామ్‌లోని గర్హి హర్సారులోని న్యూ కాలనీ నివాసి. సోమవారం రాత్రి అతన్ని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని పోలీసు అధికారి రాంబీర్ సింగ్ తెలిపారు. అలాగే నిందితుడి నుంచి రూ.5.13 లక్షలు, బాధితురాలి ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇప్పటివరకు రూ. 36 లక్షలు స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందన్నారు. -
బామ్మ ఫ్యాషన్ రేంజ్ మాములుగా లేదుగా.. అదిరిపోయే స్టన్నింగ్ స్టిల్స్..!
-
బోర్డర్లు చెరిపేసిన బామ్మ: క్రికెట్ అరంగేట్రంలోనే రికార్డు
గల్లీ నుంచి ఢిల్లీ దాకా, పసిపిల్లల నుంచి పండుముసలాళ్ల దాకా క్రికెట్ ఆటకున్న క్రేజే వేరు. గత కొన్ని రోజులుగా సందడి ఐపీఎల్ 2024 సీజన్ ముగిసింది. ఫైనల్‌పోరు కోలకత్తా నైట్ రైడర్స్ సునాయాసంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది టైటిట్‌ను కైవసం చేసుకుంది. ఇదంతా ఒక ఎత్తయితే లండన్‌కు చెందిన 66 ఏండ్ల సల్లీ బార్టన్(Sally Barton) విశేషంగా నిలుస్తోంది. ఈ కథా కమామిష్షు ఏంటో చూద్దాం రండి! ముగ్గురు మనువరాళ్లున్న ఈ అమ్మమ్మ క్రికెట్ అరంగేట్రం చేసిన రికార్డులు బద్దలు కొట్టింది గత నెలలో యూరోపా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఎస్టోనియాతో జరిగిన 3-మ్యాచ్‌ల మహిళల T20 సిరీస్‌లో గిబ్రాల్టర్ తరపున అరంగేట్రం చేసింది సాలీ బార్టన్. తద్వారా 66 ఏళ్ల 334 రోజుల వయసులో అత్యంత వృద్ధ అంతర్జాతీయ క్రికెటర్‌గా కూడా అవతరించింది. ఆ మాటలు విన్నవాళ్లంతా ‘బామ్మ నీ సంకల్పానికి జోహార్’. ‘నువ్వు నిజంగా సూపర్’ అంటూ ఆమెను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఏజ్ అనేది ఒక నంబరు మాత్రమేబీబీసీ స్పోర్ట్ కథనం ప్రకారం ‘‘అరవైల్లోకి వచ్చాక నేను క్రికెట్ ఆడుతానని అస్సలే ఉహించలేదు ‘నా డిక్షనరీలో ‘అతి పెద్ద వయస్కురాలు’ అనే పదమే లేదు. అందుకే 66 ఏళ్ల వయసులో క్రికెట్లో అరంగేట్రం చేశాను’’ అని బార్టన్ తెలిపింది. 2012లో పోర్చుగల్‌కు చెందిన అక్బర్ సయ్యద్ (Akbar Saiyed) పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టింది. అక్బర్ 66 ఏండ్ల 12 రోజుల వయసులో క్రికెట్లో అరంగేట్రం చేసి రికార్డు సృష్టించాడు.అయితే ఈ సిరీస్‌లో వికెట్ కీపర్ అయిన బార్టన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అంతేకాదు ఏ ఒక్కరిని ఔట్ చేయలేకపోయింది. కానీ ఈ మ్యాచ్‌లో గిబ్రాల్టర్ 128 పరుగుల తేడాతో విజయం సాధించింది. 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. బార్టన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గణితంలో లెక్చరర్‌గా రిటైర్ అయ్యారు సాలీ. అనంతరం క్రికెట్ బ్యాట్ పట్టి సరికొత్త రికార్డును సృష్టించడం విశేషం. -
కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
విదేశాల్లో బిడ్డ దగ్గరకు వెళ్లి ఆనందంగా ఉన్న సమయంలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది. కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇండియాకు చెందిన దంపతులు, వారి మూడు నెలల మనవడు దుర్మరణం చెందారు. ఆ కారులో ఉన్న చిన్నారి తల్లిదండ్రులు కూడా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టొరంటోకు తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న విట్బీలోని హైవే 401పై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై విచారాన్ని వ్యక్తం చేసిన ఒట్టావాలోని భారత హైకమిషన్ మృతులకు సంతాపాన్ని తెలియజేసింది.ఏం జరిగిందంటే ఇండియాకు చెందిన మణివణ్ణన్(60) మహాలక్ష్మి(55) దంపతులు ఎజాక్స్‌లో ఉంటున్న మనవడిని చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అందరూ కలిసి బయటికి వెళ్లగా మృత్యువు వారిని కబళించింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం . బోమన్‌విల్లేలో మద్యం దుకాణంలో చోరీ చేసిన ఇద్దరు నిందితులను పోలిసులు వెంబడించారు. పోలీసులను నుంచి తప్పించు కునే క్రమంలో హైవేపై వ్యాన్‌లో రాంగ్రూట్లో వెళుతూ వారు పలు కార్లను ఢీకొట్టారు. ఇందులో బాధితుల కారు కూడా ఉంది. ఈ ఘటనలో నిందితుల్లో ఒకరు ఘటనా స్థలంలోనే మరణించాడు. చిన్నారి తల్లిదండ్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ,తల్లి ఐసీయూలో ఉందని ఒంటారియో స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ యూనిట్ (SIU) తెలిపింది.‘‘ఎప్పటిలాగే ఆ హైవేపై కారులో వెళుతున్నాను ఇంతలో నిందితులు రాంగ్రూట్లో ఎదురుగా వచ్చారు. ఆరు కార్లను ఢీకొట్టారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఆ క్షణం నా కళ్లను నేనే నమ్మలేకపోయాను’’ ఈ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ ఓ ప్రత్యక్ష సాక్షి మరోవైపు ఘటనపై కెనడా పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. యాక్సిడెంట్ ఎలా జరిగిందనేది ఆరా తీస్తున్నారు. ప్రత్యేక బృందాలతో వివిధ కోణాలలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటనపై టొరొంటోలోని భారతీయ కాన్సులేట్ విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి సంతాపం తెలియజేసింది. ఈ ఘటనపై కెనడా అధికారులతో టచ్‌లో ఉన్నామని బాధిత కుటుంబానికి అన్నిరకాలుగా అండగా ఉంటామని పేర్కొంది. -
డెబ్బై మూడేళ్ల బామ్మ... మాధురితో పోటీపడి డ్యాన్స్ చేసింది!
‘డ్యాన్స్ వయసు ఎరగదు’ అనే సామెత ఉందో లేదోగాని ఈ వీడియో చూస్తే ‘నిజమే సుమీ’ అనిపిస్తుంది. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘డ్యాన్స్ దివానే’లో 73 సంవత్సరాల బామ్మ డ్యాన్స్ వైరల్ అయింది. ఛోబీ అనే బామ్మ ‘దేవదాస్’ సినిమాలోని మాధురి దీక్షిత్ పాపులర్ పాట ‘మార్ డాలా’కు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. రియాల్టీ షో జడ్జీలు మాధురి దీక్షిత్, సునీల్షెట్టీలకు ఛోబీ డ్యాన్స్ బాగా నచ్చింది. ‘మనసులో ఏది అనిపిస్తే అది చేయాలి. భయం అవసరం లేదు... అని మీరు మాకు చెబుతున్నట్లుగా ఉంది’ అని బామ్మను ప్రశంసించింది మాధురి. ఆ తరువాత బామ్మతో కలిసి మాధురి దీక్షిత్ డ్యాన్స్ చేసింది. ‘మాధురి అంటే డ్యాన్స్‌కు మరో పేరు. ఆమె పాపులర్ పాటకు డ్యాన్స్ చేయాలంటే సాహసం మాత్రమే కాదు. ప్రతిభ కూడా ఉండాలి. ప్రతిభ, సాహసం మూర్తీభవించిన ఛోబీజీకి అభినందనలు’. ‘మాధురితో పోటీపడి డ్యాన్స్ చేయడం మామూలు విషయం కాదు’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో సోషల్ మీడియాలో కనిపించాయి. -
15 ఏళ్లకే అమ్మ.. 33కు అమ్మమ్మ.. కొత్త ట్విస్ట్ ఇదే!
తల్లి అయ్యే వయసులో అమ్మమ్మగా మారిన ఓ మహిళ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఆమె హృదయం ఇప్పుడు మరొకరిని కోరుకుంటోంది. ఆమె ఆ దేశంలో అతి పిన్న వయస్కురాలైన అమ్మమ్మ టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు ఆ మహిళ తన 34 ఏళ్ల వయసులో మరోసారి పెళ్లికూతురుగా ముస్తాబవుతోంది. రేచెల్ మెక్‌ఇంటైర్ అనే మహిళ యునైటెడ్ కింగ్డమ్లో ఉంటోంది. మీడియా కథనాల ప్రకారం ఆమె ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన అమ్మమ్మ. కుమార్తెకు జన్మనిచ్చినప్పుడు రేచెల్ వయసు కేవలం 15 సంవత్సరాలు. పెరిగి పెద్దయిన ఆ కుమార్తెకు వివాహం జరిగింది. ఆమె కూడా ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఫలితంగా రేచెల్ తన 33 సంవత్సరాల వయసులో అమ్మమ్మగా మారింది. రేచెల్ జీవిత చిత్రం ఎంతో ఆసక్తికరం. ఈ అమ్మమ్మ ఇప్పుడు మరోమారు పెళ్లికూతురు అవుతోంది. మూరత్ అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు రేచెల్ తన కుమార్తెకు చెప్పింది. వీరి ప్రేమకు కుమార్తె కూడా మద్దతు పలికింది. కొంతకాలం క్రితం ఆమె మూరత్తో తొలి చూపులోనే ప్రేమలో పడింది. ఆ తర్వాత ఇద్దరూ దగ్గరయ్యారు. ‘మూరత్ ప్రవర్తన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే అతనిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయానికి నా కుమార్తె కూడా మద్దతు తెలిపిందంటూ’ పెళ్లి కుమార్తెగా మారబోతున్న రాచెల్ సంబరపడుతూ మీడియాకు తెలిపింది. ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్ ఎన్నికలతో భారత్, పాక్, చైనాలకు లింకేమిటి? -
రతన్ టాటా జీవితంలో మరిచిపోలేని వ్యక్తి.. ఎవరీ నవాజ్‌బాయి టాటా!
దేశీయ దిగ్గజ సంస్థ టాటా (TATA) గురించి ఈ రోజు అందరికి తెలుసు. అయితే ఈ కంపెనీ 1868లో 'జమ్సెట్జీ నుస్సర్వాన్జీ టాటా' (జంషెడ్జీ) ప్రారంభించారు. నేడు ఈ కంపెనీ 150కి పైగా దేశాల్లో ఉత్పత్తులను, సేవలను అందిస్తూ.. ఆరు ఖండాల్లోని 100 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. కంపెనీ మార్కెట్ విలువ నేడు సుమారు రూ. 24 లక్షల కోట్లు. ఇంత పెద్ద సామ్రాజ్యానికి ఒకప్పుడు మహిళ డైరెక్టర్‌గా పనిచేసిందని చాలామందికి తెలియకపోవచ్చు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా సన్స్ మొదటి మహిళా డైరెక్టర్ 1925లో టాటా సన్స్ మొదటి మహిళా డైరెక్టర్‌గా 'నవాజ్‌బాయి' పనిచేసింది. ఆమె తన భర్త రతన్జీ టాటా మరణానంతరం కంపెనీకి సారథ్యం వహించి 1965లో మరణించే వరకు దానిని నడిపించింది. కంపెనీని నడిపించడమే కాకుండా ఈమె తన జీవితకాలంలో ఎన్నో దానధర్మాలు చేసింది. దీనికోసం 1928లో ఒక సంస్థను స్థాపించించింది. ఈ సంస్థ ప్రస్తుతం సర్ రతన్ టాటా ఇన్స్టిట్యూట్ (RTI) అనే పేరుతో పేద మహిళలకు ఉపాధి కల్పిస్తూ.. కుకరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్ అండ్ లాండ్రీ విభాగాలలో వారి స్వంత జీవనోపాధికి శిక్షణ ఇస్తుంది. నవాజ్‌బాయి టాటా స్వయంగా రతన్ టాటా గ్రాండ్ మదర్. రతన్ టాటా చిన్నప్పుడు ఈమెతో చాలా సన్నిహితంగా ఉండేవాడినని గతంలో చాలాసార్లు వెల్లడించాడు. రతన్ & నవాజ్‌బాయి టాటా ఇద్దరూ కొన్నేళ్లు ఇంగ్లాండ్‌లో నివసించారు. వీరికి కింగ్ జార్జ్ V అండ్ క్వీన్ మేరీ వ్యక్తిగత స్నేహితులు. ఇదీ చదవండి: 19 ఏళ్లనాటి కల.. ఇప్పుడు నిజమైంది.. ఈజ్‌మైట్రిప్ కో-ఫౌండర్ టాటా సంస్థ పురోగతికి నవాజ్‌బాయి ఎంతో కృషి చేసింది. జమ్సెట్జీ టాటా నిర్దేశించిన సూత్రాలు, ఆదర్శాలకు అనుగుణంగా కంపెనీ పనిచేస్తుందని ఆమె నిర్ధారించేవారు. ఈ సంఘటనలు రతన్ టాటా గతంలో కూడా చాలా గొప్పగా వెల్లడించారు. -
మనవరాలి సంరక్షణ కోసం.. గంటకు రూ. 1600లు డిమాండ్ చేసిన అమ్మమ్మ!..
ప్రస్తుతం ఆలుమగలు ఉరుకులు పరుగులు జీవితంతో పిల్లల ఆలనపాలన చూసుకోలేని స్థితిలో లేరు. అందులోనూ భార్యభర్తలిద్దరూ ఉద్యోగస్తులు అయితే పిల్లల బాగోగులు చూసుకోవడం అస్సలు కుదరదు. కాస్త స్తోమత ఉంటే డేకేర్ లేదంటే అమ్మమ్మ, నాయనమ్మల వద్ద ఉంచాల్సిందే. కానీ ఇక్కడొక అమ్మమ్మ తన మనవరాలిని చూసుకునేందుకు గంటకు రూ. 1600లు ఇవ్వాల్సిందేనని కూతురికి తెగేసి చెప్పింది. దీంతో కూతురు ఒక్కసారిగా షాక్ గురయ్యింది. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా! ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎందుకిలా ఆమె డిమాండ్ చేసిందంటే.. అసలేం జరిగిందంటే..ఓ వృద్ధ మహిళ తన సొంత మనవరాలిని సంరక్షణ కోసం, గంటకు రూ. 1600 ఛార్జ్ చేస్తానని కరాఖండీగా చెప్పింది కూతురికి. అంతేగాదు ఆ చిన్నారికి సంబంధించిన కొన్ని లగ్జరీ వస్తువులను కూడా డిమాండ్ చేసింది ఆ వృద్ధురాలు. ఈ విచిత్ర ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. కూతురు..."తన తల్లి వృద్ధురాలని, పైగా ఇంట్లో ఖాళీగానే ఉంది. కాబట్టి తాను తన కూతురిని చూసుకోమని అడిగాను. ఇది ఏమైనా అడగకూడని విషయమా!. తాను, తన భర్త ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నందువల్లే అడుతున్నా" అని కూతురు తల్లిని ప్రాధేయపడుతోంది. తన తల్లి వయసు 64 ఏళ్లు అని, ప్రస్తుతం ఆమె ఏ ఉద్యోగం చేయడం లేదు. అందువల్ల ఆమెకు చాలా సమయం ఉంటుంది. కాబట్టి నా కుమార్తెను చూసుకోమని అడిగాను. కానీ ఆమె గంటకు సుమారు 16 పౌండ్ల ఛార్జీ ఇవ్వాలని చెబుతోంది. ఏం చేయాలో తెలియడం లేదని సోషల్ మీడియాలో వాపోయింది ఆ వృద్ధురాలి కూతురు. తన తల్లి ఆలస్య రుసుమును కూడా వసూలు చేస్తానని కరాఖండీగా చెప్పనట్లు తెలిపింది. అంతేగాదు కారులో ప్రత్యేక సీటు, స్టోలర్, బాటిల్ ఇతర వస్తువులు కూడా కావలని డిమాండ్ చేసిందంటూ గోడు వెల్లబోసుకుంది కూతురు. ఎందుకు ఆ వస్తువులన్నీ అడిగిందంటే.. తన తల్లి వస్తువులను శుభ్రం చేసి మళ్లీ ఉపయోగించను కూడా ఉపయోగించదని ఆవేదనగా చెబుతోంది. ఇంత మొత్తం చెల్లించాలంటే తాను అప్పులుపాలు కాక తప్పదని కూతురు ఒకటే గోల చేస్తోంది. కానీ సదరు వృద్ధురాలు తన డిమాండ్లను అంగీకరించకపోతే చూడనని నిర్మోహమాటం చెప్పేసింది. ఇక ఆమె ఒప్పుకోకపోతే కూతుర్ని డేకేర్‌లో పెడతానని చెబుతోంది. తన కుటంబంలో అందరూ నైన్ టు ఫైవ్ జాబే చేస్తారని, అందువల్లే తాను వాళ్ల అమ్మను కోరినట్లు పేర్కొంది. ఈ విషయం ప్రస్తుతం బ్రిటన్ అంతటా తెగ వైరల్ అవుతోంది. నిజానికి చాలామంది వృద్ధులు లేదా ఇంట్లోని పెద్దవాళ్ల పట్ల ఇలాంటి ధోరణితోనే ఉంటారు. ఇది సరైనది కాదు. వృద్ధులు ఖాళీగా పనిపాట లేకుండా ఉంటారని అలుసుగా చూడకూడదు. జీవితంలో పడరాని పాట్లు కష్టాలు పడి మనల్ని పెంచినవారు. వారు జీవితంలో ఎన్నో వేదనలను గెలుపోటములు చూసి.. చూసి.. అలసిపోయిన వాళ్లు. వాళ్లకంటూ కాస్త ఏకాంతం కావాలని కోరుకుంటారు. ముందుగా వారి ఓపెనియన్ అడగాలి. వారి మనసెరిగి మసులుకుంటే చూసేదేమో ఆమె!. ఏమో ఆమె మనసులో ఏమూలనో ఏదో అభద్రతా భావం ఉంటేనే కథ ఇలా మాట్లాడతారు. ఒక్కసారి ఇలా ఆలోచించి వారిని అర్థం చేసుకునే యత్నం చేయండి. కాగా, నెట్టింట వైరల్ అవుతున్న ఈ విషయం పట్ల నెటిజన్లు కూడా ఘాటుగానే స్పందించారు. పిల్లలను చూసుకునే సామర్థ్యం లేప్పుడూ పిల్లల్ని కనాలనే ఆలోచన తీసుకోకుండా ఉండాల్సింది. లేదా గర్భధారణ సమయంలోనే తల్లితో మాట్లాడి ఉండాల్సింది. అయినా ఆమె ఇప్పటి వరకు మిమ్మల్ని సంరక్షించింది. ఇక మీ కూతుర్ని చూసుకోవాల్సింది మీ బాధ్యతే అని ఆమెకు చివాట్లు పెడుతూ పోస్ట్‌లు పెట్టారు. (చదవండి: ఏనుగు చెవులు లాంటి అరుదైన ఆక్టోపస్! విస్తుపోయిన శాస్త్రవేత్తలు -
కెనడా బామ్మను ప్రేమించి, పెళ్లాడిన పాక్ కుర్రాడు
ప్రేమకు తరతమ బేధాలు, అంతరాలు ఉండబోవని ప్రేమను పండించుకున్న కెనడా బామ్మ, పాక్ కుర్రాడు నిరూపించారు. పాకిస్తాన్‌కు చెందిన 35 ఏళ్ల కుర్రాడు కెనడాకు చెందిన 70 ఏళ్ల బామ్మ ప్రేమలో పడ్డాడు. వీరి ప్రేమ ఎంతలా వికసించిందంటే, చివరికి ఇద్దరూ పెళ్లి చేసుకుని, జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. వరుని పేరు నయీమ్ షాజాద్. 70 ఏళ్ల ఆ కెనడియన్ వధువు పేరు మేరీ. అయితే వీరి ప్రేమను, పెళ్లిని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. వీసా కోసం నయీమ్ ఇటువంటి పని చేశాడని ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని వీరిద్దరూ ఖండించారు. 35 ఏళ్ల నయీమ్ షాజాద్, మేరీ మధ్య సోషల్ మీడియా సైట్ ఫేస్బుక్ ద్వారా ప్రేమ మొదలైంది. తామిద్దరూ 2012లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్బుక్లో కలిశామని నయీమ్ మీడియాకు తెలిపాడు. 2015లో మేరీ నయీమ్‌కు పెళ్లి ప్రపోజ్ చేసింది. 2017లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే వీసా సమస్య కారణంగా కెనడాలో ఇద్దరూ కలిసి జీవించలేకపోయారు. మేరీ ఇటీవల పాకిస్తాన్‌ను సందర్శించి, అతని దగ్గర 6 నెలలపాటు ఉంది. నయీం గతంలో ఆర్థికంగా, మానసికంగా దిగజారి ఉన్నాడు. అయితే మేరీ అతనికి ఆర్థికంగా సాయం చేయడమే కాకుండా, మానసిక ధైర్యాన్ని కూడా అందించింది. అయితే మేరీ ధనవంతురాలేమీ కాదని, పెన్షన్‌తో బతుకుతున్నదని నయీమ్ చెప్పాడు. కాగా కెనడా వెళ్లేందుకు, డబ్బు కోసమే మేరీని నయీం పెళ్లి చేసుకున్నాడని స్థానికులు ఆరోపిస్తుంటారు. అయితే నయీమ్ ఈ ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చుతూ, ఇలాంటివాటిని తాను పట్టించుకోనని అన్నాడు. తాను డిప్రెషన్లో ఉన్నప్పుడు, డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు మేరీ ఎంతో సాయం అందించిందని, అందుకే తాను ఆమె ప్రేమలో పడ్డానని నయీమ్ తెలిపాడు. ఇది కూడా చదవండి: స్కూలు టాయిలెట్లో శిశు జననం.. మాయమైన తల్లి -
నమ్మించి.. మద్యం తాగించి.. అంతమొందించి.. ఆపై..
నిజామాబాద్: ఆస్తి, నగల కోసం వరుసకు నానమ్మ అయ్యే మహిళను హత్య చేశాడో యువకుడు. మద్యం తాగించి అటవీ ప్రాంతంలో అంతమొందించి ఏమి ఎరుగనట్లు ఇల్లు చేరాడు. నిజాంసాగర్ మండలం మాగి శివారులోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. పిట్లం మండల కేంద్రానికి చెందిన దత్తుకు ముగ్గురు భార్యలు ఉన్నారు. మొదటి భార్య అంజవ్వ మనవడు సంతోష్, మూడో భార్య శోభారాణి(45)ని ఈ నెల 2న నిజాంసాగర్ ప్రాజెక్టు సందర్శనకు బైక్‌పై తీసుకొచ్చాడు. ప్రాజెక్టును చూసిన తర్వాత బైక్‌పై నిజాంసాగర్‌కు చేరుకున్నారు. అక్కడ మద్యం తీసుకున్న సంతోష్ నానమ్మను మాగి శివారులోని అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లాడు. అక్కడ ఇద్దరు కలిసి మద్యం తాగారు. అనంతరం సంతోష్, శోభారాణి తలపై కర్రతో కొట్టి చంపాడు. అనంతరం సాయంత్రం వేళ పిట్లం చేరుకున్నాడు. రాత్రి వరకు శోభారాణి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సంతోష్‌ను అడుగగా పిట్లంలో దించినట్లు చెప్పాడు. కుటుంబ సభ్యులు పిట్లం పోలీస్ స్టేషన్లో శోభారాణి మిస్ అయినట్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని సంతోష్‌ను విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. సంతోష్‌ను అదుపులోకి తీసుకు న్న పోలీసులు ఘటన స్థలానికి తీసుకువచ్చారు. ఘటన స్థలాన్ని సీఐ మురళి పరిశీలించారు. శోభారాణి ఒంటిపైన ఉన్న నగలతో పాటు ఆస్తి కోసం సంతోష్ హత్య చేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. -
నిత్యా మీనన్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక మిమ్మల్ని చూడలేనంటూ!
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తాను ఎంతగానో ప్రేమించే అమ్మమ్మ చనిపోయారు. ఈ విషయాన్ని నిత్యా తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. అమ్మమ్మ, తాతయ్యతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన నిత్యా అభిమానులు ధైర్యంగా ఉండాలంటూ పోస్టులు పెడుతున్నారు. (ఇది చదవండి: నాన్న బాటలోనే రాణిస్తా.. సేవలు కొనసాగిస్తా..ఘట్టమనేని సితార) నిత్యా ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఒక శకం ముగిసింది. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నా. గుడ్ బై అమ్మమ్మ అండ్ మై చెర్రీమ్యాన్. ఇప్పటి నుంచి మరో కోణంలో చూసుకుంటా.' అంటూ ఎమోషనలైంది. కాగా.. అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నటి నిత్యామీనన్. నితిన్ సరసన ఇష్క్ సినిమాతో గుర్తింపు దక్కించుకుంది. ఆమె తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళంలో దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో గుండెజారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, 100 డేస్ ఆఫ్ లవ్, ఒక్క అమ్మాయి తప్ప, ఇంకొక్కడు లాంటి చిత్రాల్లో నటించింది. (ఇది చదవండి: జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) -
పూల బామ్మ పులకించిన వేళ
సంచలనాలు, అద్భుతాలు మాత్రమే ‘వైరల్’కి అర్హం కాదని నిరూపించిన వీడియో ఇది... పుణెలో ఒక బామ్మ తన పూలదుకాణంలో కూర్చొని పూలు అల్లుతుంది. నిజానికి ఇదొక సాధారణ దృశ్యం. అయితే ఈ దృశ్యంలో ఆర్టిస్ట్ చైతన్యకు శ్రమజీవన సౌందర్యం కనిపించింది. తన స్కెచ్‌బుక్ తీసి బామ్మను స్కెచ్ వేయడం ప్రారంభించాడు. స్కెచ్ పూర్తయిన తరువాత బామ్మకు చూపిస్తే... ఆమె కళ్లలో ఎంత సంతోషమో! బామ్మకు ఆ స్కెచ్ ఎంతగానో నచ్చేసింది. ‘ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉందంటే... చుట్టుపక్కల ఎన్ని శబ్దాలు వినిపిస్తున్నా బామ్మ దృష్టి పూలమీద మాత్రమే ఉంది. పూల అల్లికలో అపారమైన ఆనందాన్ని పొందుతుంది’ అని రాశాడు చైతన్య. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో 2.4 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘ఇష్టమైన పనిలోనే అంతులేని సంతోషం దొరుకుతుంది అని చెప్పే వీడియో ఇది’ అని కామెంట్ సెక్షన్లో స్పందించిన వారు ఎందరో. -
5 తరాలు, 85 మంది కుటుంబ సభ్యులు.. 102 ఏళ్ల బామ్మకు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు
తిరువొత్తియూరు(చెన్నై): దిండిగల్ నత్తం సమీపంలో 5 తరాలను చూసిన 102 ఏళ్ల వృద్ధురాలు తన పుట్టిన రోజును కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఘనంగా జరుపుకుంది. దిండిగల్ జిల్లా నత్తం సమీపంలోని లింగవాడి గ్రామానికి చెందిన శ్రీనియమ్మాళ్ 1921లో జన్మించారు. ప్రస్తుతం ఆమె వయసు 102 ఏళ్లు. ఆమె భర్త మీనాక్షిసుందరం సిద్ధ వైద్యుడు. ఆయన 1997లో మరణించాడు. ఈ దంపతులకు 9 మంది పిల్లలు. వీరిలో ఇద్దరు కుమారులు ఇప్పటికే మృతి చెందారు. ప్రస్తుతం నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 23 మంది మనవళ్లు, మనవరాళ్లు, 27 మంది ముని మనవళ్లు, ముని మనవరాళ్లు, 5వ తరం వారసులుగా నలుగురు మనుమలు, మనుమరాళ్లు మొత్తం 85 మంది ఉన్నారు. శ్రీనియమ్మాళ్ 102వ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. చదవండి: స్కూల్ పిల్లల బ్యాగుల్లో డైపర్లు..! వయసేమో 11.. ఆ పని మాది కాదంటున్న టీచర్లు -
బామ్మ వయసు 73.. ప్రాణాలకు ప్రమాదమని తెలిసిన పోటీలో పాల్గొని చాంపియన్‌గా నిలిచింది!
ఆనందంగా జీవించే వారికి వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే. అచ్చం ఇలాగే.. ఏడు పదుల వయసు దాటిన తర్వాత కూడా బాడీ బిల్డర్‌గా రికార్డులు బద్దలు కొడుతోంది ఈ బామ్మ. ఈమె పేరు రెబెకా వూడీ. అమెరికాకు చెందిన రెబెకా అథ్లెట్స్ కుటుంబంలో జన్మించింది. తండ్రి, అన్నయ్య ఇద్దరూ గోల్డన్ గ్లోవ్స్ బాక్సర్స్. రెబెకా తండ్రికి ఒక కోచింగ్ సెంటర్ కూడా ఉంది. అక్కడ మగపిల్లలతో పాటు, ఆడపిల్లలు కూడా బాడీ బిల్డింగ్‌తో బాక్సింగ్, ఫుట్‌బాల్, బేస్ బాల్, బాస్కెట్ బాల్ వంటి క్రీడల్లో శిక్షణ తీసుకునేవారు. అలా వారిని చూసి, చిన్నప్పుడే తానూ బాడీ బిల్డర్ కావాలని నిర్ణయించుకుంది. తండ్రి ప్రోత్సాహంతో బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని ఎన్నో విజయాలు సాధించింది. అయితే, తన నలభయ్యో ఏట చక్కెర వ్యాధి రావడంతో పోటీలకు స్వస్తి పలకాలని వైద్యులు ఆమెకు సూచించారు. అయినా తను బాడీబిల్డింగ్ని ఆపలేదు. ఇక తన 73వ ఏట అయితే, ఇకపై పోటీల్లో పాల్గొంటే ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్లు చెప్పారట. అప్పుడు కూడా ఆమె వెనుకడుగు వేయలేదు. వైద్యుల మాటను వమ్ము చేస్తూ.. 111 కిలోగ్రాముల పోటీలో పాల్గొని చాంపియన్‌గా నిలిచింది. ఇన్ని విజయాలు సాధించే ఈ బామ్మకు ఇప్పటికీ పిజ్జా, మెక్సికన్ ఫుడ్ అంటే చాలా ఇష్టమట. ‘ఇష్టమైన ఆహారం తీసుకుంటూ, ఆనందంగా జీవిస్తే ఏ అనారోగ్యమూ మిమ్మల్ని ఏమీ చేయలేదు’ అంటోంది ఈ బాడీబిల్డర్ బామ్మ. చదవండి: 127 గంటలు.. డ్యాన్స్! -
Rebirth Story: ‘ఆవిడ మా ఆవిడే..’ పునర్జన్మ చెబుతూ హడలెత్తిస్తున్న కుర్రాడు!
పునర్జన్మ... ఇది యావత్ మానవాళికీ అంతుచిక్కని ప్రశ్న. పునర్జన్మ ఉందని కొందరు అంటుంటే, అస్సలు లేదని మరికొందరు వాదిస్తుంటారు. అయితే అప్పుడప్పుడు తమ పునర్జన్మ ఇదేనంటూ పలువురు పూసగుచ్చినట్లు చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఇటువంటి ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని మైన్పూర్ జిల్లాలో పునర్జన్మకు సంబంధించిన ఒక ఉదంతం కలకలం రేపుతోంది. ఎనిమిదేళ్ల కుర్రాడు తన అమ్మమ్మను తన భార్య అని చెబుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ మాటవినగానే మొదట ఆ కుర్రాడి కుటుంబ సభ్యులు దానిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆ కుర్రాడు చెబుతున్న గతంలోని సంఘటనలు విన్నాక కుటుంబ సభ్యులంతా తెగ ఆశ్చర్యపోయారు. పునర్జన్మకు సంబంధించిన ఈ విచిత్ర ఉదంతం ఎలావూ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగల్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. జూన్ 15న 8 ఏళ్ల అర్యన్ తన తల్లితోపాటు రతన్‌పూర్ గ్రామానికి వచ్చాడు. ఆ కుర్రాడి తల్లి.. ‘వెళ్లి.. అమ్మమ్మ కాళ్లకు దండం పెట్టు’ అని అతనితో చెప్పింది. వెంటనే ఆ కుర్రాడు ‘ఈమె నా అమ్మమ్మ కాదు. నా భార్య’ అని అని చెప్పాడు, అలాగే అక్కడే ఉన్న మేనమామను తన కుమారుడు అని ఆర్యన్ చెప్పాడు. ఆర్యన్ మాటలను తొలుత కుటుంబ సభ్యులు తేలికగా తీసుకున్నారు. అయితే ఆ కుర్రాడు అదే విషయాన్ని పదపదే చెప్పడంతోపాటు, గతంలో వారి కుటుంబంలో జరిగిన అన్ని ఘటనలను పూసగుచ్చినట్లు చెప్పడం మొదలుపెట్టాడు. ఇవన్నీ తన గత జన్మకు సంబంధించిన విషయాలని తెలిపాడు. గత జన్మలో తన పేరు మనోజ్ మిశ్రా అని, 8 ఏళ్ల క్రితం అంటే 2015 జనవరి 9న తాను పొలంలో పని చేస్తుండగా, అక్కడ ఒక రంధ్రం కనిపించిందని, దానిని కాలితో మూసివేసే ప్రయత్నం చేస్తుండగా పాము కరిచిందని తెలిపాడు. తాను వెంటనే స్పృహ కోల్పోయానని, తనను ఆసుపత్రికి తీసుకెళుతుండగా దారిలో మృతిచెందానని చెప్పాడు. పిల్లాడి నోటి నుంచి వచ్చిన ఈ మాటలు వినగానే అక్కడున్నవారంతా హడలెత్తిపోయారు. ఇదంతా వాస్తవమేనని, ఆ కుర్రాడు గత జన్మలో మనోజ్ మిశ్రా అని వారు గుర్తించారు. ఆర్యన్ ఇంకా వివరాలు చెబుతూ తాను చనిపోయిన సమయంలో తన కుమార్తె( ఆర్యన్ తల్లి) గర్భవతి అని తెలిపాడు. తాను చనిపోయాక తన దశదిన కర్మలు ముగిసిన వెంటనే తన కుమార్తె రంజన.. కుమారునికి జన్మనిచ్చిందని అన్నాడు. ఇంత చిన్న కుర్రాడు ఇన్ని విషయాలు తెలియజేయడం చూసిన అక్కడున్నవారంతా తెగ ఆశ్చర్యపోయారు. ఆర్యన్‌ది పునర్జన్మే అంటూ వారు అందరికీ చెబుతున్నారు. ఆర్యన్ తన అమ్మమ్మ నీరజ్ మిశ్రాను తన భార్య అని, మేనమామలైన అనుజ్, అజయ్‌లను తన కుమారులని, తన తల్లి రంజనను తన కుమార్తె అని చెబుతున్నాడు. ఆర్యన్ మేనమామ అజయ్ మాట్లాడుతూ నాలుగేళ్ల వయసు నుంచి ఆర్యన్ గత జన్మ విషయాలను చెబుతున్నాడని, అయితే మేము దీనిని ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదని, ఇప్పుడు నమ్మక తప్పడం లేదని అన్నారు. ఈ మధ్య ఆర్యన్ చెబుతున్న విషయాలు మరింత ఆశ్చర్యకరంగా ఉన్నాయని అన్నారు. ఆర్యన్ అమ్మమ్మ నీరజ్ మిశ్రా ఆ కుర్రాడి మాటలు నిజమేనని చెబుతోంది. ఇది కూడా చదవండి: బంగారు నగరంలో చీకటి సామ్రాజ్యం.. జన జీవనం సాగుతుందిలా.. -
గొలుసు దొంగను ప్రతిఘటించిన చిన్నారి
క్రైమ్: సమయస్ఫూర్తితో వ్యవహరించడం.. ఆపద సమయంలోనూ అక్కరకు వస్తుంది. కానీ, సమయస్ఫూర్తితో పాటు ధైర్యంగా ఉంటేనే పరిస్థితులను ఎదుర్కోవచ్చని ఇక్కడ ఓ పదేళ్ల చిన్నారి నిరూపించింది. తన బామ్మ మెడలో గొలుసు దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని.. ప్రతిఘటించింది ఆమె పదేళ్ల మనవరాలు. తన ఇద్దరు మనవరాళ్లతో ఆ బామ్మ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో స్కూటీ మీద వచ్చిన ఓ ఆగంతకుడు.. ఆమె మెడలోని చెయిన్ లాక్కోబోయాడు. దీంతో ఆ వృద్ధురాలు ప్రతిఘటించింది. ఇది గమనించిన ఆమె పదేళ్ల మనవరాలు.. చేతిలోని బ్యాగు తీసుకుని ఆ దొంగను యెడా పెడా బాదేసింది. ఆ దెబ్బకు ఆ దొంగ అక్కడి నుంచి ఉడాయించాడు. మహారాష్ట్రలోని పూణేలో ఫిబ్రవరి 25వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. సీసీటీవీ ఫుటేజీలోని చోరీయత్నం- ఆ చిన్నారి అడ్డుకున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీంతో పూణే సిటీ పోలీసులు స్పందించారు. గురువారం(మార్చి 9న) కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. #WATCH | A 10-year-old girl foiled an attempt by a chain snatcher to snatch her grandmother's chain in Maharashtra's Pune City The incident took place on February 25 & an FIR was registered yesterday after the video of the incident went viral. (CCTV visuals confirmed by police) pic.twitter.com/LnTur7pTeU — ANI (@ANI) March 10, 2023 -
ఉపాసన ఇంట తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన మెగాకోడలు
మెగా కోడలు ఉపాసన ఇంట విషాదం నెలకొంది. ఆమె నానమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది. ఆమె చివరి వరకు ఎంతో కృతజ్ఞత, సానుభూతి, గౌరవం, ప్రేమతో నిండిన జీవితాన్ని గడిపారు. ఆమె ద్వారానే జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసుకున్నాను. ఆమె నన్ను పెంచి పెద్ద చేసింది. ఆమె ప్రేమను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నేను నా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి ఎలాంటి ప్రేమానురాగాలను పొందానో.. ఆ అనుభూతులన్నింటిని నా పిల్లలకు అందేలా చూస్తానని మాటిస్తున్నాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఉపాసన ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం మథర్‌వుడ్‌ని ఆస్వాదిస్తూ సంతోషంగా గడుపుతున్న ఉపాసనకు ఇది నిజంగా తీరని లోటు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం
యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుండె బరువెక్కిందంటూ రష్మి సోషల్ మీడియా వేదికగా ఈ చేదు వార్తను పంచుకుంది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఎమోషనల్ నోట్ పోస్ట్ చేసింది. తన గ్రాండ్ మదర్ ప్రమీలా మిశ్రా శుక్రవారం కన్నుమూసినట్లు రష్మి తన పోస్ట్‌లో వెల్లడించింది. ఈ సందర్భంగా తన గ్రాండ్ మదర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఈ రోజు మా గ్రాండ్ మదర్ ప్రమీలా మిశ్రా కన్నుమూశారు. బరువెక్కిన గుండెతో కుటుంబ సభ్యులమంత ఆమెకు చివరి సారిగా విడ్కోలు పలికాం. ఆమె ఎంతో స్ట్రాంగ్ ఉమెన్. మాపై తన ప్రభావం ఎంతో ఉంది. ఆమె దూరమైనా.. తన జ్ఞాపకాలు ఎల్లప్పుడు మాతోనే ఉంటాయి. ఓం శాంతి’ అంటూ రష్మీ రాసుకొచ్చింది. కాగా రష్మీ బుల్లితెరపై యాంకర్ సందడి చేస్తూనే వెండితెరపై నటిగా రాణిస్తోంది. ప్రస్తుతం పలు షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తోంది. అలాగే వీలు చిక్కినప్పుడల్లా సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. రీసెంట్గా ఆమె బొమ్మ బ్లాక్‌బస్టర్ మూవీతో వెండితెరపై సందడి చేసింది. చదవండి: ‘మహానటి’ తర్వాత ఇంట్లో గొడవలు అయ్యాయి: సావిత్రి కూతురు నాతో షూటింగ్ చేసి చివరికి వేరే హీరోయిన్ను తీసుకున్నారు: రకుల్ -
ఆ స్నేహానికి 80 ఏళ్లు.. వాళ్లకింకా వయసైపోలేదు
వైరల్: వయసు ఒంటికే.. మనస్సుకు ఎంతమాత్రం కాదు. ఇక్కడ అదే నిరూపించారు ఇద్దరు బామ్మలు. వాళ్లిద్దరి స్నేహానికి ఎనభై ఏళ్లు పూర్తయ్యాయి. కలుసుకుని చాలా ఏండ్లే అవుతోందట. తన బాల్య స్నేహితురాలిని ఎలాగైనా కలవాలని ఉందని తన మనవడితో చెప్పుకుంది ఆమె. వీడియో కాల్స్ జమానాలో ఆ మనవడు తల్చుకుంటే ఆమె కోరిక క్షణాల్లోనే తీరిపోయేది. కానీ, అతను అలా చేయలేదు. దగ్గరుండి ఆమెను స్నేహితురాలి ఇంటికి తీసుకెళ్లాడు. ఒంట్లో ఓపిక లేకున్నా తన స్నేహితురాలిని చూసే సరికి అవతల ఉన్న బామ్మ ఓపిక తెచ్చుకుంది. లేచి కూర్చుని ఆశ్చర్యపోయింది. ఆప్యాయంగా ముచ్చట్లతో మొదలైన వాళ్ల సంభాషణ.. జ్ఞాపకాల్ని నెమరేసుకుంటూ.. పాత రోజుల్లోకి వెళ్లింది. ఇద్దరూ హుషారుగా జోకులేసుకున్నారు. అలా చాలాసేపు గడిచాక.. వెళ్లే ముందు తన స్నేహితురాలి కాలిని ముట్టుకుని ఆశీర్వాదం తీసుకుంది. ముకిల్ మీనన్ అనే యువకుడు తన బామ్మ కోసం ఇదంతా చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన వాళ్లిద్దరి రీయూనియన్ పోస్ట్ అమితంగా ఆకట్టుకుంటోంది. బాల్యం అద్భుతమైంది. అందులోని స్నేహాలు ఎంతో మధురమైనవి. ఏళ్లు గడిచిన.. ఆ జ్ఞాపకాలు, అప్పటి చిలిపి చేష్టలు ఎప్పుడూ పదిలంగా ఉండిపోతాయి. View this post on Instagram A post shared by m u k i l m e n o n (@mukilmenon) -
45 ఏళ్ల తర్వాత నానమ్మను కలిసిన వ్యక్తి.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!
ఇతరులను సంతోషంగా ఉండాలంటే డబ్బులు, నగలు, ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనస్పూర్తిగా చేసే చిన్న చిన్న పనులు సైతం ఎదుటి వారిలో కొండంత ఆనందాన్ని తీసుకొస్తాయి. వారితో గడిపే కాస్త సమయం మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అలాంటి ఓ అందమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన నానమ్మను కలిసేందుకు ఓ వ్యక్తి స్పెయిన్ నుంచి సౌత్ అమెరికాలోని బొలివియాకు ప్రయాణించాడు. నానమ్మను కలవడంలో ఆశ్యర్యపోవాల్సింది ఏముంది అనుకుంటున్నారా.. ఎందుకంటే ఆ వ్యక్తి ఆమెను చూసి 45 ఏళ్లు అవుతోంది. చిన్నతనంలో అన అనే మహిళ అతన్ని తన సొంత కొడుకులా చూసుకుంది. అయితే కొన్నాళ్లకు అతను దూరంగా వెళ్లిపోయాడు. మళ్లీ ఇన్నాళ్ల తరువాత మహిళను కలవాలని నిర్ణయించుకున్నాడు. ఆమెపై ఉన్న ప్రేమ అతన్ని స్పెయిన్ నుంచి బొలివియాకు తీసుకువచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత నానమ్మను చూసేందుకు ఏకంగా 8 వేల కిలోమీటర్లకు పైగా ట్రావెల్ చేశాడు. బామ్మ దగ్గరకు వెళ్లి తనెవరో చెప్పిన వెంటనే ఆమె పట్టరాణి సంతోషంతో ఉద్వేగానికి లోనైంది. వెంటనే అతన్ని ఆలింగనం చేసుకొని కన్నీరు పెట్టుకుంది. తన జర్నీని వ్యక్తి మెత్తం రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిని చూసిన ఎవరైనా భావోద్వేగానికి గురవ్వకుండా ఉండలేరు. ఈ వీడియోపై నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. వీడియో ఎంతో అందంగా ఉందని, దీనిని చూస్తుంటే తమ కంట్లో నీళ్లు వస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు. These heartwarming nanny reunions get me every time, @GoodNewsCorres1 ❤️, you got me again. pic.twitter.com/xK35MGL6oy — ☮️💙 Lena L Chen 💙☮️ (@LenaLChen) September 28, 2022 -
చిట్టితల్లి ఇక లేదు.. అందుకే..
కెలమంగలం(బెంగళూరు): కడుపునొప్పి తాళలేక కూతురు ఆత్మహత్య చేసుకొంది. అల్లారుముద్దుగా పెంచుకొంటున్న కూతురు ఇక లేదని కుమిలిపోయిన తల్లి, అమ్మ కూడా బలవంతంగా తనువు చాలించారు. ఇరువురూ రైలు క్రిందపడి ఆత్మహత్య చేసుకొన్న ఘటన తళి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. తళి సమీపంలోని గుమ్మళాపురం గ్రామానికి చెందిన నరసింహన్ కూతురు అర్పిత (14) 9వ తరగతి చదివేది. గత రెండు రోజుల క్రితం కడుపునొప్పి సమస్యతో బాలిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. తళి పోలీసులు శవాన్ని స్వాధీనపరుచుకొని శవపరీక్ష కోసం ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శవాన్ని తీసుకొనేందుకెళ్లిన అర్పిత తల్లి సుమిత్ర (32), అమ్మమ్మ రత్నమ్మ(60)లు ధర్మపురికి సోమవారం వెళ్లారు. అక్కడే కుర్లా ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకొన్నారు. రైలు దూసుకెళ్లడంతో మృతదేహాలు దూరంగా పడ్డాయి. ఈ ఘటనపై ధర్మపురి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. వరస ఆత్మహత్యలతో గుమ్మళాపురంలో విషాదం ఏర్పడింది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: భువనగిరిలో దారుణం.. మహిళ నగ్న చిత్రాలు తీసి.. -
షణ్ముఖ్ జశ్వంత్ ఇంట్లో తీవ్ర విషాదం..
-
బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ ఇంట్లో తీవ్ర విషాదం..
Bigg Boss Fame Shanmukh Jaswanth Grand Mother Passed Away: యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు పొందిన షణ్ముఖ్ జశ్వంత్ బిగ్‌బాస్ ఎంట్రీతో మరింత పాపులర్ అయ్యాడు. తనదైన ఆట తీరుతో బిగ్‌బాస్ ఐదో సీజన్లో చివరకు నిలిచి, రన్నరఫ్‌గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అనేకమంది అభిమానులకు కూడా సంపాదించుకున్నాడు. అయితే అదే సమయంలో ఇదే షో.. తన ప్రేయసితో విడిపోవడానికి కారణమైంది. సోషల్ మీడియాలో క్యూట్ పెయిర్‌గా పేరు సంపాదించుకున్న దీప్తి సునైనా, షణ్ముఖ్ గతేడాదిలో విడిపోయిన విషయం తెలిసిందే. దీంతో తన కెరీర్‌పై ఫోకస్ పెట్టి షణ్ముఖ్ జశ్వంత్ 'ఏజెంట్ ఆనంద్ సంతోష్' సిరీస్ చేస్తున్నట్లు ప్రకటించాడు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అయితే అంత సవ్యంగా జరుగుతున్న షణ్ముఖ్ జీవితంలో విషాదం నెలకొంది. షణ్ముఖ్ బామ్మ మరణించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు షణ్ను తన బామ్మతో కలిసి ఉన్న వీడియోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. ఈ స్టోరీకి రిప్ అని రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. బామ్మతో షణ్ముకు ఉన్న అటాచ్మెంట్ చూసి ఎమోషనల్ అవుతున్నారు. ఈ వీడియోలో తన పెళ్లి చూస్తావా అని షణ్ను అడగ్గా 'ఏమో చూస్తానో లేదో..' అని బామ్మ అన్నట్లుగా ఉంది. 'నువ్ ఉండాలి' అని షణ్ము అనగా, 'నీ పెళ్లి వరకు కచ్చితంగా ఉంటుంది' అని వెనకాల నుంచి మాటలు వినిపించాయి. చదవండి: నేను సింగిల్, కాదు మింగిల్.. ఏం చెప్పాలో తెలియట్లేదు: అనుపమ పరమేశ్వరన్ సినిమా టికెట్ల కోసం క్యూలో మహేశ్ బాబు.. వీడియో వైరల్ -
మియాపూర్: డబ్బుల కోసం అమ్మమ్మ కర్కశత్వం.. కూతురి పిల్లలనే కనికరం లేకుండా..
సాక్షి, మియాపూర్: సొంత అమ్మమ్మ మానవత్వం మరిచి రూ.30 లక్షలు డబ్బులిస్తేనే మనవళ్లను పంపుతానని కూతురును బెదిరించడంతో ఆమె మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ లింగానాయక్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మియాపూర్ మదీనాగూడలో నివాసముంటున్న రుహీ వైద్యురాలు. పదేళ్ల క్రితం ముదాసర్ అలీ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఎనిమిది సంవత్సరాల అర్ఫాన్, ఐదేళ్ల అర్హాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త అలీ ఏడాదిన్నర క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ క్రమంలో తల్లి ముంతాజ్, అక్క రోషనాతో కలిసి మదీనాగూడలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆస్తి మీద కన్నేసిన తల్లి, అక్క జనవరిలో ఇద్దరు పిల్లలను తీసుకొని వారి సొంత ఊరు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి తీసుకెళ్లిపోయారు. చదవండి: స్నేహను ప్రేమిస్తున్నానని చెప్పి.. తర్వాత మరో అమ్మాయితో పెళ్లన్నాడు.. చివరికి! అప్పటి నుండి పిల్లలను తల్లి రుహీకి కనిపించకుండా చేశారు. దీంతో రుహీ పిల్లల కోసం సత్తుపల్లి వెళ్లగా అక్కడ బంధువులందరూ ఆమె పై దాడి చేసి కారును సైతం లాక్కొని పంపించేశారు. దీంతో తల్లి, మిగతా కుటుంబ సభ్యులపైన రుహీ బుధవారం రాత్రి మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కిడ్నాప్ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా గురువారం మియాపూర్ పోలీసులు రుహీ దగ్గర బంధువైన సలీమ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. బాధితురాలు రుహీ మానసిక పరిస్థితి సరిగా లేదని, పిల్లలను పట్టించుకోవడం లేదని వారి భవిష్యత్ దృష్యా తాము తీసుకెళ్లామని రుహీ తల్లి ముంతాజ్ తెలిపారు. పిల్లల అమ్మమ్మగా తమకు సర్వ హక్కులు కల్పించాలని మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు రుహీ తల్లి ముంతాజ్ తెలిపింది. చదవండి: Hyderabad: సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోం.. కూతురి గోల్డ్ చైన్ విషయమై భర్తతో గొడవ... దాంతో.. -
ఏకే 47 గన్‌తో సైనిక కసరత్తులు చేస్తున్న 79 ఏళ్ల బామ్మ!
Ukrainian Grandmother Pick UP AK 47 Rifle: రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించి ఉక్రెయిన్ వాసులకు అమాంతం యుద్ధ భయాన్ని పెంచేసింది. ఓ పక్క అమెరికా రష్యాని హెచ్చరిస్తూ వస్తోంది. దీంతో ఉక్రెయిన్ తమ దేశంలోని పెద్దల నుంచి పిల్లల వరకు తమని తాము రక్షించుకోవడమే కాక దేశాన్ని కూడా రక్షించుకుకోనేలా శిక్షణ ఇచ్చేందుకు సన్నద్దమవుతోంది. అయితే అందుకు పిల్లలు, పెద్దలు కూడా ఏ మాత్రం భయందోళనలకు గురికాకుండా సైనిక శిక్షణ తీసుకునేందుకు ఉత్సాహంగా ముందుకు రావడం విశేషం. ఈ నేపథ్యంలోనే వాలెంటైనా కాన్‌స్టాంటినోవ్‌స్కా అనే 79 ఏళ్ల ఉక్రెయిన్ బామ్మ ఏకే 47 గన్ని పట్టుకుని సైనిక శిక్షణ తీసుకుంటోంది. ఈ మేరకు ఆమె తూర్పు ఉక్రెయిన్‌లోని మారియుపోల్‌లో జాతీయ గార్డు సాయంతో 79 ఏళ్ల వృద్ధ మహిళ అసాల్ట్ రైఫిల్‌ను ఎలా ఉపయోగించాలో నేర్చకుంటోంది. అయితే అక్కడ స్థానిక మీడియా ఈ విషయమై ప్రశ్నిస్తే.. "ఆమె ఈ పని నేను మాత్రమే కాదు మీ అమ్మ అందరూ కచ్చితంగా నేర్చుకునేందుకు సన్నద్దమవుతారు. ఎందుకంటే వారు తమ పిల్లలను, దేశాన్ని రక్షించే పనిలో నిమగ్నమై సమయం ఆసన్నమైంది" అని చెప్పింది. సరిహద్దుల వద్ద రష్యా దళాల ఉద్రిక్తలు కొనసాగుతున్నందున ప్రజలకు ప్రాథమిక సైనిక పద్ధతులను నేర్పడం ఈ శిక్షణ లక్ష్యం. రాగ్-ట్యాగ్ సైన్యాన్ని నిర్మించడానికి దేశవ్యాప్తంగా నిర్వహించిన అనేక కసరత్తులలో ఇది ఒకటి. అందులో భాగంగానే ఈ బామ్మ సైనికి బెటాలియన్లోకి చేరి సైనిక కసరత్తులు నేర్చుకుంటోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ఆన్లైన్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఆమెను హీరో అంటూ ప్రశంసంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. Ukrainian great grandmother, Valentina Constantinovska, on an Ak-47, training to defend against a possible Russian attack. “Your mother would do it too,” she told me. pic.twitter.com/PnojqRir4K — Richard Engel (@RichardEngel) February 13, 2022 -
తన గారాలపట్టి లేదని తెలిసి ఆ అవ్వ గుండె ఆగింది
గడివేముల (కర్నూలు): మనవరాలంటే ఆ అవ్వకు పంచ ప్రాణాలు.. మనవరాలికి కూడా అవ్వపై ఎనలేని ప్రేమ.. ఆ ఇద్దరు ఒకరిపై ఒకరు పెంచుకున్న ప్రేమాభిమానాలు మృత్యువులోనూ తొలిగిపోలేదు. మనవరాలు పాముకాటుకు గురై ఈ లోకం వీడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన అవ్వ.. ఆ మరణవార్త వినగానే తట్టుకోలేక పోయింది. చిన్నప్పుడు తాను ఎత్తుకు పెంచిన మనవరాలు కాస్త వయసొచ్చాక జేజీ.... ఏమైందంటూ బాగోగులు చూస్తూ వచ్చేది. వృద్ధాప్యంలో ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ దగ్గరుండి చూసుకునేది. ఆకలేస్తే అన్నం, జబ్బు చేస్తే మందులు ఇలా మలిదశలో జేజిని అన్ని విధాలా చూసుకునేది. చదవండి: (లాడ్జికి రావాలని ఒకర్ని.. ఇంట్లో ఎవరూ లేకుంటే వచ్చేస్తా అని మరొకర్ని..) వారం రోజుల క్రితం కూలీ పనులకు వెళ్లిన మనవరాలు పాముకాటుకు గురై మంగళవారం చనిపోయిందని తెలుసుకున్న అవ్వకు లోకం శూన్యంగా మారింది. 17 ఏళ్లుగా మనవరాలి ప్రేమ నిండిన ఆమె ఇక తన గారాలపట్టి లేదని తెలిసి ఆ అవ్వ గుండె ఆగిపోయింది. ఇద్దరి మరణం ఏకకాలంలో సంభవించడంతో ఆ గ్రామ వాసులు హృదయ విదారకంగా ఈ సంఘటన గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ ఘటన గడివేముల మండలం బిలకలగూడూరులో జరిగింది. గ్రామానికి చెందిన కాటెపోగు వెంకటసుబ్బయ్య, వెంకటలక్ష్మమ్మలకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరిలో చివరి సంతానమైన రాణెమ్మ (17) తల్లిదండ్రులతో పాటు కూలీ పనులకు వెళుతుండేది. రాణెమ్మ వారం రోజుల క్రితం మినుము పంటలో కలుపు తీసేందుకు పొలం పనులకు వెళ్లింది. అక్కడ పాముకాటుకు గురైంది. చదవండి: (రెండో పెళ్లి.. భార్య విలాసాలు తీర్చలేక..) విషయం తెలుసుకున్న తోటి కూలీ మిత్రులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం నంద్యాల ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రాణెమ్మ కోలుకోలేక మృతి చెందింది. మనవరాలి మృతి వార్త విన్న రాణెమ్మ జేజమ్మ వెంకటలక్ష్మమ్మ (72) వెంటనే ఓయమ్మా.. అంటూ కుప్పకూలి ప్రాణాలు విడిచింది. జేజి, మనవరాలు ఇద్దరూ ఒకేరోజు నిమిషాల వ్యవధిలో మృత్యుపాలైన విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఇద్దరి మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. -
అందాల పోటీలు.. 10 మందిని వెనక్కి నెట్టి విజేతగా 86 ఏళ్ల బామ్మ
జెరూసలేం: అలనాటి నాజీ మారణహోమం భయాందోళనలను భరిస్తూ జీవనం సాగించిన మహిళలను గౌరవించే నిమిత్తం రూపొందించిన వార్షిక ఇజ్రాయెల్ అందాల పోటీల్లో 86 ఏళ్ల బామ్మ కుకా పాల్మోన్ విజేతగా నిలిచి "మిస్ హోలోకాస్ట్ సర్వైవర్" కిరీటాన్ని గెలిపొందారు. ఈ మేరకు జెరూసలేంలోని ఒక మ్యూజియంలో ఈ పోటీలు నిర్వహించారు. అయితే ఈ పోటీల్లో సుమారు 10 మంది 79 నుంచి 90 సంవత్సరాల వయసు ఉన్న బామ్మలు మంచి హెయిర్ స్టైల్, మేకప్ వేసుకుని గౌనులాంటి చీరలను ధరించి క్యాట్వ్యాక్తో సందడి చేశారు. (చదవండి: వామ్మో! మొసలిని కౌగలింతలతో ఎలా ఉక్కిరిబిక్కిరి చేసేస్తోందో!!) ఈ మేరకు కుకా పాల్మోన్ మాట్లాడుతూ.."హోలోకాస్ట్‌లో గడిపిన తర్వాత నేను నా కుటుంబసభ్యులతో కలిసి జీవిస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, నలుగురు మనవరాళ్ళు, ఇద్దరు ముని మనవరాళ్ళు ఉన్నారు. పైగా నేను ఇక్కడకు వచ్చి పాల్గొంటానని కలలో కూడా అనుకోలేదు. ఈ వయసులో విజేతగా నిలిచి ఈ కిరిటాన్ని గెలుచకోవడం అద్భతమైన విషయం వర్ణించలేనిది". అంటూ చెప్పుకొచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో అప్పటి నాజీల మారణహోమం కారణంగా ఇజ్రాయెల్ పెద్ద సంఖ్యలో యువతను కోల్పోయింది. అప్పటి భయానక పరిస్థితులను భరిస్తూ ప్రాణాలతో బయటపడిన అతి కొద్ది మంది యూదు మహిళలను గౌరవించే నిమిత్తం ఈ అందాల పోటీలు ఎంతగానో దోహదపడతాయని ఇజ్రాయెల్ అందాల పోటీ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మేరకు కరోనా మహమ్మారి దృష్ట్యా గతేడాది నిర్వహించ లేకపోయినట్లు తెలిపారు. (చదవండి: ఇదే ఆఖరి రోజు!.. బతికే ఉన్నందుకు కృతజ్ఞతలు..) -
వైరల్: తొలిసారి పిజ్జా తిన్న బామ్మ.. ‘అబ్బే బాలేదురా మనవడా’..
పిజ్జా.. ఈ పేరు వింటేనే భోజన ప్రియులకు నోరూరుతుంది. క్యాప్సికమ్, టమోటా, ఉల్లిపాయ ముక్కలు, చీజ్‌తో టాపింగ్ చేసే ఇటాలియన్ వంటకం పిజ్జాను ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు. ఆన్లైన్ ఫుడ్ యాప్‌లు వచ్చి తర్వాత చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఘుమఘుమలాడే పిజ్జా నేరుగా ఇంటికే వచ్చేస్తోంది. వెజ్, నాన్‌వెజ్ అంటూ చిన్న నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. చదవండి: మట్టి ముంతలో స్పెషల్ పిజ్జా.. నెటిజన్లకు నోరూరిస్తోంది తాజాగా ఓ బామ్మ తొలిసారి పిజ్జాను రుచి చూసింది. దీనిని ఆమె మనవడు గ్రీష్ భట్ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఇంకేముంది ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో.. బామ్మ పిజ్జాలోని ఒక ముక్కను తీసుకొని తింటుంది. అయితే అది ఆమెకు అంతగా నచ్చలేదేమో.. వెంటనే అదో రకంగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ముసిమసిగా నవ్వుతుంది. ‘మొదటిసారి పిజ్జా తింటున్న నాన్నమ్మ రియాక్షన్’ అనే క్యాప్షన్‌తో ఫేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే లక్షల వ్యూవ్స్ సంపాదించింది. పిజ్జా రుచి చూసిన ఆ భామ్మ ఇచ్చిన హవభావాలు ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి. ‘అయ్యో బామ్మకు పిజ్జా నచ్చలేదనుకుంటా.. ఆమె రియాక్షన్ చూస్తుంటే అబ్బే బాలేదురా మనువడా.. ఎలా తింటారు దీన్ని.. అనేలా ఉంది. పిజ్జా తినేప్పుడు నాని చూపించిన ఎక్స్ప్రెషన్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి’. అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి మీరు కూడా చూసేయండి. View this post on Instagram A post shared by Greeshbhatt (@greesh_bhatt_) -
అమ్మమ్మ మందలించిందని..చెన్నైలో అదృశ్యం.. రేణిగుంటలో ప్రత్యక్షం
సాక్షి, రేణిగుంట: అమ్మమ్మ మందలించిందని ఓ మనవరాలు ఇంటి నుంచి అదృశ్యమైంది. ఎక్కడెక్కడో తిరిగి చివరికి రేణిగుంటకు చేరింది. అదృష్టవశాత్తు సీఐ అంజూయాదవ్ దృష్టికి రావడంతో వ్యవహారం సుఖాంతమైంది. కుటుంబ సభ్యుల దరికి చేరింది. శనివారం రాత్రి సీఐ తెలిపిన వివరాలు.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన యువతి(18) చెన్నైలో చదువుతోంది. అక్కడే అమ్మమ్మ ఇంటిలో ఉంటోంది. ఆమె తల్లి ఓ ప్రైవేటు స్కూలులో టీచర్‌గా పనిచేస్తోంది. చదువుల పరంగా వెనుకబడిపోతున్నావని అమ్మమ్మ ఇటీవల మందలించడంతో ఇంటి నుంచి పారిపోయింది. ఈమేరకు చెన్నైలో మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. చెన్నై నుంచి గుంటూరు ఇతర ప్రాంతాలకు వెళ్లిన యువతి శనివారం రేణిగుంటలో ప్రత్యక్షమైంది. ఆమె అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో ఆటోడ్రైవర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ ఆ యువతిని తన వెంట స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఒకింత బెరుకు, భయంతో ఉన్న విద్యార్థినికి తొలుత అల్పాహారం తెప్పించి పెట్టారు. ఆ తర్వాత అనునయించి మాట్లాడితే విషయం చెప్పింది. ఇలా చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి వచ్చేస్తే కుటుంబ సభ్యులు ఎంతగా టెన్షన్ పడతారో..ఆలోచించావా తల్లీ? అంటూ బుజ్జగించారు. చదవండి: (చిరునవ్వుతో భర్తకు ఎదురెళ్లింది.. ఏమైందో తెలియదు.. కొద్ది నిమిషాల్లోనే..) కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఆ విద్యార్థి వద్ద ఉన్న ఐడీ కార్డును చూసి ఎక్కడ చదువుతోందో తెలుసుకున్నారు. ఆ విద్యార్థిని తల్లి, అమ్మమ్మతో తన ఫోన్ నుంచి మాట్లాడించారు. అంతే! ఉరుకులు పరుగులతో ఆ విద్యార్థిని తల్లి తన కుమారుడితో వచ్చి శనివారం రాత్రి సీఐను కలిసింది. కుమార్తెను చూడగానో భావోద్వేగంతో కదలిపోయింది. అప్పటివరకు పడిన టెన్షన్ ఎగిరిపోయిందేమో..! కళ్ల నుంచి రాలుతున్న ఆనందభాష్పాల నడుమ కుమార్తెను హత్తుకుంది. పోలీసుల మోముల్లో నవ్వులు పూశాయి. -
ఇల్లరికం వెళ్లిన అల్లుడు అమ్మమ్మ ఊరికి వచ్చి శవమయ్యాడు
హన్వాడ: అమ్మమ్మ ఊరికి వచ్చిన యువకుడు బావిలో పడి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని ఏనమీదితండా సమీపంలో చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మదాబాద్ మండల కేంద్రానికి చెందిన శివకృష్ణ (29)కు నారాయణపేట జిల్లా కోస్గికి చెందిన అరుణకు మూడేళ్ల కిందట వివాహమైంది. శివకృష్ణ ఇల్లరికం వెళ్లాడు. చదవండి: ‘స్త్రీలను కాదు.. రోడ్డు చూసి బండి నడుపు’ పోలీసుల హెచ్చరిక వైరల్ ఈక్రమంలోనే భార్య అరుణతో తరచూ గొడవలు జరిగేవి. శివకృష్ణ అప్పుడప్పుడు స్వగ్రామం మహమ్మదాబాద్, అమ్మమ్మ వారి గ్రామం ఏనమీదితండాకు వచ్చివెళ్లేవాడు. గత శనివారం కూడా కోస్గి నుంచి నేరుగా అమ్మమ్మ ఇంటికి (ఏనమీదితాండ) వచ్చిన శివకృష్ణ అదేరోజు ఇంటి నుంచి ఎవ్వరికీ చెప్పకుండా గ్రామ సమీపంలో దొడ్డుకుంటోని బావిలో పడి మృత్యువాతపడ్డాడు. బుధవారం మృతదేహం బావిలో తేలడంతో స్థానికులు గమనించి బయటికి తీశారు. ఈ సమాచారం తెలుసుకున్న హన్వాడ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి శవపంచనామా చేశారు. జిల్లా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. మేనమామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని హన్వాడ పోలీసులు తెలిపారు. చదవండి: సిరిసిల్ల జిల్లా అరుదైన ఫీట్: సంతోషంలో కేటీఆర్ -
పియానో బామ్మ కొత్త ఆల్బమ్.. 107లో సిక్సర్
వయసు ఏడుపదులు దాటిందంటే చాలామందికి అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టమే అవుతుంటుంది. కొంతమంది మాత్రం ఆరోగ్యవంతమైన జీవనశైలితో హుషారుగా కనిపిస్తారు. ఫ్రెంచి దేశానికి చెందిన కొలెట్ట్ మేజ్ వయసు సెంచరీ దాటి ఏడేళ్లు అయ్యింది. అయినా పియానోపై రాగాలు పలికించడమే గాక ఏకంగా కొత్త ఆల్బమ్‌ను విడుదలచేసింది. 107 ఏళ్ల వయసులో డెబ్భై ఏళ్లకు పైబడ్డ కొడుకుతో కలిసి ఈ ఆల్బమ్‌ను విడుదల చేసింది కొలెట్ట్. 1914 జూన్ 16 న ఫ్రెంచ్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది కొలెట్ట్ మేజ్. నాలుగేళ్ల వయసులో ఒకరోజు కొలెట్ట్ వాళ్లింటికి పక్కింటి పిల్లలు వచ్చి పియానో వాయించడం ఆమె వినింది. అప్పటినుంచి ఆమెకు పియోను వాయించాలన్న ఆసక్తి కలిగింది. దీంతో చిన్నతనంలో బాగా సంగీతం, పియానో వాయిస్తూ అదే లోకంగా గడిపేది. మ్యూజిక్ కోర్సు చేస్తానని తల్లిదండ్రులకు చెప్పింది. కానీ వద్దని వారించారు. అయినప్పటికీ కొలెట్ట్ ఎలాగైనా పియానో వాద్యకారిణి కావాలనుకుని..15 ఏళ్ల వయసులో మ్యూజిక్ స్కూలులో పియానో నేర్చుకుని 16వ ఏట పియానో టీచర్‌గా చేరింది. అప్పటి నుంచి అనేక ఏళ్లపాటు పియానో టీచర్‌గా పనిచేసింది. ఆ తర్వాత కూడా కొలెట్ట్ పియానో వదల్లేదు. ఆరో ఆల్బమ్.. షూమాన్, క్లాడ్ డెబస్సీ మ్యూజిక్‌ను ఇష్టపడే కొలెట్. 84 ఏళ్ల వయసులో తొలిసారి ఆల్బమ్ విడుదల చేసిన కొలెట్ట్. తాజాగా 107 ఏళ్ల వయసులో ఆరో ఆల్బమ్‌ను విడుదల చేసింది. గత పదిహేనేళ్లుగా రోజుకి ఎనిమిది గంటలు పియానో వాయించి వాటిని రికార్డు చేసి, సౌండ్ ఇంజినీర్ సాయంతో ఆల్బమ్‌లుగా మారుస్తోంది. ఇంతటి వృద్ధాప్యంలోనూ.. ఆమె ఎంతో యాక్టివ్‌గా ఉంటూ పియానో పై కీస్ ను ప్రెస్‌చేస్తూ సుమధుర సంగీతాన్ని అందిస్తోంది. పియానో వాయించడం ద్వారా తనని తాను బిజీగా ఉంచుకుంటుంది. సలాడ్ కన్నా ఆత్మీయ ఆహారం ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వాద్యకారిణిగా పేరొందిన కొలెట్ట్ మేజ్... సలాడ్ తినడానికి పడే కష్టం కంటే పియానోను వాయించడం తేలిక అని చెబుతున్నారు. ‘‘సంగీతం అనేది చాలా ప్రభావ వంతమైన, భావోద్వేగాలతో కూడుకున్న మాధ్యమం. ప్రకృతి, భావోద్వేగాలు, ప్రేమ, కలలు, ఆశలు వంటి వాటన్నింటికి సంగీతమే ఆత్మీయ ఆహారంగా పనిచేస్తుంది. అందుకే నేను మ్యూజిక్‌ను కంపోజ్ చేయడానికి ఇష్టపడతాను’’ అని చెబుతోంది నవ్వుతూ. -
యాంకర్ శ్రీముఖి ఇంట తీవ్ర విషాదం.. ఎమోషనల్ అయిన ‘రాములమ్మ’
యాంకర్ శ్రీముఖి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సోమవారం శ్రీముఖి అమ్మమ్మ కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ శ్రీముఖి ఎమోషనల్ అయింది. ‘అమ్మమ్మ అంటే నాకు ఇష్టం. జీవితంలో చాలా విషయాలను తన నాకు చెప్పింది. ఎప్పుడూ హుషారుగా ఉండేది. అందరికి సంతోషాన్ని పంచేది. ఎల్లప్పుడూ సంతోషాన్ని అందరికీ పంచేది. ఆమె చాలా ధైర్య వంతురాలు. జీవితంలో నువ్వు ఇచ్చిన ప్రతి దానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎప్పుటికీ నిన్ను గుర్తు పెట్టుకుంటాను అమ్మమ్మ ’అంటూ ఎమోషనల్ అయింది యాంకర్ శ్రీ ముఖి. ఇక శ్రీముఖి అమ్మమ్మ మరణానికి సంతాపం తెలుపుతూ పలువురు ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు. ఇక శ్రీముఖి విషయానికొస్తే.. యాంకర్‌గా, నటిగా తనదైన మాటతీరులో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. బుల్లి తెరపై పలు షోలకు యాంకర్‌గా చేస్తూనే.. అప్పుడప్పుడు వెండితెరపై మెరుస్తోంది. ఇటీవల ఆమె ‘క్రేజీ అంకుల్స్’మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోయింది View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
పదే పదే తిడుతున్నారని గుడిసెకు నిప్పు.. సజీవ దహనం
సాక్షి, చెన్నై: పదేపదే తిడుతున్నారంటూ 16 ఏళ్ల బాలుడు అవ్వా, తాతపై కోపం పెంచుకున్నాడు. అర్ధరాత్రి గాఢనిద్రలో ఉన్న వారిద్దరినీ సజీవ దహనం చేశాడు. వివరాలు.. సేలం జిల్లా ఆత్తూరు సమీపంలో కొత్తంపాడి గ్రామం భారతీ నగర్‌కు చెందిన కాటురాజా(75) రైతు. ఆయనకు భార్య కాశిఅమ్మాల్(65)తో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిలో రెండో కుమారుడైన కుమార్ కుటుంబం తల్లిదండ్రుల పంట పొలంలోని గుడిసెకు పక్కనే మరో ఇంట్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం వేకువజామున కాటురాజా, కాశిఅమ్మాల్ నిద్రిస్తున్న గుడిసె తగల బడింది. కుమార్‌తో పాటుగా, పరిసర వాసులు ఆర్పేందుకు యత్నించారు. అగ్నిమాపక సిబ్బంది అర్ధగంట శ్రమించి మంటల్ని అదుపు చేశారు. లోనికి వెళ్లి చూడగా, ఆ దంపతులు సజీవ దహనం కావడంతో మృతదేహాల్ని పోస్టుమారా్టనికి తరలించారు. డీఎస్పీ ఇమాన్ వేల్ జ్ఞానశేఖరన్ తొలుత ప్రమాదంగా భావించినా, గుడిసెకు బయట గడియ పెట్టి ఉండడంతో కొడుకులను అనుమానించారు. అదే సమయంలో కుమార్ తనయుడు (16) పోలీసుల్ని చూసి భయపడడంతో అతడ్ని తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో తానే ఆ గుడిసెకు నిప్పు పెట్టినట్టు అతడు అంగీకరించాడు. పదేపదే తనను అవ్వా, తాత తిడుతుండడంతోనే ఆగ్రహించి ఈ ఘాతకానికి ఒడి గట్టిన ట్లు ఆ బాలుడు వెల్లడించాడు. దీంతో ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సుడిగాలి సుధీర్ ఇంట్లో విషాదం
Coronavirus: కరోనా సెకండ్ వేవ్ దేశ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. రోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ఎవరిని వదలడం లేదు ఈ ప్రాణాంతక మహమ్మారి. వందలాది సినీ ప్రముఖులను పొట్టన పెట్టుకుంది. టాలీవుడ్ నటులు, దర్శకులు, రచయితలు ఇలా చాలా మందిని ఈ మహమ్మారి బలి తీసుకుంది. తాజాగా కమెడియన్ సుడిగాలి సుధీర్ ఇంట్లో విషాదాన్ని నింపింది. కరోనాతో ఇటీవల సుడిగాలి సుధీర్ అమ్మమ్మ మృతి చెందింది. ఈ విషయాన్ని ఓ కామెడీ షోలో ఆటో రాంప్రసాద్ వెల్లడించాడు. అమ్మమ్మ చనిపోయినా సుధీర్ వెల్లలేకపోయాడని, చివరి చూపులు కూడా దక్కలేదని రాంప్రసాద్ తెలిపాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న సుధీర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
అమ్మమ్మా.. హాస్పిటల్‌కు వచ్చేశాం... అంతలోనే!
సాక్షి, హిమాయత్‌నగర్: ‘అమ్మమ్మా.. హాస్పిటల్‌కు వచ్చేశాం.. నీకేం కాదు. ఇక్కడ నీకు నేనే దగ్గరుండి వైద్యం చేపిస్తా. నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు. నువ్వు ధైర్యంగా ఉండు అమ్మమ్మా.. అంటూ తన ఒడిలో పడుకోబెట్టుకున్న అమ్మమ్మకు భరోసా ఇచ్చింది ఓ వైద్యురాలు. ‘పై ఫొటోలో కనిపిస్తున్న వైద్యురాలి పేరు డాక్టర్ హిమజ. అమీర్‌పేటలోని నేచుర్‌క్యూర్ ఆస్పత్రిలో వైద్యురాలు. ఎందరో కోవిడ్ బాధితులను రక్షించింది. కూకట్‌పల్లిలో నివాసం ఉండే తన అమ్మమ్మ మీనాక్షి(62) తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో.. మంగళవారం ఉదయం 11.40గంటల సమయంలో కింగ్‌కోఠి ఆస్పత్రికి తానే ఆటోలో తీసుకొచ్చింది. అడ్మిషన్‌కు లోపల ఆలస్యం అవుతోంది.. బయటేమో మీనాక్షి పల్స్ రేటు పడిపోతోంది. 15 నిమిషాల తర్వాత బయటే ఉన్న ఆక్సిజన్ కాన్సండ్రేటర్ నుంచి మీనాక్షికి ఆక్సిజన్ పెట్టారు. డాక్టర్ హిమజ లోనికి వెళ్లి అడ్మిషన్‌కు సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్ రూమ్ వద్ద చెప్పి స్లిప్ తీసుకున్నారు. అడ్మిషన్ ప్రక్రియ చేసే సిబ్బంది వద్దకు వచ్చి ఆ స్లిప్‌ను ఇచ్చారు. అప్పుడు సిబ్బంది వచ్చి ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ చూడగా.. 42కంటే తక్కువగా ఉన్నాయి. ఎమర్జెన్సీ కేసు కాబట్టి గాంధీ లేదా ఉస్మానియాకు వెళ్లండన్నారు. గాంధీలో బెడ్స్‌లేని కారణంగా ఉస్మానియాకు రాయించుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రి లోపలికి వెళ్లగానే డాక్టర్ హిమజ చేతిలోనే ఆమె తుదిశ్వాస విడిచింది. ఆక్సిజన్ అందిస్తూ.. డాక్టర్ అయ్యుండి కూడా.. నేను ఒక డాక్టర్ అయ్యుండి కూడా నాకెంతో ఇష్టమైన అమ్మమ్మను రక్షించుకోలేకపోయాను అంటూ కన్నీటిపర్యంతమైయ్యింది డాక్టర్ హిమజ. అమ్మమ్మ బతుకుతుందనే ధైర్యంతో ఇంటిల్లిపాదికి ధైర్యాన్ని నూరిపోశాను. ఓ పక్క అడ్మిషన్‌కు ఆలస్యం.. మరో పక్క ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ తగ్గిపోవడంతో.. నా చేతిలోనే చనిపోయిందంటూ ‘సాక్షి’తో బోరున విలపించింది. చదవండి: Lockdown: సిటీలో ‘పరిధి’ దాటొద్దు! -
అవ్వను కడతేర్చిన మనుమడు
సాక్షి, చెన్నై: ఈరోడ్ సమీపంలో మద్యానికి డబ్బు ఇవ్వలేదని మంగళవారం అవ్వను మనుమడు హతమార్చాడు. ఈరోడ్ జిల్లా, అవల్‌పూందురై భారతివీధికి చెందిన ముత్తుస్వామి, జల్విన్‌మేరి కుమార్తె భారతివెన్నిలా, కుమారుడు పూవిళిసెల్వన్ (33). భారతివెన్నిలాకు వివాహమై విడిగా ఉంటున్నారు. పూవిళిసెల్వన్ భార్య షర్మిలా (35). ఒక కుమార్తె ఉన్నారు. పూవిళిసెల్వన్‌కు రెండేళ్లుగా మానసిక స్థితి సరిలేదు.ఇలావుండగా షర్మిల, భర్త, కుమార్తెతో కోవైలోని పుట్టింటికి వెళ్లింది.ఆ తర్వాత మంగళవారం అవల్‌పూందురైకు వచ్చిన పూవిళిసెల్వన్ మద్యానికి డబ్బులివ్వాలంటూ తల్లి జల్విన్‌మేరీతో గొడవ పడ్డాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో ఇంట్లో నిద్రిస్తున్న 95 ఏళ్ల అవ్వను కత్తితో పొడిచి హతమార్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అరచ్చలూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ఒబామా కుటుంబంలో విషాదం
నైరోబీ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన నాన్నమ్మ(వరసకు) సారా ఒబామా సోమవారం కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అమె కెన్యాలో తన 99 ఏట మరణించారు. నాన్నమ్మ మరణంపై ఒబామా తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘‘ ఇది నిజం.. ఆమె దేవుడి దగ్గరకు వెళ్లింది. ఈ ఉదయం ఆమె చనిపోయింది’’ అని ఆమె కూతురు మర్శత్ ఓన్యాంగో భావోద్వేగానికి గురయ్యారు. సారా ఒబామా 1922లో లేక్ విక్టోరియాలో జన్మించారు. బరాక్ ఒబామా తాత గారు హుస్సేన్ ఓన్యాంగో ఒబామా మూడో భార్య ఈ సారా ఒబామా. సారా ఒబామా ఫౌండేషన్ పేరిట ఆమె అనాథ పిల్లలకు అన్ని వసతులు కల్పిస్తున్నారు. రక్త సంబంధం లేకపోయినప్పటికి ఒబామా ఆమెను చాలా ఆప్యాయంగా చూసుకునేవారు. 2006లో కెన్యా వెళ్లిన ఆయన సారా ఇంటికి వెళ్లారు. ఆమెను తన బామ్మ అంటూ అందరికీ పరిచయం చేశారు. ఆ తర్వాతే ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. కాగా, మంగళవారం ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. -
తీవ్ర విషాదం.. పూజా హెగ్డే ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన పూజా హెగ్డే ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తాను ఎంతగానో ప్రేమించే బామ్మను కోల్పోయినట్లు తెలిపింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె అమ్మమ్మ ఫోటోను షేర్ చేస్తూ..'ఈ క్యూటీని మేం కోల్పోయాం. ఎన్ని కష్టాలు ఉన్నా నువ్వుతూనే ముందుకు సాగాలని ఆమె మాకు నేర్పింది. భౌతికంగా తను దూరమైనా, ఎప్పటికీ మాతోనే ఉంటుంది. లైఫ్‌లో కావాల్సిన వాళ్ల కోసం ఈగోలను పక్కన పెట్టడం ఎలానో నేర్పించింది. షూటింగ్ సమయంలో ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? మధ్యాహ్నం భోజనం తిన్నావా అంటూ అడిగేదానివి. నీ ఫోన్ కాల్స్ మిస్ అవుతాను..లవ్యూ ఆజీ' అంటూ ఎమోషనల్ అయ్యింది. కెరీర్ మొదట్లో అపజయాలు ఎదురైన సమయంలో ఫ్యామిలీ సపోర్ట్ తనకు ఎక్కువగా ఉందని పలుసార్లు చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగు, హిందీ సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. తెలుగులో ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్ (ఈ చిత్రాన్ని హిందీలోనూ తెరకెక్కిస్తున్నారు) అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హిందీలో సల్మాన్ ఖాన్ తో ‘కభీ ఈద్ కభీ దీవాలి’, రణ్వీర్ సింగ్‌తో ‘సర్కస్’ సినిమాల్లో నటిస్తున్న ఈ భామ.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో గెస్ట్‌రోల్ పోషించనుంది. చదవండి : (ముంబైలో ఇల్లు కొన్న బుట్టబొమ్మ) (అనురాగ్ కశ్యప్, తాప్సీ నివాసాలపై ఐటీ దాడులు) -
వడ్డీ అడిగినందుకు దారుణం
చెన్నై: తెన్‌కాశిలో అదృశ్యమైన అవ్వ, మనుమరాలు హత్యకు గురయ్యారు. వీరి మృతదేహాలు శుక్రవారం గోనెసంచిలో లభ్యమయ్యాయి. మదురై కోర్టు ఉత్తర్వులతో ఈ సంఘటనలో మిస్టరీ వీడింది. తెన్కాశి కీళపులియూరుకు చెందిన ఉచ్చిమాగాళి భార్య గోమతి (55). ఈమె కుమార్తె సీతాలక్ష్మి (25). అల్లుడు మురుగన్ (31) సైన్యంలో పనిచేస్తున్నాడు. వీరి కుమారుడు మనీష్ (6), కుమార్తె ఉత్తర అలియాస్ సాక్షి (1) మనుమరాలు ఉత్తరను గోమతి అమ్మాళ్ పెంచుకుంటూ వచ్చింది. గత జనవరి 12 నుంచి గోమతి అమ్మాళ్, ఉత్తర కనిపించలేదు. కశ్మీర్లో పనిచేస్తున్న అల్లుడు మురుగన్ ఇంటికి చేరుకుని కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు అవ్వ, మనుమరాలి ఆచూకీ కనుగొనాలని పోలీసులను ఆదేశించింది. పోలీసులు గోమతి అమ్మాళ్ చివరిసారిగా వీరపాండియమ్మాళ్‌తో మాట్లాడిన విషయం తెలిసింది. పోలీసుల విచారణలో గోమతి అమ్మాళ్ వీరపాండియమ్మాళ్‌కు వడ్డీకి నగదు అందజేసింది. ఈ నగదు తిరిగివ్వమని కోరడంతో ఇద్దరి మధ్య తగాదా ఏర్పడింది. దీంతో వీరపాండియమ్మాళ్, గోమితి అమ్మాళ్, మనుమ రాలిని హతమార్చి మృతదేహాలను గోనెసంచిలో కట్టి తోటలో విసిరేసినట్లు తెలిసింది. పోలీసులు శుక్రవారం ఆమెను అరెస్టు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: కడుపుమీద కారు ఎక్కించి హత్య చదవండి: ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో స్కూల్ టీచర్‌పై -
ఇద్దరు పిల్లల తండ్రి.. ప్రియురాలి తల్లితో జంప్!
లండన్ : తన బిడ్డకు జన్మనిచ్చిన ప్రియురాలిని కాదని ఆమె తల్లితో పారిపోయాడో వ్యక్తి. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గ్లౌస్‌స్టర్‌షైన్‌కు చెందిన జెస్ అల్డ్రిడ్జ్ (24), అదే ప్రాంతానికి చెందిన రియాన్ షెల్టన్ (29)తో గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాడు. రియాన్‌తో పాటు ఆమె తల్లి 44 ఏళ్ల జార్జినాతోనూ సైడ్ ట్రాక్ నడిపాడు. రాత్రిళ్లు కిచెన్‌లో బకార్డి తాగుతూ ఇద్దరూ కబుర్లు చెప్పుకునేవారు. వీరి ప్రవర్తన రియాన్‌కు అనుమానాస్పదంగా తోచింది. దీంతో ఓ రోజు దీనిపై ఇద్దర్నీ నిలదీయగా.. అలాంటిదేమీ లేదని చెప్పారు. రియాన్ కడుపుతో ఉన్న సమయంలో జెస్,జార్జినాలు రహస్యంగా కలుసుకునేవారు. ఈ విషయం రియాన్‌కు తెలిసినా ఏమీ చేయలేకపోయింది. ( అత్త వివాహేతర సంబంధం.. అల్లుడు ఆత్మహత్య) జనవరి 28న జెస్,రియాన్‌ల ప్రేమకు గుర్తుగా పండంటి మొగబిడ్డ జన్మించాడు. బిడ్డ పుట్టిన కొన్ని గంటల తర్వాత జెస్‌నుంచి ఆమెకో మెసేజ్ వచ్చింది. తమ ప్రేమకు బ్రేకప్ చెబుతున్నట్లు. ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిన ఆమెకు.. జెస్, జార్జినా లేచిపోయారన్న విషయం తెలిసి షాక్ అయింది. దీనిపై రియాన్ మాట్లాడుతూ.. ‘‘ ఇది దారుణమైన వెన్నుపోటు. ఏ అమ్మమ్మ అయినా మనవడితో ప్రేమలో పడాలి.. మనవడి తండ్రితో కాదు. నాకు, నా పిల్లలకు తోడుగా ఉంటుందనుకున్నాను. కానీ, ఇలా నా ప్రియుడితో పారిపోతుందనుకోలేదు’’అని కన్నీటి పర్యంతం అయింది. -
అమ్మమ్మను కోల్పోయిన బాధలో ఉంటే.. జాతి వివక్ష వ్యాఖ్యలా..?
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తల్లి ఎలాన్ చైనా జాతీయురాలన్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల కిందట ఎలాన్ తల్లి చైనాలో మరణించారు. ఈ విషయాన్ని జ్వాల సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ట్విటర్లో తన అమ్మమ్మ మరణ వార్తను తెలుయజేస్తూ.. "చైనీస్ న్యూ ఇయర్ రోజున అమ్మమ్మ మరణించింది. అంతకుముందు అమ్మ ప్రతి నెలా చైనాకు వెళ్లి అమ్మమ్మను చూసొచ్చేది. అయితే, కోవిడ్ కారణంగా ఈ ఏడాది అమ్మ వెళ్లలేదు" అంటూ పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన కొందరు నెటిజన్లు.. చైనీస్ వైరస్ అనకుండా కోవిడ్ అని ఎందుకు అంటున్నావంటూ జ్వాలను ప్రశ్నించడం మొదలెట్టారు. దీనిపై బాధతో ఆమె స్పందిస్తూ.. ఓపక్క అమ్మమ్మను కోల్పోయిన బాధలో మేముంటే, కొందరు జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించిందన్నారు. అసలు మనం బతుకుతున్నది సమాజంలోనేనా.. అలాగైతే సానుభూతి ఎక్కడ.. మనం ఎటువైపు పయనిస్తున్నాం.. ఇది సిగ్గుపడాల్సిన విషయం అంటూ ఆమె ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు విస్మయానికి గురి చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. Ammaama passed away in China on d eve of CNY!My mom use 2 visit her every month but for past year she couldn’t because of https://t.co/pvd6Pcfvsj dis covid has made us realise how important it is 2 be in present do whatever v can for our loved ones whenever v can! Happy new year pic.twitter.com/EUyEqNDopj — Gutta Jwala (@Guttajwala) February 12, 2021 I am mourning the loss of my grand mom who passed away in China and to my surprise I get racist replies....and I am asked why I say covid and not Chinese virus.... What has happened to us as a society...where’s the empathy...where r we headed...and there r defenders?? Shameful! — Gutta Jwala (@Guttajwala) February 12, 2021 -
వ్యవసాయం పద్మశ్రీ తెస్తుందని ఊహించలేదు
కోయంబత్తూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం దక్షిణాదిలోనే మొట్ట మొదటిదన్న విషయం తెలిసిందే. దీనికున్న మరో విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సి ఉంది. అదేమిటంటే.. ఈ విద్యాసంస్థ ఏభయ్యేళ్ల క్రితం నుంచే ‘రైతులకు సేంద్రియ వ్యవసాయా’న్ని నేర్పిస్తూ ఉంది! అందుకు ప్రత్యక్ష నిదర్శనం 104 ఏళ్ల పాపమ్మాళ్!! రసాయనిక రైతుగా 30 ఏళ్ల వ్యవసాయానుభవం తర్వాత.. 50 ఏళ్ల క్రితం.. కోయంబత్తూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ‘సేంద్రియ వ్యవసాయం’ నేర్చుకున్నారు. అనుదినం తానే నడుము వంచి పొలం పనులు చేసుకుంటున్న ఈ ‘మహా రైతమ్మ’ను పద్మశ్రీ పురస్కారం వరించింది.ఆమెను ‘సాక్షి’ పలుకరించింది.. తోట పనిలో పాపమ్మాళ్ మీరు వ్యవసాయంలోకి మీరెలా వచ్చారు? పొట్ట కూటి కోసం ఎంతకష్టమైనా పడకతప్పదు. 1914లో పుట్టాను. చిన్నప్పుడే అమ్మానాన్న చనిపోయారు. వారు నడిపే టీ బంకు మూతపడటంతో చెల్లితో కలిసి నానమ్మ దగ్గరకు చేరుకున్నాను. నానమ్మది కూడా ఫలసరుకుల దుకాణం పెట్టుకుని జీవితాన్ని నెట్టుకొచ్చే పేద కుటుంబం కావడంతో.. ఆమెకు సహకరిస్తూ రెండో క్లాసులోనే చదువు మానేశాను. 20 ఏళ్లకే పెళ్లయింది. పదేళ్ల క్రితం భర్త చనిపోయాడు. పిల్లలు లేకపోవడంతో సోదరి పిల్లలనే నా పిల్లలుగా చేరదీశాను. పొదుపు చేసిన సొమ్ముతో పది ఎకరాలు కొని సాగులోకి దిగాను. తదనంతరం కుటుంబ అవసరాల కోసం 7.5 ఎకరాలు అమ్మివేశాను. 2.5 ఎకరాల పొలంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా. ప్రస్తుతం అరటి పంట పెట్టా. సేంద్రియ సాగు ఎప్పటి నుంచి..? తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం సలహా బృందంలో సభ్యురాలిగా ఉన్నాను. ఆ సమావేశాలకు హాజరైనపుడు సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకున్నాను. ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేసే రసాయన ఎరువులు, పురుగుమందులతో ఇన్నాళ్లూ సేద్యం చేశానా? అని బాధపడ్డాను. సేంద్రియ వ్యవసాయంలోకి మారి 50 ఏళ్లు గడిచింది. దేశవాళీ విత్తనాలు సేకరించేదాన్ని. జొన్న వంటి చిరుధాన్యాలు, కూరగాయలు, కందులు పండించే దాన్ని. ఇపుడు అరటి సాగు చేస్తున్నా. సేంద్రియ వ్యవసాయంలో మీ ప్రత్యేకత ఏమిటి? ఆవు పేడ, మూత్రం, గడ్డి, బెల్లం మిశ్రమాలను వాడతాను. ఆవు పేడ, లవంగాలు, ఉప్పును ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి పొలంలోని భూమిలో పాతి పెడతాను. 15 రోజులకు ఒకసారి మూత తీసి ఆ మిశ్రమాన్ని కలియబెడతాను. 2 నెలల తరువాత బయటకు తీసి మొక్కల పాదుల్లో చల్లుతాను. వేపాకును ఎండ బెట్టి పొడి చేసి, వెల్లుల్లి పొడి, నీటితో కలిపి ద్రావణం తయారు చేసుకొని పంటలపై చల్లితే పురుగు పట్టదు. సేంద్రియ రైతుగా మీ అనుభూతి ఎలా ఉంది? ఆరోగ్యకరమైన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తేవడంలో ఎంతో ఆనందం ఉంది. సేంద్రియ వ్యవసాయం అనేది ఒక రకంగా సమాజ సేవ. రసాయనాలతో ఆహార పంటల సాగును పూర్తిగా మాన్పించాలి. సేంద్రియ సాగులోని బాగు గురించి భావితరాలకు అవగాహన కల్పించాలి. పద్మశ్రీ అవార్డుకు ఎంపికవ్వటం ఎలా అనిపిస్తోంది? పొట్ట గడవటం కోసం నా మానాన నేను చేసుకుంటున్న సేంద్రియ వ్యవసాయం పద్మశ్రీ అవార్డుకు తెచ్చి పెడుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. అసలు పద్మశ్రీ అవార్డు అనేది ఒకటి ఉందని కూడా నాకు తెలియదు. కేంద్ర ప్రభుత్వం నాకు పద్మశ్రీ ప్రకటించగానే మారుమూల గ్రామంలో ఉంటున్న నా వద్దకు ప్రజలు, బంధువులు, ముఖ్యంగా విలేకరులు తండోపతండాలుగా రావడం ప్రారంభించారు. ఈ హడావిడితోనే పద్మశ్రీ అవార్డు గొప్పతనం గురించి తెలిసింది. ఈ గుర్తింపు, గౌరవం నాకు కాదు సేంద్రియ వ్యవసాయానికే అని భావిస్తున్నాను. మీ ఆరోగ్య రహస్యం ఏమిటి? తెల్లవారుజామునే లేచి ఇప్పటికీ వేప పుల్లతోనే పళ్లు తోముతాను. కాలకృత్యాలు ముగించుకుని (టీ, కాఫీ తాగను) ఒక చెంబు నిండా గోరువెచ్చని నీళ్లు, రాగి గంజి తాగుతాను. ఎప్పుడైనా చికెన్ సూప్ సేవిస్తాను. అరటి ఆకులోనే భోజనం చేస్తాను. ఆకుకూరలు, ఆకుపచ్చని కూరగాయలతోనే నా భోజనం. మటన్ బిర్యానీ అంటే ఇష్టం. ఎప్పుడైనా కొద్దిగా తింటాను. ఉదయం 5.30–6 గంటల కల్లా చేలో ఉంటాను. కూలీలను పెట్టుకుంటే వారికి 10 గంటలకు కాఫీ లేదా కొబ్బరి బొండాం, సాయంత్రం మళ్లీ ఏదో ఒకటి తినడానికి ఇవ్వాలి. ఆ ఖర్చు భరించే స్థోమత నాకు లేదు. అందుకే నాటి నుంచి నేటి వరకు నేనే పొలం పని చేస్తాను. సోదరి, మనుమలు, మనుమరాళ్లు అప్పుడప్పుడూ పనిలో సాయం చేస్తారు. సాయంత్రం చీకటì పడే వరకు పొలం దగ్గరే ఉంటాను. దాదాపు 80 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా.. ఎప్పుడూ అలసి పోలేదు. నాకు 104 ఏళ్లు వచ్చాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. నిరంతరం పొలం పనులు చేయటం, ఆహారపు అలవాట్లే నా ఆరోగ్య రహస్యం అనుకుంటాను. – కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై -
ఒక్కో బొమ్మకు ఒక్కో అమ్మాయి పేరు
పిల్లల లేత మనసులను అర్థం చేసుకోవడం, తగు రీతిగా స్పందించడం కొందరికే సాధ్యమవుతుంది. ఈ యేడాది కరోనాతోపాటు దేశ విదేశాల్లోనూ ఎన్నో ఆందోళనలు కలిగించే అంశాల గురించి విన్నాం. మొన్న ఆగస్టులో లెబనాన్‌లో జరిగిన బీరుట్ పేలుడులో 200 మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఎన్నో కుటుంబాలు నిలువ నీడలేకుండా రోడ్డున పడ్డాయి. ప్రాణనష్టం, వస్తు నష్టం జరిగింది. ఆ పేలుడుకు ప్రభావితమైనవారిలో పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. వారికి ఎంతో ఇష్టమైన బొమ్మలు పేలుడులో కాలిపోవడం, మసిబారడం.. వంటివి జరిగిపోయాయి. లెబనీస్ కళాకారిణి, బామ్మ ఆ పిల్లల స్థితికి తల్లడిల్లిపోయింది. ఆ చిన్నారి మనసులకు ఉపశమనం ఇవ్వాలనే ఆలోచనతో బొమ్మలు తయారు చేయడం మొదలుపెట్టింది. సొంతంగా తన చేతులతో రంగు రంగుల బొమ్మలను తయారు చేసింది. ఒక్కో బొమ్మకు ఒక్కో అమ్మాయి పేరు పెట్టింది. అలా ఇప్పటి వరకు తాను రూపొందించిన 100 బొమ్మలను అమ్మాయిలకు అందించింది. రోజూ ఉదయాన్నే నిద్రలేచింది మొదలు పడుకునేవరకు శ్రద్ధగా బొమ్మలను తయారు చేస్తూ కూర్చుంటుంది. బొమ్మలను తయారుచేసిన బామ్మ ఫొటో సోషల్ మీడియాలో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. బామ్మ చేస్తున్న పనికి ఎంతోమంది ప్రశంసలు తెలియజేస్తున్నారు. -
ఆకాశ వీధిలో.. బామ్మ
-
ఆకాశ వీధిలో.. బామ్మ ఫిట్నెస్ మంత్ర
ఐదంతస్తుల భవనం మీద నుంచి కిందకు చూస్తేనే కళ్లు తిరుగుతాయి చాలా మందికి. కానీ, 90 ఏళ్ల ప్యాట్రిసియా బేకర్ మాత్రం తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి 15,000 అడుగుల ఎత్తు నుండి స్కైడైవింగ్ చేసింది. అలా వచ్చిన డబ్బును తన మనవడు నిర్మించే ‘స్పెషల్ నీడ్ పిల్లల’ స్కూల్‌కి, మరోటి అనాథలు ఉండే హోమ్‌కి విరాళంగా ఇవ్వడానికి కేటాయించింది. 90 ఏళ్ల వయసులో చేసిన ఈ సాహసం ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఈ బామ్మ చెబుతున్న ఫిట్నెస్ వివరాలు ఈ తరం తప్పక పాటించేవిగా ఉన్నాయి. తన ఫిట్నెస్ మంత్ర ప్రతి రోజూ ఉదయం 50 సిట్అప్స్ చేయడంతో ప్రారంభం అవడమే అంటోంది. స్కైడైవింగ్ అంటే యువత కూడా భయభ్రాంతులకు లోనవుతారు. అలాంటిది ఇగ్లండ్‌లో ఉండే ప్యాట్రిసియా బేకర్ 90 ఏళ్ల వయసులో స్కైడైవింగ్ చేసి ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఈ వృద్ధ మహిళకు 10 మంది మనవరాళ్ళు ఉన్నారు. ప్యాట్రిసియా స్కైడైవింగ్ తన అనుభవాన్ని వివరిస్తుంది’ ఇది అద్భుతమైనది. మొదటిసారి విమానంలో కూర్చున్నప్పుడు భయపడ్డాను కానీ ఇలా గాలిలో ఎగరడం మాత్రం సరదాగా ఉండేది. అయితే, ల్యాండింగ్ తరువాత, పారాచూట్ ఆగిపోయినప్పుడు కొంత భయపడ్డాను. దానికి గతంలో అయిన గాయాలు కూడా ఉన్నాయి. కానీ, ఇన్నాళ్లకు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగినందుకు సంతోషంగా ఉంది. నా భర్త నాలుగేళ్ల క్రితం నాకు దూరమయ్యాడు. అతను ఎప్పుడూ స్కైడైవింగ్ ఉత్తేజకరమైనదిగా భావించేవాడు. నా పుట్టినరోజు వేడుక ఈ ఆటతో జరుపుకోవడం ఇష్టపడేవాడు’ అని వివరించింది. ప్యాట్రిసియా కొన్నేళ్ల క్రితం హాట్ ఎయిర్ బెలూన్, పారాగ్లైడింగ్ కూడా చేసింది. కానీ 90వ పుట్టినరోజుకు మొదటిసారి స్కైడైవింగ్ చేసింది. బేకర్ వ్యక్తిగత వైద్యుడు వయస్సు ప్రకారం ఈ సాహసం చేయవద్దని సలహా ఇచ్చాడు. కానీ బేకర్ వినలేదు. డైవ్ సెంటర్లోనే తన వైద్యపరీక్షలన్నీ చేయించుకొని మరీ ఈ సాహసానికి పూనుకుంది. -
‘చిరునవ్వుతో మహమ్మారిపై విజయం’
ముంబై : కరోనా వైరస్ సోకగానే డీలా పడే వారిలో ధైర్యం నింపే ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 106 ఏళ్ల వయసులో మహమ్మారి బారినపడి వ్యాధి నుంచి వేగంగా కోలుకున్న బామ్మ ఉదంతం అందరిలో స్ఫూర్తి నింపుతోంది.థానే జిల్లాలో 106 సంవత్సరాల వృద్ధురాలు కరోనా వైరస్‌ను జయించి వైద్యులు, నర్సుల అభినందనల మధ్య ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. పదిరోజుల పాటు కోవిడ్-19కు చికిత్స పొందిన బామ్మ చిరునవ్వుతో ఆస్పత్రి నుంచి బయటకు వస్తూ తన డిశ్చార్జి సర్టిఫికెట్‌ను మీడియాకు ప్రదర్శించారు. అంతకుముందు వందేళ్లు పైబడిన మహిళను కరోనా చికిత్స అందించేందుకు పలు ఆస్పత్రులు నిరాకరించాయని, ఎట్టకేలకు ఆమె ఇప్పుడు వ్యాధిని జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతుండటం సంతోషకరమని వృద్ధురాలి కోడలు పేర్కొన్నారు. పదిరోజుల కిందట తమ అత్తగారిని కళ్యాణ్ డొంబివిలి మున్పిపల్ కార్పొరేషన్ పరిథిలోని ఓ కోవిడ్ సెంటర్లో చేర్చుకుని చికిత్స అందించడంతో ఆమె ఆరోగ్యం కుదుటపడిందని చెప్పారు. వృద్ధురాలికి మెరుగైన చికిత్స అందించి ఆమె కోలుకునేందుకు కృషి చేసిన వైద్య సిబ్బందిని కోవిడ్-19 కేంద్రాన్ని నిర్వహించే ‘ఒక రూపాయి ఆస్పత్రి’ ఎండీ డాక్టర్ రాహుల్ గులే అభినందించారు. జులై 27న తాము ఈ ఆస్పత్రిని ప్రారంభించామని, అప్పటి నుంచి 1100 మంది కోవిడ్-19 రోగులకు చికిత్స అందించామని చెప్పారు. రైలు ప్రమాదాల బాధితులకు తక్షణ సాయం అందించేందుకు ఎంపిక చేసిన కేంద్రాల్లో రూపాయి ఆస్పత్రులను సెంట్రల్ రైల్వే ప్రారంభించింది. కరోనాను జయించిన వృద్ధురాలి ఉదంతంపై మహారాష్ట్ర మంత్రి ఆదిత్యా ఠాక్రే స్పందించారు. వృద్ధురాలికి మెరుగైన చికిత్స అందించిన ఆస్పత్రి నిర్వాహకులు, వైద్యులతో పాటు శివసేన స్థానిక ఎంపీ శ్రీకాంత్ షిండేను ఆయన అభినందించారు. చదవండి : 'పాపడ్'లు తిని కరోనా నుంచి కోలుకున్నారా? -
దేవుడు అతడ్ని నీ కోసమే పంపాడు
న్యూయార్క్ : ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనపుడు మన బుర్ర పనిచేయటం మానేస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేక తికమకపడిపోతాము. కుటుంబసభ్యులకు లేదా ఆప్తులకు ప్రమాదం జరిగినపుడు మన పరిస్థితి ఊహించటం కష్టం. చాలా మంది ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ, ఏదో ఒకటి చేసేస్తుంటారు. కానీ, కొంతమంది మాత్రం బాధను నొక్కిపట్టి ఏం చేస్తే వారిని రక్షించుకోవచ్చో అది చేస్తారు. ఆ కొద్దిమందిలో ఒకడే అమెరికాకు చెందిన పీజే అనే 11 ఏళ్ల బాలుడు. కొద్దిరోజుల క్రితం అతడి బామ్మ బ్రేవర్ లేయే రక్తంలో చక్కెర నిల్వలు తగ్గి నడవలేక కిందపడిపోయింది. ( వారెవ్వా.. వాట్ ఏ డ్రైవింగ్ స్కిల్స్ ) ఆ సమయంలో దూరంగా కారు నడుపుతున్న పీజే ఆమెను గమనించాడు. వెంటనే కారు బ్రేవర్ దగ్గరకు తీసుకెళ్లి అందులో ఆమెను ఎక్కించి ఆసుపత్రికి చేర్చాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ దేవుడు అతడ్ని నీ కోసమే పంపాడు! ... మీ అదృష్టం బాగుండి బతికిపోయారు... కుర్రాడు చాలా తెలివిగా ప్రవర్తించాడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
బామ్మ 'షూటింగ్'కి నెటిజన్లు ఫిధా
వయసు మీద పడేకొద్ది కంటిచూపు మందగిస్తుంది. అలాంటిది 90 ఏళ్ల బామ్మ మాత్రం సరిగ్గా గురిచూసి షూట్ చేసింది. సరదాగా తన మనువడితో షూట్ అవుట్ ఆడి వహ్వా అనిపించుకుంది. మనువడు నెత్తిమీద పేపర్ బ్యాగ్ పెట్టుకోగా, బొమ్మ తుపాకీతో బామ్మ గురిచేసి కొట్టిడమే కాదు తన విజయానికి ఆనందంతో పరవశించిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేవలం ఆరు గంటల్లోనే 20 లక్షలమంది దీన్ని వీక్షించారు. ఈ వయసులోనూ బామ్మ గారు ఎంత ఉల్లాసంగా ఉన్నారో ..బామ్మ షూటింగ్‌కే కాదు,ఆమె చేసిన డ్యాన్స్‌కు కూడా మేం ఫిధా అయ్యామంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. You may see this as just a simple clip, but I think it’s awesome! That’s his grandmother, I find it lovely to see the relationship they have and her being able to enjoy time with him even at her age, it’s beautiful, especially at a time like this ❤️ pic.twitter.com/zfBcRbGe0M — ⚽ Simon BRFC Hopkins ⚽ (@HopkinsBRFC) September 2, 2020 -
విషాదం: నాయనమ్మ వెంటే మనవడు..
ఎస్.కోట రూరల్: ఎస్.కోట పట్టణంలోని గౌరీశంకర్ కాలనీలో ఓ ఇంట విషాదం నెలకొంది. శుక్రవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో కాలనీకి చెందిన వెదురుపల్లి కాసులమ్మ (90) అనే వృద్ధురాలు అనారోగ్యంతో మృతిచెందింది. ఆమె మనుమడు దివ్యాంగుడైన వెదురుపర్తి వీరాచారి (45) శుక్రవారం ఉదయం నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నాడు. శనివారం ఉదయం 6 గంటలకు ఆయన నిద్ర లేచేసరికి మీ నాయనమ్మ మృతిచెందిందని భార్య కామాక్షి తెలిపింది. అంతే.. ఆయన గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచారు. గంటల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. కరోనా భయంతో వీరిద్దరి మృతదేహాలను శ్మశానానికి తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పోలీసులకు సమాచారమిస్తే.. పంచాయతీ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బందికి తెలియజేయాలని, పంచాయతీ వారికి తెలియజేస్తే కాంట్రాక్టు పారిశుద్ధ్య సిబ్బంది సమ్మెలో ఉన్నారని, పర్మినెంట్ సిబ్బందిలో ఏడుగురు మహిళలేనంటూ జవాబిచ్చినట్టు మృతుల కుటుంబ సభ్యులు వాపోయారు. చివరకు మృతుని బంధువుల్లో వైద్యశాఖలో పనిచేసే ఒక వ్యక్తి రెండు పీపీఈ కిట్లు తెప్పించి మృతదేహాలను బయటకు తీయించారు. ఇదే సమయంలో సమాచారం అందుకున్న తహసీల్దార్ ఎల్.రామారావు కాలనీకి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతదేహాలను తోపుడు రిక్షాలపై శ్మశాన వాటికకు తరలించారు. దగ్గరుండి దహనసంస్కారాలు పూర్తిచేయించారు. మృతుల కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాలని సచివాలయ ఏఎన్ఎంను ఆదేశించారు. రోడ్డున పడిన కుటుంబం పుట్టుకతో మూగ, చెముడుతో బాధపడుతున్న వీరాచారి టైలర్ వృత్తిలో కొనసాగుతున్నాడు. ఆయనకు భార్య కామాక్షి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటి వద్దనే మహిళలకు ఫ్యాషన్ డ్రెస్సులు కుడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. తల్లి సంవత్సరం కిందటే మరణించింది. తండ్రి, తమ్ముడు ఆనంద్, వీరాచారి కుటుంబాలు ఒక ఇంట్లోనే నివసిస్తున్నాయి. వీరాచారి మరణంతో కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోయామంటూ మృతుని భార్య కామాక్షి బోరున విలపిస్తోంది. -
అవ్వ మరణంతో అనాథలుగా..
జయపురం: అమ్మా, నాన్నలు పోయారు. నాన్నమ్మే వారికి అన్నీ. ప్రస్తుతం నాన్నమ్మ కూడా చనిపోవడంతో ఆ చిన్నారులు అనాథలుగా మిగిలారు. కొరాపుట్ జిల్లా జయపురం సబ్‌డివిజన్ కుంధ్ర సమితి బిజాపూర్ పంచాయతీ ఖిలాపుట్ గ్రామానికి చెందిన వృద్ధురాలు పద్మ పొరజ కుమారుడు, కోడలు కొన్నేళ్ల కిందట మృతి చెందారు. అప్పటి నుంచి వారి నలుగురు కుమారులు, కుమార్తె నాన్నమ్మ పద్మ పొరజ వద్ద ఉంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.500 పింఛన్, 25 కేజీల బియ్యంతో కుటుంబం నెట్టుకువచ్చేది. కూలిపనులు చేస్తూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. ఆ చిన్నారులకు ఏ కష్టం రాకుండా చూసుకునేది. నాన్నమ్మ మృతి చెందడంతో ఆ చిన్నారులు అనాథలయ్యారు. వారిని ఆదుకునే ఆపద్భాందవుడి కోసం ఎదురుచూస్తున్నారు. ఆ చిన్నారులను ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వృద్ధురాలు మృతి విషయం తెలుసుకున్న బిజాపూర్ సర్పంచ్ బృందావన్ నాయిక్‌తో పాటు పలువురు ఆమె దహన సంస్కారాలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కుంధ్రా సమితి బీఎస్‌ఎస్‌వో సుమిత్ర ఖొర, సమితి అధ్యక్షురాలు సురేంధ్ర పొరజ, కొరాపుట్ జిల్లా శిశు సురక్షా అధికారి రాజేశ్వరీ దాస్ అక్కడకు చేరుకుని మృతురాకి కుటుంబానికి రూ.15 వేలు ఆర్థికసాయం అందజేశారు. ఆ చిన్నారులకు పునరావాసం కల్పిస్తామని జిల్లా శిశు సురక్షా అధికారి రాజేశ్వరి దాస్ హామీ ఇచ్చారు. అంతవరకు వారు అంగన్వాడీ కేంద్రంలో ఉండేలా ఏర్పాట్లు చేశారు. -
నానమ్మ పిజ్జా సూపర్‌హిట్
ఫిబ్రవరి వరకూ ఆమె ఒక సగటు అమ్మ, నానమ్మ. మే నాటికి అంట్రప్రెన్యూర్ అయిపోయింది. లాక్డౌన్లో తన కొడుకుల ఇళ్లకు పిజ్జా చేసి పంపిస్తే వాళ్లు ఆహా, ఓహో అన్నారు. హోమ్ కిచెన్ పెట్టించారు. ఇప్పుడు వారానికి 300 మంది ఆమె పిజ్జాలు తెప్పించుకుంటున్నారు. 67 సంవత్సరాల ముంబై గృహిణి నవ విజయగాథ ఇది. ముంబై లోఖండ్వాలాలో నివసించే 67 సంవత్సరాల ప్రతిభా కానోయ్‌కు ఒకటే కోరిక. ‘నన్ను ఏదైనా పని చేసి డబ్బు సంపాదించనివ్వండ్రా’ అని. కలిగిన కుటుంబం. భర్త మూడేళ్ల క్రితం చనిపోయాడు. కొడుకులు ముంబైలోనే సెటిల్ అయ్యారు. ఆమె ఇంట్లో పని చేసే వారికే నెలకు పది, పన్నెండు వేలు జీతాలు ఇవ్వాలి. ‘అందరూ పని చేసి డబ్బు సంపాదిస్తున్నారు. నేనొక్కదాన్ని తిని కూచుంటున్నాను. నేను కూడా పని చేసి సంపాదిస్తాను’ అని ఆమె తరచూ అనేది. కాని భర్త, కొడుకులు ‘అంత అవసరం ఏముంది’ అని ఆమె మాట పడనివ్వలేదు. కాని కాలం కలకాలం ఒకేలా ఉండదు. అది కరోనాను తెస్తుంది. మార్చిలో మొదలు ప్రతిభా కానోయ్‌కు నలుగురు మనమలు ఉన్నారు. కొడుకులు తరచూ వాళ్లను బయటకు తీసుకెళతారు. లేదా ఇంటికి బయటి ఫుడ్ తెప్పించి పెడతారు. కాని మార్చిలో లాక్డౌన్ మొదలయ్యాక ప్రతిభా మనసు ఊరికే ఉండలేకపోయింది. ‘అయ్యో... పిల్లలు బయటి తిండిని తెప్పించుకోలేకపోతున్నారే’ అనుకుంది. తన ఇద్దరు కొడుకుల ఇళ్లకు తన ఇంటి నుంచి పిజా తయారు చేసి పంపించడం మొదలెట్టింది. కొడుకులు ఆ పిజా రుచి చూసి ఆశ్చర్యపోయారు. మనమలు అయితే లొట్టలు వేయసాగారు. ప్రతిభా కానోయ్ చేసేది వెజ్ పిజ్జాలు. అలాంటి పిజ్జాలు ముంబైలో తినలేదు అని వారు ప్రశంసించసాగారు. మారిన మనసు తల్లి వంట ప్రతిభను చూశాక కొడుకుల మనసు మారింది. ‘అమ్మా.. హోమ్ కిచెన్ పెట్టిస్తాం. ఇంటి నుంచే నువ్వు వ్యాపారం ప్రారంభించు. సొంతగా సంపాదించు’ అని ఏర్పాట్లు చేశారు. ఇద్దరు చెఫ్‌లు జీతానికి కుదిరారు. డెలివలి బోయ్స్ కూడా. ‘మమ్మీస్ కిచెన్’ అనే పేరుతో మే 2న ప్రతిభా పిజ్జా వ్యాపారం మొదలైంది. కొడుకులే ఆమె ప్రచారకర్తలు అయ్యారు. ‘మా అమ్మ పిజ్జాలు టేస్ట్ చేసి చెప్పండి’ అని ఫ్రెండ్స్‌ను కోరారు. ఫ్రెండ్స్ ఆర్డర్స్ పెట్టారు. ప్రతిభ చేసి పంపే పిజ్జాలను చూసి వహ్వా అన్నారు. రెండు మూడు నెలల్లో ఆమె వ్యాపారం ఎంత బిజీ అయ్యిందంటే ఇవాళ పిజ్జా కావాలంటే నిన్న ఆర్డర్ పెట్టాలి. ఖాళీగా ఎందుకుండాలి? ‘నా భర్త భోజన ప్రియుడు. నాతోపాటు కలిసి వంట చేయడాన్ని ఇష్టపడేవాడు. చిన్నప్పుడు మా అక్క దగ్గర వంట నేర్చుకున్నాను. అలా వంటలో నేను నేర్చుకున్నది ఇప్పుడు ఉపయోగపడింది. పిజ్జాలో వాడే పదార్థాలు స్వచ్ఛంగా ఉండేలా చూసుకుంటాను. వాటిని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి వినిగర్లో నానబెట్టి ఉపయోగిస్తాను. ఉదయం 9 గంటలకు నేను కిచెన్‌లోకి వెళితే సాయంత్రం వరకూ రోజుకు 30 నుంచి 50 వరకూ డెలివరీలు ఉంటాయి. శని, ఆదివారాలు 100 పైగా ఆర్డర్లు ఉంటాయి. 11 రకాల పిజ్జాలు తయారు చేస్తాం. 400 నుంచి 550 వరకూ చార్జ్ చేస్తాం. నన్ను చూసి కొందరు ఇంత డబ్బుండి ఇదేం పని అనుకోవచ్చు. కాని ఎవరైనా సరే ఎందుకు ఖాళీగా ఉండాలి అంటాను. స్త్రీలు తమ ఆర్థిక స్వాతంత్య్రం తాము చూసుకోవాలి. అలాగే వయసైపోయిందని కొందరు అనుకుంటూ ఉంటారు. ఆరోగ్యాన్ని సరిగ్గా కాపాడుకుంటే వయసు ఎప్పటికీ అవదు. ఏ వయసులో అయినా జీవితాన్ని ఫుల్‌గా జీవించవచ్చు. 67 ఏళ్ల వయసులో సక్సెస్ సాధించి నా తోటి వయసు వారికి నేను ఇవ్వాలనుకుంటున్న సందేశం ఇదే’ అంది ప్రతిభ. ఎప్పుడైనా ముంబై వెళితే ఆమె చేతి పిజ్జాకు ఆర్డర్ పెట్టండి. – సాక్షి ఫ్యామిలీ -
ఒక రోజు వ్యవధిలో అమ్మమ్మ కూడా..
గుడిపాల: మసాలా పొడి అనుకుని గుళికల మందు వేసి వండిన చికెన్‌ను తిన్న మహిళ సైతం బుధవారం కన్నుమూసింది. అమ్మమ్మ వండిన చికెన్‌ను తిన్న ఇద్దరు మనవళ్లు సోమవారం తిని మరణించడం విదితమే. ఆ చికెన్‌ను వండిన గోవిందమ్మ (52) పరిస్థితి కూడా విషమించి బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. వివరాలు..తవణంపల్లె మండలం ఉత్తర బ్రాహ్మణపల్లెకు చెందిన రాంబాబు కుమారులు ఈనెల 13న గుడిపాల మండలంలోని అమ్మమ్మ గోవిందమ్మ ఇంటికి వచ్చారు. సోమవారం అమ్మమ్మను చికెన్ చేసి పెట్టమని అడిగారు. అయితే గోవిందమ్మకు మతిస్థిమితం సరిగా లేదు. గోవిందమ్మ కోడికూర చేస్తూ మసాలాపొడి అనుకుని గుళికల మందును అందులో వేసింది. వండిన తర్వాత చికెన్‌ను తిన్న ఆమె మనుమళ్లు రోహిత్, జీవ మృతిచెందడం విదితమే. గోవిందమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ఆమె కన్నుమూసినట్లు గుడిపాల ఎస్ఐ వాసంతి తెలిపారు. ఒక రోజు వ్యవధిలో మనవళ్లు, అమ్మమ్మ మరణించడంతో రెండు మండలాల్లోనూ తీవ్రవిషాదం నింపింది.(మసాలా పొడి అనుకుని చికెన్‌లో..) -
ఊరంతా కిచెన్ గార్డెన్
ప్రకృతిని, ఊరి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి 84 ఏళ్ల ఓ బామ్మ పలుగూ, పార చేత బట్టింది. వంటిళ్లని పచ్చని కూరగాయలతో నింపడానికి నిత్యం శ్రమిస్తోంది. రకరకాల కూరగాయల నారుపోసి, మొక్కలను పెంచి, వాటిని ఉచితంగా గ్రామ వాసులకు అందిస్తోంది. బామ్మపనికి ముగ్దులైన ఊరి ప్రజలు ‘సూపర్ మామ్మ’ అంటున్నారు. తమిళనాడుకు చెందిన 84 ఏళ్ల నుంజమాల్ ఈ కరోనా టైమ్‌లో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందాలని, అది కిచెన్‌లో తయరయ్యే వంటకాల నుంచే వస్తుందని, ఇంటిపంట అలవాటును అందరిలోనూ ప్రోత్సహించడానికి నడుము కట్టింది. రాష్ట్రమంతా కూరగాయల మొక్కలను పంపిణీ చేయాలని ఉందనే ఈ మామ్మ. ‘సొంతంగా కూరగాయలను పండించుకోవడం ద్వారా సేంద్రీయ పద్ధతులను అవలంబిస్తారు. దీనివల్ల పర్యావరణానికీ మేలు కలుగుతుంద’ని చెబుతోంది. ఇప్పుడు నుంజమాల్ అందరిళ్లకు వెళ్లి ఎవరింట్లో ఎన్ని మొక్కలు, ఎలా పెంచుతున్నారు అనే విషయాన్ని స్వయంగా కనుక్కుంటూ తీరికలేకుండా ఉంది. తనే స్వయంగా మొక్కలను నాటి, పాదులు తీసి నీళ్లు పోసి వస్తుంది. ఆమె కృషికి ఏపుగా పెరుగుతున్న కూరగాయల తోటలే నిదర్శనం. ఈ బామ్మ పెరటి తోటలను తయారు చేయడాన్ని మెచ్చుకుంటూ ఒక వార్తాసంస్థ ఆమె ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేసింది. ఆ వెంటనే ఈ బామ్మకు మద్దతుగా రీట్వీట్ల వరద మొదలైంది. -
విషాదం : చికెన్ కర్రీలో మసాలకు బదులు..
సాక్షి, చిత్తూరు : వృధ్యాప్యంలో ఉన్న అమ్మమ్మ చేసిన పొరపాటు ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసింది. చికెన్ కర్రీలో మసాల అనుకుని విష గుళికలు కలిసింది ఆ వృద్ధురాలు. విషగుళికలు కలిపిన ఆహారం తిని ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గుడిపాల మండలంలోని ఏఎల్‌పురం గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మృతులు తవణంపల్లి మండలం వడ్డేపల్లికి చెందిన రోహిత్, జీవాగా గుర్తించారు. (చదవండి : ‘అమ్మ’మ్మలే హతమార్చారు..) వడ్డేపల్లికి చెందిన ఇద్దరు పిల్లలు అమ్మమ్మ ఊరైన ఏఎల్‌పురానికి వెళ్లారు. దీంతో వాళ్ల అమ్మమ్మ చికెన్ వండి... పిల్లలకు పెడదామని నిర్ణయించుకుంది. చికెన్ చేసే సమయంలో చికెన్ మసాలా బదులు విష గుళికలు కలిపింది. గుళికలు వేసిన చికెన్ తినడంతో ఆ ఇద్దరు బాలులు మృతి చెందారు. కేసు దర్యాప్తు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. -
ఈ ఆట పేరేంటో మీకు గుర్తుందా?
గడిచిన కాలం ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ప్రతి సందర్భంలోనూ ఒకప్పటి రోజులే బాగుండేవి అని అనుకుంటూ ఉంటాం. కొన్ని విషయాలు మనకు బాల్యాన్ని గుర్తు చేస్తాయి. వాటిని చూసి చిన్నప్పుడు మనం కూడా అలాగే చేసేవాళ్లం. అచ్చం ఇలాగే ఆడుకునేవాళ్లం అంటూ పాతరోజులను నెమరేసుకుంటాం. ఇంతకీ ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే ఓ బామ్మ తన మనవరాలితో కలిసి ‘కచ్చకాయలు’ ఆడుకుంటున్న వీడియో నెటిజన్లకు తమ చిన్ననాటి జ్ఙాపకాలను గుర్తు చేస్తోంది. (వైరల్: పాము నీళ్లు తాగడం చూశారా?) పిల్లలు తమ అమ్మమ్మ, తాతయ్యలతో ఎందుకు సమయం గడపాలి అంటే’ అంటూ ఓ వ్యక్తి షేర్ చేసిన ఈ వీడియోలో 60 ఏళ్ల వయసున్న బామ్మ తన మనవరాలతో కూర్చొని సరాదాగా కచ్చకాయలు/అచ్చన్న గిల్లలు ఆడుతోంది. ఆటను ఏకదాటిగా బామ్మ ఆడటాన్ని చూస్తున్న తన చిన్నారి మనవరాలు ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్న ఈ వీడియోను శుక్రవారం ట్విటర్లో పోస్ట్ చేయగా ఇప్పటికే 15 వేలమంది లైక్ చేశారు. అనేక మంది వారి అనుభవాలు, బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. (జిరాఫీని రెచ్చగొడితే ఇలానే ఉంటుంది!) ‘హేయ్ నాకు ఈ ఆట తెలుసు. మా అమ్మ నాకు నేర్పించింది. ఒడిశాలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ప్రతి ఇంట్లో ఈ ఆట ఆడతారని తెలుసు’. అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘నేటితరం పిల్లలు ఇలాంటి ఆటలను కోల్పోతున్నారు. దీనిని హర్యానాలో ‘ఘెట్’ అని పిలుస్తారు’. అని మరో నెటిజన్ పేర్కొన్నారు. కాగా దీనిని వివిధ ప్రాంతాల్లో అనేక ఇతర పేర్లతో పిలుచుకుంటారు. మరి మీరు ఈ ఆటను ఎప్పుడైనా ఆడారా.. అయితే ఈ వీడియోను చూసి ఆ మధురానుజ్ఙాపకాలను మరోసారి గుర్తుతెచ్చుకోండి. (చిన్నారి ఏడుపు.. పాలు అందించిన పోలీస్) -
డబ్బుల కోసం నానమ్మను చంపేశాడు
మొయినాబాద్(చేవెళ్ల): ఓ బాలుడు డబ్బుల కోసం తన నానమ్మతో గొడవపడి ఆమె గొంతునులిమి హత్యచేశాడు. ఈ సంఘటన మొయినాబాద్ మండలం శ్రీరాంనగర్‌లో సోమవారం జరిగింది. ఎస్సై జగదీష్, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కావలి వెంకటమ్మ(65) కొడుకు కుమార్ కొన్నేళ్ల క్రితం మృతిచెందాడు. ఆమె కోడలు విజయ, ఇద్దరు మనవలు, మనువరాలితో కలిసి ఉండేది. రెండో మనవడు (16) పదో తరగతి వరకు చదివి గ్రామంలో కొంతకాలంగా ఖాళీగా తిరుగుతున్నాడు. డబ్బులు ఇవ్వాలంటూ తరచూ అతడు నానమ్మ వెంకటమ్మతో గొడవపడేవాడు. అయితే, ఆదివారం కోడలు విజయ, పెద్ద మనవడు, మనవరాలు బంధువుల వద్దకు వెళ్లారు. ఇంటి వద్ద ఉన్న బాలుడు డబ్బులు కావాలని వెంకటమ్మతో గొడవపడ్డాడు. ఈక్రమంలో రాత్రి 10 గంటల సమయంలో ఆమెతో మరోమారు ఘర్షణపడి బెల్టుతో కొట్టాడు. అనంతరం గొంతు నులిమేయడంతో ఆమె చనిపోయింది. మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి అనంతరం స్నేహితుడి ఇంటికి వెళ్లి నిద్రించాడు. సోమవారం ఉదయం నల్లా నీళ్లు వస్తున్నాయని చెప్పేందుకు పక్కింటి వారు వెళ్లి చూడగా వెంకటమ్మ విగతజీవిగా పడి ఉంది. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ జానయ్య, ఎస్సై జగదీష్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.(బాలిక బలవన్మరణం) పోలీసుల అదుపులో బాలుడు డబ్బుల కోసం నానమ్మను హత్య చేసిన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటమ్మ మృతి విషయంపై గ్రామస్తులకు ఆమె చిన్న మనవడిపై అనుమానం వచ్చి అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. కాగా, వృద్ధురాలు హత్యకు బాలుడికి మరో ఇద్దరు యువకులు కూడా సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణలో పూర్తి వివరాలు రాబడతామని చెబుతున్నారు. -
ఉయ్యాల.. జంపాల
పుట్టపర్తి టౌన్: ఏడు పదుల వయస్సులో ఓ బామ్మ పదేళ్ల పిల్లలా తొక్కుటూయల ఊగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పుట్టపర్తి నగర పంచాయతీ బ్రాహ్మణపల్లికి చెందిన జయమ్మ వయస్సు 76 ఏళ్లు. ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె సంతానం. ఈ వయస్సులోనూ జయమ్మ తన పనులు తానే చేసుకుంటోంది. వంట కూడా స్వయంగా వండుకుంటుంది. ఇదంతా ఒక ఎత్తయితే ఇంటి వద్దనున్న చింత చెట్టుకు తొక్కుటూయల వేసి అతివేగంగా ఊగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాగులు, కొర్రలు, జొన్నలు, సంగటి, ఆకుకూరలు తినడం వల్లే తాను ఆరోగ్యంగా ఉన్నట్లు జయమ్మ చెబుతోంది. రోజూ వ్యాయామం, ఉదయాన్నే వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నట్లు తెలిపారు. -
తల్లిదండ్రుల మృతి.. అన్నీ తానై..
అనంతపురం, తాడిపత్రి టౌన్: రెండేళ్ల క్రితం వరకు ఆ కుటుంబం ఆనందోత్సాహాలతో గడిపింది. భార్యాభర్త, ఇద్దరు పిల్లలు... ఎంతో సంతోషంగా జీవిస్తున్న తరుణంలో విధి వక్రీకరించింది. ఫలితంగా తల్లిదండ్రుల నీడన ఆడుకోవాల్సిన వయస్సులో ఆ చిన్నారులు అనాథలయ్యారు. ఆదుకునే వారు లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడారు. అయినవాళ్లందరూ కాదని అంటే ఎటు పోవాలో అర్థం కాలేదు. చివరకు ఏడు పదుల వయస్సులో ఉన్న నానమ్మ అన్నీ తానై ముందుకు వచ్చింది. కాటికి కాళ్లు చాపిన వయస్సులో చిన్నారుల పోషణ భారాన్ని నెత్తికెత్తుకుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా ఆగమ్యగోచరంగా ఉంది. తాను లేకపోతే మరోసారి ఆ పిల్లలు అనాథలుగా రోడ్డున పడతారనే భావన ఆ వృద్ధురాలిని కలిచి వేస్తోంది. అందుకే తాను జీవించి ఉండగానే వారికో ఆసరా కల్పించాలని పరితపిస్తోంది. ఆదుకునే హస్తం కోసం ఎదురు చూస్తోంది. లక్ష్మి, కళ్యాణ్‌కుమార్ చింతలేని కుటుంబం... తాడిపత్రిలోని జయనగర్‌కు చెందిన రాజయ్య (రాజ కుళ్లాయప్ప), నాగేశ్వరమ్మ దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె లక్ష్మి... స్థానిక చేనేత కాలనీలోని మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. కొడుకు కళ్యాణ్‌కుమార్ (కుళ్లాయప్ప), తన అక్కతో పాటు అదే పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. కూలి పనులతో కుటుంబాన్ని రాజయ్య పోషించుకుంటూ వచ్చేవాడు. సంపాదన తక్కువే అయినా.. చిన్న కుటుంబం కావడంతో ఎలాంటి చింతలేకుండా సంతోషంగా జీవిస్తూ వచ్చారు. నెలల తేడాతో తల్లిదండ్రులను కోల్పోయి.. ఎంతో సంతోషంగా జీవిస్తున్నామనుకుంటున్న తరుణంలో నాగేశ్వరమ్మ అనారోగ్యంతో మంచం పట్టింది. పలు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించినా ఫలితం లేకపోయింది. చివరకు ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుసుకున్న రాజయ్య ఒక్కసారిగా కుంగిపోయాడు. వచ్చే అరకొర సంపాదనతో కుటుంబాన్ని అతి కష్టంపై లాక్కొస్తున్న తరుణంలో పిడుగులాంటి వార్త అతని జీవితంలో అంధకారాన్ని నింపుతూ వచ్చింది. భార్య ప్రాణాలను దక్కించుకునేందుకు తన శాయాశక్తుల ప్రయత్నించాడు. దాచుకున్న డబ్బు కాస్త ఖర్చయిపోయింది. చివరకు అప్పులు చేయాల్సి వచ్చింది. అయినా భార్య ప్రాణాలు దక్కలేదు. 18 నెలల క్రితం ఆమె మృత్యువాతపడింది. భార్య మృతితో రాజయ్య మానసికంగా చాలా నలిగిపోయాడు. తిండితిప్పలు లేక అనారోగ్యం పాలయ్యాడు. ఆ దిగులుతోనే ఆరు నెలల క్రితం అతనూ గుండెపోటుతో మరణించాడు. అందరూ ఉన్నా.. అనాథలుగా తల్లి మరణించిన ఘటన నుంచి చిన్నారులు కోలుకోలేదు. అయిన వారందరూ మాట వరసకు కూడా పలకరించడం మానేశారు. దీంతో ఎవరి ఇంటికి వెళ్లాలన్నా ఒక విధమైన జంకుతో చిన్నారులు నలిగిపోయారు. అదే సమయంలో తండ్రి కూడా మరణించడంతో వారికి దిక్కుతోచలేదు. కంటి ముందు నిర్జీవమై పడి ఉన్న తండ్రి మృతదేహాన్ని చూస్తూ కన్నీరు పెట్టడం తప్ప వారికి మరేమీ చేతకాలేదు. కొందరు వస్తున్నారు.... ఏవేవో మాట్లాడుకుంటున్నారు.. వెళ్లిపోతున్నారు. ఏం చేయాలో.. ఎలా చేయాలో.. ఎవరిని కలవాలో ఆ చిన్నారులకు దిక్కుతోచలేదు. ఎవరూ చేరదీయకపోవడంతో అనాథలుగా మిగిలారు. కర్మకాండలు ఎలా జరిగాయో కూడా వారికి గుర్తులేదు. నానమ్మ పంచన చేరి.. చిన్నారుల పరిస్థితి చూసి నానమ్మ నాగమ్మ చలించిపోయింది. అప్పటికే అద్దె ఇంటిలో నివసిస్తూ.. ప్రభుత్వం అందజేసే వితంతు పింఛన్‌తో అతి కష్టంపై జీవితాన్ని నెట్టుకొస్తున్న ఆమెకు ఆ చిన్నారుల పోషణ తలకు మించిన భారమే. అయినా ఆ వృద్ధురాలు భయపడలేదు. నేనున్నాంటూ ఆ చిన్నారులను అక్కున చేర్చుకుంది. ఒక పూట పస్తులుండైనా చిన్నారుల కడుపు నింపుతూ.. వారి ఆలనాపాలనా చూసుకుంటూ వస్తోంది. రోజు వారీ క్రమం తప్పకుండా వారిని పాఠశాలకు పంపుతూ చదువు సంధ్యలు చెప్పిస్తోంది. ఇలాంటి తరుణంలోనే ఆమె మదిలో ఓ చిరు ఆలోచన పెనుభూతమై భయపెట్టింది. జీవిత చరమాంకంలో ఉన్న తాను జీవించి ఉండగానే ఆ చిన్నారులకు ఓ ఆసరా కల్పించాలని భావించింది. ఆ దిశగా ఆదుకునే హస్తం కోసం ఎదురుచూస్తోంది. మనసున్న దాతలు ముందుకు వచ్చి ఆర్థికసాయం అందిస్తే చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉపయోగపడేలా చేయాలని భావిస్తోంది. ఆ దిశగా ప్రాధేయపడుతోంది. దాతలు స్పందిస్తే.. పేరు: తలారి నాగమ్మ W/O తలారి పుల్లన్న బ్యాంక్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఖాతా నం. : 6213 460 7206 ఐఎఫ్ఎస్సీ కోడ్ : SBIN0021066 సంప్రదించాల్సిన ఫోన్ నం. :81439 29401 -
బామ్మగారి 'బ్యాగు'లు
లతికా చక్రవర్తి వయసు 90 ఏళ్లు. ఈ వయసులో ఇంక పనులేం చేస్తారు.. ‘కృష్ణా, రామా.. అనుకుంటూ రోజులు వెళ్లబుచ్చక..’ అనుకుంటారు ఎవరైనా. కానీ, ఈ బామ్మ భారతదేశం నలుమూలలా ఆ ప్రాంతాలకే ప్రత్యేకమైనపాత చేనేత చీరలు, కుర్తాలు, బట్టలు సేకరించి వాటితో అందమైన ‘పొట్లి’ బ్యాగులు, పర్సులు తయారు చేస్తున్నారు.చేత్తో పట్టుకునే సంచులు, పర్సులను రీసైక్లింగ్ చేయడం అంటే ఈ బామ్మకు మహా ఇష్టం. ‘‘ఆడవాళ్లు ప్రతిబ్యాగ్తోనూ ఒక బంధాన్ని, ఓ ప్రత్యేకమైన కథను కలిగి ఉంటారు’’ అని చెబుతుంది. ఏ తరానికైనా పనికివచ్చే ఎన్నోముచ్చట్లతో పాటు, పనే దైవంగా భావించాలని చెబుతున్న ఈ బామ్మ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిందే! లతిక 1930లో అస్సాంలోని ధుబ్రి పట్టణంలో జన్మించారు. ‘‘చదువులో ఎప్పుడూ ముందంజలో ఉండేదాన్ని. కానీ, మా కుటుంబ సంప్రదాయ పద్ధతులు పై చదువులకు వెళ్లకుండా నన్ను అడ్డుకున్నాయి. కాలేజీలో చేరకుండానే కృష్ణ లాల్ చక్రవర్తితో పెళ్లైంది. తను సర్వే ఆఫ్ ఇండియాలో సర్వేయర్‌గా చేసేవారు. ఆయన ఉద్యోగరీత్యా తను ఏ రాష్ట్రానికి వెళితే నేనూ అక్కడికి వెళ్లాను. బయటకు వెళ్లి గుర్తింపు తెచ్చే పనులు చేయాలని ఉండేది. కానీ, నా భర్తకు నేను బయటకు వెళ్లి సంపాదించడం ఇష్టం లేదు. ముగ్గురు పిల్లలు. వాళ్ల ఆలనా పాలనతో ఇంట్లోనే ఉండిపోయాను. కానీ, నా జీవితం ఇలాగే నాలుగ్గోడల మధ్య ఉండిపోకూడదు అనిపించేది. ఒక ఏడాది ఇంట్లో ఆర్థిక సమస్యలు వచ్చాయి. ఆ సమయంలో టీచర్‌గా పనిచేయాలనే ఆలోచనతో తొలిసారి బయటికి అడుగుపెట్టాను. పనిలో ఉన్న ఆనందం, స్వయంకృషితో సంపాదించే డబ్బు నాకు ఎనలేని సంతృప్తిని ఇచ్చాయి. ఆ తర్వాత ఎప్పుడూ ఇంటిపట్టున ఉండాలనే ఆలోచన కూడా చేయలేదు. మా రోజులు చాలా భిన్నంగా ఉండేవి. ఇప్పటిలా అప్పుడు చాలా వస్తువుల అవసరం లేదు. ఒకసారి వాడిన వస్తువులును తిరిగి చక్కగా ఉపయోగించుకునేవాళ్లం. ఎలాంటి భేషజాలు లేవు. ఒకరితో పోల్చి చూసుకోవడం ఉండేది కాదు. దీంతో చాలా సంతోషంగా ఉండేవాళ్లం’’ అంటూ గతాన్ని గుర్తుచేసుకుంటారు లతిక. వృథా ఇష్టం ఉండదు యాభైఏళ్ల వయసులో భర్తను కోల్పోయిన లతిక పిల్లలతో ఉంటూ వారి బాగోగులు చూసుకుంటూ రోజులు గడిపేశారు. అయితే, ఆమె స్వయంకృషి, అభిరుచి.. తొమ్మిది పదులకు చేరువవుతున్న దశలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టేలా చేశాయి. ఇప్పుడు ఆమె ఒక బిజినెస్ ఉమెన్. తను తయారు చేసిన అందమైన ‘పొట్లి’ సంచులను తయారు చేస్తూ వాటిని అమ్ముతున్నారు. ‘‘పాత బట్టలను పడేయడం అంటే ఇష్టముండేది కాదు. ఆ మాటకొస్తే ఏదైనా వృథా అవుతుంటే నా మనసు చివుక్కుమంటుంది. పాత చీరలతో పిల్లలకు కుర్తాలు కుట్టేదాన్ని. కుర్తాలతో పర్సులు, సంచులు తయారు చేసేదాన్ని. అయితే వాటిని అమ్మాలని ఎప్పుడూ అనుకోలేదు. మా బంధువుల్లోనే ఎవరైనా అడిగితే ఇచ్చేదాన్ని..’’ అంటూ తన వ్యాపారం ఎలా మొదలైందీ వివరిస్తారు లతిక. రెండు–మూడు రోజుల్లో ఒక బ్యాగును తయారు చేస్తారామె. అలా.. మొదట ఓ 300ల బ్యాగులను తయారు చేశారు. బామ్మ ఆసక్తిని చూసిన మనవడు ‘లతికాస్ బ్యాగ్’ పేరుతో ఆమె కోసం ఒక వెబ్‌సైట్‌ని ప్రారంభించాడు. బామ్మ కుట్టిన బ్యాగులను వెబ్సైట్లో పెట్టడంతో వాటికి డిమాండ్ పెరిగింది. న్యూజిలాండ్, జెర్మనీ నుంచి కూడా లతిక బ్యాగులకు ఇప్పుడు గిరాకీ వస్తోంది! సంతోషాన్నిచ్చే వ్యాపకం ‘‘నా భర్త 65 ఏళ్ల క్రితం ఓ కుట్టుమిషన్ని కానుకగా ఇచ్చాడు. దానిమీదే ఈ బ్యాగులను కుట్టడం మొదలుపెట్టాను. మా కోడలు, కూతుళ్లు వాడేసిన చీరలూ తీసుకున్నాను. పాత క్లాత్‌తో కుట్టిన ఈ బ్యాగులకే టాజిల్స్, ఎంబ్రాయిడరీతో కొత్తగా రూపు కడతాను. అయితే బ్యాగులను అమ్మాలనే ఉద్దేశంతో ఈ పనిని మొదలుపెట్టలేదు. వీటి తయారీలో ఒక ఆనందాన్ని పొందుతాను. నా వయసును మర్చిపోతాను. నా భక్తి అంతా నా బ్యాగ్ రూపకల్పనలోనే ఉంటుంది. నా హృదయంతో వీటిని తయారు చేస్తాను. ఈ తరం అమ్మాయిలకు కూడా నా బ్యాగులు నచ్చుతున్నాయంటే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. వయసు మీద పడినవాళ్లు కూడా నా బ్యాగులను ఇష్టపడతారు..’ అంటూ బ్యాగుల గురించి ఎన్నో విషయాలను చెబుతారు లతిక.ఈ బామ్మ తన వయసు పెరుగుతుందనే భావన దర చేరనీయరు. అందుకే తన గదిలో ఒక్క అద్దాన్నీ ఉంచుకోరు. ఎంతసేపూ స్నేహితులతో గడపడం, నలుగురి మధ్యలో మాట్లాడుతూ ఉండటాన్ని ఇష్టపడతారు. ముడతలు పడిన చేతులతో ముచ్చటగా తీర్చిదిద్దే ఒక్కో బ్యాగ్‌కు ఒక్కో అందమైన పేరు పెట్టి మురిసిపోతుంటారు– ఆరెన్నార్ -
బామ్మ కొన్న వస్తువు చూసి ఫ్యామిలీ షాక్
అనుకున్నదొక్కటి.. అయినది మరొక్కటి.. అంటే ఇదేనేమో! తప్పులో కాలేసిన ఓ బామ్మ చేసిన పనికి అందరూ నోరెళ్లబెట్టారు. కానీ తర్వాత అసలు విషయం తెలిసి సరదాగా నవ్వుకుంటున్నారు. ఇంగ్లండ్‌కు చెందిన డెబ్భైఆరేళ్ల బామ్మ జానీ టీగూడె ఫిబ్రవరి 11న సామాను తేవడానికని కిరాణా కొట్టుకెళ్లింది. తనకు కావాల్సిన సరుకులు తీసుకుని అనంతరం వాటికి బిల్లు చెల్లించి ఇంటికి తిరిగొచ్చింది. అయితే ఆమె తెచ్చిన ఓ వస్తువును చూసి ఇంటి సభ్యులు షాక్‌కు గురయ్యారు. సామానులో పెద్ద కండోమ్ ప్యాక్ ఉండటంతో వాళ్ల కళ్లను వారే నమ్మలేక గందరగోళానికి లోనయ్యారు. దీనిపై ఆమె భర్త జాన్ రిలే బామ్మను నిలదీయగా తానెక్కడ తీసుకువచ్చానంటూ తిరుగుదాడి చేసింది. (కిటికీలో నుంచి కండోమ్ విసిరాడు) అనంతరం దాన్ని చూసి అయ్యయ్యో.. ఇది టీ బ్యాగు అని భ్రమపడి పొరపాటున తీసుకువచ్చానే అని నవ్వుతూ సమాధానమిచ్చింది. కొట్టుకు వెళ్లేటపుడు కళ్లజోడు మర్చిపోయానని.. దీంతో తనకు ఏదీ సరిగా కనిపించలేదని సంజాయిషీ ఇచ్చుకుంది. ఇక దీన్ని ఎలాగైనా దుకాణంలో తిరిగి ఇచ్చేసి రమ్మని ఆమె తన మనవరాలిని కోరింది. ఈ విషయాన్నంతటినీ ఫొటోలతో సహా బామ్మ మనవరాలు జెమ్మా తన ఫేస్బుక్లో షేర్ చేసింది. ‘ఆ బాక్సును చూడగానే మాకు ఆశ్చర్యం వేసింది. దీన్ని ఎలా కొనగలిగావని అడిగితే ఆమె చెప్పిన సమాధానం విని ఎంతో నవ్వుకున్నాం. పైగా ఇది నాకవసరం లేదంటూ.. వెంటనే దుకాణంలో తిరిగి ఇచ్చేసి రమ్మని దబాయిస్తోంది’ అని చెప్పుకొచ్చింది. ఏదేమైనా బామ్మ చేసిన తప్పిదం ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. (రెస్టారెంట్ కిచెన్‌లో స్నానం: ‘నీకేమైనా పిచ్చా’!) -
నాయనమ్మ హత్య
పట్నంబజారు(గుంటూరు): ఆస్తి కోసం నాయనమ్మను మనవడు హత్య చేసిన సంఘటన గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. నగరంపాలెం పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక శ్రీనివాసరావుపేటలో ఆకుల యలమంద, అతని భార్య పద్మావతి, తల్లి సామ్రాజ్యం, నానమ్మ సుశీల (70) నివసిస్తున్నారు. ఆస్తి తన పేరున రాయాలని సుశీలను యలమంద గొడవ చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల ఆరో తేదీ రాత్రి 2.30 గంటల సమయంలో సుశీలను చీరతో ఉరి బిగిస్తుండగా ఆమె కేకలు వేసింది. ఇంటి పక్కన ఉండే నరసింహ కుటుంబ సభ్యులు వచ్చి చూడటంతో యలమంద పరారయ్యాడు. లోపలికి వెళ్లి చూడగా అప్పటికే సుశీల మృతి చెందింది. ఆస్తి రాయలేదనే కోపంతో వృద్ధురాలిని మనవడే హత్య చేసినట్లు నరసింహ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
105 ఏళ్ల వయసులో బామ్మ ఫీట్‌కు ఫిదా..
తిరువనంతపురం : పట్టుదల ఉంటే సాధించలేనిది లేదంటూ ఓ బామ్మ 105 ఏళ్ల వయసులోనూ సత్తా చాటారు. దేశంలోనే అత్యధిక వయసు కలిగిన స్టూడెంట్‌గా ఆమె నాలుగో తరగతికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యారు. గత ఏడాది కేరళలోని కొల్లాంలో రాష్ట్ర సాక్షరతా మిషన్ నిర్వహించిన పరీక్షలకు వందేళ్లు దాటిన బాగీరథి అమ్మ హాజరయ్యారు. ఈ పరీక్షల ఫలితాలను సాక్షరత్ మిషన్ బుధవారం వెల్లడించింది. పరిస్థితుల ప్రభావంతో తన తొమ్మిదో ఏట మూడో తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పాల్సి రావడంతో ఎప్పటికైనా విద్యాభ్యాసంతో జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆమె నిత్యం పరితపించేవారు. చిన్ననాటే తల్లిని కోల్పోయి తనకంటే చిన్నవారైన చెల్లెళ్లు, తమ్ముళ్లను పెంచే బాధ్యత తలకెత్తుకోవడంతో ఆమె తన కలను నెరవేర్చుకోలేకపోయారు. వివాహానంతరం ముఫ్పై ఏళ్ల వయసులోనే భర్తను కోల్పోవడంతో తన ఆరుగురి సంతానాన్ని పెంచి పెద్దచేసే బాధ్యతలనూ ఆమె స్వీకరించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇన్నేళ్లకు చదువుకోవాలన్న తన ఆక్షాంక్షను ఆమె నెరవేర్చుకున్నారు. వయోభారంతో పరీక్షల్లో రాయలేకపోవడంతో మూడు ప్రశ్నాపత్రాలను పూర్తి చేసేందుకు ఆమె మూడు రోజులు తీసుకున్నారని సాక్షరతా మిషన్ వర్గాలు తెలిపాయి. తాను పదో తరగతికి సమానమైన పరీక్షకు హాజరవుతానని బాగీరథి అమ్మ విశ్వాసంతో చెబుతున్నారు. మరోవైపు సాక్షరతా మిషన్ నిర్వహించిన అక్షరలక్షమ్ కార్యక్రమంలో 96 ఏళ్ల కార్తియని అమ్మ 100కు 98 మార్కులు సాధించారని మిషన్ తెలిపింది. కాగా నాలుగేళ్లలో కేరళ రాష్ట్రంలో నూరు శాతం అక్షరాస్యత సాధించాలన్నదే తమ లక్ష్యమని సాక్షరతా మిషన్ వెల్లడించింది. చదవండి : వైరల్ : ఎర్రచీరలో ఇరగదీసింది -
అమ్మమ్మ స్కూల్‌కెళ్తోంది
డ్వాక్రా గ్రూప్‌లో లోన్ తీసుకుంది సుమతి. సంతకం పెట్టడానికి ముందుకు రావట్లేదు. ‘‘ఏంటమ్మా డబ్బు తీసుకుంటావ్‌గానీ సంతకం పెట్టవా?’’ పేపర్‌ను ఆమె ముందు పెడ్తూ విసుక్కున్నాడు బ్యాంక్ ఏజెంట్. ‘‘అయ్యో .. ఆమెకు చదువురాదు సర్.. వేలిముద్ర వేస్తుంది’’ అనునయిస్తున్నట్టు చెప్పింది ఆ డ్వాక్రా గ్రూప్ లీడర్. ‘‘ఆ ముక్క ముందే చెప్తే పోయేది కదా.. టేమ్వేస్ట్ కాకపోతే’’ అంటూ స్టాంప్ప్యాడ్ సుమతి ముందుకు తోశాడు. అవమానంతో ఆమె మొహం ఎర్రబడింది. సిగ్గుతో తలవంచుకొనే వేలిముద్ర వేసింది సుమతి. ‘‘రాజూ.. నీ క్లాస్మెంట్ నరేందర్ ఉండేవాడు చూడు.. వాళ్లమ్మ కనిపించిందిరా చాన్నాళ్ల తర్వాత’’ ఉత్సాహంగా చెప్పింది కొడుకుతో అమృత. ‘‘క్లాస్మెంట్ కాదమ్మా.. క్లాస్మేట్’’ సరిదిద్దాడు కొడుకు. చిన్నబుచ్చుకున్న అమ్మ ‘‘అదేలే. స్వారీ’’ అంది తప్పు పలికినందుకు. కిసుక్కున నవ్వాడు రాజు. ‘‘మళ్లీ ఏమైంది స్వారీ చెప్పాగా’’ కొపంగా అడిగింది అమ్మ. ‘‘స్వారీ కాదమ్మా.. సారీ’’ సరిదిద్దాడు అబ్బాయి. కొడుకు దగర అమ్మ ఇన్సల్ట్ అయినట్టు భావించింది అమ్మ. అరగంట నుంచి టేబుల్ సొరుగులోని కాయితాలన్నిటినీ కిందపడేసి వాటిల్లోంచి ఏదో వెదుకుతున్న కోడలిని అడిగింది అత్తగారు ‘‘దేని కోసం వెదుకుతున్నావమ్మా?’’ అంటూ! ‘‘అబ్బా.. మీకేం తెలుసని చెప్పాలి?’’ విసుక్కుంది కోడలు. చివుక్కుమంది అత్తగారి మనసు. వీళ్లే కాదు చాలా ఇళ్లల్లో చాలా మంది పెద్దవాళ్లకు ఈ భంగపాటు పరిపాటే. ‘‘నీకేం తెలీదులే.. నువ్వూరుకో’’ అనే మాటలూ సర్వసాధారణమే! ఇలాంటి మాటలు, అవమానాలు వినదల్చుకోలేదు మహారాష్ట్ర, థాణె జిల్లా, ఫంగాణె గ్రామంలోని అమ్మమ్మలు, నానమ్మలు. నిరక్షరాస్యులుగా, అంగుఠా ఛాప్లుగా ఉండదల్చుకోలేదు. వాళ్లకోసమే ప్రారంభమైన బడికి వెళ్లడం మొదలుపెట్టారు. బ్యాగులతో సూల్కెళ్తూ... అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున.. ఆ బడిపేరు ‘‘ఆజిబైచి శాల’’. దేశంలోనే మొట్టమొదటి వయోజన మహిళా పాఠశాల. యాభై ఏళ్లు నిండిన స్త్రీలను అక్షరాస్యులను చేయాలనే ఉద్దేశంతో రిటైర్డ్ జిల్లాపరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు యోగేందర్ బంగర్ దీన్ని స్థాపించాడు. స్థానికంగా ఉన్న మోతీరామ్ దలాల్ చారిటబుల్ ట్రస్ట్ సహకారం, భాగస్వామ్యంతో 2016, మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున స్టార్ట్ అయిందీ స్కూల్. నేటికి ఆ బడిలో మొత్తం 35 మంది వయోజన విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఈ బడికి సాధారణ స్కూళ్లకున్నట్లే కరిక్యులమ్ ఉంది. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బడివేళలు. ప్రార్థనతో బడి మొదలవుతుంది. పాఠ్యపుస్తకాల్లోని పాఠాలు కాక గేమ్స్, గార్డెనింగ్, పెయింటింగ్ లాంటివీ పాఠ్యాంశాల్లో భాగాలు. ఇవికాక కాలేజ్ పిల్లలు, ఇతర స్కూల్‌పిల్లలు వచ్చి వీళ్లకు కంప్యూటర్స్ వంటివీ నేర్పించి వెళ్తూంటారట. ఈ పెద్దవాళ్లూ ఆ పిల్లలకు తమ జీవన పాఠాలు, అనుభవాల గురించి చెప్తూంటారట. వారానికి ఒకసారో.. పదిహేను రోజులకు ఒకసారో.. లేదంటే స్కూళ్లు, కాలేజీలకు సెలవులున్నప్పుడో.. జాతీయ పండగలప్పుడో ఇలాంటి అనుభవ పాఠాలు, వ్యూస్ ఎక్స్ఛేంజ్ సెషన్స్ ఉంటాయట. ‘‘దీనివల్ల ఈ జనరేషన్ పోకడలను పెద్దవాళ్లు.. వాళ్ల ఎక్స్‌పీరియెన్స్‌ను చిన్నవాళ్లు తెలుసుకునే వీలుంటోంది. ఈ సెషన్స్‌తో పెద్దవాళ్ల కన్నా చిన్నవాళ్లకే ఎక్కువ ఉపయోగంగా ఉంది. పెద్దవాళ్లు తాము చదువుకోగలుగుతున్నందుకు కాన్ఫిడెంట్‌గా కనపడుతున్నారు. కాని పిల్లలు వీళ్లతో కలుస్తూ మాట్లాడుతూ.. వాళ్ల కష్టసుఖాలను తెలుసుకుంటూండడం వల్ల వాళ్లలో ఒకరకమైన ధైర్యం, మానసిక స్థయిర్యం పెరుగుతోంది. చాలామంది అమ్మాయిల్లో పిరికితనం, కంగారు పోయి.. స్థిరంగా ఆలోచించడం మొదలైందట. చిన్న విషయాలకే ఆందోళనపడ్డమూ తగ్గిందట’’ అంటారు ఈ స్కూల్ వ్యస్థాపకులు యోగేంద్ర బంగర్. అరవై ఏళ్ల నుంచి తొంభైఏళ్ల వయస్సున్న అమ్మమ్మలు, నానమ్మలు గులాబీరంగు చీర యూనిఫామ్, బ్యాగ్‌తో చాలా శ్రద్ధగా ఈ బడికి వెళ్తూంటారు. ‘‘సంతకం పెట్టడం వస్తే చాలు అనుకున్న మేము పుస్తకాలు చదవడం, ఫోన్ చూసుకోవడం, నంబర్లు ఫీడ్ చేసుకోవడం.. వంటివీ నేర్చుకోగలిగాం. కంప్యూటర్ గురించీ తెలుసుకున్నాం’’ అంటారు సంతోషంగా. -
నెల శిశువును హతమార్చిన నానమ్మ
సాక్షి, చెన్నై : ఆడ బిడ్డగా పుట్టడమే ఆ శిశువుకు శాపంగా మారింది. అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన నానమ్మే తనను హతమారుస్తుందని కూడా తెలియని ఆ శిశువు మరణం మిస్టరీ ఓ నర్సు రూపంలో వెలుగులోకి వచ్చింది. కృష్ణగిరిలో ఈఘతకం చోటు చేసుకుని ఉన్నది. కృష్ణగిరి, ధర్మపురి జిల్లాల్లో ఆడ శిశువు మరణాలు ఒకప్పుడు మరీ ఎక్కువే. ఆడ బిడ్డ పుట్టిందంటే క్షణాల్లో హతమార్చిన కషాయి కుటుంబాలు ఎన్నో. ఇక్కడి ఇతి వృత్తాంతో సినిమాలు సైతం తెరకెక్కి ఉన్నాయి. దీంతో ఆడ శిశు మరణాల కట్టడి చేయడానికి పాలకులు తీవ్రంగానే కొరడా ఝుళిపించారు. ప్రస్తుతం ఈ మరణాలు అదుపులోనే ఉన్నా, చాప కింద నీరులా గుట్టు చప్పుడు కాకుండా శిశు హత్యలు సాగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఓ కసాయి నాన్నమ్మే ఓ ఆడ శిశువును హతమార్చడం వెలుగులోకి వచ్చింది. రెండో బిడ్డ కూడా... కృష్నగిరి జిల్లా పోచ్చం పల్లి సమీపంలో పారూర్ నాగర్ కొట్టు గ్రామానికి చెందిన రాజా కూలి కార్మికుడు. రాజకు సత్యతో నాలుగేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఆరాద్య(3) కుమార్తె ఉంది. తన కుమారుడికి మగ బిడ్డ పుట్టాలని రాజ తల్లి పొట్టియమ్మాల్ మొక్కని దేవుళ్లు అంటూ లేదు. చివరకు రెండో సారిగా కోడలు గర్భం దాల్చడంతో , ఈ సారి పుట్టబోయేది మగ బిడ్డే అన్న «ధీమాతో పొట్టియమ్మాల్ ఉంటూ వచ్చింది. అయితే, గత నెల మరో పండంటి ఆడ బిడ్డకు సత్య జన్మనిచ్చింది. అప్పటి నుంచే పొట్టియమ్మాల్ రుస రుసలాడుతూ తన కోపాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. ఇరుగు పొరుగు వారు నచ్చ చెప్పడంతో ఆ బిడ్డను, కోడల్ని ఇంటికి తీసుకొచ్చింది. ఆ బిడ్డను ఎంతో అల్లారు ముద్దుగా పొట్టియామ్మల్ చూసుకుంది. అయితే, ఇదంతా నటనే అన్నది రాజ, సత్యలకు కూడా తెలియదు. ఈ నేపథ్యంలో గత వారం రాజ, సత్యలు సామాన్లు కొనుకున్నేందుకు బయటకు వెళ్లారు. వచ్చి చూడగా, పొట్టియమ్మాల్ బోరున విలపిస్తూ బిడ్డ ఊపిరి ఆడక తల్లడిల్లిందని, తాను చేయాల్సిందంతా చేశానని, ఉలుకు పలుకు లేదని కన్నీటి పర్యంతంతో నాటకాన్ని రక్తికట్టించింది. బిడ్డ మరణించడంతో ఓ బాక్స్‌లో పెట్టి ఇంటికి సమీపంలో ఖననం చేశారు. ఇంత వరకు అన్నీ బాగానే ఉన్నా, సోమవారం ఆ ఇంటికి వచ్చిన గ్రామ నర్సు రూపంలో అసలు గుట్టు బయటకు వచ్చింది. కసాయి నాన్నమ్మ అరెస్టు... బిడ్డకు టీకా వేయడం కోసం నర్సు మంగై ఆ ఇంటికి వచ్చింది. విషాదంతో ఉన్న సత్యను చూసి ఎక్కడ బిడ్డ అని ప్రశ్నించింది. జరిగిన విషయాన్ని ఆమెతో పంచుకుని సత్య విలపించింది. అన్ని విన్న మంగైను అనుమానం వీడ లేదు. బిడ్డ ఆరోగ్య వంతంగా ఉందని, తానే అన్ని రకాల పరీక్షలు నిర్వహించానని, ఎలా ఊపిరి ఆడ కుండా మరణిస్తుందని సత్య దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈ సమాచారాన్ని జిల్లా ఆరోగ్య శాఖ అధికారి దృష్టికి ఆ నర్సు తీసుకెళ్లింది. పోలీసు సహకారంతో ఆరోగ్య అధికారులు రంగంలోకి దిగడంతో పొట్టియమ్మాల్ రంగు బయట పడింది. తన కుమారుడికి మగ బిడ్డ పుట్టాలని తాను వేడుకోని దేవుళ్లు లేదని, అయితే, తొలి బిడ్డ ఆడ బిడ్డగా పుట్టడంతో సర్దుకున్నట్టు ఆమె పోలీసు దృష్టికి తెచ్చింది. ఈ సారైనా మగ బిడ్డ పుడుతాడుకుంటే, మళ్లీ ఆడ బిడ్డే పుట్టిందని, అందుకే తనకు ఇష్టం లేకున్నా, ఇంటికి రప్పించానని, తన కుమారుడు, కోడలుకు కూడా తెలియకుండా పాలలో మందు కలిపి ఇచ్చి హతమార్చి, ఊపిరి ఆడకుండా మరణించినట్టు నాటకం ఆడినట్టు వాంగ్ములం ఇచ్చింది. ఈ నర్సు మంగై రూపంలో తన బండారం బయటకు వచ్చిందని పేర్కొంటూ, ఆమె మీద తన కోపాన్ని ప్రదర్శించింది. దీంతో పొట్టియమ్మాల్ను అరెస్టు చేసిన పోలీసులు ఆ శిశువు మృత దేహాన్ని మంగళవారం బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. -
పెళ్లి కూతురుతో పూల ‘బామ్మలు’
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు సినిమాల్లో యువ రాణులు తమ చెలికత్తెలతో కలిసి పూల బుట్టలు పట్టుకొని పూదోటలకు వెళ్లి రావడం, గుళ్లూ గోపురాలు చుట్టి రావడం మనలో ఎక్కువ మంది చూసే ఉంటారు. మరి ఇలాంటి అనుభవం అమెరికాకు చెందిన లిండ్సే రాబీకి ఎక్కడ ఎదురయిందో తెలియదు గానీ, తన పెళ్లికి మాత్రం పూల బామలు కాకుండా పూల బామ్మలు కావాలని పంతం పట్టింది. అంటే తన నలుగురు బామ్మలు పూల బుట్టలు పట్టుకొని తన ముందు పూలు చల్లుకుంటూ నడుస్తుంటే పెళ్లి కూతురు దుస్తుల్లో ముస్తాబై తాను పెళ్లి పీటలపైకి నడిచి వస్తానంటూ తన మనోగతాన్ని పెళ్లి ఏర్పాట్లు చూసే పెద్దలకు చెప్పింది. అంతే లిండ్సే నలుగురు బామ్మలకు ఒకే నీలి రంగుపై నీలి, తెలుపు, కాస్త నలుపు రంగు చుక్కలు కలిగిన దుస్తులను ఆగ మేఘాల మీద వెళ్లి కుట్టి తెప్పించారు. లిండ్సే ముత్తవ్వ (తల్లి తల్లికి తల్లీ) కథ్లీన్ బ్రౌన్, 72 ఏళ్ల బెట్టీ బ్రౌన్, 76 ఏళ్ల వాండా గ్రాంట్ (వారిలో ఒకరు తన తల్లికి తల్లి కాగా, మరొకరు తన తండ్రికి తండ్రి), ఇక పెళ్లి కుమారుడు ట్యానర్ రాబీ తల్లి జాయ్ రాబీలు ఆ ఒకే తీరు దుస్తులను ధరించి అట్టలతో చేసిన పూల బుట్టలను పట్టుకొని పెళ్లి కూతురు కోరిక మేరకు ఆమె ముందు నడుస్తూ, దారంటూ పూల చల్లుతూ పెళ్లి కూతరును పీటలపైకి ఆహ్వానించారు. బామ్మలకు కూడా మనుమరాలిని అలా ఆహ్వానించడం తెగ ముచ్చటేసింది. బామ్మల పట్ల మనమరాలికున్న అనుబంధానికి ఈ వెంట్ నిదర్శనమని పెళ్లికి హాజరైన బంధువులు, మిత్రులు వేనోళ్ల ప్రశంసలు కురిపించారు. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలోని బెంటాన్ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఈ ముచ్చటైన సంఘటనను ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్ నటాలీ కాహో వాటిని ‘ఇన్స్టాగ్రామ్’ బిజినెస్ పేజీలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. వాటిని చూస్తున్న యూజర్లు ఎవరికి వారు, ఇలాంటి పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని కలలుగంటున్నారు. -
మనవరాలికి ప్రేమతో.. మిద్దె తోట
మనవలు, మనవరాండ్రకు నానమ్మలు ఎన్నో విలువైన బహుమతులు అందిస్తుంటారు. ఆట వస్తువులు, బొమ్మలు ఇతరత్రా సామగ్రి కొనుగోలు చేసి వారికి అందిస్తుంటారు. వారి మోములో ఆనందాన్ని నింపుతుంటారు. కానీ ఇక్కడ ఓ నానమ్మ విభిన్న ప్రత్యేకతను చాటుకున్నారు. ఏకంగా తన మనవరాలి కోసం మిద్దె తోటనే పెంచుతున్నారు. తన సంతానం ఎలాగూ వ్యవసాయ క్షేత్రాలు, మొక్కల మధ్య జీవితాన్ని గడపకపోవడాన్ని గమనించిన ఆమె తన ముద్దుల మనవరాలి కోసం ముద్దుముద్దుగా మిద్దె తోట పెంపకానికి ఉద్యుక్తులయ్యారు. బంజారాహిల్స్:బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 13లోని శ్రీ సాయినగర్‌లో నివసిస్తున్న ప్రభా పొనుగోటి ఇంటి మిద్దెపైకి వెళ్లి చూస్తే అక్కడ ఏపుగా పొరుగుతున్న కూరగాయల మొక్కలతో పాటు బోన్సాయ్ వృక్షాలు, పాతకాలం నాటి కలెక్షన్స్ విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇదంతా ఆమె తన మనవరాలి కోసం తయారు చేయడం విశేషం. సాయినగర్‌లో నివసించే ప్రభా పొనుగోటి తల్లిదండ్రులతో పాటు అత్తామామలది వ్యవసాయ నేపథ్య ఉన్న కుటుంబాలు. తండ్రి, మామ ఇద్దరూ రైతులు కావడంతో ఆమెకు తోటలన్నా, వ్యవసాయ క్షేత్రాలన్నా ఇష్టంగా ఉండేది. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత పంటలు చూడటం, కూరగాయల మొక్కలు కానరాకపోవడం ఆమెను ఒకింత ఇబ్బందికి గురి చేసింది. తన పిల్లలు ఎలాగూ వీటిని చూడలేదు. కనీసం తన మనవళ్లు, మనవరాళ్లైనా తోటలు చూడాలనే ఉద్దేశంతో తన ఇంటినే తోటగా మార్చేశారు. మనవరాలు ఇనారా కోసం ఆమె టెర్రస్‌పై ఏకంగా పెరటి తోట పెంచుతున్నారు. ఇందులో కూరగాయల మొక్కలతో పాటు తనకిష్టమైన బోన్సాయ్ వృక్షాలను కూడా పెంచుతున్నారు. ఆమె పెంచుతున్న కూరగాయల మొక్కలన్నీ ఆర్గానిక్‌వే కావడం విశేషం. ప్రస్తుతం చిక్కుడు, వంకాయ, బీన్స్, బెండకాయ, టమాట, పచ్చిమిర్చితో పాటు నాలుగు రకాల ఆకు కూరలు కూడా పండిస్తున్నారు. చూడచక్కని బోన్సాయ్ వృక్షాలు ప్రభా పొనుగోటి ప్రతిరోజూ మనవరాలు ఇనారాను తీసుకొని ఉదయం మిద్దె తోటలోకి అడుగు పెడతారు. వాటి సాగును పరిశీలిస్తారు. నీరు పోసి కలుపు తీస్తారు. ఇలా గంటపాటు మనవరాలితో కలిసి ఇక్కడే గడుపుతారు. ఇక సాయంత్రం మరో రెండు గంటలు ఈ తోటలోనే గడుపుతారు. ఇదంతా తన మనవరాలి కోసమే చేసినట్లు ఆమె వెల్లడించారు. కొడుకులు, కోడళ్లు ఉద్యోగాలకు వెళ్లిన సమయంలో ప్రభ ఒంటరితనం నుంచి దూరం కావడానికి ఈ మిద్దె తోటను వేదికగా మార్చుకున్నారు. ఒక వైపు తోటను పెంచుతూనే ఇంకోవైపు ఇళ్లంతా బోన్సాయ్ వృక్షాలతో నింపేశారు. వాటి ఆలనాపాలనా కూడా చూస్తుంటారు. ఇటీవలే ఈ తోటలోకి కొత్తగా పునాస మామిడి, జామ, లక్ష్మణ్ సీతాఫలం, అవకాడ్ మొక్కలు వచ్చి చేరాయి. వీటిని పెంచేందుకు వర్మీ కంపోస్టు కూడా తయారు చేస్తున్నారు. మట్టివాసన..ఆస్వాదన కుటుంబ సభ్యులందరూ పెరటి తోటను ఆస్వాదించేందుకు, మట్టి వాసన చూసేందుకు వీలుగా మిద్దె మొత్తం మొక్కలతో నింపేశారు. మనవరాలి కోసం ఏకంగా మినీ గార్డెన్‌ను తయారు చేశారు. ప్రస్తుతం ఇనారా 14 నెలల చిన్నారి. ఆమె పేరుతో ప్రతినెలకు ఒక మొక్క చొప్పున ఈ గార్డెన్లో పెంచుతున్నారు. వీటికి తోడు గ్రామీణ ఇళ్లలోని ఉండే కాగులు, ఇసుర్రాయి కూడా ఆమె కలెక్ట్ చేశారు. మొక్కల కోసం వాడిపారేసిన బకెట్లు, వాష్ బాక్స్‌లు సేకరించి అందులోనే వాటిని పెంచుతున్నారు. టైర్లు, కొబ్బరిపీచు ఇలా పడేసిన వ్యర్థాలన్నీ కూరగాయలు, మొక్కల పెంపకం కోసం వినియోగిస్తున్నారు. ప్రతిరోజూ మూడు, నాలుగు గంటలు ఈ తోటలో గడపడం వల్ల తను చాలా ఆరోగ్యంగా ఉన్నానని, ఇంటిల్లిపాది చక్కని గాలిని, వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారని ప్రభ వెల్లడించారు. -
అవును వారు బామ్మలే..కానీ!
లండన్ : జుట్టు ముగ్గుబుట్టవడం..ముడతలు పడిన చర్మం..ఉద్యోగం దూరమవడం ఇవన్నీ వయసు తెచ్చే మార్పులే. 60 దాటగానే అన్నీ అయిపోయాయనుకునే నిర్వేదం నుంచి 70లు దాటితేనే అసలైన జీవితాన్ని ఆస్వాదించవచ్చంటున్నారు ఈ నయా బామ్మలు. వయసు శరీరానికే కానీ మనసుకు కాదని చెప్పే వాళ్లని చూశాం కానీ, వయసు తమ శరీరానికీ దూరమే అన్నట్టు ఈ వృద్ధుల దినచర్య అందరి కళ్లకు కడుతోంది. బోల్డర్ అనే వెబ్సైట్ చేసిన పరిశోధనలో చలాకీ వృద్ధుల దూకుడు వెల్లడైంది. కృష్ణ రామా అనుకుంటూ కాలక్షేపం చేస్తారనుకునే 70 ఏళ్ల పైబడిన వారినే ఈ వెబ్సైట్ పలుకరించగా వారి చురుకైన లైఫ్‌స్టైల్ చూసి విస్తుపోయే పరిస్థితి ఎదురైంది. వీరిలో ఒకరు 82 ఏళ్ల వయసులో ప్రేమలో పడి వివాహం చేసుకున్నవారు కాగా, మరొకరు 85 ఏళ్ల వయసులో ఏకంగా రోజూ ఒక మైలు దూరం స్విమ్ చేస్తున్నారు. వీరంతా ఇప్పటికీ ఏదో ఒక పనిచేస్తుండటం గమనార్హం. తమ జీవితంలో అత్యంత సంతోషదాయకమైన దశ ఇదేనని వారంతా చెప్పుకొచ్చారు. వృద్ధాప్యం జీవితంలో అత్యంత దుర్భర దశ అనుకుని అసలు వాస్తవం గ్రహించాలని వీరిని ఇంటర్వ్యూ చేయగా భిన్నమైన పరిస్ధితి తమ పరిశోధనలో వెల్లడైనట్టు ఆ వెబ్సైట్ పేర్కొంది. 87 ఏళ్ల వయసులో టెన్నిస్.. తాను ఇప్పటికి 70 ఏళ్లు పైగా టెన్నిస్ ఆడుతున్నానని కెనడాలోని ఒంటారియాకు చెందిన ముఫీ గ్రీవ్ (87) వెల్లడించి ఇంటర్వ్యూ చేసిన వారిని షాక్‌కు గురిచేశారు.తాను 30, 40, 50 ఇలా వయసు పెరుగుతున్న కొద్దీ ఎలాంటి సమస్యలూ ఎదుర్కోలేదని, జీవితంలో ఎదుగుతున్న కొద్దీ ఎదో రంగంలో విజయం సాధిస్తే తమకు లభించే ఆత్మవిశ్వాసం ఎంతో గొప్పదని ఆమె చెప్పుకొచ్చారు. తాను 62 ఏళ్ల వయసులో బ్రైన్ ట్యూమర్‌తో బాధపడినా సానుకూల దృక్పథంతో సమస్యలు అధిగమించానని వెల్లడించారు. సమస్యలతో దిగాలుపడి కూర్చోవడం తనకు ఇష్టం ఉండదని పాజిటివ్ మైండ్‌తో పరిగెత్తడమే తనకు తెలిసిన విషయమన్నారు. గోల్ప్‌లో 90 స్కోర్ చేయడమే తన తదుపరి లక్ష్యమని చెప్పారు. ఏడు పదుల వయసులో స్విమ్మింగ్ ఎలరీ మెక్గొవన్ ఏడు పదుల వయసు దాటిన ఈ బామ్మ స్విమ్మింగ్‌లో పలు వరల్డ్ ఛాంపియన్షిప్లను కైవసం చేసుకున్నారు. రష్యాలో వింటర్ స్విమ్మింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో తనకు గాయమైనా రేస్ ముగిసే వరకూ రక్తం కారుతున్నా తనకు ఆ విషయం తెలియలేదని ఎలరీ చెబుతారు. తాను ప్రతివారం పైలేట్స్, స్పిన్ క్లాసులు తీసుకుంటానని ఆరోగ్యకర ఆహారం, పరిమితంగా రెడ్‌వైన్ తీసుకోవడమే తన ఆరోగ్య రహస్యమని ఆమె చెప్పకొచ్చారు. గత ఏడాది తన కుమారుడు జేమ్స్ హఠాన్మరణం చావు పట్ల తొలిసారిగా భయాన్ని కల్పించిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడే జీవితాన్ని చాలించాలని లేదని, కానీ నా వయసు ఏటికేడు పెరుగుతూ పోతోందని అన్నారు. అయినా తాను జీవితంలో సాధించాలనే పట్టుదలను వీడలేదని, అంటార్కిటికాను ఈదడం తన తదుపరి టార్గెట్ అని చెప్పారు. పదహారు ఫ్లోర్లు: అవలీలగా ఎక్కేస్తారు రీటా గిల్మోర్ 87 ఏళ్ల వయసులో తన రెస్టారెంట్‌లోని 16 ఫ్లోర్లనూ ఎక్కిదిగుతారు. కస్టమర్లు, సిబ్బందితో కలివిడిగా ఉంటూ బ్రెయిన్‌ను చురుకుగా ఉంచుకుంటానని ఆమె చెబుతారు. మద్యం ముట్టకుండా..పొగ తాగకుండా ఉండటమే తాను ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణమనే రీటా రోజూ మేకప్ వేసుకోవడమే కాదు స్ధానిక దుస్తుల కంపెనీకి ఇప్పటికీ మోడల్‌గా వ్యవహరిస్తున్నారు. -
కిలాడీ బామ్మ
గుంటూరు, తెనాలిరూరల్: ఆ బామ్మ వయసు 71 ఏళ్లు. ఆలయంలో ఉంటే అందరూ హరే రామ హరే కృష్ణ అంటూ భజనలు చేస్తుందనుకుంటారు. జాగ్రత్త దొంగలుంటారు అని హెచ్చరిస్తుంటే ఎంతటి పెద్దరికమని ముచ్చట పడతారు. అలా అని ఆ బామ్మను దగ్గరకు రానిచ్చారో.. ఒంటి మీద నగలుపోయి ఘొల్లుమంటారు. వామ్మో బామ్మ.. అంటూ గగ్గోలు పెడతారు.. ఇలా ప్రజలను బురిడీ కొట్టించి నగలు కొట్టేస్తున్న కిలాడీ బామ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. వృద్ధ మహిళలే లక్ష్యంగా నేరాలకు పాల్పడుతున్న ఆమె నుంచి రూ. 2.10 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీన పరుచుకున్నారు. తెనాలి టూ టౌన్ సర్కిల్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ ఆర్ఎస్ కిషోర్‌కుమార్ ఈ కిలాడి బామ్మగురించి వివరించారు. సత్తెనపల్లి పట్టణంలోని రంగా కాలనీకి చెందిన జవంగుల సరోజిని(71) తెనాలిలో నివసిస్తున్న తన కొడుకు వద్దకు వచ్చి పోతుండేది. మార్చిలో వచ్చిన ఆమెకు అదే నెల 13వ తేదీన పట్టణ నందులపేటలోని వినాయకుడి గుడి ధ్వజ స్తంభ ప్రతిష్ట జరుగుతుందని తెలిసింది. 13వ తేదీ ఉదయం గుడికి వెళ్లి ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొంది. కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. వీరిలో వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుంది. రద్దీగా ఉండడంతో ‘చోరులతో జాగ్రత్తగా ఉండాల’ంటూ మహిళలతో మాటలు కలిపింది. చీర కొంగులు కప్పుకోవాలంటూ తానే స్వయంగా కప్పింది. ఈ క్రమంలో పట్టణ మోదుకూరి వారి వీధికి చెందిన కొత్తపల్లి అన్నపూర్ణ(65), నందులపేటకే చెందిన పొందూరి సుగుణకుమారి(63)ల మెడలలోని బంగారు నానుతాడులను అపహరించింది. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించగా టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కెమెరాల్లో కనపడకుండా నేరాలు.. సరోజిని నేరాలకు పాల్పడిన తీరు గురించి తెలుసుక్ను పోలీసులు నివ్వెరపోయారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నా, వాటిలో పడకుండా జాగ్రత్తలు తీసుకుని మరీ గొలుసులు అపహరించింది. బాధితులు ఫిర్యాదుతో ఆలయంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులకు ఎవరూ ఫుటేజ్లలో కనబడలేదు. సీసీ కెమెరాలను గుర్తించి, వాటిలో పడకుండా జాగత్తపడింది. ఎటువంటి ఆధారం లేకుండా పోయిందనుకుని పోలీసుల దర్యాప్తు వేగం తగ్గించారు. అంతలోనే, ధ్వజ స్తంభ మహోత్సవాన్ని స్థానికులు సెల్ఫోన్లు, కెమెరాలతో వీడియో తీశారని తెలుసుకున్నారు. వాటిని తెప్పించి పరిశీలించి నిందితురాలిగా అనుమానం ఉన్న వృద్ధురాలి ఫోటో తీయించగలిగారు. ఈమెపైనే బాధితులూ అనుమానం వ్యక్తం చేశారు. ఇక నిందితురాలు ఈమేనని నిర్ధారించుకున్న పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. తెనాలి రజకచెరువు వద్ద శనివారం ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం ఒప్పుకుందని, ఆమె వద్ద నుంచి మొత్తం 72 గ్రాముల రెండు బంగారు నానుతాడులను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. నిందితురాలు గతంలో విజయవాడలోని ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్టు తెలిసింది. సమావేశంలో ఎస్ఐ గన్నవరపు అంజయ్య, సిబ్బంది ఉన్నారు. -
బామ్మ కోసం భామ
బామ్మ కోసం భామ ఏం చేసిందో తెలుసా? సినిమా పవర్ఫుల్ మాధ్యమమే కాదు, ఒక స్టేజీ తరువాత అది నటీనటులకు ఒక వ్యసనంలా మారిపోతుంది కూడా. ఇక యువ నటి కీర్తీసురేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేటి క్రేజీ కథానాయకి తనే. చిన్న వయసులోనే కమర్శియల్ హీరోయిన్ పాత్రలతో పాటు, హీరోయిన్ ఓరియెంటెడ్ కధా చిత్రాలు చేసేస్తూ ప్రశంసలు అందుకుంటున్న నటి కీర్తీసురేశ్. యువత ఈ బ్యూటీ చిరునవ్వుకే ఫ్లాట్ అయిపోతున్నారంటే అతిశయోక్తి కాదేమో. మహానటి చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించి అందరి అభినందనలను అందుకున్న కీర్తీసురేశ్ మలయాళం, తమిళం, తెలుగు అంటూ దక్షిణ భాషలన్నింటిలోనూ నటిస్తూ బహుభాషా నటిగా గుర్తింపు పొందుతోంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఒక్క చిత్రం చేతిలో లేకపోయినా, ప్రశాంతత తరువాత వచ్చే తుపాన్ మాదిరి త్వరలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించబోతోందనే ప్రచారం జోరందుకుంది. అదేవిధంగా విజయ్‌తో ముచ్చటగా మూడోసారి అట్లీ దర్శకత్వంలో నటించనుందని టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఇందులో అగ్రనటి నయనతార హీరోయిన్గా ఇప్పటికే ఎంపికైనట్లు సమాచారం. అదేవిధంగా టాలీవుడ్లో రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ చిత్రంలోనూ కీర్తీకి హీరోయిన్ అవకాశం ఎదురుచూస్తోందనే ప్రచారం జరుగుతోంది. మళ్లీ బిజీ అవుతున్న కీర్తీసురేశ్ తన బామ్మ కోసం అవకాశాల వేట మొదలెట్టిందట. కీర్తీసురేశ్ది సినీ నేపథ్యం అన్న విషయం తెలిసిందే. ఈమె తల్లి మేనక గతంలో రజనీకాంత్‌కు జంటగా నెట్రికన్ చిత్రంలో నటించారన్నది గమనార్హం. అలా కొన్ని చిత్రాల్లో నటించిన మేనక వివాహానంతరం నటనకు దూరమయ్యారు. అయితే ఆమె తల్లి సరోజ కూడా నటినే. అయితే సరోజ ఇప్పటికీ నటనను కొనసాగిస్తున్నారు. కీర్తీసురేశ్ హీరోయిన్గా నటించిన రెమో, కార్తీ హీరోగా నటించిన కడైకుట్టి సింగం వంటి చిత్రాల్లో బామ్మగా నటించారు. ఇక సీనియర్ నటుడు చారుహాసన్‌కు జంటగా దాదా కథానాయకిగా నటించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఇలాంటి పరిస్థితుల్లో కీర్తీసురేశ్ తనకు కథలు చెప్పడానికి వచ్చే దర్శక నిర్మాతలతో తన బామ్మకు ఈ చిత్రంలో ఏదైనా పాత్ర ఉందా అని అడుగుతోందట. పాత్ర అంటే ఏదో ఒకటి ఇచ్చి తన బామ్మ ప్రతిభను అగౌరపరచరాదు, ఆమె మూడు తరాలు నటి. అందుకే మంచి బలమైన పాత్రలు ఉంటే ఇవ్వండి అని అడుగుతోందట. చాలా మంది హీరోయిన్లు తన కోసం గానీ, అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు కోసం అవకాశాలు అడుగుతారు. కీర్తీ ఏమిటీ తన బామ్మ కోసం అవకాశాల వేట మొదలెట్టింది అని సినీ వర్గాలు పరిహాస్యం చేస్తున్నారు బామ్మ ఫుల్‌టైమ్ నటి కాదు బామ్మ కోసం అవకాశాల వేట ప్రచారం నటి కీర్తీసురేశ్ చెవికి చేరింది. దీంతో కాస్త ఆగ్రహానికి గురైంది. తానేంటి బామ్మ కోసం అవకాశాలు అడగడం ఏమిటి ఇదంతా అసత్య ప్రచారం. అయినా తన బామ్మ ఫుల్‌టైమ్ నటి కాదు. ఆమె కోసం అవకాశాలను అడగాల్సిన అవసరం లేదు అని కీర్తీసురేశ్ స్పందించింది. -
అమ్మా..? నాయనమ్మా..?
సాక్షి, హైదరాబాద్: కన్నపేగు గొప్పదా..? పెంచిన ప్రేమ గొప్పదా..? అన్నది తెలుసుకోనేందుకు అటు తల్లికి, ఇటు నాయనమ్మకు ఓ చిన్నారి పరీక్ష పెట్టాడు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. టోలిచౌకీకి చెందిన సయ్యద్ గౌస్, ఫర్హీన్ సుల్తానా దంపతులకు సయ్యద్ సయీద్(4) కుమారుడు ఉన్నాడు. ఏడాదిక్రితం గౌస్ గుండెపోటుతో మృతి చెందడంతో చిన్నారి సయీద్ తన నాయనమ్మ నసీంబాను వద్దే పెరుగుతున్నాడు. భర్త మరణంతో పుట్టింటికి చేరుకున్న ఫర్హీన్ సుల్తానా గత కొంత కాలంగా తన కుమారుడిని తనకు అప్పగించాలని అత్తపై ఒత్తిడి తెస్తోంది. అయితే చిన్నారి సయీద్ మాత్రం తల్లిదగ్గరికి వెళ్లేందుకు ససేమిరా అంటూ నాయనమ్మ వద్దే ఉంటానని మొరాయిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఫరీన్ సుల్తానా తన కుమారుడిని అప్పగించాలంటూ కోరుతూ డీసీపీని ఆశ్రయించింది. ఆయన ఆదేశాల మేరకు పోలీసులు గురువారం చిన్నారి సయీద్‌తో పాటు తల్లి ఫరీన్, నాయనమ్మ నసీంబానులను స్టేషన్‌కు పిలిపించారు. అక్కడ కూడా తాను నాయనమ్మ వద్దే ఉంటానంటూ చిన్నారి ఏడుస్తూనే తల్లిని ఒప్పించేందుకు ప్రయత్నించాడు. రెండు రోజుల్లో తన తండ్రి సంవత్సరీకం ఉందని అది అయిపోయాక వస్తానని అతను ఏడుస్తున్నా తల్లి విన లేదు. ‘తమ్ముడు ఆయాన్ ఉన్నాడు కదా వాడిని చూసుకుంటూ ఉండు నేను నాయనమ్మతో ఉంటానంటూ’ తల్లిని ఒప్పించేందుకు శతవిధాల ప్రయత్నం చేశాడు. చిన్నారిని తల్లితో పంపాలా, నాయనమ్మకు అప్పగించాలా అన్న దానిపై న్యాయసలహా కోరనున్నట్లు పోలీసులు తెలిపారు. -
96 ఏళ్ల వయసులో ‘లిటరసీ’ పరీక్షకు..
తిరువనంతపురం: కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ నిర్వహించిన పరీక్షకు హాజరైన 96 ఏళ్ల కార్తియాని అమ్మ..చదువుకు వయసు అడ్డంకి కాదని నిరూపించింది. చదవడం, రాయడం నేర్చుకోవాలనే బలమైన కోరికతో కార్తియాని ఆరు నెలల క్రితం అక్షరాస్యత కార్యక్రమం ‘అక్షరలక్షం’లో పేరు నమోదు చేయించుకుంది. శిక్షణా కాలంలో గణితం, చదవడం, రాయడంపై పట్టు సాధించిన ఆమె..ఆదివారం తిరువనంతపురంలో పరీక్ష రాసి కోర్సును దిగ్విజయంగా పూర్తిచేసింది. -
పెళ్లి ఆపేందుకు నానమ్మ హత్య
సోదరుడి పెళ్లి ఆపేందుకు ఓ యువకుడు ఘోరానికి పాల్పడ్డాడు. సొంత నానమ్మనే హత్య చేశాడు. ఆపై నగల కోసమే హత్య జరిగినట్లు నమ్మించేందుకు, వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకొనిపరారయ్యాడు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు 48గంటల్లో కేసును ఛేదించారు. నిందితుడు గతంలోనూ ఓ మహిళను హత్య చేసి, జైలుకు వెళ్లొచ్చినట్లు విచారణలో తేలింది. హైదరాబాద్, కీసర: తమ్ముడి పెళ్లి జరిగితే తనకు ఇంట్లో స్థానం ఉండదని భావించిన ఓ యువకుడు పెళ్లిని వాయిదా వేయించేందుకు సొంత నాయనమ్మనే దారుణంగా హత్యచేసిన సంఘటన కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. సోమవారం కీసర పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజ్గిరి డీసీపీ ఉమామహేశ్వరశర్మ , ఏసీపీ రషీద్, కీసర సీఐ సురేందర్‌గౌడ్ కేసు వివరాలు వెల్లడించారు. కీసరకు చెందిన పురాన పెద్దమ్మ(80)కు ముగ్గురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు, కుమార్తెలు. వారిలో చిన్న కుమారుడు లక్ష్మయ్య స్థానిక నందిని నగర్లో ఉంటున్నాడు. అతడికి ముగ్గురు కుమారులు శ్రీకాంత్, శ్రీహరి, శ్రీధర్. అందులో శ్రీకాంత్, శ్రీహరి వివాహాలు అయ్యాయి. అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. చిన్న కొడుకు శ్రీధర్ వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు పెళ్లి సంబందాలు చూస్తున్నారు. ఓ కంపెనీలో పనిచేస్తున్న శ్రీకాంత్ మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో రెండు గదులు మాత్రమే ఉండటంతో, శ్రీధర్ వివాహం జరిగితే తాను ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోవాల్సి ఉంటుందని భావించిన అతను ఎలాగైనా సోదరుడికి పెళ్లి జరకుండా అడ్డుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో తన మేనత్త నర్సమ్మ వద్ద ఉంటున్న నాయనమ్మ(పురాన పెద్దమ్మ)ను హత్య చేస్తే ఓ ఏడాదిపాటు పెళ్లి వాయిదా పడుతుందని పథకం పన్నాడు. ఇందులో భాగంగా శనివారం పోచమ్మ బస్తీలో ఉంటున్న మేనత్త ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న పురాన పెద్దమ్మ మనవడిని భోజనం చేయమని చెప్పగా, అతను వద్దని చెప్పడంతో వృద్ధురాలు భోజనం చేసి పడుకుంది. ఇదే అదునుగా భావించిన శ్రీకాంత్ ఆమె మొహంపై దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. ఆభరణాల కోసమే దొంగలు హత్య చేసినట్లు నమ్మించేందుకు ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. సీసీ కెమెరాల ఆధారంగా పట్టివేత... వృద్ధురాలి హత్య కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నింధితుడిని అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన రోజు నిందితుడు అనుమానాస్పదంగా తిరగడాన్ని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. 48 గంటల్లోనే హత్య కేసును చేధించిన కీసర పోలీసు సిబ్బందిని డీసీపీ, ఏసీపీ లు అభి నందించి, నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. గతంలోనూ ఓ మహిళనుహత్య చేసిన శ్రీకాంత్ ... నిందితుడు శ్రీకాంత్ గతంలోనూ ఓ మహిళను హత్య చేసి జైలు శిక్ష అనుభవించాడు. 2011లో తనతో పాటు పని చేస్తున్న మహిళతో పరిచయం పెంచుకున్న అతను ఆమెను నమ్మించి శివారులోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకున్నాడు. ఈ కేసులో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. -
అమ్మమ్మ అయిన యంగ్ హీరోయిన్
‘జూలి 2’తో బాలీవుడ్లో సెటిల్ అవుదామనుకున్న హీరోయిన్ లక్ష్మీరాయ్‌కు నిరాశే ఎదురయ్యింది. బాలీవుడ్ ఈ భామను పట్టించుకోక పోయినా దక్షిణాది పరిశ్రమ ఈ ముద్దుగుమ్మను ఆదరిస్తూనే ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక మలయాళ చిత్రం ‘ఓరు కుట్టనందన్ బ్లాగ్’, తమిళ చిత్రం ‘నీయ 2’ తో పాటు మరో నాలుగు సినిమాలు ఉన్నాయి. వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న లక్ష్మీరాయ్ తన అభిమానులకు ఒక శుభవార్త చెప్పారు. 33 ఏళ్ల ఈ హీరోయిన్ అమ్మమ్మ అయ్యిందంట. లక్ష్మీరాయ్‌కి ఇంకా వివాహమే కాలేదు. మరి అలాంటిది అమ్మమ్మ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా..? విషయం ఏంటంటే ఈ ‘కాంచన’ భామ రెండు కుక్కలను పెంచుకుంటుంది. వాటినే తన సొంత పిల్లల్లా భావిస్తోంది. ఈ మధ్యే ఆ రెండు కుక్కలు మరో రెండు కుక్క పిల్లలకు జన్మనిచ్చాయి. ఇదే విషయాన్ని లక్ష్మీరాయ్ తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘చాలామంది నా ఈడు అమ్మాయిలు ఇపాటికే అమ్మలయ్యారు. కానీ నేను మాత్రం ఏకంగా అమ్మమ్మనే అయ్యాను. నా బిడ్డలు ‘మియు’, ‘లియు’.. ‘టిఫాని’, ‘పకో’ అనే మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఇప్పుడు నా ప్రపంచం మరింత పెద్దదయ్యింది’ అనే సందేశాన్ని ట్విటర్లో పోస్టు చేశారు. ప్రస్తుతం లక్ష్మీరాయ్ తన పిల్లల(కుక్కపిల్లల) కోసం క్లౌడ్‌నైన్ ఆస్పత్రిలో ఉన్నారు. తెలుగులో ‘ఖైది నం 150’ సినిమాలో ఈ భామ మెగాస్టార్ చిరంజీవితో కలిసి ప్రత్యేక గీతంలో మెరిసిన సంగతి తెలిసిందే. -
అమ్మ రాదు..! అవ్వ లేదు.!!
సాక్షి, కడప : అమ్మకోసం ఎదురుచూపులు.. కళ్లు కాయలు కాస్తున్నా కనిపించడం లేదు.. అమ్మ మాట విందామన్నా వినిపించడం లేదు.. అమ్మ రాక..నాన్న లేక..అనుక్షణం పిల్లలను తలచుకుంటూ..పోషించడం కోసం పండుటాకు పడరాని కష్టాలను పడింది.. పిల్లల కోసం ప్రతినిత్యం పనికి వెళ్లి వారిని కంటికి రెప్పలా కాపాడుకుంది. ఒక వైపు అనారోగ్యంతో మంచంలో పడిన భర్తకు ఏ లోటు రాకుండా చూసుకుంటూ.. మరోవైపు చిన్నారుల కష్టాన్ని మోస్తూ వచ్చిన అవ్వను దేవుడు కూడా కానరాని లోకానికి తీసుకెళ్లాడు. రెండేళ్లుగా ఎన్నో కష్టాలు...మరెన్నో బాధలు అనుభవించిన అవ్వ ఇక తిరిగి రాని లోకానికి వెళ్లిందన్న నిజాన్ని జీర్ణించుకో చిన్నారులు రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తోంది. బతికున్న సమయంలో కోడలి కోసం పోలీసు స్టేషన్‌కు..కడప కలెక్టరేట్‌కు..ఏజెంట్ల వద్దకు వెళ్లి మొర పెట్టుకుని బాధను వినిపిస్తూ వచ్చినా.. ఆ పండుటాకు వేదన అరణ్యరోదనగానే మిగిలింది. గాలివీడు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన రామసుబ్బమ్మ మృతితో చిన్నారులు అనాథలుగా మారారు. కష్టాల్లో ఉన్న కుటుంబం కోసం కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలవాలని కువైట్‌కు వెళ్లింది చిన్నారుల తల్లి పార్వతమ్మ. దాదాపు మూడేళ్ల క్రితం వెళ్లిన ఆమె నుంచి ఇప్పటివరకు ఎలా ఉందో కూడా సమాచారం లేదు. ఒక్కసారంటే ఒక్కసారికూడా పిల్లలతోగానీ, కుటుంబ సభ్యులతోగానీ మాట్లాడిన పాపాన పోలేదు. నలు గురు పిల్లలను, భర్తను, కుటుంబాన్ని వదిలి సుదూ ర ప్రాంతానికి వెళ్లిన ఆమె ఆ తర్వాత కనిపించడం లేదు. ఇప్పుడు ఆ పిల్లలు అమ్మ కావాలంటూ మూడేళ్ల నుంచి కన్నీరు పెడుతూనే ఉన్నారు. రెండేళ్లుగా అన్నీ తానై.. పార్వతమ్మ కువైట్‌కు వెళ్లిన తర్వాత ఏడాదికి భర్త నాగేందర్ నాయుడు భార్యపై బెంగతో.. మనో వేదనకు గురై.. మంచం పట్టి తనువు చాలించాడు. అమ్మ ఎక్కడో దేశంగానీ దేశంలో ఉన్నా ఆచూకీ తెలియకపోవడం.. తండ్రి చనిపోవడంతో ఇక భారమంతా నానమ్మ రామసుబ్బమ్మపైనే పడింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. నలుగురు చిన్నారులను పోషించడం నానమ్మ, తాతయ్యకు రోజురోజుకు కష్టతరంగా మారింది. అయినా మనవళ్లు, మనవరాళ్లు కావడంతో ఇతరులకు ఏమాత్రం తీసిపోకుండా అల్లారుముద్దుగా పెంచుకుంటూనే వచ్చింది. రామసుబ్బమ్మ భర్త వెంకట రమణ నాయుడు కూడా మంచంలో ఉండడంతో అటు పెద్దాయనను, ఇటు చిన్నారులను అన్నీ తానై పోషిస్తూ వచ్చింది. ఏడాది కిందట నాన్న.. ఇప్పుడు నానమ్మ పార్వతమ్మ మూడేళ్ల క్రితం కువైట్కని వెళ్లడం, తర్వాత సమాచారం లేకపోవడంతో భర్త రెడ్డి నాగేంద్ర కుంగిపోతూ చనిపోగా....అప్పటి నుంచి భారమంతా నాన్నమ్మ రామసుబ్బమ్మ మీద పడినా పోరాడుతూ వచ్చింది. విధి వక్రించి బుధవారం ఉదయం పాముకాటుకు గురై తనువు చాలించింది. పొలం అమ్మి.. కూలి పనులు చేసి.. గాలివీడు మండలం గొట్టివీడు పంచాయతీలోని రెడ్డివారిపల్లెకు చెందిన రామసుబ్బమ్మ వయస్సు దాదాపు 70 ఏళ్లు. మనవళ్లు, మనవరాళ్లను పోషించడానికి తన వద్ద ఉన్న అర ఎకరా పొలాన్ని అమ్మి చిన్నారులను చదివిస్తోంది. అంతేకాకుండా కుటుంబ అవసరాల నిమిత్తం ప్రతిరోజు ఉపాధి హామీ కూలి పనులకు వెళుతూ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారింది. ఉన్న ఫళంగా రామసుబ్బమ్మ మృతి చెందింది. ఆమెను స్వదేశానికి రప్పించండి : ఎమ్మెల్యే జిల్లా ఉన్నతాధికారులు, విదేశాంగ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని అనాథలైన పిల్లల తల్లి పార్వతమ్మను స్వగ్రామానికి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు. అనాథ పిల్లలకు అండగా ఉండి సహాయ, సహకారాలను అందిస్తామన్నారు. అనాథలైన చిన్నారులు ఒకవైపు తల్లి కనిపించకపోవడం.. మరోవైపు ఇటీవలే తండ్రి మరణించడంతో చిన్నారుల వేదన అంతా ఇంతా కాదు. ఆలనా పాలనా చూడాల్సిన తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోవడంతో ఆ భారమంతా చూస్తూ వచ్చిన రామసుబ్బమ్మ బుధవారం మృతి చెందడంతో పిల్లలు అనాథలుగా మారారు. వనజ (12) 7వ తరగతి చదువుతుండగా, రెడ్డి నాగేంద్ర (9) నాల్గవ తరగతి, శైలజ (7) మూడవ తరగతి, సునీల్ (4)లు దిక్కులేని వారుగా మిగిలారు. అయితే గాలివీడు ఎస్ఐ మంజునాథ్ సంబం«ధిత ఏజెంట్లతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోనూ కువైట్‌లో ఉన్న తల్లిని రప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం చిన్నారులు చదువుకునేందుకు...కుటుంబ పోషణకు దయార్థ హృదయులు ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. -
వీరాభిమానిని సత్కరించిన రజనీ
పెరంబూరు: సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను వయోభేదం లేకుండా ఆబాలగోపాలం అభిమానిస్తుంటారన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే 78 ఏళ్ల బామ్మ ఆయన వీరాభిమానే కాదు, త్వరలో నెలకొల్పనున్న రజనీకాంత్ రాజకీయ పార్టీ సభ్యత్వ నమోదు కోసం వయోభారాన్ని కూడా లెక్కచేయకుండా తీవ్రంగా కృషి చేయడం విశేషం. ఆమె పేరు శాంత. తిరుత్తూర్కు చెందిన ఈ బామ్మ రజనీకాంత్ వీరాభిమాని అట. రజనీకాంత్ త్వరలో ప్రారంభించబోయే రాజకీయ పార్టీలో సభ్యులను చేర్చడంలో అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారట. ఈ విషయం గురించి రజనీ ప్రజా సంఘ నిర్వాహకులు రజనీకాంత్ దృష్టికి తీసుకురాగా ఆయన చాలా సంతోషపడ్డారు. శాంత చిరకాల కోరిక రజనీకాంత్‌ను ఒక్కసారి కలిసి ఆయనతో మాట్లాడాలన్నదట. విషయం తెలుసుకున్న రజనీకాంత్ శుక్రవారం బామ్మ శాంత పోయస్‌గార్డెన్‌లోని తన ఇంటికి పిలిపించి శాలువ కప్పి సత్కరించారు. -
‘జిగేల్ రాణి’ సాంగ్‌కి స్టెప్పులేసిన హీరోయిన్ బామ్మ
-
రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి
సిర్పూర్(టి): మండలంలోని పారిగాం గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగు సంవత్సరాల చిన్నారి మతి చెందగా ఓ వద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. సిర్పూర్(టి) ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని ధనోరా గ్రామానికి చెందిన నాగుబాయి అనే వద్ధురాలు తన మనవరాలైన రాంటెంకి ఇషాని(04) ని తీసుకోని పారిగాం గ్రామంలోని ఓ పెళ్లి వేడుకలకు వచ్చింది. పారిగాం గ్రామంలో ఆటో దిగి గ్రామంలో జరిగే పెళ్లి వేడుకలకు వెళ్తుండగా సిర్పూర్(టి) నుంచి లోనవెల్లి గ్రామం వైపు వెళ్తున్న లోనవెల్లి గ్రామానికి చెందిన ఔత్కర్ శరత్ బైక్‌తో వీరిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇషాని మతి చెందింది నాగుబాయికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. -
మృత్యు తీగలు
ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం రెండు ప్రాణాలను బలితీసుకుంది. చేతికందే ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని ప్రజలు విన్నవించుకున్నా పెడ చెవినపెట్టారు. ఫలితంగా అవ్వ, మనవరాలు విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డారు. తనకల్లు: ఉస్తినిపల్లికి చెందిన రిటైర్డ్ టీచర్ రామచంద్ర కొన్నేళ్లుగా తనకల్లులోని ఇందిరానగర్‌లో నివాసముంటున్నాడు. ఆయనకు భార్య ఆదిలక్ష్మి ( చిన పాపాయమ్మ) ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీనివాసులుకు మోహన్, వెన్నెల అనే ఇద్దరు పిల్లలున్నారు. శ్రీనివాసులు తన ఇద్దరు పిల్లలను తల్లిదండ్రుల వద్ద వదిలి బతకుదెరువు కోసం భార్య రమాదేవితో కలిసి బెంగుళూరుకు వెళ్లాడు. పిల్లలు మోహన్ నల్లచెరువు మోడల్ స్కూల్ల్లో తొమ్మిదో తరగతి చదువుతుండగా, వెన్నెల (13)అదే పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. వెన్నెల బుధవారం పాఠశాలకు వెళ్లకుండా బట్టలు ఉతకాలనే ఉద్ధేశ్యంతో ఇంటి పట్టునే ఉంది. భోజనం చేసిన అనంతర తాను బట్టలు ఉతకడానికి పాత ఇంటి వద్దకు వెళ్లుతున్నానని చెప్పి వెళ్లింది. కొద్దిసేపటి తరువాత అవ్వ ఆదిలక్ష్మి (70) కూడా మనవరాలికి సాయంగా బట్టలు ఉతకడానికి వచ్చింది. వీధిలైట్ వైరు తగిలి..విద్యుదాఘాతం ఉతికిన బట్టలను కరెంట్ స్తంభానికి ఇంటికి కట్టిన జీఏ వైరు (ఇనుప వైరు) పైన వేయడానికి వెన్నెల వెళ్లింది. వీధిలైటుకు సంబంధించిన విద్యుత్ తీగ కిందకు వేలాడుతోంది. గాలికి ఆ తీగలు ఇనుప వైరుకు తాకుతోంది. ఇది తెలియని వెన్నెల బట్టలు ఆరేస్తుండగా విద్యుత్‌షాక్ కొట్టడంతో గట్టిగా అరించింది. గమనించిన అవ్వ కాపాడేందు కోసం వెన్నెలను గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. విగతజీవులై పడిఉన్న అవ్వ, మనవరాలిని చూసి బంధువులు, గ్రామస్తులు బోరున విలపించారు. ఎస్ఐ శ్రీనివాసులు, ఏఎస్ఐ బాలరాజు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించి, ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. లైన్మెన్ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం ట్రాన్స్‌కో లైన్మెన్ల నిర్లక్ష్యం వల్లనే నిండు ప్రాణాలు బలయ్యాయని గ్రామస్తులు ఆరోపించారు. ప్రమాదకరంగా ఉన్న కరెంట్ వైర్లను తొలగించాలని లైన్మెన్లకు ఎంత చెప్పినా పట్టించుకోకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరానగర్‌లో ఇళ్లపై విద్యుత్ తీగలు చేతికందే ఎత్తులో ఉన్నాయని, తొలగించాలని కోరితే డబ్బు డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రమాదానికి కారణమైన లైన్మెన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
అతిలోక సుందరి అమ్మ(మ్మ) మనోళ్లే
రాయచోటి రూరల్ / కడప కల్చరల్: నిజంగా ఆమె అతిలోక సుందరే. ఆదివారం ఆమె ఇక లేరన్న వార్త విన్న జిల్లా వాసులు ఎంతో బాధపడ్డారు. శ్రీదేవి పెద్దలు మన జిల్లా సరిహద్దు ప్రాంతానికి చెందిన వారేనని తెలియడంతో ఒకింత ఊరట చెందారు. శ్రీదేవి అమ్మమ్మ రాయచోటి సమీపంలోని గ్యారంపల్లె గ్రామానికి చెందిన వారు. దిగ్గజనటి తల్లి ఈ గ్రామంలో జన్మించారని ఆ ప్రాంతానికి చెందినవారు శ్రీదేవి సమీప బంధువులు తెలుపుతున్నారు. తర్వాత తిరుపతికి, అటు నుంచి చెన్నైకి వెళ్లినట్లు తెలుస్తోంది. మొత్తంమీద అతిలోక సుందరి శ్రీదేవి మూలాలు మన జిల్లాలోని అతి సమీప ›ప్రాంతానికి చెందినవి కావడం విశేషం. శ్రీదేవి గత ఏడాది ఆగస్టు 13న తన పుట్టిన రోజు సందర్భంగా తిరుమలకు వచ్చారు. ఆమెను కలిసివచ్చామని పిన్నమ్మ మునిరాజమ్మ, చెబుతున్నారు. ఆ సమయంలో తీసుకున్న కొన్ని ఫొటోలను సాక్షికి ఇచ్చారు. -
ఈ బామ్మ సూపర్ మోడల్..
లండన్ : 82 ఏళ్ల వయసులో ఓ బామ్మ హాట్ మోడల్స్‌కు దీటుగా మోడలింగ్‌లో దూసుకుపోతోంది. ఉద్యోగం నుంచి రిటైరైన బార్బర్ అనే బామ్మ సీనియర్ మోడల్ కావాలంటూ ఓ పత్రికలో ప్రచురించిన యాడ్‌ను చూసి ఇంప్రెస్ అయి ఫ్యాషన్ ప్రపంచంలో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె ఆస్ర్టేలియాలో ప్రముఖ యాడ్ ఏజెన్సీ ఎంజీఎంటీకి మోడల్‌గా ఒప్పందంపై సైన్ చేశారు.తనకు ఎంతో ఇష్టమైన దుస్తులను వేసుకునే అవకాశం ఇప్పుడు కలగడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారామె. యువతులకే అందమైన దుస్తులు అందుబాటులో ఉన్నాయని, తమలాంటి వారికోసం ఇలాంటి దుస్తులు మార్కెట్లో లేవని తానెప్పుడు తన ముగ్గురు కుమార్తెలతో అంటుంటానని బార్బర్ చెప్పుకొచ్చారు. మోడలింగ్‌లో అవకాశాల కోసం ప్రయత్నిస్తానని తాను చెప్పగా తన కుమార్తెలు ప్రోత్సహించారన్నారు. మహిళల ఫ్యాషన్ బ్రాండ్ అడ్రిప్ట్కు ప్రకటనల షూట్ కోసం ఇటీవల ఆమె తన స్వస్థలం టామ్‌వర్త్ నుంచి బ్రిస్బేన్కూ వెళ్లారు. ఈ వయసులోనూ ఆమె ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటంతోనే ఆమె కోరుకున్న వృత్తిలో రాణిస్తూ అందరికీ స్ఫూర్తినిస్తున్నారని అడ్రిఫ్ట్ ప్రతినిధి చెప్పారు. మోడలింగ్‌లో ప్రతి క్షణాన్నీ తాను ఆస్వాదిస్తున్నానని బార్బర్ చెపుతున్నారు. -
అడ్డంగా బుక్కయ్యారు..
హైదరాబాద్, బంజారాహిల్స్: యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌కు చెంది న విజయ్ డిగ్రీ ఫెయిల్ అయ్యాడు. వరుసకు సోద రుడైన వాసు పదో తరగతి ఫెయిల్ అయ్యాడు. ఇద్ద రూ హైటెక్ సిటీ రోడ్డులో రాత్రి పూట ఛాయ్బండి నడిపించి ఉపాధి పొందాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం రూ.50 వేల వరకు ఖర్చవుతాయని అంచనా వేసిన ఇద్దరూ పక్కా ప్లాన్ వేశాడు. తన ఇంటికి వచ్చిన అమ్మమ్మ మెడలోనుంచి గొలుసు తస్కరించి అమ్మగా వచ్చిన డబ్బుతో ఛాయ్ బండి పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే స్నాచింగ్చేసే క్రమంలో చేసిన చిన్న తప్పుతో పోలీసులకు దొరికిపోయారు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌పరిధిలో చోటు చేసుకున్న ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లోని పోలీస్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న ప్రమీల కుమారుడు విజయ్ ఆవారాగా తిరుగుతున్నాడు. ఇటీవల అతని అమ్మమ్మ వెంకటమ్మ ఊరి నుంచి వచ్చింది. ఆమె మెడలో గొలుసు తస్కరించాలని అన్న వాసుతో కలిసి పథకం వేశాడు. బుధవారం ఉదయం వాసు ముసుగు తో వచ్చి గొలుసు తెంచుకొని పరారయ్యాడు. పోలీసు లు నిందితులపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. స్నాచింగ్ చేసింది తానేనని ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలని దొంగతనానికి పాల్పడినట్లు వెల్లడించారు. అందుకు అమ్మమ్మ గొలుసునే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాకు కరాటే వచ్చు.. నేను కిక్ ఇస్తే అంతే..!
-
నాకు కరాటే వచ్చు.. నేను కిక్ ఇస్తే అంతే..!
ప్రయాణ సమయంలో ఓ ప్యాసింజర్‌కు అరుదైన అనుభవం ఎదురైంది. మద్యం సేవించి బస్సులో ప్రయాణిస్తున్న యువకుడిపై బామ్మ దాడికి దిగింది. ఈ సంఘటన కజికిస్తాన్‌లోని ఒక సిటీలో చోటుచేసుకుంది. బస్సులో ఉన్న మరో ప్రయాణికుడు ఈ ఘటనను మొబైల్ ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. వివరాలివి.. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలను పరిశీలిస్తే.. వృద్ధురాలు హఠాత్తుగా ఆ యువకుడి చెంపపై కొట్టింది. కూర్చొన్న సీటులో నుంచి లేవమని అతనిపై గట్టిగా అరిచింది. ‘అంతటితో ఆగకుండా బస్సులో నుంచి వెళ్లిపోవాలని చెప్పింది. మద్యం సేవించిన వాళ్లు అంటే నాకు నచ్చదు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని’ అతడితో అన్నది. ఆ యువకుడు బామ్మ నుంచి దూరంగా వెళ్లుతూ.. ‘మీ చేతులను అదుపులో ఉంచుకోవాల’ని అన్నాడు. అతడి మాటలకు ఆమె కోపంతో మరింత రెచ్చిపోయింది. ఆ యువకుడిని వెనక్కి నెట్టి, కాళ్లతో కూడా తన్నింది. ‘నాకు కరాటే వచ్చు.. నేను కిక్ ఇస్తే అంతే సంగతి. నాకు మందు తాగే వాళ్లంటే ఇష్టం ఉండద'ని కేకలు వేసింది. పాపం ఆ యువకుడు బామ్మ దెబ్బకు భయపడి అక్కడి నుంచి వెళ్లి బస్సులోనే మరోవైపు కూర్చున్నాడు. -
ఈ అవ్వకు 102 ఏళ్లు!
హాయ్ ఫ్రెండ్స్... ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోలోని అవ్వ పేరు బోయ సుంకమ్మ. కూడేరు మండలం అంతరగంగ గ్రామానికి చెందిన ఈమె వయసు ఎంతనుకున్నారు... 102 ఏళ్లు! అబ్బో అని ఆశ్చరపోతున్నారా? నిజమేనండీ బాబూ.. ఆ గ్రామస్తులు చెబుతున్నదానిని బట్టి చూస్తే అవ్వకు 102 ఏళ్లు అనేది స్పష్టంగా తెలిసిపోతోంది. ఇంత వయసు వచ్చిన ఇంకా ఆరోగ్యంగానే ఉన్న ఈ అవ్వకు తోడుగా ఓ మనవడు ఉన్నాడు. అతను కూడా ఉద్యోగరీత్య మరో ప్రాంతానికి వెళ్లి వస్తుంటాడు. ఇక అవ్వకు బీపీ లేదు.. షుగరూ లేదు! ఇక కంటి చూపు సమస్యలంటరా? కళ్లకు అద్దాలు పెట్టుకున్న సందర్భాన్ని తామెన్నడూ చూడలేదని స్థానికులు అంటున్నారు. ఇంటి, వంట పనులూ అవ్వనే చేస్తుంటుంది. ఒకరి సాయం లేకుండా నడుస్తుంది. ఇక అవ్వ దగ్గర బోలెడు కథలు వినేందుకు పిల్లలతో పాటు పెద్దలూ ఆసక్తి చూపుతుంటారు. ఇంతకు అవ్వ ఆరోగ్య రహస్యమేమిటంటారా? అయితే ఈ విషయంగా అవ్వనే అడిగితే.. ‘కొర్ర అన్నం, రాగిముద్ద, జొన్న రొట్టెలు ఆహారంగా తీసుకోవడంతో పాటు వయసు పైబడే వరకూ నిరంతర వ్యవసాయ పనులు చేయడమేనని చెబుతున్నారు. ఔరా! భలే అవ్వరా!! అని కితాబునిస్తున్నారా.. అయితే ఓకే. - కూడేరు (ఉరవకొండ) -
అత్యాచారం కేసులో అమ్మమ్మ అరెస్ట్
కొల్లం: కేరళలో మనవరాలిపై అత్యాచార ఘటనలో భర్తకు సహకరించిన దారుణమైన సంఘటన వెలుగు చూసింది. కొల్లాం జిల్లా కుంద్రాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మైనర్ బాలికలైన మనవరాళ్లపై తాత అత్యాచారానికి పాల్పడితే.. ఆయనకు అమ్మమ్మ సహకరించడం కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు శనివారం బాలికల అమ్మమ్మను (62) అరెస్ట్ చేశారు. మనవరాళ్లపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో ఆమెను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మనుమరాళ్లపై గత రెండేళ్లకాలంగా విజయన్ అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో తాత లైంగిక వేధింపులకు తాళలేక 10 సం.రాల బాలిక ఇటీవల ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఈ దారుణం వెలుగు చూసింది. బాలికలపై భర్త అఘాయిత్యం, లైంగిక వేధింపులు ఆమెకు తెలుసుఅనీ, ఈ మహిళ సాయం చేసినట్టుగా పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఆమె భర్త విక్టర్ అలియాస్ విజయన్ ను రెండు రోజుల క్రితం అరెస్టు చేశారు. మూత్రపిండాల వ్యాధి చికిత్స చేయించుకుంటున్న ఆమెను ఆసుపత్రి నుంచి జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అయిన తరువాత ఆమెను జైలుకు తరలించానున్నామని దర్యాప్తు అధికారి, కొట్టారకార డిప్యూటి ఎస్పీ.దర్యాప్తు అధికారి కృష్ణకుమార్, చెప్పారు. 376 (అత్యాచారం చేసినందుకు శిక్ష) , 305 (పిల్లల ఆత్మహత్యకు ప్రేరేపణ) సహా, పోస్కో (లైంగిక నేరాలు నుండి పిల్లలు రక్షణ) సహా, పలు ఐపిసి సెక్షన్ల కింద కేసులు, కేసులు నమోదు చేశామన్నారు. -
నాయనమ్మకు బాలికచే అంత్యక్రియలు
టి.నరసాపురం : ఎవరైనా మరణిస్తే కుమారుడు తలకొరివి పెట్టడం హిందూ సంప్రదాయం. వారసులు ఎవరూ లేకపోవడంతో నాయనమ్ మృతదేహానికి మనుమరాలే అంత్యక్రియలు నిర్వహించిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం బందంచర్ల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన వీరంకి వెంకాయమ్మ (48) అనారోగ్యంతో గురువారం మృతి చెందింది. వెంకాయమ్మ భర్త గతంలోనే చనిపోయారు. ఈమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉండగా, కుమారుడు మధు 2002లో ప్రమాదంలో మృతిచెందాడు. అప్పటికి అతని భార్య రాధ గర్భిణి. తండ్రి మరణానంతరం జన్మించిన కుమార్తెకు హిమశ్రీగా నామకరణం చేశారు. హిమశ్రీ, ఆమె తల్లి రాధ బొర్రంపాలెంలో అమ్మమ్మ ఇంటివద్ద ఉంటున్నారు. హిమశ్రీ అదే గ్రామంలో 9వ తరగతి చదువుతోంది. బాలిక నాయనమ్మ వెంకాయమ్మ శుక్రవారం మరణించగా, వారసులెవరూ లేకపోవడంతో ఆమె మనుమరాలు హిమశ్రీ ముందుకొచ్చి అంత్యక్రియలు జరిపించింది. -
ఓ వైపు ఆనందం..మరోవైపు విషాదం
ముంబై:కొన్ని సందర్భాల్లో విధి చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకవైపు ఆనందాన్నిస్తే, మరొకవైపు విషాదాన్ని కూడా మిగులుస్తుంది. ఇటీవల ఈ తరహా ఘటనే భారత ఆల్ రౌండర్ జయంత్ యాదవ్ ఇంట ఎదురైంది. ఇంగ్లండ్ తో ముంబైలో జరిగిన టెస్టులో జయంత్ యాదవ్ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నసమయంలోనే అతని అమ్మమ్మ కన్నుమూయడం ఆ కుటుంబంలో విషాదాన్ని తీసుకొచ్చింది. 'కొడుకు ఆడుతున్న మూడో మ్యాచ్‌ను టీవీలో ఆసక్తిగా చూస్తున్నా. పెద్ద స్కోరు సాధిస్తాడనే ధీమాతో టీవీకి అతుక్కుపోయా. కాకపోతే అదే సమయంలో మా అత్తయ్య మృతి చెందిందంటూ ఫోన్ వచ్చింది. దాంతో హడావుడిగా ఢిల్లీ నుంచి జలంధర్ వెళ్లిపోయా. అయితే అక్కడ దిగగానే జయంత్ సెంచరీ చేసిన విషయం తెలిసింది. ఒకవైపు విషాదం..మరొకవైపు ఆనందం. ఏమి చేయాలో తెలియని పరిస్థితి నాది. ఈ విషయాన్ని వెంటనే జయంత్ కు కూడా చెప్పలేదు. సెంచరీ చేసిన మూడ్‌లో ఉన్న జయంత్‌ను డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆ విషయం ఆలస్యంగా చెప్పాం'అని తండ్రి జయ్ సింగ్ యాదవ్ విధివిలాపాన్ని గుర్తు చేసుకున్నాడు. -
పాపం.. పాపను బంతిలా విసిరికొట్టింది
మనవడు కావాలని కోరుకున్న ఓ మహిళ.. కోడలు ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఉన్మాదిలా ప్రవర్తించింది. అభంశుభం తెలియని రెండునెలల చిన్నారి మనవరాలిని గొంతునులిమి చంపేసి నేలపై విసిరికొట్టింది. హరియాణాలోని బహదూర్‌గఢ్‌లో ఈ దారుణం జరిగింది. సుదేష్ అనే మహిళ మనవడు కావాలని కోరుకుందని, రెండు నెలల క్రితం కోడలు ఆడ్డబిడ్డకు జన్మనిచ్చిందని, అప్పటి నుంచి కోడలిని వేధించిందని పోలీసులు చెప్పారు. పుట్టింటిలోనే ఉండాల్సిందిగా ఆమెను హింసించేవారు. మంగళవారం కోడలు బిడ్డను తీసుకుని అత్తమామల ఇంటికి వచ్చింది. సుదేష్ కోడలితో గొడవపెట్టుకుని, మనవరాలి గొంతుపిసికి విసిరేసింది. కోడలు వెంటనే పాపను తీసుకుని ఆస్పత్రికి వెళ్లగా, అప్పటికే చిన్నారి చనిపోయినట్టు వైద్యులు చెప్పారు. ఆమె ఫోన్ చేసి ఈ విషయాన్ని తండ్రికి చెప్పింది. పోలీసులు సుదేష్తో పాటు ఆమె భర్త, కొడుకుపై కేసు నమోదు చేశారు. -
బామ్మ కోరిక తీరకుండా చేసిన దొంగ
నోయిడా: ఓ దొంగ తన కారును ఎత్తుకుపోయి బామ్మ చివరి కోరిక తీరకుండా చేశాడు. ఆమె అస్తికలు గంగా నదిలో కలపకుండా చేసి ఓ మనుమడిని విషాదంలో మునిగేలా చేశాడు. ఎందుకంటే ఆ దొంగ ఎత్తుకుపోయిన ఆ కారులోనే బామ్మ అస్తికలతో కూడిన కలశం ఉంది కనుక. వివరాల్లోకి వెళితే.. నోయిడాలోని సెక్టార్ 27కు చెందిన సుమిత్ అనే 25 ఏళ్ల వ్యక్తికి ఓ బామ్మ ఉంది. ఆమె తీవ్ర అనారోగ్యంతో చనిపోయింది. దీంతో ఆమె అంత్యక్రియలు నిర్వహించి చితా భస్మాన్ని ఓ కలశంలో ఉంచి తన కారులో పెట్టాడు. ఇంటికొచ్చాక కారును ఇంటిముందు పార్క్ చేసి పని పూర్తి చేసుకొని గంగానదిలో కలిపేందుకు వెళదామని బయటకెళ్లి చూడగా ఆ కారును ఎవరో ఎత్తుకెళ్లారు. ఆ కారును ఎత్తుకెళ్లడం చూశామని చుట్టుపక్కలవారు చెప్పడంతో ఆ వైపుగా పరుగెత్తినప్పటికీ లాభం లేకుండాపోయింది. ఆ దొంగ కారుతో పారిపోయాడు. ఇప్పటికీ ఐదు రోజులైనా కారు జాడ తెలియలేదు. ఆ దొంగ ఇప్పటికే ఈ కలశాన్ని పారేసి ఉండొచ్చని, కారు బెంగకంటే తన బామ్మ చివరి కోరికను తీర్చలేకపోయానే అన్న బాధ తనకు ఎక్కువగా ఉందని అతడు వాపోతున్నాడు. -
ప్రియాంకకు కష్ట సమయం..
ముంబై : బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నివాసంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె అమ్మమ్మ శుక్రవారం ఉదయం మృతి చెందింది. చిన్నప్పటి నుంచి ప్రియాంక 'నానీ'కి చాలా క్లోజ్. షూటింగుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆమె తన అమ్మమ్మకు సంబంధించి ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకుంటుంది. వీలు కుదిరినప్పుడల్లా నానీ కోసం సమయం కేటాయించేది. ఇటీవల ప్రియాంక పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న సమయంలో కూడా ఆమె అమ్మమ్మ అక్కడే ఉన్నారు. ఎన్నోసార్లు తన నానీతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతుంటుంది ప్రియాంక. కాగా ప్రియాంక తండ్రి క్యాన్సర్ తో 2013 జూన్‌లో మరణించారు. ఆమె తన తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. నాన్నతో కలిసున్న ఓ మరపురాని ఫొటోని గురువారం తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది ప్రియాంక. అంతలోనే ఆమెకు ఎంతో అనుబంధం ఉన్న నానీ శాశ్వతంగా దూరమవడం విచారకరం. ప్రియాంకకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలంటూ ఆమె సన్నిహితులు సందేశాల ద్వారా విచారం వ్యక్తం చేస్తున్నారు. -
బావిలో పడి నాయనమ్మ, మనవరాలు మృతి
చిల్లకూరు : నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం ఐదవ తరగతి విద్యార్థిని నాగలక్ష్మి బట్టలు ఉతికేందుకు గ్రామంలోని నేల బావిలోకి దిగి ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయింది. కాపాడేందుకు వెళ్లిన ఆమె నాయనమ్మ పోలమ్మ (60) కూడా నీళ్లలో మునిగి ప్రాణాలు విడిచింది. నాయనమ్మ, మనవరాళ్ల మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
పెద్ద చదువులు చదువుతా
స్కూల్కెళ్లి పెద్ద పెద్ద చదువులు చదవాలని ఉంది. యాక్టర్ మహేష్‌బాబును కలవాలని ఉంది. ఎప్పుడూ ఇంట్లోనే పడుకుని ఉండటం చాలా కష్టంగా ఉంది. అమ్మ కూడా లేదు. ఈ వయసులో నానమ్మను చాలా బాధ పెడుతున్నాను. - సహన -
అమ్మ,అమ్మమ్మని నరికేశాడు..
అనంతపురం అర్బన్ : ఆస్తి కోసం కన్నతల్లిని, అమ్మమ్మను దారుణంగా నరికి చంపిన ఘటన సోమవారం అనంతపురం జిల్లా గుత్తి రోడ్డులో చోటుచేసుకుంది. తల్లి పుష్పలత(42), అమ్మమ్మ బాలనాగమ్మ(58) లు సంఘటనాస్థలంలోనే మృతిచెందారు. నిందితుడు కిరణ్ కుమార్ పరారీలో ఉన్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఒక్క క్షణం ఆలస్యం చేసినా..
పగిడ్యాల (కర్నూలు) : ప్రమాదవశాత్తు కాలు జారి కేసీ కాలువలో పడి నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్న మనవడు, మనవరాలిని రక్షించేందుకు తన ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా కేసీ కెనాల్లోకి దూకి రక్షించేందుకు ప్రయత్నించిన నాయనమ్మ కూడా ప్రమాదంలో చిక్కుకుంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా పగిడ్యాలలో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. స్థానిక దేవనగర్ కాలనీకి చెందిన సుగుణమ్మ కేసీ కాలువలో బట్టలు ఉతకడానికి వెళ్లింది. ఈ క్రమంలో ఆమెతో పాటు మనవరాలు అనిత(7), మనవడు కృపావరం(10)లను వెంటబెట్టుకుని వెళ్లింది. సుగుణమ్మ బట్టలు ఉతుక్కోవడంలో నిమగ్నమై ఉండగా మెట్లపై కూర్చున్న మనవరాలు అనిత, మనవడు కృపావరం ఆకతాయిగా నీళ్లలోకి దిగి నీటిప్రవాహాంలో చిక్కుకుని ప్రమాదానికి గురయ్యారు. ఇది గమనించిన వృద్ధురాలు ఇద్దరి పిల్లలను రక్షించేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున కేకలు వేస్తూ నీళ్లలోకి దూకి రక్షించే ప్రయత్నం చేసింది. అయితే ఇద్దరు పిల్లలు ఆమెను చుట్టేయడం వలన మునిగిపోసాగింది. అదే సమయంలో ఈతకు వచ్చిన భరత్, ఆంజనేయలు అనే యువకులు ఇది గమనించి వెంటనే కాలువలోకి దూకి వారిని రక్షించారు. ఆ యువకులు నీటిలో దూకేందుకు ఒక్క క్షణం ఆలస్యం చేసినా ముగ్గురి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయేవని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. -
బామ్మను చంపిన మనవడు
గరివిడి (విజయనగరం జిల్లా) : కుటుంబకలహాల నేపథ్యంలో బామ్మను మనవడు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన శనివారం సాయంత్రం విజయనగరం జిల్లా గరివిడి మండలం కాపుచంభాం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కాపుచంభాం గ్రామానికి చెందిన యడ్ల గొల్లబాబు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా తన బామ్మ యడ్ల నర్సమ్మ(63)తో శనివారం గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో గొల్లబాబు బామ్మను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం మండల పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
మనవడి ని పెళ్లి కొడుకును చేసి...
ముషీరాబాద్: అల్లారు ముద్దుగా పెంచుకున్న మనవడు పెళ్లికొడుకయ్యాడు. అతడిని తనివి తీరా చూసుకొని.. నిండు మనసుతో దీవించిన ఆమె సంతోషం పట్టలేకో ఏమో... అంతలోనే అనంతలోకాలకు వెళ్లి పోయింది. దీంతో ఆ పెళ్లి మండపంలో మోగాల్సిన భాజాభంత్రీలు మూగబోయాయి. పెళ్లిని తాత్కాలికంగా నిలిపి వేసి అమ్మమ్మ అంత్యక్రియలను నిర్వహించారు. వివరాలు.. ముషీరాబాద్‌లోని సాయిరెడ్డి పటేల్‌నగర్ అందరికీ సుపరిచితం. 1950కు ముందు ఆ ప్రాంతంలో సాయిరెడ్డిపటేల్ పెద్ద భూస్వామి. అతనికి చెందిన భూములే రాంనగర్, అడిక్‌మెట్ తదితర ప్రాంతాలు. అతను మృతి చెందాక అతను ఉండే వీధిని సాయిరెడ్డి పటేల్‌నగర్‌గా పిలుస్తున్నారు. అతని ము నిమనవడు సందీప్‌రెడ్డి వివాహం - మేఘనతో గురువారం ఉదయం 11 గంటలకు కొంపల్లిలో జరగాల్సి ఉంది. అయితే వివాహానికి ముందు బుధవారం రాత్రి సందీప్‌రెడ్డిని అతడు నివసించే అల్వాల్‌లో పెళ్లి కొడుకును చేశారు. ఈ వేడుకకు సాయిరెడ్డిపటేల్ కొడుకు రాంచంద్రారెడ్డి భార్య దేవేంద్రమ్మ ముషీరాబాద్ నుంచి వచ్చారు. మనువడిని పెళ్లి కొడుకును చేయగా చూసి మనసారా దీవించింది. కొద్దిసేపటికే అక్కడే కన్ను మూసింది. దీంతో వివాహాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. భౌతిక కాయాన్ని ముషీరాబాద్‌కు తీసుకొచ్చి బాపూజీనగర్ శ్మశాన వాటికలో నిర్వహిం చారు. దీంతో సాయిరెడ్డిపటేల్ గల్లీతో పాటు ముషీరాబాద్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
నిజం చెప్పిన పాపానికి...వాతలు..!