మియాపూర్‌: డబ్బుల కోసం అమ్మమ్మ కర్కశత్వం.. కూతురి పిల్లలనే కనికరం లేకుండా.. | Miyapur: Grandma Kidnap And Sons, Demands Rs 30 Lakhs | Sakshi
Sakshi News home page

మియాపూర్‌: డబ్బుల కోసం అమ్మమ్మ కర్కశత్వం.. కూతురి పిల్లలనే కనికరం లేకుండా..

Published Fri, Feb 18 2022 11:38 AM | Last Updated on Fri, Feb 18 2022 2:18 PM

Miyapur: Grandma Kidnap And Sons, Demands Rs 30 Lakhs - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మియాపూర్‌: సొంత అమ్మమ్మ మానవత్వం మరిచి రూ.30 లక్షలు డబ్బులిస్తేనే మనవళ్లను పంపుతానని కూతురును బెదిరించడంతో ఆమె మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ లింగానాయక్‌ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మియాపూర్‌ మదీనాగూడలో నివాసముంటున్న రుహీ వైద్యురాలు. పదేళ్ల క్రితం ముదాసర్‌ అలీ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఎనిమిది సంవత్సరాల అర్ఫాన్, ఐదేళ్ల అర్హాన్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త అలీ ఏడాదిన్నర క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ క్రమంలో తల్లి ముంతాజ్, అక్క రోషనాతో కలిసి మదీనాగూడలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆస్తి మీద కన్నేసిన తల్లి, అక్క జనవరిలో ఇద్దరు పిల్లలను తీసుకొని వారి సొంత ఊరు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి తీసుకెళ్లిపోయారు.
చదవండి: స్నేహను ప్రేమిస్తున్నానని చెప్పి.. తర్వాత మరో అమ్మాయితో పెళ్లన్నాడు.. చివరికి!

అప్పటి నుండి పిల్లలను తల్లి రుహీకి కనిపించకుండా చేశారు. దీంతో రుహీ పిల్లల కోసం సత్తుపల్లి వెళ్లగా అక్కడ బంధువులందరూ ఆమె పై దాడి చేసి కారును సైతం లాక్కొని పంపించేశారు. దీంతో తల్లి, మిగతా కుటుంబ సభ్యులపైన రుహీ బుధవారం రాత్రి  మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కిడ్నాప్‌ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా గురువారం మియాపూర్‌ పోలీసులు రుహీ దగ్గర బంధువైన సలీమ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. బాధితురాలు రుహీ మానసిక పరిస్థితి సరిగా లేదని, పిల్లలను పట్టించుకోవడం లేదని వారి భవిష్యత్‌ దృష్యా తాము తీసుకెళ్లామని రుహీ తల్లి ముంతాజ్‌ తెలిపారు. పిల్లల అమ్మమ్మగా తమకు సర్వ హక్కులు కల్పించాలని మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు రుహీ తల్లి ముంతాజ్‌ తెలిపింది.
చదవండి: Hyderabad: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోం.. కూతురి గోల్డ్‌ చైన్‌ విషయమై భర్తతో గొడవ... దాంతో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement