
మృతి చెందిన కాటురాజా, కాశిఅమ్మాల్ (ఫైల్)
సాక్షి, చెన్నై: పదేపదే తిడుతున్నారంటూ 16 ఏళ్ల బాలుడు అవ్వా, తాతపై కోపం పెంచుకున్నాడు. అర్ధరాత్రి గాఢనిద్రలో ఉన్న వారిద్దరినీ సజీవ దహనం చేశాడు. వివరాలు.. సేలం జిల్లా ఆత్తూరు సమీపంలో కొత్తంపాడి గ్రామం భారతీ నగర్‌కు చెందిన కాటురాజా(75) రైతు. ఆయనకు భార్య కాశిఅమ్మాల్(65)తో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిలో రెండో కుమారుడైన కుమార్ కుటుంబం తల్లిదండ్రుల పంట పొలంలోని గుడిసెకు పక్కనే మరో ఇంట్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం వేకువజామున కాటురాజా, కాశిఅమ్మాల్ నిద్రిస్తున్న గుడిసె తగల బడింది. కుమార్‌తో పాటుగా, పరిసర వాసులు ఆర్పేందుకు యత్నించారు.
అగ్నిమాపక సిబ్బంది అర్ధగంట శ్రమించి మంటల్ని అదుపు చేశారు. లోనికి వెళ్లి చూడగా, ఆ దంపతులు సజీవ దహనం కావడంతో మృతదేహాల్ని పోస్టుమారా్టనికి తరలించారు. డీఎస్పీ ఇమాన్ వేల్ జ్ఞానశేఖరన్ తొలుత ప్రమాదంగా భావించినా, గుడిసెకు బయట గడియ పెట్టి ఉండడంతో కొడుకులను అనుమానించారు. అదే సమయంలో కుమార్ తనయుడు (16) పోలీసుల్ని చూసి భయపడడంతో అతడ్ని తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో తానే ఆ గుడిసెకు నిప్పు పెట్టినట్టు అతడు అంగీకరించాడు. పదేపదే తనను అవ్వా, తాత తిడుతుండడంతోనే ఆగ్రహించి ఈ ఘాతకానికి ఒడి గట్టిన ట్లు ఆ బాలుడు వెల్లడించాడు. దీంతో ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment