grand son
-
మనవడికి ప్రాణభిక్ష పెట్టిన 70 ఏళ్ల అమ్మమ్మ..ఎలా అంటే!
ఆధునిక కాలంలో అవయవదానం సాధారణంగా మారిపోయింది. కానీ ఇంకా చాలామంది తన ప్రాణానికి ముప్పు వస్తుందేమో అని భయపడిపోతారు. అవగాహన ఉన్నవారు మాత్రం ఒక కిడ్నీని, లివర్‌లోని కొంత భాగాన్ని దానమిచ్చేందుకు ముందుకు వస్తున్నారు. కానీ 70 ఏళ్ల బామ్మ తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ తన మనవడిని ఎలాగైనా రక్షించుకోవాలని తాపత్రయపడింది. ధైర్యంగా కిడ్నీని దానం చేసి నిస్వార్థ ప్రేమకు ప్రతిరూపంగా నిలిచింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో జరిగింది.వివరాల్లోకి వెళితే.. జబల్పూర్లోని సిహోరాకు చెందిన యువకుడు (23) గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. అతని రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో అతనికి కిడ్నీ మార్పిడి చేయడం తప్ప వేరే మార్గం లేదని వైద్యులు తెలిపారు. కిడ్నీ దాతలకోసం కుటుంబ సభ్యులు అన్వేషణ మొదలు పెట్టారు. కుటుంబ మిగిలిన సభ్యులతో పోలిస్తే బామ్మ, మనవడి బ్లడ్ గ్రూప్ ఒక్కటేనని రక్త పరీక్షల్లో తేలింది. వారిద్దరికీ సంబంధిత పరీక్షలు చేయగా, బామ్మ కిడ్నీ మ్యాచ్ అయ్యింది. అటు బామ్మ కూడాతన కిడ్నీని డొనేట్ చేయడానికి అంగీకరించింది. నెల రోజులపాటు బామ్మ శారీరక సామర్థ్యాన్ని పరిశీలించిన అనంతరం కిడ్నీ మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. అమ్మమ్మ ధైర్యంతో ముందుకువచ్చ తన మనవడికి కొత్త జీవితాన్ని ఇవ్వడం విశేషంగా నిలిచింది.కిడ్నీమార్పిడిఆపరేషన్ విజయవంతమైందనీ, ప్రస్తుతం మనవడు, బామ్మ ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, జబల్పూర్ మెట్రో ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ విశాల్ బదేరా, కిడ్నీ మార్పిడి సర్జన్ డాక్టర్ రాజేష్ పటేల్ వెల్లడించారు. -
మనువడికి 108 రకాల వంటలు
-
మనవడిపై ప్రేమ.. 4 నెలల బిడ్డకు రూ.240 కోట్ల గిఫ్ట్
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరమే లేదు. కేవలం పదివేల రూపాయలతో వేలకోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించి ఎంతో మందికి ఆదర్శంగా నిలబడ్డారు. భారతదేశంలోని మిలియనీర్ల జాబితాలో ఒకరైన నారాయణ మూర్తి తన మనవడికి ఏకంగా కోట్ల రూపాయల షేర్స్ గిఫ్ట్ ఇచ్చారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి తన నాలుగు నెలల 'ఏకాగ్రహ్ రోహన్ మూర్తి' (Ekagrah Rohan Murty)కి ఏకంగా రూ. 240 కోట్ల విలువైన షేర్స్ గిఫ్ట్ ఇచ్చారు. దీంతో ఏకాగ్రహ్ ఇప్పుడు ఇన్ఫోసిస్‌లో 1500000 షేర్స్ లేదా 0.04 శాతం వాటా కలిగి ఉన్నట్లు సమాచారం. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి, కోడలు అపర్ణ కృష్ణన్ 2023 నవంబర్ 10న బెంగళూరులో మగబిడ్డకు జన్మనిచ్చారు. నారాయణ మూర్తి, సుధా మూర్తికి ఇప్పటికే కృష్ణ సునక్, అనౌష్క సునక్ అనే ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. వీరిరువురూ యూకే ప్రధాన మంత్రి రిషి సునక్, అక్షతా మూర్తి కుమార్తెలు. ఏకాగ్ర పేరు మహాభారతంలోని అర్జున్ పాత్ర నుంచి ప్రేరణ పొందింది. సంస్కృత పదమైన 'ఏకాగ్రహ్'కు అచంచలమైన దృష్టి, సంకల్పం అని అర్థం. -
అమితాబ్ మనవడికి ఎగ్జిమా! ఇది ఎందువల్ల వస్తుందంటే..
బాలీవుడ్ లెజండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా నటిస్తూ ప్రేకక్షుల ప్రశంసలందుకుంటున్నారు అమితాబ్. ప్రముఖ టెలివిజన్ కార్యక్రమం కౌన్ బనేగా కరోడ్పతికి అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరిస్తూ మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఆయన మనవడు అగస్త్య నంద 'ది ఆర్చీస్' సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఒక ఇంటర్యూలో తాను ఎగ్జిమా అనే చర్మ వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇంతకీ ఏంటా ఎగ్జిమా? ఎందువల్ల వస్తుంది. అగస్త్య సోదరి నవ్య నేవలి నంద హోస్ట్ చేసిన 'వాట్ ది హెల్ నవ్య పాడ్‌క్యాస్ట్' ప్రోగ్రాంలో తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి అగస్త్య తన తల్లి శ్వేతా బచ్చన్, అమ్మమ్మ జయబచ్చన్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ముగింపులో చర్మ సంరక్షణ విషయంలో ఎవరిని సంప్రదిస్తారని ప్రశ్నించగా అగస్త్య తాను తల్లినే ఆశ్రయిస్తానని అన్నారు. ఈ నేపథ్యంలోనే తాను ఎగ్జిమా(తామర)తో బాధపడుతున్నట్లు అగస్త్య తెలిపారు. ఇది తనను బాగా వేధించే సమస్య అని అన్నారు. తన సహ నటులతో కలిసి నటించే సమయంలో ఈ సమస్య కారణంగానే చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. తాను ఎక్కువగా సన్‌స్క్రీన్ లోషన్, ఫేస్‌క్రీమ్, షేస్ వాష్ వంటి వాటిని చర్మ సంరక్షణ కోసం వాడుతుంటానని అన్నారు. అయితే తామరకు ఇంతవరకు బెస్ట్ అయింట్మెంట్ అంటూ ఏదీ లేకపోవడం బాధకరం అని చెప్పారు. దయచేసి దానికి సరైన మందు కనుక్కొండని వేడుకున్నాడు అగస్త్య. ఇంతకీ ఏంటీ ఎగ్జామా అంటే.. ఎగ్జిమా అంటే.. తామర అనేది పిల్లలను పెద్దలను ప్రభావితం చేసే ఒక సాధారణ చర్మ పరిస్థితి. దీనిని అటోపిక్ ఎగ్జిమా లేదా తామర అని కూడా అంటారు. దీని వల్ల చర్మంలో అస్సలు తేమగా ఉండదు. అస్తమాను పొడిగా ఉండి చికాకు తెప్పిస్తుంది. ఫలితంగా చర్మం నుంచి కొన్ని రకాల రసాయనాలు విడుదలయ్యి ఒక విధమైన గీతలు, చారలు రావడం జరుగుతుంది. అది కాస్త దురదగా, ఇరిటేట్‌గా ఉంటుంది. పోని గోకితే వెంటనే మరింత దురదగా ఉండి ఎర్రగా బొబ్బల్లా రావడం జరగుతుంది. లక్షణాలు.. చర్మం పొడిగా ఉండి, ఎరుపుగా ఉంటుంది. ఎక్కువుగా మోచేతుల మడతలు, మోకాళ్ల వెనుక, మణికట్టు, చీలమండలలో వస్తుంది. ఎక్కువుగా పెద్దలు, పిల్లలను ప్రభావితం చేస్తుంది. పిల్లలకు ఎక్కువుగా మెడ, ముఖంపై వస్తుంది. ఓ నాణెం సైజులో చేతులు, కాళ్లు, లేదా వీపుపై ఎర్రగా వస్తుంటాయి. అయితే ఎందువల్ల ఇలా వస్తుందనేందుకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. కుటుంబపరంగా వచ్చే వ్యాధే ఇది కూడా. అయితే వ్యక్తుల పరిస్థితి దృష్ట్యా ఒక్కొక్కరిలో ఒక్కోలా ఈ తామర వస్తుందని వైద్యలు చెబుతున్నారు. తామర రావడానికి గల కారణాలు.. వ్యాధి నిరోధక శక్తి.. కొందరిలో వ్యాధి నిరోధక శక్తి వాతావరణంలో ఉండే బ్యాక్లీరియా లేదా వైరస్‌లకు అతిగా ప్రతిస్పందించడంతో అలెర్జీలకు దారితీయడం వల్ల ఈ సమస్య తలెత్తుంది. అందువల్ల ముందుగా మన వ్యాధినిరోధక శక్తిని మంచిగా పెంపొందించుకునేలా ఆహారాలను తీసుకోవడం ఉత్తమం. జీన్స్.. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి ఇది. కుటుంబంలో ఎవ్వరైనా ఈ సమస్యతో బాధపడుతుంటే వారి తర్వాత తరాలకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాతావరణ కారకాలు.. కొందరూ పొడి వాతావరణంలో జీవిచడం వల్ల కూడా ఈ సమస్యను ఎదుర్కొంటారు. వాతావరణంలో తేమ తక్కువుగా ఉండే ప్రాంతాల్లో నివశించే వాళ్లు కూడా ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఒత్తిడికి గురైనా.. మానసిక ఆరోగ్యం బాగోలేకపోయినా, ఎక్కువగా ఒత్తిడి, యాంగ్జిటీ, డిప్రెషన్ వంటి వాటికి గురైనా ఇలాంటి చర్మ సంబంధిత రుగ్మతలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానసికంగా సరిగా లేకపోయినా శరీరంపై ప్రభావం ఏర్పడుతుందని చెబుతున్నారు. వైద్యులు వద్దకు సకాలంలో వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటే సమస్యను ఆదిలోనే నియంత్రించొచ్చని అంటున్నారు నిపుణులు. అలాగే పరిస్థితి మరింత జటిలం కాకమునుపే ఈ ఎగ్జిమాకు చికిత్స తీసుకోవడమే అని విధాల మంచిదని చెబుతున్నారు వైద్యులు. (చదవండి: 'శబ్దమే శాపం ఆమెకు' అత్యంత అరుదైన వ్యాధి..ఆఖరికి పిల్లల నవ్వులు కూడా..) -
Jaya Krishna Latest Photos: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, రమేశ్ బాబు తనయుడు (ఫోటోలు)
-
మగబిడ్డకు జన్మనిచ్చిన అపర్ణ కృష్ణన్ - ఆనందంలో నారాయణ మూర్తి ఫ్యామిలీ
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి, కోడలు అపర్ణ కృష్ణన్ నవంబర్ 10న బెంగళూరులో పండండి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లితో పాటు బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రోహన్ మూర్తి, అపర్ణ కృష్ణన్ ముద్దుల బాబుకి 'ఏకాగ్ర' అని పేరుపెట్టారు. ఈ పేరుకి సంస్కృతంలో అచంచలమైన దృష్టి లేదా ఏకాగ్రత అని అర్థం వస్తుందని చెబుతున్నారు. నారాయణ మూర్తి, సుధా మూర్తికి.. కృష్ణ సునక్, అనౌష్క సునక్ అనే ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. వీరిరువురూ యూకే ప్రధాన మంత్రి రిషి సునక్, అక్షతా మూర్తి కుమార్తెలు. నారాయణ మూర్తి వేలకోట్ల సంపదకు వారసుడైన 'రోహన్ మూర్తి'.. తండ్రి మాదిరిగానే సొంతకాళ్ళ మీద నిలబడాలని కొత్త కంపెనీని ప్రారంభించడానికి ఇన్ఫోసిస్‌లో వైస్ ప్రెసిడెంట్ పదవిని వదిలేసాడు. అనుకున్న విధంగానే 'సోరోకో' (Soroco) పేరుతో సంస్థ స్థాపించి కోట్లు గడిస్తున్నాడు. ఇదీ చదవండి: అందుకే 'రోహన్ మూర్తి' ఇన్ఫోసిస్ జాబ్ వదిలేసాడు! బెంగళూరులోని బిషప్ కాటన్ బాయ్స్ స్కూల్లో చదువుకున్న రోహన్.. ఆ తరువాత కార్నెల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్, హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో డాక్టరేట్ (PhD) పొందాడు. చదువు పూర్తయిన తరువాత 2011లో టీవీఎస్ గ్రూప్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ కుమార్తె లక్ష్మి వేణుని వివాహం చేసుకున్నాడు. కొన్ని అభిప్రాయ భేదాల వల్ల 2015లో ఈ జంట విడిపోయింది. లక్ష్మి వేణుతో విడాకులైన తరువాత రోహన్ మూర్తి రిటైర్డ్ ఇండియన్ నేవీ ఆఫీసర్ కమాండర్ KR కృష్ణన్, మాజీ SBI ఉద్యోగి సావిత్రి కృష్ణన్ కుమార్తె 'అపర్ణ కృష్ణన్'ను 2019లో వివాహం చేసుకున్నారు. వీరిరువురు ఇప్పుడు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. -
యువకుని శవానికి రోజుల తరబడి స్నానాలు, దుస్తుల మార్పిడి.. దుర్వాసన రావడంతో..
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో రోమాలు నిక్కబొడుచుకునే ఉదంతం వెలుగు చూసింది. ఒక బామ్మ 10 రోజులుగా తన 18 ఏళ్ల మనుమడి మృతదేహాన్ని తనతోపాటు ఉంచుకుని దానికి స్నానం చేయిస్తూ, దుస్తులు మారుస్తూ వస్తోంది. అయితే ఆ మృతదేహం నుంచి వెలువడుతున్న దుర్వాసన చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో, అక్కడివారు పోలీసులకు ఈ సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ఇంటి తలుపులు తెరిచి చూసి అవాక్కయ్యారు. ఆ బామ్మ తన మనుమడి మృతదేహాన్ని తన దగ్గరే ఉంచుకుంది. ఆ మృతదేహం పురుగులు పట్టి, కుళ్లిపోయిన స్థితిలో ఉండటాన్ని పోలీసులు గమనించారు. గదిలో నుంచి విపరీతమైన దుర్ఘందం వెలువడసాగింది. ఆ దుర్వాసనకు పోలీసులకు ఒక్కసారిగా వాంతులు వచ్చాయి. అయితే వారు తమను తాము నియంత్రించుకుని, ముందుగా ఆ బామ్మను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఆ వృద్ధురాలు మతిస్థిమితం లేనిదని తెలిపారు. కాగా పోలీసులు ఆ యువకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఆ కుర్రాడు ఎలా మృతి చెందాడనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోహరిపుర్వా ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్దురాలి ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నదని అక్కడివారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితి చూసి పోలీసులు సైతం హడలెత్తిపోయారు. గదిలో ఒక వృద్ధురాలు 18 ఏళ్ల యువకుని మృతదేహానికి సపర్యలు చేస్తూ కనిపించింది. ఆ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. ఆ వృద్ధురాలిని పోలీసులు ప్రశ్నించగా, తన మునుమడు 10 రోజుల క్రితం చనిపోయాడని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: వధువు మెడపై కత్తి పెట్టి కిడ్నాప్.. నిశ్చేష్టుడైన వరుడు! -
మనవడితో ముఖేష్ అంబానీ మురిపెం.. ఆకట్టుకుంటున్న ఫొటోలు, వీడియో!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబంతో సహా ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. కొడుకు ఆకాశ్ అంబానీ, కోడలు శ్లోక మెహతా, మనవడు పృథ్వీతో కలిసి సిద్ధి వినాయకున్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మనవడు పృథ్వీని ముఖేష్ అంబానీ ఎత్తుకుని కనిపించారు. స్వామివారి దర్శనానికి వెళ్తున్నప్పుడు, ఆలయంలో ఉన్నంత సేపు ఆయన తన మనవడిని ఎత్తుకునే ఉన్నారు. వారి వెంట పృథ్వీ తల్లి, ప్రస్తుతం గర్భిణిగా ఉన్న శ్లోక మెహతా, ఆకాశ్ అంబానీ ఉన్నారు. ముఖేష్ అంబానీ కుటుంబం గత వారం కూడా సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించింది. అప్పుడు కూడా ముఖేష్ అంబానీ మనవడిని ఇలాగే ఎత్తుకుని స్వామివారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను ఓ వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! -
ముఖ్య అతిధి గా అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్
-
బీజేపీలోకి సి.రాజగోపాలచారి ముని మనవడు
న్యూఢిల్లీ: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత దేశ చిట్టచివరి గవర్నర్ జనరల్ అయిన సి.రాజగోపాలాచారి ముని మనవడు సీఆర్ కేశవన్ శనివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దక్షిణభారతంలో మరింతగా పుంజుకునేందుకు కృషిచేస్తున్న పార్టీలోకి నేతలు చేరుతుండటం బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. కేంద్ర మంత్రి వీకే సింగ్, బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి అనిల్ బలూనీల నేతృత్వంలో ఆయన బీజేపీలో చేరారు. ‘ ప్రజామోదంతో పాలిస్తూ అవినీతిరహిత, సమ్మిళ ప్రభుత్వాన్ని ముందుండి నడిపిస్తున్న ప్రధాని మోదీపై గౌరవంతో పార్టీలో చేరాను’ అని బీజేపీలోకి వచ్చిన సందర్భంగా కేశవన్ వ్యాఖ్యానించాను. తమిళనాడుకు చెందిన కేశవన్ తొలినాళ్లలో కాంగ్రెస్‌లో కొనసాగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ను వీకేసింగ్ పరోక్షంగా విమర్శించారు. ‘ సి.రాజగోపాలాచారి దేశం కోసం అవిశ్రాంతంగా పోరాడారు. కానీ స్వాతంత్య్రం వచ్చాక ఆయన చేసిన త్యాగాలు మరుగునపడేలా, చరిత్ర గర్భంలో కలిసిపోయేలా కొందరు కుట్ర పన్నారు. దేశం కోసం తాము మాత్రమే కష్టపడ్డామని కేవలం ‘ఒక్క కుటుంబం’ మాత్రం ప్రకటించుకుంది’ అంటూ గాంధీల కుటుంబాన్ని పరోక్షంగా విమర్శించారు. తమిళనాడులో కేశవన్ బీజేపీ వాణిని గట్టిగా వినిపిస్తారన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీలో చేరుతున్న నేతల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. -
మనవడితో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్.. ఫోటోలు వైరల్
మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్, అతని మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ తమ మొదటి మనవడి ఫోటోలను తమ వేరువేరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ద్వారా షేర్ చేశారు. జెన్నిఫర్ ఆమె భర్త నేయెల్ నాసర్ 2023 మార్చి 5న ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తమ మొదటి బిడ్డను స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. జెన్నిఫర్ & నేయెల్ నాసర్ చిన్న పాదాలు ఉన్న ఫోటో షేర్ చేస్తూ మా చిన్న హెల్తీ ఫ్యామిలీ ప్రేమను పంచుతోంది, అంటూ రాసుకొచ్చారు. ఇక బిల్ గేట్స్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తన మనవడిని చేతుల్లో పట్టుకుని 'ప్రపంచాన్ని కనుగొనడం కోసం నేను వేచి ఉండలేను' అంటూ క్యాప్సన్ ఇచ్చారు. View this post on Instagram A post shared by Bill Gates (@thisisbillgates) అదే సమయంలో మెలిండా గేట్స్ మనవడిని చేతుల్లో పట్టుకున్న ఫొటోలను షేర్ చేస్తూ.. నాకు మొదటి మనవడిని పట్టుకోవడంలా అనిపించడం లేదు, నేను జెన్ని పట్టుకున్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పుడు జెన్, నాయెల్ తల్లిదండ్రులుగా కొత్త పాత్రలో అడుగు పెట్టడం చూసి గర్వపడుతున్నానంటూ రాసింది. వీరి పోస్టులు చూసిన వారిలో చాలామంది వారికి అభినందనలు తెలిపారు. ఇందులో నోబెల్ శాంతి బహుమతి పొందిన మలాలా యూసఫ్‌జాయ్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మొదలైన వారు ఉన్నారు. View this post on Instagram A post shared by Melinda French Gates (@melindafrenchgates) -
హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎంజీఆర్ మనువడు.. రిలీజ్‌కు రెడీ
తమిళసినిమా: ఎంజీఆర్ మనవడు జూనియర్ ఎంజీఆర్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఇరుంబన్. నటి ఐశ్వర్య దత్తా నాయకిగా నటించిన ఇందులో నటుడు యోగిబాబు, సెండ్రాయన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కీరా దర్శకత్వంలో తమిళ్ బాలా, ఆర్.వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ దేవా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం స్థానిక కేకేనగర్‌లోని శాంతి మెట్రిక్యులేషన్ స్కూల్లో నిర్వహించారు. ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ చిత్ర ఆడియోను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరంభ దశలో నటుడు విజయ్‌కు ఆయన తండ్రి దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ సపోర్ట్ చేశారని, అయితే విజయ్ సూపర్‌స్టార్‌గా ఎదగడానికి ఆయన కఠిన శ్రమే కారణమన్నారు. ఇప్పుడు డాన్స్‌లో ఇండియాలోనే విజయ్ను మించిన వారు లేరన్నారు. నటుడు ధనుష్‌కు కూడా మొదట్లో ఆయన తండ్రి అండగా ఉన్నారని, తన ప్రతిభతోనే అగ్ర హీరోగా పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ఎంజీఆర్ మనవడిగా సినిమా రంగంలోకి అడుగుపెడుతున్న జూనియన్ ఎంజీఆర్ కూడా కష్టపడితేనే తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఇరుంబన్ చిత్ర పాటలు, ట్రైలర్ బాగున్నాయని సీమాన్ అన్నారు. చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. -
మనవడ్ని కిడ్నాప్ చేయించిన తాత
బనశంకరి: రెండు రోజుల క్రితం ఉత్తరకన్నడ జిల్లా భట్కళ నుంచి అపహరణకు గురైన బాలుడు గోవాలో ప్రత్యక్షమయ్యాడు. బ్రెడ్ తీసుకురావడానికి వెళ్లిన అలీ ఇస్లాందాదా (8) అనే బాలుడు రెండురోజుల క్రితం అదృశ్యమయ్యాడు. కుటుంబసభ్యులు భట్కళనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాప్‌నకు గురైన ప్రాంతం చుట్టుపక్కల ఉన్న సీసీ టీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి ఒక కారులో అతన్ని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. గోవాలో దుండగులను పట్టుకుని బాలున్ని సజీవంగా తల్లిదండ్రులకు అప్పగించారు. సౌదీ నుంచి తాత పన్నాగం.. అయితే బంధువులే బాలుడిని కిడ్నాప్ చేశారని తేలింది. సౌదీఅరేబియాలో ఉన్న బాలుని తాత ఇనయతుల్లా ఇందుకు కుట్ర పన్నాడు. ఇతనికి బాలుని తండ్రి (అల్లుడు) డబ్బు ఇవ్వాల్సి ఉంది. ఇవ్వకపోడంతో గతంలో పలుమార్లు గొడవలు జరిగాయి. దీంతో పలువురితో కలిసి కిడ్నాప్ చేయించి డబ్బు కోసం ఒత్తిడి చేశాడు. ఈ కేసుకు సంబంధించి భట్కళవాసి అనీశ్పాషాను పోలీసులు అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. (చదవండి: నాన్‌వెజ్ రాజకీయం.. మాంసం తిని గుడికి వెళ్తారా?) -
పుల్లారెడ్డి మనవడి ఇంట అడ్డుగోడ తొలగింపు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త జి. పుల్లారెడ్డి మనవడు ఏకనాథ్‌రెడ్డి భార్య ప్రజ్ఞారెడ్డి ఇంట్లోకి రాకుండా కట్టిన అడ్డుగోడను తొలగించాలని న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సోమవారం ప్రొటెక్షన్ అధికారులు అమలు చేశారు. ఉదయం ఇంటికి చేరుకున్న ప్రొటెక్షన్ అధికారి అక్కేశ్వర్రావు పంజగుట్ట పోలీసుల సహకారం తీసుకుని అడ్డుగా ఉన్న గోడను తీయించారు. మొదట ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రొటెక్షన్ అధికారిని అనితారెడ్డి అక్కడకురాగా ఏకనాథ్‌రెడ్డి తరఫు న్యాయవాది గోడకూల్చే విషయంలో పునరాలోచించుకోవాలని గతంలో వీరికి అనుకూలంగా ఇచ్చిన కోర్టు ఆదేశాలు చూపగా పరిశీలించిన అధికారులు జిల్లా ప్రొటెక్షన్ అధికారి అక్కేశ్వర్రావుకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న అక్కేశ్వర్రావు అడ్డుగా నిర్మించిన గోడను తొలగించారు. న్యాయస్థానం ప్రజ్ఞారెడ్డి ఫిర్యాదు మేరకు ఇంట్లో స్వేచ్ఛగా తిరిగేందుకు అడ్డుగా ఉన్న గోడను తొలగించాలని ఆదేశించిందని, దాన్ని తాము అమలు చేసినట్లు ఆయన తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలు ఎంతో సంతోషాన్నిచ్చాయి న్యాయస్థానం ఆదేశాలు ఎంతో సంతోషాన్నిచ్చాయని ఏకనాథ్‌రెడ్డి భార్య ప్రజ్ఞారెడ్డి అన్నారు. ఏకనాథ్‌రెడ్డి కుటుంబంతో తాను న్యాయపోరాటం చేస్తుండగా ఈ నెల 15వ తేదీన అడ్డుగా ఉన్న గోడను తొలగించాలని ఆదేశాలు ఇచ్చిందన్నారు. గోడను తొలగించిన ప్రొటెక్షన్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. రెండు నెలలుగా తాను తన పాప కిందకు, పైకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. (క్లిక్: నిత్య పెళ్లి కొడుకును అరెస్ట్ చేయాలి) -
పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత మనవడిపై కేసు పెట్టిన భార్య
సాక్షి, హైదరాబాద్: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జి. పుల్లారెడ్డి మనవడు ఏక్నాథ్ రెడ్డిపై కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీసు స్టేషన్లో గృహ హింస చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి వివరాల ప్రకారం.. ఏక్నాథ్ రెడ్డికి ఆయన భార్య ప్రగ్యారెడ్డికి మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏక్నాథ్ రెడ్డి.. ఆయన భార్యను ఇంట్లో నుంచి బయటకు రానివ్వడంలేదని తెలుస్తోంది. అంతేకాకుండా తన భార్యను ఇంట్లోనే ఉంచి బయటకు ఆమె బయటకు రాకుండా ఉండేందుకు రాత్రికే రాత్రే రూమ్‌కు అడ్డంగా ఓ గోడను కట్టి ఇంటికి తాళం వేసి పారిపోయాడని బాధితురాలు(ఏక్నాథ్ రెడ్డి భార్య) ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపుల చట్టంతో పాటు గృహ హింస కేసు నమోదు చేసినట్టు పంజాగుట్ట పోలీసులు వెల్లడించారు. -
ఆస్తి కోసం దారుణం! తాతను హతమార్చిన మనవడు..
నూజివీడు: ఆస్తి కోసం సొంత తాతయ్యనే మనవడు హత్య చేశాడు. ఆపై దానిని దుండగుల పనిగా చిత్రీకరించి విఫలయ్యాడు. దీంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి నూజివీడు డీఎస్పీ బుక్కాపురం శ్రీనివాసులు గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పట్టణంలోని కోటవారిపేటకు చెందిన జూవ్వనపూడి గంగులు(70) అలియాస్ ఆదం ఈనెల 11వ తేదీ రాత్రి ఇంట్లోనే నిద్రిస్తూ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఈ సంఘటనపై పట్టణ ఎస్ఐ తలారి రామకృష్ణ కేసు నమోదు చేయగా, సీఐ ఎస్ ప్రసన్నవీరయ్యగౌడ్ మూడు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపారు. మృతుడికి నలుగురు కుమారులు కాగా, భార్య, రెండు, మూడో కుమారులు గతంలో మృతిచెందారు. ఆ తర్వాత ఆస్తి పంపకాల విషయమై వివాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మృతుడు గంగులు తన రెండు ఇళ్లను, పెద్ద కుమారుడైన శేఖర్‌కు రాస్తూ వీలునామా రాశాడు. దీంతో తన తాతపై మూడో కుమారుని కొడుకు, మనవడైన జువ్వనపూడి వరప్రసాద్(21) కక్ష పెంచుకున్నాడు. స్నేహితుని సాయంతో.. దీంతో వరప్రసాద్ తన స్నేహితుడైన నూజివీడు మండలం ఎంఎన్పాలెంకు చెందిన వనుకూరి ప్రేమకుమార్(23)తో కలిసి ఈనెల 11న అర్ధరాత్రి దాటిన తరువాత 2గంటల సమయంలో గంగులు తన ఇంట్లో మంచంపై నిద్రిస్తుండగా కరెంటు వైరుతో మెడకు చుట్టి గట్టిగా లాగి చంపారు. ఆ తర్వాత రూ.70వేల నగదు, నాలుగు బంగారు ఉంగరాలు, గొలుసు, ఆస్తికి సంబంధించి రాసిన వీలునామా తీసుకొని వెళ్లిపోయారు. ఆ తర్వాత తనకు సహకరించినందుకు గాను తన స్నేహితుడికి రూ.30వేలు నగదు, రెండు ఉంగరాలను ఇచ్చాడు. సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ పట్టణ, రూరల్, ముసునూరు ఎస్ఐలతో మూడు బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా దర్యాప్తు జరిపారు. సీన్ ఆఫ్ అఫెన్స్‌ని బట్టి కుటుంబ సభ్యులే ఈ ఘాతునికి పాల్పడి ఉంటారన్న అనుమానంతో విచారించిన పోలీసులు.. 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. నిందితులిద్దరినీ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. కేసును ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన సీఐ ఎస్ ప్రసన్నవీరయ్యగౌడ్, ఎస్ఐలు తలారి రామకృష్ణ, ఎం. లక్ష్మణ్, కె. రాజారెడ్డి, అజయ్, సిబ్బందికి రివార్డులను అందజేశారు. చదవండి: అమ్మో! చెడ్డీ గ్యాంగ్!! స్కెచ్ వేశారో.. -
పదే పదే తిడుతున్నారని గుడిసెకు నిప్పు.. సజీవ దహనం
సాక్షి, చెన్నై: పదేపదే తిడుతున్నారంటూ 16 ఏళ్ల బాలుడు అవ్వా, తాతపై కోపం పెంచుకున్నాడు. అర్ధరాత్రి గాఢనిద్రలో ఉన్న వారిద్దరినీ సజీవ దహనం చేశాడు. వివరాలు.. సేలం జిల్లా ఆత్తూరు సమీపంలో కొత్తంపాడి గ్రామం భారతీ నగర్‌కు చెందిన కాటురాజా(75) రైతు. ఆయనకు భార్య కాశిఅమ్మాల్(65)తో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిలో రెండో కుమారుడైన కుమార్ కుటుంబం తల్లిదండ్రుల పంట పొలంలోని గుడిసెకు పక్కనే మరో ఇంట్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం వేకువజామున కాటురాజా, కాశిఅమ్మాల్ నిద్రిస్తున్న గుడిసె తగల బడింది. కుమార్‌తో పాటుగా, పరిసర వాసులు ఆర్పేందుకు యత్నించారు. అగ్నిమాపక సిబ్బంది అర్ధగంట శ్రమించి మంటల్ని అదుపు చేశారు. లోనికి వెళ్లి చూడగా, ఆ దంపతులు సజీవ దహనం కావడంతో మృతదేహాల్ని పోస్టుమారా్టనికి తరలించారు. డీఎస్పీ ఇమాన్ వేల్ జ్ఞానశేఖరన్ తొలుత ప్రమాదంగా భావించినా, గుడిసెకు బయట గడియ పెట్టి ఉండడంతో కొడుకులను అనుమానించారు. అదే సమయంలో కుమార్ తనయుడు (16) పోలీసుల్ని చూసి భయపడడంతో అతడ్ని తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో తానే ఆ గుడిసెకు నిప్పు పెట్టినట్టు అతడు అంగీకరించాడు. పదేపదే తనను అవ్వా, తాత తిడుతుండడంతోనే ఆగ్రహించి ఈ ఘాతకానికి ఒడి గట్టిన ట్లు ఆ బాలుడు వెల్లడించాడు. దీంతో ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మనవడి వేధింపులు తాళలేక వృద్ధుడి ఆత్మహత్య
చంద్రగిరి : మద్యం కోసం మనుమడు వేధింపులను తట్టుకోలేక తాత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం మండలంలోని కొత్తశానంబట్లలో చోటు చేసుకుంది. మృతుని బంధువుల కథనం..గ్రామానికి చెందిన చిన్నబ్బరెడ్డి (72), గోవిందమ్మ దంపతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో చిన్నబ్బరెడ్డి దంపతులు తన మనమడితో కలసి అదే గ్రామంలో వేరే కాపురం ఉంటున్నారు. మద్యానికి బానిసైన మనుమడు తరచూ తన తాతను డబ్బులు కోసం వేధించేవాడు. ఈ క్రమంలో రెండు రోజులుగా చిన్నబ్బరెడ్డితో తీవ్రంగా గొడవ పడ్డాడు. దీంతో ఆయన జీవితంపై విరక్తి చెందాడు. ఇంట్లోని ఫ్యాను కొక్కీకి ఉరివేసుకుని మృతి చెందాడు. వృద్ధుని కుటుంబ సభ్యులు ఆగమేఘాలపై అంత్యక్రియలను పూర్తి చేశారు. పోలీసులకు ఫిర్యాదు అందలేదు. -
బ్రిటన్ రాణికి 10వ ముని మనవడు
లండన్: బ్రిటన్ రాణి ఎలిజెబెత్–2 తనకి 10వ మునిమనవడు పుట్టినందుకు ఆనందంతో పొంగిపోతున్నారు. రాణి ఎలిజబెత్ మనవరాలు జారా తిండాల్ బాబుకి జన్మని చ్చారు. ఆ బాబుకి లుకాస్ ఫిలిప్ తిండాల్ అని పేరు పెట్టారు. బ్రిటన్ సింహాసనానికి క్యూ కట్టిన వారసుల్లో లుకాస్ 22వ స్థానంలో ఉన్నాడు. రాణి ఎలిజెబెత్ కూతురి కూతురైన జారా తిండాల్, ఆమె భర్త ఇంగ్లండ్ రగ్బీ మాజీ ఆటగాడు మైక్ తిండాల్కు మూడో సంతానంగా లుకాస్ పుట్టాడు. జారా బాత్ రూమ్‌లోనే బాబుకి జన్మనివ్వడం విశేషం. ఆస్పత్రికి తీసుకువెళ్లే వ్యవధి లేకపోవడంతో బాత్రూమ్లోనే తమ బిడ్డకు స్వాగతం పలికారు. రాణి దంపతులు బాబును చూడాలని ముచ్చట పడుతున్నారని, పరిస్థితులు అనుకూలించాక వాళ్లు కలుసుకుం టారని ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. -
చెరువులో పడి తాత, మనవడు మృతి
నడికూడ: ఎడ్లబండి అదుపుతప్పి చెరువులో పడిపోవడంతో తాత, మనవడు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలం వరికోలు గ్రామం లో ఆదివారం చోటుచేసుకుంది. పరకాల రూరల్ సీఐ రమేశ్ కుమార్, ఎస్ఐ వెంకటకృష్ణ కథనం ప్రకారం.. వరికోల్‌కు చెందిన కానాల సాంబయ్య (46) తన పెద్ద కూతురు కుమారుడు ఆసోల ఆర్తిక్ (6) వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి బయల్దేరారు. మనవ డు ఎడ్లబండి తోలుతుండగా.. తాత వెనకాల నడుచుకుంటూ వస్తున్నాడు. వరికోల్, వేములపల్లి గ్రామాల మధ్య ఉన్న నల్లకుంట చెరువు కట్టపై ఎద్దులు బెదరడంతో బండి అదుపుతప్పి చెరువులో పడిపోయింది. ఆర్తిక్ నీటిలో పడగా.. వెనకాల వస్తున్న సాంబయ్య మనవడని కాపాడటానికి చెరువులోకి దిగాడు. ఆయనకు ఈత రాకపోవడంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి మృతదేహాలను బయటకు తీశారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. -
కరోనాతో గాంధీ మునిమనవడు మృతి
జోహన్నెస్‌బర్గ్: కరోనా వైరస్ కారణంగా జాతిపిత మహాత్మా గాంధీ మునిమనవడు సతీష్ ధుపేలియా ఆదివారం జోహన్నెస్‌బర్గ్‌లో మరణించారు. ఆయన కరోనా వైరస్‌తో మృతి చెందినట్లు ఆయన సోదరి ఉమా ధుపేలియా తెలిపారు. న్యుమోనియాతో ఆస్పత్రిలో చేరిన తన సోదరుడికి కరోనా వైరస్ కూడా సోకిందని తెలిపారు. ఆయన నెల రోజుల నుంచి ఆస్పత్రిలో కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. చికిత్స పొందుతున్న సతీష్‌కి ఆదివారం హఠాత్తుగా గుండెపోటు రావటంతో మృతి చెందారని ఆమె సోషల్ మీడియలో వెల్లడించారు. ఆయనతో పాటు సోదరి ఉమా, మరో సోదరి కీర్తి మీనన్ జోహన్నెస్‌బర్గ్‌లో నివసిస్తున్నారు. చదవండి: ఆ రెండు మార్కెట్ల మూసివేత: ఆదేశాలు వెనక్కి! వీరు ముగ్గురు మహాత్మా గాంధీ చూపిన మార్గంలో రెండు దశాబ్దాలుగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. సతీష్ ధుపేలియా మీడియా రంగంలో వీడియోగ్రాఫర్, ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. గాంధీ ప్రారంభించిన ‘గాంధీ డెవలప్మెంట్ ట్రస్ట్’ ద్వారా అనేక సేవలు అందింస్తూ.. సామాజిక కార్యక్రమాలు నిర్వహించేవారు. సతీష్ ధుపేలియా, ఉమా ధుపేలియా, కీర్తి మీనన్ వీరు ముగ్గురు మహాత్మాగాంధీ రెండో కుమారుడు మనీలాల్ గాంధీ వారసులు. చదవండి: భోజనం డబ్బు మా నాన్న తినేస్తున్నాడు -
పబ్జీ కోసం తాత పెన్షన్ అకౌంట్ నుంచి
న్యూఢిల్లీ: పబ్జీ కోసం ఓ బాలుడు తన తాత పెన్షన్ ఖాతా నుంచి 2.35 లక్షల రూపాయలను బదిలీ చేసినట్లు ఢిల్లీ పోలీసులు సోమవారం తెలిపారు. నిందితుడు తన తాత పెన్షన్ ఖాతా నుంచి డబ్బును బదిలీ చేశాడని.. ఆ మొత్తాన్ని నెలల తరబడి పబ్జీ కోసం వినియోగించాడని ఢిల్లీ సైబర్ పోలీస్ సెల్ విభాగం వెల్లడించింది. కొద్ది రోజుల క్రితం బాధితుడికి తన బ్యాంక్ అకౌంట్ నుంచి 2,500 డ్రా చేసినట్లు మెసేజ్ రావడమే కాక అవైలబుల్ బ్యాలెన్స్ 275 రూపాయలుగా చూపించింది. ఈ మెసేజ్ చూసి బాధితుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే బ్యాంకుకు వెళ్లి తనకు వచ్చిన మెసేజ్ గురించి విచారించగా.. అతని పెన్షన్ ఖాతా నుంచి 2,34, 000 రూపాయలు బదిలీ అయినట్లు తెలిసింది. బాధితుడు వెంటనే పోలీసులను సంప్రదించి, తాను ఎటువంటి లావాదేవీలు చేయలేదని.. తన నంబర్‌కు వన్-టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) కూడా రాలేదని ఆరోపించాడు. (చదవండి: ఇకపై పోచింకిని సందర్శించలేరు..) గత రెండు నెలల వ్యవధిలో బాధితుడి ఖాతా నుంచి 2,34,497 రూపాయలు బదిలీ అయినట్లు సైబర్ సెల్ గుర్తించింది. పంకజ్ కుమార్ (23) పేరిట ఉన్న పేటీఎం ఖాతాకు చెల్లింపులు జరుగుతున్నట్లు పోలీసులు కనుగొన్నారు. సైబర్ సెల్ పంకజ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుంది. విచారణలో తన స్నేహితులలో ఒకరు అతని ఐడీ, పేటిఎమ్ ఖాతా పాస్వర్డ్ అడిగినట్లు తెలిపాడు. సదరు వ్యక్తి పబ్జీ కోసం గూగుల్ పే చెల్లింపులు చేయడానికి పంకజ్ ఖాతాను ఉపయోగించినట్లు పోలీసులు కనుగొన్నారు. విచారణలో భాగంగా సదరు వ్యక్తిని ఫిర్యాదుదారుడి మనవడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తన తాత ఖాతా నుంచి పబ్జీ ఆడటానికి నగదు బదిలీ చేసినట్లు నిందితిడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. బ్యాంక్ ఖాతా హ్యాకింగ్ అవుతుందని చెప్పితన తాత మొబైల్ ఫోన్ నుంచి ఓటీపీ మెసేజ్‌లను తొలగించేవాడనని టీనేజర్ పోలీసులకు తెలిపాడు. -
హోం మంత్రి మనవడి వీడియో.. వైరల్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా, సైబర్ అనర్థాలపై అప్రమత్తంగా ఉండాలంటూ డీజీపీ ట్విటర్లో రోజూ పౌరులను హెచ్చరిస్తూ ఉంటారు. విచిత్రంగా ఆయన పేరిట రిజిష్ట్రర్ అయిన ఓ వాహనంపై ఏకంగా హోంమంత్రి మహమూద్ అలీ మనవడు, అతడి స్నేహితుడు కలసి డిపార్ట్మెంట్కు వ్యతిరేకంగా చేసిన టిక్‌టాక్ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోలో ఐజీస్థాయి అధికారిని నోరు అదుపులో పెట్టుకోవాలని.. లేదంటే పీక కోస్తా అంటూ బెదిరిస్తూ చెప్పే ఓ సినిమా డైలాగ్ ఉంది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు వీడియోపై గురువారం డీజీపీ కార్యాలయంలోనూ చర్చ జరిగింది. విషయం డీజీపీ, ఏడీజీ దృష్టికి కూడా వెళ్లినట్లు తెలిసింది. డీజీపీ కార్యాలయం సమాచారం ప్రకారం.. ఆ వీడియో పాతదని, కారుపై కూర్చున్న యువకుడు హోంమంత్రి మనవడు కాగా, డైలాగులు చెప్పిన యువకుడు అతడి స్నేహితుడని తెలిపారు. హోంమంత్రి భద్రత కోసం కేటాయించిన కార్లలో అది కూడా ఒకటని తెలిపారు. తెలంగాణలో ఉన్న ప్రతి పోలీసు వాహనం డీజీపీ పేరుతో రిజిస్టర్ అయి ఉంటుందని వివరణ ఇచ్చారు. సదరు వీడియోలో ఒక బాలివుడ్ సినిమాలో పోలీసు అధికారిని పీక కోస్తామని అత్యంత అవమానకరంగా బెదిరించే ఆడియోకు మ్యాచ్ అయ్యేలా హోంమంత్రి మనవడు, అతడి స్నేహితుడు హావభావాలు వ్యక్తం చేస్తూ టిక్‌టాక్ వీడియో చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు శాఖకు చెందిన అధికారిక వాహనంపై కూర్చొని ఇలా అభ్యంతరకరంగా వీడియో చిత్రించడం పట్ల నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఘటనను సీరియస్ గా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. This #TikTok video shows grandson of #Telangana Home Minister #MahmoodAli seated on police vehicle (regd @TelanganaDGP?); his friend mimes to audio of a police officer being threatened that his throat will be slit if he is not respectful to the man on jeep; Creative licence?@ndtv pic.twitter.com/ym6RHrVSJ3 — Uma Sudhir (@umasudhir) July 18, 2019 -
తాతను హతమార్చిన మనవడు
గుంటూరు, చిలకలూరిపేట: ఆస్తి తన పేర రాయలేదని తాతను మనవడు కత్తితో పొడిచి కిరాతకంగా హతమార్చిన సంఘటన బుధవారం చిలకలూరిపేట మండలం కావూరు గ్రామంలో జరిగింది. చిలకలూరిపేట రూరల్ సీఐ విజయచంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కావూరు గ్రామానికి చెందిన కందుల కోటయ్య(63), సీతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. చిన్న కుమారుడు ఆదినారాయణ గుంటూరులో నివాసం ఉంటున్నాడు. పెద్ద కుమార్తె వెంకట రమణమ్మ, చిన కుమార్తె సుజాతను కావూరు గ్రామంలోనే ఇచ్చి వివాహాలు జరిపించాడు. కన్నీంటిపర్యంతమైన కుటుంబ సభ్యులు పెద్ద కుమార్తె వెంకటరమణమ్మ నాలుగేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి పెద్ద అల్లుడు పెడవల్లి కోటయ్య, అతని కుమారుడు నాగేశ్వరరావుతో కలిసి అల్లుడు ఇంట్లోనే మృతుడు కందుల కోటయ్య, సీతమ్మ దంపతులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ పెద్దగా వ్యవహరిస్తున్న కందుల కోటయ్యను ఆస్తి తన పేరున రాయాల్సిందిగా మనవడు పెడవల్లి నాగేశ్వరరావు కోరుతూ వచ్చాడు. స్థిరాస్తి బదలాయింపు విషయంలో ఇరు కుటుంబాల మధ్య కలహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం మధ్యాహ్నం కూడా తాత, మనవడి మధ్య వివాదం జరిగింది. కోపోద్రికుడైన నాగేశ్వరరావు మంచంపై పడుకొని ఉన్న తాతపై కత్తితో మెడ, తలభాగంలో విచక్షణారహితంగా పొడవటంతో కోటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలంలో రక్తపు మడుగులో పడి ఉన్న వృద్ధుడి భౌతికాయాన్ని చూసిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం తెలుసుకున్న రూరల్ సీఐ ఎస్.విజయచంద్ర, ఎస్ఐ జి.అనీల్‌కుమార్‌లు కావూరు గ్రామానికి వెళ్లి శవ పంచనామా చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నాగేశ్వరరావు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
బీజేపీలోకి సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు
బెంగళూరు : భారతదేశ మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధకృష్ణన్ మనవడు సుబ్రమణ్యం శర్మ(44) నేడు బీజేపీలో చేరనున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల తర్వాత కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యురప్ప సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న అసమానతలను తొలగించే ఉద్దేశంతో తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు సుబ్రమణ్యం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ‘సమాజంలో పేద, ధనిక వర్గాల మధ్య అంతారాలు విపరీతంగా పెరిగిపోయాయి. వ్యవస్థలో ఉన్న వ్యక్తుల్లో ఎవరో ఒకరు దీన్ని తొలగించడానికి పూనుకోవాలి. ఈ అసమానతలను తొలగించడమే ధ్యేయంగా నేను రాజకీయాల్లోకి వచ్చాన’ని ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహిళా ఎంపవర్మెంట్ పార్’టీ తరఫున మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి సుబ్రమణ్యం పోటీ చేశారు.