మనవడిపై ప్రేమ.. 4 నెలల బిడ్డకు రూ.240 కోట్ల గిఫ్ట్ | Narayana Murthy Gift For Rs 240 Crore Shares To Grand Son | Sakshi
Sakshi News home page

Infosys Narayana Murthy: మనవడిపై ప్రేమ.. 4 నెలల బిడ్డకు రూ.240 కోట్ల గిఫ్ట్

Published Mon, Mar 18 2024 8:01 PM | Last Updated on Mon, Mar 18 2024 8:18 PM

Narayana Murthy Gift For Rs 240 Crore Shares To Grand Son - Sakshi

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరమే లేదు. కేవలం పదివేల రూపాయలతో వేలకోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించి ఎంతో మందికి ఆదర్శంగా నిలబడ్డారు. భారతదేశంలోని మిలియనీర్ల జాబితాలో ఒకరైన నారాయణ మూర్తి తన మనవడికి ఏకంగా కోట్ల రూపాయల షేర్స్ గిఫ్ట్ ఇచ్చారు.

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి తన నాలుగు నెలల 'ఏకాగ్రహ్ రోహన్ మూర్తి' (Ekagrah Rohan Murty)కి ఏకంగా రూ. 240 కోట్ల విలువైన షేర్స్ గిఫ్ట్ ఇచ్చారు. దీంతో ఏకాగ్రహ్ ఇప్పుడు ఇన్ఫోసిస్‌లో 1500000 షేర్స్ లేదా 0.04 శాతం వాటా కలిగి ఉన్నట్లు సమాచారం.

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి, కోడలు అపర్ణ కృష్ణన్ 2023 నవంబర్ 10న బెంగళూరులో మగబిడ్డకు జన్మనిచ్చారు. 

నారాయణ మూర్తి, సుధా మూర్తికి ఇప్పటికే కృష్ణ సునక్, అనౌష్క సునక్ అనే ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. వీరిరువురూ యూకే ప్రధాన మంత్రి రిషి సునక్, అక్షతా మూర్తి కుమార్తెలు. ఏకాగ్ర పేరు మహాభారతంలోని అర్జున్ పాత్ర నుంచి ప్రేరణ పొందింది. సంస్కృత పదమైన 'ఏకాగ్రహ్'కు అచంచలమైన దృష్టి, సంకల్పం అని అర్థం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement