Infosys Narayana Murthy
-
ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. నారాయణమూర్తి ఏమన్నారంటే..
ఉద్యోగ కోతలపై కృత్రిమ మేధ (ఏఐ), వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ప్రభావం ఎలా ఉందో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి తన అభిప్రాయాలు పంచుకున్నారు. కృత్రిమ మేధ వల్ల కొంతమేరకు నిరుద్యోగం పెరుగుతోందని నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐ ప్రభావంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏఐను ముప్పుగా కాకుండా ఒక అవకాశంగా చూడాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.కృత్రిమ మేధ-ఉద్యోగ నష్టాలుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాస్తవానికి చాలా పనులను ఆటోమేట్ చేస్తోందని మూర్తి చెప్పారు. దాంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారని తెలిపారు. అయితే ఇది కొత్త అవకాశాలను సృష్టించడానికి, మానవ ఉత్పాదకతను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉందని అంగీకరించారు. 1970ల్లో కంప్యూటర్-ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ సాధనాలను ప్రవేశపెట్టిన సమయంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని చెప్పారు. కానీ ఈ సాధనాలు డెవలపర్లకు మరింత క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి వీలు కల్పించాయన్నారు. ఉత్పాదకతను పెంచడానికి మానవులు, యంత్రాలు కలిసి పనిచేసే సహాయక సాంకేతికతగా కృత్రిమ మేధను పరిగణించాలని మూర్తి అన్నారు. అటానమస్ డ్రైవింగ్, ప్రమాదకర వాతావరణంలో యంత్రాలను ఆపరేట్ చేయడం, కచ్చితమైన పరికరాలతో రిమోట్ సర్జరీ వంటి వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోజనకరంగా ఉంటుందని హైలైట్ చేశారు. కృత్రిమ మేధను ఉపయోగించడం ద్వారా మానవులు మరింత సృజనాత్మక, సంక్లిష్టమైన పనులపై దృష్టి పెట్టవచ్చని చెప్పారు. ఇది ఉద్యోగుల నైపుణ్యాల పెరుగుదలకు దారితీస్తుందని తెలిపారు.ఇదీ చదవండి: భారత్‌లో బ్లాక్‌రాక్ కొత్తగా 1,200 ఉద్యోగాలుఏఐ ఇన్నోవేషన్‌లో భారత్ పాత్రకృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, నూతన ఆవిష్కరణలు చేయడంలో భారత్ సామర్థ్యంపై మూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి చెందిన సాంకేతికతలను అవలంబించడమే కాకుండా ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి దోహదపడే స్థాయికి దేశం పురోగమించిందని అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధను స్వీకరించి కొత్త టెక్నాలజీల్లో పెట్టుబడులు పెట్టాలని యువతను కోరారు. -
స్టేడియంలో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి - వైరల్ అవుతున్న మీమ్స్
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు 'ఎన్ఆర్ నారాయణ మూర్తి' (NR Narayana Murthy) ముంబైలోని వాంఖడే స్టేడియంలో.. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 మ్యాచ్ వీక్షించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పలువురు నెటిజన్లు పనిగంటలపై ప్రస్తావన తీసుకువచ్చారు. మీమ్స్ కూడా షేర్ చేస్తున్నారు.వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ను రాజీవ్ శుక్లా, ముఖేష్ అంబానీ, ఆకాష్ అంబానీ వంటి వాటితో పాటు బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి రిషి సునక్, బ్రిటిష్ వ్యాపారవేత్త మనోజ్ బాదాలే కూడా వీక్షించారు. అయితే వాంఖడేలోని స్టాండ్‌పై కూర్చున్న నారాయణ మూర్తి ఫోటో.. వైరల్ కావడంతో సోషల్ మీడియా వినియోగదారులు ఎడిట్ చేసిన మీమ్స్ షేర్ చేయడం ప్రారంభించారు.Narayan Murthy: Employees should work on weekends.Also Narayan Murthy on weekend: pic.twitter.com/6bIwwYqSjn— karanbir singh 🫶 (@karanbirtinna) February 3, 2025వారానికి 70 గంటలు పనిచేయాలని చెప్పిన నారాయణ మూర్తి.. మ్యాచ్ చూడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా అరుదైన దృశ్యం అని ఒకరు కామెంట్ చేశారు. ఇన్ఫోసిస్ ఉద్యోగులు నారాయణ మూర్తిని పిలిచి ఎక్కువ గంటలు పని చేసి ఆదివారం మ్యాచ్ చూడమని సలహా ఇచ్చి ఉంటారని మరొకరు అన్నారు. వారాంతాల్లో ఉద్యోగులు మాత్రమే కాదు.. నారాయణ మూర్తి కూడా పని చేయాలి అని ఇంకొకరు అన్నారు.ఆదివారాల్లో కూడా పనిచేయమని లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టి) చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చెప్పారు. కాబట్టి ఇప్పుడు నారాయణ మూర్తి పనిచేయకపోవడం బాధకలిగిస్తోంది.. ఆదివారాల్లో మిమ్మల్ని పని చేయించలేకపోతున్నందుకు నేను చింతిస్తున్నాను. ఆదివారాల్లో మిమ్మల్ని పని చేయించగలిగితే, నేను కూడా ఆదివారాల్లో పని చేస్తాను అని ఓ నెటిజన్ అన్నారు.Narayana Murthy enjoying his life on a Sunday evening. Dream for L&T Chairman. pic.twitter.com/v0A4oMFM5G— Trendulkar (@Trendulkar) February 2, 2025వారానికి 70 గంటల పనిఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి 3వన్4 (3one4) క్యాపిటల్ పాడ్‌కాస్ట్ 'ది రికార్డ్' ఫస్ట్ ఎపిసోడ్లో యువతను ఉద్దేశించి.. భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడాలంటే, ఇతర దేశాలతో పోటీ పడాలంటే వారానికి 70 గంటలు పని చేయాలని పేర్కొన్నారు. ఇండియాలో పని ఉత్పాదకత.. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ చేసినట్లు భారతీయ యువకులు ఎక్కువ గంటలు పనిచేయాలని వెల్లడించారు.పని గంటలు పెంచకపోతే ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలతో భారత్ పోటీ పడటం అసాధ్యం అని నారాయణ మూర్తి అన్నారు. తప్పకుండా దీని గురించి యువత ఆలోచించాలి, జర్మన్ దేశంలో ప్రతి వ్యక్తి.. దేశాభివృద్ధి కోసం తప్పనిసరిగా అదనపు పని చేయడానికి ముందడుగు వేస్తున్నారు. ఇదే భారతీయులు కూడా పాటించాల్సిన అవసరం ఉందని నారాయణ మూర్తి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.Infosys employees watching Narayan Murthy enjoy the match on a Sunday pic.twitter.com/C6hTn48R7h— SwatKat💃 (@swatic12) February 2, 2025వారానికి 90 గంటల పనిఉద్యోగులు వారంలో 90 గంటలు పనిచేయాలని, ఆదివారాలు కూడా విధులకు హాజరుకావాలంటూ ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘ఇంట్లో కూర్చొని ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు? ఇంట్లో తక్కువ, ఆఫీసులో ఎక్కువగా ఉంటామని భార్యలకు చెప్పాలి. అవసరమైతే ఆదివారాలు కూడా పనిచేయాల.. అని అన్నారు. దీనిపై సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కూడా స్పందించారు. -
సుదీర్ఘ పని గంటలు.. ఎవరికి వాళ్లే ఆలోచించుకోవాలి..
ముంబై: దేశం పురోగమించాలంటే యువత సుదీర్ఘ సమయం పాటు పని చేయాలన్న వ్యాఖ్యలపై దుమారం ఇంకా చల్లారని నేపథ్యంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి వివరణనిచ్చారు. ఎవరూ ఎవరినీ గంటల తరబడి పని చేయాలని చెప్పరని, ఎవరికి వారే ఆలోచించుకుని, తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ‘నేను పొద్దున్నే ఆరున్నరకి ఆఫీసుకి చేరుకునేవాణ్ని. రాత్రి ఎనిమిదిన్నరకి బైటికి వచ్చేవాణ్ని. ఇలా నేను దాదాపు నలభై ఏళ్లు పని చేసాను. ఇది వాస్తవం. నేను స్వయంగా చేశాను. ఇది తప్పు.. నువ్వు ఇలా చేయాలి.. ఇలా చేయకూడదు.. అని ఎవరూ అనడానికి లేదు. ఇలాంటి వాటిపై చర్చలు, వాదోపవాదాలు అనవసరం. మీకు మీరుగా ఆలోచించుకుని, మీరు కోరుకున్నది చేయడమే‘ అని కిలాచంద్ స్మారకోపన్యాస కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నారాయణ మూర్తి తెలిపారు. నిరుపేద బాలలకు మెరుగైన భవిష్యత్తును అందించే దిశగా కష్టపడి పనిచేయాలా, వద్దా అనేది ఎవరికి వారు ఆలోచించుకుని, నిర్ణయం తీసుకోవాల్సిన విషయమని పేర్కొన్నారు. -
ఇన్ఫీ మూర్తి కుటుంబ సంపదలో రూ.1900 కోట్లు ఆవిరి!
ప్రముఖ దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి (NR Narayana Murthy) కుటుంబం సంపద ఒక్క రోజులో రూ.1900 కోట్లు ఆవిరైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో శుక్రవారం (జనవరి 17) నాడు ఇన్ఫోసిస్ షేర్లు దాదాపు 6 శాతం నష్టపోయి రూ. 1,812.70 వద్ద ముగిశాయి. ఈ భారీ తగ్గుదలతో మూర్తి కుటుంబం నెట్‌వర్త్‌లో దాదాపు రూ. 1,900 కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. అమ్మకాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7.54 లక్షల కోట్లకు పడిపోయింది.4.02 శాతం వాటాసెప్టెంబర్ త్రైమాసికం నాటికి కంపెనీలో సమిష్టిగా 4.02 శాతం వాటాను నారాయణ మూర్తి కుటుంబం కలిగి ఉంది. ఇందులో మూర్తి 0.40 శాతం వాటాను కలిగి ఉండగా, ఆయన సతీమణి సుధా మూర్తికి 0.92 శాతం, వారి కుమారుడు రోహన్ మూర్తికి 1.62 శాతం వాటా ఉంది. ఇక వారి కుమార్తె, యూకే (UK) మాజీ ప్రధాన మంత్రి రిషి సునక్ భార్య అక్షతా మూర్తి 1.04 శాతం, నారాయణ మూర్తి మనవడు ఏకగ్రహ రోహన్ మూర్తి 0.04 శాతం వాటాను కలిగి ఉన్నారు. శుక్రవారం నాటి క్షీణత తర్వాత కంపెనీలో మూర్తి కుటుంబం హోల్డింగ్‌ల విలువ రూ. 30,334 కోట్లుగా ఉంది. ఇది గురువారం నాటి రూ. 32,236 కోట్లతో పోలిస్తే గణనీయమైన నష్టాన్ని ప్రతిబింబిస్తోంది.లాభాలు బాగున్నా..ఇన్ఫోసిస్ బలమైన త్రైమాసిక ఆదాయాలను ప్రకటించిన తర్వాత మార్కెట్ కల్లోలం ఏర్పడింది. దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల ఎగుమతిదారు అయిన ఇన్ఫోసిస్ డిసెంబర్ త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం సంవత్సరానికి (YoY) 11 శాతం వృద్ధిని నమోదు చేసి మొత్తం రూ.6,806 కోట్లకు చేరింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 8 శాతం పెరిగి రూ.41,764 కోట్లకు చేరుకుంది. ఇదే క్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి కంపెనీ తన ఆదాయ వృద్ధి అంచనాను 4.5-5 శాతానికి సవరించింది. ఇది దాని వ్యాపార పథంలో విశ్వాసాన్ని సూచిస్తోంది.ఇదీ చదవండి: విప్రో జూమ్.. టెక్ మహీంద్రా హైజంప్!బలమైన ఫండమెంటల్స్ ఉన్నప్పటికీ, స్టాక్ క్షీణత విస్తృత పరిశ్రమ సవాళ్లు, మార్కెట్ సెంటిమెంట్‌పై పెట్టుబడిదారుల ఆందోళనలను తెలియజేస్తోంది. 1,812.70గా ఉన్న స్టాక్ విలువ ఐటీ రంగంలో రానున్న ఎదురుగాలి గురించిన భయాందోళనలను ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇన్ఫోసిస్‌లో మూర్తి కుటుంబానికి ఉన్న ముఖ్యమైన వాటా కంపెనీ వారసత్వంలో వారి కీలక పాత్రను తెలియజేస్తోంది. ఐటీ రంగంలోని కీలక పరిణామాలు, ఇన్ఫోసిస్ దీర్ఘకాలిక వృద్ధి పథాన్ని అంచనా వేయడానికి డీల్ పైప్‌లైన్‌ను నిశితంగా పర్యవేక్షించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. -
అన్నేసి గంటలు పనిచేస్తే జరిగేది ఇదే!
భారత్‌లో పనిగంటల అంశం మరోసారి చర్చ తెర మీదకు వచ్చింది. ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం ఉద్యోగులు వారం మొత్తం మీద ఏకంగా 90 గంటలు పని చేయాల్సిందేనంటూ వ్యాఖ్యానించడం ఇందుకు కారణం. మొన్నీమధ్యే ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి 70 గంటలు పని చేయాలంటూ పిలుపు ఇవ్వడం తెలిసిందే. అయితే సుబ్రహ్మణ్యం ‘అంతకుమించి’ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు సెలబ్రిటీలు సైతం మండిపడుతున్నారు. ఈ దరిమిలా వీళ్లిద్దరి గురించి నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. అయితే.. ఇంతకీ 70.. 90.. మనిషి శరీరం ఒక వారంలో అసలు ఎన్నేసి పనిగంటలను చేయగలదు?. ఏ మేర పని ఒత్తిడిని ఒక ఉద్యోగి భరించగలరు?. అలా గనుక పని చేస్తే.. శరీరంలో కలిగే మార్పులేంటి?. ఈ విషయంలో అసలు వైద్యులు ఏం చెబుతున్నారు?.. బిజినెస్ టైకూన్లు చెబుతున్న అంతటి పని భారం ఉద్యోగి మోయ తరమేనా?.. వారంలో 90 గంటలపని.. అంటే ఏడు రోజులపాటు 13 గంటల చొప్పున పని చేయాలన్నమాట. మిగిలిన 11 గంటల్లోనే నిద్ర, ఇతర పనులు, ప్రయాణాలు, ఆఖరికి కుటుంబ సభ్యులతో గడపడం లాంటి వాటితో సర్దుకుపోవాలన్నమాట. అయితే ఇది శారీరకంగానేకాదు.. మానసికంగానూ మనిషిపై ప్రతికూల ప్రభావం చూపెడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయం ప్రకారం.. వారంలో 55 గంటలకు మించి గనుక పని చేస్తే గుండె జబ్బుల బారినపడే అవకాశం ఉంటుందట. అలా పనిచేసే ఉద్యోగుల్లో వందలో 35 మంది స్ట్రోక్ బారినపడే అవకాశం ఉంది. వందలో 17 మంది ప్రాణమే పొగొట్టుకునే అవకాశం ఉంది అని ఆ స్టడీ వెల్లడించింది. ‘‘ఎక్కువసేపు పని చేయడమంటే గుండె మీద ఒత్తిడి పెంచడమే. దీనివల్ల కోర్టిసోల్, అడ్రినలిన్ హార్మోన్లపై ప్రభావం పడుతుంది. తద్వారా బీపీ, గుండె కొట్టుకునే వేగంలో మార్పులొస్తాయి. అలా హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్‌తో పాటు హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వారానికి 40 గంటల కంటే ఎక్కువ పని చేయడం వల్ల.. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు గట్టిపడడమో లేదంటే కుంచిచుపోతాయి’’ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: భారత్ బాగుండాలంటే.. ఉద్యోగుల పని గంటలు తగ్గాల్సిందే!.. ఇక ఎక్కువ గంటలు పని చేయడం డయాబెటిస్‌కు దారి తీసే అవకాశం లేకపోలేదు. ఇది రక్తంలో షుగర్ స్థాయిపై అనేక రకాలుగా ప్రభావం చూపెడుతుంది. మహిళలు 45 గంటలకంటే ఎక్కువసేపు పని చేసినా.. పురుషులు 53 గంటలకు మించి పని చేసినా షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువని పలు అధ్యయనాలు తెలిపాయి కూడా. ఇక చాలాసేపు కూర్చుని పనిచేయడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయి పెరుగుతుందని పలు అధ్యయనాలు నిరూపించాయి కూడా. ఇది ఒబెసిటీ(స్థూలకాయం)కి దారి తీయొచ్చు. అన్నింటికి మించి.. విపరీతమైన పనిభారం మానసిక ఆరోగ్యాన్ని కుంగదీస్తుంది. ఇది బంధాలకు బీటలు తెచ్చే ప్రమాదం లేకపోలేదు. అందుకే.. విశ్రాంతి లేకుండా శరీరానికి పని చెప్పడం ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. జీరో రెస్ట్ వర్క్.. నిద్రాహారాలను నిర్లక్ష్యం చేయిస్తుంది. పని ఒత్తిడి వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతిమంగా.. అనారోగ్యకరమైన జీవనశైలి వైపునకు అడుగులు వేయిస్తుందని అంటున్నారు. భారతీయుల్లో ఇప్పటికే గుండె జబ్బులు, డయాబెటిస్‌లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్న వాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇలాంటి తరుణంలో అధిక పని గంటల నిర్ణయాలతో పరిస్థితి మరింత ముదిరే అవకాశం ఉంటుంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: వారానికి మొత్తం 40 గంటలే పని ఉండాలి!ఇన్ఫోసిస్ మూర్తి(78) ఏమన్నారంటే..ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువ. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. మనమూ అలా శ్రమించాలి. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలి.తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శల నేపథ్యంలో మరోసారి ఆయన స్పందిస్తూ..ఇన్ఫోసిస్(Infosys)ను మేం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంపెనీలతో పోలుస్తాం. అలా పోల్చుకున్నప్పుడే భారతీయులు చేయాల్సింది చాలా ఉందనిపిస్తుంది. మన దేశంలో ఇంకా 80కోట్ల మంది ఉచిత రేషన్ అందుకుంటున్నారు. అంటే ఆ 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నట్లే కదా..! అందుకే మన ఆశలు, ఆకాంక్షలను ఉన్నతంగా ఉంచుకోవాలి. వారానికి 70 గంటలు పని చేయలేకపోతే మనం ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలం? మనం కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతే ఇంకెవరు పనిచేస్తారు?.ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం(64) ఏమన్నారంటే..ఆదివారాలు మీతో పనిచేయించలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. మీతో అలా పనిచేయించగలిగితే.. నాకు సంతోషం. ఎందుకంటే నేను ఆదివారాలు పనిచేస్తున్నాను. అయినా ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు. ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు. ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలి. వారానికి 90 గంటలు పని చేయాలి. అందుకోసం ఆదివారం సెలవులనూ వదిలేయాలి. ఇదీ చదవండి: 104 రోజులు ఏకధాటిగా పని.. అనారోగ్యంతో వ్యక్తి మృతి -
వారానికి 70 గంటల పనిపై అదానీ స్పందన ఇది
ఇన్ఫోసిస్ 'నారాయణ మూర్తి' (Narayana Murthy) వారానికి 70 గంటలు పనిచేస్తే భారత్ అభివృద్ధి చెందుతుందని వెల్లడించిన విషయం అందరికీ తెలుసు. ఈ వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు మిశ్రమంగా స్పందించారు. కాగా ఇప్పుడు ఈ విషయంపై దిగ్గజ పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ చైర్మన్ 'గౌతమ్ అదానీ' (Gautam Adani) కూడా మాట్లాడారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.భారతదేశంలో వర్క్ - లైఫ్ బ్యాలెన్స్ డిబేట్‌పై గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. పని & జీవితం మధ్య సమతుల్యతను సాధించడంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగానే 'ఒక వ్యక్తి ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం పనిలోనే నిమగ్నమైపోతే.. భార్య అతన్ని విడిచి పారిపోతుంది' అని అన్నారు.వర్క్-లైఫ్ బ్యాలెన్స్వర్క్ - లైఫ్ బ్యాలెన్స్ అనేది వ్యక్తిని ఆనందింపజేయాలని, మీరు చేసే పని మీకు నచ్చితే.. లైఫ్ బ్యాలెన్స్ అవుతుందని అదానీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలతో గడపడానికి రోజుకు కనీసం నాలుగు కేటాయించాలని ఆయన సూచించారు. వ్యక్తిగత జీవితాన్ని విస్మరించడం వల్ల కలిగే పరిణామాల గురించి కూడా వివరించారు.Watch: Adani Group Chairman Gautam Adani on work-life balance says, "If you enjoy what you do, then you have a work-life balance. Your work-life balance should not be imposed on me, and my work-life balance shouldn't be imposed on you. One must look that they atleast spend four… pic.twitter.com/Wu7Od0gz6p— IANS (@ians_india) December 26, 2024వారానికి 70 గంటల పనిఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి 3వన్4 (3one4) క్యాపిటల్ పాడ్‌కాస్ట్ 'ది రికార్డ్' ఫస్ట్ ఎపిసోడ్లో యువతను ఉద్దేశించి.. భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడాలంటే, ఇతర దేశాలతో పోటీ పడాలంటే వారానికి 70 గంటలు పని చేయాలని పేర్కొన్నారు. ఇండియాలో పని ఉత్పాదకత.. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ చేసినట్లు భారతీయ యువకులు ఎక్కువ గంటలు పనిచేయాలని వెల్లడించారు.పని గంటలు పెంచకపోతే ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలతో భారత్ పోటీ పడటం అసాధ్యం అని నారాయణ మూర్తి అన్నారు. తప్పకుండా దీని గురించి యువత ఆలోచించాలి, జర్మన్ దేశంలో ప్రతి వ్యక్తి.. దేశాభివృద్ధి కోసం తప్పనిసరిగా అదనపు పని చేయడానికి ముందడుగు వేస్తున్నారు. ఇదే భారతీయులు కూడా పాటించాల్సిన అవసరం ఉందని నారాయణ మూర్తి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.నారాయణ మూర్తి వ్యాఖ్యలపై విమర్శలువారానికి 70 గంటలు పనిచేయాలి అని పేర్కొన్న నారాయణ మూర్తి వ్యాఖ్యలను పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (PMS) కంపెనీ ఫస్ట్‌గ్లోబల్‌గ్రూప్ ఫౌండర్, చైర్పర్సన్, ఎండీ దేవినా మెహ్రా (Devina Mehra) తప్పుపట్టారు. ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ 'నిమితా థాపర్' కూడా 70 గంటల పనిని కండించారు. ఇప్పుడు తాజాగా గౌతమ్ అదానీ కూడా ఆ వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు.ఇదీ చదవండి: అంబానీ ఇంటికి కొత్త అతిథి.. ఇది చాలా స్పెషల్!గౌతమ్ అదానీభారతదేశంలో రెండో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ దిగ్గజ పారిశ్రామిక వేత్తలలో ఒకరు. ఈయన నికర విలువ రూ. ఆరు లక్షల కోట్ల కంటే ఎక్కువ. ఈయన సారథ్యంలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్ మొదలైన కంపెనీలు ఉన్నాయి. -
70 గంటల పని: ప్రముఖ సీఈఓ ఏమన్నారంటే?
భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే.. యువత వారానికి 70 గంటలు పని చేయాలని, ఇన్ఫోసిస్ 'నారాయణ మూర్తి' గతంలో పేర్కొన్నారు. దీనిపైన పలువురు పారిశ్రామిక వేత్తలు మిశ్రమంగా స్పందించారు. కాగా ఇప్పుడు ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ 'నిమితా థాపర్' వ్యాఖ్యానించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిమితా థాపర్ మాట్లాడుతూ.. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల లాభం పొందేది యజమానులే.. కానీ ఉద్యోగులు కాదని వెల్లడించారు. ఎక్కువ డబ్బు సంపాదించాలనుకునే యజమానులు.. ఎక్కువ గంటలు పనిచేయండని వివరించారు. అయితే అభివృద్ధి పేరుతో ఉద్యోగులపైన పనిభారాన్ని మోపకూడని అన్నారు.ఈ విషయం మీద షాదీ.కామ్ వ్యవస్థాపకుడు 'అనుపమ్ మిట్టల్' మీద స్పందిస్తూ.. నారాయణ మూర్తి మాటలతో ఏకీభవించారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే.. తప్పకుండా కస్టపడి పనిచేయాలి. నేను అమెరికాలో ఉన్నప్పుడు రోజుకు 16 గంటల చొప్పున పని చేశానని పేర్కొన్నారు. మనిషి ఎదగాలంటే.. పనిగంటలతో సంబంధం లేకుండా అంకితభావంతో పనిచేయాలని స్పష్టం చేశారు. -
నారాయణమూర్తి అడిగితే.. కొండపై నుంచి దూకేవాడిని: నందన్ నీలేకని
నందన్ నీలేకని అనగానే.. ఆధార్ సృష్టికర్త అని వెంటనే గుర్తొస్తుంది. కానీ ఈయన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులలో ఒకరు కూడా. ఇటీవల ఈయన రోస్లాన్‌స్కీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రయాణం గురించి వెల్లడించారు.నందన్ నీలేకని 1978లో మొదటిసారి ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని కలిసిన తరువాత తనలో మార్పు వచ్చిందని చెప్పారు. అంతకంటే ముందు ఐఐటీ బాంబేలో చేరడానికి తన తండ్రిని ఎదిరించిన విషయాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. నాన్న నన్ను కెమికల్ ఇంజినీరింగ్‌లో చేరమని చెబితే.. నేను ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో చేరాను. అప్పట్లో అది ఓ చిన్నపాటి తిరుగుబాటు చర్య అని అన్నారు.నేను చదువుకునే రోజుల్లో ఇంజినీర్ లేదా డాక్టర్ అనే రెండు ఉద్యోగాలను మాత్రమే తల్లిందండ్రులు పిల్లలకు చెప్పేవారు. నేను డాక్టర్ కావాలని కోరుకోలేదు, అందుకే ఇంజినీర్ అయ్యాను అని నందన్ నీలేకని చెప్పుకొచ్చారు. 1978లో ఐఐటీ బాంబే నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీర్ పట్టా పొందాను. ఆ తరువాత గ్రేడ్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్ష రాయ్లకున్నాను, కానీ ఆరోజు అస్వస్థతకు గురవ్వడం వల్ల పరీక్ష మిస్ అయ్యాను. తరువాత ఏం చేయాలో తోచలేదు.ఆ సమయంలో కొత్త టెక్నాలజీని, మినీ కంప్యూటర్లను ఉపయోగిస్తున్న ఓ చిన్న సంస్థ పాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్ గురించి విన్నాను. ఇది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సంస్థకు సాఫ్ట్వేర్ హెడ్‌గా ఉన్న నారాయణమూర్తి ఆఫీసుకు వెళ్ళాను. ఆయన నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు, అదృష్టవశాత్తు వాటన్నింటికి సరైన సమాధానాలు ఇచ్చాను. ఇదే నా జీవితాన్ని మలుపుతిప్పిన అసాధారణ జాబ్ ఆఫర్ అని నీలేకని అన్నారు.నారాయణమూర్తి ఆకర్షణీయంగా, చాలా ప్రతిష్టాత్మకంగా ఉండేవారాని నీలేకని పేర్కొన్నారు. గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకున్న వ్యక్తి అని ఆయన నారాయణమూర్తిని కొనియాడారు. ఆయన అడిగితే ఏమైనా చేస్తాను. కొండపై నుంచి దూకమంటే.. తప్పకుండా దూకుతాను అని నీలేకని చెప్పారు. ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవంగా భావిస్తున్నాను. 25ఏళ్ల వయసులో నా లీడర్ నారాయణమూర్తితో కలిసి ఇన్ఫోసిస్ స్థాపించమని గుర్తుచేసుకున్నారు.ఇదీ చదవండి: అలా ఆమె మనసు గెలుచుకున్నా.. 30 ఏళ్లకే మాటపై నిలబడ్డా: ఎన్వీడియా సీఈఓఇన్ఫోసిస్ ప్రస్తావన గురించి మాత్రమే కాకుండా.. ఆధార్‌ను రూపొందించే తన ప్రయాణాన్ని కూడా వివరించారు. ఆధార్‌లో చేరిన ఒక నెలలోపే, నేను వైదొలిగే సమయానికి మేము 600 మిలియన్ల ఐడీలను సాధిస్తామని ప్రకటించాను. ఇది చాలా పెద్ద లక్ష్యం, ప్రజలు నన్ను వెర్రివాడిగా భావించారు. అయితే ఈ లక్ష్యం నా జట్టును ఉత్తేజపరిచింది. ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం వల్ల మిగతావన్నీ కనుమరుగయ్యేలా చేశాయని నందన్ అన్నారు. -
టీసీఎస్.. ఇన్ఫోసిస్‌కు ప్రత్యర్థి కాదా?
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి.. తనకు, దివంగత రతన్ టాటాకు మధ్య 2004లో జరిగిన ఆసక్తికరమైన సంఘటన గుర్తు చేసుకున్నారు. ఇన్ఫోసిస్‌లో జంషెడ్జీ టాటా రూమ్‌ను ప్రారంభించేందుకు ఇన్ఫోసిస్ ఆహ్వానించినప్పుడు రతన్ టాటా ఆశ్చర్యపోయారని మూర్తి చెప్పారు.ఇన్ఫోసిస్‌కు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) పోటీదారుగా ఉన్నప్పటికీ తనను ఎందుకు ఆహ్వానించారని రతన్ టాటా అడిగారని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో రతన్ టాటా టీసీఎస్ సంస్థకు నాయకత్వం వహించేశారు. టాటా సందేహానికి మూర్తి మర్యాదపూర్వకంగా బదులిస్తూ, జంషెడ్జీ టాటా కంపెనీలకు అతీతమైనవారని, గొప్ప దేశభక్తుడని పేర్కొన్నారు. ఇన్ఫోసిస్‌కు టాటా గ్రూప్‌ను పోటీదారుగా తాను ఎన్నడూ భావించలేదని, రతన్ టాటా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నందున రూమ్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించామని రతన్ టాటాకు చెప్పారు.ఇదీ చదవండి: రతన్ టాటా మళ్లీ బతికొస్తే..తర్వాత టాటా ఆహ్వానాన్ని మన్నించారని, ఈ కార్యక్రమం తనకు జ్ఞాపకంగా మారిందని నారాయణమూర్తి పేర్కొన్నారు. రతన్ టాటాకు కాస్త సిగ్గుపడే స్వభావం ఉందని, దీంతో అప్పడు సుదీర్ఘ ప్రసంగం చేసే మూడ్‌లో లేరని చెప్పుకొచ్చారు. అయితే రతన్ టాటా పర్యటన తమ టీమ్‌పై చాలా ప్రభావం చూపిందని, ఇన్ఫోసిస్ సిబ్బందితో సమయం గడిపారని మూర్తి గుర్తు చేసుకున్నారు. రతన్ టాటా వినయం, దయ, దేశభక్తి ఉన్న గొప్ప వ్యక్తి అని నారాయణమూర్తి కొనియాడారు. -
‘వారానికి 40 గంటలే పని ఉండాలి!’
పని భారం.. తీవ్ర ఒత్తిడితో ఓ యువ ఉద్యోగిణి ప్రాణం కోల్పోవడం దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ భిన్నంగా స్పందించారు.పని ఒత్తిడితో యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా ఉద్యోగి మరణించిన ఘటనపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. పని ప్రదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరగొద్దని సూచించిన ఆయన.. పనివేళలపై పార్లమెంట్లో చట్టం తెచ్చేందుకు కృషిచేస్తానన్నారు. ఈ క్రమంలో వారానికి 40 గంటల పని దినాల ప్రతిపాదన తెరపైకి తెచ్చారాయన.Had a deeply emotional and heartrending conversation with Shri Sibi Joseph, the father of young Anna Sebastian, who passed away after a cardiac arrest, following four months of deeply stressful seven-day weeks of 14 hours a day at Ernst&Young. He suggested, and I agreed, that I…— Shashi Tharoor (@ShashiTharoor) September 20, 2024 నాలుగు నెలలు.. ఏడు రోజులు.. రోజుకి 14 గంటల చొప్పున పని చేయడంతోనే ఆమె ఒత్తిడికి గురైంది. ఆమె మృతిపై విచారం వ్యక్తం చేస్తున్నా. అందుకే వారానికి ఐదు రోజులే పని దినాలు ఉండాలి. ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగులు రోజుకు ఎనిమిది గంటలే పని చేయాలి. ఈ దిశగా చట్టం కోసం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నా వంతు కృషి చేస్తా.. అని తన ఎక్స్ ఖాతాలో ఆయన ఒక సందేశం కూడా ఉంచారు. అంతేకాదు ఇదే అంశంపై అన్నా తండ్రి సిబి జోసెఫ్‌తోనూ తాను మాట్లాడినట్లు థరూర్ తెలిపారు.కేరళకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరయిల్(26) నాలుగు నెలలుగా పూణే ఈవై కార్యాయలంలో పని చేస్తూ.. జులై నెలలో కన్నుమూసింది. అయితే పని ఒత్తిడి వల్లే అన్నా మరణించిందని ఆమె తల్లి అనిత ఈవై ఇండియా చైర్మన్ రాజీవ్ మెమానీకి లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది.ఇక.. ఈ వ్యవహారంపై కేంద్ర కార్మిక శాఖ విచారణ చేపట్టింది. మరోవైపు తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో రాజీవ్ మెమానీ స్పందించారు. ‘‘ఆమె కుటుంబంతో మాట్లాడాను. సెబాస్టియన్ మృతికి సంతాపం తెలిపాను. వారి జీవితంలో ఏర్పడిన వెలితిని ఎవరూ పూడ్చలేరు. ఆమె అంత్యక్రియల సమయంలో మేము అక్కడ లేకపోవడంపై తీవ్ర విచారం వ్యక్తంచేస్తున్నాను. ఇది మా పని సంస్కృతికి పూర్తిగా విరుద్ధం. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. భవిష్యత్తులో ఇలా జరగదు’’ అని సంస్థ మెమానీ పేర్కొన్నారు. తెరపైకి నారాయణమూర్తి కామెంట్స్పని ఒత్తిడితో ఈవై ఉద్యోగిణి మరణించడం చర్చనీయాశంగా మారిన వేళ.. పనిగంటలపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గతంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ దేశాలతో పోటీ పడాలన్నా.. అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవాలన్నా.. భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాల్సిందేనని అన్నారాయన. ‘‘ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువ. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. చైనా వంటి దేశాలతో పోటీపడాలంటే మన యువత అదే తరహాలో పనిచేయాల్సిన అవసరం ఉంది. ‘ఇదీ నా దేశం. నా దేశం కోసం వారానికి 70 గంటలు కష్టపడతా’ అనే అనే ప్రతిజ్ఞ చేయాలి’’ అని నారాయణమూర్తి అన్నారు. ఆ సమయంలో ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.వారానికి 100 గంటలైనా పని చేయాలంటూ ఎలోన్ మస్క్ లాంటి బిలియనీర్లు పిలుపు ఇస్తుంటారు. కానీ, ఓవర్ వర్క్ వల్ల గుండె, మెదడు ఇతర కీలకమైన అవయవాలపై ఒత్తిడి పడుతుంది. చివరకు.. మరణానికి కూడా దారి తీయొచ్చు. మొన్నీమధ్య చైనాలోనూ ఓ పెయింటర్ ఇలా గొడ్డు చాకిరీ చేసే ప్రాణం పొగొట్టుకున్నాడు. ఆరా తీస్తే.. వరుసగా 104 రోజులు పని చేసిన ఆ కిందిస్థాయి ఉద్యోగి.. ఒకే ఒక్కరోజు సెలవు తీసుకున్నాడని తేలింది. ఇదీ చదవండి: కోటి జీతం.. అయినా ఈవై ఉద్యోగం వద్దనుకున్నాడు!! -
తయారీ కేంద్రంగా భారత్!.. చెప్పడం సాహసమే
వారానికి 72 గంటల పని గురించి చెబుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. చైనాను భారత్ అధిగమిస్తుందని పలువురు నిపుణులు చెబుతుంటే.. తయారీ రంగంలో ఇండియా చైనాని దాటాలంటే అనేక సవాళ్ళను ఎదుర్కోవాలని 'ఈఎల్‌సీఐఏ టెక్ సమ్మిట్ 2024'లో పేర్కొన్నారు.ఇండియా సామర్థ్యం మీద సందేహంగా ఉంది. ఇప్పటికే చైనా ప్రపంచ కర్మాగారంగా మారింది. ఇతర దేశాల్లోని సూపర్ మార్కెట్లు, హోమ్ డిపోలలోని దాదాపు 90 శాతం వస్తువులు చైనాలో తయారైనవే ఉన్నాయి. అవన్నీ భారత్ జీడీపీకి ఆరు రెట్లు. కాబట్టి ఈ సమయంలో మన దేశం చైనాను అధిగమిస్తుందని చెప్పడం సాహసమనే చెప్పాలి అని నారాయణ మూర్తి అన్నారు.ఐటీ రంగ ఎగుమతుల్లో భారత్ వృద్ధి సాధిస్తుండగా.. తయారీ రంగం మాత్రం దేశీయ సహకారం, ప్రభుత్వ మద్దతు వంటి వాటి మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇక్కడ లక్ష్యాలను చేరుకోవాలంటే.. ప్రభుత్వాల పాత్ర చాలా కీలకమని నారాయణ మూర్తి అన్నారు. ఇది మెరుగుపడాలంటే ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సమాచారం లోపాలను తగ్గించాలని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యాపారవేత్తలు మార్కెట్ పరిస్థితులను మెరుగ్గా అంచనా వేయాలి, అప్పుడే తయారీ రంగం అభివృద్ధి చెందుతుంది అని ఆయన అన్నారు. -
భారత్ చైనాను ఎలా అధిగమిస్తుందంటే?.. ఇన్ఫీ నారాయణ మూర్తి ఫార్ములా
ఇండియా కేవలం చైనాతో భౌగోళిక సరిహద్దును పంచుకోవడమే కాకుండా.. ఆర్ధిక వ్యవస్థలో కూడా ప్రత్యర్థిగా కూడా ఉంది. చైనా జీడీపీ భారత్‌తో పోలిస్తే 2.5 రెట్లు ఎక్కువ. అయితే భారత్ భవిష్యత్తులో చైనా ఆర్థిక వ్యవస్థను అధిగమించే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు.పారిశ్రామిక రంగంలో చైనాను అధిగమించేందుకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని సృష్టించేందుకు భారత్ ప్రాధాన్యత ఇవ్వాలని నారాయణ మూర్తి అన్నారు. పౌరుల ఆదాయాన్ని పెంచడంపై దృష్టి పెట్టాలి. ఆదాయంతో పాటు ఏటా లక్షలాది ఉపాధి అవకాశాలను కల్పించాలి. అప్పుడే మన దేశం చైనాను తప్పకుండా అధిగమిస్తుందని అన్నారు.మానవ వనరుల ఉత్పాదకతను పెంచడానికి 'ఏఐ'ను తగినంతగా ఉపయోగించాలి. సాధారణ ఏఐ ప్రజల సామర్థ్యాన్ని పెంచుతూ సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది. ఇది మన సమాజానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.దేశీయ తయారీని పెంచడానికి భారత ప్రభుత్వం ఈ దశాబ్దం ప్రారంభంలో సుమారు రూ. 2.7 లక్షల కోట్ల విలువైన ప్రోత్సాహక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. ఈ దశాబ్దం చివరి నాటికి, భారతదేశ వార్షిక జీడీపీ వృద్ధి శాతం 9కి చేరుకోవచ్చు. చైనా వృద్ధి రేటు 3.5 శాతానికి పడిపోవచ్చు. రానున్న రోజుల్లో కూడా ఇదే జోరు కొనసాగితే చైనాను భారత్ అధిగమించగలదని నారాయణ మూర్తి పేర్కొన్నారు. -
మంచి వ్యక్తిగా ఉండాలనుకోవడం లేదు!.. కానీ..
టెక్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు ఇన్ఫోసిస్ 'నారాయణ మూర్తి'. ప్రారంభం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని.. నేడు కోట్ల సంపదకు నాయకుడైన ఈయన ఎంతోమందికి ఆదరప్రాయం. ఖచ్చితమైన సిద్ధాంతాలను పాటించే మూర్తి.. తాను మంచి వ్యక్తిగా ఉండాలనుకోవడం లేదని ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు.నాయకుడిగా నేను మొదటి నేర్చుకున్న విషయం న్యాయమైన వ్యక్తిగా ఉండాలనుకోవడం. ప్రతి లావాదేవీలో న్యాయంగా ఉండటం చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి నేను మంచి వ్యక్తిగా కాకూండా.. న్యాయమైన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నానని అన్నారు.1981లో ఎన్ఆర్ నారాయణ మూర్తి పూణేలో ఇన్ఫోసిస్‌ను స్థాపించారు. అప్పటి నుంచి కంపెనీ ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ.. ముందుకు సాగుతోంది. ఇప్పటికి కూడా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు.ప్రతి విద్యార్ధి చదవాల్సిన పుస్తకంఇదిలా ఉండగా.. ఇటీవల ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి దేశంలో ప్రతి విద్యార్ధి తప్పకుండా.. పాల్ జీ.హెవిట్ రాసిన "కాన్సెప్టువల్ ఫిజిక్స్" (Conceptual Physics) అనే పుస్తకాన్ని చదవాలని సూచించారు. ఇందులో హైస్కూల్ విద్యార్థులకు ఫిజిక్స్ ఎలా బోధించాలో వెల్లడించారని నారాయణమూర్తి చెప్పారు. దీనిని భారతదేశంలోని అన్ని భాషల్లోకి అనువదించడానికి రచయిత అనుమతిస్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు. -
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
"మేఘాలయ నుంచి కన్యాకుమారి వరకు, శ్రీనగర్ నుంచి జామ్‌నగర్" వరకు భారతదేశంలోని ప్రతి పిల్లవాడు చదవాల్సిన పుస్తకాలలో ఒకటి ఉందని ఇన్ఫోసిస్ 'నారాయణమూర్తి' ఇటీవల పేర్కొన్నారు. పాల్ జీ.హెవిట్ రాసిన "కాన్సెప్టువల్ ఫిజిక్స్" (Conceptual Physics) అనే పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని ఆయన సూచించారు.ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ప్రస్తుతం 'కాన్సెప్టువల్ ఫిజిక్స్' చదువుతున్నట్లు పేర్కొన్నారు. పాల్ హెవిట్ అనే హైస్కూల్ టీచర్ ఈ పుస్తకాన్ని రచించారు. ఇందులో హైస్కూల్ విద్యార్థులకు ఫిజిక్స్ ఎలా బోధించాలో వెల్లడించారని నారాయణమూర్తి చెప్పారు. దీనిని భారతదేశంలోని అన్ని భాషల్లోకి అనువదించడానికి రచయిత అనుమతిస్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు.'కాన్సెప్చువల్ ఫిజిక్స్' మొదటిసారిగా 1971లో ప్రచురించారు. ఇందులో క్లాసికల్ మెకానిక్స్ నుంచి ఆధునిక భౌతికశాస్త్రం వరకు సారూప్యతలు, సూత్రాల చిత్రాలతో వెల్లడించారు. ఇది పాఠకులను ఎంతగానో ఆకర్షిస్తుందని నారాయణ మూర్తి అన్నారు. -
4 నెలల మనవడికి రూ.240 కోట్ల బహుమతి
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తన నాలుగు నెలల మనవడు ఏకగ్రాహ్ రోహన్ మూర్తికి ఖరీదైన బహుమతిని ప్రదానం చేశారు. ఇన్ఫోసిస్‌కు చెందిన 15 లక్షల షేర్లను ఇచ్చారు. ప్రస్తుత మార్కెట్ ధర (రూ. 1,602) ప్రకారం వీటి విలువ రూ. 240 కోట్లుగా ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కంపెనీలో తనకుగల ఈక్విటీలో 0.04 శాతం వాటాను కుమారుడు రోహన్ పుత్రుడు ఏకగ్రాహ్కు నారాయణ మూర్తి రిజిస్టర్ చేశారు. దీంతో ఏకగ్రాహ్ రోహన్ ఇన్ఫోసిస్‌లో బుల్లి బిలియనీర్ వాటాదారుడయ్యారు. నారాయణ మూర్తి కుమార్తె అక్షత, అల్లుడు రిషీ (బ్రిటన్ ప్రధాని)కి ఇద్దరు కుమార్తెలుకాగా.. ఏకగ్రాహ్ మనవడు. -
మనవడిపై ప్రేమ.. 4 నెలల బిడ్డకు రూ.240 కోట్ల గిఫ్ట్
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరమే లేదు. కేవలం పదివేల రూపాయలతో వేలకోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించి ఎంతో మందికి ఆదర్శంగా నిలబడ్డారు. భారతదేశంలోని మిలియనీర్ల జాబితాలో ఒకరైన నారాయణ మూర్తి తన మనవడికి ఏకంగా కోట్ల రూపాయల షేర్స్ గిఫ్ట్ ఇచ్చారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి తన నాలుగు నెలల 'ఏకాగ్రహ్ రోహన్ మూర్తి' (Ekagrah Rohan Murty)కి ఏకంగా రూ. 240 కోట్ల విలువైన షేర్స్ గిఫ్ట్ ఇచ్చారు. దీంతో ఏకాగ్రహ్ ఇప్పుడు ఇన్ఫోసిస్‌లో 1500000 షేర్స్ లేదా 0.04 శాతం వాటా కలిగి ఉన్నట్లు సమాచారం. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి, కోడలు అపర్ణ కృష్ణన్ 2023 నవంబర్ 10న బెంగళూరులో మగబిడ్డకు జన్మనిచ్చారు. నారాయణ మూర్తి, సుధా మూర్తికి ఇప్పటికే కృష్ణ సునక్, అనౌష్క సునక్ అనే ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. వీరిరువురూ యూకే ప్రధాన మంత్రి రిషి సునక్, అక్షతా మూర్తి కుమార్తెలు. ఏకాగ్ర పేరు మహాభారతంలోని అర్జున్ పాత్ర నుంచి ప్రేరణ పొందింది. సంస్కృత పదమైన 'ఏకాగ్రహ్'కు అచంచలమైన దృష్టి, సంకల్పం అని అర్థం. -
కూతురితో నారాయణ మూర్తి - ఫన్ మిస్ అయిన రిషి సునాక్!
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు 'నారాయణ మూర్తి' ఇటీవల తన కుమార్తె 'అక్షతా మూర్తి'తో కలిసి బెంగళూరులోని ఒక ఐస్‌క్రీమ్ పార్లర్లో సాధారణ వ్యక్తుల మాదిరిగానే ఐస్‌క్రీమ్ తింటూ కనిపించారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వైపు బ్రిటన్ ప్రథమ మహిళ, మరో వైపు టెక్ దిగ్గజం ఇద్దరూ చాలా సింపుల్‌గా కనిపించిన ఫోటో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటోను ఒక ఎక్స్ (ట్విటర్) యూజర్ షేర్ చేస్తూ.. బెంగళూరులోని జయనగర్ 5వ బ్లాక్‌లోని 'కార్నర్ హౌస్'లో బ్రిటన్ ప్రథమ మహిళ అక్షతా మూర్తి తన తండ్రి నారాయణమూర్తితో కలిసి ప్రశాంతంగా ఐస్‌క్రీమ్ తింటున్నారు. ధనవంతులైనప్పటికీ సాధారణ వ్యక్తులు మాదిరిగా జీవితం గడుపుతున్నారు. ఇదే నారాయణమూర్తి గొప్పతనం అంటూ ట్వీట్ చేశారు. ఈ ఫొటోలో నారాయణ మూర్తి, అక్షతా మూర్తి ఇద్దరూ క్యాజువల్ దుస్తులు ధరించి ఉండటం చూడవచ్చు. ఇందులో రిషి సునాక్ పేరు కూడా ట్యాగ్ చేసి మీరు ఈ ఫన్ మిస్ అయ్యారు అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ ఫోటో చూసి పలువురు నెటిజన్లు వీరి సింప్లిసిటీకి ఫిదా అయిపోతున్నారు. ఇదీ చదవండి: ఉద్యోగులకు అవి ఇవ్వలేకపోయాను!.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి Britain's First Lady Akshata Murty with her Father Shri Narayan Murthy at Corner House in Jayanagar 5th block Bangaluru... Place was packed.... they came quietly and bought their ice cream . Rich but live a common life . This the greatness that Mr @Infosys_nmurthy carries along.… pic.twitter.com/QhYLikRbns — Devi Singh (@devipsingh) February 12, 2024 -
ఉద్యోగులకు అవి ఇవ్వలేకపోయాను!.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి 'యాన్ అన్‌కామన్ లవ్: ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి' బుక్ ఆవిష్కరించిన తరువాత, సంస్థలో చాలా మంది ఉద్యోగులకు తగినన్ని రివార్డ్ ఇవ్వలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేశారు. సంస్థ ఉన్నతికి ఉద్యోగుల సహకారం ప్రధానమని వెల్లడించారు. ఇన్ఫోసిస్ సంస్థ ఉన్నతికి ఉద్యోగులు చాలా కష్టపడుతున్నారని, వీరికి కంపెనీ కో-ఫౌండర్లకు ఇచ్చినంత స్టాక్‌ను ఇవ్వలేకపోయానని చింతించారు. ఉద్యోగులు కూడా సంస్థ వల్ల ప్రయోజనాలను పొందాలని, నేను కోరుకుంటున్నానని నారాయణ మూర్తి కోరారు. వారానికి 85 నుంచి 90 గంటలు 1981లో పూణేలో ప్రారంభమైన ఇన్ఫోసిస్ ప్రధాన కార్యాలయం ఇప్పుడు బెంగళూరులో ఉంది. నాతో (నారాయణ మూర్తి) పాటు, నందన్ నీలేకని, క్రిస్ గోపాలకృష్ణన్, శిబులాల్, కే దినేష్, ఎన్రాఎస్ ఘవన్, అశోక్ అరోరా సంస్థ ఏర్పాటుకు సహకరించారు. ప్రారంభంలో నేను వారానికి 85 నుంచి 90 గంటలు పనిచేశానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇదీ చదవండి: ఒక్క రోజులోనే రూ.57 వేల కోట్లు మటాష్.. అయినా ఆవిడే ప్రపంచంలో రిచెస్ట్! టాయిలెట్స్ శుభ్రం చేయడంపై నారాయణమూర్తి వ్యాఖ్యలు ఇటీవల నారాయణ మూర్తి తన టాయిలెట్లను శుభ్రం చేయడం గురించి, ఎందుకు శుభ్రం చేయాలనే విషయాలను వెల్లడిస్తూ.. నా పిల్లలకు కూడా మన టాయిలెట్లను మనమే శుభ్రం చేసుకోవాలని, సమాజంలో ఎవరూ తక్కువ కాదని చెప్పినట్లు తెలిపారు. చాలామంది ధనవంతుల పిల్లలు ఇప్పటికి కూడా టాయిలెట్లను శిబిరం చేసుకోవడం మన పనికాదని భావిస్తారని అది కరెక్ట్ కాదని అన్నారు. -
మీరు రాజకీయాల్లోకి వస్తారా? నారాయణ మూర్తి సమాధానం ఇదే..
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు 'నారాయణ మూర్తి' (Narayana Murthy) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సొంతంగా ఉపయోగించే టాయిలెట్లను శుభ్రం చేయడం గురించి, రాజకీయాలపై తనకున్న ఆసక్తిని గురించి ప్రస్తావించారు. సమాజంలో మరుగుదొడ్లను శుభ్రం చేసేవారిని చాలా చిన్న చూపు చూస్తారని, అందువల్లే నా పిల్లలకు మన టాయిలెట్లను మనమే శుభ్రం చేసుకోవాలని, సమాజంలో ఎవరూ తక్కువ కాదని చెప్పడానికి, సొంతంగా ఉపయోగించే టాయిలెట్లను శుభ్రం చేసుకోవడం గురించి వివరించారు. నా పిల్లలు అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉంటారని, వారి ప్రశ్నలకు ప్రేమతో సమాధానాలు చెబుతానని వివరించారు. ముఖ్యంగా ప్రస్తుతం చాలామంది ధనవంతుల కుటుంబాలలో సొంత టాయిలెట్లను సొతంగా శుభ్రం చేసుకునే పద్దతి పూర్తిగా నిషిద్ధంగానే ఉందని తెలిపారు. రాజకీయాల్లో చేరే ఆలోచన ఉందా.. నారాయణ మూర్తిని రాజకీయాల్లో చేరే ఆలోచన ఏమైనా ఉందా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలు తనకు లేదని.. తన పిల్లలు, మనవళ్లతో గడపాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు చెప్పారు. అంతే కాకుండా.. సంగీతాన్ని ఆస్వాదిస్తూ.. భౌతిక శాస్త్రం నుంచి అర్ద శాస్త్రం వరకు వివిధ అంశాలను తెలుసుకోవాలనుకుంటున్నట్లు కూడా వివరించారు. ఇదీ చదవండి: మూడు నెలల బిడ్డను అక్కడ విడిచిపెట్టి.. ఇన్ఫోసిస్ కోసం సుధామూర్తి.. రచయిత్రి, పరోపకారి అయిన 'సుధామూర్తి' (Sudha Murthy) కూడా ప్రజలకు సేవ చేయడానికి ప్రత్యేకంగా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని కూడా నారాయణ మూర్తి తెలిపారు. అవసరమైనప్పుడు తప్పకుండా సమాజానికి సేవ చేస్తామని, దానికోసం రాజకీయాల్లో స్థానం తనకు అవసరం లేదని స్పష్టం చేశారు. -
అప్పుడాయన ఆ తప్పు చేయకుంటే ఇన్ఫోసిస్ పుట్టేదే కాదు!
విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ చేసిన ఒక తప్పు.. దేశంలో అగ్రశ్రేణి ఐటీ సంస్థగా ఉన్న ఇన్ఫోసిస్ (Infosys) పుట్టుకకు కారణమని తెలుసా? అప్పుడాయన ఆ తప్పు చేయకుండా ఉంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉండేదే కాదు. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి (NR Narayana Murthy) స్వయంగా చెప్పిన ఆ విషయం గురించి తెలుసుకుందామా.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగంలో భారత్ గణనీయ అభివృద్ధి సాధించింది. ఇందుకు ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది కార్పొరేట్ లీడర్లు చేసిన కృషి ఎనలేనిది. 1981లో కంపెనీని స్థాపించి దేశంలో ఐటీ అభివృద్ధి బాటలో పయనించడానికి అనేకమందికి మార్గం సుగమం చేసిన ఏడుగురిలో ఒకరైన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి ముందువరుసలో ఉంటారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో ఎలాంటి కీలక పాత్ర లేని 77 ఏళ్ల నారాయణమూర్తి.. తనతో విప్రో ఫౌండర్ అజీమ్ ప్రేమ్‌జీ చెప్పిన ఓ ఆసక్తికర విషయాన్ని ఇటీవల వెల్లడించారు. నారాయణమూర్తిని ఉద్యోగంలోకి తీసుకోకపోవడమే తాను చేసిన అతి పెద్ద తప్పులలో ఒకటి అని అజీమ్ ప్రేమ్‌జీ తనతో ఒకసారి చెప్పాడని సీఎన్‌బీసీ టీవీ18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పరిస్థితులు అనుకూలంగా జరిగి ఉంటే ఇప్పుడు విప్రో సంస్థకు తిరగుండేది కాదని నారాయణ మూర్తి దంపతులు ఇదే ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నారాయణ మూర్తి 1981 నుంచి 2002 వరకు 21 సంవత్సరాల పాటు ఇన్ఫోసిస్ సీఈవోగా కొనసాగారు. 2002 నుంచి 2006 వరకు బోర్డు ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ తర్వాత చీఫ్ మెంటార్‌గా కూడా సేవలందించారు. 2011లో ఇన్ఫోసిస్ నుంచి రిటైరయ్యారు. నారాయణ మూర్తి ఇప్పుడు ఇన్ఫోసిస్ ఎమెరిటస్ చైర్మన్. -
అందుకే వారానికి 70 గంటల పని చేయమన్నా! - నారాయణ మూర్తి
భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే యువత వారానికి 70 గంటలు పనిచేయాలని గతంలో ఇన్ఫోసిస్ 'నారాయణ మూర్తి' చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారం రేకెత్తించాయి. కొందరు ఆ మాటలతో ఏకీభవిస్తే.. మరికొందరు వ్యతిరేకించారు. అయితే ఇప్పుడు నారాయణ మూర్తి అలా ఎందుకు చెప్పారనే విషయాన్ని వెల్లడించారు. దేశంలో రైతులు, కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారు. ఇది అందరికి తెలిసిన విషయం. అయితే దేశంలో ఉన్నత చదువులు చదువుకున్న విద్యావంతులు మాత్రం నిర్దిష్ట సమయానికి పనిచేయాలని అలవాటు పడిపోయారు. ఎవరైతే ఎక్కువ కష్టపడి పని చేస్తారో.. వారినే అదృష్టం వరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇదీ చదవండి: గూగుల్ పరిస్థితులు బయటపెట్టిన మాజీ ఉద్యోగి 70 గంటల పని గురించి చెప్పడం మాత్రమే కాదు, నేను వారానికి 90 గంటలు పనిచేసిన రోజులున్నాయని గుర్తు చేశారు. ఇన్ఫోసిస్‌లో తాను ఉదయం 6 గంటలకు పనిని ప్రారంభించి రాత్రి 9 గంటలకు ముగించేవాడినని చెబుతూ, తాను పాటించకుండా ఇతరులకు హితబోధ చేయనని చెప్పుకొచ్చారు. -
...అలా విజయం సాధించినట్లు చరిత్రలో లేదు: మరో సీఈవో..
దేశంలో ఉద్యోగులు, యువత ఎంత సేపు కష్టపడాలి.. ఎన్ని గంటలు పని చేయాలి అనే దానిపై మళ్లీ చర్చ మొదలైంది. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి బాటలోకి మరో సీఈవో వచ్చి చేరారు. ఎక్కువ గంటలు పనిచేయడానికి ఏ మాత్రం సంకోచించకూడదని, జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడాల్సిందే అంటున్నారు. ఇంతకీ ఎవరాయన.. ఇంకా ఏమన్నారన్నది ఇక్కడ తెలుసుకుందాం.. ఆన్లైన్ ఫర్నీచర్ సంస్థ ‘వేఫెయిర్’ సీఈవో నీరజ్ షా (Wayfair CEO Niraj Shah).. ఎక్కువ పని గంటలు పనిచేయాలని తమ కంపెనీ ఉద్యోగులకు సూచించారు. ఎవరైనా సోమరితనంతో విజయం సాధించినట్లు చరిత్రలో లేదని ఉద్బోధించారు. విజయం సాధించాలంటే కష్టపడాల్సిందేనంటూ ఈ భారతీయ-అమెరికన్ బిజినెస్‌మన్ తమ ఉద్యోగులకు పంపిన ఒక నోట్లో పేర్కొన్నట్లుగా సీఎన్ఎన్ వార్తా సంస్థ ఓ కథనంలో నివేదించింది. కంపెనీ డబ్బును మీదిగా భావించండి.. "ఎక్కువ గంటలు పని చేయడానికి, మరింత బాధ్యతగా ఉండటానికి, పనిని, జీవితాన్ని మిళితం చేయడానికి సంకోసించాల్సిన, సిగ్గుపడాల్సిన పనిలేదు. సోమరితనంతో ఎవరూ విజయం పొందినట్లు చరిత్రలో లేదు" అని నీరజ్షా ఉద్యోగులకు ఇచ్చిన సందేశంలో పేర్కొన్నారు. కంపెనీ ఇటీవలి విజయాన్ని జరుపుకున్న సందర్భంగా ఈ నెల ప్రారంభంలో ఆయన ఈ సందేశాన్ని పంచుకున్నారు. కంపెనీ ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయినీ తమదిగా భావించి మరింత బాధ్యతగా పనిచేయాలని ఉద్యోగులను కోరారు. నారాయణమూర్తి బాటలో.. యువత ఎక్కువ పని గంటలు పనిచేయాలనే భావనను మొదటి సారిగా వెలుబుచ్చిన వ్యక్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి. రెండు నెలల క్రితం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడాలంటే యువత వారానికి 70 గంటలు పని చేయాలని సూచించారు. ఆ తర్వాత చర్చ విస్తృతమైంది. విభిన్న వర్గాల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమందికి ఆయన భావనను సమర్థించగా మరికొందరు వ్యతిరేకించారు. -
అలాంటివి ఎవరూ నమ్మకండి - హెచ్చరించిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
డీప్ ఫేక్ అనేది కేవలం సినీ సెలబ్రిటీలను మాత్రమే కాకుండా పారిశ్రామిక వేత్తలను కూడా తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. ఇప్పటికే రతన్ టాటా పేరుమీద వచ్చిన డీప్ ఫేక్ మరువక ముందే.. మరో పారిశ్రామిక దిగ్గజం మీద డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ అయినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి (Narayana Murthy) ఇటీవల డీప్ ఫేక్ వీడియో బారిన పడినట్లు తెలిసింది. ట్రేడింగ్ యాప్‌లకు నారాయణ మూర్తి ప్రచారం చేస్తున్నట్లు డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్నాయని, వాటిని ఎవరూ నమ్మవద్దని ఆయనే స్వయంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్లు కూడా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ట్రేడింగ్ యాప్‌లలో నేను పెట్టుబడులు పెట్టానని, వాటిని ప్రచారం చేస్తున్నట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలోప్రచారమవుతున్నాయి. వాటిని ఎవరూ నమ్మవద్దని నారాయణ మూర్తి పేర్కొన్నారు. కొన్ని వెబ్సైట్లు డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి మోసం చేస్తున్నాయని, అలాంటివి మీకు ఎదురైతే సంబంధిత అధికారులకు రిపోర్ట్ చేయాలనీ పేర్కొన్నారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఒక పోస్ట్‌లో, సోన అగర్వాల్ పేరుతో టాటా మేనేజర్‌గా చెప్పుకుంటూ.. దేశ ప్రజలకు ఇదే నా సిఫార్సు. 100 శాతం గ్యారెంటీతో పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి అవకాశం, దీని కోసం ఈ ఛానెల్లోకి వెళ్లండి అంటూ.. రతన్ టాటా చెప్పినట్లు ఓ పోస్ట్ షేర్ చేశారు. ఈ వీడియోపై రతన్ టాటా స్పందిస్తూ.. అదంతా ఫేక్ అని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇలాంటి వాటి భారిన పడకుండా ఉండాలంటే ప్రజలు కూడా తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయనే వెల్లడించారు. PUBLIC WARNING ISSUED IN RESPECT OF FAKE VIDEOS AND POSTS ON SOCIAL MEDIA AND INTERNET ABOUT ME — Narayana Murthy (@Infosys_nmurthy) December 14, 2023 using deepfake pictures and videos. I categorically deny any endorsement, relation or association with these applications or websites. I caution the public to not fall prey to the content of these malicious sites and to the products or — Narayana Murthy (@Infosys_nmurthy) December 14, 2023 -
పనిగంటలపై మరోసారి కీలక వ్యాఖ్యలు.. కష్టం వృధా కాలేదు
వారానికి 70 గంటల పని వ్యాఖ్యలు కొంత మరుగున పడగానే.. మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్ఫోసిస్‌లో వారానికి 85 నుంచి 90 గంటలు పని చేసిన సందర్భాలున్నాయన నారాయణ మూర్తి తాజాగా వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు 'నారాయణ మూర్తి' 1994 వరకు వారానికి 85 నుంచి 90 గంటలకు పైగా పనిచేసినట్లు వెల్లడించారు. ఉదయం 6:20 గంటలకు ఆఫీసుకు చేరుకొని రాత్రి 8:30 గంటలకు బయట వచ్చేవాడినని, అలా వారంలో ఆరు రోజులు చేసేవాడినని చెప్పుకొచ్చాడు. 40 సంవత్సరాల వయసులో కూడా వారానికి 70 గంటలు పనిచేసినట్లు తెలిపారు. నా కష్టం ఎప్పుడూ వృధా కాలేదని వెల్లడించారు. పేదరికం నుంచి బయటపడేందుకు ఏకైక మార్గం కష్టపడి పని పనిచేయడమే, దీనిని తల్లిదండ్రులు వారి పిల్లలకు తప్పకుండా నేర్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇదీ చదవండి: సుధామూర్తి రాజకీయాల్లోకి వస్తుందా? ఇదిగో క్లారిటీ.. గత కొన్ని రోజులకు ముందు ఒక ఇంటర్వ్యూలో యువత వారానికి 70 గంటలు పనిచేయాలని అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, జపాన్ ప్రజలు తమ దేశాలను అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడానికి, ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచడానికి ఎక్కువ పనిగంటలు చేసారని తెలియజేస్తూ.. మనదేశంలో కూడా అలా చేస్తే బాగుంటుందని తన అభిప్రాయం వెల్లడించారు. నారాయణ మూర్తి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అప్పుడే తెగ వైరల్ అయ్యాయి. -
కొత్త పెట్టుబడులకు కాటమరాన్.. ఏ రంగాల్లో అంటే..
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు 'నారాయణ మూర్తి' (Narayana Murthy)కి చెందిన వెంచర్ క్యాపిటల్ సంస్థ 'కాటమరన్' (Catamaran) పెట్టుబడులను మరిన్ని రంగాలకు పెంచడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు కంపెనీకి చెందిన సీనియర్ అధికారి తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డిజిటల్ యాక్సిలరేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పో (DATE) సందర్భంగా కాటమరాన్ చైర్మన్ అండ్ ఎండీ 'రంగనాథ్' మాట్లాడుతూ.. 2022తో పోలిస్తే భారతదేశంలోని స్టార్టప్‌ల వాల్యుయేషన్ అంచనాలు తగ్గాయని, మంచి ఆలోచనలు రానున్న రోజుల్లో పెట్టుబడులను ఆకట్టుకుంటాయని వెల్లడించారు. ఇదీ చదవండి: నెలకు రూ.9 లక్షలు సంపాదిస్తున్న అందగత్తె.. కానీ ఈమె.. భారతదేశం ఇప్పటికే అనేక రంగాలను ఆకరిస్తోందని, తద్వారా పెట్టుబడులు పెరుగుతున్నాయని రంగనాథ్ తెలిపారు. డీప్ టెక్, ఆటోమొబైల్స్‌లో ఎగుమతి, భాగాలను తయారు చేయగల కంపెనీలలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా వ్యాఖ్యానించారు. ఇప్పటికే సంస్థ స్పేస్ ఎక్స్, డీప్ టెక్ ఎనర్జీ, లాగ్ 8, బీ2బీ ఈ-కామర్స్ సంస్థ ఉడాన్, ఎడ్యుటెక్ ఉడేమీ వంటి స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. -
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం..
వారంలో 70 గంటలు పనిచేయాలంటూ చేసిన వ్యాఖ్యలు మరువక ముందే ఇన్ఫోసిస్ 'నారాయణ మూర్తి' (Narayana Murthy) సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా ఫైనాన్షియల్ అనలిస్ట్ కావడం సులభమే అంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత కొంతకాలంలో సోషల్ మీడియాలో 70 గంటల పని గురించి చర్చలు వెల్లువెత్తాయి. అవన్నీ ఇప్పుడు కొంత సద్దుమణిగాయి అనేలోపే.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ లేదా ఫైనాన్సియల్ అనలిస్ట్ కావడం చాలా తేలిక, కంపెనీ నడపడం.. వ్యాపారవేత్తగా మారడం చాలా కష్టం అంటూ వ్యాఖ్యానించారు. బిజినెస్ చేయడానికి.. వ్యాపారవేత్తలుగా మారటానికి రిస్క్ తీసుకునే యువకులకు బాసటగా నిలిచేలా సమాజంలో మార్పులు రావాలని ఆయన వెల్లడించారు. 1981లో ఇన్ఫోసిస్‌లో కేవలం ఆరుమంది ఇంజినీర్లు మాత్రమే ఉన్నారని, ఆ తరువాత ఊహకందని రీతిలో వినూత్న ఆలోచనలతో పారిశ్రామికవేత్తలు పెరిగారని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఖాతాల్లోకి రూ.820 కోట్లు పడగానే ఆనందపడిన జనం - అంతలోనే.. దశాబ్దం క్రితం కంటే నేటి యువత గొప్ప ఆత్మవిశ్వాసంతో ఉన్నారని సంక్లిష్ట సమస్యలను సైతం పరిష్కరించే ఉత్సాహం వారిలో ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యాపార రంగంలో అడుగుపెట్టే యువకులకు అందరూ అండగా ఉండాలని చెబుతూ.. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఫైనాన్షియల్ అనాలిసిస్ వంటి వాటి కంటే వ్యాపార రంగం భిన్నంగా ఉంటుందని, ఇందులో సక్సెస్ వస్తుందా? రాదా అనే గ్యారెంటీ ఉండదని.. మొత్తం రిస్క్‌తో కూడుకున్నపని అని నారాయణ మూర్తి పేర్కొన్నారు. -
మగబిడ్డకు జన్మనిచ్చిన అపర్ణ కృష్ణన్ - ఆనందంలో నారాయణ మూర్తి ఫ్యామిలీ
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి, కోడలు అపర్ణ కృష్ణన్ నవంబర్ 10న బెంగళూరులో పండండి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లితో పాటు బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రోహన్ మూర్తి, అపర్ణ కృష్ణన్ ముద్దుల బాబుకి 'ఏకాగ్ర' అని పేరుపెట్టారు. ఈ పేరుకి సంస్కృతంలో అచంచలమైన దృష్టి లేదా ఏకాగ్రత అని అర్థం వస్తుందని చెబుతున్నారు. నారాయణ మూర్తి, సుధా మూర్తికి.. కృష్ణ సునక్, అనౌష్క సునక్ అనే ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. వీరిరువురూ యూకే ప్రధాన మంత్రి రిషి సునక్, అక్షతా మూర్తి కుమార్తెలు. నారాయణ మూర్తి వేలకోట్ల సంపదకు వారసుడైన 'రోహన్ మూర్తి'.. తండ్రి మాదిరిగానే సొంతకాళ్ళ మీద నిలబడాలని కొత్త కంపెనీని ప్రారంభించడానికి ఇన్ఫోసిస్‌లో వైస్ ప్రెసిడెంట్ పదవిని వదిలేసాడు. అనుకున్న విధంగానే 'సోరోకో' (Soroco) పేరుతో సంస్థ స్థాపించి కోట్లు గడిస్తున్నాడు. ఇదీ చదవండి: అందుకే 'రోహన్ మూర్తి' ఇన్ఫోసిస్ జాబ్ వదిలేసాడు! బెంగళూరులోని బిషప్ కాటన్ బాయ్స్ స్కూల్లో చదువుకున్న రోహన్.. ఆ తరువాత కార్నెల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్, హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో డాక్టరేట్ (PhD) పొందాడు. చదువు పూర్తయిన తరువాత 2011లో టీవీఎస్ గ్రూప్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ కుమార్తె లక్ష్మి వేణుని వివాహం చేసుకున్నాడు. కొన్ని అభిప్రాయ భేదాల వల్ల 2015లో ఈ జంట విడిపోయింది. లక్ష్మి వేణుతో విడాకులైన తరువాత రోహన్ మూర్తి రిటైర్డ్ ఇండియన్ నేవీ ఆఫీసర్ కమాండర్ KR కృష్ణన్, మాజీ SBI ఉద్యోగి సావిత్రి కృష్ణన్ కుమార్తె 'అపర్ణ కృష్ణన్'ను 2019లో వివాహం చేసుకున్నారు. వీరిరువురు ఇప్పుడు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. -
అందులో తప్పేముంది? మేం రోజుకు 15 గంటలు పనిచేస్తున్నాం: కాంగ్రెస్ ఎంపీ
భారత్ శక్తివంతమైన దేశంగా ఎదగాలంటే యువత వారానికి కనీసం 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Infosys Narayana Murthy) చేసిన వ్యాఖ్యపై గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కొంతమంది ఆయన్ను సమర్థిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. దేశ ఉత్పాదకత పెరగడానికి ఎక్కువ గంటలు పనిచేయాలన్న నారాయణమూర్తి సలహాను సమర్థిస్తున్నవారి జాబితాలోకి తాజాగా కాంగ్రెస్ ప్రముఖ నేత, ఎంపీ మనీష్ తివారి (Manish Tewari) చేరారు. నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలో తప్పేముందని ప్రశ్నించారు. దీనిపై ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’(ట్విటర్)లో ఆయన పోస్ట్ చేశారు. అది తప్పనిసరి నియమం కావాలి ‘వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలపై ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారు.. అందులో తప్పేముంది? ఓ వైపు ప్రజా జీవితం, మరో వైపు వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూనే మా లాంటి ప్రజా ప్రతినిధులు రోజుకు 12-15 గంటలు పనిచేస్తున్నాం. నేను చివరగా ఎప్పుడు ఆదివారం సెలవు తీసుకున్నానో నాకు గుర్తే లేదు. గెలిచినా, ఓడిపోయిన ప్రజా జీవితంలో ఉన్నవారికి ఆదివారం సెలవు అనేది ఉండదు. వారానికి 70 గంటలు పని, ఒక రోజు సెలవు, సంవత్సరానికి 15 రోజులు విరామం అనేది తప్పనిసరి నియమం కావాలి’ అని మనీష్ తివారి తన ట్వీట్లో రాసుకొచ్చారు. I do not understand the brouhaha around @Infosys_nmurthy statement on a 70 hour work week . What is wrong with it ? Some of us Public Representatives work 12-15 hours a day 7 days a week balancing careers with Public Service. I do not recall when I last took a Sunday off.… — Manish Tewari (@ManishTewari) November 10, 2023 -
అన్నేసి గంటలేంటి? ‘సిల్లీ’కాకపోతే: ప్రముఖ కంపెనీ అధినేత్రి కౌంటర్!
ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి (Infosys founder NR Narayana Murthy) ‘వారానికి 70 గంటల పని’ వ్యాఖ్యల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది. అసలే పని ఒత్తిడితో సతమతమవుతూ కుటుంబ జీవితాన్ని ఆస్వాదించలేకపోతుంటే మళ్లీ అధిక పని గంటల సలహాలేంటని చాలా మంది ఉద్యోగులు కస్సుమంటున్నారు. ఇక వ్యాపారాధినేతలు, కంపెనీల ప్రముఖలలో కొందరు ఈ సలహాను సమర్థిస్తుంటే మరికొంత మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అలా నారాయణమూర్తి ‘70 గంటల పని’ భావనను వ్యతిరేకిస్తున్నవారిలో తాజాగా మరో ప్రముఖురాలు చేరారు. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (PMS) కంపెనీ ఫస్ట్‌గ్లోబల్‌గ్రూప్ ఫౌండర్, చైర్పర్సన్, ఎండీ దేవినా మెహ్రా (Devina Mehra) ‘వారానికి 70 గంటల పని’ భావనను తప్పుపట్టారు. సుదీర్ఘ పని గంటల వల్ల ఉత్పాదకత పెరుగుతుందని ఆమె విశ్వసించడం లేదు. అంతేకాదు ఈ సలహాలను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు కూడా. అది వెర్రితనం ‘వాస్తవంగా చెప్పాలంటే ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఉత్పాదకత తగ్గుతుంది. ఇది ప్రపంచమంతటికీ బాగా తెలుసు. కాబట్టి వారానికి 70 గంటలు పని చేయాలని చెప్పడం వెర్రితనం అవుతుంది. నా ఉద్దేశంలో ఈ భావన పనికిరాదు’ అని చెప్పారు దేవినా మెహ్రా. వారానికి 70 గంటలు పనికే కేటాయిస్తే వాళ్లు ఇతర బాధ్యతలను ఏం నిర్వర్తించగలరని ఆమె పశ్నించారు. వర్క్‌ఫోర్స్‌లో చాలా మంది మహిళలకు వర్క్‌తోపాటు ఇతర బాధ్యతలూ ఉంటాయని, సుదీర్ఘ పని గంటల వాతావరణంలో అలాంటి మహిళలు పని చేయలేరని మెహ్రా వివరించారు. యువత ఆఫీస్‌లో అత్యధిక సమయాన్ని వెచ్చించాల్సిన పనిలేదని, అయితే నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఒక యజమానిగా తాను అవుట్‌పుట్‌పై దృష్టి పెడతాను కానీ, పని గంటల సంఖ్యపై కాదని ఆమె స్పష్టం చేశారు. -
అప్పుడు నారాయణమూర్తి ఇలా సమాధానమిచ్చారు - ట్రూకాలర్ సీఈఓ
ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తిని ఎనిమిదేళ్ల క్రితం కలిసినట్లు, ఆ సమయంలో ఆయన చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ.. ట్రూకాలర్ సీఈఓ 'అలాన్ మామెడి' ట్వీట్ చేసాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. సుమారు ఎనిమిది సంవత్సరాల క్రితం మొదటిసారి నారాయణ మూర్తిని కలిసినప్పుడు అతడెవరో తనకు తెలియదని, నేనెవరో ఆయనకు తెలియదని వెల్లడించాడు. వారివురు మాట్లాడుకునే సమయంలో మీరు ఏమి చేస్తారని అడిగానని అలాన్ చెప్పాడు. దీనికి సమాధానంగా 'జీవితంలో నాకు అదృష్టం ఉండటం వల్ల ప్రజలకు తప్పకుండా కొంత సాయం చేయాలని నా భార్య ఎప్పుడూ నాతో చెబుతుంది, అదే చేస్తున్న అని చెప్పాడని ట్వీట్లో వెల్లడించాడు. వందలకోట్ల సంపద ఉన్నప్పటికీ నారాయణ మూర్తి చాలా వినయపూర్వకమైన వ్యక్తి అని అలాన్ మామెడి వెల్లడించాడు. ఇదీ చదవండి: కొత్త కారు కొనడానికి ఇదే మంచి సమయం - మునుపెన్నడూ లేనన్ని బెనిఫిట్స్ నిజానికి నేను (అలాన్ మామెడి) చదువుకునే రోజుల్లో మా ఇంట్లో కంప్యూటర్ బాగుచేయడానికి ఇన్ఫోసిస్ కంపెనీకి చెందిన ఒక వ్యక్తి వచ్చాడని.. అప్పుడే ఆ సంస్థలో ఉద్యోగం చేయాలనుకున్నట్లు వివరించాడు. కానీ జీవితం ఎలా ముందుకు సాగుతుందో తెలియదని ఇందులో ప్రస్తావించాడు. First time I met Narayana was almost 8 yrs ago. I did not know who he was and he didn't know what I did. After an inspiring hour of discussing everything about life, I asked him what he do and he said "My wife always told me that because I had luck in life, I must give back, and… https://t.co/7dVJupNmqI pic.twitter.com/KGljiEvW59 — Alan Mamedi (@AlanMamedi) November 3, 2023 -
వారానికి 60 గంటల కంటే ఎక్కువే.. పని గంటలపై ఇదిగో ప్రూఫ్..
ప్రగతి సాధించిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ పోటీ పడాలంటే యువత తప్పకుండా వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి తన అభిప్రాయం వ్యక్తం చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు ఈ అభిప్రాయంపై ఏకీభవిస్తే, మరికొందరు వ్యతిరేకించారు. టైమ్ యూస్ సర్వే (Time Use Survey) విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో వారానికి సరాసరి 61.6 గంటలు పనిచేస్తున్నట్లు తెలిసింది. వారానికి 65.4 గంటలు పనిచేస్తూ తెలంగాణ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలున్నాయి. ఇదీ చదవండి: పండుగ సీజన్లో గొప్ప ఆఫర్స్.. టూ వీలర్ కొనాలంటే ఇప్పుడే కొనేయండి! తక్కువ పని గంటలున్న రాష్ట్రాల్లో మణిపూర్ (46.9 గంటలు), నాగాలాండ్ (46.8 గంటలు) ఉన్నాయి. అండమాన్ & నికోబార్ దీవుల్లో కూడా వారానికి 58.7 గంటలు పనిచేస్తున్నట్లు ఈ జాబితాలో చూడవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ యువకులు చేసినట్లు భారతీయలు ఎక్కువ గంటలు పనిచేస్తే తప్పకుండా ఇండియా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలని వెల్లడించారు. -
యువతనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి - ఇలా చేయాల్సిందే అంటూ..
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి 3వన్4 (3one4) క్యాపిటల్ పాడ్‌కాస్ట్ 'ది రికార్డ్' ఫస్ట్ ఎపిసోడ్లో యువతను ఉద్దేశించి.. భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడాలంటే, ఇతర దేశాలతో పోటీ పడాలంటే ఏం చేయాలనే విషయాలను వెల్లడించారు. గత రెండు మూడు దశాబ్దాలుగా అద్భుతమైన ప్రగతి సాధించిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ పోటీ పడాలంటే యువత తప్పకుండా వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అన్నారు. ఇండియాలో పని ఉత్పాదకత ప్రపంచంలోనే చాలా తక్కువగా ఉందని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ చేసినట్లు భారతీయ యువకులు ఎక్కువ గంటలు పనిచేయాలని వెల్లడించారు. ఇదీ చదవండి: టెస్లాకు క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. నితిన్ గడ్కరీ ఏమన్నారంటే? ప్రభుత్వంలో అవినీతి కూడా తగ్గించాలని, పని గంటలు పెంచాలని ఆలా జరగకపోతే పురోగతి సాధించిన దేశాలతో పోటీ భారత్ పోటీ పడటం సాధ్యం కాదని అన్నారు. తప్పకుండా దీని గురించి యువత ఆలోచించాలి, ప్రతి జర్మన్ దేశ అభివృద్ధి కోసం తప్పనిసరిగా అదనపు పని చేయడానికి ముందడుగు వేస్తున్నారు. ఇదే భారతీయులు కూడా పాటించాల్సిన అవసరం ఉందని నారాయణ మూర్తి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. -
జనాభా పెరుగుదలపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు..
ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి (Narayana Murthy) ఇటీవల కోల్‌కతాలోని టెక్నో ఇండియా యూనివర్శిటీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం గురించి, జనాభా నియంత్రణ గురించి వ్యాఖ్యానించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నారాయణ మూర్తి స్నాతకోత్సవంలో మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు తన విశ్వాసాలను స్వేచ్ఛగా ఆచరించుకోవచ్చు. అలాంటి సమాజంలో ప్రజాస్వామ్యం ఉత్తమంగా ఉంటుందని వ్యక్తం చేశారు. దేశ జనాభా నియంత్రణకు సరైన ప్రాధాన్యం లేదని వెల్లడించారు. దేశంలోనో కొన్ని ప్రాంతాల్లో నియంత్రణ ఉన్నప్పటికీ.. చాలా ప్రాంతాల్లో దీన్ని పూర్తిగా విస్మరించినట్లు చెప్పుకొచ్చారు. నిజనమైన ప్రజాస్వామ్యానికి నాలుగు స్వేచ్ఛలు ఉంటాయని, అవి.. భావ ప్రకటన స్వేచ్ఛ, విశ్వాసాల మీద స్వేచ్ఛ, భయం నుంచి స్వేచ్ఛ, కోరికల పట్ల స్వేచ్ఛ అని అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డీ రూజ్వెల్ట్ మాటలు గుర్తు చేశారు. ఇదీ చదవండి: అదే జరిగితే 70 వేల ఉద్యోగాలు పోతాయ్.. ఎక్కడో తెలుసా? భారతదేశం గత మూడు దశాబ్దాలుగా ప్రశంసనీయమైన ఆర్థిక పురోగతి ఉన్నప్పటికీ, పేదరికం, త్రాగునీరు, విద్య, పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ వంటి వాటిలో ఇంకా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తున్నట్లు తెలిపారు. జనాభా పెరుగుదలను తగ్గించడం ఇప్పుడు చేయవల్సిన ముఖ్యమైన పని. జనాభా సమస్య రానున్న 20 నుంచి 25 ఏళ్లలో మన దేశంపై విధ్వంసం సృష్టించే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించారు. -
బ్రిటన్ రాణిని దాటేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె..!
రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో రష్యాలోని ఇన్ఫోసిస్ వ్యాపారాలపై బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్‌పై యూకే మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. అంతేకాకుండా రిషి సునక్ భార్య అక్షతా మూర్తి పన్ను చెల్లింపులపై కూడా వివాదం నెలకొంది. రిషి సునక్, అక్షతా మూర్తిని బ్రిటన్ మీడియా టార్గెట్ చేస్తూ పలు వ్యాసాలను ప్రచురించాయి. కాగా తాజాగా అక్షతామూర్తికి సంబంధించిన ఆస్తుల విషయంలో మరో విషయం బయటపడింది. ఎలిజబెత్ కంటే ఎక్కువ..! అక్షతా మూర్తి ఆస్తులు బ్రిటన్ రాణి ఎలిజబెత్ కంటే ఎక్కువని తెలుస్తోంది. ఎఎఫ్‌పీ నివేదిక ప్రకారం, స్టాక్ ఎక్స్ఛేంజ్కు కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం...అక్షతా మూర్తి ఇన్ఫోసిస్‌లో దాదాపు బిలియన్ డాలర్ల విలువైన షేర్లను కలిగి ఉంది. 2021 సండే టైమ్స్ రిచ్ లిస్ట్ ప్రకారం... బ్రిటన్ మహరాణి వ్యక్తిగత సంపద దాదాపు 460 మిలియన్ డాలర్లుగా ఉందని నివేదించింది. రిషి సునక్‌తో కలిసి స్థాపించిన వెంచర్ క్యాపిటల్ కంపెనీ కాటమరాన్ వెంచర్స్‌కి అక్షత డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా...డొమిసైల్ స్టేటస్ వల్ల ఆమె ఏటా 2.1 మిలియన్ పౌండ్ల పన్నులను తప్పించుకోగలిగారని బీబీసీ అంచనా వేసింది. అక్షతామూర్తి భారత పౌరురాలిగా ఉంటూ బ్రిటన్‌లో పన్నులను ఎగవేస్తున్నారని బ్రిటన్ ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. ఈ ఆరోపణలపై అక్షతా మూర్తి ప్రతినిధి వివరణ కూడా ఇచ్చారు. చదవండి: యూకే మంత్రి రిషి సునక్ భార్య పన్ను చెల్లింపులపై వివాదం..! క్లారిటీ ఇచ్చిన అక్షతా మూర్తి..! -
రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్..! ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడికి చిక్కులు..!
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. యుద్ద ప్రభావం అన్ని దేశాలపై పడుతోంది. కాగా ఇప్పుడు ఇదే యుద్దం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు యూకే ఆర్థిక మంత్రి రిషి సునక్‌కు కొత్త చిక్కులను తెచ్చి పెట్టింది. రష్యాలో ఇన్ఫోసిస్ ఉనికిపై..! యూకే ఛాన్స్లర్ ఆఫ్ ఎక్స్‌చెకర్, ఫైనాన్స్ మినిష్టర్‌గా రిషి సునక్ వ్యవహారిస్తోన్న విషయం తెలిసిందే. వీరు స్వయాన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తి భర్త. భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రష్యాలో కూడా తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ విషయంపై ప్రముఖ బ్రిటన్ వార్త సంస్థ రిషి సునక్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. అమెరికాతో పాటుగా యూరప్ దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలను విధించిన నేపథ్యంలో రష్యాలోని ఇన్ఫోసిస్ ఉనికిపై సునక్‌ను ప్రశ్నించారు. యూకే ఆర్థిక మంత్రి ఇంట్లోని వారు రష్యాతో వ్యాపారాలు చేయడం ఎంత వరకూ సబబు అంటూ సదరు వార్త పత్రిక సునక్‌ను ఇంటర్వూలో అడిగారు. ‘మీ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని, మీ భార్యకు కూడా కంపెనీల్లో వాటాలు ఉన్నాయంటూ’ సదరు పత్రిక పేర్కొంది. రష్యాకు చెందిన ఆల్ఫా బ్యాంక్‌తో ఇన్ఫోసిస్‌కు సంబంధాలున్నాయనంటూ వెల్లడించారు. సంబంధం లేదు..! ఇన్ఫోసిస్-రష్యా వ్యవహారంపై యూకే మంత్రి రిషి సునక్ సదరు పత్రికకు ధీటైనా జవాబునిచ్చారు. ‘నేను ఇక్కడికి ఎన్నికైన నాయకుడుగా వచ్చాను. తాను దేనికి బాధ్యత వహిస్తానో దాని గురించి చర్చించేందుకు సిద్దంగా ఉన్నానని బదులు ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రిషి సునక్ కుటుంబం ప్రయోజనాలు పొందుతుందనే విషయంపై...ఇన్ఫోసిస్‌కు చెందిన వ్యవహారం పూర్తిగా కుటుంబ సభ్యులే చూసుకుంటారు. నాకు ఎలాంటి అవసరం లేదంటూ తెలిపారు. ఇక కంపెనీ వ్యవహారాలతో తనకేలాంటి సంబంధాలు లేవని ఉద్ఘాటించారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న చర్యలను తోసిపుచ్చారు. కాగా రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో తాము శాంతికి మద్దతు ఇస్తామని ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో తెలియజేసింది. చదవండి: జర్మనీ అతి పెద్ద సంస్థ ఇన్ఫోసిస్ కైవసం.. డీల్ విలువ ఎంతంటే? -
రతన్‌టాటా, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి.. వెదురు చెట్టుతో అబ్బురపరిచే పోలిక
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్పీజీ ఇండస్ట్రీస్ చైర్మన్ హార్ష్ గోయెంకా తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట ఆసక్తి రేపుతోంది. ఈ ట్వీట్లో ఉన్న ఫోటో పాతదైన సరే అందులో ఉన్న వ్యక్తులు, వారు సాధించిన ఘనతలు.. ఈ ఇద్దరు లెజెండ్స్ గురించి మరో బిజినెస్ దిగ్గజం చేసిన కామెంట్లు ట్విట్టర్లో భావోద్వేగపూరిత సంభాషణలకు తెర లేపాయి. కోవిడ్ సంక్షోభం ఇండియాను ముట్టడించకముందు 2020 జనవరిలో ముంబైలో ఓ ప్రైవేటు కార్యక్రమం జరిగింది. ఇందులో రతన్‌టాటాకి లైఫ్ టైం అచీవ్మెంట్ని ఇన్పోసిన్ నారాయణమూర్తి అందించారు. ఈ సందర్భంగా భారతీయ పారిశ్రామికవేత్తలకు దార్శనికుడైన రతన్‌టాటా పాదాలకు నారాయణమూర్తి పాదాభివందనం చేశారు. ఈ ఫోటో అప్పుడు కూడా చాలా మందిని ఆకట్టుకుంది. తాజాగా అదే ఫోటోను హార్ష్‌గోయెంకా ట్వీట్ చేస్తూ చక్కని కామెంట్‌ని జత చేశారు. ‘వెదురు చెట్టులా మనం ఉండాలి. జీవితంలో ఎంత ఎత్తులకు ఎదిగినా అణకువతో ఒదిగి ఉండాలి’ అనే అర్థం వచ్చేలా కామెంట్ జత చేశారు. ఈ ఫోటో నెటిజన్లకు బాగా నచ్చడంతో ఇందులో భాగస్వాములైన ముగ్గురి లెజెండ్స్ జీవితాలకు సంబంధించిన ఆసక్తికర అంశాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. “Be like a bamboo. The higher you grow, the deeper you bow.” Two of the most respected businessmen #RatanTata #NarayanaMurthy pic.twitter.com/xa77aCsRiW — Harsh Goenka (@hvgoenka) December 26, 2021 చదవండి: Vijay Mallya : రోజులు ఎప్పుడూ ఒక్కలా ఉండవు ! -
Sudha Murthy : అప్పట్లో జీన్స్, టీషర్ట్స్‌లో వెళ్లేదాన్ని.. కానీ ఆ తర్వాత..
దేశంలో ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకున్న మొదటి తరం వ్యక్తుల్లో ముఖ్యులు ఎం నారాయణమూర్తి. ఇన్ఫోసిస్‌ను స్థాపించి దేశవ్యాప్తంగా వేలాది మందికి ఉపాధి కల్పించారు. ఐటీ రంగంలో భారత్‌కు బలమైన పునాదులు పడటానికి సహాకరించారు. అలాంటి నారాయణమూర్తికి అర్థాంగిగా తన వంతు సహాకారం అందిస్తూనే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు సుధా మూర్తి. ఇప్పటి వరకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేలాది మందికి అండగా నిలిచారు. పాతికేళ్ల సేవాకార్యక్రమాల నుంచి త్వరలో ఆమె పక్కకు తప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ఐటీ రంగం నుంచి వచ్చిన సుధామూర్తి మురికివాడలకు ఎలా వెళ్లారు. అక్కడి ప్రజల అక్కరలు తీర్చే క్రమంలో తనని తాను ఎలా మార్చుకున్నారు? ఈ దేశ ప్రజల పట్ల ఆమె అభిప్రాయాలు ఏంటీ అనే వివరాలను సుధా మూర్తి మాటల్లోనే తెలుసుకుందాం.. 1996 డిసెంబరు 6న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్థాపించాం. అప్పుడు ఈ ఫౌండేషన్‌కి రూ. 36 లక్షలు కేటాయించారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. ఆ డబ్బుతో చాలా సహాయ కార్యక్రమాలు చేయోచ్చు అనుకున్నాను. అనుకున్నదే తడవుగా మా టీమ్‌తో కలిసి రంగంలోకి దిగాను. కానీ ఆ తర్వాతే తెలిసింది... ఈ పని నేను అనుకున్నంత సుళువు కాదని. జీన్స్ టూ శారీ ఇప్పుడంటే చీరకట్టు సంప్రదాయ బొట్టుతో సాధారణ గృహిణిలా కనిపిస్తున్నాను. కానీ ఫౌండేషన్ స్టార్ చేసిన కొత్తలో నేను జీన్స్, టీ షర్ట్స్ షూస్‌లో ఎక్కువగా ఉండేదాన్ని. ఫౌండేషన్ తరఫున ఏదైనా పని చేసేందుకు స్లమ్ ఏరియాలకు వెళ్లినప్పుడు.. అక్కడి ప్రజలు నా దగ్గరికి వచ్చే వారు కాదు. వాళ్ల కోసమే నేను వచ్చానని నమ్మేవాళ్లు కాదు. నా దగ్గర డబ్బున్నా అది సరైన విధంగా ఖర్చు చేయాలేని పరిస్థితి ఉండేది. ఒక వేళ చేసిన మనీ ఖర్చు పెట్టగలిగేదాన్ని కానీ. వాళ్ల బాధలు స్వయంగా విని అర్థం చేసుకునే అవకాశం రాకపోయేది. అందుకే సేవా కార్యక్రమాల్లో మనసు పెట్టి పని చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే వారిలో ఒకరిగా కలిసిపోవాలని నిర్ణయించుకున్నాను. దీంతో జీన్స్, టీ షర్ట్స్ పక్కన పెట్టి సంప్రదాయ చీర కట్టు, బొట్టులోకి మారిపోయాను. నేను ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య హోదాలో కాకుండా ఓ సాధారణ స్కూలు టీచరు తరహాలో ప్రజలతో కలిసి పోయాను. సహనం డబ్బులు చాలు సమస్యలు పరిష్కరించవచ్చు అనుకున్నాను. కానీ ఆ అభిప్రాయం తప్పని త్వరలోనే అర్థమైంది. ఫౌండేషన్ ద్వారా నేను చేయాల్సిన పనులు మనుషులుతో కంప్యూటర్లతో కాదని తెలిసింది. కంప్యూటర్ అయితే కమాండ్ ఇచ్చి ఎంటర్ కొడితే కావాల్సిన పని జరుగుతుంది. కానీ మనుషులు అలా కాదు. ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కో రకంగా ఉంటుంది. వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు అనుభవాలు ఉంటాయి. వాటి ఆధారంగా వారి ప్రతిస్పందన ఉంటుంది. మనం చెప్పగానే వాళ్లు వెంటనే మారిపోరు. దానికి సమయం పడుతుంది. అన్నింటికీ మించి ఎదుటి వారు చెప్పే సమస్యని సహనంతో వినడం.. ఆ తర్వాత దానికి తగ్గ పరిష్కారం ఎలా అని ఆలోచించడం అలవాటు చేసుకున్నాను. దాతృత్వం అనేది డబ్బు కాదు మనసుతో చేసే పని అర్థం చేసుకున్నాను. అందుకే మనఃస్ఫూర్తిగా ఇన్ఫోసిస్ బాధ్యతలు నిర్వర్తించాలని నిర్ణయం తీసుకున్నాను. చదవండి: అప్పట్లో కంప్యూటర్లు కావాలంటే ఢిల్లీ వెళ్లాల్సిందే - నారాయణమూర్తి ఇవ్వడమే పనిగా.. ప్రజల్లో కలిసిపోయేందుకు వారితో పాటు కలిసి తిన్నాను, వారి భాషలోనే మాట్లాడాను అలా చేస్తున్న క్రమంలో వారి కష్టాలు, బాధలు మరింతగా అర్థం అయ్యాయి. వారితో పోల్చుకుంటే దేవుడు నాకు ఏ లోటు రానివ్వలేదు. దేశంలో నూటికి తొంభైశాతం మందికి లేని సౌకర్యాలు, అవకాశాలు నాకు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడే సృష్టించిన ఈ ప్రజలకి నేను కూడా ఏదైనా చేయాలని గట్టినా అనుకున్నాను అంతే ! అప్పటి నుంచి ఇప్పటి వరకు గడిచిన 25 ఏళ్లుగా ఫౌండేషన్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. సాయంలో అహం వద్దు దాతృత్వ కార్యక్రమాలు చేసేప్పుడు.. మనం ఇచ్చే వాళ్లం.. వాళ్లు తీసుకునే వాళ్లు అనే ఫీలింగ్ చాలా మందికి తెలియకుండానే ఏర్పడుతుంది. వాళ్లకు ఏం కావాలో పూర్తిగా అర్థం చేసుకోకుండా మనం ఏం ఇవ్వాలని అనుకుంటున్నామో అదే ఇస్తాం. చాలా సార్లు సాయం తీసుకునే వాళ్ల అభిప్రాయాలను పూర్తిగా పరిగణలోకి తీసుకోం. వారిని తక్కువ అంచనా వేస్తాం. ఇది సరికాదు. ఆహార కొరత, విద్య, వైద్యం వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు కుటుంబాలకు అవసరాలు వేరేగా ఉంటాయి. వాటిని వారి మాటల్లో విని మన మనసుతో అర్థం చేసుకోవాలి.. అప్పుడు సాయం చేస్తే వాళ్లకి ఫలితం.. మన మనసుకి తృప్తి దక్కుతుంది. చేయాల్సింది ఎంతో ఉంది పాతికేళ్ల కిందట రూ. 36 లక్షల రూపాయలతో ఎన్నో మంచి పనులు చేయోచ్చని ఫౌండేషన్ స్థాపించాం. ఇప్పుడు రూ. 400 కోట్ల రూపాయల ఫండ్ ఉంది. అయితే మా కళ్ల ముందు కనిపిస్తున్న సమస్యలు పరిష్కరించేందుకు ఈ ఫండ్ ఏ మూలకు సరిపోదు. ఐనప్పటికీ ప్రాధాన్యత క్రమం ఆధారంగా సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోతున్నాం. కోవిడ్‌తో పరిస్థితులు మరింతగా దిగజారాయి. ఆహారలేమి, నిరుద్యోగం, హెల్త్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. దేశ జనాభా అందరికీ రెండు పూటల తిండి, ఇంటర్ వరకు ఆటంకం లేని విద్య, ధరించేందుకు మంచి దుస్తులు కొనుక్కునే దశ వచ్చే వరకు మన దేశం అభివృద్ధి చెందనట్టే లెక్క. స్పందించే హృదయం ఉండాలి గడిచిన 25 ఏళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుంచి త్వరలో తప్పుకోబోతున్నాను. నా తర్వాత ఈ బాధ్యతలు చూసుకునే వారికి ప్రాధాన్యతలు వేరేగా ఉండొచ్చు.వారి లక్ష్యాలు భిన్నంగా ఉండొచ్చు. అలా ఉండటం తప్పేమి కాదు. నిజానికి అలా ఉంటడం వల్ల విభిన్న రంగాల్లో సేవా కార్యక్రమాలు విస్తరిస్తాయి కూడా. అయితే ఎదుటి వారి కష్టాలను చూసి మనసు లోతుల్లోంచి స్పందించే గుణం మాత్రం తప్పకుండా ఉండాలి. - సాక్షివెబ్ ప్రత్యేకం చదవండి: ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రూ.100 కోట్ల సాయం -
రాణిగారి కన్నా ఏం తక్కువ
సుధామూర్తి నవ్వుకునే ఉంటారు కూతురు అక్షతను క్వీన్‌తో పోటీకి తెచ్చింది మరి బ్రిటన్ మీడియా! ఎలిజబెత్ రాణి గారి కంటే.. వెయ్యికోట్లు ఎక్కువేనట అక్షత సంపద! నిజమే కావచ్చు కానీ.. ఇప్పటికీ ఆమె.. తల్లిని పాకెట్ మనీ అడిగే కూతురిలానే జీవిస్తున్నారన్నదీ నిజం. నిరాడంబరంగా.. సంపన్నతను ప్రదర్శించని రాణిగా! తల్లి పెంపకంలోని గొప్పతనం అది. ఇన్ఫోసిస్ దంపతులు సుధ, నారాయణమూర్తిల గుర్తింపు ఎన్నేళ్లు గడిచినా, వాళ్ల కంపెనీ ఎన్ని కోట్లు గడిచినా ఎప్పటికీ మారనిదీ, ఒకేవిధమైనదీ! ‘సంపన్నులైన నిరాడంబరులు’ అనేదే ఆ గుర్తింపు. వారిద్దరి నిరాడంబరత్వం గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు తమ ఇద్దరు పిల్లల్ని వాళ్లెలా పెంచారన్నదే సరైన కొలమానం అవుతుంది. మూర్తి దంపతులకు మొదట కుమార్తె. తర్వాత కొడుకు. కుమార్తె అక్షత బ్రిటన్‌లో స్థిరపడ్డారు. కొడుకు రోహన్ ఇండియాలోనే ‘హార్వర్డ్ సొసైటీ ఆఫ్ ఫెలోస్’కి టెక్నికల్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఇన్ఫోసిస్ చైర్పర్సన్ అయిన డెబ్బై ఏళ్ల సుధామూర్తి సోషల్ వర్కర్. కన్నడ, మరాఠీ, ఇంగ్లిష్ భాషలలో పుస్తకాలు రాశారు. ఒకప్పుడు ఆమె ఇంజినీరింగ్ టీచర్. నారాయణమూర్తి ఇన్ఫోసిస్‌కి ప్రస్తుతం ఎమెరిటస్ చైర్మన్. పదవీ విరమణానంతర బాధ్యతల్ని నిర్వహించి వెళుతుంటారు. కోట్లల్లో ఆస్తులు ఉన్నా, సింపుల్‌గా ఉంటారు. ఉండకూడదని కాదు. ఈ దంపతుల ఆసక్తులు, అభిరుచులు.. ఆస్తుల సంపాదనకు పూర్తి భిన్నమైనవి. అందుకే ఎప్పుడు వీళ్ల ప్రస్తావన వచ్చినా ‘నిరాడంబరత్వం’ వీరి సుసంపన్నతగా కనిపిస్తుంది. అందుకే వీళ్లమ్మాయి అక్షత ఇప్పుడు బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ కన్నా ధనికురాలన్న గుర్తింపు పొందడం పెద్ద విశేషం అయింది. ∙∙ అక్షత (40) పదకొండేళ్ల క్రితం రిషీ సునక్‌ను వివాహమాడి బ్రిటన్ వెళ్లిపోయారు. కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ బిజినెస్ స్కూల్లో వాళ్లిద్దరూ క్లాస్మేట్స్. ఆ పరిచయం పెళ్లి వరకు వెళ్లింది. రిషి బ్రిటన్‌లోనే పుట్టారు. 2014లో ప్రజా రాజకీయాల్లోకి వెళ్లారు. ప్రస్తుతం యు.కె.లో అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీ ఎంపీ ఆయన. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ఛాన్స్లర్ ఆఫ్ ఎక్స్‌చెకర్’ అయ్యారు. అంటే ఆర్థికమంత్రి. ఇద్దరు కూతుళ్లు. కృష్ణ, అనౌష్క. ఆర్థికమంత్రి అయినవారు కుటుంబ వివరాలతోపాటు ఆస్తుల లెక్కల్నీ, వాటి విలువను వెల్లడించాలి. బ్రిటన్ పార్లమెంటుకు కూడా ఆ ఆనవాయితీ ఉంది. ఇటీవల రుషీ తన ఆర్థిక పత్రాలను సమర్పించినప్పుడు యు.కె.లో ఆయన భార్య అక్షత నిర్వహిస్తున్న సొంత వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘క్యాటమరాన్ వెంచర్స్’ ఆస్తులు, ఇన్ఫోసిస్ లో ఆమెకు ఉన్న షేర్లు కలుపుకుని ఆమె సంపద విలువ 480 మిలియన్ పౌండ్లు ఉన్నట్లు బహిర్గతం అయింది. అదేమీ దాచి ఉంచిన సంగతి కానప్పటికీ ‘ది గార్డియన్’ పత్రిక సంపన్నత విషయంలో అక్షత క్వీన్ ఎలిజబెత్‌ను దాటిపోయారని రాయడంలో ప్రపంచ ప్రజల ఆసక్తికి అక్షత ఒక కేంద్రబిందువు అయ్యారు. బహుశా ఈ కేంద్రబిందువును చూసి సుధామూర్తి దంపతులు మురిసిపోయే ఉంటారు. క్వీన్ ఎలిజబెత్ దగ్గర ప్రస్తుతం ఉన్నది 350 మిలియన్ పౌండ్లయితే, అక్షత దగ్గరున్నవి 450 పౌండ్లు. మన కరెన్సీలోమనమ్మాయి దగ్గర రాణి గారి దగ్గర ఉన్న డబ్బు కంటే సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఎక్కువ ఉన్నట్లు. అక్షతకు ఇంకా అమెజాన్ ఇండియాలో, బ్రిటన్‌లోని ఆరు కంపెనీల్లో వాటాలు ఉన్నాయి. ∙∙ ‘రాణిగారి గారి కన్నా అక్షత సంపన్నురాలు’ అనే మాట వినేందుకు గొప్పగా ఉన్నా ఇంకా తల్లిదండ్రులను పాకెట్ మనీ అడిగే అమ్మాయిలానే సాధారణంగా ఉంటారు అక్షత! ‘డబ్బుకు మనం సొంతదారులం కాదు. సంరక్షకులం మాత్రమే. నువ్వు విజయం సాధించినప్పుడు ఆ విజయంలో సమాజం నీకిచ్చిన సహకారం కూడా ఉంటుంది కనుక ఆ సహకారాన్ని తిరిగి నువ్వు సమాజానికి ఇచ్చేయాలి’ అని తను టాటా ఉద్యోగిగా ఉన్నప్పుడు జేఆర్డీ టాటా చెప్పిన మాటను సుధామూర్తి గుర్తుంచుకుని పాటించారు. తన పిల్లలకూ నేర్పించారు. ఆమె జీవితంలోని రెండు సందర్భాలు కూడా అక్షతను, రోహన్‌ను నిరాడంబరంగా పెంచేందుకు ప్రేరణ అయ్యాయి. తెరిపి లేకుండా ఏకధారగా వర్షం కురుస్తుంటే ఇల్లు తడిసి, కప్పు కారిపోతున్నా.. ‘వానా వానా వల్లప్ప’ అని పాడుకుంటూ సంతోషంతో నృత్యం చేసిన ఒక నిరుపేద కుటుంబం, తమిళనాడు స్వామిమలై సమీపంలోని ఒక ఆలయంలో అంధుడైన ఒక పూజారి తను ఇచ్చిన ఐదు వందల నోటును తడిమి చూసుకుని ‘అంత డబ్బు తనకు అక్కర్లేదు’ అని తిరిగి ఇచ్చేస్తూ, ఐదు పావలా బిళ్లలను మాత్రమే అడిగి తీసుకోవడం సుధామూర్తిని ఆశ్చర్యంలో ముంచెత్తిన సందర్భాలు ఆ రెండూ. కొడుకు బడికి వెళ్తున్నప్పుడు చాలాకాలం పాటు ఆమె ఇచ్చిన పాకెట్ మనీ 5 రూపాయలు! ‘అయిదా!’ అని రోహన్ మూతి బిగిస్తే, ‘ఇది కూడా లేని వాళ్లు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు’ అని సుధామూర్తి చెప్పేవారట. తగ్గట్లే ఇద్దరు పిల్లలూ ఎంత ఆస్తిపరులైనా, అమ్మానాన్న పిల్లల్లానే ఉన్నారు. రాణిగారి కంటే ధనికురాలిగా ఊహించని కొత్త గుర్తింపు పొందిన అక్షత.. తల్లి పెంపకంలో చిన్నప్పటి నుంచీ సంపన్నతను ప్రదర్శించని రాణిగానే పెరిగారు. -
బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ‘ఇన్ఫోసిస్’ మూర్తి అల్లుడు
లండన్: ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి అల్లుడు, భారత సంతతి బ్రిటిష్ ఎంపీ రిషి సునక్(39) భారీ ప్రమోషన్ కొట్టేశారు. బ్రిటన్ కేబినెట్లో చోటుచేసుకున్న భారీ మార్పుల్లో భాగంగా ప్రధాని తర్వాత రెండో స్థానంగా భావించే ఆర్థిక మంత్రి పోస్టు ఆయనకు దక్కింది. ప్రధాని జాన్సన్ చీఫ్ స్పెషల్ అడ్వైజర్ డొమినిక్ కమ్మింగ్స్‌తో తలెత్తిన విభేదాల కారణంగా ఆర్థిక మంత్రి, పాక్ సంతతికి చెందిన సాజిద్ జావిద్ అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ఆ తర్వాతి పోస్టు, ఆర్థిక శాఖ చీఫ్ సెక్రటరీగా ఉన్న రిషి ఆ బాధ్యతల కోసం ప్రధాని ఎంపిక చేశారు. తాజా పరిణామంతో భారత సంతతికి చెందిన హోంమంత్రి ప్రీతీ పటేల్, రిషి సునక్ కీలక బాధ్యతల్లో ఉన్నట్లయింది. వీరితోపాటు ఆగ్రాలో జన్మించిన అలోక్ శర్మ(52)కు వాణిజ్యం, ఇంధన, పరిశ్రమల విధానం శాఖ మంత్రి, సుయెల్లా బ్రావర్‌మాన్(39)ను అటార్నీ జనరల్‌గా బాధ్యతలు అప్పగించారు. ఎక్కువ మంది భారతీయులు కీలకపోస్టుల్లో ఉన్న ఈ మంత్రివర్గాన్ని ‘దేశి కేబినెట్ ఇన్ యూకే హిస్టరీ’గా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఆర్థిక మంత్రిగా తనపై చాలా బాధ్యతలు ఉన్నాయని రిషి అన్నారు. వచ్చే నెలలో పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్‌ను రూపొందించాల్సి ఉంది. రిషి తండ్రి వైద్యుడు కాగా, తల్లి ఫార్మసిస్ట్. పంజాబ్‌కు చెందిన వీరు లండన్‌లో స్థిరపడ్డారు. 1980లో జన్మించిన రిషి వించెస్టర్ కాలేజీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీల్లో చదివారు. రిషి సునక్ నారాయణమూర్తి కుమార్తె అక్షతను వివాహం చేసుకున్నారు. -
ప్రజారోగ్యంపై పెట్టుబడులు అవసరం
అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చినా మనం వెనుకబడ్డాం దేశంలో 49 శాతం ఫిజీషియన్ల సంఖ్య పెరగాలి దీర్ఘకాలిక వ్యాధులతో దేశంలో 60 శాతం మరణాలు బయో ఏషియా సదస్సులో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రజారోగ్యంపై తక్షణం పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చినా ఆరోగ్య రంగంలో మనం వెనుకబడి ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగంపై బుధవారం జరిగిన బయో ఏషియా–2017 సదస్సులో ఆయన మాట్లాడా రు. దేశంలో సగటు ఆయుర్దాయం 1960లో 45 ఏళ్లుంటే.. 2010 నాటికి అది 67 ఏళ్లకు చేరుకుందని.. చైనా, బ్రెజిల్ వంటి దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువని వివరించారు. శ్రీలంక, బంగ్లాదేశ్ కంటే మనం ఆరోగ్య రంగంలో వెనుకబడి ఉన్నామని చెప్పారు. శిశు మరణాల రేటు 1995–2015 మధ్య 25కు తగ్గిందని.. అయితే మిలీనియం డెవలప్మెంట్ గోల్‌కు చేరుకోలేక పోయామన్నారు. దక్షిణ భారతదేశంలో పరిస్థితి మెరుగ్గా ఉన్నా.. ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ వెనుకబడే ఉన్నామన్నారు. ఇమ్యునైజేషన్లోనూ మనదేశం వెనుకబడి ఉందన్నారు. టీబీ వ్యాధులు తగ్గినా.. అంతర్జాతీయంగా పోలిస్తే మాత్రం వెనుకబడే ఉన్నామన్నారు. దీర్ఘకాలిక వ్యాధుల (జీవనశైలి)తో దేశంలో 60 శాతం మరణాలు సంభవిస్తున్నాయని, ముఖ్యంగా పనిచేసే దశలో ఉండే 35–65 ఏళ్ల వయసు వారే ఈ వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వ్యాధుల నిర్థారణ, నియంత్రణకు ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ముఖ్యంగా మొబైల్ యాప్స్ కూడా ఆరోగ్య సమాచారాన్ని అందిస్తున్నాయని, యాపిల్ వాచ్‌తో హార్ట్ బీట్, ఫిట్నెస్ తదితర వివరాలు తెలుసుకోవచ్చన్నారు. దేశంలో డాక్టర్ల సంఖ్య పెరగాల్సిన అవసరముందని నారాయణ మూర్తి స్పష్టం చేశారు. ఫిజీషియన్లు 49 శాతం, దంత వైద్యులు 109 శాతం, నర్సులు 177 శాతం, మిడ్ వైవ్స్ 185 శాతం, మహిళా వైద్య నిపుణులు 62 శాతం, పిల్లల వైద్యులు 68 శాతం పెరగాల్సిన అవసరముందన్నారు. వ్యాధులపై ముందస్తు హెచ్చరికలు ఇచ్చేందుకు మనకు సరైన ప్రజారోగ్య నిర్వహణ వ్యవస్థ, ఆరోగ్య సమాచార సేకరణ, విశ్లేషణ ఉండాలన్నారు. రెండంకెల స్థాయిలో ఫార్మా ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎగుమ తుల వృద్ధి రెండంకెల స్థాయిలో ఉందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ సుధాంశు పాండే వెల్లడించారు. బయో ఏషియా సదస్సులో మాట్లాడుతూ.. ఇతర రంగాల కంటే సాపేక్షికంగా ఫార్మా రంగమే మెరుగ్గా ఉందని, గత నెల వృద్ధి 8 శాతంగా ఉందని తెలిపారు. ముగిసిన సదస్సు మూడ్రోజుల పాటు నగరంలోని హైటెక్స్‌లో జరిగిన బయో ఏషియా–2017 సదస్సు బుధవారం ముగిసింది. ఈ సదస్సులో 51 దేశాల నుంచి 1,480 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సు వేదికగా వ్యాపారం, భాగస్వామ్య అం శాలపై వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు కంపెనీల మధ్య 1,200 వరకు సమా వేశాలు జరిగాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు ఈ సదస్సులో ప్రపంచ దిగ్గజ ఔషధ కంపెనీలు జాన్సన్ అండ్ జాన్సన్, జీఎస్కే, నోవార్టిస్, గ్లెన్‌మార్క్, వోకార్డ్, ఫిలిప్స్, డెలైట్ తదితర కంపెనీలతో చర్చలు జరిపారు. జీవ వైజ్ఞానిక శాస్త్రం, ఔషధ పరిశ్రమల రంగాల్లో రాష్ట్ర ఆధిపత్యాన్ని నిలుపుకుంటా మని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుత బయోటెక్ క్లస్టర్, జినోమ్ వ్యాలీలతో పాటు త్వరతో ఏర్పాటుకానున్న మెడ్‌టెక్ క్లస్టర్, మెడికల్ డివైసెస్ అండ్ ఎలక్రానిక్స్ పార్క్, ఫార్మా క్లస్టర్, హైదరాబాద్ ఫార్మా సిటీల విశేషాలను మంత్రి కేటీఆర్ కంపెనీలకు తెలియజేశారు. హైదరాబాద్‌లో వ్యాపార విస్తరణకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ కంపెనీలు సుముఖత వ్యక్తం చేశాయని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, నైపుణ్యభివృద్ధి అంశంపై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మా స్యుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్)తో నోవార్టిస్ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.