
భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే యువత వారానికి 70 గంటలు పనిచేయాలని గతంలో ఇన్ఫోసిస్ 'నారాయణ మూర్తి' చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారం రేకెత్తించాయి. కొందరు ఆ మాటలతో ఏకీభవిస్తే.. మరికొందరు వ్యతిరేకించారు. అయితే ఇప్పుడు నారాయణ మూర్తి అలా ఎందుకు చెప్పారనే విషయాన్ని వెల్లడించారు.
దేశంలో రైతులు, కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారు. ఇది అందరికి తెలిసిన విషయం. అయితే దేశంలో ఉన్నత చదువులు చదువుకున్న విద్యావంతులు మాత్రం నిర్దిష్ట సమయానికి పనిచేయాలని అలవాటు పడిపోయారు. ఎవరైతే ఎక్కువ కష్టపడి పని చేస్తారో.. వారినే అదృష్టం వరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: గూగుల్ పరిస్థితులు బయటపెట్టిన మాజీ ఉద్యోగి
70 గంటల పని గురించి చెప్పడం మాత్రమే కాదు, నేను వారానికి 90 గంటలు పనిచేసిన రోజులున్నాయని గుర్తు చేశారు. ఇన్ఫోసిస్‌లో తాను ఉదయం 6 గంటలకు పనిని ప్రారంభించి రాత్రి 9 గంటలకు ముగించేవాడినని చెబుతూ, తాను పాటించకుండా ఇతరులకు హితబోధ చేయనని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment