Work
-
పని గంటలా..? పని నాణ్యతా..?
పని గంటలపై ప్రముఖులు స్పందిస్తుండడంతో దీనిపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ముకేశ్ అంబానీ తనయుడు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ అధిక పని గంటలపై తన అభిప్రాయం వెల్లడించారు. ముంబై టెక్ వీక్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆఫీసులో ఎంతసేపు (ఎన్ని గంటలు) ఉంటారనేది ముఖ్యం కాదు.. చేస్తున్న పనిలో నాణ్యత ఉండాలంటూ దాని గురించి మాత్రమే ఆలోచిస్తానని చెప్పారు. ఇటీవల ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నారాయణమూర్తి, ఎల్అండ్టీ ఛైర్మన్ సుబ్రహ్మణియన్..వంటి ప్రముఖులు ఈ పని గంటలపై స్పందిస్తూ ఆఫీస్‌లో ఎక్కువసేపు పని చేయాలని చెప్పారు. పని గంటలు, పని నాణ్యతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో నిపుణులు అందులోని విభిన్న అంశాలను విశ్లేషిస్తున్నారు.పని గంటలునిర్దిష్ట వ్యవధిలో పనులు పూర్తి: సరైన పని గంటలు ఉండడం వల్ల ఉద్యోగులు క్రమశిక్షణతో, ఫోకస్‌గా పని చేసేందుకు వీలవుతుంది. నిర్దిష్ట కాలవ్యవధిలో పనులు పూర్తయ్యేలా ఉపయోగపడుతుంది. ఇది మొత్తం ఉత్పాదకతకు దోహదం చేస్తుంది.సమన్వయం, సహకారం: టీమ్ సభ్యుల మధ్య సమన్వయం, సహకారాన్ని సులభతరం చేయడానికి పని గంటలు తోడ్పడుతాయి. అందరూ ఒకేసారి అందుబాటులో ఉన్నప్పుడు సమావేశాలను షెడ్యూల్ చేయడం, ప్రాజెక్టులను చర్చించడం, సమష్టి నిర్ణయాలు తీసుకోవడం సులభం అవుతుంది.వర్క్-లైఫ్ బ్యాలెన్స్: నిర్దిష్ట పని గంటలు వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాల మధ్య స్పష్టమైన సరిహద్దును సృష్టించడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ సమతుల్యతను నిర్వహించడానికి కీలకం అవుతాయి.పని నాణ్యతక్లయింట్లు సంతృప్తి: పని నాణ్యతపై దృష్టి పెట్టడం వల్ల ఉద్యోగులు మెరుగైన ఫలితాలు అందించే అవకాశం ఉంది. దీనివల్ల క్లయింట్లు సంతృప్తి చెందుతారు.ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ: క్వాలిటీ ఆధారిత పని ఆవిష్కరణలను, సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది. కఠినమైన పనిగంటలకు పరిమితం కాని ఉద్యోగులు కొత్త ఆలోచనలు, విభిన్న విధానాలను అన్వేషించవచ్చు.ఉద్యోగుల సంతృప్తి: పనిలో నిత్యం అధిక నాణ్యమైన అవుట్‌పుట్ ఇవ్వడం వల్ల ఉద్యోగులు సంతృప్తి చెందుతూ, కొత్త ఆవిష్కరణలు చేసేందుకు ప్రేరణ పొందే అవకాశం ఉంది. ఇది సానుకూల పని వాతావరణానికి దారితీస్తుంది.పని గంటలు, పని నాణ్యత ప్రాముఖ్యంఉత్పాదకత పెంచడానికి పని గంటలు, పని నాణ్యత రెండూ చాలా ముఖ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకోసం కొన్ని విధానాలను సూచిస్తున్నారు.ఫ్లెక్సిబుల్ పని వేళలు: ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూళ్లలో పని చేసేందుకు వీలుగా ఉద్యోగులకు అవకాశం కల్పించాలి. దానివల్ల ఎలాంటి ఒత్తిడి లేకుండా అధిక నాణ్యత కలిగిన అవుట్ పుట్ వస్తుంది.అవుట్ పుట్‌పై దృష్టి: పని గంటల సంఖ్యకు బదులుగా అవుట్ పుట్ నాణ్యతపై దృష్టి కేంద్రీకరించాలి. అందుకోసం సంస్థలు స్పష్టమైన లక్ష్యాలు, అంచనాలను నిర్ణయించాలి. సహేతుకమైన కాలపరిమితిలో అధిక నాణ్యత పనిని అందిస్తే కలిగే ప్రయోజనాలను నొక్కి చెప్పాలి.విరామాలు: క్రమం తప్పకుండా విరామాలు, డౌన్‌టైమ్‌ను ప్రోత్సహించడం సృజనాత్మకతను పెంచుతుంది. కొంతమంది ఉద్యోగులు పని సమయాల్లో కాసేపు రిలాక్స్ అవ్వలనుకుంటారు. అలాంటివారికి రీఛార్జ్ అయ్యేందుకు కొంత సమయం ఇస్తే నాణ్యమైన అవుట్‌పుట్ అందించే అవకాశం ఉంటుంది.నైపుణ్యాలు అభివృద్ధి: ఉద్యోగులకు శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధికి అవకాశాలను అందించాలి. దాంతో వారి పని నాణ్యత మెరుగుపడుతుంది. నిరంతర అభ్యాసం సృజనాత్మకతకు దోహదం చేస్తుంది.ఇదీ చదవండి: రూ.1,700తో అమెరికా వెళ్లి రూ.16,400 కోట్లు సంపాదనపని గంటలు, పని నాణ్యత రెండూ ముఖ్యమైనవే. అయినప్పటికీ ఒకదాని కంటే మరొకదానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం అసమతుల్యతకు దారితీస్తుంది. ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ను కాపాడుకుంటూ ఉద్యోగులు అధిక నాణ్యమైన పనిని అందించడానికి కృషి చేయాలి. -
కట్టు.. బొట్టు.. శ్రమైక జీవనం.. తరం వెళ్లిపోతోంది
తరం వెళ్లిపోతోంది. పాలనురగకు తీసిపోని ధవళవర్ణపు(తెలుపు) వస్త్రధారణ, హుందాతనానికి గుర్తుగా నిలిచే తాత మీసం, ఆత్మగౌరవాన్ని కళ్లకు కట్టే బామ్మ బొట్టు, శ్రమైక జీవనం, ప్రేమతో పలకరించి, మన కలలను నిజం చేసిన పెద్దల తరం, కష్టాల సుడిగుండాలు చుట్టిముట్టినా తొణకని గంభీర స్వరం మూగబోతోంది. ధర్మనిష్ఠ పాటిస్తూ కుటుంబాలకు నాగరికత నేర్పిన నాటి తరం.. ఇక తీపి గుర్తుగా మిగిలిపోతోంది. తాత, అమ్మమ్మ, నానమ్మ ఇలా.. కాలక్రమేణా ఒకనాటి పెద్దలందరూ వయోభారంతో కనుమరుగవుతున్నారు.హుజూరాబాద్: పూటగడవని రోజుల్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు న్నా.. పస్తులుంటున్నా ఇంటి గుట్టు బయట పడనిచ్చేవారు కాదు. చిరిగిన దుస్తులు ధరించిన నాటి ఇంటి పెద్ద తన సంతానానికి ఆ లోటు రాకుండా చూసేవారు. పచ్చడి మెతుకులే పరమాన్నంగా కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. తాము పడే బాధలు పక్కింటివారితో కూడా చర్చించేవారు కాదు. రోజువారీ పనికి సమయంతో పనేంటనే భావన వారికి ఉండేది. ఉమ్మడి కుటుంబాలే..అప్పట్లో అత్యధికంగా ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. ఒక్కో ఇంట్లో పగలూ రాత్రి కలిసి 20 కిలోల వరకు ఆహార ధాన్యాలు వండివార్చే వారంటే అతిశయోక్తి కాదు. ఒక కుటుంబంలో 10 నుంచి 20 మంది వరకు ఉన్నా భేషజాలు ఉండేవి కావు. నీతి, నియమాలే కట్టుబాట్లుగా కుటుంబ పెద్ద చెప్పించే వేదంగా ఉండేది. పిల్లలకు పెళ్లి చేయాలంటే ఉమ్మడిగానే నిర్ణయం తీసుకునేవారు. ఏ ఒక్క బంధువునీ మర్చిపోకుండా తరచూ ఇంటికి ఆహ్వానించి, వారం రోజుల వరకు వెళ్లనిచ్చేవారు కాదు. ఇప్పుడేం జరుగుతోంది?నేటితరంలో కొంతమంది ఆధునిక పోకడలతో ముందుకెళ్తున్నారు. అనాలోచిత నిర్ణయాలు, అహం, ఇతరులను తక్కువగా చూసే ధోరణి చాలామందిలో కనిపిస్తున్నాయి. చిన్న కుటుంబాలుగా విడిపోతూ, గొడవ పడుతూ గౌరవించుకోవడం లేదు. కుటుంబసభ్యులందరూ కలవడానికి, మాట్లాడుకోవడానికి ఇష్టపడటం లేదు. కడుపున పుట్టిన బిడ్డలు కొందరు చేరదీయకపోవడంతో పెద్దలు అనాథాశ్రమాల్లో కాలం వెళ్లదీస్తున్న దుస్థితి కనిపిస్తోంది. జీవితాంతం కష్టపడినవారు వృద్ధాప్యంలో పలకరింపుకైనా నోచుకోక మౌనంగా రోదిస్తున్నారు. విడిగా ఉండేందుకే ప్రాధాన్యంఉమ్మడి కుటుంబంలో ఉండేందుకు కొంతమంది ఇష్టపడటం లేదు. ఫలితంగా వారిపై పెద్దల నియంత్రణ ఉండటం లేదు. ఎక్కడో ఉన్న సినీనటులు ఈరోజు ఏంచేశారో చెప్పగలుగుతున్నారు. ఇంట్లోవారు ఎప్పుడు ఏంచేస్తున్నారో చెప్పలేని పరిస్థితి. మాట్లాడుతున్న తీరుతో రక్త సంబంధీకులకు దూరమవుతున్నారు. ఇతరులతో పోల్చుకుంటూ రాబడికి మించి ఖర్చు చేస్తున్నారు. యువత వ్యసనాలకు బాని సవుతోంది. 30 ఏళ్లొచ్చినా పెళ్లి మాట ఎత్తడం లేదు. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో శ్రద్ధాంజలితీరికలేని జీవితంలో.. ఒక వ్యక్తి మరణిస్తే వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో మెస్సేజ్ పెట్టి, వదిలేస్తున్నారు. చనిపోయినవారిని చూసేందుకు సైతం వెళ్లలేని పరిస్థితులు దాపురించాయి.నైతిక విలువలు నేర్పాలిప్రభుత్వం నూతన విద్యావిధానంలో నైతిక విలువలు, మానవ విలువలను పాఠ్యాంశంగా చేర్చాలి. పాఠశాల స్థాయిలోనే సంస్కృతి, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతపై పిల్లలకు శిక్షణ తరగతులు నిర్వహించాలి. ఉమ్మడి కుటుంబ ప్రాముఖ్యతపై ప్రతీ ఇంట్లో కుటుంబసభ్యులందరూ చర్చించుకో వాలి. పర్యావరణ విధ్వంసం వల్ల వచ్చే ఉపద్రవా ల కన్నా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పతనమైతే కలిగే అనర్థాలపై ప్రభుత్వం, గ్రామ పంచాయతీలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు ప్రచారం చేయాలని సామాజికవేత్తలు సూచిస్తున్నారు.వ్యవసాయం.. గంజి, మెతుకులువ్యవసాయానికి యంత్రాలు లేని నాటి కాలంలో తెల్లవారకముందే సాగు పనుల్లో నిమగ్నమై, దీపాలు పెట్టే వేళకు ఇల్లు చేరేవారు. పగలంతా పడిన కష్టాన్ని మరిచి, మిణుకుమిణుకుమంటూ వెలిగే నూనె దీపాల వెలుగులో ఇంటిల్లిపాది కూర్చొని, కాచిన గంజిలో మె తుకులు కలిపి తినేవారు. ఇంటి నిర్మాణం చేపట్టాలంటే మట్టి, కలపను ఎడ్లబండ్లపై తీసుకువచ్చేవారు. జీవితంలో ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా భూమి, ఇల్లు మాత్రం అమ్మకానికి పెట్టేవారు కాదు. తల్లిదండ్రులు, పంటలు, పశుసంపదను ప్రేమగా చూసుకునేవారు.ఆ రోజులే మంచిగుండే..నాటి రోజులు మంచిగుండే. పండుగచ్చిందంటే కుటుంబ సభ్యులందరం కలిసి అప్పాలు చేసుకునేటోళ్లం. ఫోన్లు లేకున్నా ఆనందంగా ఉండేటోళ్లం. చుట్టాలు వస్తే సంబురం. మంచి, చెడు మాట్లాడుకునేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. మనుషుల మధ్య ప్రేమ లేదు.– కేతిరి రాజయ్య, దమ్మక్కపేట, హుజూరాబాద్ఇప్పటోళ్లను చూస్తే భయమైతందినాటి రోజుల్లో సంస్కృతి సంప్రదాయాలు, పెద్దల మాటకు కట్టుబడి బతికినం. ఇప్పటోళ్లను చూస్తే భయమైతంది. చిన్న విషయానికే కోపానికి వస్తున్నరు. పెద్దలంటే గౌరవం లేదు. చిన్నప్పటి నుంచే పిల్లలను సక్రమంగా పెంచాలి.– మూగల సంజీవరెడ్డి, ఆదర్శ రైతు, ధర్మరాజుపల్లి, హుజూరాబాద్ప్రేమ, క్రమశిక్షణ ఉండాలిఒక కుటుంబంలోని పెద్దలందరూ ప్రేమ, క్రమశిక్షణతో ఉండాలి. గొడవ పడటం, గౌరవ మర్యాదలు పాటించకపోవడం వంటివి చేయొద్దు. ఇవి పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపుతాయి. కుటుంబాలు బాగుంటేనే సమాజం బాగుంటుంది. – ఎల్.వర్షి, ప్రభుత్వ మానసిక వైద్య నిపుణుడు, హుజూరాబాద్ -
నైపుణ్యం కలిగిన ప్రవాస ఇంజినీర్లకు సకల సౌకర్యాలు
దేశంలో ప్రవాస ఇంజినీర్ల సేవలను మరింత ఎక్కువగా వినియోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. శ్రామిక కొరత సమస్యను పరిష్కరించడానికి, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అధిక నైపుణ్యం కలిగిన ప్రవాస ఇంజినీర్ల(expat engineers)ను దేశంలోకి ఆహ్వానించేందుకు ప్రభుత్వం కొత్త విధానాలను ప్రకటించింది. ఈ నిర్ణయంతో నిపుణుల ద్వారా సంపద సృష్టి జరుగుతుందని, వివిధ పరిశ్రమల్లో సాంకేతిక పురోగతి మెరుగుపడతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.నిపుణుల కొరతకు పరిష్కారంఇంజినీరింగ్ రంగంలో నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ఇది మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సాంకేతిక అభివృద్ధి పెరుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. నైపుణ్యం కలిగిన ప్రవాస ఇంజినీర్లను దేశంలోకి ఆహ్వానించడం ద్వారా ఈ లోటును భర్తీ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రాజెక్టులు సకాలంలో, అత్యున్నత ప్రమాణాలతో పూర్తయ్యేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటోంది.ఇదీ చదవండి: వేసవి కాలం కంపెనీలకు లాభం!ప్రభుత్వ చర్యలు ఇలా..ప్రవాస ఇంజినీర్లు భారత్‌లో పనిచేయడానికి వీలుగా వీసా ప్రక్రియలను ప్రభుత్వం సులభతరం చేసింది. వీసా ప్రాసెసింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గించింది. నిపుణులు అనవసరమైన ఆలస్యం లేకుండా శ్రామిక శక్తిలో భాగమయ్యేలా చర్యలు చేపడుతోంది. ప్రతిభావంతులను ఆకర్షించడానికి మెరుగైన జీతాలు, పునరావాసం, గృహ ప్రయోజనాలు వంటి ప్రోత్సాహకాలను అందిస్తోంది. భాషా శిక్షణ, సాంస్కృతిక ఓరియెంటేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే స్థానికంగా ఉన్న శ్రామిక శక్తిలో నైపుణ్య అంతరాలను గుర్తించడానికి పరిశ్రమ నాయకులతో కలిసి పనిచేస్తోంది. ప్రవాస ఇంజినీర్లు అవసరాలకు తగిన విధంగా స్థానికులకు శిక్షణ అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇంజినీర్లకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో గణనీయంగా పెట్టుబడులు పెడుతోంది. అధునాతన ఇంజినీరింగ్ పనులకు అవసరమైన వనరులను అందించే అత్యాధునిక సౌకర్యాలు, పరిశోధనా కేంద్రాలు, టెక్నాలజీ పార్కుల అభివృద్ధి చేస్తోంది. -
వారానికి 4 రోజులే పని.. కొత్త లేబర్ కోడ్ వచ్చేస్తుందా?
మోదీ ప్రభుత్వం రానున్న బడ్జెట్లో (Budget 2025-26) కొత్త లేబర్ కోడ్ (New Labor Code) నిబంధనల అమలును ప్రకటించవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) రాబోయే బడ్జెట్లో లేబర్ కోడ్లను దశలవారీగా అమలు చేసే ప్రణాళికను ప్రకటించవచ్చని భావిస్తున్నారు. అధికార వర్గాల ప్రకారం.. ఈ కొత్త లేబర్ కోడ్లు మూడు దశల్లో అమల్లోకి రానున్నాయి. దీంతో ఉద్యోగులకు రోజువారీ పని గంటలు పెరుగుతాయి. అలాగే వారానికి 4 రోజులే పని చేసే అవకాశం ఉంటుంది. పీఎఫ్ కోసం కట్ చేసే డబ్బు పెరిగితే ప్రతి నెలా వచ్చే జీతం తగ్గవచ్చు.మూడు దశల్లో కొత్త లేబర్ కోడ్లేబర్ కోడ్ కొత్త కొత్త విధానాలను అమలు చేయడానికి ఆయా యాజమాన్యాలకు తగిన సమయం ఇచ్చేందుకు మూడు దశల్లో దీన్ని అమలు చేస్తారని తెలుస్తోంది. 2025-26 బడ్జెట్లోనే ప్రభుత్వం ఈ కోడ్లను ప్రకటిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది అమలులోకి వస్తుంది. ఈ లేబర్ కోడ్లు అటు యాజమాన్యాలకు అనువుగా ఉండటమే కాకుండా ఇటు ఉద్యోగులకు కూడా మెరుగైన సామాజిక భద్రత కల్పిస్తాయని భావిస్తున్నారు.ఇదీ చదవండి: Budget 2025: కొత్త ట్యాక్స్ శ్లాబ్ రాబోతోందా?మొదటి దశలో 500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న పెద్ద కంపెనీలు ఈ కోడ్లను అనుసరించడం తప్పనిసరి. రెండో దశలో 100-500 మంది ఉద్యోగులున్న మీడియం కంపెనీలను దీని పరిధిలోకి తీసుకురానున్నారు. మూడో దశలో 100 మందిలోపు ఉద్యోగులున్న చిన్న కంపెనీలపై ఈ కోడ్లను అమలు చేయనున్నారు. లేబర్ కోడ్ కొత్త నియమాలు, పథకం ప్రకారం, ఈ నిబంధనలను అమలు చేయడానికి చిన్న సంస్థలకు సుమారు రెండు సంవత్సరాలు పడుతుంది. దేశ వ్యాపార నిర్మాణంలో 85 శాతం కంటే ఎక్కువ వాటా ఎంఎస్ఎంఈలు అంటే చిన్న పరిశ్రమలదే.రాష్ట్రాలతో చర్చలుఈ కోడ్లను అమలు చేసేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, ఢిల్లీ వంటి రాష్ట్రాలతో ముసాయిదా నిబంధనలను ఖరారు చేసే పనిలో మంత్రిత్వ శాఖ బిజీగా ఉంది. మొదటి దశలో వేతనాలు, సామాజిక భద్రతా కోడ్‌పై కోడ్‌ను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే మార్చి నాటికి అన్ని రాష్ట్రాలతో ముసాయిదా నిబంధనలు ఖరారు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.ఏమిటీ లేబర్ కోడ్లు?భారత ప్రభుత్వం 29 కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా ఏకీకృతం చేసింది. యాజమాన్యాలతోపాటు ఉద్యోగుల సామాజిక భద్రతను బలోపేతం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. నాలుగు కోడ్లు ఇవే.. వేతనాలపై కోడ్, సామాజిక భద్రతా కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, చివరిది ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండిషన్ కోడ్.4 రోజులు పని.. 3 రోజులు సెలవుకొత్త లేబర్ కోడ్లలో వారంలో నాలుగు రోజుల పని, మూడు రోజుల విశ్రాంతి విధానం కూడా ఉండవచ్చు. ఉద్యోగుల పని, జీవితం మధ్య సమతుల్యతను ఏర్పరచడమే ఈ విధానం ఉద్దేశం. అయితే వారానికి నాలుగు రోజులే పని చేయాలనే నిబంధన వల్ల రోజువారీ పని గంటలు పెరుగుతాయి. మరోవైపు ప్రావిడెంట్ ఫండ్ కోసం మినహాయించే మొత్తం పెరిగే పరిస్థితిలో ఉద్యోగుల చేతికి అందే జీతం తగ్గవచ్చు. -
పనీ – పాటా
పనీ–పాటా అనే నుడికారం ఊరికే పుట్టలేదు; శ్రామిక సంస్కృతిలో పని లేకుండా పాటా, పాట లేకుండా పనీ ఉండవు; అవి అన్యోన్యాలు. పాడుకుంటూ పనిచేస్తే పనిభారం తగ్గుతుందంటారు; అందుకే, ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూసొలుపేమున్నదని ఓ సినీకవి అన్నాడు. అసలు పాట రూపంలో కవిత్వమే కానీ, అభినయ రూపంలో నృత్య, నాటకాలే కానీ, ఆమాటకొస్తే ఇతర కళారూపాలే కానీ పుట్టింది పనితోనేనని పండితులు తేల్చారు. వైయక్తిక, సామూహిక శ్రమలో భాగమైన శారీరక చర్యలను కళారూపాలు అంటిపెట్టుకునే ఉండేవన్నారు. పనినీ, పాటనూ విడదీసి చూడడం నాగరికత ముదిరిన తర్వాతే వచ్చింది. పాట అనేది పనిలేనప్పుడు పాడుకునే వ్యాపకమైంది. రానురాను పాటను పక్కన పెట్టి పనికి మాత్రమే పట్టం కట్టే స్థితికి దారితీసి; తాజాగా వారానికి 70 గంటలు పనిచేయాలని ఒకరంటే, కాదు 90 గంటలు పనిచేయాలని మరొకరు అనే వరకు వెళ్లింది. కొన్నిరోజులుగా ఇదే పెద్ద చర్చనీయాంశం. మనిషితో సహా సమస్త జీవరాశితోనే పని కూడా పుట్టింది; అది కర్మగా మారి కర్మయోగంగా తాత్విక శిఖరానికీ చేరింది; దాంతోపాటు కలలూ, కన్నీళ్ళ చరిత్రనూ మూటగట్టింది. వేల సంవత్సరాల వెనకటి వేట–ఆహార సేకరణ జనాల జీవనంలోకి తొంగి చూస్తే, వారు వారానికి పదిహేను గంటలే పనిచేసేవారని మానవశాస్త్ర నిపుణులంటారు. వారిది మొరటుదనం, అజ్ఞానం మూర్తీభవించిన దుర్భర జీవితమని కొందరంటే; కాదు, ఆ తర్వాతి కాలానికి చెందిన వ్యవసాయ జీవనంతో పోల్చితే వేట–ఆహారసేకరణ జనాలది అత్యున్నత సంస్కృతికి చెందిన సంపన్న సమాజమనీ, తగినంత తీరిక ఉండడమే అందుకు కారణమనీ మరికొందరు అన్నారు. ప్రకృతిని అధ్యయనం చేయడానికీ, చంద్రుడి వృద్ధిక్షయాలపై ఆధారపడిన కాలగణనాన్ని కూర్చడానికీ, కళారూపాల అభివృద్ధికీ ఆ తీరిక తోడ్పడిందనీ, వారే తొలి శాస్త్రవేత్తలూ, కళాకారులనీ – అప్పటి అనేక గుహా చిత్రాలు, కుడ్యచిత్రాల ఆధారంగా నిపుణులు నిరూపించారు. వ్యవసాయ జీవనం నుంచీ ఆ తీరిక అడుగంటి పారిశ్రామిక యుగానికి వచ్చేసరికి వారానికి 80 నుంచి 100 గంటలు పనిచేయవలసిన దుఃస్థితి దాపురించి, ఆ నిర్బంధ శ్రమకు వ్యతిరేకంగా ఉద్యమాలు తలెత్తడంతో వారానికి 40 గంటల పని ప్రామాణిక కొలమానంగా స్థిరపడిందని చరిత్ర చెబుతోంది. నిజానికి పనీ–తీరికా అనేవి ఏదో ఒక నిర్ధారణకో, ఒకే ఒక్క నిర్వచనానికో అందని సంక్లిష్ట అనుభవాలు. ప్రతిసారీ పనిభారాన్ని దాని పరిమాణంతోనూ, గంటలతోనూ తూచలేం. ఇష్టంతో స్వచ్ఛందంగా చేసే పని అలాంటి కొలతలనూ, శ్రమనూ కూడా అధిగమిస్తుంది. నిర్బంధంగా విధించే పని తక్కువ పరిమాణంలో ఉండి, తక్కువ సమయాన్ని తీసుకునేదైనా భారంగానే తోస్తుంది. స్వతంత్రంగా కొయ్యపని చేసుకుంటూ అందులో కళాత్మకతనూ, తృప్తినీ ఆస్వాదించిన ఒక వడ్రంగి ఒక ఫ్యాక్టరీ కార్మికుడిగా మారడంతోనే వాటిని కోల్పోయి ఎలా నిరాసక్తంగా మారాడో కొడవటిగంటి కుటుంబరావు ఒక కథలో చిత్రిస్తారు. పనిగంటలు పెరిగితే ఉత్పాదకత పెరుగుతుందనుకోవడమూ సత్యదూరమేనని చెప్పి, ఐస్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్ లాంటి దేశాల అనుభ వాన్ని ఉటంకించేవారూ ఉన్నారు. వారానికి 30–35 గంటల పనితోనే ఈ దేశాలు ఉత్పాదకత లోనూ, సంతోషభరిత జీవనంలోనూ అగ్రస్థానం వహించడాన్ని వారు ఉదాహరిస్తున్నారు. పనీ–తీరికలలో ఏది ఎక్కువైనా జీవనశకటం ఒకవైపే ఒరిగిపోయి జీవితమే అస్తవ్యస్తమవుతుంది. జీవిక కోసమే మొత్తం సమయాన్ని వెచ్చిస్తే, జీవించడమే మరచిపోతామని ఒక సూక్తి. అన్నిటా సమతూకం పాటించడంలోనే సంతోష రహస్యం ఇమిడి ఉందన్నది మరొక ఉద్బోధ.అందుకే, ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నారు; అదే అన్ని సందర్భాలకూ వర్తించే సార్వకాలిక సూత్రం. నిజానికి పనికీ–తీరికకీ మధ్య అన్యోన్యతా, పరస్పరతా ఉన్నాయే తప్ప వైరుద్ధ్యం లేదని, దేని విలువ దానిదేనని అనేవారూ ఉన్నారు. కుటుంబ సభ్యులతోనూ, విందు వినోదాలతోనూ ఆహ్లాదంగా గడిపే తీరిక సమయం పనిలో నిమగ్నతకూ, నాణ్యతకూ, ఉత్పాదకత పెరగడానికే తోడ్పడుతుందంటారు. పనిలో ఇతర దేశాలతో పోటీ, అభివృద్ధీ అనేవి కొత్తగా వచ్చాయి. దేశాభివృద్ధిని కొత్తపుంతలు తొక్కించడానికి పని గంటలు పెంచాలనడం పూర్తిగా కొట్టిపారవేయవలసినదేమీ కాదు. కాకపోతే, ఇతర అనేకానేక దృష్టికోణాలను, వాస్తవాలను విస్మరించి ఏకపక్షంగా అలాంటి అభిప్రాయానికి రావడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువన్నది ఒక విమర్శ. అభివృద్ధిలో పోటీ పడవలసిందే కానీ, ఇక్కడి మానవవనరుల అందుబాటునూ, వాటి అభివృద్ధినీ కూడా పరిగణనలోకి తీసుకుని తగిన ప్రణాళికతో ముందుకు వెళ్లాలనే వాదన వినిపిస్తోంది. వివిధ రంగాలలో ఇప్పటికే పెరిగిన పని భారం ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యాలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోందనీ, అందువల్ల ఉత్పాదకత మందగిస్తోందనీ ఆయా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఇంకోవైపు దేశంలో నిరుద్యోగం రేటు పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కనుక, పని గంటలను పెంచడం కన్నా పని చేసే చేతుల సంఖ్యను పెంచి పనిని పంచడమే అత్యుత్తమ పరిష్కారమనీ; అందుకు అవసర మైన అన్నిరకాల శిక్షణ సదుపాయాలనూ అభివృద్ధి చేయాలనే వాదన ముందుకు వస్తోంది. పని నుంచి పాటను వేరు చేసినప్పుడు చిన్న పని కూడా పెనుభారమే అవుతుంది. పనికి పాటను జోడించడమే దానిని తేలికచేసే మార్గం. పనీ–పాటా కలిసినప్పుడు... పనే పాటవుతుంది! -
బాసులు లేని వర్క్ కల్చర్
వారంలో 90 గంటలు పని చేయాలంటు ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యయన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ విధానాన్ని వ్యతిరేకించిన ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా తాజాగా డెన్మార్క్ వర్క్ కల్చర్‌ను అవలంబించడం ద్వారా భారత్ ప్రయోజనం పొందే అవకాశం ఉందని సూచించారు.‘డెన్మార్క్‌లో ఉద్యోగులు మైక్రో మేనేజ్మెంట్(కింది స్థాయి బాసులు) లేకుండా స్వతంత్రంగా పనిచేస్తారు. వీరు సంవత్సరానికి కనీసం ఐదు వారాల సెలవు, ఆరు నెలల పేరెంటల్ లీవ్ అనుభవించే అవకాశం ఉంది. సౌకర్యవంతమైన పని గంటలు ఎంచుకోవచ్చు. దాంతో వృత్తిపరంగా, వ్యక్తిగత జీవితాలను సమతుల్యం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరూ ఉద్యోగాలను వీడకుండా స్థానిక ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అక్కడి ఉద్యోగులు అనుభవించే సౌకర్యాలు, స్వయంప్రతిపత్తి కారణంగా చాలా మంది పనిని కొనసాగిస్తారు. కంపెనీ యజమానులు మానసిక ఆరోగ్యానికి, వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు విలువ ఇస్తారు. వ్యక్తిగత ఆకాంక్ష కంటే సామూహిక శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇస్తారు’ అని చెప్పారు.అసలేం జరిగిందంటే..ఎల్ అండ్ టీ ఉద్యోగి ఒకరు ఛైర్మన్‌తో వీడియో ఇంటెరాక్షన్‌లో భాగంగా కొన్ని అంశాలను అడుగుతూ..ఉద్యోగులు శనివారాల్లో ఎందుకు పని చేయాల్సి ఉంటుందని అన్నారు. దాంతో వెంటనే సుబ్రహ్మణ్యన్(l and t chairman comments) స్పందిస్తూ ‘ఆదివారాన్ని కూడా పని దినంగా ఆదేశించలేం కదా. నేను మీతో ఆదివారం పని చేయించుకోలేకపోతున్నాను. మీరు సండే కూడా పని చేస్తే మరింత సంతోషిస్తాను. ఎందుకంటే నేను ఆ రోజు కూడా పని చేస్తున్నాను’ అని అన్నారు. ఇంట్లో ఉండి ఉద్యోగులు ఏం చేస్తారని సుబ్రహ్మణ్యన్ ప్రశ్నించారు. ‘ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? నీ భార్యవైపు ఎంతసేపు చూస్తూ ఉంటావు? రండి, ఆఫీసుకు వచ్చి పని ప్రారంభించండి. మీరు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలంటే వారానికి 90 గంటలు పని చేయాలి’ అన్నారు.Why the people in Denmark are happiest about their work practices:- Employees are trusted to work independently without micromanagement- Minimum five weeks of vacation and six months of parental leave- Flexible hours allow time for family and personal life- Job loss is…— Harsh Goenka (@hvgoenka) January 16, 2025వినాశనానికి దారితీస్తుందంటూ ఇప్పటికే స్పందనసుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా(Harsh Goenka) గతంలో స్పందిస్తూ..‘వారానికి 90 రోజుల పనా? సండేను సన్-డ్యూటీ అని.. ‘డే ఆఫ్’ను ఓ పౌరాణిక భావనగా ఎందుకు మార్చకూడదు. తెలివిగా కష్టపడి పని చేయడాన్ని నేను నమ్ముతాను. కానీ, జీవితాన్ని మొత్తం ఆఫీసుకే అంకితంగా మారిస్తే అది వినాశనానికి దారితీస్తుందే తప్ప విజయం చేకూరదు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనేది ఆప్షన్ కాదు. అవసరం అని నా భావన’ అని తన ఎక్స్ ఖాతాలో పోర్కొన్నారు. ‘వర్క్ స్మార్ట్ నాట్ స్లేవ్’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. -
‘భార్యను తదేకంగాఎంతసేపు చూస్తారు? : అమూల్ స్పందన, ఈ కార్టూన్లు చూస్తే!
ఉద్యోగులు, పనిగంటలపై కార్పొరేట్ కంపెనీ ఎల్అండ్టీ (L&T) చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలని, ఇంట్లో కూర్చుని భార్యను ఎంత సేపు చూస్తారూ, ఆదివారం కూడా పని చేయండి అంటూ సుబ్రహ్మణ్యన్ చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో సుదీర్ఘ పని గంటలపై మరోసారి చర్చకు దారి తీసింది. సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై ఇప్పటికే నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై పలువురు ఇండస్ట్రీ పెద్దలుకూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఈ జాబితాలోకి డైరీ బ్రాండ్ అమూల్ చేరింది.అమూల్ ఏమంది?ఎల్ అండ్ టి బాస్ "స్టేర్ ఎట్ వైఫ్" వ్యాఖ్యలపై అమూల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక డూడుల్ విడుదల చేసింది. ఇందులో ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమూల్ "90 గంటల పని వారం గురించి వివాదం!" అనే శీర్షికతో పాటు ఒక డూడుల్‌ను షేర్ చేసింది! డూడుల్‌లోని టెక్స్ట్ బోల్డ్‌లో L & T లెటర్స్‌తో ((Labour & Toil) "శ్రమ అండ్ కఠోర శ్రమ?" అంటూ సుబ్రహ్మణ్యన్ను విమర్శించింది "మీరు మీ భార్యను ఎంతసేపు తదేకంగా చూడగలరు?" "అమూల్ రోజూ బ్రెడ్‌ను తదేకంగా చూస్తుంది," అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.#Amul Topical: Controversy about the 90 hour work week! pic.twitter.com/VQlwoLoTx8— Amul.coop (@Amul_Coop) January 14, 2025కాగా ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ వార్తలు, అంశాలపై ప్రత్యేకమైన గ్రాఫిక్స్ ,పోస్టర్లను రూపొందించడంలో అమూల్ కంపెనీబాగా ప్రసిద్ధి చెందింది. క్రీడల నుండి వినోదం వరకు, అన్ని ముఖ్యమైన సందర్భాలు, ప్రధానంగా ప్రముఖులు చనిపోయినపుడు కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, 90 గంటల పనివారం గురించి కొనసాగుతున్న వివాదంపై కూడా స్పందించడం విశేషం. గతంలో వారానికి 70 గంటలు పని చేయాలనే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ్ మూర్తి కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇపుడు ఎల్అండ్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ ఇంకో అడుగు ముందుకేసి, 90 గంటలు, "ఇంట్లో కూర్చొని మీరు ఏమి చేస్తారు? భార్యను ఎంత సేపు చూస్తారు,ఆఫీసుకు వెళ్లి పని ప్రారంభించండి." అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధిక జీతం , సౌకర్యాలు ఉన్న కార్పొరేట్ కంపెనీల సీఈవోలు, కింది స్థాయి, తక్కువ జీతం పొందే ఉద్యోగుల నుండి అదే స్థాయి నిబద్ధతను ఎందుకు ఆశిస్తారంటూ నెటిజన్లు ప్రశ్నించారు. మరికొంతమంది కార్మిక శ్రమను దోచుకునే వీళ్లకి కార్మిక చట్టాలు, అమలు, కార్మిక సంక్షేమం గురించి మాట్లాడే మనసు ఉండదంటూ మండిపడ్డారు. అంతేకాదు ఈ వివాదంపై అనేక కార్డూన్లు, ఫన్నీ కామెంట్లు,వీడియోలు నెట్టింట సందడి చేశాయి కూడా. Dedicated to the L&T Chairman who wants a 90 hour work week pic.twitter.com/QtPtLjh2ej— Prashant Bhushan (@pbhushan1) January 13, 2025బాలీవుడ్ సూపర్ స్టార్ దీపికా పదుకొనే, ఆర్పీసీ గ్రూప్ చైర్పర్సన్ హర్ష్ గోయెంకా కూడా సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలను ఖండించారు. అలాగే ఎంఅండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్రా 90 గంటల పనివారం చర్చపై స్పందిస్తూ.. తూకం వేసి, పరిమాణం కంటే పని నాణ్యతపై దృష్టి పెట్టాలని సూచించారు. సుదీర్ఘ పని గంటల కంటే ఉత్పాదకత ,సామర్థ్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.బండ చాకిరీ : మన దేశంమరోవైపు అంతర్జాతీయ కార్మిక సంస్థ( ILO) నివేదిక ప్రకారం, భారతదేశం ఇప్పటికే ప్రపంచ ఓవర్ వర్క్ రంగంలో ముందు వరుసలో ఉంది. అదనపు పని విషయంలో ప్రపంచ దేశాల్లో భారతదేశం 13వ స్థానంలో ఉందని వెల్లడించింది. సగటున భారతీయ ఉద్యోగులు ప్రతి వారం 46.7 గంటలు పనిచేస్తారని, భారతదేశంలోని 51శాతం మంది శ్రామిక శక్తి ప్రతి వారం 49 లేదా అంతకంటే ఎక్కువ గంటలు పనిచేస్తుందని, అత్యధికంగా సుదీర్ఘమైన పని గంటలు ఉన్న దేశాలలో భారతదేశం రెండవ స్థానంలో ఉందని కూడా సంస్థ పేర్కొన గమనార్హం. -
భార్యలవైపు ఎంతసేపు చూస్తారు... ఆదివారాలు కూడా ఆఫీసుకు రండి!
‘ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? భార్యను ఎంత సేపు చూడగలరు? భర్తలను భార్యలు ఎంత సేపు చూడగలరు? ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండి. ‘ఆదివారాలు కూడా ఆఫీసుకురండి. వారానికి 90 గంటలు పనిచేయాలి’ అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరో కాదు దేశంలోనే ప్రముఖ కార్పొరేట్ కంపెనీ లార్సన్ అండ్ టుబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్. ఆ మధ్య వారానికి 70గంటలు పనిచేయాలని మాట్లాడి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురయ్యారు. ఇప్పుడు ఆ వంతు సుబ్రమణ్యన్ది. మూర్తి మీద జోకులు మీమ్‌లు ఆగకముందే ఎల్–టీ చైర్మన్ ఆయనకు తోడయ్యారు. ఉద్యోగులకు వ్యక్తిగత జీవితం ఉండదా, ఉండకూడదా అంటూ నెటిజనులు దాడి మొదలెట్టారు. ఇతర కార్పొరేట్ సీఈఓలు కూడా సుబ్రమణ్యన్ మాటల్ని కొట్టిపారేశారు. ఉద్యోగులపై ఒత్తిడి పెరిగి సమర్ధత సన్నగిల్లుతున్న ఈరోజుల్లో వారికి స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పాల్సింది పోయి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదన్నారు. సోషల్ మీడియాలో దాడిని నెటిజన్ల నుంచి వెల్లువెత్తిన వ్యతిరేకతని గమనించిన ఎల్–టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇది భారతదేశపు దశాబ్దమని చైర్మన్ సుబ్రమణ్యన్ విశ్వసిస్తున్నారు..అసాధారణ ఫలితాలు సాధించాలంటే అసామాన్య కృషి అవసరం. కలసికట్టుగా అంకితభావంతో కృషి చేస్తే వృద్ధిని కొనసాగించగలుగుతాం. అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలనే విజన్‌ను సాకారం చేసుకోగలుగుతాం. కంపెనీ చైర్మన్ వ్యాఖ్యలు ఇదే లక్ష్యాన్ని ప్రతిఫలిస్తున్నాయని ఎల్–టీ ప్రకటన జారీ చేసింది. జాతి నిర్మాణమే ఎల్అండ్టీ ప్రధాన లక్ష్యం. ఎనిమిది దశాబ్దాలుగా దేశ మౌలికసదుపాయాలు, పరిశ్రమలు, సాంకేతిక సామర్థ్యాలను బలపరుస్తున్నాం. ఉద్ధేశాలు, లక్ష్యాలు సాధనకు కట్టుబడి ముందుకు సాగుతామని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: అపోహలు వీడితేనే మంచి స్కోరు -
టేబుల్ స్పేస్ సీఈవో అమిత్ బెనర్జీ కన్నుమూత
వర్క్‌స్పేస్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ‘టేబుల్ స్పేస్’ వ్యవస్థాపకుడు, చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అమిత్ బెనర్జీ కన్నుమూశారు. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గుండెపోటుతో ఆయన చనిపోయాడంటూ కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నప్పటికీ అమిత్ బెనర్జీ మరణానికి తక్షణ కారణం ఇంకా తెలియలేదు.“మా వ్యవస్థాపకుడు, చైర్మన్, సీఈవో అయిన అమిత్ బెనర్జీ మరణించినట్లు ప్రకటించడం చాలా విచారకరం. భారతదేశంలో ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ సొల్యూషన్ పరిశ్రమను మార్చిన దార్శనికుడైన నాయకుడు అమిత్. ఆయన నాయకత్వంలో టేబుల్ స్పేస్ ఈస్థాయికి చేరింది” అని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు.కంపెనీ, దాని వ్యక్తులు మరియు పరిశ్రమపై అతని ప్రభావం శాశ్వతంగా ఉంటుంది మరియు అతని కుటుంబం, స్నేహితులు మరియు భాగస్వాములచే అతను తీవ్రంగా మిస్ అవుతాడు. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము.అమిత్ బెనర్జీ గురించి..దాదాపు 44 ఏళ్ల వయస్సు ఉన్న అమిత్ బెనర్జీ, 2017 సెప్టెంబర్‌లో టేబుల్ స్పేస్‌ను స్థాపించారు. వర్క్ స్పేస్ కోసం చూస్తున్న పెద్ద, మధ్య-మార్కెట్ అద్దెదారులకు ఇది మేనేజ్డ్ వర్క్‌స్పేస్ ప్రొవైడర్‌గా అందుబాటులోకి వచ్చింది.పంజాబ్ టెక్నికల్ యూనివర్శిటీలో 2002లో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసిన అమిత్ బెనర్జీ 2004 జనవరిలో ఐటీ మేజర్ యాక్సెంచర్‌లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆ సంస్థలో 13 సంవత్సరాలు పనిచేసిన ఆయన రియల్ ఎస్టేట్ వ్యూహం, ప్రణాళిక, సముపార్జనలు, డీల్ స్ట్రక్చరింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్‌కు బాధ్యత వహించారు.వృత్తిపరమైన అనుభవం అతన్ని రియల్ ఎస్టేట్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది టేబుల్ స్పేస్‌ను ప్రారంభించడంలో సహాయపడింది. అమిత్ బెనర్జీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. బెనర్జీ సెజ్ డీల్ స్ట్రక్చరింగ్‌లో నైపుణ్యం కలిగి ఉన్నారు. ఆయన సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌లో ఆవిష్కరణలతో పేటెంట్ హోల్డర్ కూడా.టేబుల్ స్పేస్ గురించి..గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ హిల్‌హౌస్ క్యాపిటల్ మద్దతుతో ఉన్న టేబుల్ స్పేస్, 2025లో ఐపీఓకి వెళ్లాలని చూస్తున్న అనేక స్టార్టప్‌లలో ఒకటి. రూ. 3,500 కోట్ల కంటే ఎక్కువ నిధుల సమీకరణపై దృష్టి సారించింది. సుమారు 2.5 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.టేబుల్ స్పేస్ వెబ్సైట్ ప్రకారం.. సంస్థ నిర్వహించే వర్క్‌స్పేస్‌లలో మార్కెట్ లీడర్‌గా ఉంది. ప్రధానంగా గూగుల్ (Google), యాపిల్ (Apple), డెల్ (Dell) వంటి ఫార్చూన్ (Fortune) 500 కంపెనీలతో కలిసి పని చేస్తుంది. పెద్ద స్థలాలను లీజుకు ఇవ్వడం, వాటిని ఆధునీకరించడమే కాకుండా వాణిజ్య రియల్ ఎస్టేట్‌ను సొంతం చేసుకోవడానికి జాయింట్ వెంచర్ల కోసం కంపెనీ భారతీయ రియల్టర్లతో కూడా జతకట్టింది.వరుస విషాదాలుస్టార్టప్ కమ్యూనిటీలో ఇటీవల ప్రముఖుల మరణాలు విషాదాన్ని నింపుతున్నాయి. రెండు వారాల క్రితం, ప్రఖ్యాత యోగర్ట్ బ్రాండ్ ఎపిగామియా సహ వ్యవస్థాపకుడు రోహన్ మిర్చందానీ డిసెంబర్ 21న 41 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. వెంచర్ క్యాపిటల్ సంస్థ గుడ్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు రోహన్ మల్హోత్రా అక్టోబర్ 1న మరణించారు. పెప్పర్ఫ్రై సహ వ్యవస్థాపకుడు అంబరీష్ మూర్తి ఆగస్టులో లేహ్‌లో బైకింగ్ ట్రిప్‌లో గుండెపోటుతో మరణించారు. -
భారీ స్థాయిలో ఆఫీస్ వసతుల నిర్మాణం
పని ప్రదేశాలకు (Work Space) డిమాండ్ పెరుగుతోంది. ఈ విభాగంలో దేశ, విదేశీ కంపెనీల అవసరాలను తీర్చేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ప్రముఖ పట్టణాల్లో 250 లక్షల చదరపు అడుగుల (Sft) ఆఫీస్ వసతుల నిర్మాణం జరుగుతున్నట్టు రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ వెల్లడించింది. హౌసింగ్ బ్రోకరేజీ, క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలు, రిటైల్, ఇండస్ట్రియల్, వేర్‌హౌసింగ్ లీజింగ్ విభాగాల్లో సేవలు అందిస్తున్న అనరాక్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లోకి అడుగు పెట్టడం గమనార్హం.భారత ఆఫీస్ మార్కెట్‌కు 2024 ఎంతో సానుకూలంగా నిలిచిపోతుందని అనరాక్ కమర్షియల్ లీజింగ్ అండ్ అడ్వైజరీ ఎండీ పీయూష్ జైన్ తెలిపారు. రికార్డు స్థాయిలో ఆఫీస్ మార్కెట్ లీజింగ్ లావాదేవీలు నమోదైనట్టు, ఖాళీ ఆఫీస్ స్పేస్ తగ్గినట్టు చెప్పారు. 2025లోనూ ఆఫీస్ మార్కెట్లో బలమైన డిమాండ్ కొనసాగుతుందన్నారు. కరోనా తర్వాత ఆఫీస్ మార్కెట్ చాలా బలంగా కోలుకున్నట్టు పేర్కొన్నారు. గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లను (జీసీసీలు) బహుళజాతి సంస్థలు భారత్‌తో పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తుండడం, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, పుణె, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా నగారల్లో ఆఫీస్ స్పేస్‌కు గణనీయమైన డిమాండ్‌ను తీసుకొస్తున్నట్టు జైన్ వెల్లడించారు. ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ (గంటలు, రోజుల తరబడి లీజింగ్‌కు అవకాశం ఇచ్చేవి) ఆపరేటర్లు పెద్ద ఎత్తున కార్యకలాపాలను విస్తరిస్తూ, ఆఫీస్ స్పేస్‌లను లీజుకు తీసుకుంటున్నట్టు అనరాక్ నివేదిక తెలిపింది.ఈ రంగాల నుంచి డిమాండ్..ఐటీ/ఐటీఈఎస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ (బ్యాంకులు సహా), ఇంజినీరింగ్ అండ్ తయారీ రంగ కంపెనీలు ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్‌కు కీలకంగా ఉన్నట్టు అనరాక్ నివేదిక వెల్లడించింది. ‘2025 సంవత్సరంలో డిమాండ్ ఆశావహంగా ఉండనుంది. స్థిరీకరణ, విస్తరణ, హైబ్రిడ్ పని నమునా డిమాండ్‌కు మద్దతుగా నిలవనున్నాయి. గురుగ్రామ్, బెంగళూరు, పుణెలో గ్రేడ్–1 ఆఫీస్ స్పేస్ సరఫరాలో కొరత ఉంది. డెవలపర్లు ఈ అంతరాన్ని భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20–25 మిలియన్ (200–250 లక్షల ) ఎస్ఎఫ్టీ గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ నిర్మాణంలో ఉంది. సకాలంలో నిర్మాణం పూర్తి చేసే డెవలపర్లు పెరుగుతున్న డిమాండ్ అవకాశాలను సొంతం చేసుకోవడంలో ముందుంటారు’ అని జైన్ తెలిపారు. ఈ డిమాండ్ స్థిరంగా కొనసాగుతుందన్నారు. తక్కువ వ్యయాలు, నైపుణ్య మానవ వనరులు, నిర్వహణ సామర్థ్యాలు వెరసి బీఎఫ్ఎస్ఐ, హెల్త్‌కేర్, టెక్నాలజీ, ఆర్అండ్డీ పరిశ్రమల్లో జీసీసీలకు భారత్ చిరునామాగా మారుతోందన్నారు. ఇదీ చదవండి: స్వరంతో సంపద సృష్టించిన గాయనీమణులుసవాళ్లు ఇవే..ఆఫీస్ స్పేస్ మార్కెట్లో సవాళ్ల గురించి జైన్ ప్రస్తావించారు. అధిక ముడి సరుకుల ధరలు, సరఫరా సమస్యలతో నిర్మాణంలో జాప్యం నెలకొనడం ప్రధాన సవాలుగా ఉన్నట్లు చెప్పారు. ఆఫీస్ స్పేస్‌లో స్వల్పకాల లీజుకు ప్రాధాన్యం ఇస్తుండడం ఈ విభాగంలో దీర్ఘకాల ఒప్పందాలపై ప్రభావం చూపిస్తున్నట్టు తెలిపారు. -
భలేవాడివి బాసు!
ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత చాలా అవసరం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం బాగుంటేనే ప్రతిరోజూ ఆనందం ఉంటుంది. అసలే దూరాభారం ప్రయాణాలు, ట్రాఫిక్ చిక్కులు, టార్గెట్లు వంటి కారణాలతో అలిసిపోవడం సహజం.. అయితే మన రోజువారీ ఆరోగ్య పరిస్థితిని ఇలాంటి అనేక అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. అన్నింటి కన్నా మనపై ఉన్న బాస్ ప్రవర్తనను బట్టే మన మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని తాజా పరిశోధనల్లో తేలింది. మనం పనిచేసే ప్రాంతం బాగుంటే మానసిక ప్రశాంతత ఉంటుందని మానసిక నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే రోజుకు కనీసం 9 గంటల పాటు ఆఫీస్‌లోనే గడపాల్సి వస్తుంది కాబట్టి.. అక్కడి వాతావరణం బాగుంటేనే మిగతా రోజంతా సులువుగా గడిచిపోతుందని పేర్కొంటున్నారు. పై అధికారి శాడిస్టు అయితే మానసిక ఆరోగ్యంతో పాటు మన పనితనం, భవిష్యత్తు, ఇతరులతో సంబంధాలు కూడా దెబ్బతింటాయని చెబుతున్నారు నిపుణులు. దీర్ఘకాలిక ప్రభావం.. ఆఫీస్‌లో బాస్ ప్రవర్తన సరిగ్గా లేకపోతే.. అది ఉద్యోగిపై స్వల్పకాలికంగా కాకుండా దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడూ నెగెటివిటీతో బాస్ మాట్లాడుతుంటే ఉద్యోగుల సొంత తెలివితేటలపైనే అనుమానం వస్తుంటుంది. వారిని వారే తక్కువ అంచనా వేసుకోవడంతో పనితీరు కూడా మందగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చివరకు ఉద్యోగంపై విరక్తి కలిగి రాజీనామా చేసేంత వరకూ వెళ్తుందని పేర్కొంటున్నారు. మోటివేషన్ ఉండాల్సిందే.. పని చేసే ప్రదేశంతో నెగెటివ్ వాతావరణం కన్నా మోటివేషన్ ఉంటే ఉద్యోగులు క్రియాశీలకంగా పనిచేస్తుంటారని, చేసిన పనికి మెచ్చుకోలు లేకపోయినా కనీసం కించపరిచేలా మాట్లాడటం, అందరి ముందు మందలించడం వంటి పనులు చేస్తే మానసిక వేదనకు గురై.. పని తీరు మందగిస్తుందని పేర్కొంటున్నారు. పనిచేసే ప్రదేశంలో ఆరోగ్యకరమైన పోటీతత్వం, స్వతంత్రత, చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు ఉంటే ఉద్యోగులకు మోటివేషన్ వస్తుందని పేర్కొంటున్నారు. అప్పుడు పనితీరులో కూడా మెరుగుదల ఉంటుందని చెబుతున్నారు.ఎలా బయటపడాలి..?కర్కశమైన బాస్ కింద పనిచేసిన వారి మానసిక స్థితిని మళ్లీ తిరిగి పొందొచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయడం కన్నా అక్కడి నుంచి వెళ్లిపోయి వేరే ఉద్యోగం వెతుక్కోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇక, పాత ఆఫీస్ జ్ఞాపకాలను మర్చిపోయి.. ఆత్మన్యూనత భావం నుంచి బయటపడటం కాస్త కష్టమైనా కూడా సాధించొచ్చని చెబుతున్నారు. మన శక్తి సామర్థ్యాలను గుర్తు చేసుకుని, మనం గతంలో సాధించిన విజయాలను నెమరువేసుకుంటూ ఉండాలని పేర్కొంటున్నారు. మన మంచి కోరే సహోద్యోగులతో మనం చేసిన పనిపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ ఉండాలని, చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని పూర్తి చేస్తుంటే మళ్లీ మనలో కాని్ఫడెన్స్ పెరుగుతుందంటున్నారు. కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఆత్మ స్థైర్యం సాధించాలని పేర్కొంటున్నారు. ఆఫీస్‌లో మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రొఫెషనల్‌గా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.వ్యక్తిగత సంబంధాలపై ప్రభావం.. ‘ఎక్కువ కాలం ఇలాంటి వాతావరణంలో పనిచేయడంతో నేర్చుకునే తత్వం తగ్గిపోతుందని, కొత్త విషయాలు రూపకల్పన చేయడం, సృజనాత్మకత పెంచేందుకు దోహదపడే డోపమైన్ తగ్గుముఖం పట్టి.. కారి్టసాల్ స్థాయి పెరిగుతుందని ఢిల్లీకి చెందిన సైకోథెరపిస్టు డాక్టర్ చాందినీ చెబుతున్నారు. అద్భుతంగా ఎలా పని చేయాలా..? అని ఆలోచించడం మానేసి.. తన మీదికి రాకుండా ఏం చేయాలనే దానిపైనే దృష్టి సారిస్తారని ఆమె వివరించారు. ఆఫీస్ వాతావరణం చాలాకాలం పాటు సరిగ్గా లేకుంటే ఉద్యోగులకు వేరే వారితో సంబంధాలు దెబ్బతింటాయని, అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో మత్తు పదార్థాలు తీసుకునే అలవాటు చేసుకుంటారని, అలాగే శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.లీడర్షిప్ ముఖ్యం.. ఆఫీస్ వాతావరణం చెడిపోడానికి కారణాల్లో ప్రధానమైనది లీడర్షిప్ లేకపోవడం. బాస్ సరిగ్గా లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతాయని చెబుతున్నారు. బాస్‌కు నాయకత్వ లక్షణాలు లేకపోతే తాను చెప్పాలనుకున్న విషయాలు ఉద్యోగులకు వ్యక్తీకరించలేరు. దీంతో ఉద్యోగులకు ఉన్న సమస్యలు నేరుగా చెప్పుకోలేరు. పక్షపాత వైఖరి, అసాధ్యమైన టార్గెట్లు పెట్టడం కూడా వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నారు. ఒత్తిడితో పాటు ఆందోళన పెరుగుతుందని పేర్కొంటున్నారు. తద్వారా ఆఫీస్ వాతావరణం పూర్తిగా చెడిపోతుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో ఇటీవల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా ఈ అధ్యయనం ప్రాధాన్యత సంతరించుకుంది.అనేక ఆరోగ్య సమస్యలు.. పనిచేసే ప్రదేశంలో బాస్ సపోర్టు ఉంటే ఉద్యోగులు వ్యక్తిగతంగా ఎదుగుదలకు ఉపయోగపడటమే కాకుండా సంస్థ పనితీరు కూడా బాగుంటుంది. ఏం చేసినా తప్పులు వెతకడం, విమర్శలు చేస్తుండటం వల్ల ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ ఉద్యోగాన్ని వదిలి వెళ్లలేక, అక్కడే భరించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఈ పరిస్థితులను ఎవరికీ చెప్పుకోలేక నిద్రలేమి, హృద్రోగ సమస్యలు తలెత్తుతాయి. బాస్ ప్రవర్తనతో ఎలాంటి సమస్యలు వస్తున్నాయో కుదిరితే నేరుగా చెప్పి సమస్యలను పరిష్కరించుకోవాలి. నచ్చిన వారితో కాసేపు ప్రశాతంగా గడిపినా, ఫోన్లో మాట్లాడినా మనసులోని బరువు తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. – డాక్టర్ పి.హరీశ్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ -
పాఠాలు పక్కన పెట్టి పనిలో పిల్లలు
-
రోజుకు నాలుగు గంటలే పని, నెల ఆదాయం 15 లక్షలకు పై మాటే!
‘నేను రోజుకు నాలుగు గంటలే పనిచేస్తాను’ అని ఎవరైనా అంటే....‘అయితే ఏంటటా’ అనుకుంటాం. నేను రోజుకు నాలుగు గంటలే పనిచేసినా నెలకు పదిహేను లక్షలు సంపాదిస్తాను’ అని అంటే మాత్రం ‘అయ్ బాబోయ్’ అని బోలెడు ఆశ్చర్య΄ోవడమే కాదు ‘అలా ఎలా?’ అని అడుగుతాం.అమీ లాండినో (న్యూయార్క్)ను ఇప్పుడు చాలామంది ఈ ప్రశ్న అడుగుతున్నారు. ‘నేను ఉండాల్సింది ఇక్కడ కాదు. డిజిటల్ ఫీల్డ్‌లో’ అంటూ చాలా సంవత్సరాల క్రితం కాలేజీకి గుడ్‌బై చెప్పిన అమీ లాండినో మన కరెన్సీలో నెలకు పదిహేను లక్షలకు పైగా సంపాదిస్తుంది. ‘సోషల్ మీడియా’ను లాభదాయకమైన వ్యాపారక్షేత్రంగా మలుచుకోవడంలో విజయం సాధించింది. మొదట్లో వీడియోలను యూట్యూబ్‌లో షేర్ చేసేది. ఇలా చేస్తున్న క్రమంలోనే తనలోని స్కిల్స్‌ను ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకునేది.వ్యాపారులు తమకు కావలసిన వీడియోలను సొంతంగా ఎలా క్రియేట్ చేసుకోవచ్చో నేర్పే ఆన్లైన్ కోర్సును ప్రారంభించడం అమీ లాండినోకు టర్నింగ్ పాయింట్. లాండినో యూట్యూబ్ చానల్ ‘అమీ టీవి’లో తన గోల్–సెట్టింగ్ ప్రాసెస్‌తో సహా వెయ్యికి పైగా వీడియోలు ఉన్నాయి. అమీ లాండినో ‘స్టార్ యూట్యూబర్’ మాత్రమే కాదు ఎన్నో పుస్తకాలు కూడా రాసింది. (సాంగ్లీ నుంచి స్టాన్ఫోర్డ్ వరకు.. పేద ఇంటి బిడ్డ సక్సెస్ స్టోరీ) -
డ్యూటీకి.. టిక్.. టిక్..కానీ బాడీ క్లాక్ బీట్ వినండి ప్లీజ్..!
చాలామంది తమ వేతనం సరిపోకవడంతోనో లేదా ఇతరత్రా కారణాలతోనో ఒక షిఫ్ట్ పని చేయగనే... మళ్లీ వెంటనే మరో షిఫ్ట్ చేస్తుంటారు. ఇలా మధ్యలో ఎలాంటి విశ్రాంతి లేకుండా వెంటవెంటనే పనిచేసేవాళ్లలో కనిపించే సమస్యల్లో ఒకటి ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’. రాత్రీ, పగలూ తేడాలేకుండా వెంటవెంటనే పనిచేయాల్సి రావడంతో ఆ షెడ్యూల్స్కు అనుకూలంగా వారి దేహం ఇమడలేపోవడంతో వచ్చే ఈ సమస్యపై అవగాహన కోసం ఈ కథనం.వర్క్షిఫ్ట్ డిజార్డర్స్కు లోనయ్యేవారు పగటివేళ నిద్రమత్తుతో జోగుతూ ఉంటారు. వాళ్లలో నిద్రపట్టడంలో ఇబ్బంది, దృష్టికేంద్రీకరణ సమస్యలు, తలనొప్పి వంటివి కనిపిస్తాయి. దాంతో పనిప్రదేశాల్లో తప్పులు చేయడం, గాయపడటం జరగవచ్చు. తరచూ అనారోగ్యాల బారిన పడటం కూడా జరుగుతుండవచ్చు. దీర్ఘకాలిక పరిణామాలుగా రక్తంలో కొవ్వు పదార్థాల మోతాదులు పెరగడం, రొమ్ము, పురుషులు ప్రొస్టేట్ కేన్సర్ల బారిన పడటం, గుండె జబ్బుల బారిన పడటం, స్థూలకాయం రావడం వంటి రిస్క్‌లు ఉంటాయి. వర్క్ షిఫ్ట్ డిజార్డర్‌కు కారణమిదే... మన మెదడులో ఒక జీవగడియారం పనిచేస్తుంటుంది. మన తినేవేళలు, నిద్ర సమయాలు ఆ గడియారంలో ఓ అలారంలా నమోదై ఉంటాయి. దాంతో మనం ఓ క్రమబద్ధమైన రీతిలో పనులు చేస్తుంటాం. మనలో తమకు తెలియకుండానే నిర్వహిలమయ్యే ఈ క్రమబద్ధతను ‘సర్కేడియన్ రిథమ్’ అంటారు. ఈ రిథమ్ మారి΄ోవడం, ఈ లయ దెబ్బతినడం (సర్కేడియమ్ ఆల్టరింగ్ సిగ్నల్స్) వల్ల వచ్చే సమస్యలో ముఖ్యమైనది ‘వర్క్ షిఫ్ట్ డిజార్డర్’. లక్షణాలు... సాధారణంగా షిఫ్ట్‌లలో పనిచేసేవారు రోజుకు సగటున నాలుగు గంటల కంటే తక్కువగా నిద్ర΄ోతుంటారు. నిద్ర నాణ్యత కూడా తగ్గుతుంది. దాంతో కొద్దిపనికే అలసిపోతుంటారు. ఇలా పనిచేసేవాళ్లలో కొందరు ఏడెనిమిది గంటలపాటు నిద్ర΄ోయినప్పటికీ వాళ్లకూ ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’ రావచ్చు. బాధితుల్లో ఈ ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’ కారణంగా... తరచూ ఆపుకోలేని కోపం రావడం, త్వరత్వరగా భావోద్వేగాలకు గురికావడం (మూడ్ స్వింగ్స్), తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ వంటివి కనిపిస్తుంటాయి. నిర్ధారణరాత్రివేళల్లో నిద్రలేమి అలాగే పగటిపూట నిద్ర ముంచుకొస్తుండటం. పని ప్రదేశంలో మాటిమాటికీ నిద్ర వస్తుండటం. పైన పేర్కొన్న లక్షణం షిఫ్టుల్లో పనిచేస్తున్నప్పుడు కనీసం నెల రోజుల పాటు కనిపించడం. నిద్ర ఎంత పడుతుందన్నది తెలుసుకోవడం కోసం ఉపయోగపడే పరికరం ఆక్టిగ్రఫీ సహాయంతో ఏడురోజుల పాటు పరిశీలించినప్పుడు సర్కేడియన్ రిథమ్, స్లీప్ – టైమ్ గ్రాఫ్‌తో సరిగా సరిపోలకపోవచ్చు.నివారణ/చికిత్స..ఈ సమస్య నివారణ కోసం పనిచేసే సమయంలో కెఫిన్ మోతాదు ఎక్కువగా ఉండే కాఫీ, కెఫినేటెడ్ డ్రింక్స్ వంటివి తక్కువగా తీసుకోవడంతోపాటు ఈ కింది అంశాలను బాధితులకు చికిత్సలో భాగంగా సూచిస్తారు, ఇక చికిత్సలో భాగంగా అందించే ప్రక్రియ అయిన బ్రైట్ లైట్ థెరపీలో బాగా తీక్షణమైన వెలుతురులో 3 – 6 గంటల పాటు ఉంచడం షిఫ్ట్ మొదలవడానికి ముందర కొద్దిసేపు కునుకు పట్టేలా చేయడం. (షార్ట్ షెడ్యూల్డ్ న్యాప్స్ (ప్రీ–షిఫ్ట్) ఇంటికి బయల్దేరే సమయంలో అది సాయంత్రమైనప్పటికీ నల్లటి గాగుల్స్ ధరించేలా చూడటం ఇంటి దగ్గర నిద్ర సమయంలో పూర్తిగా దట్టమైన చీకట్లో నిద్రపోయేలా చేయడం. ఆ టైమ్‌లో పరిసరాలు నిశ్శబ్దంగా ఉండేలా చూడటం సూర్యోదయం పూట వెలుగు వస్తున్నప్పుడు నిద్రపట్టడానికి మెలటోనిన్ మందులతో స్లీప్ మాడిఫికేషన్ థెరపీ ఇవ్వడం బాధితులు ఇంటికి వెళ్లగానే నిద్రకు ఉపక్రమించేలా సూచనలు ఇవ్వడం. కిషన్ శ్రీకాంత్, కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్ (చదవండి: అది మీ తప్పు కాదు, మనసుకూ జబ్బులొస్తాయ్!) -
నిపుణులమైనా నేర్చుకుంటాం..
వృత్తిలో ఎంత అనుభవం సంపాదించినా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోకుంటే వెనుకబడిపోతాం. రోజువారీ విధుల్లో నెగ్గుకురాలేం. ఈ ఆవశ్యకతను హైదరాబాద్‌లో ప్రొఫెషనల్స్ గుర్తించారు. పనిలో ముందుకెళ్లేందుకు తోడ్పాటు కోసం అన్వేషిస్తున్నారు.ప్రొఫెషనల్ నెట్వర్క్ అయిన లింక్డ్ఇన్ కొత్త పరిశోధన ప్రకారం, మునుపెన్నడూ లేని విధంగా హైదరాబాద్‌లో 93 శాతం మంది ప్రొఫెషనల్స్ తమ వృత్తిలో ముందుకెళ్లేందుకు మరింత మార్గదర్శకత్వం, తోడ్పాటు కోసం చూస్తున్నారు. కొత్త కొత్త మార్పుల నేపథ్యంలో ఉద్యోగులకు తమ విధుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను మిలితం చేసుకునే అవకాశం ఉంది. దీంతో 63 శాతం మంది తమ కెరీర్లో ముందుకు సాగడం కోసం ఏఐపై ఆధారపడటం సౌకర్యంగా ఉంటుందని నమ్ముతున్నారు.ఫలితంగా ఏఐ ఆప్టిట్యూడ్‌తో కూడిన లింక్డ్ఇన్ లెర్నింగ్ కోర్సుల వినియోగం గత సంవత్సరంలో నాన్-టెక్నికల్ ప్రొఫెషనల్స్‌లో 117 శాతం పెరిగింది. అనుభవం ఒక్కటే సరిపోదని నిపుణులు గుర్తిస్తున్నారు. నగరంలోని 69 శాతం మంది ప్రొఫెషనల్స్ నిరంతరం నేర్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు. 41 శాతం మంది కెరీర్ వృద్ధికి నైపుణ్యం అవసరమని నమ్ముతున్నారు. వర్క్ ప్లేస్ మార్పును ఎదుర్కొంనేందుకు 60 శాతం మంది అవసరమైన నైపుణ్యాలపై మార్గదర్శకత్వం కోసం వెతుకుతున్నారు.ఇదీ చదవండి: వచ్చే ఏడాది ఎవరి జీతాలు పెరుగుతాయి?చాలా మంది సాంకేతిక పురోగతి (51 శాతం), సెక్టార్-నిర్దిష్ట మార్కెట్ విశ్లేషణ (42 శాతం), సామాజిక పోకడలు (34 శాతం) గురించి తెలుసుకొని భవిష్యత్తు అవకాశాల కోసం సిద్ధంగా ఉన్నారు. విషయ పరిజ్ఞానం కోసం హైదరాబాద్‌లోని 46 శాతం మంది నిపుణులు షార్ట్-ఫామ్ వీడియోలను ఆశ్రయిస్తున్నారు. 45 శాతం మంది నిర్దిష్ట నైపుణ్యాలను అందించే లాంగ్-ఫామ్ వీడియో కోర్సులను అత్యంత సహాయకరంగా భావిస్తున్నారు. -
కళ‘నైనా’ కనని, కాలం చెల్లని : సహనం నుంచి సంకల్పబలం వరకు!
కొన్ని దశాబ్దాల క్రితం...నైనా దలాల్ వేసిన చిత్రాలు ఆనాటి కళాభిమానులకు షాకింగ్‌గా అనిపించాయి. ఆమె చిత్రాలు కాలం కంటే చా...లా ముందు ఉండడమే దీనికి కారణం.లండన్‌లో వెస్ట్రన్ ఆర్ట్‌ను అధ్యయనం చేసిన తొలి భారతీయ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన తొంభై సంవత్సరాల నైనా దలాల్ సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ న్యూ దిల్లీలోని ట్రావెన్ కోర్ హౌస్‌లో జరుగుతోంది. సాధారణ ప్రజల కథలను చెప్పడమే లక్ష్యంగా నైనా దలాల్ కుంచె సామాన్యుల జీవితాల్లోకి వెళ్లింది. ఆమె చిత్రాలలో నాస్టాల్జీయా తొంగి చూస్తుంది. View this post on Instagram A post shared by Galleriesplash (@galleriesplash) ‘నైనా దలాల్ ఆర్ట్ వర్క్‌ను చాలా తక్కువ మంది అర్థం చేసుకున్నారు’ అంటారు కొద్దిమంది విశ్లేషకులు. కామన్వెల్త్ స్కాలర్షిప్ అందుకొని లండన్‌కు వెళ్లింది దలాల్. లండన్‌లో వెస్ట్రన్ ఆర్ట్‌ను అధ్యయనం చేసిన మొదటి భారతీయ ఆర్టిస్ట్‌గా తన ప్రత్యేకత చాటుకుంది. నైనా దలాల్ ప్రింట్ మేకింగ్ కోర్సులో చేరినప్పుడు చాలామంది ఆశ్చర్య΄ోయారు. ఎందుకంటే ప్రింట్ మేకింగ్ అనేది పురుషాధిక్య మాధ్యమంగా గుర్తింపు పొందింది. భారీ యంత్రాలతో పనిచేయాల్సి వచ్చేది. అయితే నైనా దలాల్ అసాధారణ ప్రతిభ ముందు అపోహలు నిలబడలేక పోయాయి. ఫెమినిజంకు సంబం«ధించి ఫస్ట్ వేవ్ బలాన్ని సంతరించుకుంటున్న కాలంలో, మన దేశంలోని మహిళా కళాకారులు ఫెమినిస్ట్ భావాలతో స్ఫూర్తి ΄÷ందుతున్న కాలంలో ఆమె తన కుంచెను బలమైన మాధ్యమంగా ఉపయోగించింది. మాతృత్వం నుంచి ఒంటరితనం వరకు తన చిత్రరచనకు నైనా ఎన్నో ఇతివృత్తాలు ఎంచుకుంది.బెంచీలు, బూట్లు, రాళ్లు, గోడలు, కొండలలాంటి నిర్జీవమైన వాటి నుంచి జంతువులు, పక్షుల వరకు ఆ చిత్రాలలో కనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ వాటితో తమ జ్ఞాపకాలను పంచుకునేలా చేస్తాయి. ఆ జ్ఞాపకాలు ఒక వ్యక్తికి మరో వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. నైనా దలాల్‌ను ఇతర ప్రముఖ భారతీయ మహిళా కళాకారుల నుండి వేరు చేసిన అంశం ప్రింట్ మేకింగ్‌తో చేసిన లిథోగ్రాఫ్, కొలాగ్రాఫ్లు. 1960లో నైనా దలాల్ లండన్‌కు మకాం మార్చింది. ఇండియాలో ఉన్నప్పుడు స్పాన్సర్ షోల కంటే సొంత ఆర్ట్ షోలే ఎక్కువ చేసింది. ‘నైనా దలాల్ వివిధ మాధ్యమాల్లో వందలాది చిత్రాలను సృష్టించింది. ఈ ప్రదర్శన ఒక మినీ–రెట్రోస్పెక్టివ్ లాంటిది’ అంటున్నారునైనా దలాల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు.మహిళల గురించిన నా ఆలోచనలు కాలంతోపాటు మారుతూ వచ్చాయి. అవి నా చిత్రాల్లో ప్రతిఫలిస్తాయి. మహిళల్లో ఉండే సహనం నుంచి సంకల్పబలం వరకు ఎన్నో వెలుగులు నా చిత్రాల్లో కనిపిస్తాయి. నా కళలో కాల్పనిక విషయాలు కనిపించవు. నా చుట్టూ కనిపించే సాధారణ ప్రజల జీవితాలే కనిపిస్తాయి. శ్రామిక జీవుల గురించి చదివినప్పుడు, విన్నప్పుడు వారికి సంబంధించిన ఆలోచనలు నా మనసులో సుడులు తిరుగుతుంటాయి. ఆ అలజడిని నా చిత్రాల్లోకి తీసుకువస్తుంటాను. నా కళ వారికి గొంతు ఇస్తుందని అనుకుంటున్నాను.– నైనా దలాల్ -
ఉద్యోగి అంత్యక్రియలకు వెళ్లని యాజమాన్యం.. కంపెనీపై తీవ్ర విమర్శలు
పూణేకి చెందిన ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’(ఈవై) కంపెనీలో పనిచేస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ (26) అన్నా సెబాస్టియన్ పెరియాలి మృతి సర్వత్రా చర్చనీయాంశమైంది. మరణం తర్వాత ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సంస్థ తరుపున ఒక్క ప్రతినిధి కూడా పాల్గొనకపోవడం, రేయింబవళ్లు పని భారం మోపడం వల్లే తన కుమార్తె మరణించిందని బాధితురాలి తల్లి ఆరోపిస్తోంది.ఇది మన సంస్కృతికి పూర్తి విరుద్ధంఅయితే అన్నా మరణంపై నెటిజన్లు ఈవై సంస్థ ఛైర్మన్ రాజీవ్ మెమానీ స్పందించారు. తన ఉద్యోగి అంత్యక్రియలకు హాజరు కాకపోవడంపై లింక్డిన్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. అన్నా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి జీవితంలో అన్నా లేని వెలితిని ఎవరూ తీర్చలేరు. ఆమె అంత్యక్రియలకు మేము హాజరు కాలేకపోయినందుకు చింతిస్తున్నాను. ఇది మన సంస్కృతికి పూర్తి విరుద్ధం. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు.. ఇంకెప్పుడూ జరగదు’అని అన్నారు. ఈ సందర్భంగా సామరస్య పూర్వకమైన ఆఫీస్ వాతావరణాన్ని ఉద్యోగులకు అందించేందుకు తాను కట్టుబడి ఉన్నానని, లక్ష్యం నెరవేరే వరకు విశ్రమించబోనని ఉద్ఘాటించారు.ఇదీ చదవండి : 100 రోజుల్లో సూపర్ సిక్సూ లేదు.. సెవెనూ లేదు : వైఎస్ జగన్సంస్థ తీరు దారుణంఈ ఏడాది మార్చిలో ఈవైలో చేరిన అన్నా సెబాస్టియన్ పెరియాలి మరణించారు. పని ఒత్తిడి కారణంగా తన కుమార్తె మరణించినట్లు తల్లి అనితా అగస్టిన్ కంపెనీకి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో తన కుమార్తె అంత్యక్రియలకు కంపెనీ నుంచి ఎవరూ హాజరు కాలేదని అగస్టిన్ పేర్కొన్నారు. ఆమె అంత్యక్రియల తర్వాత, నేను ఆమె నిర్వాహకులను సంప్రదించాను. కానీ నాకు యాజమాన్యం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. విలువలు,మానవ హక్కుల గురించి మాట్లాడే ఒక సంస్థ ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియల్లో పాల్గొనకపోవడం దారుణమని అన్నారు. పని ఒత్తిడి ఆరోపణల్ని ఖండించిన మెమోనీకాగా, ఈవైలో పని ఒత్తిడి కారణంగా అన్నా మరణించిందనే తల్లి చేసిన ఆరోపణలపై రాజీవ్ మెమానీ ఖండించారు. దీంతో మెమానీపై ఈవై మాజీ ఉద్యోగులు విమర్శలు గుప్పిస్తున్నారు. మోయలేని పని భారం కారణంగా ఆ సంస్థ నుంచి బయటకు వచ్చినట్లు కామెంట్లు చేయగా.. లింక్డిన్ పోస్ట్‌లో మెమానీ మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. రంగంలోకి కేంద్రంఈ అంశంపై దేశ వ్యాప్తంగా ఉద్యోగులపై సంస్థల కఠిన వైఖరితో పాటు పనిభారం వంటి అంశాలు చర్చకు దారి తీస్తున్నాయి. ఈ తరుణంలో అన్నా సెబాస్టియన్ పెరియాలి మరణంపై కేంద్రం స్పందించింది. పని వాతావరణంలో అసురక్షిత, శ్రమ దోపిడీకి గురవుతున్నారనే ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. -
ఆఫీస్ వైఫ్, ఆఫీస్ హజ్బండ్
ఆఫీస్ వైఫ్, ఆఫీస్ హజ్బండ్.. ఈ శీర్షిక చూడగానే మీరు ఆశ్చర్యపోతుండవచ్చు. కానీ ఇలాంటిదొకటి ఉందని నాకు 15 ఏళ్ల కిందటే తెలుసు. సమాజంలో వస్తున్న కొత్త ట్రెండ్ లను ఎప్పటికప్పడు తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం సైకాలజిస్టుగా నాకు అవసరం. అలా దాని గురించి తెలుసుకున్నా. ఆ మధ్య కాలంలో అలాంటి కేస్ ఒకటి నా దగ్గరకు వచ్చింది. దాని గురించే ఈరోజు మీతో పంచుకుంటా.అసలేంటీ కాన్సెప్ట్? ఆఫీస్ వైఫ్/ఆఫీస్ హజ్బండ్ అనే పదాలు ఒకరి వర్క్ లైఫ్ లో ముఖ్యమైన సహాయక పాత్ర పోషించే కొలీగ్ గురించి చెప్పేవి. లైఫ్ పార్టనర్ కు సమానమైన ఎమోహనల్ సపోర్ట్, గైడెన్స్, కంపాయిన్షిప్ అందించే వ్యక్తిని ఆఫీస్ స్పౌజ్ అంటారు. వారిద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్, కొలాబరేషన్ ఉంటుంది. ఇతర కొలీగ్స్ తో పంచుకోని, పంచుకోలేని వృత్తిగత, వ్యక్తిగత విషయాలు వారితో పంచుకుంటారు. వారి బంధం అంతవరకే పరిమితం, ఎలాంటి లైంగిక సంబంధం ఉండదు.ఎమోషనల్ డిపెండెన్సీ...హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ కార్పొరేషన్లో సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ గా పని చేస్తున్న ప్రియా శర్మ తన సహోద్యోగి రాజీవ్ పటేల్ ఐదేళ్లుగా కలిసి పనిచేస్తున్నారు. చాలా ప్రాజెక్టులు పూర్తి చేయడంలో రాజీవ్ ఆమెకు తన సహకారం అందించాడు. అలా వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇరువురి అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు, బాధ్యతలు, బాధలు పంచుకునేవారు.ఒత్తిడి సమయాల్లో ప్రియకు రాజీవ్ ఎమోషనల్ సపోర్ట్ అందించగా, రాజీవ్ కు కష్ట సమయాల్లో ప్రియ భరోసాగా నిలిచింది. అలా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది వృత్తిపరమైన సరిహద్దు రేఖలను చెరిపేయడం ప్రారంభించింది. తరచుగా తమ వ్యక్తిగత వివరాలను పంచుకునేవారు. ఆఫీస్ తో పాటు బయట కూడా తరచూ కలుసుకునేవారు.రాజీవ్ పై ఆమె ఎమోషనల్ గా బాగా ఆధారపడింది. ఎప్పుడు ఒత్తిడి, ఆందోళన అనిపించినా అతనితో మాట్లాడి రిలాక్స్ అయ్యేది. అతను అందుబాటులో లేనప్పుడు అభద్రతకు, ఆందోళనకు లోనయ్యేది. అతను లేకుంటే సరిగా పనిచేయలేకపోయేది.పుకార్లు షికారు... ఇవన్నీ కలిసి ఆఫీసులో వారిద్దరి రిలేషన్ షిప్ పై అనుమానాలకు కారణమయ్యాయి. టీమ్ లో కూడా సమస్యలు మొదలయ్యాయి. తామెంత పనిచేసినా రాజీవ్ ప్రియనే సపోర్ట్ చేస్తాడని, తమకు అన్యాయం చేస్తాడని మిగతావాళ్లు భావిస్తున్నారు. వారిని ‘ఆఫీస్ వైఫ్, ఆఫీస్ హజ్బండ్’ అని అనుకోవడం మొదలుపెట్టారు.ఈ మాటలు ప్రియ వరకు వచ్చేసరికి తల్లడిల్లిపోయింది. ఫ్రెండ్లీగా ఉన్నంతమాత్రాన ఇలా మాట్లాడతారా.. అని బాధపడుతోంది. ఇదంతా ఆమె కుటుంబ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె కౌన్సెలింగ్ కోసం వచ్చింది.ఇలాంటి సమస్య మీకూ ఎదురై ఉండవచ్చు. మీరు క్లోజ్ గా ఉన్న ఫ్రెండ్ తో సంబంధం అంటగట్టేవాళ్లు మీ పక్కనే ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో వచ్చే ఎమోషనల్ తుఫాన్ ను కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం. అలాంటి సందర్భాల్లో ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం అవసరం. అలానే ప్రియ కౌన్సెలింగ్ కోసం వచ్చింది.మూడు నెలల థెరపీ...ప్రియాశర్మ తన సమస్య గురించి వివరించాక సైకోడయాగ్నస్టిక్స్ ద్వారా ఆమె తీవ్రమైన డిప్రెషన్, యాంగ్జయిటీకి లోనవుతున్నట్లు నిర్ధారణైంది. దీంతో ఆమెకు సైకోథెరపీ ప్రారంభించాను. ఈ థెరపీ లక్ష్యం ప్రియ, రాజీవ్ మద్య ప్రొఫెషనల్ బౌండరీస్ ను తిరిగి ఏర్పాటు చేయడం, అతనిపై ఎమోషనల్ డిపెండెన్సీని తగ్గించి, స్వంత కోపింగ్ మెకానిజమ్ లను మెరుగుపరచడం, వర్క్ ప్లేస్ డైనమిక్స్ ను మెరుగుపరచడం. వారానికో సెషన్ చొప్పున మూడు నెలలపాటు రోల్-ప్లేయింగ్ బౌండరీస్, కాగ్నిటివ్ బిహేవియరల్ టెక్నిక్స్, ఎమోషనల్ రెగ్యులేషన్, వర్క్ ప్లేస్ డైనమిక్స్ ను మెరుగుపరిచేందుకు కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ తదితర టెక్నిక్స్ ద్వారా ఆమె మామూలు మనిషి కాగలిగింది. రాజీవ్ తో ఫ్రెండ్లీగా ఉంటూనే తన సైకలాజికల్ వెల్ బీయింగ్ ను కాపాడుకోగలిగింది.ముందిలా చేయండి.. అంటే ఏంటి సర్, ఇప్పుడే సమస్య వచ్చినా మీ దగ్గరకు రావాలంటారా? అని మీరు అనుకోవచ్చు. అలా నేనెప్పుడూ చెప్పను. ఎవరైనా సరే మొదట తన సమస్యను తానే పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు, చేయాలి కూడా. అలా చేసినా ఫలితం లేనప్పుడే ప్రొఫెషనల్ సహాయం తీసుకోవాలి. మీకోసం కొన్ని సెల్ఫ్ హెల్ప్ టిప్స్...1.సహోద్యోగులతో మీ సరిహద్దులను స్పష్టంగా నిర్దేశించుకోండి. ఆఫీస్ టైంలో పర్సనల్ ఇష్యూస్ చర్చించవద్దు. ఆ తర్వాత కమ్యూనికేషన్ ను పరిమితం చేయండి. 2. రోజూ డైరీ రాయడం మీ ఆలోచనలను, చర్యలను గమనించడానికి, అవి మీ ప్రొఫెషనల్ బౌండరీస్ కు అనుగుణంగా ఉన్నాయో లేవో అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. 3. మీ కొలీగ్ పై ఆధారపడేలా చేసే ట్రిగ్గర్ లను గుర్తించి, వాటిని మేనేజ్ చేసుకునేందుకు ప్రయత్నించాలి. 4.మిమ్మల్ని మానసికంగా సంతృప్తి పరిచే హాబీల్లో కొంత సమయం గడపండి. ఇది ఇతరులపై ఎమోషనల్ గా ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. 5. ఏ ఒక్కరికో పరిమితం కాకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులు లతో సపోర్ట్ నెట్‌వర్క్‌ను రూపొందించండి, 6. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించుకోండి.7. ఒత్తిడిని మేనేజ్ చేసేందుకు మైండ్ ఫుల్ బ్రీతింగ్, మైండ్ ఫుల్ నెస్, మెడిటేషన్ లను రోజూ ప్రాక్టీస్ చేయండి.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.comConnections corner -
పని చెప్పకుండా జీతం ఇస్తోంది.. కంపెనీపై కేసు పెట్టిన మహిళ
ఆఫీసులో ఏదైనా పని చెబితే తప్పుంచుకోవాలని చూసే ఉద్యోగులు ప్రతి సంస్థలోనూ కొంత మంది ఉంటారు. పని చెప్పకుండా జీతం ఇస్తే చాలా బాగుంటుందని చాలామంది అనుకుంటారు. కానీ పని చేయకుండా 20 సంవత్సరాలుగా జీతం ఇస్తున్న కంపెనీ మీదే ఓ మహిళ కేసు వేసింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? వివరాలు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.ఫ్రాన్స్‌కు చెందిన లారెన్స్ వాన్ వాసెన్‌హోవ్ అనే మహిళకు తమ కంపెనీ ఎలాంటి పని చెప్పలేదని, అయితే ప్రతి నెలా జీతం మాత్రం ఇచ్చేస్తున్నారని.. సంస్థ మీద దావా వేసింది. 1993లో వాసెన్‌హోవ్‌ను ఫ్రాన్స్ టెలికాం నియమించుకుంది. ఆ తరువాత ఈ కంపెనీని ఆరెంజ్ సంస్థ టేకోవర్ చేసింది.ఆరెంజ్ కంపెనీ టేకోవర్ చేసిన తరువాత వాసెన్‌హోవ్‌కు ఒక వైపు పక్షవాతం, మూర్ఛతో బాధపడుతున్నట్లు తెలుసుకుంది. ఈ కారణంగానే ఆమెకు నచ్చిన ఆఫర్ ఎంచుకోమన్నారు. ఆ సమయంలో ఆమె ఫ్రాన్స్‌లోని మరొక ప్రాంతానికి బదిలీని అభ్యర్థించింది. కానీ తనకు తగిన వర్క్‌ప్లేస్‌ను కంపెనీ ఎంపిక చేయలేకపోయింది. దీంతో ఆమె కోరికను కంపెనీ తీర్చలేకపోయింది.ఫ్రాన్స్‌లోని మరొక ప్రాంతానికి బదిలీ చేయడానికి కంపెనీ సాహసం చేయలేదు, దీంతో ఆమెకు ఎలాంటి పని అప్పగించేలేదు. పని అప్పగించకపోయినా.. జీతం మాత్రం ప్రతి నెల అందించేవారు. ఇలా దాదాపు 20 ఏళ్లుగా తనకు కంపెనీ జీతం ఇస్తున్నట్లు వాసెన్‌హోవ్ పేర్కొన్నారు.ఏ పని చేయకుండా జీతం పొందడం అనేది చాలా మందికి కల కావొచ్చు. కానీ వాసెన్‌హోవ్‌కు ఇది నచ్చలేదు. దీంతో ఈమె 2015లో తనపై వివక్ష చూపుతున్నారని ప్రభుత్వానికి & అథారిటీకి ఫిర్యాదు చేసింది. పని చేయకపోవడం ఒక ప్రత్యేక హక్కు కాదు అని ఆమె వాదించింది.వాసెన్‌హోవ్ తరపున న్యాయవాది డేవిడ్ నాబెట్-మార్టిన్ కూడా ఒంటరిగా ఉండటం వల్ల ఆమె డిప్రెషన్‌కు లోనయ్యిందని పేర్కొన్నారు. అయితే కంపెనీ ఈమెకు అన్ని పరిస్థితుల్లోనూ అండగా ఉందని, ఆమెకు ఆరోగ్యం కుదుటపడితే అడాప్టెడ్ పొజిషన్లో మళ్ళీ విధులు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. -
మీ బ్రెయిన్ ఆక్టివ్‌గా ఉండాలంటే.. ఇలా చేయండి!
శరీరంలో ముఖ్యమైన భాగాల్లో మెదడు ఒకటి. మెదడు ఆదేశాల ప్రకారమే శరీరంలోని అన్ని భాగాలు పనిచేస్తాయి. మెదడు సరిగ్గా పని చేయకపోతే... మనిషి ఏ పనీ సరిగ్గా చేయలేడు. అలాంటి మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే.. మనం కొన్ని చెయ్యాలి... మరికొన్నింటిని తినాలి... అవేంటో చూద్దాం...దేనినైనా సరే, సరిగ్గా పని చేయిస్తేనే అది సక్రమంగా పని చేస్తుంది. ఎన్ని వేలు పోసి కొన్న యంత్రాన్నైనా సరే, దానితో పని చేస్తేనే కదా అది సరిగ్గా పనిచేసేదీ లేనిదీ తెలిసేది! అందువల్ల మెదడు సరిగ్గా పని చేయాలంటే దానికి ఎప్పుడూ తగిన పని చెబుతూనే ఉండాలి. అదేవిధంగా మెదడు చురుగ్గా పని చేయాలంటే కొన్ని రకాలైన ఆహార పదార్థాలను తీసుకోవాలి.ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్: మెదడు సరిగ్గా పని చేయాలంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం అవసరం. ఎందుకంటే ఈ ఫ్యాటీ యాసిడ్స్ మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్ ను ప్రోత్సహిస్తాయి. తృణ ధాన్యాలు కూడా మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.యాంటీ ఆక్సిడెంట్లు: ఇవి కూడా మెదడు కణాలను ఒత్తిడి, వాపు నుంచి రక్షించడంలో సహకరిస్తాయి. విటమిన్ బి12 లోపిస్తే నరాల బలహీనతకు దారితీయవచ్చు. కాబట్టి మీ డైట్లో విటమిన్ బి12 ఉండేలా చూసుకోండి.అదే విధంగా అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. ఫలితంగా జ్ఞాపకశక్తి తగ్గి మతి మరపు పెరుగుతుంది. కాబట్టి షుగర్ తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. అదేవిధంగా హైడ్రేట్‌గా ఉండటం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది.అరోమా: కొన్ని రకాల మూలికలు, సుగంధ ద్రవ్యాలు మెదడు కణాలను పరిరక్షించే సమ్మేళనాలను కలిగి ఉంటాయి, ఇవి ఐక్యూని మెరుగుపరుస్తాయి. కాబట్టి మీ ఆహారంలో పసుపు, దాల్చిన చెక్క, రోజ్ మేరీ వంటివి ఉండేలా చూసుకోండి.ఇవిగాక మెదడును చురుగ్గా ఉంచేలా పదవినోదాలు, పదవిన్యాసాలు పూర్తి చేయడం, సుడోకు వంటివి ఆడటం, క్యారమ్స్, చదరంగం వంటి ఇన్డోర్ గేమ్స్ ఆడటం, రోజూ కొన్ని పదాలను గుర్తు పెట్టుకోవాలనే నియమాన్ని పెట్టుకుని దానిని సరిగ్గా అనుసరించడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది.ఇవి చదవండి: Shipra Singhania: సిమెంట్ వాడకుండా.. గోరువెచ్చని ఇల్లు! -
ఉద్యోగం దొరికితే చాలు అనే యువతరం కాదు..అంతకుమించి..!
కొత్త రంగాలు ఉనికిలోకి రావడం వల్ల ‘ఉద్యోగమే సర్వస్వం’ ‘ఉద్యోగం దొరికితే చాలు’ అనుకోవడం లేదు యువతరంలో చాలామంది. దీనికి కారణం...ప్రత్యామ్నాయ అవకాశాలు. ‘ఉద్యోగం ఎందుకు చేయాలి?’ నుంచి ‘చేస్తే ఎలాంటి ఉద్యోగం చేయాలి’ వరకు కెరీర్ బాట పట్టడానికి ముందు రకరకాల కోణాలలో ఆలోచిస్తున్నారు. మంచి వేతనం కంటే మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. 44 దేశాల్లో మిలీనియల్స్, జెన్ జెడ్‌పై సర్వే చేసింది డెలాయిట్. దీని ప్రకారం ప్రైమరీ జాబ్ తోపాటు మరో జాబ్ చేస్తున్న యువ ఉద్యోగుల సంఖ్య తక్కువేమీ కాదు. బెంగళూరులో ఒక ప్రైవేట్ కాలేజీలో పని చేస్తున్న పరిమళ ఆన్లైన్లో వ్యాపారం కూడా చేస్తుంటుంది.‘డబ్బు కోసం కాదు. అదొక ఫ్యాషన్’ అంటుంది తన ఆన్లైన్ వ్యాపారం గురించి. లింక్డ్ ఇన్ సర్వే ప్రకారం 2023లో మన దేశంలో 88 శాతం మంది జెన్ జెడ్ ఉద్యోగులు ‘ఉద్యోగ మార్పు’నకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. జెన్ జెడ్ ఉద్యోగులపై ఆర్పీజీ గ్రూప్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం పదిమందిలో ఆరుగురు మంచి వేతనం కంటే మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చారు.‘పని ఒత్తిడి చచ్చినట్లు భరించాల్సిందే’ అని రాజీపడడం కంటే ‘జీతం తక్కువ అయినా సరే నాకు నచ్చిన ఉద్యోగం చేస్తాను’ అని ఆలోచిస్తున్న వారి సంఖ్య యువతరంలో ఎక్కువగానే ఉంది. ముంబైలోని ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేసిన అనన్యకు పనిభారంతో ఊపిరాడేది కాదు. ఒక ఫైన్ మార్నింగ్ ‘ఇది కాదు జీవితం’ అనిపించింది. తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తోంది. ‘నేను పని చేస్తున్న కంపెనీతో పోల్చితే ఇది చాలా చిన్న ఉద్యోగం కావచ్చు. కాని ఎంతో సంతోషంగా ఉంది’ అంటుంది అనన్య. ఒక మార్కెటింగ్ సంస్థలో ఉద్యోగం చేసిన ఇరవై సంవత్సరాల సారా బోహ్ర ఆ ఉద్యోగం మానేసి సొంతంగా మార్కెటింగ్ ఫర్మ్ మొదలుపెట్టింది. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యత ఇస్తోంది. ‘ఇప్పుడు చాలా సౌకర్యంగా ఫీలవుతున్నాను. పని ప్రకారం కాదు గంటల ఆధారంగా ప్రొడక్టివిటీని కంపెనీలు అంచనా వేస్తున్నాయి’ అంటుంది సారాతీయని పాఠాలు..రాజస్థాన్‌లోని వనస్థలి యూనివవర్శిటీలో బీబీఏ డిగ్రీ పూర్తి చేసిన అనువ కక్కర్ ఉద్యోగం కంటే సొంత స్టార్టప్‌కే ్ర΄ాధాన్యత ఇచ్చింది. అయితే కస్టమైజ్డ్ పోస్టర్ కార్డ్‌లకు సంబంధించి ఆన్లైన్ బిజినెస్‌లో ఫెయిల్ అయింది. అయితే ఈ ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకున్న అనువ ‘టిగెల్’ చాకోలెట్ బ్రాండ్‌తో సక్సెస్ అయింది. హాట్ చాక్లెట్+వింటర్= హ్యాపీనెస్ నినాదంతో చిన్న బడ్జెట్లో కంపెనీ మొదలు పెట్టింది. కస్టమర్ చాయిస్‌లను అర్థం చేసుకోవడంలో పట్టు సాధించింది. ‘టిగెల్’ స్టార్ట్ చేసినప్పుడు అనువ వయసు 21 సంవత్సరాలు. ‘చిన్న వయసులో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రస్థానం మొదలు పెట్టడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది’ అంటుంది అనువ కక్కర్. బెస్ట్ ప్లాన్ బెడిసి కొడితే?‘ఈ రంగంలో మాత్రమే పనిచేస్తాను అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏ రంగంలో పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. యాంత్రిక జీవితం కంటే ఉల్లాసకరమైన మార్పు చాలామంచిది’ అంటుంది చెన్నైకి చెందిన శ్రీతేజ. కోల్‌కత్తాకు చెందిన 23 సంవత్సరాల మనీష తన ఉద్యోగానికి సంబంధించి ఇప్పటికీ మూడు రంగాలు మారింది. అలా అని ఆమెలో పశ్చాత్తాపం ఏమీ లేదు. ‘ఏ రంగంలో అయినా పనిచేయగలను అనే నమ్మకం వచ్చింది’ అంటుంది మనీష. వర్క్ నుంచి గ్యాప్ తీసుకోవాలనుకునే యువతరం కోసం ఈమధ్య కాలంలో ఎన్నో ‘గ్యాప్ ఇయర్ కమ్యూనిటీస్’ వచ్చాయి. ‘గ్యాప్ఎక్స్’ పేరుతో హరియాణాలోని అశోకా యూనివర్శిటీలో 40 మంది స్టూడెంట్స్‌తో కూడిన గ్రూప్ ఉంది.‘యువతలో చాలామంది కెరీర్ మార్గాన్ని నిర్ణయించుకునే ముందు వివిధ అవకాశాల గురించి అన్వేషిస్తున్నారు. ఆలోచిస్తున్నారు’ అంటున్నాడు దిల్లీ యూనివర్శిటీ మాజీ వైస్ చాన్సలర్ దినేష్ సింగ్. చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి నచ్చిన ఉద్యోగం చేయడం, సొంతంగా కంపెనీ మొదలుపెట్టడం, ఉద్యోగ విరామం తీసుకొని ఆన్లైన్ కోర్సులలో చేరడం వరకు తమదైన దారిలో ప్రయాణం చేస్తోంది నవతరం.(చదవండి: సడెన్‌గా మిస్ యూఎస్ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మోడల్!కారణం ఇదే..) -
Lok Sabha Election 2024: ఎన్నికల ఉపాధి... 9 లక్షల మందికి!
లోక్‌సభ ఎన్నికలు ఎంతోమంది ఆకలి బాధ తీరుస్తున్నాయి. తాత్కాలికంగానైనా ఉపాధి కల్పిస్తున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 దాకా ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండడం తెలిసిందే. ఈ ఎన్నికల సీజన్లో దేశవ్యాప్తంగా కనీసం 9 లక్షల తాత్కాలిక ఉపాధి అవకాశాలు లభిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా పలు రకాల అవసరాలను తీర్చే విధంగా ఉద్యోగాలుంటాయని ‘వర్క్ ఇండియా’ సీఈవో సహ వ్యవస్థాపకుడు నీలేశ్ దుంగార్వాల్ తెలిపారు. ప్రధానంగా డేటా ఎంట్రీ ఉద్యోగాలు, బ్యాక్ ఆఫీస్, డెలివరీ, డ్రైవర్లు, కంటెంట్ రైటింగ్, సేల్స్ వంటి రూపాల్లో ఉపాధి లభిస్తోంది. ఏప్రిల్ 19న తొలి విడత దశ పోలింగ్ నాటికే 2 లక్షల తాత్కాలిక ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచి్చనట్టు సీఐఈఎల్ హెచ్ఆర్ డైరెక్టర్ ఆదిత్య నారాయణన్ మిశ్రా తెలిపారు. డేటా విశ్లేషణ, ప్రణాళిక, ప్రజలతో సంబంధాలు, మార్కెట్ సర్వే, మీడియా సంబంధాలు, కంటెంట్ డిజైన్, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఏఐ స్ట్రాటజీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఈ అవకాశాలు అందివచి్చనట్టు చెప్పారు. 8 నుంచి 13 వారాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈవెంట్ మేనేజ్మెంట్, ప్రింటింగ్, రవాణా, ఫుడ్, బెవరేజెస్, క్యాటరింగ్, సెక్యూరిటీ, ఐటీ నెట్వర్క్ మేనేజ్మెంట్, అనలిటిక్స్‌లో 4 నుంచి 5 లక్షల మందిని తాత్కాలిక ప్రాతిపదికగా నియమించుకుంటున్నట్టు మిశ్రా అంచనా వేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
May Day Special Story: ఖరీదు కట్టే షరాబు లేడు
ప్రతి శ్రమకూ ఒక విలువ ఉంటుంది.పురుషుడు విలువ కలిగిన శ్రమే చేస్తాడు. అతడిది ఉద్యోగం.స్త్రీ విలువ కట్టని ఇంటి పని చేస్తుంది.ఆమెది చాకిరి.భారతదేశంలో స్త్రీ, పురుషుల్లో స్త్రీలుఅత్యధిక గంటలు ఏ ఖరీదూ లేనిఇంటి పనుల్లో మునిగి ఉంటున్నారనిసర్వేలు చెబుతున్నాయి.దేశ యంత్రాంగాలు అంతరాయంలేకుండా ముందుకు సాగడంలోఈ శ్రమ నిశ్శబ్ద ΄ాత్ర వహిస్తోంది.స్త్రీల శ్రమకు విలువ కట్టలేక΄ోతేకనీసం గౌరవం ఇవ్వడమైనా నేర్వాలి. ఇంతకు ముందు వివరించి చెప్పడం కొంత కష్టమయ్యేది. ఇప్పుడు అర్బన్ క్లాప్ వంటి సంస్థలు వచ్చాయి కనుక సులువు. అర్బన్ క్లాప్ వారికి బాత్రూమ్ల క్లీనింగ్ కోసం కాల్ చేస్తే వాళ్లు ఒక్కో బాత్రూమ్కు ఇంతని చార్జ్ చేస్తారు. ఇంట్లో రెండుంటే రెంటికీ చార్జ్ పడుతుంది. అదీ ఒకసారికి. అమ్మ వారంలో రెండు సార్లు, నెలలో ఏడెనిమిది సార్లు రెండు బాత్రూమ్లు కడుగుతుంది. ఆమెకు ఆ చార్జ్ మొత్తం ఇవ్వాలి లెక్క ప్రకారం. అలాగే కిచెన్ క్లీన్ చేయాలంటే కూడా ఒక చార్జ్ ఉంటుంది. అమ్మ రోజూ వంటిల్లు సర్దిసర్ది, ΄్లాట్‌ఫామ్ కడిగి, స్టవ్ రుద్ది క్లీన్ చేస్తుంది. ఆ చార్జ్ కూడా ఆమెకు ఇవ్వాలి. అమ్మ శ్రమకు కనీసం విలువ కట్టాలని కొన్ని సందర్భాలలో కోర్టులు కూడా అంటున్నాయి. కొన్ని సంస్థలు అమ్మ శ్రమను ఎలా విలువ కట్టవచ్చో కూడా చెబుతున్నాయి.1. ఆపర్చునిటీ కాస్ట్ మెథడ్: అంటే అమ్మ బయటకు వెళ్లి ఉద్యోగం చేస్తే నలభై వేలు వస్తాయనుకుంటే, ఆమె ఆ ఉద్యోగం మానుకుని ఇంట్లో ఉండి΄ోతే ఆమె శ్రమ విలువను నెలకు నలభై వేలుగా గుర్తించాలి. (అమ్మ ఉద్యోగం చేసి కూడా అంత శ్రమా చేస్తుంటే నలభైకి మరో నలభై కలిపి ఇంటికి ఇస్తున్నట్టు).2. రీప్లేస్మెంట్ కాస్ట్ మెథడ్: ఇల్లు చిమ్మడం, బట్టలుతకడం, ఆరిన బట్టల్ని మడత పెట్టడం, ఇస్త్రీ చేయడం, మొక్కలకు నీళ్లు పోయడం, కూరగాయలు, సరుకులు తెచ్చుకోవడం, బిల్లులు కట్టడం, వంట చేయడం, ఇంటిని కనిపెట్టుకుని ఉండటం... వీటన్నింటినీ బయట వ్యక్తులతో సర్వీసుగా తీసుకుంటే (అర్బన్ క్లాప్ మాదిరిగా) ఎంత అవుతుందో లెక్కగట్టి అది అమ్మ చేసే పని శ్రమగా గుర్తించడం.3. ఇన్పుట్/అవుట్‌పుట్ కాస్ట్ మెథడ్: అలా కాకుండా ఈ పనులన్నింటికీ ఒక యోగ్యమైన ఉద్యోగిని పెట్టుకుంటే మార్కెట్ అంచనాను బట్టి ఎంత జీతం ఇవ్వాల్సి వస్తుందో అంత జీతం ఇవ్వడం.అవన్నీ సరే. కంటికి కనిపించే పనులకు కట్టే విలువ. కాని పిల్లవాడు స్కూల్లో పడి దెబ్బ తగిలించుకుని ఇంటికి వస్తే అమ్మ దగ్గరకు తీసుకుని, మందు రాసి, ధైర్యం చెప్పి, వాడి పక్కన కూచుని కబుర్లు చెపుతుందే... ఆ ప్రేమకు విలువ కట్టే షరాబు ఉన్నాడా? మే డే రోజున ప్రపంచ కార్మికురాలా ఏకం కండి అనే నినాదాలు వినిపిస్తుంటాయి. కాని ఇంటి పని చేస్తూ, అది ఎక్కువైనా చేస్తూ, కుటుంబమంతా ఆ పనిలో భాగం కావాలన్న సంగతిని చెప్పడానికి కూడా తటపటాయిస్తూ, అది వద్దనుకుంటే ఆ ఆప్షన్ లేక, తప్పించుకోవడానికి వీల్లేని ఆ పనిని చేస్తూ కూడా విలువ లేని పని చేస్తున్నామన్న న్యూనతను అనుభవిస్తూ తమ హక్కులు ఏమిటో తమకే తెలియని తల్లి, భార్య, కుమార్తె, చెల్లెళ్లను కార్మికులుగా గుర్తించాలని ఎవరూ అనుకోరు.స్త్రీల ఇంటి శ్రమ దేశంలోని యంత్రాంగం సజావుగా పనిచేయడంలో కీలకమైనది. వారు... దేశం కోసం పని చేసి రిటైరైన వృద్ధుల సేవలో ఉంటారు. దేశానికి ఆదాయం తెచ్చిపెట్టే యువత సేవలో ఉంటారు. దేశానికి భవిష్యత్తులో అంది రావాల్సిన పిల్లల సేవలో ఉంటారు. ‘కుటుంబం’ అనే బంధంలోకి వచ్చి కూతురిగా, కోడలిగా, భార్యగా వీరు ‘ప్రేమ’తో, ‘బాధ్యత’తో, ‘బంధం’తో ఈ సేవ చేస్తారు. అంత మాత్రం చేత ఈ సేవను నిరాకరించడానికి వీల్లేదు. శ్రమగా చూడక్కర్లేదని భావించకూడదు. ఇంత చేస్తున్నా ‘ఇంట్లో కూచుని ఏం చేస్తుంటావ్?’ అనే మాటను వాళ్లు పడాలా?ఉద్యోగం చేసినా చేయక΄ోయినా ఒక గృహిణి రోజుకు సగటున మూడున్నర గంటలు ఇంటి పని చేస్తుంటే పురుషుడు కేవలం గంటన్నర ఇంటి పని చేస్తున్నాడు.స్త్రీలు తమ ఇంటి పనిని ఒక్కరోజు మానేసి సహాయనిరాకరణ చేస్తే దేశం స్తంభిస్తుంది. అందుకే స్త్రీల శ్రమను గౌరవించే మే డే రోజున వారికి కృతజ్ఞతలు తెలియచేయాలి. విలువైన శ్రమ చేస్తున్నందుకు సమాజం వారికి హర్షధ్వానాలు తెలియచేయాలి. -
Viral Video: స్కూటీ నడుపుతూ వర్క్ కాల్.. ఈ ఐటీ ఉద్యోగి కష్టం చూడండి..
ఏ ఉద్యోగంలో అయినా పని ఒత్తిడి మామూలే. అయితే ఇది ఐటీ పరిశ్రమలో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. బెంగళూరులో ఓ వ్యక్తి ల్యాప్‌టాప్‌లో వర్క్ కాల్లో అటెండ్ అవుతూ స్కూటర్ నడుపుతున్న వీడియో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన తర్వాత వర్క్-లైఫ్ బ్యాలెన్స్, 70 గంటల వర్క్ వీక్ చర్చ సోషల్ మీడియాలో తిరిగి మొదలైంది. పీక్ బెంగుళూరు అనే హ్యాండిల్‌పై ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేసిన ఈ క్లిప్ దేశ ఐటీ రాజధాని మూసచిత్రాన్ని చూపించింది. ఇక్కడ టెక్ నిపుణులు బహిరంగ ప్రదేశాల్లో తమ ల్యాప్‌టాప్‌లపై పనిలో నిమగ్నమై ఉండటం సర్వసాధారణమే. అయితే ఈ ఉద్యోగి మాత్రం ఓ వైపు స్కూటర్ నడుపుతూ.. మరోవైపు ల్యాప్‌టాప్‌ను ఒళ్లో పెట్టుకుని వర్క్ కాల్ అటెండ్ అవుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజనులు పలు విధాలుగా స్పందించారు. "బ్రో ఐటీ కంపెనీలో ఉండాలంటే పని చేస్తూనే ఉండాలి. వారానికి 70 గంటల సమయం కూడా సరిపోదు" అని ఓ యూజర్ కామెంట్ చేశారు. "క్లయింట్ కాల్, మరణం ఎప్పుడైనా రావచ్చు" అని మరో యూజర్ చమత్కారంగా రాసుకొచ్చారు. "ఈ రోజుల్లో పని ఒత్తిడి చాలా ఎక్కువే. అయినా ఇలా మాత్రం చేయొద్దు" అని ఇంకొక యూజర్ హితవు పలికారు. Bengaluru is not for beginners 😂 (🎥: @nikil_89) pic.twitter.com/mgtchMDryW — Peak Bengaluru (@peakbengaluru) March 23, 2024 -
అలసిపోయిన అమ్మకు ఇలాంటి బిడ్డ ఒక్కరుంటే చాలు
కుంచమంత కూతురు ఉంటే..మంచం దగ్గరికే అన్నీ చేరతాయనేది సామెత. నిజంగా ఒక ఇంట్లో ఆడపిల్ల ఉంటే తల్లికి, కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటుంది. బుడ్జి బుడ్జి చేతులతో చిన్ని చిన్ని పనులు చేస్తూ అమ్మల్ని మురిపిస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్లో సందడి చేస్తోంది. డాటర్స్ ఆర్ బెస్ట్ అంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. చిన్న బిడ్డతో, ఇతర పనులతో అలిసిపోయి నిద్రలోకి జారుకున్న అమ్మను చూసిన ఓ చిన్నారి వెంటనే రంగంలోకి దిగిపోయింది. తల్లి నిద్ర చెడకుండా, చిందరవందరగా ఉన్న ఇల్లంతా చక్కగా సర్దేస్తుంది. అంతేకాదు ఉయ్యాలలో ఉన్న పాపాయిని కూడా ఒళ్లోకి తీసుకొని కూచుంటుంది. కాసేపటికి మెలకువ వచ్చి ఆ తల్లి, బిడ్డ చేసిన పనికి పరవశురాలై, ఆత్మీయంగా హత్తుకుని, ముద్దు పెట్టుకోవడం మనం ఈ వీడియోలో చూడొచ్చు. What a wonderful daughter. ❤️pic.twitter.com/fCDRi8j1mS — मैं हूँ Sanatani 🇮🇳 🚩🚩 (@DesiSanatani) March 18, 2024 నిజానికి ముద్దార నేర్పించాలే గానీ, ఆడ,మగా అనే తేడా లేకుండా అన్ని పనుల్లో అమ్మానాన్నలకు తోడుగా ఉంటారు పిల్లలు. ప్రస్తుతం సమాజంలో ఇది చాలా అవసరం కూడా. పనులు పంచుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత చిన్నతనంలోనే ఆ విలువ తెలుసుకుంటే.. ఆ ఇల్లు ఆనంద హరివిల్లు అవుతుంది. -
అందుకే వారానికి 70 గంటల పని చేయమన్నా! - నారాయణ మూర్తి
భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే యువత వారానికి 70 గంటలు పనిచేయాలని గతంలో ఇన్ఫోసిస్ 'నారాయణ మూర్తి' చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారం రేకెత్తించాయి. కొందరు ఆ మాటలతో ఏకీభవిస్తే.. మరికొందరు వ్యతిరేకించారు. అయితే ఇప్పుడు నారాయణ మూర్తి అలా ఎందుకు చెప్పారనే విషయాన్ని వెల్లడించారు. దేశంలో రైతులు, కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారు. ఇది అందరికి తెలిసిన విషయం. అయితే దేశంలో ఉన్నత చదువులు చదువుకున్న విద్యావంతులు మాత్రం నిర్దిష్ట సమయానికి పనిచేయాలని అలవాటు పడిపోయారు. ఎవరైతే ఎక్కువ కష్టపడి పని చేస్తారో.. వారినే అదృష్టం వరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇదీ చదవండి: గూగుల్ పరిస్థితులు బయటపెట్టిన మాజీ ఉద్యోగి 70 గంటల పని గురించి చెప్పడం మాత్రమే కాదు, నేను వారానికి 90 గంటలు పనిచేసిన రోజులున్నాయని గుర్తు చేశారు. ఇన్ఫోసిస్‌లో తాను ఉదయం 6 గంటలకు పనిని ప్రారంభించి రాత్రి 9 గంటలకు ముగించేవాడినని చెబుతూ, తాను పాటించకుండా ఇతరులకు హితబోధ చేయనని చెప్పుకొచ్చారు. -
వ్యక్తం... అవ్యక్తం
పైకి పచ్చగా కనిపించే చెట్టు ఎంత విస్తరించి ఉన్నదో అంత కన్న ఎక్కువగా దాని వేళ్ళు నేలలో పాతుకుని పోయి ఉంటాయి. చెట్టు అంటే పైకి కనిపించే కొమ్మలు, ఆకులు, పూలు, పళ్ళు మాత్రమే అనుకుంటే ఎంత పొరపాటో తెలుస్తోంది కదా. అదే విధంగా మనకి పైకి కనిపించే ప్రపంచం వెనుక ఎంతో ప్రయత్నం ఉంది. కనపడేది ఒక వంతు మాత్రమే... మూలమైనది మూడు వంతులు అని మన ఋషులు దర్శించి తెలియ చేశారు. ఒక వైద్యుడి దగ్గరకి వెళ్లినప్పుడు ఆయన నాలుగు మాటలు చకచక రాయటం చూసి, ఈ మాత్రానికే రూ. 500 తీసుకున్నాడు అని వాపోతారు. కాని, ఆ నాలుగు మాటలు, అంటే మందుల పేర్లు రాయటానికి ఆయన ఎంత కాలం కృషి చేసి ఉంటారో . ఒకసారి ఒక యంత్రం హఠాత్తుగా ఆగిపోయిందట. అందరూ రకరకాలుగా ప్రయత్నం చేశారు కానీ అది మొండికేసింది. ఒక ఇంజినీర్ని పిలిచారు. ఆయన వచ్చి అటు ఇటు పరిశీలించి సుత్తి తీసుకుని సున్నితంగా ఒక దెబ్బ వెయ్యగానే అది పని చెయ్యటం మొదలు పెట్టింది. తన ఫీజు అడగగానే ఒక సుత్తిదెబ్బ ఇంత ఖరీదా? అని అడిగాడట యజమాని. దానికి ఆ ఇంజినీరు సుత్తి దెబ్బకి ఒక రూపాయే. కానీ ఎక్కడ కొట్టాలో, ఎట్లా కొట్టాలో తెలుసుకున్నందుకు మిగిలినది అన్నాడట. నిజమే కదా. సుత్తిదెబ్బ అయితే ఎవరైనా కొట్టి ఉండ వచ్చుగా. ఇంజినీరు ని పిలవటం ఎందుకు? పైకి కనిపించే పని వెనక ఉన్న కృషే పనిలో నైపుణ్యానికి కారణం. ‘‘పాదోస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతమ్ దివి’’ అంది పురుష సూక్తం. అది అర్థం కావటానికి మానవుడు స్వయంగా ఇతర ప్రమేయం లేకుండా తయారు చెయ్యగల ఒకే ఒక్కమాట ని ఉదాహరణగా తీసుకోవచ్చు.‘‘త్రీణి నిహితా గుహాని తాని విదుర్ర్బాహ్మణా మనీషిణః నేంగయన్తి తురీయమ్ వాచో మనుష్యా వదంతి’’పరా, పశ్యంతి, మాధ్య మా అనే మూడుస్థాయుల ప్రయత్నం తరువాత వైఖరి అనబడే అందరికి వినపడే వాక్కు వెలువడుతుంది. మనకి తెలియకుండానే ఇంత ప్రయత్నం జరిగిపోతోంది. ఇది అర్థం చేసుకోగలిగితే సృష్టి రహస్యం చాలా వరకు తెలిసినట్టే. దృశ్యమాన జగత్తుకి కారణమైన అదృశ్యంగా ఉన్న దానిని కనీసం ఊహించగలుగుతాం. ఇది ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక నాటక ప్రదర్శననో, చలనచిత్రాన్నో చూడండి. రంగస్థలం మీద ఒక గంటో, రెండుగంటలో ప్రదర్శించే నాటకానికి పూర్వరంగం అంటే ముందు చేసే ప్రయత్నం ఎంతో. తెరమీద కనపడే ఒక దృశ్యాన్ని చిత్రీకరించటానికి ఎంతమంది ఎన్నిరోజులు శ్రమించి ఉంటారో ఈ మధ్య కాలంలో బాగా ప్రచారం చేస్తూనే ఉన్నారుగా. ఒక గంట పాట కచేరీకి ఇన్ని వేలా? అని ప్రశ్నించే వారికి సమాధానం అది ఆ గంట కచేరీకి కాదు, దానికి ముందు చేసిన సాధనకి అని. ఒక మేథావి ఇచ్చిన గంట ఉపన్యాసం వింటే వంద గ్రంథాలు చదివినట్టే అనేది అందుకనే. ఒక్క గంట మాట్లాడటానికి వాళ్ళు అప్పటికి కొన్ని గ్రంథాలు చదువుతారు. అంతకుముందే ఎన్నో గ్రంథాలు చదివి ఉంటారు. దానికి వారి అనుభవం, విశ్లేషణ జోడించబడతాయి. ఈ దృష్టి అలవరచుకుంటే వ్యక్తం నుండి అవ్యక్తానికి ప్రస్థానం ప్రారంభమైనట్టే. ఒక చెట్టుని కొట్టటానికి గంట పట్టింది. ఎంత తేలిగ్గా అయిపోయిందో అని చూసే వాళ్ళు అనుకుంటారు. కాని, గంట సమయంలో కొట్టటానికి గాను గొడ్డలికి తగినంత పదును పెట్టటానికి కనీసం పది గంటలు పట్టి ఉంటుంది. కనపడే పని వెనక కనపడకుండా ఉన్న సంసిద్ధత కోసం చేసిన ప్రయత్నం ఎంత ఉంటుందో అర్థం చేసుకుంటే పని సమయాన్ని సరిగా అంచనా వేసినట్టు అవుతుంది. చాలా సందర్భాలలో చేసే పని విలువని సరిగా అంచనా వెయ్యలేకపోవటానికి ఇటువంటి అవగాహనాలోపమే కారణం. – డా. ఎన్.అనంత లక్ష్మి -
ఆ గనిలో మహిళలకే పని.. కారణమిదే!
సాధారణంగా గనుల్లో పనిచేసేందుకు పురుషులనే నియమిస్తుంటారు. గనుల్లోని పనులు ఎంతో కష్టమైనందున వాటిని పురుషులతోనే చేయిస్తుంటారు. అయితే ఆఫ్రికాలోని ఒక దేశంలో దీనికి విరుద్ధమైన పనితీరు కలిగిన ఒక గని ఉంది. దీనిలో మహిళలు మాత్రమే పని చేస్తుంటారు. దీని వెనుకగల కారణం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అంతే కాదు ఈ గనిలో పని చేసే మహిళలకు భారీ వేతనం కూడా లభిస్తుంది . ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచంలోని పలు దేశాలు ఆ గనిలో జరిగే పనితీరును ప్రశంసిస్తుంటాయి. ఉత్తర జింబాబ్వేలోని డుంగుజా నది వద్ద మైనింగ్ జరుగుతుంటుంది. ‘జింబాకువా’ లాంటి అనేక కంపెనీలు ఇక్కడ రత్నాల కోసం వెదుకులాట సాగిస్తుంటాయి. ఇక్కడ పనిచేసేందుకు మహిళలను మాత్రమే తీసుకుంటారు. డ్రిల్లింగ్ అయినా, సుత్తితో కొట్టే పని అయినా, పెద్ద పెద్ద రాళ్లను రవాణా చేయడమైనా.. ప్రతీపనిని మహిళలే చేస్తుంటారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ గనిలో పేలుళ్లు లాంటి పనులు చేయరు. జాతి రాళ్లు, రత్నాలు భూమి లోపలి పొరలలో కనిపిస్తాయి. ఉలి, సుత్తి సహాయంతోనే ఇక్కడ తవ్వకాల పనులు చేపడతారు. ఈ విధమైన పనితీరుతో పర్యావరణానికి హాని కలగదు. ఈ ప్రక్రియలో రసాయనాలు ఉపయోగించరు. నీటిని కూడా తక్కువగానే ఉపయోగిస్తారు. ఇక్కడ పనిచేసే మహిళలకు ప్రతినెలా 180 (ఒక యూరో రూ.91) యూరోలు అందుతుంటాయని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. ఇక్కడ పనిచేసే మహిళలు తమ తీరిక సమయంలో కూరగాయలు పండిస్తూ, వాటిని విక్రయిస్తుంటారు. ఇక్కడి గనుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైనింగ్ కంపెనీలు మహిళా సాధికారతను కాంక్షిస్తూ, వారికే ఉపాధి కల్పిస్తున్నట్లు చెబుతున్నాయి. ఇక్కడి మహిళలు తమ పిల్లల చేత ఉన్నత చదువులు చదివిస్తున్నారు. నిరుద్యోగ భర్తలకు అండగా నిలుస్తున్నారు. మగవారి కంటే తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు ఇక్కడి మహిళలు. ఇది కూడా చదవండి: కోతకొచ్చిన పంటల్లో నక్కిన పులులు.. వణుకుతున్న కూలీలు! -
వారానికి 70 గంటల పని: ఇన్ఫో ‘సిస్’ వీడియో వైరల్.. మీ పొట్ట చెక్కలే!
70 hour work week remark hilarious video viral భారతీయు యువత వారానికి 70 గంటలు పని పనిచేయాలన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వ్యాఖ్యలు పెను దుమారాన్నే రాజేశాయి. కొంతమంది కంపెనీల ప్రతినిధులు, నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పించగా, పలువురు ఐటీ దిగ్గజాలు ఇన్ఫీ మూర్తికి మద్దతుగా నిలిచారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రధానంగా ఇండస్ట్రీలో మహిళా ఉద్యోగులపై వివక్షపై ఎక్కువ చర్చ నడిచింది. ఇంటా బయటా మహిళా ఉద్యోగుల పనిగంటలు, వారికి లభిస్తున్న గుర్తింపు, అందుతున్న వేతనం తదితర విషయాలు చర్చనీయాంశమైనాయి. ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్లో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. ఇన్ఫీ ‘సిస్’ పేరుతో వైరల్ అవుతున్న ఈ వీడియోను వ్యాపారవేత్త హర్ష గోయెంకా ఎక్స్(ట్విటర్)లో షేర్ చేశారు. 70-80-90 గంటలు పనిచేస్తున్నారు గృహిణులు దగ్గర మొదలు పెట్టి.. నారాయణ ..నారాయణ.. అంటూ ఇన్ఫో ‘సిస్’ మీకు ఇన్ఫో ఇస్తోంది బ్రో.. అంటూ తనదైన యాక్సెంట్‌తో సాగిన ఈ వీడియో నెట్టింట్ హల్చల్ చేస్తోంది. ఈ హిలేరియస్ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. వావ్.. నిజం చెప్పారు. గృహిణులు 70 నుండి 80 గంటలు పని చేస్తారు.. లవ్ యూ ఫర్ అండర్ స్టాండింగ్ .. ఇన్ఫో ‘సిస్’ అని ఒక యూజర్ కమెంట్ చేశారు. ఇది నూటికి నూరు శాతం, ఈ వీడియోను ఇన్ఫీ మూర్తి అంకుల్ చూడాలి అని మరొకరు వ్యాఖ్యానించడం విశేషం Info sis giving you info on 70 hour week! 😂😂 pic.twitter.com/rh6Jw1n2TD — Harsh Goenka (@hvgoenka) November 6, 2023 -
వర్క్ ఫ్రం హోమ్ శకం ముగిసినట్టే..నా? కంపెనీలు ఏమంటున్నాయి?
కోవిడ్ మహమ్మారి సమయంలో వర్క్ ఫ్రం హోమ్ (WFH) విధానం అన్ని కంపెనీలకూ, ముఖ్యంగా టెక్ సంస్థలకు అనివార్యంగా మారింది. ఆ తర్వాత కోవిడ్ పరిమితులు సడలించినప్పటి నుంచి ఐటీ కంపెనీలు, స్టార్టప్‌లు ఉద్యోగుల ఉత్పాదకతను పెంచే క్రమంలో వారిని ఆఫీస్‌లకు రప్పించే హైబ్రిడ్ మోడల్‌ను అమలు చేస్తున్నాయి. ఇప్పుడు, రిమోట్ వర్కింగ్ యుగానికి ముగింపు పలుకుతూ ఉద్యోగులు ఆఫీసు నుంచి పని చేయడాన్ని (WFO) తప్పనిసరి చేస్తున్నాయి. దాదాపు నాలుగేళ్ల నుంచి వర్క్ ఫ్రం హోమ్ చేసిన ఇన్ఫోసిస్ ఉద్యోగులు నవంబర్ 20వ తేదీ నుంచి తిరిగి ఆఫీస్ బాట పట్టనున్నారు. వారంలో మూడు రోజులు ఆఫీసు నుంచే వారు పనిచేయాల్సి ఉంటుందని కంపెనీ ఆదేశాలు జారీ చేసింది. ఇక టీసీఎస్ (TCS) అయితే గత నెలలో తమ ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పాటు ఆఫీస్ నుంచి వర్క్‌ను తప్పనిసరి చేసింది. ఇక విప్రో తమ ఉద్యోగులను వారంలో తమకు నచ్చిన మూడు రోజులు ఆఫీసు నుంచి పని చేసేందుకు మే నెల నుంచి అవకాశం కల్పించింది. హెచ్‌సీఎల్‌టెక్ కూడా తన ఉద్యోగులను వారానికి మూడు రోజులు ఆఫీస్‌లకు వచ్చి పనిచేయాలని కోరింది. ఇదీ చదవండి: ఐటీ హబ్‌లు వెలవెల! భారీగా పడిపోయిన నియామకాలు.. కీలక రిపోర్ట్ వెల్లడి సొనాటా సాఫ్ట్‌వేర్‌లో దశలవారీగా రిటర్న్ టు ఆఫీస్ విధానం అమలుపై కసరత్తు చేస్తున్నారు. మిడ్-మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు, లీడర్షిప్ స్థాయిలో ఉన్న ఉద్యోగులు ఇప్పటికే వారానికి రెండు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేస్తున్నారు. వచ్చే జనవరి నుంచి మిగిలిన వారు కూడా హైబ్రిడ్ మోడ్‌లో వారానికి కనీసం రెండు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేస్తారని సొనాటా సాఫ్ట్వేర్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ బాలాజీ కుమార్ చెప్పారు. పూర్తి వర్క్ ఫ్రం హోమ్ విధానం నుంచి ఉద్యోగులను కంపెనీలు ఇప్పుడిప్పుడే హైబ్రిడ్ మోడల్‌కు తీసుకొచ్చి వారానికి కొన్ని రోజులైనా ఆఫీస్‌ల నుంచి పని చేయించుకుంటున్నాయి. అయితే ఈ హైబ్రిడ్ విధానమైనా కొనసాగుతుందా లేదా టీసీఎస్ లాగా అన్ని కంపెనీలు పూర్తిగా వర్క్ ఫ్రం ఆఫీస్‌ను తప్పనిసరి చేసి వర్క్ ఫ్రం హోమ్ శకానికి ముగింపు పలుకుతాయా? అన్న అనుమానం ఉద్యోగ వర్గాల్లో ఉంది. రిమోట్ వర్క్ క్షీణిస్తోంది వంద శాతం రిమోట్ జాబ్స్ అనే భావన క్రమంగా మసకబారుతోందని ర్యాండ్‌స్టాడ్ ఇండియా చీఫ్ పీపుల్ ఆఫీసర్ అంజలి రఘువంశీ చెబుతున్నారు. ఆఫీస్‌కు వచ్చి పనిచేయడానికి భారతీయ ఉద్యోగులు క్రమంగా అలవాటు పడుతున్నారని, వారి అవసరాన్ని బట్టి వారానికి ఒకటి లేదా రెండు రోజులు వర్క్ ఫ్రం హోమ్ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. వారానికి నాలుగు రోజులైతే ఓకే రాండ్‌స్టాడ్ ఇన్సైట్స్ 4-డే వర్క్‌వీక్ క్యాండిడేట్ పల్స్ సర్వే 2023 ప్రకారం, 35 శాతం మంది ఉద్యోగులకు తమ కంపెనీ 4-రోజుల వర్క్‌వీక్‌కి మారితే ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లి పని చేయడానికి అభ్యంతరం లేదు. 43 శాతం మంది ఒక రోజు అదనపు సెలవు వస్తే మిగిలిన రోజుల్లో పని గంటలు కాస్త ఎక్కువైనా పర్వాలేదని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల అభిప్రాయాలను అదే సమయంలో తమ వ్యాపార అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇద్దరికీ అనువైన విధానాన్ని కంపెనీలు ఆలోచించాలని అంజలీ రఘువంశీ సూచిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికి వర్క్ ఫ్రం ఆఫీస్ మోడల్‌కు ఉద్యోగులు వచ్చినప్పటికీ ఒక్కసారి జాబ్ మార్కెట్ అనుకూలంగా మారిందంటే ఉద్యోగులు తమకు మరింత సౌలభ్యాన్ని అందించే ఉద్యోగాల వైపు వెళ్లే అవకాశం ఉంటుందని, అందువల్ల కంపెనీలు ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందంటున్నారు. దశలవారీగా ఆఫీస్‌లకు.. ఆఫీస్‌లకు వచ్చి పనిచేయడం వల్ల ఉద్యోగుల మరింత నేర్చుకునేందుకు, అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని హెచ్ఆర్ నిపుణులు నమ్ముతున్నారు. “హైబ్రిడ్ విధానం ఐటీ రంగంలోని ఉద్యోగులపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. కొంతమంది ఉద్యోగులు ఆఫీస్ రావడానికి ఇష్టపడవచ్చు. ప్రయాణ ఇబ్బందుల నేపథ్యంలో మరికొంత మంది ఆఫీస్‌లకు రావడానికి ఇష్టపడకపోవచ్చు” అని కెరీర్‌నెట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అన్షుమన్ దాస్ చెప్పారు. వర్క్ ఫ్రం హోమ్ మంచి ఆలోచన కాదని ఐటీ కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు భావిస్తున్నారు. దశలవారీగా అన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీస్‌లకు రప్పిస్తున్నాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో విస్తృతంగా ఉన్న రిమోట్ వర్క్ విధానం తగ్గుతూ వస్తోంది. రిమోట్ వర్క్ క్రమంగా తగ్గుముఖం పట్టడం కూడా ఉద్యోగులను తిరిగి ఆఫీస్‌లకు రప్పించడానికి కంపెనీల్లో కొనసాగుతున్న ఒత్తిడిని ప్రతిబింబిస్తుందని బిజ్ స్టాఫింగ్ కామ్రేడ్ మేనేజింగ్ పార్టనర్ పునీత్ అరోరా పేర్కొన్నారు. -
ఏ రాష్ట్రంలో ఎక్కువ పనిగంటలు? తెలంగాణ సంగతేంటి?
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పని చేయాలని చెప్పినప్పటి నుండి, జనం ఈ విషయంలో రెండు వర్గాలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. కార్మికవర్గం దీనిని సరైనదిగా భావించడం లేదు. అయితే యాజమాన్యం దీనిని సమర్థించుకునేందుకు భిన్నమైన వాదనలు వినిపిస్తోంది. అయితే ఈ రోజు మనం.. దేశంలోని ఏ రాష్ట్రంలోని ప్రజలు అధిక గంటలు పని చేస్తున్నారు? అత్యధిక వేతనం పొందుతున్నవారెవరు? అనే విషయాలను తెలుసుకుందాం. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ఉత్తరాఖండ్ ప్రజలు గరిష్టంగా 9.6 గంటలు పని చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. తెలంగాణలో సగటు ఉద్యోగి రోజుకు 9.2 గంటలు పనిచేస్తున్నాడు. గుజరాత్, మహారాష్ట్ర మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రతి ఉద్యోగి రోజూ సగటున 9 గంటలు పని చేస్తున్నాడు. అయితే తక్కువ పనిగంటల విషయానికొస్తే దేశంలోని మణిపూర్ మొదటి స్థానంలో ఉంది. సగటున ఇక్కడి ప్రజలు ప్రతిరోజూ 6 గంటలు పని చేస్తారు. ఏ రాష్ట్రంలోని ప్రజలు ఎన్ని గంటలు పనిచేస్తున్నారో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రజలు అత్యధిక జీతం పొందుతున్నారో తెలుసుకుందాం. 2022వ సంవత్సరంలో ఆర్బీఐ దీనికి సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం కేరళ ప్రజలు దేశంలోనే అత్యధిక జీతం పొందుతున్నారు. ఇక్కడ తలసరి వార్షిక ఆదాయం రూ.1,94,767. వేతనాల గురించి చెప్పాలంటే ఇక్కడి కార్మికులకు రోజువారీ వేతనం రూ.838. కాగా హర్యానా, పంజాబ్‌లు ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాయి. ఇది కూడా చదవండి: యురేనస్ మీద ఐదు సెకెన్లు ఉండగలిగితే? -
'70 గంటలు పని'.. వ్యాఖ్యలపై వైద్యులు ఏమంటున్నారంటే..!
ప్రముఖ టెక్ కంపెనీ ఫౌండర్ ఓ కార్యక్రమంలో 'యువత 70 గంటలు పనిచేస్తే'.. ఎన్నో విజయాలు సాధించొచ్చు అన్న వ్యాఖ్యలు పెద్ద ప్రకంపనం సృష్టించాయి. ఆయనతో కొన్ని కంపెనీ సీఈవోలు ఏకీభవించగా, ఐటీ ఉద్యోగులు మాత్రం ఘాటుగా స్పందించారు. ఏదీఏమైనా ఇది అందరికీ సాధ్యమా? ఏ మనిషి అయినా అన్ని గంటలు పనికే కేటాయిస్తే ఆరోగ్య పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కుటుంబ సంబంధాలు దెబ్బతినవా? అది అసలు బ్యాలెన్స్ అవుతుందా? దీని గురించి వైద్యలు ఏం చెబుతున్నారు తదితరాల గురించే ఈ కథనం!. దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి యువత పని విషయమై ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. భారత యువత వారంలో 70 గంటలు పనిచేస్తే భారత ఆర్థిక రంగంలో ఊహించని విజయాలు సాధించవచ్చు అని నారాయణ మూర్తి ఓ కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశారు. దీంతో నెట్టింట ప్రముఖ ఐటి ఉద్యోగులంతా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పనికి తగ్గట్టుగా వేతనం ఇస్తే కచ్చితంగా అన్ని గంటలు చేస్తామంటూ మూర్తి వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఐతే ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా సీఈవో భవిష్ అగర్వాల్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్పర్సన్ సజ్జన్ జిందాల్ వంటి ప్రముఖులు మాత్రం నారాయణ మూర్తి వ్యాఖ్యలపై ఏకభవించడం విశేషం. ఇదిలా ఉండగా, నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై వైద్యులు సైతం విభేదించారు. ఈ మేరకు బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి మాట్లాడుతు..అసమంజసమైన పని గంటలు వల్ల దీర్ఘకాలికా ఆరోగ్యంపై తీవ్ర దుష్పరిణామాలు చూపిస్తాయన్నారు. ఇన్ని గంటలు పనిచేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆయన చెప్పినట్లు వారానికి 70 గంటలు అంటే..రోజుకు 24 గంటల షెడ్యుల్ ప్రకారం..వారానికి ఆరో రోజులు పనిచేస్తే..రోజుకు 12 గంటలు చొప్పున పనిచేయగా మిగిలిని 12 గంటల్లో ఓ ఎనిమిది గంటలు నిద్రకుపోగా మిగిలిని 4 గంటలు మీ వ్యక్తిగత విషయాలు, ఆఫీస్‌కు చేరుకునే జర్నీకి పోతాయి. అదే బెంగళూరు వంటి మహానగరాల్లో అయితే రెండు గంటలు రోడ్డుపైనే గడిచిపోతాయి. అంటే ప్రశాంతంగా తినడానికి, కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి, వ్యాయామానికి, కనీసం వినోదానికి సమయం ఉండదు. ఇలా ఓ యంత్రంలా మనిషి చేసుకుంటూ పోతే కెరియర్ పరంగా ఎదుగుదల ఉంటుందేమో గానీ తనకు తెలియకుండాననే వివిధ మానసిక రుగ్మతల బారిన పడి లేని అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అదీగాక ఇటీవల యువత చిన్న వయసులోనే గుండెపోటుకి గురై చనిపోతున్న ఉదంతాలను ఎన్నో చూస్తున్నాం. యువకులకే ఈ గుండెపోటులు ఎందుకొస్తున్నాయో? ప్రముఖులు కాస్త ఆలోచించాలని చెబుతున్నారు. తెలియని పని స్ట్రెస్ ఉద్యోగంలో అనుకున్న గోల్ రీచ్ కాలేకపోతున్నామన్న భయం మరోవైపు ఉద్యోగంలో ఎదుగుదల కోసం నానాపాట్లు ఇవన్నీ వెరసి గుండెపై ప్రభావం చూపి కార్డియాక్ అరెస్టులు లేదా గుండెకు సంబంధించిన వ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. వైద్యులు మాత్రం ముందు ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేసి నిరుద్యోగ సమస్యకు కళ్లెం వేయండి. యువత పని జీవితం బ్యాలెన్స్డ్గా ఉంటేనే మంచి లక్ష్యాలను వృద్ధిని సాధించగలరని వైద్యుడు దీపక్ నొక్కి చెబుతున్నారు. సదరు వైద్యుడి వ్యాఖ్యలపై నెటిజన్లు ఏకీభవించడమే గాక ఇన్ని గంటలు పని కారణంగా వ్యక్తిగత సంబంధాలు సైతం దెబ్బతింటాయని ఒకరు, లేనిపోని అనారోగ్య సమస్యలు బారినపడి భారంగా జీవనం గడపాల్సి వస్తుందంటూ రకరకాలు కామెంట్లు చేస్తూ ట్వీట్లు చేశారు. 24 hours per day (as far as I know) If you work 6 days a week - 12h per day Remaining 12h 8 hours sleep 4 hours remain In a city like Bengaluru 2 hours on road 2 hours remain - Brush, poop, bathe, eat No time to socialise No time to talk to family No time to exercise… https://t.co/dDTKAPfJf8 — Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) October 27, 2023 (చదవండి: పిల్లలను మంచిగా పెంచడం ఎలా? సైకాలజిస్ట్‌లు ఏం చెబుతున్నారంటే..) -
కలల సౌధాన్ని డిజైన్ చేస్తాను!
‘ప్రతి ఇంటికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది.ఇంటి యజమానిప్రాధాన్యతలకు అనుగుణంగా ఆ ఇంటి డిజైనింగ్ ఉండాలి. వారి కలల సౌధాన్ని కళ్ల ముందు నిలపడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను’ అని తన గురించి, తన ప్రాజెక్ట్స్ గురించి వివరించారు ఇటీవల ముంబయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రోఫెషనల్ ఇంటీరియర్ డిజైనర్ షబ్నమ్ గుప్త. 48 ఏళ్ల షబ్నమ్ గుప్త 16 ఏళ్ల వయసు నుంచే ఈ రంగంలోకి వచ్చానని వివరించింది. ఆమె డిజైన్స్ సెలబ్రిటీల ఇళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. అపార్ట్మెంట్లు, ఫామ్‌హౌజ్‌లు, హాస్పిటల్స్ నుంచి మట్టితో కట్టిన చిన్న రూమ్‌లను కూడా తన విలక్షణమైన శైలితో ఆవిష్కరిస్తుంటారు. తనే ఇన్నేళ్ల ప్రయాణం గురించి షబ్నమ్ వివరిస్తూ.. ‘‘నా జీవితంలో అత్యంత ప్రభావాన్ని కలిగించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది మా అమ్మానాన్నలు, మా వారు. వాళ్లతో చేసే చర్చలు నాలో ఇంకా స్థిరత్వానికీ, ఎదుగుదలకూ తోడ్పడుతుంటాయి. ఎందుకంటే వాళ్లే నా వర్క్‌లో మొదటి అతిపెద్ద విమర్శకులు. దేనినీ త్వరగా మెచ్చుకోరు. వాళ్లను మెప్పించడం అంటే నేను సూపర్ సక్సెస్ అయినట్టు అనుకుంటాను. అంతగా నా వర్క్‌లో ఇన్వాల్వ్ అవుతాను. మొదటిసారి మా నాన్న ఇల్లు కట్టించినప్పుడు నేను చాలా ఆసక్తి కనబరిచాను. చాలా మార్పులు, చేర్పులు చేశాను. నాన్నగారు కూడా నా సూచనలను చాలా బాగా తీసుకున్నారు. అక్కడి నుంచి ఇంటీరియర్, ఆర్కిటెక్చర్ మీద ఇష్టం ఏర్పడింది. దీంతో ఇంటీరియర్ డిజైనింగ్‌లో డిప్లోమా పూర్తి చేశాను. ముంబయ్ ర హేజా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి కోర్స్ పూర్తి చేసుకున్నాక సొంతంగాప్రాక్టీస్ మొదలు పెట్టాను. దీనికి ముందు ప్రముఖ ఆర్కిటెక్ట్ తుషార్ దేశాయ్‌తో కలిసి పనిచేయడం ద్వారా డిజైనింగ్‌లో చాలా నైపుణ్యాలను నేర్చుకున్నాను. ఆ తర్వాత ఫిల్మ్ప్రోడక్షన్ హౌజ్‌లో ఒక చిన్న పనితో నా లైఫ్ స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచి నా సొంత లేబుల్ పెరుగుతూ వచ్చింది. నా ఖాతాలో ఆదిత్యా చోప్రా, రాణీ ముఖర్జీ, పరిణీతి చోప్రా.. వంటి చాలా మంది బాలీవుడ్ తారల ఇళ్లు, మీడియా హోజ్లు, హాస్పిటల్స్ డిజైన్ చేసినవి ఉన్నాయి. టీమ్ వర్క్.. డిజైనింగ్‌లో ఎప్పుడూ కొత్త కొత్త ఆవిష్కరణలకు స్పేస్ ఉంటుంది. ఇందులో ప్రకృతి, మన సంప్రదాయం, కళలు అన్నింటినుంచి ప్రేరణ పొందవచ్చు. ఈ డిజైనింగ్‌లో ప్రకృతితో మనకు ఒక అనుబంధం ఏర్పడిపోతుంది. ఏ ఒక్కరి జీవిత ప్రయాణం మరొకరితో పోల్చలేం. చాలామంది విజయాలకు వేర్వేరు అర్థాలు ఉంటాయి. మనం చేసే పనిలో సంతృప్తి పొందితే చాలు. మిగతా ట్యాగ్లు ఏవీ అక్కర్లేదు. వాటిని నేను సీరియస్‌గా తీసుకోను కూడా. ఇప్పటివరకు నా ప్రయాణం ప్రశాంతతను నేర్పింది. చాలా మందితో కలిసి టీమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మానవ సంబంధాలను తెలుసుకునే వీలుంటుంది. మా టీమ్‌తో పనిచేసే సమయంలో చాలా జోవియల్‌గా ఉంటాను. ఎలా అంటే ఒక మానసిక వైద్యుడిలా. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండటంతో పనిప్రదేశంలో ఉల్లాసంగా ఉంటాం. పట్టణ, నగర వాసాల నుంచి, గ్రామీణ ఇండ్ల వరకు డిజైన్ చేసినవన్నీ నా జాబితాలో ఉన్నాయి. ఈ రంగంలో మన చేత వర్క్ చేయించుకునేవారితో నమ్మకమైన వాతావరణాన్ని సృష్టించుకోవడం ముఖ్యం. అలాగే, వ్యాపారులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. ఇదే ఇన్నేళ్ల నా ప్రయాణంలో సాధించిన విజయం అనుకుంటాను. ప్రతిదీ సాధనే.. ఆర్కిటెక్చర్లో భాగంగా దేశమంతా తిరిగాను. ప్రముఖ ఆర్కిటెక్చురల్ప్రాధాన్యమున్న స్థలాలన్నీ సందర్శించాను. అవగాహన చేసుకున్నాను. విదేశాల్లోని కట్టడాలు, ఇంటీరియర్ వర్క్ చూస్తూ ప్రయాణించడంతో ప్రతిదానినీ అర్ధం చేసుకుంటూ, ఇంకాస్త మెరుగైన పనితనాన్ని నా వర్క్‌లో చూపించడం ఎప్పటికప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఏ ఒక్క రోజు ఇంకో రోజుతో పోల్చలేం. చేయాలనుకున్న పనుల జాబితాను టిక్ చేసుకుంటూ వెళ్లడమే. మొదట్లో గందరగోళంగా ఉండేది. తర్వాత ఏ రోజు పనులు ఆ రోజు చేయడం ఒక అలవాటుగా మారిపోయింది. నా జీవనశైలిలో నా మైండ్ స్పేస్‌ను అర్థం చేసుకోవడం చాలా సవాల్‌గా ఉండేది. జీవితంలో ఏదైనా రూపొందించాలనుకున్నప్పుడు అదొకప్రాక్టీస్గా ఉండాలి. క్లయింట్స్ ఇళ్లను డిజైన్ చేయడంలో నా స్కిల్‌ని మాత్రమే చూపించాలి. ఇదీ ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగమే. ఇంటీరియర్ డిజైనర్‌గా, ఆర్కిటెక్ట్‌గా ఎక్కువ సమయం సిమెంట్, దుమ్ము కొట్టుకుపోయి పనిలో గడిచిపోతుంటుంది. అయినా నాకంటూ కొంత స్పేస్ ఉంచుకుంటాను. ప్రయాణాలు నాకు ఎప్పుడూ ఇష్టం. ఇది ఎల్లప్పుడూ నన్ను పునరుజ్జీవింపజేస్తుంది. చాలాసార్లు పని నుంచి రిలాక్స్ అవడానికి టూర్స్‌ని ఎంచుకుంటుంటాను. వందల ఇళ్లు డిజైన్ చేసి ఉంటాను. ఎన్నో అవార్డులు ఈ రంగంలో అందుకున్నాను. కానీ, నా ఇంట్లో ఏది ఎలా ఉండాలనే నియమం లేదు. అక్కడంతా నా పిల్లల ఇష్టమే. ఎందుకంటే వారి దగ్గర నేను తల్లిని మాత్రమే. భవిష్యత్తు తరాలకు.. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ది ఆరెంజ్ లేన్ ఆ తర్వాత పీకాక్ లైఫ్ పేరుతో ఇంటీరియర్ స్పేస్‌లను క్రియేట్ చేశాను. హైదరాబాద్‌లో కోషా పేరుతో వింటేజ్ స్టైల్ ఫర్నీచర్‌ను లాంచ్ చేశాను. ఇంటీరియర్ డిజైనింగ్‌లో వింటేజ్ స్టైల్ ఇప్పుడు బాగా ట్రెండ్‌లో ఉంది. దేశంలోని ఇతరప్రాంతాల నుంచి ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్‌లలోని అతిప్రాచీన కళా ఖండాలను సేకరించడం, వాటిని రీ మోడలింగ్ చేసి, నేటి తరానికి అందించడంలో నాటి కళను భవిష్యత్తు తరాలకు తీసుకెళుతున్నామనే సంతృప్తి కలుగుతుంది. ఇక నా వ్యక్తిగత విషయానికి వస్తే ప్రయాణాలు అంటే ఎంత ఇష్టమో వ్యక్తిగత అలంకరణ కూడా అంతే ఇష్టం. నా వ్యక్తిగత అలంకరణ కొంచెం బోహో స్టైల్లో ఉంటుంది. ఇది స్వేచ్ఛా, స్ఫూర్తిలకు ప్రతీకగా ఉంటుంది. ఎదుటివారు మనల్ని పరిశీలనగా గమనించేంత ప్రత్యేకంగా ఉంటాయి’ అని నవ్వుతూ వివరించారు షబ్నమ్. – నిర్మలారెడ్డి, ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్ -
వేసవిలో ‘ఉపాధి’కి కసరత్తు
సాక్షి, అమరావతి: పేదలకు వచ్చే వేసవిలో కూడా సొంత ఊళ్లలోనే పెద్ద ఎత్తున పనులు కల్పి0చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉపాధి హామీ పథకం కింద కొత్త పనులను గుర్తించే ప్రక్రియను చేపట్టింది. 2024–25 ఆర్థి క సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హామీ పథకం లేబర్ బడ్జెట్‌పై అన్ని గ్రామాల్లో కసరత్తు మొదలైంది. గత మూడేళ్లుగా గ్రామాల వారీగా ఉపాధి పథకం పనులకు వచ్చిన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని.. వచ్చే ఆరి్థక సంవత్సరంలో ఎంత మందికి ఈ పథకం ద్వారా పనులు కల్పి0చాలన్న అంచనాలను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియ సజావుగా పూర్తి చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సూర్యకుమారి ఇప్పటికే కలెక్టర్లతో పాటు డ్వామా పీడీలకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో అక్టోబర్ 2 నుంచి ఈ ప్రక్రియ మొదలయ్యింది. గతంలో చేపట్టి ఇప్పటికీ పూర్తి కాని పనులను 20వ తేదీకల్లా ఉపాధి హామీ పథకం సిబ్బంది సందర్శించి సమీక్షిస్తారు. నవంబర్ 10కల్లా గ్రామాల్లో అదనంగా చేపట్టే కొత్త పనులను గుర్తిస్తారు. నవంబర్ 15కల్లా ఆయా గ్రామాల్లో ఎంత మందికి ఎన్ని పనిదినాలు కల్పించాలన్న వివరాలతో లేబర్ బడ్జెట్‌ను రూపొందించి సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్య.. కొత్తగా గుర్తించిన పనులకు సంబంధించి గ్రామ సభలో చర్చించి అనుమతి తీసుకుంటారు. అవసరమైతే మండల, జిల్లా స్థాయిలో కూడా అనుమతులు తీసుకునే ప్రక్రియను చేపడతారు. 2024–25 ఆరి్థక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంత మందికి పనులు కల్పి0చాలనే వివరాలను గుర్తించి.. అందుకు అవసరమయ్యే పనులకు కలెక్టర్ల ద్వారా అనుమతి తీసుకునే ప్రక్రియను డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేస్తారు. గ్రామాల వారీగా తయారు చేసిన ఈ అంచనాలతో రాష్ట్ర స్థాయిలో ఉపాధి హామీ పథకం లేబర్ బడ్జెట్‌ను రూపొందించి.. దానిని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అనుమతికి పంపిస్తామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, కొత్త పనుల గుర్తింపులో కనీసం 60 శాతం వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల పనులకు ప్రాధాన్యత ఉంటుందని అధికారులు తెలిపారు. గ్రామాల వారీగా కమిటీలు.. 2024–25 ఆరి్థక ఏడాదికి సంబంధించిన లేబర్ బడ్జెట్ అంచనాల తయారీ, కొత్త పనుల గుర్తింపు కోసం గ్రామాల స్థాయిలో ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ల ఆధ్వర్యంలో కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, విలేజ్ సర్వేయర్లు, వ్యవసాయ, ఉద్యానవన, సెరీకల్చర్ అసిస్టెంట్లు, గ్రామ వలంటీర్లు, పొదుపు సంఘాల గ్రామ స్థాయి లీడర్లు, ఉపాధి హామీ పథకం ఫీల్డు అసిస్టెంట్లను ఈ కమిటీల్లో సభ్యులుగా నియమించారు. మండల స్థాయి అధికారులు ఈ గ్రామ కమిటీలకు తగిన సహకారం అందజేస్తారు. -
చదువు మాని.. చపాతీల తయారీ.. గురుకులంలో విద్యార్థుల వంటావార్పు
చేర్యాల(సిద్దిపేట): వసతి గృహంలో హాయిగా చదువుకోవలసిన విద్యార్థులు వంట పనివారిగా మారి చపాతీలు తయారు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలోని గురుకుల పాఠశాలలో ఆదివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం ఉదయం అల్పాహారంలో చపాతీలు అందించాల్సి ఉంటుంది. కానీ వాటి తయారీకి సరిపడా మనుషులు లేకపోవడంతో విద్యార్థులతో చేయించారు. ప్రిన్సిపాల్ సహకారంతోనే కాంట్రాక్టర్ ఇలా పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని గురుకుల ప్రిన్సిపాల్ అశోక్‌బాబు వద్ద ప్రస్తావించగా.. తమకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి ఉందని స్పష్టం చేశారు. అందువల్లే విద్యార్థులతో వంట పని చేయిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
తల్లిగా లాలిస్తూ.. మేయర్‌గా పాలన చేస్తూ..
తిరువనంతపురం: తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు నెలన్నర శిశువును చంకనెత్తుకుని విధులు నిర్వర్తిస్తున్న ఆమె ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు తెగ స్పందించారు. ఒక్క అమ్మకు మాత్రమే ఉన్న కళ ఇది అని తల్లితనాన్ని కొనియాడుతున్నారు. ఆర్య రాజేంద్రన్ మేయర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో తన నెలన్నర శిశువును ఒడిలో లాలిస్తూ.. ఓవో ఫైల్స్‌పై సంతకాలు చేస్తున్నారు. ఈ ఫొటోలు బయటకు రాగా.. నెటిజన్లు ప్రశంసించారు. ఇటు.. వ్యక్తిగతంగా.. అటు.. వృత్తిపరమైన బాధ్యతలను మహిళలు మేనేజ్ చేయగలరని కామెంట్లు పెడుతున్నారు. మహిళలు తల్లితనం కోసం వృత్తిపరమైన లక్ష్యాలను పక్కకుపెట్టాల్సిన అవసరం లేదంటూ స్పందించారు. ఆర్య రాజేంద్రన్ ఫొటో బయటకు వచ్చిన నేపథ్యంలో పనిచేసే ప్రదేశాల్లో పిల్లల సంరక్షణ సెంటర్ల ప్రాధాన్యతల గురించి చర్చిస్తున్నారు. పనిచేసే ప్రదేశాల్లో తగినన్ని ఏర్పాట్లపై ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. అటు.. ప్రభుత్వ కార్యాలయాల్లోకి పిల్లల్ని తీసుకురాకూడదు కదా..? అంటు మరికొందరు ప్రశ్నించారు. కేవలం ఫొటో షూట్ స్టంట్స్‌గా పేర్కొన్న మరికొంత మంది నెటిజన్లు.. సాధారణంగా రోజూవారి కూలీ చేసుకునేవారికి ఇది సాధ్యమవుతుందా..?అంటూ కామెంట్లు పెట్టారు. ఆర్య రాజేంద్రన్(24) 2020లో 21 ఏళ్లకే మేయర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి దేశంలోనే అత్యంత పిన్న వయస్కులైన మేయర్‌గా రికార్డ్‌కెక్కారు. అదే రాష్ట్రానికి చెందిన సీపీఐఎమ్ ఎమ్మెల్యే సచిన్ దేవ్‌ను వివాహం చేసుకున్నారు. సచిన్ కూడా దేశంలోనే అత్యంత చిన్న వయస్సులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వారికి ఈ ఏడాది ఆగష్టు 10న ఓ ఆడ శిశువు జన్మిచింది. ఇదీ చదవండి: నూతన పార్లమెంట్: ఆరు దర్వాజలకు ఆరు జంతువులు కాపలా.. అవి దేనికి ప్రతీక.. -
పైళ్లెన ఐదు నెలలకే.. పని చేసుకోమన్నందుకు.. ఇలా చేశాడు!
సంగారెడ్డి: పైళ్లెన ఐదు నెలలకే ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని హబ్సిపూర్ గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన గుర్రం ఆనంద్(29)కు ఐదు నెలల క్రితం వివాహం జరిగింది. అతని కుడి చేయి కొద్దిగా అంగవైకల్యం ఉంది. ఖాళీగా తిరగకుండా ఏదైనా పని చేసుకోమని తల్లిదండ్రులు చెబుతుండటంతో వారితో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో సోమవారం ఉదమం 10 గంటల సమయంలో పొలం దగ్గరకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పాడు. మధ్యాహ్నం తన భార్య భారతికి ఫోన్ చేసి పైలంగా ఉండు అని చెప్పి కట్ చేశాడు. అనుమానం వచ్చి భార్య, బంధువులు పొలం దగ్గర వెతికారు. పక్కనే ఉన్న మంగళి భిక్షపతి బావి దగ్గర చెప్పులు, ఫోన్ కనిపించాయి. బావిలో చూడగా ఆనంద్ మృతదేహం కనిపించింది. మానసిక, శారీరక పరిస్థితి సరిగాలేక జీవితంపై విరక్తిచెంది మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
‘ఉపాధి’తో పేదలకు అండగా ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ఈ సీజన్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఆలస్యమయ్యాయి. దీంతో పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్న పేదలకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకంతో అండగా నిలిచింది. అవసరమున్న ప్రతి చోటా పెద్ద ఎత్తున పనులు చేపట్టింది. పని అడిగిన ప్రతి ఒక్కరికీ వారి సొంత ఊళ్లలోనే పనులు కల్పించింది. ఇలా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెపె్టంబరు 4వ తేదీ మధ్య కేవలం ఐదు నెలల్లోనే 19.93 కోట్ల పనిదినాలు కల్పించింది. వ్యవసాయ పనులే దొరకని ఈ ఐదు నెలల్లో 43.48 లక్షల కుటుంబాలు సొంత గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేసుకొని రూ. 4,660.53 కోట్ల మేర లబ్ధి పొందాయి. ఈ పథకం కింద కూలీలకు రోజుకు సరాసరిన రూ. 247.46 చొప్పున ప్రభుత్వం చెల్లించింది. గ్రామాల్లో వ్యవసాయ పనులు లేని సమయంలో పేదలకు పనుల కల్పనలో గత నాలుగేళ్లుగా మన రాష్ట్రమే దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఈ ఏడాది కూడా మండు వేసవి కారణంగా సాధారణంగా గ్రామాల్లో ఎక్కడా వ్యవసాయ పనులే ఉండని మే నెలలో ప్రభుత్వం రోజుకు సరాసరిన 28.73 లక్షల మంది పేదలకు పనులు కల్పించింది. సాధారణంగా గ్రామాల్లో వ్యవసాయ పనులు మొదలయ్యాక ఏటా జూలై, ఆగస్టు నెలల్లో ఉపాధి హామీ పనులకు పెద్దగా డిమాండ్ ఉండదు. అయితే, ఈ ఏడాది నాగార్జున సాగర్ పరిధిలో ఇంకా నీటి విడుదల చేయకపోవడం, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా ఉండటంతో ఈ ఏడాది ప్రభుత్వం ప్రత్యేకంగా ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. గ్రామాల్లో పనులు చేసుకొనేందుకు ముందుకొచ్చినా ప్రతి ఒక్కరికీ లేదు అనకుండా జూలై, ఆగస్టు నెలల్లోనూ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించింది. జూలై నెలలో సరాసరిన రోజుకు 8.57 లక్షల మంది, ఆగస్టులో రోజుకు సరాసరిన 2.23 లక్షల మంది ఉపాధి హామీ పథకం పనులకు హాజరైనట్టు అధికారులు చెప్పారు. పని కావాలని అడిగిన వారికి సొంత గ్రామాల్లోనే పనులిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే 12.49 లక్షల పనులు గుర్తించి, సిద్ధం చేసి ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు ఊపందుకొన్నాయి. అందువల్ల పది రోజులుగా ఉపాధి హామీ పనులకు డిమాండ్ తగ్గిందని అధికారులు తెలిపారు. ఈ నెల 1 నుంచి 4వ తేదీ మధ్య ఆదివారం పోను మిగతా మూడు రోజుల్లో 10,376 మంది మాత్రమే ‘ఉపాధి’ పనులకు వచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాలు వెల్లడించాయి. -
పని చేసేవారు కొందరైతే.. హడావుడి చేసేవారు మరికొందరు!
కంచర్ల యాదగిరిరెడ్డి: ప్రతి ఆఫీసులో రెండు రకాల ఉద్యోగులు ఉంటారు.. పనిలో ఆనందం పొందాలనుకునే వారు కొందరైతే.. పనిచేస్తున్నట్టుగా హడావుడి (షో) చేసేవాళ్లు ఇంకొందరు. ఎవరు ఏమిటన్నది తెలుసుకోవడం కొంచెం కష్టమైన పనే.. కానీ ఐటీ కంపెనీల్లో ఇలాంటి వారిని గుర్తించేందుకు ఈ–కమ్యూనికేషన్ టెక్ కంపెనీ ‘స్లాక్’ ఒక అధ్యయనం చేసింది. ఆశ్చర్యకరమైన ఫలితాలను ప్రకటించింది.మన దేశంలో ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో షో చేసేవాళ్లు 43 శాతందాకా ఉన్నారని వెల్లడైనట్టు తేల్చి చెప్పింది. అంటే ప్రతి వంద మందిలో 57 మంది చక్కగా పనిచేసుకుంటూంటే.. మిగతా వారు చేసేపనికన్నా ఎక్కువగా ‘షో’ చేస్తున్నారని అభిప్రాయపడింది. ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోని కంపెనీల్లో ఇలాంటి ఉద్యోగులు గణనీయంగానే ఉన్నారని పేర్కొంది. 18వేల మందిని ప్రశ్నించి.. ఆఫీసుల్లో సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు వినియోగించే అప్లికేషన్ ‘స్లాక్’. వాట్సాప్, మెసెంజర్, సిగ్నల్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇది ఆఫీసు బృందాలకు మాత్రమే పరిమితం. అయితే ఉద్యోగుల్లో పనిచేసేవాళ్లు, చేస్తున్నట్టు నటించే/హడావుడి చేసేవారిని గుర్తించేందుకు స్లాక్ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఒక అధ్యయనం చేపట్టింది. వివిధ దేశాల్లోని ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న 18వేల మందిని రకరకాల ప్రశ్నలు వేసి.. వారు ఏ రకానికి చెందినవారో తెలుసుకునే ప్రయత్నం చేసింది. తాజాగా ఆ అధ్యయనం నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా, జపాన్, సింగపూర్ వంటి ఆసియా దేశాల్లో పనిచేస్తున్న వారిలో ‘షో’ చేసేవారే ఎక్కువని పేర్కొంది.ఇండియాలో 43 శాతం, జపాన్‌లో 37 శాతం, సింగపూర్‌లో 36 శాతం ఇలాంటి ఉద్యోగులు ఉన్నారని తెలిపింది. కానీ ఆసియాలో భాగమే అయినా దక్షిణ కొరియాలో మాత్రం దాదాపు 72 శాతం మంది ఒళ్లు వంచి బుద్ధిగా పనిచేస్తున్నారని పేర్కొంది. యూరప్, అమెరికాలలో హడావుడి చేసే ఉద్యోగులు కొంత తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. ఉద్యోగులు ఏమంటున్నారు? స్లాక్ సర్వే ప్రకారం.. పలువురు ఐటీ ఉద్యోగులు తమ పనితీరును లెక్కగట్టే విధానంలో మార్పులు రావాలని కోరుకుంటున్నారు. కేవలం ఆన్లైన్ స్టేటస్, ఈ–మెయిళ్లకు ఇచ్చిన సమాదానాలు వంటివాటిపై మాత్రమే కాకుండా.. పనికి సంబంధించి మేనేజర్లతో మాట్లాడిన సందర్భాలు, ఏదైనా పని పూర్తి చేసేందుకు పట్టిన గంటలు వంటివాటి ఆధారంగా పనితీరును మదింపు చేయాలని అంటున్నారు. కోవిడ్ సమయంలో మాదిరిగా రిమోట్ వర్కింగ్ లాంటి పద్ధతులే మేలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది పనివేళలు ఫ్లెక్సిబుల్‌గా ఉండాలని కోరుకుంటే.. ఇష్టమైన చోట పనిచేసే అవకాశం ఉండాలని 36శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆఫీసుల్లో ప్రోత్సాహకాలు భిన్నంగా ఉండాలని, కార్యాలయాల్లో వసతులు పెరగాలని 32శాతం మంది భావిస్తే.. వర్క్ ఫ్రం హోమ్ కాకుండా మళ్లీ ఆఫీసులకు వచ్చి పనిచేయడంపై నిర్ణయం తీసుకోవాలని మరికొందరు ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఆఫీసులలో ఒకరిద్దరు కాకుండా బృందాలుగా పనిచేయాలని, బృందంగా మేధోమథనం చేయడం ద్వారా ఉత్పాదకత పెరుగుతుందని పలువురు ఉద్యోగులు పేర్కొన్నారు. సహోద్యోగులతో కలివిడిగా ఉండవచ్చునని, నాలుగు మాటలు మాట్లాడుకోవచ్చని తెలిస్తేనే మళ్లీ ఆఫీసులకు వెళతామని మైక్రోసాఫ్ట్ నిర్వహించిన ఒక అధ్యయనంలో 84శాతం మంది ఉద్యోగులు చెప్పడం గమనార్హం. పని చేయకున్నా ‘ఆన్లైన్’ కొందరు ఉద్యోగులు తాము పెద్దగా పనేమీ చేయకపోయినా యాక్టివ్‌గా ఉన్నామని చూపుకొనేందుకు ప్రయత్నిస్తుంటారని స్లాక్ అధ్యయనం వెల్లడించింది. ఇలాంటి 63 శాతం మంది ఉద్యోగులు యాప్స్‌లో తమ స్టేటస్ ‘ఆన్లైన్’ అని ఉండేలా చూసుకునేందుకు ప్రయత్నిస్తారని పేర్కొంది. మీటింగ్‌లతోనే సరి! తమకు మీటింగ్‌లలో, ఈ–మెయిళ్లకు సమాధానాలు ఇవ్వడంతోనే రోజంతా గడచిపోతోందని.. దీనివల్ల తాము ఉత్పాదకత ఎక్కువగా ఉండే పనులు చేయలేకపోతున్నామని సింగపూర్ ఉద్యోగుల్లో 44 శాతం మంది పేర్కొన్నట్టు స్లాక్ అధ్యయనం వెల్లడించింది. స్లాక్ ఏమంటోంది? ఒక ఐటీ కంపెనీ ఉద్యోగి పనితీరును, ఉత్పాదకతను అంచనా వేసేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్రమాణాలు విజిబిలిటీ, యాక్టివిటీ అని రెండు రకాలు. ఉద్యోగి ఆన్లైన్లో ఎన్ని గంటలు ఉన్నాడు? ఎన్ని ఈ–మెయిళ్లు పంపాడు? వంటి వివరాల ఆధారంగా 27శాతం మేనేజర్లు ఉత్పాదకతను నిర్ణయిస్తుంటారని స్లాక్ సర్వే చెప్తోంది. ఉద్యోగులు అసలు పనిలో ఉత్పాదకత ఎంత పెంచారనేది మేనేజర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్లాక్ టెక్నాలజీ ఎవాంజలిస్ట్ డెరెన్ లానే పేర్కొన్నారు. ఫలితాలను బట్టి కాకుండా, కంటికి కనిపించే అంశాల ఆధారంగా ఉత్పాదకతను నిర్ణయిస్తే.. ఆ కంపెనీ ఉద్యోగులు పనిచేస్తున్నట్టు నటించేందుకే ఇష్టపడతారని చెప్పారు. ఈ తీరువల్ల ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతుందని.. పనితో సంబంధం లేకుండా ఆఫీసుల్లో ఎక్కువ సమయం గడపడం, వచ్చిన ఈ–మెయిళ్లకు వెంటనే సమాధానాలు చెప్పడంలో బిజీగా మారిపోతున్నారని, లేదంటే అవసరమున్నా లేకపోయినా అన్ని మీటింగ్‌లకూ హాజరవుతున్నారని స్లాక్ అధ్యయనంలో తేలిందని వివరించారు. -
ఫలితం కోసం చూడకుండా అంకితభావంతో పనిచేయాలి
సాక్షి, హైదరాబాద్: ‘ఫలితాల కోసం ఎదురుచూడకుండా అంకితభావంతో నీ పని నువ్వు చేసుకుపో.. అని భగవద్గీతలోని శ్లోకాలు చెబుతున్నాయి..ఇది అర్బిట్రేషన్‌లో నిపుణులు ఎలాంటి కీలకపాత్ర పోషించాలో చెబుతుంది’అని హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అన్నారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ఆధ్వర్యంలో ‘ఆర్బిట్రేషన్‌లో విలువను పెంపొందించడం–నిపుణుల సూచనలు’అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘కర్మాణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’అనే భగవద్గీత శ్లోకాన్ని ఉటంకించారు.నిష్పక్షపాతానికి కట్టుబడి న్యాయమైన తీర్మానాలకు వేదికను ఏర్పాటు చేయడంతో నిపుణులకు ఈ సూత్రం ప్రతిధ్వనిస్తుందని చెప్పారు. ఐఏఎంసీ రిజిస్ట్రార్ ప్రారంభోపన్యాసం చేశారు. భారత్‌ను అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంగా మార్చడంలో న్యాయవ్యవస్థ, ప్రభుత్వ పాత్ర కీలకమని అన్నారు. కార్యక్రమంలో జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి, జస్టిస్ శ్రీసుధ, జస్టిస్ నంద, జస్టిస్ కాజ శరత్, జస్టిస్ పుల్లా కార్తీక్, సింగపూర్ ఇంటర్నేషనల్ కమర్షియల్ కోర్ట్ అంతర్జాతీయ మధ్యవర్తి, అంతర్జాతీయ న్యాయమూర్తి ప్రొఫెసర్ డగ్లస్ జోన్స్, లండన్, టొరంటో, సిడ్నీలోని లా ఛాంబర్స్‌తో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్ ప్రొఫెసర్ జానెట్ వాకర్, ఎఫ్టీఐ కన్సల్టింగ్ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ లీ బేకర్, అర్బిట్రేటర్ భాగస్వామి విన్సెంట్ రోవాన్, ఎఫ్టీఐ కన్సల్టింగ్‌లో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ కార్తీక్ బలిసాగర్ పాల్గొన్నారు. -
యువతలో అనాసక్తి .. సింగరేణిలో ఈ గనుల్లోనే గైర్హాజరీలు ఎక్కువ
చిన్నచిన్న అనారోగ్య కారణాలు సాకుగా చూపుతూ విధులకు డుమ్మా. వీరిలోనూ ఉన్నత విద్యావంతులే అధికం.. ఒక్క వకీల్పల్లిగనిలోనే 60 మంది దాకా గైర్హాజరుతో ఉద్యోగాలు కోల్పోవద్దంటున్న అధికారులు గోదావరిఖని: సింగరేణి భూగర్భగనుల్లో పనిచేసేందుకు యువత ఎక్కువగా మక్కువ చూపడం లేదు. కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందినవారే గైర్హాజరు అవుతున్న వారిలో అధికంగా ఉన్నారు. బీటెక్, ఎంటెక్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ లాంటి ఉన్నత చదువులు చదివి ప్రస్తుతం వచ్చిన ఉద్యోగాన్ని నామోషిగా భావించేవారు కొందరయితే, ఇక్కడ వర్క్ కల్చర్ ఇష్టం లేక, సిగరేణి ఆఫీసుల్లో అవకాశం రాక, లైట్ జాబ్‌ల కోసం పరుగులు తీసేవారు మరికొందరు. మూడు షిఫ్ట్‌ల విధానానికి ఇష్టపడినవారు ఇంకొందరు. సింగరేణిలో చేరిన కొద్దిరోజులకే విధులకు డుమ్మా కొట్టేవారి సంఖ్యా క్రమక్రమంగా పెరుగుతోంది. పలువురు కుటుంబసభ్యులు,తల్లిదండ్రుల అనారోగ్య కారణాలు సాకుగా చూపుతూ గైర్హాజరవుతున్నారు. ఒక్క వకీల్‌పల్లిగనిలో గైర్హాజరు అయిన వారు 60 మంది దాకా ఉన్నారు. ఆర్జీ–1 ఏరియా జీడీకే–11గనిలో ఓ యువ కార్మికుడు 2022 ఏప్రిల్‌లో ఉద్యోగంలో చేరాడు. 15 నెలల్లో 19రోజులు మాత్రమే డ్యూటీ చేశాడు. గైర్హాజర్ కౌన్సెలింగ్‌కు హాజరై తన తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోలేక డ్యూటీకి రావడం లేదని కారణంగా చెప్పాడు. దీంతో గైర్హాజర్ కార్మికుల జాబితాలో ఆయన చేరాడు. జీడీకే–11గనిలో బదిలీ వర్కర్‌గా 2015లో సింగరేణి విధుల్లో చేరాడు. ఐదేళ్ల నుంచి కనీసం వంద మస్టర్లు చేయలేదు. దీంతో ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసే పరిస్థితి ఏర్పడింది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగోలేకే తాను డ్యూటీకి రావడం లేదని చెబుతున్నాడు. ‘ఆర్జీ–2 ఏరియా వకీల్‌పల్లిగనిలో పనిచేస్తున్న యువ కార్మికుడు 2015లో కారుణ్య నియామకం ద్వారా సంస్థలో చేరాడు. డిగ్రీ పూర్తి చేసిన యువకుడికి సంబంధించి గడిచిన 8 ఏళ్లలో వంద మçస్టర్లు మాత్రమే నమోదయ్యాయి. తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్లే డ్యూటీకి రాలేకపోతున్నానని అంటున్నాడు. ..ఆర్జీ–2 లో వకీల్‌పల్లిగనికి చెందిన ఒకరు 2018లో ఉద్యోగంలో చేరారు. కనీసం అతను 60 డ్యూటీలు కూడా చేయలేదు. దీంతో సింగరేణి యాజమాన్యం గైర్హాజర్ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని నోటీసు జారీ చేసింది. ఇటీవల గనిలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు హాజరయ్యాడు. కారుణ్య నియామకాలు ఇలా సింగరేణిలో పనిచేసే కార్మికుడు మెడికల్ ఇన్వాలిడేషన్ (అనారోగ్య కారణం)తో విధుల నుంచి తప్పుకుంటే వారి స్థానంలో కొడుకుకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం ఇస్తున్నారు. తెలంగాణ వచ్చాక 2015 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, ఇప్పటివరకు 11,541మంది యువత ఉద్యోగాల్లో చేరారు. విధుల్లో చేరిన నాటి నుంచి మూడేళ్ల పాటు పనిచేస్తే వారి ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి. అయితే సింగరేణిలో 12 ఏరియాల్లో గత మూడేళ్లలో కనీసం 100 మస్టర్లు కూడా చేయని కార్మికులు 1377 మంది ఉన్నారు. పూర్తిస్థాయి యాంత్రీకరణ ఉన్నా.. పదేళ్ల కిందట అయితే భూగర్భగనిలోకి దిగి పైకి ఎక్కడమే ఎంతో శ్రమగా ఉండేది. తట్టాచెమ్మస్ పూర్తిగా కనుమరుగైపోయింది. సెమీ మెకనైజ్డ్, ప్రస్తుతం పూర్తిస్థాయి యాంత్రీకరణ కొనసాగుతోంది. మ్యాన్రైడిండ్, చైర్‌కార్, చైర్లిఫ్ట్లాంటి విధానం ద్వారా భూగర్భగనిలోని పనిస్థలాల వద్దకు కార్మికులను తీసుకెళ్లి, తిరిగి తీసుకొస్తున్నారు. దీంతో కార్మికులకు నడక శ్రమ చాలా తగ్గింది. అయినా చాలామంది యువ కార్మికులు ఆఫీస్ కార్యాలయాలు, ఓసీపీలు, గనిపైన ఉన్న లైట్‌జాబ్ కోసం పైరవీలు చేస్తున్నారు. ఏటా వంద మస్టర్లు తప్పనిసరి సంస్థలో బదిలీ వర్కర్లుగా ఉద్యోగంలో చేరిన కార్మికులకు ఏటా భూగర్భ గనుల్లో అయితే 190 మస్టర్లు, సర్ఫేజ్లో అయితే 240 మస్టర్లు ఉండాలి. అవి ఉంటేనే వారి ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి. ఏటా వంద మస్టర్ల చొప్పున మూడేళ్ల పాటు 300 మస్టర్లుంటే ఉద్యోగానికి గ్యారెంటీ. లేనిపక్షంలో యాజమాన్యం నిబంధనల ప్రకారం ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తుంది. వాస్తవ కారణాలు ఉంటే సంస్థ సహకరిస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఏర్పడింది. సింగరేణిలో చేరిన యువత చిన్నకారణాలతో విధులకు గైర్హాజరవుతూ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు. ఏవైనా వాస్తవ కారణాలుంటే సంస్థ కూడా సహకరిస్తుంది. సంస్థలో యువకార్మికులు పెరుగుతున్న క్రమంలో సంస్థ మరింత లాభాల బాటలో పయనించాలి. కారణాలేవైనా సంస్థ ఉద్యోగం పోగొట్టుకుని ఉద్యోగితో పాటు కుటుంబం వీధిన పడటం సరికాదు. –బలరాం, డైరెక్టర్(పా), సింగరేణి -
అంజూ ఘటన: ఆ కుటుంబానికి ఉపాధే కరువైంది!
జైపూర్: మధ్యప్రదేశ్‌కు చెందిన అంజూ అనే వివాహిత పాక్‌కు వెళ్లి అక్కడే తన ప్రియున్ని వివాహమాడిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనల అనంతరం అంజూ కుటుంబం స్థానికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అంజూ నిర్వాకం తర్వాత స్థానికులు ఆ కుటుంబం నుంచి దూరంగా ఉంటున్నారట. కేవలం గ్రామంలోనే గాక ఉద్యోగంలో కూడా వెలివేతకు గురికావాల్సి వస్తోందని సమాచారం. అంజూ తండ్రి గయా ప్రసాద్ థామస్ బౌనా అనే గ్రామంలో బట్టల కుట్టే వృత్తి చేస్తున్నారు. తన కూతురు అంజూ పాక్‌కు వెళ్లిపోయిన తర్వాత ఎవరూ తనకు ఉపాధిని కల్పించడం లేదని చెప్పారు. మొదట సానుభూతి చూపిన గ్రామస్థులే.. ఇప్పుడు దూరంగా ఉంటున్నారని వాపోయారు. అటు.. అంజూ సోదరుడు, భర్తకు కూడా తమ కంపెనీల్లో ఇదే పరిస్థితి ఎదురవుతోందట. అంజూ సోదరుడు డేవిడ్ ఓ ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్నాడు. అయితే.. అంజూ వ్యవహారం తర్వాత తాను పనిచేసే సంస్థ డేవిడ్‌ను ఇంటివద్దే ఉండమని చెప్పేసిందని చెప్పారు. అంజూ భర్తను కూడా ఆయన పనిచేసే కంపెనీ బెంచ్‌కే పరిమితం చేసిందట. ఏ పని అప్పగించడం లేదట. ఖాలీ గానే ఉంచున్నారని వెల్లడించారు. అంజూ అనే వివాహిత ఇద్దరు పిల్లలు, భర్తను వదిలి ప్రియుని కోసం పాకిస్థాన్‌కు కొన్ని రోజుల క్రితం వెళ్లిపోయింది. అక్కడే తన పేరును ఫాతిమాగా మార్చుకుని పెళ్లి కూడా చేసుకుంది. ఈ ఘటనల తర్వాత అంజూపై ఆమె తండ్రి తీవ్ర ఆరోపణలు చేశాడు. తనకు చెప్పకుండానే పాకిస్థాన్‌కు వెళ్లిందని అంజూ భర్త తెలిపారు. పాక్ వెళ్లాక రెండు మూడు రోజుల తర్వాత మళ్లీ వస్తానని చెప్పినట్లు వెల్లడించారు. అయితే.. అంజూ పాక్ వెళ్లిన తర్వాత అక్కడ ఓ రియల్ ఎస్టేట్ సంస్థ అంజూ కొత్త జంటకు భూములు వంటి అనేక కానుకలు సమర్పించారు. దీనిపై అనుమానం వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా.. అంతర్జాతీయ కుట్ర కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దర్యాప్తునకు ఆదేశించారు. ఇదీ చదవండి: భర్త కోసం త్యాగం.. ఇలాంటి అమ్మాయి భార్యగా వస్తే ఎంత బాగుంటుందో! -
28 ఏళ్ల క్రితం రూ. 166 కోట్ల జాక్‌పాట్.. ఇప్పుడు తిరిగి పాత జీవితంలోకి..
అతను నేషనల్ లాటరీలో 11 మిలియన్ యూరోలు(సుమారు రూ.116 కోట్లు) గెలుచుకున్నాడు. ఇంత భారీ మొత్తం దక్కించుకున్న అతను రెండు దశాబ్ధాల తరువాత తన గత వర్కింగ్ లైఫ్‌లోకి తిరిగి వచ్చేశాడు. 61 ఏళ్ల మార్క్ గార్డ్నర్, అతని బిజినెస్ పార్ట్నర్ పాల్ మెడిసన్ 1995లో 22 మిలియన్ల యూరోలు గెలుచుకున్నారు. దీంతో వారి జీవితం పూర్తిగా మారిపోయింది. మార్క్ .. బ్రిటన్‌కు చెందినవాడు. అతను కొంత మొత్తాన్ని అస్తవ్యస్త రీతిలో వివిధ సంస్థల్లో పెట్టుబడి పెట్టాడు. దీంతో కోట్లాది రూపాయలు కోల్పోయాడు. అతని నాల్గవ భార్య కూడా ఇదేవిధంగా వివిధ చోట్లు పెట్టుబడులు పెట్టి నష్టపోయింది. ‘ఈ పాటికి నేను పనిచేయడం మానేసేవాడిని’ అయితే మార్క్ కొంత మొత్తాన్ని మాత్రం సరైన చోట్ల పెట్టుబడిగా పెట్టాడు. వాటిలో యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ కూడా ఒకటి. దీనితో పాటు తమ కంపెనీ క్రాఫ్ట్ గ్లాస్లో 2 మిలియన్ యూరోలు పెట్టుబడిగా పెట్టాడు. ఇప్పుడు మార్క్ ఈ కంపెనీని నడుపుతున్నాడు. మార్క్ మీడియాతో మాట్లాడుతూ ‘నన్ను తప్పుగా అనుకోకండి. నేను ఆరోజు కాకుండా.. ఇప్పుడు ఈ 61 ఏళ్ల వయసులో లాటరీలో గెలిచివుంటే పరిస్థితులు మరో విధంగా ఉండేవి. ఈ పాటికి నేను పనిచేయడం మానేసేవాడిని. ఇప్పుడు నా దగ్గర కావాలసినంత తెలివితేటలు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో నేను ఒక్క రోజు సెలవు తీసుకున్నా, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాను’ అని అన్నాడు. ప్రతీవారం లాటరీ టిక్కెట్ల కొనుగోలు మార్క్‌కు ఇప్పటికీ ఫుట్‌బాల్‌తో అనుబంధం ఉంది. అతనికి హాస్టింగ్లో లోకల్ క్లబ్ ఉంది. అలాగే మార్క్ గతంలో బార్బాడోస్‌లో ఒక ఇల్లు కూడా కొనుగోలు చేశాడు. లాటరీలో వచ్చిన సొమ్మునంతా అతను దుర్వినియోగం చేయలేదు. కొన్ని పెట్టుబడుల వలన అతనికి లబ్ధి చేకూరింది. ఇప్పుడు కూడా మార్క్ ప్రతీవారం లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తుంటాడు. తాను 1995లో ఏ నంబరు లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశాడో ఆ నంబరు గల లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తుంటాడు. నాటి తన పార్ట్నర్ పాల్ ప్రస్తుతం స్కాట్‌ల్యాండ్‌లో ఉన్నాడని, అయితే అతను ఆ లాటరీ సొమ్ముతో ఏమి చేశాడో తెలియదని మార్క్ తెలిపాడు. ఇది కూడా చదవండి: కేలండర్లో లేని రోజున పుట్టిన పిల్లాడు.. విద్యాశాఖ నిర్లక్ష్యానికి పరాకాష్ట! -
హెచ్-1బీ: భారతీయ టెక్ నిపుణులకు శుభవార్త
US-Canada H-1B visa holders: అమెరికా హెచ్-1 బి వీసాదారులకు కెనడా శుభవార్త వెల్లడించింది. హెచ్-1 బీ వీసాదారులు ఇకపై కెనడాలో కూడా పనిచేయవచ్చని తాజాగా ప్రకటించింది. అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులను ఆకర్షించేందుకు యూఎస్ హెచ్-1 వీసా హోల్డర్లకు ఓపెన్ వర్క్ పర్మిట్లను ఇవ్వడం ప్రారంభించింది. దీని ద్వారా అమెరికాలో ఉన్న 75 శాతం భారత హెచ్-1బీ వీసాదారులకు ప్రయోజనం చేకూరనుంది. (హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన అదానీ) ఈ కొత్త పథకం ద్వారా కెనడా ప్రభుత్వం10వేల మంది దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ వీసా హోల్డర్లు కెనడాలో మూడు సంవత్సరాల పాటు పని చేయడానికి అనుమతిస్తుంది. ఈ వీసా హోల్డర్ల కుటుంబ సభ్యుల చదువుకోవచ్చు లేదా దేశంలో పని చేసుకోవచ్చు. ఇందుకు తాత్కాలిక నివాస వీసా, వర్క్ లేదా స్టడీ పర్మిట్ లభిస్తుందని పేర్కొంది. ఇప్పటిదాకా యూఎస్‌లో పని చేసే హెచ్-1 బీ హోల్డర్లు స్పెషాలిటీ ఆక్యుపేషన్ వీసాను ఉపయోగించేవారు. కాగా 2023 వసంవత్సరం జులై 16వతేదీ నాటికి హెచ్1 బి వీసా హోల్డర్లు, వారితో పాటు కుటుంబ సభ్యులు కెనడాకు రావడానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని కెనడా ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. టెక్ కంపెనీలు ఇండియా, చైనా వంటి దేశాల నుండి ప్రతి సంవత్సరం పదివేల ఉద్యోగులను నియమించు కుంటాయి. (అత్యధిక ట్యాక్స్ కట్టే బీటౌన్ భామ ఎవరో తెలుసా? నెటవర్త్ తెలిస్తే షాకవుతారు) -
టీచరే బడిదొంగ... ఇరవై ఏళ్లుగా డుమ్మా!
స్కూలుకు డుమ్మా కొట్టే స్టూడెంట్స్‌ను చూసి ఉంటారు. కానీ, టీచర్ని ఎప్పుడైనా చూశారా! ఫొటోలో కనిపిస్తున్న ఈ టీచర్ ఒక రోజు కాదు, వారం కాదు.. ఏకంగా ఇరవై సంవత్సరాలు స్కూలుకు డుమ్మా కొట్టింది. ఇటలీకి చెందిన సింజియా పలైన డిలియో, వెనిస్లోని ఓ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో సైన్స్ టీచర్‌గా పనిచేస్తుంది. ఇరవై నాలుగు సంవత్సరాల తన ఉద్యోగ జీవితంలో తను స్కూలుకెళ్లింది కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే! అనారోగ్య సెలవులు, కుటుంబ సెలవులు, అనుమతి సెలవులు వంటి వివిధ రకాల సెలవులు పెట్టి, డుమ్మా కొట్టేది. వీటిల్లో కొన్ని రికార్డుల్లో ఉంటే, చాలా వరకు సెలవులు రికార్డుల్లోనే లేవు. ఈ మధ్యనే స్కూల్ ఇన్స్పెక్టర్లు లియో బోధనను పరిశీలించినపుడు, ఆమె గందరగోళంగా పాఠాలను బోధించింది. తర్వాత పనితీరుపై పరీక్ష నిర్వహించినపుడు, విద్యార్థుల నుంచే లియో పుస్తకాలను సేకరించడం గమనించి, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. లియో ఇందుకు ఒప్పుకోలేదు. ఉద్యోగం తిరిగి సాధించుకోవడానికి కోర్టులో కేసు వేసింది. కోర్టు కూడా లియో దాదాపు రెండు దశాబ్దాలు స్కూలుకు హాజరు కాలేదని గుర్తించింది. ‘ఆమెతన ఉద్యోగం తిరిగి పొందలేదు’ అని తీర్పు ఇవ్వడంతో, ఇది కాస్త వైరల్‌గా మారింది. (చదవండి: చిన్నపిల్లలే!.. వారికేం తెలియదు అనుకుంటే..పప్పులో కాలేసినట్లే..) -
అందమైన నగల తయారీలో బుజ్జి చేతులు రక్తసిక్తం!
ఆ పట్టణానికి చెందిన పోలీసులు ఒక గృహంపై దాడులు చేసి, 22 మంది బాల కార్మికులను రెస్క్యూ చేశారు. వీరిని షహన్వాజ్ అనే వ్యాపారి రూ. 500 చొప్పున వారి తల్లిదండ్రుల నుంచి కొనుగోలు చేశాడని పోలీసులు గుర్తించారు. తరువాత ఆ చిన్నారుల చేత రోజుకు ఏకంగా 18 గంటలపాటు ఆర్టిఫిషిల్ నగల తయారీ పనులు చేయిస్తున్నట్లు కనుగొన్నారు. అది రాజస్థాన్‌లోని జైపూర్... ఈ పట్టణం పింక్ సిటీగా పేరొందింది. పర్యాటక ప్రాంతంగానూ గుర్తింపు పొందింది. ఆభరణాల తయారీకి కేంద్రంగా ఉన్న ఈ పట్టణానికి విదేశీయులకు కూడా వస్తుంటారు. ఇక్కడ తయారయ్యే నగలు వేసుకుని మహిళలు మురిసిపోతుంటారు. కానీ ఈ నగల తయారీ వెనుక కొందరి బాల్యం మసకబారుతున్నదని, వెట్టి చాకిరీతో వారు నలిగిపోతున్నారనే విషయం చాలామందికి తెలియదు. జైపూర్‌లోని భట్టాబస్తీలో 22 మంది చిన్నారులను జూన్ 12 న పోలీసులు ఒక పిల్లల సంరక్షణా సంస్థ సాయంలో రెస్క్యూ చేశారు. వీరి చేత బలవంతంగా నగలు తయారు చేసే పనులు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చదువుకునే వయసులో వారి బాల్యాన్ని చిదిమేస్తున్నట్లు పోలీసులు గమనించారు. పోలీసులు రెస్క్యూ చేసిన చిన్నారులంతా బాహార్లోని సీతామఢి, ముజఫ్ఫర్‌పూర్ ప్రాంతానికి చెందినవారని సమాచారం. రెస్క్యూ అనంతరం విచారణలో పోలీసులకు పలు విషయాలు తెలిశాయి. ఈ చిన్నారులతో రోజుకు 18 గంటల పాటు చాకిరీ చేయిస్తున్నారు. భోజనం పేరుతో వారికి ఖిచిడీ మాత్రమే ఇస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆవేదన చెందారు. ఈ సందర్భంగా ఆ చిన్నారులు పోలీలసులతో మాట్లాడుతూ షహన్వాజ్ అనే వ్యక్తి తమ తల్లిదండ్రులకు రూ.500 చొప్పున ఇచ్చి తమను కొనుగోలు చేశాడని తెలిపారు. తమను బీహార్ నుంచి ఇక్కడకు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: బాధితులకు వైద్య సేవలు అందించే ఎక్స్‌ప్రెస్ రైలు ఈ చిన్నారులందరినీ ఒక గదిలో బంధించి, ప్రతీరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ నగలు తయారీ చేసే పనులను బలవంతంగా చేయిస్తున్నారు. ఈ నేపధ్యంలో పని ఒత్తిడికి తోడు రోజూ ఖిచిడీ తినడం వలన ఆ చిన్నారులు అనారోగ్యం బారినపడుతున్నారు. అయినా వారి యజమాని మనసు కరగడం లేదు. పైగా ఆ చిన్నారుల చేత పశువుల చేత పనిచేయించినట్లు వ్యవహరిస్తున్నాడు. కాగా సోమవారం అంటే జూన్ 12న రాత్రి సమయంలో ఈ గదిలో నుంచి చిన్నారుల రోదనలు వినిపించడంతో స్థానికులు ‘బచపన్ బచావో’ అనే పిల్లల సంరక్షణ సంస్థకు ఈ విషయాన్ని తెలియజేశారు. వెంటనే ఆ సంస్థ నిర్వాహకులు మనీష్ శర్మ పోలీసులకు ఈ సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను చూసిన షహన్వాజ్ తన భార్యతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సందర్భంగా పోలీసులు అక్కడ రెస్క్యూ నిర్వహించి, 22 మంది చిన్నారులను కాపాడారు. వారంతా 9 నుంచి 16 ఏళ్ల మధ్యగలవారేనని పోలీసులు గుర్తించారు. వారిని వారి తల్లిదండ్రుల చెంతకు తరలించే ప్రయత్నిం చేస్తున్నారు. అలాగే నిందితుడు షహన్వాజ్, అతని భార్య కోసం గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: రీల్స్‌పై మోజులో బావిపైకి ఎక్కి.. -
డబ్బు కోసం ఆ పని కూడా చేయాల్సి వచ్చింది: ప్రముఖ నటి
టాలీవుడ్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెరపై తల్లి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి సోషల్ మీడియాలో విభిన్నమైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది. పలు వీడియోలతో తన ఫాలోవర్లను అలరిస్తోంది. ఆమె వర్క్ అవుట్ చేస్తూ, డ్యాన్స్ చేస్తున్న వీడియోలను కూడా పోస్ట్ చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి, పెళ్లికి ముందు తాను అనుభవించిన కష్టాల గురించి ప్రగతి చెప్పు కొచ్చింది. (ఇదీచదవండి: ట్రోలర్స్‌కు ఫోటోలతో కౌంటర్ ఇచ్చిన 'భీమవరం' బ్యూటీ) ఇంట్లో ఊరికే తింటున్నావ్ అనేలా తన అమ్మ చేసిన కామెంట్లు నచ్చేవి కావని ఆమె తెలిపింది. దాంతో పిజ్జా షాపులో పని చేశానని ఆమె పేర్కొంది. అంతే కాకుండా డబ్బు కోసం ఎస్టీడీ బూత్‌లో కూడా పని చేశానని ప్రగతి తెలిపింది. నేను ఆ సమయంలో లడ్డూలా ఉండే దానిని, అందువల్ల ఒక యాడ్ చేయమని కొందరు అడిగారని తెలిపింది. అలా మోడలింగ్‌లోకి వచ్చాక హీరోయిన్గా కూడా అవకాశాలు వచ్చాయి. వాటిని సరిగ్గా వినియోగించుకోలేకపోయానని చెప్పు కొచ్చింది. ఆ సమయంలో హీరో కమ్ నిర్మాతతో ఏర్పడిన వివాదం వల్ల సినిమాలే చేయకూడదని నిర్ణయించుకుని 20 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత కొంత కాలానికి తన భర్తతో విభేదాలు రావడం వల్ల విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పింది. ప్రగతి వెల్లడించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: రాజకీయ నాయకుడి కుమారుడిని పెళ్లాడనున్న టాలీవుడ్ హీరోయిన్) -
ఇదెక్కడి వర్క్ ఫ్రొం హోమ్ రా మామ...
-
మెటా కీలక నిర్ణయం వర్క్ ఫర్మ్ హోమ్..!
-
ఇటుకలు చేస్తున్న సోనుసూద్
-
నాకు కాళ్లు లేకపోయినా ప్రజలకు వాలంటీరుగా సేవ చేసే అవకాశం కల్పించారు.. నాకు పెన్షన్ కూడా ఇస్తున్నారు..!
-
H-1B వీసాదారులకు శుభవార్త..
-
ఇండియన్ టెక్కీలకు ఊరట.. హెచ్-1బీ వీసాలపై యూఎస్ కోర్ట్ కీలక తీర్పు
అమెరికాలోని ఇండియన్ టెక్కీలకు ఊరట నిస్తూ హెచ్-1బీ వీసాలపై యూఎస్ కోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. యూఎస్ టెక్ సెక్టార్‌లోని విదేశీ ఉద్యోగులకు పెద్ద ఉపశమనంగా హెచ్-1బి వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు అమెరికాలో పని చేయవచ్చని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. కొన్ని వర్గాల హెచ్-1బీ వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములకు ఉపాధి అధికార కార్డులను ఇచ్చే ఒబామా కాలం నాటి నిబంధనలను కొట్టివేయాలని సేవ్ జాబ్స్ యూఎస్ఏ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేసింది. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఇక పదేళ్లూ అంతంతే!) సేవ్ జాబ్స్ యూఎస్ఏ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అమెజాన్ , యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ కంపెనీలు కూడా వ్యతిరేకించాయి. హెచ్-1బీ వర్కర్ల జీవిత భాగస్వాములకు యూఎస్ ఇప్పటివరకు దాదాపు లక్ష వర్క్ ఆథరైజేషన్ కార్డులు జారీ చేసింది, వీరిలో గణనీయమైన సంఖ్యలో భారతీయులు ఉన్నారు. హెచ్-1బీ వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకునేలా కోర్టు ఇచ్చిన తీర్పుపై అక్కడి ప్రముఖ కమ్యూనిటీ నాయకుడు, వలసదారుల హక్కుల కోసం పోరాడే న్యాయవాది అజయ్ భూటోరియా హర్షం వ్యక్తం చేశారు. అయితే కోర్టు తీర్పుపై అప్పీల్ వెళ్లనున్నట్లు సేవ్ జాబ్స్ యూఎస్ఏ తెలిపింది. (గంగూలీ ముద్దుల తనయ.. అప్పుడే ఉద్యోగం చేస్తోంది.. జీతమెంతో తెలుసా?) -
అమెజాన్ ఉద్యోగులకు అలర్ట్: మే 1 నుంచి..!
సాక్షి,ముంబై: ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వారానికి మూడు రోజులు ఆఫీసు నుంచి పనిచేయాలని కార్పొరేట్ ఉద్యోగులను కోరింది. ఈ మేరకు అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ ఫిబ్రవరి 17న సిబ్బందికి మెమో ద్వారా సమాచారం అందించారు. ఈ విధనం మే 1 నుంచి అమల్లోకి రానుంది. ఎక్కువ సమయం ఆఫీసులో, సహోద్యోగులతో కలిసి ఉన్నప్పుడు నేర్చుకోవడానికి, సంస్కృతిన బలోపేతం కావడానికి ఎక్కువ దోహదపడుతుందని జెస్సీ తెలిపారు. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు సహకారంతో కొత్త ఆవిష్కారాలుసులభమవుతాయనీ, వ్యక్తిగతంగా ఒకరి నుండి మరొకరు నేర్చుకోవడం ఈజీ అని పేర్కొన్నారు. అలాగే తమ ఉద్యోగులు ప్రధాన నగరాల్లోని కార్యాలయాలకు వస్తే వ్యాపారానికి, ఆర్థిక వ్యవస్థలకు ఊతమిస్తుందని ఆండీ జెస్సీ బ్లాగ్ పోస్ట్ సందేశంలో పేర్కొన్నారు. కాగా గ్లోబల్‌గా కరోనా పరిస్థితి చక్కబడుతున్న నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్నాయి. గత నెలలో, స్టార్‌బక్స్ తన కార్పొరేట్ ఉద్యోగులకు వారానికి మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయాలని కోరింది.డిన్నీ కూడా వారానికి నాలుగు రోజులు ఆఫీసు నుంచి పని విధానం మార్చినుంచి ప్లాన్ చేసుకోవాలని డిస్నీ ఉద్యోగులను కోరుతోంది. వాల్‌మార్ట్ రెగ్యులర్ ఇన్-ఆఫీస్ పని దినాలను ప్లాన్ చేసు కోవాలని ఇటీవల తన టెక్ టీంలకు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
నువ్వున్నావ్‌గా! ఇల్లు ఊడ్చడానికి, వంట చేయడానికి,..
నువ్వున్నావ్‌గా! ఇల్లు ఊడ్చడానికి, వంట చేయడానికి, బట్టలు ఉతకడానికి.. పనిమనుషుల్ని పెట్టుకుంటే నా జీతం కూడా సరిపోదు.. -
సీఎం జగన్ ఆదేశాలు.. ‘అన్నమయ్య’ పునరుద్ధరణకు శ్రీకారం
సాక్షి, అమరావతి: అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చెయ్యేరుకు ఎంత వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. రూ.635.21 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్–ఓపెన్ విధానంలో రెండేళ్లలో పూర్తి చేయాలనే షరతుతో రూపొందించిన టెండర్ ముసాయిదా షెడ్యూల్‌ను జలవనరుల శాఖ ఎస్ఈ కె.శ్రీనివాసులు బుధవారం జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపారు. జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదంతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ ధరకు ముందుకొచ్చిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించనున్నారు. ఎన్నడూ లేని రీతిలో.. చెయ్యేరుకు వందేళ్లకు ఒకసారి గరిష్టంగా 2.40 లక్షల క్యూసెక్కులు, రెండు వందల ఏళ్లకు ఒకసారి గరిష్టంగా 2.85 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేయగా 140 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గతేడాది నవంబర్ 19న చెయ్యేరు నుంచి అన్నమయ్య ప్రాజెక్టులోకి 3.20 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం పోటెత్తింది. ఆ స్థాయిలో వరదను దిగువకు విడుదల చేసే సామర్థ్యం స్పిల్ వేకు లేకపోవడంతో మట్టికట్ట తెగిపోయింది. ఈ నేపథ్యంలో చెయ్యేరుకు నాలుగు లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్నమయ్య ప్రాజెక్టును పునరుద్ధరించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ పనులు చేపట్టడానికి రూ.787.77 కోట్లతో జలవనరుల శాఖ నవంబర్ 2న పరిపాలన అనుమతి ఇచ్చింది. నిపుణుల నివేదికపై టీడీపీ సర్కారు పెడచెవి ♦అన్నమయ్య జిల్లాలో రాజంపేట మండలం బాదనగడ్డ వద్ద చెయ్యేరుపై 2.24 టీఎంసీల సామర్థ్యంతో అన్నమయ్య ప్రాజెక్టును 1981లో ప్రారంభించి 2001కి పూర్తి చేశారు. ప్రాజెక్టు కింద 22,500 ఎకరాల ఆయకట్టు ఉంది. ♦వరదను దిగువకు విడుదల చేసేలా 206.65 మీటర్ల ఎత్తుతో 94 మీటర్ల పొడవున స్పిల్ వే, అనుబంధంగా 336 మీటర్ల పొడవున మట్టికట్టను నిర్మించారు. స్పిల్ వేకు 13.75 మీటర్ల ఎత్తు, 14 మీటర్ల వెడల్పుతో ఐదు గేట్లు అమర్చారు. ♦ 2012లో జల వనరుల శాఖ నిర్వహించిన 3–డీ అధ్యయనంలో అన్నమయ్య ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి గరిష్టంగా 2.17 లక్షల క్యూసెక్కులే దిగువకు విడుదల చేయవచ్చని తేలింది. 2017లో ప్రాజెక్టును తనిఖీ చేసిన డ్యామ్ సేఫ్టీ కమిటీ 1.30 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేసేలా అదనంగా మరో స్పిల్ వే నిర్మించాలని అందచేసిన నివేదికను టీడీపీ సర్కారు బుట్టదాఖలు చేసింది. ♦గతేడాది నవంబర్ 16, 17, 18, 19 తేదీల్లో శేషాచలం– నల్లమల అడవులు, చెయ్యేరు, బహుదా, మాండవ్య పరీవాహక ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. 17న అన్నమయ్య ప్రాజెక్టులో సగటున 1.75 టీఎంసీలను నిల్వ చేస్తూ వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేశారు. 18న రాత్రి 8 గంటలకు వరద 77,125 క్యూసెక్కులకు చేరడంతో దిగువకు 1,09,124 క్యూసెక్కులను వదులుతూ వచ్చారు. అదే రోజు రాత్రి పది గంటలకు ప్రాజెక్టు గేట్లను పూర్తిగా ఎత్తివేసి 1,46,056 క్యూసెక్కులు దిగువకు వదిలేశారు. 19న తెల్లవారుజామున 3 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టులోకి 3.20 లక్షల క్యూసెక్కుల వరద రావటంతో మట్టం గరిష్ట స్థాయికి చేరింది. సామర్థ్యం చాలక మట్టికట్ట పైనుంచి దిగువకు వరద పారింది. దీంతో 19న ఉదయం 6.30 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగింది. చదవండి: బాలయ్యా.. ఇటు రావేమయ్యా.. కిష్టప్ప.. ఎక్కడున్నావప్పా.. టెండర్ నిబంధనలు ఇవీ.. ♦కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ప్రమాణాల ప్రకారం చెయ్యేరుకు గరిష్టంగా వచ్చే వరదపై అధ్యయనం చేసి అంతకంటే ఎక్కువ సామర్థ్యంతో వరదను దిగువకు విడుదల చేసేలా స్పిల్ వే నిర్మించాలి. ♦సీపీడబ్ల్యూఆర్‌ఎస్ (సెంట్రల్ పవర్ వాటర్ రీసెర్చ్ స్టేషన్), ఏపీఈఆర్‌ఎల్ (ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్), సీడబ్ల్యూసీ లాంటి అధీకృత సంస్థలతో అధ్యయనం చేపట్టి జలవనరుల శాఖ సూచనల ప్రకారం ప్రాజెక్టును పునరుద్ధరించాలి. ♦ప్రాజెక్టు వద్ద భౌగోళిక పరిస్థితులపై అధ్యయనం నిర్వహించి డయాఫ్రమ్ వాల్ / ఇతర పద్ధతుల్లో పునాది నిర్మాణంపై నిర్ణయించాలి. -
విశాఖ జిల్లాలో చురుగ్గా జగనన్న లేఅవుట్ పనులు
-
వందేళ్ల బామ్మకి గౌరవ డాక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టా
రెండో ప్రపంచ యుద్ధం నాటి సమయంలోని వ్యక్తులను స్మరించుకుంటూ ..నాటి నుంచి ఇప్పటి వరకు మనుగడ సాధించి ఉన్న ఎందర్నో గౌరవించి సత్కరించాం. ఆ సమయంలో వారు చూపించిన తెగువ, ప్రదర్శించిన శక్తి యుక్తులను ప్రశంసించాం కూడా. అచ్చం అలానే ఒక్కడోక బామ్మ నాటి సమయంలోని ఒక ఉక్కు పరిశ్రమను కాపాడి అందరిచే ప్రశంసలు అందుకుంది. పైగా ఆమె నిస్వార్థ కృషికి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది యూకే ప్రభుత్వం. వివరాల్లోకెళ్తే....యూకేకి చెందిన వందేళ్ల వృద్ధురాలు రెండో ప్రపంచ యుద్ధంలో ఉక్కు పరిశ్రమను కూలిపోకుండా కాపాడింది. ఆమె యుక్త వయసులో ఆ ఉక్కు పరిశ్రమలో పనిచేసినప్పుడూ..పురుషుల కంటే తక్కువ వేతనంతో ఇతర మహిళలతో కలిసి పనిచేసింది. ఆమె 72 గంటల వారాలు విధులు నిర్వర్తించేది. ఆ వృద్ధురాలి పేరు కాథ్లీన్ రాబర్ట్స్. తనతోపాటు పనిచేసిన వారిలో బతికి ఉన్న ఏకైక వ్యక్తి ఆ బామ్మ. సంక్షోభం, ఆర్థిక పతనం వంటి విపత్కర సమయాల్లో తన దేశం కోసం అంకితభావంతో పనిచేసింది. కాథ్లీన్ బృందం గనులు, ప్లాంట్లలోని భారీ యంత్రాలు, క్రేన్లను నిర్వహించేవారు. పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్న పట్టించుకోకుండా నిరాటంకంగా పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఎప్పుడూ ఎటు నుంచి వైమానిక దాడులు జరుగుతాయోనన్న భయంతో హెల్మట్లు ధరించి మరీ విధులు కొనసాగించేవారు. కొన్నాళ్ల తర్వాత విధుల నుంచి తొలగింపబడ్డారు. ఐతే కాథ్లీన్ మౌనంగా ఊరుకోలేదు. ఉక్కుమహిళల వారసత్వాన్ని కాపాడేందుకు ఏడేళ్లు ప్రచారం చేసింది. చివరికి 70 ఏళ్ల తర్వాత ఆమె రచనలు షెఫిల్డ్ విశ్వవిద్యాలయం గుర్తించింది. క్యాథిలిన్ని ఉక్కు కార్మికురాలిగా, ప్రచారకురాలిగా ఆమె చేసిన కృషికి గుర్తింపు లభించడంతో ఆమె గౌరవ డాక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్‌ని అందుకుంది. ఈ మేరకు కాథ్లీన్ మాట్లాడుతూ...తనకు ఈ గౌవర డిగ్రీ ఇవ్వనున్నారని తెలిసి ఆశ్చర్యపోయాను. యుద్ధ ప్రయత్నానికి సహకరించిన ఉక్కుమహిళలందరి తరుఫున ఈ గౌరవ డాక్టరేట్‌ని తీసుకోవడం సంతోషంగా ఉంది. చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఆమె విద్యార్థులకు ఒక విజ్ఞప్తి చేశారు. "మీరు ప్రతీది పుస్తకం నుంచి నేర్చుకోలేరు. కేవలం అనుభవంతోనే కొన్నింటిని తెలుసుకోగలరు అని అన్నారు. అలాగే అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ మీ కలలను సాకారం చేసుకోండి" అని సూచించారు. (చదవండి: ఏడాది వయసు కొడుకుతో ఈ రిక్షా నడుపుతున్న మహిళ: వీడియో వైరల్) -
ఫెస్టివల్ సీజన్ కదా.. చిల్ అవ్వండి, ఉద్యోగులకు 11 రోజులు సెలవులిచ్చిన కంపెనీ!
నగర వాసుల డైలీ లైఫ్ అంటే ఉదయం నుంచి రాత్రి వరకు బిజీ బిజీగా గడిపేస్తుంటారు. వారమంతా తీరిక లేకుండా ఎవరి పనుల్లో వాళ్లు విశాంత్రి అనే మాట మరిచి వీకెండ్లో కాస్త చిల్ అవుతుంటారు. అయితే కొందరికి మాత్రం ఆ కాస్త రిలీఫ్ అయ్యే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని గమనించిన ఓ కంపెనీ తమ ఉద్యోగులు శారీరకంగానే కాకుండా మానసికంగానూ దృఢంగా ఉండాలని భావించింది. అందుకే ఫెస్టివల్ సమయంలో బిజీగా గడిపిన అనంతరం వారి విశ్రాంతి కోసం ప్రత్యేకంగా పనికి బ్రేక్ పేరుతో సెలవులు ఇచ్చింది. వరుస పండుగల్లో బిజీ విక్రయాలతో ప్రజలు తీరిక లేకుండా ఈ ఫెస్టివల్ సీజన్ గడుపుతారు. అందుకే తమ కంపెనీ తన ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే ప్రయత్నంలో, ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం మీషో వరుసగా రెండవ సంవత్సరం కూడా 11 రోజుల "రీసెట్ అండ్ రీఛార్జ్ విరామం"ని ప్రకటించింది. ఈ విషయాన్ని కంపెనీ వెబ్సైట్లో పోస్ట్ చేసింది. అందులో.. "మేము వరుసగా రెండవ సంవత్సరం కంపెనీ-వ్యాప్తంగా 11-రోజుల విరామాన్ని ప్రకటించాం! రాబోయే పండుగ సీజన్‌తో పాటు వారి వర్క్ లైఫ్‌ని బ్యాలెన్స్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, మీషో ఉద్యోగులకు రీసెట్ & రీఛార్జ్ అనేది కొంత అవసరం కాబట్టి వారికి అక్టోబర్ 22 నుంచి నవంబర్ 1 వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ట్వీట్ చేసింది. We’ve announced an 11-day company-wide break for a second consecutive year! Keeping the upcoming festive season & the significance of #WorkLifeBalance in mind, Meeshoites will take some much-needed time off to Reset & Recharge from 22 Oct-1 Nov. Mental health is important. — Sanjeev Barnwal (@barnwalSanjeev) September 21, 2022 చదవండి: సగం సంపద ఆవిరైంది.. సంతోషంగా ఉందంటూ పోస్ట్ పెట్టిన మార్క్ జుకర్‌బర్గ్! -
ఆ జర్నలిస్ట్ వర్క్ డెడికేషన్ని చూసి... ఫిదా అవుతున్న నెటిజన్లు
పాకిస్తాన్లో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు సంభవించిన వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో పాకిస్తాన్లో వేలాదిమంది మృతి చెందారు. లక్ష్లలాదిమంది నిరాశ్రయులయ్యారు. రహదారులు, వంతెనలు, రైల్వే మార్గం పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించడమే కాకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లోకి ఆర్మీని పంపించి సహాయక చర్యలు చేపట్టింది. అలాగే ప్రపంచ దేశాలకు సాయం అందించాల్సిందిగా పిలుపునిచ్చింది. మరోవైపు వరదలతో అల్లకల్లోలంగా ఉన్న పాకిస్తాన్ ప్రాంతాల్లో పరిస్థితులు గురించి సమాచారాన్ని అందించే పనిలో పడ్డాయి అక్కడ మీడియా సంస్థలు. ఈ క్రమంలో ఒక రిపోర్ట్ర్ పాకిస్తాన్‌లోని వరదలకు సంబంధిచి లైవ్ రిపోర్టింగ్‌ని అందించడానికి పెద్ద సాహసమే చేశాడు. సదరు రిపోర్టర్ ఏకంగా వరద ఉధృతిలో... పీకల్లోతు నీటిలో నిలబడి మరీ అక్కడ పరిస్థితి గురించి సమాచారం అందించాడు. దీంతో నెటిజన్లు ఆ జర్నలిస్ట్ డెడికేషన్ వర్క్‌కి హ్యాట్సాప్ అని ప్రశంసిస్తే, మరికొందరూ టీఆర్పీ రేటింగ్స్ కోసైం కొన్ని మీడియా సంస్థలు జర్నలిస్ట్‌లు చేత ఇలాంటి ప్రమాదకరమైన రిపోర్టింగ్‌లు చేయిస్తున్నాయంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: నడి రోడ్డుపై ఎద్దుతో పరాచకాలు... దెబ్బకు కుమ్మిపడేసింది) -
పాపం..వీరి నెల జీతం రూ.15వేల కంటే తక్కువే!
భారత్‌లో మూడింట 2 వంతుల మంది బ్లూ కాలర్ ఉద్యోగులు అంటే పొలం పనిచేసేవాళ్లు, మైనింగ్ వర్కర్లు, కనస్ట్రక్షన్,మ్యానిఫ్యాక్చరింగ్ ఉద్యోగులు నెలకు రూ.15,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారంటూ ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. పేరోల్ మేనేజ్మెంట్ యాప్ శాలరీబాక్స్ నివేదిక ప్రకారం..పని ప్రాంతాల్లో మహిళలు నెలకు సగటున రూ.12,398 సంపాదిస్తుండగా..వారి సహోద్యోగులైన పురుషుల కంటే 19 శాతం తక్కువ వేతనం తీసుకుంటున్నట్లు తేలింది. ఉద్యోగుల్లో 15 శాతం కంటే తక్కువ మంది నెలకు రూ.20,000-40,000 (సగటున రూ.25,000) వరకు సంపాదిస్తున్నారని డేటా హైలైట్ చేస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మెజారిటీ సంస్థలు కేంద్ర వేతన సంఘం (సిపిసి) నిర్ణయించిన కనీస వేతనం (అంటే నెలకు రూ.18,000.)కంటే తక్కువ వేతనాలు చెల్లిస్తాయని శాలరీ బాక్స్ తన నివేదికలో హైలెట్ చేసింది. ఆ రంగాల్లో మహిళలకు అత్యధిక వేతనాలు దేశవ్యాప్తంగా 850కి పైగా జిల్లాల నుండి వన్ మిలియన్‌కు పైగా శ్రామికులు డేటాబేస్ ఆధారంగా శాలరీ బాక్స్ ఈ నివేదికను రూపొందించినట్లు శాలరీబాక్స్ సీఈఓ , కో ఫౌండర్ నిఖిల్ గోయల్ ఒక ప్రకటనలో తెలిపారు. తమ సర్వేలో శ్రామిక శక్తిలో కేవలం 27 శాతం మంది మహిళలు మాత్రమే ఉన్నారని, 73 శాతం మంది శ్రామిక శక్తి పురుషులు ఉన్నట్లు గుర్తించామని అన్నారు. సూపర్ మార్కెట్లు,కిరాణా స్టోర్ , జనరల్ స్టోర్లతో పాటు గార్మెంట్స్ టెక్స్టైల్ వంటి పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులకు నెలకు సగటున రూ.8,300 వేతనం తీసుకుంటున్నారని నిఖిల్ గోయల్ వెల్లడించారు. లాజిస్టిక్స్, ట్రాన్స్ పోర్ట్, ఐటి సాఫ్ట్ వేర్,టైలరింగ్, బొటిక్‌లలో మహిళలకు అత్యధిక ప్రాదాన్యం ఉందని, జీతాలు సైతం అదే స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. -
వీఆర్ఏలు ఇక ఊళ్లకు
సాక్షి, నెట్వర్క్: ‘కారు కడుగుడు, బట్టలు ఉతుకుడు’శీర్షికన వీఆర్ఏల బానిస బతుకులపై శుక్రవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనం ఉన్నతస్థాయి యంత్రాంగంలో తీవ్ర చర్చకు దారి తీసింది. కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చాక వీఆర్ఏలకు సర్వీస్ రూల్స్, డ్యూటీ చార్ట్ లేకపోవటంతో ఆయా జిల్లాల రెవెన్యూ అధికారులు ఆడ, మగ తేడా లేకుండా వీఆర్ఏలకు ఆర్డర్లీ పనులు చెబుతున్న తీరును ఫొటోలతో సహా సాక్షి వెలుగులోకి తెచ్చింది. దీంతో పలు జిల్లాల ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వీఆర్ఏలు ఎవరినీ రెవెన్యూయేతర పనుల్లో ఉపయోగించవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. సుదీర్ఘ కాలంగా మండల, డివిజన్, జిల్లా కేంద్రా ల్లో అనధికార విధుల్లో కొనసాగుతున్న వీఆర్ఏలు శుక్రవారం నుండి తమ సొంత గ్రామాల్లో విధులు నిర్వహించాలని ఆదేశించారు. నిర్మల్, జగిత్యాల, నాగర్‌కర్నూల్ తదితర జిల్లాల అధికారుల నుంచి ఈ మేరకు ఆదేశాలు వీఆర్ఏలకు అందినట్టు తెలుస్తోంది. జిల్లాలోని వీఆర్ఏ, వీఆర్వోలు సంబంధిత ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలకు నిత్యం హాజరుకావాలని ఆదేశిస్తూ నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఉదయ్‌కుమార్ శుక్రవారం సర్క్యులర్ జారీ చేశారు. మాజీ వీఆర్వో, వీఆర్ఏలు కార్యాలయాల్లో సమయపాలన పాటించాలని, మాన్యువల్ రిజిస్టర్‌ను నిర్వహిం చాలని సూచించారు. మరికొందరిని జిల్లాలోని ప్రభుత్వ ఇసుక వాహనం, ఇసుక రీచుల వద్ద విధులు నిర్వర్తించేలా సమన్వయం చేసుకోవా లని ఆర్డీవో, తహసీల్దార్లకు ఆదేశాలు జారీచేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగిత్యాల జిల్లాలోని అన్ని మండలాలకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. తాజా ఆదేశాలతో జిల్లాలో ఇలా ఆర్డర్లీ పనులు చేస్తున్న వీఆర్ఏల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ‘సాక్షి’కి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. సమస్యలు చెప్పుకుంటాం.. సమయం ఇవ్వండి తాము ఎదుర్కుంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు గానూ తమ ప్రతినిధి బృందానికి సమయం ఇవ్వాలని తెలంగాణ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏ అసోసియేషన్ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి విజ్ఞప్తి చేసింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బి.రమేష్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్‌లు ఈ మేరకు తాము పంపిన విజ్ఞాపన పత్రాన్ని పత్రికలకు విడుదల చేశారు. -
మస్కట్‌లో మహిళ ‘గోస’.. 10 రోజుల నుంచి ఫోన్ స్విచ్చాఫ్
సాక్షి, జగిత్యాల(కరీంనగర్): నిరుపేద కుటుంబం. భర్త వికలాంగుడు. ఎదిగిన కొడుకు ప్రేమ పెళ్లి చేసుకొని ఇల్లు విడిచి వెళ్లాడు. దీంతో ఆ పేద మహిళకు ఇంటి పోషణ భారం కావడంతో ఓ గల్ఫ్ ఏజెంట్ ద్వారా 36 రోజుల క్రితం మస్కట్ వెళ్లింది. అక్కడ ఇంటి యజమాని పెట్టే చిత్రహింసలకు నరకం అనుభవిస్తున్నట్లు 10 రోజుల క్రితం కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. కుటుంబ సభ్యులు ఆమెతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తుండగా స్విచ్ ఆఫ్ ఉండడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్‌కు చెందిన కొదురుపాక సత్తమ్మ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తన బాధలు అదే కాలనీకి చెందిన రమాదేవికి చెప్పుకోగా, ఆమె తన అన్న నిజామాబాద్‌లో గల్ఫ్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న రవికుమార్‌కు పరిచయం చేయించింది. ఈ క్రమంలో రవికుమార్, సత్తమ్మ వయస్సుతో పాటు మతం (క్రిస్టియన్‌గా) మార్చి పాస్‌పోర్టు తీయించాడు. నవంబర్ 4న ఇంటి పని కోసమని మస్కట్‌కు పంపించాడు. అక్కడకు చేరుకున్న సత్తమ్మ ఇంటి యజమానితో తాను హిందువు అని చెప్పడంతో ఆమెను తీవ్ర వేధింపులతో పాటు అనవసరమైన పనులు చేయించడం.. చేయకపోతే దాడిచేయడంతో చెయ్యి కూడా విరిగిపోయిందని 15 రోజుల క్రితం బాధితురాలు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు గల్ఫ్ ఏజెంట్ రవికుమార్ వద్దకు వెళ్లగా, తాను మస్కట్‌కు పంపించేందుకు రూ.1.50 లక్షలు ఖర్చు అయిందని, ప్రస్తుతం రూ.లక్ష చెల్లిస్తే స్వగ్రామం రప్పిస్తానని చెప్పాడు. వారి వద్ద డబ్బులు చెల్లించే స్థోమత లేకపోవడంతో జగిత్యాలలోని గల్ఫ్ సోషల్ వర్కర్ షేక్ చాంద్‌పాషాకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అతడు స్పందించి సత్తమ్మను స్వగ్రామం రప్పించేందుకు గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటర్‌పోల్‌తో పాటు భారత రాయబార కార్యాలయానికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. జాతీయ దర్యాప్తు సంస్థకు ఫిర్యాదు చేశాం జిల్లా కేంద్రానికి చెందిన సత్తమ్మకు గల్ఫ్ ఏజెంట్ నిబంధనలకు విరుద్ధంగా పాస్‌పోర్టు ఇప్పించి మస్కట్ పంపించాడు. అక్కడ యజమాని ద్వారా ఇబ్బందులు పడుతున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు నా దృష్టికి తీసుకువచ్చారు. జాతీయ దర్యాప్తు సంస్థకు సమాచారం అందించడంతో పాటు మస్కట్ భారత రాయబార కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేశాం. – షేక్ చాంద్‌పాషా, గల్ఫ్ సోషల్ వర్కర్, జగిత్యాల చదవండి: యువతి అదృశ్యం -
Yesvantpur Express: ఆ రైలు ధర్మవరం వరకే
సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): కాచిగూడ నుంచి కర్నూలు మీదుగా యలహంక (బెంగళూరు)కు వెళ్లే యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలును ధర్మవరం వరకు కుదించారు. బెంగళూరు – పెనుగొండ మధ్య జరుగుతున్న రైల్వే ట్రాక్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 17603 నంబరు రైలు ఈనెల 12, 13, 14 తేదీల్లో కాచిగూడ నుంచి కర్నూలు, డోన్ మీదుగా ధర్మవరం వరకు మాత్రమే వెళ్తుంది. అలాగే యలహంక నుంచి కాచిగూడ వెళ్లే 17604 నంబరు రైలు 13, 14, 14 తేదీల్లో ధర్మవరం నుంచి వెనుదిరిగి వెళ్తుంది. భువనేశ్వర్ రైలు రద్దు భువనేశ్వర్ – బెంగళూరు – భువనేశ్వర్ మధ్య నంద్యాల, డోన్ మీదుగా రాకపోకలు సాగించే 18463, 18464 రైళ్లు ఈనెల 12, 13, 14, 15 తేదీల్లో బెంగళూరు – శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్ల మధ్య రద్దు చేశారు. మచిలీపట్నం – యశ్వంత్‌పూర్ – మచిలీపట్నం మధ్య కర్నూలు మీదుగా రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ రైళ్లు 13, 14వ తేదీల్లో ధర్మవరం– యశ్వంత్‌పూర్ మధ్య రద్దు చేశారు. కోర్బా – యశ్వంత్‌పూర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 12న కర్నూలు, డోన్, గుత్తి, రేణిగుంట, జోలార్‌పెట్టాయి, బంగారపేట్, కృష్ణరాజపురం మీదుగా దారి మళ్లించారు. రాజ్‌కోట్ – కోయంబత్తూర్‌కు మంత్రాలయం రోడ్, ఆదోని మీదుగా వెళ్లే 16613 ఎక్స్‌ప్రెస్ రైలును గుత్తి, రేణిగుంట, జోలార్పట్టాయి, తిరపత్తూర్, సేలమ్ మీదుగా మళ్లించారు. ఈ మేరకు రైల్వే శాఖ సీపీఆర్ఓ రాకేష్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
బిజినెస్ మ్యాగ్నెట్ అయినా సరే.. మండే పనంటే మొరాయించుడే
బిజినెస్ మ్యాగ్నెట్ అంటే నిత్యం ఎంతో బిజీగా ఉంటారు. కాలంతో పాటు పరుగులు తీస్తుంటారు. క్షణం కూడా వృధా చేయరు. రెండు వేల రూపాయల నోటు కింద పడితే ఆ నోటు తీస్తే ఒక్క క్షణం వేస్ట్ అవుతుందని ఫీలయ్యేంతగా పని చేస్తుంటారని మనం భావిస్తుంటాం. సినిమాల్లో దర్శకులు, పుస్తకాల్లో రచయితలు బిజినెస్ మ్యాగ్నెట్ పాత్రలను ఇలాగే మలుస్తూ వస్తున్నారు. కానీ నిజ జీవితంలో వాళ్లు సెకన్ల ముల్లుతో పోటీ పడుతూ పని చేస్తుంటారా ? ఈ విషయం తెలియాలంటే మనం బిజిగా ఉండే బిజినెస్‌మేన్‌లనే అడగాలి. కానీ మనకా కష్టం లేకుండానే కళ్లకు కట్టినట్టుగా చూపించారు ఇండియాలోనే బిజీయెస్ట్ బిజినెస్‌మేన్‌లలో ఒకరు పద్మ భూషణ్ ఆనంద్ మహీంద్రా. సోషల్ మీడియాలో ఆనంద్ మహీంద్రా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇక వీకెండ్ వచ్చిందంటూ మరో లెవల్లో పోస్టులు చేస్తుంటారు. కాగా 2021 నవంబరు 15 సోమవారం ఉదయం ఆయన ట్విట్టర్లో షేర్ చేసిన వీడియో నవ్వులూ పూయిస్తోంది. కేరళాలో జరిగిన ఆఫ్ రోడ్ ర్యాలీలో ఓ జీపు బురదగుంటలో చిక్కుకుని ముందుకు కదిలేందుకు మొరాయిస్తుంటే అందులో ఉన్న డ్రైవరు, పక్కన ఉన్న వ్యక్తులు ఆ జీపు ముందుకు వెళ్లేలా సహకరిస్తూ ఉత్సహపరుస్తుంటారు. ఈ వీడియోను ఉదహరిస్తూ మండే మార్నింగ్ పని చేయాలంటే ఇలాంటి ఫీలింగే కలుగుతుందంటూ ట్విస్ట్ ఇచ్చారు. -
ఆ వారం రోజులు ఆఫీసులకు వెళ్లకండి.. అయినా జీతాలిస్తాం!
మాస్కో: గత ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి ప్రపంచదేశాలకు తన ప్రతాపాన్ని చూపిస్తూ వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. మహమ్మారి కట్టడికి శానిటైజేషన్, సామాజిక దూరం, వ్యాక్సినేషన్ కార్యక్రమంతో చెక్ పెట్టాలని ఆయా దేశాల ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాజాగా రష్యాలోని లాట్వియాలో కరోనా మరణాలు ఇటీవల ఒక్కసారిగా పెరిగింది. వైరస్ వ్యాప్తి అడ్డుకునేందుకు రష్యా ప్రభుత్వం నెల రోజుల లాక్డౌన్ కూడా విధించింది. ఓ వైపు వైరస్ వ్యాప్తి చెందడం, మరో వైపు శీతాకాలం కావడంతో అంటువ్యాధుల భయం కూడా రష్యాకు తలనొప్పిగా మారింది. రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులకు అడ్డుకట్ట వేయడం కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అక్టోబర్ 30 నుంచి వారంపాటు వేతనంతో కూడిన సెలవులను ఇస్తున్నట్టు ప్రకటించారు. దీని ప్రకారం ఉద్యోగులెవ్వరూ ఆఫీసులకు వెళ్లాల్సిన పనిలేదు. పైగా ఆ వారం పాటు ప్రజలు ఎవరి ఇళ్లలో వాళ్లు ఉంటూ మహమ్మారి అంతానికి సహకరించడంతో వారి జీతం కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ప్రజలందరూ బాధ్యతగా వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా గడిచిన 24 గంటల్లో కరోనాతో రష్యాలో 1,028 మంది మరణించారు. ఇప్పటికే కొన్ని యూరోపియన్ దేశాలు, ముఖ్యంగా యూకేలో కరోనా కేసుల పెరుగుతూ అక్కడి ప్రజలను వణికిస్తోంది. దీనికితోడు శీతాకాలం సమీపిస్తుండడంతో వైరస్ ఫోర్త్ వేవ్ ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. చదవండి: మనోడి లక్ బాగుంది.. లేకుంటే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసేది..! -
వామ్మో ఆ యాప్.. మెడ మీద కత్తిరా బాబోయ్!
సాక్షి,కెరమెరి(ఆసిఫాబాద్): గ్రామ పంచాయతీ కార్యదర్శుల పనితీరును విశ్లేషించేందుకు, అభివృద్ధి పనుల పర్యవేక్షణకు నూతనంగా తీసుకొచ్చిన డీఎస్ఆర్(డైలీ శానిటేషన్ రిపోర్టు) యాప్ ఇబ్బందికరంగా మారుతోంది. ఇప్పటికే అదనపు భారం మోస్తున్న తమకు ఈ యాప్ మెడ మీద కత్తిలా ఉందని కార్యదర్శులు వాపోతున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్యంతో సహా పల్లె ప్రగతి పనుల పురోగతి నమోదు కోసం ప్రభుత్వం డీఎస్ఆర్ యాప్ తీసుకొచ్చింది. పల్లె ప్రగతి పనులు పరిశీలన, వీధుల శుభ్రం, రికార్డులు, ధ్రువీకరణ పత్రాలు, మరణాల నమోదు, విద్యుత్ బిల్లులు ఇలా ప్రతి సమాచారాన్ని ప్రస్తుత డీఎస్ఆర్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు ఈ యాప్‌ను మార్చారు. కొత్త ఆప్షన్లను ఇందులో చేర్చారు. కొత్త డీఎస్ఆర్ ఆప్‌ను ఇప్పటికే ఇన్స్టాల్ చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు అందాయి. కాని చాలా మంది ఇంకా ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోలేదు. దీన్ని వినియోగించడానికి నిరాకరిస్తున్నారు. నేటి నుంచి దీన్ని వాడకంలోకి తేవాలని కోరుతుండగా, కొద్ది మంది మాత్రమే ఇన్స్టాల్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి ఇది.. పంచాయతీ కార్యదర్శులు ఇప్పటికే ఉన్న యాప్‌ను తొలగించి కొత్తది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇందులో పంచాయతీ కార్యాలయం చిత్రాలను లోపలి నుంచి ఒకటి, బయటి నుంచి మరొకటి తీసి అనుసంధానం చేయాలి. ఇది ఈ కార్యాలయ, ప్రాంతానికి సంబంధించిన అక్షాంశాలు, రేఖాంశాలు ఆధారంగా పనిచేస్తుంది. ఆ తర్వాత రోడ్లు వీధులు, తదితర ఐదు ఫొటోలు అప్లోడ్ చేయాలి. పాత తేదీని తీసిన ఫొటో అయితే అప్లోడ్ కాదు. పంచాయతీ కార్యదర్శులు ఖచ్చితంగా లోకేషన్లో ఉండి పనిచేసేలా ఈ యాప్‌ను తీర్చిదిద్దారు. ఇది ప్రధానంగా ఇబ్బందికి కారణం. దీని ప్రకారం కార్యదర్శులు తప్పక ఉదయం 5 గంటలలోపు హాజరును యాప్‌లో నమోదు చేయాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా తెరచుకోదు. స్వీయా చిత్రం తీసుకుంటేనే హాజరు నమోదవుతుంది. తర్వాత డైయిలీ శానిటేషన్ రిపోర్టును ఆన్లైన్లో చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే అదనపు పనిభారంతో సతమతమవుతున్న తమకు ఇది మరింత ఇబ్బందికరంగా మారుతుందని కార్యదర్శులు పేర్కొంటున్నారు. సిగ్నల్స్ రాని వారి పరిస్థితి? కొత్త విధానంతో కార్యదర్శులు సంకట స్థితిలో పడ్డారు. కార్యదర్శులు అందరూ స్థానికంగా నివాసం ఉండడం లేదు. నివాసిత ప్రాంతానికి దూరంగా ఉన్నా పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము లేచి బయలుదేరితే తప్పా 5 గంటల్లోపు కార్యాలయానికి చేరుకునే పరిస్థితి లేదు. ఇక మహిళా కార్యదర్శులు ఇక్కట్లకు గురికావాల్సిందే. వేళాపాళా లేకుండా కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహించాల్సి రావడంతో లోలోనా కుమిలిపోతున్నారు. జిల్లాలో సెల్‌ఫోన్ సంకేతాలు సరిగా అందని పంచాయతీలు దాదాపు 200 వరకూ ఉన్నాయి. అక్కడ ఈ విధానాన్ని ఎలా అమలు చేయాలో ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వారికి ఈ విధానం ఇబ్బందికరంగా మారుతుందని అంటున్నారు.కొత్తయాప్‌ను మెడ మీద కతిక్తలాంటిదని పంచాయతీ కార్యదర్శులు వ్యతిరేకిస్తున్నారు. ఉపాధిహామీ క్షేత్ర సహాయకులు పనులు తామే చేస్తున్నామని, పాఠశాలల్లో స్వీపర్లను తొలగించడంతో తమ సిబ్బంది ద్వారా పనిచేయించాల్సి వస్తుందని అంటున్నారు. ఊర్లో అన్ని సమస్యలు చూడాల్సి వస్తుందని చెబుతున్నారు. నాయకులు, పై స్థాయి అధికారులు వచ్చినా ఉరుకులు, పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ యాప్‌లో పేర్కొన్న నిబంధనలు మార్చాలని విన్నవిస్తున్నారు. చదవండి: ఒక్కగానొక్క కూతురు.. అల్లారు మద్దుగా పెంచారు.. పుట్టిన రోజునే.. -
రహదారుల వైద్యుడు గంగాధర్ ను సత్కరించిన ధృవ కాలేజ్ మేనేజ్మెంట్
-
వర్క్ ఫ్రం హోం కాదు.. వర్క్ ఫ్రం ఆస్పత్రి
కోవిడ్-19 కారణంగా ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం చేస్తున్నారు. దీంతో ఎక్కువ మంది ఉద్యోగులకు గంటల తరబడి జర్నీ చేసే బాధ తప్పింది. డబ్బులు కూడా సేవ్ చేసుకుంటున్నారు. కానీ అదే సమయంలో ఇంటిని మేనేజ్ చేస్తూ ఆఫీస్ పనిచేయడం కష్టంగా మారింది. పరిస్థితులు ఎలా ఉన్నా వర్క్ ఫ్రం హోం చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఓ ఉద్యోగి భార్య ఆస్పత్రిలో పండంటి పాపకు జన్మనిచ్చింది. దీంతో సదరు ఉద్యోగి వర్క్ ఫ్రం హోంని కాస్తా.. వర్క్ ఫ్రం హాస్పటల్‌గా మార్చాడు. ఆస్పత్రికి చెందిన ఓ వార్డ్‌లో భార్య అప్పుడే పుట్టిన పాపాయికి జోకొడుతుంటే.. పక్కనే ఓ టేబుల్‌పై ల్యాప్ ట్యాప్‌తో భర్త ఆఫీస్ పనిచేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సామ్ హోడ్జెస్ అనే నెటిజన్ వర్క్ ఫ్రం హాస్పిటల్ ఫోటోల్ని నెట్టింట్లో షేర్ చేయగా..ఏప్రిల్ 2న "నా భార్య పండంటి పాపాయికి జన్మనిచ్చింది. తండ్రిగా పిల్లలకు దూరంగా ఎంత కష్టమో మాటల్లో చెప్పలేను. అయినా వర్క్‌కి నేను కట్టుబడి ఉన్నా వర్క్ ఫ్రం హోం కంటే వర్క్ ఫ్రం హాస్పటల్ నుంచి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. కుటుంబ సభ్యుల్ని, క్లైంయింట్లను" మేనేజ్ చేస్తున్నాను అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. చదవండి: రెండేళ్ల వరకూ వర్క్ ఫ్రం హోం.. ఎంతమందంటే Peak horrific LinkedIn pic.twitter.com/1Pqx0ZOjeF — Sam Hodges (@SamHodges) June 20, 2021 -
లక్కీ ఫెలోస్ : టాప్-20లో టీసీఎస్
న్యూయార్క్ : భారతీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అమెరికాలో అతి పెద్ద ఉత్తమం కంపెనీల జాబితాలో చోటు చేసుకుంది. పనిచేయడానికి అనువైన సంస్థల టాప్ 20 సంస్థల సరసన చేరింది. ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ పేరుతో శుక్రవారం ప్రకటించిన వివరాల ప్రకారం 2020 ఫార్చ్యూన్ కంపెనీల్లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ సంస్థ టీసీఎస్. సీఎస్ మేనేజ్మెంట్ టీం, వైవిధ్యాన్ని ఒక ఆస్తిగా కంపెనీ స్వీకరించిన వైనం, ఉద్యోగుల బలాలు, వృత్తి వృద్ధి అవకాశాలను గుర్తించడంలోటీసీఎస్ కృషికి ఈ గుర్తింపు లభించినట్టు సర్వే తెలిపింది. 2020 ఫార్చ్యూన్ కంపెనీల్లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ సంస్థ టీసీఎస్. అమెరికాలో మెగా కంపెనీలతో పాటు యుఎస్‌లో పనిచేసే టాప్ 20 టీసీఎస్ ఒక్కటే నిలవడం విశేషం. దిగ్గజ కంపెనీల్లో ఒకరిగా ఈ గుర్తింపును సాధించడం గర్వంగా వుందని టీసీఎస్ ఉత్తర అమెరికా, యుకె, యూరప్ అధ్యక్షుడు సూర్య కాంత్ సంతోషం వ్యక్తం చేశారు. తమ కస్టమర్లకు ఫస్ట్-క్లాస్ సేవలు అందించేలా చురుగ్గా పనిచేసే ఉద్యోగులను ఎంపిక చేశామనీ, అందరికీ సంతోషకరమైన, ఆరోగ్యకరమైన పని సంస్కృతిని సృష్టించామని కాంత్ తెలిపారు. ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ పేరుతో నిర్వహించిన అధ్యయనంలో 33వేలకు పైగా ఉద్యోగుల్లో, 60కి పైగా అంశాలను అంచనా వేసింది. ముఖ్యంగా ఉద్యోగులు తమ బాస్‌లను ఎంతవరకు విశ్వసిస్తారు, ప్రజలతో వ్యవహరించే తీరు, గౌరవం, కార్యాలయ నిర్ణయాల వైఖరి, టీమ్ మధ్య స్నేహభావం ఎంత లాంటి అంశాలను పరిశీలించింది. పదిమందిలో ఏడుగురు (72శాతం) ఉద్యోగులు పని చేయడానికి టీసీఎస్ గొప్ప సంస్థ అని కొనియాడారు. పది మందిలో ఎనిమిది మంది (80శాతం) వర్క్, లైఫ్ సమతుల్యత చాలా బావుందని, అవసరమైనప్పుడు పనికి దూరంగా ఉండటానికి అవకాశం కల్పించారని చెప్పారు. పది మందిలో దాదాపు తొమ్మిది (85శాతం) చాలా సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నారు. కాగా గ్లోబల్ టెక్ సేవల్లో దూసుకుపోతున్న టీసీఎస్ 20వేల మందికి పైగా కొత్త ఉద్యోగులను నియమించు కుందని ఇటీవల ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే 2019లో యుఎస్ ఉద్యోగులలో 90 శాతం మంది తాజా డిజిటల్ టెక్నాలజీస్, టూల్స్, ప్లాట్‌ఫామ్‌లలో అప్‌గ్రేడ్ అయినట్టు వెల్లడించింది. 2014 నుండి, ఐటి సర్వీసెస్, కన్సల్టింగ్ రంగంలో అమెరికాలో టీసీఎస్‌ది కీలక పాత్ర. -
పది చేతులు చాలవు
యోషికా నిషిమాస ప్రతిరోజూ పేపరు మీద పెద్ద లిస్టు రాయాలి. ప్రతిరోజూ జరిగిన సంవాదాలు, పనులు, భోజన సమయాలు... డైలీ రికార్డును పూర్తిచేస్తూనే ఉండాలి.ఆవిడ ఒక మార్కెటింగ్ ప్రొఫెషనల్. ఈ లిస్టు ఆమె వృత్తికి సంబంధించినది కాదు. తన పిల్లల ప్రీస్కూల్‌కి సంబంధించిన విషయాలు. ఈ పనులన్నీ ఆవిడ ఆఫీసుకి వెళ్లేలోపు పూర్తి కావాలి. జపాన్‌లో ఉద్యోగాలు చేస్తున్న ఎంతోమంది మహిళలలాగే 38 సంవత్సరాల నిషిమాస కూడా ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. జపాన్‌లో ఆడవారి నుంచే ఎక్కువ పనిని ఆశిస్తోంది ప్రభుత్వం. జపాన్ ప్రధాని షింజో అబే, జపాన్‌లోని మహిళలతో ఎక్కువ పని చేయించి, జాతీయ ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం మహిళలను ‘ఉమెనోమిక్స్’ (ఉమెన్+ఎకనామిక్స్) అంటున్నారు. ఈ జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో షింజో అబే, ‘జపాన్‌లో 67 శాతం మంది మహిళలు ఎంతో చక్కగా ఉద్యోగాలు చేస్తున్నారు, ఈ సంఖ్య అమెరికా దేశం కంటే చాలా ఎక్కువ ’ అని గొప్పలు పలికారు. ఎక్కువ మంది పనిచేయడం ఆ దేశానికి గర్వకారణమా! వారు చిన్న పదవులలో మాత్రమే ఎందుకు ఉంటున్నారో అవసరం లేదా! ఇంటి బాధ్యతల కారణంగా జపాన్ మహిళలు ఉన్నతస్థానాలకు ఎదగాలని కలలు కంటున్నా ముందుకు వెళ్లలేక పోతున్నారు. కానీ యాజమాన్యాలు మాత్రం వారి నుంచి ఎక్కువ పని ఆశిస్తున్నాయి. మగవారు సహాయం చేయరు ఇక్కడ పనిచేస్తున్న మహిళల శాతం చాలా ఎక్కువే. కానీ, వంచిన నడుము ఎత్తకుండా ఇంటి పని చేయడం, ఇంట్లో వారందరినీ బాధ్యతగా చూసుకోవడంతో వారు అలసిపోతున్నారు, దీనికితోడు ఇంట్లోని మగవారు ఆడవారికి చేదోడువాదోడుగా ఉండరు. ప్రపంచంలోని ఇతర సంపన్న దేశాలతో పోలిస్తే జపాన్‌లో ఇంటిపనులు, పిల్లలను చూడటం వంటి పనులు చేసే మగవారు చాలా తక్కువ. ‘నోరికో ఓ ట్సుయా’ అనే ప్రభుత్వ ఉద్యోగి చేసిన సర్వే ప్రకారం మహిళల కంటే పురుషులు ఇంటి పనులు తక్కువ చేస్తున్నారు. ఈ కారణంగా ఉద్యోగాలలో ఎదగలేకపోతున్నారు, ఇంటి దగ్గర కూడా బంధాన్ని పటిష్టపరచుకోలేకపోతున్నారు స్త్రీలు. నిషిమాస జీవితాన్ని పరిశీలిస్తే... ఆమెకు ప్రీస్కూల్ చదువుతున్న ఇద్దరు చిన్నపిల్లలు. నిత్యం వారి ఆరోగ్యం గురించి, రెండు పూటలా ఏం తింటారు, మూడ్స్‌ని బట్టి ఏ టైమ్‌లో ఏం చేస్తారు, ఎప్పుడు నిద్రపోతారు, ఎప్పుడు ఆడుకుంటారు వంటివన్నీ రికార్డు రాసి ఆ పిల్లలను క్రెచ్‌లో దింపాలి. నిత్యం ఈ పని చేయడం ఎంత కష్టమో అర్థం చేసుకోవాలి. ఇవి కాకుండా ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్న ఎనిమిది సంవత్సరాల మరో కొడుకు గురించి చూసుకోవాలి. స్కూల్ అయిపోయాక ఆ పిల్లవాడు ట్యూటర్ దగ్గరకు వెళ్లాలి. అందుకోసం హోమ్‌వర్క్ అసైన్మెంట్ మీద సంతకం చేయాలి. వీటిలో ఏ ఒక్క పని మరచిపోయినా ఇబ్బందే. పేపర్ మీద ఇవన్నీ రాయడంతో ఆమె పనులు ప్రారంభమవుతాయి. ఆ తరువాత వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతికి ఇస్త్రీ చేయడం... ఇలా లెక్కలేనన్ని పనులు చేయాలి. ఇక వంటకాల విషయానికి వస్తే, రకరకాల జపనీస్ వంటకాలు తయారుచేయడం చాలా కష్టం. ఆ తరువాత లంచ్ బాక్సులను అందంగా, పిల్లలకు తినాలనిపించేలా సర్దాలి. పనివాళ్లు దొరకరు కనుక, అంట్లు, బట్టలు... ఈ పనులన్నీ పూర్తిచేయాలి. నిషిమాస ఈ పనులన్నీ ఒంటిచేత్తో చేస్తోంది. నిషిమాస భర్త ఒక మేనేజ్మెంట్ కన్సల్టెంట్. అప్పుడప్పుడు ఆయనకు ఆఫీసులో పని ఆలస్యం అవుతుంది. ఒక్కోసారి క్లయింట్లతో బయటకు పార్టీలకు వెళ్తుంటాడు. జపాన్‌కి నిషిమాసలాంటి చదువుకున్నవారి అవసరం చాలా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జపాన్ ఆర్థికంగా చాలా వేగంగా ఎదిగింది. పెళ్లి అయిన తరువాత, గర్భిణులుగా ఉన్న సమయంలోను మహిళలు ఆఫీసు నుంచి చాలా వేగంగా ఇంటికి వెళ్లిపోయేవారు. దేశ ఆర్థిక వనరులను పెంచడం కోసం, ఆ సమయంలో వారి భర్తలు ఆఫీసులో మిగతా పని పూర్తి చేసేవారు. 1970 తరువాత వివాహితమహిళలు పనినంతావారే స్వయంగా చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముగింపు: జపాన్‌లో మరమనుషులు ఎక్కువంటారు, అందుకేనేమో అక్కడ స్త్రీలను కూడా మరమనుషులుగా భావిస్తున్నారు. ఆమెకు ఒక మనసు ఉంటుందని, ఆమె అలసిపోతుందని, ఆమె కూడా ఉద్యోగంలో పైస్థాయికి ఎదగాలనుకుంటుందని అర్థం చేసుకునేలోగా ఎంతోమంది ఆత్మన్యూనతకు గురవుతూనే ఉంటారు. మరెంతోమంది చిన్న ఉద్యోగాలలోనే పదవీ విరమణ చేసేస్తారు. నిషిమాస ఒక పెద్ద యూనివర్సిటీ నుంచి పట్టా పొందాక, ఒక టెక్ట్స్‌బుక్ పబ్లిష్ చేయడానికి ఒక సంస్థలో పనిచేసింది. అక్కడ ఆమె చాలా బాగా, చురుకుగా పనిచేయడంతో త్వరగా పైస్థాయికి ఎదిగింది. నాలుగు సంవత్సరాల తరువాత వివాహం చేసుకుంది. పెళ్లయిన వారిని ఆ కంపెనీలో పార్ట్ టైమర్లుగా మారుస్తారు. నిషిమాస విషయంలో అదే జరిగింది. ప్రతిరోజూ బాస్ ‘నువ్వు ఆఫీసులో ఎక్కువ సమయం ఉండట్లేదు, నీ పిల్లల కోసం నువ్వు తొందరగా వెళ్లిపోతున్నావు’ అని సాధించడం మొదలుపెట్టడంతో, మరో ఉద్యోగం కోసం వేట మొదలుపెట్టింది నిషిమాస. ‘నువ్వు ఎక్కువసేపు పనిచేయలేవు కదా? ఆలస్యం అయితే నీర్త నిన్ను అర్థం చేసుకుంటాడా’ అని అడిగారు అక్కడ.తను పనిచేసిన పబ్లిషర్ మాత్రం తన వివాహం గురించి అడగలేదు కానీ పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండేది. నిషిమాస 29వ ఏట గర్భం దాల్చింది. అయినా ఆమెకు ఎటువంటి సౌకర్యం లేదు ఆఫీసులో. ఒక్కోసారి అర్ధరాత్రి వరకు ఉండేది. దాంతో మొదటిసారి గర్భస్రావం అయ్యింది. ఆ తరువాత కొన్నాళ్లకి మళ్లీ గర్భిణి అయ్యింది. అయినా ఆఫీసులో చాలాసేపు పనిచేస్తూనే ఉంది. తన పనిలో కొంత భాగాన్ని మరొకరికి పంచమని అడగలేకపోయింది. రాత్రి పది గంటలకు ఇంటికి వెళ్లిన వెంటనే బాస్ దగ్గర నుంచి ఫోన్ వచ్చేది, ‘‘అందరి కంటే ముందుగా ఇంటికి వెళ్లిపోయావు, నీ కొలీగ్స్‌ని క్షమాపణలు అడుగు’ అని. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా నిషిమాస ఉద్యోగం మానేయాలనుకోలేదు. భర్త తాను పై పదవులకు ఎదగాలనుకున్నాడు. అందువల్ల పిల్లల బాధ్యత పూర్తిగా నిషిమాస తీసుకోవలసి వచ్చింది. తాను చాలా ఎక్కువసేపు కష్టపడుతున్నట్లు చెప్పేవాడు భర్త. కష్టపడుతున్నది ఎవరో అందరికీ తెలిసిందే. -
ఉపాధి నిబంధనల్లో మార్పులు
ఇకపై పని చేసిన గ్రామంలోనే సగం నిధులు ఖర్చు చేయాలి వేతనదారులకు పని కలిపిస్తేనే మెటీరియల్ పనులు మంజూరు ఈ ఏడాది జిల్లాలో రూ. 800 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యం శ్రీకాకుళం పాతబస్టాండ్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ ఏడాది నుంచి మార్పులు తీసుకురావాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. గ్రామాల్లో వేతనదారుల ద్వారా జరిగే పని విలువను బట్టే ఆ గ్రామానికి మౌలిక వసతుల కల్పనకు ఉపయోగపడే మెటీరియల్ కాంపోనెంట్ నిధులను మంజూరు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల్లో కొన్ని మార్పులు చేయనున్నారు. ఉపాధి çహామీ పథకం అమలు చేసేందుకు రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధుల్లో 60 శాతం వేతనదారులకు పనులు కల్పించడానికి, మరో 40 శాతం మెటీరియల్ కాంపోనెంట్ పనుల్లో భాగంగా సిమెంటురోడ్లు, భవనాలు, సీసీ కాలువులు, ప్రహరీల నిర్మాణ పనులకు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం 40 శాతం మెటీరియల్ పనుల నిధుల విడుదలకు జిల్లా ప్రాతిపదిక.. గ్రామాల్లో వేతనదారుల ద్వారా జరిగే పని విలువను బట్టీ నిధులు విడుదల చేసే వెసులుబాటు ఉంది. కొత్త నిబంధనల ప్రకారం.. గ్రామ పరిధిలో వేతనదారుల ద్వారా చేసే పని విలువలో కనీ సం 50 శాతం సంబంధిత గ్రామంలోనూ, మరో 25 శాతం నిధులు ఆ గ్రామం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వేరే గ్రామానికైనా మంజూరు చేయవచ్చు. మిగిలిన 25 శాతం నిధులను ఆ జిల్లా పరిధిలో ఏ గ్రామానికైనా మంజూరు చేసే వెసులబాటు ఉంది. ఇటీవల జరిగిన రాష్ట్ర ఉపాధి హమీ పథకం అమలు కమిటీ సమావేశంలో గ్రామీణ అభివద్ది శాఖ అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు చేయగా..దీనికి ప్రభుత్వం అంగీకరించింది. అధికార ఉత్తర్వులు విడుదల చేయాల్సి ఉంది. రూ. 800 కోట్ల విలువైన పనుల లక్ష్యం జిల్లాలో ఈ ఏడాది (2018–19 ఆర్థిక సంవత్సరంలో) ఉపాధి హమీ పథకం ద్వారా 800 కోట్ల రూపాయల విలువ చేసే వివిధ పనులు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో వేతనదారుల ద్వారా చె?పట్టే పనులకు నాలుగు వందల కోట్ల రూపాయలు, మెటీరియల్ పనులకు మరో రూ. 400 కోట్లు వెచ్చించాలనేది లక్ష్యం. వీటిలో మెటీరియల్ కంపోనెంట్ పనుల్లో ఉపాధి హామీ పథకం ద్వారా సమకూరే నగదు రూ. 266 కోట్లు కాగా, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.134 కోట్లు సమకూర్చాల్సి ఉంటుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం, నిబంధనాలతో వేతనదారులు ఎక్కువగా పనిచేసే గ్రామాల్లో మెటీరియల్ కాంపోనెంట్ పనులు కూడా ఎక్కువగా రానున్నాయి. గత ఏడాది జిల్లాలో వేతనదారులు రూ. 320 కోట్లు విలువైన పనులు చేయగా.. మెటీరియల్ పనులు రూ. 210 కోట్లు జరిగాయి. ఈ ఏడాది ఈ మొత్తాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.కూర్మారావు ‘సాక్షి’కి తెలిపారు. జిల్లాలో 1096 పంచాయతీలు ఉండగా.. వీటిలో 1071 పంచాయతీల పరిధిలో ఉపాధి పనులు జరుగుతున్నాయి. మిగిలిన 25 గ్రామాల్లో పనులు గుర్తించక పోవడంతో పాటు వేతనదారులు కూడా పనులు చేసేందుకు ఆకస్తి చూపడం లేదు. ఇలాంటి గ్రామాల్లో నీటి గుంతలు, గృహ నిర్మాణాలు ఇతర పనులు చేయడం ద్వారా లక్ష్యాన్ని చేరేలా కృషి చేస్తున్నామని పీడీ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకి సగటునా 2,75,000 మంది వేతనదారులు పనుల్లో పాల్గొంటున్నట్టు చెప్పారు. -
‘ఉపాధి’ జోరు
ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పథకానికీ అనుసంధానం చేస్తోంది. ఎక్కడ చూసిన ఉపాధి.. ఏ పథకం ప్రవేశపెట్టినా ఉపాధి హామీ పథకం కిందనే చేపడుతోంది. ఇలా ప్రతి దానికి ఈ పథకాన్ని అనుసంధానం చేయడంతో కూలీలకు చేతినిండా పని లభించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వ్యవసాయం, హరితహారం, మిషన్‌కాకతీయ, రోడ్ల నిర్మాణం, పశువుల పాకలు, ఫారంఫండ్లు.. డంపింగ్‌యార్డు, పంచాయతీ భవనాలు, శ్మశానవాటికలు.. ఇలా ప్రతీ దాన్ని ఉపాధి హామీ పథకంలో చేయిస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దేశమంతటా ఈ పథకానికి ఇస్తున్న ప్రాధాన్యం అంతాఇంత కాదు. ప్రభుత్వం చేపట్టే ప్రతీ పనికి ఈ పథకం వర్తింపజేస్తున్నారు. దీంతో ఉపాధి కూలీలకు చేతినిండా పనులు దొరుకుతున్నాయి. ఆ పథకం కింద సుమారు 52 రకాల పనులు చేస్తున్నారు. జిల్లాలో 1,51,583 మంది జాబ్‌కార్డులు ఉండగా.. 3,22,000 వేల మంది కూలీలు ఉన్నారు. గత ఏడాది 60 లక్షల పని దినాలు లక్ష్యం కాగా.. 31.22లక్షల పని దినాలు కల్పించారు. తాజాగా సంతల ఏర్పాటు.. గ్రామాల్లో సంతలు(అంగళ్లు) నిర్వహించుకోవడానికి వీలుగా గ్రామీణ ఉపాధి హమీ పథకం కింద షెడ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. స్థానికుల అవసరాలు తీర్చడంలో భాగంగా పండ్లు, కూరగాయలు, తినుబండరాలు, సామగ్రి తదితర వాటిని విక్రయించుకునేందుకు వసతులు కల్పించనుంది. ఈ మేరకు గ్రామీణ అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీలు, ప్రజాప్రతినిధులు, దాతలు చొరవ తీసుకుంటే త్వరగా అంగళ్ల నిర్వహణకు అనువైన ఏర్పాట్లు చేసుకోవచ్చు. అవసరమైన మౌలిక వసతులను రెండు కేటగిరీల్లో కల్పించుకునేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 20 గదులు, 30 గదుల విస్తీర్ణంలో అభివృద్ధి చేసుకునేలా అవకాశం ఇచ్చారు. గ్రామ జనాభా, స్థలం, నిధుల లభ్యత తదితర వాటిని పరిగణనలోకి తీసుకొని గ్రామ పంచాయతీలే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. 30 గదులకు రూ.15 లక్షలు, 20 గదులకు రూ.10 లక్షలు కేటాయించనున్నారు. వీటిని ప్లాట్‌ఫాం, నీటి వసతి, మూత్రశాలలు, డ్రైనేజీలు, పార్కింగ్ స్థల అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంగళ్ల నిర్వహణ ద్వారా గ్రామ పంచాయతీలు ఆదాయాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. వేలం పాట స్థలం కేటాయింపు లేదా అంగళ్లలో విక్రయించే వారి నుంచి పన్నులు కూడా వసూలు చేసుకోవచ్చు. వ్యవసాయ పనులకు.. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రవేశపెట్టే దేశ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోంది. దీనిలో భాగంగానే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పనులకు అనుసంధానం చేస్తోంది. గ్రామీణులకు ఉన్న ఊర్లోనే పనిచేసుకుని జీవించేందుకు రూపొందించిన ఈ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చుతోంది. వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయడం వల్ల బీడు భూములు సాగులోకి రావడంతోపాటు పాడిపరిశ్రమ, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకంలో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి పాకల నిర్మాణాలు చేపడుతోంది. ఊటకుంటలు, ఫారంఫండ్లు, నీటి నిల్వ కుంటలు ఏర్పాటు చేస్తున్నారు. సేంద్రియ ఎరువులతో భూమిని సారవంతం చేసుకొని వర్మీకంపోస్టు యూనిట్లు తయారు చేసుకోవచ్చు. పశువుల తొట్టెలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. హరితహారంలో.. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఉపాధి హామీ పథకంలో హరితహార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే హరితహారం కింద నాటే మొక్కలు ఉపాధి పనులతోనే చేయిస్తున్నారు. జిల్లాలోని వివిధ నర్సరీల్లో ఉపాధి కూలీలతో మొక్కల పెంపకాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఈ ఏడాది కోటి మొక్కల లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 5 వేల మంది కూలీలు పనిచేస్తున్నారు. మొక్కలు నాటడం, వాటి రక్షణ చర్యలకు సైతం ఉపాధి పనుల్లోనే వినియోగిస్తున్నారు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణాలకు ఉపాధి నిధులు వెచ్చిస్తున్నారు. సీసీ రోడ్లకు 90 శాతం నిధులు ఈ పథకం నుంచి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని చాలా గ్రామాల్లో ఉపాధి కింద వేసిన రోడ్లు పూర్తయ్యాయి. మిషన్ కాకతీయ కింద చేపట్టే పనులు సైతం చేపడుతున్నారు. చెరువులో తీయడం ఈ పథకం కింద చేస్తున్నారు. అటవీ భూముల్లో.. ఉపాధి పథకం కింద అటవీ భూముల్లో నీటి సంరక్షణకు పెద్దపీట వేస్తున్నారు. పెద్ద ఎత్తున నీటి, ఊటకుంటల తవ్వకాలు చేపడుతున్నారు. అటవీభూములు ఆక్రమణలకు గురికాకుండా సరిహద్దు చుట్టూ కందకాలు తవ్వుతున్నారు. దీని ద్వారా బయట నుంచి భూమిని కాపాడుకోవచ్చు. ఈ భూముల్లో వర్షపునీటి వరదకు మట్టికోతకు గురికాకుండా, భూమిలో తేమ సాంద్రత ఎక్కువ కాలం నిలిపే ప్రక్రియలో భాగంగా ఈ ఉపాధి పనులకు శ్రీకారం చుట్టారు. వర్షపు నీటిని భూమిలో ఇంకేలా చేయడం ద్వారా మట్టిలో తేమ ఉంటుంది. తద్వారా మొక్కలు చనిపోకుండా మనుగడ సాగిస్తాయి. ఫలితంగా హరిత శాతం పెరగడంతోపాటు వన్యప్రాణులకు వేసవిలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. సద్వినియోగం చేసుకోవాలి.. ఉపాధి హామీ పథకం కింద చేపట్టే ప్రతి పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఉపాధి కూలీలకు పని కల్పించడంతోపాటు రైతులకు సంబంధించిన నిర్మాణాలు ఈ పథకం కింద చేపడుతున్నాం. ఎక్కువగా వ్యవసాయ పనులకు అనుసంధానం చేయడం, నీటి లభ్యతను పెంచే నిర్మాణాలు చేపడుతున్నాం. – రాథోడ్ రాజేశ్వర్, డీఆర్డీవో -
పని ఎక్కువ...జీతం తక్కువ
విద్యాశాఖలో ఉపాధ్యాయులు, సిబ్బందితో సమానంగా పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్స న్స్ (సీఆర్పీ)ను ప్రభుత్వం విస్మరిస్తోంది. మండల విద్యాశాఖాధికారుల పరిధిలో పనిచేసే సీఆర్పీలు రోజురోజుకూ పనిభారం పెరిగి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. స్కూల్ అసి స్టెంట్లతో సరిపోయే అర్హతలతో నియమితులైన సీఆర్పీలకు సమాన పనికి సమాన వేతనం అందని ద్రాక్షగానే మిగిలింది. డిగ్రీ, బీఎడ్, టెట్, పీజీ చేసిన వారు కూడా సీఆర్పీలుగా పనిచేస్తున్నా.. వారికి చాలీచాలని వేతనాలే అందుతున్నాయి. అరకొరగా ఇస్తున్న వేతనాలు రవాణా ఖర్చులకే సరిపోతుండడంతో జీవనోపాధికి నానాపాట్లు పడుతున్నారు. – సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట నుంచి ఎర్ర శ్రీనివాస్ సీఆర్పీ వ్యవస్థ ఏర్పడిందిలా.. గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసి డిప్యూటేషన్‌పై ఎమ్మార్పీ (మండల రిసోర్స్ పర్సన్)లుగా నియమించే వారు. పాఠశాలలు దెబ్బతింటున్నాయనే ఉద్దే శంతో ఆ వ్యవస్థను రద్దు చేసి కాంట్రాక్ట్ విధా నంలో ఆరేళ్ల క్రితం (2012లో) సీఆర్పీ వ్యవస్థ ను రూపొందించింది ప్రభుత్వం. డీఎస్సీ కమిటీ ఇంటర్వూ్యలు నిర్వహించి, అందులో ఉత్తీర్ణత, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్, మెరిట్ ప్రకారం సీఆర్పీలను నియమించారు. నియామక సమ యంలో రూ.5,500 వేతనం. అందులోనే టీఏ బిల్లు ఇచ్చేవారు. క్రమంగా.. 2013లో రూ. 7 వేలు, 2014లో 8,500 చెల్లించారు. ప్రస్తుతం రూ.15వేలు చెల్లిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2298 మంది సీఆర్పీలు పనిచేస్తున్నారు. ఇవీ డిమాండ్లు..: ఉద్యోగ భద్రత కల్పించాలి. వేతనం రూ. 28,940 స్కూల్ అసిస్టెంట్ పోస్టు కేటగిరి ప్రకారం ఇవ్వాలి. ఇన్సూరెన్స్, ఆరోగ్యకార్డులు, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలి. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. ఏడాదికి 22 సాధారణ సెలవులు ఇవ్వాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి. కేజీ నుంచి పీజీ విద్యలో భాగస్వాములను చేయాలి. వేతన వ్యత్యాసం వివిధ రాష్ట్రాలలో సీఆర్పీలకు ఇచ్చే వేతనాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చే వేతనాలకు వ్యత్యాసం భారీగా ఉంది. ఉత్తరాఖండ్‌లో రూ. 75 వేలు, గుజరాత్లో రూ. 55,640, హర్యానాలో రూ.54వేలు, తమిళ నాడులో రూ. 51 వేలు, హిమాచల్‌ప్రదేశ్‌లో రూ. 57,390, సిక్కింలో రూ. 60,500 చొప్పున చెల్లిస్తున్నారు. తెలంగాణలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువగా వేతనం కేవలం రూ.15 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఇవీ సీఆర్పీల విధులు.. - సీఆర్పీలను స్కూల్ కాంప్లెక్స్‌లకు అనుసంధానించారు. ఒక్కో సీఆర్పీ దాదాపు 15 నుంచి 18 పాఠశాలలను పరిశీలించాల్సి ఉంటుంది. - ఏదో ఒక స్కూల్‌ను ప్రార్థన సమయంలో సందర్శించి ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు నమోదు చేసుకొని వాట్సాప్‌లో అధికారులకు పంపాలి. - మండల వనరుల కేంద్రానికి, పాఠశాలలకు అనుసంధాన కర్తగా పని చేస్తూ సమాచారాన్ని అధికారులకు ఎప్పటికప్పుడు పంపుతూ ఉండాలి. - ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుడు సెలవు పెడితే సీఆర్పీ విధులు నిర్వర్తించాలి. - కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణకు సహకరించాలి. - సర్వశిక్షా అభియాన్‌తోపాటు ఇతర విద్యాశాఖ కార్యక్రమాలను చేపట్టాలి. - మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించాలి. - బడి బయట పిల్లలను బడిలో చేర్పించడం, రెగ్యులర్‌గా రాని వారిని వచ్చేలా చేయడం వీరి విధి కూడా.. - పాఠశాలలో నిధుల వినియోగాన్ని సమీక్షించాలి. - క్లస్టర్ స్థాయిలో ఎగ్జిబిషన్ మేళాలు నిర్వహించడానికి స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలకు సహకరించాలి. - వేసవి బడులను నిర్వహించాలి. -
ఉపాధిలో మహిళ
నాగర్‌కర్నూల్ టౌన్ : కరువు కాటకాల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న పేదలకు సొంత ఊరిలోనే పని కల్పించి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా నివారించేందుకు 2005లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వరంగా మారింది. గతంలో గ్రామాల్లో పనులు లేకపోవడంతో చాలా మంది బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వెళ్లే వారు. నెలల తరబడి కుటుంబాలకు దూరం గా ఉండి పిల్లాపాపలను వదిలేసి పొట్ట కూటి కోసం అన్నీ వదిలేసి పట్టణ ప్రాంతాల కు వెళ్లిపోయేవారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత పలు కుటుంబాలు సొంత ఊర్లోనే పనులు చేసుకుంటూ అందుకు తగ్గ కూలి పొందుతున్నారు. ఏడాది పొడవునా కూలీ పనులకు వెళ్తూ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు. అందులో జిల్లాలో మహిళలే అధికంగా ఉన్నారు. దీంతో ఉపాధిలో మహిళా శక్తి తన ప్రాభావాన్ని చాటుకుంటోంది. జిల్లాలో లక్షా 69వేల 27 ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉండగా వారిలో 3లక్షల 71వేల 130మంది కూలీలు ఉన్నారు. వీరిలో లక్షా 91వేల 256 మంది మహిళలే ఉన్నారు. అంటే దాదాపు 51శాతం మంది మహిళలే ఉన్నారు. ఈ ఏడాది చేసిన పనుల్లో చూసుకుంటే ఇప్పటి వరకు లక్షా 11వేల మంది పనుల్లో పాల్గొనగా అందులో 59వేల మంది (53 శాతం) మహిళలు ఉన్నారు. ఏడాదంతా పుష్కలంగా పనులు... ఉదయం వేళ పారా, పలుగు పట్టుకుని పురుషులతో పాటు మహిళలు కూలీ పనులకు వెళ్తున్నారు. తిరిగి మధ్యాహ్నం ఇంటికి చేరుకుని కుటుంబ పనులు చూసుకుంటున్నారు. మరికొందరు ఉదయం ఈజీఎస్ పనులకు వెళ్లి త్వరగా ముగించుకుని తర్వాత తమ సొంత వ్యవసాయ పనులకు సైతం వెళ్తున్నారు. ఇందుకు సంబంధించిన డబ్బులు వారి ఖాతాలోనే పడుతుండడంతో సొమ్ముకు సైతం భద్రత ఏర్పడింది. కాలానుగుణంగా ప్రతి సీజన్లోనూ కూలీలకు పనులు కల్పించడంతో పాటు గ్రామాల్లోని ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రతి కూలీ వద్దకు వెళ్లి పనుల వివరాలు చెబుతూ పనులకు తీసుకెళ్తున్నారు. గతంలో వేసవి కాలంలోనే పనులు అధికంగా ఉండేవి. కానీ ప్రతి పనికి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకుంటుండడంతో ఏడాది మొత్తం చేతినిండా పని ఉంటోంది. ముఖ్యంగా వానాకాలంలో హరితహారం మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం ఇలా ప్రతి ప్రభుత్వ పథకంలోనూ ఉపాధి కూలీలను వినియోగిస్తూ వారికి చేదోడువాదోడుగా నిలుస్తోంది. దీంతో నిరుపేదలకు సంవత్సరమంతా పనులు గ్రామాల్లోనే పుష్కలంగా లభిస్తున్నాయి. మహిళా కూలీలను ప్రోత్సహిస్తున్నాం గ్రామాలలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొనే మహిళలను ప్రోత్సహిస్తున్నాం. ఈ ఏడాది జరిగిన పనుల్లో ఇప్పటి వరకు అధిక శాతం మహిళలే పాల్గొంటున్నారు. పనులు చేసేందుకు కూడా పురుషుల కంటే మహిళలు అధిక ఆసక్తి చూపించడం మహిళా శక్తికి నిదర్శనం. – సుధాకర్, డీఆర్డీఓ -
వనదేవతల జాతరకుసర్వం సిద్ధం
హుజూరాబాద్ : కోరిన కోర్కెలు తీర్చే వన దేవతలు సమ్మక్క–సారలమ్మ జాతర నిర్వహణకు ఏర్పాట్లు అంతా సిద్ధం చేశారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో 10 చోట్ల జరుగనున్నండగా, సమ్మక్క–సారలమ్మలు కొలువుదీరనున్న గద్దెలను ఇప్పటికే ముస్తాబు చేశారు. తెలంగాణలో రెండేళ్లకోసారి ఎంతో వైభంగా జరిగే సమ్మక్క–సారలమ్మ జాతర సందడి వారం రోజుల ముందుగానే ప్రారంభం కాగా, ఈ నెల 31 నుంచి మూడు రోజుల పాటు వైభవంగా జరుగునున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు ఎత్తు బంగారం (బెల్లం) కొనుగోలు చేస్తుండటంతో మార్కెట్లో జాతర సందడి నెలకొంది. నియోజకవర్గంలో ప్రధానంగా హుజూరాబాద్ పట్టణ సమీపంలోని రంగనాయకులగుట్ట వద్ద జాతర వైభవంగా జరుగుతుంది. ఇక్కడ ప్రతీ రెండేళ్లకోసారి జరిగే జాతరకు 2 లక్షలకు పైగానే భక్తులు హాజరవుతుండగా, ఆయా మండలాల్లో జరుగనున్న ఒక్కో జాతరకు లక్ష మందికిపైగానే భక్తులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. జూపాకలో జాతరకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీణవంకలో ముమ్మర ఏర్పాట్లు మినీ మేడారంగా పిలిచే వీణవంక సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 31న వ నం నుంచి సారలమ్మ గద్దెకు రానుండటంతో జాతర ప్రారంభమవుతుంది. ఇక్కడ 1979 నుంచి పాడి వంశీయుల ఆధ్వర్యంలో జాతర జరుగుతుండగా... సుమారు 2లక్షల మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సమ్మక్క–సారలమ్మ గద్దెల సమీపంలో వాగు ఉండటంతో మినీ మేడారంగా పేరుగాంచింది. కరీం నగర్ నుంచి వీణవంక 40కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్తుల స్నానాల కోసం పక్కనే చెక్‌డ్యాం నిర్మించారు. ఇటీవల ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సహకారంతో ఎస్సారెస్పీ కెనాల్ కాలువ ద్వారా నీటిని నింపడంతో చెక్‌డ్యాం కలకళలాడుతోంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎస్సై కిష్ణారెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉంచారు. అదేవిధంగా చల్లూరు, కోర్కల్, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో కూడా జాతర జరుగుతుంది. ఇల్లందకుంటలో గద్దెలు ముస్తాబు ఇల్లందకుంట మండలంలోని మల్యాలలో జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు జాతర కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేశారు. 30 ఏళ్లుగా మల్యాలలో ఈ జాతరను నిర్వహిస్తున్నారు. సమ్మక్క–సారలమ్మలను మేడారంకు చెందిన కోయజాతి కులస్తులు తాటి వనం నుంచి తీసుకొస్తారు. ఇప్పటికే పూజరులు వచ్చి ఉన్నారు. గతంలో వేరు ప్రదేశాలకు మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్లేవారు అందరు కలిసి కులమతాలు తేడా లేకుండా జాతరను నిర్వహిస్తున్నా రు. దాదాపు ఈ జాతరకు 20వేలకు పై గా జమ్మికుంట, ఇల్లందకుంట మండలాలకు చెందిన వివిధ గ్రామాల ప్ర జలు వచ్చి దర్శించుకుంటారు. మూడు రోజుల పాటు జాతర జరుగనుంది. జమ్మికుంటలో.. జమ్మికుంట పట్టణంలోని కేశవపూర్‌లో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పాతకాల సంపత్ అధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. జమ్మికుంట, హైదరాబాద్, ఖమ్మం, మహారాష్ట్ర ప్రాంతాలతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం జాతర నిర్వహాకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సారి నూతనంగా సమ్మక్క గద్దె వద్దకు వెళ్లే సమయంలో మేడారంలో ఉండే విధంగా 5 గంటలను ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా భక్తులు స్నానాలు చేసేం దుకు శశ్వాత బాత్రూంలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సారి జరిగే జాతరకు మొక్కులు చెల్లించుకునేందుకు దాదాపు మూడు లక్షల మంది భక్తులు ççహాజరవుతారనే అంచన వేస్తున్నారు. మానేరు తీర ప్రాంతాన జాతర జమ్మికుంట మండలం వావిలాల, తనుగుల గ్రామాల్లో సమ్మక్క, సారలమ్మ జాతరలు కొసాగుతాయి. వావిలాలలో 1982 నుంచి, తనుగులలో 1984 నుం చి ప్రతి రెండేళ్లకోసారి జాతర కొనసాగుతూ వస్తున్నాయి. రెండు గ్రామాల శివారులో ఉన్న మానేరు తీర ప్రాంతాన జాతర వేడుకలు జరుగుతాయి. వావి లాలలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యం లో నడుస్తుంగా, తనుగులలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, విద్యుత్, రోడ్ల వసతులను ఏర్పాట్లను చేస్తున్నారు. వసతులు ఏర్పాటు చేశాం జాతరకు వచ్చే భక్తుల కోసం ఇప్పటికే అన్ని వసతులను ఏర్పాటు చేశాం. ప్రధానంగా తాగునీటి వసతి, లైటింగ్ పనులు పూర్తి చేశాం. మొక్కులు చెల్లించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. స్నానాల కోసం జంపన్న వాగు వద్ద ఏర్పాట్లు చేశాం. -పోరెడ్డి దయాకర్‌రెడ్డి,జాతర కమిటి చైర్మన్ -
తెలంగాణలో నూతన పంచాయతీ రూపకల్పన పక్రియ
-
ఏపీలో పోలీసుల పనితీరు భేష్
సాక్షి, అమరావతి: శాంతిభద్రతల విషయంలో 2017లో రాష్ట్ర పోలీసులు ఎక్కడా ఫెయిల్ కాలేదని, పోలీసుల పనితీరు సంతృప్తిగా ఉందని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు. ఎర్రచందనం విషయంలో అధికారులు చక్కగా పనిచేస్తున్నారంటూ ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్లను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని, స్మగ్లర్లను పట్టుకోవడంలో మంచి పురోగతి సాధించామని విలేకరుల సమావేశంలో తెలిపారు. సైబర్ నేరాలు 46 శాతం పెరిగాయన్నారు. కేసుల ఛేదనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు ఎ, బి, సి, డి కేటగిరీలో అవార్డులు ఇస్తున్నామని చెప్పారు. రహదారి ప్రమాదాలను 5 శాతం తగ్గించామన్నారు. రూ.68 కోట్లను చలానా రూపంలో వసూలు చేశామని, గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు 20 టీమ్‌లను ఏర్పాటు చేశామని, నక్సల్స్‌ను నియంత్రించడంలో విజయం సాధించామని, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి నక్సల్స్ సమస్యను ఎదుర్కొంటున్నామని ఆయన వివరించారు. కోడి పందేల విషయంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామన్నారు. ఈ సందర్భంగా ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ అండ్ నెట్వర్కింగ్ సిస్టమ్స్ పిన్స్ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ యాప్ వల్ల పోలీసులు సీజ్ చేసిన వాహనం ఏ పోలీస్ స్టేషన్లో ఉందో తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ప్రధానంగా ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసిన వాహనాల విషయంలో ఇది ఎంతో ఉపయోగకరమని సాంబశివరావు చెప్పారు. నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు ఎంజాయ్ చేయొచ్చని, అయితే మత్తు పానీయాలు తాగని వారితోనే వాహనం నడిపించాలని సూచించారు. -
వెట్టి బతుకులు!
సాక్షి, నాగర్‌కర్నూల్/ నాగర్‌కర్నూల్ క్రైం: నాగర్‌కర్నూల్ జిల్లాలోని పలు ప్రాజెక్టుల్లో పనులు చేసేందుకు పొట్ట చేత పట్టుకుని ఇతర రాష్ట్రాల నుంచి కోటిఆశలతో వలసొచ్చిన కూలీల విషాదాంతమిది. జిల్లాలోని పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లిఫ్ట్–1 వద్ద పలు రకాల పనులు చేసేందుకు చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా కింజోలి, చిత్తాపూర్, ఒడియాపాల్, దోన్వా గ్రామాలకు చెందిన కార్మికులు ఏడాది క్రితం జిల్లాకు వచ్చారు. ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పలు పనుల్లో వీరు కార్మికులుగా పనిచేస్తూ నెలనెలా తమ కుటుంబాలకు డబ్బులు పంపిస్తున్నారు. శనివారం ఉదయం వీరు ఉంటున్న క్యాంపు నుంచి పనులు జరుగుతున్న ప్రాంతానికి టిప్పర్‌లో వెళ్తుండగా బ్రేకులు ఫెయిలై బోల్తా పడింది. దీంతో అందులోని 16మంది చెల్లాచెదురుగా పడిపోయారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో సుమారు 15–20 నిమిషాలపాటు వీరి ఆర్తనాదాలు అడవిపాలయ్యాయి. ఆ తర్వాత అటుగా వెళ్తున్న వారు గమనించి ఒక్కొక్కరిని ముళ్లపొదల నుంచి రక్తమోడిన శరీరాలతో రోడ్డుపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి చికిత్స నిమిత్తం తరలించారు. తహసీల్దార్ల ద్వారా.. అయితే ఒక గ్రామం నుంచి ఉపాధి కోసం మరో ప్రాంతానికి వలస వెళ్లాలంటే తప్పనిసరిగా అలాంటి వారి పూర్తి వివరాలు నమోదు చేయాలి. వారికి సంబంధించిన పూర్తి వివరాలను తహసీల్దార్ల ద్వారా కార్మిక శాఖ సేకరించాలి. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కూలీలను కార్మిక శాఖ అధికారులు నమోదు చేసుకుని వారి రాష్ట్రాన్ని, జిల్లాను, గ్రామాన్ని, వారి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి ఫొటోలు తీసుకోవాలి. అలాగే ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు బీమా సౌకర్యం ఉందా.. ఆరోగ్య భద్రత కల్పిస్తున్నారా అన్న అంశాలపై వాకబు చేయాలి. జిల్లాలోని అధికారులు ఇవేమీ పట్టించుకోలేదు. దీంతో శనివారం జరిగిన ప్రమాదంలో గాయపడ్డ, మరణించిన వారి వివరాలు తెలుసుకోవడం పోలీసులకు తలకు మించిన భారంగా తయారైంది. ఎవరు ఎక్కడి వారో.. వారు మరణించారన్న వార్త ఎవరికి తెలియజేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. ముఖం చాటేసిన కంపెనీ.. నిర్మాణ రంగంలో ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే నవయుగ ఎన్ఈసీ కంపెనీల ప్రతినిధులు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన కూలీల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు కంపెనీ వారిని కఠినంగా శిక్షించాలని, వారిపై కేసులు నమోదు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా టిప్పర్ ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన కార్మిక కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం అందిస్తుందని, మరో రూ.10 లక్షల బీమా సొమ్ము చెల్లించేలా చర్యలు తీసుకుంటా మన్నారు. గాయపడిన కూలీలకు వైద్యఖర్చులతోపాటు రూ.2 లక్షలు చెల్లించేందుకు కాంట్రాక్ట్ సంస్థ ఆదేశాలు జారీ చేసిందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. పొట్ట చేతపట్టుకుని వలసలకు పేరుగాంచిన జిల్లాకే వలస వచ్చారు.. అనుకోని సంఘటనతో ముగ్గురు అమాయకుల ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయాయి. మరికొందరు రెక్కలు తెగిన పక్షుల మాదిరిగా మారాయి. ఈ ఘటనతో వలస కార్మికులు ఎక్కడి నుంచి వచ్చారు.. కుటుంబ సభ్యులు ఎవరు.. వీరికి బీమా సౌకర్యం ఉందా.. ఆరోగ్య భద్రత కల్పిస్తున్నారా.. తదితర వివరాలు సేకరించడంలో కార్మికశాఖ నిర్లక్ష్యం కనిపిస్తోంది. -
స్పిల్‌వే పనులు పరిశీలించిన సీఎం
మధ్యాహ్నం 12 గంటలకు రాక పనుల ప్రగతిని వివరించిన ఈఎన్సీ అధికారులతో సమీక్షించిన చంద్రబాబు పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పరిశీలించారు. మధ్యాహ్నం 12 గంటలకు హెలీకాప్టర్‌లో ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు స్వాగతం పలికారు. వ్యూపాయింట్ నుంచి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు పనుల వివరాలను సీఎంకు తెలియజేశారు. అక్కడ నుంచి స్పిల్‌వే నిర్మాణ ప్రాంతానికి చేరుకుని పనులు పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన మ్యాప్ ద్వారా ఈఎన్సీ స్పిల్‌వే వివరాలను తెలియజేశారు. అలాగే గేట్లు తయారీ కేంద్రానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ట్రాన్స్ట్రాయ్ కార్యాలయంలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో పాటు ఏజెన్సీ ప్రతినిధులతో పనులపై రివ్యూ జరిపారు. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు కె.భాస్కర్, కార్తీకేయ మిశ్రా, డీఐజీ పీవీఎస్ రామకృష్ణ, కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఎస్ఈ వీఎస్ రమేష్‌బాబులు పాల్గొన్నారు. -
యాంత్రీకరణకు గ్రహణం
మంత్రి ఓకే చేయలేదు... ప్రారంభం కాని రైతు రథం సాక్షి ప్రతినిధి, ఏలూరు : వ్యవసాయ శాఖలో యాంత్రీకరణకు గ్రహణం పట్టింది. ఈ ఏడాది ఖరీఫ్ పూర్తి అయ్యే దశకు చేరుకుంటున్నా ఇంతవరకూ యాంత్రీకరణ ప్రారంభం కాలేదు. వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి ఈ ఏడాది రూ. 110 కోట్లతో వ్యవసాయ శాఖకు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటికే ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యి ఆరు నెలలు గడిచినా ఇంతవరకూ ఆమోదం లేదు. గత ఏడాది కూడా కేవలం రూ. 24.56 కోట్ల రూపాయల విలువతో 4,892 మంది రైతులకు యంత్ర పరికరాలు అందచేశారు. ఈ ఏడాది బడ్జెట్ అంచనాలు నాలుగింతలు పెంచి పంపినా ఇంతవరకూ ఆమోదానికి నోచుకోలేదు. ప్రస్తుతం రైతు రథం పథకం కింద సబ్సిడీ ట్రాక్టర్లు ఇవ్వాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. జిల్లాకు మొదట ఐదు వందల పైచిలుకు మంజూరు కాగా, వాటిని ఇప్పుడు 858కి పెంచారు. ఈ ప్రక్రియ మొత్తం ప్రజాప్రతినిధుల చేతుల్లో ఉండటంతో అడుగు ముందుకు పడటం లేదు. జిల్లాలోని 15 మంది ఎమ్మెల్యేలకు లబ్ధిదారులు ఎంపిక బాధ్యత అప్పగించారు. ఆ తర్వాత ఈ ప్రతిపాదనలను జిల్లా ఇంఛార్జి మంత్రి ఆమోదించాల్సి ఉంటుంది. మొత్తం 858 ట్రాక్టర్లలో 140 ట్రాక్టర్లు 4 వీల్ రకం ఉండగా, మిగిలినవి 2 వీల్ రకం. 4 వీలర్ రకం ట్రాక్టర్లకు అదనంగా యంత్రపరికరాలు ఉంటే రూ. 2.50 లక్షలు, మామూలు వాటికి రూ. 2 లక్షలు సబ్సిడీ కాగా, 2 వీల్ ట్రాక్టర్‌కు అదనపు హంగులు ఉంటే రూ. 2 లక్షలు, మామూలు వాటికి రూ. 1.50 రూపాయల సబ్సిడీ ఉంది. వీటికి రైతుల నుంచి పోటీ ఎక్కువ ఉంది. ఎమ్మెల్యేలపై కూడా స్థానిక నాయకుల నుంచి ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి లబ్ధిదారుల ఎంపిక తమకు తలనొప్పిగా మారిందని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే వ్యతిరేకత పెరుగుతుందని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంఛార్జి మంత్రి కూడా ఈ జాబితాకు ఆమోద ముద్ర వేయకపోవడంతో రైతు రథం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. రైతు రథంలో ఇచ్చే ట్రాక్టర్లు కూడా రైతు కోరుకున్న కంపెనీవి కాకుండా తమకు అనుకూలమైన వాటినే ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. అమరావతిలో మంత్రిని కలిసి అమోద ముద్ర వేయించుకున్న బ్రాండ్లకు మాత్రమే ఇందులో ఆమోదం లభించినట్లు తెలిసింది. జిల్లాలో ఎక్కువగా వినియోగించే కంపెనీలకు చెందిన ట్రాక్టర్లకు ఆమోదం లభించలేదు. దీంతో ప్రభుత్వం ఇస్తామని చెబుతున్న ట్రాక్టర్ల బ్రాండ్లపై రైతుల్లో వ్యతిరేకత వస్తోంది. మరోవైపు వ్యవసాయ శాఖలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేరుగా వినియోగదారునికే లబ్ధి అనే పథకం కింద జిల్లాకు రూ. 23.45 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. ఇదివరకు ఇచ్చే సబ్సిడీ యంత్రాలకు భిన్నమైన పథకం. ఈ స్కీం ఇప్పటి వరకూ ప్రారంభించలేదు. ఇటువంటి పథకం ఒకటి ఉందన్న విషయం కూడా రైతులకు తెలియలేదు. జిల్లాలో యాంత్రీకరణ ప్రక్రియ మాత్రం ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. -
మీ ఆలోచనలు కుదురుగానే ఉంటాయా?
ఒక పని చేయాలని కాసేపు అనుకొని, మళ్లీ అంతలోనే వద్దనుకోవటం, వాయిదా వేయాలనుకోవటం, తిరిగి చేయాలనుకోవటం... ఇలాంటి తికమకలు తెలిసినవే. ఆలోచనలను వెంటవెంటనే మార్చుకుంటూ అయోమయానికి గురయ్యే పరిస్థితి మీలోనూ ఉందా? మీ ఆలోచనలు కుదురుగా ఉన్నాయో లేవో సెల్ఫ్‌చెక్ చేయండి. 1. షాపులో ఒక వస్తువును సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా చాలాసేపు దాని గురించి అయోమయంలో ఉంటారు. ఎ. అవును బి. కాదు 2. ఎవరికైనా మాట ఇచ్చి వెంటనే ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారు. ఎ. అవును బి. కాదు 3. ఒక క్రమపద్ధతి లేని ఆలోచనా విధానం వల్ల మీ జీవితభాగస్వామి, స్నేహితులతో అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. ఎ. అవును బి. కాదు 4. మీ అభిప్రాయాలకు కాక ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ విలువనిచ్చి ఆచరించటానికి ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు 5. పరీక్షల్లో ముందుగా సరైన సమాధానం రాసి దాన్ని మార్చి తర్వాత తప్పుగా రాసిన సందర్భాలు ఉన్నాయి. ఎ. అవును బి. కాదు 6. ఆలోచనలో క్రమం లేకపోవటం వల్ల అబద్ధాలు చెప్పవలసిన పరిస్థితి కలుగుతుంది. ఎ. అవును బి. కాదు 7. అభిప్రాయాలను స్థిమితం లేకుండా మార్చుకోవటంవల్ల ప్రయోజనం కలిగిందని మీ అనుభవంలో తెలుసుకున్నారు. ఎ. కాదు బి. అవును 8.ఎప్పటికప్పుడు మారే మీ అభిప్రాయాలకు ఇతరులను సాకుగా చూపిస్తారు. ఎ. అవును బి. కాదు 9. స్థిమితంలేని ఆలోచనలు, అభిప్రాయాల వల్ల కొన్నిసార్లు మీరు ఆందోళనకు గురవుతారు. ఎ. అవును బి. కాదు 10. ఆలోచనలో మార్పుల వల్ల ఒక పనిని చాలాసార్లు చేయవలసి వస్తుంది. ఎ. అవును బి. కాదు మీరు టిక్ పెట్టుకున్న సమాధానాలలో ‘ఎ’ లు ఏడు దాటితే మీ ఆలోచనలు స్థిమితంగా ఉండవు. తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే మార్చుకొనే మనస్తత్వం మీకుంటుంది. ఇలాంటి నిలకడలేని ఆలోచనలు మీ జీవితంలో చాలా చికాకుని, ఆందోళనని కలిగిస్తాయి. ‘బి’ లు 6 కంటే ఎక్కువగా వస్తే నిర్ణయాలను వెంటవెంటనే మార్చుకొనే మనస్తత్వం మీకుండదు. మీ నిర్ణయాలలో అయోమయానికి తావుండదు. కాబట్టి మీరు ‘ఎ’లను ప్రాతిపదికగా తీసుకోవడం బెటర్. -
పనులు వేగం పెంచండి
2019కి మిగులు జలాలు సాధించనున్నారు... పోలవరాన్ని సందర్శించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సాక్షి ప్రతినిధి, ఏలూరు, పోలవరం : ప్రాజెక్టు పనులు 2019 నాటికి పూర్తి చేసేలా వేగం పెంచాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది. కమిటీ చైర్మన్ హుకుంసింగ్ నేతృత్వంలో 9 మంది పార్లమెంట్ సభ్యుల బృందం శుక్రవారం పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను పరిశీలించింది. తొలుత విజయవాడ నుంచి బయలుదేరిన ఈ బృందం పట్టిసీమ చేరుకుని ప్రాజెక్టును పరిశీలించింది. అనంతరం డెలివరీ పాయింట్‌ను సందర్శించిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు చేరుకుని అక్కడ పోలవరం ప్రాజెక్టు మ్యాప్ చూసి ప్రాజెక్టు నిర్మాణం గురించి తెలుసుకున్నారు. వ్యూ పాయింట్, íస్పిల్‌వే కాంక్రీట్ పనులు, రేడియల్ గేట్ల తయారీ పనులూ వారు పరిశీలించారు. అనంతరం హుకుంసింగ్ మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2019 నాటికి మిగులు జలాలు సాధించే ఘనత దక్కించుకోనుందని హుకుంసింగ్ అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న జలవనరుల ప్రాజెక్టులను సందర్శిస్తున్న తమ కమిటీ పోలవరం వచ్చిందని పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరిగేలా కృషి చేయాలని సూచించారు. తమ బృందం ఏపీతోపాటు పంజాబ్, చండీఘడ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో క్షేత్ర పరిశీలన చేసి వివిధ జలవనరుల ప్రాజెక్టులను పరిశీలించిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దేశంలో నీటికొరత లేకుండా నీటిభద్రత కల్పించే విషయంపై దృష్టి పెట్టేందుకు అవసరమైన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఈ కమిటీ అందిస్తుందన్నారు. తొలుత సీఎంతో భేటి రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను సందర్శించేందకు వచ్చిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు తొలుత విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారని, ఆయన ప్రాజెక్టు వివరాలను వారికి వివరించారని వెల్లడించారు. విజయవాడ నుంచి పోలపవరం చేరుకున్న ఈ బృందం సభ్యులు పోలవరం ప్రాజెక్టు పనులను కళ్ళారా చూసిన తరువాత సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుందని చెప్పారు. అనుకున్న ప్రకారం 2019 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని 2018లో కొంతమేర గ్రావిటీ ద్వారా నీరందించేందుకు యత్నాలు జరుగుతున్నాయన్నారు. జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమమాహేశ్వరరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి 97 సార్లు వర్చ్యువల్ ఇన్స్పెక్షన్, 18 సార్లు ప్రాజెక్టును సందర్శించారని చెప్పారు. నిర్మాణం విషయంలో ప్రధానమంత్రి మోదీ, కేంద్ర జలవనరుల శాఖామంత్రి ఉమాభారతి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని ప్రశంసించారు. పోలవరం ప్రాజెక్టు డ్యామ్ పనులు జరుగుతున్న తీరుపై కమిటీ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహకారం అందించాలని స్టాండింగ్ కమిటీ సభ్యులను కోరారు. ప్రతి సోమవారం ముఖ్యమంత్రి పోలవరంపై సమీక్ష నిర్వహించడంతో పాటు ప్రతి నెల 3వ సోమవారం ప్రాజెక్టు పనులను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ పనులను శరవేగం చేస్తున్నారని వివరించారు. అధికారులతో మాటామంతి తొలుత పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న కమిటీ సభ్యులకు పోలవరం ప్రాజెక్టు నమూనా పటాన్ని, ఇతర ప్రాజెక్టుకు సంబంధించిన ఛాయాచిత్రాలను చూపిస్తూ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఒనగూరే ప్రయోజనాలను, నిర్మాణ పనుల పురోగతిని జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్, పోలవరం ప్రాజెక్టు సీఈ రమేష్‌బాబులు వివరించారు. ఈ సందర్బంగా కమిటీ సభ్యులు జిల్లా అధికారులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కోసం జరిగిన భూసేరణపై కలెక్టర్ కాటంనేని భాస్కర్ నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో వి.సత్యభా, అపూరూపకొద్దార్, సర్ధార్ బల్విందర్ ఎస్.గుహంథర్, హర్షవర్ధన్ సింగ్దుంగార్పూర్, రాపోలు ఆనందభాస్కర్, ప్రదీప్ తమటా, డాక్టర్ సిద్ధాంత్మహోపాత్రాలతోపాటు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖామంత్రి పితాని సత్యనారాయణ, ఎంపీ మాగంటి బాబు, కలెక్టర్ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
రిటైర్మెంటా... అంటే?
-
రిటైర్మెంటా... అంటే?
బ్రిటన్ రాణి ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ వయోభారం దృష్ట్యా ఇకపై రాచ విధులకు దూరంగా ఉండాలని గురువారం నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఆయన 96వ ఏట అడుగుపెడతారు. 60 ఏళ్లు రాగానే రిటైర్మెంట్ తీసుకొని... విశ్రాంత జీవితం గడపాలని ఎందరో కోరుకుంటారు. కానీ కొందరు మాత్రం అందుకు భిన్నం. సుదీర్ఘకాల విధుల్లో ఉన్నా... వయసు సెంచరీ దాటేసినా... పనిలోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నారు వీరు. 80–90 ఏళ్లుగా అదే పని. అయినా ఏమాత్రం విసుగు, విరామం ఉండదు. అలాంటి వయోధికులు కొందరి గురించి... డేవిడ్ గుడాల్: 103 ఏళ్ల పర్యావరణ శాస్త్రవేత్త ఇప్పటికీ పెర్త్ (ఆస్ట్రేలియా)లోని ఎడిత్ కోవాన్ యూనివర్శిటీలో గౌరవ రీసెర్చ్ అసోసియేట్‌గా పనిచేస్తున్నారు. 70 ఏళ్ల కెరీర్లో 100కు పైగా పరిశోధన పత్రాలను వెలువరించిన గుడాల్ రోజూ వర్శిటీకి డ్రైవ్ చేసుకుంటూ రావడం క్షేమకరం కాదని భావించిన అధికారులు ఇంటి నుంచి పనిచేయాల్సిందిగా కోరగా.... ఆయన నిరాకరించారు. దాంతో వర్శిటీయే దిగివచ్చి గుడాల్ ఇంటికి దగ్గర్లో ఆఫీసును చూసిపెట్టింది. నాటకరంగంలోనూ ఇటీవలి దాకా చురుకుగా ఉన్న గుడాల్ కంటిచూపు మందగించిన కారణంగా రిహార్సల్స్‌కు చాలాదూరం డ్రైవ్ చేయాల్సిన పరిస్థితుల్లో ఈ అభిరుచికి దూరమయ్యారు. ఆంథోని మాంచినెల్లి: న్యూయార్క్‌లోని ఆరెంజ్ కౌంటీకి చెందిన 106 ఏళ్ల ఆంథోని క్షురక వృత్తిలో ఉన్నారు. ఊహతెలిసినప్పటి నుంచి సెలూన్లో పనిచేయడమే. 90 ఏళ్లుగా క్షురకుడిగా పనిచేస్తున్న ఈయన 2012లోనే సుదీర్ఘకాలం క్షురక వృత్తిలో ఉన్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డులకెక్కారు. ‘పని చేయడం ఆపొద్దు. మీరు చేస్తున్న పనికి వయసు అడ్డంకిగా మారిందా... మరో పనిని ఎంచుకొండి. అంతేకాని రిటైర్ కావొద్దు’ అని ఇటీవల ఆంథోని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మస్తానమ్మ: మనకే తెలియని తెలుగు మాస్టర్ చెఫ్ ఈ 106 ఏళ్ల బామ్మ. ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడ గ్రామానికి చెందిన ఈమె యూట్యూబ్ ఛానల్ ‘కంట్రీ ఫుడ్స్’ నెట్టింట్లో ఓ సంచలనం. ఏకంగా 2,80,000 మంది సబ్‌స్రై్కబర్స్ ఉన్నారీ ఛానల్‌కు. బామ్మ చేతి వంట రుచి ఎరిగిన ఈమె మునిమనవడు కె.లక్ష్మణ్... కంట్రీ ఫుడ్స్ ఛానల్ నిర్వహణ బాధ్యతలు చూస్తారు. పచ్చటి పంటపోటాల మధ్య, లేదా మామిటి, అరటి తోటల్లో మస్తానమ్మ ఓ చెట్టు కింద కూర్చొని తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. సంప్రదాయ, స్థానిక వంటకాలను మస్తానమ్మ సిద్ధం చేస్తుంటారు. ఎగ్ దోస, చేపల వేపుడు, బంబూ చికెన్ బిర్యానీ, పుచ్చకాయలో వండిన చికెన్... ఇలా బామ్మ ఎన్నింటినో అలవోకగా వండివారుస్తుంది. సీ ఫుడ్‌లో స్పెషలిస్టు. ప్రతి వంటకానికి కావాల్సిన పదార్థాలేమిటి, ఎంత మోతాదులో వాడాలో చేతిలోకి తీసుకొని చూపెడుతుంది. లక్ష్మణ్ బృందం బామ్మ వంట వీడియోలను షూట్ చేసి యూట్యూబ్‌లో పెడుతుంది. మొదట్లో మనవడు చేస్తున్నదేమిటో మస్తానమ్మకు అర్థమయ్యేది కాదు. కాని కొంతకాలం తర్వాత అర్థమైంది. అప్పుడామె ఎంతో సంతోషపడిందని లక్ష్మణ్ చెప్పారు. నెట్లో ఇప్పుడీ బామ్మకు చాలా క్రేజుంది. జాక్ బెర్ట్రాండ్ వీన్స్టయిన్: న్యూయార్క్‌లోని ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్‌లో ఫెడరల్ జడ్జిగా పనిచేస్తున్నారీ 95 ఏళ్ల యువ న్యాయమూర్తి. 1967లో జడ్జిగా నియమితులైన ఈయన వివిధ కోర్టుల్లో న్యాయమూర్తిగా 50 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఇప్పటికీ అదే ఉత్సాహంతో న్యాయస్థానానికి హాజరవుతారు. చట్టాల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు ఆకళింపు చేసుకుంటూ రిటైర్మెంట్ ఆలోచన లేకుండా ముందుకు సాగుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా నావికాదళంలో పనిచేసి లెఫ్టినెంట్‌గా రిటైరయ్యారు. తర్వాత న్యాయరంగాన్ని కెరీర్‌గా ఎంచుకున్నారు. షిగీకి హినోరా: ప్రపంచంలోనే అత్యంత పెద్దవయస్కుడైన ప్రాక్టీసింగ్ ఫిజీషియన్ 105 ఏళ్ల హినోరా. టోక్యోలోని సెయింట్ ల్యూక్ ఇంటర్నేషనల్ ఆసుపత్రి ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. ఐదు ఫౌండేషన్లకు చైర్మన్. పెద్దసంఖ్యలో పుస్తకాలు రాశారు. వేలకొద్ది పత్రాలు సమర్పించారు. ఈ వయసులోనూ ఆయన ప్రతిరోజు ఆసుపత్రికి వస్తారు. తన పేషెంట్లను చూడటానికి రౌండ్లకు కూడా వెళతారు. అపార అనుభవం కారణంగా హినోరాను‘జాతి సంపద’గా సహచర డాక్టర్లు అభివర్ణిస్తుంటారు. అలా ఇలినించా లెవుష్కినా: మాస్కో మెడికల్ ఇనిస్టిట్యూట్‌లో వైద్యవిద్యను అభ్యసించిన లెవుష్కినా 89 ఏళ్ల వయసులోనూ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. జీర్ణ, విసర్జన వ్యవస్థల నిఫుణురాలు. రష్యాలోని రయాజాన్ అనే పట్టణంలో ఈమె నివసిస్తున్నారు. ఉదయం 8 గంటలకే క్లినిక్‌లో పేషెంట్లను చూడటం ప్రారంభం అవుతుంది. 11 గంటలకు ఆసుపత్రికి వెళ్లి ఆపరేషన్లకు ఉపయుక్తమవుతారు. వారంలో నాలుగురోజులు ఆపరేషన్లు చేస్తుంటారు. 67 ఏళ్ల కెరీర్లో 10 వేల పైచిలుకు ఆపరేషన్లు నిర్వహించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వడదెబ్బతో ఇద్దరు మృతి
అప్పలాపురం(బనగానపల్లె రూరల్): నందివర్గం స్టేషన్ పరిధిలోని అప్పలాపురం గ్రామానికి చెందిన ఉపాధి కూలీ అవుకు దానియల్(27) వడదెబ్బతో శుక్రవారం మృతి చెందాడు. దానియల్ ఉదయం ఉపాధి పనికి వెళ్లాడు. ఎండ దెబ్బకు పనిప్రదేశంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా కోలుకోలేక మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఆగిపోయిన పోలవరం పనులు
-
వడదెబ్బతో ముగ్గురి మృతి
మహానంది/బనగానపల్లె: భానుడి ఉగ్రరూపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బతో జిల్లాలో మంగళవారం ఒక్కరోజే ఐదుగురు మృతి చెందారు. వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన అస్వస్థతకు గురై ఇంటికొచ్చిన కుటుంబ సభ్యులు కాసేపటికే మృత్యవాత పడటంతో ఆ కుటుంబాలు బోరున విలపించాయి. పేరు మండలం గ్రామం మృతికి కారణం వెంకటేశ్వర్లు(45) మహానంది అల్లీనగరం పొలం పనులకు వెళ్లి.. వి.చిన్నమ్మ(74) మహానంది తిమ్మాపురం రెండ్రోజులుగా అస్వస్థతకు గురై.. సయ్యద్‌హుస్సేన్(47) బనగానపల్లె బనగానపల్లె ఇంట్లోనుంచి బయటకు వెళ్లి వచ్చి.. రహీమ్(39) కర్నూలు జొహరాపురం పొలం పనులకు వెళ్లి.. మాల కిష్టానమ్మ (78) దేవనకొండ కరివేముల పొలం పనికి వెళ్లి -
మేమింతే..!
► కదలని కాంట్రాక్టర్లు ► ముందుకు సాగని వెలిగొండ పనులు ► కాంట్రాక్టర్లకు సెవెన్ డేస్ నోటీసులు ► అయినా మారని తీరు ► హెడ్ రెగ్యులేటర్, టన్నెల్ పనులను కొత్త కాంట్రాక్టర్లకు అప్పగింత ► వచ్చే ఏడాదికి ఫేజ్–1 పనులు పూర్తి కావడం ప్రశ్నార్థకమే... సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కాంట్రాక్టర్ల తీరు మారకపోవడంతో వెలిగొండ ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. పనులు నత్తనడకన సాగుతుండటంతో అధికారులు హెచ్చరికగా కాంట్రాక్టర్లకు సెవెన్ డేస్ నోటీసులు జారీ చేశారు. నోటీసులిచ్చి 15 రోజులు దాటుతున్నా.. వారి తీరు మారలేదు. పనుల్లో పురోగతి లేదు. దీంతో కొల్లంవాగు హెడ్ రెగ్యులేటర్ పనులతో పాటు టన్నెల్–1, 2 పనులలో కొంత భాగాన్ని కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు పనులకు సంబంధించి అంచనాలను రూపొందించే పనిలో పడ్డారు. ఇప్పటికే దాదాపు రూ.120 కోట్ల అంచనాలతో రూపకల్పన చేసి కొల్లంవాగు హెడ్ రెగ్యులేటర్ పనులకు మరో వారంలో టెండర్లు పిలవనున్నారు. తొలుత రెండు హెడ్ రెగ్యులేటర్‌లో మొదటి హెడ్ రెగ్యులేటర్ పూర్తి చేసేందుకే ప్రాధాన్యతనిస్తున్నారు. అనుకున్న రీతిలో కొత్త కాంట్రాక్టర్ పనులు వేగవంతం చేస్తే ఆరు నెలల్లో ఒక హెడ్ రెగ్యులేటర్ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అదే సమయంలో టన్నెల్–1, 2 పనులను హెడ్ రెగ్యులేటర్ వైపు నుంచి చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు అంచనాలను సిద్ధం చేస్తున్నారు. ఈ పనులను సైతం టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. 2018 మార్చి నాటికి ఫేజ్–1 పనుల్లో భాగంగా టన్నెల్–1, హెడ్ రెగ్యులేటర్ పనులను పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముందుకు సాగని టన్నెల్ పనులు.. టన్నెల్–1 18.820 కి.మీ. ఉంది. రూ.624.6 కోట్లతో ఒప్పందం మేరకు పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.484.44 కోట్లు వెచ్చించి 13.927 కి.మీ. పనులు మాత్రమే పూర్తి చేశారు. ఇక టన్నెల్–2కు సంబంధించి 18.838 కి.మీ. ఉండగా రూ.735.21 కోట్లతో పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.464.8 కోట్లు ఖర్చు చేసి 10.425 కి.మీ. మేర మాత్రమే పనులు పూర్తి చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు వేగవంతం చేస్తున్నట్లు పలుమార్లు ప్రకటించింది. తొలుత 2016 నాటికే నీళ్లిస్తామన్నారు. ఆ తర్వాత మాట మార్చి 2017కు అన్నారు. కాంట్రాక్టర్లు ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కై ప్రాజెక్టు అంచనాలను రూ.2,330 కోట్లకు పెంచుకోవడం తప్ప పనుల కోసం వెచ్చించిన నిధులు నామమాత్రమే. తాజా బడ్జెట్లో కేవలం వెలిగొండకు రూ.200 కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తే వెలిగొండపై బాబు ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో తెలుస్తోంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి 2018 నాటికి వెలిగొండ ద్వారా నీరిస్తామంటూ మరోమారు ప్రకటించారు. దీంతో ఇటీవల అధికారులపై ఒత్తిడి పెరిగింది. వారు ఎంత చెప్పిన కాంట్రాక్టర్లు వినే పరిస్థితి లేదు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలే వెలిగొండ కాంట్రాక్టర్ల అవతారమెత్తడంతో వారు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. దీంతో ఇటీవల వారికి సెవెన్ డేస్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ప్రభుత్వం చేసిన పనులకే బిల్లులు చెల్లించటం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. నెలవారీ ఖర్చుల బిల్లులు తప్ప పెండింగ్‌లో ఉన్న రూ.60 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్లులివ్వకుండా పనులు చేయమంటే ఎలా చేస్తారన్నది కాంట్రాక్టర్ల వాదన. బిల్లులివ్వలేదంటూ ఇటీవల పలు దఫాలుగా పనులను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్న కాంట్రాక్టర్లను కాదని వెలిగొండ పనులు వేరొక కాంట్రాక్టర్‌కు అప్పగించడం అంతా ఆషామాషీ వ్యవహారం కాదు. అధికారులు ఉన్న కాంట్రాక్టర్లతోనే పనులు వేగవంతం చేయిస్తారా.. లేక మిగిలిన పనులను కొత్త కాంట్రాక్టర్లకు అప్పగిస్తారా.. అన్నది రాబోయే కాలంలో గానీ తెలియదు. మూడు జిల్లాల రైతుల ఎదురుచూపులు.. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు వెలిగొండ ప్రాణాధారం. ప్రకాశం జిల్లాలో 3.36,100 ఎకరాలు, నెల్లూరు జిల్లా పరిధిలో 84 వేల ఎకరాలు, కడప జిల్లా పరిధిలో 27,200 ఎకరాలు ప్రాజెక్టు ద్వారా సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం మూడు జిల్లాల ప్రజానీకం వేయికళ్లతో ఎదురు చూస్తోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఫ్లోరైడ్, కిడ్నీ వ్యాధి బారి నుంచి వేలాది ప్రజలను కాపాడాలంటే వెలిగొండే శరణ్యం. అయినా సరే బాబు సర్కారు మాటలతో సరిపెట్టడం మినహా ప్రాజెక్ట్‌ను చిత్తశుద్ధితో పూర్తిచేసే ప్రయత్నం చేయడం లేదు. -
వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
అవుకు: మెట్టుపల్లె గ్రామంలో ఉపాధి కూలీ ఒకరు వడదెబ్బతో బుధవారం మృతి చెందారు. స్థానికులు, ఫీల్డ్ అసిస్టెంట్ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గడ్డం పుల్లయ్య (35)ఉదయం ఉపాధి పనికి వెళ్లి.. 11 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురై స్పృహ తప్పి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. మృతునికి భార్య రమాదేవి, ఒక కూతురు, కూమారుడు ఉన్నారు. -
అడిగిన వారందరికీ పనులు కల్పిస్తాం
– వేసవిలో ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు – పనుల కోసం 0866–2432064 ఫోన్ చేయవచ్చు.. – డ్వామా పీడీ పుల్లా రెడ్డి వెల్లడి కర్నూలు (అగ్రికల్చర్) : వలసలను నివారించేందుకు అడిగి ప్రతి ఒక్కరికీ పని కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పుల్లారెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వలసలు వెళ్లే గ్రామాన్ని సందర్శించి అందుకు గల కారణాలను తెలుసుకొని పనులు కల్పిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని 36 కరువు మండలాల్లో ఇప్పటికే 100 రోజులు పని దినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలకు అదనంగా 50 రోజులు పనిదినాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ప్రత్యేక వేసవి అలవెన్సులు ఇస్తున్నామని, ఉపాధి పనులు సంబంధిత గ్రామానికి 5కి.మీల దూరంలోనే పనులు కల్పించే విధంగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఒకవేళ ఐదు కిలో మీటర్లు దాటి పనులు కల్పిస్తే 10 శాతం రవాణా భత్యాన్ని అందజేస్తామని తెలిపారు. పనులు కావాలనుకునే వారు 0866–2432064కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. -
‘కూలి’ కష్టం!
‘ఉపాధి’ కూలీల ఖాతాల్లోకి జమ కాని రూ.3 కోట్లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కూలీలు రెండు నెలలుగా ఇదే దుస్థితి ఆధార్ అనుసంధానం కాకపోవడమే కారణం 18 శాతం మందికి బ్యాంక్ అకౌంట్లే లేని వైనం పనులు చేసినా కూలి డబ్బు తీసుకోలేని దయనీయ పరిస్థితి ఉపాధి హామీ కూలీలది. బ్యాంక్ ఖాతాలున్నా ఆధార్ అనుసంధానం కాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా కూలీలు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో సుమారు రూ.3 కోట్లు బ్యాంకులకు వెళ్లి వెనక్కు వచ్చేసింది. జిల్లాలోని 1003 పంచాయతీల్లో 6,77,776 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. వీరిలో 5,59,244 మందికి బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. 1,18,532 మందికి ఖాతాలు లేవు. గతంలో ఉపాధి పనులు చేసిన వారి నుంచి పుస్తకాల్లో సంతకాలు తీసుకుని తపాలా సిబ్బంది నగదు పంపిణీ చేసేవారు. ఇందులో అక్రమాలు చోటుచేసుకోవడంతో వేలిముద్రల ఆధారంగా బయోమెట్రిక్ విధానం అమల్లోకి తెచ్చారు. కొందరి వేలిముద్రలు, మరికొందరి ఆధార్ సరిపోలకపోవడంతో సాంకేతిక సమస్యలు వచ్చాయి. వేతనాల చెల్లింపు ఆలస్యమైంది. దీంతో ప్రత్యక్ష నగదు బదిలీకి కేంద్రం శ్రీకారం చుట్టింది. జాబ్ కార్డులు ఉన్న వారందరికీ ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) లేదా వ్యక్తిగత పొదుపు ఖాతాలు ఏదో ఒక బ్యాంకులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. గత ఏడాది వరకు కొన్ని పంచాయతీల్లో కూలీలకు బ్యాంక్ ఖాతాల ద్వారా, మరికొన్ని చోట్ల పోస్టాఫీసుల ద్వారా చెల్లింపులు చేశారు. అయితే.. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల్లోనూ బ్యాంక్ ఖాతాల ద్వారానే కూలి డబ్బు అందిస్తున్నారు. ప్రతి రోజూ రెండు లక్షల మంది వరకు కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారు. వీరికి ప్రతి వారం చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లోని కూలీల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాకపోవడంతో సమస్య తలెత్తుతోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు పది వేల మంది కూలీలకు రూ.3 కోట్లు అందించాల్సి ఉంది. ఈ డబ్బు బ్యాంకులకు వెళ్లినా ఆధార్ అనుసంధానం కాక వెనక్కు వచ్చేసింది. ప్రధానంగా కనగానపల్లి మండలంలో కూలీలకు ఉపాధి సొమ్ము అందలేదని తెలుస్తోంది. 18 శాతం మందికి ఖాతాల్లేవ్ జిల్లాలో ప్రస్తుతం ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీల్లో 1,18,532 మందికి బ్యాంక్ ఖాతాలు లేవు. మొత్తం కూలీల్లో 18 శాతం మందికి అకౌంట్లు లేవు. గుడిబండ మండలంలో 10,594 మంది కూలీలుంటే 7091 మందికి, కదిరిలో 8,988 మందికి గాను 6,128, రొద్దంలో 11,367 మందికి 7,997, మడకశిరలో 11,795 మందికి గాను 8,263, చెన్నేకొత్తపల్లి మండలంలో 14,778 మందికి గాను 10,557 మందికి మాత్రమే బ్యాంక్ ఖాతాలున్నాయి. ఇలాంటి మండలాలు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. గుత్తి, గుంతకల్లు, పెద్దపప్పూరు, తాడిమర్రి, ఉరవకొండ మండలాల్లో మాత్రం 98 శాతానికి పైగా బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా ఖాతాలు తెరిపిస్తే కూలీలకు మేలు జరిగే అవకాశం ఉంది. చర్యలు తీసుకుంటున్నాం : నాగభూషణం, డ్వామా పీడీ ఉపాధి కూలీలందరికీ బ్యాంక్ ఖాతాలు తప్పనిసరి. ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరికీ వ్యక్తిగత ఖాతాల్లోనే నగదు పడుతుంది. ఖాతాలు తెరిపించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. కూలి చెల్లింపు సమస్య ఉన్న చోట ఆధార్ లింకేజీ చేయిస్తున్నాం. కూలీలు కూడా తమ ఖాతాలకు ఆధార్‌తో లింక్ చేయించుకుని మండల కంప్యూటర్ సెంటర్ (ఎంసీసీ)కు వెళ్లి అప్లోడ్ చేయించుకోవాలి. అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. -
ప్రతి మండలంలో లక్ష మందికి ‘ఉపాధి’
– జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ కర్నూలు (అర్బన్): ప్రతి మండలంలో నాలుగు వారాల్లోగా లక్ష మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని ఎంపీడీఓలను జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేవలం 10 శాతం పనులు కల్పించడంలోనే ఉన్నారని, పరిస్థితి చాలా అధ్వానంగా ఉందన్నారు. పనులు జరగడం లేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పొలాల్లో పంటలు లేవని, రైతులకు ఉపయోగపడే పనులతో పాటు చెక్‌డ్యామ్‌లు, పూడికతీత పనులు చేపడితే పెద్ద ఎత్తున కూలీలు పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, జీరో ప్రగతి ఉన్న గ్రామాలపై నిఘా పెంచాలని డ్వామా పీడీ పుల్లారెడ్డికి సూచించారు. బండిఆత్మకూరు, రుద్రవరం, నంద్యాల, గోస్పాడు మండలాల్లో పది శాతం కూలీలకు మాత్రమే పనులు కల్పిస్తున్నారని.. సంబంధిత అధికారులపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. మండలాల్లో ఉండని ఏపీఓ, టీఏలపై వేటు తప్పదని హెచ్చరించారు. కోడుమూరు మండలంలో అధికారుల పనితీరు బాగాలేదని, కచ్చితంగా కూలీల సంఖ్యను పెంచి వలసలను నివారించాలన్నారు. అనేక గ్రామాల్లో ఉపాధి పనుల కల్పన జీరో శాతం ఉందన్నారు. 23 మండలాల్లో వంకలు, వాగులు ఉన్నాయని, జంగిల్ క్లియరన్స్ కోసం ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ రామకృష్ణ, ఇరిగేషన్ ఎస్ఈ చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి కల్పనలో 50లక్షల పనిదినాలు వెనుకబడ్డాం
– అత్యవసర పరిస్థితుల్లోనే సెలవులు మంజూరు – తన అనుమతి లేనిదే ఎంపీడీఓలు సెలవుల్లో వెళ్లేందుకు వీల్లేదు – జిల్లా కలెక్టర్ విజయమోహన్ కర్నూలు(అర్బన్): జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పని కల్పించడంలో 50 లక్షల పనిదినాలు వెనుకబడ్డామని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రం నుండి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లేబర్ బడ్జెట్ పెంపుపై ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో మంజూరు చేసిన పనులకు లేబర్ బడ్జెట్ పెరిగేలా ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 50 లక్షల పనిదినాలు వెనుకబడ్డామని, పూర్తిస్థాయిలో లేబర్ బడ్జెట్‌ను అధిగమిస్తే రూ.50 కోట్లు లేబర్ కాంపోనెంట్ వస్తుందని.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఉపాధి కూలీలకు పనులు కల్పించడంలో వెనుకబడ్డ మండలాలు వచ్చే సోమవారం నాటికి ప్రతి మండలంలో 1.50 లక్షల మందికి పనులు కల్పించాలన్నారు. రానున్న మూడు మాసాలు గ్రామాల్లో కూలీలకు ఎలాంటి పనులు ఉండవని.. వారందరినీ ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు పురమాయించాలన్నారు. ఏపీడీ, ఏపీఓ, క్షేత్రస్థాయి అధికారుల టూర్ డైరీలను తాను ప్రతి శనివారం సమీక్షిస్తానని.. ప్రతి ఒక్కరూ లక్ష్యం మేరకు పనులు చేసి నివేదికలు ఇవ్వాలన్నారు. ఉపాధిహామీ సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎలాంటి సెలవులు మంజూరు చేయరాదని డ్వామా పీడీ పుల్లారెడ్డిని ఆదేశించారు. అలాగే ఎంపీడీఓలు కూడా తన అనుమతి లేనిదే సెలవుల్లో వెళ్లరాదని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఐదు ఫారంపాండ్స్ ప్రకారం పనులు ప్రారంభించాలన్నారు. ఇంకా మంజూరుకు సంబంధించి ఏవైనా ప్రతిపాదనలు ఉంటే సమర్పించాలన్నారు. ఓడీఎఫ్ కింద 135 గ్రామాల్లో మార్చి నెలాఖరులోగా మరుగుదొడ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాగులన్నీ చెరువులకు అనుసంధానం చేసేందుకు వాగుల్లో పేరుకుపోయిన మట్టి, జంగిల్ క్లియరెన్స్ చేసేందుకు ఉపాధి హామీ కింద పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో సీపీఓ ఆనంద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కష్టాన్ని ఇష్టంగా భావిస్తే విజయం సొంతం
జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ మండపేట : చదువు కోసం పడే కష్టాన్ని ఇష్టంగా భావిస్తే విజయం విద్యార్థి సొంతమవుతుందని జన విజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్షుడు చల్లా రవికుమార్ అన్నారు. పట్టణంలోని టౌ¯ŒS హాల్లో ఎంఈఓ వై.వీరభద్రరావు అధ్యక్షతన పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు మనో ధైర్యాన్ని ఇచ్చేందుకు స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్న కార్యక్రమంలో రవికుమార్ మాట్లాడుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకునేవారు విజ్ఞాన సముపార్జన కోసం శ్రమపడాలన్నారు. అప్పుడే విజయం సాధించి, సమాజంలో గుర్తింపు పొందుతారన్నారు. లయ¯Œ్స క్లబ్ అధ్యక్షుడు కర్రి నారాయణరెడ్డి, ప్రభుత్వాస్పత్రి డిప్యూటీ సివిల్ సర్జ¯ŒS బి.సుబ్రహ్మణ్యేశ్వరి, ఆంగ్ల అ«ధ్యాపకులు సమర్పణకుమార్ మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా విద్యార్థులు వ్యవహరించాలన్నారు. పాఠశాలల అధ్యాపక సిబ్బంది, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో సెంట్రింగ్ కూలీ మృతి
ఎమ్మిగనూరు రూరల్: విద్యుదాఘాతంతో సెంట్రింగ్ కూలీ మృతి చెందిన సంఘటన మంగళవారం ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన రాజు (35) సెంట్రింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య సునంద, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్య ప్రస్తుతం గర్భిణి, మరో ఐదు రోజుల్లో ప్రసవం అయ్యే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ క్రమంలో రాజు మంగళవారం గాంధీనగర్‌లో ఓ ఇంటి నిర్మాణానికి అమర్చిన సెంట్రింగ్ కర్రలు తీసేందుకు వెళ్లాడు. కర్రలు తీస్తున్న సమయంలో పక్కనే విద్యుత్ తీగలు తాకింది. అప్పటికే భవనానికి క్యూరింగ్ నిమిత్తం నీళ్లు చల్లడంతో కర్ర తడిగా ఉంది. దీంతో రాజు విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయాడు. స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న కుటుంబీకులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించారు. గర్భిణి అయిన భార్య రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
పండగ ముగిసింది.. పట్నం రమ్మంది
- తట్టా బుట్టా సర్ధుకుంటున్న వ్యవసాయ కూలీలు - బతుకు వేటలో భాగంగా పట్నం దిశగా అడుగులు - ఆలూరు మండలంలో పెరుగుతున్న వలసలు ఆలూరు రూరల్ : వర్షాభావం కారణంగా స్థానికంగా పనులు లేకపోవడం, అరకొరగా పండిన పంట దిగబడులు ఇళ్లు చేరడం, ఉపాధి పనులు ప్రారంభించకపోవడం, సంక్రాంతి సైతం వెళ్లిపోవడం వెరసి ఆలూరు డివిజన్లోని పల్లెలు వలస బాట పట్టాయి. బతుకు వేటలో భాగంగా చిన్న, సన్నకారు, వ్యవసాయ కూలీలు గుంటూరు, బెంగళూరు తదితర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. సోమవారం మండల పరిధిలోని హుళేబీడు, తుంబళబీడు, ఆలూరు తదితర ప్రాంతాలకు చెందిన వ్యవసాయ కూలీలు తట్టాబుట్టా సర్ధుకుని పిల్లాపాపలతో గుంటూరు పోయేందుకు దాదాపు ఆరు ఆటోల్లో గుంతకల్ రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా వారిని పలకరించగా స్థానికంగా ఉపాధి పనులు అరకొరగా కొనసాగుతుండడం, పనికితగ్గ వేతనం లేకపోవడం, పనులు చేసినా కూలీ డబ్బులు చేతికి రాకపోవడంతోనే వలస వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు తదితర ప్రాంతాల్లో కూడా పనులు అరకొరగానే ఉన్నాయని ఇప్పటికే అక్కడకు వెళ్లిన వారు చెప్పారని, అయితే ఇక్కడే ఉంటే పూట గడవని పరిస్థితులు వస్తాయని భావించి ఉన్నకాడికే చాలనే ఉద్దేశ్యంతో వెళ్తున్నామని నిట్టూర్చారు. -
పని సర్దుబాటు ఉత్తర్వులను రద్దు చేయాలి
ప్యాఫ్టో రాష్ట ప్రధాన కార్యదర్శి డిమాండ్ కర్నూలు సిటీ: ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను పని సర్దుబాటు పేరుతో బదిలీలు చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ప్యాఫ్టో) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.హృదయరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం పని సర్దుబాటు ఉత్తర్వులకు నిరసనగా కలెక్టరేట్ ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభంలో చేయాల్సిన పనిని మధ్యలో చేపడితే ఎలా అని ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం ఆ ఉత్తర్వులను సవరించాలని డిమాండ్ చేశారు. అలాగే మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేసి, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడం తగదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా కన్వీనర్ సురేష్ కూమార్, ఏపీటీఎఫ్(257) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగాప్రసాద్, యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అద్యక్షుడు ఎన్.నరసింహూలు, ఎస్టీయూ జిల్లా కార్యదర్శి తిమ్మన్న, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి.రామశేషయ్య, డీటీఎఫ్ నాయకుడు కృష్ణ, ఏపీటీఎఫ్ నాయకులు ఇస్మాయిల్, కమలాకరరావు, ఆర్‌యూపీపీ నాయకులు నాగేంద్రుడు, రఘు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నీ మేనేజ్మెంట్ ఇదేనా
డీఎం అండ్ హెచ్ఓ పద్మజారాణిపై పూనం మాలకొండయ్య మండిపాటు గుంటూరు మెడికల్ : ‘నీవు ప్రోగ్రామ్ చేయగలవా లేదా... నీ మేనేజ్మెంట్ ఇదేనా... నీ కమాండ్ ఏమీ బాగాలేదు’- అంటూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య మండిపడ్డారు. గుంటూరు వైద్య కళాశాలలో సోమవారం స్వాస్థ్య విద్యావాహిని వాహనాలను పూనం మాలకొండయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వాహనంలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే వైద్య విద్యార్థులకు ప్రత్యేకంగా బ్యాడ్జీ, ఐఈసీ మెటీరియల్‌తో కూడిన బ్యాగ్‌లను అందజేశారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య విద్యార్థులు సర్వే చేయాల్సిన అంశాలతో రూపొందించిన పత్రాలు బ్యాగ్‌లలో లేకపోవటాన్ని గమనించిన పూనం మాలకొండయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన కార్యక్రమంపై అవగాహన కల్పించేలా రూపొందించిన బ్యానర్లు కట్టకపోవటం, సర్వే పత్రాలు బ్యాగ్‌లలో పెట్టకపోవటంతో డీఎం అండ్ హెచ్ఓపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే డీఎంహెచ్ఓ తన వద్ద ఉన్న ఓ సర్వే పత్రాన్ని వైద్య కళాశాలలో ఫోటోస్టాట్ కాపీలు తీయించి వైద్య విద్యార్థుల బ్యాగ్‌లలో పెట్టారు. ఉదయం ఏడుగంటల కల్లా వాహనాలు ప్రారంభం కావాల్సి ఉండగా 7.30 గంటల వరకు బయలు దేరకపోవటంతో వైద్యాధికారులకు పూనం మాలకొండయ్య క్లాస్ తీసుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో స్వాస్థ్య విద్యావాహిని కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో పరిశీలించేందుకు ఆమె వైద్య విద్యార్ధుల వాహనాలతో పాటుగా వెళ్ళారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అరుణకుమారి, ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ డి.షాలినీదేవి, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, ఎస్పీఎం వైద్య విభాగాధిపతి డాక్టర్ ఆర్. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజారోగ్యానికి భరోసా కల్పించడమే ధ్యేయం సత్తెనపల్లి: ప్రజల ఆరోగ్య సంరక్షణకు వైద్య ఆరోగ్య శాఖ సరికొత్త విధానానికి నాంది పలికిందని, రోగాలు వచ్చినప్పుడు వైద్యం చేసేకంటే రోగాలు వ్యాప్తి చెందకుండా ప్రజలకు అవగాహన కల్పించి ప్రజారోగ్యానికి భరోసా ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ పూనం మాలకొండయ్య ఆదేశించారు. సోమవారం ఆకస్మికంగా సత్తెనపల్లి వచ్చిన ఆమె చంద్రన్న సంచార వైద్యసేవల వాహనాలు వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఉండటంతో వాటిని పరిశీలించారు. అనంతరం సత్తెనపల్లి మండలం భట్లూరు గ్రామంలో స్వాస్థ్య విద్యా వాహిని కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య అలవాట్లపై అవగాహన కల్పించేలా స్వాస్థ్య విద్యావాహిని కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. చంద్రన్న సంచార చికిత్స శిబిరాలు జరిగే రోజున గ్రామాల్లో స్వాస్థ్య విద్యావాహిని బృందాలు కూడా పర్యటిస్తాయన్నారు. నెలకో అంశంపై బృందాలు ప్రజలకు వివరిస్తాయన్నారు. మెడికోలు, నర్సింగ్ విద్యార్థులు, దంత వైద్య విద్యార్థులు, అసిస్టెంట్ సర్జన్ బృందంలో ఉంటారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది వైద్య విద్యార్థులకు ఈ బాధ్యతలు అప్పగించామన్నారు. ఈసందర్భంగా వైద్య విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాల,అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె సందర్శించి చిన్నారులతో చేతుల శుభ్రత, తదితర వాటి పై మాట్లాడారు. కార్యక్రమంలో వైద్య అధికారులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు. -
అసలు పనిచేసే ఏటీఎంలెన్నో తెలుసా?
-
అసలు పనిచేసే ఏటీఎంలెన్నో తెలుసా?
ముంబై: పెద్ద నోట్ల రద్దులో అత్యంత కీలకమైన ఘట్టం.. రద్దయిన నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే గడువు డిసెంబర్ 30 శుక్రవారంతో ముగిసింది. ఈ లోపల ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్న సరిపడ నగదు విషయంలో ప్రభుత్వం వాగ్దానం నెరవేరినట్టు కనిపించడం లేదు. దేశీయంగా ఉన్న ఏటీఎంలో కేవలం 30 శాతం మాత్రమే నగదును అందిస్తున్నాయని, మిగతా రెండు వంతులకు పైగా ఏటీఎంలు నోక్యాష్ బోర్డులనే వెక్కిరిస్తున్నట్టు వెల్లడైంది. దీంతో ఈ ఏటీఎంలు ఉన్నా ఒకటే లేకపోయినే ఒకటే అన్నచందాగా మారాయి. బ్యాంకులు సైతం కస్టమర్లకు నగదును తమ బ్రాంచ్ కార్యాలయాల నుంచే అందిస్తున్నాయని ఏటీఎంలలో మాత్రం నగదు నింపడం లేదని తెలిసింది. కేవలం 30 శాతం అంటే 66,000 ఏటీఎంలు మాత్రమే యాక్టివ్‌గా పనిచేస్తున్నాయని ఏటీఎం ఇండస్ట్రి కాన్ఫడరేషన్ ప్రెసిడెంట్ సంజీవ్ పటేల్ తెలిపారు. రెండు నెలల డీమోనిటైజేషన్ కాలంలో కేవలం 20 శాతం ఏటీఎంలలోనే రెగ్యులర్‌గా నగదును నింపినట్టు ఆయన చెప్పారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు రోజూ రూ.7-8 లక్షల వరకు ఏటీఎంలలో నగదును నింపేవారని, కానీ నోట్ల రద్దు అనంతరం రోజుకు కేవలం రూ.2-3 లక్షల నగదునే నింపినట్టు తెలిసింది. అత్యధిక మొత్తంలో నగదు కావాలనుకునే వారు బ్యాంకుల్లోనే నగదు తీసుకోవడానికి మొగ్గుచూపారని భారత్, దక్షిణాసియా ఎన్సీఆర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ నవ్రోజ్ దస్తూర్ చెప్పారు. ఎస్బీఐ ఒక్క బ్యాంకే ఏటీఎంలలో నగదును మంచిగా ఫిల్ చేసిందని, ప్రైవేట్ బ్యాంకులు తమ కార్యాలయాల నుంచే నగదును అందించాయని తెలిపారు. -
పొట్టకూటి కోసం వెళ్లి ఇరుక్కుపోయింది
-
నేడు ఏపీలో అన్ని బ్యాంకులు పని చేస్తాయి
-
ట్రంప్ విజయంపై సత్య నాదెళ్ల
శాన్ఫ్రాన్సిస్కో: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 45 వ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి బుధవారం అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వారందరితోనో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మెక్రోసాఫ్ట్‌కు చెందిన లింక్డ్ఇన్ పోస్ట్ లో చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించారని ప్రశంసించిన ఆయన ఈ ఎన్నికలు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులతో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత సాధించాయని పేర్కొన్నారు. అధ్యక్షుడు సహా నిన్న ఎంపికయిన వారందరినీ అభినందించిన నాదెళ్ల వారందరితో పనిచేయడానికి తాము ఎదురుచూస్తున్నా మన్నారు. తమ ధృడమైన సిద్ధాంతాలు, విలువలకు కట్టుబడి ఉంటామని, ముఖ్యంగా విభిన్నమైన సంస్కృతులను చిత్తశుద్ధితో కలుపుకుపోతామని తెలిపారు. దీంతో తన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో టెక్ కంపెనీలకు వ్యతిరేకంగా చేసిన సంచలన వ్యాఖ్యలను ఫాలో కావొద్దని సంకేతాలను అమెరికా నూతన అధ్యక్షుడికి సూచన ప్రాయంగా అందించారు భారతీయ సంతతికి చెందిన సత్య నాదెళ్ల. అలాగే కంపెనీ ఆలోచనలు, సిఫార్సులను అమెరికా కొత్త అడ్మినిస్ట్రేషన్, కాంగ్రెస్‌కు వివరిస్తూ మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ కూడా కంపెనీ బ్లాగులో ఒక పోస్ట్ పెట్టారు. -
‘అమ్మ’సేవలు ఆదర్శవంతం
సామాజిక సేవా కార్యక్రమాల్లో ’అమ్మ ఫౌండేష¯ŒS’ పలు రంగాల్లో ఉచిత శిక్షణ సామాజిక సేవా కార్యక్రమాలతో ‘అమ్మ’ ఫౌండేష¯ŒS పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. నిరుద్యోగ యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ, గృహిణులకు కుట్టు శిక్షణ, కారు డ్రైవింగ్ వంటి రంగాలతో పాటు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో అమ్మ ఫౌండేష¯ŒS రెండేళ్లుగా ముందుకు సాగుతోంది. నగరం ప్రధాన కేంద్రంగా మన జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఈ ఫౌండేష¯ŒS ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని మాకనపాలెం గ్రామానికి చెందిన మట్టపర్తి నవీ¯ŒS 2014లో నగరం కేంద్రంగా అమ్మ ఫౌండేష¯ŒS ఏర్పాటు చేశారు. నగరంతో పాటు అప్పనపల్లి, అయినవిల్లి మండలం నేదునూరు, పెదపాలెం, అంబాజీపేట మండలం వక్కలంక కొత్తపేట మండలం వాడపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, సీతారామపురంలో ఫౌండేష¯ŒS కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా కంప్యూటర్, కుట్టు శిక్షణ ఇస్తున్నారు. – మామిడికుదురు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు... పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల నిర్వహణలో అమ్మ ఫౌండేష¯ŒS విశేషంగా సేవలందిస్తోంది. అనాథ పిల్లలకు ఉచితంగా నోటు పుస్తకాలు అందించడంతో పాటు కళాశాల విద్యార్థులకు ఉచితంగా బస్ పాస్‌లు ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నారు. స్వచ్ఛభారత్, గోదావరి, కృష్ణా పుష్కరాల్లో ఈ ఫౌండేష¯ŒS సభ్యులు విశేషంగా సేవలందించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. సేవలకు నెలకు రూ.రెండు లక్షలు పేద కుటుంబానికి చెందిన మట్టపర్తి నవీ¯ŒS 9వ తరగతి వరకు చదువుకున్నారు. ఎన్నో కష్టాలు పడిన ఆయన పేదలకు తనవంతుగా సేవలందించాలని అమ్మ ఫౌండేష¯ŒSను ఏర్పాటు చేశారు. తనకు ఉన్న వాహనాల ద్వారా నెలకు రూ.4.50 లక్షల ఆదాయం వస్తోందని దానిలో రూ.రెండు లక్షలు సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నానని నవీ¯ŒS చెప్పారు. వృద్ధాశ్రమం ఏర్పాటే లక్ష్యం వృద్ధుల కోసం భవనం నిర్మించి అందులో 50 మందికి ఆశ్రయం కల్పించాలన్నది నా అశయం. కుటుంబ సభ్యుల ఆదరణ నోచుకోనివారికి ఆసరాగా నిలవాలన్నది నా ప్రయత్నం. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. – మట్టపర్తి నవీ¯ŒS కుట్టు శిక్షణతో ఉపాధి అమ్మ ఫౌండేష¯ŒS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కట్టు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్నా. నాతో పాటు ఎంతో మంది మహిళలు ఇక్కడ తర్ఫీదు పొందుతున్నారు. మూడు నెలల పాటు శిక్షణ ఇస్తున్నారు. – లక్కింశెట్టి సాయిసీతామహలక్ష్మి, శివకోడు -
మరో దోపిడీకి తెరతీసిన తెలుగు తమ్ముళ్లు
-
పనులు పరుగెత్తాలి
ఏలూరు (మెట్రో) : జిల్లాలో జల రవాణా మార్గాన్ని పునరుద్ధరించే పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కె.భాస్కర్ ఆదేశించారు. ఈ పనులకు అవసరమైన భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్ట్‌లు, జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే లైన్ విస్తరణ పనుల ప్రగతిపై అధికారులతో శనివారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్ప్రాజెక్ట్లో భాగంగా జిల్లాలో 74 కిలోమీటర్ల పొడవునా ఏలూరు కాలువను ఆధునికీకరించాల్సి ఉందని చెప్పారు. రోడ్లపై ట్రాఫిక్‌ను తగ్గించడంతోపాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ సామగ్రిని తరలించేందుకు జల రవాణా ఉపయోగపడుతుందన్నారు. నిడదవోలు–ఏలూరు మధ్య ప్రధాన కాలువను వెడల్పు చేసి ఓడల ద్వారా సరుకుల రవాణా చేసేందుకు వీలుగా 35 గ్రామాలు, ఏలూరు, తాడేపల్లిగూడెంలలో భూసేకరణ చేపడుతున్నట్టు వివరించారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్ట్‌లు, జాతీయ రహదారులకు సంబంధించి భూములను అప్పగించిన వెంటనే పనులు చేపట్టాల్సిన బాధ్యత కాంట్రాక్ట్ ఏజెన్సీలపై ఉందన్నారు. రైతులకు మేలు కలగాలనే సంకల్పంతో పనులు చేయాలని సూచించారు. పోగొండ రిజర్వాయర్ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్, స్పెషల్ కలెక్టర్ సీహెచ్ భానుప్రసాద్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి షాన్మోహన్, ఎస్డీసీ సూర్యనారాయణ, హౌసింగ్ ప్రాజెక్ట్ అధికారి ఇ.శ్రీనివాస్, ఆర్ అండ్ బీ ఎస్ఈ నిర్మల, డ్వామా పీడీ ఎం.వెంకటరమణ పాల్గొన్నారు. -
అటకెక్కిన కాకినాడ కెనాల్ రోడ్డు విస్తరణ
-
సమష్టి కృషితోనే గెలుపు సాధ్యం
పట్నంబజారు: సమష్టి కృషితోనే కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు సాధ్యమని తూర్పు నియోజవకర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. టీడీపీ దుర్మార్గాలకు ఎదురొడ్డి వైఎస్సార్ సీపీ జెండాను భుజాన వేసుకున్న వారికే ప్రాధాన్యముంటుందని స్పష్టం చేశారు. అరండల్‌పేటలోని జిల్లా పార్టీ కార్యాయలంలో సోమవారం నగర ముఖ్య నేతలు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అధికార పార్టీ నేతల ఎత్తులను చిత్తు చిత్తు చేయాలన్నారు. బూత్ కమిటీ నుంచి డివిజన్ వరకు అన్ని విభాగాలు పూర్తి చేయాలని సూచించారు. కార్పొరేషన్‌పై వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడేందుకు కృషిచేయాలని కోరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలుపురం రాము), లక్కాకుల థామస్‌నాయుడు, ఎండీ నసీర్‌అహ్మద్, ఈచంపాటి వెంకటMýృష్ణ (ఆచారి), పార్టీ నేత కిలారి రోశయ్య మాట్లాడుతూ ఎన్నికలంటే భయంపుట్టే ఓట్లు తొలగిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు పోలూరి వెంకటరెడ్డి, అత్తోట జోసఫ్, అంగడి శ్రీనివాసరావు, మామిడి రాము, శిఖా బెనర్జీ, మాలె దేవరాజు, దేవానంద్, మండేపూడి పురుషోత్తం, మేడా సాంబశివరావు, కొరిటిపాటి ప్రేమ్‌కుమార్, గనిక ఝాన్సీరాణి, నిమ్మరాజు శారదాలక్ష్మి, ఆరుబండ్ల కొండారెడ్డి, జగన్‌కోటి, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేరువ నర్సిరెడ్డి, దాసరి కిరణ్, పల్లపు శివ, షేక్ జానీ, సుంకర రామాంజనేయులు, సోమికమల్, తోట మణికంఠ, దుగ్గెంపూడి యోగేశ్వరరెడ్డి, నరాలశెట్టి అర్జున్, అన్ని డివిజన్ల అధ్యక్షులు, పార్టీ ముఖ్యనేతలు పాల్గోన్నారు. -
పనితోనే మనిషిలో నైపుణ్యం
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు పెదనందిపాడు(గుంటూరు జిల్లా) : పనిచేయడంతోనే మనిషిలో నైపుణ్యం పెరుగుతుందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఉదయం గుంటూరు జిల్లా పెదనందిపాడు వచ్చిన ఆయన ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నిర్వహించిన మహిళా నైపుణ్య శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఖాళీగా ఉండకుండా ఏదోక పనిచేయాలని సూచించారు. పనిచేయకపోతే ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో పాటు మనసు చెడు ఆలోచనల వైపు పయనించి జీవితం దెబ్బతింటుందన్నారు. మరింత ఎక్కువ మంది మహిళలు కుట్టు శిక్షణ తీసుకొని ఉపాధి పొందాలని కోరారు. కో ఆపరేటివ్ సొసైటీగా ఏర్పడి బయట నుంచి ఎక్కువ పనులు తెచ్చుకొని అందరూ కలిసి కట్టుగా పనిచేస్తే అన్ని గ్రామాల వారికి ఆదర్శంగా ఉండొచ్చన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 100వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయటానికి పూర్వ విద్యార్థులు చాలా కష్టపడుతున్నారని చెప్పారు. గ్రామాభివృద్ధికి కూడా తోడ్పాటునందించాలన్నారు. గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కోరారు. సిబార్ దంతవైద్య కళాశాల డైరెక్టర్ డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ గ్రామంలో త్వరలో సర్వే చేయించి దంత సమస్యలున్న వారికి చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. శిక్షణ పొందిన మహిళలకు ప్రశంసా పత్రాలు, కుట్టుమిషన్లు అందజేశారు. కార్యక్రమంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు సతీమణి శివపార్వతి, సర్పంచ్ కొలగాని కోటేశ్వరరావు, ఎంపీపీ ముద్దన నగరాజకుమారి, జనశిక్షణ సంస్థ డైరెక్టర్ పి.శ్రీనివాసరావు, తహసీల్దార్ కె.మోహన్‌రావు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నర్రా బాలకష్ణ, ఎంపీడీవో పి.బాలమ్మ, బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజరు సి.ముత్యం, నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్లా రాజమోహన్‌రావు, రావి శివరామకృష్ణయ్య, వెల్లంకి ప్రసాద్, కుర్రా హరిబాబు, పోలినేని అంకమ్మ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
పంపు ‘సెట్’ అయ్యేదెప్పుడు..?
నత్తనడకన ఏజీడీఎస్ఎం పైలెట్ ప్రాజెక్టు ఏడాదిన్నరలో 15 శాతం మాత్రమే అమలు ఆసక్తి చూపని రైతులు వ్యవసాయంలో విద్యుత్ ఆదాకు పాతమోటార్ల స్థానంలో అధునాతన పంపు సెట్లు ఏర్పాట్లు చేసే డిమాండ్ ఆధారిత వ్యవసాయ నిర్వహణ ప్రాజెక్టు (ఏజీడీఎస్ఎం) నత్తనడకన సాగుతోంది. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును రాజానగరం మండలంలో చేపట్టారు. మండలంలోని 29 గ్రామాల్లో గల 2,496 పంపుసెట్లను ఈ పథకంలో మార్చాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అయితే ఇంతవరకూ కేవలం 456 మోటార్లనే మార్చగలిగారు. అంటే 15 శాతం లక్ష్యాన్ని మాత్రమే ఏడాదిన్నరకు సాధించగలిగారు. సాక్షి, రాజమహేంద్రవరం : పథకాలు ఘనం.. ఆచరణ అల్పం అనడానికి మరో ఉదాహరణగా నిలుస్తుంది డిమాండ్ ఆధారిత వ్యవసాయ నిర్వహణ ప్రాజెక్టు (ఏజీడీఎస్ఎం). మెట్ట ప్రాంతంలో బోరు ఆధారిత వ్యవసాయంలో పాతమోటార్ల స్థానంలో అధునాతన పంపుసెట్లు ఏర్పాటు చేసేందుకు ఈ పథకాన్ని నిర్దేశించారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా రాజానగరం మండలంలో ఈ పథకాన్ని 2015 ఏప్రిల్ 5 నుంచి అమలు చేయడం ప్రారంభించారు. ఈ పథకంలో రైతుల వద్ద ఉన్న పాత మోటార్ల స్థానంలో 4 స్టార్, 5 స్టార్ రేటింగ్ కలిగిన అధునాతన వ్యవసాయ మోటార్లు ఏర్పాటు చేస్తారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) మధ్య 2015లో ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్), ఈఈఎస్ఎల్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేయాలని నిర్ణయించారు. రూ. 18.95 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు పూర్తయితే ఐదేళ్లలో రూ. 40.45 కోట్ల విలువైన 21.317 మిలియన్ల విద్యుత్ ఆదా అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రాజానగరంలో మండలంలోని 29 గ్రామాల్లో 29 ఫీడర్ల పరిధిలోని 2,496 పంపుసెట్ల స్థానంలో స్టార్ రేటింగ్ మోటార్లు మార్చాల్సి ఉంది. దీనికి ఏడాది కాలపరిమితిగా నిర్దేశించారు. రైతుల్లో అనాసక్తి రైతులు తమ అవసరాలకు అనుగుణంగా 5, 10, 15, 20 హార్స్పవర్ (హెచ్‌పీ) మోటార్లు వినియోగిస్తున్నారు. ఉచితంగా ఇస్తున్నప్పటికీ పాత పంపుసెట్టు స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసుకునేందుకు రైతులు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. స్టార్ రేటింగ్ పంపు సెట్టు అమర్చే ఈఈఎస్ఎల్ పాత మోటారును తీసుకుంటుంది. ఐదేళ్లపాటు ఉచితంగా సర్వీసు అందిస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే సర్వీస్ చేసే సిబ్బంది సకాలంలో రాకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతోనే రైతులు దీనిపై ఆసక్తి చూపడం లేదు. ప్రాజెక్టు పురోగతి నామమాత్రం ఈ ఏడాది అక్టోబర్ నాటికి 100 శాతం పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. అయితే ఈ నెల 3వ తేదీ నాటికి మొత్తం 765 మోటార్లను మాత్రమే మార్చగలిగారు. ఈ నెలాఖరు నాటికి మిగిలిన 1,731 మోటార్లను మార్చాల్సి ఉంది. ఈ పథకంపై పలుమార్లు రైతులకు అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించినప్పటికీ ప్రాజెక్టు పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. -
ఏఎంసీ.. సేవలు నాస్తి
చింతలపూడి: జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల (ఏఎంసీ) పనితీరు నానాటికీ దిగజారుతోంది. కమిటీలకు ఆదాయం మెండుగా వస్తున్నా అదే స్థాయిలో సేవలు మెరుగుపడటం లేదని విమర్శలు వస్తున్నాయి. మార్కెట్ కమిటీల్లో సిబ్బంది కొరత ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న వ్యాపారుల నుండి సెస్ రూపంలో కోట్లాది రూపాయల ఆదాయం మార్కెట్ కమిటీలకు వస్తోంది. వచ్చిన ఆదాయంతో రైతులకు గిట్టుబాటు ధర, యార్డుల్లో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీలపై ఉంది. వీటితో పాటు మార్కెట్ కమిటీల ద్వారా అమలవుతున్న పథకాలపై రైతులకు అవగాహన కల్పించి, వాటిని రైతులకు చేరువ చేయాలి. ముఖ్యంగా రైతు బంధు పథకం ద్వారా రైతులు పండించిన పంటలను గోదాముల్లో నిల్వ చేసుకునే సౌకర్యం కల్పించడంతో పాటు నిల్వ చేసుకున్న పంటలపై రైతులకు 75 శాతం రుణాలు అందించడం మార్కెట్ కమిటీల పని. దీనిపై 180 రోజుల వరకు వడ్డీ ఉండదు. ఆ తర్వాత గోడౌన్లలో పంట భద్రపరుచుకునేందుకు 12 శాతం వడ్డీ చెల్లించాలి. ఈలోపు ధర పెరిగితే రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. అయితే ఈ పథకంపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సెస్ వసూలుకే పరిమితం సిబ్బంది కొరత కారణంగా కమిటీలు కేవలం సెస్ వసూలుకు మాత్రమే పరిమితమవుతున్నాయి. వాస్తవానికి రైతులు పండించిన ఉత్పత్తుల అమ్మకాలు మార్కెట్ కమిటీల ద్వారానే జరగాలి. ఇందుకోసమే కోట్లాది రూపాయలను వెచ్చించి కమిటీల పరిధిలో యార్డులను నిర్మిస్తున్నారు. ఎన్ని గిడ్డంగులు నిర్మిస్తున్నా రైతులకు మాత్రం పూర్తిస్థాయిలో ఉపయోగపడటం లేదు. ప్రభుత్వ పరిధిలో ఉంది మార్కెట్ కమిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాల్సిన అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది. ఖాళీ పోస్టుల విషయం ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. – పి.ఛాయాదేవి, ఏడీ, జిల్లా మార్కెటింగ్ శాఖ పోస్టులు భర్తీ కోరుతున్నాం మార్కెట్ కమిటీల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సిబ్బంది కొరత కారణంగా ఉన్న సిబ్బందితోనే ప్రభుత్వ పథకాలను అమలు చేయడం సమస్యగా మారింది. – టీటీఎస్‌వీవీ నారాయణ, అధ్యక్షుడు, జిల్లా మార్కెట్ కమిటీ కార్యదర్శుల సంఘం -
ఏఎంసీ.. సేవలు నాస్తి
చింతలపూడి: జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల (ఏఎంసీ) పనితీరు నానాటికీ దిగజారుతోంది. కమిటీలకు ఆదాయం మెండుగా వస్తున్నా అదే స్థాయిలో సేవలు మెరుగుపడటం లేదని విమర్శలు వస్తున్నాయి. మార్కెట్ కమిటీల్లో సిబ్బంది కొరత ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న వ్యాపారుల నుండి సెస్ రూపంలో కోట్లాది రూపాయల ఆదాయం మార్కెట్ కమిటీలకు వస్తోంది. వచ్చిన ఆదాయంతో రైతులకు గిట్టుబాటు ధర, యార్డుల్లో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీలపై ఉంది. వీటితో పాటు మార్కెట్ కమిటీల ద్వారా అమలవుతున్న పథకాలపై రైతులకు అవగాహన కల్పించి, వాటిని రైతులకు చేరువ చేయాలి. ముఖ్యంగా రైతు బంధు పథకం ద్వారా రైతులు పండించిన పంటలను గోదాముల్లో నిల్వ చేసుకునే సౌకర్యం కల్పించడంతో పాటు నిల్వ చేసుకున్న పంటలపై రైతులకు 75 శాతం రుణాలు అందించడం మార్కెట్ కమిటీల పని. దీనిపై 180 రోజుల వరకు వడ్డీ ఉండదు. ఆ తర్వాత గోడౌన్లలో పంట భద్రపరుచుకునేందుకు 12 శాతం వడ్డీ చెల్లించాలి. ఈలోపు ధర పెరిగితే రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. అయితే ఈ పథకంపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సెస్ వసూలుకే పరిమితం సిబ్బంది కొరత కారణంగా కమిటీలు కేవలం సెస్ వసూలుకు మాత్రమే పరిమితమవుతున్నాయి. వాస్తవానికి రైతులు పండించిన ఉత్పత్తుల అమ్మకాలు మార్కెట్ కమిటీల ద్వారానే జరగాలి. ఇందుకోసమే కోట్లాది రూపాయలను వెచ్చించి కమిటీల పరిధిలో యార్డులను నిర్మిస్తున్నారు. ఎన్ని గిడ్డంగులు నిర్మిస్తున్నా రైతులకు మాత్రం పూర్తిస్థాయిలో ఉపయోగపడటం లేదు. ప్రభుత్వ పరిధిలో ఉంది మార్కెట్ కమిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాల్సిన అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది. ఖాళీ పోస్టుల విషయం ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. – పి.ఛాయాదేవి, ఏడీ, జిల్లా మార్కెటింగ్ శాఖ పోస్టులు భర్తీ కోరుతున్నాం మార్కెట్ కమిటీల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సిబ్బంది కొరత కారణంగా ఉన్న సిబ్బందితోనే ప్రభుత్వ పథకాలను అమలు చేయడం సమస్యగా మారింది. – టీటీఎస్‌వీవీ నారాయణ, అధ్యక్షుడు, జిల్లా మార్కెట్ కమిటీ కార్యదర్శుల సంఘం -
పారిశుద్ధ్య పనులకు మంగళం
నాలుగు నెలలుగా విడుదల కాని గౌరవ వేతనం రూ.2.22 కోట్ల బకాయి జిల్లాలో 2.520 పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు రాయవరం : ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యం నిర్వహణ చేపట్టాలని విద్యాశాఖ భావించింది. విద్యాశాఖలో భాగమైన సర్వశిక్షాభియాన్ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు నిధులను మంజూరు చేస్తుంది. గ్రామాణాభివృద్ధి శాఖలో అంతర్భాగంగా ఉన్న మహిళా శక్తి సంఘాలకు ఈ బాధ్యతలను అప్పగించారు. గ్రామ సంఘాలు నియమించిన వ్యక్తులు పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపడుతున్నారు. వీరికి ఇస్తున్న అరకొర గౌరవ వేతన నాలుగు నెలలుగా నిలిచి పోయింది. అసలు ఈ నిధులు విడుదల అవుతాయా? లేదా? అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో ఇదీ పరిస్థితి జిల్లాలో 3,301 ప్రాథమిక పాఠశాలలు, 414 ప్రాథమికోన్నత పాఠశాలలు, 659 ఉన్నత పాఠశాలలున్నాయి. అయితే 2,110 ప్రాథమిక, 214 ప్రాథమికోన్నత, 202 ఉన్నత పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అనుమతి వచ్చింది. ఈ పాఠశాలల మరుగుదొడ్ల పారిశుద్ధ్య నిర్వహణకు డ్వాక్రా మíß ళలను నియమించారు. ప్రాథమిక పాఠశాలలో పారిశుద్ధ్యం నిర్వహించే వారికి నెలకు రూ.2 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకైతే రూ.2,500, ఉన్నత పాఠశాలలో నిర్వహించే వారికి రూ.4 వేలు గౌరవ వేతనంగా నిర్ణయించారు. వీరి గౌరవ వేతనం నుంచి ప్రాథమిక పాఠశాలకు ఫినాయిల్, హార్పిక్, బ్లీచింగ్, చీపుర్లు కింద రూ.200 తగ్గిస్తున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.300, ఉన్నత పాఠశాలకు రూ.500 చొప్పున తగ్గించి ఆ సొమ్ముతో పాఠశాల పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. 2014 నుంచి పారిశుద్ధ్య నిర్వహణ.. పాఠశాలల్లో విద్యార్థులకు నిర్మించిన మరుగుదొడ్ల నిర్వహణను ఎస్ఎస్ఏ 2014 నవంబరు నుంచి చేపడుతుంది. అప్పట్లో ఆరు నెలలకు ఎస్ఎస్ఏ నేరుగా నిధులను పాఠశాల ఎస్ఎంసీ అకౌంట్లకు బదిలీ చేసింది. గతేడాది నవంబరు 20 నుంచి పారిశుద్ధ్యం నిర్వహణ బాధ్యతలను డీఆర్డీఏ ద్వారా డ్వాక్రా సంఘాలకు అప్పగించారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు గౌరవ వేతనాన్ని వారి ఖాతాల్లో జమ చేశారు. మార్చి నుంచి ఆగస్టు వరకు నాలుగు నెలలకు రావాల్సిన గౌరవ వేతనం విడుదల కాలేదు. జిల్లాలో వీరి గౌరవ వేతనం కింద రూ.రెండు కోట్ల 22 లక్షల 52 వేలు విడుదల కావాల్సి ఉంది. అదిగో ఇదిగో అంటున్నారు.. జెడ్పీ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రం చేసే పని చేస్తున్నాను. నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. అడిగితే అదిగో ఇదిగో అంటున్నారు. – గుబ్బల వీరయ్యమ్మ, వెదురుపాక, రాయవరం మండలం నిధులు మంజూరు కావాల్సి ఉంది.. పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణ చేస్తున్న వారికి గౌరవ వేతనం నిధులు విడుదల కావాల్సి ఉంది. ఫిబ్రవరి వరకు మాత్రమే నిధులు విడుదలయ్యాయి. – మల్లిబాబు, ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్డీఏ, కాకినాడ -
‘అమృత్’ పనులపై స్థల పరిశీలన
చిత్తూరు (అర్బన్): ‘అమృత్’ పథకంలో భాగంగా చేపట్టనున్న పనుల కోసం ఎంపిక చేసిన స్థలాలను అధికారులు సోమవారం పరిశీలించారు. కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు భాస్కరరావుతో పాటు టాటా కన్సల్టెన్సీ నిర్వాహకులు నగరంలోని ఓవర్ బ్రిడ్జి, కట్టమంచి చెరువు, ఇరువారం, నీవానది ప్రాంతాల్లో పర్యటించారు. నగరంలో నుంచి వచ్చే మురుగునీరు నీవానదిలో కలవకముందే శుద్ధి చేసి ఇతర అవసరాలను ఉపయోగించేలా ప్లాంట్‌ను పెట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిని ఎక్కడెక్కడ పెట్టాలనే అంశంపై స్థలాలను అధికారులు పరిశీలించారు. -
ఎవరి ఉద్యోగాలు వారే చేయాలి
ఏలూరు (మెట్రో) : జిల్లాలో వివిధ శాఖల్లో వికలాంగుల కోటాలో ఉద్యోగాలు పొందిన వికలాంగులు వారి విధుల్లో వారు మాత్రమే పనిచేయాలని, వేరే వ్యక్తులు పనిచేయడానికి వీలులేదని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్లో సోమవారం ‘మీ కోసం’ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వికలాంగుల కోటాలో ఉద్యోగాలు పొందిన కొంతమంది వారు పనిచేయకుండా వారి తరఫున వేరే వారితో పనిచేయిస్తున్నారని, ఎవరు ఉద్యోగం పొందారో వారే పనిచేయాలన్నారు. వేరే వారు పనిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యలను కలెక్టర్ భాస్కర్‌కు చెప్పుకున్నారు. వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరుగుతోంది కొన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతికి పాల్పడుతున్న వ్యక్తులు రాజ్యమేలుతున్నారని అటువంటి వారిని గుర్తించి ఆయా శాఖాధికారులు వారిని పక్కనపెట్టాలని లేకపోతే భారీ కుంభకోణాల్లో అధికారులు ఇరుక్కుపోయే ప్రమాదమున్నదని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా అధికారుల కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీపీవో, పశుసంవర్థక శాఖ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడుతున్న ఇద్దరు గుమాస్తాలను బయటకు పంపిస్తే మళ్లీ అవే కార్యాలయాల్లో తిష్టవేశారన్నారు. అటువంటి వారిపై ఉపేక్షించేది లేదని చెప్పారు. జిల్లాలో ఏలూరు కార్పొరేషన్‌తో సహా 8 పురపాలక సంఘాల్లో పారిశుధ్య పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయన్నారు. పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు. నా ఫైల్స్ నేనే మోస్తున్నా కలెక్టర్‌గా నాకు కనీసం అటెండర్ కూడా లేడని, నా ఫైల్స్ నేనే మోసుకుంటున్నానని.. ఇలా చేయడంలో తప్పేమీ లేదని కలెక్టర్ భాస్కర్ వ్యాఖ్యానించారు. తన కంప్యూటర్ ఆపరేటర్ కూడా లేడని అయినా రోజుకు 450 ఫైల్స్ పరిష్కరిస్తున్నానని, 67 శాఖల అధికారులతో చర్చిస్తున్నానని చెప్పారు. ప్రతి అధికారి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో సమస్యలు పరిష్కరించవచ్చని, ఐదు వారాలుగా అధికారులు మీకోసం, ఈ–ఫైలింగ్‌లో అనేక శాఖలు సమస్యలను పరిష్కరించడం లేదని, ప్రజలకు సేవలు అందడం లేదన్నారు. సమావేశంలో జేసీ పి.కోటేశ్వరరావు, ఏజేసీ ఎంహెచ్ షరీఫ్, జెడ్పీ సీఈవో డి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు -
పంప్‌హౌజ్ పనులు షురూ
కాళేశ్వరం: కాళేశ్వరం బ్యారేజీలో భాగంగా మహదేవపూర్ మండలం కన్నేపల్లి ప్రధాన పంప్‌హౌస్ పనులు మొదలయ్యాయి. మే రెండో తేదీన సీఎం కేసీఆర్ భూమిపూజ చేసిన విషయం తెలిసిందే. సోమవారం మంథని ఎమ్మెల్యే పుట్ట మధు అధికారికంగా పనులు ప్రారంభించారు. మూడు రోజులుగా మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్టర్లు పనులు వేగవంతం చేశారు. నిర్మాణం జరిగే ప్రదేశంలో పొక్లెయిన్లతో పూడిక తీస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు గురువారం వరకు నిర్మాణానికి అవసరమైన భూసేకరణను హడావుడిగా పూర్తిచేసినట్లు తెలిసింది. మొదట 48ఎకరాలు, తరువాత 188 ఎకరాలు భూసేకరణ చేసినట్లు తెలుస్తోంది. కొందరు నిర్వాసితులకు ఎకరానికి రూ. 3లక్షల2వేలు ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో పంప్‌హౌస్ పనులు ముమ్మరం కానున్నాయి. పరిహారం పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో భూసేకరణకు నిర్వాసితులు అడ్డు చెబుతుండడం అధికారులకు తలనొప్పిగా మారింది. మంత్రి హరీశ్‌రావు వచ్చి పరిహారంపై హామీ ఇస్తేనే భూములు ఇస్తామని పట్టుబట్టారు. -
రెండు వందల పనిదినాలు కల్పించాలి
నల్లగొండ టౌన్ : ఉపాధి హామీ పథకం ద్వారా సంవత్సరానికి రెండువందల రోజుల పనిదినాలను కల్పించాలని, కనీసం రోజుకు రూ.350 కూలి చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ విజయరాఘవన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక చినవెంకట్‌రెడ్డి ఫంక్షన్హాల్లో జరిగిన ఉపాధి చట్టం దశాబ్ది ఉత్సవాల సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయించేందుకు భూస్వాములు, పెట్టుబడిదారులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అదే పరిస్థితి ఏర్పడితే తిరిగి భూస్వాములకు ఊడిగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న ఉపాధి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని దళిత, గిరిజన, మహిళలకు ఉపాధి లభిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధిపథకం అమలుతీరుపై వ్యవసాయ కార్మిక సంఘం దేశ వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తుందని, సర్వే పూర్తి అయిన తరువాత ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేస్తామన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. చట్టం పూర్తి స్థాయిలో అమలుకు వ్యవసాయ కార్మిక సంఘం పోరాడుందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ కేంద్రం నుంచి వచ్చిన ఉపాధి నిధులను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా విడుదల చేయకుండా పక్కదారి పట్టిస్తుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నం జరిగితే పెద్ద ఎత్తున ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. జాతీయ కౌన్సిల్ సమావేశంలోపలు అంశాలపై చర్చించి చట్టాన్ని పూర్తి స్థాయిలో పరిరక్షించుకోవడానికి భవిష్యత్ కార్యచరణను రూపొందిస్తామని తెలిపారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి అయిలయ్య అధ్యక్షతన జరిగిన సభలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షుడు తిరుణవక్కరసు, జాతీయ సహాయ కార్యదర్శి సునిల్‌చోప్రా, కిసాన్‌సభ జాతీయ అధ్యక్షుడు హన్నన్‌మొల్లా, జాతీయ కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్రామయ్య, రాష్ట్ర అధ్యక్షుడు బి.ప్రసాద్, సంఘం జిల్లా అధ్యక్షురాలు బి.పద్మ, ములకలపల్లి రాములు, చినవెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘పోలవరం’కు అధునాతన యంత్రాలు
పోలవరం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికై ఆస్ట్రేలియా నుంచి అధునాతన యంత్రాలు వచ్చాయి. గతంలో జర్మనీ నుంచి కొన్ని అధునాతన యంత్రాలను తీసుకువచ్చారు. తాజాగా ఆస్ట్రేలియా నుంచి భారీ యంత్రాలను తెచ్చారు. దాదాపు నెల కిందట ఈ యంత్రాల విడిభాగాలు రాగా కొన్ని రోజులుగా వాటిని బిగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల కోసం త్రివేణి సంస్థ వీటిని తీసుకువచ్చింది. ఎక్సివేటర్.. కొండల్ని పిండి చేయగల ఎక్సివేటర్ యంత్రాన్ని తీసుకువచ్చారు. దీని బరువు 700 ఎం.టి. టాటానగర్ నుంచి 17 పెద్ద ట్రాలీలలో విడిభాగాలను ఇక్కడకు తీసుకువచ్చారు. వాటిని బిగించేందుకు నెల రోజులు పట్టింది. దీని ఖరీదు రూ.70 కోట్లు. దీనికి రెండు ఇంజిన్లు ఉంటాయి. 3 వేల హెచ్‌పీ కెపాసిటీ. 36 క్యూబిక్ మీటర్ల కొండను లేదా మట్టిని ఒకేసారి తీయగలదు. రిలయన్స్, త్రివేణి సంస్థలలో మాత్రమే ఇవి ఉన్నాయి. డంపర్లు .. ఐదు డంపర్లను తీసుకువచ్చారు. వాటిలో ఒక డంపర్ బిగింపు పూర్తికాగా మరో నాలుగు బిగింపు దశలో ఉన్నాయి. డంపర్ కెపాసిటీ 245 ఎంటీ రాయిని, మట్టిని తొలగించేందుకు వీటిని వినియోగిస్తారు. ఒక్కో డంపర్ ఖరీదు రూ.10 కోట్లు. ఈ యంత్రాలను వినియోగించటం ద్వారా పనులు వేగవంతం అవుతాయని కాంట్రాక్ట్ సంస్థ అధికారులు చెబుతున్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ యంత్రాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
బాధ్యతాయుతంగా పనిచేయాలి
అధికారులు, ఉద్యోగులకు మంత్రి ఈటల సూచన తిమ్మాపూర్ : ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కలిగేలా అధికారులు, ఉద్యోగులు పని చేయాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తిమ్మాపూర్ తహసీల్దార్ కార్యాలయ నూతన భవనాన్ని ఆయన బుధవారం ప్రారంభించి, మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రంలో కొత్త ఒరవడితో, బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. నిజాంల కాలంలో నిర్మించిన భవనాలు వందేళ్లు చెక్కు చెదరకుండా ఉంటే.. ఇప్పుడు లక్షలు ఖర్చు చేసి నిర్మిస్తున్న భవనాలు మాత్రం ఇరవై సంవత్సరాలకే శిథిలావస్థకు చేరుతున్నాయని, పనుల్లో నాణ్యత కొరవడుతోందని అన్నారు. ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి పైసా ప్రజల కష్టార్జితమనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, పుట్ట మధు, ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్‌రావు, జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, ఎంపీపీ ప్రేమలత, జెడ్పీటీసీలు పద్మ, ఎంపీపీ శరత్‌రావు, కేడీసీసీబీ డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, ఆర్డీవో చంద్రశేఖర్, తహశీల్దార్ కోమల్‌రెడ్డి, ఎంపీడీవో పవన్‌కుమార్, వైస్ ఎంపీపీ భూలక్ష్మి, సర్పంచ్ స్వరూప, ఎంపీటీసీ సుగుణమ్మ పాల్గొన్నారు. నిర్మితికేంద్రం స్థలాన్ని ఖాళీ చేయించండి నిర్మితికేంద్రాన్ని వెంటనే ఖాళీ చేయించి స్థలాన్ని మోడల్ స్కూల్‌కు అప్పగించాలని జేసీ శ్రీదేవసేనను మంత్రి ఆదేశించారు. ఇటుకలు ఉండడంతో మోడల్‌స్కూల్ హాస్టల్లోకి పాములు, పురుగులు వస్తున్నాయని ఎమ్మెల్యే తెలపడంతో స్థలాన్ని మంత్రి పరిశీలించి ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్ ఆఫీసు మెట్లపై జారకుండా ఉండే టైల్స్ వేయాలని సూచించారు. మోడల్ స్కూల్లో వంట చేయడాన్ని పరిశీలించారు. సమాచారం ఇచ్చేలా చూడాలి జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల సమాచారాన్ని ప్రొటోకాల్ ప్రకారం అందరికీ అందేలా చూడాలని ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్‌రావు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఎల్ఎండీ అతిథిగృహంలో ఆయన మంత్రితో మాట్లాడారు. పలు కార్యక్రమాల సమాచారం ప్రజాప్రతినిధులకు అందడం లేదని, ఇలాంటి సమాచార లోపం పునరావృతం కాకుండా చూడాలని కోరారు. -
సీపీఐ బలోపేతానికి కృషి చేయాలి
చిలుకూరు: గ్రామాల్లో సీపీఐ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలోని బేతవోలు గ్రామంలో జరగిన పార్టీ నిర్మాణ మహసభలో ఆయన మాట్లాడారు. పార్టీ నాయకులు సమన్వంతో పని చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో పార్టీ చేసే నిర్ణయాలు కింది స్థాయిలో కార్యకర్తలకు చేరాలని నాయకులకు సూచించారు. ఈ నెల 11 నుంచి 17 వరకు జరిగే తెలంగాణ విముక్తి వారోత్సవాల్లో పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 11న రాత్రి చిలుకూరుకు తెలంగాణ బస్సు యాత్ర చేరుకుంటుందని అన్నారు. కార్యక్రమంకు ముందు పల్లా వెంకట్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు దొడ్డా నారాయణరావు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, జెడ్పీటీసీ భట్టు శివాజీ నాయక్, పార్టీ మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు కొండా కోటయ్య, బెజవాడ వెంకటేశ్వర్లు, తాళ్లూరి శ్రీను, నంధ్యాల రామిరెడ్డి, పుట్టపాక శ్రీనివాస్, చేపూరి కొండల్, సర్పంచ్‌లు సుల్తాన్ వెంకటేశ్వర్లు, తాళ్లూరి పద్మా శ్రీనివాస్, రెమిడాల రాజు జయసుధ, సోసైటీ వైస్ చైర్మన్ ఆవుల శ్రీను, మండల , గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
వాగు ఆగేనా.. పనులు సాగేనా
జిల్లాలోని కోటపల్లి మండలం నుంచి వేమనపల్లి మండల కేంద్రం వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులకు నీల్వాయి వాగు అడ్డుపడుతోంది. ఈ రెండు మండలాల మధ్య ఆరు నెలలుగా డబుల్ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ రెండు మండలాల మధ్యలో నీల్వాయి వాగు ఉంది. వర్షాకాలం కావడం, నీల్వాయి వాగుపై నూతన వంతెన నిర్మిస్తుండడంతో రోడ్డు పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్డు నిర్మాణంలో భాగంగా కల్వర్టుల నిర్మాణంలో ఉపయోగించే పైపులను జేసీబీ సాయంతో వాగు దాటిస్తుండగా సాక్షి కెమెరా కంటికి చిక్కాయి. అయితే 18 రోజుల క్రితం తాతాల్కిక వంతెన, రోడ్డును వేశారు. కానీ మూడు రోజుల కురిసిన వర్షానికి అవి కొట్టుకుపోయాయి. – వేమనపల్లి -
అవినీతి బీటలు
పర్యాటక శాఖ పనుల్లో కానరాని నాణ్యత పగుళ్లు తీస్తున్న వసతిగృహ సముదాయం గోడలు రూ.కోటికి పైగా పక్కదారి పట్టినట్లు ఆరోపణలు పిఠాపురం : పర్యాటక శాఖ పనుల్లో అవినీతి బీటలు బయటపడుతున్నాయి. నిధులు మంజూరు చేసేది పర్యాటక శాఖ. పనులు జరిగేది దేవాదాయ శాఖ పరిధిలో. కానీ ఎవరికి వారే తమది కాదంటే తమది కాదంటూ తప్పించుకోవడం.. క్వాలిటీ కంట్రోల్ అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంతో.. రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన నిర్మాణాలు నెలలు తిరగకుండానే నాణ్యత లోపాలను బహిర్గతం చేస్తున్నాయి. టెంపుల్ టూరిజంలో భాగంగా పర్యాటక శాఖ పిఠాపురం పాదగయ క్షేత్రంలో భక్తులకు మౌలిక వసతులు మెరుగుపరచే పనులు చేపట్టింది. ఆలయాన్ని ఆనుకుని ఉన్న స్థలంలో రూ.1.77 కోట్లతో రిసెప్షన్, సమాచార కేంద్రం, భక్తులు వేచి ఉండే గదులు, హోటల్ తదితర సౌకర్యాలతో వసతిగృహ సముదాయం నిర్మించింది. ఇందులో 8 గదులు ఒక డార్మిటరీ ఉన్నాయి. 2013లో ప్రారంభించిన ఈ పనులు 2014లో పూర్తి కావాలి. కానీ 2015లో పూర్తి చేశారు. దీని నిర్మాణం జరిగిన స్థలం చెరువు గర్భం కావడంతో ఇక్కడ ఏ నిర్మాణం చేపట్టినా పునాది నుంచీ అత్యంత పటిష్టంగా చర్యలు తీసుకోవాలి. కానీ అలా జరగకపోవడంతో ఏడాది తిరగకుండానే గోడలు బీటలు వారుతున్నాయి. వసతిగృహ సముదాయంలో అన్ని సౌకర్యాలూ కల్పించాల్సి ఉండగా.. కేవలం గదులు మాత్రం నిర్మించి ఆలయ అధికారులకు పర్యాటక శాఖ అప్పగించింది. కరెంటు, మంచాలు, ఏసీలు, మంచినీరు, మోటార్లు తదితర సౌకర్యాలన్నింటినీ ఆలయ సొమ్ముతోనే ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఈ భవన నిర్మాణ వ్యయంలో సుమారు రూ.కోటి వరకూ నిధులు పక్కదారి పట్టాయని, అందువల్లనే నాణ్యత లోపించిందన్న ఆరోపణలు వస్తున్నాయి. నిర్మించి ఏడాది కాకుండానే ఈ వసతిగృహ సముదాయంలో గదుల గోడలు బీటలు వారాయి. ఏ ఒక్క అధికారీ నాణ్యతను పరిశీలించకుండానే బిల్లులు చెల్లించడం పర్యాటక శాఖ పనుల్లో సర్వసాధారణం అయిపోయిందని, అందువల్లే ప్రతి నిర్మాణం ఇలా నాణ్యాతా లోపాలతో కొద్ది రోజుల్లోనే శిథిదిలావస్థకు చేరుకుంటోందని భక్తులు ఆరోపిస్తున్నారు. నాణ్యత లోపంపై చర్యలు తీసుకుంటాం వసతిగృహ సముదాయం పనుల్లో నాణ్యత లోపాలపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపిస్తాం. నాణ్యాత లోపాలుంటే చర్యలు తీసుకుంటాం. గోడలు బీటలు వారుతూంటే ఎటువంటి ప్రమాదాలూ జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. – జి.శ్రీనివాస్, ఈఈ, పర్యాటక శాఖ -
మండల అభివృద్ధికి కృషిచేయాలి
దేవరకొండ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆదేశించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తున్నందున వైద్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంచినీటి కొరత ఏర్పడినా ప్రణాళికాబద్ధంగా మంచినీటి సమస్య పరిష్కారానికి కషి చేస్తామన్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ డాక్టర్ దూదిపాల వేణుధర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులున్నారు. -
కడుపు నింపని ఉపాధి పనులు
పట్టించుకోని అధికారులు 3నెలలుగా కూలిడబ్బులు చెల్లించకపోవడంతో ఇబ్బందుల్లో కూలీలు మెదక్‌రూరల్: రెండేళ్లుగా వర్షాలు లేకపోవడంతో ఏర్పడిన తీవ్ర కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించినప్పటికీ సకాలంలో కూలి డబ్బులు అందక పస్తులుండక తప్పడం లేదు. వర్షాలు కురియక వేసిన పంటలు ఎండిపోయి కొంతమంది బతుకు దెరువు కోసం పట్టణాలకు వలస వెళ్లారు. మరికొంతమంది గ్రామాల్లో ఉండగా, వారికి ప్రభుత్వం ఉపాధి కల్పిస్తోంది కానీ సకాలంలో బిల్లులు మాత్రం చెల్లించడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉపాధిహామీ పథకంలో పనులు చేసి నెలలు గడుస్తున్నా కూలి డబ్బులు చెల్లించడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మెదక్ మండలంలోని 25 గ్రామ పంచాయతీలకుపైగా వేలాది మంది కూలీలు ఉపాధి పనులు చేపట్టినప్పటికీ సకాలంలో కూలి డబ్బులు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని కూలీలు ఆరోపిస్తున్నారు. మెదక్ మండలం పాతూర్ గ్రామంలోని ప్రజలు 30 గ్రూపులుగా ఏర్పడిన సుమారు 300 మంది ఉపాధిహామీ పథకంలో కూలి పనులు చేశారు. మూడు నెలల క్రితం రెండు వారాలపాటు కొంతమంది కూలీలు, మూడు వారాలు మరికొంతమంది ఉపాధి పనులు చేయించారు. కాగా పనులు చేసి మూడు నెలలు గడిచిపోతున్నా ఏ ఒక్క కూలికి కూడా డబ్బులు చెల్లించలేదు. అవసరానికి ఆదుకోని ఉపాధి పనులు చేసే బదులు...వలసవెళ్లడమే నయమని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. నాలుగు నెలలు కావొస్తున్నా కూలి డబ్బులు ఇస్తలేరు: ఉపాధి పథకంలో కూలీ పనులుచేసి 4నెలలుకావస్తున్న కూలీడబ్బులు మాత్రం ఇస్తలేరు. నాకు మూడు వారాల కూలీ డబ్బులు రావాల్సి ఉంది. ఎన్నిసార్లు అడిగినా నిధులు రాలేవంటూ సమాధానం చెబుతున్నారు. -మేడిపల్లి ఎల్లవ్వ, పాతూరు రెండు వారాల కూలీ డబ్బులు రావాలి: కరువు కాలంలో తిండికిలేక ఉపాధి పథకంలో కూలీకి పోతే మూడు నెలలు గడిచినా కూలీ డబ్బులు ఇస్తలేరు. అసలే కరువుతో అలమటిస్తున్న మాకు పంటలు చేతికందక, పనులు లేక, చేసిన పనులకు కూలీడబ్బులు రాక ఆర్ధాకలితో అలమటిస్తున్నాం. అధికారులు స్పందించి వెంటనే కూలీ డబ్బులు చెల్లించాలి. -దూరబోయిన పోచమ్మ, పాతూరు -
సమష్టి కృషితోనే విజయం
కలెక్టర్ కాంతిలాల్ దండే గుంటూరు వెస్ట్ : సమష్టి కృషితోనే విజయాలు సాధ్యమని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయడం అభినందనీయమని ఆయన చెప్పారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి మరిన్ని లక్ష్యాలు సాధించాలని కోరారు. జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో కృష్ణా పుష్కరాల్లో విధులు నిర్వహించిన సిబ్బందికి విజయోత్సవ అభినందన సభ స్థానిక శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆదివారం నిర్వహించారు. కలెక్టర్ కాంతిలాల్ మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేసి యాత్రికులకు అవసరమైన అన్ని సౌకర్యాలూ కల్పించినట్లు చెప్పారు. పారిశుధ్య నిర్వహణలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసిన పంచాయతీశాఖ పనితీరును కొనియాడారు. మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాలను సాధించాలి.. అక్టోబర్ 2వ తేదీ నాటికి జిల్లాలోని 462 గ్రామాల్లో 25 వేల మరుగుదొడ్లు నిర్మించాలని కలెక్టర్ కోరారు. ఆయా గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్) గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం పుష్కర విధులు నిర్వహించిన ఈఓపీఆర్డీలు, పంచాయతీ సెక్రటరీలకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. తొలుత ఇటీవల మృతిచెందిన కొల్లూరు ఈవోపీఆర్డీ మల్లీశ్వరి మృతికి సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీపీఓ కె.శ్రీదేవి, ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ ముంగా వెంకటేశ్వరరావు, ఆర్‌డబ్లు్యఎస్ ఎస్ఈ పి.భానువీరప్రసాద్, డీఆర్డీఏ పీడీ షేక్ హబీబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి పనికి ఓ రేటు
సైదాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి కంపు చేయి తడిపితేనే పని ఇప్పటికే ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు మరి కొందరిపైనా నజర్..? సైదాపూర్ : సైదాపూర్ తహసీల్దార్ కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఏపని కావాలన్నా అటెండర్ నుంచి అధికారి వరకు డబ్బులు ముట్టజెప్పాల్సిందే. ఇందులో కూడా పనిని బట్టి రేటు ఉంటుంది. పైసలు ఇస్తేనే ఫైళ్లు కదులుతాయి. కాసులు చేతిలో పడితేనే కాగితంపై కలం గీత పడుతుంది. కులం నుంచి భూముల రికార్డుల వరకు ధ్రువీకరణ పత్రాలు కావాలంటే రూ.100 నుంచి రూ.10 వేల వరకు లంచం ఇవ్వాల్సిందే. రెవెన్యూ రికార్డుల్లో తప్పులు సృష్టించేది, సరి చేసేందుకు కాసులు కాజేసేది వీరే. ఇక్కడ పని చేసే అధికారులు ఖాళీ జేబులతో ఆఫీసుకు వచ్చి రోజు కనీసం రూ.2 వేలు వేసుకుని ఇంటికి వెళ్లారంటే అతిశయోక్తికాదు. డబ్బులు ముందు..పని తర్వాత..? రైతుల దగ్గర ముందు డబ్బులు తీసుకున్న కారణంగా అధికారుల్లో ఒకరికి ఒకరు పొసకకనే రైతుల పనులు పెండింగ్‌లో ఉంటున్నాయి. డబ్బులు ఇచ్చిన రైతులకు పాసు బుక్కులు లేవని, వెబ్ ల్యాండ్ పని చేయడంలేదని, లేక పని పూర్తి అయ్యింది.. కొన్ని రోజులు ఆగుమని తమదైన∙శైలిలో నచ్చజెపుతారు. ఓ అధికారి అయితే కార్యాలయానికి పనుల కోసం వచ్చేవారిని వరుస కలుపుకుని సంబోధిస్తూ డబ్బులు వసూలు చేస్తాడని స్థానికులు చెబుతున్నారు. పనులు కాక విసుగు చెందిన రైతులు గొడవ చేస్తే డబ్బులు తిరిగి ఇవ్వకుండా అప్పు పత్రం రాసి ఇస్తున్నట్లు తెలిసింది. అయితే డబ్బులు ఇచ్చినా పనులు కావడంలేదని ఏళ్ల తరబడి తిరుగుతున్నామని జూలై 4న రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట దర్నా చేశారు. సముదాయించడానికి వచ్చిన రెవెన్యూ అధికారులతో బాధిత రైతులు వాగ్వాదానికి దిగారు. డబ్బులు ఇచ్చినా ఎందుకు చేయడం లేదని నిలదీశారు. జీతాలు పెంచినా.. లంచాల కోసం డిమాండ్ అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, లంచం ఆశించకుండా ఉండాలంటే వారికి సరిపోయే విధంగా వేతనాలు ఉండాలని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల వేతనాలు భారీగా పెంచారు. అయినా అవినీతి మరింత పెరిగిందనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. తహసీల్ కార్యాలయంలో ఉద్యోగులకు జీతం కన్నా లంచంపైనే మక్కువ ఎక్కువ. అధికారుల తప్పులకు.. రైతుల ఘర్షణ పహణీల్లో పేర్లు తప్పులు రాసి దరఖాస్తులు పెట్టుకుంటే సరి చేస్తామంటారు. ఆ దరఖాస్తుతో మోఖామీద ఎంక్వయిరీ అంటారు. రెండు వైపులా డబ్బులు తీసుకుని ఇక్కడ మాతో కావడంలేదని దీనికి ఆర్డీవో, లేక కోర్టుల్లో పరిష్కరించుకోవాలని రైతుకు సూచిస్తారు. ఈ క్రమంలో రైతుల మధ్య భూతగాదాలు ఏర్పడి ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలూ ఉన్నాయి. అవినీతిపరులెందరో.. పేరు మార్పు కోసం రైతు నుంచి రూ.8 వేలు తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి చిక్కిన వీఆర్వో గోస్కుల రమేశ్‌తో పాటు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరి కొందరు అధికారులపై ఏసీబీ దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. ఇదే కార్యాలయంలో కొందరు సిబ్బందిపై ఫిర్యాదులు ఉన్నట్లు సమాచారం. అవినీతి అధికారులను అదుపు చేయడానికి అవినీతి నిరోదక శాఖ ఎన్నో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తూనే ఉంది. దొరికితేనే దొంగ, దొరక కుండా దండుకోవాలని మధ్యవర్తులను పెట్టుకుని మరీ లంచాలు వసూలు చేస్తున్నవారూ ఉన్నారు. తొమ్మిదేళ్ల క్రితం బీమా సొమ్ము చెల్లింపులో కక్కుర్తి పడి లంచం ఆశించిన ఆర్ఐ సీహెచ్.ప్రభాకర్ కరీంనగర్లో తన ఇంటి సమీపంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ]lÊడేండ్ల క్రితం మరో ఆర్ఐ రైతు వెంటబడి పొలం దగ్గర ఉన్న రైతును డబ్బులు ఇవ్వమని పీడించాడు. దిక్కులేక బాధితుడు ఏసీబీకి పట్టించాడు. దుద్దెనపల్లిలో తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన 9 గుంటల భూమికి రికార్డులలో పేరు మార్పు కోసం గత ఆరు నెలలుగా తిరుగుతున్న రైతు తాటిపల్లి రాజిరెడ్డిని రూ.15 వేలు డిమాండ్ చేసి రూ.8 వేలు తీసుకుంటూ వీఆర్వో రమేశ్ మంగళవారం ఏసీబీకి చిక్కాడు. అయినా రెవెన్యూ అధికారుల్లో ఏమాత్రం మార్పు రాదని మండల ప్రజలు అంటున్నారు. -
సమన్వయంతో పనిచేయాలి
మంత్రి జోగు రామన్న మండలాభివృద్ధిపై సుదీర్ఘంగా కొనసాగిన సమావేశం గైర్హాజరైన అధికారులపై చర్యలకు ఆదేశం ఆదిలాబాద్ రూరల్ : ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న సూచించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నా అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో రైతులు వాటి ఫలాలు పొందలేకపోతున్నారన్నారు. బుధవారం పట్టణంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో ఎంపీపీ నైతం లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మండలాభివృద్ధి సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. – సమావేశంలో ఆర్‌డబ్ల్యూస్ అధికారులు సరైనా రీతిలో సమాధానాలు చెప్పకపోవడంతో ఎన్నిసార్లు చెప్పిన మీరూ మారారా.. అని అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. – రైతుల కోసం అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పించాలని వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. రుణాలు ఇవ్వని బ్యాంకుల జాబితాను తమకు అందించాలన్నారు. బిందు సేద్యం ద్వారా వ్యవసాయ సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని, సబ్సిడీ విషయాలు తెలపాలన్నారు. – అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా అనే విషయాలను స్థానిక ప్రజాప్రతినిధులు పరిశీలించాలన్నారు. – వచ్చే మాసంలో వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉన్నందున, విషజ్వరాలు ప్రబలకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. – తాను భూమి పూజ చేసిన వివిధ అభివృద్ధి పనులు ప్రారంభం కాకపోవడంపై పంచాయతీ రాజ్ ఏఈపై మండిపడ్డారు. తప్పుడు సమాచారంతో తననే పక్కతోవ పట్టించాలని చూస్తే సహించేది లేదన్నారు. – శ్మశాన వాటికల ఏర్పాటు కోసం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్థలాలను గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. – బట్టిసావర్గాం ప్రభుత్వ పాఠశాలలో తోటి విద్యార్థులతో విద్యార్థులు గొడవ పడితే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా సంబంధిత పాఠశాల హెచ్ఎం టీసీ ఇచ్చి ఇంటికి పంపుతున్నారని సర్పంచ్ రామారావు మంత్రి దృష్టికి తెచ్చారు. స్పందించిన మంత్రి సంబంధిత పాఠశాల హెచ్ఎం కఠిన చర్యలు తీసుకేనేలా డీఈవోకు ఫిర్యాదు చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగిరి అశోక్, ఎంపీడీవో ర వీందర్, తహశీల్దార్ వర్ణ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. కొందరు అధికారుల గైర్హాజరు సమావేశానికి మంత్రి వస్తున్నారని సమాచారం ఉన్నా కొంత మంది అధికారులు సమావేశానికి హాజరుకాకపోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గైర్హాజరైన అధికారుల వివరాలను వెంటనే కలెక్టర్‌కు అందించాలని, నామమాత్రంగా నోటీసులు జారీ చేయకుండా, అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఆలస్యంగా సమావేశం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన సర్వసభ్య సమావేశం మంత్రి రావడం ఆలస్యం కావడంతో ఆయన ఆదేశాల మేరకు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైంది. ప్రారంభమైన 45 నిమిషాల పాటు వివిధ సమస్యలపై చర్చించి భోజన విరామం ప్రకటించారు. సమావేశం ఆలస్యంగా ప్రారంభం కావడంతో ప్రజాప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంత మంది ఎదురు చూసి ఇంటికి వెళ్లిపోయారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు మంత్రి జోగు రామన్న వచ్చారు. -
సమర్థవంతంగా పనిచేయండి : ఎస్పీ
అనంతపురం సెంట్రల్ : రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకల్లో ఎ లాంటి పొరపాట్లకు తావులేకుండా సమర్థవంతంగా విధులు ని ర్వహించాలని ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబు ఆదేశించారు. శని వారం సాయంత్రం బందోబస్తులో పాల్గొనే పోలీస్ అధికారుల తో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో ఉన్నంత సేపు ప్రతి ఒక్కరూ అలర్ట్‌గా ఉం డాలని ఆదేశించారు.ముఖ్యంగా ట్రాఫిక్ ఆంక్షలు పకడ్బందీగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు సుబ్బారావు, మల్లికార్జునవర్మ, వేణుగోపాల్, మల్లికార్జున, గంగయ్య, మహబూబ్‌బాషా, కోలార్‌కృష్ణ, స్పెషల్‌బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు రాజశేఖర్, యల్లమరాజు, పలువురు సీఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. -
తెలంగాణ జాగృతి జిల్లా శాఖకు అవార్డు
హన్మకొండ : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గోదావరి పుష్కరాలు, మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలోను వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయడంతో పాటు వలంటీర్లుగా సేవలు అందించారు. సేవలను గుర్తించిన తెలంగాణ జాగృతి ఆధినాయకత్వం వరంగల్ జిల్లా శాఖకు బెస్ట్ జిల్లా శాఖగా ఎంపిక చేసి ఆవార్డు అందించింది. వరంగల్ జిల్లా శాఖ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే ముందు వరుసలో ఉంది. నల్లగొండలో జరిగిన 10 వార్షికోత్సవ సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా జిల్లా కన్వీనర్ కోరబోయిన విజయ్‌కుమార్ అవార్డు అందుకున్నారు. దీంతో పాటు సలాం పోలీసు లఘుచిత్రా దర్శకుడు వంశీకి ప్రోత్సాహక అవార్డుకు వచ్చింది. జిల్లాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ ఇస్తున్న రాణి,లతకు ప్రోత్సాహక అవార్డు లభించింది. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాకు ఉత్తమ అవార్డు రావడానికి కృషి చేసిన జాగృతి అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. -
8లోపు అన్ని పనులు పూర్తి చేయాలి
–అవాంతరాలు లేకుండా –పుష్కరాల నిర్వహణకు –చర్యలు తీసుకోవాలి –కలెక్టర్ టీకే శ్రీదేవి సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా వస్తున్న కృష్ణా పుష్కారాను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ నెల 8వ తేదీ లోపు పనులన్నీ పూర్తి చేసి పుష్కరాల నిర్వహణకు ఘాట్లన్నింటినీ ప్రత్యేకాధికారులకు అప్పగించాలని కలెక్టర్ డా.టీకే శ్రీదేవి సూచిం చారు. శనివారం రెవెన్యూ సమావేశ మంది రంలో జిల్లా అధికారులు, పుష్కరాల ప్రత్యేక అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తులు పుష్కర స్నానం మాత్రమే చేయాలని, ఎట్టి పరిస్థితిలో నోట్లోకి నీళ్లు పోకుండా చూసుకోవాలని కోరారు. వీఐపీ ఘాట్లలో జాగ్రత్తలు తీసుకోవాలి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమైన పుష్కరఘాట్లలో 4 నిమిషాలకు మించి భక్తులు స్నానం చేసేందుకు ఎక్కువ సమ యం తీసుకోవద్దని ఆమె కోరారు. పుష్కరాలలో నిర్వహించే 12 రోజులు ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని, అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని ఆమె కోరారు. భక్తుల సంఖ్యను కూడా నమోదు చేసుకోవాలన్నారు.పుష్కరాల నిర్వహించే 13 మండలాలలో అన్ని పాఠశాలలకు స్థానికంగా సెలవు దినాలుగా ప్రకటించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. 52 పుష్కర ఘాట్లు శుభ్రంగా ఉండాలని ఆదేశించారు. రెండు రోజుల్లో చెత్తా చెదారం తొలగించాలనిడీపీఓను ఆదేశించారు. పుష్కరఘాట్ల ప్రత్యేక అధికారులు వాలంటీర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈనెల 9 లేదా 10 తేదీలలో రిహార్సల్ నిర్వహించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు నీటిపరీక్షలు చేయాలి పుష్కరాల సందర్భంగా ప్రతిరోజు అన్ని ఘాట్ల వద్ద నీటి నాణ్యతపై పరీక్ష నిర్వహించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. సైన్బోర్డులను వెంటనే ఏర్పాటుచేయాలని దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు. త్వరత్వరగా దర్శ నంచే యించి పంపించాలని కలెక్టర్ అ న్నారు. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి మా ట్లాడుతూ పుష్కరాల సందర్భంగా పూర్తి బందోబస్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం. రాంకిషన్, ఏజేసీ బాలాజీ రంజిత్ప్రసా ద్, డీఆర్ఓ భాస్కర్, జెడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ, పీడీలు పాల్గొన్నారు. అంత కు ముందు కలెక్టర్ డా.టీకే శ్రీదేవితో పాటు జిల్లా అధికారులు ప్రొ.జయశంకర్ చిత్రపటానికి పూలమాలల వేసి నివాళులర్పించారు. -
దుర్గాఘాట్‌పై దృష్టి పెట్టండి
అధికారులకు మంత్రి ఉమా ఆదేశాలు వసతుల కల్పనలో అలసత్వంపై కమిషనర్ ఆగ్రహం విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గాఘాట్‌లో పుష్కర పనులపై మంత్రులు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ శుక్రవారం దుర్గాఘాట్‌ను పరిశీలించి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించగా, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఘాట్ పనులపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. దుర్గాఘాట్ పరిస్థితిపై ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురించిన ‘అదిగో పుష్కరం... ఎప్పటికీ పరిష్కారం?’ కథనానికి స్పందించిన మంత్రి దేవినేని ఉమా, మేయర్ కోనేరు శ్రీధర్ ఘాట్‌కు చేరుకుని పనుల తీరుపై అధికారులను ప్రశ్నించారు. రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మోడల్ గెస్ట్‌హౌస్ వద్ద పనులు, దుర్గాఘాట్‌లో రావిచెట్టు వద్ద మట్టికుప్పలను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తామన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పర్యాటకులను ఆకట్టుకునేలా ఈ పనులు సాగుతున్నాయన్నారు. దుర్గాఘాట్‌లో మౌలిక వసతులు కల్పించాలి దుర్గాఘాట్, మోడల్ గెస్ట్‌హౌస్‌లో మౌలిక వసతులు కల్పించడంలో ఎందుకు ఆలస్యం అవుతోందని మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గాఘాట్‌ను శుక్రవారం ఆయన సందర్శించి పలు సూచనలు చేశారు. -
గండి పూడ్చివేతకు మరో రెండు రోజులు!
సీతారామపురం(నూజివీడు) : మండలంలోని సీతారామపురం సమీపంలోని రామిలేరుపై ఉన్న పోలవరం అండర్‌టన్నెల్‌కు పడిన గండి పనులు ఎట్టకేలకు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల ఒకటోతేదీ తెల్లవారుజామున గండి పడినప్పటి నుంచి గండిని పూడ్చటానికి ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు అక్కడే మకాం వేశారు. గోదావరి జలాల ప్రవాహం తగ్గడానికి రెండు రోజులు పట్టిన తరువాత గండి వద్ద రింగ్‌బండ్ ఏర్పాటు చేయడానికే మరో రెండు రోజులు సమయం తీసుకోవడంతో ఇప్పటివరకు గండిపూడ్చివేత పనులు ప్రారంభమవ్వలేదు. కాంక్రీట్ వేసే యంత్రాలు గురువారం సాయంత్రానికి గండి పడిన ప్రదేశానికి చేరుకోగా శుక్రవారం నుంచి కాంక్రీట్ పనులను చేపట్టారు. ముందుగా కాలువ లోపలిభాగంలో అండర్ టన్నెల్ స్లాబుతో పాటు ఉన్న అప్రాన్‌లో కాంక్రీటు నింపుతున్నారు. ఇది పూర్తయిన వెంటనే గండిని కూడా కాంక్రీట్‌తో పూడ్చుతామని ఇంజనీర్లు చెప్పారు. ఈ పనులు ఏడో తేదీ నాటికి పూర్తవుతాయని భావిస్తున్నారు. పనులను జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ పరిశీలించి వెళ్ళారు. నాణ్యతలో రాజీవద్దు: మంత్రి ఉమా గండి పూడ్చివేత పనుల్లో రాజీపడకూడదని జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. అప్రాన్, గండి పూడ్చివేత పనులను ఎలాంటి హడావుడి లేకుండా పూర్తిచేయాలన్నారు. మంత్రితో పాటు జలవనరులశాఖ అపెక్స్ కమిటీ సభ్యులు ఆళ్ల గోపాలకృష్ణ, తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ, ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు తదితరులున్నారు. -
నత్తనడకన వంతెన నిర్మాణం
ఉప్పొంగిన సండ్రవాగు కొట్టుకుపోయిన ప్రత్యామ్నాయ దారి పెరిగిన రవాణా దూరం సిరిసిల్ల రూరల్ : బద్దెనపల్లి గ్రామ సమీపంలోని సండ్రవాగుపై చేపట్టిన వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. బ్రిడ్జితోపాటు సమీపంలో కల్వర్టు నిర్మాణానికి ఈ ఏడాది జనవరిలో రూ.1.75కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఫిబ్రవరిలోనే పనులు ప్రారంభించారు. 2017 జనవరి నాటికి పనులు పూర్తి కావాల్సి ఉంది. టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు వేగవంతం చేయడంలో శ్రద్ధ చూపడంలేదు. దీంతో వంతెన ప్రస్తుతం పిల్లర్ల దశకే చేరింది. వంతెన పనులు జరుగుతున్నందున రాకపోకలు సాఫీగా సాగేందుకు పక్కనే తాత్కాలిక రోడ్డు నిర్మించారు. కానీ, నెలరోజుల క్రితం కురిసిన వర్షాలతో వచ్చిన వరదలతో అది కొట్టుకుపోయింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సండ్రవాగు ఉప్పొంగడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే రామన్నపల్లి, బస్వాపూర్, బాలమల్లుపల్లి గ్రామస్తులకు రవాణా భారం పెరిగింది. వీరు సుమారు పది కిలోమీటర్ల అదనంగా ప్రయాణం చేసి నేరెళ్ల మీదుగా సిరిసిల్లకు చేరుకోవాల్సి వస్తోంది. కడుపునొప్పి వచ్చినా, కాలు గుంజినా పది కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేస్తేనే సిరిసిల్లలోని ఆస్పత్రుల్లో చేరే అవకాశం ఉంది. బ్రిడ్జి పూర్తయితే çసుమారు ఆరు కిలోమీటర్ల దూరభారం తగ్గుతుంది. ఈ విషయంపై కాంట్రాక్టర్‌ను సంప్రదించగా.. డైవర్షన్ రోడ్డు ఓసారి నిర్మించామని, వరద ఉధృతికి అది కొట్టుకుపోయిందని, మరోసారి నిర్మించేందుకు సంబంధిత శాఖ నిధులు మంజూరు చేయడంలేదన్నారు. అయినా, త్వరలోనే తాత్కాలిక రోడ్డు నిర్మిస్తామని తెలిపారు. తిప్పలైతంది – పూర్మాణి మల్లారెడ్డి, గ్రామస్తుడు, బస్వాపూర్ వంతెన కాడ తాత్కాలిక రోడ్డు వేస్తే బాగుంటుంది. వాగుల నీళ్లున్నయ్. ఆటోలు, బస్సులు మా ఊరికి రావడంలేదు. నేరెళ్ల నుంచి పది కిలోమీటర్లు ప్రయాణం జేస్తేనే సిరిసిల్ల చేరుకోవచ్చు. తాత్కాలిక రోడ్డు వేయిస్తాం – రమేశ్, ఏఈ, పంచాయతీరాజ్ బద్దెనపల్లి వంతెన వద్ద నిర్మించిన తాత్కాలిక రోడ్డు వర్షానికి కొట్టుకుపోయింది. వర్షపునీరు వెళ్లేందుకు వీలుగా పైపులు ఏర్పాటు చేసి మరోసారి ప్రత్యామ్నా రోడ్డు నిర్మించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించాం. వారం రోజుల్లో ఇది అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. -
పనులను అడ్డుకున్న గిరిజనులు
చలకుర్తి(పెద్దవూర): చలకుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని కుంకుడుచెట్టు తండాలో అటవీశాఖ అధికారులు చేపడుతున్న కందకాల పనులను మంగళవారం గిరిజన రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ సర్వే నంబర్ 301లో 405.39 ఎకరాలు, 490లో 12 ఎకరాలు, 491లో 20 ఎకరాలు, 492లో 18 ఎకరాల భూములను భూములు లేని నిరుపేద గిరిజనులకు గతంలో ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేసిందన్నారు. ఈ భూములు సాగుకు అనుకూలంగా లేకపోవడంతో అలాగేవదిలేశామన్నారు. ఈ భూముల్లో కంపచెట్లు పెరగడంతో అటవీశాఖ అధికారులు తమవే నంటూచుట్టూ జేసీబీలతో కందకాలు తీయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అడ్డుకోవడంతో చేసేది లేక అటవీ అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు శ్రీరాములు, సైదా, చంద్రకళ, సోమ్లా, చందు, వాలియా, రెడ్యా, బాలు, అరుణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలు సహకరిస్తేనే అభివృద్ధి
కలెక్టర్ యోగితా రాణా మిషన్ భగీరథ పైప్‌లైన్ నిర్మాణ పనుల ప్రారంభం ఆర్మూర్అర్బన్ : ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకు ప్రజలు సహకరిస్తేనే అభివృద్ధి జరుగుతుందని కలెక్టర్ యోగితా రాణా అన్నారు. ఆర్మూర్ మండలంలోని కోమన్‌పల్లిలో మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందించే పైపులైను నిర్మాణాన్ని కలెక్టర్ యోగితా రాణా, ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో కోమన్‌పల్లి నుంచి పైప్‌లైన్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఎస్సారెస్పీ నుంచి గోదావరి జలాలను శుద్ధి చేసి తాగునీటిని ప్రతి ఇంటికి అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలో మిషన్ భగీరథకు ప్రభుత్వం రూ. 2,650 కోట్లు వ్యయం చేస్తోందన్నారు. తొలి విడతగా 121 గ్రామాలను ఎంపిక చేసి అందులో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు ఉన్న 47 గ్రామాలకు ముందుగా శుద్ధిజలాలను సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎంపిక చేసిన గ్రామాల్లో రూ. 150 కోట్లతో అంతర్గత పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. కోమన్‌పల్లిలో పైప్‌లైన్ నిర్మాణ పనులు పూర్తి చేసి వారం రోజుల్లో ఇంటింటికి తాగునీటి సరఫరా చేస్తామని పేర్కొన్నారు. అలాగే మిగతా గ్రామాల్లో ఈనెల 31 లోగా నీటి సరఫరా చేయనున్నామని చెప్పారు. రూ. 15 లక్షలు మంజూరు చేస్తా : ఎమ్మెల్యే గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, హరితహారంలో మొక్కల నాటాడాన్ని 100 శాతం పూర్తి చేసుకుంటే తన నిధుల నుంచి అదనంగా రూ. 15 లక్షలు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోమన్‌పల్లి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఆర్మూర్ పట్టణానికి 100 పడకల ఆస్పత్రిని తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల కంటే ముందుగా ఆర్మూర్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ పూర్తి చేసుకోవడానికి ప్రజలు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ రమేశ్, ఆర్డీవో యాదిరెడ్డి, మండల ప్రత్యేకాధికారి రామారావ్ నాయక్ పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..
న్యాయవాదులతో హైకోర్టు జడ్జి నవీన్‌రావు కోర్టు ప్రాంగణంలో హరితహారం న్యాయమూర్తులకు వర్క్‌షాప్ వరంగల్ లీగల్ : తెలంగాణ హైకోర్టు సాధన ఉద్యమంలో పాల్గొన్న న్యాయవాదులకు సంబంధించిన సమస్యలు, కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, కక్షదారులకు కనీస సౌకర్యాల కల్పన కోసం తన వంతు కృషి చేస్తానని జిల్లా పోర్టు ఫోలియో జడ్జి, హైకోర్టు జడ్జి పి.నవీన్‌రావు తెలిపారు. జిల్లాకు శనివారం వచ్చిన ఆయన తొలుత కోర్టు ప్రాంగణంలో హరితహారంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి ఎం.లక్ష్మణ్, మహాæనగరపాలక సంస్థ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, పోలీసు కమీషనర్ సుధీర్‌బాబుతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. ఇక్కడ చదువుకున్న తనకు వరంగల్‌పై ప్రత్యేక గౌరవం ఉందని తెలిపారు. ఆ తర్వాత జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో న్యాయమూర్తులకు ‘సాక్ష్యాధారాల నమోదు’పై నిర్వహించిన వర్క్‌షాప్‌లో కూడా నవీన్‌రావు పాల్గొన్నారు. వర్క్‌షాప్‌లో వివిధ అంశాలపై రిటైర్ జిల్లా జడ్జి యస్.మాధవరావు, సీబీఐ కోర్టు జడ్జి చక్రవర్తి, జనగాం కోర్టు సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు, సీనియర్ జూనియర్ సివిల్ జడ్జిలు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు సహోదర్‌రెడ్డి, జయాకర్, టీ.వీ.రమణ, అల్లం నాగరాజు, కవిత తదితరులు పాల్గొన్నారు. -
బాల కార్మికులు కాదు.. బడి పిల్లలే
విద్యార్థులు కూలీలుగా మారారు. పాఠశాల గదులను ఊడ్చుతున్నారు. సిమెంటు బస్తాలను మోస్తున్నారు. బెజ్జూరు మండలంలోని సంజీవ్‌నగర్ ఎంపీపీఎస్ పాఠశాలలో బుధవారం విద్యార్థులు కూలీలుగా మారడం కనిపించింది. ఏంటా అని ఆరా తీస్తే కొన్ని నిజాలు బయటకు వచ్చాయి. పాఠశాల గది ఒకటి సిమెంటు బస్తాల కారణంగా నిరుపయోగంగా ఉంటోంది. దీనిపై ఆ గ్రామానికి చెందిన యువకుడు ఒకరు విద్యా శాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో పాఠశాల సిబ్బంది కూలీలకు డబ్బులు చెల్లించాల్సి వస్తుందని విద్యార్థులతోనే ఆ పనులు చేయించారు. – బెజ్జూర్ -
కల్వర్టు నిర్మాణ పనులు ప్రారంభం
మంగంపేట (మల్దకల్) : మండలంలోని మంగంపేట స్టేజీ సమీపంలో గద్వాల–అయిజ ప్రధాన రహదారిపై నూతనంగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణం పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ర్యాలంపాడు రిజర్వాయర్ ద్వారా 108 ప్యాకేజీ కింద చేపట్టిన కాల్వ ఏర్పాటులో భాగంగా ఈ కల్వర్టు నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో కల్వర్టు నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మండల ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. అదే విధంగా అమరవాయి, నీలిపల్లి, పాలవాయి, కొండపల్లి, రేపల్లి గ్రామాలకు చెందిన రైతులకు ప్రధాన కాలువ ఇదే కావడంతో నిర్మాణం పనులు పూర్తయితే కాని కాల్వ ద్వారా నీరు వెళ్లే పరిస్థితి లేదని, వెంటనే కల్వర్టు నిర్మాణం పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందే విధంగా చూడాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. -
ఐదేళ్ళ బాలికే ఆధారం!
'కుంచమంత కూతురుంటే మంచం మీదే కూడు' అన్న సామెత ఆ బాలిక విషయంలో సరిగ్గా సరిపోతుంది. అంధుడైన తన తండ్రి.. కొబ్బరి తోటల్లో పనికి వెళ్ళేందుకు ప్రతిరోజూ దారి చూపించే ఆ చిన్నారి.. ఎందరికో స్ఫూర్తిదాయకమౌతోంది. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన మూడు నిమిషాల నిడివి ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఫిలిప్పీన్స్ కు చెందిన ఐదేళ్ళ బాలిక జెన్నీ, కాలికి చెప్పుల్లేకుండా తన అంధ తండ్రి పెపె నెల్సన్ కు పనిలో సహాయపడటం ఇప్పుడు ఫేస్ బుక్ లో లక్షలమందిని ఆకట్టుకుంటోంది. ఆ చిన్న ప్రాణానికి తండ్రిపై ఉన్న ప్రేమను, బాధ్యతను తెలియజేస్తోంది. కొబ్బరి తోటల్లో తండ్రి పనికి సాయ పడటమే కాదు... ఆప్యాయంగా ఆహారం తినిపించడం, నీళ్ళు అందించడం ప్రతి మనసునూ కదిలింపజేస్తోంది. కూతురి సహకారంతో నెల్సన్ ప్రతిరోజూ సుమారు 60 కొబ్బరి చెట్లు ఎక్కగల్గుతున్నాడు. అందుకుగాను అతడికి అందే 6 డాలర్ల వేతనం.. ఇప్పుడా కుటుంబానికి తిండికి లోటు లేకుండా చేస్తోంది. ప్రతి గుండెనూ కదిలిస్తున్న ఆ వీడియోను ఫేస్ బుక్ లోని తన పేజీలో రూబీ కెప్యూన్స్ పబ్బిలాన్.. జూన్ 10వ తేదీన పోస్ట్ చేసింది. అప్పట్నుంచీ లక్షలమంది తిలకించడమే కాదు.. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లో కథనంగా మారింది. మనసును కదిలించే వీడియోను తిలకించిన ఎంతోమంది వినియోగదారులు సహాయక సంస్థల ద్వారా వారికి తగిన సహకారం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఏబీఎస్ సీబీఎన్ ఫౌండేషన్ ఆ తండ్రీ కూతుళ్ళను కలిసింది. రెటినల్ డిటాచ్ మెంట్, రెటినిటిస్ పిగ్మెంటోసా తో బాధపడుతున్న నెల్సన్ కు తగిన ట్రైనింగ్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. త్వరలో నెల్సన్, జెన్నీలు మంచి వాతావరణంలో స్థిరపడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
ఎంకాం చదివి.. సెంట్రింగ్ పనికి వెళ్లలేక...
నర్సంపేట(వరంగల్): ఉద్యోగం రావడం లేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో గురువారం రాత్రి జరిగింది. నెహ్రూనగర్ కాలనీకి చెందిన ఇప్ప సాంబయ్యు-ఉవు దంపతుల రెండో కువూరుడు ఇప్ప నరేష్(24) ఎంకామ్ పూర్తి చేశాడు. ఉద్యోగాల కోసం ఏడాదిగా అన్వేషిస్తూ ఇంటర్వ్యూలకు వెళ్లేవాడు, ఎక్కడా ఉద్యోగం రాకపోవడంతో తండ్రి, అన్నతో కలసి సెంట్రింగ్ పనులకు వెళ్తున్నాడు. ఎంకామ్ పూర్తి చేసి ఈ పని చేయాల్సి వస్తోందని తరుచూ తండ్రితో చెప్పి బాధపడేవాడు. కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి వెళ్లగా సూసైడ్‌నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏదైనా ఉద్యోగం వస్తే పేదరికం బాధ ఉండేది కాదని, ఏ ఉద్యోగమూ లేని తనకు చావే శరణ్యమని సూసైడ్ నోట్లో రాశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
త్వరలో బ్యాంకుల్లా పోస్టాఫీసులు!
న్యూఢిల్లీః త్వరలో బ్యాంకింగ్ సేవలు మరింత విస్తరించనున్నాయి. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) పేరున దగ్గరలోని పోస్టాఫీసులే బ్యాంకులుగా పనిచేసే విధానాన్ని 2017 మార్చి నాటికి అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర కేబినెట్ ప్రతిపాదనను తెచ్చింది. దీంతో 2019 నాటికల్లా మొత్తం దేశంలోని 50 జిల్లా కేంద్రాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ప్రస్తుం మారుమూల ప్రాంతాల్లో ఉన్న 139,000 పోస్టాఫీసులతో కలిపి భారతదేశంలో 154,000 పోస్టాఫీసులు ఉన్నాయి. వీటిలో ముందుగా జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఉండే సుమారు 650 కార్యాలయాల్లో పోస్టల్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చి, వాటిని మారుమూల ప్రాంతాలతో అనుసంధానం చేస్తారు. వచ్చే ఏడాది మార్చి నాటికల్లో పోస్టల్ డిపార్ట్ మెంట్ లో పేమెంట్ బ్యాంకులను అందుబాటులోకి తెస్తామని, ప్రపంచంలోనే పోస్టల్ సేవలను అందించడంలో మన దేశం ఇంచుమించుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్నా అతి పెద్ద నెట్వర్క్ ను కలిగి ఉందని టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుత ప్రతిపాదనను అమల్లోకి తెచ్చేందుకు 400 కోట్ల రూపాయల ఈక్విటీలు, 400 కోట్ల రూపాయల గవర్నమెంట్ గ్రాంటులతో మొత్తం 800 కోట్ల రూపాయలను వినియోగించనున్నట్లు టెలికాం మంత్రి తెలిపారు. ఇందుకోసం మారుమూల ప్రాంతాల్లో పనిచేసే సుమారు 1.7 లక్షల మంది పోస్ట్ మ్యాన్ లకు అవసరాన్ని బట్టి స్మార్ట్ ఫోన్లను, టాబ్లెట్ లను అందిస్తామని, దీంతో ప్రజలు తమ బ్యాంక్ అకౌంట్లను సులభంగా చేరుకోగల్గుతారన్నారు. అంతేకాక ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ కలిగిన 5000 ఏటీఎం లను కూడ దేశవ్యాప్తంగా ప్రారంభించేందుకు శాఖ యోచిస్తున్నట్లు తెలిపారు. -
బ్రేక్ లేక.. డైపర్స్ వాడుతున్నారు!
వాషింగ్టన్: అమెరికాలోని చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు వెల్లడించిన విషయాలు నివ్వెరపరిచేలా ఉన్నాయి. చౌక ధరకే చికెన్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతులు చేస్తూ.. కోట్లు గడిస్తున్న బడా చికెన్ ఫ్యాక్టరీలు తమ కార్మికుల విషయంలో మాత్రం కనీస మానవత్వాన్ని కూడా ప్రదర్శించడం లేదు. కార్మికులు టాయ్‌లెట్‌కు వెళ్లడానికి కూడా యాజమాన్యాలు అనుమతించకుండా వేధిస్తున్నాయంటూ కొందరు కార్మికులు వెల్లడించిన నిజాలు ఇప్పుడు అంతర్జాతీయ సమాజాన్ని నివ్వెరపరుస్తున్నాయి. పని మధ్యలో కార్మికులు టాయ్‌లెట్ కోసం విరామం తీసుకోవడం మూలంగా ఉత్పదకత తగ్గిపోతుందని భావించే యాజమాన్యాలు అందుకు అనుమతించడం లేదని, దీనివల్ల డైపర్స్ వాడుతున్నానంటూ ఓ కార్మికుడు వెల్లడించిన విషయాన్ని అంతర్జాతీయంగా పేదరికానికి వ్యతిరేకంగా పోరాడే ఆక్స్‌ఫామ్ సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. తానే కాదు తనతో పాటు పనిచేసే చాలా మంది కార్మికులు ఇలాగే డైపర్స్ వాడుతారని, మరికొందరు టాయ్‌లెట్‌కు వెళ్లే అవసరం లేకుండా నీటిని త్రాగకుండా పనిచేసి అనారోగ్యం పాలౌతున్నారని ఓ కార్మికుడు వెల్లడించిన విస్తుగొలిపే విషయాలను ఆ నివేదిక పేర్కొంది. చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో పనిచేసే వందలాది కార్మికుల భయంకర అనుభవాలను ఈ నివేదిక తెలిపింది. ఇటీవల చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమలో పెరిగిన టెక్నాలజీ మూలంగా ఉత్పాదన వేగం కూడా పెరిగింది. అయితే ఈ వేగాన్ని అందుకోవడానికి బడా కంపెనీలు కార్మికులపై తీవ్రస్థాయిలో పనిభారం మోపుతున్నారని ఆక్స్‌ఫామ్ వెల్లడించింది. ఎనిమిది గంటల షిఫ్టుల్లో పనిచేస్తున్న కార్మికులకు రెండు విడతలు అరగంట చొప్పున విరామం ఇవ్వాలన్న కనీస నిబంధనలను చికెన్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు పట్టించుకోవడం లేదని నివేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఆ పాత్ర కోసం చాలా కసరత్తు చేశా..
ఆ పాత్ర కోసం చాలా కసరత్తు చేశానంటోంది నటి నిక్కీగల్రాణి. ఇంతకీ ఈ అమ్మడు చెప్పొచ్చేదేమిటనేగా మీ భావన. కోలీవుడ్‌లో లక్కీ హీరోయిన్లలో నిక్కీగల్రాణి ఒకరని కచ్చితంగా చెప్పవచ్చు. డార్లింగ్ అంటూ జీవీ ప్రకాశ్‌కుమార్‌తో రొమాన్స్ చేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ భామ ప్రస్తుతం మూడు, నాలుగు చిత్రాలతో బిజీగా ఉంది. లారెన్స్‌కు జంటగా మొట్టశివ కెట్టశివ చిత్రంతో పాటు జీవీ ప్రకాశ్‌కుమార్‌తో రెండో సారి కడవుళ్ ఇరుక్కాన్ కుమారు చిత్రాన్ని పూర్తి చేశాననీ చెప్పింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ రెండు చిత్రాల్లోనూ తనకు నటనకు అవకాశం ఉన్న పాత్రలో లభించడం సంతోషంగా ఉందని అంది. ఒకే రకం మూస పాత్రలు చేయడం తనకు ఇష్టం ఉండదనీ, అదే విధంగా నటించిన పాత్రలకు సొంతంగా డబ్బింగ్ చెప్పకుంటేనే ఆ పాత్రలకు న్యాయం చేకూరుతుందనీ పేర్కొంది. తాను తదుపరి ఘట్టానికి చేరుకోవచ్చునని అంది. అందుకే తన చిత్రాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నాని చెప్పింది. ప్రస్తుతం వేలన్నువందుటా వెళ్లక్కారన్ చిత్రంలో నటిస్తున్నాననీ తెలిపింది. ఇందులో తాను పోలీస్ అధికారిగా నటిస్తున్నాననీ, ఇందు కోసం చాలా కసరత్తు చేశాననీ చెప్పింది.పోరాట సన్నివేశాలు ఉండడంతో ఫైట్స్‌లో శిక్షణ పొందాననీ, పోలీస్ గెటప్ కోసం తన శారీరక భాషను చాలానే మార్చుకున్నాననీ తెలిపింది. -
పట్టించుకోకుంటే పని కోల్పోయినట్లే!
మానసిక అనారోగ్యంతో కొన్ని వేల సంవత్సరాల పని శక్తిని కోల్పోతాం అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. ప్రతి సంవత్సరం పెరుగుతున్న మానసిక అనారోగ్యం వల్ల వచ్చే 2030 సంవత్సరం నాటికి సుమారు 12 బిలియన్ల పనిరోజులు లేదా 50 మిలియన్ సంవత్సరాల పని వృధా అయిపోతుందని డబ్ల్యూహెచ్ ఓ తాజా నివేదిక ప్రకారం తెలుస్తోంది. మానసిక ఒత్తిడి, ఆత్రుత వంటి లక్షణాలకు చికిత్స అందించడంలో వైఫల్యం చెందితే సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక ఉత్పాదకతలో 925 బిలియన్ డాలర్ల ఖరీదైన నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని వరల్డ్ హెల్గ్ ఆర్గనైజేషన్ కొత్త అధ్యయనాల ప్రకారం తెలుస్తోంది. సాధారణ మానసిక అనారోగ్య చికిత్సకోసం పెట్టుబడి, ఆరోగ్య ఆర్థిక ప్రయోజనాలు పై ప్రపంచంలోనే మొదటిసారి విశ్లేషణ జరిపిన సంస్థ తన పరిశోధనా వివరాలను ల్యాన్సెట్ సైకియాట్రీ లో ప్రచురించింది. మానసిక ఒత్తిడి అనారోగ్యాల చికిత్సకు వెచ్చించే ఒక డాలర్... ఆరోగ్యంతోపాటు తిరిగి 4 డాలర్ల ఖరీదైన ఉత్పాదకతను పెంచే అవకాశం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. మానసిక ఒత్తిడి, అనారోగ్యాలకు చికిత్స అందించడం పై దృష్టి పెట్టకపోవడం, ఓ మానవ తప్పిదంగానూ, పిసినారితనంగానూ కనిపిస్తోందని, అన్ని దేశాలు మానసిక ఆరోగ్య సేవలపై పెట్టుబడికి అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు సిఫార్సు చేయాలని, ప్రస్తుత ప్రభుత్వాలు తమ ఆరోగ్య బడ్జెట్ లో కేవలం సగటున మూడు శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నాయని నివేదిక ద్వారా వెల్లడైంది. వచ్చే 15 సంవత్సరాల్లో కౌన్సెలింగ్, యాంటీ డిప్రెషన్ మందులకోసం 147 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తే... 399 బిలియన్ డాలర్ల ఖరీదైన కార్మిక శక్తి పెరుగుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. ప్రపంచ జనాభాలో దాదాపు పదిశాతం మంది అంటే సుమారు 740 మిలియన్లమంది ఇప్పుడు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని, అందులోనూ సాధారణ మానసిక అనారోగ్యం క్రమంగా పెరుగుతోందని తాజా అధ్యయనాల్లో తేలింది. 1990 నుంచి 2013 మధ్య కాలంలో ప్రజల్లో మానసిక ఆందోళన, వ్యాకులత దాదాపు సగం పెరిగింది. అత్యవసర పరిస్థితులు, యుద్ధాలు వల్ల వ్యక్తుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు వెల్లువెత్తుతున్నాయని, 20 శాతం ప్రజలు అటువంటి సంఘటనలవల్లే ఒత్తిడికి గురౌతున్నారని డబ్ల్యూ హెచ్ ఓ అంచనా వేసింది. ఇది ఓ ప్రజారోగ్య సమస్య కాదని, అభివృద్ధి సమస్యగా గుర్తించాలని, నిరాశ, ఆత్రుత వంటి వాటికి చికిత్సను అందిస్తే... అది ఆర్థిక అభివృద్ధికి మంచి అర్థాన్ని తెస్తుందని తమ పరిశోధనల్లో తేలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మార్గరెట్ చాన్ తెలిపారు. ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
కొత్త ఏడాది మొదలైంది ఇలా..
పుస్తకాలు పట్టాల్సిన చిట్టి చేతులు నీళ్ల బిందెలు మోస్తున్నాయి. అక్షర ముక్కలు నేర్చుకోవాల్సిన వయసులో చిన్నారులు వెట్టి పనులకు అలవాటు పడున్నారు. కొత్త ఏడాది చదువులు ప్రారంభమైనా కొత్త పుస్తకాలు రాకపోవడంతో చిన్నారులు ఇలాంటి పనులు చేయాల్సి వస్తుంది. మంగళవారం జగదేవ్‌పూర్ ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు మధ్యాహ్న వంట కోసం బిందెలతో నీళ్ల మోస్తున్న దృశ్యాలను ‘సాక్షి’ కెమెరా క్లిక్మనిపింది. - జగదేవ్‌పూర్ -
శివ.. శివా!
♦ 11 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్న ♦ శివసాగర్ ప్రాజెక్టు పనులు ♦ ప్రతి ఏడాదీ పెరుగుతున్న అంచనా వ్యయం ♦ నైరాశ్యంలో ఆయకట్టు రైతన్నలు యాలాల: పదకొండేళ్లుగా శివసాగర్ ప్రాజెక్టు పనులు కొనసాగుతూనే ఉన్నా యి. దీంతో ఇక్కడి రైతులకు ప్రాజెక్టు ద్వారా నీరందడం తీరని కలగానే కనిపిస్తుంది. శివసాగర్ ప్రాజెక్టు విషయమై రాష్ట్ర బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడంతో ఈ ఏడాది కూడా ఇది పూర్తి కావ డం అనుమానంగానే కనిపిస్తుంది. దీం తో ఆయకట్టు రైతులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. జలయజ్ఞంలో భాగంగా యాలాల మండలం విశ్వనాథ్‌పూర్ కాక్రవేణి నదిపై శివసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి 2005లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వై.ఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు వెయ్యి ఎకరాల ఆయకట్టు, ఐదు గ్రామాల రైతులకు ఉపయోగకరంగా ఉండేలా రూపకల్పన చేశారు. రూ. 5కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పనులు పూర్తవడానికి అనేక రకాల అవాంతరాలు ఎదురయ్యాయి. ప్రాజెక్టు ఇంకా అసంపూర్తిగానే ఇక్కడి రైతులను వెక్కిరిస్తుంది. అప్పట్లో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్లు నాసిరకమైన పనులు చేపట్టడంతో కుడివైపు తూము కూలిపోయింది. రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు అలుగు రెవిట్మెంట్తో పాటు దిగువ, ఎగువ ప్రాంతాలు కోతకు గురయ్యాయి. ప్రాజెక్టు పూర్తికోసం అంచనా వ్యయాన్ని గత ప్రభుత్వాలు రూ.9 కోట్లకు పెంచినా పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. కాగా ఇటీవల ప్రాజెక్టు కాల్వలకు సంబంధించి భూసేకరణ కోసం ఇరిగేషన్ అధికారులు సర్వే పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రాజెక్టు పనులకు సంబంధించి ఇటీవల రాష్ట్ర బడ్జెట్లో కూడా ఊసే లేకపోవడంతో ఇక్కడి రైతుల్లో తీవ్ర నైరాశ్యం నెల కొంది. 11ఏళ్లుగా ప్రాజెక్టు పనులు ఇంకా నిర్మాణ దశలోనే కుంటు పడటంతో ప్రాజెక్టు నిర్మాణంపై ఆయకట్టు రైతులు ఆశలు వదులుకున్నారు. ప్రభుత్వం దృష్టి పెట్టాలి..! 11 ఏళ్లుగా శివసాగర్ ప్రాజెక్టు వెక్కిరిస్తుంది. ఇటీవల కాల్వల నిర్మాణం కోసం భూసర్వేను అధికారులు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు పత్రికల్లో చూశా. ప్రస్తుతం మిషన్ కాకతీయలో చెరువులకు మరమ్మతులు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం శివసాగర్ ప్రాజెక్టుపై దృష్టిసారించాలి. శివసాగర్ ప్రాజెక్టు పూర్తయితే ఇక్కడి రైతాంగానికి ఎంతో మేలు కలుగుతుంది. -వీరేశం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కలగానే మిగిలేలా ఉంది..! శివసాగర్ ప్రాజెక్టు రైతన్నలకు కలగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది. ప్రభుత్వాలు మారుతున్నా శివసాగర్ తలరాత మాత్రం మారడం లేదు. ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోనైనా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఇక్కడి రైతాంగానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ విషయంలో ఇరిగేషన్, ప్రభుత్వ ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి. -గాజుల బస్వరాజ్, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి -
రెక్కలకష్టం ఆపేశారు
♦ కూలి డబ్బులకు లక్షన్నర మంది ఎదురుచూపు ♦ రూ.26 కోట్లు బకాయిపడిన సర్కారు ♦ నిధుల ఆలస్యంతో ఉపాధి పనులపై ప్రభావం ♦ పనులకు వచ్చేవారి సంఖ్య భారీగా తగ్గుముఖం గత నెల 29న ఉపాధి పనులకు 1.03 లక్షల మంది హాజరుకాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 75 వేలకు పడిపోయింది. నిధుల నిలిపివేతపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో యంత్రాంగం దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటోంది.జిల్లాలో ఉపాధి పనులు చేసిన కూలీలకు రూ.26 కోట్లు చెల్లించాల్సి ఉంది. బంట్వారం, యాచారం, మంచాల, దోమ, పెద్దేముల్ మండలాల్లోనే బకాయిలు అధికం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల గ్రహణం పట్టుకుంది. కరువు కరాళ నృత్యంతో బతుకు బరువై.. ఉపాధి పనులకు వెళ్లిన కూలీలకు డబ్బులివ్వకుండా సర్కారు పొట్టకొడుతోంది. ఎనిమిది వారాలుగా సుమారు లక్షన్నర మంది కూలీల రెక్కల కష్టాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. దాదాపు రూ.26 కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడంతో జిల్లాలో ఈజీఎస్ పనులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బకాయిలు పెరిగిపోవడంతో ఉపాధికి వచ్చే కూలీల సంఖ్య తగ్గుముఖం పట్టింది. సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి : తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో ఈ ఏడాది సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. దీంతో రైతులు కూడా ఉపాధి కూలీలుగా మారిపోయారు. ఈ క్రమంలో పనిదినాలను ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య బాగా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.06 కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే ఈ సంఖ్య దాటిపోయింది. ఈ పనిదినాలను విశ్లేషిస్తే జిల్లాలో కరువు పరిస్థితులను అంచనా వేయవచ్చు. ఈ మండలాల్లో అధికం..! ఈ ఏడాది సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో రబీ పంటల సాగు పడిపోయింది. దీంతో వ్యవసాయ కూలీలు సైతం ఉపాధి బాట పట్టారు. ఈ క్రమంలోనే జిల్లాలో రికార్డు స్థాయిలో పని దినాలు నమోదయ్యాయి. వ్యవసాయాధారిత ప్రాంతాలైన బంట్వారం, యాచారం, మంచాల, దోమ, పెద్దేముల్ మండలాల్లో ఈజీఎస్ పనులు ముమ్మరంగా సాగాయి. అదే సమయంలో జిల్లాకు బకాయిపడిన రూ.26 కోట్లలో సింహభాగం ఇక్కడే చెల్లించాల్సివుంది. ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లా యాజ మాన్య సంస్థ (డ్వామా) 52,704 మందికి వంద రోజుల పనిదినాలను కల్పించింది. జిల్లావ్యాప్తంగా ఉన్న 2.89 లక్షల మంది జాబ్కార్డుదారుల్లో ఇప్పటివరకు 2.30 లక్షల మందికి ఉపాధి చూపించారు. రెండు నెలలుగా కూలి డబ్బుల్లేవు రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు మావి. ఉపాధి పనులు చేసి నెలలు గడుస్తున్నా డబ్బులివ్వలేదు. ఎట్టా బతకాలె. ఉపాధి పనులు చేసి పస్తులుండాల్సిన దుస్థితి. మాకు ఎనిమిది వారాలకు పైగా చేసిన పనులకు కూలి డబ్బులు రావాలి. ఎన్నిసార్లు ధర్నా చేసినా పట్టించుకునేవారు లేరు. - మడ్డి యాదమ్మ, నక్కర్తమేడిపల్లి, యాచారం రెండు నెలలుగా ఇయ్యట్లే.. ఉపాధి హామీ పథకంలో రెండు నెలలు పనిచేసినం. ఇప్పటి వరకు కూలి డబ్బులు ఇయ్యలె. అసలే కరువు ఉంది.. ఈ యేడు ఎక్కడ కూడా పంటలు వెయ్యలె. కూలి చేయడం తప్ప వేరే బతుకుదెరువు లేదు. చేసిన పనులకు కూలి ఇవ్వండని ఎన్ని రోజులు అధికారుల సుట్టు తిరగాలె. వారం వారం ఇస్తామన్నారు.. ఎక్కడిస్తున్నారు? - చౌట వెంకటయ్య, అంతారం, కుల్కచర్ల మండలం ఎవ్వరూ పట్టించుకుంటలేరు.. ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఆరు వారాల కంటే ఎక్కువే అయింది. ప్రతి సోమవారం ప్రజాదర్బారులో అడుగుతున్నాం. ఉపాది సిబ్బంది తీరు బాగా లేదు. ఇలాగైతే ఎలా.. పెద్ద సార్లు పట్టించుకొని తమ కూలీ డబ్బులు తమకు ఇప్పించాలె. - ఆంజనేయులు, మాలసోమారం, బంట్వారం మండలం -
పురుషులు 50శాతం, స్త్రీలు 39శాతం మాత్రమే
భారత కార్మికుల్లో పని విషయంలో మహిళలు పురుషులతో పోలిస్తే కాస్త వెనుకబడే ఉన్నారంటున్నాయి తాజా పరిశోధనలు. పనిచేసే చోట ఏభై శాతం మంది పురుషులతో పోలిస్తే కేవలం 39 శాతం మహిళలు మాత్రమే పూర్తిగా విధుల్లో నిమగ్నమౌతున్నారని సర్వేలు చెప్తున్నాయి. డేల్ కార్నెగీ ట్రైనింగ్ ఇండియా విడుదల చేసిన లెక్కల ప్రకారం భారత పురుషులు 50 శాతం మంది విధుల్లో కొనసాగుతుంటే కేవలం 39 శాతం మంది మహిళలు మాత్రమే విధుల్లో కొనసాగుతున్నారని తేల్చి చెప్పింది. అయితే ఇక్కడ కూడా నియామకాలతోపాటు ప్రతి విషయంలోనూ లింగ వివక్ష లక్ష్యంగా ఉంటోందని, ప్రమోషన్ల దగ్గర నుంచీ మహిళలకు కనిపించని అడ్డు గోడలు ప్రతి స్థాయిలోనూ ఎదురౌతూనే ఉన్నాయని సర్వేలు చెప్తున్నాయి. ఇటువంటి కారణాలతోనే విధులను మధ్యలోనే వదిలేసి వెళ్ళేవారి శాతం ఎక్కువగా ఉంటోందని డీసీటీఐ ఛైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ పల్లవి ఝా తెలిపారు. భారత మహిళలు తరచుగా కార్యాలయాల్లోని పురుష సహచరులతోపాటు... చాలా సందర్భాల్లో పై అధికారుల వివక్షకు గురౌతున్నారని డీసీటీఐ లెక్కలు చెప్తున్నాయి. అయితే ఉత్పాదకత విషయంలో మహిళలు వెనుకబడుతున్నారన్న భ్రమలో కంపెనీలు ఉండటమే కాక, అంచనాలకు మించి వారినుంచి ఆశించడం ఇందుకు కారణమౌతోందని, ముఖ్యంగా సంస్థలు మహిళల నుంచి ఎంత పని తీసుకోగలం, వారి అభివృద్ధికి ఎటువంటి ప్రోత్సాహం అందించగలం అన్నదానిపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండటం అవసరమని ఝా తెలిపారు. వివిధ హోదాల్లోని మహిళలను పరిశీలిస్తే... సీ సూట్ (సీనియర్ ఎగ్జిక్యూటివ్) స్థాయిలో మహిళలు అత్యధికంగా 63 శాతం వరకు ఉంటున్నారని, సంస్థాగత పరిపాలనా స్థాయిలో 42శాతం మంది ఉండగా... న్యాయవాదులు, ఇంజనీర్లు వంటి ఇతర ప్రోఫెషనల్ ఉద్యోగాల్లో కేవలం 18 శాతం మంది మాత్రమే విధుల్లో కొనసాగుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే బీపీవోల్లో మాత్రం మహిళా ఉద్యోగుల శాతమే ఎక్కువగా ఉంటోందని, వారిలోని ప్రతిభను ఖాతాదారులను ఆకట్టుకునేందుకు ఆయా కంపెనీలు వినియోగించుకుంటున్నాయని డీసీటీఐ అధ్యయనాల్లో నిర్థారించారు. -
'రికార్డు' కష్టాలు..!
ప్రపంచరికార్డు తెచ్చిపెట్టిన ఆ వేళ్లే ఇప్పుడు అతడికి సమస్యగా మారాయి. అదృష్టంతో పాటు.. సమస్యనూ తెస్తున్నాయి. కార్పెంటర్ వృత్తితో కాలం గడుపుదామనుకున్న అతడికి అధికంగా ఉన్న వేళ్లు ఇబ్బంది పెడుతున్నాయి. మనిషికి సహజంగా ఉండాల్సిన వాటి కన్నా 8 వేళ్లు ఎక్కువ ఉండటం ప్రత్యేక గుర్తింపు తెచ్చినా...వృత్తి జీవితానికి మాత్రం ఇబ్బందిగానే మారింది. గుజరాత్‌లోని హిమ్మత్ సాగర్ కు చెందిన దేవేంద్ర సుథార్.. ప్రపంచంలోనే ఎవ్వరికీ లేనన్ని వేళ్లతో ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కాడు. రెండు చేతులకూ కలిపి 4, రెండు కాళ్లకు కలిపి 4 అధికంగా ఉన్న వేళ్లతో మొత్తం 28 వేళ్లు ఉన్నాయి. 43 ఏళ్ల వయసున్న దేవేంద్ర కార్పెంటర్ పనిచేస్తూ జీవనాన్నిగడుపుతున్నాడు. చాలా అరుదుగా కనిపించే ఈ ప్రత్యేకత (పోలిడాక్టిలిజమ్) అతడి జీవనోపాధికి అడ్డంకిగా మారింది. కార్పెంటర్ పని చేసేటప్పుడు అధికంగా ఉన్న వేళ్లు అడ్డు వస్తుండటంతో అవి తెగిపోకుండా పని చేయడం కష్టమౌతోంది. ఇప్పుడు రికార్డు తెచ్చిపెట్టిన సంతోషం కన్నా వేళ్ళతో ఇబ్బందే అతడికి ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉన్న వేళ్లు తనను సెలబ్రిటీని చేశాయని, అందరూ తనను చూసేందుకు వస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని దేవేంద్ర చెప్తున్నాడు. కానీ అవే వేళ్లు తన జీవన గమనానికి అడ్డంకిగా మారాయని, కార్పెంటర్ పనిచేయడం ఎంతో కష్టంగా ఉందని అంటున్నాడు. ఎక్కువ వేళ్లు ఉండటంతో ఎంతో అధికంగా శ్రమపడాల్సి వస్తోందని చెబుతున్నాడు. తన సమస్యకు పరిష్కారం ఏంటో అర్థం కాక ఆందోళన చెందుతున్నాడు. అటు రికార్డును తెచ్చిపెట్టిన వేళ్లను ఏమీ చేయలేక, ఇటు రోజువారీ జీవనంలో కష్టాలు పడలేక సతమతమౌతున్నాడు.