‘భార్యను తదేకంగాఎంతసేపు చూస్తారు? : అమూల్‌ స్పందన, ఈ కార్టూన్లు చూస్తే! | L&T Boss Stare At Wife Remark Amul post going viral on social media | Sakshi
Sakshi News home page

‘భార్యను తదేకంగాఎంతసేపు చూస్తారు? : అమూల్‌ స్పందన, ఈ కార్టూన్లు చూస్తే!

Published Wed, Jan 15 2025 12:38 PM | Last Updated on Wed, Jan 15 2025 2:35 PM

L&T Boss Stare At Wife Remark Amul post going viral on social media

ఉద్యోగులు, పనిగంటలపై కార్పొరేట్‌ కంపెనీ ఎల్‌అండ్‌టీ (L&T) చైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలని, ఇంట్లో కూర్చుని భార్యను ఎంత సేపు చూస్తారూ,  ఆదివారం కూడా పని చేయండి అంటూ సుబ్రహ్మణ్యన్‌ చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.  

ఇది సోషల్‌ మీడియాలో సుదీర్ఘ పని గంటలపై మరోసారి చర్చకు దారి తీసింది. సుబ్రహ్మణ్యన్‌ వ్యాఖ్యలపై ఇప్పటికే  నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై పలువురు ఇండస్ట్రీ పెద్దలుకూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  తాజాగా ఈ  జాబితాలోకి డైరీ బ్రాండ్ అమూల్ చేరింది.

అమూల్‌ ఏమంది?
ఎల్ అండ్ టి బాస్ "స్టేర్ ఎట్ వైఫ్" వ్యాఖ్యలపై అమూల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక డూడుల్‌ విడుదల చేసింది.   ఇందులో ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్‌ వ్యాఖ్యలపై  ఆగ్రహం వ్యక్తం  చేసింది. అమూల్ "90 గంటల పని వారం గురించి వివాదం!" అనే శీర్షికతో పాటు ఒక డూడుల్‌ను షేర్‌ చేసింది! డూడుల్‌లోని టెక్స్ట్ బోల్డ్‌లో L & T  లెటర్స్‌తో ((Labour & Toil)  "శ్రమ అండ్‌  కఠోర శ్రమ?" అంటూ సుబ్రహ్మణ్యన్‌ను విమర్శించింది "మీరు మీ భార్యను ఎంతసేపు తదేకంగా చూడగలరు?" "అమూల్ రోజూ బ్రెడ్‌ను తదేకంగా చూస్తుంది," అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.

కాగా ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ వార్తలు, అంశాలపై ప్రత్యేకమైన గ్రాఫిక్స్ ,పోస్టర్లను రూపొందించడంలో అమూల్‌ కంపెనీబాగా  ప్రసిద్ధి చెందింది. క్రీడల నుండి వినోదం వరకు,  అన్ని ముఖ్యమైన సందర్భాలు, ప్రధానంగా ప్రముఖులు చనిపోయినపుడు కూడా తనదైన శైలిలో స్పందిస్తూ  ఉంటుంది. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ,  90 గంటల పనివారం గురించి కొనసాగుతున్న వివాదంపై  కూడా స్పందించడం విశేషం.

 

 

గతంలో వారానికి 70 గంటలు పని చేయాలనే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ్ మూర్తి కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇపుడు  ఎల్‌అండ్‌టీ చైర్మన్‌   సుబ్రహ్మణ్యన్  ఇంకో అడుగు ముందుకేసి, 90 గంటలు, "ఇంట్లో కూర్చొని మీరు ఏమి చేస్తారు? భార్యను ఎంత సేపు చూస్తారు,ఆఫీసుకు వెళ్లి పని ప్రారంభించండి." అంటూ  చేసిన  వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధిక జీతం , సౌకర్యాలు  ఉన్న కార్పొరేట్‌ కంపెనీల సీఈవోలు,  కింది స్థాయి, తక్కువ జీతం పొందే ఉద్యోగుల నుండి అదే స్థాయి నిబద్ధతను ఎందుకు ఆశిస్తారంటూ నెటిజన్లు ప్రశ్నించారు.  మరికొంతమంది కార్మిక శ్రమను దోచుకునే వీళ్లకి కార్మిక చట్టాలు, అమలు, కార్మిక సంక్షేమం  గురించి మాట్లాడే మనసు ఉండదంటూ మండిపడ్డారు. అంతేకాదు ఈ వివాదంపై అనేక కార్డూన్లు, ఫన్నీ కామెంట్లు,వీడియోలు నెట్టింట  సందడి చేశాయి కూడా.

 

బాలీవుడ్ సూపర్ స్టార్ దీపికా పదుకొనే, ఆర్‌పీసీ  గ్రూప్ చైర్‌పర్సన్ హర్ష్ గోయెంకా కూడా  సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలను ఖండించారు. అలాగే ఎంఅండ్‌ ఎం అధినేత ఆనంద్ మహీంద్రా 90 గంటల పనివారం చర్చపై స్పందిస్తూ.. తూకం వేసి, పరిమాణం కంటే  పని నాణ్యతపై దృష్టి పెట్టాలని సూచించారు. సుదీర్ఘ పని గంటల కంటే ఉత్పాదకత ,సామర్థ్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.

బండ చాకిరీ : మన దేశం
మరోవైపు  అంతర్జాతీయ కార్మిక సంస్థ( ILO) నివేదిక ప్రకారం, భారతదేశం ఇప్పటికే ప్రపంచ ఓవర్ వర్క్ రంగంలో ముందు వరుసలో ఉంది.   అదనపు పని విషయంలో   ప్రపంచ దేశాల్లో  భారతదేశం 13వ స్థానంలో ఉందని వెల్లడించింది. సగటున భారతీయ ఉద్యోగులు ప్రతి వారం 46.7 గంటలు పనిచేస్తారని, భారతదేశంలోని 51శాతం మంది శ్రామిక శక్తి ప్రతి వారం 49 లేదా అంతకంటే ఎక్కువ గంటలు పనిచేస్తుందని, అత్యధికంగా సుదీర్ఘమైన పని గంటలు ఉన్న దేశాలలో భారతదేశం రెండవ స్థానంలో ఉందని కూడా సంస్థ పేర్కొన గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement